షాద్ నగర్ క్రైమ్ సీఐ నీ సర్వీస్ రిమూవ్ చేయాలని ఎల్ బి నగర్ లో బీఎస్పీ ఆందోళన
షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దళిత మహిళకు థర్డ్ డిగ్రీ ఇచ్చిన కేసులో సీఐ రాంరెడ్డిని తొలగించాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు ఎల్బీనగర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఈ ఘటనపై ఎందుకు విచారణ జరపడం లేదని బాధిత మహిళకు కూడా ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు నాయకులు సీఐ రాంరెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించకపోతే ఊరుకోమని హెచ్చరించారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Kavitha Prashant Kishor Meeting: తెలంగాణ రాజకీయాల్లోకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నారని.. ఓ పార్టీకి వ్యూహ రచన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని.. అతడు తెలంగాణలో సేవలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయిన కవిత స్థాపించనున్న పార్టీకి పని చేస్తారని సమాచారం. ఆమె ఏర్పాటు చేసే పార్టీ కోసం పీకే పని చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కవితతో కలిసి పని చేసేందుకు పీకే ఆసక్తి కనబరిచారని విశ్వసనీయ సమాచారం.
Also Read: Viral Pic: ఈ 'స్టార్ యువకులకు వధువు కావలెను'.. పెళ్లి కాని యువకుల బ్యానర్ ఫొటో వైరల్
రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న కవితతో ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే పలుమార్లు భేటీ అయినట్లు సమాచారం. రెండు నెలల వ్యవధిలో హైదరాబాద్‌కు వచ్చిన పీకే కవితతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు రోజుల పాటు పీకేతో కవిత సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజల కోసం పార్టీ ఏర్పాటు.. ప్రజలు తమ పార్టీగా ఓన్ చేసుకోవడం.. ప్రజల కోణంలో ఎలా పని చేయాలనే అంశంపై పీకేతో కవిత చర్చించినట్లు సమాచారం.
Also Read: KTR Condemns: మతిభ్రమించిన రేవంత్ రెడ్డి.. అతడు సీఎం కావడం సిగ్గుచేటు: కేటీఆర్ ఆగ్రహం
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కవిత ప్రయత్నాలు కొనసాగుతున్న క్రమంలో పీకేతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజల కోణంలో పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలు ఏర్పాటు చేసి కవిత అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో కవిత వేగం పెంచారు. తాను ఏర్పాటు చేసే పార్టీ కోసం పీకేతో పని చేయాలని కవిత నిర్ణయించుకున్నారు. పలుమార్లు వీరిద్దరూ భేటీ అయి చర్చలు జరగ్గా.. కవితతో కలిసి పని చేసేందుకు పీకే ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. గతంలో విజయవంతంగా అనేక పార్టీలకు రాజకీయ వ్యూహ రచన చేసిన ప్రశాంత్ కిశోర్ ఇటీవల బిహార్‌లో రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయంగా పూర్తిగా విఫలమయ్యాడు. బిహార్ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన పీకే ఇప్పుడు కవితకు పని చేస్తుండడం గమనార్హం. మరి పీకే వ్యూహ రచనతో కవిత రాజకీయంగా ఎదుగుతారా? విజయం సాధిస్తారా? అనేది వేచి చూడాలి.
Also Read: Tomorrow Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. బ్యాంకులకు కూడా! ఎందుకో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Union Budget 8th Pay Commission: 8వ వేతన సంఘం (8th Pay Commission) అమలు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపునకు మాత్రమే పరిమితం కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. రేటింగ్ ఏజెన్సీ ICRA విశ్లేషణ ప్రకారం.. రాబోయే కేంద్ర బడ్జెట్ 2026పై అంచనాలు, ఆర్థిక పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమలు ఇప్పుడు ఒక ప్రధాన ఆర్థిక చర్చగా మారింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై పడే భారం, బడ్జెట్ కేటాయింపుల్లో వచ్చే మార్పులను ఈ క్రింది అంశాల ద్వారా అర్థం చేసుకోవచ్చు.
1. 2026 బడ్జెట్లో వేతన సవరణ సాధ్యమేనా?
ICRA నివేదిక ప్రకారం.. 8వ వేతన సంఘం తుది నివేదిక రావడానికి ఇంకా 15 నుండి 18 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీనివల్ల 2026-27 బడ్జెట్ నాటికి పూర్తిస్థాయి వేతన సవరణ అసంభవం అనిపిస్తోంది. అయితే, ఉద్యోగులు ఆశించే ఉపశమనంపై ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏదైనా సంకేతం ఇస్తుందో లేదో వేచి చూడాలి.
2. బకాయిల భారం (Arrears Pressure)
ఒకవేళ వేతన సంఘం సిఫార్సులను పాత తేదీ (జనవరి 1, 2026) నుండి అమలు చేస్తే, ప్రభుత్వం భారీ మొత్తంలో బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. అమలులో జాప్యం జరిగితే, దాదాపు 15 నెలలకు పైగా పేరుకుపోయిన బకాయిలను ఒకేసారి చెల్లించడం వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.
జీతాల వ్యయం: 2028 ఆర్థిక సంవత్సరం నాటికి జీతాలు, పెన్షన్ల వ్యయం 40-50% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.
3. గత అనుభవాలు - ఒక హెచ్చరిక
7వ వేతన సంఘం బకాయిలు కేవలం 6 నెలలకే పరిమితమైనా, అప్పట్లో వేతన వ్యయం ఒక్క ఏడాదిలోనే 20% పెరిగింది.
అంతకు ముందు 6వ వేతన సంఘం అమలు జాప్యం వల్ల 2.5 ఏళ్ల బకాయిలు చెల్లించాల్సి వచ్చింది. దీనివల్ల వరుసగా రెండు మూడేళ్ల పాటు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
4. ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలు
భవిష్యత్తులో పడే ఈ భారీ ఆర్థిక భారాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం ఒక వ్యూహాన్ని అనుసరిస్తోంది. వేతనాల భారం పడకముందే, అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా 2027 ఆర్థిక సంవత్సరంలోనే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తోంది. మూలధన వ్యయాన్ని 14% పెంచి, దాదాపు రూ. 13.1 లక్షల కోట్లకు చేర్చడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవాలని చూస్తోంది.
ICRA విశ్లేషణ ప్రకారం.. 8వ వేతన సంఘం అనేది కేవలం ఉద్యోగుల జీతాల పెంపు మాత్రమే కాదు, ఇది రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వ వ్యయ ప్రాధాన్యతలను మార్చే ఒక ప్రధాన ఆర్థిక కార్యక్రమం. 2026 బడ్జెట్ ఈ ప్రక్రియకు ఒక పునాదిలా మారనుంది.
(గమనిక: ఈ సమాచారం కేవలం విశ్లేషణల ఆధారంగా అందించబడింది. ఖచ్చితమైన వివరాల కోసం అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించండి. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Unmarried Youth Banner: పండుగ, ఉత్సవాలు ఉంటే శుభకాంక్షలు చెబుతూ బ్యానర్లు వెలుస్తుంటాయి. రాజకీయ నాయకులు, యువజన సంఘాలు తదితర వారు బ్యానర్లు ప్రదర్శిస్తుంటారు. అయితే ఓ జాతరలో వినూత్నంగా.. తమ కష్టాలు చెబుతూ పెళ్లి కాని ప్రసాదుల బ్యానర్ వెలిసింది. వీరంతా స్టార్ యువకులకు వధువు కావలెను అని పెట్టి బ్యానర్ ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది. అమ్మాయి కోసం వారు వేసిన బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఏపీలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: KTR Condemns: మతిభ్రమించిన రేవంత్ రెడ్డి.. అతడు సీఎం కావడం సిగ్గుచేటు: కేటీఆర్ ఆగ్రహం
చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాలతో జరిగింది. పండుగ సందర్భంగా నిర్వహించిన పశువుల పండుగలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకులు ఒక భారీ బ్యానర్ ఏర్పాటుచేశారు. సంప్రదాయ శుభాకాంక్షలకు భిన్నంగా గ్రామంలోని యువకులు తమ ఫొటోలన్నింటినీ ముద్రించి.. 'ముఖ్య గమనిక స్టార్ యువకులకు వధువు కావలెను' అని పెద్ద అక్షరాలతో బ్యానర్ కట్టేశారు.
Also Read: Tomorrow Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. బ్యాంకులకు కూడా! ఎందుకో తెలుసా?
దాదాపు 30 మందికి పైగా యువకుల ఫొటోలతో కూడిన ఈ పేద్ద బ్యానర్ చూసి జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పుడు పిల్లని ఇచ్చేవారి కోసం కుర్రాళ్లు ఇలా ఫ్లెక్సీలు వేసుకున్నారు. ఈ సరదా బ్యానర్ వెనుక ఒక బలమైన సామాజిక సందేశం దాగి ఉందని ఊరి పెద్దలు చెబుతున్నారు. 'మా కుర్రాళ్లంతా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే. వయసు కూడా మించిపోలేదు. కానీ పెళ్లిళ్ల దగ్గరకు వచ్చేసరికి అబ్బాయికి కారు ఉందా? విమానం ఉందా? రైలు ఉందా?' అని అడుగుతున్నట్లు గ్రామ పెద్దలు చెప్పారు. ఇది సరైన పద్ధతి కాదు అని వధువు తరఫు వారికి హితవు పలికారు. ఆస్తులు, హోదాలు చూసి పెళ్లిళ్లు చేయడం మానేయాలని విజ్ఞప్తి చేశారు. మానవత్వాన్ని, మనిషి గుణాన్ని చూడాలని ఆడపిల్లల తల్లిదండ్రులకు సూచించారు.
Also Read: Women Dress: మహిళలు ఏం ధరించాలి? సనాతన ధర్మం చెబుతోంది తెలుసా?
కనుమ పండుగ సందర్భంగా కట్టిన ఈ బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఊర్లో కూడా ఇలాంటి బ్యానర్ కట్టాలి అంటూ బ్యాచిలర్స్ కామెంట్స్ చేస్తున్నారు. కలికిరిపల్లి యువకుల ప్రయత్నం నవ్వులు పూయించడమే కాదు, నేటి వివాహ వ్యవస్థలోని లోపాలను కూడా ఎత్తిచూపుతోంది. ఇలా బ్యానర్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడడం చూస్తుంటే యువకుల పెళ్లి కష్టాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rohit Sharma Doubtful In ODI World Cup: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలమవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 61 పరుగులు మాత్రమే చేయడంతో, 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆయన స్థానంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
టీ20, టెస్ట్ క్రికెట్‌కు ఇప్పటికే వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి పెట్టారు. అయితే, తాజా సిరీస్‌లో ఆయన ప్రదర్శన నిరాశపరచడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.
గౌతమ్ గంభీర్ ప్లాన్ ఏంటి?
కోచ్ గంభీర్ ఎప్పుడూ కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని మొగ్గు చూపుతుంటారు. 2027 ప్రపంచ కప్ నాటికి జట్టును యువతతో నింపాలని ఆయన భావిస్తున్నారు. రోహిత్ వయస్సు రీత్యా ఆయన ఫిట్నెస్, ఫామ్‌ను గంభీర్ నిశితంగా గమనిస్తున్నారు. గిల్ సారథ్యంలో కొత్త తరం జట్టును నిర్మించే క్రమంలో సీనియర్లను పక్కన పెట్టే సాహసం గంభీర్ చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరం.
విరాట్ వర్సెస్ రోహిత్..
న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను నిలబెట్టుకోగా, రోహిత్ మాత్రం తడబడ్డారు. గతంలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఇద్దరూ రాణించి విమర్శలకు సమాధానం ఇచ్చారు. కానీ ఇప్పుడు రోహిత్ వరుసగా విఫలమైతే, గంభీర్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రోహిత్ ఎందుకు అవసరం?
2027 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా వేదికగా జరగనుంది. దక్షిణాఫ్రికాలోని వేగవంతమైన పిచ్‌లపై రోహిత్ శర్మకు ఉన్న అనుభవం, ఆయన ఆడే 'పుల్ షాట్లు' జట్టుకు ప్లస్ పాయింట్ అవుతాయి. రోహిత్ క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు ఉండే భయం అంతా ఇంతా కాదు. ఈ కోణంలో చూస్తే ఆయన అనుభవం జట్టుకు ఎంతో అవసరం.
ప్రత్యామ్నాయం ఎవరు?
ఒకవేళ రోహిత్ శర్మ జట్టులో లేకపోతే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు యశస్వి జైస్వాల్ సిద్ధంగా ఉన్నారు. యువ ఆటగాడైన జైస్వాల్ తన దూకుడైన ఆటతీరుతో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించారు. రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా జైస్వాల్‌ను సిద్ధం చేయాలనే ఆలోచనలో కూడా మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
తదుపరి అవకాశం ఎప్పుడు?
ప్రస్తుతానికి టీమిండియాకు వన్డే మ్యాచ్‌లు లేవు. ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాతే వన్డే సిరీస్‌లు ప్రారంభమవుతాయి. అప్పుడు లభించే అవకాశాలను రోహిత్ సద్వినియోగం చేసుకోకపోతే, సెలెక్టర్లు కచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ICC Ultimatum To Bangladesh Update: 2026 టీ20 ప్రపంచకప్ ఆతిథ్యంపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. భద్రతా కారణాల సాకుతో భారత్‌లో ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గట్టి హెచ్చరిక జారీ చేసింది.
భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ విషయంలో ఐసీసీ తన వైఖరిని స్పష్టం చేస్తూ, నిర్ణయం తీసుకోవడానికి జనవరి 21ని ఆఖరి తేదీగా (Deadline) నిర్ణయించింది.
వివాదం ఎక్కడ మొదలైంది?
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించాలనే బీసీసీఐ నిర్ణయం తర్వాత రెండు బోర్డుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీనికి తోడు రాజకీయ పరిస్థితులను సాకుగా చూపిస్తూ, భారత్‌లో ఆడితే తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని బంగ్లాదేశ్ వాదిస్తోంది.
ఐసీసీ మీటింగ్‌లో కీలక అంశాలు:
వేదిక మార్పు కుదరదు: తమ గ్రూప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ విన్నపాన్ని ఐసీసీ తోసిపుచ్చింది. ముందుగా నిర్ణయించినట్లు కోల్‌కతా, ముంబైలలోనే మ్యాచ్‌లు ఆడాలని స్పష్టం చేసింది. ఐర్లాండ్‌తో గ్రూప్ మార్చుకుంటామన్న ప్రతిపాదనను కూడా ఐసీసీ తిరస్కరించింది. భారత్‌లో బంగ్లాదేశ్ జట్టుకు ఎటువంటి ముప్పు లేదని, పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.
బంగ్లాదేశ్ తప్పుకుంటే ఏమవుతుంది?
జనవరి 21లోపు బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని వెల్లడించకపోతే, ఐసీసీ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్ స్థానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్ జట్టును ప్రపంచకప్‌లోకి తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్ కూడా తన భాగస్వామ్యంపై ఆలోచిస్తామని ప్రకటించడం గమనార్హం. ఒకవేళ శ్రీలంక వీలుకాకపోతే బంగ్లాదేశ్ మ్యాచ్‌లను తమ దేశంలో (పాకిస్తాన్) నిర్వహించడానికి సిద్ధమని పీసీబీ ప్రతిపాదించింది.
వచ్చే 48 గంటలు బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తుకు అత్యంత కీలకం. ఐసీసీ హెచ్చరికకు తలొగ్గి భారత్‌కు వస్తారా? లేక ప్రతిష్టాత్మక ప్రపంచకప్ నుంచి తప్పుకుంటారా? అన్నది ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Union Budgets 2026: జనవరి నెల పూర్తవ్వడానికి వస్తుంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల సవరణ అమల్లోకి రాలేదు. దీంతో 8వ వేతన సంఘం అమలు ఆలస్యం అవుతుందన్న విషయం స్పష్టమవుతోంది. రేటింగ్ సంస్థ ఐసీఆర్ఏ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ జాప్యం వల్ల కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా వేతన సంఘ సిఫార్సులు చివరకు జనవరి 1నుంచి అమలు చేస్తే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
సాధారణంగా కేంద్ర వేతన సంఘాలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అమల్లోకి వస్తాయి. అదే విధంగా 7వ వేతన సంఘం జనవరి 1, 2016 నుంచి అమలులోకి వచ్చిన నేపథ్యంలో.. 8వ వేతన సంఘం కూడా జనవరి 2026 నుంచే అమల్లోకి వస్తుందని చాలా కాలంగా భావించారు. అయితే, ప్రస్తుతం కమిషన్ తన నివేదికను సమర్పించేందుకు ఇంకా 15 నుంచి 18 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఐసీఆర్ఏ వెల్లడించింది. దీనివల్ల సమీప భవిష్యత్తులో జీతాల సవరణ జరగడం అసాధ్యమని సంస్థ అభిప్రాయపడింది. ఈ విషయాన్ని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక కూడా ప్రస్తావించింది.
ఐసీఆర్ఏ రూపొందించిన ఈ విశ్లేషణను బడ్జెట్ 2026–27పై ఇచ్చిన అవుట్‌లుక్‌లో చేర్చారు. దాని ప్రకారం, 8వ వేతన సంఘం వల్ల కేంద్ర ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం తక్షణం కాకుండా 2028 ఆర్థిక సంవత్సరంలోనే స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఒకసారి సిఫార్సులు అమలులోకి వస్తే జీతాలు, పెన్షన్లపై ప్రభుత్వ ఖర్చు భారీగా పెరుగుతుందని, ఇది ఆర్థిక స్థిరత్వంపై ఒత్తిడిని పెంచుతుందని అంచనా వేస్తున్నారు.అయితే, వేతన సంఘం అమలు ఎప్పుడు జరిగినా ప్రభుత్వం దానిని జనవరి 1, 2026 నుంచి వెనుకటి తేదీ నుంచి అమలు చేసే అవకాశమే ఎక్కువగా ఉందని ఐసీఆర్ఏ భావిస్తోంది. అలా జరిగితే, కనీసం 15 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి సంబంధించిన బకాయిలను ఒకేసారి చెల్లించాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వ ఖజానాపై ఒక్కసారిగా భారీ భారం మోపుతుంది. ఐసీఆర్ఏ అంచనా ప్రకారం, ఈ కారణంగా 2028 ఆర్థిక సంవత్సరంలో జీతాల వ్యయం 40 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
గత అనుభవాలను ఉదాహరణగా తీసుకుంటే, బకాయిల పరిమాణం బడ్జెట్‌పై ఎంత ప్రభావం చూపుతుందో స్పష్టంగా తెలుస్తుంది. 7వ వేతన సంఘం అమలు సమయంలో బకాయిలను కేవలం ఆరు నెలలకు మాత్రమే పరిమితం చేసినప్పటికీ, ఒకే ఏడాదిలో జీతాల వ్యయం 20 శాతానికి పైగా పెరిగింది. దీనికి భిన్నంగా, 6వ వేతన సంఘం అమలులో జాప్యం ఎక్కువగా ఉండటంతో బకాయిలు రెండున్నర సంవత్సరాలకు మించి పేరుకుపోయాయి. దీని వల్ల అనేక సంవత్సరాల పాటు ప్రభుత్వంపై నిరంతర ఆర్థిక ఒత్తిడి కొనసాగింది.
రాబోయే కాలంలో జీతాలు, పెన్షన్ల భారం వల్ల వచ్చే ప్రభావాన్ని కొంత మేర తగ్గించేందుకు ప్రభుత్వం 2027 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాన్ని ముందుగానే పెంచే అవకాశం ఉందని ఐసీఆర్ఏ అంచనా వేస్తోంది. ఈ నివేదిక ప్రకారం, మూలధన వ్యయం దాదాపు 14 శాతం పెరిగి సుమారు రూ. 13.1 లక్షల కోట్లకు చేరుకోవచ్చు. దీని ద్వారా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతూనే, ఆర్థిక స్థలం కొంత సమతుల్యంగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల దృష్టిలో చూస్తే, ఈ ఆలస్యం అంటే జీతాల పెంపు రద్దు అయినట్టు కాదు, కేవలం వాయిదా పడినట్టే. చివరకు వేతన సంఘం అమలులోకి వచ్చినప్పుడు భారీ మొత్తంలో బకాయిలు అందుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఈ దీర్ఘకాలిక నిరీక్షణ ఉద్యోగుల్లో అనిశ్చితిని పెంచుతోంది. మరోవైపు, ప్రభుత్వానికి బడ్జెట్ ప్రణాళిక రూపొందించడాన్ని మరింత క్లిష్టంగా మారుస్తోంది.
ఐసీఆర్ఏ అంచనా ప్రకారం 8వ కేంద్ర వేతన సంఘం ఇకపై ఒక సాధారణ జీత సవరణ ప్రక్రియగా మాత్రమే ఉండదు. ఇది కేంద్ర ప్రభుత్వ వ్యయ ప్రాధాన్యతలను తిరిగి నిర్వచించే స్థాయికి చేరుకుని.. రాబోయే సంవత్సరాల్లో వరుసగా వచ్చే కేంద్ర బడ్జెట్లపై కూడా గణనీయమైన ప్రభావం చూపించే ప్రధాన ఆర్థిక పరిణామంగా మారే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
School Holidays In Telangana: తెలంగాణలో సంక్రాంతి సెలవులు ముగిసిన వెంటనే విద్యార్థులకు మరో శుభవార్త వినిపిస్తోంది. ఈ నెల చివరలో మేడారం జాతర సందర్భంగా వరుస సెలవులు వచ్చే అవకాశం ఉందన్న వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా రాష్ట్రంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
మేడారం జాతర ఎప్పుడంటే?
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతర ఈ నెల జనవరి 28 నుండి 31 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు తరలివెళ్తుంటారు.
సెలవులపై విన్నపం..
జాతర సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ కుటుంబాలతో కలిసి దేవతలను దర్శించుకునేందుకు వీలుగా సెలవులు ప్రకటించాలని పీర్టీయూ (PRTU) నాయకులు ప్రభుత్వానికి విన్నవించారు. జాతర జరిగే నాలుగు రోజులు (జనవరి 28, 29, 30, 31) సెలవులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, విద్యార్థులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు లభించనున్నాయి.
సాధారణంగా మేడారం జాతర సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో స్థానిక సెలవులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ఇస్తారా లేదా అనేది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సెలవులపై విద్యాశాఖ నుండి క్లారిటీ వస్తే విద్యార్థులు, తల్లిదండ్రులకు స్పష్టత లభిస్తుంది.
వరుస సెలవుల వార్తలతో విద్యార్థులు సంబరపడుతుండగా, జాతర ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BRICS Currency Future: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆధారస్తంభంగా ఉన్న అమెరికా డాలర్ ఆధిపత్యం భవిష్యత్తులో బలహీనపడే అవకాశముందా అనే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అమెరికా అనుసరిస్తున్న కఠినమైన సుంకాల విధానాలు, ఆర్థిక ఆంక్షలు, ఏకపక్ష నిర్ణయాలతో అనేక దేశాలు అసంతృప్తికి లోనవుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే కొన్ని దేశాలు డాలర్‌పై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీపై చేస్తున్న చర్చలు ప్రపంచ మార్కెట్లలో ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. బ్రిక్స్ నిజంగా తన సొంత కరెన్సీని ప్రవేశపెడితే, డాలర్ ప్రభావం తగ్గుతుందా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా నిలుస్తోంది.
అమెరికా డాలర్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీగా ఎందుకు నిలిచిందంటే, దానికి చారిత్రక, ఆర్థిక కారణాలు ఉన్నాయి. నేటి అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ అత్యధికంగా ఉపయోగిస్తోంది. చమురు లావాదేవీల నుంచి అంతర్జాతీయ ఒప్పందాల వరకు చాలా వ్యవహారాలు డాలర్లలోనే జరుగుతాయి. ఈ కారణంగా డాలర్ కేవలం ఒక కరెన్సీగా కాకుండా, అమెరికా ఆర్థిక, రాజకీయ ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసే సాధనంగా మారింది. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు నేరుగా లేదా పరోక్షంగా డాలర్‌తో ముడిపడి ఉండటం కూడా దీనికి బలం చేకూర్చింది.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా వాణిజ్య విధానాల్లో స్పష్టమైన మార్పులు కనిపించాయి. భారీ సుంకాలు విధించడం, ఆంక్షలు విధించడం, ఆర్థిక ఒత్తిడిని ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగించడం వంటి చర్యలు అనేక దేశాలను ఇబ్బందులకు గురిచేశాయి. భారతదేశం, చైనా, బ్రెజిల్ వంటి దేశాలతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిస్థితులు అనేక దేశాలను డాలర్‌పై ఇంతగా ఆధారపడటం సరైందేనా? అనే ప్రశ్న వేయించేలా చేశాయి. ఫలితంగా, డాలర్‌కు ప్రత్యామ్నాయ వ్యవస్థలపై ఆలోచనలు బలపడుతున్నాయి.
బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల సమాఖ్య. ఈ దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ప్రతినిధులుగా ఉన్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం ఏటా పెరుగుతూ వస్తోంది. అంతేకాదు, అమెరికా ఆర్థిక ఒత్తిడిని తప్పించుకోవాలనే ఆకాంక్ష కూడా ఈ దేశాల్లో బలంగా ఉంది. అందుకే పరస్పర లావాదేవీల కోసం డాలర్‌కు ప్రత్యామ్నాయ మార్గాలపై వారు దృష్టి పెట్టారు.
బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి కరెన్సీ అనే ఆలోచన కొత్తది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ అంశంపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా డాలర్, యూరో వంటి పాశ్చాత్య కరెన్సీలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒక దేశం అమెరికా విధించే ఆంక్షల వల్ల ఆర్థికంగా దెబ్బతింటే, దాని ప్రభావం మొత్తం వ్యవస్థపై పడుతుంది. అలాంటి పరిస్థితులను నివారించేందుకు బ్రిక్స్ దేశాలు స్వంత చెల్లింపు వ్యవస్థ లేదా ఉమ్మడి కరెన్సీ గురించి ఆలోచిస్తున్నాయి.
బ్రిక్స్ కరెన్సీ అమలులోకి వస్తే కొన్ని స్పష్టమైన ప్రయోజనాలు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. సరిహద్దులు దాటే వాణిజ్య లావాదేవీలు సులభంగా, తక్కువ ఖర్చుతో జరిగే అవకాశం ఉంటుంది. డిజిటల్ సాంకేతికత, బ్లాక్‌చెయిన్ వంటి ఆధునిక విధానాలను వినియోగిస్తే చెల్లింపులు వేగంగా పూర్తవుతాయి. ఇది బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించడమే కాకుండా, వారి విదేశీ మారక నిల్వలపై ఉన్న ఒత్తిడిని కూడా తగ్గించగలదు. అంతేకాదు, అభివృద్ధి చెందుతున్న చిన్న దేశాలకు కూడా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త అవకాశం లభించవచ్చు.
అయితే బ్రిక్స్ కరెన్సీ ప్రవేశంతో డాలర్ వెంటనే బలహీనపడిపోతుందని భావించడం సరైంది కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. డాలర్ బలం దాని విస్తృత వినియోగం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసం, అమెరికా ఆర్థిక వ్యవస్థతో ఉన్న గాఢమైన అనుబంధం మీద ఆధారపడి ఉంది. కానీ బ్రిక్స్ దేశాలు క్రమంగా తమ వాణిజ్యంలో కొత్త కరెన్సీలను ఉపయోగించడం ప్రారంభిస్తే, దీర్ఘకాలంలో డాలర్ ఆధిపత్యం తగ్గే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేము. అయితే ఈ మార్పు ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా, దశలవారీగా జరిగే ప్రక్రియగానే ఉంటుంది.
ఈ పరిణామాలను అమెరికా కూడా జాగ్రత్తగా గమనిస్తోంది. ఎక్కువ దేశాలు డాలర్ వినియోగాన్ని తగ్గిస్తే, అమెరికా ఆర్థిక మరియు రాజకీయ ప్రభావం దెబ్బతినే అవకాశం ఉందనే ఆందోళన అక్కడ నెలకొంది. అందుకే బ్రిక్స్ వంటి ప్రత్యామ్నాయ ప్రయత్నాలను అమెరికా అనుమానంతో చూస్తోంది. డాలర్‌పై డిమాండ్ తగ్గితే, అమెరికా తన ఆర్థిక నిర్ణయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి కూడా తలెత్తవచ్చు. అందుకే బ్రిక్స్ కరెన్సీపై జరుగుతున్న చర్చలు కేవలం ఆర్థిక అంశంగా మాత్రమే కాకుండా, భవిష్యత్ ప్రపంచ శక్తి సమీకరణాలను ప్రభావితం చేసే అంశంగా మారుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KTR Condemns Revanth Reddy: శాంతిభద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, అసాంఘిక చర్యలను, నేరాలను ప్రోత్సహించేలా రేవంత్ రెడ్డి మాట్లాడటం కనీసం సిగ్గుచేటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని ప్రకటించారు. రేవంత్ రెడ్డికి పూర్తిగా మతిభ్రమించిందని ఇవాల్టి సభ సాక్షిగా తేలిపోయిందని తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీ పాట పాడడం వెనుక ఉన్న అసలు కుట్ర ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమైందని చెప్పారు.
Also Read: Tomorrow Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. బ్యాంకులకు కూడా! ఎందుకో తెలుసా?
బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలని ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి పిలుపునివ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ముఖ్యమంత్రివా లేక ముఠా నాయకుడివా? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగానే కాకుండా హోంమంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి కనీస సోయి లేకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. పదేళ్ల కాలంలో శాంతిభద్రతల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో నేడు అరాచక పర్వానికి ద్వారాలు తెరిచే వారు అధికారంలో ఉండడం రాష్ట్రానికి పట్టిన దరిద్రమని కేటీఆర్ దుయ్యబట్టారు.
Also Read: Women Dress: మహిళలు ఏం ధరించాలి? సనాతన ధర్మం చెబుతోంది తెలుసా?
తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండాపై ఉన్న చెక్కుచెదరని అభిమానాన్ని చూసి రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యిందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అందులో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. రెండేళ్ల కాలంలోనే అట్టర్ ఫ్లాప్ పాలనతో ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్ రెడ్డికి పూర్తిగా మతిభ్రమించిందని ఇవాల్టి సభ సాక్షిగా తేలిపోయిందని ప్రకటించారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే చురుగ్గా స్పందించి అరెస్టులు చేసే పోలీసు శాఖ, డీజీపీ రేవంత్ రెడ్డి చేసిన ఈ తీవ్రమైన, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read: Shashtipoorthi: షష్టిపూర్తి ఎందుకు చేస్తారు? 60 ఏళ్లకు ఎందుకు చేయాలో హిందూ శాస్త్రం ఏం చెబుతోంది?
కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీ పాట పాడటం వెనుక ఉన్న అసలు కుట్ర ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమైందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. రెండేళ్లుగా తన పాత బాసు ఆదేశాల మేరకు తెలంగాణకు తీరని నష్టం చేసేలా జలహక్కులను రేవంత్ రెడ్డి కాలరాశారని గుర్తుచేశారు. నేడు ఆయన చేసిన ప్రకటనతో నిజస్వరూపం బట్టబయలైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయే నావ అని అర్థం కావడంతోనే రేవంత్ రెడ్డి ఏ క్షణమైనా దాని నుంచి బయటకు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ఒకవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ.. మరోవైపు తెలంగాణ ప్రజలు తిరస్కరించిన టీడీపిని తిరిగి ఈ గడ్డపైకి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి పన్నాగం పన్నుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. దీనిని 4 కోట్ల తెలంగాణ సమాజం తప్పకుండా తిప్పికొడుతుందని కేటీఆర్ తెలిపారు. నీళ్ల నుంచి మొదలుకొని నిధులు, నియామకాల వరకూ తెలంగాణ ప్రయోజనాలను పాతాళంలోకి నెట్టిన కోవర్టు రాజకీయాలకు, రాష్ట్రానికి చేసిన ద్రోహానికి రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Horoscope 2026 Telugu: ఒక గ్రహం నక్షత్రం సంచారం చేసినప్పుడు దాని కారణంగా ఏర్పడే ప్రభావం అనేక రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు తీసుకువస్తుంది. ముఖ్యంగా ఇది వ్యక్తి జీవితంపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను పడుతుంది. కాబట్టి నక్షత్ర సంచారం కూడా చాలా కీలకమైందిగా భావిస్తారు. ముఖ్యంగా కొన్ని గ్రహాలు సంచారం చేస్తే వ్యక్తిగత జీవితంలో పనుల్లో మార్పులు రావడమే కాకుండా ఆర్థిక సంబంధాల్లో కూడా అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. 2026 జనవరి చివరి మూడు రోజులపాటు అరుదైన యాదృచ్ఛికలో ఏర్పడిపోతున్నాయి.
ప్రధాన గ్రహాలైన కుజుడు, బృహస్పతి, బుధుడు, శుక్రుడు ఒకదాని తర్వాత ఒకటి రాశులు సంచారం చేయబోతున్నాయి. దీని ప్రభావం జనవరి 29 నుంచి 31వ తేదీ మధ్యలో అన్ని రాశుల వారిపై పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కుజుడు ఉత్తరాషాడ నక్షత్రం నుంచి శ్రవణా నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. అలాగే జనవరి 30వ తేదీన బృహస్పతి పునర్వాసు నక్షత్రం లో ఒక దశ నుంచి మరొక దశకు మారబోతోంది. జనవరి 31వ తేదీన బుధుడు శుక్రుడు ఒకే రోజు ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాయి. దీని కారణంగా ఈ సమయం ఎంతో కీలకంగా మారబోతోంది.
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ మూడు రోజులు ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల నుంచి ఉపశమనం తులబంగా లభించబోతోంది. ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే కష్టపడి పనిచేయడం వల్ల సానుకూలమైన ఫలితాలు కూడా పొందుతారు. కుటుంబ జీవితంలో ప్రేమ సంబందాలు మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో పిల్లల ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం కూడా చాలావరకు మెరుగుపడుతుంది.
మిధున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో అద్భుతమైన పురోగతి లభించబోతోంది. కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అలాగే ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా కలగవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. శక్తి స్థాయిలు కూడా విపరీతంగా పెరిగి అనేక రకాల పనులు చేయగలుగుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం కూడా అనుకున్నంత స్థాయిలో పెరుగుతుంది. వీరికి ఆర్థిక పరిస్థితులు అనుకున్న దానికంటే ఎక్కువగా మెరుగుపడతాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణ నెలకొంటుంది. పనుల్లో కొత్త బాధ్యతలు కూడా పెరుగుతాయి. మానసిక భక్తుడు కూడా విపరీతంగా తగ్గి.. అనుకోని లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు.
సింహరాశి
సింహరాశి వారికి ఈ సమయంలో గౌరవం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. పురోగతి కూడా ఎంతో లభిస్తుంది. ముఖ్యంగా విద్యాబుద్ధులు విపరీతంగా పెరగడమే కాకుండా.. ఈ సమయంలో జ్ఞానంతో పని చేయగలుగుతారు.. అలాగే కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో చాలా బాగుంటారు. ముఖ్యంగా కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. అలాగే అనుకున్న పనుల్లో ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో ఉపశమనం కలుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Whatsapp Admissible In Court: నేటి డిజిటల్ కాలంలో వాట్సాప్ సందేశాలు మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరి గొడవలు, మోసాలు లేదా కోర్టు కేసుల విషయానికి వస్తే, ఈ వాట్సాప్ స్క్రీన్షాట్లకు చట్టబద్ధత ఎంత? కోర్టు వీటిని సాక్ష్యంగా అంగీకరిస్తుందా? అనే విషయాలను చట్టపరమైన కోణంలో ఇప్పుడు విశ్లేషిద్దాం.
చాలామంది వాట్సాప్ చాట్లను కేవలం స్క్రీన్‌షాట్ తీసి ప్రింట్ ఇస్తే సాక్ష్యంగా సరిపోతుందని భావిస్తారు. కానీ, భారతీయ సాక్ష్యాధారాల చట్టం ప్రకారం ఇది అంత సులభం కాదు.
చట్టం ఏం చెబుతోంది?
డిజిటల్ సాక్ష్యాలకు సంబంధించి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (Indian Evidence Act) లోని సెక్షన్ 65B అత్యంత కీలకమైనది. వాట్సాప్ స్క్రీన్షాట్లు, ఇమెయిల్‌లు, ఆడియో లేదా వీడియో క్లిప్‌లను 'ఎలక్ట్రానిక్ రికార్డ్స్'గా పరిగణిస్తారు. వీటిని కోర్టులో సాక్ష్యంగా సమర్పించాలంటే 65B సర్టిఫికేట్ తప్పనిసరి.
ఏమిటీ 65B సర్టిఫికేట్?
ఇది మీరు సమర్పించే డిజిటల్ సాక్ష్యం అసలైనదని ధృవీకరించే ఒక పత్రం. ఇందులో ప్రధానంగా ఈ కింది అంశాలను ధృవీకరించాల్సి ఉంటుంది.
1) స్క్రీన్‌షాట్ తీసిన మొబైల్ సక్రమంగా పనిచేస్తోంది.
2) మెసేజ్‌లు ఎడిట్ చేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం జరగలేదు.
3) సదరు వ్యక్తికి ఆ డివైజ్‌పై పూర్తి నియంత్రణ ఉందనే ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
ఈ సర్టిఫికేట్ లేకుండా మీరు ఎన్ని స్క్రీన్షాట్లు సమర్పించినా కోర్టు వాటిని ప్రాథమిక సాక్ష్యంగా అంగీకరించదు.
కోర్టులో సాక్ష్యం నిలబడాలంటే ఈ నియమాలు పాటించాలి
సందర్భోచితంగా ఉండాలి: కేవలం ఒక మెసేజ్ స్క్రీన్‌షాట్ మాత్రమే కాకుండా, పూర్తి సంభాషణ (Context) అర్థమయ్యేలా ఉండాలి. ఎంపిక చేసిన (Selective) స్క్రీన్షాట్లను కోర్టు తిరస్కరించే అవకాశం ఉంది.
ఫోన్ నంబర్ స్పష్టత: స్క్రీన్‌షాట్‌లో అవతలి వ్యక్తి ఫోన్ నంబర్ స్పష్టంగా కనిపించాలి. కేవలం పేరు ఉంటే సరిపోదు, ఎందుకంటే పేరును ఎలాగైనా సేవ్ చేసుకోవచ్చు.
ఫోరెన్సిక్ పరీక్ష: అవతలి పక్షం ఆ సాక్ష్యాన్ని సవాల్ చేస్తే, కోర్టు సదరు మొబైల్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపమని ఆదేశించవచ్చు.
మెటాడేటా: సందేశం పంపిన సమయం, తేదీ వంటి వివరాలు (Metadata) సరిపోలాలి.
ఏయే కేసుల్లో ఉపయోగపడుతుంది?
గృహ హింస, విడాకుల కేసులు... బ్లాక్మెయిల్ లేదా బెదిరింపులకు సంబంధించిన నేరాలు.. ఆర్థిక మోసాలు, వ్యాపార ఒప్పందాల వివాదాలు.. కార్యాలయాల్లో వేధింపులు (Workplace Harassment) వంటి వాటి కోసం ఈ సాక్ష్యాలు సందర్భాన్ని బట్టి పనిచేయవచ్చు.
వాట్సాప్ స్క్రీన్‌షాట్ కోర్టులో సాక్ష్యంగా చెల్లుతుంది, కానీ దానికి సెక్షన్ 65B సర్టిఫికేట్ తోడవ్వాలి. స్క్రీన్‌షాట్‌ను ఎడిట్ చేయడం లేదా ఫార్వార్డ్ చేసిన మెసేజ్‌లను సాక్ష్యంగా చూపడం వల్ల ప్రయోజనం ఉండదు. న్యాయపరమైన చిక్కులు ఎదురైనప్పుడు అనుభవజ్ఞుడైన న్యాయవాదిని సంప్రదించి, డిజిటల్ సాక్ష్యాలను సరిగ్గా సిద్ధం చేసుకోవడం ముఖ్యం.
(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. చట్టపరమైన సమస్యల కోసం నిపుణులైన లాయర్లను సంప్రదించండి. పైన పేర్కొన్న సమాచారాన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
CPI Centenary Meeting: 'బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ఉపాధి హామీ పథకం తెస్తే బీజేపీ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. ఉపాధి హామీ రద్దుతో అగ్గువకో సగ్గువకో అదానీ అంబానీలకు కూలీలు దొరికే పరిస్థితి. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా నాడు పోరాటం చేశాం. పేదల హక్కులు కొల్లగొట్టడానికి, రాజ్యాంగం మార్చడానికి 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు. రాజ్యాంగాన్ని చెర పట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది' అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Also Read: Lakshmi Parvathi: చంద్రబాబు లోకేశ్‌పై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
ఖమ్మంలో జరుగుతున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. పేదల హక్కుల పోరాటాల్లో ప్రాణాలు కోల్పోతామే కానీ ఎర్ర జెండా వదలమని ప్రకటించిన కామ్రేడ్లకు రేవంత్ రెడ్డి వందనం చేశారు. రైతులు, రైతు కూలీలు, హరిజనులు, గిరిజనులు కోసం కమ్యూనిస్టులు పోరాడారని.. దున్నే వాడిదే భూమి అని కమ్యూనిస్టులు పిలుపునిస్తే దానిని అమల్లోకి తెచ్చింది ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు అని గుర్తుచేశారు.
Also Read: Shashtipoorthi: షష్టిపూర్తి ఎందుకు చేస్తారు? 60 ఏళ్లకు ఎందుకు చేయాలో హిందూ శాస్త్రం ఏం చెబుతోంది?
'రైతులు ధర నిర్ణయించలేనప్పుడు కనీస మద్దతు ధర కోసం కమ్యూనిస్టులు పోరాడారు. 4 వేల అమరవీరుల త్యాగాలతో హైదరాబాద్ రాష్ట్రం నిజాం నుంచి విముక్తి అయింది. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్, శేషగిరి రావు వంటి వారెందరో నాడు పోరాడారు' అని రేవంత్ రెడ్డి వివరించారు. 'పేదల ఓటు హక్కు రద్దు చేసేందుకు సర్ తీసుకువచ్చారు. రాజ్యాంగ సభ సమయంలోనూ గోల్వాల్కర్ వారసులు పేదలకు ఓటు హక్కు లేకుండా చేసేందుకు ప్రయత్నించారు' అని మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Women Dress: మహిళలు ఏం ధరించాలి? సనాతన ధర్మం చెబుతోంది తెలుసా?
'మూల వాసులు ఎక్కడ నుంచి ఆధారాలు తెస్తారు. ఓటు హక్కు లేకపోతే రేషన్ కార్డు, ఇల్లు, పింఛన్ పోతుంది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ తేడా లేకుండా మోదీకి వ్యతిరేకంగా దండు కట్టాలి' అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు పేదల కోసం కొట్లాడతారని.. నేటి ఈ ప్రభుత్వంలో మీ శ్రమ ఉందని చెప్పారు. 'నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి వచ్చినా బీజేపీ ఒక్క సీటు లేదు. తులసీ వనంలో గంజాయి మొక్కకు చోటు లేదు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి చోటు లేదు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి సర్పంచులు కూడా లేరు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఖమ్మంలో సంబరంగా ప్రారంభమైంది. మరో రెండు రోజుల పాటు ఈ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Nandamuri Lakshmi Parvathi: ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు మోసాలను గ్రహించాలని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహం పేరుతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలోనే నీరుకొండపై విగ్రహం పెట్టేవాడని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. తనప్రతిష్ట దిగజారుతున్నప్పుడల్లా ఎన్టీఆర్ పేరుతో రాజకీయం చేయడం చంద్రబాబుకి అలవాటేనని, ఎన్టీఆర్ విగ్రహం పేరుతో ఆయన చేస్తున్న హడావుడి కూడా అలాంటిదేనని ప్రకటించారు.
Also Read: Shashtipoorthi: షష్టిపూర్తి ఎందుకు చేస్తారు? 60 ఏళ్లకు ఎందుకు చేయాలో హిందూ శాస్త్రం ఏం చెబుతోంది?
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి కీలక ప్రెస్‌మీట్ నిర్వహించారు. చంద్రబాబుకి చేతనైతే మెడికల్ కాలేజీలు నిర్మించాలని.. ప్రధాని మోదీతో మాట్లాడి ఎన్టీఆర్‌కి భారతరత్న ఇప్పించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్ దుర్మార్గాలపై బీజేపీ నాయకులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. 2014లోనే నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం పెడతానని చెప్పి పక్కన భూములు కాజేశాడని, చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లలో విగ్రహం నిర్మాణం పూర్తి చేయలేడా అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికైనా చంద్రబాబు మోసాలను గుర్తించాలని విజ్ఙప్తి చేశారు.
Also Read: Women Dress: మహిళలు ఏం ధరించాలి? సనాతన ధర్మం చెబుతోంది తెలుసా?
చేతనైతే మోడీతో మాట్లాడి చంద్రబాబు ఎన్టీఆర్‌కి భారతరత్న ఇప్పించాలని, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పెండింగ్ పనులు పూర్తి చేయాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్ దోపిడీలు, అరాచకాలపై తాను కూడా ప్రధాని మోడీకి లేఖ రాస్తానని చెప్పారు. జూదాలు, కోడి పందేలు, కేసినోలు, అర్థనగ్న నృత్యాలతో రాష్ట్ర ప్రతిష్టను చంద్రబాబు నడి బజారున నిలబెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపం పండిన రోజు చంద్రబాబు సంపాదించిన లక్షల కోట్ల అక్రమ సంపాదన కూడా ఆయన్ను కాపాడలేదని, నారా లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన కాళ్లకే చుట్టుకుని ఆయన్ను జైలుపాలు చేయడం ఖాయమని లక్ష్మీపార్వతి ప్రకటించారు.
జయంతి, వర్ధంతి వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ మీద చంద్రబాబు ప్రేమ ఒలకబోస్తుంటాడని నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. గతంలోనూ 2014 అధికారంలోకి వచ్చినప్పుడు నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడతానని హడావుడి చేసి చుట్టుపక్కల భూములు కాజేశాడు. మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని.. ఎన్టీఆర్ ఆశయాలను కాపాడతానని నక్క వినయాలు ప్రదర్శిస్తున్నాడని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని లక్ష్మీపార్వతి ఆరోపించారు.
మోసపు హామీలతో రైతులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు దారుణంగా మోసం చేశాడని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. మోసపు హామీలతో అధికారంలోకి రావడం వచ్చాక ప్రజలకు వెన్నుపోటు పొడిచి రాష్ట్రాన్ని దోచుకోవడమే చంద్రబాబు విధానం అని విమర్శించారు. మళ్లీ జగన్ ప్రభుత్వం రాగానే తండ్రీకొడుకుల అరాచాకలపై తక్షణ విచారణ జరిపి చట్టపరంగా వారిని శిక్షించకుండా వదిలిపెట్టమని లక్ష్మీ పార్వతి హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి