కొత్తగూడెం నెహ్రూ కాలనీలో గోడపై పాము పిల్ల కనిపించింది.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Sun Transit in Aries on April 14 Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాజుగా పిలిచే సూర్యుడు తన రాశిని మారినప్పుడల్లా ద్వాదశ రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతూ ఉంటుంది. 2026 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన చైత్ర సంక్రాంతి పర్వదినాన సూర్యుడు మీన రాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనినే జ్యోతిష్య శాస్త్రంలో మేష సంక్రాంతి కూడా అంటారు. అయితే, ఈ సంచారం రోజు నుంచి కొన్ని రాశుల వారికి గోల్డెన్ పీరియడ్ ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఆర్థికంగా వృత్తిపరంగా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే కెరీర్ పరంగా కూడా ఊహించని పురోగతి లభించబోతోంది.
అదృష్టం వరించబోయే రాశులు ఇవే..
మేష రాశి
మేష రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం కారణంగా ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో రెట్టింపు అవుతుంది పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వ రంగాల్లో పనులు చేసే వారికి లేదా ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉండబోతోంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా.. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ తో పాటు జీతాల పెంపు కూడా ఉండబోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
సింహరాశి
సింహ రాశికి అధిపతి సూర్యుడు కావడం వల్ల.. ఈ సంచారం వీరికి కూడా అద్భుతమైన ఫలితాలను అందించబోతోంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారి కోరికను ఈ సమయంలో తప్పకుండా నెరవేరబోతున్నాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదరడమే కాకుండా.. భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి వైపు నుంచి ఆస్తులు కూడా కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా సూర్యుడి సంచారం అనేక రకాల ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించబోతోంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు కూడా లభించబోతున్నాయి. సంతానం పరంగా అద్భుతమైన శుభవార్తలు వింటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వ్యక్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతోంది. నూతన పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా పొందగలుగుతారు. అలాగే సరైన వ్యక్తులతో వ్యాపార ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mahesh Babu Trisha Affair News: తమిళనాడుతో పాటు ఇటు సినీ ఇండస్ట్రీలో హీరో విజయ్, హీరోయిన్ త్రిష అఫైర్ అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడిదే రూమర్ ఆ రాష్ట్రంతో పాటు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని కూడా ఊపేస్తుంది. అయితే హీరోయిన్ త్రిషకు విజయ్‌తో కాదని.. ఓ తెలుగు హీరోతో అఫైర్ ఉందని ఓ దర్శకనిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత కొన్ని నెలలుగా రాజకీయ నాయకుడు, నటుడు విజయ్‌తో హీరోయిన్ త్రిష ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరో వార్త తెలుగునాట సంచలనంగా మారింది. అయితే ఇదే ఆరోపణతో ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. సంగీత స్వర్ణలింగం కూడా విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.
అలాగే విజయ్ ఓ హీరోయిన్ తో(ఆమె పేరు బయటపెట్టకుండా) ప్రేమాయణం సాగిస్తున్నాడని ఆరోపించింది. ఈలోగా త్రిష, తలపతి కలిసి కనిపించి కలకలం సృష్టించింది. ఇదే విషయమై టీవీకే అధినేత విజయ్ స్పందిస్తూ.. వ్యక్తిగత విషయాలను తాను సర్దుకోగలను అని కార్యకర్తలు చింతించాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
అయితే విజయ్, త్రిష పేరుతో పాటు ఇప్పుడు ఆ బంధంలో మరో తెలుగు హీరో పేరు వినిపిస్తోంది. ఇదే విషయాన్ని టాలీవుడ్‌కు చెందిన ఓ దర్శకనిర్మాత గీతాకృష్ణ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. హీరో మహేష్ బాబు, త్రిషలకు అఫైర్ ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.
మహేష్, త్రిష రహస్య సంబంధం కలిగి ఉన్నారని ఆయన తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నేరుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ముంబైలోని ఓ రహస్యప్రాంతంలో వారిద్దరూ తరచూ కలుసుకునేవారని ఆయన తెలిపారు. మహేష్ బాబు భార్య నమ్రతకు ఈ విషయం తెలిశాక చాకచక్యంగా ఈ విషాయన్ని ఆమె కప్పిపుచ్చారని దర్శకుడు గీతాకృష్ణ స్పష్టం చేశారు.
హీరో మహేష్ బాబు వ్యక్తిగత విషయానికొస్తే.. ఆయన హీరోయిన్ నమ్రతను ప్రేమించి పెళ్లాడారు. 'వంశీ' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన వీరిద్దరూ.. చాలా ఏళ్లుగా ప్రేమించుకుని, చివరకు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. భారీ బడ్జెట్ చిత్రమైన ఇందులో ప్రియాంక్ చోప్రా జోనస్ కథానాయికగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Petrol And Diesel Shortage: రెండు రోజులుగా తెలంగాణలో ఎక్కడ చూసినా పెట్రోల్ బంక్‌లు వాహనదారులతో నిండిపోయాయి. భారీ స్థాయిలో క్యూ లైన్లు ఏర్పడి పరిస్థితి భయానకంగా మారడంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత విషయమై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ప్రజలకు కొన్ని సూచనలు చేస్తూ ీలక ప్రకటన చేశారు. 'సోషల్ మీడియా వదంతులను నమ్మకండి. పెట్రోలు, డీజిల్ కొరత లేనేలేదు' అని ప్రకటించారు.
Also Read: Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు
'ఆయిల్ సంస్థల వద్ద అవసరానికి సరిపడ పెట్రోలు, డీజిల్ నిల్వలున్నాయని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఆయిల్ సరఫరాలోనూ ఇబ్బందుల్లేవు. పెట్రోలు, డీజిల్ సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది' అని బండి సంజయ్ వివరించారు. మోదీ ప్రభుత్వం ఆయిల్ నిల్వలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని చెప్పారు. వదంతలు నమ్మి అవసరానికి మించి పెట్రోలు కొనడంవల్ల క్రుత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు.
Also Read: Gold Man: స్వర్ణాభరణాల్లో తిరుమల శ్రీవారితోనే పోటీ.. 25 కిలోల బంగారంతో గోల్డ్ మెన్ సందడి
రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న వదంతులు నమ్మవద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రజలకు విజ్ఝప్తి చేశారు. ఆయిల్ సంస్థల వద్ద సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని.. కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపారు. కృత్రిమ కొరత స్రుష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలని కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. వాహనదారులు రోజువారీ అవసరాలకు తగ్గట్లుగానే క్రమశిక్షణతో పెట్రోలు, డీజిల్‌ను కొనుగోలు చేయాలని కోరారు.
Also Read: SBI Interest Rate: ఎస్‌బీఐ ఖాతాదారులకు పండుగే.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారీగా వడ్డీ రేట్ల పెంపు
అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొట్టిపారేశారు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ప్రకటించారు. ఇండియన్ ఆయిల్, హెచ్ పీసీఎల్, బీపీసీఎల్ వంటి అన్ని పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీల వద్ద అవసరమైనంత స్టాక్ అందుబాటులో ఉందని.. పెట్రోల్, డీజిల్ సరఫరాలో లోపం లేదని వివరించారు.
పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే పుకార్లు, దుష్ప్రచారాన్ని నమ్మి పెట్రోలు బంకుల వద్దకు పరుగులు తీయరాదని బండి సంజయ్ సూచించారు. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో కొన్ని పెట్రోలు బంకుల్లో తాత్కాలిక స్టాక్ కొరత ఏర్పడిందని వివరించారు. ఎలాంటి కొరత లేదని.. పెట్రోల్ బంకుల్లో కృత్రిమ కొరత ఇబ్బందుల్లేకుండా యథావిధిగానే సరఫరా కొనసాగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Lockdown In India 2026 News: పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత భారత్‌లోనూ ప్రభావం చూపనుందని పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభం నాటి పరిస్థితులకు ప్రజలకు సిద్ధంగా ఉండాలని మోదీ పిలుపు మేరకు ప్రజల్లో మరోసారి కలవరం మొదలైంది. ఈ క్రమంలో దేశంలో మరోసారి లాక్‌డౌన్ రావొచ్చనే చర్చ విపరీతంగా జరుగుతోంది. అయితే దేశంలో ఎలాంటి భయాందోళన పరిస్థితులు లేవని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
కొన్ని జాతీయ నివేదికల ప్రకారం.. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ప్రస్తుత పరిస్థితిని 'దశాబ్దాలలో అత్యంత తీవ్రమైన ఇంధన సంక్షోభం'గా అభివర్ణించారు. ప్రపంచంలో రోజుకు 11 మిలియన్ బ్యారెళ్ల చమురును లాస్ అవుతోందని గుర్తించారు. 1970 తర్వాత ఇంతటి భారీ నష్టం జరగడం ఇదే మొదటిసారి అని ఐఈఏ తెలిపింది. ఆ సంక్షోభ సమయంలో ప్రపంచం రోజుకు 5 మిలియన్ బ్యారెళ్ల చమురును కోల్పోయేది. పార్లమెంట్‌లో కూడా ఇలాంటి సంక్షోభమే తలెత్తవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
అయితే అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) హెచ్చరిక నేపథ్యంలో ఫిలిప్పీన్స్ దేశంలో జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీని లాగే అనేక దేశాలు ఇదే బాట పట్టనున్నాయని సమాచారం. ఈ క్రమంలో ఫిలిప్పీన్స్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు అత్యవసర చర్యగా 4 రోజుల పనివారాన్ని అమలు చేశాయి. అత్యవసరంగా కానీ ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. అదే విధంగా ఇంధన పొదుపు నియమాలను పాటించాలని సూచించారు. అయితే మన దేశంలో ప్రస్తుతం 45 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీలంక కొన్ని రంగాలకు ప్రభుత్వ సెలవులను తప్పనిసరి చేసింది. బంగ్లాదేశ్‌లో కూడా ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. అదే విధంగా నిర్దిష్ట సమయాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. అదే విధంగా పాకిస్థాన్ కూడా వారంలో పని గంటలను తగ్గించింది. వియత్నాంలో వ్యాపారాలు ఇంటి నుంచే పనిచేయాలని సూచించారు.
భారత్ ప్లానింగ్స్ ఏంటి?
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సమస్యలు తలెత్తుతున్న క్రమంలో భారత్ విధానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారత్‌కు కావాల్సిన ముడిచమురు, గ్యాస్‌ను సుమారు 50 శాతం గల్ఫ్ నుంచి ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ద్వారా వస్తుంది. ఇప్పుడు అదే శాతం సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావం ఇప్పటికే దేశంలో కనిపిస్తోంది.
యుద్ధం నేపథ్యంలో భారతదేశం పారిశ్రామిక గ్యాస్ సరఫరాలను తగ్గించి, LPG ఉత్పత్తిని పెంచింది. గల్ఫ్ దేశాలతో పాటు, భారతదేశం ఇప్పుడు మరెన్నో దేశాల నుంచి చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ప్రధాని మోదీ చెప్పినట్లుగా, భారతదేశం గతంలో 27 దేశాల నుంచి చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకునేది. ఇప్పుడు ఈ సంఖ్య 41కి పెరిగింది.
భారతదేశం వద్ద ప్రస్తుతం 53 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పెట్రోలియం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. అదనంగా 65 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాని మోదీ కూడా చెప్పారు. గత 11 ఏళ్లలో భారతదేశం కూడా తన శుద్ధి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది.
భారత్‌లో లాక్‌డౌన్ ఉంటుందా?
మీడియా నివేదికల ప్రకారం.. భారతదేశం ప్రస్తుతం లాక్‌డౌన్‌లో లేదు. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే, పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో ఉంది ఇంధన కొరతే కానీ, కరోనా మహమ్మారి లాగా ప్రాణాంతమైన వైరస్ కాదు. కాబట్టి, లాక్‌డౌన్ ఉండకపోవచ్చు. ఆఫీసులు వర్క్‌ఫ్రమ్ హోమ్, అత్యవసర ప్రయాణాలు తప్పా మిగితా వాటిపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jeevan Reddy Resigned: ఎంత మంది బుజ్జగించినా వెనక్కి తగ్గలేదు. తనకు జరిగిన అవమానంతో తీవ్ర మనస్తాపం చెందిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై.. కాంగ్రెస్ తీరుపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. తన సిట్టింగ్ స్థానంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేను చేర్చుకుని తన ఉనికికే ప్రమాదంగా మారిన పరిస్థితుల్లో ఆయన ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీలో ఆయన చేరిక లాంఛనమే కానుంది. ఆయన రాజీనామాతో ఉమ్మడి కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బగా భావించవచ్చు.
Also Read: Gold Man: స్వర్ణాభరణాల్లో తిరుమల శ్రీవారితోనే పోటీ.. 25 కిలోల బంగారంతో గోల్డ్ మెన్ సందడి
తీవ్ర మనోవేదన
జగిత్యాలలో నిర్వహించిన తన అనుచరులు, అభిమానుల సమావేశంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం రాజీనామా లేఖను విడుదల చేశారు. 'పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదు.. జగిత్యాలలో ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పినా వినలేదు. నేను, నా కార్యకర్తలు అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నాం. తీవ్రమైన బాధతో పార్టీని వీడుతున్నా' అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read: Telangana Assembly: 'నీ యవ్వ మమ్మల్ని అరెస్ట్ చేసుడేంది?' అసెంబ్లీ వద్ద నవ్వులు పూయించిన సంఘటన
కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నేను కొంతమంది లాగా ముఖ్యమంత్రి అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, కానీ మమ్మల్ని కూడా బతకనివ్వు' అని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. 'నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎంతమందిని తొక్కుతావయ్య నువ్వు రేవంత్ రెడ్డి. నీ తొక్కుడు కాదు రేవంత్ రెడ్డి.. ఈ జగిత్యాలలో ఏ శక్తి నన్ను ఆపలేదు. ఎవడయ్యా ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి? వాడికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? బతకడానికి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. వాడు ప్రభుత్వ సలహాదారుడిగా నియామకం అయిన తర్వాత వాడు ఇచ్చిన సలహాలు ఏమైనా ఉన్నాయా?' అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
'వేం నరేందర్ రెడ్డి ఎవడు? ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఏంది?' అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిలదీశారు. 'రేవంత్ రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తా. నీతో అణగదొక్కబడటం కంటే పోరాటం చేస్తే నాకు పోయేది ఏముంది?' అని రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. 'రేవంత్ రెడ్డి నిర్ణయాలతో ఆయన సొంత పార్లమెంట్ మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. చేవెళ్ల ఎంపీ స్థానానికి తొలుత సునీతా మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించి.. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డిని తెచ్చి అతడికి ఇచ్చారు. దాని ప్రభావం రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ స్థానం మహబూబ్ నగర్ అలానే చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది' అని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. 'దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ, కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేయడం దేనికి సంకేతం. అందుకే సికింద్రాబాద్ ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది' అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
8th Pay Commission Update: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమైన శుభవార్త. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ప్రక్రియ వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు 30 నుంచి 34 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కమిటీ పెంపు శాతాన్ని నిర్ధారించినా కొంతమేర ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. పెంపు వస్తే 1.1 కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.
దేశంలో 8వ వేతన సంఘం ప్రక్రియ వేగవంతం అవుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఆశలు భారీగా పెరుగుతున్నాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఈసారి జీతాలు, పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీని అమలు ఎప్పుడవుతుందో తెలియాల్సి ఉంది.
నిపుణుల ప్రకారం ఈ వేతన సంఘం ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయినా పెరిగిన జీతాలు ఉద్యోగుల ఖాతాల్లోకి రావడానికి 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత వేతన సంఘాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ విధంగా నిర్ణయానికి వస్తున్నారు.
