नूंह जिले में लगातार बारिश से जनजीवन प्रभावित, कब्रिस्तान और घरों में भरा पानी
Nuh Rural, Haryana:नूंह जिले में पिछले कई दिनों से हो रही रुक-रुक कर बारिश से ग्रामीण अंचल में जनजीवन अस्त-व्यस्त हो गया है। बारिश के कारण कब्रिस्तान और घरों में पानी भर गया है जिससे गांव की सड़कें भी पानी से लबालब हो गई हैं। नूंह विधायक ने जब इस स्थिति के बारे में सुना तो वे सुड़का गांव पहुंचे। वहां उन्होंने देखा कि कब्रिस्तान भी बारिश के पानी से भर गया है। इसके अलावा गांव के घरों में भी पानी भर गया है जिससे लोगों की समस्याएं और बढ़ गई हैं।
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Student Collapse: స్కూల్లో గుండెల్ని పిండేసే ఘటన.. కుప్పకూలిన విద్యార్థి
Visakhapatnam, Andhra Pradesh:School Student Collapse On Teacher In School At Vizag Watch heart Breaking VideoGoldman: తిరుమలలో మరో గోల్డ్‌మ్యాన్ హల్చల్.. ఎన్ని కిలోలు ఉన్నాయంటే?
Dharmavaram, Andhra Pradesh:Another Goldman At Tirumala Temple Watch His Gold Ornaments Watch VisualsTirumala: శ్రీవారి సేవలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి దంపతులు
Dharmavaram, Andhra Pradesh:NR Narayana Murthy Couple And D Suresh Babu Visits Tirumala Temple Watch VideoTirumala: కొత్త అల్లుడు, కుమార్తెతో కలిసి తిరుమల వచ్చిన బండ్ల గణేశ్
Dharmavaram, Andhra Pradesh:Bandla Ganesh Visits Tirumala Temple Along With His Daughter And Son In Law Watch VideoKonda Surekha: 'నా బిడ్డ కామెంట్లకు నాకేం సంబంధం'.. వివరణ ఇచ్చిన కొండా సురేఖ
Baddipadaga, Telangana:Konda Susmita vs Revanth Reddy: 'అధికారం వచ్చాక రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికి ఎక్కాయని.. ఆయన అవినీతి భాగోతాలు చెబుతానని.. బీసీలను అణగదొక్కుతున్నారు' అని కొండా సుష్మిత వ్యాఖ్యలు చేయడం తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ వివరణ ఇవ్వాలని నోటీసు పంపించగా దానికి మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను వివరణ అడగడాన్ని తప్పుబట్టారు. ఆమె వ్యాఖ్యలకు తనకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన వివరణతో కూడిన లేఖను టీసీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపించారు. లేఖలో క్రమశిక్షణా కమిటీకి మంత్రి తన వివరణలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. 'ఆగస్టు 19వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘కొండా’ కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలుచోట్ల వేడుకలు నిర్వహించడంతోపాటు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నా స్వస్థలమైన గీసుకొండతో నా కూతురు సుస్మితా పటేల్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుమార్తె కొండా సుస్మితా పటేల్ పాల్గొన్నారు' అని కొండా సురేఖ వివరించారు.
ఆ కార్యక్రమంలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, ఆ ప్రాతిపదికన వివరణ కోరడం సముచితం కాదని మంత్రి సురేఖ పేర్కొన్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని మంత్రి కొండా సురేఖ లేఖలో వివరించారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో తన ప్రమేయం లేదని గుర్తించాలని సూచించారు. తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. మరి ఈ వివరణతో క్రమశిక్షణా కమిటీ సంతృప్తి చెందుతుందా? లేదా తదుపరి ఏం జరుగుతుందనేది ఉత్కంఠ నెలకొంది. మరో వైపు కొండా సుష్మితపై కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు రెచ్చిపోతున్నారు. ఆమెపై తీవ్ర విమర్శలతోపాటు ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ పరిణామాలు ఎక్కడకు దారి తీస్తాయో వేచి చూడాలి.
తెలుగులో హ్యాపీ వరలక్ష్మీ వ్రతం విషెష్..
Hyderabad, Telangana:Happy Varalakshmi Vratham: కమలవాసిని కరుణించే వేళ... కలశాల పూజలో వెలిగిన దివ్య కాంతుల వేళ.. మీ ఇంట ఆనందాల అమృతం కురవాలని.. అష్టైశ్వర్యాలు చిరకాలం వర్ధిల్లాలని మనసారా లక్ష్మీదేవిని కోరుకుంటూ.. వరలక్ష్మీ వ్రతం పర్వదినాన ప్రత్యేకమైన శుభాకాంక్షలు..తెలుగులో హ్యాపీ వరలక్ష్మీ వ్రతం విషెష్..
Hyderabad, Telangana:Happy Varalakshmi Vratham: కమలవాసిని కరుణించే వేళ... కలశాల పూజలో వెలిగిన దివ్య కాంతుల వేళ.. మీ ఇంట ఆనందాల అమృతం కురవాలని.. అష్టైశ్వర్యాలు చిరకాలం వర్ధిల్లాలని మనసారా లక్ష్మీదేవిని కోరుకుంటూ.. వరలక్ష్మీ వ్రతం పర్వదినాన ప్రత్యేకమైన శుభాకాంక్షలు..Chandrababu: నదీ జలాలపై దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో ముందుకుసాగాలి: చంద్రబాబు
Salavankuppam, Tamil Nadu:Southern Zonal Council Meeting: తెలంగాణ, ఏపీ విభజన జరిగి పుష్కర కాలం దాటినా విభజన చట్టంలోని అంశాలు ఇంకా నెరవేరలేదని దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలు 12 ఏళ్లుగా ఇంకా విభజనకు నోచుకోలేదని గుర్తుచేశారు. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నదీ జలాల అంశంలో దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.
మహాబలిపురంలో హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. నదీ జలాలపై దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యం. కేంద్రం, రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలి' అని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు ప్రతిపాదన చేశారు. కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి- బెంగళూరు- చెన్నై నగరాలను అనుసంధానించే రవాణా వ్యవస్థ ఉండాలని కోరారు.
'దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలి. దక్షిణాది విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో అనుసంధానించాలి. దక్షిణాది రాష్ట్రాల యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలి' సమావేశంలో సీఎం చంద్రబాబు కోరారు. విపత్తుల సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు.
'దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31 శాతం ఉంది. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలి' అని చంద్రబాబు తెలిపారు. 'పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు కేంద్ర సహకారంతో సాకారం అవుతున్నాయి. అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా సాధించాం. వనరుల లోటు, సెక్షన్ 56లోని అంశాలను పరిష్కరించాలి. దుగ్గరాజుపట్నం పోర్టు, రిఫైనరీ ప్రతిపాదనలకు వేగంగా అనుమతులు ఇవ్వాలి' అని సీఎం చంద్రబాబు కోరారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కడప జేఎస్‌డబ్ల్యూ రైల్వే లింక్‌కు కేంద్ర అనుమతులు ఇవ్వాలన్నారు.
గోదావరి–కావేరి నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదన సీఎం చంద్రబాబు చేశారు. గోదావరి–కావేరి అనుసంధానంతో తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అని పేర్కొన్నారు. నదీ జలాలపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. గంగా–కావేరి నదుల అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక అవసరం అని గుర్తుచేశారు. నదుల అనుసంధానంపై కాలపరిమితితో కూడిన డీపీఆర్‌లు, అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. సహకారం, సమన్వయంతోనే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం అని ప్రకటించారు.
Student Collapse: గుండెల్ని పిండేసే ఘటన.. టీచర్ ఒడిలో కుప్పకూలిన విద్యార్థి
Visakhapatnam, Andhra Pradesh:Heart Breaking Video: టీచర్ బెదిరింపులకు ఆ విద్యార్థి బెంబేలెత్తిపోయాడు. హోంవర్క్ చేయలేదని టీచర్ బెదిరించడంతో ఆ పిల్లాడు కుప్పకూలిపోయాడు. బెదిరించిన టీచర్ ఒడిలోనే ఆ విద్యార్థి పడిపోయాడు. లేపిచూసేసరికి ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర విషాద సంఘటన విశాఖపట్టణంలో జరిగింది. టీచర్ వేధింపులతోనే ఆ పిల్లాడు మరణించాడని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనతో విశాఖపట్టణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
YS Jagan DSC Demands: "డీఎస్సీ లీకేజీలపై సీబీఐ విచారణ జరపాలి..లోకేష్ రాజీనామా చేయాలి" వైఎస్ జగన్ డిమాండ్!
Vijayawada, Andhra Pradesh:YS Jagan Demands CBI Enquiry On DSC: ఆంధ్రప్రదేశ్ గతంలో జరిగిన మెగా డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణలో జరిగిన లీకేజీలు, అక్రమాలపై తక్షణమే సీబీఐ (CBI) విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్.జగన్ డిమాండ్ చేశారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ (APPSC) అంశాలకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను ఆయన మీడియా సమావేశంలో ప్రజల ముందుకు ఉంచారు.
డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తాము లేవనెత్తిన అంశాలన్నీ వాస్తవాలేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే పరిస్థితి వచ్చిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. తప్పు చేశారు కాబట్టే ప్రభుత్వం గింజుకుంటోంది కానీ, సీబీఐ విచారణకు మాత్రం ముందుకు రావడం లేదని జగన్ ఆరోపించారు.
ఈ అక్రమాలను గట్టిగా లేవనెత్తుతామనే భయంతోనే తమకు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదని, చివరికి ప్రతిపక్షం లేకుండానే సభను నడుపుతున్నారని జగన్ విమర్శించారు. ప్రత్యర్థి జట్టు లేని చోట, బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రీ కొడుకులు ఇద్దరూ బ్యాటింగ్ చేసుకుంటూ తాము అద్భుతంగా చేశామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
డీఎస్సీ లీకేజీలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ తమ ఎమ్మెల్సీలు (MLCలు) నాలుగు రోజుల పాటు శాసనమండలిని స్తంభింపజేసినా ప్రభుత్వం చర్చకు సిద్ధపడలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
అలాగే డీఎస్సీ పరీక్షల ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ అనే రెండు కీలక బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టడం ద్వారా పారదర్శకతకు పాతరవేసి, లీకేజీలకు స్వయంగా ద్వారాలు తెరిచారని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రశ్నల తయారీ అనేది ఎస్సీఈఆర్టీ (SCERT) డైరెక్టర్ బాధ్యత కాగా, పరీక్ష నిర్వహించే బాధ్యత డీఎస్సీ కన్వీనర్‌దని ఆయన అన్నారు.
అయితే, ఈ రెండింటినీ ఒకే వ్యక్తికి అప్పగించినట్లు లోకేష్ స్వయంగా అంగీకరించడమే కాకుండా, అందులో తప్పేముందని దబాయించారని విమర్శించారు. ఈ రెండు వ్యవస్థల మధ్య ఉండాల్సిన కనీస నియంత్రణలను ఎందుకు తొలగించారో.. అలాగే ఒకే వ్యక్తి చేతిలో రెండు కీలక బాధ్యతలు ఎందుకు పెట్టారో తేలడానికి దర్యాప్తు జరగాలని జగన్ డిమాండ్ చేశారు.
అవుట్సోర్సింగ్ ఉద్యోగి 'నవీన్' వివాదం..
