ఖైరతాబాద్: జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బిఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన
Hyderabad, Telangana:పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బిఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ ఖ్యాతిని కాపాడాలని, పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని మండిపడ్డారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
మహబూబాబాద్ Govt ఆస్పత్రిలో ఘోరం.. 4 ఏళ్ల చిన్నారికి ఎక్స్పైరీ మందులు!
Hyderabad, Telangana:Mahabubabad Latest News: ప్రాణాలు నిలపాల్సిన ఆస్పత్రులే.. నిర్లక్ష్యానికి నిలయాలుగా మారుతున్నాయి. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన్నట్లుగా తయారైంది ప్రభుత్వ ఆస్పత్రుల తీరు.. చిన్నారి ప్రాణాలతో చెలగాటమాడుతూ.. గడువు ముగిసిన మందులను పంపిణీ చేసిన ఉదంతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది..
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన మురళీ.. తన 4 సంవత్సరాల కుమారుడు రాజ్ తీవ్ర వాంతులు, విరోచనాలతో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం స్థానిక మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. OP విభాగంలో బాబును పరీక్షించిన వైద్యులు రెండు రకాల సిరప్‌లను ప్రిస్క్రిప్షన్‌లో రాశారు. అందులో ఒక సిరప్‌ను ఆసుపత్రిలోని ఫార్మసీలోనే ఇచ్చి.. మరొకటి బయట మెడికల్ షాప్‌లో కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రెండు టానిక్‌లు వాడితే ఉపశమనం లభిస్తుందని.. ఆస్పత్రిలో అడ్మిట్ కావాల్సిన అవసరం లేదని చెప్పి పంపించివేశారు.
వైద్యుల సూచన మేరకు మరో సిరప్‌ను బయట మెడికల్ షాప్‌లో కొనుగోలు చేసిన మురళీ ఇంటికి వెళ్లాడు. బాబుకు మందు పోసేందుకు సిద్ధమవుతున్న సమయంలో అనుమానం వచ్చి.. ఆస్పత్రిలో ఇచ్చిన సిరప్ బాటిల్‌ను పరిశీలించాడు. దాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.. ఆ మందు ఎక్స్పైరీ డేట్ గతేడాది జూన్ 2026 సంవత్సరానికే ముగిసిపోయింది. ఏమాత్రం గమనించకుండా ఆ మందును బాబుకు తాగించి.. ఉంటే పరిస్థితి అత్యంత విషమంగా మారేది.
విషయం తెలుసుకున్న వెంటనే మురళీ.. ఆయన బంధువులు ఆస్పత్రికి చేరుకుని సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిలదీశారు. అయితే, మొదటిగా తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు యత్నించిన ఆస్పత్రి సిబ్బంది.. మేము ఈ మందు ఇవ్వలేదు అంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితులకు, సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బాధితులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయిన బాధితులను తిరిగి పిలిపించారు.. ఆస్పత్రి ఫార్మసీ సిబ్బంది పొరపాటున.. గమనించకుండా గడువు ముగిసిన సిరప్‌ను ఇచ్చారని అంగీకరిస్తూ.. అధికారికంగా క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితులు ప్రశాంతంగా ఇంటికి వెళ్లిపోయారు..
ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8,580mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Redmi K100 సిరీస్ లాంచ్.. గేమింగ్ లవర్స్‌కి పండగే!
Hyderabad, Telangana:Redmi K100 Series Launch: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమి సబ్-బ్రాండ్ రెడ్మి మార్కెట్లోకి మరో సరికొత్త సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రెడ్మి K100 పేరుతో అందుబాటులోకి రాబోతున్న Redmi K100 Proతో పాటు Redmi K100 Pro Max అనే రెండు పవర్ఫుల్ మోడళ్లు విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. చైనా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబో (Weibo) ద్వారా కంపెనీ ఈ ఫోన్లకు సంబంధించిన కీలక వివరాలను అధికారికంగా వెల్లడించింది. వీటిని ఆగస్టు 11న ఈ సిరీస్ చైనా మార్కెట్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సిద్ధమైంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందరినీ ఆకట్టుకునే ప్రధాన ఫీచర్ దీని బ్యాటరీగా భావించవచ్చు. Redmi K100 Pro మోడల్లో ఏకంగా 8,580mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 26 శాతం సిలికాన్ మెటీరియల్ వాడటం వల్ల బ్యాటరీ సైజ్ పెరగకుండానే ఎక్కువ రోజూ పనిచేస్తుందని సమాచారం.. ఇక ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 50W వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్, 22.5W వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించడం విశేషం..
గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చిన్నట్లు తెలుస్తోంది.. ఇందులో కస్టమ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 V ప్రాసెసర్‌తో పాటు ప్రత్యేకమైన AI గేమింగ్ గ్రాఫిక్స్ చిప్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. AnTuTu బెంచ్‌మార్క్ పరీక్షలో ఈ ఫోన్ ఏకంగా 40,95,000 కంటే ఎక్కువ స్కోర్ సాధించి రికార్డు సృష్టించింది. ఫోన్ వేడెక్కకుండా 3D సర్క్యులేటింగ్ కోల్డ్ పంప్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందుబాటులో ఉండడం విశేషం..
ఇక దీనికి సంబంధించిన డిస్ప్లే వివరాల్లోకి వెళితే.. ఇది 6.59-అంగుళాల డిస్ల్పేను కలిగి ఉంటుంది. ఇది 185Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 4,800Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో లభిస్తోంది.. ఇది గరిష్టంగా 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో ఫ్లాట్ ప్యానెల్, అద్భుతమైఊన కెమెరా మాడ్యూల్‌ను కూడా అందించారు. వెనకాలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు అల్ట్రా-వైడ్, టెలిఫోటో లెన్స్‌లను అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ప్రత్యేకంగా అద్భుతమైన ఆడియో అనుభూతి కోసం కెమెరా ఐలాండ్‌పై Sound by Bose బ్రాండింగ్‌ను కూడా కలిగి ఉంటుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్పెషిఫికేషన్స్..
ఈ సిరీస్‌లోని టాప్ మోడల్ అయిన K100 Pro Max స్మార్ట్‌ఫోన్‌లో 6.9-అంగుళాల భారీ OLED డిస్ప్లేను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. అలాగే 200MP కెమెరాతో పాటు మైండ్ బ్లోయింగ్ 9,000 mAh బ్యాటరీ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైనాలో ఈ స్మార్ట్ఫోన్ల కోసం ప్రీ-ఆర్డర్లు కూడా మొదలయ్యాయి. ఇవే కాకుండా ఇందులో అనేక రకాల అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
మహిళపై కొండచిలువ దాడి.. పామును చంపి ఆస్పత్రికి తీసుకొచ్చిన బంధువులు!
Hyderabad, Telangana:12ft Python Attacks: జనగామ జిల్లా కంచనపల్లి గ్రామంలో గురువారం ఓ ఊహించని ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో ఓ మహిళపై భారీ కొండచిలువ ఒక్కసారిగా దాడి చేయడంతో స్థానికులు, గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కంచనపల్లి గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళ గురువారం ఉదయం తమ మొక్కజొన్న, వరి పొలం పనులకు వెళ్లింది.. పైరు మధ్యలో పని చేసుకుంటుండగా.. అక్కడ ఉన్న సుమారు 12 అడుగుల భారీ కొండచిలువ ఒక్కసారిగా స్వప్నపై దాడి చేసింది. ఆమె కాళ్లను చుట్టుముట్టి ఆహారంగా మలుచుకునేందుకు ప్రయత్నించింది. ఈ ఊహించని పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన స్వప్న గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది..
ఆమె కేకలు విన్న సమీప రైతులతో పాటు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి పరుగులు తీసిన్నట్లు సమాచారం. స్వప్న ప్రాణాపాయ స్థితిలో ఉండడం చూసి సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తీవ్రంగా పోరాడి స్వప్నను కొండచిలువ పట్టు నుంచి విడిపించారు. అనంతరం ఆ భారీ కొండచిలువ ఎవరికైనా ప్రమాదం చేసే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో దానిని అక్కడే కొట్టి చంపిన్నట్లు సమాచారం.
తీవ్రంగా గాయపడిన స్వప్నను కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విచిత్రంగా, ఎంత పెద్ద పాము దాడి చేసిందో వైద్యులకు చూపించడానికి, ఘటన తీవ్రతను వివరించడానికి వారు చనిపోయిన 12 అడుగుల కొండచిలువను కూడా ఆటోలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఆ భారీ కొండచిలువను చూసిన రోగులతో పాటు, బంధువులు ఒక్కసారిగా భయాందోళనకు గురైన్నట్లు తెలుస్తోంది.
జనగామ ఏరియా ఆసుపత్రి వైద్యులు స్వప్నకి తక్షణమే అత్యవసర చికిత్స అందిచిన్నట్లు తెలుస్తోంది.. కొండచిలువ విషపూరితమైనది కాకపోయినప్పటికీ.. దాని దాడి వల్ల స్వప్నకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని.. ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
తులం బంగారంపై ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్.. నగల షాపుల ఆఫర్ల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే..!!
Secunderabad, Telangana:Gold Rate: గత ఏడాది కాలంలో, బంగారం ధరలు దాదాపు 70శాతం పెరిగి రికార్డులను బద్దలు కొట్టాయి. చరిత్రలో బంగారం ధరలు ఇంత వేగంగా ఎన్నడూ పెరగలేదు. ప్రస్తుత బంగారం ధరలను చూస్తే, గత ఆరు నెలలుగా అవి పెరుగుతూ వస్తున్నాయి. జనవరి నుండి, 10 గ్రాముల 24-క్యారెట్ బంగారం ధర రూ.1.83 లక్షలను దాటడంతో, బంగారం ధరలు సర్వకాలిక రికార్డును నెలకొల్పాయి. అప్పటి నుండి, ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది.
ప్రస్తుత బంగారం ధరలను చూస్తే.. ధరలు స్థిరంగా ఉన్నాయని మనం చూడవచ్చు. గత నెలలో, బంగారం ధరలు రూ. 1.40 లక్షల నుండి రూ.1.45 లక్షల మధ్య ట్రేడ్ అయ్యాయి. నేడు తులం 10 గ్రాముల బంగారం ధరరూ. 1,49,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గత వారం బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ముడి చమురు ధరలు తగ్గడమే అని చెప్పాలి. ముడి చమురు ధరలు తగ్గినప్పుడు, డాలర్‌కు డిమాండ్ కూడా తగ్గుతుంది. బంగారం ధరలు పెరుగుతాయి. భారతదేశంలో, గత ఏడాది బంగారం ధరలు విపరీతంగా పెరిగిన తర్వాత, బంగారు ఆభరణాలు కొనడానికి బంగారు ప్రియులు అంతగా ఆసక్తి చూపడం లేదని నగల దుకాణాల యజమానులు ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకాకుండా, స్థానిక సుంకాలలో గణనీయమైన పెరుగుదల కూడా బంగారం ధరలలో హెచ్చుతగ్గులకు ఒక కారణంగా ఉంది. విదేశాల నుండి బంగారం దిగుమతులను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల దిగుమతి సుంకాలను గణనీయంగా పెంచింది. ఇది కూడా బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని చెప్పాలి.
బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో, నగల దుకాణాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ధరలు భారీగా పెరగడంతో సామాన్య మధ్య తరగతి ప్రజలకు బంగారం కొనాలంటే భారంగా మారిందని చెప్పాలి. దీంతో బంగారు షాపు యజమానులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను, కొత్త కొత్త స్కీములను ప్రవేశపెడుతున్నారు. వీటిలో అత్యంత ముఖ్యమైనది బంగారంపై ఇచ్చే డిస్కౌంట్ పథకం. హైదరాబాద్‌లో ప్రస్తుతం తులం బంగారంపై రూ. 10,000 డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు.
తులం బంగారంపై ఇచ్చే రూ. 10,000 డిస్కౌంట్లో నిజం ఎంత?
హైదరాబాద్ నగరంలో ఇటీవల ప్రారంభమైన కొన్ని నగల దుకాణాలలో ఇలాంటి ఆఫర్లు కనిపిస్తున్నాయి. అయితే, ఈ ఆఫర్ కేవలం 916 గ్రేడ్ బంగారానికి మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని సాధారణంగా 22 క్యారెట్ల బంగారం అని అంటారు. వాస్తవానికి, బంగారు ఆభరణాలను ఈ నాణ్యత గల బంగారంతోనే తయారు చేస్తారు. అయితే, ఒక నగల దుకాణంలో బంగారు ఆభరణాలపై దాదాపు 10వేల రూపాయల డిస్కౌంట్ లభించడం చాలా అరుదు. అయినప్పటికీ, గత ఏడాది కాలంగా, నగల దుకాణాలు వినియోగదారులను ఆకర్షించడానికి వివిధ ఆఫర్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం, తగ్గింపులు కేవలం బంగారంపై మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గతంలో, ఈ తగ్గింపులు కేవలం బంగారం విలువ తరుగుదల, తయారీ ఛార్జీలపై మాత్రమే లభించేవి. దీని ఆధారంగా, పెరుగుతున్న బంగారం ధర వల్ల బంగారు ఆభరణాల మార్కెట్ ఎంతగా ప్రభావితమవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు.
Also Read: ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో నో ఫ్యూయల్! కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..!!
Also Read: పీఆర్సీ పై టీచర్ల పోరు బాట.. సెప్టెంబర్ 1న ప్రభుత్వ ఉపాధ్యాయుల మహా ధర్నా.. డిమాండ్లు ఇవే..!!
Also Read: టీచర్లకు డెడ్‌లైన్ ఫిక్స్.. టెట్ అర్హత తప్పనిసరి
Also Read: ఆ బడుల్లో ఒకే టీచర్.. దేశంలో ఇలాంటి పాఠశాలలు లక్ష
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
ఛార్జింగ్ కష్టాలకు గుడ్ బై.. 10,000mAh బ్యాటరీతో ఒప్పో F35 ప్రో ఎంట్రీ.. వివరాలివే!
Hyderabad, Telangana:Oppo F35 Pro Launching Soon: చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎప్పుడూ ఛార్జింగ్ సాకెట్ల కోసం వెతుక్కోవడం.. ప్రయాణాలు చేసే సమయాల్లో పవర్ బ్యాంక్ బరువును మోయలేక నరకం చూస్తూ ఉంటారు.. స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ ఇదో నిత్య సమస్యగా మారింది.. కానీ ఇకపై ఆ బాధలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పే సమయం వచ్చేసింది.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం ఒప్పో భారతీయ మొబైల్ ప్రేమికులను దృష్టిలో పెట్టుకుని.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఊపేసేందుకు ఒక అద్బుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.
భారత్‌లో గత ఏప్రిల్‌లో అద్భుతం సృష్టించిన F33 సిరీస్ తర్వాత.. మరింత శక్తివంతమైన F35 సిరీస్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు కంపెనీ సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ నెలలోనే భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల చైనాలో ఘనంగా విడుదలైన ఒప్పో A7 ప్రొ మ్యాక్స్ (Oppo A7 Pro Max) మోడల్‌కు రీబ్రాండెడ్ వర్షన్‌గా ఈ F35 ప్రొను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది..
