రాజేంద్ర నగర్లో 326 కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ప్రకాష్‌గారు పంపిణీ చేశారు.
Hyderabad, Telangana:రాజేంద్రనగర్ ఎమ్మార్వో కార్యాలయంలో 326 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎమ్మార్వో రాములు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పెళ్లికి పేదింటి ఆడబిడ్డలకు డబ్బులిచ్చి అద్భుత పథకం అందించారన్నారు. ఈ కళ్యాణలక్ష్మి యోజన ద్వారా ఎంతో మంది పేద ఆడపిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Nepal Floods: నేపాల్‌లో ప్రకృతి విలయం..ఆకస్మిక వరదలతో భూకంపం..మౌలిక వసతుల విధ్వంసం!
Namarjung, Gandaki Province:Flash Floods Nepal: నేపాల్‌లోని రసువా, ధాదింగ్, నువాకోట్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. రసువా జిల్లాలోని భోటేకోశీ నది ఉధృతంగా ప్రవహించడంతో అనేక గ్రామాలు, వంతెనలు, రోడ్లు, జలవిద్యుత్ ప్రాజెక్టులు బురద, శిథిలాల కింద చిక్కుకుపోయాయి. గల్లంతైన 348 మందిలో 105 మంది భారతీయులు, 93 మంది నేపాల్ పౌరులు, 12 మంది బ్రిటిష్, ముగ్గురు అమెరికన్ పౌరులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ దారుణ విపత్తుకు భూకంపం ప్రేరేపిత కొండచరియలే కారణమని నేపాల్ విదేశాంగ మంత్రి షిషిర్ ఖనాల్ పార్లమెంటులో వివరించారు. బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో టిబెట్ భూభాగంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో భారీగా మంచు, రాళ్లతో కూడిన కొండచరియలు విరిగిపడి టిబెట్ వైపు ఉన్న లెండే ఖోలా నది ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. నీరు నిలిచిపోయి ఆ అడ్డుకట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో, భోటేకోశీ నదిలోకి వరద ప్రవాహం విపరీతంగా పోటెత్తింది.
మౌలిక వసతుల విధ్వంసం..
ఈ వరదల కారణంగా 11 జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఒక సౌర విద్యుత్ ప్రాజెక్టు దెబ్బతినడంతో జాతీయ గ్రిడ్‌కు 431.1 మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. త్రిశూలి నదిపై ఉన్న కనీసం 19 వంతెనలు దెబ్బతినగా, సుమారు 40 కిలోమీటర్ల మేర రహదారులు కొట్టుకుపోయినట్లు రోడ్ల శాఖ అధికార ప్రతినిధి శుభరాజ్ నెఉపానే వెల్లడించారు.
భారత్ అండ..హెచ్చరికలు..
నేపాల్ సైన్యం, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ఫోన్లో మాట్లాడి సంతాపం తెలపడంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు, అత్యవసర మందులను పంపేందుకు సిద్ధమయ్యారు. నది ఎగువన ఇంకా అవరోధాలు ఉండటంతో మరోసారి వరద ముప్పు పొంచి ఉందని భావించి, భారత సరిహద్దు రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో కూడా వరద హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: భర్తను చంపి, పేగులు బయటకు తీసిన భార్య..కురుక్షేత్రలో ఘోర హత్యోదంతం!
Also Read: స్కూల్ విద్యార్థినులతో కలిసి ప్రిన్సిపాల్ స్నానం..వీడియో వైరల్ కావడంతో సస్పెండ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Congress: కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నా.. క్రమశిక్షణ తప్పలేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Hyderabad, Telangana:Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశమవడం చర్చనీయాంశంగా మారింది. భేటీ అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. క్రమశిక్షణ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
క్రమశిక్షణ విషయంలో రేవంత్ రెడ్డి, నేను పార్టీకి కట్టుబడి ఉంటామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తాను ఎక్కడ మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. 'కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేయాలని మాత్రమే నేను మాట్లాడా. పార్టీ బలోపేతం కోసం నేను మాట్లాడా. కానీ పార్టీని బలహీన పరిచే విధంగా నేను మాట్లాడలేదు. అందరం కలిసి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం' అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
తాను మాట్లాడిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలు మారాయని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్తుచేశారు. అభివృద్ధి నిధుల కోసమే తాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరకు వచ్చినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తనకు ఎదురుపడ్డాడని.. అతడి రాకకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 'తెలంగాణలో ఆంధ్ర మీడియా పెత్తనం ఎక్కువైంది. నాలాంటి నిఖారైనా నాయకుడిని ఆంధ్ర మీడియా కంట్రోల్ చేయలేదు. తెలంగాణలో ఆంధ్ర మీడియా చానల్స్ నా లాంటి సీనియర్లపై అసత్య కథనాలు రాస్తున్నాయి. నాపై అసత్య కథనాలు ప్రచారం చేస్తే సంగతి చూస్తా' అని హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో పార్టీ సీనియర్ నాయకులు, ప్రభుత్వ సలహాదారులు వి. హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చి ప్రజా సమస్యల పరిష్కార కేంద్రంగా మార్చారు. గాంధీ భవన్ కూడా ప్రజల సమస్యల పరిష్కార వేదిక అయ్యేలా ముఖాముఖీ కార్యక్రమం చేపట్టాం' అని వెల్లడించారు. 'ఈ రోజు నా దృష్టికి భూముల సమస్యలు ఎక్కువ వచ్చాయి. పటేల్ పట్వారి విధానం వల్ల భూ సమస్యలు తక్కువగా ఉండేవి. నాడు ఇందిరా గాంధీ పంచిన భూములు మళ్లీ భూస్వాములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో తప్పిదాలు జరుగుతున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి పటిష్ట చర్యలు తీసుకోవాలి' అని పేర్కొన్నారు.
Zee 24 Ghanta: పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి ఆరు సూత్రాలు ప్రకటించిన సువేందు అధికారి
Kolkata, West Bengal:Zee 24 Ghanta Mega Conclave: చారిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ పశ్చిమ బెంగాల్లో వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు వివరించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పాలన వంద రోజుల పాలన పూర్తి చేసుకుందని.. 6 సూత్రాల ప్రణాళిక, 3 ప్రత్యేక కమిటీలు వేస్తున్నట్లు సువేందు అధికారి ప్రకటన చేశారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కలకత్తాలో జరిగిన జీ 24 ఘంటా సదస్సులో సీఎం సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని స్వయం సమృద్ధిగా మార్చేందుకు 6 సూత్రాల ప్రణాళికను సువేందు అధికారి ఆవిష్కరించారు. పారిశ్రామిక పునరుద్ధరణ, పరిపాలనా నిర్ణయాలు, అవినీతి ఫిర్యాదులకు సంబంధించి 3 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి, సరిహద్దు భద్రత, విద్య, పర్యాటకం వంటి పలు అంశాలపై జీ 24 కాంక్లేవ్‌లో చర్చించారు.
Irumudi: 'ఇరుముడి' కోసం మక్తల్ థియేటర్లో ప్రేక్షకుల ధర్నా
Makthal, Telangana:Audience And Actor Ravi Teja Fans Protest For Irumudi Movie At Makthal Watch VisualsNikhil: 'స్వయంభూ' కోసం తిరుమల శ్రీవారి వచ్చిన యువ నటుడు నిఖిల్
Dharmavaram, Andhra Pradesh:Actor Nikhil Siddarth Visits Tirumala Temple For Swayambhu Movie Watch VisualsBigg Boss 10 Telugu: బిగ్‌బాస్ ఆఫర్‌ను రెండుసార్లు తిరస్కరించిన క్రేజీ సీరియల్ హీరో..ఈసారి మాత్రం తానే వస్తా అంటున్నాడు!
Hyderabad, Telangana:Mukesh Gowda Bigg Boss 10 Telugu: తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ హీరోలకు ఉండే క్రేజ్, ఫాలోయింగ్ సాధారణంగా ఒక సినిమా హీరో రేంజ్‌లోనే ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటుల్లో 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ ఒకరు. సాధారణంగా ముఖేష్ గౌడ అంటే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు కానీ, 'గుప్పెడంత మనసు' సీరియల్లో రిషి అంటే మాత్రం ప్రేక్షకులు ఇట్టే గుర్తుపడతారు.
ఈ సీరియల్లో ఆయన నటన, లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది, ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనను 3 లక్షల కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఈ విశేష ఆదరణ కారణంగానే ఆయనకు సినిమాల్లో కూడా వరుస అవకాశాలు లభిస్తున్నాయి.
ఇంతటి క్రేజ్ ఉన్న ఈ నటుడికి గతంలోనే బిగ్‌బాస్ షో నిర్వాహకుల నుంచి ఆహ్వానాలు అందాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తెలుగు బిగ్‌బాస్ నుంచే కాకుండా, కన్నడ బిగ్‌బాస్ నుంచి కూడా భారీ రెమ్యునరేషన్ ఆఫర్లతో పిలుపు వచ్చిందని, అయితే అప్పట్లో బిగ్‌బాస్ గేమ్ తనకు పూర్తిగా అర్థం కాకపోవడం వల్లే ఆ ఆఫర్లను తిరస్కరించానని ముఖేష్ తెలిపారు.
ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అగ్ని పరీక్ష సీజన్ 2 ముగింపు దశకు చేరుకోవడంతో, సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ కొత్త సీజన్ ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పటికే హౌస్ లోకి వెళ్లే సెలబ్రిటీ కంటెస్టెంట్లను ఫైనల్ చేసే పనిలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. సోషల్ మీడియాలో పల్లవి గౌడ, తేజస్విని గౌడ, కావ్యశ్రీ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, జబర్దస్త్ ఫేమ్ ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ వంటి ఎందరో ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే, ఈసారి ఈ జాబితాలో ముఖేష్ గౌడ పేరు మరింత బలంగా వినిపిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు మారాయని, ఈ పదో సీజన్లో ముఖేష్ ఖచ్చితంగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే గ్రాండ్ లాంచింగ్ వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Toxic Vs Irumudi: 'టాక్సిక్' నెగటివ్ టాక్.. రవితేజ 'ఇరుముడి' సినిమాకు ఊహించని బూస్ట్
Also Read: చిరంజీవి 'విశ్వంభర' విడుదల అవుతుందా? మూవీ యూనిట్ ఏం చేస్తుంది? 2027లో కూడా డౌటే?!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
సెప్టెంబర్‌లో లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ 4 రాశుల వారికి కనకవర్షం ఖాయం!
Hyderabad, Telangana:Lakshmi Narayana Raja Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికతో పాటు వాటి మార్పులు మానవ జీవితాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి గ్రహాలు అనుకూలం స్థానంలో ఉంటే అదృష్టం తలుపు తడుతుంది సరిగ్గా 2026 సెప్టెంబర్ నెలలో కూడా ఒక మహా అద్భుతం జరగబోతోంది ఈ నెలలో గ్రహాల గమనం అనేక అద్భుతాలకు మార్పులకు నాంది పలకబోతోంది. ముఖ్యంగా రెండు ప్రధాన గ్రహాలు కలిసినప్పుడు ఏర్పడే ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఈ సమయంలో ఏర్పడబోతోంది ఈ అరుదైన యోగంతో నాలుగు రాశుల వారికి ధన లాభాలతో పాటు కనక వర్షం కురవబోతోంది. అయితే, ఏ రాశుల వారికి అదృష్టం లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 26వ తేదీ బుధ గ్రహం తులా రాశిలోకి సంచారం చేసింది. అప్పటికే తులా రాశిలో శుక్రుడు సంచార దశలో ఉన్నాడు.. తులారాశిలో ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక కారణంగానే ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రాజయోగం వల్ల మహర్దశ పట్టబోతోంది.. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అనుకున్న ధన లాభాలు కలగబోతున్నాయి.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
వృషభ రాశి
ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వృషభరాశి వారికి అంతులేని ధన లాభాలు కలగబోతున్నాయి.. వీరు చేపట్టే ప్రతి పనిలో అద్భుతమైన విజయాలు కలుగుతాయి. సకల భౌతిక సుఖాలు కలగడమే కాకుండా భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో రకాల ప్రణాళికలు ఈ సమయంలో కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా మిత్రులకు సంబంధించిన ఆస్తులు కూడా మీ వైపు వచ్చే అవకాశాలున్నాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండటమే కాకుండా జీవితం మరింత అద్భుతంగా ఆనందకరంగా మారుతుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ సమయం ఒక స్వర్ణ యుగం లాంటిది లక్ష్మీనారాయణ రాజయోగ ప్రభావంతో వీరికి కొత్త కొత్త ఆదాయ మార్గాలు లభించడమే కాకుండా ఆర్థికంగా అతిపెద్ద ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులు అందరికీ భారీ మొత్తంలో లాభాలు చేకూరుతాయి.. కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా మారి అనుకున్న పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు.
కన్యారాశి
సుదీర్ఘకాలం తర్వాత కన్యా రాశి వారికి విశేషమైన అదృష్టం పట్టబోతోంది. ఈ శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగ ప్రభావంతో జీవితం పూర్తిగా మారబోతోంది. ముఖ్యంగా చాలా కాలంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో కళ్ళు చెదిరే ధన లాభాలు కలుగుతాయి. కొత్తగా ఏదైనా వ్యాపారాలు లేదా ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులందరికీ అద్భుతమైన సమయం లాంటిది. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
వృశ్చిక రాశి
ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగ ప్రభావం వృచ్చిక రాశి వారిపై కూడా పడుతుంది. దీని కారణంగా వీరికి అకస్మాత్తుగా ధన లాభాలు కలగడమే కాకుండా.. జీవితంలో వస్తున్న అనేక కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. కోరుకున్న కోరికలు సింపుల్‌గా నెరవేరి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కూడా లభించబోతున్నాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో అనుకుంటున్నా పనులు ఎంతో సులభంగా చేయగలిగి సింపుల్‌గా విజయాలు సాధించగలుగుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Kalvakuntla Kavitha Mudhiraj: పెళ్లికొడుకు స్థానంలో నవ వధువుకి తాళికట్టిన కల్వకుంట్ల కవిత..
Hyderabad, Telangana:Kalvakuntla Kavitha Mudhiraj Marriage: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుడి తరఫు కుటుంబ సభ్యురాలిగా ఒక వివాహ వేడుకలో పాల్గొని, ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం కీలకమైన ఆచారాలను నిర్వహించారు. తెలంగాణ జాగృతి నాయకురాలైన ఆమె, తెలంగాణ రక్షణ సేన నాయకుడు బాషబోయిన బాలప్రసాద్, శివానిల వివాహానికి హాజరయ్యారు. ఈ వివాహ వేడుక ఈసీఐఎల్ (ECIL) కీసర క్రాస్ రోడ్ సమీపంలోని ఆరాధ్య కన్వెన్షన్‌లో జరిగింది.Irumudi Collection: రూ.100 క్లబ్‌లోకి రవితేజ 'ఇరుముడి'..మాస్ మహారాజ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బాస్టర్!
Hyderabad, Telangana:Irumudi Rs 100 Crore Collection: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన తాజా ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటి రోజే నుంచే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. రవితేజ కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక వసూళ్లతో ఈ సినిమా ఒక సరికొత్త మైలురాయిని తాకింది. సినిమా విడుదలైన వారంలోపే రూ.100 కోట్ల కలెక్షన్ల్ గ్రాస్ ను కొల్లగొట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది.Fastag Traffic Fines: వాహనదారులకు బిగ్ అలర్ట్..ఇకపై ఫాస్టాగ్ ద్వారా ట్రాఫిక్ చలాన్లు ఆటోమేటిక్ వసూళ్లు!
Hyderabad, Telangana:Fastag Traffic Fines Deduction: హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాలు, ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు సమగ్ర ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజా రవాణా బలోపేతం, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ, మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో, ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడానికి సాంకేతికత సాయంతో ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.
ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనుల ఈ-చలాన్ జరిమానాలను నేరుగా వారి ఫాస్టాగ్ ఖాతా నుంచే ఆటోమేటిక్‌గా కట్ చేసే విధానాన్ని ప్రతిపాదిస్తున్నారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వార్షికోత్సవ కార్యక్రమంలో జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఈ సరికొత్త ప్రతిపాదన వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ విధానానికి సంబంధించి హెచ్ఎండీఏ (HMDA) అధికారులతో చర్చలు జరుగుతున్నాయని, అనుమతులు, సాంకేతిక అంశాలు పూర్తయిన తర్వాత దీనిని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుత విధానం ప్రకారం కెమెరాలు, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల ద్వారా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి వాహనదారులకు ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు. అయితే, చాలామంది వాహనదారులు ఈ జరిమానాలను వెంటనే చెల్లించకుండా పెండింగ్‌లో పెడుతున్నారు. దీనివల్ల బకాయిల వసూలు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి వస్తోంది. కానీ కొత్తగా ప్రతిపాదించిన ఫాస్టాగ్ అనుసంధాన విధానం అమల్లోకి వస్తే, జరిమానా విధించిన వెంటనే మొత్తం ఆటోమేటిక్‌గా వసూలైపోతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ విధానం కేవలం చలాన్ల వసూళ్లకే కాకుండా, నగరంలో ట్రాఫిక్ నిర్వహణకు సాంకేతికతను జోడించే దిశగా ఒక కీలక అడుగు కానుంది. దీనివల్ల నిబంధనలు ఉల్లంఘించే వారిపై తక్షణ ఆర్థిక ప్రభావం పడుతుంది. అయితే, ఈ కొత్త విధానం ఎప్పుడు అమలవుతుంది? జరిమానాలు ఏ నిబంధనల ప్రకారం కట్ చేస్తారు? ముందస్తు సమాచారం ఎలా ఇస్తారు? అనే విషయాలపై ఇంకా అధికారికంగా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
ఏదేమైనా, ఈ సరికొత్త నియమం అమల్లోకి వస్తే చలాన్ పడిన వెంటనే ఫాస్టాగ్ ఖాతా నుండి డబ్బు కట్ అవుతుంది కాబట్టి, ఇది వాహనదారుల జేబులకు భారీగా చిల్లు పెట్టే విషయమేనని సాధారణ జనం అభిప్రాయపడుతున్నారు.
Also Read: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మరోసారి ఫైర్..రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ప్రెస్‌మీట్
Also Read: మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే వార్త.. తెలంగాణలో 121 కొత్త అంతర్జాతీయ బ్రాండ్లు సిద్ధం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
12 ఏళ్ల పాపలా నటించి ఫ్యామిలీని ముంచిన 37 ఏళ్ల మహిళ.. చివరికి ఏమైందంటే?
Hyderabad, Telangana:Real-Life Orphan Movie Case News: సినిమాల్లో మాత్రమే చూసే వింతైన మోసాలు ఒక్కొక్కసారి నిజజీవితంలోనూ జరిగి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి.. హాలీవుడ్ లో సంచలనం సృష్టించిన అనాధ సినిమా మీకు గుర్తుందా? అచ్చం అలాంటి ఘటన బ్రెజిల్ లో వెలుగు చూసింది.. ఒక 37 ఏళ్ల మహిళ..ఆటిజంతో బాధపడుతున్న 12 ఏళ్ల చిన్నారిగా నటించి ఏకంగా ఒక కుటుంబాన్ని దారుణంగా మోసం చేసింది.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం.. ఇప్పుడు ఈ హైడ్రామాకు ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రెజిల్ కు చెందిన అమండ సౌజా డి ఒలివేరా అనే మహిళ ఈ కళ్ళు చెదిరే మోసానికి పాల్పడింది.. శాంటా కాటరినా రాష్ట్రంలో స్థానికంగా ఉండేవో చర్చికి వెళ్లే ఒక దంపతులను ఆమె టార్గెట్ చేసింది.. చర్చి పాస్టర్ ద్వారా వారితో పరిచయం పెంచుకొని.. తన పేరు గాబ్రియేలని .. తాను తీవ్రమైన ఆటిజంతో బాధపడుతున్నానని 12 ఏళ్ల అనాధ బాలికనని వారిని నమ్మించింది.. వారిలో సానుభూతి పొందేందుకు నోట్లో చిన్నపిల్లల పీకపెట్టుకొని తిరగడంతో పాటు పాల బాటిల్‌తో పాలు తాగడం, అర్ధరాత్రి నిద్రలో ఉలిక్కిపడి లేవడం, మెనీ మోర్ లాంటి బొమ్మల దుస్తులు వేసుకోవడం.. ఇలా అచ్చం చిన్నపిల్లల వ్యవహరిస్తూ దంపతులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసింది..
పాప అనుకోవడానికి ఆమె శరీర ఆకృతి పెద్దవారిలా ఎందుకు ఉందన్న అనుమానం రాకుండా ఆ యువతి ఒక పెద్ద కట్టుకతే అల్లింది.. చిన్నతనంలో తన తల్లిదండ్రులు తనను తీవ్రంగా హింసించారని.. బలవంతంగా హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వడం వల్లే తాను త్వరగా ఎదిగిపోయిందని.. పెద్ద దానిలాగా కనిపిస్తున్నానని కన్నీళ్లు పెట్టుకుంది.. దీంతో ఆ దంపతులు చలించిపోయారు.. ఏకంగా 14 నెలల పాటు తనను ఇంట్లో ఉంచుకొని.. ఆమె పన్నెండు పుట్టినరోజు వేడుకలను కూడా ఎంతో అద్భుతంగా నిర్వహించారు.. ఆమె బరువు తగ్గడం కోసం మౌన్‌జారో అనే ఖరీదైన మందులు కూడా కొనిచ్చి కంటికి రెప్పలా ఆ యువతీని కాపాడారు. ఆమెను చట్టబద్ధంగా దత్తత తీసుకునేందుకు కూడా వాళ్ళు సిద్ధమయ్యారు..
ఆ దంపతులకు చెందిన ఒక బంధువుకు ఆ యువతి వింత ప్రవర్తన పై అనుమానం వచ్చింది.. ఇంటర్నెట్లో ఇలాంటి కేసుల గురించి వెతకగా.. ఈమె ఇలాగే మోసం చేసిన పాత పాత వార్తలు కూడా కొన్ని కనిపించాయట.. ఆ బంధువులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం బయటపడింది.. పోలీసులు ఆ యువతీని విచారించగా మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి.. ఆమె ఒక ప్రొఫెషనల్ మోసం చేసే యువతి అని.. దాదాపు ఏడు రాష్ట్రాల్లో ఇలాగే పేర్లు మార్చుకొని కుటుంబాలను మోసం చేసిందని గుర్తించారు. దత్తత తీసుకునే వారి నుంచి మరింత సానుభూతి కోసం ఏకంగా తన శరీరంలో 200 సూదులను స్వయంగా గుచ్చుకొని.. కన్నవాళ్లే చిత్రహింసలు పెట్టారని నమ్మించే ప్రయత్నం చేసిందట..
తాను మానసిక రోగినని.. ఎవరినీ మోసం చేయలేనని కోర్టులో ఆ యువతి వాదించింది. కానీ ఆమె పక్క ప్లాన్ ప్రకారమే మోసాలకు పాల్పడిందని గుర్తించిన న్యాయమూర్తి ఆ వాదనను తోసిపిచ్చారు. ఆమెపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో కోర్టు ఆమెకు దాదాపు ఏడున్నర సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
No Traffic Lights: ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేని ఏకైక దేశం ఇదే..
Hyderabad, Telangana:No Traffic Lights Country: ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా నగరాల్లో వాహనాల్లో ఒకచోట నుంచి మరొక చోటికి వెళ్లడం ఊహించగలమా? ఎక్కడ చూసినా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో వెలిగే లైట్లు మనం చేసే ట్రావెలింగ్ ను అద్భుతంగా నియంత్రిస్తూ ఉంటాయి. అయితే ప్రపంచంలో ఎక్కడా ఒక ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేని దేశం ఒకటి ఉందని చెబితే మీరు నమ్ముతారా? మీరు తప్పకుండా నమ్మాల్సిందే.. అవును మీరు విన్నది నిజమే.. ఆ దేశం మరేదో కాదు మన పురుగున ఉన్న అద్భుతమైన హిమాలయ దేశం భూటాన్..
ప్రపంచమంతా సాంకేతికత వైపు పరుగులు తీస్తూ ఉంటే.. భూటాన్ మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది.. ఆ దేశ రాజధాని థింఫూ తో సహా దేశంలో ఎక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్ కూడా మనకు కనిపించదు.. ఇందుకు ప్రధాన కారణం అక్కడి ప్రజలు మనస్తత్వంగా భావించవచ్చు.. ట్రాఫిక్ లైట్లు అనేవి కేవలం యంత్రాలని.. వాటికి ఎలాంటి బాగోద్వేగాలు ఉండవని భూటాన్ ప్రజలు నమ్ముతూ ఉంటారు.. యంత్రాల ద్వారా నియంత్రించడం కంటే తోటి మనుషులే దారి చూపడాన్ని వారు ఇష్టపడతారట..
అయితే, భూటాన్‌లో ఎప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ను ప్రయత్నించలేదా అంటే.. చేశారు కూడా.. కొన్ని సంవత్సరాల క్రితం థింఫూ నగరంలోని ఓ రద్దీ ఉండే కూడలిలో మొదటిసారిగా ఒక ట్రాఫిక్ లైట్‌ను ప్రభుత్వం ప్రయోజనాత్మకంగా ఏర్పాటు చేసింది.. కానీ ఆ లైట్లను చూసి అక్కడ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.. అది యాంత్రికంగా ఉందని.. మనుషుల మధ్య ఉండే ఆత్మీయ బంధాన్ని దూరం చేస్తోందని వారు భావించారట.. ప్రజల వ్యతిరేకతను గమనించిన అక్కడి ప్రభుత్వం.. ఆ లైట్లను పెట్టిన 24 గంటల్లోనే తీసేసిందట.. అప్పటినుంచి ఇప్పటివరకు భూటాన్ లో మళ్ళీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఊసే ఎత్తలేదు..
సిగ్నల్స్ లేనప్పుడు అంత రద్దీలో ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేస్తారని సందేహం రావడం సహజం.. అయితే, థింఫూ నగరంలోని కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా డిజైన్ చేసిన అందమైన బూతులలో నిలబడి.. తమ చేతి సైగలతో వాహనాలను నియంత్రిస్తూ ఉంటారట.. వారు ఎంతో ఓపికగా.. నవ్వుతూ ట్రాఫిక్ క్లియర్ చేయడం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.. ప్రజలు కూడా నిబంధనలు పాటిస్తూ ఎంతో క్రమశిక్షణతో డ్రైవ్ చేస్తారు.. కాబట్టి అక్కడ ప్రమాదాలు జరగడం చాలా అరుదు..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
భూటాన్ దేశం అభివృద్ధిని GDPతో కాకుండా ప్రజల సంతోషంతో కొలుస్తుంది.. ప్రజల సంతోషానికి.. ప్రశాంతతకు భంగం కలిగించే ఆధునికతను వారు సున్నితంగా తిరస్కరిస్తారట.. ట్రాఫిక్ లైట్ ల స్థానంలో పోలీసులను నియమించడం కూడా ఇందులో భాగమే.. యంత్రాలకంటే మనుషులకే ఎక్కువగా విలువనిచ్చే భూటాన్.. నిజంగా నేటి ప్రపంచానికి ఒక గొప్ప ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదని కొంతమంది నిపుణులు చెబుతూ వస్తున్నారు..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Suryakumar Yadav Reentry: టీమ్ఇండియాలోకి సూర్యకుమార్ యాదవ్ రీఎంట్రీ? బీసీసీఐ నుంచి కీలక సమాచారం లీక్!
Hyderabad, Telangana:Suryakumar Yadav Re-Entry News: గత టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాను విజయపథంలో నడిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత జట్టులో కనుమరుగయ్యాడు. ప్రపంచ ఛాంపియన్‌గా భారత్‌ను నిలబెట్టిన సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి తప్పించడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే టీ20లతో పాటు ఇతర సిరీస్‌లలో భారత్ వరుస ఓటముల తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ను తిరిగి జట్టు కెప్టెన్‌గా తీసుకోవాలని బీసీసీఐ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
అంతకుముందు, దేశవాళీ క్రికెట్లో నిలకడగా పరుగులు సాధిస్తే సూర్యకుమార్ యాదవ్ భారత జట్టులోకి తిరిగి రాగలరని BCCI (భారత క్రికెట్ నియంత్రణ మండలి) వర్గాలు ANIకి తెలిపాయి. బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోవడంతో, ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ముందు సూర్యకుమార్ యాదవ్ T20I కెప్టెన్సీని కోల్పోవడమే కాకుండా జట్టు నుంచి కూడా తొలగించారు. ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్‌ను కొత్త T20I కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది.
అయితే, అయ్యర్ నాయకత్వంలో భారత జట్టు ప్రదర్శన అంతగా ఆశాజనకంగా లేదు. ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన 'మెన్ ఇన్ బ్లూ' (భారత జట్టు), ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 4-0తో ఓటమిని చవిచూసింది (మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది).
BCCI వర్గాల సమాచారం ప్రకారం, సూర్యకుమార్ పునరాగమన అవకాశాలను బోర్డు పూర్తిగా తోసిపుచ్చలేదు. ప్రస్తుత ప్రణాళికల్లో లేనప్పటికీ, దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తే జట్టు ఎంపికకు ఆయన పరిగణించబడే అవకాశం ఉంది. "సూర్యకుమార్ యాదవ్‌కు ఇంకా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అతను జట్టు ఎంపిక పరిశీలనలో లేనప్పటికీ, దేశవాళీ క్రికెట్లో నిలకడగా పరుగులు సాధిస్తే తిరిగి జట్టులోకి వచ్చే అర్హత అతనికి ఉంది" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ప్రకారం.. టీమ్ఇండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య కొలంబోలో కలిశారు. సూర్యకుమార్ జయసూర్యను పలకరిస్తూ కాసేపు మాట్లాడటం కనిపించింది. జయసూర్య చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించిన భారత బ్యాటర్, ఆయన అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారా అని సరదాగా అడిగారు. "మరింత ఫిట్‌గా తయారవుతున్నారు, పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నారా? చూస్తుంటే 100% అలాగే అనిపిస్తోంది" అని ఆయన అన్నారు. ఆ కామెంట్‌కు శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య నవ్వారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్ల మనసులను గెలుచుకుంది.
Also Read: శ్రీలంకతో టెస్టులో ఉద్రిక్తత..లంక బౌలర్‌తో యశస్వి జైస్వాల్ రణరంగం..వీడియో వైరల్!
Also Read: డబ్ల్యూటీసీ రేసులో భారత్ అసలు సిసలైన పరీక్ష.. ఫైనల్ చేరాలంటే భారత్ ఇలా చేయాలి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Costly Egg Auction: డజన్ కాదు ఒక్కటే.. రూ.25 వేలకి అమ్ముడుపోయి కోడిగుడ్డు..
Hyderabad, Telangana:Egg Sold For Rs 25k: సాధారణంగా ఒక కోడిగుడ్డు ధర ఎంత ఉంటుంది.. మహా అయితే దాదాపు 7 నుంచి 8 రూపాయల వరకు ఉంటుంది.. కొన్ని కోడిగుడ్ల ధరలు దాదాపు 20 రూపాయలు ఉంటాయి.. కానీ ఎవరైనా ఒక కోడిగుడ్డుని ఏకంగా 25,000 పెట్టి కొన్నాను అంటే మీరు కళ్ళు మూసుకొని నమ్మగలుగుతారా..? అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజమే.. ఈ ఆశ్చర్యకరమైన ఘటన లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఒక సాధారణ కోడి గుడ్డును వేలంలో ఏకంగా 25 వేల రూపాయలకు కొనుగోలు చేసేసారంటే నమ్మాల్సిందే.. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం తెలిసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆ కారణమేంటో? ఇంత ధరకు అమ్ముడు పోవడానికి గల కారణాలు.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవల ఇరాన్లో నెలకొన్న ఘర్షణలతో పాటు యుద్ధ వాతావరణం వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ఇరాన్ బాధితులకు సహాయం చేసేందుకు లద్దాఖ్, కాశ్మీర్ తదితర ప్రాంతాల ప్రజలు ఏకమైనట్లు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే లేహ్ జిల్లాలో భారీ ప్రత్యేకమైన విరాళాల సేకరణ కార్యక్రమం చేపడుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా స్థానికులు తమ వద్ద ఉన్న వస్తువులతో పాటు నగదును విరాళంగా ఇవ్వడం మొదలుపెట్టారు..
ఈ క్రమంలోనే ఒక కోడి గుడ్డును వేలానికి ఉంచగా.. షబీర్ హుస్సేన్ అనే స్థానిక వ్యక్తి దానిని ఏకంగా 25 వేలకు పాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఒక గుడ్డు ధర ₹10 మాత్రమేనని నాకు తెలుసని.. కానీ నేను ఆ పాతిక వేలు ఇచ్చింది గుడ్డు కోసం కాదని.. ఇరాన్ కష్టాలు పడుతున్న బాధితులకు నా వంతు సహాయం చేయడం కోసమని.. మానవత్వం ముందు డబ్బు ఎంత అవసరమైతే మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమంటూ గొప్ప మనసును చాటుకున్నాడు..
కేవలం కోడి గుడ్డు మాత్రమే కాదు.. కాశ్మీర్ అంతట ఇరాన్ బాధితుల కోసం ప్రజలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.. మహిళలు తమ బంగారంతో పాటు వెండి ఆభరణాలు విరాళాన్ని ఇస్తుంటే.. చిన్నపిల్లలు సైతం తమ కడ్డీ బ్యాంకులను పగలగొట్టి దాచుకున్న డబ్బులను విరాళంగా ఇచ్చేస్తున్నారు. మరి కొంతమంది తమ ఇళ్ళలోని సైకిళ్లతో పాటు పాత్రలు, పశువులను సైతం విరాళంగా అందించి మానవత్వం చాటుకుంటున్నారు..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
భారతీయులు చూపుతున్న ఈ ఆదరణ పట్ల ఇరాన్ రాయబారి కార్యాలయం కూడా స్పందించింది. కష్ట కాలంలో అండగా నిలిచిన భారతీయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.. మీ దయతో పాటు మానవత్వాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము.. థాంక్యూ ఇండియా అంటూ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఒక చిన్న కోడి గుడ్డు ద్వారా మొదలైన ఈ గొప్ప సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. తోటి మనుషుల కష్టాల్లో ఉన్నప్పుడు మతంతో పాటు ప్రాంతాలకు అతీతంగా స్పందించడమే నిజమైన మానవత్వం అని భారత ప్రజలు నిరూపించారు.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Viral News: పగలు ప్రియుడితో.. రాత్రి భర్తతో.. భార్య షిఫ్ట్ కాపురం..
Hyderabad, Telangana:Viral Latest News: పోలీస్ స్టేషన్‌ను ప్రతిరోజు ఎన్నో రకాల ఫిర్యాదులు వస్తూ ఉండడం మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటాం.. ఆస్తి తగాదాలతో పాటు దొంగతనాలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎన్నో రకాల కేసులు పోలీసులు చూస్తూ ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని వెలుగు చూసిన ఓ విచిత్రమైన కేసును చూసి పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యింది.. అవును మీరు చదువుతుంది నిజమే.. ఒకే ఇంట్లో తన భర్తతో పాటు ప్రియుడితో కలిసి జీవించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ మహిళ ఏకంగా పోలీసులను ఆశ్రయించడం ఆసక్తి కలిగిస్తోంది. వినడానికి వింతగా ఉన్న ఇది అక్షరాల నిజమే.. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది.. అయితే ఈ ఘటనకు సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సీతాపూర్ జిల్లా మహమ్మదాబాద్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు ఓ మహిళ తన భర్తతో పాటు ప్రియుడితో కలిసి వచ్చింది.. ముగ్గురూ కలిసి పోలీసులకు ఓ లిఖితపూర్వకమైన ఫిర్యాదును అందించారు. తాము ముగ్గురం ఒకే ఇంట్లో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నామని.. తమ ప్రత్యేకమైన కాపురానికి రక్షణ కల్పించాలని వారు కోరారు.. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఆ మహిళ చెప్పిన షిఫ్ట్ కాపురం ప్లాన్ విన్న పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైపోయారట..
తన భర్త పగటిపూట ఉద్యోగానికి వెళ్తాడని.. ఆ సమయంలో తన ప్రియుడు ఇంట్లో ఉంటాడని మహిళ వివరించింది.. ఆ తర్వాత రాత్రి పూట ప్రియుడు డ్యూటీకి వెళ్తాడని.. అప్పుడు భర్త ఇంటికి వస్తాడని.. ఇలా ఎవరి షిఫ్ట్ ప్రకారం వారు తనతో సమయం గడుపుతారని చెప్పుకొచ్చింది.. ఇద్దరి పని వేళలకు అనుగుణంగా తన జీవితాన్ని ప్లాన్ చేసుకున్నానని.. తాము ముగ్గురం ఈ ఒప్పందానికి పూర్తిగా అంగీకరించామని ఆమె పోలీసులకు చెప్పడంతో వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు..
ఒక ఒప్పందానికి భార్య, భర్త, ప్రియుడు ముగ్గురు అంగీకరించినప్పటికీ.. భర్త కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట.. ముఖ్యంగా భర్త తండ్రి, ఇద్దరు ఆడపడుచులు ఈ ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నారట.. తమ వ్యక్తిగత జీవితంలో వారు జోక్యం చేసుకోకుండా ఆదేశించాలని.. వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని ఆ ఆ ముగ్గురు కలిసి పోలీసులను వేడుకున్నారు..
సాధారణంగా ఇలాంటి వ్యవహారాలలో గొడవలు, దాడులు జరగడం మనం చూస్తూ ఉంటాం.. కానీ భర్త ప్రియుడు కలిసిపోయి.. ఒకే ఇంట్లో భార్యతో షిఫ్టుల వారిగా కాపురం చేయడానికి అంగీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. తమ పోలీసులు తమ సర్వీసులో ఇలాంటి వింత కేసులు ఎప్పుడూ చూడలేదని తలలు పట్టుకుంటున్నారు.. చట్ట పరిధిలో ఈ ఒప్పందానికి ఎలాంటి అనుమతి ఇవ్వాలో అర్థం కాక అధికారులు గందరగోళంలో పడ్డారు..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
