ఎల్బీ నగర్ సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ వేడుకలు
Hyderabad, Telangana:నేడు గురుపౌర్ణమి సందర్భంగా ఎల్బీనగర్లోని శ్రీ ప్రసన్నజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ షిరిడి సాయి దేవస్థానంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారని, పూజారి శివశాస్త్రి పాత్రను పోషించాలని కోరారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Aadarsha Kutumbam Teaser: వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం ఏకే 47' టీజర్ వచ్చేసింది! పంచ్ డైలాగ్‌లతో వెంకీ-త్రివిక్రమ్ కాంబో హిట్ కొడుతుందా?
Hyderabad, Telangana:Aadarsha Kutumbam AK 47 Teaser: టాలీవుడ్లో విక్టరీ వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన తిరుగులేని క్రేజ్ ఉంది. గతంలో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేసి మెప్పించగా, ఇప్పుడు వీరి కాంబోలో 'ఆదర్శ కుటుంబం (AK47)' చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ భారీ బజ్ క్రియేట్ చేయగా, తాజాగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసి థియేట్రికల్ విడుదలపై స్పష్టత ఇచ్చింది.
తాజాగా విడుదలైన టీజర్ అత్యంత రీఫ్రెషింగ్‌గా ఉండి వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మధ్యతరగతి కుటుంబ వాతావరణం, ఆ కుటుంబంలో చోటుచేసుకునే సరదా సన్నివేశాలు, వెంకటేశ్ తనదైన మార్క్ కామెడీ టైమింగ్ టీజర్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన పదునైన చమత్కార సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం, ఫన్, యాక్షన్, త్రివిక్రమ్ మార్క్ సంభాషణలతో రూపొందిన ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 02న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
"డబ్బుకు సబ్బుకు ఓ పోలిక ఉంది.. మొదటిది చూస్తుండగానే కరిగిపోద్ది, రెండోది ఆలోచించే లోపే అరిగిపోద్ది" అనే డైలాగ్‌తో టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అలాగే "అడుక్కునేవాడికి కూడా ఆదివారం ఉంటుంది కానీ ఈ అప్పులోళ్లకు మాత్రం ఉండదు" అని వెంకీ చెప్పే సంభాషణలు, చిట్టిబాబు క్యారేజీ కబుర్లు నవ్వులు పూయిస్తున్నాయి. సామాన్యుడి కోపం గురించి టీజర్ చివరలో చెప్పే బలమైన డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
టీజర్ పరిశీలిస్తే ఈ సినిమాలో కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో పాటు ఏదో తెలియని క్రైమ్, మిస్టరీ అంశాలు కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి ఎస్. తమన్ స్వరాలు సమకూరుస్తుండగా, యంగ్ హీరో నారా రోహిత్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
మరో ఆసక్తికర విషయమేమిటంటే, ఈ సినిమాలో ప్రధాన పాత్రల పరిచయంతో పాటు వెంకటేశ్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తారక్ వాయిస్ ఓవర్ ప్రచారంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ALso Read: లైంగిక వేధింపుల కేసులో 'ఢీ' డ్యాన్సర్ రాజు అరెస్ట్..సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని మోసం?
Also Read: Sandeepa Virk Jail: "30 సార్లు నగ్నంగా నిలబెట్టారు" తీహార్ జైలులో తీవ్ర అవమానంపై హీరోయిన్ ఆవేదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dhee Raju Arrest: లైంగిక వేధింపుల కేసులో 'ఢీ' డ్యాన్సర్ రాజు అరెస్ట్..సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని మోసం?!
Hyderabad, Telangana:Dhee Dancer Raju Arrest: తెలుగు బుల్లితెరపై విశేష ప్రాచుర్యం పొందిన 'ఢీ-10' డ్యాన్స్ రియాలిటీ షో విజేతగా నిలిచి, కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజు తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నాడు. ఒక యువతిని లైంగికంగా వేధించాడనే సంచలన ఆరోపణలతో అతడు కటకటాల పాలయ్యాడు. రాజును అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించారు. అయితే, ఒక సెలబ్రిటీపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయాన్ని మియాపూర్ పోలీసులు ఇన్ని రోజులు అత్యంత గోప్యంగా ఉంచడం ప్రస్తుతం బుల్లితెర, డ్యాన్స్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సినిమా అవకాశాల పేరుతో మోసం?
బాధిత యువతి కథనం ప్రకారం.. కొరియోగ్రాఫర్ రాజు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. అంతేకాకుండా, చలనచిత్రాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసానికి పాల్పడ్డాడని మియాపూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన మియాపూర్ పోలీసులు విచారణ చేపట్టి, ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత ఈ నెల 9వ తేదీన రాజుపై అధికారికంగా కేసు నమోదు చేశారు.
కేసు నమోదు చేసిన వెంటనే స్పందించిన పోలీసులు, నిందితుడు రాజును అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా, రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ప్రస్తుతం రాజు జైలులోనే ఉన్నాడని సమాచారం.
తీవ్ర చర్చనీయాంశంగా మారిన పోలీసుల గోప్యత..
ఈ వ్యవహారంలో అందరినీ విస్మయానికి గురిచేస్తున్న ప్రధాన అంశం మియాపూర్ పోలీసుల తీరు. సాధారణంగా ఒక ప్రముఖ సెలబ్రిటీపై లేదా టీవీ షో విజేతపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వివరాలు తక్షణమే బయటకు వస్తాయి. కానీ, ఈ కేసు విషయంలో మియాపూర్ పోలీసులు ఈ నెల 9నే కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించినప్పటికీ, ఈ వివరాలను మీడియాకు వెల్లడించకుండా ఇన్ని రోజులు అత్యంత గోప్యంగా ఉంచారు.
ఇంతటి ప్రాధాన్యత ఉన్న కేసు వివరాలను సీక్రెట్‌గా ఉంచడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం ఇప్పుడు బుల్లితెర వర్గాల్లోనూ, డ్యాన్స్ షో వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఆరోపణలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత కేసుకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Also Read: బిగ్‌బాస్ హోస్‌లోకి నందన వైల్డ్ కార్డు ఎంట్రీ..వారానికి ఏకంగా రూ.2 లక్షలు ఆఫర్!
Also Read: Sandeepa Virk Jail: "30 సార్లు నగ్నంగా నిలబెట్టారు" తీహార్ జైలులో తీవ్ర అవమానంపై హీరోయిన్ ఆవేదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Janasena MLA On TDP: జనసేన కార్యకర్తల్ని టీడీపీ నాయకులు తొక్కేస్తున్నారు: జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు!
Vijayawada, Andhra Pradesh:Janasena MLA Bolisetti Srinivas On TDP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు కావస్తోంది. మరో రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉండటంతో పాటు, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సమయం కూడా ఆసన్నమైంది. ఈ గత రెండున్నరేళ్ల కాలంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్‌ల నుంచి జనసేన ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్‌లు తీవ్రమైన ఒత్తిళ్లను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట జనసేన ఇన్ఛార్జ్లకు, అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు లేని చోట ఆ పార్టీ ఇన్‌ఛార్జ్‌ల విధానాల వల్ల జనసేన ఎమ్మెల్యేలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు జనసేన ఎమ్మెల్యేలు, కీలక నేతలు అధినేత పవన్ కళ్యాణ్‌తో జరిగిన భేటీలలో ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, చర్యలు మాత్రం శూన్యంగా ఉన్నాయని సమాచారం.
జనసేన ఎమ్మెల్యే బహిరంగ ఆరోపణలు
ఈ పరిణామాల నేపథ్యంలో తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ టీడీపీ నేతల నుంచి తమకు ఎదురవుతున్న ఒత్తిడిని బహిరంగంగానే అంగీకరించారు. టీడీపీ నాయకులను తాము ఎంతగా గౌరవిస్తున్నప్పటికీ, వారు మాత్రం జనసైనికులను తీవ్రంగా తొక్కేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితిపై తమ నాయకుడు పవన్ కళ్యాణ్‌కు ముందే తెలుసని వ్యాఖ్యానించారు.
ఈ సమస్యలన్నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పూర్తిస్థాయిలో తెలుసని, త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో జరిగే కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ అంశంపై చర్చించనున్నారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో జరగబోయే కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మన నాయకుడు పవన్ కళ్యాణ్ ఈ విషయమై నేరుగా మాట్లాడతారని పార్టీ కార్యకర్తలకు వివరించారు.
వచ్చే ఎన్నికలు, సీట్ల కేటాయింపుపై స్పష్టత
నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీ నేతల ఒత్తిడిని ఎదుర్కొంటున్న బొలిశెట్టి శ్రీనివాస్, ఈమధ్య వరుసగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ 60 సీట్ల వరకు పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కోసం సీట్లు డిమాండ్ చేస్తున్న జనసేన నాయకులపై స్పందిస్తూ.. తాను చెబితే ఎవరికీ సీటు ఇవ్వరని తేల్చిచెప్పారు.
పార్టీ కార్యకర్తలకు టికెట్లు ఇప్పించే అర్హత తనకు లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ వాస్తవాలనే చెబుతానని, ఎలాంటి వ్యక్తి అయినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Also REad: "జగన్‌కి డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలుసా?" వైఎస్ జగన్‌కు మంత్రి లోకేష్ కౌంటర్!
Also Read: 7 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల ముసలోడు లైంగిక దాడి..శ్రీకాకుళంలో దారుణం, కామాంధుడి అరెస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Eshwar Sai Bail: మాధురి రాథోడ్ ఎపిసోడ్లో ఈశ్వర్ సాయికి బిగ్ రిలీఫ్..ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు!
Hyderabad, Telangana:Eshwar Sai Bail News: తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ లు మాధురీ రాథోడ్, ఈశ్వర్ సాయిల వ్యక్తిగత వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియోను ఈశ్వర్ సాయి భార్య బయట పెట్టడం గమనార్హం. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నా.. తాజాగా ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్లు మాధురి రాథోడ్ కేసు పెట్టింది. ఈ కేసు నేపథ్యంలో ఈశ్వర్ సాయి కోర్టుకు వెళ్లగా.. న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.Ganesh Chaturthi 2026: వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి: సజ్జనార్
Hyderabad, Telangana:VC Sajjanar: వినాయక చవితిని పురస్కరించుకుని నవరాత్రులు, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ఉత్సవ సమితి నిర్వాహకులు, ప్రజలు తమ పోలీస్ శాఖకు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. సమన్వయంతో ప్రశాంతంగా.. వేడుకగా వినాయక చవితి ఉత్సవాలు చేసుకుందామని పిలుపునిచ్చారు. 'గణేశ్ ఉత్సవాల వేళ శబ్ద కాలుష్యంపై ప్రజల నుంచి, ముఖ్యంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులు, వృద్ధుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. పండుగను ఉత్సాహంగా చేసుకుంటూనే, చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది కలగకుండా మైక్/సౌండ్ సిస్టమ్స్ పరిమితిని తగ్గించుకోవాలి' అని ఉత్సవ సమితి నిర్వాహకులకు పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ప్రధాన నిమజ్జనం రోజున మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఊరేగింపులు సాగితే ప్రజలు, ట్రాఫిక్ సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మండపాల నిర్వాహకులు నిమజ్జనం రోజున ఉదయమే ఊరేగింపును ప్రారంభించేలా ప్రోత్సహించాలని సమితి సభ్యులను కోరారు. రద్దీ ఎక్కువగా ఉండే ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు, పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా అక్కడి ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తారని కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ప్రజల్లో, నిర్వాహకులలో అవగాహన పెంచేందుకు పోలీస్ స్టేషన్ల వద్ద తగిన సమాచార బ్యానర్లు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అందరి సామూహిక భాగస్వామ్యంతో, భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా ఈ మహా పండుగను విజయవంతం చేయాలని అధికారులతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో హైదరాబాద్ సిటీ పోలీస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపును అత్యంత వైభవంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, నిర్వాహకులు, వివిధ కమిటీల సభ్యులతో హైదరాబాద్ సిటీ పోలీసులు శుక్రవారం విశ్వేశ్వరయ్య భవన్లో ప్రత్యేక సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అడిషనల్ సీపీ (క్రైమ్స్, సిట్) ఎ. శ్రీనివాస్, అడిషనల్ సీపీ (ఎల్ అండ్ ఓ) తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) డి. జోయల్ డేవిస్‌తోపాటు హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అందరూ డీసీపీలు పాల్గొన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, వివిధ ఉత్సవ కమిటీల ప్రతినిధులు
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి. రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్. శశిధర్, సలహాదారు కరోడిమాల్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కోశాధికారి మహేష్ యాదవ్, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధి సాయి కిరణ్‌తోపాటు ఇతర ఉత్సవ కమిటీల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. 'హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలకు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉంది. ప్రతియేటా దశాబ్దాలుగా నగర ప్రజలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు అందిస్తున్న సహకారంతోనే ఉత్సవాలు ప్రశాంతంగా సాగుతున్నాయి' అని తెలిపారు. ఈ సంవత్సరం కూడా వేడుకలు విజయవంతంగా ముగిసేందుకు సిటీ పోలీస్ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు, భద్రతా చర్యలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. విగ్రహాలను తీసుకువచ్చే (ఆగమనం) సమయంలో రద్దీ, అధిక వేగం, వాహనాలపై డాన్సులు చేయడంతో ట్రాఫిక్ స్తంభించడమే కాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయని కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాహకులు విగ్రహాల రాక సమాచారాన్ని ముందే పోలీసులకు తెలియజేసి, ట్రాఫిక్ తక్కువగా ఉండే సమయాల్లో సురక్షితంగా మండపాలకు తరలించాలని సూచించారు.