డీఎస్సీ ప్రశ్నపత్రాలు తయారు చేసే విభాగంలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి 'నవీన్'కు పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని ప్రభుత్వం ఒప్పుకుందని వైఎస్ జగన్ తెలిపారు. క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ ఉన్న నవీన్‌కు మొదటి ర్యాంక్ రావడంతో లీకేజీ స్పష్టంగా జరిగిందని, ఇది బయటపడితే గొడవ అవుతుందనే భయంతోనే మెరిట్ లిస్ట్ మార్చి అతనిని పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. మొదటి మెరిట్ లిస్టులో ఉన్న నవీన్ పేరును తొలగించి, రెండవ మెరిట్ లిస్టును ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు.
సీబీఐ దర్యాప్తునకు డిమాండ్..
నవీన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదు కాబట్టే ఉద్యోగం ఇవ్వలేదని తండ్రీ కొడుకులు ఇద్దరూ అసెంబ్లీలో, కోర్టులో అధికారుల చేత చెప్పించారని విమర్శించారు. అయితే, అభ్యర్థి ఐడీని బ్లాక్ చేసి, కనీసం కాల్ లెటర్ కూడా పంపనప్పుడు నవీన్ వెరిఫికేషన్‌కు ఎలా రాగలుగుతాడని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఆధారాలతో నవీన్ హైకోర్టులో అఫిడవిట్ కూడా వేశాడని పేర్కొన్నారు. అసెంబ్లీలో వీటికి తండ్రీ కొడుకులు (చంద్రబాబు, లోకేష్) సమాధానం ఎందుకు చెప్పలేదని జగన్ నిలదీస్తూ, ఈ తప్పులన్నింటిపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
Also Read: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు కీలక అప్డేట్..మరి ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి ఇదే
Also Read: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం.. నదిలో దూకిన ఏఈ కుటుంబం..ముగ్గురు గల్లంతు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Eshwar Sai Madhuri Rathod: ఫోక్ డాన్సర్ల వివాదం.. ఈశ్వర్ సాయి భార్యపై రివర్స్ కేసు పెడుతున్న మాధురి రాథోడ్?
Hyderabad, Telangana:Eshwar Sai Madhuri Rathod Controversy: ప్రముఖ ఫోక్ సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి వివాహేతర సంబంధానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ల అక్రమ సంబంధం వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఈ వివాదం కాస్తా పోలీస్ స్టేషన్లకు చేరి, ఇరు వర్గాల మధ్య పరస్పర ఫిర్యాదులు, తీవ్ర ఆరోపణలతో సంచలనం సృష్టిస్తోంది.
అయితే ఈ వివాదం వేములవాడలోని రెడ్డి భవన్లో మొదలైంది. ఈశ్వర్ సాయి కోసం అతని భార్య శరణ్య, ఆమె సోదరి కలిసి అక్కడికి వెళ్లగా, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇద్దరూ ఒకే ఇంట్లో పట్టుబడ్డారు. ఆ సమయంలో అక్కడ ఒక చిన్నారి కూడా ఉంది. దీనికి సంబంధించిన దృశ్యాలను శరణ్య సోదరి తన మొబైల్లో వీడియో రికార్డ్ చేసింది.
ఇదే విషయమై తాము ప్రశ్నించినందుకు ఈశ్వర్ సాయి, అతని అసిస్టెంట్ తమపై దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా మొబైల్ ఫోన్లు లాక్కున్నారని శరణ్య సోదరి ఆరోపించింది. ఈ వ్యవహారంపై హైదరాబాద్‌లోని రాయిదుర్గం పోలీస్ స్టేషన్లో శరణ్య సోదరి ఫిర్యాదు చేసింది.
అయితే, ఇల్లీగల్ అఫైర్ వ్యవహారం తమ పరిధిలోకి రాదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పరస్పర ఇష్టంతో ఉండే సంబంధాలు నేరం కిందకు రావని పోలీసులు స్పష్టం చేశారు. దాడులు లేదా ఫోన్ లాక్కున్న ఘటన వేములవాడలో జరిగింది కాబట్టి అక్కడే ఫిర్యాదు చేసుకోవాలని రాయిదుర్గం పోలీసులు వారికి సూచించారు.
మరోవైపు ఈ వ్యవహారంలో సదరు మాధురి రాథోడ్ కమ్యూనిటీకి చెందిన వారు ఎదురుదాడికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తను తన స్నేహితుడైన ఈశ్వర్ సాయితో ఉన్న సమయంలో శరణ్య, ఆమె సోదరి అకారణంగా లోపలికి వచ్చి, తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని మాధురి పేర్కొంది.
అంతేకాకుండా తనను కులం పేరుతో దూషిస్తూ అవమానించారని.. వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసి పరువు తీశారని ఆమె ఆరోపిస్తోంది. దీనిపై శరణ్య, ఆమె సోదరిపై వేములవాడ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేందుకు మాధురి చట్టపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే, మాధురి రాథోడ్ పక్కనే ఉంటూ నటిస్తూ, తన భర్తను వలలో వేసుకుని, లొంగతీసుకుని ఇల్లు చేరకుండా చేస్తోందని ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ఇరువర్గాలు చట్టపరమైన చర్యల కోసం సిద్ధమవుతుండటంతో వేములవాడ పోలీసులు వీటిపై దృష్టి సారించారు.
Also Read: నటి మీనా భర్త మృతి వెనుక అసలు నిజం ఇదే..ఇంటర్వ్యూలో చెబుతూ కంటతడి పెట్టిన హీరోయిన్!
Also Read; 'ఇరుముడి' సినిమా ఫస్ట్ రివ్యూ..రవితేజ కంబ్యాక్..థియేటర్లలో అయ్యప్ప శరణుఘోష పక్కా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sonia Gandhi Vande Mataram: సోనియా గాంధీ వందేమాతరం వివాదం..కాంగ్రెస్ పార్టీపై మరింత పెరిగిన రాజకీయ రగడ!
Hyderabad, Telangana:AC Side Effects Monsoon: వర్షాకాలంలో కూడా ఏసీ వాడుతున్నారా? అయితే మీరు ఈ సమస్యలు తెచ్చిపెట్టుకున్నట్టే!
Hyderabad, Telangana:AC Side Effects In Monsoon: వర్షాకాలంలో ఉక్కపోత, తేమ నుండి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఎక్కువ సమయం ఏసీ (AC) గదుల్లోనే గడుపుతుంటారు. అయితే ఏసీ నుండి వచ్చే చల్లని, పొడి గాలి చర్మానికి తీవ్ర హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ చర్మవాధుల నిపుణుల సూచనల ప్రకారం.. ఈ సీజన్లో ఏసీ వాడేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో, వాటిని ఎలా నివారించాలో ఇక్కడ చూద్దాం.
చర్మం పొడిబారడం, ఇన్ఫెక్షన్లు..
బయటి వాతావరణంలోని తేమకు, ఏసీ గదిలోని పొడి గాలికి మధ్య జరిగే నిరంతరం మార్పు వల్ల చర్మం సహజ తేమను కోల్పోతుంది. దీనివల్ల చర్మం పొడిబారి, తీవ్రమైన దురద, చికాకు కలుగుతాయి. గోకడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
చేయకూడని తప్పులు..
1) తక్కువ ఉష్ణోగ్రతలో ఏసీ వాడకం అనగా చాలా మంది ఏసీని 16 లేదా 18 డిగ్రీల వద్ద సెట్ చేస్తుంటారు. అలా కాకుండా ఉష్ణోగ్రతను 25 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచడం చర్మానికి మంచిది.
2) నేరుగా గాలి తగలకుండా చూసుకోవడం అంటే.. ఏసీ లేదా కార్ వెంట్స్ నుంచి వచ్చే బలమైన గాలి నేరుగా ముఖానికి తగిలేలా ఉంటే చర్మం త్వరగా పొడిబారుతుంది. గాలి పక్కకు వెళ్లేలా వెంట్లను సర్దుబాటు చేసుకోవాలి.
3) తగినంత నీరు తాగకపోవడం అనగా.. రోజంతా ఏసీ ఆఫీసుల్లో ఉండేవారు తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడతారు. ఇది చర్మాన్ని నిర్జీవంగా మారుస్తుంది.
4) మాయిశ్చరైజర్ వాడకపోవడం మంచిది. ప్రతి నాలుగు గంటలకు ఒకసారి తేలికపాటి మాయిశ్చరైజర్, పెదవులకు లిప్ బామ్ రాసుకోవడం వల్ల చర్మంలో తేమ నిలుస్తుంది.
చర్మ పరిశుభ్రత, ఆహారం..
వర్షాకాలంలో తేమ, చెమట కారణంగా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. అందుకే మంచి సబ్బుతో రోజుకు రెండుసార్లు స్నానం చేయడం, ముఖాన్ని శుభ్రమైన నీటితో రోజుకు 2-3 సార్లు కడుక్కోవడం మంచిది. అలాగే పోషకాలున్న పండ్లు, ఆకుకూరలు తింటూ చర్మాన్ని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
Also Read: బరువు తగ్గడానికి 'యాపిల్ సైడర్ వెనిగర్' మంచిదా..?
Also Read: Weight Loss Tips: వాకింగ్ Vs రన్నింగ్..ఫాస్ట్‌గా బరువు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Konda Surekha: వివాదాల కేరాఫ్ అడ్రస్‌గా మంత్రి కొండా సురేఖ.. డిఫెన్స్‌లో కాంగ్రెస్!
Hyderabad, Telangana:Minister Konda Surekha News: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా మంచి గుర్తింపు పొందిన మంత్రి కొండా సురేఖ చుట్టు వివాదాలు వీడకుండా చుట్టూ ముడుతూనే ఉన్నాయి.. తనదైన దూకుడు శైలిలో వార్తల్లో నిలిచే ఆమె.. చేసిన వరుస వ్యాఖ్యలతో పాటు చోటు చేసుకున్న పరిణామాలు ప్రభుత్వానికి.. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతూ వస్తున్నాయి.. గత కొద్ది కాలంగా ఒక వివాదం ముగిసేలోపే మరొకటి తెరపైకి వస్తూ ఆమెను రాజకీయంగా సుడిగుండంలోకి నెడుతోంది..
సినీనటి సమంత విడాకుల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.. రాజకీయ విమర్శల క్రమంలో సినీ ప్రముఖుల పేర్లను ప్రస్తావించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు ఇతర రాజకీయ పార్టీ నాయకులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు న్యాయపరమైన వివాదాలకు కూడా దారి తీసిన సంగతి తెలిసిందే. పరిస్థితి తీవ్రతను గమనించిన ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం కాస్త సర్దుమనిగిపోయింది..
సమంత వివాదం చల్లారుతున్న సమయంలోనే.. మంత్రులు ఫైల్ క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే తీవ్ర ఆగ్రహానికి దారి తీసేలా చేశాయి.. క్యాబినెట్ సహచరులపైనే తీవ్ర ఆరోపణలు చేసినట్లు అవ్వడంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సంగతి కూడా తెలిసిందే.. ఈ ప్రకటనతో అటు ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శల దాడికి దిగాయి.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో 22A పిడుగు.. సొంత భూమి ఉన్నా ఎందుకీ తిప్పలు?
మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నేత కడియం శ్రీహరితో జరిగిన ప్రోటోకాల్ వివాదం కూడా పార్టీ వర్గాల్లో తీవ్రమైన చర్చనీ అంశానికి దారితీసింది.. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో టెండర్ల ప్రక్రియకు సంబంధించిన అంశాలు కూడా అంతర్గత విభేదాలను రచ్చకెక్కించేలా చేశాయి.. ఇలా వరుస వివాదాలతో సతమతమవుతున్న తరుణంలో.. తాజాగా ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలు మంత్రి సురేఖకు మరింత తలనొప్పిగా మారేలా చేశాయి.. సొంత పార్టీ నేతలతో సమన్వయం లేకపోవడంతో పాటు దూకుడుగా మాట్లాడే శైలి ఆమెను మరింత డిఫెన్స్‌లో పడేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. వరుస వివాదాల నేపథ్యంలో అధిష్టానం ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది..
Also Read: తెలుగు రాష్ట్రాల్లో 22A పిడుగు.. సొంత భూమి ఉన్నా ఎందుకీ తిప్పలు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Meena Husband Death: నటి మీనా భర్త మృతి వెనుక అసలు నిజం ఇదే..ఇంటర్వ్యూలో చెబుతూ కంటతడి పెట్టిన హీరోయిన్!
Hyderabad, Telangana:Meena Husband Death Reason: దక్షిణాది చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా వెలుగొందిన మీనా వ్యక్తిగత జీవితంలో 2022లో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆమె భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందడం అప్పట్లో సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణంపై రకరకాల పుకార్లు వచ్చినప్పటికీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో మీనా స్పందిస్తూ తన భర్తను కాపాడుకునేందుకు తాను పడిన వేదనను తలచుకుని తీవ్రంగా భావోద్వేగానికి గురయ్యారు.
నటి మీనా భర్త విద్యాసాగర్ మృతికి సంబంధించి ఆమె మాట్లాడుతూ.. ఆయనకు ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్‌ప్లాంట్) చేయాల్సి వచ్చిందని తెలిపారు. అప్పట్లో ఈ వైద్య ప్రక్రియ గురించి తమకు అంతగా అవగాహన లేదని, ఆ మెడికల్ ప్రాసెస్ చాలా పెద్దదానిని ఆమె వెల్లడించారు.
వైద్యం కోసం దేశమంతా తిరిగిన వైనం..
భర్తను బతికించుకోవడానికి హైదరాబాద్, బెంగళూరు ఇలా దేశంలోని పలు ప్రాంతాల్లో బెస్ట్ ట్రీట్మెంట్ కోసం శతవిధాలా ప్రయత్నించినట్లు మీనా చెప్పారు. అమెరికా వెళ్లి వైద్యం చేయిద్దామని ఆలోచించినా, అక్కడి డాక్టర్లు కూడా ఇక్కడ ఇస్తున్న చికిత్సనే అక్కడ కూడా ఇస్తారని, ఈ స్థితిలో ప్రయాణం చేయడం క్షేమం కాదని చెప్పడంతో ఇండియాలోనే ఉండాల్సి వచ్చిందన్నారు.
లంగ్స్ మార్పిడి కోసం పలుమార్లు అలెర్ట్స్ వచ్చినా.. మెడికల్ క్రైటీరియా సరిపోకపోవడం, అవయవాలు మ్యాచ్ కాకపోవడంతో మూడు, నాలుగు సార్లు ఆస్పత్రికి వెళ్లి వెనుదిరిగిన సందర్భాలున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల పర్యవేక్షణలో ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని చెప్పారు.
భర్త మరణం తర్వాత తాను కుటుంబంతో కలిసి చాలా కఠినమైన రోజులను ఎదుర్కొన్నానని మీనా పేర్కొన్నారు. ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, తన స్నేహితులు, సినిమాల సాయంతో ఆ విషాద ఛాయల నుంచి క్రమంగా బయటపడుతున్నట్లు ఆమె తెలిపారు.
Also Read: 'ధురంధర్' నటి ఆయేషా ఖాన్ నిశ్చితార్థం..అతడి ఫొటో సీక్రెట్‌గా..సోషల్ మీడియాలో వైరల్!
Also Read: 'చెన్నై లవ్‌స్టోరీ' నుంచి 'జన నాయగన్' వరకు..ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
