పేలుడు పదార్థాలు, నకిలీ నోట్లు స్వాధీనం
Sukma, Chhattisgarh:ఛత్తీస్‌గఢ్...నక్సల్స్ శిబిరం లో నకిలీ నోట్ల కట్టల గుట్టు రట్టు చేసిన భద్రతా బలగాలుసుక్మా జిల్లాలోని బెజ్జి పోలీసు స్టేషన్ పరిధిలో గల కొరాజ్‌గూడ అడవుల్లో బయట పడిన నకిలీ కరెన్సీ. భారీ ఎత్తున నకిలీ నోట్లు, ప్రింటర్, పేలుడు పదార్థాలు, తుపాకులు, వైర్లెస్ సెట్లు స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలుहमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
విద్యార్థులకు సీఎం రేవంత్ శుభవార్త.. నేరుగా అకౌంట్లలోకి ఫీజు రీయింబర్స్మెంట్..!!
Lakshmapur, Telangana:Telangana Fee Reimbursement: స్వాతంత్ర్య దినోత్సవం వేళ తెలంగాణ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులకు విద్యా బోధనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్త కూడదనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రూ. 2,400 కోట్ల నిధులు ముందస్తుగానే బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు రేవంత్ ప్రకటించారు. విద్యార్థులు ఎవరినీ ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా, డబ్బులు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోనే స్కాలర్ షిప్ సొమ్మ జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు సాధించాలంటే కేవలం డిగ్రీలు ఉంటే సరిపోవని, టెక్నికల్ స్కిల్స్ కడా ఎంతో సీఎం రేవంత్ విద్యార్థులకు సూచించారు.
10వ తరగతి పూర్తైన వెంటనే విద్యార్థులు ITI కోర్సుల ద్వారా వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవచ్చని సీఎం చెప్పారు. నర్సింగ్ విద్య అభ్యసించిన వారికి జపాన్, జర్మనీ, కొరియా తదితర విదేశాలలో లక్షల రూపాయల ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. యువతలో తగిన నైపుణ్యం, సామర్థ్యం ఉంటే.. వారిని విదేశాలకు పంపించి మంచి ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యతను తనదేనని రేవంత్ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో విద్యా రంగానికి ప్రాధాన్యతనిచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్వాన్స్ ఫీజు రీయింబర్స్మెంట్లను అందించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ చొరవలో భాగంగా, ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ల మొదటి విడతగా రూ.250 కోట్లను నేరుగా బ్యాంకుల్లో జమ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని అర్హులైన పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రతి ఏటా రూ.2,300 కోట్లను క్రమం తప్పకుండా విడుదల చేస్తామని ఆయన స్పష్టంగా హామీ ఇచ్చారు.
ఫీజు రీయింబర్స్మెంట్లు ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న నెలలోపే విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అయ్యేలా ఒక పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడానికి బలమైన పునాదిని అందిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అలర్ట్...OPSపై కేంద్రం పార్లమెంటులో ఏం చెప్పిందంటే..?
Also Read: స్కూల్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
సర్కార్ బడుల్లో చదువులెట్ల సాగుతున్నయ్.. ఆగస్టు 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో తనిఖీలు..!!
Lakshmapur, Telangana:Telangana government schools: ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు ఎలా సాగుతున్నాయి.. టీచింగ్ ఎలా ఉంది.. పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు.. పాఠశాలలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే దానిపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడానికి అకడమిక్ ప్యానెల్ బృందాలను నియమిస్తున్నారు. ఈ బృందాలు ఈ నెల 17వ తేదీన తనిఖీలను ప్రారంభిస్తాయి. విద్యార్థుల ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్ర (FLN) సామర్థ్యాలను అంచనా వేయడం, ఉపాధ్యాయులకు విద్యాపరమైన మద్దతును అందించడం ఈ తనిఖీల ప్రాథమిక ఉద్దేశ్యం.
రాష్ట్రంలోని సుమారు 24,000 పాఠశాలలను తనిఖీ చేయడానికి పాఠశాల విద్యా అధికారులు 307 ప్యానెల్ బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలో 171 ప్రాథమిక పాఠశాలలకు, 38 ఉన్నత ప్రాథమిక పాఠశాలలకు, 98 ఉన్నత పాఠశాలలకు కేటాయించారు. పదేళ్ల అనుభవం ఉన్న PSHMలు.. SGTలు ప్రాథమిక పాఠశాలలకు అధికారులుగా ఉంటారు. ఉన్నత పాఠశాలలు, UPSలకు పాఠశాల సహాయకులు సభ్యులుగా ఉంటారు. ప్రాథమిక పాఠశాల తనిఖీ బృందంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఉన్నత పాఠశాల బృందంలో ప్రిన్సిపాల్, సబ్జెక్ట్ టీచర్, PETతో సహా తొమ్మిది మంది సభ్యులు ఉంటారు. ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక బృందాలు రోజుకు 2 పాఠశాలలను తనిఖీ చేయాలి. మూడు నెలల్లో కనీసం 100 పాఠశాలలను తనిఖీ చేయాలి. ఉన్నత పాఠశాలల బృందాలు రోజుకు ఒక పాఠశాలను తనిఖీ చేయాలి. మూడు నెలల్లో సగటున 50 పాఠశాలలను తనిఖీ చేయాలి.
తనిఖీలకు ముందు, బృందాలు మూడు దశల్లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాయి. ఈ శిక్షణ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న టీజీఐఆర్డీలో ప్రారంభమైంది. మొదటి దశ ఈ నెల 11, 12 తేదీలలో, రెండవ దశ 17, 18 తేదీలలో, మూడవ దశ 19, 20 తేదీలలో జరుగుతుంది. శిక్షణ పూర్తయిన వెంటనే, బృందాలు పాఠశాలల తనిఖీలు నిర్వహిస్తాయి. మొదటి దశ ఆగస్టు 17న, రెండవ దశ ఆగస్టు 21న, మూడవ దశ ఆగస్టు 24న ప్రారంభమవుతుంది. ఈ శిక్షణ కోసం ప్రభుత్వం రూ. 18.50 లక్షల బడ్జెట్‌ను కేటాయించింది. అధికారులు సకాలంలో శిక్షణకు హాజరు కావాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ నవీన్ నికోలస్ ఆదేశించారు.
ఈ బృందాలు కేవలం బోధన గురించే కాకుండా, పాఠశాల మొత్తం పరిస్థితి గురించి కూడా విచారిస్తాయి. అవి తరగతి గది బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళికలు, సిలబస్ పూర్తి చేయడం, విద్యార్థుల హాజరుతో పాటు గ్రంథాలయాలు, ప్రయోగశాలల వంటి మౌలిక సదుపాయాల నిర్వహణను కూడా పరిశీలిస్తాయి. అంతేకాకుండా, ఈ బృందాలు మధ్యాహ్న భోజన పథకం అమలు, ఆహార నాణ్యత, పారిశుధ్యం, తాగునీటి సౌకర్యాలు, విద్యార్థుల ఆరోగ్య పరీక్షలపై నివేదికలను సిద్ధం చేస్తాయి. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో ఏకరూపత ఏర్పడుతుందని, లోపాలను సరిదిద్దుకోవడానికి అవకాశం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అలర్ట్...OPSపై కేంద్రం పార్లమెంటులో ఏం చెప్పిందంటే..?
Also Read: స్కూల్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
దిమాగీ నక్సల్స్‌తో జాగ్రత్త.. ఎర్రకోటపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఎవరికి హెచ్చరికంటే?
Lakshmapur, Telangana:PM Modi: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దిమాగీ నక్సల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. దిమాగీ నక్సల్స్ పదాన్ని ఆయన పూర్తి వివరించలేదు. కానీ వారిని గుర్తించి..వేరు చేయాలని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.
దిమాగీ నక్సల్స్ ఓ కొత్త రకమైన శత్రువు అన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మావోయిస్టు మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఇప్పుడు దేశ రాజకీయాల్లో భాగస్వామ్యం అవుతున్నారని.. కొందరు ప్రభుత్వ కమిటీల్లోనూ అడ్వైజర్లుగా విధులు నిర్వహిస్తున్నారని.. మావోయిస్టు ఐడియాలజీ దేశ విధానాలపై ప్రభావం చూపిందన్నారు. సాయుధ నక్సలైట్లు అంతం అయినా.. ఆ సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించామని సాయుధ నక్సలైట్లు అంతమైనా.. దిమాగీ నక్సల్స్ మాత్రం అలాగే ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. ఆ నక్సల్స్ దేశంలో హింస, అల్లర్లు స్రుష్టిస్తున్నారని.. ప్రధాని మోదీ ఆరోపించారు. సమాజాన్ని తమ తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లేందుకు విభిన్న వ్యూహాలను అమలు చేస్తున్నారని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
గడిచిన నాలుగు దశాబ్దాలుగా నక్సలిజం, మావోయిజం భయానక హింసతో లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేశాయని, 3,500 మందికి పైగా పోలీసు భద్రతా సిబ్బంది ఆధిపత్య పోరులో ప్రాణాలు అర్పించారని ప్రధాని తెలిపారు. 2014లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దేశాన్ని నక్సల్స్ రహితంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేశామని, నేడు ఆ ఆశయం దిశగా గణనీయమైన విజయం సాధించి మావోయిస్టు హింసను దాదాపు కట్టడి చేశామని స్పష్టం చేశారు.ఒకప్పుడు తుపాకుల మోతలతో, రక్తాక్షరాలతో తడిసిన మారుమూల నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నేడు అభివృద్ధి పతాకాలు ఎగురుతున్నాయని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, మౌలిక వసతులు ఆయా ప్రాంతాలకు చేరువవుతున్నాయని పేర్కొన్నారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అలర్ట్...OPSపై కేంద్రం పార్లమెంటులో ఏం చెప్పిందంటే..?
Also Read: స్కూల్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sun-ketu: సింహరాశిలో సూర్య-కేతువుల కలయిక.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగులేని రాజయోగం!
Hyderabad, Telangana:Sun-ketu Conjunction In Leo Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 17వ తేదీ చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు గ్రహాలకు అధిపతిగా భావించే సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. చాయాగ్రహంగా పిలిచే కేతువు ఇప్పటికే అదే రాశిలో సంచార దశలో ఉంది. ఫలితంగా సింహరాశిలో సూర్య కేతువుల బలమైన గ్రహ సంయోగం ఏర్పడుతోంది. దీని కారణంగానే కొన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆదాయ వనరులు పెరగడమే కాకుండా.. డబ్బు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోబోతున్నాయి. అలాగే ఉద్యోగంలో మంచి అభివృద్ధి కూడా లభించబోతోంది. ముఖ్యంగా సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అయితే, ఏ రాశుల వారికి ఈ రెండు గ్రహాల శుభ ప్రభావం పడుతుందో.. లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశుల వారికి బంపర్ లాభాలు..
మేషరాశి
సూర్య కేతువుల కలయిక కారణంగా ఈ సమయంలో మేష రాశి వారికి గొప్ప పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఉద్యోగస్తులకు అద్భు తమైన పురోగతి లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఇతరుల మధ్య వచ్చిన చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. అందరూ మిమ్మల్ని గౌరవించడమే కాకుండా అద్భుతమైన ప్రశంసలు కూడా వారి చేత పొందుతారు. అలాగే కుటుంబంలో మంచి సంతోషకరమైన వాతావరణ కూడా నెలకొంటుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి కూడా ఈ సమయం అత్యంత అనుకూలమైన లాభాలను అందిస్తుంది.. ముఖ్యంగా శక్తివంతమైన యోగ ప్రభావంతో ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే పనుల్లో పురోగతి లభించడమే కాకుండా.. భారీ మొత్తంలో ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో దూర ప్రయాణాలు చేసే వారికి విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచి ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులందరికీ తప్పకుండా పరిష్కారం లభించబోతోంది.
తులారాశి
తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక అద్భుతమైన కొత్త ఆదాయ మార్గాలను తెచ్చి పెట్టబోతున్నాయి. ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన పనులన్నీ ఎంతో సులభంగా పూర్తి కాబోతున్నాయి. ఉద్యోగంలో గొప్ప పురోగతి లభించడమే కాకుండా.. మంచి మంచి పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అంతేకాకుండా ఇతర ఉద్యోగుల సహాయంతో భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా కష్టపడి పనులు చేసే ఉద్యోగాస్తులకు ఈ సమయంలో తప్పకుండా ప్రశంసలు లభించబోతున్నాయి..
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు లభించబోతున్నాయి. కేతువు గ్రహ ప్రభావంతో ఆదాయం భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలో పదోన్నతులు కలిగి అనుకున్న జీవితాలు కూడా పెంచుకోగలుగుతారు. అంతే కాకుండా మీరు బాసులకు సన్నిహితులుగా మారి విశేషమైన లాభాలు పొందవచ్చు.. ఈ సమయంలో వ్యాపారాలకు కూడా చాలా వరకు వృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడం వల్ల పెద్ద పెద్ద ధన లాభాలను సొంతం చేసుకోగలుగుతారు. అనుకున్న అని కూడా సులభంగా సాధించగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర నిపుణులను ఆధారంగా చేసుకొని రాసింది మాత్రమే.. అలాగే ఈ సమాచారం మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించదు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
‘అంగీ’ పైపైకి.. ‘లాగు’ జారిపోతోంది.. కొలతలు మారిన ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్స్..!!
Lakshmapur, Telangana:Govt School Uniform Issue Telangana: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల (యూనిఫాం) పంపిణీలో తీవ్ర అక్రమాలు, అలసత్వం వెలుగుచూశాయి. సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన యూనిఫాంల పంపిణీ కార్యక్రమం తీవ్ర గందరగోళానికి దారితీసింది. పంపిణీ చేసిన దుస్తుల కొలతల్లో భారీ తేడాలు రావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాఠశాలల్లో బాలికలకు కేటాయించిన దుస్తులు కొంతవరకు ఫర్వాలేదనిపించినా, బాలురకు అందించిన చొక్కాలు (అంగీలు), లాగుల పరిస్థితి మాత్రం మరీ అధ్వానంగా తయారైంది.
కొందరు విద్యార్థులకు చొక్కాలు మరీ పొట్టిగా, బిగుతుగా ఉంటే.. మరికొందరికి అతిగా పొడవుగా, వదులుగా ఉన్నాయి. నాణ్యత లేని కుట్లు ఉండటంతో పాటు చొక్కాలు, లాగులు ఒకవైపు పైకి, మరోవైపు కిందికి వేలాడుతూ అసమానంగా ఉన్నాయని ఉపాధ్యాయులు గుర్తించారు. ఈ లోపాలను గమనించిన పలువురు ఉపాధ్యాయులు, ఇలాంటి నాసిరకం దుస్తులను విద్యార్థులకు పంపిణీ చేయలేమని స్పష్టం చేస్తూ పంపిణీ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌తో పాటు వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లోనూ ఇదే తరహా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారముపై హుస్నాబాద్ ఎంఈవో మనీల స్పందిస్తూ.. యూనిఫాంల కొలతల్లో తేడాలు వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ దుస్తులను కుట్టిన మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో మాట్లాడి, కొలతలను సరిచేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దుస్తులను పునర్నిర్మించి సరిచేసే వరకు విద్యార్థులకు పంపిణీ చేయవద్దని హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. విద్యార్థుల దుస్తుల నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అలర్ట్...OPSపై కేంద్రం పార్లమెంటులో ఏం చెప్పిందంటే..?
Also Read: స్కూల్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Independence Day: స్వాతంత్య్ర వేడుకల్లో తళతళ మెరుస్తున్న తెలంగాణ సచివాలయం
Hyderabad, Telangana:Light Decoration To Telangana Secretariat For Independence Day 2026 Watch VisualsKCR Wishes: తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తొలి సీఎం కేసీఆర్
Baddipadaga, Telangana:80th Independence Day: స్వాతంత్య్ర వేడుకలకు తెలంగాణలో భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాడవాడలా స్వాతంత్య్ర వేడుకలు జరగనుండగా రాష్ట్రస్థాయిలో గోల్కొండలో సంబరాలు జరగనున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. 'పరాయి వలస పాలనను పారదోలి 1947 ఆగస్టు 15న భారతదేశం స్వయంపాలనను సాధించుకుంది. నిస్వార్థ పోరాట స్ఫూర్తి, దార్శనిక నాయకత్వం, త్యాగంతో కూడిన ప్రజల భాగస్వామ్యమే దేశానికి స్వాతంత్య్రాన్ని అందించాయి' అని మాజీ సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
'79 వసంతాలు పూర్తి చేసుకుని 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని చేసుకుంటున్న ఈ శుభసందర్భంలో దేశ సామాజిక న్యాయం, ఆర్థిక ప్రగతిని ప్రతి ఒక్కరూ పునశ్చరణ చేసుకోవాలి' అని గులాబీ బాస్ కేసీఆర్ తెలిపారు. ఫెడరల్ పాలనా విధానం, సెక్యులర్ స్ఫూర్తితో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం మరింత ముందుకు సాగేందుకు ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలను గుర్తించాల్సిన అవసరం ఉందని మాజీ సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. భవిష్యత్తులో దేశ పాలనలో భాగస్వామ్యం కానున్న నేటితరం మరింత జ్ఞానం, సహనం, దార్శనికతతో ముందడుగు వేసినప్పుడే స్వాతంత్య్ర ఉద్యమ త్యాగాల ఫలాలు ప్రతి గడపకు చేరుతాయని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అంత్యక్రియలకు హాజరు
