తెలుగు జర్నలిస్ట్ ఫోరం యూనియన్ కోసం అడహాక్ కమిటీ ఎన్నిక
Kadapa, Andhra Pradesh:కడప ప్రెస్ క్లబ్లో తెలుగు జర్నలిస్ట్ ఫోరం యూనియన్ ఏర్పాటు కోసం అడహాక్ కమిటీ ఎన్నిక జరిగింది. జిల్లా కన్వీనర్‌గా ఉప్పు శ్రీకాంత్, కో-కన్వీనర్‌గా కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా విభాగానికి బండారు కిషోర్ కుమార్ కన్వీనర్‌గా, బి.రామచంద్ర కో-కన్వీనర్‌గా నియమితులయ్యారు. సుధీర్ కుమార్ సలహాదారుగా ఎంపికయ్యారు. యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు త్వరలో ప్రారంభం. జర్నలిస్టుల పిల్లలకు ఫీజులలో 50% రాయితీ కోసం కృషి చేస్తామని శ్రీకాంత్ తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
తిరుమల శ్రీవారి సేవలో రెండు రాష్ట్రాల గవర్నర్లు
Dharmavaram, Andhra Pradesh:Two Other Governors Visits Tirumala Temple Watch Videoరేపు మిడ్జిల్‌కు రేవంత్ రెడ్డి.. ఏర్పాట్లు పూర్తి
Midjil, Telangana:All Set To Revanth Reddy Midjil Tour A Head 20 Years Complete In Political Careerతిరుమలలో దిల్ రాజు, రాఘవేంద్రరావు.. ఇతర ప్రముఖులు
Dharmavaram, Andhra Pradesh:Cine Actors And MLAs Visits To Tirumala Temple Watch VideoPrashna Ravan Arrest: యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు.. వైసీపీ Vs జనసేన కార్యకర్తల మధ్య తోపులాట!
Machilipatnam, Andhra Pradesh:Heavy Rain Alert: రాబోయే 2 గంటల్లో భారీ వర్షం..తెలుగు రాష్ట్రాలకు బిగ్ వార్నింగ్..
Hyderabad, Telangana:Heavy Rain Alert News: దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మందకొడిగా సాగుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు భారీగా పెరిగాయి. రాబోయే రెండు గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలియజేసింది.రేపు రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్‌కు రేవంత్ రెడ్డి.. షెడ్యూల్ ఇదే!
Midjil, Telangana:Revanth Reddy Midjil Visit: రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన అనంతరం తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి రేవంత్ రెడ్డి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ప్రాంతానికి రేపు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తన రెండు దశాబ్దాల రాజకీయ వార్షికోత్సవాన్ని చేసుకోనున్నారు. జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు తాను ఎదగడానికి కారణమైన గడ్డకు కృతజ్ఞత చెప్పుకునేందుకు మిడ్జిల్ ప్రాంతంలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.
20 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి జన్మనిచ్చిన నేలకు వందనం చెప్పేందుకు రేవంత్ రెడ్డి వెళ్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రేపు శనివారం ముఖ్యమంత్రి నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా తన తొలి విజయానికి వేదికైన మిడ్జిల్ మండలానికి ముఖ్యమంత్రి హోదాలో వెళ్లనుండడంతో ఈ పర్యటన రాజకీయంగా, భావోద్వేగంగా ప్రత్యేకత సంతరించుకుంది. తనకు రాజకీయ జన్మనిచ్చిన నేలపై ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతోపాటు పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు.
షెడ్యూల్ ఇదే!
==> రేపు ఉదయం 11.45 గంటలకు హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్‌కర్నూల్ జిల్లాకు బయలుదేరుతారు.
==> 12.30 గంటలకు ఉర్కొండపేట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేస్తారు.
==> ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేసి శంకుస్థాపన. అనంతరం ఆలయ ఆవరణలో తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన ఆనాటి అనుచరులు, ముఖ్య నాయకులు, ఆనాటి పెద్దలతో మాటామంతీ జరపనున్నారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు.
==> మధ్యాహ్నం 2.30 గంటలకు ఉర్కొండపేట నుంచి రోడ్డు మార్గంలో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌కు బయలుదేరుతారు.
==> 2.45 గంటలకు మిడ్జిల్ మండలం వెల్జాల క్రాస్ రోడ్డుకు చేరుకుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ
==> మధ్యాహ్నం 3 గంటలకు మిడ్జిల్ బహిరంగ సభా ప్రాంగణంలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు.
==> సాయంత్రం 3.15 గంటలకు మిడ్జిల్‌లో జరిగే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగం
కృతజ్ఞతా సభ
2006లో మిడ్జిల్ జడ్పీటీసీగా గెలిచి ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లో తొలి అడుగు వేసిన రేవంత్ రెడ్డి, 20 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ అదే నేలపై ముఖ్యమంత్రిగా ప్రజలకు తన కృతజ్ఞతలు తెలపనున్నారు. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయి వరకు సాగిన తన ప్రస్థానంలో మిడ్జిల్ ప్రజల ఆశీర్వాదం కీలకమని భావిస్తున్నారు.
ముగ్గురు మంత్రులు వర్సెస్ ఒకే ఒక్కడు.. ఆసక్తిగా ఖమ్మం జిల్లా రాజకీయాలు
Khammam, Telangana:Khammam Politics: బీఆర్ఎస్ పార్టీ హయాంలో పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత సైలెంటయ్యారు. ఓటమిని జీర్ణించుకోకపోవడం.. వ్యక్తిగత కారణాలతో అజయ్ గులాబీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపించలేదు. ప్రస్తుతం రెండు నెలల నుంచి జిల్లాలో విసృతంగా ఆయన పర్యటిస్తున్నారు. వారానికి రెండు, మూడు సార్లు జిల్లాలో పర్యటిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో ఉత్సాహం కనిపిస్తుంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆ పార్టీ నాయకులు కూడా ఇప్పుడు చురుగ్గా మారారు.
మరోవైపు రాష్ట్ర పార్టీ కూడా ఖమ్మం జిల్లాపై దృష్టి సారించింది. ఎందుకంటే ముగ్గురు కీలక మంత్రులు జిల్లాలో ఉండడంతో వారిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది. ఎన్నడూ లేని రీతిలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు వరుస పర్యటనలు చేశారు. దీంతో ఒక్కసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కూడా ప్రజల్లో కొంత అసహనం ఉండడంతో దానిని క్యాచ్ చేసుకునే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పవచ్చు. పార్టీ బలోపేతం, కార్యకర్తలకు భరోసా ఇవ్వటానికి మాజీ మంత్రి అజయ్‌కి పార్టీ ఆదిష్టానం కీలక బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే పువ్వాడ జిల్లాలో యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్‌తో పువ్వాడ అజయ్‌కు సన్నిహిత సంబంధాలు ఉండడం జిల్లాలో పువ్వాడకు కలిసొచ్చింది. కీలక నాయకులు ఉన్నప్పటికీ పువ్వాడపైనే భారం వేసినట్లు సమాచారం.
ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల పనితీరుపై పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో గెలిచి మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావును లక్ష్యంగా అజయ్ కుమార్ ఆరోపణలు చేస్తున్నారు. గతంలో తన హయాంలో ఖమ్మంలో జరిగిన అభివృద్దిని వివరిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం అంటూ తుమ్మలపై విరుచుపడుతున్నాడు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో తుమ్మల వర్సెస్ పువ్వాడ అనే రీతీలో అజయ్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. ఇటీవల కాలంలో పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి కూడా ఆయా నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం అజయ్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో సీటుకే పరిమితమైన బీఆర్ఎస్ పార్టీని.. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ అసెంబ్లీ సీట్లు సాధిస్తామనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న క్రమంలో ఇప్పటి నుంచే పువ్వాడ జిల్లాలో వ్యూహాలు అమలు చేస్తున్నారని సమాచారం.
అయితే అజయ్ కుమార్‌కు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఉన్న జిల్లా నాయకులు ఆయనకు సహకరించడం లేదనే ప్రచారం నడుస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్‌తో పాటు పలువురు ఒక జట్టుగా పనిచేస్తున్నారని సమాచారం. వీరంతా అజయ్ పర్యటనలో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. మరోవైపు పార్టీలో ఎలాంటి సమస్యలు ఉన్న కలిసికట్టుగా ఉండి వచ్చే ఎన్నికలలో జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని పువ్వాడ చెబుతున్నారు. చూడాలి పువ్వాడ అజయ్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో.
తెలంగాణ అప్పుల చిట్టా ఇదే! జూపల్లికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ
Hyderabad, Telangana:Telangana Debts: బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఖడించారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంపై మోపిన అప్పుల గురించి వివరిస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావుకి బహిరంగ లేఖ రాశారు. లేఖతో పాటు విడియోలు, ఇతర ఆధారాలను మంత్రికి వాట్సప్ ద్వారా పంపించారు. అప్పులపై పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారని సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు.
'బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల గురించి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సభ్యులు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారు. మీ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో సహా ఎన్నిసార్లు వివరించినా మీ తీరు మారక పోవడం శోచనీయం' అని కాంగ్రెస్ తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు అసహనం వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నరేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న రుణాలు, గ్యారెంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలు మొత్తం కలిపితే రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని నేను అసెంబ్లీలో తెలిపా. నేను చెప్పిన ఆ లెక్కలకు కట్టుబడి ఉంటా. ఎక్కడైనా చర్చకు సిద్దమని అసెంబ్లీలోనే స్పష్టంగా ప్రకటించా' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గుర్తుచేశారు..
'మీరు (జూపల్లి) రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు చేసిన అప్పు రూ.1,77,058 కోట్లు అని పేర్కొన్నారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లెక్కల ప్రకారం జూన్ 30, 2026 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.1,86,067 కోట్లు' అని లేఖలో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రస్తావించారు. '2026 మార్చి 18న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీ ప్రభుత్వం చేసిన ఎఫ్ఆర్బీఎం, అన్ని రకాల అప్పు కలిపి రూ.3,47,294 కోట్లు అని స్వయంగా ప్రకటించారు' అని వీడియోతో సహా హరీశ్ రావు వివరించారు.
'మీలాగా మేము మాట మార్చడం లేదు, పూటకో తీరుగా అంకెలు మార్చి చెప్పడం లేదు. మేము చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నాం. నేటికి మా లెక్కల ప్రకారం, సుమారు 4.5 లక్షల కోట్ల అప్పు వివిధ మార్గాల ద్వారా మీ ప్రభుత్వం తీసుకున్న విషయం బహిరంగ రహస్యమే' అని మంత్రులకు మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. 'బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో నేను అసెంబ్లీలో చేసిన ప్రసంగం వీడియో, మీ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన వీడియో, మీ అప్పులకు సంబంధించిన ఆర్బీఐ అధికారిక లెక్కలను మీ వాట్సాప్‌కు పంపిస్తున్నా. వాటిని ఒకసారి పరిశీలించి, వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నా' అని లేఖలో జూపల్లికి హరీశ్ రావు సూచించారు. ఇకనైనా అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి, మంత్రులు తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.
iQOO నుంచి పవర్ఫుల్ ఫోన్.. 6500mAh బ్యాటరీతో iQOO Z11i విడుదల.. ధర ఎంతంటే?
Hyderabad, Telangana:iQOO Z11i Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO తన సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ iQOO Z11i స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా మార్కెట్లోకి లాంచ్ చేసింది.. వినియోగదారులను ఆకట్టుకునేలా అద్భుతమైన ఫీచర్లతో.. ముఖ్యంగా భారీ బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లో అడుగుపెట్టిన్నట్లు కంపెనీ అధికారంగా వెల్లడించింది.. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ధర, ఫీచర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ధరకి సంబంధించిన వివరాలు..
ఈ iQOO Z11i స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన్నట్లు కంపెనీ తెలిపింది. మొదటి వేరియంట్ 6GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ భారత కరెన్సీలో సుమారు రూ.18,000తో అందుబాటులోకి వచ్చింది. ఇక రెండవ వేరియంట్ 8GB ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ధర రూ.21,000తో లభించనుంది. ఇక చివరి హైఎండ్ వేరియంట్ 8GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,000లతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఇంక్ షాడో (Ink Shadow), కింగ్‌ఫెంగ్ (Qingfeng)తో పాటు డెసర్ట్ గోల్డ్ (Desert Gold) అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.
డిస్ప్లే అద్భుతం..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.74 అంగుళాల LCD ప్యానెల్ డిస్ప్లేను అందించినట్లు కంపెనీ తెలిపింది.. ఇది HD ప్లస్ (1600 x 720 పిక్సెల్స్) రెసల్యూషన్‌తో అందుబాటులోకి వచ్చింది. స్మూత్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.. ఇందులో వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. కంటి రక్షణ కోసం TÜV Rheinlandలో బ్లూ లైట్ సర్టిఫికేషన్, DC డిమ్మింగ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
పవర్ఫుల్ పర్ఫార్మెన్స్..
ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 (Snapdragon 4 Gen 2) చిప్సెట్ ప్రాసెసర్‌తో రన్ అవుతున్నట్లు కంపెనీ తెలిపింది.. ఇదిలా ఉంటే మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను మరింత పెంచుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. iQOO Z11i వెనుక భాగంలో ఆటోఫోకస్ లెన్స్‌తో కూడిన 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇది 1080p క్వాలిటీతో వీడియో రికార్డింగ్ చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను కూడా కలిగి ఉండడం విశేషం.. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా అందిస్తోంది.. అలాగే ఇది మోస్ట్ పవర్ఫుల్ 6500mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: చిన్నారులే టార్గెట్.. కరీంనగర్లో నకిలీ ఫుడ్ రాకెట్ బట్టబయలు..
Hyderabad, Telangana:Karimnagar Latest News: చిన్నారుల అమాయకత్వాన్ని, వారు ఇష్టపడే రంగురంగుల ప్యాకెట్లను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు కల్తీ ధందాకు తెరలేపారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో లోపల విషాన్ని నింపి మార్కెట్లోకి వదులుతున్నట్లు తేలింది.. కరీంనగర్ నగరంలోని గంజ్ ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం జరిపిన ఆకస్మిక దాడుల్లో భారీగా నకిలీ, కల్తీ ఆహార పదార్థాలు పట్టుబడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
నకిలీ కుర్కురేలు..
కరీంనగర్ గంజ్ హోల్‌సేల్ మార్కెట్ కేంద్రంగా ఎలాంటి అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నకిలీ వ్యాపారాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు బట్టబయలు చేశారు. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కుర్కురేలను హ్యాపీ బర్త్ డే అనే ఆకర్షణీయమైన బ్రాండ్ పేరుతో ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. వీటితో పాటు చిన్న ప్లాస్టిక్ ట్యూబ్లలో నింపిన రంగు రంగుల లిక్విడ్ పెప్సీ ప్యాకెట్లను అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఆ రంగులు.. రసాయనాలు చిన్నారుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
అడ్రస్ లేదు.. తయారీ వివరాలు లేవు..
ఈ దాడికి సంబంధించిన వివరాలను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO) అంకిత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. పట్టుబడిన ప్యాకెట్లపై ఎలాంటి కంపెనీ అడ్రస్ కానీ.. తయారీ తేదీ (Manufacturing Date), ఎక్స్పైరీ తేదీ (Expiry Date) లేదా కనీసం ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలు కూడా లేవని ఆయన తెలిపారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో నాణ్యతా ప్రమాణాలు లేకుండా వీటిని తయారు చేసి.. కేవలం లాభాల కోసమే మార్కెట్లోకి సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
స్ట్రాంగ్ వార్నింగ్..
ఈ ఉదంతం నేపథ్యంలో మార్కెట్లో ఇలాంటి నాణ్యత లేని.. కల్తీ ఆహార పదార్థాలను విక్రయించినా లేదా నిల్వ చేసినా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే తయారీదారులకు.. వ్యాపారులకు నోటీసులు జారీ చేసినట్లు FSO అంకిత్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నారుల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని.. రాబోయే రోజుల్లో దాడులను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. చిరుతిళ్ల పేరుతో మార్కెట్లోకి వస్తున్న ఇలాంటి ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన పదార్థాల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు. వీధి అరుగులపై.. చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో దొరికే ఇలాంటి లోకల్ బ్రాండ్స్ వల్ల పిల్లల్లో లివర్, కిడ్నీ సమస్యలతో పాటు గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం హైడ్రా కూల్చివేతలు.. కన్నీరు పెడుతున్న బాధితులు!
Hyderabad, Telangana:Hydra Demolition Drive At Moti Nagar News: హైదరాబాద్‌లోని మోతినగర్, బోరబండ రోడ్డు ప్రధాన సిగ్నల్ ఏరియాలో హైడ్రా (HYDRA) అధికారులు శనివారం ఉదయం భారీ కూల్చివేతలు చేపట్టారు. రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలతో పాటు ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన షాపులను JCBల సహాయంతో నేలమట్టం చేశారు. మోతినగర్ చౌరస్తాలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను దృష్ట్యా.. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగానే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఫుట్‌పాత్‌లు, రోడ్డు మార్జిన్లను క్లియర్ చేయడం వల్ల వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతాయని.. ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని హైడ్రా వర్గాలు వెల్లడించాయి.
ముందుగా నోటీసులు ఇచ్చామన్న అధికారులు..
ఈ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఒక్కసారిగా చేపట్టింది కాదని.. స్థానిక వ్యాపారులకు, నివాసితులకు చట్టప్రకారం ముందస్తు నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి రోడ్డును ఆక్రమించుకున్నందు వల్లే ఈ చర్యలు అనివార్యమయ్యాయని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. ఈ కూల్చివేతలతో మోతినగర్ జంక్షన్లో ఎన్నాళ్లుగానో వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానిక వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
కన్నీరుమున్నీరవుతున్న బాధితులు..
మరోవైపు అధికారుల చర్యలపై బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారంతో పాటు నోటీసులు ఇవ్వకుండానే రాత్రికి రాత్రే వచ్చి షాపులను కూల్చివేశారని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద కోట్లలో ఉండే అక్రమ నిర్మాణాలను వదిలేసి.. రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మా లాంటి పేదలపై కక్ష సాధిస్తున్నారని.. ఉన్నపళంగా షాపులు కూల్చేస్తే ఇప్పుడు మేము రోడ్డున పడ్డామని.. మాకు జీవనోపాధి ఎలా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ఆసరా కోల్పోయిన అనాథలు..
