కటింగ్ చెపించుకొని మంగలి దుకానాన్ని ధ్వంసం చేసిన కస్టమర్లు
రంగారెడ్డి జిల్లా దేవపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలోని దానమ్మ జొప్పిడిలో గంజాయి గ్యాంగ్ కలకలం రేపుతోంది. గంజాయి ముఠాలోని ముగ్గురు వ్యక్తులు జుట్టు కత్తిరించుకోవడానికి సెలూన్‌కు చేరుకున్నారని మరియు డబ్బు అడిగినప్పుడు యజమానిపై దాడి చేశారని మీకు తెలియజేద్దాం. ఫర్నిచర్‌ను కూడా ధ్వంసం చేసిన అనంతరం దుండగులు యజమానిపై దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న దుండగులు బీభత్సం సృష్టించి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Narmetta Oil Palm Factory: శ్రమ మాది, శిలాఫలకం రేవంత్ రెడ్డిది.. బీఆర్ఎస్ కట్టిన భవనాలకు రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడని బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధిపై రాజకీయ కక్ష చేస్తున్నాడని.. ఏకంగా రూ.1,070 కోట్ల అభివృద్ధి పనుల రద్దు చేశారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన కాళేశ్వరం జలాలతోనే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నారని గుర్తుచేశారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రైతులకి ధోకా చేశాడని.. రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నర్మెట్ట గ్రామంలోనే రుణమాఫీ కాని రైతులు 350 మంది ఉన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
Also Read: TMC Manifesto: నాలుగోసారి అధికారమే లక్ష్యం.. తృణమూల్ అధినేత్రి మమతా టాప్ 10 హామీలు
రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన చేస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కీలక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. ' రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సిద్దిపేట నియోజకవర్గానికి కొత్తగా మంజూరైన కార్యక్రమం ఒక్కటీ లేదు. సిద్దిపేటలో రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్న కార్యక్రమాలన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసి.. నిధులు కేటాయించి, నిర్మాణాలు పూర్తి చేసినవే' అని వివరించారు. మాదేమో శ్రమ ఫలితం.. రేవంత్ రెడ్డిదేమో శిలాఫలకం అని ప్రకటించారు.
Also Read: Kavitha: తెలంగాణ బడ్జెట్‌పై జాగృతి ఫైర్.. రాహుల్ గాంధీకి కొత్త పేరు పెట్టిన కవిత
శిలాఫలకాల మీద రేవంత్ రెడ్డి పేరు ఉండొచ్చు.. కానీ ప్రజల మనోఫలకాల మీద ఉండేది మాత్రం కేసీఆర్ పేరే అని హరీశ్ రావు ప్రకటించారు. 'రూ.300 కోట్లతో నర్మెట్టలో ప్రారంభించబోతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతే. దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ రావడానికి, రిఫైనరీ పెట్టడానికి మేమే నిర్ణయం తీసుకున్నాం. టీజీఐసీ ద్వారా 62 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చాం. రైతులను స్వయంగా ఒప్పించి మొక్కలు నాటించాం' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు.
Also Read: Harish Rao: కాంగ్రెస్ బడ్జెట్‌తో ఆరు గ్యారెంటీలకు ఘోరీ.. అందరికీ మొండి'చేయి': హరీశ్ రావు
'కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఎగతాళి చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే కాళేశ్వరం జలాలతో నడిచే ఫ్యాక్టరీని ప్రారంభించడం శోచనీయం. ఈ ఫ్యాక్టరీ కోసం కాలువ పొడిగించి 20 కోట్ల లీటర్ల సామర్థ్యంతో చెరువును నిర్మించి నీరందించింది మేమే. పక్కనే పారుతున్న కాళేశ్వరం కాలువ నీళ్లను నెత్తిన జల్లుకుని ఫ్యాక్టరీని ప్రారంభించు' అని రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సూచించారు. కాళేశ్వరం, మల్లన్న సాగర్ కట్టేటప్పుడు ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేసి ఎన్ని కుట్రలు చేసినా.. మొక్కవోని దీక్షతో ప్రాజెక్టును పూర్తి చేసి ఈ నేలకు జలాలను అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అని గుర్తుచేశారు.
'ఎన్నికల ముందు దేవుళ్ల మీద ఒట్లు పెట్టిన రేవంత్ రెడ్డి.. రుణమాఫీ పేరిట రైతులను దారుణంగా మోసం చేశారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఇంకా 52 శాతం మందికి, అంటే 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రూ.300 కోట్ల బకాయిలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నర్మెట్ట గ్రామంలోనే 350 మంది రైతులకు మాఫీ కాలేదు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేట పర్యటనకి వస్తున్నారు' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. వరుసగా మూడు పంటలకు ఎగ్గొట్టిన రైతుబంధును.. ఈ మూడు సీజన్ల రైతుబంధు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 'సగం పనులైన ప్రభుత్వ వెటర్నరీ కాలేజీని సిద్దిపేట నుంచి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు ఎత్తుకుపోయారు. ఇది ముఖ్యమంత్రి స్థాయికి తగిన పనేనా?' అని హరీశ్ రావు ప్రశ్నించారు. కేవలం రాజకీయ కక్షతో రద్దు చేసిన రూ.1,070 కోట్ల పనులను తక్షణమే పునరుద్ధరించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rain Alert In AP For Next 3 Days: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఓ వైపు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. ఇప్పుడు మరోసారి వర్షాలు పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఏఏ ప్రాంతాల్లో కురవనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం సడెన్‌గా వాతావరణం మారిపోయింది. ఉపరితల ఆవర్తనంతో పాటు మరోవైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా రాబోయే 3 రోజుల పాటు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలోని తీర ప్రాంతాలతో పాటు రాయలసీమ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలియజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో దక్షిణ అంతర కర్ణాటక పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర అంతర కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం ప్రస్తుతం కొంత తగ్గింది.
గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురవగా.. ఇప్పుడు మరో 3 రోజుల పాటు వర్షాల తీవ్రత కొనసాగనుంది. ముఖ్యంగా గంటకు 40-60 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు సంభవించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి వర్షాలు కొనసాగినా.. ఈదురుగాలులు మాత్రం గంటకు 30 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది. రాగల 3 రోజులు ఏపీలో వాతావరణం దాదాపుగా ఒకేలా ఉండే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.
నేడు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు వీయడం సహా రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఎల్లుండి మాత్రం కేవలం ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ జల్లుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు సంభవించకపోవడం గమనార్హం. వర్షాలు ముగిసిన తర్వాత ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Also REad: Water Melon For Diabetics: షుగర్ ఉన్న వాళ్లు వేసవిలో పుచ్చకాయ తినొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jagtial Mango Market Losses Latest News: తెలంగాణ మామిడికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది తీపి కరువైంది గా భావించవచ్చు.. ఎంతో రుచికరమైన ఇక్కడి మామిడి పండ్లకు అంతర్జాతీయంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు.. కానీ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం జగిత్యాల మామిడి మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది.. ఎగుమతులు నిలిచిపోవడంతో కోట్లాది రూపాయల వ్యాపారం స్తంభించిపోయింది.. అటు రైతులతోపాటు ఇటు వ్యాపారాలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయినట్లు తెలుస్తోంది..
ప్రతి ఏటా జగిత్యాల మామిడి మార్కెట్ కు ఢిల్లీతో పాటు మహారాష్ట్ర గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యాపారులు వస్తుంటారు.. ఇక్కడి క్వాలిటీ బాగా నచ్చడంతో వ్యాపారులు నేరుగా తోటల వద్ద కొనుగోలు జరిపి.. వాటిని ప్యాకింగ్ చేసి అమెరికాతో పాటు దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్ వంటి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా ఎగుమతులు చేస్తారు.. సాధారణంగా ఈ సీజన్లో జగిత్యాల నుంచి సుమారు 100 కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతూ ఉండేవట.. కానీ ఈ ఏడాది యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడం, రవాణా చార్జీలు ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరగడంతో ఎగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది..
మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి అయ్యే మామిడిలో 60 శాతం జగిత్యాల నుంచే వెళ్తుంది.. అయితే ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఆర్డర్లు రద్దు అయ్యాయట.. ఇంకా తేడాది ఈ సమయానికి 100 టన్నుల మామిడి విదేశాలకు వెళ్ళింది.. కానీ ఇప్పుడు స్థానిక మార్కెట్ పైనే ఆధారపడాల్సి వస్తోంది. డిమాండ్ లేక ధరలు సగానికి సగం పడిపోయాయని స్థానిక రైతులతో పాటు వ్యాపారస్తులు వాపోతున్నారు. అంతేకాకుండా కొన్నిచోట్లనైతే రైతులు సగం కంటే తక్కువ ధరలకు వ్యాపారులకు అమ్మేయాల్సి వస్తోందట..
Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!
పెట్టుబడులు విపరీతంగా పెరిగి.. దిగుబడి తగ్గిన సమయంలో ఈ యుద్ధ ప్రభావం రైతులకు కోలుకోని దెబ్బగా మారింది.. ఎగుమతులు లేకపోవడంతో వ్యాపారాలు ఉన్నదారలకంటే 50 శాతం తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు.. దీనివల్ల రైతులకు రవాణా ఖర్చులు కూడా రావడం లేదట.. అంతర్జాతీయ మార్కెట్ తలుపులు మూసుకుపోవడంతో.. నిలువ చేసుకునే సదుపాయం లేక రైతులు చాలా చీప్ ధరలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అయితే, దీనిపై ప్రభుత్వం స్పందించి మామిడి ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని.. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు..
Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Jagtial Telugu News: మనుషుల మధ్య బంధాల కంటే పేదరికం సృష్టించే కష్టాలే బలమైనవని నిరూపించే అత్యంత హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.. ప్రాణం ఉన్నంతవరకు తోడుంటానని ప్రమాణం చేసిన భార్య.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భర్తను కాపాడుకోలేక, తగిన గతిలేక స్మశాన వాటికలు వదిలేసి వెళ్లిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది..
జగిత్యాల జిల్లాకు చెందిన ఎండ్రికాయల శ్రీధర్ గత కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. ఇదే సమయంలో ఆయనకు రెండు కిడ్నీలు దెబ్బతినడంతో పరిస్థితి చాలా వరకు విషమించింది.. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించినప్పటికీ.. ఆరోగ్యం ఏమాత్రం మెరుగు పడలేకపోయింది.. రోజురోజుకు క్షీణిస్తున్న ఆరోగ్యం, పెరుగుతున్న వైద్య ఖర్చులు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా అనేక సమస్యల్లో పడేసాయి..
శ్రీధర్ అనారోగ్యానికి గురికావడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.. ముఖ్యంగా అర్థ కట్టలేని స్థితిలో ఉండడంతో ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయాలని తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాడు.. మరోవైపు ఇద్దరు పిల్లల బాధ్యత తో పాటు వారి భవిష్యత్తు ఆ తల్లిని ఎంతగానో వేటాడాయి.. ఆటో అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న భర్తను చూసుకోలేక.. మరోవైపు పిల్లలను పోషించలేక ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది.. కొద్ది రోజులపాటు ఎంతగానో ఆలోచన చేసింది..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
చివరికి ఏ దారి కనిపించని స్థితిలో.. తన భర్తను జగిత్యాలలోని స్థానిక స్మశాన వాటికలో వదిలేసింది.. నేను నీకు చికిత్స చేయించలేను.. కనీసం ఉండటానికి నీడ కూడా లేదని.. ఎంతో నిస్సహాయ స్థితిలో ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది.. అయితే స్మశానంలో పడి ఉన్న శ్రీధర్ ను గమనించిన స్థానికులు వెంటనే సామాజిక కార్యకర్తలకు సమాచారం అందించారు.. మానవత్వంతో స్పందించిన వారు పోలీసుల సహాయంతో శ్రీధర్ను చికిత్స నిమిత్తం మళ్ళీ ఆస్పత్రికి తరలించారు.. ఈ వార్త తెలిసిన స్థానికులు.. పేదరికం ఒక మనిషిని ఎంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకునేలా చేస్తుందని.. దానికి నిదర్శనం ఈ ఘటనేనని కన్నీరు పెడుతున్నారు.
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sangareddy Assigned Lands: అసైన్డ్ భూములు కొనడం.. అమ్మడం నిషేధం.. ఇది మనలో మాట కాదు.. గవర్నమెంట్ రూల్. పేదలకు పంచిన భూములను, ఫ్లాట్లను యథాతథ స్థితి (AS FOR RULE) ప్రకారమే వాడుకోవాలి.. ఇలా ఇవ్వగానే అలా అమ్మేస్తాం.. మా బంధువులకు ఇచ్చేస్తాం అంటే కుదరదు. అయితే ప్రతీ రూల్‌లోనూ కొన్ని లూప్ పోల్స్ ఉంటాయి.. వాటిని అడ్డుపెట్టుకుని వందల కోట్లకు పడగలెత్తుతున్నారు సంగారెడ్డి జిల్లా పొలిటికల్ లీడర్లు. ఏకంగా 250 ఎకరాల ప్రభుత్వం భూమి పేదల నుంచి లాగేసుకుని అప్పన్నంత ఆరగించేశారు. అయినవాళ్లకు కట్టబెట్టేశారు. వాళ్లకు అయిన వాళ్లంటే చుట్టాలో.. దోస్తులో కాదు.. పేరు మోసిన రియల్టర్లు. తిమ్మిని బమ్మి చేయగల సమర్థులు.
సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో గుట్టుగా సాగిన భూ దందాలో రాజకీయ నాయకులు మాత్రమే కాదు.. పేరుమోసిన అధికారులూ భాగస్వాములయ్యారు. గతంలో సంగారెడ్డి జిల్లాలో కీలక అధికారి చక్రం తిప్పితే. రాష్ట్ర సచివాలయంలోని మరో కీలక అధికారి ఆ వ్యవహారాన్నంతా చక్కబెట్టారు. ఇందుకోసం ప్రభుత్వ భూములకు ఏకంగా NOC లే ఇచ్చేశారు. NO OBJECTION CERTIFICATEను పెట్టేసి.. అసైన్డ్ భూమిని కాస్త పట్టా భూమిగా మార్చేశారు. ఇంకేముంది ఏళ్ల తరబడి నిషేధిత జాబితాలో ఉన్న అసైన్డ్ భూములకు చక చక ఎన్ఓసిలు వచ్చేశాయి. ఆ ఖరీదైన భూములు ప్రైవేట్ రియల్టర్స్ చేతుల్లోకి వెళ్లిపోయాయి.
Also Read: TMC Manifesto: నాలుగోసారి అధికారమే లక్ష్యం.. తృణమూల్ అధినేత్రి మమతా టాప్ 10 హామీలు
ఇక్కడ ట్విట్ ఏంటంటే భూ దందాలో అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్ష నేతలు ఒక్కటవ్వడమే. ఇదంతా వింటుంటే ఈమధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పొలిటికల్ సాంగ్ గుర్తుకొస్తుంది. గెలిచినాము యుద్ధమూ.. చల్ కేల్ ఖతమూ.. ఇక పగ లేంది బై.. ప్రతీకారమేంది బై.. ఈ నేల కోసం అన్నట్లుగా ఉంది భూ దందాలో నేతల ములాఖత్‌లు చూస్తే... నాటి, నేటి ప్రభుత్వ పెద్దలే అసైన్డ్ భూములను గద్దలా ఎగరేసుకుపోతున్నారు. వందలకోట్ల విలువ చేసే భూములను అప్పనంగా కాజేసుకుని జేబులు నింపుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
Also Read: Kavitha: తెలంగాణ బడ్జెట్‌పై జాగృతి ఫైర్.. రాహుల్ గాంధీకి కొత్త పేరు పెట్టిన కవిత
ఇక సంగారెడ్డికి కూతవేటు దూరంలో ఉన్న పొతిరెడ్డి పల్లిలోని 153, 154, 155, 161 ని సర్వే నెంబర్లలో దాదాపు 250 ఎకరాల భూమిని గద్దల్లా తన్నెసుకుంటుంటే.. వాటిని పొందిన లబ్దిదారులు మాత్రం దిక్కుతోటక దిగాలు చెందుతున్నారు.. 2007లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డే ఇచ్చిన ఇళ్ల పట్టాలను కూడా రద్దు చేసి రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇటీవల కొందమంది పేదలు తమ ప్లాట్ల కోసం ఆ భూముల శివారులోకి వెళ్తే.. పోలీసులను పెట్టి గెంటించేశారు. గతంలో ప్రభుత్వం పేదలకు పంచిన భూములను బలవంతంగా లాగేసుకున్నారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులది కూడా కీలక పాత్ర టాక్ వినిపిస్తోంది
భూ పంపిణీ, ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన తర్వాత గడువు లోగా అవి వాడుకలో లేకుంటే.. వెనక్కి తీసేసుకుంటామని మీకు ఇచ్చిన పట్టాలోనే రాసి ఉంది కదా.. అది తెలియకుండానే ఇప్పుడు గొడవకు వచ్చారా అంటున్నారు రెవెన్యూ ఆఫీసర్స్. పట్టాలు ఇచ్చినప్పుడు రూల్స్ పెట్టిన అధికారులు.. ఇచ్చిన భూమిని సాగుకు యోగ్యం అయ్యేందుకు సహకరించారా.. పోనీ ఇళ్లు కట్టుకుంటామంటే ప్రభుత్వ పథకాలనేమైనా జత చేశారా అంటే అదీ లేదు. కానీ రూల్స్ మాత్రం స్ట్రిక్ట్ గా ఫాలోఅవుతున్నామంటారు. ఎందుకంటే పేదల భూములను లాగేసుకున్నా.. పెద్దగా పట్టించుకునే నాథుడు ఉండడు కాబట్టి. విచిత్రం ఏంటంటే సంగారెడ్డిలో పేదల భూములను లాక్కుని వెంచర్లు వేస్తుంటే.. ప్రతిపక్షాలు కూడా మౌనంగా ఉన్నాయి. ఇదేం దబాయింపు అని అడగడానికి కూడా ప్రతిపక్ష పార్టీలు జంకుతున్నాయి. నిజానికి ప్రతిపక్ష నేతల్లో ఉన్నది భయం కాదు. సర్కారు భూముల్లో తమ వాట ఎక్కడ పోతుందోనన్న ఆందోళన అని బాధితులే చెబుతున్నారు. అందుకే వాళ్లకు మేం కనిపించడం లేదంటూ గుండెలు బాదుకుంటున్నారు.
అయితే సంగారెడ్డిలో జరుగుతున్న భూ దందా ఉన్నతస్థాయి అధికారి నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్ల వరకు తెలియంది కాదు. కానీ ఇదేంటనీ ఏ ఒక్కరూ ప్రశ్నించలేరు. ఎందుకంటే.. వారికి వాళ్ల కుర్చి.. ఉద్యోగం కాపాడుకోవడమే ముఖ్యం. ఏదైనా సమస్య వచ్చినప్పుడో.. కోర్టుల నుంచి మొట్టికాయలు పడ్డప్పుడో స్పందిస్తారు కానీ.. భూముల వ్యవహారంలో నామమాత్రంగా కూడా మాట్లాడరు. ఏదేమైనా సంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చడం.. ఇందుకోసం NOC లు ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Avanigadda Politics: ఆంధ్రప్రదేశ్ లో కూటమి నేతల కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో జనసేన, వర్సెస్ టీడీపీ అన్నట్టుగా నేతలు కొట్లాటలకు దిగుతున్నారు. ఇప్పుడు ఈ లొల్లి కృష్ణా జిల్లాకు పాకింది. అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే మండలి బుద్దా ప్రసాద్, తెలుగుతమ్ముళ్ల మధ్చ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలకు జనసేన ఎమ్మెల్యే కండువాలు కప్పడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరే కార్యకర్తలకు నామినేటేడ్ పోస్టులు, ఇతర పోస్టులను ఆశ చూపిస్తుండటంతో.. కొందరు నేతలు జనసేనలో చేరిపోయారు. దాంతో రాష్ట్రంలో పొత్తు ధర్మాన్ని జనసేన ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపించడం సంచలనంగా మారింది.
Also Read: Whip Appointment: నలుగురికి విప్ అవకాశం.. వేముల వీరేశం పదవితో కోమటిరెడ్డికి చెక్?
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు పొత్తులుగా ఏర్పాటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. చాలా నియోజకవర్గాల్లో జనసేన కోసం తెలుగుతమ్ముళ్లు తమ అవకాశాలను వదులుకున్నారు. ఇందులో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కూడా ఒకటి.. ఇక్కడ జనసేన నుంచి మండలి బుద్దా ప్రసాద్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ లో నిలిచారు. ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేత్రత్వంలో జనసేన పరా్టీలో చేరిపోయారు. అయితే టీడీపీలో టికెట్ దక్కే అవకాశం లేదనే సమాచారంతో.. ఆయన జనసేన కండువా కప్పుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో దగ్గరుండి మరి ఆయన్ను టీడీపీ నేతలు గెలిపించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఎమ్మెల్యే అయ్యాక మండలి రాజకీయంగా బలపడే ప్రయత్నాల్లో టీడీపీ నేతలకు గాలం వేసే పనిలో బిజిబిజిగా ఉన్నారు. ఇటీవల టీడీపీకి చెందిన కొందరు నేతలకు ఆయనకు జనసేన కండువాలు కప్పారు. దాంతో తమ్ముళ్లు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. అవనిగడ్డలో టీడీపీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా బుద్ద ప్రసాద్ పనిచేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: TMC Manifesto: నాలుగోసారి అధికారమే లక్ష్యం.. తృణమూల్ అధినేత్రి మమతా టాప్ 10 హామీలు
ఈ క్రమంలోనే అవనిగడ్డలో ఎమ్మెల్యే బుద్దా ప్రసాద్, టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా నియోజకవర్గంలో ఒకే రోడ్డుకు రెండు పార్టీల నేతలు భూమి పూజ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కోడూరు మండలం ఎస్సీ కాలనీలో ఓ రోడ్డుకు మొదట్లో ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం అదే రోడ్డుకు టీడీపీ నేతలు మరోసారి భూమి పూజ చేయడం హాట్ టాపిక్ ఆ మారింది. ఈ సందర్భంగా కూటమి నేతలు జనసేన ఎమ్మెల్యే బుద్దా ప్రసాద్ పై బహిరంగంగా విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అయితే కూటమి పొత్తు ధర్మంలో భాగంగా.. రహదారి నిర్మాణం టీడీపీ నేతలు చేపట్టాల్సి ఉందని.. కానీ ఎమ్మెల్యే మాత్రం ఒంటెద్దు పొకడలతో.. రోడ్డు పనులను ఎలా ప్రారంభిస్తారని తెలుగుతమ్ముళ్లు ప్రశ్నించారు. ఎవరికి చెప్పకుండా దొంగ చాటుగా వచ్చి హడావుడిగా రహదారి పనులు ప్రారంభించారని టీడీపీ నేత బండే శ్రీనివాసరావు విమర్శలకు దిగారు.
అయితే ఎమ్మెల్యేపై విమర్శల విషయంలో టీడీపీ నేతలు ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం వెనుక టీడీపీ పెద్దలు ఉన్నారని వాళ్లే చెబుతున్నారు. రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, జిల్లా ఇంచార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ నియోజకవర్గం ఇంచార్జ్ కనపర్తి శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకే రహదారి పనులకు మరోసారి ప్రారంభించినట్టు చెప్పుకొచ్చారు. అయితే బుద్దా ప్రసాద్ ఎమ్మెల్యే అయ్యాక.. టీడీపీని భూస్థాపితం చేసే పనిలో ఉన్నారని నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలకు జనసేన కండువాలు కప్పేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో నీటి సంఘాల ఎన్నికల సమయంలోనే టీడీపీ నేతలకు పదవులు ఆశచూపి జనసేన పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ఇప్పుడు మరోసారి చేరికలకు తెరతీశారని మండిపడుతున్నారు.. అయితే నియోజకవర్గంలో టీడీపీ జరుగుతున్న నష్టాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు.
మొత్తంగా ఎమ్మెల్యే బుద్దా ప్రసాద్ తన పద్దతి మార్చుకోవాలని టీడీపీ నేతలు అంటున్నారు. అవనిగడ్డలో కూటమి పొత్తు ధర్మాన్ని పాటించాలని తెలుగుతమ్ముళ్లు కోరుతున్నారు.. అయితే టీడీపీ నేతల విమర్శలను ఎమ్మెల్యే ఎంతమేర సీరియస్‌గా తీసుకుంటారో.. ఆ తర్వాత ఏం చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vivo Y11 5G India Launch: ప్రముఖ వివో కంపెనీ మార్కెట్లోకి తమ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ సిరీస్‌లా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇవి వివో వై11 5జి, వివో వై21 5జి రెండు మోడల్స్‌లో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే, ఇప్పటికే ఈ రెండు మోడల్స్ కు సంబంధించిన ఫీచర్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.. ఈ మొబైల్స్ గతంలో విడుదల చేసిన అన్ని మోడల్స్ కంటే చాలా ప్రత్యేకమైన డిజైన్తో పాటు మిడిల్ క్లాస్ వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరల్లో మాత్రమే లభించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల సింగాపూర్‌లో విడుదలైన వివోకు సంబంధించిన ఓ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఈ మొబైల్ మోడల్స్ ఫీచర్ల లాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ 6.74-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.
ఇటీవల లీకైన వివో వై11 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ స్టోరేజ్ వేరియంట్లను బట్టి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 4జీబీ ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ కలిగిన మొబైల్ ధర రూ.14 వేల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే 128gb ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16 వేల నుంచి ప్రారంభం కాబోతున్నట్లు నీకైనా వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇందులోని హై ఎండ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.18 వేల నుంచి అందుబాటులోకి రాబోతోంది. 6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.20 వేల నుంచి అందుబాటులోకి రాబోతోంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో కూడిన టాప్ ఆఫ్ ది లైన్ వేరియంట్ ధర రూ.22 వేల నుంచి ప్రారంభం కాబోతోంది..
ఇక ఈ రెండు మోడల్స్‌కు సంబంధించిన ఫీచర్స్ ఒకేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హార్డ్వేర్ కూడా సేమ్‌గా ఉన్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. ఇక ఈ స్మార్ట్‌ఫోన్స్ ఎంతో ప్రత్యేకమైన 6.74-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. దీంతోపాటు ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ సపోర్టుతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఇక ఈ రెండు మోడల్స్‌కు సంబంధించిన వెనక భాగం వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యంగా వివో Y11 5Gలో 13MP ప్రధాన కెమెరా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు వివో Y21 5Gలో 50MP ప్రధాన కెమెరా ను కలిగి ఉండబోతుంది. అలాగే ఈ రెండు మోడల్స్‌లో ఫ్రంట్ కెమెరా 5MP ఉండబోతున్నట్లు సమాచారం.. ఇక ఈ రెండు మొబైల్ కు సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. రెండింటిలోనూ కంపెనీ ఎంతో శక్తివంతమైన 6,500mAh బ్యాటరీని అందించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 6పై పనిచేస్తాయని తెలుస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Realme 16 5g India Launch: చైనీస్ స్మార్ట్‌ఫోన్‌తయారీ సంస్థ రియల్ మీ భారత్ మార్కెట్లోకి తమ కొత్త మొబైల్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రియల్ మీ 16 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్లతో పాటు అద్భుతమైన డిజైన్ ను కలిగి ఉండబోతోంది. ముఖ్యంగా మనం గతంలో ఎప్పుడూ చూడని అద్భుతమైన స్పెషల్ డిజైన్లు కలిగి ఉంటుంది. అలాగే వివిధ రకాల కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అయితే, ఈ మొబైల్ ప్రత్యేకత ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
రియల్‌మీ 16 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వివరాలను ఓ వార్తా సంస్థ తమ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో త్వరలో మార్కెట్లోకి రాబోతుందని తెలిపింది. అయితే, ఈ మొబైల్ గత మోడల్స్‌తో పోలిస్తే అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండబోతుందట. అయితే, రియల్ మీ కంపెనీ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను ఇప్పటికీ చేయకపోవడం గమనార్హం.. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ప్రకారం మాత్రం.. రియల్‌మీ 16 5G, రియల్‌మీ 16Tల విడుదల త్వరలోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది..
ఇప్పటికే రియల్‌మీ 16 5G ఈ సంవత్సరం జనవరిలో వియత్నాంలో విడుదలైంది. కానీ ఇంకా అందుబాటులోకి రాలేకపోయినట్లు తెలుస్తోంది. అలాగే అంతర్జాతీయంగాను విడుదల కాలేకపోవడం విశేషం.. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 256GB స్టోరేజ్‌తో పాటు, 12GB, 256GB వేరియంట్లలో విడుదలయ్యాయి. ఇది వైట్ స్వాన్, బ్లాక్ క్లౌడ్ రంగులలో అందుబాటులో ఉంది. రియల్‌మీ 16 5Gలో 6.57-అంగుళాల ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 4,200 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ సపోర్టుతో విడుదలైనట్లు సమాచారం..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
మీ డిస్ప్లేకు రియల్ మీ కంపెనీ DT స్టార్ D+ గ్లాస్ ప్రొటెక్షన్ ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పాటు మాలి-G57 MC2 GPUతో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ UI 7.0 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది.. దీంతోపాటు మీ మొబైల్ వెనుక భాగంలో కెమెరా డ్యూయల్ రియల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అదేవిధంగా వెనక భాగంలోని ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్ ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభించడం విశేషం. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 7,000 mAh బ్యాటరీ 60 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఇవే కాకుండా ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jharkhand Bomb Discovery Telugu: జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్ సమీపంలో గల సువర్ణరేఖ నది తీరంలో భారీ పేలుడు పదార్థం లభ్యమవ్వడం స్థానికంగా ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.. సుమారు దాదాపు 227 కిలోల బరువున్న ఈ శక్తివంతమైన బాంబు అమెరికాలో తయారైనట్లు ఇప్పటికే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కొంతమంది అధికారులు గుర్తించారు. తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని బహరగోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక తవ్వకాలు జరుపుతుండగా ఈ భారీ బాంబు బయటపడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. అసలు ఈ బాంబు అక్కడికి ఎలా వచ్చి ఉంటుంది? ఇది రావడానికి గల కారణాలేంటి పూర్తి వివరాలు మనం ఎప్పుడు తెలుసుకుందాం..
నదిలో ఇసుక తీస్తున్న సమయంలో కూలీలకు గ్యాస్ సిలిండర్ ఆకారంలో ఉన్న ఈ ఒక భారీ వస్తువు కనిపించింది.. అయితే ఈ విషయాన్ని అక్కడే ఉన్న కూలీలు అంత గ్రామస్తులకు తెలియజేశారు.. దీంతో గ్రామస్తులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోగా.. అది బాంబని తేలడంతో భయాందోళనకు గురయ్యారు.. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.. బాంబు చుట్టూ పది మీటర్ల మేర ఎవరిని రాకుండా బారికేడ్లు ఏర్పాటుచేసి రక్షణ కల్పించారు..
ఈ బాంబుపై AN-M64 500 lb American-made అనే అక్షరాలు స్పష్టంగా కనిపించడం విశేషం.. అయితే ఇది రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటిది లేదా 1971 భారత్ పాక్ యుద్ధ సమయంలో ఇక్కడ పడి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.. మరోవైపు 2018లో కలయికుండా ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన ఒక యుద్ధ విమానం ఈ ప్రాంతంలోనే కూలిపోయింది.. బహుశా ఆ యుద్ధ విమానంలో బాంబులలో ఇది ఒకటై ఉంటుందని కూడా అధికారులు అనుమానిస్తున్నారు..
రాంచి నుంచి వచ్చిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఈ బాంబును ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అత్యంత శక్తివంతమైందని.. సాధారణ పద్ధతుల్లో దీనిని నిర్వీర్యం చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.. ఒకవేళ ఇది పేలితే 100 మీటర్ల పరిధిలో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. దీంతో దీనిని నిర్వీర్యం చేసేందుకు పశ్చిమ బెంగాల్లోని కలైకుండా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారుల సహాయం కోరినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఆర్మీ తో పాటు ఎయిర్ఫోర్స్ నిపుణులు వచ్చేవరకు ఆ ప్రాంతంలో అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.. అది తీరానికి ఎవరు వెళ్లకుండా ప్రజలకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sun-Jupiter 2026: సూర్య, గురు సంయోగం.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం.. కెరీర్, వ్యాపారంలో తిరుగుండదు!
Sun-Jupiter Conjunction 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహ గమనాలు మానవ జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపుతాయని మనందరికీ తెలిసిందే.. 2026 సంవత్సరంలో జరగబోయే అరుదైన గ్రహ కూటమి కొన్ని రాశుల వారికి జాతకాన్ని పూర్తిగా మార్చబోతోంది. ముఖ్యంగా గ్రహాలకు రాజుగా చెప్పుకునే సూర్యుడు.. దేవ గురువు గృహస్పతి కలయిక కారణంగా సూర్య గురు సంయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా నాలుగు రాష్ట్రాల వారికి రాజయోగం పట్టడమే కాకుండా ఆర్థికంగా, వృత్తిపరంగా ఇంచను విజయాలు సాధిస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జీవితంలో ఎప్పుడు పొందలేని ప్రయోజనాలు పొందబోతున్నారు..
అదృష్ట రాశులు..
మేష రాశి
మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సంయోగం అద్భుతమైన లాభాలను చేకూర్చబోతోంది. ముఖ్యంగా వీరికి నిలిచిపోయిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ లభించడమే కాకుండా.. వేతనాల్లో పెంపు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా మారబోతున్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు సూర్యుడి ప్రభావంతో వీరికి స్వర్ణ యుగం ప్రారంభం కాబోతోంది. ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్న వారికి విశేషమైన గుర్తింపు లభించబోతోంది. ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు కూడా భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా తండ్రి నుంచి భారీ బహుమతులు కూడా పొందగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి..
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఆదాయ వనరులు కూడా విపరీతంగా పెరుగుతాయి. అంతేకాకుండా గతంలో చేసిన పెట్టుబడిలో నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా పొందగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో సంతోషం విపరీతంగా నిండుతుంది. కెరీర్‌లో కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా వాటిని సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మెప్పు పొందుతారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా మెరుగుదల కనిపించే అవకాశాలు ఉన్నాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతిగా గురుడు ఉంటాడు. అయితే సూర్యుడి కలయిక కారణంగా వీరికి ఆధ్యాత్మికంగా కలిసి రాబోతోంది. ముఖ్యంగా మంచి అభివృద్ధి పనుల్లో నిమగ్నమైన వ్యక్తులకు విశేషమైన గుర్తింపు లభించబోతోంది. విదేశీ ప్రయాణాలకు ఉన్న అడ్డంకులు కూడా ఎంతో సులభంగా తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ లేదా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం అదృష్టాన్ని తీసుకురాబోతోంది. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన ప్రయోజనాలు పొందుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Saturn Venus Conjunction Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహగమనం మానవ జీవితంపై ఎంత ప్రభావం చూపుతుందో మనందరికీ తెలిసిందే.. ముఖ్యంగా సంపదకు కారకుడైన శుక్రుడు.. కర్మాలకు అధిపతిగా వ్యవహరించే శని ఒకే రాశిలో కలిసినప్పుడు అద్భుతం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రాశుల వారికి అదృష్టం కూడా వరించి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతూ ఉంటాయి. అయితే మార్చి 26వ తేదీన ఈ రెండు గ్రహాల కలయిక జరగబోతోంది. చాలా రోజుల తర్వాత శని శుక్ర గ్రహాలు కలయిక జరపడం విశేషం. అయితే ఈ సమయంలో మూడురాశుల వారు ధనవంతులయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోతున్న రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం..
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ రెండు గ్రహాలు కలయిక ఒక రాజయోగంలా మారబోతోంది.. శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడంతో శని దేవుడి ప్రభావంతో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడిల నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా వస్తాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులతో పాటు భారీ మొత్తంలో జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి.
మిథున రాశి
మిధున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా అదృష్టం ఊహించని స్థాయిలో రాబోతోంది. ముఖ్యంగా వీరి జాతకంలో భాగ్య స్థానంలో ఈ మార్పులు జరగడం వల్ల సమాజంలో వీరికి అద్భుతమైన గౌరవం లభించబోతోంది. ఆదాయ వనరులు పెరగడమే కాకుండా పాత అప్పుల నుంచి విముక్తి లభించబోతోంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దీంతోపాటు వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ముందుకు సాగిపోతోంది. అలాగే మీరు ఈ సమయంలో తప్పకుండా భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
కుంభ రాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శని దేవుడు అధిపతిగా ఉంటాడు. అయితే, వీరికి శుక్రుడు ప్రభావం చాలా వరకు కలిసి రాబోతోంది. అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు. ముఖ్యంగా సొంత వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది గోల్డెన్ పీరియడ్ గా మారబోతోంది.. అలాగే నూతన పరిశ్రమలు స్థాపించడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. గత కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి. అంతేకాకుండా కొన్ని వీరికి అనుకూలమైన పనులు జరుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎప్పటినుంచో అనుకుంటున్న పనులు కూడా సులభంగా చేసి అద్భుతమైన విజయాలు సాధిస్తారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan AP Politics: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల్లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మాస్ లీడర్. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్. కడప ఎంపీగా కాంగ్రెస్ తరపున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ తండ్రి హఠాన్మరణంతో జగన్ రాజకీయ దారి ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన వారిని ఓదార్పు యాత్ర పేరుతో జనంలోకి వెళ్లి.. ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఇదే జగన్ రాజకీయ భవిష్యత్తును మొత్తం మార్చేసింది. ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతివ్వలేదు. అధిష్టానం నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. ఇక అక్కడి నుంచి కాంగ్రెస్ కు జగన్ కు మధ్య తీవ్ర అగాథం ఏర్పడింది. అ తర్వాత జరిగిన పరిణామాలతో అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లడం. ఆ తర్వాత ప్రత్యేకంగా వైసీపీ పార్టీ పెట్టడం చకచక జరిగిపోయాయి. ఆ తర్వాత.. ఏపీలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.. మరోసారి సీఎం అయ్యేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
Also Read: RK Roja: ఉగాది రోజు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీఆర్ నాయుడు గాడిదలు కాస్తున్నారా?
ఇక 2019లో ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైందని అందరూ భావించారు. కానీ, ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కొద్ది రోజుల్లోనే జగన్ తన పంథాను మార్చేశారు. విధానపరమైన విమర్శలను పక్కన పెట్టి, వ్యక్తిగత టార్గెట్‌లకు ప్రాధాన్యత ఇచ్చారు. తనకంటూ రాజకీయ మిత్రులను సంపాదించుకోవాల్సింది పోయి, గడిచిన ఐదేళ్లలో ప్రతిపక్ష పార్టీలను, నాయకులను బద్ధ శత్రువులుగా మార్చుకున్నారు. నేనే శాశ్వత ముఖ్యమంత్రిని అనే భ్రమలో ఉండి, రేపు తాను కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందన్న కనీస ఆలోచనను విస్మరించారన్న విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. జగన్ తనను తాను వైఎస్సార్ వారసుడిగా చెప్పుకుంటారు. కానీ, రాజకీయ శైలిలో తండ్రికి, కొడుకుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుందనేది పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్న టాక్. వైఎస్సార్ హయాంలో చంద్రబాబుతో రాజకీయ పోరు ఉన్నా, అది వ్యక్తిగత స్థాయికి ఎప్పుడూ వెళ్లలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తన దగ్గరకు వస్తే పనులు చేసి పెట్టే ఉదార స్వభావం వైఎస్సార్‌ది. అందుకే ఆయనకు సొంత పార్టీలోనే కాదు, ప్రత్యర్థి పార్టీల్లోనూ అభిమానులు, శ్రేయోభిలాషులు ఉండేవారు. కానీ జగన్ మాత్రం ప్రత్యర్థులను రాజకీయంగా కాకుండా, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేధించారనే ఆరోపణలు మూటగట్టుకున్నారనేది ఓపెన్ సీక్రెట్.
Also Read: Harish Rao: కాంగ్రెస్ బడ్జెట్‌తో ఆరు గ్యారెంటీలకు ఘోరీ.. అందరికీ మొండి'చేయి': హరీశ్ రావు
అయితే వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పిదం సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయడమే అనే చర్చ ఉంది. 70 ఏళ్ల వయసున్న ఒక సీనియర్ నాయకుడిని, సరైన సాక్ష్యాధారాలు చూపకుండా, అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేసి 50 రోజుల పాటు జైల్లో ఉంచడం ఏపీ ప్రజలకు రుచించలేదు. ఈ అరెస్ట్ ద్వారా చంద్రబాబుపై సానుభూతి పెరగడమే కాకుండా, జగన్ ఒక కక్షపూరిత నాయకుడు అనే ముద్ర బలంగా పడిపోయింది. సామాన్యులు సైతం ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు అని చర్చించుకునేలా చేసింది. అదే ఆగ్రహం 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి శవ పంచనామా రాసింది. కేవలం రాజకీయ నాయకులనే కాకుండా, కొన్ని సామాజిక వర్గాలను, వ్యాపారవేత్తలను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి రైతుల పట్ల అనుసరించిన తీరు, వారిని హేళన చేయడం గ్రామీణ ఓటర్లలో తీవ్ర అసంతృప్తిని నింపిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.. వీటికి తోడు, వైసీపీ సోషల్ మీడియా వింగ్ ద్వారా అప్పటి ప్రతిపక్ష నాయకుల కుటుంబ సభ్యులపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేశాయనే విమర్శలు ఉన్నాయి.
ఇక 2024 ఎన్నికల్లో మాత్రం.. జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని బలంగా నమ్మారు. మరోసారి తానే సీఎం అవుతానంటూ కలలు కన్నారు. అప్పట్లో సంక్షేమ పథకాలు ప్రజలను ఆదుకుంటాయని జగన్ నమ్మినా, అహంకారం, వ్యక్తిత్వ హననం ఆ పథకాల ప్రభావాన్ని తుడిచిపెట్టేశాయన్న ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఇంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదని చర్చ జరుగుతోంది. ఇప్పటికీ తనదే తప్పు లేదని, ఈవీఎంల వల్లో లేక మరే కారణం వల్లో ఓడిపోయామని చెప్పుకోవడం ఆయన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదకరమని పొలిటికల్ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. పార్టీలో ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పక్కకు తప్పుకుంటున్నా, కేవలం కొందరు వీరాభిమానుల మాటలు విని జగన్ ముందుకు వెళ్తున్నారనే టాక్ నడుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రజలు పగలు, ప్రతీకారాలు కోరుకోవడం లేదు. కేవలం అభివృద్ధిని, ప్రశాంతమైన పాలనను కోరుకుంటున్నారనీ జగన్ గ్రహించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఏదీఏమైనా జగన్ ఇప్పటికైనా తన పంథాను మార్చుకుంటారా. తన తండ్రిలా అందరివాడు అనిపించుకునే ప్రయత్నం చేస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. లేక అదే పాత కక్ష రాజకీయాలను కొనసాగిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ తన రాజకీయ శైలిని పూర్తిగా ప్రక్షాళన చేసుకోకపోతే మాత్రం 11 సీట్ల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందన్నది రాజకీయ పండితుల మాట. మరి జగన్ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Congress Whip: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. శాసనసభ, శాసనమండలిలో కొత్త విప్‌లను నియమించింది. అసెంబ్లీలో విప్ లుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావుకు అవకాశం ఇచ్చారు. ఇక శాసనమండలిలో విప్‌లుగా ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌కు చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ పదవుల నియామకంపై అధికార పార్టీలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. విప్ పదవుల భర్తీలో సీఎం రేవంత్ రెడ్డి మార్క్ ఉందనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశంకు కీలక పదవి దక్కడంతో.. త్వరలో జరిగే విస్తరణలో నల్గొండ జిల్లాకు మంత్రి పదవి లేనట్టే అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
Also Read: TMC Manifesto: నాలుగోసారి అధికారమే లక్ష్యం.. తృణమూల్ అధినేత్రి మమతా టాప్ 10 హామీలు
ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇందులో ఒకరు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాగా.. మరొకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మరోవైపు ఇదే జిల్లా నుంచి ప్రభుత్వ విప్‌గా బీర్ల ఐలయ్య కొనసాగుతున్నారు. అటు శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పుడు వేముల వీరేశంకు సైతం ప్రభుత్వ విప్ పదవిని అప్పగించారు. మరోవైపు ఎస్టీ కోటాలో ఎంపికైన డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టినా.. ఆ పదవిని ఆయన చేపట్టలేదు.. ఈ పోస్టును సైతం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌ను అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. దాంతో ఉమ్మడి జిల్లాకు ఆరు కీలక పోస్టులు దక్కినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే విస్తరణలో నల్గొండ జిల్లాకు మంత్రి పదవి దాదాపు లేనట్టేనని జిల్లా నేతలు చర్చించుకుంటున్నారు. అందుకే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు విప్ పదవి ఇచ్చారని ప్రచారం సాగుతోంది.
Also Read: Kavitha: తెలంగాణ బడ్జెట్‌పై జాగృతి ఫైర్.. రాహుల్ గాంధీకి కొత్త పేరు పెట్టిన కవిత
కొద్దిరోజులుగా మంత్రి పదవి రాలేదనే అసంతృప్తిలో మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ పెద్దలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మునుగోడులో రాజ్ గోపాల్ రెడ్డి దూకుడు పెంచారు. వైన్స్ షాపుల దగ్గర నుంచి.. లోకల్ బాడీ ఎన్నికల్లోనూ తన మార్క్ చూపించారు. అంతేకాకుండా తనకు అవకాశం దొరికిప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో రాజ్ గోపాల్ రెడ్డి వ్యవహారాన్ని టీపీసీసీ చీఫ్ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దాంతో హైకమాండ్ సైతం రాజ్ గోపాల్ రెడ్డి అంశాన్ని హైకమాండ్ సీరియస్‌గా పరిశీలిస్తోందని అంటున్నారు. అయితే ఒకే ఇంట్లో రెండు మంత్రి పదవులు ఆసాధ్యమని పార్టీ పెద్దలు అన్నట్టు తెలిసింది. ఒకవేళ వెంకట్ రెడ్డి మంత్రి పదవి వదులుకుంటే.. ఆ పదవిని రాజ్ గోపాల్ రెడ్డికి ఇవ్వమంటూ హైకమాండ్ చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.
కానీ వెంకట్ రెడ్డిని మంత్రి పదవిలో నుంచి తప్పించడం అసాధ్యమని తేలడంతోనే.. రాజ్ గోపాల్ రెడ్డిని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్ గోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ పెద్దలు సైతం కాస్తా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఆయన పార్టీకి లాయల్‌గా ఉండే పరిస్థితులు లేరనే అభిప్రాయానికి పార్టీ పెద్దలు వచ్చినట్టు సమాచారం. అందుకే రాజ్ గోపాల్ రెడ్డిని పక్కన పెట్టారని టాక్. మరోవైపు త్వరలో జరిగే విస్తరణలో ఎస్టీ సామాజికవర్గం నేతకు మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. ఇప్పటివరకు ఎస్టీలకు, రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మరో పదవి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రెడ్డి నేతకు ఇచ్చేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. కాబట్టి.. రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి దాదాపు లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రభుత్వ విప్ గా వేముల వీరేశంకు అవకాశం కల్పించి.. రాజ్ గోపాల్ రెడ్డికి చెక్ పెట్టారని ప్రచారం సాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
West Bengal Assembly Elections: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ నెలకొనగా.. ఇప్పటికే షెడ్యూల్ విడుదలై అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలు, అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. వరుసగా నాలుగోసారి అధికారం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అదిరిపోయే మేనిఫెస్టోను ప్రకటించింది. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను అమలుచేస్తూనే వాటికి మరింత పెంచుతూ పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయాలు ప్రకటించారు.
Also Read: Harish Rao: కాంగ్రెస్ బడ్జెట్‌తో ఆరు గ్యారెంటీలకు ఘోరీ.. అందరికీ మొండి'చేయి': హరీశ్ రావు
ఓటర్లను ఆకర్షించి నాలుగోసారి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక 10 హామీలు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపిస్తే రాబోయే ఐదేళ్లలో ప్రతి ఇంట్లో ఆనందం నింపాలనే ఆశయంతో పనిచేస్తామని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటమిని ముందే ఖరారు చేసుకున్న బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో అనధికార రాష్ట్రపతి పాలన విధించారని మమతా బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌ను కాపాడుకునేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భయభ్రాంతులకు గురిచేసినా.. ధనప్రవాహంతో ప్రలోభ పెట్టినా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. 'మేం విభజన రాజకీయాలు చేయడం లేదు. అన్ని మతాల ప్రజలూ నాకు సమానమే' అని మమతా బెనర్జీ ప్రకటించారు.
Also Read: RK Roja: ఉగాది రోజు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీఆర్ నాయుడు గాడిదలు కాస్తున్నారా?
మేనిఫెస్టోలో ప్రధాన హామీలు ఇవే!
లక్ష్మీ భండార్ సహాయం పెంపు
ప్రస్తుతం అమలులో ఉన్న లక్ష్మీ భండార్ పథకం సహాయం పెంచుతామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సాధారణ మహిళలకు నెలకు అందిస్తున్న సహాయం మరో రూ.500 పెంచుతూ మొత్తం రూ.1,500 చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇక ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.1,700 ఆర్థిక సహాయం టీఎంసీ ప్రకటించింది. ఇక నిరుద్యోగులకు అందిస్తున్న భృతి రూ.1,500 అందిస్తామని హామీ ఇచ్చింది.
==> పారిశ్రామికంగా పశ్చిమ బెంగాల్ మరింత అభివృద్ధి చెందేందుకు మరింత ప్రోత్సాహం ఇస్తామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఎంఎస్ఎంఈలతో 1.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్, పోర్టులు, వాణిజ్య మౌలిక వసతులు, అత్యాధునిక గ్లోబల్ ట్రేడ్ సెంటర్‌ను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని పెట్టుబడులు, వ్యాపారాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడం.
==> ‘దౌరే చికిత్స’ పేరిట ఇంటింటికీ ఆరోగ్య సేవలు ప్రారంభం. ఇంటి వద్దే నాణ్యమైన వైద్య సేవలు అందించేలా వైద్య శిబిరాలు ఏర్పాటు.
==> రాష్ట్రంలోని వేలాది పాఠశాలలను ఈ-లెర్నింగ్ సౌకర్యాలతో ఆధునీకరణ
==> 7 నుంచి 8 కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తామని హామీ. బ్లాక్‌లు, కొత్త మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేయాలని మేనిఫెస్టోలో ప్రకటన.
==> అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశం. రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి, భూమిలేని రైతులకు మద్దతు ఇవ్వడానికి, వ్యవసాయ రంగాన్ని మరింత మెరుగుపరచడానికి రూ.30,000 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
==> అర్హులైన అందరికీ వృద్ధాప్య పింఛన్లు నిరంతరాయంగా అందించడం.
==> ప్రతి కుటుంబానికీ శాశ్వత ఇంటి నిర్మాణం.
==> ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీటి సరఫరా
కాగా పశ్చిమబెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఏప్రిల్ 23, 29 పోలింగ్ జరుగుతుండగా.. మే 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana SSC Exams Cancelled: తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. నేడు అనగా మార్చి 20వ తేదీన డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్‌కు సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలపై ఆయన కీలక ప్రకటన చేశారని వార్తలు వచ్చాయి. వచ్చే విద్యాసంవత్సరం 2026-27 నుంచి పదో తరగతి బోర్డు ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు తాజాగా మీడియాలో ప్రచారం జరిగింది. అయితే దీనిపై తెలంగాణ విద్యాశాఖ కమిషన్ ఓఎస్డీ డాక్టర్ జీనత్ స్పందించారు. పదో తరగతి పరీక్షలు రద్దు వెనుక అసలు నిజం ఇదే అని అధికారి జీనత్ క్లారిటీ ఇచ్చారు.
జరిగింది ఇదే?
10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయాలని తాము సమర్పించిన నివేదికలో ఎక్కడా సిఫార్సు చేయలేదని తెలంగాణ విద్యా కమిషన్ స్పష్టం చేస్తోంది. SSC బోర్డును, BIEని విలీనం చేయాలని, అలాగే కేవలం 11వ తరగతి పబ్లిక్ పరీక్షలను మాత్రమే రద్దు చేయాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు డాక్టర్ జీనత్ స్పష్టం చేశారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలని, ప్రజలకు కచ్చితమైన, ధృవీకరించబడిన సమాచారం మాత్రమే చేరేలా చూడాలని మేము మీడియాకు వెల్లడించారు.
అయితే అంతకుముందు మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..తెలంగాణ విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తేవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో ఉన్న +2 విధానం అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ అలాంటి మార్పులు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. ఈ క్రమంలో SSC బోర్డు లేనట్టేనని..దీంతో పదో తరగతి పరీక్షలు ఉండబోవని ఆయన ప్రకటన చేశారు.
మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. విద్యావ్యవస్థలో మార్పులపై ఏర్పాటు చేసిన కమిటీ అనేక అధ్యయనాలు చేస్తోందని అయన తెలిపారు. అయితే ఈ మార్పులపై విద్యాశాఖ కమిషన్ ఇచ్చేది తుదినివేదిక కాదని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టింది వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ అని రేవంత్ అన్నారు. బడ్జెట్‍కు వ్యతిరేకంగా చెవిలో పువ్వులు పెట్టుకుని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ నేతల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ సెటైర్లు వేశారు. మాజీ సీఎం కేసీఆర్ బయటకి రాకుండా గృహ నిర్బంధం చేశారని.. తెలంగాణ జాతిపిత ఎవరో ప్రజలు డిసైడ్ చేయాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook