జిల్లా మణికొండ పట్టణంలో పెద్ద పాము కనిపించింది
Manikonda, Telangana:రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల హిల్స్ కాలనీ రోడ్ నెం.4లో 12 అడుగుల పొడవున్న పాము కనిపించింది. 12 అడుగుల పామును చూసిన ప్రజలు వెంటనే భయాందోళనకు గురై పాము పట్టేవారికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేహ 12 అడుగుల పామును చాకచక్యంగా పట్టుకుంది.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
తులం బంగారం ధర ఎంత..? నేడు ఆగస్టు 8వ తేదీ శనివారం పసిడి ధరలు ఇవే..!!
Secunderabad, Telangana:Gold Rate Today: నేడు ఆగస్టు 8వ తేదీ శనివారం బంగారం, వెండి ధరలు చూస్తే.. 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ. 152,140. 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర రూ. 139,462. ఒక కిలోగ్రాము వెండి ధర రూ. 232,620 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లోని మార్పులే అని చెప్పవచ్చు. డాలర్ విలువ పెరగడం.. ప్రపంచవ్యాప్త డీ-డాలరైజేషన్ ప్రభావం బంగారం ధరలలో ఏకకాలంలో పెరుగుదలకు దారితీశాయి. సెంట్రల్ బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పుంజుకోవడానికి దారితీసింది. గత మూడు, నాలుగు రోజులుగా డాలర్ విలువను గమనిస్తే, అది క్రమంగా తగ్గుతూ వస్తోంది. మరోవైపు, రూపాయి విలువ పెరుగుతున్నట్లు గమనించవచ్చు. బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం, అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్సు బంగారం ధర 4,300డాలర్ల కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతుండటమే.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏం చెబుతోంది?
బంగారం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇటీవల బంగారం ధరలు తగ్గుతాయని ఒక అంచనాను జారీ చేసింది. బంగారం ధర సుమారుగా 37శాతం మేర తగ్గే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొనడం గమనార్హం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ బంగారం ధరలు తగ్గుతాయని అంచనా వేస్తుండగా, మరికొన్ని బ్రోకరేజ్ సంస్థలు కూడా బంగారం ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నాయి.
మరి మోతీలాల్ ఓస్వాల్ ఏమంటోంది?
ఇటీవల, మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ సంస్థ కూడా ఈ విషయంలో బంగారం ధరలు వాటి గరిష్ట స్థాయి నుండి సుమారుగా 7 నుండి 8శాతం మేర తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. గత ఏడాది బంగారం ధరలను పరిశీలిస్తే, జనవరిలో ఇది రూ. 1.83 లక్షల (సుమారు $1.50 లక్షలు) వద్ద సర్వకాలిక రికార్డు స్థాయికి చేరుకుంది. అప్పటి నుండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే, ఇప్పుడు బంగారం ధర మళ్లీ రూ. 1.50 లక్షల (సుమారు $1.50 లక్షలు) పైకి కదులుతోంది. ఈలోగా, పెరుగుతున్న ధరల దృష్ట్యా, రాబోయే శ్రావణ మాసంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముడి చమురు ధరల తగ్గుదల బంగారం ధరల పెరుగుదలకు కూడా దోహదపడిందని నిపుణులు అంటున్నారు.
Also Read: ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. గజిని కంటే దారుణం..ఏం అడిగినా.. ఆ మూడే సమాధానాలు..!!
Also Read:ఎస్బీఐలో 1,538 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇవే..!!
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
చేయూత పింఛన్లకు నేటి నుంచి దరఖాస్తులు.. అర్హతలు ఏంటంటే?
Hyderabad, Telangana:Telangana New Pension Eligibility: సామాజిక భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుండే కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణను చేపడుతోంది. ఆగస్టు 15న సుమారు 2.50 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను అధికారికంగా ప్రారంభిస్తారు. ప్రధానంగా ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, డయాలసిస్, ఫైలేరియా, థలసేమియా, హిమోఫీలియా వంటి సమస్యలతో బాధపడే వారికి పెన్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు.
కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ ఈ నెల నుండి నిరంతరంగా కొనసాగుతుంది కాబట్టి దీనికి ప్రత్యేక గడువు లేదు. ఆగస్టు 15 నుండి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందించనున్నట్లు ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క గతంలోనే ప్రకటించారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణిస్తే, వెంటనే వారి పేర్లను జాబితా నుండి తొలగించాలని, అలాగే స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
సామాజిక భద్రతను పటిష్టం చేసే క్రమంలో, పెన్షనర్ మరణిస్తే వారి భాగస్వామికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది ప్రభుత్వం. అలాగే దివ్యాంగులు, తలసేమియా బాధితుల కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించడంతో పాటు, భార్య లేదా భర్త మరణించిన వారికి తక్షణమే పెన్షన్ వర్తించేలా చర్యలు తీసుకున్నారు.
చేయూత పెన్షన్ కోసం అర్హతలు ఇలా ఉన్నాయి:
వితంతువులైతే భర్త మరణ ధృవీకరణ పత్రం సమర్పించాలి. విడాకులు పొందిన వారు లేదా కనీసం ఏడాది కాలంగా విడిగా ఉంటున్న ఒంటరి మహిళల విషయంలో తహశీల్దార్ విచారణ నివేదిక అవసరం. అవివాహిత ఒంటరి మహిళల వయస్సు 30 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. దివ్యాంగులకు 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండాలి. సదరం సర్టిఫికేట్ సమర్పించాలి. 50 ఏళ్లు పైబడిన చేనేత కార్మికులు సొసైటీ సభ్యత్వ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి.
తెలంగాణలో చేయూత పింఛన్ల ఆదాయ పరిమితి విషయానికి వస్తే, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల కంటే తక్కువ, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉండాలి. నాలుగు చక్రాల వాహనాలు, భారీ వాహనాలు లేదా మూడు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కారు.
Also Read: ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. గజిని కంటే దారుణం.. ఏం అడిగినా.. ఆ మూడే సమాధానాలు..!!
Also Read: BRS Party: పాలమూరు ప్రాంతానికి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ ఓ శని: బీఆర్ఎస్ పార్టీ
దరఖాస్తు విధానం..
ఇప్పటికే అప్లై చేసినవారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కేవలం సంబంధిత పంచాయతీ లేదా వార్డు అధికారుల ద్వారా ధ్రువీకరించుకుంటే సరిపోతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు చేయూత వెబ్సైట్ నుండి ఫారం డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసి సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు సమర్పించాలి. ఆగస్టు 15న ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలను ప్రకటించనుంది. కొత్త రేషన్ కార్డులు, సుమారు 1.50 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు, 2.50 లక్షల మందికి కొత్త పెన్షన్లతో పాటు, గిగ్ వర్కర్ల చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. అలాగే, వేతన కోతల నుండి రక్షణ కల్పించేందుకు సంక్షేమ బోర్డు సేవలను కూడా ప్రారంభించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఆగస్టు 15న బుధ-గురు యుతి దృష్టి యోగం.. 4 రాశుల వారికి లక్ ఛేంజ్, ధన వర్షం!
Hyderabad, Telangana:Mercury-jupiter Effect Telugu: జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు, గురుడు గ్రహాలను అత్యంత శుభ గ్రహాలుగా చెప్పుకుంటారు. బుధుడు బుద్ధి, వ్యాపారంతో పాటు అద్భుతమైన ఆలోచనలు, సంభాషణ నైపుణ్యానికి కారకుడిగా భావిస్తూ ఉంటారు.. గురు దేవుడు అదృష్టం, విద్యతో పాటు ధర్మం, ఆర్థిక సమృద్ధికి ప్రతీకగా చెప్పుకుంటారు.. ఈ రెండు శుభ గ్రహాల మధ్య అరుదైన, అత్యంత శక్తివంతమైన యుతి దృష్టి యోగం ఏర్పడబోతోంది.
ఆగస్టు 15 శనివారం సాయంత్రం 4:51 గంటలకు బుధుడుతో పాటు గురుడు ఒకరికొకరు 0 డిగ్రీల కోణంలోకి వచ్చి.. ఈ శక్తివంతమైన యోగాన్ని ఏర్పాటు చేస్తాయి. ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభంతో పాటు కెరీర్, వ్యాపారాల్లో ఊహించని పురోగతి లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా 4 రాశుల జాతకులు గోల్డెన్ పీరియడ్‌గా మారుతుంది. ఈ సమయంలో అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కలుగుతాయి..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి జాతకులకు ఈ యోగం బంపర్ ప్రయోజనాలను అందిస్తుంది. జీవితంలో సానుకూల మార్పులు మొదలవుతాయి. కుటుంబంతో సంతోషకరమైన సమయం ప్రారంభమవుతుంది. కీలకమైన నిర్ణయాలు సునాయాసంగా తీసుకుంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో పురోగతితో పాటు వ్యాపారంలో భారీ డీల్స్ కుదురి ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. నూతన ప్రాజెక్టులు చేతికి వచ్చి ఆర్థికంగా బలపడతారు.
వృషభ రాశి (Taurus)
బుధ-గురు యుతి దృష్టి యోగం వల్ల వృషభ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల సపోర్ట్ లభించి.. పెద్ద పదవులు పొందే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జీతం భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఇది సరైన సమయంగా మారుతుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి.. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
మీన రాశి (Pisces)
ఈ శక్తివంతమైన దృష్ట్యా యోగం వల్ల మీన రాశివారికి కష్టాలన్నీ తొలగిపోతాయి.. ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. వ్యాపార విస్తరించేవారికి నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయంగా మారుతుంది.. ఈ సమయంలో చేసే పెట్టుబడులు భవిష్యత్తులో భారీ లాభాలను అందిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతం పెంపు కూడా కనిపిస్తుంది. దీంతో పాటు కెరీర్ కొత్త మలుపు లభిస్తాయి.
మకర రాశి (Capricorn)
మకర రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగ రంగంలో ప్రమోషన్ దక్కే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యాపారవేత్తలకు ఈ సమయంలో భారీ ప్రాఫిట్ మార్జిన్ ఇచ్చే ప్రాజెక్టులను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు తగ్గి ధన నిల్వలు విపరీతంగా పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Tirumala: సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు.. టీటీడీ కీలక సమీక్ష
Tirupati, Andhra Pradesh:TTD Official Review On Tirumala Salakatla Brahmotsavams 2026 Watch VideoTirumala Darshan: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటులు ఆది, అశ్విన్ బాబు
Tirupati Urban, Andhra Pradesh:BRS Party: పాలమూరు ప్రాంతానికి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ ఓ శని: బీఆర్ఎస్ పార్టీ
Wanaparthy, Telangana:Mahabubnagar Water Projects: 'ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణాలో వరద వస్తుంది. జూరాలకు నుంచి 2 లక్షల 30 వేల క్యూసెక్కుల నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్నాయి. 160 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలో ఉన్నాయి. ఉన్న నీళ్లను వదిలిపెట్టి ఆకాశం నుంచి వచ్చే నీళ్ల కోసం వానయాగం చేయడం విడ్డూరం. కాలువల ద్వారా నీళ్లు ఇవ్వొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాల్సింది పోయి నీళ్లు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఏమిటి' అని ప్రశ్నించారు.
కృష్ణాలో నీళ్లు పొంగిపొర్లుతుంటే పంటలు వెయ్యకంఇ అనే కార్యక్రమం ప్రభుత్వం పెట్టుకుంది. 160 టీఎంసీలు శ్రీశైలంలో ఉంటే 45 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి అనడం ఏమిటి' అని ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిలదీశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టూ ఉన్న అధికారులు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్లు అందుకే అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన అధికారుల సలహాలు సూచనల ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నామని.. ప్రభుత్వానికి ఇష్టమైన వార్తలు రాయించి రైతాంగాన్ని మోసం చేస్తున్నారని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ నుంచి కుడి కాలువ నీళ్లు ఆపే దమ్ము ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉందా? అని సూటిగా ప్రశ్నించారు.
'పాలమూరు అల్లుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరుకు ఒక శని. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలమూరుకు ఒక శని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు అవుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో తట్టెడు మట్టి తియ్యలేదు' అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరుకు నీళ్లు ఇచ్చే ఆలోచన ఉందా.. బెల్లంతో పొడిచే ఆలోచన ఉందా చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.
'గతంలో కృష్ణాలో అతి తక్కువ నీళ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడుకుంది. ఎగువన వచ్చే వరదను ఆపుకునే అవకాశం కర్ణాటక రాష్ట్రానికి లేదు. 120 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఆల్మట్టి ఎప్పుడో నిండిపోయింది. 30 టీఎంసీల సామర్థ్యం ఉన్న నారాయణపూర్ ఎప్పుడో నిండిపోయింది. జూరాలకు వరద పోటెత్తింది ఉన్న నీళ్లను మనం వాడుకుంటే తప్పేం ఉంది' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, మంత్రి ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారని నిలదీశారు.
'నార్లపూర్ రిజర్వాయర్ నింపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. కల్వకుర్తి ఎత్తిపోత పథకం ద్వారా ఎదుల రిజర్వాయర్ నింపొచ్చు. ఏదుల నిండితే వట్టెం నింపుకోవొచ్చు. తక్షణమే కేఎల్ఐ జర్వాయర్ నింపాలిని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది' అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. వరి పంట తగ్గాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం లేదని చెప్పారు. కేఎల్ఐ మూడు పంపులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
IAS Officers: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు.. ఇదిగో జాబితా
Nuzendla, Andhra Pradesh:IAS And IFS Officers Transfer: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంలో భారీగా ఐఎఫ్ఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు స్థాన చలనం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు.. పోస్టింగ్‌లు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కీలకమైన శాఖలకు సంబంధించిన అధికారుల మార్పులు జరగడం ఆసక్తికరంగా మారింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎవరెవరు అధికారుల బదిలీ జరిగిందో తెలుసుకుందాం.
కీలకమైన పర్యాటకం, విద్య, రవాణా, ఆరోగ్యం, హౌసింగ్, విపత్తు నిర్వహణ, టీటీడీ తదితర శాఖల్లో ఏపీ ప్రభుత్వం కొత్త నియామకాలు చేపట్టింది. పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జె. శ్యామలరావు, రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా కోన శశిధర్‌ను నియమించారు. ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎం. శివ ప్రసాద్ బదిలీ చేశారు.
తెలంగాణ నుంచి బదిలీ అయిన ఆమ్రపాలి కాటాను బదిలీ చేయడం ఆసక్తికరం. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆమె స్థానంలో పట్టంశెట్టి రవి సుభాష్‌ను నియమించారు. ఏపీపీఎస్సీలో సీఈఓ, కార్యదర్శి పోస్టులకు కూడా అతడికి పూర్తి అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది.
రానున్న గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా సురేశ్ కుమార్‌ను, జాయింట్ స్పెషల్ ఆఫీసర్‌గా నారాయణ భరత్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. పురావస్తు, మ్యూజియంల కమిషనర్‌గా ముత్యాలరాజు రేవును బదిలీ అయ్యారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌తోపాటు నేషనల్ హెల్త్ మిషన్ ఎండీగా కేవీఎన్ చక్రధర బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హెప్సిబా రాణి కొర్లపాటిని నియమించగా.. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా పి. అరుణ్ బాబును నియమించింది.
బదిలీలు వీరికే..
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ -ప్రఖర్ జైన్
ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఎండీ గీతాంజలి శర్మ
డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌గా డైరెక్టర్ చేతన్ టీఎస్‌కు పూర్తి అదనపు బాధ్యతలు
టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (హెల్త్, ఎడ్యుకేషన్): డాక్టర్ ఏ శరత్ (రిటైర్డ్ అధికారి)
టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్: ప్రభల గోపీనాథ్
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పూర్తి అదనపు బాధ్యతలు: ఏఏఎల్ పద్మావతి
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్: ఎం. జయకృష్ణ
ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ: బి. సునీల్ కుమార్ రెడ్డి (ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు)
Harish Rao: 'సమ్మక్క సాగర్'కు అనుమతులు మంజూరు చేయాలి: జల్ శాఖ మంత్రికి హరీశ్ రావు లేఖ
Baddipadaga, Telangana:GRMB Meeting: తెలంగాణ నీటి ప్రాజెక్టుల అంశంపై కేంద్ర జల్‌శక్తి మంత్రికి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు లేఖ రాశారు. జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులు చేర్చడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్‌లు పొందిన తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించే అంశాన్ని చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశంపై జలశక్తి మంత్రికి, సెక్రటరీకి లేఖ రాశారు.
కేంద్రం ఇప్పటికే చట్టబద్ధంగా ఇచ్చిన అనుమతులను జీఆర్ఎంబీ సమీక్షించడం సరికాదని లేఖలో మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. అజెండాలో పేర్కొన్న అంశాలను ఉపసంహరించుకోవాలని.. పెండింగ్‌లో ఉన్న సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ అనుమతులను తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర న్యాయమైన నీటి హక్కులను కాపాడేందుకు ఏపీ పునర్విభజన చట్టం 2014, సెక్షన్ 85 కింద తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) జరగబోయే 18వ సమావేశం ఎజెండాలో పొందుపరిచిన అంశాలను తక్షణమే ఉపసంహరించుకునేలా ఆ బోర్డును ఆదేశించాలని మాజీ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని పలు భారీ సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పటికే మంజూరు చేసిన చట్టబద్ధమైన అనుమతులను మళ్లీ సమీక్షించేలా ఈ ఎజెండాను రూపొందించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదం కాదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, అత్యున్నత సంస్థల అధికారాలు, వాటి విశ్వసనీయతకు సంబంధించిన సున్నితమైన అంశమని స్పష్టం చేశారు.
ఏడు ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక, హైడ్రోలాజికల్, ఇంజనీరింగ్, పర్యావరణ, చట్టపరమైన అంశాలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూఎస్), జలశక్తి మంత్రిత్వ శాఖలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపిందని లేఖలో మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ అత్యున్నత సంస్థలు చట్టబద్ధంగా అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ నిర్ణయాలను మళ్లీ సమీక్షించే లేదా రద్దు చేసే అధికారం గోదావరి బోర్డు లాంటి కింది స్థాయి సంస్థకు ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు.
జలశక్తి మంత్రిత్వ శాఖ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను మళ్లీ సమీక్షించేందుకు జీఆర్ఎంబీకి అవకాశం ఇస్తే అది కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రాధాన్యతను తగ్గించినట్లు అవుతుందని లేఖలో మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోని కాళేశ్వరం, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి, ముక్తేశ్వరం, చనాక-కొరట, మోడికుంటవాగు, కడెం-గూడెం, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్టులకు సుదీర్ఘ ప్రక్రియ తర్వాతే అనుమతులు వచ్చాయని.. ఇప్పుడు వాటిని మళ్లీ సమీక్షించాలని ఎజెండాలో పెట్టడం సరికాదని ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఇచ్చిన అనుమతులను మళ్లీ సమీక్షించేలా అవకాశం ఇస్తే భవిష్యత్తులో జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ ఇచ్చే ప్రతి అనుమతిపైనా అనిశ్చితి ఏర్పడుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో సాగునీటి అభివృద్ధి కుంటుపడడంతోపాటు కోట్లాది మంది రైతుల జీవనోపాధి, తాగునీటి భద్రత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఈ అంశాలపై కేంద్ర మంత్రి తక్షణమే స్పందించి ఎజెండాలోని వివాదాస్పద అంశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులను గోదావరి బోర్డు మళ్లీ సమీక్షించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సమ్మక్క సాగర్, ఇతర పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రికి మాజీ మంత్రి హరీశ్ రావు కోరారు.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సంచలనం.. సజ్జనార్ ఎన్కౌంటర్ చేయిస్తానని బెదిరింపులు
Hyderabad, Telangana:Trainee IPS Uday Krishna Reddy: ఐపీఎస్ శిక్షణలో ఉన్న తోటి అధికారిణితో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వేధింపులకు పాల్పడిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ కమిషనర్ సజ్జనార్‌పై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది. తనను ఎన్కౌంటర్ చేయిస్తానని సజ్జనార్ కుటుంబసభ్యులను బెదిరింపులకు పాల్పడినట్లు పోలీస్ కస్టడీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పడం కలకలం రేపుతోంది.
అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ ముగిసింది. కస్టడీ ముగిసిన అనంతరం మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. నిన్న రాత్రి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించేందుకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు సీపీ సజ్జనార్ వెళ్లారు. అయితే విచారణ సమయంలో చాలా అభ్యంతరకర మాటలు మాట్లాడారని పోలీస్ కమిషనర్ సజ్జనార్‌పై ఉదయ్ కృష్ణారెడ్డి మెజిస్ట్రేట్‌కి ఫిర్యాదు చేశారు.
కస్టడీ సమయంలో విచారణ చేసిన ప్రతి పోలీసుపై ఉదయ్ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తున్నాడు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఫిర్యాదును మెజిస్ట్రేట్ తీసుకున్నారు. మెజిస్ట్రేట్ నుంచి అందరినీ న్యాయమూర్తి బయటకు పంపించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట బోరున విలపించారు. కమిషనర్ సజ్జనార్‌తో పాటు విచారణ చేసిన పోలీసులకి నోటీసు ఇవ్వాలంటూ మెజిస్ట్రేట్‌కి ఉదయ్ కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. తనను ఎన్కౌంటర్ చేస్తానని కుటుంబసభ్యులను బెదిరించినట్లు ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరాలు లేని చోట విచారణ చేసినట్లు ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోపించారు. రిటైర్డ్ ఏసీపీ పూర్ణచంద్రారావు విచారణలో ఎలా పాల్గొంటాడంటూ అడ్వకేట్ ప్రశ్నించారు. అడ్వకేట్లను కూడా చంపేస్తామని బెదిరించినట్లు ఉదయ్ కృష్ణారెడ్డి అడ్వకేట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకొని వెళ్లి టార్చర్ చేసినట్టు ఉదయ్ కృష్ణారెడ్డి వివరించారు. 13 మంది తెలుగు ట్రైనీ ఐపీఎస్‌లు ఉన్నారని వారి జీవితాలు కూడా నాశనం చేస్తామని బెదిరించినట్లు కోర్టుకి తెలిపారు. ఈ సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డి అత్తాపూర్ ఇన్స్పెక్టర్కి షోకాజ్ నోటీసు ఇచ్చారు. సీసీ టీవీ కెమెరాలు లేని చోట ఎలా విచారణ చేశారని న్యాయస్థానం ప్రశ్నించింది. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మెజిస్ట్రేట్ తెలిపారు.
EWS కటాఫ్ మార్కులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్టూడెంట్స్ JAC పోరుబాట!
Hyderabad, Telangana:EWS Reservation Demands: ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని EWS స్టూడెంట్స్ JAC డిమాండ్ చేసింది. శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం చారిత్రక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు.. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ.. భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
పోలీసు ఉద్యోగాల నియామకాలలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రిలిమినరీ కటాఫ్ మార్కులను 60 నుంచి 50కి తగ్గించాలని అన్నారు.. సిటిఈటి (CTET), టిఈటి (TET) పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అర్హత మార్కులను 90 నుంచి 75కు తగ్గించాలని కోరారు.. జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఇతర రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వర్తింపజేస్తున్నట్లే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పూర్తిగా అందజేయాలి. దేశవ్యాప్తంగా సాగుతున్న రిజర్వేషన్ హటావో ఆందోళన్‌కు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ జేఏసీ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆయా రంగాల్లో సరైన అవకాశాలు రావాలంటే వ్యవస్థలో సమగ్ర మార్పులు అవసరమని వారు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ జేఏసీ వ్యవస్థాపకుడు నల్లమద్ది శివారెడ్డి మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని వాపోయారన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎదురవుతున్న సాంకేతిక, నిబంధనల చిక్కులను తొలగించి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఊరట నివ్వాలని కోరారు. ప్రభుత్వం మా డిమాండ్లపై వెంటనే స్పందించకపోతే, వచ్చే రోజుల్లో ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేది లేదని తేల్చిచెప్పారు.
Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala Brahmotsavam: టీటీడీ కీలక సమీక్ష.. కనీవినీ ఎరుగని రీతిలో తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Salakatla Brahmotsavams 2026: తిరుమలలో అంగరంగ వైభవంగా జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేయనుంది. ఉత్సవాల నిర్వహణపై టీటీడీ శుక్రవారం సమీక్ష చేసింది. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను టీటీడీ ఆదేశించింది.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ యంత్రాంగం ముమ్మరంగా సన్నాహాలు ప్రారంభించింది. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జేఈవో డాక్టర్ శరత్, సీవీఎస్ఓ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి అన్ని శాఖల ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచడం, పార్కింగ్ నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడం, చిన్నారుల భద్రత కోసం చైల్డ్ ట్యాగ్ల పంపిణీ, విద్యుత్ వ్యవస్థలపై నిరంతర పర్యవేక్షణ, అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని టీటీడీ అధికారులు అధికార యంత్రాంగానికి ఆదేశించింది. గరుడసేవ, చక్రస్నానం రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో ఆదేశించారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లో దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన కళాబృందాలతోపాటు సింగపూర్, జర్మనీ దేశాల కళాబృందాలు కూడా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుపతి జేఈవో డాక్టర్ శరత్ తెలిపారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు..
తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీ నటులు ఆది, అశ్విన్ బాబు, సంగీత దర్శకుడు తమన్, సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ శ్రీవారి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు పొందడం తమకు ఆనందంగా ఉందని.. దేశ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని సినీ నటులు ప్రార్థించినట్లు తెలిపారు.
రూ. 470 కోట్ల అప్పు ఎలా తీరింది?.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై BRS ప్రజెంటేషన్!
Hyderabad, Telangana:Mla Prem Sagar Rao News: మంచిర్యాల జిల్లాలో స్థానిక కన్వెన్షన్ హాల్ వేదికగా BRS నాయకులు విసిరిన డాక్యుమెంటరీ ఆస్ట్రాన్ దెబ్బకు అధికార కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆర్థిక ముసుగులు తొలగిస్తూ.. ఆయన అక్రమ సంపాదనల చిట్టాను ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా BRS నేత నడిపల్లి విజిత్ రావు విశ్లేషించిన తీరు ప్రజలను, రాజకీయ శ్రేణులను ఆశ్చర్యపరిచేలా చేస్తోంది..
ఈ మైండ్ బ్లాకింగ్ కార్యక్రమానికి BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై.. సభను ఉద్దేశించి ప్రసంగించారు. శాసనసభ్యుడిగా గెలిచిన కేవలం రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రేమ్ సాగర్ రావు దాదాపు 470 కోట్ల రూపాయల భారీ బ్యాంకు రుణాలను ఏ విధంగా చెల్లించారో చెప్పాలని RSP నిలదీశారు.
మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీ విధానాలపై విరుచుకుపడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఈ భారీ మనీ లాండరింగ్‌పై వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులతో లోతైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. లిక్కర్ మాఫియా, విచ్చలవిడి ఇసుక దందా, పేదల భూమి కబ్జాలు, గ్యాంగ్ వార్లతో పాటు చివరికి ఐటీ హబ్ పేరుతో సాగిన నయా దోపిడీలన్నీ ఈ భారీ మనీ లాండరింగ్‌కు మూలాలని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ముఖ్యంగా, ఎమ్మెల్యే PSR ఒప్పందం కుదుర్చుకున్న ఉర్మిక కంపెనీ.. దక్కన్ కంపెనీల వెనుక ఉన్న ఆర్థిక క్రయవిక్రయాల వ్యవహారాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ.470 కోట్ల రుణాలను మంజూరు చేసిన బ్యాంకుల తీరుపై కూడా ఈడీ, సీబీఐ విచారణ జరిపి అసలు సూత్రధారులను బయటకు తీయాలన్నారు.
Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
ఈ సందర్భంగా RS ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో చట్టం తన రూపురేఖలను కోల్పోయి ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాఫియా డాన్లు షాడో ఎమ్మెల్యేలుగా మారి నియోజకవర్గాలను శాసిస్తున్నారని విమర్శించారు. మంచిర్యాల ప్రస్తుతం KGF సినిమా తరహా మాఫియా సామ్రాజ్యాన్ని తలపిస్తోందని.. నియోజకవర్గ వనరులను దోచుకుంటున్న MLA పిఎస్ఆర్ పేరును దేశంలోనే ప్రముఖ ఆర్థిక నేరస్థుల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రూ.11 లక్షల IT ఉద్యోగానికి గుడ్ బై.. నీళ్ల వ్యాపారంతో ఏడాదికి రూ.28.5 లక్షల సంపాదన!
Hyderabad, Telangana:Leaving 11 Lpa Corporate Job To Earning 28.5 Lakhs: నేటి యువతలో చాలామంది లక్షల జీతాలొచ్చే కార్పొరేట్ ఉద్యోగాల కోసం నగరాలకు వెళ్లిపోతున్నారు. కానీ, కొందరు మాత్రం ఆ AC గదుల ఉద్యోగాలను.. 9 టు 5 రోటీన్ జీవితాన్ని వదిలి సొంతంగా ఏదైనా సాధించాలని అనుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఆలోచనే ఓ యువకుడి జీవితాన్ని మలుపు తిప్పింది.. బెంగళూరులో రూ. 11 LPA ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని.. తన సొంత ఊరిలోనే వాటర్ ప్యూరిఫికేషన్ వ్యాపారం ప్రారంభించి.. ప్రతి నెలా లక్షల్లో ఆర్జిస్తున్న ఒక యువకుడి స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..
ఎక్స్ ప్లాట్ఫామ్లో అంకిత్ పాండే అనే యూజర్ తన స్నేహితుడి సక్సెస్ స్టోరీని నెటిజన్లతో పంచుకున్నారు. ఆ యువకుడు బెంగళూరులో మంచి జీతమొచ్చే.. ఉద్యోగం చేస్తున్నప్పటికీ.. ప్రమోషన్ల వెంట పడకుండా.. తన సొంత ఊరికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ప్రజల నిత్యవసర అవసరమైన సురక్షితమైన తాగునీరు అందించే అద్భుతమైన వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. తన సొంత స్థలంలోనే ఒక వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాడు.
ప్రస్తుతం ఆ యువకుడు తన ప్లాంట్ నుంచి సుమారు 300 ఇళ్లతో పాటు స్థానిక దుకాణాలకు ఫ్యూరిఫైర్ చేసిన డ్రింకింగ్ వాటర్ సరఫరా చేస్తున్నాడు. రోజుకు సగటున 300 నీళ్ల క్యాన్లను అమ్ముతున్నాడు. ఒక్కో క్యాన్ ధర రూ.30 చొప్పున ఉండగా.. రోజు తన రూ. 9,000 వరకు సంపాదించుతున్నాడు. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.2.70 లక్షల వరకు అవుతుంది.
ఇక ఖర్చుల విషయానికొస్తే.. నీటిని ఫ్యూరిఫై చేసేందుకు, కరెంట్ బిల్లుల కోసం నెలకు రూ.15,000 అవుతుందని.. ట్రాన్స్‌పోర్టేషన్ కోసం రూ.20,000 ఖర్చవుతాయి. సొంత స్థలంలోనే ప్లాంట్ ఉండటం వల్ల అద్దె ఖర్చులు అసలు లేవు.. ఖర్చులు అన్ని పోనూ.. ప్రతి నెలా రూ.2.35 లక్షల వరకు మిగులుతుంది. అంటే ఏడాదికి సుమారు రూ.28.5 లక్షల వరకు సంపాదించుతున్నాడు.
He installed a water purification plant on his own property and connected… pic.twitter.com/uY3mfTd0d3
— Ankit Pandey (@iamankitpande) August 3, 2026
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వేలాది మంది స్పందించారు. నగరాల్లో ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేయడం కంటే.. డిమాండ్ ఉండే చిన్న వ్యాపారాలు ప్రారంభించడమే.. మంచిదని పలువురు అభిప్రాయపడ్డారు. సొంత ఊరిలో.. కుటుంబంతో ఉంటూనే.. ఇంతటి లాభాలు పొందడం గొప్ప విషయమని ప్రశంసించారు. అయితే, వ్యాపార విజయం అనేది మీ ప్రాంతంతో పాటు పెట్టుబడి, స్థానిక డిమాండ్ పై ఆధారపడి ఉంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sunrisers Hyderabad Captain: కావ్యా మారన్ సూపర్ ప్లాన్..రాబోయే ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ కెప్టెన్ ఇతనే!
Hyderabad, Telangana:Sunrisers Hyderabad New Captain: ఐపీఎల్ 2026 సీజన్లో అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), వచ్చే 2027 టోర్నీ కోసం ఇప్పనుంచే కీలక ప్రణాళికలు రచిస్తోంది. ఆరెంజ్ ఆర్మీని మళ్లీ ఛాంపియన్‌గా నిలపాలన్న కసితో ఉన్న ఫ్రాంచైజీ యాజమాన్యం, జట్టు పగ్గాలను యువ వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ చేతికి అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ప్యాట్ కమిన్స్ గైర్హాజరీకి అసలు కారణం?
సన్‌రైజర్స్‌ను అద్భుతంగా నడిపించిన ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంపై ఎలాంటి సందేహాలు లేవు. అయితే భవిష్యత్తు షెడ్యూల్ ఆయనకు సవాలుగా మారనుంది. 2027లో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్, ఆ వెనువెంటనే వన్డే వరల్డ్ కప్ టోర్నీలు ఉండటంతో.. ఆస్ట్రేలియా దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లపై కమిన్స్ పూర్తిగా దృష్టి సారించనున్నారు.
ఈ బిజీ షెడ్యూల్ కారణంగా కమిన్స్ ఐపీఎల్ 2027 సీజన్‌కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. గత సీజన్లోనూ ఆయన గైర్హాజరీలో తొలి విడత మ్యాచ్‌లకు ఇషాన్ కిషన్ సారథ్యం వహించిన విషయం గమనార్హం.
ఇషాన్ కిషన్ వైపే కావ్య మారన్ మొగ్గు
వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ఎస్ఆర్హెచ్ పూర్తిస్థాయి (ఫుల్‌టైమ్) కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను ఖరారు చేయాలని కావ్య మారన్ అండ్ కో భావిస్తోంది. గతంలో ఇషాన్ నాయకత్వంలో ఎస్ఆర్హెచ్ 7 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలు నమోదు చేసింది. కేవలం తన బ్యాటింగ్ పవర్‌తోనే కాకుండా, మైదానంలో ఒత్తిడిని జయించి జట్టును నడిపించిన తీరు యాజమాన్యాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. జట్టులో కొందరు సీనియర్ల పేర్లు రేసులో ఉన్నప్పటికీ, లాంగ్‌టర్మ్ విజన్‌తో మేనేజ్మెంట్ ఇషాన్ వైపే సుముఖంగా ఉంది.
డిసెంబర్లో అధికారిక ప్రకటన?
2024లో ఎస్ఆర్హెచ్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్యాట్ కమిన్స్ హయాంలో జట్టు అద్భుతమైన విజయాలను సాధించింది. 2025లో ఆరో స్థానంలో నిలిచిన ఆరెంజ్ ఆర్మీ, 2026లో మూడో స్థానంతో మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. ఈ కెప్టెన్ మార్పునకు సంబంధించిన అధికారిక ప్రకటనను డిసెంబర్లో వెలువరించే అవకాశం ఉంది.
Also Read; కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట..ఒకే రోజు 8 స్వర్ణ పతకాలు..భారత్ ఖాతాలో 39
Also REad: కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతం..నీరజ్ చోప్రాకు రజతం..యశ్వీర్ సింగ్‌కు కాంస్య పతకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
వామ్మె.. సముద్రంలా ఎగసిపడుతున్న బావిలో నీరు.. వీడియో..
Hyderabad, Telangana:Gujarat Well Waves Video: సముద్రంలో కెరటాలు ఎగసిపడటం సహజమే.. కానీ, ఊరి చివర ఉన్న చిన్న బావిలో సముద్రం తరహాలో ఉవ్వెత్తున అలలు వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి అరుదైన, ఊహించని ఘటనే గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో వెలుగుచూసిందంటే నమ్ముతారా? అవును మీరు చదువుతుంది నిజమే.. గత నాలుగు రోజులుగా ఓ బావిలోని నీరు దానంతటదే కెరటాలలా ఎగసిపడుతుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. దీనిని చూసేందుకు చాలా మంది అక్కడికి చేరుకుంటున్నారు. వారు ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మోర్బీ జిల్లా వీర్పర్డా గ్రామాని దగ్గరలోనే నేషనల్ హైవే పక్కన దాదాపు 18 అడుగుల లోతు ఉన్న ఒక పాత బావి ఉంది. గత కొన్ని రోజులుగా ఈ బావిలోని నీరు సాధారణంగా ఉండకుండా.. సముద్రపు కెరటాల మాదిరిగా అలలు అలలుగా ఊగిపోతోంది. రెండు రోజుల క్రితం మొదటిసారి ఈ వింతను గమనించిన గ్రామస్తులు.. మొదట్లో కాసేపటికి శాంతిస్తుందని భావించారు. కానీ, మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మళ్లీ నీటిలో మార్పులు వచ్చి.. కదులడంతో ఆశ్చర్యపోయారు.
బావిలో నీరు వింతగా అటు ఇటు ఊగుతూ ఉండగా.. చూసిన కొందరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో విపరీతంగా వైరల్ అవ్వడం మొదలైంది.. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఈ దృశ్యాన్ని చూడటానికి తరలి రావడం కూడా ప్రారంభించారు. మరికొందరు స్థానికులు దీనిని దేవుడి మహిమగా భావిస్తూ బావి వద్ద పూజలు కూడా చేస్తూ ఉన్నారు..
🚨MYSTERIOUS WELL BAFFLES GUJARAT VILLAGERS
pic.twitter.com/cBa32uv79g— The Tatva (@thetatvaindia) August 7, 2026
మోర్బీ ప్రాంతం భూకంప తీవ్రత ఎక్కువగా ఉండే.. సీస్మిక్ జోన్ (Seismic Zone) పరిధిలోకి వస్తుందని అధికారులు తెలిపారు. దాంతో భూగర్భంలో ఏదైనా చలనం రావడం వల్ల లేదా భూకంప సంకేతాల వల్లే ఇలా నీరు అలలలా మారుతోందేమోనని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగంతో పాటు భూగర్భ శాస్త్రవేత్తలు వెంటనే రంగంలోకి దిగారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