ఈ కూల్చివేతల్లో ఎందరో పేదలు తమ ఏకైక జీవనాధారాన్ని కోల్పోయారు. భర్తను కోల్పోయి.. ఒక చిన్న షాపు పెట్టుకుని పిల్లలను పోషించుకుంటున్న ఒక మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. కన్నీరుమున్నీరైంది. తనకున్న ఒక్కగానొక్క ఉపాధి మార్గాన్ని కూడా అధికారులు లాగేసుకున్నారని.. ఇప్పుడు బతకడం ఎలాగో అర్థం కావడం లేదన్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి..అప్పులు తెచ్చుకుని నడుపుకుంటున్న దుకాణాలు నేలమట్టం కావడంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
Read more: Harish Rao: తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. హరీష్ రావు అరెస్ట్.. మరోసారి హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Ford Employee Fired: చాక్లెట్ దొంగతనం చేశాడని ఉద్యోగి తొలగింపు..చివరికి పోయి ఉద్యోగి కాళ్లు పట్టుకున్న కంపెనీ!
Hyderabad, Telangana:Ford Employee Cookie Incident: అమెరికాలోని ఫోర్డ్ మోటార్ కంపెనీకి చెందిన ఓ ప్లాంట్‌లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేవలం రూ.160 విలువైన ఓ చాక్లెట్‌ను దొంగిలించాడనే ఆరోపణలతో 11 ఏళ్లుగా కంపెనీకి నమ్మకంగా పనిచేస్తున్న ఎలక్ట్రిషినయన్ ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. చాక్లెట్ దొంగతనం చేసినా ఉద్యోగం నుంచి తీసివేసే అంత పెద్ద సమస్య కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఆ రాత్రి ఏం జరిగింది?
అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. మధుమేహం ఉన్న ఎలక్ట్రిషియన్ కర్ట్ క్రోమ్ ఒక రోజు నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తుండగా, తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అతని రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయాయి. వెంటనే లంచ్ రూమ్‌లోని 'అరామార్క్' సెల్ఫ్-సర్వీస్ కియోస్క్ వద్దకు వెళ్లి 'గ్రాండ్మాస్ చాక్లెట్ చిప్ కుకీ' కొనుగోలు చేశాడు.
మొదటి మెషీన్లో లావాదేవీ విఫలమైనట్లు అనిపించడంతో, పక్కనే ఉన్న మరో మెషీన్లో కార్డ్ స్వైప్ చేసి డబ్బులు చెల్లించి, కుకీ తిని తిరిగి విధుల్లోకి చేరాడు. కానీ వారం తర్వాత, ఫోర్డ్ సెక్యూరిటీ విభాగం అతను కుకీని దొంగిలిస్తున్నట్లు సీసీటివి(CCTV) ఫుటేజ్ ఉందని ఆరోపిస్తూ, క్రోమ్‌ను తక్షణమే ప్లాంట్ నుండి సదరు ఎలక్ట్రిషియన్‌ను బయటకు పంపించడమే కాకుండా అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించారు.
కథను మలుపు తిప్పిన బ్యాంక్ స్టేట్మెంట్
తాను నిర్దోషినని క్రోమ్ ఎంత మొత్తుకున్నా కంపెనీ వినలేదు. దాంతో ఆయన తన బ్యాంక్ అకౌంట్ తనిఖీ చేయగా.. 1.95 డాలర్లు (చాక్లెట్ విలువ భారత కరెన్సీలో సుమారు రూ.160) కట్ అయినట్లు స్పష్టమైంది. క్రోమ్ నోటరైజ్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ను సమర్పించడంతో, ఫోర్డ్ యాజమాన్యం కియోస్క్ నిర్వహణ సంస్థ 'అరామార్క్'తో మాట్లాడి లావాదేవీ నిజమేనని నిర్ధారించుకుంది.
ఆ తర్వాత తమ తప్పు తెలుసుకున్న ఫోర్డ్, క్రోమ్‌ను తిరిగి ఉద్యోగంలోకి రమ్మని కోరింది. అంతేకాకుండా, ఆయన ఐదు వారాల పాటు ఖాళీగా ఉన్నందుకు గాను 28,000 డాలర్లు అనగా సుమారు రూ.23 లక్షలు బకాయి వేతనాన్ని చెల్లించింది.
కంపెనీ ఆఫర్‌ను తిరస్కరించిన ఉద్యోగి
నిర్దోషిత్వం నిరూపితమై, నష్టపరిహారం దక్కినప్పటికీ క్రోమ్ తిరిగి ఫోర్డ్ కంపెనీలో చేరడానికి నిరాకరించారు. తన సొంత ఊరైన విస్కాన్సిన్కు దగ్గర్లోనే గంటకు ఎక్కువ జీతం ఇచ్చే మరో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాన్ని ఆయన ఎంచుకున్నారు. కేవలం తన పాత పనిముట్లను తీసుకోవడానికి మాత్రమే లూయిస్విల్లే ప్లాంట్‌కు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు.