కొన్ని జాతీయ నివేదికల ప్రకారం.. 8వ వేతన సంఘం అమలు తరువాత జీతాలు, పెన్షన్లు 30 నుంచి 34 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల సుమారు 1.1 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని తెలుస్తోంది. ఈ పెంపు దేశీయ వినియోగాన్ని పెంచేందుకు సహకరిస్తుందని.. ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. పెరుగుదల తుది స్థాయి మాత్రం పే మ్యాట్రిక్స్ మార్పులు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, అలవెన్సుల సవరణలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ అంశాలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశంలో దాదాపు 50.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పాత పెన్షన్ పథకం కింద సుమారు 69 లక్షల మంది, జాతీయ పింఛను వ్యవస్థ కింద మరికొంత మంది పెన్షనర్లు ఉన్నారట. వీరిపై ఈ సవరణ ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం 8వ పే కమీషన్ సంప్రదింపుల దశలోనే ఉంది. ఇప్పుడు ప్రభుత్వంలో వివిధ వర్గాల నుంచి సూచనలు, వారి అభిప్రాయాలను సేకరించి పరిగణలోకి తీసుకోనున్నారు. ఇదే విషయంపై MyGov పోర్టల్ ద్వారా కమిషన్ ప్రశ్నావళికి సమాధానాలు సమర్పించేందుకు గడువును 2026 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ విధంగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే పలువురి సలహాలు సూచనలు స్వీకరిస్తామని స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Man In Tirumala: అలంకార ప్రియుడైనా తిరుమల శ్రీవారినే మించినట్టు ఓ భక్తుడు స్వర్ణాభరణాలు ధరించి ప్రత్యక్షమయ్యాడు. కిలోల కొద్దీ బంగారం.. కళ్లు చెదిరే.. ధగధగలాడే ఆభరణాలు ధరించిన గోల్డ్ మెన్ తిరుమల క్షేత్రంలో కనిపించాడు. ఆ వెంకటేశ్వరుడినే ఆభరణాలకు పోటీగా వచ్చినట్టు అతడు ఆ స్థాయిలో తన ఒంటిపై స్వర్ణాభరణాలు ధరించాడు. కంఠాభరణం.. ఉంగరాలు, కడియాలతో బంగారం మనిషిలా అతడు తిరుమల వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. తిరుమలలో సందడి చేసిన అతడు గురించి వివరాలు తెలుసుకుందాం.
Also Read: SBI Interest Rate: ఎస్‌బీఐ ఖాతాదారులకు పండుగే.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారీగా వడ్డీ రేట్ల పెంపు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో గోల్డ్ మెన్ సందడి చేశారు. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూర్య గోల్డ్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. హైదరాబాద్‌లో ఎక్కడకు వెళ్లినా కిలోల కొద్దీ ఆభరణాలు ధరిస్తూ కనిపిస్తుంటాడు. అలాంటి వ్యక్తి తిరుమలలో కనిపించడంతో ప్రత్యేకంగా నిలిచింది. కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి తిరుమల కొండపై అతడు కనిపించడంతో భక్తులు ఆసక్తిగా గమనించారు.
Also Read: Free Bus: మేనిఫెస్టోలో వరాల జల్లు.. 'మహిళలకు ఫ్రిడ్జ్‌లు ఫ్రీ, పురుషులకు ఉచిత బస్సు'
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విరాళం అందించిన సూర్య అనంతరం దర్శన టికెట్ పొంది మంగళవారం సాయంత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మెడలో భారీ బంగారు హారాలు, చేతికి ప్రత్యేకమైన 'గోవింద నామ కంకణం' ధరించి ఆలయం వెలుపలికి సూర్య వచ్చాడు. దీంతో అందరూ అతడిని చూసేందుకు అమితాసక్తి ప్రదర్శించారు. ఒళ్లంతా మెరిసిపోతున్న బంగారంతో కనిపిస్తున్న ఆయన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు.
Also Read: KTR Reaction: 6 గ్యారంటీలపై ప్రైవేటు బిల్లుపై దృష్టి మళ్లించడమే కుట్ర: కేటీఆర్
గోల్డ్ మెన్‌గా పిలుచుకుంటూ అతడితో ఫొటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. దర్శనం అనంతరం సూర్య మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల వెంకటేశ్వర స్వామి దయతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భారత దేశంలో ఎవరూ ధరించని కడియం ఒక్కటి ధరించాలని గతంలో స్వామిని ప్రార్థించానని.. స్వామి ఆశీస్సులతో గోవింద నామం ఉన్న కడియం ధరించినట్లు సూర్య వివరించారు. గోవిందనామం కడియం ధరించడం తకు ఎంతో సంతృప్తినిచ్చిందని.. దీనికంతటికి స్వామి ఆశీర్వాదమే కారణమని గోల్డ్‌మెన్ సూర్య తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
SBI Bulk Term Deposits Interest Rates Hike: ఎస్‌బీఐ బల్క్ టర్మ్ డిపాజిట్లు, ఎస్‌బీఐ అకౌంట్ హోల్డర్స్, వడ్డీ రేట్లు,బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన ఖాతాదారులకు ఎస్‌బీఐ భరీ శుభవార్త వినిపించింది. తన బల్క్ టర్మ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ భారీగా వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణ కస్టమర్ల కంటే సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ అందించనుంది. అయితే కొత్త, రెన్యువల్ డిపాజిట్లకు మాత్రమే ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. బల్క్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఖాతాదారులకు అధిక రాబడి లభించనుంది. అయితే పెంచిన కొత్త వడ్డీ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ తెలిపింది.
Also Read: Telangana Assembly: 'నీ యవ్వ మమ్మల్ని అరెస్ట్ చేసుడేంది?' అసెంబ్లీ వద్ద నవ్వులు పూయించిన సంఘటన
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు భారీ శుభవార్త అందించింది. బల్క్ టర్మ్ డిపాజిట్లపై (రూ.3 కోట్ల కంటే ఎక్కువ) వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. కొత్త వడ్డీ రేట్ల ధరలను ఎస్‌బీఐ సవరించింది. కొత్త వడ్డీ రేట్ ధరల ప్రకారం ఏడాది నుంచి రెండేళ్ల లోపు కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటును ఎస్‌బీఐ 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు ఎప్పుడూ అదనపు వడ్డీ లభిస్తుంది. వృద్ధుల కోసం 180 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై వడ్డీ రేటు 6.10 శాతం నుంచి 6.35 శాతానికి.. ఏడాది నుంచి రెండేళ్ల డిపాజిట్లపై 6.75 శాతం నుంచి 7.00 శాతానికి వడ్డీ రేటు పెరగడం విశేషం.
Also Read: Rain Alert: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా
కొత్తగా చేసే డిపాజిట్లు, రెన్యువల్ చేసే డిపాజిట్లకు ఈ కొత్త వడ్డీ రేట్లు మాత్రమే వర్తిస్తాయని ఎస్‌బీఐ తెలిపింది. బల్క్ టర్మ్ డిపాజిట్లను గడువు ముందే విత్‌డ్రా చేసుకుంటే మాత్రం ఒక శాతం పెనాల్టీ యథాతథంగా ఉంటుంది. వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంతో పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించనుంది. ఈ వడ్డీ రేట్ల పెంపు సీనియర్ సిటిజన్లకు లాభదాయకంగా మారనుంది.
Also Read: Shobha Yatra: శ్రీరామనవమి శోభాయాత్రపై పోలీస్ డేగ కన్ను.. ప్రశాంతంగా చేసుకుందాం
ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయం బ్యాంకింగ్ రంగాన్ని ఆశ్చర్యపరుస్తోంది. చాలా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్న క్రమంలో ఎస్‌బీఐ మాత్రం పెంచడం విశేషం. ఎస్‌బీఐ అకౌంట్ కలిగిన వారు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే ఇప్పుడు భారీగా లబ్ది పొందవచ్చు. వడ్డీ రేట్ల పెంపు వెనుక ఎస్‌బీఐ భారీ వ్యూహమే ఉందని అనిపిస్తోంది. క్రమంగా కస్టమర్లు దూరమవుతున్న వేళ వారిని పెంచుకునేందుకు.. ఆకర్షించుకునేందుకు ఎస్‌బీఐ ఈ వడ్డీ రేట్లు పెంచడం కారణంగా తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
AIADMK Election Manifesto: తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు అన్నాడీఎంకే పార్టీ ప్రజలకు వరాల జల్లు కురిపించింది. ఉచిత పథకాలు భారీగా ప్రకటించింది. వాటిలో మహిళలకు ఉచితంగా ఫ్రిడ్జ్ ఇస్తామని.. పురుషులకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని ఏఐడీఎంకే పార్టీ ప్రకటన చేసింది. తమిళనాడు ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో భారీగా మహిళలు ఇచ్చింది. ఓట్లు ఎలాగైనా పొందాలని ఇబ్బడిముబ్బడిగా అన్నాడీఎంకే హామీలు ఇచ్చేసింది.
Also Read: Rain Alert: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెన్నైలో అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి 297 హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆస్తి పన్ను, ఇల్లు పన్ను, విద్యుత్ చార్జీలు, నీటి చార్జీలు పెరగడంతో కుటుంబాలను ఆదుకునేందుకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి రూ.10,000 ప్రత్యేక సాయం ఇస్తామని ఏఐడీఎంకే మేనిఫెస్టోలో తెలిపింది.
Also Read: KTR Reaction: 6 గ్యారంటీలపై ప్రైవేటు బిల్లుపై దృష్టి మళ్లించడమే కుట్ర: కేటీఆర్
మేనిఫెస్టోలో ప్రధాన హామీలు
- రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన మహిళలకు ఉచితంగా ఫ్రిజ్‌లు అందిస్తాం.
- ఐదు లక్షల మంది వర్కింగ్ మహిళలకు టూ వీలర్స్‌పై రూ.25,000 వరకు రాయితీ అందించడం
- మహిళలతోపాటు పురుషులకు కూడా ప్రభుత్వ బస్సులలో ఉచిత ప్రయాణం
- రేషన్ కార్డు దారులకు ప్రతి నెలా కిలో పప్పు, లీటర్ వంట నూనె అందిస్తాం.
- ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లు
- సామాజిక పింఛన్లు రూ.2,000కు పెంపు
- గ్రామీణ ఉపాధి హామీ పథకం 150 రోజులకు పెంపు
- జల్లికట్టు బాధితులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం
- ఈపీఎస్ మహిళల కోసం కుల విలక్కు పథకం
Also Read: Telangana Assembly: 'నీ యవ్వ మమ్మల్ని అరెస్ట్ చేసుడేంది?' అసెంబ్లీ వద్ద నవ్వులు పూయించిన సంఘటన
గెలుపే లక్ష్యం..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 234 అసెంబ్లీ సీట్లున్న తమిళనాడులో ఏప్రిల్ 23వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. మే 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. అధికారానికి దూరమైన అన్నాడీఎంకే తిరిగి దక్కించుకోవడానికి ప్రజలపై వరాల జల్లు కురిపించింది. జయలలిత తర్వాత ఏఐడీఎంకే తీవ్ర సంక్షోభంలో పడగా.. అగ్ర నాయకుడు పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరడంతో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Funny Incident At Telangana Assembly: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవడంతో అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి తీరుపై అన్ని ప్రజా సంఘాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, ఆటో కార్మికులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుతో నష్టపోతున్న వర్గాలు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అసెంబ్లీ ముట్టడి చేపడుతుండగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ సంఘటన నవ్వులు పూయిస్తోంది. నిరసనకారులను కాకుండా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌ను అరెస్ట్ చేయగా.. ఆయన అబబబ్బా అంటూ నెత్తి నోరు కొట్టుకుంటూ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Maganti Gopinath Daughter: మాగంటి గోపీనాథ్ కుటుంబంలో మరో విషాదం.. కొన ఊపిరితో కుమార్తె
విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మంగళవారం అసెంబ్లీ ముట్టడి చేపట్టింది. అసెంబ్లీ వైపు బీఆర్‌ఎస్‌వీ నాయకులు దూసుకురావడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే విద్యార్థి నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. ముట్టడించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో అటువైపు మానకొండూరు నియోజకవర్గంలోని రేపాక గ్రామ సర్పంచ్ కాత మల్లేశం రాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: Revanth Reddy: సిద్దిపేట గడ్డపై రేవంత్ రెడ్డి ఛాలెంజ్.. హరీశ్ రావును ఓడిస్తే మంత్రి పదవి ఆఫర్
తనను అరెస్ట్ చేయడంతో కాత మల్లేశం లబోదిబోమన్నాడు. పోలీసులు తనను బలవంతంగా వ్యాన్ ఎక్కించడంతో ఇదెక్కడి లొల్లి అయ్యా అని అరుస్తూ మీడియాతో మాట్లాడాడు. 'మేం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లం అయ్య. మమ్మల్ని రమ్మని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాస్‌లు ఇచ్చిండు. మేం కాంగ్రెస్ పార్టీ వాళ్లం..' అని మల్లేశం వివరించాడు. అయితే ఆ లొల్లిలో పోలీసులు అతడి బాధను వినిపించుకోలేదు. గట్టిగా అరుస్తూ.. నోరు కొట్టుకుంటూ 'నీ యవ్వ మమ్మల్ని అరెస్ట్ చేసిండేంది.. మేం కాంగ్రెస్ పార్టీ నాయకులం రా అయా' అని మీడియాతో అతడు వాపోయాడు. 'ఏం పోలీసులే.. ఛీ ఛీ' అంటూ నెత్తి నోరు మొత్తుకున్నాడు. ఇది తెలుసుకున్న పోలీస్ అధికారి అతడిని కిందకు దించాడు.
ఆ సమయంలో మరో పోలీస్ అధికారి వచ్చి అతడిని మళ్లీ వ్యాన్ ఎక్కించే ప్రయత్నం చేయగా.. 'అయ్య నీకు దండం పెడతా మేం కాంగ్రెస్ పార్టీ నాయకులమే.. నీ దయనే' అంటూ విజ్ఞప్తి చేశాడు. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసుడు ఏమిటి? వాపోవడంతో అతడిని పోలీసులు వదిలేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణలో పోలీసులు ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాలను అణచివేస్తున్న తీరు ఈ సంఘటనతో కళ్లకు కట్టినట్టు కనిపించింది.
నేను కాంగ్రెస్ వాడిని నన్ను అరెస్ట్ చేస్తారా అంటే దించేశారు... దించిన తర్వాత ఓవర్ చేస్తున్నాడు అని మళ్ళీ ఎక్కించారు వెహికల్ 😂😂😂 pic.twitter.com/oMKhSmJMbK
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) March 24, 2026
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hyderabad Rains: వేసవి ప్రారంభమైన తర్వాత వాతావరణం విచిత్రంగా మారింది. ఎండలు దంచికొట్టాల్సి ఉండగా ఈ కాలంలో గమ్మత్తుగా వర్షాలు దంచికొడుతున్నాయి. అకాల వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలపగా.. దానికి తగ్గట్టుగానే తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. అకస్మాత్తుగా మంగళవారం సాయంత్రం కూడా వర్షం దంచికొట్టింది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడింది. వర్షానికి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read: KTR Reaction: 6 గ్యారంటీలపై ప్రైవేటు బిల్లుపై దృష్టి మళ్లించడమే కుట్ర: కేటీఆర్
హైదరాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరమంతా కురుస్తున్న వర్షం...ఆల్విన్ కాలనీ, ఎల్లమ్మ బండ, హైదర్ నగర్, భాగ్యనగర్ కాలనీ, వివేకానంద నగర్, కూకట్ పల్లి, జగద్గిరిగుట్ట, కేపీహెచ్ బీ కాలనీ, బాలాజీ నగర్, మూసాపేట్, ప్రశాంతి నగర్, బాలానగర్, తదితర ప్రాంతాలలో వర్షం కురుస్తుంది. ఉదయం నుండి ఎండ తీవ్రతో అల్లాడిన ప్రజలకు సాయంత్రం నుండే ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడడంతో ఒక్కసారిగా వర్షం కురుస్తుంది. ఉక్కబోతతో అల్లాడిన ప్రజలు వర్షం కురుస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని గుమ్మడిదల, ఐడీఏ బొల్లారం, జిన్నారం తదితర గ్రామాల్లో భారీ వర్షం పడింది. నల్లటి మబ్బులతో అమీన్‌పూర్ కమ్ముకుపోవడంతో అక్కడ పరిస్థితి భయంకరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana Assembly: 'ఆరు గ్యారెంటీల మీద ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం. అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరాం. ప్రజల నుంచి దృష్టిని మరల్చటానికి ఛార్జిషీట్ వ్యవహారం ముందుకు తెచ్చారు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ఇది లొట్టపీసు కేసు మాత్రమే అని పునరుద్ఘాటించారు. 'ప్రభుత్వం గోరంతలు కొండంతలు చేస్తోంది. లేని కేసు ఉన్నట్టుగా మసి పూసి మారేడు కాయ చేస్తున్నారు. మేము ఎవరికైతే లబ్ధి చేశామని ఆరోపణ చేశారో వారి పేరే ఛార్జీషీట్‌లో లేదు. ఆ కంపెనీ చైర్మన్, సీఈఓ పేరు ఎందుకు పెట్టలేదు?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 'దీని వెనుక ఎన్ని వందల కోట్లు చేతులు మారాయి. దావోస్ మంతనాలు ఏంటి..? తెరవెనుక బాగోతాలు ఏమిటి?' అని నిలదీశారు.
Also Read: Telangana Assembly: 'నీ యవ్వ మమ్మల్ని అరెస్ట్ చేసుడేంది?' అసెంబ్లీ వద్ద నవ్వులు పూయించిన సంఘటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు మీడియాతో చిట్‌చాట్ చేశారు. 'ఈరోజు కూడా డబ్బులు బ్యాంక్ ఖాతాలో ఉన్నాయి. అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం తప్ప ఈ కేసులో ఏం లేదు. డబ్బులు బ్యాంక్ నుంచి బ్యాంక్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ప్రభుత్వం ఎఫ్ఈఓ సంస్థ నుంచి రికవరీ చేయాలి. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టేందుకు ఫార్ములా ఈ రేస్ నిర్వహించాం. ఈ రేస్ ద్వారా 700 కోట్ల పెట్టుబడులు ప్రభుత్వానికి వచ్చాయని నెల్సన్ అనే సంస్థ వెల్లడించింది' అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు.
Also Read: Maganti Gopinath Daughter: మాగంటి గోపీనాథ్ కుటుంబంలో మరో విషాదం.. కొన ఊపిరితో కుమార్తె
'అందాల పోటీలతో రెండు రూపాయల పెట్టుబడులు కూడా రాలేదు. అందాల పోటీకి వచ్చిన ఎల్లా మ్యాగీ అనే అమ్మాయి తనను వేశ్యగా చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంతో తెలంగాణ పరువుపోయింది. మెస్సీతో రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆటకు రూ.వంద కోట్ల ఖర్చు అయింది. రేవంత్ రెడ్డి నుంచి రికవరీ చేస్తారా?' అని కేటీఆర్ ప్రశ్నించారు. తమకు న్యాయ స్థానాల మీద విశ్వాసం ఉందని.. ఈ కేసు ఏ న్యాయస్థానంలో నిలవదని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. గిగ్ వర్కర్లకు భారీ శుభవార్త!
'ఈ ప్రభుత్వ రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. నేనే మంత్రిగా విధానపర నిర్ణయం తీసుకున్నా. మూసీపై చర్చ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల వద్ద కాదు.. ప్రజల వద్ద పెట్టండి. భయం ఉంటే వెయ్యి మంది పోలీసులను పెట్టుకొని రండి' అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. 'టీడీఆర్ అతి పెద్ద కుంభకోణం. కృత్రిమ డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. టీడీఆర్‌లను రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు ఏటీఎమ్‌లా మార్చుకున్నారు. రేవంత్ కుటుంబ సభ్యులే టీడీఆర్‌లు కొంటున్నారు. ఇదొక ఇన్ సైడర్ ట్రేడింగ్ కుంభకోణం. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక టీడీఆర్ కుంభకోణంపై సమగ్ర విచారణ చేయిస్తాం' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మూసీ బాధితులకు టీడీఆర్‌లు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hyderabad Police: శ్రీరామనవమి హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరిగే శోభయాత్రపై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శోభయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సిద్ధంగా ఉన్నాయని.. అందరూ సహకరిస్తే ఉత్సవాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తి చేసుకుందామని నగర పోలీస్ కమిషనర్లు ఆర్‌వీ కర్ణన్, వీసీ సజ్జనార్ సూచించారు. శోభాయాత్ర ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలు, బందోబస్తుపై సీపీ దిశానిర్దేశం చేశారు.
Also Read: Telangana Assembly: 'నీ యవ్వ మమ్మల్ని అరెస్ట్ చేసుడేంది?' అసెంబ్లీ వద్ద నవ్వులు పూయించిన సంఘటన
శోభయాత్రపై హైదరాబాద్ సీతారాం బాగ్‌లో నిర్వహించిన అధికారుల సమన్వయ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పాల్గొని.. శోభాయాత్ర ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలు, బందోబస్తుపై సీపీ దిశానిర్దేశం చేశారు. '2010లో ప్రారంభమైన ఈ యాత్ర అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్త గుర్తింపు పొందింది. సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే ఈ వేడుకను భక్తులు భక్తిశ్రద్ధలతో.. క్రమశిక్షణతో చేసుకోవాలి' అని సూచించారు. సుమారు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని.. అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘా ఉంటుందని ప్రకటించారు.