తన కుటుంబంలో చోటుచేసుకున్న విషాద సంఘటనతో కేసీఆర్ స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. తన సతీమణి శోభమ్మ సోదరుడు, కేసీఆర్ బామ్మర్ది మృతిచెందడంతో కల్వకుంట్ల కుటుంబం మొత్తం విషాదంలో మునిగింది. బావమరిది అంత్యక్రియల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొని ఆఖరి నివాళి అర్పించారు. అంతకుముందు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబాన్న ఓదార్చారు. ఇక తన సోదరుడు మృతిచెందడాన్ని కేసీఆర్ భార్య శోభమ్మ తట్టుకోలేకపోతున్నారు. సోదరుడి మృతదేహం చూసిన అనంతరం శోభమ్మ తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు. కంటతడి పెట్టడంతో కేసీఆర్ ఆమెను ఓదార్చారు.
Independence Day: తెలంగాణలో ఏ జిల్లాల్లో ఎవరు జెండా ఎగురవేస్తారు? పూర్తి జాబితా ఇదే!
Baddipadaga, Telangana:Telangana Independence Day: స్వాతంత్య్ర వేడుకలకు తెలంగాణలో అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లో దేశభక్తిని చాటేలా అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీపాల వెలుగులో కాంతులీనుతున్నాయి. స్వాత్యంత్ర వేడుకల్లో ఏయే జిల్లాల్లో ఎవరు జెండా ఎగురవేయనున్నారనేది తెలంగాణ ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ప్రభుత్వం వెల్లడించింది.
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 32 జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు జెండా వందనం చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో రాజధాని హైదరాబాద్‌లో జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి జెండాను ఆవిష్కరించనున్నారు. ఉదయం 10:00 గంటలకు ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించేలా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం అధికార యంత్రాంగానికి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో ఉదయం 9:30 గంటలకు మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, శాసనసభ/శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించనున్నారు.
జిల్లా.. జెండా ఆవిష్కరించే మంత్రులు, ప్రజాప్రతినిధులు
ఆదిలాబాద్ – ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్
భద్రాద్రి కొత్తగూడెం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హనుమకొండ – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జగిత్యాల – మంత్రి మహ్మద్ అజహరుద్దీన్
జయశంకర్ భూపాలపల్లి – ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
జనగామ – ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
జోగులాంబ గద్వాల – ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి
కామారెడ్డి – ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు
కరీంనగర్ – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఖమ్మం – ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
కుమురంభీం ఆసిఫాబాద్ – శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
మహబూబాబాద్ – ప్రభుత్వ విప్ జె. రాంచందర్ నాయక్
మహబూబ్‌నగర్ – మంత్రి జూపల్లి కృష్ణారావు
మంచిర్యాల – ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు
మెదక్ – మంత్రి వివేక్ వెంకటస్వామి
మెద్చల్ – ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు
ములుగు – మంత్రి దనసరి అనసూయ సీతక్క
నాగర్‌కర్నూల్ – ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి
నల్గొండ – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నారాయణపేట – మంత్రి వాకిటి శ్రీహరి
నిర్మల్ – ప్రభుత్వ విప్ వెముల వీరేశం
నిజామాబాద్ – ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి
పెద్దపల్లి – ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు
రాజన్న సిరిసిల్ల – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రంగారెడ్డి – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
సంగారెడ్డి – మంత్రి దామోదర రాజనర్సింహ
సిద్దిపేట – మంత్రి పొన్నం ప్రభాకర్
సూర్యాపేట – మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
వికారాబాద్ – శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వనపర్తి – శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
వరంగల్ – మంత్రి కొండా సురేఖ
యాదాద్రి భువనగిరి – శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Independence Day: రేపు ఏపీలో స్వాతంత్య్ర వేడుకల్లో జెండా ఎగురవేసే మంత్రులు వీరే..
Nuzendla, Andhra Pradesh:80th Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో గొందు గొందులో భారతదేశ గీతాలు వినిపించనున్నాయి. స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శనివారం జరగనున్న 80వ స్వాతంత్య్ర వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముస్తాబైంది. ప్రతి గల్లీలో.. ప్రతి ఊరిలో.. ప్రతి జిల్లాలో జరగనున్న వేడుకలకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అధికారికంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించిన వివరాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి మంత్రుల నియామకం చేపట్టింది. ఆగస్టు 15న అమరావతిలో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు జరగనుండగా.. ఉదయం 8.30 గంటలకు అమరావతిలోని పరేడ్‌లో సీఎం చంద్రబాబు పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు.
జిల్లాల వారీగా మంత్రుల జెండావందనం
- ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న మంత్రి నారా లోకేశ్
- శ్రీకాకుళంలో జెండా ఎగరేయనున్న మంత్రి అచ్చెన్నాయుడు
- కృష్ణా జిల్లాలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న మంత్రి కొల్లు రవీంద్ర
- పల్నాడులో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్
- నెల్లూరులో మంత్రి పొంగూరు నారాయణ
- అనకాపల్లిలో మంత్రి వంగలపూడి అనిత
- చిత్తూరులో మంత్రి సత్యకుమార్ యాదవ్
- పశ్చిమగోదావరిలో మంత్రి నిమ్మల రామానాయుడు
- విశాఖపట్నంలో మంత్రి అనగాని సత్యప్రసాద్
- తిరుపతిలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
- అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్
- కర్నూలులో జెండా ఆవిష్కరించనున్న మంత్రి టీజీ భరత్
- కడపలో మంత్రి NMD మహమ్మద్ ఫరూక్
- ఏలూరులో మంత్రి కొలుసు పార్థసారథి
- ప్రకాశంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి
- బాపట్లలో మంత్రి గొట్టిపాటి రవికుమార్
- తూర్పుగోదావరిలో మంత్రి కందుల దుర్గేష్
- పార్వతీపురం మన్యంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
- నంద్యాలలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
- శ్రీసత్యసాయి జిల్లాలో మంత్రి ఎస్.సవిత
- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమలో మంత్రి వాసంశెట్టి సుభాష్
- విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- అన్నమయ్య జిల్లాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
- అల్లూరి సీతారామరాజు, పోలవరం, మార్కాపురం జిల్లాల్లో జాతీయ పతాకం ఆయా జిల్లాల కలెక్టర్లు ఆవిష్కరించనున్నారు.
Teacher Hair: టీచరమ్మకు పనోళ్లుగా విద్యార్థి.. జడ వేయించుకున్న టీచర్
Kesamudram, Telangana:Teacher Ties Her Hair Braided With A SSC Student In KGBV Hostel Watch Viral VideoIndependence Day: విద్యుద్దీపాల కాంతుల్లో ఏపీ అసెంబ్లీ జిగేల్ జిగేల్
Amaravati, Andhra Pradesh:AP Assembly Building Illuminated Visuals For 80th Independence Day Celebrations Watch VisualsIndependence Day: విద్యుద్దీపాల వెలుగుల్లో ఏపీ సెక్రటేరియట్ జిగేల్
Velgapudi, Andhra Pradesh:AP Secretariat Building Colorful Lightings For 80th Independence Day Celebrations Watch Visualsబెస్ట్ స్వాతంత్ర దినోత్సవ వీడియో విషెస్..
Hyderabad, Telangana:80వ స్వాతంత్య్ర దినోత్సవ గ్రీటింగ్స్..
Hyderabad, Telangana:Happy 80th Independence Day: మత, భాష, సాంస్కృతులలో ఎన్నో వైవిధ్యాలు ఉన్నప్పటికీ.. భారతీయులమంతా ఒక్కటే అని ఐకమత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండగ ఇది.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం విజయవంతంగా కొనసాగుతోందని ఈ వేడుకలే ప్రత్యక్ష నిదర్శనం.. కాబట్టి ఇలా స్వాతంత్ర వేడుకలు ఎల్లప్పుడూ కులమత భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని కోరుకుంటూ.. దేశభక్తిని పెంపొందించడానికి సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఇలా 80 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ ను పంపండి..