టెక్నాలజీ Vs మానవత్వం..
ప్లాంట్ లోని ఇతర కార్మికుల సమాచారం ప్రకారం.. ఈ అరామార్క్ కియోస్క్‌లలో ఇలాంటి ఆటోమేషన్ లోపాలు తరచూ జరుగుతుంటాయి. కేవలం కొన్ని డాలర్ల స్నాక్స్ విషయంలో గతంలోనూ కొందరు ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.
సెల్ఫ్-చెక్అవుట్ వివాదాలు తలెత్తినప్పుడు నేరుగా ఉద్యోగం నుండి తీసేయకుండా, విచారణ పూర్తయ్యే వరకు కేవలం 'సస్పెన్షన్' మాత్రమే విధించేలా ఫోర్డ్ తన విధానాన్ని మార్చుకుంది. ఈ కేసును తాము "వేరేలా హ్యాండిల్ చేసి ఉండాల్సింది" అని ఫోర్డ్ ప్రతినిధి బహిరంగంగా అంగీకరించారు.
ఈ ఉదంతం ఆధునిక కార్పొరేట్ ప్రపంచానికి ఒక హెచ్చరిక. ఆటోమేటెడ్ డిజిటల్ వ్యవస్థలను గుడ్డిగా నమ్మి, దశాబ్దాల కాలం పనిచేసిన ఉద్యోగుల పట్ల యాజమాన్యాలు కఠినంగా వ్యవహరిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఈ సంఘటన నిరూపించింది.
Also Read: టిక్‌టాక్‌లో లవర్స్ కిస్సింగ్ వీడియో..పబ్లిక్‌లో దారుణంగా కొరడా దెబ్బలతో శిక్ష!
Also Read: అమెరికన్ పాప్ సింగర్ పోటిగా విరాట్ కోహ్లీ..అందులో కిమ్ కర్దాషియన్‌నే మించిపోయాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. చేనేతలకు పాత వైభవం తెస్తాం..: MLA గంగుల
Hyderabad, Telangana:Karimnagar News: తెలంగాణలో చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు.. నేత కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ నగరంలోని కొత్తపల్లిలో ఘనంగా నిర్వహించిన చేనేత పారిశ్రామిక, సహకార సంఘం నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలక వర్గ సభ్యులను ఆయన ఘనంగా సన్మానించి.. ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ పాలనలోనే చేనేతకు మంచి రోజులు..
సమావేశంలో గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి.. వారిని అన్ని విధాలా ఆదుకున్న ఏకైక ప్రభుత్వం BRS మాత్రమేనని కొనియాడారు. గతంలో ఉపాధి లేక సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేత కార్మికులకు నూతన జీవం పోశామని ఈ సమయంలో గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు పండుగల సందర్భంగా.. పంపిణీ చేసే బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను స్థానిక నేత కార్మికులకే అప్పగించి.. కేసీఆర్ ప్రభుత్వం వారి ఇళ్లలో కాంతులు నింపిందని ఆయన తెలిపారు. దీని ద్వారా వేలాది మంది కార్మికులకు నిరంతర ఉపాధి లభించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కార్మికుల పొట్టకొడుతున్నారు..
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక నేత కార్మికులను కాదని.. వస్త్రాల తయారీ టెండర్లను ఇతర రాష్ట్రాల సంస్థలకు అప్పగించడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల స్థానిక చేనేత కార్మికుల కడుపు కొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డర్లు లేక.. ఉపాధి కరువై చేనేత కార్మికులు మళ్లీ రోడ్డున పడే దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే..
చేనేత కార్మికులు అధైర్యపడాల్సిన అవసరం లేదని.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తిరిగి BRS ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్లీ పాత వైభవాన్ని తీసుకొస్తామని.. చేనేత రంగానికి పూర్వవైభవం తెచ్చి .. కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Virat Kohli Kim Kardashian: అమెరికన్ పాప్ సింగర్ పోటిగా విరాట్ కోహ్లీ.. ఆ విషయంలో కిమ్ కర్దాషియన్‌ను మించిపోయాడు!
Hyderabad, Telangana:Virat Kohli Kim Kardashian Followers: భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా మరో అద్భుతమైన మైలురాయిని అందుకున్నారు. అమెరికన్ పాప్ సింగర్ కిమ్ కర్దాషియన్ ను అధిగమించి ఎక్స్ వేదిక(గతంలో ట్విట్టర్)పై అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తుల జాబితాలో 11వ స్థానానికి దూసుకెళ్లారు.
ఎక్స్ (X) ఖాతాలో ప్రస్తుతం విరాట్ కోహ్లీకి 69.9 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. అమెరికన్ పాప్ సింగర్ కిమ్ కర్దాషియన్ కు 68.9 మిలియన్ ఫాలోవర్లు మాత్రమే ఉండటం గమనార్హం. కేవలం హాలీవుడ్ ప్రముఖులకు మాత్రమే సాధ్యమయ్యే ఈ గ్లోబల్ డిజిటల్ రికార్డును భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ సులువుగా సాధించి నిరూపించాడు.
క్రికెట్ హద్దులు దాటిన గ్లోబల్ బ్రాండ్..
2009లో ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో చేరిన నాటి నుంచి విరాట్ కోహ్లీ తన ఆన్లైన్ ఉనికిని నిరంతరం పెంచుకుంటూనే ఉన్నారు. ఆయన కేవలం క్రికెట్ మాత్రమే పరిమితం కాకుండా వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తూ వస్తున్నారు. ఈ ఎక్స్ ఖాతాలో విరాట్ కోహ్లీ తన మ్యాచ్ విశేషాలు నెట్ ప్రాక్టీస్ వీడియోలతో పాటు వ్యక్తిగత ఫిట్నెస్, మెంటల్ వెల్నెస్ గురించి ఆరోగ్యం పై ఆయన పంచుకునే సూటి అభిప్రాయాలు ప్రేక్షకులను మరింతగా దగ్గర చేశాయి. అలాగే తన వ్యక్తిగత జీవితం అయినా తన భార్య నటి అనుష్క శర్మ, పిల్లల ఫోటోలను పంచుకోవడంతో ఫ్యామిలీ మెన్ గా విరాట్ కోహ్లీ మరింతగా ఫ్యాన్స్ దగ్గరయ్యారు.
గ్లోబల్ లీగ్ లో కోహ్లీ ఎక్స్ టాప్ అకౌంట్స్
ప్రస్తుతం ఎక్సెల్ ప్లాట్ ఫామ్ లో ఎలాన్ మస్క్ అత్యధికంగా ఫాలోవర్లలో అడ్రస్ స్థానంలో కొనసాగుతుండగా.. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ టాప్-11లోకి చేరుకున్నారు. తద్వారా క్రిస్టియానో రోనాల్డో, నెయ్‌మేర్ వంటి ప్రపంచ స్థాయి క్రీడా దిగ్గజాల సరసన నిలిచాడు.
ఎక్స్ వేదికగా ఓనర్ ఎలాన్ మస్క్ ఖాతాకు అత్యధికంగా 23 కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉండగా.. ఆ తర్వాత బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, క్రిస్టియానో రోనాల్డో, నరేంద్ర మోడీ, రిహానా తదితరులు వంటి వారు టాప్-10లో ఉన్నారు. ఆ తర్వాతి 11వ స్థానంలో విరాట్ కోహ్లీ 69.9 మిలియన్ ఫాలోవర్స్‌తో విరాట్ కోహ్లీ నిలిచాడు.
Also Read: 15 ఏళ్ల బాలికపై ఆస్ట్రేలియా క్రికెటర్ అత్యాచారం..జైలుకు వెళ్లనున్న ఆసీస్ బౌలర్!
Also Read: "నీ తొడల సైజ్ ఎంత?".. స్టార్ డైరెక్టర్ అడిగిన ప్రశ్నకు బిత్తరపోయిన మౌనీషా చౌదరి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Indonesia Couple Kiss: టిక్‌టాక్‌లో లవర్స్ కిస్సింగ్ వీడియో..పబ్లిక్‌లో దారుణంగా కొరడా దెబ్బలు కొట్టిన మతపెద్దలు!
Central Kalimantan:Indonesia Couple Kiss Video: ఇండోనేషియాలో ఓ నిర్ఘాంతపోయే సంఘటన చోటుచేసుకుంది. ఆ దేశానికి చెందిన ఓ పెళ్లి కాని జంట టిక్‌టాక్ యాప్‌లో ముద్దులు పెట్టుకునే వీడియో ఒకటి పోస్ట్ చేశారు. అయితే ఆ కారణంగా ఆ జంటకు 21 సార్లు కొరడా దెబ్బలను శిక్షగా విధించారు. ఈ విషయం ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆచే అనే ఇండోనేషియాలోని ఒక సంప్రదాయవాద ప్రావిన్స్. ఇక్కడ నివసిస్తున్న ఒక యువ జంట కొన్ని నెలల క్రితం టిక్‌టాక్ లైవ్ క్రియేట్ చేసి అందులో ముద్దు పెట్టుకున్నారు. ఫలితంగా వారు ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో.. గత వారంలో ఒక ఇస్లామిక్ షరియా కోర్టుచే బహిరంగంగా కొరడా దెబ్బలు తిన్నారు.
అయితే ఇండోనేషియా దేశంలో పెళ్లి కాకుండా జంట ముద్దు పెట్టుకోవడం పెద్ద నేరంగా పరగణిస్తారు. అయితే టిక్‌టాక్ లైవ్‌లో ఈ విధంగా ముద్దులు పెట్టుకున్న ఆ జంటకు.. నగర షరియా కోర్టు వారిద్దరికీ చెరో 21 సార్లు కొరడా దెబ్బలు కొట్టాలని ఆదేశించింది. ఆచే నగరంలోని బుస్తానుసలాదిన్ పార్కులో ఇలాంటి శిక్షల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై.. ముసుగులు ధరించిన బృందం ఆ ప్రేమ జంటను పబ్లిక్‌గా కొరడాలతో కొట్టింది. ఈ చర్యను కనీసం 100 మంది చూశారని స్థానికులు చెబుతున్నారు. అలా చూడటమే కాకుండా వీడియో కూడా తీసినట్లు తెలుస్తోంది.
టిక్‌టాక్ లైవ్‌లో ముద్దు పెట్టుకుంటూ పట్టుబడిన ఆ జంట వయసు వరుసగా 25, 22 సంవత్సరాలు. వారిద్దరూ ఈ ఏడాది ఫిబ్రవరిలో టిక్‌టాక్ లైవ్‌లో ముద్దు పెట్టుకున్నారు. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత షరియా అధికారులకు పలు ఫిర్యాదులు అందడంతో ఏప్రిల్‌లో వారిని అరెస్టు చేశారు. ఈ టిక్‌టాక్ లైవ్ వీడియో ఉన్న సెల్ ఫోన్, యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్‌ను కోర్టు సాక్ష్యంగా స్వాధీనం చేసుకుని, వాటిని ధ్వంసం చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
న్యాయస్థానం మొదట ఆ జంటకు చెరో 25 కొరడా దెబ్బల శిక్ష విధించింది. అయితే, ఆ నేరానికి గాను ఇద్దరూ అప్పటికే నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించినందున, ఆ 25 కొరడా దెబ్బలను 21కి తగ్గించింది.
ఇండోనేషియాలో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేసే ఏకైక ప్రావిన్స్ ఆచే అని అంటారు. వేర్పాటువాద యుద్ధాన్ని ముగించడానికి కుదిరిన 2006 శాంతి ఒప్పందంలో భాగంగా, ఆ దేశ లౌకిక కేంద్ర ప్రభుత్వం ఈ ప్రావిన్స్‌కు మతపరమైన చట్టాలను అమలు చేసే హక్కును మంజూరు చేసింది. పైన పేర్కొన్న ఆచే ప్రావిన్స్ జనాభాలో 1% ఉన్న ముస్లిమేతరులను కూడా చేర్చడానికి ఈ చట్టాన్ని 2015లో విస్తరించారు.
శిక్ష ఇంకా దేనికి ఉంటుంది?
పైన పేర్కొన్న చట్టం వివాహేతర సంబంధాలు, స్వలింగ సంపర్కం వంటి విషయాలను అనైతిక నేరాలుగా పరిగణిస్తుంది. అటువంటి నేరాలకు 100 కొరడా దెబ్బల వరకు శిక్ష విధించడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. 2025లో బహిరంగంగా కౌగిలించుకుని, ముద్దు పెట్టుకున్నందుకు ఇద్దరు పురుషులకు కొరడా దెబ్బలు వేశారు. అదేవిధంగా మద్యం సేవించేవారికి, జూదం ఆడేవారికి, శుక్రవారం ప్రార్థనలకు హాజరుకాని పురుషులకు ఈ కొరడా దెబ్బల శిక్ష విధిస్తారు.
మానవ హక్కుల ఉల్లంఘన..
ఇండోనేషియాకు చెందిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఆచే ప్రావిన్స్‌లో పిల్లలను బహిరంగంగా కొరడాతో కొట్టడాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా ఖండించింది. దీనిని క్రూరమైన, అమానుషమైన శిక్షగా అభివర్ణించింది. దీనిని రద్దు చేయడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ ఒప్పందానికి కూడా ఈ సంస్థ మద్దతు తెలిపింది.
Also Read: 15 ఏళ్ల బాలికపై ఆస్ట్రేలియా క్రికెటర్ అత్యాచారం..జైలుకు వెళ్లనున్న ఆసీస్ బౌలర్!
Also Read: "నీ తొడల సైజ్ ఎంత?".. స్టార్ డైరెక్టర్ అడిగిన ప్రశ్నకు బిత్తరపోయిన మౌనీషా చౌదరి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
