బండ్లగుడా జాగిర్ నూతన మేయర్ మొదటి సమావేశం
Hyderabad, Telangana:రంగారెడ్డి జిల్లా.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ నూతన మేయర్ లతా ప్రేమ్ గౌడ్ అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు... ఈ సమావేశంలో కార్పొరేషన్ అభివృద్ధి పనుల కోసం రూ 51.11 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారనీ మేయర్ అన్నారు... ముఖ్యంగా కార్పొరేషన్ లో నీటి ఎద్దడి సమస్య పరిష్కారం కోసం హిమాయత్ సాగర్ ఫిల్టర్ బెడ్లను ఏర్పాటుతో మంచినీటి సమస్యతో పాటు మెరుగైన మాలిక వసతులకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు..हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Telangana SIR: సర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన.. రెండు రోజులు ప్రత్యేక ప్రచారం
Baddipadaga, Telangana:Telangana SIR: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ ప్రక్రియపై రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు సాగిన సర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ, ఫిర్యాదులు తదితర అంశాలపై ప్రకటన విడుదల చేసింది. సర్‌కు సంబంధించి ప్రత్యేక ప్రచారం కల్పిస్తామని ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను 17.08.2026న ఆయా ఈఆర్ఓ కార్యాలయాల్లో ప్రచురించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ జాబితాతో పాటు ఏఎస్‌డీడీ ఓటర్ల వివరాలను సీఈఓ తెలంగాణ వెబ్సైట్ (https://ceotelangana.nic.in)లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
ముఖ్య వివరాలు, గడువులు
క్లెయిమ్‌లు, అభ్యంతరాల గడువు: ఆగస్టు 17 నుంచి ఈనెల 16వ తేదీ వరకు
నోటీసుల జారీ, పరిష్కారం: 17.08.2026 నుండి 15.10.2026 వరకు
ప్రత్యేక ప్రచార (స్పెషల్ క్యాంపెయిన్) తేదీలు
- మొదటి విడత: ఈనెల 5 నుంచి 6వ తేదీ వరకు
- రెండో విడత: ఈనెల 12వ తేదీ నుంచి 13 వరకు
ప్రస్తుత పురోగతి
మొత్తం 92,88,112 నోటీసులు రూపొందించగా 31,74,952 నోటీసులు అందాయి. 1,94,737 నోటీసులపై విచారణ పూర్తయింది. మిగిలిన నోటీసులను 119 మంది ఈఆర్ఓలు, 1,973 మంది ఏఈఆర్ఓల ద్వారా గడువులోగా విచారించనున్నారు.
మొత్తం క్లెయిమ్‌లు, అభ్యంతరాలు: 9,07,292
- ఫారం-6 (కొత్త ఓటరు): 3,94,517
- ఫారం-6ఏ (ప్రవాస భారతీయులు): 6,346
- ఫారం-7 (పేర్ల తొలగింపు): 48,752
- ఫారం-8 (సవరణలు/మార్పులు): 4,57,677
ప్రత్యేక ప్రచార దినాలలో బీఎల్ఓలు, బీఎల్ఏలు పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలను లేదా ఈఆర్ఓ కార్యాలయాలను సందర్శించి తమ పేర్లను సరిచూసుకోవాలని, ఫారాలు 6, 7, 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ముఖ్య ఎన్నికల అధికారి కోరారు.
MPLADS: ఎంపీ లాడ్స్ నిధులపై దుష్ప్రచారం.. నిధులన్నీ ఉపయోగించాం: బండి సంజయ్
Karimnagar, Telangana:MPLADS Usage: 'ఎంపీ లాడ్స్ నిధులన్నీ వినియోగించాం. నా పరిధిలో రూ.17.50 కోట్ల నిధులు వస్తే రూ.16.47 కోట్లు వినియోగించాం. మొత్తం నిధుల్లో 94 శాతం పనులు పురోగతిలో ఉన్నాయి' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. 'అసలే ఎంపీ నిధులు సరిపోక ఇబ్బంది పడుతున్నాం. ఎంపీ లాడ్స్ నిధులు పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. అయినా నిధులే వినియోగించడం లేదని దుష్ప్రచారం సరికాదు' అని వివరించారు.
ఎంపీ లాడ్స్ నిధులు వినియోగించలేదని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఎంపీల గౌరవాన్ని తగ్గించేందుకు ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ లాడ్స్ నిధులు సరిపోక సీఎస్సార్ నిధులను సేకరిస్తూ ప్రజల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ నివేదికను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కేటాయిస్తున్న ఎంపీ లాడ్స్ నిధులను వినియోగించుకోవడంలో పార్లమెంట్ సభ్యులు పూర్తిగా వెనుకబడిపోతున్నారంటూ ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ విడుదల చేసిన నివేదిక సత్య దూరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.
ఎంపీ లాడ్స్ కింద పంపిన ప్రతిపాదనలకు సంబంధించి పనుల పురోగతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఎంపీలపై అభాండాలు వేయడం సరికాదని బండి సంజయ్ తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం విషయానికొస్తే ఎంపీ లాడ్స్ కింద రూ.17.50 కోట్లు కేటాయించగా.. దీనిలో ఇప్పటికే రూ.16.47 కోట్లు వినియోగించామని వివరించారు. మొత్తంగా కేంద్రం కేటాయించిన రూ.17.5 కోట్లలో 94.1 శాతం మేరకు అంటే రూ.16.47 కోట్ల నిధులకు సంబంధించిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు.
