ఖమ్మంలో సీపీఐఎంఎల్ మాస్‌లైన్ పార్టీ డిమాండ్
Dhamsalapuram, Telangana:ఖమ్మంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎంఎల్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పట్టణ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి బైఠాయించారు. పథకాలు అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా అనేక హామీలు అమలు కాలేదన్నారు. పింఛన్, ఇందిరమ్మ గృహాలు తదితర వాటిని వెంటనే అమలు చేసి అర్హులకు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Sabarimala Temple Schedule: రేపు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం..ప్రత్యేక ఏర్పాట్ల షెడ్యూల్ విడుదల!
Sabarimala, Kerala:Sabarimala Temple Schedule 2026: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం మరోసారి తెరుచుకోనుంది. మలయాళ కేలండర్ ప్రకారం పవిత్రమైన 'చింగం' మాస పూజా కార్యక్రమాల నిమిత్తం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఈ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా శబరిమల అయ్యప్ప ఆలయం తెరిచి, మూసివేసే షెడ్యూల్ తాజాగా విడుదలైంది.
ఆలయ తెరిచే సమయం, షెడ్యూల్
కేరళంలోని శబరిమల అయ్యప్ప ఆలయం ఆదివారం అనగా ఆగస్టు 16న సాయంత్రం సరిగ్గా 5:00 గంటలకు ప్రధాన పూజారి ఆలయ గర్భగుడి తలుపులను తెరుస్తారు. మలయాళ నూతన సంవత్సరం ప్రారంభం కానున్న ఈ నెల 17వ తేదీ ఉదయం 5:00 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
చింగం మాస పూజల ముగింపు సందర్భంగా అనగా ఈ నెల 21వ తేదీ రాత్రి 10:00 గంటలకు చింగం మాస పూజలు ముగియనుండటంతో ఆలయ గర్భగుడిని మూసివేస్తారు. చింగం మాస పూజల అనంతరం, ఆ రాష్ట్రంలో పెద్దఎత్తున జరుపుకొనే ఓనం పండుగ ప్రత్యేక పూజల కోసం ఆగస్టు 24వ తేదీన శబరిమల అయ్యప్ప ఆలయం తిరిగి తెరుచుకోనుంది.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఈ ప్రత్యేక పూజా సమయాల్లో శబరిమలకు విచ్చేసే అయ్యప్ప భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీడీబీ అధికారులు, కేఎస్ఆర్టీసీ (KSRTC) సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తుల రద్దీకి తగినట్లుగా ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. యాత్రికులకు మెరుగైన వసతులు, భద్రతా చర్యలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు.
భక్తుల రద్దీ అంచనాలకు తగినట్లుగా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచామని, యాత్రికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ శబరిమల యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు.
Also Read: మరికొద్ది గంటల్లో సూర్యగ్రహణం ప్రారంభం..ఈ రాశుల వారికి తస్మాత్ జాగ్రత్త!
Also REad: అరుదైన రాజయోగం..ఈ నాలుగు రాశులకు రాజయోగాలతో అదృష్టం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Viral Video: ఎలుగుబంట్లకు పార్లేజీ బిస్కెట్లు తినిపించిన పూజారి.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:Wild Bears Video Watch: ఆధారంగా అడవి జంతువులతో పాటు ముఖ్యంగా ఎరుగుబంట్లు వంటి క్రూర మృగాల పేర్లు వింటేనే భయంతో అందరూ ఎంతో వణికిపోతూ ఉంటారు. అలాంటిది.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక పూజారి ఏకంగా అడవి ఎలుగుబంటలకు చేతులతో పార్లేజీ బిస్కెట్లను తినిపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆయన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక హనుమంతుడి ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన అడవి ఎలుగుబంట్లకు పూజారి ఎలాంటి భయం లేకుండా అక్కడే కూర్చుని.. ఆ మూడింటికి పార్లేజీ బిస్కెట్లు చేతులతో తినిపిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో రెండు ఎలుగుబంట్లు అతడు అందించిన బిస్కెట్లను అద్భుతంగా తింటున్నాయి. అంతేకాకుండా మరో చిన్న ఎలుగుబంటి మాత్రం.. ఆ పూజారి తలభాగం పైకి ఎక్కి.. అతను ఇచ్చిన బిస్కెట్‌ను తినడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.. వాటికి ఆ పూజారి ఎంతో ఆప్యాయంగా బిస్కెట్లు పెట్టడం చూసిన చాలామంది.. ఆశ్చర్యపోతూ వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు..
అయితే, ఈ వీడియో చూసిన వన్యప్రాణి సంరక్షకులు సైతం.. సోషల్ మీడియా వినియోగదారులకు, అడవిలో జీవించే వారికి కొన్ని ప్రత్యేకమైన సూచనలు తెలుపుతున్నారు.. ఈ తరహా అలవాట్లు మూగజీవాలకే కాకుండా మానవాళికి కూడా తీవ్ర ముప్పు కలిగిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. అడవి జంతువులకు మనుషులకు పట్ల సహజంగా ఉండే భయం పోయి.. ఆహారం కోసం పూర్తిగా మనుషులపై ఆధారపడే ప్రమాదం ఉందని వారంటున్నారు.. అంతేకాకుండా క్రమంగా ఈ జంతువులు జనావాసాల్లోకి రావడం మొదలవుతాయని.. ఈ సమయంలోనైనా ఆహారం దొరకకపోతే.. ప్రజలపై దాడి చేసే అవకాశాలు విపరీతంగా పెరుగుతాయని వారు చెబుతున్నారు..
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
అలాగే ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌తో పాటు పంచదార అధికంగా ఉండే, ఇలాంటి బిస్కెట్లు వంటి మానవ ఆహారాలు అడవి జంతువుల ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బ తీసే అవకాశాలు ఉన్నాయని వారు తెలుపుతున్నారు. జంతువులు తమ సహజ ఆహారాన్ని వెతుక్కోవడం మానేస్తే స్థానిక పర్యావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ఛాన్స్ కూడా ఉందట... వన్యప్రాణులను ప్రేమించడం మంచిదే అయినప్పటికీ.. వాటిని వాటి సహజ ఆవాసాల్లో స్వేచ్ఛగా బ్రతకనివ్వడమే అసలైన పరిరక్షణ అని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఎలుగుబంట్లకు సంబంధించిన వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rohit Sharma West Indies: రిటైర్మెంట్ వార్తలకు చెక్..రోహిత్ శర్మకు మరోసారి వన్డేల్లో అవకాశం!
Hyderabad, Telangana:Rohit Sharma West Indies Series: భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఇంగ్లండ్ పర్యటనలోని చివరి వన్డేలో అద్భుతమైన సెంచరీతో మెరిసిన 'హిట్‌మ్యాన్', తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
వెస్టిండీస్ సిరీస్‌తో కీలక అడుగు
బీసీసీఐ, సెలెక్టర్ల మధ్య జరిగిన చర్చల అనంతరం వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్‌కు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. 2027 వన్డే ప్రపంచకప్‌లోపు తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ సిరీస్ రోహిత్‌కు అత్యంత కీలకం కానుంది.
ఊహాగానాలకు కారణాలేంటి?
ఇంగ్లండ్ పర్యటన సమయంలో రోహిత్ స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఆడించాలనే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. లార్డ్స్ వేదికగా జరిగిన వన్డేనే రోహిత్‌కు ఆఖరి మ్యాచ్ కావచ్చని ప్రచారం జరిగింది. అయితే, అదే మ్యాచ్‌లో రోహిత్ అబాధ్యతాయుతమైన శతకంతో చెలరేగి, రిటైర్మెంట్పై ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.
సిరీస్వారీగా ప్రదర్శనల సమీక్ష
తన వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన రోహిత్‌కు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. ఇకపై ఆయన ప్రదర్శనను సిరీస్వారీగా సమీక్షించనున్నారు. దీంతో వెస్టిండీస్ సిరీస్‌లో రోహిత్ ప్రదర్శన ఎలా ఉండబోతుందనే దానిపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
అజిత్ అగార్కర్ భవిష్యత్తు..
మరోవైపు బీసీసీఐ ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలంపై కూడా సందిగ్ధత కొనసాగుతోంది. వరుస ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు రాణించడంతో ఆయన ఒప్పందాన్ని 2027 ప్రపంచకప్ వరకు పొడిగిస్తారని భావించారు. అయితే, శ్రీలంక టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత జరిగే బీసీసీఐ కీలక సమావేశంలో అగార్కర్ భవిష్యత్తుపై స్పష్టత రానుంది.
బీసీసీఐ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై సెలెక్టర్లు, బోర్డు పెద్దల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. జట్టులో ప్రక్షాళన జరగాలని సెలెక్టర్లు భావిస్తుంటే, బోర్డు మాత్రం రోహిత్ అందుబాటులో ఉన్నంత కాలం ఆడాలని కోరుకుంటున్నట్లు సమాచారం. ఏదేమైనా, ఇంగ్లండ్‌లో సెంచరీతో తన సత్తా చాటిన రోహిత్.. వెస్టిండీస్ సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగిస్తే 2027 వరల్డ్‌కప్ రేసులో ముందుండటం ఖాయం.
Also Read: శ్రీలంకతో తొలి టెస్టులో టీమ్ఇండియా ప్లేయింగ్ 11 ఇదే! బెంచ్ మీద నలుగురు ఆటగాళ్లు!
Also Read: టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్? బీసీసీఐలో కీలక పదవికి హైదరాబాదీ సై!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
సర్కార్ బడుల్లో ప్రపంచస్థాయి చదువులు.. ఈనెల 17 నుంచి ఫిన్లాండ్లో టీచర్ల స్పెషల్ ట్రైనింగ్..!!
Lakshmapur, Telangana:Teachers Finland Training: ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. 'ఏపీ విద్యా నమూనా'ను దేశానికి ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో, ఉత్తమ ఉపాధ్యాయులకు విదేశాలలో శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఏప్రిల్‌లో ఇప్పటికే 37 మంది ఉపాధ్యాయులను సింగపూర్‌కు పంపిన ప్రభుత్వం, ఇటీవల మరో 29 మంది అగ్రశ్రేణి ఉపాధ్యాయులను ఫిన్లాండ్కు పంపే ఏర్పాట్లను ఖరారు చేసింది. ఈ బృందం ఆగస్టు 17 నుంచి 26 వరకు ఎనిమిది రోజుల పాటు పర్యటిస్తుంది.
ప్రపంచంలోనే అగ్రగామి విద్యాసంస్థ అయిన ఫిన్లాండ్లో 'అంతర్జాతీయ వృత్తిపర అభివృద్ధి కార్యక్రమం' కింద ఉత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేయడమే ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యం. ఉపాధ్యాయులు టుర్కు విశ్వవిద్యాలయంలో ప్రత్యేక శిక్షణ పొందుతారు. ఈ కార్యక్రమం ద్వారా, ఉపాధ్యాయులు అంతర్జాతీయ విద్యా వ్యవస్థ వినూత్న బోధనపై ప్రత్యక్ష అనుభవాన్ని పొంది, రాష్ట్రంలో బోధన నాణ్యతను మరింత బలోపేతం చేస్తారు.
ఈ శిక్షణా కార్యక్రమాన్ని మూడు దశల్లో అమలు చేసేందుకు రూపొందించారు. మొదటి దశ. నలుగురు ఫిన్నిష్ నిపుణులతో నాలుగు రోజుల ఓరియెంటేషన్ కార్యక్రమం ఇప్పటికే విజయవాడలో పూర్తయింది. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులకు ఫిన్నిష్ విద్యా వ్యవస్థ, బోధనా పద్ధతులపై ప్రాథమిక అవగాహనను అందించింది.
రెండవ దశ: ఆగస్టు 17 నుండి 26 వరకు ఫిన్లాండ్లోని టుర్కు, రౌమాలో ఎనిమిది రోజుల ప్రత్యక్ష శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో తరగతి గదుల పరిశీలన, పాఠశాలల సందర్శన, స్థానిక విద్యావేత్తలతో ముఖాముఖి చర్చలు ఉంటాయి. బాలల-కేంద్రీకృత అభ్యసనం, ఆనందకరమైన బోధనా పద్ధతులు, ఆట-ఆధారిత విద్య వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు.
మూడవ దశ: శిక్షణ తర్వాత, ఆన్లైన్ మార్గదర్శక సెషన్లు నిర్వహిస్తారు. టుర్కు విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు మన ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేస్తారు. వారి పాఠశాలల్లో అమలు చేయాల్సిన ప్రాజెక్టుల విషయంలో వారికి సహాయం చేస్తారు.
ఫిన్లాండ్ పర్యటన నుండి తిరిగి వచ్చిన ఉపాధ్యాయులు మన రాష్ట్రంలోని పాఠశాల వాతావరణంలో ఫిన్నిష్ బోధనా పద్ధతులను అమలు చేయడానికి ఒక మార్గసూచిని రూపొందిస్తారు. వారు తమ జిల్లాల్లోని తోటి ఉపాధ్యాయులకు వనరుల వ్యక్తులుగా.. మార్గదర్శకులుగా సేవ చేస్తారు. వారు ఆటలతో సరదాగా నేర్చుకోవడానికి నమూనా తరగతి గదులను సృష్టిస్తారు. వారు నేర్చుకున్న విజయవంతమైన బోధనా పద్ధతులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర పాఠశాలల్లోనూ ప్రచారం చేస్తారు.
ఈ కార్యక్రమం ఉపాధ్యాయులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, డిజిటల్ సాధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, అంతిమంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం, ప్రతి విద్యార్థికి ప్రపంచ స్థాయి సమగ్ర విద్యను అందించడం అనే ప్రభుత్వ ఆశయానికి ఈ కార్యక్రమం గణనీయంగా దోహదపడుతుంది.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అలర్ట్...OPSపై కేంద్రం పార్లమెంటులో ఏం చెప్పిందంటే..?
Also Read: స్కూల్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Snake Video: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. భారీ పాముతో పిల్లల ఆటలు.. వీడియో!
Hyderabad, Telangana:Toddlers Play With Snake Video: సోషల్ మీడియా ప్రపంచంలో రోజుకొక వింతైన ఆశ్చర్యం కలిగించే వీడియో వెలుగులోకి వస్తూనే ఉంటది.. సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యం కలిగించే వీడియోలు అన్ని క్షణాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒళ్లు గగుర్పొడిచే ఘటనే ఇప్పుడు వెలుగు చూసింది.. సాధారణంగా పాముల పేర్లు వింటేనే ఆమడ దూరం పారిపోతూ ఉంటాం.. అలాంటిది కొంతమంది చిన్నారులు ఏకంగా భయంకరమైన పాములను చేతిలో పట్టుకొని ఆడుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను షాక్‌కు గురి చేసేలా చేస్తుంది.. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే ట్రెండింగ్ మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వీడియోలో ఏముంది?
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే. ముగ్గురు చిన్న పిల్లలు ఎలాంటి భయం లేకుండా పాములతో ఆడుకోవడం మీకు క్లియర్ గా కనిపిస్తుంది. అందులో ఇద్దరు చిన్నపిల్లలు కలిసి ఒక భారీ సైజు కలిగిన ప్రమాదకరమైన పామును రెండు చేతుల పట్టుకొని ఉండడం గమనించవచ్చు. ఆ పాము కూడా ప్రమాదకరంగా నాలుకను బయటికి తీసి.. పడగపై నిలబడి ఉండడం మీరు గమనించవచ్చు.. వారి పక్కనే ఉన్న మరో పిల్లాడు ఒక చిన్న పాముని పట్టుకొని.. ఎంతో అపురూపంగా చూస్తూ ఉండడం మీరు గమనించవచ్చు...
అన్నింటికంటే ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే.. ఆ వీడియోలో పామురంగు అత్యంత వింతగా.. చూడడానికి ఎంతో భయానకరంగా ఉండటం మీరు గమనించవచ్చు. ఆ పాము ఏ క్షణంలోనైనా కాటు వేసే ప్రమాదం ఉన్నప్పటికీ.. ఆ పిల్లలు ఏమాత్రం ఏమీ తెలియనట్లుగా.. వాటిని ఒక బొమ్మలా భావించి ఆడుకోవడం చూసేవారికి ఆశ్చర్యం కలిగిస్తుంది.. అంతేకాకుండా ఆ పాము ఉగ్రరూపం దాల్చినట్లు కూడా అనిపించడం చూసి చాలామంది వారి తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేయడం కామెంట్లలో కనిపిస్తుంది..
ఈ వీడియోను ఒక కథ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అతి తక్కువ సమయంలోనే నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 40 లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోను లక్షల్లో లైక్ చేసినట్లు సమాచారం. ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు కూడా పెడుతున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమా? వారి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అని కొందరు కామెంట్లలో ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు..
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Video Viral: చైనాలో బతికున్న కప్పతో టీ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!
Hyderabad, Telangana:Live Frog Milk Tea Viral Video: సోషల్ మీడియా అనేది ఒక మాయా ప్రపంచంగా మారిపోయింది.. ఇందులో ఎప్పుడు ఎలాంటి, దేనికి సంబంధించిన వీడియోలు, వార్తలు టెండర్ అవుతాయో ఊహించడం చాలా కష్టమని మనందరికీ తెలుసు.. అప్పుడప్పుడు ఇందులో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే నవ్వొస్తుంటుంది.. మరికొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యంతో పాటు భయాందోళనకు కూడా గురి చేస్తూ ఉంటాయి. తాజాగా ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఒక వీడియో మాత్రం అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది.. చైనాకు సంబంధించిన ఒక వ్యక్తి తాను తాగే మిల్క్ టీ గ్లాసులోని ఏకంగా బతికి ఉన్న ఒక పెద్ద కప్పని వేసుకొని.. స్ట్రాతో ఆ టీని తాగుతూ ఉన్నట్లు వీడియో వైరల్ అవుతుంది..
ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది.. చైనా వాళ్లు జంతువులను ఇష్టమొచ్చినట్లు చంపుకొని ఆహారంగా తీసుకుంటారని.. వారి అలవాట్లపై తీవ్రస్థాయిలో సోషల్ మీడియా వినియోగదారులు మండిపడుతున్నారు. ఈ వీడియోను @lolong___ అనే x యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే ఈ వీడియో అప్పటినుంచి విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది. ఈ వీడియోని ఏకంగా 1.2 కోట్ల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
చైనీలు బతికున్న కప్పను పాల టీలో వేసుకుని.. దాన్ని రసాన్ని తాగుతారు.. అని క్యాప్షన్‌తో ఈ వీడియోను సోషల్ మీడియాలో వదలడంతో.. చాలామంది ఈ వీడియో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు వీళ్ళు మనుషులేనా? ఇంత దారుణమైన ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నారు? అని నెట్ రీజియన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
— 𝐥𝐨𝐥𝐨𝐧𝐠 (@lolong___) August 9, 2026
నిజంగానే కప్ప టీ తాగుతారా?
చైనాలో ఇలాంటి వింత టీలను తాగుతారా? అని చాలామంది ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చాలామంది ఇంటర్నెట్లో సెర్చ్ చేయగా అబద్ధమని తేలింది.. ఆసియాలోని కొన్ని దేశాల్లో కప్పలను ఉడికించి.. సూప్ లాగా తినే అలవాటు ఉంటుంది.. కానీ ఇలా బతికున్న కప్పను టీలో వేసుకొని ప్రాణాలతో తాకేయడం అనేది చైనా తో పాటు థాయిలాండ్ లాంటి ఏ దేశాల్లో ఆహార సాంస్కృతి కాదని గూగుల్ సెర్చ్ లో తేలింది.. ఇదంతా కేవలం సోషల్ మీడియా వినియోగదారులను బురిడీ కొట్టించి.. వ్యూస్ సంపాదించుకోవడానికేనని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు చెబుతూ వస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఈ వీడియోను క్లియర్‌గా గమనించి మీరు కూడా చూస్తే.. అందులోని దొంగ నాటకం బట్టలు అవుతుంది.. ఒక వ్యక్తి కేవలం స్ట్రాను నోట్లో పెట్టుకుని టీ తాగుతున్నట్లు నటిస్తున్నాడు తప్ప.. స్ట్రా ద్వారా ఆ కప్ప ఉన్న నీరు ఒక్క చుక్క కూడా నోట్లోకి వెళ్లలేకపోవడం కూడా మీరు చూడొచ్చు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో లైక్స్ తో పాటు కామెంట్స్ కోసం ప్రజలు ఎంతకైనా దిగజారిపోతున్నారు. వ్యూస్ కోసం ఇలాంటి అడ్డదారులు తొక్కుతూ వస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Viral Video: బాబోయ్.. ఈ బుడతడు మామూలోడు కాదుగా.. వీడియో!
Hyderabad, Telangana:Little Boy Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ఎన్నో ఆశ్చర్యకరమైన ఘటనలకు, అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.. రోజు ఎన్నో రకాల విచిత్రమైన వీడియోలు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని మనల్ని నవ్వు పుట్టించేలా చేస్తే మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి.. ముఖ్యంగా కొన్ని చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలైతే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి కోవాకు సంబంధించిన టాలెంటెడ్ బాలుడు వీడియో అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
భారీ ట్రాక్టర్‌తో బుడతడు..
సాధారణంగా చాలామంది పిల్లలు చిన్న వయసులో ట్రాక్టర్ బొమ్మలతో పాటు కార్ల బొమ్మలు, ప్లాస్టిక్ సైకిళ్లతో ఆడుకుంటూ ఉంటారు.. మరి కొంతమంది ప్లాస్టిక్ రిమోట్ కంట్రోల్ కార్లలో ఎక్కి.. నడిపినట్టు ఫీల్ అవుతూ ఉంటారు.. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్న బాలుడు మాత్రం వయస్సుకు ఏ మాత్రం వంతన లేని విధంగా ఓ పని చేసేసాడు... నేరుగా ఆ యువకుడు భారీ డాక్టర్‌ను ఎక్కి.. నడపడమే కాకుండా.. తనలో ఉన్న డ్రైవింగ్ స్కిల్ బయటపెట్టి ప్రొఫెషన్ డ్రైవర్ల అందరిని ఆశ్చర్యపోయేలా చేసాడు.. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా.. ఆ బాలుడు తన స్టీరింగ్ అటు ఇటు తిప్పుతూ ఏమాత్రం భయం లేకుండా అద్భుతంగా ట్రాక్టర్ ని కంట్రోల్ చేయడం ఈ వీడియోలో మీరు క్లియర్‌గా చూడొచ్చు..
ఆ బాలుడికి కాళ్లు కనీసం.. క్లచ్, బ్రేకులకు కూడా సరిగ్గా అందలేక పోయినప్పటికీ.. తనలో ఉన్న స్కిల్ ను బయటపెట్టి.. సీటు అంచున కూర్చొని మరి.. ట్రాక్టర్‌ను అద్భుతంగా నడపడం మీరు ఈ వీడియోలో కళ్ళకు కట్టినట్లు చూడొచ్చు.. అతను ట్రాక్టర్ నడుపుతున్న సమయంలో.. ఆ పిల్లాడి ముఖంలో ఎలాంటి భయం లేకపోవడం కూడా అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.. ప్రస్తుతం ఈ వీడియో ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఇతర సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ గా మారింది. వేళల్లో లక్షల్లో వ్యూస్ రావడమే కాకుండా.. చాలామంది ఈ వీడియోకు కామెంట్లు కూడా పెడుతూ వస్తున్నారు..
ఇలా కామెంట్స్ చేస్తున్నారు..
ఈ అద్భుతమైన వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు చూసి ఆశ్చర్యపోతూ వస్తున్నారు. చాలామంది ఈ వీడియో పై కామెంట్లు కూడా పెడుతున్నారు.. అరే వీడు సాధారణమైన కుర్రాడు కాదు.. పుట్టినప్పుడే డ్రైవింగ్ స్కిల్స్ నేర్చుకున్నట్లు ఉన్నాడు.. అంటూ ఒక సోషల్ మీడియా వినియోగదారుడు కామెంట్ చేస్తే.. మరి కొంతమంది.. ఈ వయసులోనే ఇంత టాలెంటెడ్ దాగుందా? అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ బాలుడికి ఉన్న ఆత్మవిశ్వాసం అద్భుతమని కొంతమంది కొనియాడుతున్నారు.. ఏది ఏమైనా ఈ బాలుడికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాను హల్చల్ చేస్తుంది..
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
విద్యార్థులకు సీఎం రేవంత్ శుభవార్త.. నేరుగా అకౌంట్లలోకి ఫీజు రీయింబర్స్మెంట్..!!
Lakshmapur, Telangana:Telangana Fee Reimbursement: స్వాతంత్ర్య దినోత్సవం వేళ తెలంగాణ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులకు విద్యా బోధనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్త కూడదనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రూ. 2,400 కోట్ల నిధులు ముందస్తుగానే బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు రేవంత్ ప్రకటించారు. విద్యార్థులు ఎవరినీ ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా, డబ్బులు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోనే స్కాలర్ షిప్ సొమ్మ జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు సాధించాలంటే కేవలం డిగ్రీలు ఉంటే సరిపోవని, టెక్నికల్ స్కిల్స్ కడా ఎంతో సీఎం రేవంత్ విద్యార్థులకు సూచించారు.
10వ తరగతి పూర్తైన వెంటనే విద్యార్థులు ITI కోర్సుల ద్వారా వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవచ్చని సీఎం చెప్పారు. నర్సింగ్ విద్య అభ్యసించిన వారికి జపాన్, జర్మనీ, కొరియా తదితర విదేశాలలో లక్షల రూపాయల ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. యువతలో తగిన నైపుణ్యం, సామర్థ్యం ఉంటే.. వారిని విదేశాలకు పంపించి మంచి ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యతను తనదేనని రేవంత్ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో విద్యా రంగానికి ప్రాధాన్యతనిచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్వాన్స్ ఫీజు రీయింబర్స్మెంట్లను అందించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ చొరవలో భాగంగా, ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ల మొదటి విడతగా రూ.250 కోట్లను నేరుగా బ్యాంకుల్లో జమ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని అర్హులైన పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రతి ఏటా రూ.2,300 కోట్లను క్రమం తప్పకుండా విడుదల చేస్తామని ఆయన స్పష్టంగా హామీ ఇచ్చారు.
ఫీజు రీయింబర్స్మెంట్లు ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న నెలలోపే విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అయ్యేలా ఒక పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడానికి బలమైన పునాదిని అందిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అలర్ట్...OPSపై కేంద్రం పార్లమెంటులో ఏం చెప్పిందంటే..?
Also Read: స్కూల్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
సర్కార్ బడుల్లో చదువులెట్ల సాగుతున్నయ్.. ఆగస్టు 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో తనిఖీలు..!!
Lakshmapur, Telangana:Telangana government schools: ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు ఎలా సాగుతున్నాయి.. టీచింగ్ ఎలా ఉంది.. పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు.. పాఠశాలలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే దానిపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడానికి అకడమిక్ ప్యానెల్ బృందాలను నియమిస్తున్నారు. ఈ బృందాలు ఈ నెల 17వ తేదీన తనిఖీలను ప్రారంభిస్తాయి. విద్యార్థుల ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్ర (FLN) సామర్థ్యాలను అంచనా వేయడం, ఉపాధ్యాయులకు విద్యాపరమైన మద్దతును అందించడం ఈ తనిఖీల ప్రాథమిక ఉద్దేశ్యం.
రాష్ట్రంలోని సుమారు 24,000 పాఠశాలలను తనిఖీ చేయడానికి పాఠశాల విద్యా అధికారులు 307 ప్యానెల్ బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలో 171 ప్రాథమిక పాఠశాలలకు, 38 ఉన్నత ప్రాథమిక పాఠశాలలకు, 98 ఉన్నత పాఠశాలలకు కేటాయించారు. పదేళ్ల అనుభవం ఉన్న PSHMలు.. SGTలు ప్రాథమిక పాఠశాలలకు అధికారులుగా ఉంటారు. ఉన్నత పాఠశాలలు, UPSలకు పాఠశాల సహాయకులు సభ్యులుగా ఉంటారు. ప్రాథమిక పాఠశాల తనిఖీ బృందంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఉన్నత పాఠశాల బృందంలో ప్రిన్సిపాల్, సబ్జెక్ట్ టీచర్, PETతో సహా తొమ్మిది మంది సభ్యులు ఉంటారు. ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక బృందాలు రోజుకు 2 పాఠశాలలను తనిఖీ చేయాలి. మూడు నెలల్లో కనీసం 100 పాఠశాలలను తనిఖీ చేయాలి. ఉన్నత పాఠశాలల బృందాలు రోజుకు ఒక పాఠశాలను తనిఖీ చేయాలి. మూడు నెలల్లో సగటున 50 పాఠశాలలను తనిఖీ చేయాలి.
తనిఖీలకు ముందు, బృందాలు మూడు దశల్లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాయి. ఈ శిక్షణ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న టీజీఐఆర్డీలో ప్రారంభమైంది. మొదటి దశ ఈ నెల 11, 12 తేదీలలో, రెండవ దశ 17, 18 తేదీలలో, మూడవ దశ 19, 20 తేదీలలో జరుగుతుంది. శిక్షణ పూర్తయిన వెంటనే, బృందాలు పాఠశాలల తనిఖీలు నిర్వహిస్తాయి. మొదటి దశ ఆగస్టు 17న, రెండవ దశ ఆగస్టు 21న, మూడవ దశ ఆగస్టు 24న ప్రారంభమవుతుంది. ఈ శిక్షణ కోసం ప్రభుత్వం రూ. 18.50 లక్షల బడ్జెట్‌ను కేటాయించింది. అధికారులు సకాలంలో శిక్షణకు హాజరు కావాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ నవీన్ నికోలస్ ఆదేశించారు.
ఈ బృందాలు కేవలం బోధన గురించే కాకుండా, పాఠశాల మొత్తం పరిస్థితి గురించి కూడా విచారిస్తాయి. అవి తరగతి గది బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళికలు, సిలబస్ పూర్తి చేయడం, విద్యార్థుల హాజరుతో పాటు గ్రంథాలయాలు, ప్రయోగశాలల వంటి మౌలిక సదుపాయాల నిర్వహణను కూడా పరిశీలిస్తాయి. అంతేకాకుండా, ఈ బృందాలు మధ్యాహ్న భోజన పథకం అమలు, ఆహార నాణ్యత, పారిశుధ్యం, తాగునీటి సౌకర్యాలు, విద్యార్థుల ఆరోగ్య పరీక్షలపై నివేదికలను సిద్ధం చేస్తాయి. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో ఏకరూపత ఏర్పడుతుందని, లోపాలను సరిదిద్దుకోవడానికి అవకాశం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అలర్ట్...OPSపై కేంద్రం పార్లమెంటులో ఏం చెప్పిందంటే..?
Also Read: స్కూల్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
దిమాగీ నక్సల్స్‌తో జాగ్రత్త.. ఎర్రకోటపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఎవరికి హెచ్చరికంటే?
Lakshmapur, Telangana:PM Modi: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దిమాగీ నక్సల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. దిమాగీ నక్సల్స్ పదాన్ని ఆయన పూర్తి వివరించలేదు. కానీ వారిని గుర్తించి..వేరు చేయాలని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.
దిమాగీ నక్సల్స్ ఓ కొత్త రకమైన శత్రువు అన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మావోయిస్టు మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఇప్పుడు దేశ రాజకీయాల్లో భాగస్వామ్యం అవుతున్నారని.. కొందరు ప్రభుత్వ కమిటీల్లోనూ అడ్వైజర్లుగా విధులు నిర్వహిస్తున్నారని.. మావోయిస్టు ఐడియాలజీ దేశ విధానాలపై ప్రభావం చూపిందన్నారు. సాయుధ నక్సలైట్లు అంతం అయినా.. ఆ సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించామని సాయుధ నక్సలైట్లు అంతమైనా.. దిమాగీ నక్సల్స్ మాత్రం అలాగే ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. ఆ నక్సల్స్ దేశంలో హింస, అల్లర్లు స్రుష్టిస్తున్నారని.. ప్రధాని మోదీ ఆరోపించారు. సమాజాన్ని తమ తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లేందుకు విభిన్న వ్యూహాలను అమలు చేస్తున్నారని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
గడిచిన నాలుగు దశాబ్దాలుగా నక్సలిజం, మావోయిజం భయానక హింసతో లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేశాయని, 3,500 మందికి పైగా పోలీసు భద్రతా సిబ్బంది ఆధిపత్య పోరులో ప్రాణాలు అర్పించారని ప్రధాని తెలిపారు. 2014లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దేశాన్ని నక్సల్స్ రహితంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేశామని, నేడు ఆ ఆశయం దిశగా గణనీయమైన విజయం సాధించి మావోయిస్టు హింసను దాదాపు కట్టడి చేశామని స్పష్టం చేశారు.ఒకప్పుడు తుపాకుల మోతలతో, రక్తాక్షరాలతో తడిసిన మారుమూల నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నేడు అభివృద్ధి పతాకాలు ఎగురుతున్నాయని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, మౌలిక వసతులు ఆయా ప్రాంతాలకు చేరువవుతున్నాయని పేర్కొన్నారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అలర్ట్...OPSపై కేంద్రం పార్లమెంటులో ఏం చెప్పిందంటే..?
Also Read: స్కూల్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sun-ketu: సింహరాశిలో సూర్య-కేతువుల కలయిక.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగులేని రాజయోగం!
Hyderabad, Telangana:Sun-ketu Conjunction In Leo Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 17వ తేదీ చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు గ్రహాలకు అధిపతిగా భావించే సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. చాయాగ్రహంగా పిలిచే కేతువు ఇప్పటికే అదే రాశిలో సంచార దశలో ఉంది. ఫలితంగా సింహరాశిలో సూర్య కేతువుల బలమైన గ్రహ సంయోగం ఏర్పడుతోంది. దీని కారణంగానే కొన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆదాయ వనరులు పెరగడమే కాకుండా.. డబ్బు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోబోతున్నాయి. అలాగే ఉద్యోగంలో మంచి అభివృద్ధి కూడా లభించబోతోంది. ముఖ్యంగా సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అయితే, ఏ రాశుల వారికి ఈ రెండు గ్రహాల శుభ ప్రభావం పడుతుందో.. లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశుల వారికి బంపర్ లాభాలు..
మేషరాశి
సూర్య కేతువుల కలయిక కారణంగా ఈ సమయంలో మేష రాశి వారికి గొప్ప పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఉద్యోగస్తులకు అద్భు తమైన పురోగతి లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఇతరుల మధ్య వచ్చిన చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. అందరూ మిమ్మల్ని గౌరవించడమే కాకుండా అద్భుతమైన ప్రశంసలు కూడా వారి చేత పొందుతారు. అలాగే కుటుంబంలో మంచి సంతోషకరమైన వాతావరణ కూడా నెలకొంటుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి కూడా ఈ సమయం అత్యంత అనుకూలమైన లాభాలను అందిస్తుంది.. ముఖ్యంగా శక్తివంతమైన యోగ ప్రభావంతో ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే పనుల్లో పురోగతి లభించడమే కాకుండా.. భారీ మొత్తంలో ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో దూర ప్రయాణాలు చేసే వారికి విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచి ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులందరికీ తప్పకుండా పరిష్కారం లభించబోతోంది.
తులారాశి
తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక అద్భుతమైన కొత్త ఆదాయ మార్గాలను తెచ్చి పెట్టబోతున్నాయి. ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన పనులన్నీ ఎంతో సులభంగా పూర్తి కాబోతున్నాయి. ఉద్యోగంలో గొప్ప పురోగతి లభించడమే కాకుండా.. మంచి మంచి పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అంతేకాకుండా ఇతర ఉద్యోగుల సహాయంతో భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా కష్టపడి పనులు చేసే ఉద్యోగాస్తులకు ఈ సమయంలో తప్పకుండా ప్రశంసలు లభించబోతున్నాయి..
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు లభించబోతున్నాయి. కేతువు గ్రహ ప్రభావంతో ఆదాయం భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలో పదోన్నతులు కలిగి అనుకున్న జీవితాలు కూడా పెంచుకోగలుగుతారు. అంతే కాకుండా మీరు బాసులకు సన్నిహితులుగా మారి విశేషమైన లాభాలు పొందవచ్చు.. ఈ సమయంలో వ్యాపారాలకు కూడా చాలా వరకు వృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడం వల్ల పెద్ద పెద్ద ధన లాభాలను సొంతం చేసుకోగలుగుతారు. అనుకున్న అని కూడా సులభంగా సాధించగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర నిపుణులను ఆధారంగా చేసుకొని రాసింది మాత్రమే.. అలాగే ఈ సమాచారం మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించదు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
‘అంగీ’ పైపైకి.. ‘లాగు’ జారిపోతోంది.. కొలతలు మారిన ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్స్..!!
Lakshmapur, Telangana:Govt School Uniform Issue Telangana: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల (యూనిఫాం) పంపిణీలో తీవ్ర అక్రమాలు, అలసత్వం వెలుగుచూశాయి. సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన యూనిఫాంల పంపిణీ కార్యక్రమం తీవ్ర గందరగోళానికి దారితీసింది. పంపిణీ చేసిన దుస్తుల కొలతల్లో భారీ తేడాలు రావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాఠశాలల్లో బాలికలకు కేటాయించిన దుస్తులు కొంతవరకు ఫర్వాలేదనిపించినా, బాలురకు అందించిన చొక్కాలు (అంగీలు), లాగుల పరిస్థితి మాత్రం మరీ అధ్వానంగా తయారైంది.
కొందరు విద్యార్థులకు చొక్కాలు మరీ పొట్టిగా, బిగుతుగా ఉంటే.. మరికొందరికి అతిగా పొడవుగా, వదులుగా ఉన్నాయి. నాణ్యత లేని కుట్లు ఉండటంతో పాటు చొక్కాలు, లాగులు ఒకవైపు పైకి, మరోవైపు కిందికి వేలాడుతూ అసమానంగా ఉన్నాయని ఉపాధ్యాయులు గుర్తించారు. ఈ లోపాలను గమనించిన పలువురు ఉపాధ్యాయులు, ఇలాంటి నాసిరకం దుస్తులను విద్యార్థులకు పంపిణీ చేయలేమని స్పష్టం చేస్తూ పంపిణీ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌తో పాటు వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లోనూ ఇదే తరహా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారముపై హుస్నాబాద్ ఎంఈవో మనీల స్పందిస్తూ.. యూనిఫాంల కొలతల్లో తేడాలు వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ దుస్తులను కుట్టిన మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో మాట్లాడి, కొలతలను సరిచేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దుస్తులను పునర్నిర్మించి సరిచేసే వరకు విద్యార్థులకు పంపిణీ చేయవద్దని హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. విద్యార్థుల దుస్తుల నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అలర్ట్...OPSపై కేంద్రం పార్లమెంటులో ఏం చెప్పిందంటే..?
Also Read: స్కూల్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Independence Day: స్వాతంత్య్ర వేడుకల్లో తళతళ మెరుస్తున్న తెలంగాణ సచివాలయం
Hyderabad, Telangana:Light Decoration To Telangana Secretariat For Independence Day 2026 Watch VisualsKCR Wishes: తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తొలి సీఎం కేసీఆర్
Baddipadaga, Telangana:80th Independence Day: స్వాతంత్య్ర వేడుకలకు తెలంగాణలో భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాడవాడలా స్వాతంత్య్ర వేడుకలు జరగనుండగా రాష్ట్రస్థాయిలో గోల్కొండలో సంబరాలు జరగనున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. 'పరాయి వలస పాలనను పారదోలి 1947 ఆగస్టు 15న భారతదేశం స్వయంపాలనను సాధించుకుంది. నిస్వార్థ పోరాట స్ఫూర్తి, దార్శనిక నాయకత్వం, త్యాగంతో కూడిన ప్రజల భాగస్వామ్యమే దేశానికి స్వాతంత్య్రాన్ని అందించాయి' అని మాజీ సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
'79 వసంతాలు పూర్తి చేసుకుని 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని చేసుకుంటున్న ఈ శుభసందర్భంలో దేశ సామాజిక న్యాయం, ఆర్థిక ప్రగతిని ప్రతి ఒక్కరూ పునశ్చరణ చేసుకోవాలి' అని గులాబీ బాస్ కేసీఆర్ తెలిపారు. ఫెడరల్ పాలనా విధానం, సెక్యులర్ స్ఫూర్తితో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం మరింత ముందుకు సాగేందుకు ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలను గుర్తించాల్సిన అవసరం ఉందని మాజీ సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. భవిష్యత్తులో దేశ పాలనలో భాగస్వామ్యం కానున్న నేటితరం మరింత జ్ఞానం, సహనం, దార్శనికతతో ముందడుగు వేసినప్పుడే స్వాతంత్య్ర ఉద్యమ త్యాగాల ఫలాలు ప్రతి గడపకు చేరుతాయని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అంత్యక్రియలకు హాజరు
తన కుటుంబంలో చోటుచేసుకున్న విషాద సంఘటనతో కేసీఆర్ స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. తన సతీమణి శోభమ్మ సోదరుడు, కేసీఆర్ బామ్మర్ది మృతిచెందడంతో కల్వకుంట్ల కుటుంబం మొత్తం విషాదంలో మునిగింది. బావమరిది అంత్యక్రియల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొని ఆఖరి నివాళి అర్పించారు. అంతకుముందు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబాన్న ఓదార్చారు. ఇక తన సోదరుడు మృతిచెందడాన్ని కేసీఆర్ భార్య శోభమ్మ తట్టుకోలేకపోతున్నారు. సోదరుడి మృతదేహం చూసిన అనంతరం శోభమ్మ తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు. కంటతడి పెట్టడంతో కేసీఆర్ ఆమెను ఓదార్చారు.
Independence Day: తెలంగాణలో ఏ జిల్లాల్లో ఎవరు జెండా ఎగురవేస్తారు? పూర్తి జాబితా ఇదే!
Baddipadaga, Telangana:Telangana Independence Day: స్వాతంత్య్ర వేడుకలకు తెలంగాణలో అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లో దేశభక్తిని చాటేలా అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీపాల వెలుగులో కాంతులీనుతున్నాయి. స్వాత్యంత్ర వేడుకల్లో ఏయే జిల్లాల్లో ఎవరు జెండా ఎగురవేయనున్నారనేది తెలంగాణ ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ప్రభుత్వం వెల్లడించింది.
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 32 జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు జెండా వందనం చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో రాజధాని హైదరాబాద్‌లో జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి జెండాను ఆవిష్కరించనున్నారు. ఉదయం 10:00 గంటలకు ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించేలా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం అధికార యంత్రాంగానికి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో ఉదయం 9:30 గంటలకు మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, శాసనసభ/శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించనున్నారు.
జిల్లా.. జెండా ఆవిష్కరించే మంత్రులు, ప్రజాప్రతినిధులు
ఆదిలాబాద్ – ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్
భద్రాద్రి కొత్తగూడెం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హనుమకొండ – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జగిత్యాల – మంత్రి మహ్మద్ అజహరుద్దీన్
జయశంకర్ భూపాలపల్లి – ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
జనగామ – ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
జోగులాంబ గద్వాల – ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి
కామారెడ్డి – ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు
కరీంనగర్ – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఖమ్మం – ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
కుమురంభీం ఆసిఫాబాద్ – శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
మహబూబాబాద్ – ప్రభుత్వ విప్ జె. రాంచందర్ నాయక్
మహబూబ్‌నగర్ – మంత్రి జూపల్లి కృష్ణారావు
మంచిర్యాల – ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు
మెదక్ – మంత్రి వివేక్ వెంకటస్వామి
మెద్చల్ – ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు
ములుగు – మంత్రి దనసరి అనసూయ సీతక్క
నాగర్‌కర్నూల్ – ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి
నల్గొండ – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నారాయణపేట – మంత్రి వాకిటి శ్రీహరి
నిర్మల్ – ప్రభుత్వ విప్ వెముల వీరేశం
నిజామాబాద్ – ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి
పెద్దపల్లి – ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు
రాజన్న సిరిసిల్ల – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రంగారెడ్డి – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
సంగారెడ్డి – మంత్రి దామోదర రాజనర్సింహ
సిద్దిపేట – మంత్రి పొన్నం ప్రభాకర్
సూర్యాపేట – మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
వికారాబాద్ – శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వనపర్తి – శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
వరంగల్ – మంత్రి కొండా సురేఖ
యాదాద్రి భువనగిరి – శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