Also Read: Maganti Gopinath Daughter: మాగంటి గోపీనాథ్ కుటుంబంలో మరో విషాదం.. కొన ఊపిరితో కుమార్తె
శోభయాత్రలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా క్రైమ్ టీమ్స్, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంటాయని జంట నగరాల కమిషనర్లు తెలిపారు. గతేడాది వాహనాల బ్రేక్‌డౌన్‌తో యాత్ర నెమ్మదించిందని... ఈసారి అలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. శోభాయాత్రను మధ్యాహ్నం ఒకటికి ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఇరుకైన మార్గాల్లో పెద్ద వాహనాలతో ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా ట్రయల్ రన్ నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. డీజేలకు బదులుగా సాధారణ సౌండ్ సిస్టమ్ వాడాలని, ఇతర వర్గాల మనోభావాలు దెబ్బతినకుండా పాటలు, ప్రసంగాలు ఉండాలని నిర్వాహకులు, భక్తులకు పోలీస్ కమిషనర్లు ఆర్‌వీ కర్ణన్, వీసీ సజ్జనార్ సూచించారు. ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్లు వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రజలు, ఉత్సవ సమితి సభ్యులు పోలీసులకు సహకరించి శోభాయాత్రను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Revanth Reddy: సిద్దిపేట గడ్డపై రేవంత్ రెడ్డి ఛాలెంజ్.. హరీశ్ రావును ఓడిస్తే మంత్రి పదవి ఆఫర్
శోభయాత్రకు అసౌకర్యం కలగకుండా రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటును ఇప్పటికే పూర్తి చేశామని.. శోభయాత్రలో నిర్వాహకులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. శోభాయాత్ర వెళ్లే రూట్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి సీపీ పరిశీలించారు. ఈ సమావేశంలో అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు జోయల్ డేవిస్, ఐపీఎస్ శ్వేత, ఐపీఎస్, జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
15-foot King Cobra Video Watch Now: ఇంటర్నెట్ పుణ్యమా అని నిత్యం ఏదో ఒక వింత వీడియోలు మన ముందుకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఒక భారీ కింగ్ కోబ్రాకి సంబంధించిన వీడియో నెటిజన్ల ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక ఇరుకైన సందిలో దాక్కున్న 15 అడుగుల భారీ పామును, ప్రాణాలకు తెగించి ఒక స్నేక్ క్యాచర్ పట్టుకున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే... ఒక జనావాసాల మధ్య ఉన్న అత్యంత ఇరుకైన సందులో ఈ భారీ నాగుపాము సంచారం చేసింది.. సుమారు 15 అడుగుల పొడవున్న ఆ పామును చూసి స్థానికులు భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని సాహసోపేతమైన ఆపరేషన్ ప్రారంభించారు. ఆ సందు చాలా ఇరుకుగా ఉండటంతో పామును పట్టుకోవడం ఆ స్నేక్ క్యాచర్‌కి సవాలుగా మారింది.
స్నేక్ క్యాచర్ ఆ పాము తోకను పట్టుకుని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తుండగా.. అది ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించడం మీరు గమనించవచ్చు. ఆ భీకర దృశ్యం చూస్తుంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఆ పాము తన పడగ విప్పి బుసలు కొడుతూ స్నేక్ క్యాచర్‌ను భయపెట్టాలని చూడడం కూడా మీరు వైరల్ అవుతున్న వీడియోలో చూడొచ్చు.. ఏమాత్రం పట్టు తప్పినా ఆ విష సర్పం కాటుకు అతను బలికాక తప్పని పరిస్థితి... కానీ, తన చాకచక్యంతో అతను పాము దాడుల నుంచి తప్పుకుంటూ.. దానిని చివరికి నియంత్రించేశారు.
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
సుదీర్ఘ రెష్యూ ఆఫరేషన్ తర్వాత.. ఆ భారీ కోబ్రాను ఎంతో సులభంగా ఒక సంచిలోకి బంధించారు.. ఆ పాము సంచిలోకి వెళ్లే వరకు ఆతను ఎంతో కష్టపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికలపై మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తోంది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఇది ధైర్యం కాదు.. సాక్షాత్తు మృత్యువుతో వేట.. అని కొందరు కామెంట్ చేస్తుంటే, పాములను పట్టుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mercury Transit 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల మార్పులు మానవ జీవితంపై ఊహించని ప్రభావం చూపుతాయని అందరికీ తెలిసిందే.. ఇదిలా ఉంటే, ఏప్రిల్ 11 బుధ గ్రహం కుంభ రాశిని వీడి గురుడి రాశి అయిన మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. ఏప్రిల్ 30 వరకు బుధుడు ఇదే రాశిలో సంచార దశలో ఉంటుంది. బుధుడు మీన రాశిలో ఉండడం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బలహీనమైన స్థితిగా కూడా పరిగణిస్తారు. అయితే, ఈ సమయంలో బుధుడి శక్తి తగ్గి.. కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
బుధుడి ప్రభావంతో ఈ కింది రాశులవారు తీవ్ర సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నాలుగు రాశులవారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక, కుటుంబ విషయాలంలో కూడా అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేష రాశి
మేష రాశివారు ఈ సమయం చాలా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తక్కువ శక్తి ఉన్నట్లు అనుభూతి కూడా చెందే ఛాన్స్‌లు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యల కారణంగా మానసిక సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితుల వల్ల ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది.
సింహ రాశి
సూర్యుడి సంచారం వల్ల సింహరాశి వారికి అనేక రకాల ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఎటువంటి రిస్క్ ఉన్న పెట్టుబడులు పెట్టకపోవడం మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్ పరంగా పెద్ద అడ్డంకులు కూడా ఎదురవుతాయి. అంతేకాకుండా ఓపికతో ఉండడం చాలా మంచిది.
తులా రాశి
తులా రాశివారికి కూడా అనేక సమస్యలు వస్తాయి. పనుల్లో పదే పదే ఆటంకాలు కూడా ఎదురవుతాయి. అంతేకాకుండా ఆర్థికపరమైన సవాళ్లలో తీవ్ర ఇబ్బందులు కూడా వస్తాయి. కుటుంబంలో ప్రతికూల మార్పులు రావడం ప్రారంభమవుతాయి. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని నడపడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
మకర రాశి
మకర రాశివారు ప్రత్యర్థుల పట్ల ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. లేదంటే మీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా తగ్గిపోయి.. అనేక సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు సోషల్ మీడియాలో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కష్టపడి పనులు చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు.