icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Sonam Wangchuk: ఆమరణ దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్..

Hyderabad, Telangana:

Sonam Wangchuk Latest News: ప్రముఖ సామాజిక వేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌లతో జరిగిన కీలక సమావేశం అనంతరం ఆయన తన దీక్షను విరమించారు. మంత్రులు స్వయంగా నిమ్మరసం అందించి వాంగ్‌చుక్‌తో దీక్షను విరమింపజేశారు.

అసలేం జరిగింది?
పరీక్షల లీకేజీల అంశంపై కేంద్ర ప్రభుత్వ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ.. సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. దీక్ష క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ప్రత్యేక చికిత్స నిమిత్తం గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్‌చుక్‌ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు కలిసి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. వాంగ్‌చుక్ లేవనెత్తిన ప్రధాన సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని.. తగిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రులు స్పష్టమైన హామీ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.. దేశానికి మీ సేవలు ఇంకా చాలా అవసరమని.. యువత భవిష్యత్తు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రులు ఈ సందర్భంగా హామీ ఇచ్చిన్నట్లు సమాచారం..  

శాంతియుత చర్చలకు మార్గం సుగమం..
కేంద్ర మంత్రుల నుంచి సానుకూలమైన స్పందన లభించడంతో పాటు పలువురు పార్లమెంట్ సభ్యుల విజ్ఞప్తి మేరకు తాను దీక్ష విరమించాలని నిర్ణయించుకున్నట్లు సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు. విద్యార్థులు, యువత ఆందోళనలను విరమించి.. ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వంతో జరిగిన ఈ చర్చలు సానుకూల వాతావరణంలో ముగియడంతో దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంతో కలిసి శాంతియుత మార్గంలో పరిష్కరిస్తారని వాంగ్‌చుక్ తెలిపిన్నట్లు తెలుస్తోంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

0
0
Report

KTR Birthday: అనుకున్నది ఏదీ సాధించలే.. కానీ కేటీఆర్‌ పేరు తెలంగాణకు ఓ బ్రాండ్‌

Baddipadaga, Telangana:

KTR Birthday: అభివృద్ధికి దిక్సూచిగా.. చిరునామాగా.. పర్యాయపదంగా కేటీఆర్‌ నిలుస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ యువతరానికి కేటీఆర్‌ అనే పేరు ఒక బ్రాండ్‌గా మారింది. ముఖ్యంగా యువత కేటీఆర్‌ను అమితంగా అభిమానిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా కేటీఆర్‌ను తమ తరానికి ఒక ఐకాన్‌గా భావిస్తున్నారు. కల్వకుంట్ల తారక రామారావు కన్నా కేటీఆర్‌గా పేరు మార్మోగుతోంది. తండ్రికి తగ్గ వారసుడిగా.. విజయవంతమైన కేటీఆర్‌ తెలంగాణకు తర్వాత కాబోయే నాయకుడిగా యువత భావిస్తోంది.

గతంలో సంపన్న, మధ్యతరగతి ప్రజల ఆదరాభిమానం పొందిన కేటీఆర్‌ ఇప్పుడు మాస్‌ ప్రజల్లో కూడా గుర్తింపు పొందుతున్నారు. ఉద్యమంలో ఒక కేటీఆర్‌ను... మంత్రిగా ఒక కోణం.. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మరో కోణంలో ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్‌ నోట్లో నుంచి ఊడిపడినట్టు కేటీఆర్‌ వ్యవహార శైలి.. మాటతీరు ఉంటుంది. కేసీఆర్‌ మాదిరి ఇంగ్లీష్‌, ఉర్దూ, హిందీ, తెలుగు భాషల్లో అదరగొడతాడు. సామెతలు, కథలు, పంచ్‌లు, చలోక్తులు, జోకులు వేయడంలో కేసీఆర్‌ మాదిరి కేటీఆర్‌ ఉన్నాడు.

వాస్తవంగా కేటీఆర్‌కు రాజకీయాలు అనేవి అంతగా ఆసక్తి లేవు. కరీంనగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా తండ్రి కేసీఆర్‌కు తోడుగా ఉందామని తట్టాబుట్టా సర్దేసుకుని అమెరికా నుంచి తెలంగాణకు వచ్చాడు. ఈ విషయం కేసీఆర్‌కు కూడా తెలియదు. తర్వాత చెబితే కేసీఆర్‌ సర్లే అని వెంట తిరిగాడు. అయితే అంతకుముందు చదువు కూడా కేటీఆర్ ఇష్టపడి.. తాను చదవాలనుకున్నది చదవలేదు. అమ్మ డాక్టర్‌ కావాలని.. నాన్న ఐఏఎస్‌ కావాలని కలలు కంటే కేటీఆర్‌ మాత్రం విదేశాల్లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేశారు. ఇంటర్‌, డిగ్రీ, ఎంబీఏ ఇలా ఏ చదువు కూడా తాను అనుకున్నది కేటీఆర్‌ చదవలేదు.

కానీ కష్ట సమయంలో తండ్రి కేసీఆర్‌కు అండగా నిలవడమే కేటీఆర్‌ జీవితంలో అతి పెద్ద టర్నింగ్‌ పాయింట్‌. అప్పటి నుంచి నేటి వరకు రాజకీయాల్లో కేటీఆర్‌ కొనసాగుతున్నాడు. గతంలో తండ్రి వెనుకాల ఉండగా.. కొన్నాళ్లకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఓటమన్నేది లేకుండా దూసుకెళ్తున్నాడు. సిరిసిల్ల నుంచి వరుసగా ఓటమి లేకుండా గెలుస్తున్నాడు. మంత్రిగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడిగా విజయవంతంగా పార్టీని నడుపుతున్న కేటీఆర్‌ కుటుంబానికి మాత్రం సమయం ఇవ్వడం లేదు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వందకు ఒకటి తక్కువ సీటు అంటే 99 కార్పొరేటర్లు సీట్లు గెలిచిన తర్వాత కేటీఆర్‌కు యమ క్రేజ్‌ పెరిగింది. నాడు కేసీఆర్‌కు కొడుకు గిఫ్ట్‌ అని గుర్తింపు లభించింది. నాటి నుంచి ఎన్నికలకు వెళ్తున్నా ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు అసెంబ్లీ, పార్లమెంట్‌, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా ఏవీ వచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో కేటీఆర్‌ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ వాటన్నిటిని తట్టుకుని నిలబడి రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కేటీఆర్‌ అడుగులు వేస్తున్నాడు. ఇక తెలంగాణలో మరోసారి తన తండ్రి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పంతో కేటీఆర్‌ పని చేస్తున్నాడు.

0
0
Report
Advertisement

ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. 3 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, నేతన్న భరోసా పథకానికి గ్రీన్‌ సిగ్నల్‌

Amaravathi, Andhra Pradesh:

Nethanna Bharosa Scheme: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త వినిపించింది. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేయాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీ మంత్రివర్గ సమావేశం పచ్చజెండా ఊపింది. చేనేత కార్మికులకు 'నేతన్న భరోసా' కింద రూ.25 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటితోపాటు గోదావరి పుష్కరాలు, భోగాపురం విమానాశ్రయం ప్రారంభం తదితర అంశాలపై మంత్రిమండలి కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది.

అమరావతిలోని సచివాలయంలో గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. కొన్ని గంటలపాటు చర్చించిన మంత్రిమండలి కొన్ని కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రధాని మోదీ ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తుండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు, గోదావరి పుష్కరాలపై ఏపీ మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మంత్రివర్గ నిర్ణయాలు
==> 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. 

==> చేనేత కార్మికులకు 'నేతన్న భరోసా' కింద రూ.25 వేలు చొప్పున ఆర్థిక సహాయం

==> బాపట్లలో వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు

==> పుష్కరాలకు భద్రత, బందోబస్తుకు రూ.50 కోట్లు మంజూరు

==> ఏపీ మార్క్‌ఫెడ్‌కు సెంట్రల్ బ్యాంక్ నుంచి ఇచ్చే రూ.300 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీకి మంత్రిమండలి అంగీకారం

పొగాకు రైతుల సమస్యపై చర్చ
పొగాకు రైతులకు మద్దతుగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పోరాటం చేసేందుకు సిద్ధమవగా అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం స్పందించింది. పొగాకు రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకు రైతుల సమస్యల అంశంలో 3 ప్రతిపాదనలపై ఏపీ మంత్రివర్గం చర్చించింది. పొగాకు రైతులకు రూ.60 వేలు వడ్డీలేని రుణం ఇవ్వాలని మంత్రివర్గం ప్రతిపాదన చేసింది. పొగాకు బోర్డు నుంచి వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చేలా రెండో ప్రతిపాదన చేయగా.. గ్రేడ్‌ల విషయంపైనా ఆలోచించాలని మరో ప్రతిపాదన చేసింది.

మంత్రులకు కీలక ఆదేశాలు
ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఇన్‌ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయికి వెళ్లి సమస్య పరిష్కరించే వరకు ఇన్‌ఛార్జ్ మంత్రులదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందే పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. పింఛన్ల పంపిణీ పూర్తిచేసి ప్రధాని మోదీ భోగాపురం పర్యటన కార్యక్రమంలో నిమగ్నం కావాలని మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పారు.

0
0
Report

Riya Yadav Protest: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా ఈ మోడల్ ఎవరు?

Mumbai, Maharashtra:

Riya Yadav Police Van: దేశవ్యాప్తంగా కలకలం రేపిన 'నీట్ (NEET) ప్రశ్నపత్రం లీక్' వ్యవహారంపై ఢిల్లీ నుంచి ముంబై వరకు నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో ముంబైలోని ప్రముఖ శివాజీ పార్క్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థుల కోసం ధైర్యంగా పోలీస్ వ్యాన్‌ను ఎదుర్కొన్న ఓ యువతి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆ ధైర్యవంతురాలైన యువతి ఎవరు? అక్కడ ఏం జరిగింది? అనే వివరాలు ఇక్కడ చూద్దాం.

అసలు ఏం జరిగింది?
గత బుధవారం, ముంబైలోని దాదర్ నుండి శివాజీ పార్కుకు వెళ్తున్న రియా అహిర్, దారిలో అరెస్టు చేయబడిన నిరసనకారులతో (విద్యార్థులతో) వెళ్తున్న ఒక పోలీసు వ్యాన్‌ను గమనించారు. వెంటనే ఆమె ఏమాత్రం సంకోచించకుండా, ఆ పోలీస్ వ్యాన్ ముందు నిలబడి దానిని అడ్డుకున్నారు.

పోలీసులు ఎంత చెప్పినా ఆమె వెనక్కి తగ్గలేదు. అరెస్టు చేసిన విద్యార్థులను ఆ తర్వాతి సమయంలో విడుదల చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ, ఆమె ఒప్పుకోలేదు. విద్యార్థులను అక్కడికక్కడే వెంటనే విడుదల చేయాలని ఖచ్చితమైన పట్టుబట్టారు. రియా చూపిన దృఢమైన వైఖరి, ధైర్యానికి తలొగ్గిన పోలీసులు చివరకు నిరసనకారులను సెట్స్ నుంచే విడుదల చేశారు.

రియా అహిర్ (రియా యాదవ్) ఎవరు?
రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో నేషనల్ సెన్సేషన్‌గా మారిన రియా అహిర్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈమె పూర్తి పేరు రియా యాదవ్, వయసు 27 సంవత్సరాలు. వృత్తి రీత్యా ఈమె మోడల్, నటిగానే కాకుండా వ్యాపారవేత్తగా రాణిస్తుంది. రియా 'రియాసత్' పేరుతో సొంత క్లాథింగ్/దుస్తుల బ్రాండ్‌ను నడుపుతున్నారు. ఇటీవలే వైరల్ అయిన 'దిల్బరా' మ్యూజిక్ ఆల్బమ్‌లో కూడా ఆమె నటించారు. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.10 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటుడు అభిషేక్ బానర్జీ వంటి వారితో ఈమెకు మంచి సంబంధాలు ఉన్నాయి.

వెల్లువెత్తుతున్న ప్రశంసలు
పోలీస్ వ్యాన్‌ను అడ్డుకున్న ఉత్కంఠభరిత వీడియో నెట్‌లో వైరల్ అవ్వడంతో, ఆమె సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని నెటిజన్లు విశేషంగా కొనియాడుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్ సహా పలువురు ప్రముఖులు రియా ఫోటోను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఆమె చూపిన తెగువను బహిరంగంగా అభినందించారు.

Also REad; "హీరోయిన్ నడుముని ఇప్పుడు ఎవ్వరూ చూడడం లేదు".. బాలీవుడ్‌పై కాజల్ సంచలన వ్యాఖ్యలు!

Also Read: 'ఓం భీమ్ బుష్' హీరోయిన్ ఆయేషా ఖాన్ అరెస్ట్..నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన ముంబై పోలీసులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

మాదాపూర్‌లోని పాన్ షాప్‌లో గంజాయి దందా..

Hyderabad, Telangana:

Hyderabad Paan Shop News: మీటా పాన్, సాదా పాన్, కలకత్తా పాన్, జర్థా పాన్.. ఇలా పాన్ ప్రియులు తమకు నచ్చిన పాన్లను ఆస్వాదించడానికి పాన్ షాప్‌ల ముందు క్యూ కడుతూ ఉంటారు. మరికొందరు సిగరెట్లు, ఇతర పదార్థాల కోసం వెళ్లడం చూస్తుంటాం.. కానీ.. ఐటీ కారిడార్‌గా పేరున్న హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో ఉన్న ఓ పాన్ షాపునకు వెళ్తే మాత్రం ప్రత్యేకమైన మత్తు పదార్థాలు లభిస్తాట.. పాన్ మసాలాల చాటున ఏకంగా గంజాయి విక్రయాలు చేస్తున్న ఓ కేటుగాడిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. పాన్ షాప్‌ను అడ్డాగా మార్చుకుని సాగిస్తున్న ఈ అక్రమ దందాను చూసి అధికారులే విస్తుపోయారు..

మాదాపూర్ పరిధిలోని చందానాయక్ నగర్ రోడ్డులో ఉన్న ఓ పాన్ షాప్ కేంద్రంగా అక్రమంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం ఎస్టీఎఫ్ (STF) ఎక్సైజ్ అధికారులకు అందింది. సమాచారం అందడమే ఆలస్యం ఎస్టీఎఫ్ డీ-టీమ్‌ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది సత్వరమే స్పందించి సదరు పాన్ షాప్‌పై ఆకస్మిక దాడి నిర్వహించారు. అధికారులు షాప్‌ను చుట్టుముట్టి తనిఖీలు చేయగా.. అమ్మడానికి సిద్ధంగా ఉంచిన 500 గ్రాముల గంజాయి దొరికింది.. దాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈజీ మనీ కోసం షార్ట్‌కట్ దారి..
తక్కువ శ్రమతో త్వరగా డబ్బు సంపాదించాలనే  ఈజీ మనీ ఆశతోనే నిర్వాహకుడు ఈ అక్రమ దందాకు తెరలేపినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడు బయటి వ్యక్తుల నుంచి గంజాయిని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుని.. తన షాప్‌లోనే 10 గ్రాముల చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లుగా విడగొట్టేవాడని.. ఒక్కో 10 గ్రాముల గంజాయి ప్యాకెట్‌ను రూ. 300కు కొనుగోలు చేసి.. దాన్ని మత్తుకు బానిసలైన వినియోగదారులకు రూ.500 చొప్పున విక్రయించేవాడు. అంటే ఒక్కో ప్యాకెట్‌పై ఏకంగా రూ.200 లాభం అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నాడన్నారు.

Read more: Secunderabad: అయ్యో... సికింద్రాబాద్‌లో ఘోరం.. అత్తను ఈడ్చుకుంటూ కత్తితో దాడి చేసిన కోడలు.. వీడియో..

నిందితుడి అరెస్ట్..
పాన్ షాప్‌లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్న మాలిక్ ఆస్లామ్ టామ్ బోలీ అనే వ్యక్తిని ఎస్టీఎఫ్ బృందం అక్కడికక్కడే అరెస్ట్ చేసింది.. స్వాధీనం చేసుకున్న 500 గ్రాముల గంజాయితో పాటు నిందితుడిని తదుపరి చట్టపరమైన విచారణ.. కఠిన చర్యల నిమిత్తం మాదాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. నగరంలో చట్టవిరుద్ధంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించినా.. రవాణా చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని.. పాన్ షాప్‌లు లేదా ఇతర వ్యాపారాలను అడ్డం పెట్టుకుని.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.

Read more: Secunderabad: అయ్యో... సికింద్రాబాద్‌లో ఘోరం.. అత్తను ఈడ్చుకుంటూ కత్తితో దాడి చేసిన కోడలు.. వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

0
0
Report

Hindu Temple Beliefs: నాన్‌వెజ్ తిని ఆలయానికి వెళ్తున్నారా? హిందూ ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెబుతోంది?

Hyderabad, Telangana:

Eating Non Veg Before Temple: హిందూ సంప్రదాయంలో దేవాలయం అత్యంత పవిత్రమైన స్థలం. ఆలయ దర్శనానికి వెళ్లే ముందు స్నానం చేయడం, శుభ్రమైన దుస్తులు ధరించడంతో పాటు సాత్విక ఆహారం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా మాంసాహారం తిని దేవుడి దర్శనానికి వెళ్లకూడదనే నియమం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, మానసిక, శారీరక కారణాలను కొందరు జ్యోతిష్కులు చెబుతున్నారు.

ఆహార రకాలు, తామసిక ఆహార ప్రభావం
హిందూ శాస్త్రాల ప్రకారం మనం తినే ఆహారాన్ని మూడు రకాలుగా విభజిస్తారు. సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం వంటి రకాలుగా విభజించారు. అందులో సాత్విక ఆహారంలో పండ్లు, పాలు, కూరగాయలు (మనస్సుకు ప్రశాంతతనిస్తాయి) వంటివి వస్తాయి. అలాగే రాజసిక ఆహారంలో మసాలాలు, ఘాటైన ఆహారాలు ఉండగా.. మాంసాహారం, మద్యం మొదలైనవి తామసిక ఆహారం లెక్కలోకి వస్తాయి.

మాంసాహారం తామసిక గుణాన్ని పెంచుతుంది. ఇది తీసుకోవడం వల్ల మనస్సులో బద్ధకం, అలసట, కోపం, అసహనం వంటి భావాలు పెరుగుతాయి. ఆలయం అనేది సానుకూల (పాజిటివ్) శక్తి నిండిన ప్రదేశం కాబట్టి, ప్రశాంతమైన మనస్సుతో ఉన్నప్పుడే అక్కడ ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుంది.

జీర్ణక్రియ, శారీరక చురుకుదనం
మాంసాహారం జీర్ణం కావడానికి శరీరానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల శరీరం బరువుగా అనిపించి, నిద్రమత్తు లేదా అలసట కలుగుతుంది. గుడిలో ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడానికి లేదా ప్రార్థనలు చేయడానికి శరీరం తేలికగా ఉండటం అవసరం. శాకాహారం తేలికగా జీర్ణమై శరీరాన్ని, మనస్సును చురుగ్గా ఉంచుతుంది.

'అహింసా పరమో ధర్మః'..భక్తి సిద్ధాంతం
హిందూ ధర్మంలో జీవదయ, కరుణలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మాంసాహారం హింసతో కూడుకున్నది కాబట్టి, దేవుని సన్నిధికి వెళ్లేముందు దానికి దూరంగా ఉండటం ద్వారా జీవుల పట్ల కరుణను, భక్తిలో పవిత్రతను కాపాడుకోవచ్చని భావిస్తారు.

గర్భగుడిలోని ఆధ్యాత్మిక శక్తిని పొందడం
ఆలయ గర్భగుడిలో సానుకూల ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిని పూర్తిగా అనుభవించాలంటే.. శరీరం (పరిశుభ్రత, సాత్విక ఆహారం), మనస్సు (కోపం, అసూయ వంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా ఉండటం) రెండు స్వచ్ఛంగా ఉండాలని పెద్దలు సూచిస్తారు.

ఈ నియమాలు ప్రధానంగా హిందూ మతంలోని విశ్వాసాలు, కుటుంబ సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ఖచ్చితంగా పాటించడం లేదా తమ సంప్రదాయాల ప్రకారం నడుచుకోవడం అనేది భక్తుల నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఏదేమైనా, శరీర పరిశుభ్రతతో పాటు మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని, పవిత్ర భావనతో దేవుడిని దర్శించుకోవడమే అంతిమ లక్ష్యం.

Also Read: ఆగస్టులో ఈ 5 రాశుల వారికి రాజయోగం.. ధన వర్షంతో పాటు ఊహించని అదృష్టం!

Also Read: శ్రావణ మాసంలో శని దేవుడి కీలక మార్పు.. ఈ రాశుల వారికి డిసెంబర్ వరకు హెచ్చరిక!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

కిచెన్ స్పాంజ్‌తో ప్రాణాంతక వ్యాధులు.. క్యాన్సర్, లివర్ ఇన్ఫెక్షన్ల ముప్పు..

Hyderabad, Telangana:

Kitchen Sponge Health Risks: ఇంట్లో వంట చేయడం ఎంత ముఖ్యమో.. వంట పాత్రలను శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం.. అయితే, పాత్రలను తోమడానికి మీరు వాడే కిచెన్ స్పాంజ్ (Kitchen Sponge) మీ ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతోందని మీకు తెలుసా?. అవును మీరు చదువుతుంది నిజమే.. రోజూ మనం వాడే ఈ చిన్న స్పాంజ్ వల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రముఖ వైద్యులు తెలుపుతున్నారు.

టాయిలెట్ సీట్ కంటే 200 రెట్లు ప్రమాదకరం..
డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కిచెన్ స్పాంజ్‌లో ఉండే బాక్టీరియా, క్రిములు టాయిలెట్ సీట్ కంటే దాదాపు 200 రెట్లు ఎక్కువగా ఉంటాయట.. నిత్యం నీటితో నాని.. తేమగా ఉండే స్పాంజ్ వాతావరణం మైక్రోస్కోపిక్ క్రిములు వేగంగా పెరగడానికి అత్యంత అనుకూలమైనదిగా మారుతుంది.. మనం పాత్రలు కడిగేటప్పుడు ఈ క్రిములు గిన్నెలకు, ప్లేట్లకు అంటుకుంటాయి. ఆ తర్వాత మనం అదే పాత్రల్లో ఆహారం తిన్నప్పుడు.. ఆ క్రిములు నేరుగా కడుపులోకి చేరుతూ ఉంటాయి.

క్యాన్సర్, లివర్ సమస్యలు..
ఈ బాక్టీరియా శరీరంలోకి చేరడం వల్ల కేవలం సాధారణ కడుపునొప్పి, విరేచనాలు, ఇన్ఫెక్షన్లు మాత్రమే కాకుండా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కడుపు, జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆహారం ద్వారా లోపలికి వెళ్లే బాక్టీరియా జీర్ణవ్యవస్థను పాడుచేస్తుందని వారు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఈ క్రిములు శరీరంలోకి చేరడం వల్ల కాలేయం (Liver)పై తీవ్ర ప్రభావం పడి లివర్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. నిరంతరం హానికరమైన మైక్రో-ఆర్గానిజమ్స్ శరీరంలోకి వెళ్లడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Also Read:  కొత్తిమీర కాడలు పారేస్తున్నారా? వంటల్లో ఈ 5 అద్భుతమైన మార్గాల్లో వాడేయండి!

ఈ హెల్త్ రిస్క్ నుంచి తప్పించుకోవడానికి నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు.. కిచెన్ స్పాంజ్‌ను నెలల తరబడి వాడకూడదని వారు తెలుపుతున్నారు. ప్రతి వారం కచ్చితంగా కొత్త స్పాంజ్‌ను వినియోగించాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు.. సింథటిక్ స్పాంజ్ కంటే పురాతన కాలం నుంచి వాడుతున్న కొబ్బరి పీచు (Coconut Coir) చాలా మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది సహజ సిద్ధమైనది, తేమను త్వరగా పీల్చుకోదు.. క్రిములు చేరే అవకాశం చాలా తక్కువ ఉంటుందని వారు తెలుపుతున్నారు.

Also Read:  కొత్తిమీర కాడలు పారేస్తున్నారా? వంటల్లో ఈ 5 అద్భుతమైన మార్గాల్లో వాడేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

డ్యూటీ చేయరు.. సంతకాలు మాత్రం ముందే.. సంగారెడ్డి ఆసుపత్రిలో అక్రమాల పుట్ట..

Hyderabad, Telangana:

Sangareddy GGH Scandal: పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించాల్సిన సంగారెడ్డి గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి (GGH) అక్రమాలకు, నిర్లక్ష్యానికి నిలయంగా మారింది. ఆసుపత్రి పాలనా యంత్రాంగం నిద్రమత్తులో ఉన్నట్లు వ్యవహరించడంతో కొందరు వైద్యులు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు.. విధులకు రాకుండానే హాజరు పట్టికలో సంతకాలు చేయిస్తూ.. సర్కారు జీతాలు గుంజుతూ పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

డ్యూటీకి డుమ్మా.. 
సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో అంతా గోల్ మాల్ వ్యవహారం నడుస్తోంది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో వచ్చే రోగులకు వైద్యం అందించాల్సిన కీలకమైన కార్డియాలజిస్ట్ (Cardiologist) ఆసుపత్రి ముఖమే చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజువారీ విధులకు హాజరుకాకుండానే.. ఆసుపత్రిలోని కొందరు సిబ్బందితో మాట్లాడి హాజరు రిజిస్టర్‌లో ముందస్తుగానే, వివిధ తేదీల్లో దొంగ సంతకాలు పెట్టిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రోగులకు అందుబాటులో ఉండాల్సిన సమయంలో సదరు వైద్యుడు సొంత ప్రైవేట్ ప్రాక్టీస్‌లో లేదా ఇతర పనుల్లో నిమగ్నమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

జిల్లా నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది పేద రోగులు గుండె జబ్బుల చికిత్స కోసం ఈ ఆసుపత్రిపైనే ఆధారపడతారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి ఎదురుచూసినా డాక్టర్ దర్శనం కాకపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర అల్లాడుతున్నారు. అత్యవసర పరిస్థితిల్లో వచ్చిన రోగులు చేసేదేమీ లేక.. అప్పులు చేసి మరీ ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. సర్కారు ఉచిత వైద్యం అందిస్తుందని వస్తే.. ఇక్కడ వైద్యులు లేకపోవడంతో జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.

అధికారుల అలసత్వం.. 
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా చూడటంలోనూ.. విధులను క్రమబద్ధీకరించడంలోనూ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ (RMO) పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు ఏ సమయంలో వస్తున్నారు? ఎవరు విధుల్లో ఉంటున్నారు? అనే ప్రాథమిక విషయాలపై ఆర్‌ఎంఓ పర్యవేక్షణ అసలే లేకపోవడంతో అక్రమార్కులకు ఆసరాగా మారింది. కార్డియాలజిస్ట్ దొంగ సంతకాల వ్యవహారం రచ్చకెక్కినా.. ఆసుపత్రి సూపరింటెండెంట్ కఠిన చర్యలు తీసుకోకుండా పట్టనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Read more: Yuva Sangrama Sadassu: ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగి చావమంటారా..?.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..

కఠిన చర్యలకు డిమాండ్..
పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి బాధ్యతారాహిత్య వైద్యులపై, వారికి సహకరిస్తున్న సిబ్బందిపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే.. స్పందించి విచారణ జరిపించాలని సంగారెడ్డి ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులను సస్పెండ్ చేసి.. పేదలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read more: Yuva Sangrama Sadassu: ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగి చావమంటారా..?.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Satya Sri Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి 'జబర్దస్త్' క్రేజీ బ్యూటీ..అసలు కారణం బయటపెట్టిన నటి సత్యశ్రీ!

Hyderabad, Telangana:

Satya Sri Bigg Boss Offer: రియాలిటీ షో 'బిగ్ బాస్' సందడి మొదలవ్వడంతో సోషల్ మీడియాలో పోటీదారుల పేర్లపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే తనకు బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చినట్లు, అయితే ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు జబర్దస్త్ లేడీ కమెడియన్, నటి సత్యశ్రీ ఇటీవలి ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

బిగ్ బాస్ ఆఫర్‌పై స్పష్టత
బిగ్ బాస్ సీజన్ 10 నుండి తనకు పిలుపు వచ్చిన మాట వాస్తవమేనని నటి సత్యశ్రీ ధృవీకరించారు. అయితే ఆ షోలో పాల్గొనకపోవడానికి గల బలమైన కారణాన్ని ఆమె వెల్లడించారు. "మా కుటుంబ బాధ్యతలన్నీ నేనే చూసుకుంటున్నాను. నా తల్లిదండ్రులను వదిలి అంతకాలం దూరంగా ఉండలేను. నేను లేకపోతే వారు ఇబ్బంది పడతారు" అని నటి సత్యశ్రీ చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉన్నప్పటికీ, వారిని చూసుకోవడానికి ఇతరులు ఉంటారని, కానీ తన ఇంట్లో ఆ పరిస్థితి లేకపోవడం వల్లే ఆ ఆఫర్‌ను వద్దనుకున్నానని ఆమె వివరించారు.

గత మూడేళ్లుగా బుల్లితెరకు దూరంగా ఉంటూ, వెండితెరపై బిజీగా ఉండటంపై సత్యశ్రీ స్పందించారు. జబర్దస్త్ తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలు రావడంతోనే టెలివిజన్‌కు దూరమయ్యానని తెలిపారు. "ప్రస్తుతం ఒక దశకు చేరుకున్నాను. స్వీయ గౌరవం, రెప్యూటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటున్నాను. గ్లామర్ ఉన్నంత కాలమే మంచి పాత్రలు ఎంచుకోవాలనే ఆలోచన ఉంది" అని పేర్కొన్నారు.

హీరో నవీన్ పొలిశెట్టితో అనుభవం
ఇటీవల విడుదలైన 'అనగనగా ఒక రాజు' చిత్రంలో మంచి పాత్రతో మెప్పించిన సత్యశ్రీ, హీరో నవీన్ పొలిశెట్టి పనితీరును ప్రశంసించారు. "హీరో నవీన్ పొలిశెట్టి సెట్స్‌లో ఫుల్ ఎనర్జీతో ఉంటారు. 24/7 పనికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి షాట్ తర్వాత తర్వాతి పనిపైనే దృష్టి పెడతారు" అని నటి సత్యశ్రీ వెల్లడించింది.
 
గతంలో 'జాతిరత్నాలు' సినిమాలో తాను ఒక చిన్న పాత్ర చేసినప్పుడు, నవీన్ తనతో "కచ్చితంగా తర్వాత మూవీలో మంచి రోల్ చేద్దురు గానీ" అని చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం 'అనగనగా ఒక రాజు'లో అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read: 'ఓం భీమ్ బుష్' హీరోయిన్ ఆయేషా ఖాన్ అరెస్ట్..నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన ముంబై పోలీసులు!

Also REad: తమిళనాడు సీఎం విజయ్ చివరి సినిమా 'జన నాయగన్'..ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

రూ.20 వేల లోపే 50MP కెమెరా, OLED డిస్‌ప్లే.. మార్కెట్‌లోకి రెడ్‌మీ నోట్ 17 ఫోన్‌!

Hyderabad, Telangana:

Redmi Note 17 Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి (Xiaomi) తన సబ్‌బ్రాండ్ Redmi ద్వారా మళ్లీ మార్కెట్‌లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 17 (Redmi Note 17) సిరీస్ త్వరలోనే భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్ గీక్‌బెంచ్ (Geekbench) వెబ్‌సైట్‌లో Xiaomi 26021RN18I అనే మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ కనిపించడంతో, దీని లాంచ్ ఖాయమని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌ కూడా లీక్ అయ్యాయి..

పెర్ఫార్మెన్స్ వివరాలు..
గీక్‌బెంచ్ టెస్టింగ్‌లో రెడ్‌మీ నోట్ 17 ఆకట్టుకునే స్కోర్లను సాధించిన్నట్లు తెలుస్తోంది.. ఇది సింగిల్-కోర్ టెస్ట్‌లో 950 పాయింట్లతో పాటు మల్టీ-కోర్ టెస్ట్‌లో 2,324 పాయింట్లను సాధించిందని సమాచారం. ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 4 చిప్‌సెట్‌పై రన్‌ అయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అడ్రినో (Adreno) GPU గ్రాఫిక్స్ పవర్‌ను అందిస్తుందని తెలుస్తోంది.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమి హైపర్ ఓఎస్ 3 (HyperOS 3) పై రన్ అవుతుందని సమాచారం.. ఇది 8 GB ర్యామ్ వేరియంట్‌తో ప్రారంభం కాబోతోంది. అంతేకాకుండా ఈ డివైజ్, బడ్జెట్ ధరలో అద్భుతమైన మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది..

ఫీచర్ల సునామీ..
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ బ్యాటరీగా భావిస్తారు.. సాధారణంగా ఉండే బ్యాటరీలకు భిన్నంగా, ఇందులో ఏకంగా 8,000 mAh సామర్థ్యం గల బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.. దీనికి తోడు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో పాటు 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది..

డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో కంపెనీ 7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్‌ OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లే కంటెంట్ చూడటానికి ఎంతో స్పష్టంగా ఉంటుంది.. కెమెరా విభాగంలో f/1.8 అపెర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను, ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా అందిస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

లాంచ్ వివరాలు..
కంపెనీ దీనిపై అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఆగస్టు మొదటి వారం ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. అత్యంత ముఖ్యమైన ధర విషయానికొస్తే.. ఇది రూ.20,000 లోపు ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండే ఛాన్స్‌లు ఉన్నాయి. భారీ బ్యాటరీతో పాటు అదిరిపోయే OLED డిస్‌ప్లే కావాలనుకునేవారికి రెడ్‌మీ నోట్ 17 ఒక పర్ఫెక్ట్ ఛాయిస్‌గా మారబోతోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Samsung, రియల్‌మీలకు గట్టి పోటీగా మార్కెట్‌లోకి Redmi కొత్త 5G ఫోన్!

Hyderabad, Telangana:

Redmi 17C 5G India: సామ్‌సంగ్, రియల్‌మీ వంటి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ.. బడ్జెట్ రేంజ్‌లో అత్యంత అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లను అందించే ప్రముఖ టెక్ బ్రాండ్ రెడ్‌మి (Redmi) త్వరలోనే తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ Redmi 17C 5G పేరుతో భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది.. అధికారిక ప్రకటనకు ముందే ఈ ఫోన్ ప్రముఖ సర్టిఫికేషన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌తో పాటు థాయిలాండ్‌కు చెందిన NBTC వెబ్‌సైట్లలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ అత్యంత త్వరలోనే లాంచ్‌ కూడా కాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లీక్‌ అయిన వివరాలు..
తాజాగా లీకైన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్‌తో BIS, NBTC పోర్టళ్లలో నమోదు చేసింది.. బిఐఎస్ (BIS) గుర్తింపు లభించడమే.. కాకుండా ఈ ఫోన్ భారతీయ మార్కెట్లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వడం ఖాయమైన్నట్లు తెలుస్తోంది.. గతంలో విడుదలైన Redmi C-సిరీస్ ఫోన్‌లకు కొనసాగింపుగా ఈ Redmi 17C 5G మోడల్‌ను కంపెనీ రూపొందించినట్లు సమాచారం..

Redmi 17C 5G మొబైల్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌..
లీక్‌ అయిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో లభించినప్పటికీ ఫీచర్ల విషయంలో ఎక్కడా తగ్గకుండా రూపొందించిన్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.88 అంగుళాల పెద్ద హెచ్‌డీ ప్లస్‌ (HD+) LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.. స్మూత్ స్క్రోలింగ్ అనుభూతి కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా అందిస్తోంది.. వేగవంతమైన 5G కనెక్టివిటీ.. మెరుగైన గేమింగ్ అండ్ మల్టీటాస్కింగ్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity) లేదా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 5G ప్రాసెసర్‌ను వినియోగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత లేటెస్ట్ HyperOS పై పనిచేసే అవకాశాలు ఉన్నాయి..

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం.. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌ భాగంలో 8MP లేదా 13MP కెమెరా ఉండబోతున్నట్లు సమాచారం.. అద్భుతమైన బ్యాటరీ లైఫ్ కోసం.. ఇందులో 5,160mAh నుంచి 6,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకువచ్చిన్నట్లు తెలుస్తోంది.. ఇది టైప్-సి (USB Type-C) ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ అందిస్తుంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ వంటి ముఖ్యమైన ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ విభాగంలో (Budget Segment) రావడంతో పాటు దీని ప్రారంభ ధర రూ.10,000 నుంచి రూ. 13,000 మధ్యలో ఉండే అవకాశం ఉందని మార్కెట్ లీక్‌ అయిన వివరాలు తెలుపుతున్నాయి.. దీనిని కంపెనీ 4GB ర్యామ్‌, 6GB ర్యామ్‌తో పాటు 64GB స్టోరేజ్‌, 128GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

చిట్‌చాట్‌లో రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. కేటీఆర్‌ను బర్త్‌డే దావత్‌ అడగాలి

Hyderabad, Telangana:

KTR Birth Day: రేపు 50వ పుట్టినరోజు చేసుకుంటున్న బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను బర్త్‌డే దావత్‌ అడగాలి అని.. అయితే ఆయన ఇచ్చే పార్టీ తాను తీసుకుంటానో లేదోనని.. ఆయనవి వేరే పార్టీలు అంటూ పరోక్షంగా విమర్శలు చేశారు. గ్లోబరీనా సంస్థతో ఇంటర్‌ పేపర్ల లీక్‌ జరిగాయని.. ఈ కంపెనీ కేటీఆర్‌కు బినామీ అని మరోసారి రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్‌లో గురువారం మీడియాతో రేవంత్‌ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీతోపాటు కేటీఆర్‌, హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. 'బీఆర్ఎస్ పార్టీ పేదలకు ఇచ్చే ఇళ్లను దళారులకు అమ్ముకుంది. పేదలకు లాభం జరుగుతుందనే అక్కసుతో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ. ఇంటర్ పేపర్లు సరిగా దిద్దకపోవడంతో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి' అని రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Also Read: CM Revanth reddy: SIR పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే.!. బీజేపీ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

'గ్లోబరీనా సంస్థపై కేటీఆర్ సీసీఎస్‌పైన ఫిర్యాదు చేయాలి. మేము విచారణ చేస్తే కక్ష సాధింపు అంటారు' అని చిట్‌చాట్‌లో రేవంత్‌ రెడ్డి తెలిపారు. అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'గ్లోబారినాపై మేం విచారణ చేస్తే కక్ష సాధింపు అంటారు. కేటీఆర్ ఒక్క చిన్న ఫిర్యాదు ఇస్తే గ్లోబారినాపై విచారణ చేస్తాం. గ్లోబరినాపై విచారణ జరగడం లేదని ఎందుకు అనుకుంటున్నారు. గ్లోబారినాపై ఫిర్యాదు చేసి కేటీఆర్ చిత్తశుద్ధి నిరూపించుకోవచ్చు. గ్లోబరినాపై నివేదిక వచ్చాక ఏం చేయాలో అది చేస్తాం' అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు డిమాండ్ చేయలేదు?.. ఏమిటి ఈ కుమ్మక్కు? అని రేవంత్‌ రెడ్డి నిలదీశారు. 'పరువు ఉన్నవాడు వేస్తే పరువు నష్టం దావా వేస్తాడు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఏ రాజుల భూముల ఉన్నాయో కేటీఆర్ విచారణకు అడగాలి. మేము వచ్చాకే ధర్నా చౌక్ ఓపెన్ చేశాం. మేం తెరిచిన ధర్నా చౌక్‌లోనే కేటీఆర్ ధర్నా చేస్తామని అంటున్నారు' అని రేవంత్ రెడ్డి తెలిపారు.

'ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కేటీఆర్ ప్రశ్న వేయాలి. పేర్లతో సహా నియామకాల లిస్ట్ ఇస్తా. 55 రోజుల్లో 11 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశాం. నోటిపికేషన్ ఇవ్వడం పేపర్ లీక్ చేయడం సొమ్ము చేసుకోవడం వాళ్ల పని. సీట్లపైన నేను, కేటీఆర్ వేసిన అంచనాలను విశ్లేషించాలి. జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ 50 వేల మెజార్టీ అని చెప్పాడు. నేను 30 వేలతో గెలుస్తామని చెప్పా' అని రేవంత్ రెడ్డి తెలిపారు.

'కేటీఆర్ పుట్టిన రోజు దావత్ ఇస్తాడో అడగాలి. కేటీఆర్ ఇచ్చే దావత్ నేను తీసుకోలేనేమో. ఆయనవి అన్ని వేరే పార్టీలు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'కేసీఆర్ కుటుంబసభ్యులెవరూ రక్తదానం చేయలేదు. తీసిన రక్తం ఎవరికి అమ్ముకున్నారో చెప్పాలి. కొవ్వెక్కి ఉన్నవాళ్లు రక్తం ఇస్తే కరిగిపొద్ది. తీసిన రక్తం గాంధీకి, ఉస్మానియా ఆస్పత్రులకు ఇస్తే బాగుండు. ఉద్యమంలో ఇలాగే రెచ్చగొట్టారు. ప్రాణాలు తీసుకున్న వాళ్లే ఇప్పుడు రక్తం తీసుకుంటున్నారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top