తెలుగు జర్నలిస్ట్ ఫోరం యూనియన్ కోసం అడహాక్ కమిటీ ఎన్నిక
Kadapa, Andhra Pradesh:కడప ప్రెస్ క్లబ్లో తెలుగు జర్నలిస్ట్ ఫోరం యూనియన్ ఏర్పాటు కోసం అడహాక్ కమిటీ ఎన్నిక జరిగింది. జిల్లా కన్వీనర్‌గా ఉప్పు శ్రీకాంత్, కో-కన్వీనర్‌గా కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా విభాగానికి బండారు కిషోర్ కుమార్ కన్వీనర్‌గా, బి.రామచంద్ర కో-కన్వీనర్‌గా నియమితులయ్యారు. సుధీర్ కుమార్ సలహాదారుగా ఎంపికయ్యారు. యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు త్వరలో ప్రారంభం. జర్నలిస్టుల పిల్లలకు ఫీజులలో 50% రాయితీ కోసం కృషి చేస్తామని శ్రీకాంత్ తెలిపారు.
దివంగత నేత వైయస్ ఆర్ ప్రజల గుండెల్లో చిరస్దాయిగా నిలిచారు : అరకు వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు
Chinthakommadinne, Andhra Pradesh:కడప అరకు వైసిపి ఎంపి తనూజా రాణి* దివంగత నేత వైయస్ ఆర్ ప్రజల గుండెల్లో చిరస్దాయిగా నిలిచారు ఆయన తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ , 108 ప్రజలకు ఎంతగానో దోహదపడ్డాయి ఆయనచేసిన మంచి మనం మరచిపోకూడదు వైయస్ ఆర్ భౌతికంగా లేకపోయినా ఆంద్రప్రదేశ్ ప్రజల గుండంల్లో ఎప్పుడూ చిరస్మరణీయులే.
ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ వేడుకలు ఘన నివాళి అర్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్ విజయమ్మ
Chinthakommadinne, Andhra Pradesh:కడపలోని ఇడుపులపాయలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, విజయమ్మ, భారతిరెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డితో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు దివంగత మాజీ సీఎం రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, రమేశ్ యాదవ్, ఎంపీ తనూజారాణి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు.