ఈ ఫోన్లో కంపెనీ అద్భుతమైన 10,000mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని అందిస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఎన్నో రోజుల పాటు ఛార్జింగ్ అందించేలా దీని డిజైన్ చేసిన్నట్లు తెలుస్తోంది. అలాగే దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రావడం.. కంటిరెప్ప మూసి తెరిచేంత వేగంతో ఫోన్ రీఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గేమర్లతో పాటు ఎప్పుడు ప్రయాణాలు చేసే ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లకు ఇది నిజంగా ఒక అద్భుతమైన ఫోన్‌గా నిలుస్తుంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఇతర ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.78 అంగుళాల 1.5K LTPS OLED ఫ్లాట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే స్నాప్‌డ్రాగన్ 4 Gen 5 చిప్సెట్తో మల్టీ టాస్కింగ్ అత్యంత స్మూత్‌గా పని చేస్తోంది.. వెనుక వైపు OIS సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండగా.. సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగంలో ఆటోఫోకస్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ Samsung JN5 కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ఓఎస్ 16 (ColorOS 16) పై పని చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. భారత మార్కెట్లో ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ ధర రూ.40,000 నుంచి రూ. 45,000 మధ్యలో ఉండే అవకాశముంది. ఈ రేంజ్లో రాబోతున్న వివో S2 మోడల్‌కు ఒప్పో F35 ప్రొలకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా.. మిడ్-ప్రీమియం విభాగాన్ని పూర్తిగా ఏలేస్తుందని టెక్ విశ్లేషకులు తెలుపుతున్నారు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vivo S2 గ్రాండ్ ఎంట్రీ.. చీప్ ధరకే 3D కర్వ్డ్ డిస్ప్లే, Sony 50MP కెమెరా!
Hyderabad, Telangana:Vivo S2 India Launch: స్మార్ట్‌ఫోన్ ప్రియుల అద్భుతమైన శుభవార్త.. టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అద్భుతమైన టైమ్ రానే వచ్చేసింది. ప్రముఖ దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. తన అత్యంత ప్రతిష్టాత్మక ఫోన్ Vivo S2ను ఆగస్టు 6న గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.. ఇది 6.83 అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రీఫ్రెష్ రేట్‌తో కంటికి చెప్పలేనంత ఇంపుగా కనిపిస్తుందని తెలుస్తోంది.. ఏకంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఎంతో ఎండలో కూడా ప్రకాశవంతంగా మెరుస్తుంది. కళ్లకు ఏమాత్రం శ్రమ కలగకుండా SGSలో-బ్లూ లైట్ సర్టిఫికేషన్‌తో అందుబాటులోకి తీసుకు రావడం విశేషం..
ఈ డివైజ్‌లో MediaTek Dimensity 7360 Turbo శక్తివంతమైన ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఆంటోటూ (AnTuTu) బెంచ్‌మార్క్‌లో ఏకంగా 9.70 లక్షలకు పైగా స్కోర్ సాధించిన్నట్లు తెలుస్తోంది. ఇక గేమర్స్ కోసం ఏకంగా 7,050 mAh భారీ బ్యాటరీని ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఫోన్ మందం కేవలం 7.99 mm మాత్రమే ఉండటం నిజంగా ఒక అద్భుతంగా భావించవచ్చు.
ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడేవారికి వివో అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది.. బ్యాక్ సెటప్‌ను 50 మెగాపిక్సెల్ Sony IMX852 ప్రధాన కెమెరాతో పాటు ఫ్రాంట్ భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. రెండు కెమెరాలూ 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
అధునాతన OriginOS 6, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో పాటు డ్యూయల్ సిమిట్రికల్ స్పీకర్లతో రాబోతున్న ఈ ఫోన్ సిల్క్ వైట్, శాఫైర్ బ్లూతో పాటు రీగల్ బ్రాంజ్ కలర్స్‌లో అందుబాటులోకి రాబోతోంది.. 8GB+128GB వేరియంట్ ధర సుమారు రూ.51,999తో.. 8GB+256GB వేరియంట్ ధర రూ. 55,999తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇది అమెజాన్‌తో పాటు వివో ఈ-స్టోర్లతో పాటు ప్రముఖ రిటైల్ షాపుల్లో ఇది అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. 2 రోజుల పోలీసుల కస్టడీ మంజూరు..!!
Secunderabad, Telangana:Uday Krishnareddy: హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఒక మహిళా ఐపీఎస్ ట్రైనీపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డిపై ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఇటీవల ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అప్పర్ పారిష్ కోర్టు అతనికి రెండు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు చేసింది. అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టే వరకు అదుపులో ఉంచాలని పోలీసులు కోరారు. కోర్టు అందుకు అంగీకరించింది. పోలీసులు నేడు ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించనున్నారు.
కొంతమంది అత్యుత్తమ ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఇటీవల ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగినట్లు తెలిసింది. అయితే, అదే అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న తోటి మహిళా ఐపీఎస్ ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి, అతను తనను లైంగికంగా వేధించి, దాడి చేశాడని ఆరోపిస్తూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు తన తీర్పులో జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. అతను ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. అయితే, ఉదయ కృష్ణారెడ్డికి పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. అతను పలువురు మహిళలతో సోషల్ మీడియాలో చాట్ చేశాడని, వారికి ప్రపోజ్ కూడా చేశాడని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. అయితే, ఉదయ కృష్ణారెడ్డి తన చర్యలను సమర్థించుకున్నట్లు విచారణలో తేలింది.