'వినాయక ఆగమనం, నిమజ్జనం ఊరేగింపు మార్గాల్లో విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మల అడ్డంకులు, రోడ్ల మరమ్మతులపై ఇప్పటికే జీహెచ్ఎంసీ, ఎస్పీడీసీఎల్ అధికారులతో సమన్వయ సమావేశం పూర్తయింది. త్వరలోనే పోలీస్ అధికారులు రూట్ విజిట్ (మార్గ తనిఖీ) చేపడతారు' అని పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా నలుగురు నుంచి 5 మంది బాధ్యతాయుతమైన వాలంటీర్లను కేటాయించాలని ఆదేశించారు. వాలంటీర్ల వివరాలను పోలీస్ యాప్‌లో నమోదు చేయాలని, వారికి ప్రత్యేక గుర్తింపు (ఒకే రంగు దుస్తులు/బ్యాడ్జీలు) ఇవ్వడం ద్వారా పోలీసులతో సమన్వయం సులువవుతుందని సూచించారు.
Chandrababu: 'నా కాన్వాయ్ ట్రాఫిక్ నిలుపుదల చేయవద్దు': సీఎం చంద్రబాబు
Amaravathi, Andhra Pradesh:Chandrababu Collectors Conference: తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలుపుదల చేయవద్దని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వీఐపీలు, వీవీఐపీల పర్యటనల సందర్భంగా ఎక్కువ హడావుడి చేయవద్దంటూ సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సింపుల్‌గా ఉంటేనే ప్రజలు మెచ్చుతారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగి తప్పు చేసినా.. ప్రభావం ప్రభుత్వంపై పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి నాయకులు వస్తే వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగింపు సందర్భంగా పోలీస్ అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు.
'మా కోసం ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని మరోసారి విజ్ఞప్తి. నా కాన్వాయ్‌ను కూడా గణనీయంగా తగ్గించా. కాన్వాయ్ తగ్గిన తర్వాత ప్రశాంతంగా ఉంది. పోలీసు కానిస్టేబుల్ తప్పు చేసినా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్నే దూషిస్తారు. ప్రజాప్రతినిధుల్ని గౌరవిస్తూనే న్యాయసమ్మతంగా వ్యవహరించాలి. పొలిటికల్ గవర్నెన్స్ విధానంలోనే కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. కూటమి పార్టీల నాయకులందరూ సమానమే. ప్రజా సమస్యల పరిష్కారంపై కూటమికి పార్టీలకు చెందిన నాయకులు ఎవరూ వచ్చినా గౌరవించి.. ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. ప్రజల్ని భాగస్వాములను చేస్తే చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. భోగాపురం విమానాశ్రయం, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టుల ప్రారంభించినప్పుడు ప్రజల స్పందన అనూహ్యం' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
'డీఎస్సీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాం. దీనిపై 350 పిటిషన్లను వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. కూటమి ప్రభుత్వం ఎక్కడా తప్పు చేయదు. భయపడి వెనక్కు వెళ్లదు. కొందరు చేసిన ఆరోపణలకు తగిన సమాధానం ఇచ్చాం. గత ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంలో దారుణాలకు పాల్పడింది. హైకోర్టు కూడా సిట్ వేసి విచారణ చేయాలని ఆదేశించింది. రాజకీయ ముసుగు వేసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోం. వారు వదిలివెళ్లిన 1.53 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ తొలగించడానికి రెండేళ్లు పట్టింది' అని సీఎం చంద్రబాబు వివరించారు. వారు సృష్టించిన భూవివాదాలను ప్రక్షాళన చేయడానికి మూడేళ్లు పడుతోందని చెప్పారు.
ఉద్యోగులు, పోలీసులకు డీఏ, సరెండర్ లీవ్‌లు కూడా ఇస్తున్నాం. ఎక్కడా పొరపాట్లు లేకుండా ప్రతీ నిర్ణయంలో వేగం ఉండాలి. ప్రతీ నిర్ణయంలో మానవీయ కోణం ఉండాలి. ఆదాయం లేకపోతే సంక్షేమం ఇవ్వలేం' సీఎం చంద్రబాబు చెప్పారు. డీప్ టెక్నాలజీతో కూడిన న్యూ గవర్నెన్స్‌లో లీడర్షిప్ కీలకమని ప్రకటించారు. 'జీఎస్టీలో 18 శాతం మేర వృద్ధి నమోదైంది. జీఎస్డీపీ అంచనాలు కూడా దేశ సగటుతో పోలిస్తే అధికంగా ఉంది. 2027 నాటికి రాష్ట్రంలో భూసమస్యలను అన్నీ పరిష్కరిస్తాం. అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తాం' అని చంద్రబాబు తెలిపారు. క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తామని ప్రకటించారు.
'జలవనరుల శాఖకు చెందిన ఖాళీ స్థలాల్లో వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. త్వరలోనే రాయలసీమను హార్టీ కల్చర్ హబ్‌ను ప్రారంభిస్తాం. రాష్ట్రంలో అనుమతులిచ్చిన పరిశ్రమలకు త్వరితగతిన భూ కేటాయింపులు చేయాలి' సీఎం చంద్రబాబు వెల్లడించారు. పరిశ్రమలు, సేవలు వ్యవసాయ రంగంలో వృద్ధితో జీఎస్డీపీ పెరుగుతుందని.. రాష్ట్రంలోనూ ఏఐ నిపుణుల్ని తయారు చేసేలా కార్యాచరణ చేపడుతున్నట్లు ప్రకటించారు. 6వ తరగతి నుంచే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద శిక్షణ ఇస్తామని.. డేటా లేక్ ద్వారా ప్రతీ ప్రభుత్వ శాఖనూ సమన్వయం చేస్తామని తెలిపారు. ఏఐ స్టాక్లను ప్రతీ విభాగానికి అందుబాటులోకి తీసుకువస్తాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు. లీగల్ ఏఐ స్టాక్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. జీరో క్రైమ్ విధానంతో పని చేయాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరిట కొందరు దుండగులు ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారని.. నిమిషాల్లో బాధితులు డబ్బులు కోల్పోతున్నారని తెలిపారు.
Dearness Allowance: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. 2 డీఏలు విడుదల చేస్తూ ఉత్తర్వులు
Nuzendla, Andhra Pradesh:AP DA Released: తమ డిమాండ్ల సాధన కోసం.. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడంతో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగివచ్చింది. ఉద్యోగులకు భారీ శుభవార్త వినిపించింది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన కరువు భత్యం (డీఏ) రెండింటిని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు డీఏలు విడుదల చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులకు వినాయక చవితి కానుక అందించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. 2 నెలల డీఏలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబర్ జీతానికి కలిపి చెల్లించాలని ప్రభుత్వ ఆర్థిక శాఖ తెలిపింది. 1.82 శాతం డీఏను 2025 జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం చెల్లించనుంది. 20 నెలల బకాయిలు 2028 జనవరి, మార్చి, మే, జూలైన ఆర్థిక శాఖ చెల్లించనుంది. ఉద్యోగులకు 2.73 శాతం డీఏను 2024 జూలై 1 నుంచి చెల్లించనుంది. ఇక 26 నెలల బకాయిలు 2027 ఏప్రిల్, జూన్, ఆగస్టులో, అక్టోబర్‌లో ఉద్యోగులకు ఆర్థిక శాఖ జమ చేయనుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను ప్రస్తుతం ఉన్న 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగులకు అదనంగా 2.73 శాతం డీఏ పెంపు లభించినుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న డీఏ శాతాన్ని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏపీలోని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి భారీ ఆర్థిక ప్రయోజనం కలగనుంది.
పెంచిన డీఏ లబ్ధి సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా ఇతర వర్గాల ఉద్యోగులకు వర్తించనుంది. 2022 రివైజ్డ్ పే స్కేల్స్ (వేతన సవరణ) ప్రకారం వేతనాలు పొందుతున్న ఉద్యోగులందరికీ డీఏ పెంపు వర్తించనుంది.
డీఏ వర్తించేది వీరికే..
ప్రభుత్వం విడుదల చేసిన డీఏలు ఎవరికి వర్తిస్తుందంటే.. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు తదితర స్థానిక సంస్థల ఉద్యోగులకు పెంపు వర్తించనుంది. ఎయిడెడ్ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి డీఏ పెంపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది.
Video Viral: జంక్ ఫుడ్ చూస్తేనే జడుసుకునేలా చేశారుగా.!.. పిల్లలకు బిగ్ షాక్ ఇచ్చిన టీచర్లు.. వీడియో వైరల్..
Hyderabad, Telangana:Teachers creative ideas to stay away children from junk food video: చాలా మంది పిల్లలు ఇటీవల ఎక్కువగా జంక్ ఫుడ్ కు అలవాటు పడ్డారు. శుభ్రంగా అన్నం తినకుండా సూపర్ మార్కెట్ లలో దొరికే చిరుతిండ్లు అంటే పడిచస్తారు. స్కూల్ కు వెళ్లాలన్న, హోమ్ వర్క్ చేయాలన్న వారికి ఇష్టమైన చిరుతిండ్లు తినిపిస్తేనే ఆ పనులు చేస్తారు . పొరపాటున బైటకు తీసుకెళ్తే ఇక తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తారు. కన్పించిన చిరుతిండ్లు కావాలని మారం చేస్తారు. ఇటీవల పిల్లలు మరీ అప్ డెట్ అయ్యారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి మొబైల్ తీసుకుని తమకు కావాల్సిన పిజ్జాలు, బర్గర్ లు ఇతర చిరుతిండ్లు ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ లేకుంటే కొంత మంది ముద్దను సైతం ముట్టడంలేదు.
Teachers use fake ultrasound footage to ensure children stay away from junk food. pic.twitter.com/0HXWz6bt39
— The Indian Idiot (@theindianidiot) September 11, 2026
ఆ తర్వాత కడుపు నొప్పి, ఇతర సమస్యలతో కన్నవారికిచుక్కలు చూపిస్తారు. ఇదంతా రోటీన్ గా జరిగేదే. అయితే.. దీనిపై ఒక స్కూల్ టీచర్లు చాలా కొత్తగా ఆలోచించారు.అసలు జంక్ ఫుడ్ లు తింటే ఎలాంటి చెడు ప్రభావాలు ఎదుర్కొవాల్సి వస్తుంది.. వారి కడుపులో ఏంజరుగుతుందో వీడియోతో సహా ప్లే చేసి పిల్లలకు చూపించారు.
ఏకంగా క్లాసులో పిల్లలకు మొదట జంక్ ఫుడ్ తినేందుకుఇచ్చారు. అది కడుపులోకి వెళ్లిన తర్వాత ఏమౌతుంది.. ఆ తర్వాతి పరిణామాలను వీడియోలో చూపించారు. దీన్ని ఒక ప్రాజెక్టర్ లో చూపించారు.కడుపులో నులి పురుగులు, ఇతర సమస్యలు , అంతర్గత అవయాలను చూపించారు . దీంతో పిల్లలంతా భయంతో గుక్కపెట్టి ఏడ్చారు.
కడుపులో నులి పురుగులు చూసి భయపడిపోయారు. ఇక తమకు ఈ జంక్ ఫుడ్ వద్దన్నట్లు ఫిక్స్అయ్యారు. మొత్తంగా పాపం.. పిల్లలు మాత్రం క్లాసులోనే తెగ ఏడ్చారు. ఈ వీడియోను టీచర్లు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియో చూసిన నెటిజన్ లు భలే ప్లాన్ చేశారుగా అంటూ ఫన్నీగా కామెంట్ లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Ganesh Chaturthi 2026: వినాయక చవితి స్పెషల్..దేశంలో 5 ఫేమస్ గణపతి ఆలయాలు..కాణిపాకం ఉందా?
Kanipakam, Andhra Pradesh:Ganesh Chaturthi 2026 Famous Temples: హిందూ విశ్వాసాలలో తొలి పూజలందుకునే విఘ్నాధిపతికి అంకితం చేసిన ప్రధాన పండుగ గణేశ చతుర్థి. 2026 గణేశ చతుర్థి వేడుకలకు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. జీవితంలోని విఘ్నాలను తొలగించి, సకల శుభాలను అందించే బొజ్జ గణపయ్య అనుగ్రహం కోసం భక్తులు విశేషంగా సందర్శించే భారతదేశంలోని ప్రముఖ గణేశ క్షేత్రాలు, వాటి విశిష్టతల గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం.
2026 గణేశ చతుర్థి వేళ ముంబైలోని సిద్ధివినాయక ఆలయం, పూణేలోని దగ్దుషేత్ హల్వాయి ఆలయం, కర్ణాటకలోని శ్రీ వినాయక దేవురు ఆలయం, ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం వినాయక ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు విశేష పూజలు, వేడుకలతో ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారుతున్నాయి
భారతదేశంలోని ప్రసిద్ధ గణపతి క్షేత్రాలు..
1) సిద్ధివినాయక ఆలయం (ముంబై)
దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన గణపతి ఆలయాలలో ముంబైలోని సిద్ధివినాయక ఆలయం ప్రధానమైనది. జీవితంలో విజయం, శ్రేయస్సు, దేవుని అండ లభించాలని కోరుకుంటూ ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. గణేశ చతుర్థి పండుగను ఈ ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. గణపతిని ఎంతో సుందరంగా అలంకరిస్తారు. అక్కడ నిర్వహించే ప్రత్యేక హారతులు ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతాయి.
2) దగ్దుషేత్ హల్వాయి గణపతి ఆలయం (పూణే)
మహారాష్ట్రలోని పూణేలో ఉన్న దగ్దుషేత్ హల్వాయి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. గణపతికి ఎంతో విలువైన ఆభరణాలు, రంగురంగుల పూలతో అలంకరించబడిన వినాయకుడి విగ్రహం భక్తులకు చూడముచ్చటగా ఉంటుంది. కేవలం పూజా కార్యక్రమాలే కాకుండా, ఈ వేడుకలలో భాగంగా జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల వల్ల కూడా ఇక్కడకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
3) శ్రీ వినాయక దేవుని ఆలయం (కర్ణాటక)
కర్ణాటకలోని శ్రీ వినాయక దేవుని ఆలయం ప్రశాంతమైన పరిసరాలతో భక్తులను ఎంతో భక్తితో నింపేస్తుంది. ఇది ఇతర ఆలయాల కంటే భిన్నమైన, ప్రశాంతమైన, ధ్యానానికి అనువైన వాతావరణాన్ని కలిగి ఉంది. గణేశ చతుర్థి సమయంలో ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది. వినాయక చవితి రోజున ఇక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు ఈ వేడుకలను మరింత వైభోపేతంగా నిర్వహిస్తారు.
4) కాణిపాకం వినాయక ఆలయం (ఆంధ్రప్రదేశ్)
ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం వినాయక ఆలయానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతే కాకుండా గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర కూడా ఉంది. ఇక్కడి వినాయకుడి విగ్రహం స్వయంభువు (స్వయంగా ఆవిర్భవించినది) అని ఆలయ పురాణాల్లో పేర్కొని ఉంది. కేవలం ఆచారంగా మాత్రమే కాకుండా, ఈ క్షేత్రం పట్ల ఉన్న గాఢమైన నమ్మకంతో వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. వినాయక చవితి పండుగ సమయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించి, ఉత్సవమూర్తిని ఊరేగిస్తూ కన్నుల పండుగలా పూజలు నిర్వహిస్తారు.
5) రంజన్‌గావ్ గణపతి ఆలయం (మహారాష్ట్ర)
రంజన్‌గావ్ గణపతి ఆలయానికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇది అష్టవినాయక క్షేత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక్కడి విగ్రహం అత్యంత శక్తివంతమైనదిగా భక్తులు భావిస్తారు. వినాయక చవితి సమయంలో ఈ ఆలయంలో వైభవంగా పూజలు నిర్వహిస్తారు.
Also Read: వినాయక చవితికి ఇంట్లో ప్రతిమకు ప్రాణప్రతిష్ట ఎలా చేయాలి? పూజ నుంచి నిమజ్జనం వరకు..
Also Read: అన్నీ స్కూళ్లు, కాలేజీలకు సెలవు..ఎట్టకేలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bank Employees: బ్యాంకులకు ఐదు రోజుల పని విధానం.. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల ఆందోళన
Hyderabad, Telangana:Bank Employees Strike: తీవ్ర పని ఒత్తిడి.. అధిక పని గంటలతో తీవ్రంగా సతమతమవుతున్న బ్యాంకు ఉద్యోగులు భారీ ఉద్యమం చేపట్టారు. తమ నిరసనల్లో భాగంగా శుక్రవారం దేశవ్యాప్త సమ్మె చేపట్టారు. అన్నీ జాతీయ బ్యాంకులు ఒక రోజు బంద్ చేపట్టాయి. తమ సమస్యల పరిష్కారం.. తమ డిమాండ్ల సాధనలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళనకు దిగారు.
ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలులో జాప్యాన్ని నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. హైదరాబాద్ కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో పెద్ద ఎత్తున బ్యాంకు ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. వారంలో రెండు రోజుల సెలవు.. ఖాళీల భర్తీ చేపట్టి తమపై పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
సమ్మె సందర్భంగా యుఎఫ్‌బీయూ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కె. ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ.. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు, బ్యాంకింగ్ రంగంలో ఖాళీ పోస్టుల భర్తీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం తదితర డిమాండ్లను ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు పరిష్కరించాలని కోరారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని, సిబ్బంది కొరతతో ఖాతాదారులకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని, ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిలిపివేయాలని యుఎఫ్‌బీయూ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కె. ఆంజనేయ ప్రసాద్ డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ రంగంలో ప్రతిపాదిత పనితీరు ఆధారిత ప్రోత్సాహక విధానం (పీఎల్ఐ)పై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఉద్యోగుల మధ్య విభజనకు దారితీసే విధానాలను అమలు చేయవద్దని కోరారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగులు, అధికారుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బ్యాంకు ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.
బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించేందుకు సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమావేశాలు నిర్వహించనున్నట్లు యూఎఫ్‌బీయూ ప్రకటించింది. సమస్యలు పరిష్కారం కాకపోతే తదుపరి ఆందోళన కార్యక్రమాలను చేపడతామని తెలిపింది. ఈ కార్యక్రమంలో ఏఐబీఈఏ రాంబాబు, ఎన్సీబీఈ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, శాండిల్య, వెంకటరామయ్య తదితరులు పాల్గొని సంఘీభవాన్ని తెలిపారు.
Tirumala: తిరుమల ఆలయంలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
Dharmavaram, Andhra Pradesh:Devotees Heavy Rush To Tirumala Temple A Head Continuous Holidays Watch VideoTirumala Temple: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి
Dharmavaram, Andhra Pradesh:Cine Heroine Kriti Shetty Visits Tirumala Temple Watch VideoTelangana Rain Alert: తెలంగాణలో రెడ్ అలెర్ట్..ఈ 6 జిల్లాల్లో భారీ వర్ష సూచన!
Hyderabad, Telangana:Telangana Rain Forecast: బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతున్న సుస్పష్టమైన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణలోని 6 జిల్లాల్లో భారీ వర్షసూచన ఉండబోతుందని రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో అధికారులతో పాటు ప్రజలకు తగు సూచనలు చేశారు.Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్సార్సీపీ ఎంపీ
Dharmavaram, Andhra Pradesh:YSRCP MP Mithun Reddy Visits To Tirumala Temple Watch VideoMahesh Babu SIR Notice: డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు, ఉపాసనకు ఈసీఐ నోటీసులు..వెంటనే స్పందించాలని సూచన!
Hyderabad, Telangana:Mahesh Babu Rajamouli SIR Notice: దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ తెలంగాణలో కూడా సమయం పొడిగించి సమర్థవంతంగా కొనసాగిస్తోంది. ఈ విధానంలో భాగంగా హైదరాబాద్ నగరంలో ప్రచురించిన ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్ వంటి ప్రముఖ నియోజకవర్గాల పరిధిలో ఓటర్లుగా నమోదైన పలువురు దిగ్గజాల సమాచారంలో వ్యత్యాసాలు, సాంకేతిక లోపాలు ఉన్నట్లు తేలింది. అధికారుల రికార్డులతో వీరి వివరాలు సరిపోలకపోవడంతో చట్టబద్ధంగా వివరణ కోరుతూ ఈసీఐ నోటీసులు జారీ చేసింది.
సినీ రంగానికి చెందిన ప్రముఖులు..
ఎన్నికల సంఘం నోటీసులు పంపిన వారిలో టాలీవుడ్ అగ్రశ్రేణి నటులు, దిగ్గజ దర్శకులు ఉన్నారు. దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్, సీనియర్ కథానాయకుడు దగ్గుబాటి వెంకటేష్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు ప్రముఖ కథానాయిక సమంత రూత్ ప్రభు, యువ హీరో విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండలకు కూడా ఈసీ నోటీసులు పంపారు.
క్రీడా, వ్యాపార రంగాలు..
సినీ ప్రముఖులతో పాటు క్రీడా రంగానికి చెందిన దిగ్గజాలు కూడా ఈసీఐ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓటరు రికార్డుల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కార్పొరేట్ రంగం నుంచి ఫార్మా దిగ్గజం దివీస్ ల్యాబ్స్ అధినేత మురళీకృష్ణ ప్రసాద్ దివి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కొణిదెల వంటి వ్యాపారవేత్తలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అందుతోంది.
ఓటరు గుర్తింపు కార్డుల్లో మ్యాచ్ కాని వివరాలకు సంబంధించి ప్రముఖులు తమ ఆధారాలను మళ్లీ సమర్పించి సవరణలు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. ఒకవేళ వీరు ప్రత్యక్షంగా లేదా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేని పక్షంలో, తమ తరపున ఒక ప్రతినిధిని పంపే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది.
Also Read: Chalo Hyderabad: ప్రభుత్వ ఉద్యోగుల్లో గందరగోళం..రేపు చలో హైదరాబాద్ ఉందా? లేదా?!
Also Read: మాధురి రాథోడ్ 'నిమ్మతోట వనములో' పాట సంపాద ఎంత? రూ.10 లక్షలు పెడితే,16.2 కోట్లతో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