కేంద్రం యేటా కేటాయిస్తున్న ఎంపీ లాడ్స్ నిధులు సరిపోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ సమయంలో ఎంపీ లాడ్స్ నిధులే ఖర్చు చేయడం లేదంటూ ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ ప్రచారం చేయడం అన్యాయమని తప్పుబట్టారు. ఎంపీ లాడ్స్ నిధుల కేటాయింపు, ఎంపీల ప్రతిపాదనలు, జిల్లా కలెక్టర్ల ఆమోదం, వివిధ శాఖల అధికారుల కార్యాచరణ, అధికారుల అమలు, పనుల పూర్తి వరకు అనేక దశలు ఉన్నాయని వెల్లడించారు. ఎంపీ లాడ్స్ నిధులనే వినియోగించుకోవడం లేదని ఆరోపణలు చేయడమంటే బట్ట కాల్చి మీద వేయడమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.
'ఈ ఆర్థిక సంవత్సరం ముగింపుకు మరో 7 నెలల సమయం ఉన్నప్పటికీ నా వద్ద ఎంపీ లాడ్స్ నిధులే మిగలలేదు. ఆ నిధులకు సంబంధించిన ప్రతిపాదనలన్నీ ఎప్పుడో సంబంధిత జిల్లాల కలెక్టర్లకు పంపాం. స్థానిక సమస్యల పరిష్కారం కోసం అవసరమైన నిధుల కోసం సీఎస్సార్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండ్స్ ను సేకరిస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ వివరించారు.
Govt Employees: రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా ఉద్యోగుల భారీ ఆందోళన.. దద్దరిల్లిన సచివాలయం
Baddipadaga, Telangana:Govt Employees DA Hike: సుదీర్ఘ కాలంగా తమ సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు భత్యం, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర డిమాండ్లు పరిష్కరించని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం రోజు తమ ఆందోళనలను తీవ్ర రూపం చేశారు. తమ నిరసన కార్యక్రమాలతో హైదరాబాద్‌ను దద్దరిల్లేలా చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్‌లోని సచివాలయం, కలెక్టరేట్, భీమా భవన్, గగన్ విహార్ కాంప్లెక్స్ తదిదతర ప్రాంతాల్లో మహాధర్నా చేపట్టారు. సెక్రటేరియేట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బాహుబలి గేట్ వద్ద మహా గర్జన చేశారు. రెండో వేతన సవరణ సంఘం, డీఏ, పెండింగ్ బిల్లులు, ఈహెచ్ఎస్, ఓపీఎస్, డీపీసీ వంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎస్‌ను రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల మహా గర్జన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెక్రటేరీయేట్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల భారీగా మోహరించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాతన పింఛన్ పథకం (ఓపీఎస్) అమలు చేయాలని టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్, ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని గగన్ విహార్, భీమా భవన్, హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్‌ల వద్ద పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్, ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10వ తేదీన చేపట్టనున్న చలో హైదరాబాద్‌కు ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని కానీ తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిరసనలు చేపడుతున్నట్లు వివరించారు.
తమ సమస్యలపై రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని వెంటనే పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని.. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. సీపీస్ రద్దు ఓపీఎస్ పునరుద్ధరణ, తక్షణ ఆరోగ్య సేవల సాధన చేయాలని విజ్ఞప్తి చేశారు. తాము రోడ్డెక్కే పరిస్థితి రాకుండా రేవంత్ రెడ్డి చొరవ చూపాలని.. లేకపోతే తమ ఉద్యమాన్ని తీవ్ర రూపం చేస్తామని హెచ్చరించారు.
Sajjala vs Vijaya Sai: విజయసాయి రెడ్డిని సజ్జల కొట్టింది వాస్తవమే! ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటన
Amancherla, Andhra Pradesh:YSRCP Attack: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా గుర్తింపు పొందిన విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి మధ్య పెద్ద వివాదమే నడిచిందని.. ఈ క్రమంలో విజయసాయిపై సజ్జల దాడి చేశాడనే ప్రచారం తీవ్ర వివాదం రేపుతోంది. ఈ వివాదంపై టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. విజయసాయిని సజ్జల కొట్టింది నిజమేనని సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు తెలిపారు.
'విజయసాయి రెడ్డిని సజ్జల రామకృష్ణా రెడ్డిని కొట్టింది వాస్తవమే. సజ్జల, విజయసాయి రెడ్డి మధ్య అంతర్గత వ్యవహారం నడుస్తోంది' అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. విజయసాయి రెడ్డి తన గురించి తప్పుగా మాట్లాడారని.. తనకేమి అతడి మీద ప్రేమ లేదని స్పష్టం చేశారు. విజయసాయి రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టిన మాట వాస్తవం అని పునరుద్ఘాటించారు. 2022లో మంగళగిరిలో జరిగిన ప్లీనరీ రెస్ట్ రూమ్‌లో ఈ ఘటన జరిగిందని కీలక ప్రకటన చేశారు.
'వైఎస్సార్సీపీ ప్లీనరీలో వేదిక మీద ఎవరితో మాట్లాడించాలి అనే విషయంపై గొడవ వచ్చింది. ఉత్తరాంధ్ర నుంచి కొన్ని పేర్లు విజయసాయి రెడ్డి సూచిస్తే చొక్కా పట్టుకుని సజ్జల కొట్టారు' అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో సంచలన విషయం తెలిపారు. 'మరో అవమానం కూడా జరిగింది అది నాకు తెలుసు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపాడుకు ఎంపీగా ఉన్న సమయంలో విజయసాయి రెడ్డి వచ్చారు. అప్పట్లో కాకుపల్లి వద్ద 100 కార్లు పెట్టి గౌరవంగా స్వాగతం పలికి మాలలు వేశా. వారం నేను అమరావతికి వెళ్లినప్పుడు సజ్జల నన్ను పిలిచి విజయసాయి రెడ్డి గురించి నీచంగా మాట్లాడారు' అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు.
'ఎందుకు అన్ని కార్లు పెట్టావని అడిగారు. నేను సరదాగా తీసుకున్నాను. అత్యంత ఖరీదైన తప్పు (కాస్ట్లీస్ట్ మిస్టీక్) చేశావ్ అని నన్ను సజ్జల అన్నాడు' అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. సజ్జలకు సంబంధించిన మరో విషయాన్ని బయటపెట్టారు. 'అమరావతి రైతులు నెల్లూరుకి వచ్చినప్పుడు వర్షంలో ఇరుక్కున్నారు. నేను దారిలో వెళ్తూ వారిని కలిసి సామాన్యుడిగా మాట్లాడా. అమరావతి కోసం నేను రాలేదు. వరదల్లో చిక్కుకున్నారు. మీకు మెరుగైన వసతి చూపిస్తాం రూరల్ దాటే వరకు ఏమి అవసరం ఉన్నా మాట్లాడమని చెప్పా' అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
'ఆ రోజు సాయంత్రం నాకు సజ్జల కాల్ చేసి మాట్లాడారు. ఎందుకు వెళ్లావు అని అడిగారు. రెండోసారి నన్ను కాస్ట్లీస్ట్ మిస్టీక్ చేశావ్ అన్నారు' అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు. వరుసగా ఇలా చెప్పి సజ్జలకు తాను కౌంటర్ ఇచ్చానని తెలిపారు. 'ఇలా మాట్లాడి నువ్వు కాస్ట్లీస్ట్ మిస్టీక్ చేయవద్దు అని సజ్జలకి సమాధానం ఇచ్చా' అని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. గత సాధారణ ఎన్నికలకు ముందు వరకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్సార్సీపీలో కొనసాగిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీలో జరిగిన ఉదంతాలు చెప్పడంతో ఇప్పుడు ఆ పార్టీ సమాధానం ఇచ్చుకోలేక ఇరుకున పడింది.
గ్రామీణ బ్యాంకుల్లో 13,706 ఉద్యోగాలు.. నెలకు మంచి జీతం! నేటి నుంచే దరఖాస్తులు ప్రారంభం!
Hyderabad, Telangana:IBPS RRB Recruitment 2026: చాలా కాలంగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక గొప్ప అవకాశం. గ్రామీణ బ్యాంకుల్లో భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది, దీనికి అప్లికేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. మొత్తం 13,706 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొన్ని పోస్టులకు ఒకే పరీక్ష ఉంటుంది. కనీస అర్హతగా డిగ్రీ ఉండాలి. కొన్ని పోస్టులకు పని అనుభవం కూడా అవసరం. ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.. మొత్తం 8,183 ఆఫీస్ అసిస్టెంట్, 4,256 ఆఫీసర్ స్కేల్-1, 1,472 స్కేల్-2, 250 స్కేల్-3 ఉద్యోగాల కోసం దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించారు.
వయస్సు..
వయోపరిమితి విషయానికి వస్తే: ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-1 కి 18 నుండి 30 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు 21 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి..SC, ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్లు, PwD అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.
అర్హతలు..
అర్హతల విషయానికి వస్తే, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు స్థానిక భాషపై పట్టు, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు డిగ్రీతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పట్టా ఉండాలి. వీటితో పాటు స్థానిక భాష, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ మేనేజర్) పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్, అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ విభాగాల్లో పట్టా ఉన్నవారు అర్హులు. ఆఫీసర్ స్కేల్-3 (స్పెషలిస్ట్ ఆఫీసర్) పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీతో పాటు కనీసం 50 శాతం మార్కులు ఉండాలి, సీఏ, ట్రెజరీ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్ లేదా అగ్రికల్చర్ ఆఫీసర్‌గా పని చేసిన వారు అర్హులు.
దరఖాస్తు విధానం:
https://www.ibps.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, 'RRB' ఎంపిక చేసి, సంబంధిత పోస్టుపై క్లిక్ చేయండి. 'Register Now' ద్వారా లాగిన్ అయ్యి మీ వ్యక్తిగత మరియు విద్యా వివరాలను నమోదు చేయండి. ఆ తర్వాత RRBలో మీ స్టేట్‌ను ఎంపిక చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి. నిర్ణీత రుసుము చెల్లించి, వివరాలను ఒకసారి సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ చేసి అప్లికేషన్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. SC, ST, PwD రూ.175, ఇతర క్యాటగిరీ అభ్యర్థులు రూ.850 రూపాయల ఫీజు చెల్లించాలి.
పరీక్షా విధానం: IBPS ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు మాత్రమే ఉంటాయి,. ఇంటర్వ్యూ ఉండదు. అయితే మిగిలిన పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలతో పాటు ఇంటర్వ్యూ కూడా నిర్వహించబడతాయి.
Also Read: SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. మీ రోల్ నంబర్ షార్ట్‌లిస్ట్‌లో ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Also Read: బ్యాంక్ ఉద్యోగాల జాతర.. డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్, రూ.48,000 జీతంతో ఎస్బీఐ బ్యాంక్ జాబ్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Messi Retirement: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గుడ్‌బై.. అర్జెంటీనా జట్టు నుంచి స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్!
Hyderabad, Telangana:Lionel Messi Retirement: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే సార్వకాలిక గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా పరిగణించబడే అర్జెంటీనా సాకర్ దిగ్గజం, బిలియనీర్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుండి తన రిటైర్మెంట్ను ప్రకటించారు. ప్రస్తుతం ఇంటర్ మయామి ఫార్వర్డ్‌గా కొనసాగుతున్న మెస్సీ, అర్జెంటీనా జాతీయ జట్టు తరపున అంతర్జాతీయంగా పోటీ చేయడం నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం తెలిపారు. ఈ నిర్ణయం తనను "లోతుగా బాధిస్తోంది" అని, కానీ జాతీయ జట్టు నుండి వైదొలగడానికి "సమయం ఆసన్నమైంది" అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
అభిమానులకు ధన్యవాదాలు
జాతీయ జట్టుకు వీడ్కోలు పలుకుతూ మెస్సీ అభిమానులను ఉద్దేశించి భావోద్వేగ సందేశం ఇచ్చారు. అభిమానులకు ఆనందాన్ని అందించడానికి, ఫుట్‌బాల్ ద్వారా అర్జెంటీనా వాసులుగా గర్వపడేలా చేయడానికి తాను ఎల్లప్పుడూ జాతీయ జెర్సీ కోసం పోరాడానని చెప్పారు. "నేను ఎల్లప్పుడూ నా సర్వస్వం ఇచ్చానని మీకు ప్రమాణం చేస్తున్నాను. నా దగ్గర ఇవ్వడానికి ఇంకేమీ మిగల్లేదు. అంతేకాకుండా తమ స్థానాలకు అర్హులైన ఎంతో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు వస్తున్నారు" అని ఆయన వెల్లడించారు. ఇన్నేళ్లుగా మద్దతుగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తండ్రి మరణం, భవిష్యత్తుపై ఆలోచన..
తన తండ్రి జార్జ్ మెస్సీ మరణించిన కొద్దికాలానికే మెస్సీ ఈ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారు. తండ్రి మరణం బార్సిలోనా, పారిస్ సెయింట్-జెర్మైన్ మాజీ ఆటగాడైన ఆయనను తన భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచించేలా చేసింది.
అంతర్జాతీయ విజయాలు, 2026 ప్రపంచ కప్
క్లబ్ స్థాయిలో దాదాపు అన్నింటినీ గెలిచినప్పటికీ, 2022 వరకు మెస్సీకి ప్రపంచ కప్ ట్రోఫీ చేజారిపోయే ప్రమాదంలో కనిపించింది. అయితే ఖతార్‌లో ఫ్రాన్స్‌పై జరిగిన ఉత్కంఠభరిత పెనాల్టీ షూటౌట్ విజయంతో ఆయన ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడారు. అలాగే 2021, 2024లలో వరుసగా కోపా అమెరికా టైటిళ్లను గెలవడంలోనూ అర్జెంటీనాకు సహాయపడ్డారు.
అమెరికా, కెనడా, మెక్సికోలలో జరిగిన 2026 ప్రపంచ కప్ ఎడిషన్‌లో అర్జెంటీనాను ఫైనల్ వరకు నడిపించి, మెస్సీ తన ప్రపంచ కప్ ట్రోఫీల సంఖ్యను దాదాపు రెట్టింపు చేశారు. తుది పోరులో స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓడిపోయి అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచింది. ఈ చారిత్రక ప్రస్థానం తర్వాత మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి అధికారికంగా తప్పుకున్నారు.
Also Read: ఆర్సీబీ టీమ్‌లోకి రోహిత్ శర్మ? రెడ్ జెర్సీలో హిట్‌మ్యాన్ ఫొటో వైరల్..ఏం జరుగుతోంది?
Also Read: మరోసారి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..57 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్..సెంచరీ జస్ట్ మిస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vaibhav Sooryavanshi: మరోసారి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..57 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్..సెంచరీ జస్ట్ మిస్!
Hyderabad, Telangana:Vaibhav Sooryavanshi Duleep Trophy: బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ సెమీ-ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ తరపున బరిలోకి దిగిన 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన దూకుడు కనబరిచిన ఈ టీనేజ్ బ్యాటర్, కేవలం 42 బంతుల్లోనే సిక్సర్‌తో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తద్వారా 15 ఏళ్ల 175 రోజుల వయసులోనే దులీప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.
అక్కడితో ఆగకుండా దూకుడుగా ఆడుతూ 81 బంతుల్లో 92 పరుగులు సాధించి, కేవలం 8 పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో 1969లో లక్ష్మణ్ సింగ్ (16 ఏళ్ల 23 రోజులు) నెలకొల్పిన 57 ఏళ్ల నాటి రికార్డును సూర్యవంశీ అధిగమించాడు. అంతేకాకుండా 2005లో 16 ఏళ్ల 307 రోజుల వయసులో ఈ ఘనత సాధించిన పియూష్ చావ్లా రికార్డును సైతం బద్దలు కొట్టాడు.
దులీప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కులు..
వైభవ్ సూర్యవంశీ - 15 ఏళ్లు, 175 రోజులు
లక్ష్మణ్ సింగ్ - 16 ఏళ్లు, 23 రోజులు
పియూష్ చావ్లా - 16 ఏళ్లు, 307 రోజులు
బ్యాటింగ్‌తోనే కాకుండా మైదానంలోనూ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తొలి రోజు ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కుడి మణికట్టు గాయంతో మైదానం వీడటంతో, భోజన విరామానికి ముందు, తర్వాత కలిపి సుమారు గంటపాటు సూర్యవంశీ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.
అలాగే, ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ప్రత్యర్థి ఓపెనర్ ఆర్యన్ జుయల్ (46) క్యాచ్-బిహైండ్పై ఈస్ట్ జోన్ చేసిన విఫల అప్పీల్‌ను DRS ద్వారా రివ్యూ చేయాల్సిందిగా సమర్థించి, కీలక వికెట్ దక్కడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అంతకుముందు ముఖేష్ కుమార్, అభిజిత్ సర్కార్ చెరో 3 వికెట్లు తీయడంతో సెంట్రల్ జోన్ 266 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
Also Read: శ్రీలంక జట్టు అద్భుత పోరాటం..భారత్‌తో రెండో టెస్టు డ్రా..సిరీస్ టీమ్ఇండియా కైవసం!
Also Read: ఆర్సీబీ టీమ్‌లోకి రోహిత్ శర్మ? రెడ్ జెర్సీలో హిట్‌మ్యాన్ ఫొటో వైరల్..ఏం జరుగుతోంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Botsa Satyanarayana KA Paul: బొత్స సత్యనారాయణపై కేఏ పాల్ ఆగ్రహం..బొత్సకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వీడియో వైరల్!
Vijayawada, Andhra Pradesh:Irumudi Collection: రూ.200 కోట్ల దిశగా దూసుకెళ్తోన్న 'ఇరుముడి'..బాక్సాఫీసు వద్ద రవితేజ సినిమా సరికొత్త రికార్డు!
Hyderabad, Telangana:Irumudi 200 Crore Collection: సరైన కంటెంట్ పడితే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని 'ఇరుముడి' చిత్రం మరోసారి రుజువు చేసింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. చిత్రంలోని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో థియేటర్ల వద్ద అభిమానుల తాకిడి కొనసాగుతోంది. విడుదలైన రెండు వారాలు కావస్తున్నా సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లు అనే తేడా లేకుండా అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్..
గతంలో రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'మాస్ జాతర', 'ఈగల్' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. దీంతో కథల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించిన రవితేజ, పూర్తి కసితో 'ఇరుముడి' సినిమాను ఎంచుకున్నారు. ఆయన నమ్మకాన్ని నిజం చేస్తూ, ఈ చిత్రం రవితేజ సినీ ప్రస్థానంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన బిగ్గెస్ట్ హిట్‌గా, అలాగే అతి తక్కువ సమయంలో అత్యంత వేగంగా కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు
ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్' పరాజయం పాలవడంతో, ఆ ప్రభావం 'ఇరుముడి'కి బాగా కలిసొచ్చింది. ఇతర సినిమాల వైఫల్యంతో ఈ చిత్రానికి థియేటర్లలో స్క్రీన్స్, వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్లకుపైగా రాబట్టగా, కేవలం నైజాం ఏరియా నుంచే రూ.50 కోట్ల వరకు కలెక్షన్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే జోరు కొనసాగితే అతి త్వరలోనే ఈ చిత్రం రూ.200 కోట్ల మైలురాయిని చేరుకోవడం లాంఛనమేనని స్పష్టమవుతోంది.
టికెట్ సేల్స్‌లో సరికొత్త సంచలనం..
ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లైన బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్స్‌లలో కలిపి ఇప్పటికే 55 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం ఈ సినిమా ప్రభంజనానికి అద్దం పడుతోంది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్లో రవితేజ తోటి స్వాములతో కలిసి నల్లటి వస్త్రాలు, మెడలో మాలలు ధరించి, ఒంటికాలిపై నిలబడి భక్తిపారవశ్యంతో కనిపిస్తున్న తీరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. లాంగ్ రన్లో ఈ చిత్రం ఇంకెన్ని కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తుందోనని చిత్రసీమలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
Also Read: 'ఇరుముడి'లో 'మల్లెపూల పల్లకి' సెన్సేషన్.. సింగర్ డప్పు శ్రీనుకు భారీ రెమ్యునరేషన్..
Also Read: 'దశావతారం' థీమ్‌తో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10..సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంఛ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kavitha Emotional: ఇందూరు గడ్డపై కవిత భావోద్వేగం.. కన్నీళ్లతో నిజమాబాద్ ప్రజలకు కీలక విజ్ఞప్తి
Nizamabad, Telangana:Kavitha Tears: అసలు తాను ఏం తప్పు చేశానని బీఆర్ఎస్ పార్టీలో నుంచి వెళ్లగొట్టారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత నిలదీశారు. ఎలాంటి కారణంగా లేకుండా తనను తీహార్ జైల్లో పెట్టారని చెబుతూ ఆమె భావోద్వేగానికి గురయి కొన్ని నిమిషాలు రోదించారు. సుప్రీంకోర్టు జడ్జి కూడా తన నిజాయితీని గుర్తించి.. తనపై కేసు పెట్టిన సీబీఐ అధికారినే జైల్లో పెట్టాలని చెప్పారని గుర్తు చేశారు. తన సొంత ప్రజలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తాను పిరికిదాన్ని కాదని ప్రకటించారు.
నిజామాబాద్ కోడలిగా ఇక్కడి ప్రజలకు తానేంటో తెలుసని మాజీ ఎమ్మెల్ఈ కవిత తెలిపారు. 'పార్టీ పెట్టిన తర్వాత సొంత గడ్డకు రావడం ఆనందంగా ఉంది. స్వరాష్ట్రం వచ్చినా మన బతుకులు మారలేదు. సంపాదన పెరిగిందా? కాళేశ్వరం నుంచి ఒక్క ఎకరంలో అయినా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పారిందా..?' అని ప్రశ్నించారు. 'నేను కూడా ఆ పార్టీలోనే ఉన్నా. ప్రయత్నం చేశాం. కానీ సాధ్యం కాలేదు. కొత్త తాళం చెవి కావాలి. కొత్త శక్తి కావాలి' అని తెలిపారు. 'మిమ్మల్ని (ప్రజలు) చూసే ముందుకు వెళ్తున్నా. మీరంతా నాకు ధైర్యం ఇవ్వాలి' అని నిజామాబాద్ ప్రజలను కవిత కోరారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థాపించిన అనంతరం తొలిసారి కవిత తొలిసారి నిజామాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. నగరంలోని ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్లో బహిరంగ సభలో కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తామని కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా ‘పాంచజన్యం’ పేరుతో ఐదు పథకాలను వివరించారు.
Nurse Sirisha Case: నర్సు శిరీష కేసులో కీలక పరిణామం.. నిందితుడు సైనా ఉల్లా అరెస్ట్!
Hyderabad, Telangana:Thukkuguda Nurse Case: ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు శిరీషపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా అతి దారుణంగా దాడి చేసి ఆమెను కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం రేపింది. శాంతిభద్రతలు హైదరాబాద్‌లో లోపించాయని చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనమని చెప్పవచ్చు. నర్సు శిరీశపై అత్యాచారం, హతమార్చిన సంఘటనపై తీవ్ర రాజకీయ వివాదం రాజుకుంది. ప్రజలంతా నిందితుడిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తుండగా.. ఎట్టకేలకు శిరీషను హతమార్చిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నర్సు శిరీష అత్యాచారం, హత్య కేసులో నిందితుడు సైనా ఉల్లా అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు శంషాబాద్ డీసీపీ రాజేష్ వెల్లడించారు. 'తుక్కుగూడలోని ప్రైమ్‌కేర్ ఆస్పత్రి సమీపంలో నర్సు శిరీష దారుణ హత్య చేశాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా తాము స్థలానికి చేరుకున్న దర్యాప్తు చేశాం' అని తెలిపారు. 'హత్య కేసు నమోదు చేసి తర్వాత నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజీల పరిశీలనకు 5 ప్రత్యేక టీమ్స్‌ను నియమించాం. దర్యాప్తులో నలుగురు, ఐదుగురు అనుమానితులను గుర్తించాం' అని శంషాబాద్ డీసీపీ రాజేష్ వివరించారు.
'విచారణలో సైనా ఉల్లాపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నాం. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు. శిరీష గదికి సమీపంలోని మెకానిక్ షాపులో సైనా ఉల్లా పనిచేస్తున్నాడు. షాప్ వెనుక కిటికీ నుంచి శిరీషను గమనించేవాడు. అలా కన్నేసి సెలవు రోజు శిరీషపై దాడి చేసి అత్యాచారంతోపాటు హత్య చేశాడు' అని శంషాబాద్ డీసీపీ రాజేష్ వెల్లడించారు. నిందితుడి ఫోన్లో ఇతర నర్సుల ఫొటోలు కూడా పోలీసులు గుర్తించారు. సైనా ఉల్లా అడల్ట్ కంటెంట్‌కు అలవాటు పడి.. లైంగిక వాంఛ తీర్చుకునేందుకు శిరీషపై దాడికి పాల్పడ్డాడు.
'శిరీషతో పాటు గదిలో ఉండే కేరళకు చెందిన మరో నర్సు ఓనం పండుగకు స్వగ్రామానికి వెళ్లడంతో ఇదే అదనుగా భావించి శిరీష గదిలోకి అతడు చొరబడ్డాడు. శిరీషపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం హత్య చేశాడు' అని శంషాబాద్ డీసీపీ రాజేష్ వివరించారు. శిరీష హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా స్పీడ్ ట్రయల్ జరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశ ప్రారంభం..కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు!
Yeguva Cherlo Palli, Andhra Pradesh:Veligonda Project Inauguration News: ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల మూడు దశాబ్దాల చిరకాల వాంఛ అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద నల్లమల సొరంగాల నుంచి పరవళ్లు తొక్కుతూ వచ్చిన కృష్ణా జలాలకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, చీర సమర్పించి జలహారతి ఇచ్చారు. కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.Weather Report: ఏపీ, తెలంగాణ ప్రజలకు చల్లని కబురు..బంగాళాఖాతంలో అల్పపీడనం..భారీ వర్షాలకు హెచ్చరిక!
Vijayawada, Andhra Pradesh:Rain Forecast Weather Report: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్ష సూచనను వాతావరణ కేంద్రం తెలిపింది. గ్యాంగెటిక్ పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన సుస్పష్టమైన అల్పపీడనం 31 ఆగస్టు 2026 ఉదయం 08:30 గంటల సమయానికి అదే ప్రాంతంలో కొనసాగుతోందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి దాదాపు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది.
ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా - గంగా పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి అమృత్సర్, పాటియాలా, నజీబాబాద్, బస్తీ, అల్పపీడన కేంద్రం మీదుగా తూర్పు-మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది.
తెలంగాణలో రాగల 3 రోజుల వాతావరణం
ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన జారీ చేసింది. వర్షాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని తెలిపింది.
ఏపీలో వర్షాలు, బలమైన గాలుల తీవ్రత..
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా, రానున్న కొద్ది రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని అమరావతి వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.
ప్రజలకు హెచ్చరికలు
వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో రోడ్లపై ఉండే భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ మరియు విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని స్పష్టం చేశారు. పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
Also Read: ఎట్టకేలకు వెలిగొండ ప్రాజెక్ట్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభం..30 ఏళ్ల నాటి కల సాకారం..
Also Read: బొత్స సత్యనారాయణ Vs విజయసాయిరెడ్డి..బొత్సకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేఏ పాల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kakinada Elections: కాకరేపుతున్న కాకినాడ ఎన్నికలు.. ఈసారి జరుగుతాయా లేదా అనేది ఉత్కంఠ
Kakinada, Andhra Pradesh:AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. వచ్చే నెల లేదంటే అక్టోబర్‌లో స్థానిక సంస్థలతోపాటు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక నిర్వహణపై మాత్రం అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిసారి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠతో ఉంటాయి. ఈసారి జరుగుతాయా? సాధారణ ఎన్నికలతోపాటు జరుగుతాయనేది చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం కాకినాడలో 3 లక్షల 12 వేలు జనాభా ఉన్నారు. రస్తుత జనాభా నాలుగు లక్షలు దాటిందని అంచనా. 2017లో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు అప్పటి టీడీపీ హయాంలో జరిగాయి. ఆ తర్వాత 2022 ఆగస్టుతో మేయర్ పదవీకాలం ముగిసింది. అప్పటినుంచి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించలేదు. ప్రత్యేక అధికారుల పాలనలో నగరపాలక సంస్థ కునారిల్లుతోంది. 2010 నుంచి 2017 మధ్య కూడా కాకినాడకు ఎన్నికలు జరగలేదు. ఇలా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు దాదాపు రూ.110 కోట్ల నిధులు రాకుండా పోయాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కోర్టులో వివాదం ఉంది. ఈ వివాదం తేలితే గాని ఎన్నికలు జరిగే అవకాశాలు లేవంటున్నారు న్యాయ నిపుణులు.
ప్రస్తుతం కోర్టు కేసుల్లో ఉన్న పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల వివాదాలు పరిష్కరించి ఎన్నికలకు వెళ్తామని గతంలోనే పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ వెల్లడించారు. అయితే ఎన్నికలకు సంబంధించి రెండు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కోర్టు కేసులు ఉన్న వాటిని పక్కన పెట్టి కేసులు లేని వాటికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలా జరిగితే మరోసారి కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే 23 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు సంబంధించిన వివాదాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. కాకినాడ కార్పొరేషన్ లో ప్రస్తుతం 50 వార్డులు ఉండగా కేవలం 48 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. 42వ వార్డుకు సంబంధించి రూరల్ పరిధిలోని గంగనాపల్లి, 48వ వార్డుకు సంబంధించి స్వామి నగర్ పంచాయతీలలో కొంతభాగం వివాదం కోర్టులో ఉండడంతో ఈ రెండు డివిజన్లకు ఎన్నికలు పెట్టకుండా 48 డివిజన్ లకు ఎన్నికలు జరుపుతున్నారు.
ఇక కార్పొరేషన్ లో దాదాపు 17 సంవత్సరాలుగా విలీనమైన ఆరు గ్రామాలకు ఎన్నికలు జరపలేదు. రూరల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే తూరంగి, వాకలపూడి, ఇంద్రపాలెం, రమణయ్యపేట, చీడిగ, వలసపాకల పంచాయతీలకు విలీన సాంకేతిక కారణాలతోఎన్నికలు జరపడం లేదు.17 ఏళ్లుగా ఈ ఆరు పంచాయతీలు ఎన్నికలకు నోచుకోలేదు. ఎన్నికలు లేకపోవడంతో ఇప్పటివరకు 170 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను ఈ పంచాయతీలు కోల్పోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు పంచాయతీ ఎన్నికలు లేవు. ఇటు కార్పొరేషన్ లో కలపలేదు. పూర్తిగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉండిపోయి అభివృద్ధికి నోచుకోక కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు మహిళలు వాపోతున్నారు.
మరోవైపు కార్పొరేషన్ కు సంబంధించి కోర్టులో 5 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. తూరంగి, వాకలపూడి పంచాయతీలకు సంబంధించి అప్పటి పాలకవర్గాలు విలీనానికి అనుకూలంగా తీర్మానాలు ఇచ్చాయి. మిగిలిన నాలుగు పంచాయితీలకు ప్రత్యేక అధికారులు అంగీకారం తెలిపారు. కానీ ఇవి చెల్లవని కోర్టులో కేసులు వేశారు. దీంతో కోర్టు వివాదాలు ఎన్నికల నిర్వహణకు ఆటంకంగా మారాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వివాదాలు రాకుండా ఎవరూ కోర్టుల్లో కేసులు వేయకుండా సెక్షన్ 3 చట్టం అమలులోకి తెచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిని అమల్లోకి తెచ్చింది. దీంతో ఎన్నికలు జరగకుండా ప్రైవేట్ వ్యక్తులు కోర్టులో కేసులు వేసే అవకాశాలు లేవు. దీనిని అమల్లోకి తెచ్చినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేస్తే వాటికి కూడా ఎన్నికలు జరిపే అవకాశం ఉంటుందని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ మాజీ కౌన్సిలర్ దూసర్లపూడి రమణ రాజు తెలిపారు. ప్రభుత్వం ఇలా చేయకపోవడంతో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. అయితే గ్రామాల విలీనం కోసం పట్టించుకోకుండా ఎన్నికలు జరపాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇటీవల రెండు డివిజన్లకు సంబంధించిన కేసులు విత్ డ్రా అవ్వడంతో 50 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు వెసులుబాటు కలిగింది. మరోపక్క రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, పురపాలక సంఘాలలో డివిజన్లు, వార్డుల సంఖ్య పెంచారు. కాకినాడ కార్పొరేషన్ లో డివిజన్ ల సంఖ్య 66 కు పెంచాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు వీటిపై అధికారులు పట్టించుకోలేదని ఎమ్మెల్యే దీనిపై స్పష్టత ఇవ్వాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.
ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సెక్షన్ 3 చట్టం గురించి హైకోర్టుకు తెలియజేయడంతో పాటు మిగిలిన ఆరు గ్రామాల విలీన సాంకేతిక ప్రక్రియ చేసేసి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. అయితే ఆరు గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరపాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇతమిద్దంగా ఏ విషయం తేల్చలేక పోతోంది. ప్రస్తుతానికి తెలుగుదేశం, జనసేన, వైసిపి పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ కూడా బిజెపి బలహీనంగానే కనిపిస్తోంది. అయితే పోటీకి ఉత్సుకత చూపిస్తున్న వారు ఎన్నికలు జరుగుతాయని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ స్మార్ట్ సిటీకి ఎన్నికలు జరుగుతాయా.. జరగవా.. జరిపితే 48 డివిజన్లకే జరుగుతాయా.. 50 డివిజన్లకు నిర్వహిస్తారా.. విలీనమైన రూరల్ లోని ఆరు గ్రామాల పరిస్థితి ఏమిటి.. అన్నది తేలాల్సి ఉంది. ఇప్పుడు దీనిపైనే టాక్ ఆఫ్ ది టౌన్ నడుస్తోంది.
BJP Office: రెచ్చిపోయిన కాంగ్రెస్ నాయకులు.. బీజేపీ కార్యాలయానికి నల్ల రంగు
Hyderabad, Telangana:NSUI Attack On BJP Office: తెలంగాణలో మరోసారి తీవ్ర రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆకస్మికంగా కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు దూసుకువచ్చి బీజేపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. నల్ల రంగు పూసి బీజేపీకి వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ నాయకుల తీరుపై కమలం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై సోమవారం మధ్యాహ్నం యూత్ కాంగ్రెస్ నాయకులు దూసుకొచ్చారు. జెండాలు, ఫ్లెక్సీలతో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. అమిత్ షా రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. అమిత్ షా డౌన్ డౌన్ అంటూ అక్కడే యూత్ కాంగ్రెస్ నాయకులు కేంద్ర హోం శాఖ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒక్కసారిగా యూత్ కాంగ్రెస్ నాయకులు రావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలిసే లోపు యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ గేటుపై నల్ల రంగు పూశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, బీహార్‌లో విద్యార్థులపై కాల్పులు జరిగినందుకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నివాసానికి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కాంగ్రెస్ నాయకులు ఇంటిని ముట్టడిస్తారనే సమాచారం మేరకు హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న అతడి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. రామచంద్రరావు ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకులు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రామచంద్రరావు నివాసం వైపు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. దీంతో రామచంద్రరావు నివాసం వద్దకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. తమ ఇంటిని ముట్టడిస్తే.. రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని బీజేపీ శ్రేణులు హెచ్చరించారు.
