రాజేంద్ర నగర్లో పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్
Hyderabad, Telangana:రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆర్జిఐ విమానాశ్రయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. నాలుగేళ్ల నుంచి మైనర్ బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్న ప్రదీప్ పై బాలిక తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుద్వెల్లోని ఓ చర్చిలో ఇద్దరూ కలుసుకుని బంధం ఏర్పరుచుకున్నారు. ప్రదీప్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Konda Surekha Episode: మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి పీసీసీ నివేదిక.. మంత్రివర్గ మార్పులపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ!
Hyderabad, Telangana:Konda Surekha Episode AICC Report: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలి ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్ గా మారింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేసిన ఎపిసోడ్ తర్వాత పార్టీలో వివాదం ముదిరింది.
కుమార్తె చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించకపోవడం పార్టీ శ్రేణుల్లోనూ, నేతల్లోనూ తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఆ తర్వాత తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు స్పందిస్తూ, తనకు మరియు తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో ఎటువంటి సంబంధం లేదని సురేఖ సమాధానం ఇచ్చారు. ఆపై తనపై కుట్ర జరుగుతోందంటూ లేఖ రాయడం వంటి వరుస పరిణామాలు ఆమెను మరింతగా వివాదాల్లోకి లాగి టార్గెట్ అయ్యేలా చేశాయి.
దీంతో కొండా సురేఖ ప్రవర్తనపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ)లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆమె పార్టీ ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, వివాదాలను మరింత పెంచేలా ప్రవర్తిస్తున్నారని పీసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఆదివారం నాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీకి ఒక తాజా నివేదికను పంపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలపై సుస్మిత చేసిన అసత్య ఆరోపణలను సురేఖ ఖండించకపోవడం పట్ల పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.
సురేఖ తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను సమర్థించడం పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో తీవ్ర అసమ్మతిని కలిగించింది. ఆ తర్వాత 'తనపై కుట్ర జరుగుతోంది' అంటూ ఆమె రాసిన లేఖ కూడా పార్టీ ప్రతిష్టకు పెద్ద ఇబ్బంది కలిగించేలా మారిందని పీసీసీ అభిప్రాయపడింది. ప్రభుత్వ ప్రతిష్టను భంగపరిచేలా సుస్మిత మాట్లాడినప్పటికీ సురేఖ దానిని ఖండించకపోగా, సహచర పార్టీ నేతలపై అభాండాలు వేయడం ఏమాత్రం సరికాదని పీసీసీ, క్రమశిక్షణ కమిటీ గట్టిగా భావిస్తున్నాయి. ఈ విషయాలన్నింటినీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు, ఏఐసీసీకి పీసీసీ కూలంకషంగా వివరించింది.
ఈ పీసీసీ నివేదికలు, వరంగల్ ఎమ్మెల్యేల మీడియా సమావేశాలు, కొండా సురేఖ రాసిన లేఖల ఆధారంగా ఏఐసీసీ ప్రస్తుతం అంతర్గత విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో అధిష్టానం చర్చించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంది. అయితే వీరందరూ కూడా కొండా కుటుంబ వ్యవహార శైలిపై ప్రతికూలంగానే అధిష్టానానికి వివరించినట్లు సమాచారం.
గతంలో కూడా కొండా సురేఖ ఇటువంటి ఆరోపణలు చేసిన చరిత్ర ఉన్నందున, వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆమెతో కలిసి పనిచేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఆమె ఈ విధంగా ప్రవర్తిస్తే జిల్లా అభివృద్ధి పనులకు ఎలా సహకరిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆమె వ్యవహారశైలి ప్రతిపక్షాలకు అనుకూలంగా మారినట్లు ఉందని, కాబట్టి ఆమెను మంత్రివర్గం నుండి తొలగించాలని, అవసరమైతే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖపైనా, చిన్నారెడ్డిపైనా అధిష్టానం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకోవచ్చని కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Also REad; వైసీపీ మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం!
Also Read: ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సుకు ఘోరం ప్రమాదం..20 మంది విద్యార్థులు, దూసుకెళ్లింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Raksha Bandhan 2026: ఆగస్టు 27న రాఖీ ఎందుకు కట్టకూడదు? రాఖీ కట్టడానికి శుభముహూర్తాలు ఇవే!
Hyderabad, Telangana:Raksha Bandhan 2026 Muhurat: రక్షాబంధన్ పండుగకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. ఈ ఏడాది శ్రావణ మాస పూర్ణిమ తిథి నాడు వచ్చే ఈ పర్వదినాన్ని ఆగస్టు 28న జరుపుకోనున్నారు. ఈ రోజున శతభిషా నక్షత్రం, సుకర్మ యోగంతో పాటు మీన రాశిలో చంద్రుడి సంచారం వంటి అద్భుతమైన జ్యోతిష్య సంయోగాలు ఏర్పడుతున్నాయి. శుక్రవారం, సుకర్మ యోగాల కలయిక వల్ల ఈ పండుగ మరింత పవిత్రతను, శ్రేయస్సును సంతరించుకోనుంది. ఈ ఏడాది పండుగ రోజున భద్రా ప్రభావం ఏమాత్రం లేకపోవడం అత్యంత విశేషం.
ఆగస్టు 27న రాఖీ ఎందుకు కట్టకూడదు?
సాధారణంగా ప్రతి సంవత్సరం రక్షాబంధన్ రోజున భద్రా కాలం ఛాయ పడుతుంటుంది. శాస్త్రాల ప్రకారం భద్రా కాలంలో రాఖీ కట్టడం అశుభం. ఈ ఏడాది భద్రా తిథి పండుగకు ఒక రోజు ముందే, అంటే ఆగస్టు 27వ తేదీ గురువారం ఉదయం 9:09 గంటలకు ప్రారంభమై, అదే రోజు రాత్రి 9:25 గంటలకు ముగిసిపోతుంది.
