icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

తెలంగాణ పోలీస్ పోస్టుల అప్లికేషన్ ప్రాసెస్ షురూ.. ఈ లింక్ ద్వారా వెంటనే అప్లై చేయండి!

Hyderabad, Telangana:

TG Police Jobs 2026: చాలా కాలంగా తెలంగాణ నిరుద్యోగులు ఎదురుచూస్తున్న పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియ ఈరోజు నుండి మొదలైంది. అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష కోసం పార్ట్-1 అప్లికేషన్‌ను సెప్టెంబర్ 9 లోపు సమర్పించాలి. దరఖాస్తుతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో,  సంతకాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 7437 పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియ ఈరోజు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైంది. దీని కోసం ఆధార్ యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి.ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రక్రియ ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్‌ https://www.tgprb.in/ లో ఈరోజు  నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. సెప్టెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు వయోపరిమితి పెంచడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి కాబట్టి, అభ్యర్థులు నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదివి దరఖాస్తు చేసుకోవాలి. అలాగే దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికేట్లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.

ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి..
తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. దీని కోసం మీ మొబైల్‌లో ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూర్తయిన తర్వాత ప్రింట్ అవుట్ జాగ్రత్తగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏవైనా సందేహాలు ఉంటే అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన నంబర్లను సంప్రదించవచ్చు. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు, ఆ తర్వాత PMT, PET, తుది పరీక్షలు ఉంటాయి. ఈ ప్రక్రియలన్నింటిలో విజయవంతంగా పూర్తి చేసిన వారికి పోస్టింగ్ ఇస్తారు.

మీ వద్ద ఉండాల్సిన సర్టిఫికేట్లు..
తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ వద్ద ఈ క్రింది సర్టిఫికేట్లను సిద్ధంగా ఉంచుకోవాలి: 
1 నుండి 7వ తరగతి వరకు చదివిన బోనఫైడ్ సర్టిఫికేట్, రెజర్వేషన్ ఉంటే కుల ధృవీకరణ పత్రం, ఏప్రిల్ తర్వాత తీసుకున్న నాన్-క్రిమినల్ సర్టిఫికేట్,  స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థులైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్లతో పాటు క్లాసిఫికేషన్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి.

Also Read:  తిరుచానూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కాచిగూడ - తిరుచానూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఇకపై రెగ్యులర్

Also Read: నెట్ లేకపోయినా పర్లేదు.. ఈ ఒక్క నంబర్‌కు SMS, మిస్డ్ కాల్ ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ మీ ముందే!

మొత్తం 7437 పోలీసు పోస్టుల కోసం అభ్యర్థులు ఈ నెల 19 ఉదయం 8 గంటల నుండి సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రిక్రూట్‌మెంట్ బోర్డ్ తెలిపింది. పోస్టుల ఆధారంగా ఫీజును ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 600 నుండి 750 వరకు, ఇతరులకు రూ. 1200 నుండి 1500 వరకు నిర్ణయించారు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే, ఎస్సీ, ఎస్టీ వారికి రూ. 50 చొప్పున, ఇతరులకు రూ. 100 చొప్పున అదనపు రుసుము ఉంటుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Sania Mirza Marriage: రెండో పెళ్లికి సిద్ధమైన సానియా మీర్జా..లవర్ కోసమే దుబాయ్‌లో సెటిల్..త్వరలోనే పెళ్లి?

Hyderabad, Telangana:

Sania Mirza Second Marriage: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మరోసారి వివాహం చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పాకిస్థాన్ క్రికెట్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత దుబాయ్‌కి చెందిన ఒక విదేశీ వ్యక్తితో ఆమె వివాహం నిశ్చయమైనట్లు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

జాతీయ మీడియా కథనం ప్రకారం.. సదరు వ్యక్తి సానియా మీర్జాకు అత్యంత సన్నిహితుడని, గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అతని కోసమే సానియా దుబాయ్‌లో శాశ్వతంగా స్థిరపడినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సీక్రెట్ లవ్‌కు ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, దుబాయ్‌లోనే అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో రహస్యంగా వివాహ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. వస్తున్న ఈ పెళ్లి వార్తలపై సానియా మీర్జా గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

తొలి వివాహం, విడాకుల నేపథ్యం
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2010 ఏప్రిల్‌లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ జన్మించాడు.

అయితే వీరిద్దరూ విడిపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను రెండో వివాహం చేసుకున్నట్లు ప్రకటించిన తరుణంలో, సానియా కుటుంబం వారి విడాకుల విషయాన్ని బయటపెట్టింది. షోయబ్ వివాహేతర సంబంధాల వల్లే వారు విడిపోయినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం సానియా టెన్నిస్ రిటైర్మెంట్ తర్వాత దుబాయ్‌లో ఉంటున్నారు.

గతంలోనూ వచ్చిన రూమర్లు
సానియా మీర్జా రెండో పెళ్లిపై ఇలాంటి వదంతులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఓ టాలీవుడ్ హీరోతో, ఆ తర్వాత భారత క్రికెటర్ మహ్మద్ షమీతో ఆమె పెళ్లి జరగనుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో ఆ వార్తలను సానియా పూర్తిగా ఖండించారు. ఇప్పుడు మళ్లీ ఆమె పెళ్లి వార్తలు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read: విరాట్ కోహ్లీకి ఈ టాలీవుడ్ హీరోయిన్ మరదలు అవుతుంది..ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

Also REad: పిల్లకూన బంగ్లాదే‌శ్‌పై ఆస్ట్రేలియా ఘోర ఓటమి..ఆసీస్‌ గడ్డపై బంగ్లా జట్టు తొలి విజయం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

365 Days Maternity: మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్..మూడో బిడ్డ ప్రసవానికి 365 రోజులు ప్రసూతి సెలవులు!

Nagalapuram, Tamil Nadu:

Tamil Nadu 365 Days Maternity: తమిళనాడులోని విజయ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జనాభాను పెంచే ప్రాతిపదికన ప్రజలను ప్రభుత్వ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు తీపికబురు చెప్పింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఇద్దరికంటే తక్కువ మంది పిల్లలు ఉన్న వివాహిత మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పూర్తి వేతనంతో కూడిన 12 వారాల (లేదా 84 రోజుల) సెలవు మాత్రమే లభిస్తుంది.

మూడవ బిడ్డ జననం విషయంలో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 12 వారాల సెలవు అనగా 84 రోజులు సెలవును 365 రోజులకు పెంచుతున్నట్లు తమిళనాడు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మార్పుతో, మొదటి ఇద్దరు పిల్లలకు లభించే ఏడాది కాలపు సెలవు సదుపాయం మూడవ బిడ్డ విషయంలోనూ వర్తిస్తుంది.

రాష్ట్ర అసెంబ్లీలో తన శాఖకు సంబంధించిన నిధుల కేటాయింపుపై జరిగిన చర్చ సందర్భంగా మానవ వనరుల నిర్వహణ శాఖ మంత్రి డి. శరత్‌కుమార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. "సామాజిక సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిచ్చే సంక్షేమ ఆధారిత ప్రభుత్వం తమిళనాడుది కాబట్టి, మూడవ బిడ్డ విషయంలో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న 12 వారాల ప్రసూతి సెలవును 365 రోజులకు పెంచుతున్నాము" అని శరత్‌కుమార్ పేర్కొన్నారు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఇద్దరికంటే తక్కువ మంది పిల్లలు ఉన్న వివాహిత మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవు లభిస్తుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పూర్తి వేతనంతో కూడిన 12 వారాల (లేదా 84 రోజుల) సెలవు మాత్రమే లభిస్తుంది.

మూడవ బిడ్డ విషయంలో ప్రసూతి ప్రయోజనాలను నిరాకరించకూడదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు అనుగుణంగా, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు 12 వారాల సెలవు సదుపాయాన్ని గతంలో ప్రవేశపెట్టారు.

అసెంబ్లీకి నవజాత శిశువును తీసుకువచ్చిన తొలిసారి ఎమ్మెల్యే
అసెంబ్లీ సమావేశాలకు తన నవజాత శిశువును తీసుకురావడం ద్వారా టీవీకే (TVK) పార్టీకి చెందిన తొలిసారి ఎమ్మెల్యే ఆర్.పల్లవి అందరి దృష్టిని ఆకర్షించిన తరుణంలోనే ఈ ప్రకటన వెలువడింది.

పల్లవి శిశువును అసెంబ్లీ ప్రాంగణానికి తీసుకువచ్చారని, సభ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ప్రధాన హాలులోకి వెళ్లే ముందు బిడ్డను సంరక్షకురాలి (కేర్‌గివర్) వద్ద ఉంచారని అధికారిక వర్గాలు తెలిపాయి. పల్లవి తిరిగి వచ్చేవరకు ఆ సంరక్షకురాలు అసెంబ్లీ హాలు సమీపంలోని ఒక గదిలో శిశువును చూసుకున్నారు.

బిడ్డను వెంట తీసుకురావడం ద్వారా "హడావిడి సృష్టిస్తున్నారని" సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలపై స్పందిస్తూ, నవజాత శిశువును ఇంట్లో వదిలి రాలేనని ఎమ్మెల్యే చెప్పారు.

"దయచేసి ఏదైనా వ్యాఖ్యానించే ముందు ఆలోచించండి. మరొకరి బాధ మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ ట్రోల్ చేయకండి." అని ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్‌తో అన్నారు. తమిళనాడులో సంతానోత్పత్తి రేటు 1.4 కంటే తక్కువగా ఉండడం గమనార్హం. తమిళనాడులో జనాభా మార్పులపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రసూతి సెలవులను కూడా విస్తరించారు.

'ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ సౌత్ ఇండియా' నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో ఆరోగ్య శాఖ మంత్రి కేజీ అరుణ్‌రాజ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు 1.4 కంటే తక్కువకు పడిపోయిందని, ఇది జనాభా భర్తీ స్థాయి అయిన 2.1 కంటే చాలా తక్కువ అని అన్నారు.

తమిళనాడు జనాభాలో దాదాపు 16 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నందున, ఈ జనాభా మార్పు ఒక పెద్ద ప్రజారోగ్య సవాలు అని మంత్రి అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడో బిడ్డను కనే దంపతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లుగా, అటువంటి విధానాలను ప్రభుత్వం కూడా పరిగణించవచ్చని అరుణ్‌రాజ్ అన్నారు.

"ఆంధ్రప్రదేశ్ వంటి ప్రదేశాలలో, మూడో బిడ్డను కనే దంపతులకు ప్రోత్సాహకాలు అందించే ప్రభుత్వ పథకాలు ఉన్నాయని మాకు చెప్పారు. అందువల్ల, భవిష్యత్తులో ఇక్కడ కూడా ఖచ్చితంగా అటువంటి చర్యలు తీసుకోవచ్చు" అని ఆయన అన్నారు.

Also Read: MP School Controversy: అమ్మాయిలతో మూత్రం తాగించిన 5వ తరగతి విద్యార్థి..ప్రిన్సిపల్‌కి చెబితే చాక్లెట్స్ తినమన్నాడు!

Also Read: బీహార్‌లో ఘోర ప్రమాదం..ప్రముఖ ఆలయంలో తొక్కిసలాట..ఏడుగురు మహిళలు దుర్మరణం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Tirumala SSD Tokens: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు

Tirupati, Andhra Pradesh:

Tirumala SSD Tokens: ఆపద మొక్కులవాడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండడంతో తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి దాదాపు ఒక రోజు సమయం పడుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు అంటే బుధవారం ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులందరూ సర్వదర్శనానికి వెళ్లాలని సూచించారు.

రేపు గురువారం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులకు జారీ చేసే ఎస్‌ఎస్‌డీ టోకెన్లు బుధవారం జారీ చేయడం లేదని టీటీడీ ప్రకటించింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ వద్ద ఇచ్చే ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని నిలిపేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు ఇవ్వకపోవడంతో భక్తులు నేరుగా తిరుమలకు చేరుకొని సర్వదర్శనం చేసుకోవాలని సూచించింది. ఇక శుక్రవారం దర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లు యథావిధిగా గురువారం మధ్యాహ్నం జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. కాగా ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని పూర్తిగా రద్దు చేసే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన వారికి వచ్చినట్లు సర్వదర్శనం చేయించే ఆలోచనతో టీటీడీ 8 వారాలుగా అధ్యయనం చేస్తోంది.

కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 80,905 మంది భక్తులు దర్శించుకోగా.. 33,539 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం లభించింది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం రూ.6.12 కోట్లు చేరింది. 4.16 లక్షలు లడ్డూ ప్రసాదం విక్రయాలు జరగ్గా.. 2.88 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.

భక్తుల రద్దీతో తిరుమలలో వేచి చూసే సమయం పెరగడంతో టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. భక్తులకు వెంటనే దర్శనం అయ్యేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా క్యూలైన్‌లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు ఆహార పానీయాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.

0
0
Report

Balapur Murder Case: హైదరాబాద్‌లో మరో దారుణమైన హత్య..లవర్‌ని హత్య చేసి గోనెసంచిలో కుక్కిన ప్రియుడు..ఆ తర్వాత..!

Balapur, Telangana:

Balapur Murder Case News: హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి విషయంలో జరిగిన గొడవ కారణంగా ఒక మహిళను తన ప్రియుడి ఘోరంగా హత్య చేశాడు. ఆమెను నిందితుడు కత్తితో పొడిచి చంపి, ఆ తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి ఇంట్లోనే వదిలేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

ఏం జరిగింది?
సోమవారం అనగా ఆగస్టు 17న ఉదయం బాలాపూర్‌లో జరిగిన ఈ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ప్రియుడు తన ప్రేయసిని కత్తితో పొడిచి చంపి, మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి పరారయ్యాడు.

పోలీసుల వివరాల ప్రకారం, మృతురాలు రెహానా, అనుమానితుడు మహమ్మద్ సలామ్ ప్రేమించుకుంటున్నారు. వీరు బిస్మిల్లా కాలనీలో నివసిస్తున్నారు. అందిన సమాచారం మేరకు, రెహానా కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలని సలామ్‌పై ఒత్తిడి తెస్తోంది. దీనివల్ల సలామ్ ఆగ్రహానికి గురయ్యాడు.

పెళ్లి విషయంలో తెచ్చిన ఒత్తిడి కారణంగా వారి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత సలామ్ కత్తితో రెహానాపై దాడి చేసి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం అతను ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి, బెడ్‌రూమ్‌లో పెట్టి ఇంటి నుండి పరారైనట్లు తెలుస్తోంది.

ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత బాలాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో రెహానా, సలామ్ ఇద్దరూ బీహార్‌కు చెందినవారని తేలింది. అనుమానితుడిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. హత్యకు గల ఖచ్చితమైన కారణాలు, పరిస్థితులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం..వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని యువ నర్స్ మృతి!

Also Read: Balapur Ganesh Theme: ఈసారి బాలాపూర్ గణేష్‌కు పూరీ జగన్నాథ్ ఆలయం థీమ్..ఎలా ఉండబోతుందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం.. ఇక రేవంత్ రెడ్డి సర్కార్‌ భారీ తిరుగుబాటు

Baddipadaga, Telangana:

Telangana Govt Employees: ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఒక్కటీ కూడా నెరవేర్చకపోవడంతోపాటు కాలయాపన చేస్తూ తమను విస్మరిస్తుండడంపై ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకు దక్కాల్సిన ప్రయోజనాలు, న్యాయపరంగా రావాల్సినవి ఇవ్వడంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మీనమేషాలు వేస్తుండడంపై ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా అత్యధికంగా డీఏలు పెండింగ్‌, వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు, వందల మంది రిటైర్డ్‌ ఉద్యోగులు బెనిఫిట్స్‌ రాలేదు. దీనిపై చర్చలు, కమిటీలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుండడంతో ఇక తట్టుకోలేక ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు భారీ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.

కాంగ్రెస్‌ సర్కార్‌పై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రాల్లో నల్లబ్యాడ్జిలతో నిరసన తెలపనున్నారు. అనంతరం సెప్టెంబర్ 10వ తేదీన ఛలో హైదరాబాద్‌కు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. అన్నీ జిల్లాల నుంచి ఛలో హైదరాబాద్‌ కార్యక్రమానికి తరలివచ్చి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఆందోళన చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం మాట విన్నామని.. ఇకపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి తమ తడాఖా ఏంటో చూపిస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరించింది. కొత్త వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని వెంటనే ప్రకటించాలని.. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను ఇవ్వాలని ఉద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేస్తున్న ప్రధాన విషయాలు. అవి చేయకుండా హెల్త్ కార్డులు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయాయని ఉద్యోగులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'జూన్ 2వ తేదీన అన్ని డిమాండ్స్ పరిష్కరిస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పారు. హెల్త్ కార్డు విధి విధానాలు, ఏ ఆసుపత్రులు అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. ఏ ఆసుపత్రిలో ఏ చికిత్స చేస్తారని ఇప్పటికీ సమాచారం లేదు. మూడు నెలల నుంచి డబ్బులు కడుతున్నాం' అని వివరించారు. ఇక వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ)పైన ఇంకా ఎలాంటి సమాచారం లేదని మారం జగదీశ్వర్ తెలిపారు. జూన్ 2వ తేదీన పీఆర్‌సీ అమలు చేస్తామని, జీపీఎస్‌ని మ్యానిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడటం లేదని విమర్శించారు.

'రేవంత్‌ రెడ్డి పిలిచి మాట్లాడినప్పుడు దాని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులది. కానీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆగే ఓపిక మాకు లేదు' అని ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 27వ తేదీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద  ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 10వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. 'రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా ఇంకా పీఆర్‌సీ అమలు చేయలేదు. మీరు ఇస్తా అన్నదే మేము అడుగుతున్నాం. రిటైర్డ్ ఉద్యోగులు పెండింగ్ బిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది' అని ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ గుర్తుచేశారు.

0
0
Report
Advertisement

Hyderabad: రెండోసారి మాదే అధికారం.. 117 సీట్లు గెలవబోతున్నాం: రేవంత్‌ రెడ్డి

Hyderabad, Telangana:

Revanth Reddy: 'రెండోసారి 117 సీట్లు గెలుస్తున్నాం. కేసీఆర్‌ది కుటుంబ న్యాయం, నాది సామాజిక న్యాయం. కేసీఆర్‌ది దొరల న్యాయం, మాది సామాజిక న్యాయం. చెట్టుకు, పుట్టకు, రాయి, రప్పకు మొక్కుతున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని. వందల ఎకరాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు' అని రేవంత్‌ రెడ్డి విమర్శలు చేశారు. తాము గ్రామగ్రామాన ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. దిశ సరిగా లేకపోతే దశ సరిగా ఉండదని.. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నాం. పాలు, రాగిజావ పిల్లలకు ఇస్తున్నాం. మన పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. కష్టమైనా, నష్టమైనా పిల్లలను బడికి పంపించాలి. వాళ్లను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రమాదవశాత్తు గౌడ సోదరులు చనిపోతే రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తున్నట్లు వెల్లడించారు.

'అందెశ్రీ పాటకు విముక్తి కల్పించాం. గద్దర్ పేరును శాశ్వతంగా నిలిపాం. బీసీ కులగణన చేశాం. ఎస్సీ వర్గీకరణ చేశాం. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాం. 36 వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం. 95 వేల కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేశాం. 60 వేల కోట్ల బ్యాంకు అనుసంధాన రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చాం' అని ముఖ్యమంత్రి వెల్లడించారు. 'యంగ్ ఇండియా సమగ్ర పాఠశాలలను ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయం, క్రీడా అకాడమీని ప్రారంభించుకున్నాం' అని గుర్తుచేశారు.

'మేం చేసినవన్నీ చెబితే వాళ్లు ఇంట్లో నుంచి బయటకు రారు. చెబుతున్న అబద్ధాలను నమ్మడం లేదని కర్ణాటక, తమిళనాడుకు వెళ్లి అఘోరా రావు చేతబడి పూజలు చేయించి వచ్చాడు. కరువు రావాలని, రైతులు నష్టపోవాలని చేతబడి పూజలు చేస్తున్నారు. అధికారం కోసం ఇంతకు దిగజారుతారా?' అని అసహనం వ్యక్తం చేశారు. ఏది ఉన్నా మాట్లాడుకుని ముందుకు వెళ్దామని ప్రకటించారు.

'ఇది బహుజనుల తెలంగాణ. సామాజిక న్యాయం, జీవించడానికి స్వేచ్ఛ ఇందిరమ్మ పాలనలో ఉందని నిరూపించాం' అని తెలంగాణ సీఎం తెలిపారు. 'బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన తన కులం, కుటుంబం కోసం మాత్రమే పనిచేయలేదు. బహుజనులతో కలిసి దండయాత్ర చేసి గోల్కొండ కోటపై జెండాను ఎగురవేశారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు ఉండాలి' అని రేవంత్ రెడ్డి తెలిపారు. శివాజీ మాదిరి తెలంగాణలో బహుజనులు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి అంతే ప్రాధాన్యం ఇస్తారు. బహుజనుల కోసం పాపన్న గౌడ్‌ తన జీవితాన్ని అంకితం చేయడంతోనే ఆయనకు ఆ కీర్తి, గౌరవం దక్కింది' అని వివరించారు.

'పండుగ సాయన్న పోరాటం, పౌరుషం పాలమూరు జిల్లాలో అందరికీ తెలుసు. అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం, సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అందరిది' అని తెలంగాణ సీఎం ప్రకటించారు. 'మహేష్ గౌడ్ గాంధీభవన్‌లో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు నేను, భట్టి విక్రమార్క రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ముఖ్యమంత్రిగా నేను మళ్లీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తాం. మళ్లీ అధికారాన్ని తీసుకువస్తాం. గౌడన్నలు నూటికి నూరు శాతం సహకరించాలి' అని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 'గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అర్హులైన నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా అందరికీ పింఛన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చా' అని తెలిపారు.

'ప్రభుత్వ పొలాల్లో ఈత, తాటి చెట్లు నాటేలా చూస్తాం. కాలువ గట్లపైన కూడా ఈత, తాటి చెట్లు నాటాలి. పిల్లల తలరాతలను మనం మార్చవచ్చు. ఈనాడు చైతన్యం వచ్చింది. కులవృత్తిని కొనసాగించండి, గౌరవించండి. కానీ పిల్లలను మాత్రం చదివించండి' అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల కోసం ఎన్ని కోట్లైనా కేటాయిస్తామని.. నాణ్యమైన విద్యతో పాటు భోజనం కూడా ఇస్తామని ప్రకటించారు.

0
0
Report

Poco M8x 5g: ఆగస్టు 21న Poco M8x 5G ఫోన్ లాంచ్‌.. 7900mAh బ్యాటరీ, ఇతర ఫీచర్లు ఇవే!

Hyderabad, Telangana:

Poco M8x 5g Price: ఎప్పటినుంచో మంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా..ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే కొన్ని రోజుల తరబడి బ్యాకప్ బ్యాటరీని ఇచ్చే ఫోన్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ పోకో మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ ఫీచర్స్‌తో పాటు హెవీ బ్యాటరీ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా దీనిని కంపెనీ Poco M8x 5G స్మార్ట్‌ఫోన్‌ పేరుతో లాంచ్‌ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పుడు మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన ఫీచర్స్‌ ఏంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

7900mAh భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో అత్యంత ప్రధానమైన ఫీచర్ దీని బ్యాటరీగా భావించవచ్చు.. మార్కెట్‌లోకి విడుదల కాబోయే ఈ Poco M8x 5G మోడల్ ఏకంగా 7900mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గంటల తరబడి గేమింగ్ ఆడినా, సినిమాలు చూసినా, ఇంటర్నెట్ బ్రౌజ్ చేసినా ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే భయం ఉండదని త్వరలోనే కంపెనీ క్లైమ్‌ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్‌ కోసం 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.

అద్భుతమైన డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్..
ఈ Poco M8x 5G మొబైల్‌లో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 (Snapdragon 4 Gen 5 - 4nm) ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. భారీ గేమింగ్ సమయంలో మొబైల్ వేడెక్కకుండా ఉండేందుకు అద్భుతమైన ట్రిపుల్ కూలింగ్ సొల్యూషన్ (Thermal Management) కూడా కంపెనీ అందించిన్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి.. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో కంపెనీ 6.9-అంగుళాల భారీ ఐపీఎస్ ఎల్‌సీడీ (IPS LCD) డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి రానుంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

కెమెరా, ఓఎస్ ఫీచర్లు..
కెమెరా ప్రియుల కోసం.. ఈ ఫోన్ వెనుకభాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో కూడిన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.. అలాగే అద్భుతమైన సెల్ఫీలు, మంచి వీడియో కాల్స్ కోసం.. ఇందులోని ఫ్రంట్‌ భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత పోకో హైపర్ ఓఎస్ (Poco HyperOS) తో ఈ స్మార్ట్‌ఫోన్‌ చాలా అద్భుతంగా పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. 

ఇటీవలే అందుబాటులోకి వచ్చిన సమచారం ప్రకారం.. ఈ Poco M8x 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 21న భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. అన్ని ప్రీమియం ఫీచర్లు ఉన్నప్పటికీ.. బడ్జెట్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని దీని ధర కేవలం రూ.19,999కే లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..  

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Vivo నుంచి మరో పవర్‌ఫుల్ 5G ఫోన్.. 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, అదిరిపోయే లుక్స్!

Hyderabad, Telangana:

Vivo V80 Lite 5g Launching Soon: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అద్భుతమైన ముద్ర వేసుకున్న ప్రముఖ దిగ్గజం వివో మరో సంచలనానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోస్ట్ పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌తో అద్బుతమైన స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఇందులో అతి పెద్ద బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, వీవో కంపెనీ మోస్ట్ అవేటెడ్ Vivo V80 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది గత మోడల్స్‌ కంటే చాలా అద్భుతమైన డిజైన్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం లీక్‌ అయిన వివరాల ప్రకారం.. మొదట కంపెనీ Vivo V80 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా భారత మార్కెట్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గూగుల్ ప్లే కన్సోల్ (Google Play Console) లిస్టింగ్‌లో ఈ మోడల్ అందుబాటులోకి రావడం విశేషం. ఇందులో భాగంగా అనేక రకాల ఫీచర్స్‌ కూడా లీక్‌ అయ్యి అందుబాటులోకి వచ్చాయి..

అద్భుతమైన డిజైన్.. 
ప్రముఖ టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ Vivo V80 Lite 5G ఫోన్ ప్రీమియం మెటల్ ఫ్రేమ్‌తో పాటు చాలా అద్భుతమైన కర్వ్‌డ్ డిస్‌ప్లే డిజైన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో సెల్ఫీ కెమెరా కోసం ప్రత్యేకంగా హోల్-పంచ్ కటౌట్‌ను కూడా తీసుకు రాబోతోంది.. ముఖ్యంగా ఇందులో నీలం (Blue)తో పాటు తెలుపు (White) వంటి ప్రీమియం కలర్‌ ఆప్షన్స్‌లో యూజర్లను ఆకట్టుకునేలా ఇది రూపొందించిన్నట్లు తెలుస్తోంది.. 

ఇందులో కంపెనీ 6.83-అంగుళాల 1.5K అమోలెడ్ (AMOLED) డిస్ల్పేను అందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు వినియోగదారుడికి మైండ్‌బ్లోయింగ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను పక్కాగా అందిస్తాయని లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి..

కెమెరా క్వాలిటీకి పెట్టింది పేరైన Vivo.. ఈ ఫోన్‌లోనూ అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందించబోతున్నట్లు తెలుస్తోంది.. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు ఫ్రంట్‌ భాగంలో భాగంలో వీడియో కాలింగ్స్, సూపర్ సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతూ ఉన్నాయి..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఈ ఫోన్‌కు సంబంధించిన అతిపెద్ద హైలైట్ బ్యాటరీ భావించవచ్చు. ఇందులో ఏకంగా 7,050mAh భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు తెలుస్తోంది.. దీనితో పాటు అత్యంత ఫాస్ట్‌గా ఛార్జ్ అయ్యేందుకు 44W ఫ్లాష్‌ఛార్జ్ (FlashCharge) సపోర్ట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. దీనివల్ల ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే రోజులకు తరబడి బ్యాటరీ లైఫ్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇందులో అద్బుతమైన MediaTek Dimensity 7360 Turbo ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Ganesh Mandap: బండి సంజయ్‌ శుభవార్త.. గణేష్ మండపాలన్నింటికీ ఉచిత కరెంట్

Karimnagar, Telangana:

Free Electricity: వినాయక చవితి సందర్భంగా గణేశ్‌ మండపాలకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ప్రకటించారు. కరెంట్ ఛార్జీలన్నీ కరీంనగర్ కార్పొరేషన్ చెల్లించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. దాదాపు 2 వేల గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ సరఫరా చేయాలని చెప్పారు. ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బంది లేకుండా గణేశ్ మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉత్సాహంగా భక్తియుత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
కరీంనగర్‌లోని 21వ డివిజన్‌లో సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తనను గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు రూ.22 వేల కోట్ల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వాటిలో రూ.5 వేల కోట్లతో జాతీయ రహదారులను నిర్మించినట్లు వెల్లడించారు. ప్రతి గ్రామానికి రూ.5 లక్షల చొప్పు నిధులు ఇచ్చానని, రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో నిధులిచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తానని బండి సంజయ్‌ తెలిపారు.

తనను నమ్మి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీకి అప్పగించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు వంద రోజుల్లోనే రూ.840 కోట్ల యూసీఎఫ్ నిధులను తీసుకొచ్చినట్లు బండి సంజయ్‌ వివరించారు. ఇప్పటికే స్మార్ట్‌సిటీ పేరుతో రూ.940 కోట్ల నిధులు తెచ్చి కరీంనగర్‌ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. వరంగల్‌కు స్మార్ట్ సిటీ నిధులొచ్చినప్పటికీ అక్కడ అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. తనపై నమ్మకం ఉంచిన కరీంనగర్‌ను అభివృద్ధి, ఉత్సవాల నిర్వహణలో తెలుగు రాష్ట్రాల్లోనే అగ్రభాగాన ఉంచేందుకు తాను తన శక్తిమేర కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని.. ప్రస్తుతం అభివృద్ధి లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లంతా కలిసికట్లుగా ఉంటూ కరీంనగర్‌ను అభివృద్ధి చేసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కోరారు.

అంతకుముందు కరీంనగర్‌లోని 16వ డివిజన్ లక్ష్మీపూర్, మల్కాపూర్ కాలనీలో 15వ ఆర్ధిక సంఘం నిధులకు సంబంధించి రూ.15 లక్షల వ్యయంతో చేపట్టిన వాటర్ పైపులైన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కమిషనర్ ప్రపుల్ దేశాయ్, స్థానిక కార్పొరేటర్టులు తదితరులు ఉన్నారు.

0
0
Report

Viral Video: జామకాయలు కడగకుండా తింటున్నారా? ఈ వీడియో చూస్తే ఇక ముట్టుకోరు..

Hyderabad, Telangana:

 Instagram Guava Viral Video: మన ఆరోగ్యానికి పండ్లు ఎంత మంచివో.. మనందరికీ తెలుసు.. అందులో ఎక్కువగా చాలా మంది జామకాయలను ఇష్టపడి తింటూ ఉంటారు. అంతేకాకుండా చాలా మంది దీనిని పోషకాల గనిగా కూడా పిలుస్తూ ఉంటారు. అయితే, చాలా మంది ఇవి శరీరానికి చాలా మంచివని శుభ్రం చేయకుండా మరీ తింటూ ఉంటారు. ఇలా అనుకుని తింటే పప్పులో కాలేసినట్లేనని ఈ వీడియో నిరూపిస్తోంది.. సాధారణంగా మార్కెట్‌లో నుంచి కొనుకున్ని వచ్చిన పండ్లును తినేందుకు శుభ్రం చేసే క్రమలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక వెరైటీ వీడియో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.. తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో పూజా మహేశ్వరి (@the_denimgirl) అనే యువతి షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది... పూజకు జామకాయలను ఇంటికి తీసుకువచ్చిన్న ఆ యువతి.. జామకాలను కడిగేందుకు నీటిలో వేసింది. అంతే అక్కడ ఏం జరిగిందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

నీటిలో వేస్తే ఏం జరిగింది..?
రెండు గంటల తర్వాత జామకాయలను అలాగే ఉంచి చూడడగా.. ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది.. నీటిలో నానబెట్టిన జామకాయ పై పొర నుంచి నెమ్మదిగా చిన్న చిన్న పురుగులు బయటికి రావడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఆ పురుగులు చూడడానికి చాలా చిన్నవిగా, తెలుపు రంగులో ఉండడం మీరు క్లియర్‌గా చూడొచ్చు.. అయితే, ఈ పురుగులు చాలా చిన్నవిగా ఉండడం వల్ల కనిపించడం చాలా కష్టమైంది..

 
 
 
 
 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

అయితే, ఏమి తెలియని వారు.. కేవలం నీటిలో అలా కడిగేసి తినేస్తే.. అంతే సంగతి.. తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ నీటి ట్రిక్ (Water Trick) చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో.. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయ్యో.. ఇన్నాళ్లు ఇలాగే కడగకుండా ఎన్ని పురుగులను తినేశామో.. అంటూ కొందరు ఆందోళన పడుతూ కామెంట్లు పెడుతున్నారు.. మరికొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు.. ముఖ్యంగా వర్షాకాలంలో జామకాయలకు దూరంగా ఉండటమే మంచిది.. అని సలహా ఇస్తున్నారు. వర్షాకాలంలో పండ్లు తినే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report

12 Feet Long Girinagu: రెండు రోజుల్లో రెండు ఘటనలు.. అనకాపల్లి జిల్లాలో భారీ గిరినాగుల కలకలం

Sabbavaram, Andhra Pradesh:

Girinagu Snake: అటవీ ప్రాంతమైన అనకాపల్లి జిల్లాల్లో వరుసగా భారీ గిరినాగులు కలకలం సృష్టిస్తున్నాయి. అత్యంత పొడవైన.. తీవ్ర విషపూరితమైన భారీ గిరినాగులు వరుసగా రెండు రోజుల్లో రెండుసార్లు కనిపించాయి. చాలా ప్రమాదకరమైన గిరినాగులు జనావాసాల్లో కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వరుస సంఘటనలతో స్థానికులు భయపడుతుండగా.. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి భారీ పాములను బంధిస్తున్నారు.

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం గరిసింగి గ్రామంలో భారీ గిరినాగు ప్రజలను హడలెత్తించింది. గ్రామంలోని అద్దిపల్లి విశ్వేశ్వరావు, కరణం సత్యవతి ఇళ్ల గోడ సందులో సుమారు 13 అడుగుల భారీ గిరినాగు ప్రత్యక్షమైంది. ఉదయం ఇటుకలు తీయడానికి నివాసితులు ప్రయత్నాలు చేయగా అక్కడ బుసలు కొడుతూ భారీ గిరినాగు కంటపడడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చోడవరం అటవీ అధికారులకు సమాచారం అందించారు. తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులతోపాటు అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సమాచారం అందించారు.

వెంటనే తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులైన ప్రసాద్‌, కృష్ణ, ఇషాక్ అక్కడకు చేరుకుని భారీ గిరినాగును బంధించేందుకు తీవ్రంగా శ్రమించారు. పామును బయటకు తీయగా 12 అడుగుల పొడవు ఉండి బుసలు బుసలు కొడుతూ కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. దాదాపు గంట సేపు శ్రమించి ఎట్టకేలకు భారీ గిరినాగును బంధించారు. అనంతరం అక్కడి నుంచి తీసుకుని చీడికాడ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

మొన్న పశువుల పాక వద్ద
ఇదే జిల్లాలో ఈనెల 16వ తేదీన భారీ గిరినాగు కలకలం సృష్టించింది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం ఖండివరం గ్రామంలో ఓ పశువుల పాక వద్ద 13 అడుగుల భారీ గిరినాగు ప్రత్యక్షమైంది. ఆ పామును చూసిన స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. వెంటనే గ్రామస్తులు మాడుగులకు చెందిన స్నాక్‌ క్యాచర్‌ వెంకటేశ్‌కు సమాచారం ఇచ్చారు. అతడు గ్రామానికి చేరుకుని దాదాపు గంటన్నర పాటు శ్రమించి గిరినాగును బంధించాడు. ఆ పాము 13 అడుగుల పొడవు.. ఆరున్నర కిలోల బరువు ఉందని అతడు చెప్పాడు. అనంతరం ఆ పామును సురక్షితంగా సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

0
0
Report
Advertisement

Kavitha: రేవంత్ రెడ్డి రాక్షస రాజ్యం నడుస్తోంది.. ఏడుగురు అన్నదమ్ముల భూదోపిడీ: కవిత

Hyderabad, Telangana:

Revanth Reddy Seven Brothers: 'కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరికి  ఒకలా సామాజిక న్యాయం ఉంటుంది. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి ఏడుగురు అన్నదమ్ములపైనే చర్చ జరుగుతుంది. వాళ్లు అందరూ భూములను దొంగతనం చేస్తున్నారు. ఎక్కడ చూసినా కబ్జాలే' అని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాక్షస రాజ్యం నడుస్తోందని విమర్శించారు. సామాజిక న్యాయం అనేది ఎక్కడ ఉందని మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్‌ను ఓడగొట్టింది రేవంత్‌ రెడ్డి కదా? అని తెలిపారు. సామాజిక న్యాయం కూడా అనని రేవంత్‌ రెడ్డి సామాజిక న్యాయంపై మాట్లాడుతున్నారని.. ఆయనను ప్రజలు ఎవరూ నమ్మొద్దు అని విజ్ఞప్తి చేశారు. మంత్రివర్గంలో సామాజిక న్యాయం ఎక్కడ? ఇద్దరు బీసీలకు మంత్రి పదవులు ఇస్తే 33 శాతం అమలు జరిగినట్టా? అని నిలదీశారు. శివధర్ రెడ్డికి జీతం, వీహెచ్‌కు ఇచ్చిన ర్యాంక్ జీతం  ఎంత? ఎందుకు వ్యత్యాసం? అని ప్రశ్నించారు. ఆర్‌టీఐలో అగ్రవర్ణాలు వాళ్లు ఉన్నారు. రేవంత రెడ్డి చెప్పేది సామాజిక న్యాయం.. పాటించేది ఆటవిక న్యాయం అని విమర్శించారు. 

'రేవంత్ రెడ్డి రాక్షస రాజ్యం నడుస్తుంది. 30 వేల ఎకరాల అసైన్డ్ ల్యాండ్ లాక్కున్నారు. భూమి లేని పేద బిడ్డ కి భూమి దక్కాలి. తెలంగాణ సమాజంలో గుణాత్మక మార్పు రావాలంటే పేదలకు భూపంపిణీ జరగాల్సిందే. సామాజిక న్యాయం కోసం మే ప్రతిపాదిస్తున్న విప్లవాత్మక పథకం ‘భూలక్ష్మి’. భూమి లేని ప్రతి పేదింటి కుటుంబానికి ఎకరం భూమి అందించి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యం' అని కవిత ప్రకటించారు.

రెండేళ్లలో 5 లక్షల 96 వేల కోట్ల బడ్జెట్ పెడితే 56 శాతం ఉన్న బీసీల కోసం ఖర్చు చేసింది 0.999 శాతం మాత్రమేనని మాజీ ఎమ్మెల్సీ కవిత వివరించారు. ఇదేనా రేవంత్‌ రెడ్డి చెప్పిన సామాజిక న్యాయం? అని ప్రశ్నించారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top