ఉదయ కృష్ణారెడ్డి ఇలా అన్నట్లు సమాచారం. "సివిల్ సర్వీసెస్ గెలిచిన తర్వాత, నా గురించి కథనాలు సోషల్ మీడియా, టీవీ ఛానెళ్లలో వచ్చాయి. వాటిని చూసి చాలా మంది మహిళలు నాకు ప్రపోజ్ చేశారు. వాళ్లు నా అభిమానులుగా మారిపోయారు. నేను వారి ప్రపోజల్స్‌కు సరే అన్నాను. అందులో తప్పేముంది?" ఇటీవల కోర్టు అతనికి రెండు రోజుల పోలీసు కస్టడీ మంజూరు చేయడంతో, ఉదయ కృష్ణారెడ్డికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.
Also Read: ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో నో ఫ్యూయల్! కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..!!
Also Read: పీఆర్సీ పై టీచర్ల పోరు బాట.. సెప్టెంబర్ 1న ప్రభుత్వ ఉపాధ్యాయుల మహా ధర్నా.. డిమాండ్లు ఇవే..!!
Also Read: టీచర్లకు డెడ్‌లైన్ ఫిక్స్.. టెట్ అర్హత తప్పనిసరి
Also Read: ఆ బడుల్లో ఒకే టీచర్.. దేశంలో ఇలాంటి పాఠశాలలు లక్ష
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
కుజ-శని ప్రతికూల కలయిక.. ఆగస్టు 12 గ్రహణంతో మారబోతున్న ఈ రాశుల జాతకాలు!
Hyderabad, Telangana:Solar Eclipse Aug 12 Telugu: ఆగస్టు 12న ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది.. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించకపోవడం వల్ల ఇక్కడ సూతక్ కాలం వర్తించనప్పటికీ.. జ్యోతిష్యులు మాత్రం ఈ సమయాన్ని అత్యంత కీలకమైనదిగా భావిస్తూ ఉంటారు. గ్రహణానికి ముందే గ్రహాల గమనంలో సంభవించిన మార్పులతో పాటు ముఖ్యంగా కుజుడితో పాటు శని దేవుని స్థానాలు ప్రపంచ పరిణామాలతో పాటు పలు రాశుల వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు..
ఆగస్టు 2వ తేదీ రాత్రి కుజుడు మిథున రాశిలోకి సంచారం చేశాడు.. దీనివల్ల కుజ, శని గ్రహాలు ఒకదానికొకటి కేంద్ర స్థానాల్లో ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ అరుదైన మార్పులు ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు, కెరీర్, ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సమయంలో కొంత ఉద్రిక్తతలు లేదా ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది..
తులా రాశి:
వాహనాలు నడిపేటప్పుడు తులా రాశివారు తప్పకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇతరుల వాహనాలను నడపకపోవడమే శ్రేయస్కరమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇతరుల మాటలకు ప్రభావితమై కెరీర్, వ్యాపారాల్లో పెద్ద మార్పులు రాకుండా చేసుకోవడమే చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృషభ రాశి:
రాబోయే రోజుల్లో ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇంట్లోని పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా కెరీర్లో పెద్ద రిస్క్‌లు తీసుకోవడం తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది.
మిథున రాశి:
మిథున రాశి వారికి ఆరోగ్యం, ఉద్యోగ రంగాల్లో సమయమనం చాలా అవసరమని నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగం మారడంతో పాటు కొత్త వ్యాపారం ప్రారంభించడం లేదా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడం వంటి నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీయవచ్చు.
ధనుస్సు రాశి:
ఈ సమయం ధనుస్సు రాశి వారికి కొంత సవాలుతో కూడుకున్నదని భావించవచ్చు. మీతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే కంటే ప్రస్తుతం చేస్తున్న పనిపైనే దృష్టి పెట్టడం ఎంతో మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
కుజుడు-రాహువుల నవపంచమ యోగం.. సెప్టెంబర్ 18 వరకు ఈ 4 రాశులకి తిరుగులేని రాజయోగం!
Hyderabad, Telangana:Navpancham Yoga 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాల మార్పుల కారణంగా అనేక శుభ, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆగస్టు 2న అంగారకుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేశాడు.. ఈ గ్రహ సంచారం వల్ల కుజుడు, రాహువుల మధ్య అత్యంత శక్తివంతమైన నవపంచమ యోగం ఏర్పడింది.
జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఈ యోగం రాబోయే సెప్టెంబర్ 18 వరకు చురుకుగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ నవపంచమ యోగం ప్రభావం ద్వాదశ రాశులన్నింటిపైనా ఉన్నప్పటికీ.. ముఖ్యంగా 4 రాశుల వారికి మాత్రం ఆర్థిక పురోగతి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని విజయాన్ని, ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అదృష్టాన్ని పొందే రాశులు ఇవే
మిథున రాశి (Gemini)
కుజుడు ప్రస్తుతం మిథున రాశిలోనే సంచార దశలో ఉన్నాడు. ఈ రాశి వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. నిలిచిపోయిన లేదా రావాల్సిన పాత బాకీలు చేతికి అందుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి లేదా ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది శుభసమయంగా భావించవ్చు.
మేష రాశి (Aries)
మేష రాశికి అధిపతి కుజుడు కావడం వల్ల ఈ గ్రహ మార్పు అత్యంత అనుకూల ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సుదీర్ఘకాలంగా పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు లేదా ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త ప్రణాళికల కారణంగా పనులు కూడా స్పీడ్‌గా పూర్తి చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్లు, షేర్ మార్కెట్ రంగానికి చెందిన వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
కుంభ రాశి (Aquarius)
కుంభ రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అద్భుతంగా ఉంటుంది. మీరు తీసుకునే సరైన నిర్ణయాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి.. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇరుక్కుపోయిన డబ్బులు కూడా పూర్తిగా తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో శాంతి, సౌఖ్యాలు నెలకొంటాయి. శ్రమకు తగ్గట్టుగా లక్ష్యాలను సులువుగా చేరుకుంటారు.
తులా రాశి (Libra)
తులా రాశి వారికి ఈ యోగం వృత్తి, ఉద్యోగ రంగాల్లో గొప్ప అనుకూల మార్పులను తీసుకువస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ఆఫీసులో కీలకమైన ప్రాజెక్టులు చేతికి రావడంతో పాటు ప్రమోషన్ లేదా హోదా పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఐటీ (IT), టెక్నాలజీ, కార్పొరేట్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపార విస్తరణ విజయవంతమవుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Liquor Ban: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్..ఇండియాలో ఈ బ్రాండ్లు నిషేధం!
Hyderabad, Telangana:Liquor Brands Ban In India: మందుబాబులకు గుండె ఝల్లుమనే వార్త! ఇకపై వైన్స్ షాపుల్లో ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్, బ్యాగ్ పైపర్ వంటి ప్రముఖ లిక్కర్ బ్రాండ్లు ఇకపై కనిపించవు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రకారం.. ఈ లిక్కర్ బ్రాండ్ల సేల్స్‌పై నిషేధం విధించారు. అయితే దాని వెనుక అసలు కారణంగా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.AP Rain Alert: బంగాళాఖాతంలో మరోసారి అలజడి..రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
Vijayawada, Andhra Pradesh:AP Rain Alert News: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే చెదురుమదురు వర్షాలు కురుస్తుండగా, రాబోయే రోజుల్లో దీని ప్రభావం మరింత విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమై, పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది.
జిల్లాల వారీగా వర్ష సూచన
రేపు అనగా ఆగస్ట్ 6వ తేదీ గురువారం శ్రీకాకుళం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే మిగిలిన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే సూచన ఉందని అధికారులు వెల్లడించారు.
ప్రజలకు కీలక హెచ్చరికలు
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు, రైతులు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా వర్షం సమయంలో చెట్లు, విద్యుత్ పోల్స్, హోర్డింగ్స్ కింద ఎవరూ నిలబడవద్దని స్పష్టం చేసింది. పొలాల్లో పనిచేసే రైతులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
రైతులకు తాజా పరిస్థితి
రాష్ట్రంలో గత కొంతకాలంగా ఎల్ నినో ప్రభావం వల్ల సకాలంలో వర్షాలు పడక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ద్రోణులు, అల్పపీడనాలు పంటలకు కొంతవరకు ఊరటనిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తారమైన వర్షాలు కురిస్తేనే వ్యవసాయ రంగానికి మేలు జరిగి రైతులు సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశం ఉంది.
Also Read: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి? త్వరలోనే అధికారిక ప్రకటన!
Also Read: ఉపరాష్ట్రపతితో టీడీపీ ఎంపీల బృందం భేటి.. 'అమరావతి' ప్రత్యేక పుస్తకం ఆవిష్కరణ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chiranjeevi Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి? త్వరలోనే అధికారిక ప్రకటన!
Vijayawada, Andhra Pradesh:AP Brand Ambassador Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ కీలక బాధ్యతపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య ప్రాథమిక సంప్రదింపులు, సానుకూల చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ముఖ్య విశేషాలు, ప్రధాన లక్ష్యం..
రాష్ట్రంలోకి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం, పర్యాటకరంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, జాతీయ స్థాయిలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ను గణనీయంగా పెంచడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం.
గుజరాత్ పర్యాటక రంగానికి బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి ఆ రాష్ట్రానికి ఎంతటి జాతీయ గుర్తింపు తెచ్చారో, అదే రీతిలో ఏపీ బ్రాండ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి చిరంజీవిని రంగంలోకి దించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ఈ బృహత్తర బాధ్యతపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య కీలక చర్చలు పూర్తయినట్లు సమాచారం.
ఈ భాగస్వామ్యానికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు, దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మెగాస్టార్ రాకతో ఏపీ పర్యాటక, పెట్టుబడుల రంగాలకు మరింత ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read: విద్యార్థులకు పండగ లాంటి వార్త..ఈ వారంలో వరుసగా 3 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
Also Read: ఏపీ, తెలంగాణ ఎల్‌నినో బారి నుంచి బయటపడినట్టేనా? రైతులు తప్పకుండా తెలుసుకోవాలి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Airtel 299 Cancelled: వినియోగదారులకు ఎయిర్టెల్ బిగ్‌షాక్..అతిచౌకైన రూ.299 రీఛార్జ్ ప్లాన్ క్యాన్సిల్!
Hyderabad, Telangana:Airtel 299 Recharge Cancelled: ప్రముఖ ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) తన కస్టమర్లకు మరో షాక్ ఇచ్చింది. అత్యంత ఆదరణ పొందిన రూ.299 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను పూర్తిగా తొలగించింది. ప్రస్తుతం ఈ ప్లాన్ ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్ లేదా ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో కనిపించడం లేదు. గతంలో రీఛార్జ్ ధరలను సవరించిన ఏడాది తిరగకముందే ఈ మార్పు చేయడం గమనార్హం.
తొలగించిన ప్లాన్లు, ప్రయోజనాలు..
రూ.299 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ కింద రోజుకు 1GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, ఫ్రీ కాలర్ ట్యూన్స్‌తో పాటు పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్స్క్రిప్షన్ లభించేవి. ఇకపై ఈ ప్లాన్ అందుబాటులో ఉండదు.
రూ.299 ప్లాన్ రద్దు కావడంతో, యూజర్లు రీఛార్జ్ చేసుకోవడానికి కనీస ధర రూ.349కి పెరిగింది. రూ.349 ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్, 100 SMSలు, 6 నెలల యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్, ఫ్రీ హెలోట్యూన్స్ లభిస్తాయి.
రూ.579, రూ.619 ప్లాన్లు కూడా గల్లంతు
ఎంట్రీ లెవల్ ప్లాన్‌తో పాటు మధ్యస్థ వ్యాలిడిటీ కలిగిన రూ.579, రూ.619 ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా ఎయిర్టెల్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్యాక్‌లు కూడా ప్రస్తుతం వెబ్సైట్లో అందుబాటులో లేవు. అందులో మొదటిది రూ.579 రీఛార్జ్ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటాను అందించేది.
అలాగే రూ.619 రీఛార్జ్ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా ప్రయోజనాలతో అందుబాటులో లేవు. తొలుత కొన్ని సెలెక్టెడ్ సర్కిళ్లలో మాత్రమే ఈ ప్యాక్స్‌ను తొలగించిన ఎయిర్టెల్, క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ వీటిని నిలిపివేసినట్లు సమాచారం.
Also Read: మార్కెట్లోకి కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..చలామణీ ఎప్పటినుంచి అంటే?
Also REad: అన్నీ వస్తువులు దొరికే డీమార్ట్‌లో చీరలు ఎందుకు అమ్మరు? ఇదే బిజినెస్ టాప్ సీక్రెట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan: వెన్నుపోటు పార్టీతో ఏపీ ప్రజలకు బాధ తప్ప ఏమైనా మంచి జరుగుతోందా? వైఎస్ జగన్
Rajamahendravaram, Andhra Pradesh:YS Jagan Devarapalli Tour: 'అన్యాయంపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు. అరెస్టులు. వెన్నుపోటు పార్టీతో రాష్ట్రానికి, ప్రజలకు బాధ. అంతేతప్ప ఏ మాత్రమైనా మంచి జరుగుతోందా?' అని మాజీ వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాష్టంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని.. రైతులు రోడ్డెక్కుతున్నా పట్టించుకోని ప్రభుత్వం అని మండిపడ్డారు. పొగాకు రైతులకు అండగా నిలుస్తామని.. వారికి న్యాయం జరిగేలా పోరాడుతామని భరోసానిచ్చారు.
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొగాకు కొనుగోలు కేంద్రం సందర్శించారు. పొగాకు కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించి అక్కడి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. స్థానిక పొగాకు కొనుగోలు కేంద్రం సందర్శించిన ఆయన, కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన, పొగాకు పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర వివరాలు ఆరా తీశారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 'చంద్రబాబు పాలనలో ఒక్క గంజాయికే ధర. దాన్ని సాగు చేస్తోంది వెన్నుపోటు పార్టీ వారే' అని వెల్లడించారు. చంద్రబాబు పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక.. అన్ని రంగాలు విధ్వంసమయ్యాయని విమర్శించారు.
తమ సమస్యలను వినే నాయకుడు, కష్టకాలంలో అండగా నిలిచే మనిషి వస్తున్నాడనే నమ్మకమే వారిని కదిలించింది. పొగాకు రైతుల బాధ తెలుసుకునేందుకు వచ్చిన వైయస్ జగన్ గారికి ప్రజలు తమ అభిమానాన్ని అపూర్వంగా చాటుకున్నారు. నాయకత్వంపై నమ్మకం ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా ఎలా తరలివస్తారో ఈ దృశ్యాలే… pic.twitter.com/n0lT9n6p1r
— YSR Congress Party (@YSRCParty) August 5, 2026
'రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన రూ.7 లక్షలు ఇవ్వడం లేదు. అధికారంలోకి రాగానే వారికి రెట్టింపు సాయం చేస్తాం. మళ్లీ మార్క్‌ఫెడ్‌నూ బలోపేతం చేస్తాం' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. 'చంద్రబాబు పరిపాలనలో ఏం జరుగుతోంది అంటే విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు అన్నింటిలోనూ విధ్వంసమే కనిపిస్తోంది. ఎవరైనా అన్యాయి ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. ఇవి మాత్రమే చంద్రబాబు పరిపాలనలో కనిపిస్తాయి' అని తెలిపారు. చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ అని.. ఈ వెన్నుపోటు పార్టీతో రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇంకేమైనా ఉందా' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.
'26 నెలలు కనీసం ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధరలు వచ్చాయా? వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, పెసర్లు, సజ్జలు, మిర్చి, పొగాకు, టమోటా, చీనీ పంటకు కానీ.. చివరకు మామిడి రైతులకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి' అని వైఎస్ జగన్ వివరించారు. రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితికి బాధ్యత ఎవరిది? రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులు నమ్మి పంట వేస్తే, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని చంద్రబాబును ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వంలో ఒకే ఒక పంటకి మాత్రమే గిట్టుబాటు ధర లభిస్తోంది
అది ఏ పంట అంటే..? వెన్నుపోటు పార్టీకి చెందిన వారు పండిస్తున్న గంజాయి పంట
ఆ గంజాయిని పండిస్తున్న రైతులు టీడీపీకి చెందిన వారే
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు#YSJaganInDevarapalli#SadistChandraBabu… pic.twitter.com/lqpeBaw5Go
— YSR Congress Party (@YSRCParty) August 5, 2026
రైతులకు చంద్రబాబు దగా
'పీఎం కిసాన్‌కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20 వేల చొప్పున ‘అన్నదాత సుఖీభవ' పేరుతో ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మూడేళ్లకు కలిపి ప్రతి రైతుకు రూ.60 వేలు అందాలి. కానీ ఇప్పటివరకు ఇచ్చింది రూ.19 వేలు మాత్రమే. అంటే ఒక్కో రైతుకు రూ.41 వేలు ఇవ్వకుండా ఎగవేశారు. సుమారు 7 లక్షల మంది రైతులను ఈ పథకం నుంచి తొలగించారు. మొంథా తుపాన్ వచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ కూడా అందలేదు. సున్నా వడ్డీ పథకం రద్దు చేశారు' అని చంద్రబాబు రైతులకు చేసిన మోసాలు అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు.
'చంద్రబాబు హయాంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అది ఏ పంటో తెలుసా? అది గంజాయి. చంద్రబాబు బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట. కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా ఢమాల్ చేసే కార్యక్రమం చేశాడు. మిర్చి తింటే ఎసిడిటీ వస్తుందట! దీంతో మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు రాకుండా ఢమాల్ చేశాడు. మామిడి తింటే షుగర్ వస్తుందని ఆ పంటను ఢమాల్ చేశాడు' అని వైఎస్ జగన్ వెల్లడించారు.
SpaceX Moon Crash: అంతరిక్షంలో ఘోర ప్రమాదం..చంద్రుడ్ని ఢీ కొట్టిన ఎలాన్ మస్క్ రాకెట్!
Hawthorne, California:SpaceX Moon Crash News: అంతరిక్ష రంగంలో ఒక అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX)కు చెందిన ఫాల్కన్-9 రాకెట్‌కు సంబంధించిన విడిచిపెట్టిన పైభాగం (సెకండ్ స్టేజ్) చంద్రుడిని ఢీకొట్టినట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:05 గంటల ప్రాంతంలో చంద్రుడిపై ఉన్న ఐన్‌స్టీన్ బిలం (Einstein Crater) సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
ప్రమాదానికి దారితీసిన పరిణామాలు..
దాదాపు 4,500 కిలోల బరువు ఉన్న ఈ రాకెట్ పైభాగం, చంద్రుడిపైకి 'బ్లూ ఘోస్ట్ మిషన్'ను ప్రయోగించిన నాటి నుంచి గడచిన 19 నెలలుగా అంతరిక్షంలో లక్ష్యం లేకుండా తిరుగుతూ వచ్చింది.
2025 జనవరి 15న ప్రయోగించిన ఈ ఫాల్కన్-9 రాకెట్ దశలవారీగా విడిపోయిన తర్వాత, దాని పైభాగం ఇంధనం కోల్పోయింది. అప్పటి నుంచి భూమికి, చంద్రుడికి మధ్య గల ఒక విశాలమైన, అస్థిరమైన వలయంలో ఇది పయనించింది.
భూమి, చంద్రుడు, సూర్యుని గురుత్వాకర్షణ శక్తుల రాపిడి, అలాగే సూర్యరశ్మి కలిగించిన ఒత్తిడి కారణంగా ఈ రాకెట్ భాగం గమ్యస్థానం క్రమంగా మారుతూ వచ్చి, చివరికి చంద్రుడిని ఢీకొనేలా చేసింది.
వేగం, ప్రభావం..
ఈ స్టేజ్‌లోని ఇంధనాన్ని పూర్తిగా తొలగించి 'పాసివేట్' చేశామని స్పేస్ఎక్స్ సంస్థ తెలిపింది. అయినప్పటికీ, అంతటి అధిక శక్తి మార్గాలలో ప్రయాణించే వ్యోమనౌకల శకలాలను నియంత్రిత పద్ధతిలో పూర్తిగా దారి మళ్లించడం సాధ్యం కాదని పేర్కొంది.
చంద్రునికి గాలి నిరోధం లేదా ఘర్షణను కలిగించే వాతావరణం లేనందున, ఈ రాకెట్ భాగం దాదాపు గంటకు 8,700 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది సుమారు మూడు టన్నుల టీఎన్టీ (TNT)కి సమానమైన శక్తిని విడుదల చేసి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న మన చంద్రయాన్-2 ఆర్బిటర్ ఈ ప్రమాద స్థలాన్ని గుర్తించే అవకాశం ఉంది.
Also REad: Dubai explosions: 20 నిమిషాల్లో ఏడు భారీ పేలుళ్లు.. దుబాయ్‌లో హైటెన్షన్..
Also REad: అమెరికా-ఇరాన్ యుద్ధానికి తాత్కాలిక విరామం.. ట్రంప్ సంచలన నిర్ణయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