గురువారం పూర్ణిమ తిథి ప్రారంభమైన క్షణం నుంచే భద్ర ప్రభావం కూడా మొదలవుతుంది. అందుకే పూర్ణిమ తిథి ఉన్నప్పటికీ, శాస్త్ర నియమాల ప్రకారం 27న రాఖీ కట్టకూడదు. ఆగస్టు 28న పండుగ రోజున భద్రా దోషం ఏమాత్రం ఉండదు
చంద్రగ్రహణ ప్రభావం ఉందా?
ఆగస్టు 28న ఈ ఏడాది చివరి పాక్షిక చంద్రగ్రహణం సంభవించబోతోంది. ఈ గ్రహణ సమయం ఉదయం 6:53 గంటల నుంచి మధ్యాహ్నం 12:31 గంటల వరకు ఉంటుంది. అయితే, ఇది భారతదేశంలో కనిపించదు. అందువల్ల ఎలాంటి సూతక నియమాలను పాటించాల్సిన అవసరం లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు.
రాఖీ కట్టడానికి శుభ ముహూర్తాలు (ఆగస్టు 28): సోదరులకు దీర్ఘాయువు, ఐశ్వర్యం కలగడం కోసం ఆగస్టు 28న కింది శుభ సమయాల్లో రాఖీ కట్టాలని పండితులు సూచిస్తున్నారు.
అమృత ఘడియలు (అత్యంత శ్రేష్టం): తెల్లవారుజామున 6:08 నుండి ఉదయం 10:53 వరకు
అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12:04 నుండి మధ్యాహ్నం 12:53 వరకు
శుభ ఘడియలు: మధ్యాహ్నం 12:28 నుండి మధ్యాహ్నం 2:03 వరకు
అపరాహ్న కాల ముహూర్తం: మధ్యాహ్నం 1:44 నుండి సాయంత్రం 4:16 వరకు
చర ఘడియలు: సాయంత్రం 5:13 నుండి సాయంత్రం 6:48 వరకు
రాఖీ కట్టే సమయంలో సోదరుడు తూర్పు లేదా ఈశాన్య దిశ వైపు ముఖం ఉండేలా కూర్చోవాలి. పూజా పళ్లెంలో కుంకుమ, చందనం, అక్షింతలు, దీపం, తీపి పదార్థాలను అమర్చుకోవాలి. ముందుగా సోదరుడి నుదుట తిలకం దిద్ది, తలపై అక్షింతలు చల్లి, హారతి ఇచ్చిన తర్వాతే కుడిచేతికి రక్షా సూత్రాన్ని (రాఖీ) కట్టాలి.
Also Read: ఏల్నాటి శని సమయంలో అసలు చేయకూడని 5 తప్పులు..! చేస్తే అంతే సంగతులు..
Also Read: ఈ 6 రాశులకు సెప్టెంబర్ నెలంతా లక్ష్మీదేవి అనుగ్రహం.. కలలో సైతం ఊహించని లాభాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vishwanath And Sons Collection: రూ.200 కోట్ల క్లబ్లో 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. బాక్సాఫీస్ వద్ద సూర్య సరికొత్త రికార్డు!
Hyderabad, Telangana:Vishwanath And Sons Collection 10 Days: తమిళ స్టార్ హీరో సూర్య, యంగ్ హీరోయిన్ మమితా బైజు కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని దాటినట్లు సితారా ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాదిలోనే సూర్య నటించిన రెండు సినిమాలు ఈ ఘనత సాధించడం ఒక అరుదైన రికార్డుగా నెలకొంది.
భారీ వసూళ్లతో దూకుడు..
బాక్సాఫీస్ వద్ద 'విశ్వనాథ్ అండ్ సన్స్' కలెక్షన్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా మొదటి 9 రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా రూ.118 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది.
ఈ చిత్ర 9 రోజుల రోజువారీ వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
మొదటి రోజు: రూ. 20 కోట్లు
రెండో రోజు: రూ. 28.5 కోట్లు
మూడో రోజు: రూ. 25 కోట్లు
నాలుగో రోజు: రూ. 10 కోట్లు
5వ రోజు: రూ. 8 కోట్లు
6వ రోజు: రూ. 7 కోట్లు
ఏడో రోజు: రూ. 5.5 కోట్లు
ఎనిమిదో రోజు: రూ. 6 కోట్లు
9వ రోజు: రూ. 9 కోట్లు
ఓవర్సీస్ మార్కెట్లో అద్భుత రన్ కారణంగా.. విదేశీ మార్కెట్లలో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఇప్పటికే ఈ సినిమా 2.5 మిలియన్ డాలర్లకు పైగా (భారతీయ కరెన్సీలో రూ.24 కోట్లు) వసూలు చేసింది. మిగిలిన దేశాలతో కలుపుకుని ఓవర్సీస్లో మొత్తం 6 మిలియన్ డాలర్లు (రూ.57 కోట్లు) రాబట్టడంతో, వరల్డ్ వైడ్‌గా రూ.175 కోట్ల గ్రాస్ వసూలైంది.
10వ రోజు అద్భుతం & సూర్య రికార్డులు..
విడుదలైన 10వ రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్లకు పైగా, తమిళనాడులో మరో రూ. 5 కోట్లకు పైగా రాబట్టింది. నైట్ షోల సమయానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 190 కోట్లు వసూలవుతుందని అంచనా వేసినప్పటికీ, ఊహించని విధంగా కలెక్షన్లు దూసుకుపోయి ఏకంగా రూ.200 కోట్ల మార్కును దాటేసిందని నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు.
అయితే సరిగ్గా మూడు నెలల క్రితం సూర్య గత చిత్రం 'కరుప్పు' (తెలుగులో వీరభద్రుడు) రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, వరుసగా ఇదే ఏడాదిలో రెండో సినిమాతో కూడా రూ.200 కోట్ల క్లబ్లో చేరి సూర్య తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకున్నారు.
Also REad: Irumudi Collections: 'ఇరుముడి' సినిమా ఆల్‌టైమ్ రికార్డ్..36 గంటల్లో బ్రేక్ ఈవెన్ తెచ్చుకొని సంచలనం!
Also Read: Eshwar Sai Madhuri Rathod: మధూరీ రాథోడ్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kurukshetra Murder Case: భర్తను చంపి, పేగులు బయటకు తీసిన భార్య..కురుక్షేత్రలో ఘోర హత్యోదంతం!
Hyderabad, Telangana:Kurukshetra Murder Case News: హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన హత్యోదంతం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే ఒక మహిళ తన భర్తను చంపి, అతని పేగులను బయటకు తీసి ఘటన చుట్టుపక్కల వారిని భయబ్రాంతులకు గురిచేసింది. ఆ తర్వాత భయాందోళనతో తాము అద్దెకు ఉంటున్న ఇంటి మేడ పైనుంచి ఆ మహిళ దూకేసింది.
ఏం జరిగిందంటే?
బాధితుడు రాజేష్, అతని భార్య విమ్ల దేవి కురుక్షేత్రలోని పెహోవా రోడ్డులో ఉన్న రాజ్ ప్యాలెస్ సమీపంలో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఘటన జరిగిన రోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఆ దంపతులు గట్టిగా అరుచుకోవడం వినిపించిందని ఇంటి యజమాని రింకు తెలిపారు.
ఆ అరుపులు విని ఆయన వెంటనే మేడ పైకి వెళ్లారు. అక్కడ ఆయన చూసిన దృశ్యం ఏదో క్రైమ్ సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా ఉంది. రాజేష్ తీవ్రమైన కడుపు గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. రాజేష్ శరీరం నుండి బయటకు వచ్చిన పేగులను విమ్ల ఒక సంచిలో పెడుతుండగా ఇంటి యజమాని చూశారని సమాచారం. యజమానిని చూడగానే ఆమె భయాందోళనకు గురై మేడ పైనుంచి దూకేసింది.
కింద పడటంతో నిందితురాలు గాయపడింది, ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు, అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా ధంపూర్ గ్రామానికి చెందిన రాజేష్, గత ఏడాది కాలంగా కురుక్షేత్రలో తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అతను పెహోవా రోడ్డులోని ఒక నీటి సరఫరా సంస్థలో పని చేసేవాడు.
పోస్టుమార్టం పరీక్షలో గాయాల తీవ్రత బయటపడింది. నివేదిక ప్రకారం.. రాజేష్ కడుపు భాగం సుమారు 35 సెంటీమీటర్ల మేర కోయబడి ఉంది. పదునైన ఆయుధాల వల్ల లోతైన గాయాలు అయ్యాయి. అతని పేగులు పొట్ట భాగం నుండి బయటకు వచ్చినట్లు గుర్తించారు.
అలాగే, అతని కాలేయంలోని గణనీయమైన భాగం, కుడి వైపు మూత్రపిండం (కిడ్నీ) కనిపించకుండా పోయినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఈ గాయాలు, కనిపించకుండా పోయిన అవయవాలకు సంబంధించిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలం నుండి వివిధ పరిమాణాల మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురీందర్ సింగ్, పోలీసు బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారు. ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. విమల సంప్రదాయ వైద్యం, చేతబడి నివారణ వంటి పనుల్లో నిమగ్నమై ఉండేవారు. అలాగే ఆ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. అయితే, ఈ హత్యకు గల అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.
రాజేష్, విమలలకు వివాహమై చాలా ఏళ్లు గడిచినా వారికి పిల్లలు లేరు. పోలీసులు ఇప్పుడు వారి మధ్య ఉన్న సంబంధం, గతంలో జరిగిన గొడవలు, ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఇచ్చిన వాంగ్మూలం, ఫోరెన్సిక్ ఆధారాలు, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.
Also REad: July DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్! జూలై డీఏ పెంపుపై కీలక అప్డేట్..
Also Read: టీచర్లకు బెదిరింపులు.. 'కాక్రోచ్ జనతా పార్టీ' అభిజీత్ దీప్కేపై కేసు నమోదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Eagle Challenge: గంజాయి రవాణా, అమ్మకాల సమాచారాని రూ.5,000..సేవించే వారిని పట్టిస్తే రూ.1,500..'ఈగల్ టీమ్ ఛాలెంజ్'!
Vijayawada, Andhra Pradesh:AP Eagle Challenge 5000: విజయవాడ నగర వ్యాప్తంగా గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఆదివారం రోజున విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో నగర పోలీస్ కమిషనర్ (సీపీ) ఎస్.వి.రాజశేఖరబాబు, ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ కలిసి 'ఈగల్ ఛాలెంజ్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. గంజాయి కట్టడి కోసం పోలీసులు చేపడుతున్న వివిధ రకాల కఠినమైన చర్యలను ఈ సందర్భంగా వారు వివరించారు.
పోలీస్ కమిషనర్, ఐజీ తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి తీసుకువచ్చేవారిని మరియు విక్రయించేవారిని పట్టిస్తే రూ.5,000, అలాగే గంజాయి తాగే అలవాటు ఉన్నవారిని పట్టిస్తే రూ.1,500 నగదు బహుమతిగా ఇస్తారు. గంజాయి రవాణా, అమ్మకాలకు సంబంధించిన పక్కా సమాచారాన్ని పోలీసులకు అందిస్తే ఈ రూ.5 వేల బహుమతి లభిస్తుంది.
ఇటీవల ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో గంజాయి కేసులతో సంబంధం కలిగి ఉన్నట్లు అనుమానించిన 1,287 మందిని పోలీసులు సమగ్రంగా విచారించారు. వారిలో వెయ్యి మందికి పైగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ ఫలితాలు వచ్చాయని సీపీ తెలిపారు. అయితే, ఒక్క అజిత్‌సింగ్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనే 469 మందిని పరీక్షించగా, వారిలో 128 మంది గంజాయి సేవించినట్లు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో, అక్కడ గంజాయి తాగే 129వ వ్యక్తిని చూపించిన వారికి రూ.1,500 నగదు బహుమతి ఇస్తామని అజిత్‌సింగ్‌నగర్ సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు.
సీపీ ఎస్.వి.రాజశేఖరబాబు మాట్లాడుతూ, నగరంలో గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న 32 మందిపై ఇప్పటికే 'పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్' అమలు చేశామని స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించేందుకే ఈ 'ఈగల్ ఛాలెంజ్' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, యువతను డ్రగ్స్‌కు దూరం చేయాలనే ఉద్దేశంతో 'డ్రగ్స్ వద్దు బ్రో' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 వేల విద్యాసంస్థల్లో 'ఈగల్ క్లబ్స్' స్థాపించినట్లు వివరించారు. దీనితో పాటు రాష్ట్రంలో 849 హాట్స్పాట్లను కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా 'ఈగల్ కాల్‌సెంటర్ 1972' ప్రారంభించిన తర్వాత, గంజాయి వాడకంపై తల్లులు స్వయంగా ఫోన్ చేసి పోలీసులకు కీలక సమాచారం ఇస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈగల్ బృందం గడిచన ఒక ఏడాది కాలంగా విజయవంతంగా చేపట్టిన వివిధ రకాల కార్యక్రమాల వివరాలను ఈగల్ ఎస్పీ మహేశ్వరరాజు సభకు నివేదించారు.
Also Read: Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షముప్పు..ఉత్తరాంధ్రకు అల్పపీడన అలర్ట
Also REad: వైసీపీ మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Principal Suspended: స్కూల్ విద్యార్థినులతో కలిసి ప్రిన్సిపాల్ స్నానం..వీడియో వైరల్ కావడంతో ప్రిన్సిపాల్ సస్పెండ్!
Thanagazi, Rajasthan:School Principal Suspended: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు అనగా ఆగస్టు 15న ఓ స్కూల్ ప్రిన్సిపాల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. స్థానికంగా ఉండే ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న అతను.. పాఠశాలలోని కొందరు విద్యార్థినులతో కలిసి కొలనులో స్నానం చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 15న ప్రిన్సిపాల్, పాఠశాలకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక డ్యామ్ వద్దకు 200 మందికి పైగా విద్యార్థులను తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ డ్యామ్‌లో సుమారు 11 అడుగుల నీరు ఉండటంతో, మునిగిపోయే ప్రమాదం ఉన్నందున అక్కడ స్నానం చేయడం నిషేధించబడింది. అయినా అలాంటి ప్రమాదరకర ప్రాంతాలకు విద్యార్థినులతో వెళ్లిన కారణంగా, ఆ పరిస్థితుల్లో విద్యార్థినుల అసభ్యకర వీడియోలు బయటకు రావడంతో అతడ్ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఏం జరిగిందంటే?
థానాగాజీ ప్రాంతంలోని రౌబవి పడక్ ఛాప్లీలో ఉన్న ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాల ప్రిన్సిపాల్ లాల్ చంద్ మీనాను, బికనీర్‌లోని సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ తక్షణమే సస్పెండ్ చేసింది. శనివారం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వు ప్రకారం.. మీనా, పాఠశాల విద్యార్థినులకు సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు నిర్దేశించిన ప్రవర్తనా నియమావళిని ఆయన ప్రవర్తన ప్రాథమికంగా ఉల్లంఘించిందని విద్యాశాఖ పేర్కొంది. రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ (వర్గీకరణ, నియంత్రణ మరియు అప్పీల్) నియమావళి, 1958లోని నియమం 13(1) ప్రకారం మీనాపై శాఖాపరమైన విచారణ కూడా ప్రారంభించబడింది.
సస్పెన్షన్ కాలంలో, మీనా ప్రధాన కార్యాలయం బికనీర్‌లోని సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌లో ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. 11, 12వ తరగతి విద్యార్థినులతో కలిసి ప్రిన్సిపాల్ డ్యామ్ నీటిలో స్నానం చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో వైరల్ అయిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినులతో ప్రధానోపాధ్యాయులు లాల్ చంద్ మీనా డ్యామ్‌లో స్నానానికి తీసుకెళ్లారు. స్కూల్ నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్యామ్‌లో సుమారు 11 అడుగుల లోతులో నీరు ఉన్నట్లు తెలిసింది. మునిగిపోయే ప్రమాదం ఉన్నా దాదాపుగా 200 మంది విద్యార్థినులతో అక్కడికి వెళ్లి స్నానం చేయడం, వారి అసభ్యకర వీడియోలు బయటకు రావడం.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. దీంతో పై అధికారులు ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు.
Also Read: July DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్! జూలై డీఏ పెంపుపై కీలక అప్డేట్..
Also Read: టీచర్లకు బెదిరింపులు.. 'కాక్రోచ్ జనతా పార్టీ' అభిజీత్ దీప్కేపై కేసు నమోదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Autos Bandh: బిగ్ బ్రేకింగ్.. ప్రభుత్వంతో చర్చలు సఫలం- అర్ధరాత్రి ఆటోల బంద్ విరమణ
Baddipadaga, Telangana:Auto Workers Strike: తమకు ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆటోడ్రైవర్లు కొంచెం శాంతించారు. నేటి అర్ధరాత్రి నుంచి చేపట్టాల్సిన ఆటోల బంద్‌ను విరమించుకున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో తాత్కాలికంగా నిరవధిక బంద్ విరమించుకున్నట్లు ఆటో సంఘాలు ప్రకటించాయి. యథావిధిగా ఆటోల రాకపోకలు హైదరాబాద్‌తోపాటు తెలంగాణవ్యాప్తంగా ఉండనున్నాయి.
ఆటో కార్మిక సంఘాలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆటో కార్మిక సంఘాల డిమాండ్స్ పై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి ప్రకటించారు. చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మిక సంఘాలు తలపెట్టిన నిరవధిక బంద్నును విరమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి ఆటో కార్మిక సంఘాలు సమ్మె విరమించాయి. దీంతో ఆటో కార్మిక సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఆటో కార్మిక సంఘాలకు ప్రభుత్వం నుంచి సానుకూల అంశాలు రావడంతో సమ్మె విరమించుకోవడంతో హైదరాబాద్ నగర ప్రయాణికులకు భారీ ఊరట లభించింది.
ఆర్టీసీ పక్షాన ఈవీ ఆటోలు కొనే ప్రసక్తే లేదని అది దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. విధివిధానాలకు సెప్టెంబర్ 1వ తేదీ కార్మిక శాఖ, రవాణా శాఖ అధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2012 తర్వాత ఆటో చార్జీలు పెంచుకోవడంతో ఆటో చార్జీలు పెంచడానికి అంగీకరిస్తూ ఎంత పెంచాలి అనే దానిపై తగిన నివేదిక తీసుకొని సంబంధిత జీవో విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఓలా, ఉబెర్ లా మాదిరి ప్రభుత్వం తరుపున యాప్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఐటీ శాఖ నుంచి యాప్ ప్రారంభించేందుకు తగిన ప్రక్రియ ప్రారంభిస్తామని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
ద్విచక్ర వాహనాల్లో రాపిడో, ఓలా, ఉబెర్ నడిపే వాటికి ఎల్లో ప్లేట్ ఉన్న వాటికి మాత్రమే ప్రయాణికులను తరలింపుపై నిర్ణయం తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు రూ.12 వేల అంశంపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తగిన అంశాలు పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచ మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
హైదరాబాద్ లో పాత డీజిల్, పెట్రోల్ ఆటోలకు రెట్రోఫిట్మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చడానికి రూ.1.50 లక్షలు ప్రభుత్వం సహాయం అందిస్తుందని అధికారులు ప్రకటించారు. కొత్త ఆటోలు కొనుగోలు చేయడానికి సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి.. పర్యావరణాన్ని కాపాడడానికి నగరంలో ఈవి ఆటో లుగా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఆటో కార్మికుల సోదరుల డిమాండ్స్ పై ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని అధికారులు ప్రకటించారు. ఆటో కార్మిక సంఘాలతో జరిపిన చర్చల్లో రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి , అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, వెంకటరమణ ఉన్నారు.
Harish Rao: 'అసెంబ్లీని స్తంభింపజేస్తాం.. సచివాలయాన్ని ముట్టడిస్తాం'.. రేవంత్ రెడ్డికి హరీశ్ రావు హెచ్చరిక!
Hyderabad, Telangana:Harish Rao vs Revanth Reddy: ప్రజల ఆస్తులపై ప్రభుత్వం 22ఏతో నిషేధిత జాబితాను ఎత్తివేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం.. సచివాలయాన్ని ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరిక జారీ చేశారు. 22ఏ జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోవడం ఖాయం అని తెలిపారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే రాహుల్ గాంధీ చోద్యం చూస్తున్నారా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్ బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి, హేమానగర్ కాలనీలను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన నేపథ్యంలో ఆ కాలనీవాసులకు బీఆర్ఎస్ పార్టీ బాసటగా నిలిచింది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 శాతం కమీషన్ల కోసమే పక్కా రిజిస్టర్డ్ ఇళ్లను నిషేధిత జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతోందని.. భూభారతి పోర్టల్ నుంచి 22ఏ జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు? అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు నిలదీశారు. పబ్లిక్ డొమైన్లో పెట్టాలని తెలిపారు.
చివరికి పోలీస్ స్టేషన్ కూడా వొదిలి పెట్టని రేవంత్ రెడ్డి 🤦🏻♂️🤡
అధికారుల పేరు చెప్పి రేవంత్ రెడ్డి కూడా తప్పించుకుంటున్నాడు
తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల ఎకరాల్ని నిషేధిత జాబితాలో పెట్టే ధైర్యం అధికారులకు ఉంటుందా..?
చివరికి పోలీస్ స్టేషన్‌ని కూడా నిషేధిత జాబితాలో చేర్చారంటే.. ఇది… pic.twitter.com/tpEhBPksOY
— Harish Rao Connects🇬🇧 (@HarishraoCncts) August 23, 2026
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు లేని సమస్యలు సృష్టించి వారిని తీవ్ర ఇబ్బందులపాలు చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. 'వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ను ఎత్తేశారు. ఎప్పుడో రద్దయిన చట్టాన్ని మళ్లీ తెచ్చి, పట్టా భూములను 22-A నిషేధిత జాబితాలో పెట్టి వసూళ్లకు పాల్పడాలని చూస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రభుత్వ భూములను, ఎస్సీల అసైన్డ్ భూములను సైతం తెగనమ్ముతోంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న 1000 గజాల పార్కును కూడా అమ్మకానికి పెట్టారు' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు వివరించారు.
'ఆఖరికి గుడి కట్టడానికి.. బడి కట్టడానికి.. దవాఖానాకి.. శ్మశాన వాటికకు కూడా జాగా లేని పరిస్థితి సృష్టించారు. మరోవైపు కూకట్‌పల్లిలోని 1000 గజాల ప్రైవేటు ప్లేగ్రౌండ్‌ను కూడా ప్రభుత్వం తనదే అంటోంది. రాత్రికి రాత్రే ఇళ్లను యూఎల్సీ కింద 22ఏలో దేనికోసం పెడుతున్నారు? ఇదంతా కేవలం 30 శాతం కమీషన్లు లాగడానికే' అని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దళారులు వెళ్లి యజమానులను 30 శాతం కమీషన్ అడుగుతున్నారని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డిది పిచ్చి తుగ్లక్ నిర్ణయం!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో 2008లోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ (UCL)ను ఎత్తివేయడం జరిగింది.
కానీ ఈ తుగ్లక్ ప్రభుత్వం 1956 నాటి ల్యాండ్ సీలింగ్ నిబంధనలు ఉన్నాయంటూ ఏళ్లుగా ప్రజల ఆధీనంలో ఉన్న భూములను మళ్లీ సీలింగ్ పరిధిలో ఉన్నట్లు… pic.twitter.com/FZBgnP8ZDm
— Harish Rao Connects🇬🇧 (@HarishraoCncts) August 23, 2026
'కమీషన్ల కోసం చేసిన తప్పునకు సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలి? ఎందుకు అప్లికేషన్లు పెట్టుకోవాలి?' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు నిలదీశారు. ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుకోవాలని ఆలోచించడమే కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ చర్య అని విమర్శించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తప్పు చేసి క్షమాపణలు చెప్పి తప్పించుకోవాలని చూడొద్దని సూచించారు. అప్లికేషన్లతో సంబంధం లేకుండా ఆ భూములను 22ఏ నుంచి తొలగించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అధికారులు చేసిన తప్పు వెనుక దాక్కుని రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
'తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 40 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కూడా 22ఏలోనే ఉంది. మొత్తం హైదరాబాద్ అంతా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సరూర్‌నగర్ లాంటి ప్రాంతాలన్నీ నిషేధిత జాబితాలోనే ఉండటం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం' అని మాజీ మంత్రి హరీశ్ రావు దుయ్యబట్టారు. సీఐడీ, విజిలెన్స్ విచారణ పేరిట బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతపెద్ద తుగ్లక్ నిర్ణయం తీసుకున్న అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
'కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో పెట్టింది. ఇటు రేవంత్ రెడ్డి, అటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులే. వీళ్లు రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే.. రాహుల్ గాంధీ చోద్యం చూస్తున్నారా?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Baingan Bharta: విషంగా మారిన రాత్రి భోజనం.. వంకాయ కూర తిని ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
Chhatarpur, Madhya Pradesh:Three Sisters Death: ఇంట్లో రాత్రి భోజనంగా చేసిన వంకాయ కూర, చపాతీల ఇంట్లోని ముగ్గురు అక్కాచెల్లెళ్లు తిన్నారు. తిన్న తర్వాత ముగ్గురు బాలికలు తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. ముగ్గురు కుమార్తెలు మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగింది. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న ఆ బాలికల మృతి చెందడం పలు అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లాలోని పిపోరా ఖుర్ద్ గ్రామానికి చెందిన బాల్ముకుంద్ కుష్వాహకు ముగ్గురు కుమార్తెలు పూనమ్ (7), మనీషా (3), చాహత్ (9 నెలల). వారు ముగ్గురు శుక్రవారం రాత్రి భోజనంగా వంకాయ కూర, చపాతీలు తిన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ ముగ్గురు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపటికి ఆ ముగ్గురు చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అనంతరం ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు.
అయితే అనుమానాస్పద స్థితిలో బాలికలు మృతిచెందడంతో గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల సమాచారం అనంతరం స్థానిక పోలీసులు, వైద్యులతో కలిసి ఆ గ్రామానికి చేరుకున్నారు. పిల్లల మృతదేహాలను పూడ్చిపెట్టిన స్థలాన్ని పరిశీలించారు. బాలికల మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి పోలీసులు ఆధారాలు సేకరించారు.
కుటుంబసభ్యులు చెబుతున్నట్టు బాలికలు తీసుకున్న ఆహారం విషతుల్యమైందని.. వారి మరణానిఇక ఆహారానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని అధికారులు తెలుసుకుంటున్నారు. పిల్లల అనుమానాస్పద మృతిపై కుటుంబసభ్యులను పోలీసులు విచారణ చేస్తున్నారు. బాలికల మృతిపై పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత వారి మరణానికి కారణాలు తెలియనున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు. వంకాయ కూర తిని ముగ్గురు చిన్నారులు మరణించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త వైరల్‌గా మారింది.
BRS Party: కాంగ్రెస్ 1000 రోజుల పాలన.. సెప్టెంబర్ 2 నుంచి గులాబీ పార్టీ ఆందోళనలు
Baddipadaga, Telangana:KTR Call: 420 హామీలు.. 13 డిక్లరేషన్లు.. 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని.. వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ భారీ ఆందోళనలకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. ‘బాకీ కార్డుల’తో హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ మోసాన్ని గ్రామగ్రామాన ప్రజలకు తెలపాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి 1000 రోజులు నిండుతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీతో ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కేటీఆర్ పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు సమాజంలోని అన్ని రంగాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున వినూత్నంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది. అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి.. తర్వాత అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 1000 రోజులు నిండుతున్న సందర్భంగా ఆ పార్టీ మోసాన్ని ప్రజల్లో ఎండగడుతామని ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేసిన మోసాలు, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి వర్గానికి చేరేలా ఈ వారం రోజుల కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ నాయకత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులంతా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టేలా కార్యాచరణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు డిక్లరేషన్ల పేరుతో ప్రతి ఒక్క మాటను 100 రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. అయితే 1000 రోజులు పూర్తయిన తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన తీరును ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం, అవినీతి, అరాచకాల పట్ల తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా విధానాలు, వైఫల్యాలు, అవినీతి, అరాచకాలను ప్రజల ముందుంచాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. కార్యక్రమాలు కేవలం హామీల చుట్టూ కాకుండా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకున్న వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రధానంగా ప్రస్తావించాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయాలను మరోసారి ‘బాకీ కార్డుల’ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. రైతు కూలీలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువతకు ప్రతి నెలా ఇస్తామన్న ఆర్థిక సహాయం ఎంత మేరకు పేరుకుపోయిందో ఈ బాకీ కార్డుల ద్వారా ప్రజలకు గుర్తు చేయాలని పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు 1000 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యానికి సంబంధించిన కార్యాచరణలో భాగంగా మరోసారి యువతకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని గులాబీ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు.
July DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్! జూలై డీఏ పెంపుపై కీలక అప్డేట్..
Hyderabad, Telangana:July DA Hike News: కేంద్ర ప్రభుత్వం సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు కరువు భత్యాన్ని సవరిస్తుంది. మొదటి విడత (జనవరి నెలకు సంబంధించి) సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రకటిస్తారు. రెండో విడత (జూలై నెలకు సంబంధించి) సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో వెల్లడిస్తారు. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈసారి ఈ పెంపును కొద్దిగా ముందుగానే ప్రకటించి ఉద్యోగులకు దీపావళి లేదా దసరా కానుక అందించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎంత శాతం పెరిగే అవకాశం ఉంది?
గత ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని 58 శాతం నుండి 60 శాతానికి (అనగా 2%) పెంచింది. ప్రస్తుత ద్రవ్యోల్బణం, ధరల సూచీ ట్రెండ్స్ పరిశీలిస్తే, ఈసారి కూడా 2% నుండి 3% వరకు వేతన పెంపును ఉద్యోగులు ఆశించవచ్చు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 3 శాతం పెంపుకు ఆమోదం తెలిపితే, ఉద్యోగుల మొత్తం డీఏ 63 శాతానికి చేరుకుంటుంది.
ఉద్యోగులు ప్రస్తుతం కొత్త వేతన సంఘం (8వ వేతన సంఘం) ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ డీఏ పెంపు కీలకమైనదిగా మారింది. కొత్త వేతన సంఘం అధికారికంగా ఏర్పాటయ్యే వరకు, ఏడవ వేతన సంఘం నిబంధనల ప్రకారమే ఈ అలవెన్సుల పెంపు కొనసాగుతుంది.
ఉద్యోగ సంఘాల డిమాండ్
పండుగ సీజన్ (రక్షాబంధన్, ఓనం వంటి పండుగలు) దృష్ట్యా ఉద్యోగుల జీతాలను ఒకటి లేదా రెండు రోజుల ముందుగానే చెల్లించాలని, అలాగే డీఏ పెంపును ఆలస్యం చేయకుండా త్వరగా ప్రకటించాలని ఆల్ ఇండియా ఎన్‌పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. అక్టోబర్ వరకు ఆలస్యం చేయకుండా, కేంద్ర మంత్రివర్గం త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Also Read: టీచర్లకు బెదిరింపులు.. 'కాక్రోచ్ జనతా పార్టీ' అభిజీత్ దీప్కేపై కేసు నమోదు!
Also Read: రైలు ఒక కిలోమీటర్ ప్రయాణించాలంటే ఎన్ని లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అల్పపీడన అలర్ట్!
Hyderabad, Telangana:Andhra Pradesh Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీని ప్రభావం వల్ల రానున్న రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.
మత్స్యకారులకు బలమైన హెచ్చరికలు..
అల్పపీడన తీవ్రత కారణంగా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీనితో పాటు సముద్రం తీవ్ర అలజడిగా మారి అలలు భారీ ఎత్తున ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా మంగళవారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఏయే జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది?
సోమవారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలకు కీలక సూచనలు
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో బయట ఉన్న ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బలమైన గాలుల వల్ల చెట్లు, భారీ హోర్డింగులు కూలిపోయే ప్రమాదం ఉన్నందున, ఎవరూ వాటి కింద నిలబడకూడదని స్పష్టం చేశారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులను గమనిస్తూ ప్రజలంతా రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: ఏపీ నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి శుభవార్త.. మరో 3,000 టీచర్ పోస్టుల భర్తీకి రెడీ!
Also REad: ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సుకు ఘోరం ప్రమాదం..20 మంది విద్యార్థులు, దూసుకెళ్లింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Irumudi Collections: 'ఇరుముడి' సినిమా ఆల్‌టైమ్ రికార్డ్..36 గంటల్లో బ్రేక్ ఈవెన్ తెచ్చుకొని సంచలనం!
Hyderabad, Telangana:Irumudi Collection Day 2: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన తాజా ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. రవితేజ కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక వసూళ్లతో ఈ సినిమా ఒక సరికొత్త మైలురాయిని తాకింది. సినిమా విడుదలైన 36 గంటల్లోనే సినిమా కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.BJP Strike: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ పోరు.. 2 రోజుల నిరాహార దీక్ష
Baddipadaga, Telangana:Telangana BJP Protest: విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిపులు చెల్లించడం లేదని తెలంగాణ బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిపులు పెండింగ్‌లో పడడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రమాదకరంగా మారిందని కాషాయ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేపటి నుంచి తెలంగాణ బీజేపీ నిరాహార దీక్ష చేపట్టనుంది.
రాష్ట్రంలో విద్యావ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తాము పోరాటం చేస్తామని.. ఫీజు బకాయిలు చెల్లించేవరకు బీజేపీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు స్పష్టం చేశారు. రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి నుంచి హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో రెండు రోజుల నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.
న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని.. విద్యార్థులు, యువత తీవ్ర ఆందోళనలో ఉన్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.12,000 కోట్లకు చేరాయని.. నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలలు అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాయి. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయి' అని వెల్లడించారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై హైకోర్టు తీవ్ర స్థాయిలో చీవాట్లు పెడితే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట రేపటి నుంచి 2 రోజుల నిరాహార దీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. పోలీసుల ఆంక్షలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ అడుగుపెట్టే హక్కు లేదు
'రాహుల్ గాంధీకి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదు. ఎన్నికల వేళ తెలంగాణ విద్యార్థులకు ‘యూత్ డిక్లరేషన్’ పేరుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించారు' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జీలు జరుగుతుంటే.. ఆయుష్ విద్యార్థులు స్టైపెండ్ల కోసం పోరాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా విదేశాలకు పారిపోతూ రోడ్లపై డ్రామాలు చేసే రాహుల్ గాంధీకి దమ్ముంటే హైదరాబాద్‌కు వచ్చి విద్యార్థుల సమస్యలపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణలో విద్యార్థులు రాహుల్ గాంధీని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
కాంగ్రెస్ 30 శాతం కమీషన్ల సర్కార్
కాంగ్రెస్ ప్రభుత్వం 'బ్రదర్స్ సర్కార్'గా మారి దోపిడీ చేస్తోందని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా 30 శాతం కమీషన్లు తీసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్లను 22ఉ పేరుతో తీవ్రంగా వేధిస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో అవినీతి కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కావడంతోనే ఆ పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలు, రహస్య సమావేశాలు జరుగుతున్నాయని వివిరించారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు కూడా ప్రభుత్వాన్ని నడిపించేలా కనిపించడం లేదని తెలిపారు.
Jagadish Reddy: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి: జగదీశ్ రెడ్డి
Hyderabad, Telangana:Telangana Bhavan: తెలంగాణ రైతు పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండే దానికంటే ఎక్కువ అధ్వానమైపోయిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పి రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పి కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలని కోరారు. రైతులకు ఎల్‌నినో పెట్టిన శాపం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన శాపం అని పేర్కొన్నారు. పోలవరం నుంచి పట్టిసీమ నుంచి బ్రహ్మాండంగా నీళ్లు పోతున్నాయని.. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి ఉంటే మల్లన్నసాగర్, కొండ పోచమ్మ, రంగనాయక సాగర్ నిండేవి అని తెలిపారు.
హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ కలిసి ఆడిన నాటకం ద్రోహం ఇప్పుడు తేటతెల్లమైందని తెలిపారు. 'కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌లపై కేంద్ర జల సంఘం ఇచ్చిన రిపోర్ట్‌తో కలిసి ఆడుతున్న నాటకం తేటతెల్లమైంది. మేడిగడ్డ బ్యారేజ్‌తో సంబంధం లేకుండా కన్నేపల్లి పంపుహౌస్ ఆన్ చేయాలని కేటీఆర్ అనేక సార్లు చెప్పిన రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. చెప్పిన అబద్ధమే చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సాకు చెప్పింది' అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కమీషన్లకు అలవాటుపడిన కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
'పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ఏ విధంగా దోచుకుంటున్నారో వాస్తవాలు ప్రజలకు చూపించా. రాజశేఖర్ రెడ్డి పెట్టిన పోతిరెడ్డిపాడు బొక్కతో అంతులేకుండా నీళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్తుంది' అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి వరద జలాలను మాత్రమే తీసుకుపోవాలని గుర్తుచేశారు. దుర్మార్గంగా 140 టీఎంసీల నీళ్లను ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీళ్లను తీసుకెళ్లింది. సాగర్‌లో ఇప్పటివరకు 175 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 110 టీఎంసీల నీళ్లు వచ్చి ఉంటే సాగర్ నిండేది. నాగార్జున సాగర్‌లో ఎడమ కాల్వ కింద ఉండే పంటలకు సరిపడే నీళ్లు ఉండేవి' అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వివరించారు.
'నాగార్జున సాగర్‌లో 518 అడుగుల నీళ్లు ఉన్నప్పుడే ఎడమ కాల్వ కింద సాగునీరు ఇచ్చాం. సాగర్‌లో 510 అడుగుల నీళ్లు ఉన్నప్పుడే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎడమ కాల్వ కింద సాగునీరు ఇచ్చాడు. పెన్నా బేసిన్లో వరద రాకున్నా రాయలసీమలో 52 శాతం వర్షపాతం తక్కువ ఉన్నా మహబూబ్ నగర్ పరిధిలో ఉండే పంపులు ఇంతవరకు ఆన్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణాలో ద్రోహం చేస్తోంది' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
'నీళ్లు ఇస్తే కరెంట్ కొనాలని.. పంటలు వేస్తే ఎరువులు ఇవ్వాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం లేదు. పంట కొంటే బోనస్ ఇవ్వాలి. దుర్మార్గమైన ఆలోచనతో నీళ్లు ఇవ్వడం లేదు' అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌నినో పేరుతో దుర్మార్గమైన ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని.. నీళ్లు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని విమర్శించారు.
'నాగార్జున సాగర్ నిండిన రైతులకు నీళ్లు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పాడు. ఆరుతడి పంటలు ఏం వేసుకోవాలో ఏ జిల్లాలో ఏం పంటలు పండుతాయిని మంత్రులు ఒక్కరంటే ఒక్కరు చెప్పినవారు లేరు. ఏ గింజ పెట్టుకోవాలన్నా నీళ్లు కావాలి, రైతులకు నీళ్లు ఎలా ఇస్తారు' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
