Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajanna Sircilla505302

వేములవాడలో వన మహోత్సవం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు

Jul 22, 2024 18:58:55
Vemulawada, Telangana

వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో జరిగిన వన మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అంతరించిపోతున్న అడవులను రక్షించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Jan 29, 2026 15:15:38
Dhoolmitta, Telangana:

Snake vs Dog: జీవ ప్రపంచంలో ఒక జీవితో మరో జీవికి పడదు. దానికి మానవులు కూడా అతీతం కాదు. మానవుల విషయం పక్కనపెడితే పాములకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఉంటాయి. పాములు పగబట్టడంలో.. తమ జాతి పాములతోనే పోరాడే పాములు ఇక వేరే జాతి జంతువులతో కూడా శత్రుత్వం కొనసాగిస్తాయి. వాటిలో పాము, ముంగిస ఒకటీ కాగా.. రెండోది పాము, కుక్క. ప్రస్తుతం ఒక వీడియో వైరల్‌గా మారింది. పాము, కుక్క కలిసి రెండూ కొన్ని నిమిషాల పాటు పోరాటం చేశాయి. చివరకు కుక్క పైచేయి సాధించింది. పామును చంపేసి యజమాని కుటుంబాన్ని కాపాడింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ధూళిమిట్టలో ఈ సంఘటన జరగ్గా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Gold Prices: బడ్జెట్‌లో కేంద్రం సంచలన నిర్ణయం? రూ.లక్షలోపు దిగిరానున్న బంగారం ధర

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ధూళిమిట్టలో బడుగు సాయిలు అనే వ్యక్తి ఇంటి ఆవరణలోకి నాగుపాము వచ్చింది. పాము వచ్చి బుసలు కొట్టడంతో ఆ కుటుంబం తీవ్ర భయాందోళన చెందింది. పాము రావడంతో ఏం చేయాలో పాలుపోకపోవడంతో చుట్టుపక్కల ఉన్న వారు కూడా వచ్చారు. ఆ పాము కాటు వేయకుండా బయటకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే వారు పెంచుకుంటున్న కుక్క పాముపై ప్రతాపం చూపించింది.

Also Read: Prices Decrease: భారత్‌ చారిత్రక ఒప్పందం.. లిక్కర్‌, నూనెల ధరలు అమాంతం తగ్గుముఖం

అందరూ బెదిరించడంతో ప్రాణభయంతో ఆ నాగుపాము ఇంటి గోడ పక్కన ఉన్న రంధ్రంలోకి వెళ్లింది. అయితే పెంపుడు కుక్క ఇది గమనించి పామును తోక పట్టుకుని బయటకు లాగింది. బయటకు లాగిన నాగుపాముతో కుక్క పోట్లాడింది. అటు మనుషులు, ఇటు కుక్క దెబ్బకు పాము ఎటు పోలేని పరిస్థితి. ప్రాణభయంతో పారిపోతుండగా కుక్క పట్టుకుని వచ్చి యుద్ధం చేసింది. దీంతో ప్రాణం పోతున్నా ఆ పాము కుక్కతో హోరాహోరీగా పోరాడింది. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడిన ఆ పాము కుక్క దెబ్బకు ప్రాణం విడిచింది. వెంటాడి వేటాడి ప్రాణం పోయేంత వరకు పాముతో  కుక్క పోరాటం చేసింది.

Also Read: Medaram Jatara: మేడారం జన జాతర.. 2 రోజుల్లో 80 లక్షల మంది భక్తుల రాక

ఈ పాము, కుక్క పోరాటాన్ని ఆ కుటుంబసభ్యులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. యజమాని కుటుంబాన్ని పాము బారి నుంచి కుక్క కాపాడడం ఆసక్తికరంగా మారింది. మనుషులపై కుక్క చూపించే విశ్వాసానికి మరో ప్రత్యక్ష ఉదాహరణ ఈ సంఘటన. పాము, కుక్క కొట్లాడే వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఇన్నాళ్లు పాము, ముంగిస పోరాటం చూశాం కానీ పాము, కుక్క కొట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో మీరు కూడా చూసేయండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 29, 2026 13:05:07
Nunna, Vijayawada, Andhra Pradesh:

YS Jagan vs YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించిన పాదయాత్రపై రాజకీయాలు వేడెక్కగా.. పాదయాత్ర చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే తన సోదరుడు, వైఎస్సార్‌సీపీ అధినేతపై చెల్లెలు వైఎస్‌ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. తన అన్న ప్రకటించిన పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర ఎందుకు? అని సూటిగా ప్రశ్నించారు. అధికారం ఇస్తే ఏం చేశారని నిలదీశారు. స్వార్థం తగ్గి మంచితనం పెరగాలని సూచించారు.

Also Read: Traffic Challan: ట్రాఫిక్‌ చలాన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐదు చలాన్లు దాటితే లైసెన్స్‌ రద్దు

ఇటీవల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్‌ చేసిన పాదయాత్రపై కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. 'జగన్ పాదయాత్ర ఎందుకు? అధికారం కోసమే కదా ఈ పాట్లు? అధికారం ఇస్తే ఏం చేశారు?' అని ప్రశ్నించారు. 'వైఎస్సార్‌ జలయజ్ఞం పూర్తి చేయగలిగారా? నవరత్నాల్లో పెట్టిన హామీలకు దిక్కులేదు. అధికారంలో వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు. అధికారం ఇస్తే ఎందుకు పూర్తి చేయలేదు?' అని నిలదీశారు.

Also Read: Prices Decrease: భారత్‌ చారిత్రక ఒప్పందం.. లిక్కర్‌, నూనెల ధరలు అమాంతం తగ్గుముఖం

'మద్యనిషేధం అన్నాడు. అధికారం ఇస్తే కల్తీ మద్యం పెట్టి క్యాష్ పద్ధతిలో మద్య మాఫియా చేశాడు. రుషికొండ వేల ఏళ్ల నుంచి నిలబడ్డ కొండ. రుషికొండను బోడి గుండు చేశాడు. అధికారం ఇస్తే ఒక్క రోజు కూడా బయటకు రాలేదు. ఆ పార్టీ వాళ్లకే అందుబాటులో లేడు' అని తన సోదరుడు జగన్‌పై వైఎస్‌ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు 6 నెలల ముందు బయటకు వచ్చి సిద్ధం అంటూ కొన్ని నెలలు తిరిగారు తప్పిస్తే ఒకరోజు అయినా ప్రజల కోసం బయటకు వచ్చారా? అని ప్రశ్నించారు.

Also Read: Gold Prices: బడ్జెట్‌లో కేంద్రం సంచలన నిర్ణయం? రూ.లక్షలోపు దిగిరానున్న బంగారం ధర

'అబ్రహం లింకన్ ఒక మాట అన్నాడు. ఒక మనిషి నిజమైన నైజం తెలియాలి అంటే అధికారం ఇచ్చి చూడండి అన్నాడు. మనం జగన్‌ని అధికారంలో చూశాం. జగన్‌కి అధికారం సూట్ అవ్వలేదు. జగన్‌కు పవర్ సూట్ అవ్వలేదు' అని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల విమర్శలు చేశారు. 'జగన్ నేచర్ మారాలి. జగన్ నైజం మారాలి. జగన్‌లో మార్పు రావాలి. జగన్‌లో స్వార్థం తగ్గి మంచితనం పెరగాలి' అని హితవు పలికారు. 'అప్పుడు దేవుడు అధికారం ఇస్తాడేమో? అంతవరకు దేవుడు ప్రజలు ఆశీర్వదించడు' అని పేర్కొన్నారు. ఏడాదిన్నర తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడు అనౌన్స్ ఎందుకు? చిత్తశుద్ధి లేని యాత్రలు ఎందుకు? అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 29, 2026 12:36:24
Hyderabad, Telangana:

Railway Ticket Discount For Senior Citizens: ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026-27 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు (వృద్ధులకు) రైల్వే ప్రయాణాల్లో ఊరటనిచ్చేలా కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కరోనా సమయంలో నిలిపివేసిన రైల్వే కన్సెషన్లను (Railway Concessions) మళ్లీ ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది. దీనిపై ఆర్థిక శాఖ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎవరికి ఎంత రాయితీ?
పాత నిబంధనల ప్రకారం.. ఈ పథకం అమల్లోకి వస్తే సీనియర్ సిటిజన్లకు ఈ క్రింది విధంగా ప్రయోజనం చేకూరుతుంది. 

మహిళలు (58 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరపై 50 శాతం రాయితీ.
పురుషులు (60 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరపై 40 శాతం రాయితీ.

అన్ని తరగతులకు వర్తింపు
కేవలం సాధారణ స్లీపర్ క్లాస్ మాత్రమే కాకుండా, ఏసీ కోచ్‌లలో (1st AC, 2nd AC, 3rd AC) కూడా ఈ రాయితీ లభించే అవకాశం ఉంది. ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు 'సీనియర్ సిటిజన్' ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఈ తగ్గింపును పొందవచ్చు.

ఎందుకు నిలిపివేశారు?
మార్చి 2020లో కరోనా మహమ్మారి కారణంగా రైల్వే ఆదాయం దెబ్బతినడంతో, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఈ రాయితీలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీనివల్ల ప్రతి ఏటా రైల్వే శాఖకు సుమారు రూ.1,600 నుంచి రూ.2,000 కోట్ల వరకు ఆదా అవుతోంది. అయితే, ప్రస్తుతం రైల్వే ఆదాయం పెరగడం, వృద్ధుల నుంచి వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని దీనిని పునరుద్ధరించాలని నిర్ణయించారు.

బడ్జెట్‌పై ఆశలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బ్యాంకు డిపాజిట్లపై అధిక వడ్డీ వంటి ప్రయోజనాలు పొందుతున్న సీనియర్ సిటిజన్లకు, ఇది అదనపు బూస్ట్‌ను ఇస్తుంది.

Also REad: BSNL 1 Rupee Offer: BSNL బంపర్ ఆఫర్..కేవలం రూ.1కే అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా..మరికొద్ది రోజుల్లో మాత్రమే!

Also REad: Google Data Center Vizag: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు..రూ.83 వేల కోట్ల పెట్టుబడికి రంగం సిద్ధం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 29, 2026 11:50:11
Hyderabad, Telangana:

Elephant Jumping Video Watch Here: సోషల్ మీడియాలో నిత్యం వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.. నెటిజన్స్ ఎక్కువగా ఇలాంటి వీడియోలు చూసేందుకు మాత్రమే ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇందులో భాగంగా కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు తరచుగా ఇలాంటి వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వినియోగదారులను విస్మయానికి గురి చేస్తోంది. ఈ వీడియోలో ఏనుగు ఒక భవనం పై నుంచి అదుపుతప్పి కారుపై దూకుతున్న దృశ్యాలు కళ్లకు కట్టినట్లు చూడొచ్చు. అయితే, ఇది ఎక్కడ జరిగింది? ఏనుగు ఇలా దూకడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఒక భారీ జనావాస ప్రాంతంలో ఇరుకైన వీధిలో ఇంటి పైకప్పు పై ఒక పెద్ద ఏనుగు కనిపించడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ భవనం శిథిలావస్థలో ఉండడం.. చెక్కలు, రేకులాంటి నిర్మాణంపై ఏనుగు నిలబడి ఉండడం మీకు కనిపిస్తుంది. అయితే, ఆ పాత భవనం ఏనుగు బరువు తట్టుకోలేక కూలిపోయేందుకు దగ్గరగా ఉన్నట్లు మీరు చూడొచ్చు. ఇదే సమయంలో ఏనుగు దానిపై నిలకడ కోల్పోయి.. నేరుగా రోడ్డుపై ఆగి ఉన్న ఒక కారుపై దూకడం మీరు చూడొచ్చు.

అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్రజలంతా అదే వీధుల్లో ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా ఆ ఏనుగు కారుపై పడగానే భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల వారంతా.. వెనక్కి వెళ్ళండి.. వెనక్కి వెళ్ళండి అంటూ అరవడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. దీంతో చాలామంది అక్కడి నుంచి పారిపోవడం కూడా మీరు గమనించవచ్చు. అయితే ఆ ఏనుగు పైనుంచి దూకడంతో కొద్దిగా గాయాలైనట్లు తెలుస్తోంది. దూకిన వెంటనే ఆ ఏనుగు అక్కడి నుంచి పరుగులు పెట్టేందుకు ప్రయత్నించడం కూడా మీరు చూడొచ్చు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

ఈ వీడియోలో ఏనుగు పరిస్థితి ఏంటి అంటే.. పైనుంచి దూకిన ఏనుగు వెంటనే లేచి నిలబడడంతో గాయాలు కొద్దిగానే అయినట్లు తెలుస్తోంది. అలాగే అదృష్టవశాత్తూ ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. ఈ ఘటనను అక్కడున్న కొంతమంది తమ మొబైల్లో చిత్రీకరించి పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం.. ఇది నిజమైన వీడియో కాదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిందని కామెంట్లు చేస్తున్నారు. అవును మీరు కూడా క్లియర్ గా గమనించి ఈ వీడియోని చూస్తే.. ఇది ఒక ఏఐ వీడియోగా అనిపిస్తుంది. అలాగే ఫ్యాట్ చెక్ చేసి చూడగా.. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వీడియో గా తేలింది.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 29, 2026 11:40:19
Wadgaon, Maharashtra:

Liquor And Wine Prices: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశంలో అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి.. బంగారం, వెండి అయితే అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. అయితే బడ్జెట్‌కు ముందే ఓ కీలక పరిణామం జరిగింది. భారత్‌, యూరోపియన్‌ యూనియన్‌ మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందంగా పరిగణిస్తుండగా.. ఈ ఒప్పందంతో ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేస్తుందని.. చాలా వాటి ధరలు తగ్గుముఖం పడతాయని తెలుస్తోంది.

Also Read: Gold Prices: బడ్జెట్‌లో కేంద్రం సంచలన నిర్ణయం? రూ.లక్షలోపు దిగిరానున్న బంగారం ధర

ఈయూతో భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో ఈయూ నుంచి భారత్‌కు వచ్చే వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒప్పందంతో దేశంలోనే పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయని.. యూరోపియన్ యూనియన్‌తో చేసుకున్న కీలక వాణిజ్య ఒప్పందం ఎంతో దోహదం చేస్తుందని తెలుస్తోంది.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం.. పీఆర్‌సీ, ఈపీఎఫ్‌, డీఏ కోసం పోరాటం

ఈ ఒప్పందంపై నరేంద్ర మోదీ స్పందిస్తూ.. 'ఇది చారిత్రాత్మక నిర్ణయం. ఇదొక పెద్ద డీల్‌' అని తెలిపారు. ఈ ఒప్పందంతో రెండు దేశాలకు ప్రయోజనం జరగనుందని.. ఇది ఆరంభం మాత్రమేనని ప్రధాని వెల్లడించారు. రెండు దేశాల మధ్య వ్యూహత్మాక సంబంధాలు బలోపేతమవుతాయని చెప్పారు. అయితే ఈయూతో చేసుకున్న ఈ ఒప్పందంతో భారత్‌లో వివిధ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా భారతదేశంలో కొన్ని వస్తువుల ధరలు తగ్గుతున్నాయని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ధరలు తగ్గే జాబితాలో కార్లు, మద్యం ప్రధానంగా ఉన్నాయి. బీర్, విస్కీ, వోడ్కా, వైన్‌తోపాటు నూనె ధరలు (ఆలివ్ ఆయిల్, కూరగాయల నూనె) తగ్గుతాయని తెలుస్తోంది. కివీస్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్ వంటి ధరలు తగ్గే అవాకశం ఉంది. ఈయూ దేశాల నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు భారీగా తగ్గే అకాశాలు ఉన్నాయి.

Also Read: Traffic Challan: ట్రాఫిక్‌ చలాన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐదు చలాన్లు దాటితే లైసెన్స్‌ రద్దు

ఈయూ నుంచి దిగుమతి చేసుకునే 96.6 శాతం వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండకపోవడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. దీంతోపాటు ఈయూకి భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై కూడా సుంకాలు తగ్గుతాయి. 96.6 శాతం సుంకాలను తొలగిస్తామని యూరోపియన్ యూనియన్ తెలిపింది.

వీటిపై తగ్గనున్న సుంకాలు
స్పిరిట్‌లపై 40 శాతం సుంకాలు
అఫ్టికల్, సర్జికల్, మెడికల్ పరికరాలపై 90 శాతం సుంకాలు
భారత్‌ నుంచి వెళ్లే ఈయూ విమానాలు, అంతరిక్ష నౌక ఎగుమతులపై సుంకాల తొలగింపు
యంత్రాలు 44 శాతం
రసాయనాలు 22 శాతం
ఔషధాలు 11 శాతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 29, 2026 11:38:02
Hyderabad, Telangana:

Leopard Latest video: సామాన్యంగా మానవులు పులిని చూస్తేనే గజ గజ మునిగిపోతూ ఉంటారు.. అలాంటిది ఏకంగా ఓ అత్యంత ప్రమాదకరమైన చిరుత పులి తోక పట్టుకొని.. అది ఇతరులపై దాడి చేయకుండా గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పోలీస్ అధికారి సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా ఎంతో నైపుణ్యం ఉన్నవారు ఇలా సులభంగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎలాంటి నైపుణ్యం లేని ఒక పోలీస్ ఆఫీసర్ ఆ పులిని పట్టుకుంటున్న తీరును చూస్తుంటే అతనికున్న ధైర్యం అంతో ఇంతో కాదని అనిపిస్తోంది. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో? ఎక్కడ జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. అయితే, ఇది ఎక్కడ జరిగిందనేది వీడియోలు పేర్కొనలేదు. కానీ ఓ నివాస ప్రాంతంలో అకస్మాత్తుగా ప్రవేశించిన చిరుత పులి స్థానికులను ఎంతగానో భయాందోళనకు గురి చేస్తోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులతో పాటు అడవిశాఖ సిబ్బంది అధికారులు అక్కడికి వెంటనే చేరుకున్నారు.. అయితే ఈ సమయంలో వారు ఎంతో యాక్టివ్ గా ఉన్న ఆ చిరుత పులిని బంధించాలనుకున్నారు. ఈ సమయంలో ఒక పోలీస్ అధికారి తన ధైర్యాన్ని ఒక్కసారిగా పెంచుకొని.. చిరుత పులి తప్పించుకొని పారిపోతున్న సమయంలో దాని తోకను గట్టిగా పట్టుకున్నాడు.

ఆ అధికారి ఎంతో చాకచక్యంగా చిరుత పులి తోకను పట్టుకోవడం చూసిన ఇతర అధికారులు ఒక్కసారిగా కంగు తిన్నారు. అయితే, ఈ సమయంలో ఆ చిరుత పులి పోలీస్ అధికారిపై ఎదురు దాడి చేయడం కూడా మీరు చూడొచ్చు.. అయినప్పటికీ ఆ పోలీస్ ఆఫీసర్ ఏమాత్రం వదలకుండా చిరుత పులి తోకను అలాగే పట్టుకొని ఉండిపోయాడు.. అయితే, అక్కడున్న కొంతమంది రోప్ సిధం సార్ అని అరుస్తూ ఉండడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా అక్కడున్న పోలీస్ ఆఫీసర్ అందరూ వెనక్కి వెళ్లిపోండి అంటూ అరవడం మీరు చూడొచ్చు..

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

చివరికి అడవి శాఖ సిబ్బందితోపాటు ఇతరులు కలిసి ఆ చిరుత పులిని ఎంతో సురక్షితంగా తాళ్లతో బంధించి.. అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎనిమిది సెకండ్ల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజమైన హీరో అంటే ఇతనే అనే క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు.. చాలామంది ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా సృష్టించిందని కామెంట్లు చేస్తున్నారు. అవును మీరు ఈ వీడియోను క్లియర్‌గా గమనించి చూస్తే.. ఇదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అని తెలుస్తుంది.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 29, 2026 11:27:36
Hyderabad, Telangana:

BSNL 1 Rupee Offer Last Date: బీఎస్ఎన్ఎల్ (BSNL) మొబైల్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన గమనిక. తక్కువ ధరకే అదనపు డేటాను అందించే పలు అద్భుతమైన ఆఫర్లకు గడువు ముగియబోతోంది. పాత ధరకే ఎక్కువ డేటా ప్రయోజనం పొందాలనుకునే వారు జనవరి 31, 2026 లోపు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రైవేట్ టెలికాం సంస్థలకు పోటీగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ల ద్వారా రోజువారీ డేటా పరిమితిని పెంచారు. అయితే ఈ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది.

అదనపు డేటా లభించే ప్లాన్లు 
ఈ క్రింది ప్లాన్లలో గతంలో కంటే రోజుకు 0.5GB డేటా అదనంగా లభిస్తుంది.

ప్లాన్ ధర ప్రస్తుత డేటా (రోజుకు) పాత డేటా (రోజుకు) వ్యాలిడిటీ
₹225 3GB 2.5GB 30 రోజులు
₹347 2.5GB 2GB 50 రోజులు
₹485 2.5GB 2GB 72 రోజులు
₹2399 2.5GB 2GB 365 రోజులు

గమనిక: అన్ని ప్లాన్లలోనూ అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు ఉచితం. డేటా పరిమితి ముగిశాక ఇంటర్నెట్ వేగం 40Kbpsకి తగ్గుతుంది.

సెన్సేషనల్ ₹1 ప్లాన్ (కొత్త కస్టమర్లకు మాత్రమే)
కొత్తగా బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకునే వారికి ఈ ఆఫర్ ఒక వరం. ఈ రీఛార్జ్ ద్వారా రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, 100 SMSలు.. 30 రోజుల వ్యాలిడిటీతో రానున్నాయి.  ఈ ప్లాన్‌తో పాటు ఉచిత సిమ్ కార్డ్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ కూడా జనవరి 31 తో ముగియనుంది.

₹251 స్పెషల్ ప్లాన్ (100GB డేటా)
ఎక్కువ డేటా అవసరమయ్యే వారి కోసం ఈ ప్లాన్ తీసుకొచ్చారు. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలతో పాటు ఏకమొత్తంగా 100GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దీంతో పాటు ఉచిత BiTV సబ్‌స్క్రిప్షన్. రోజుకు కేవలం ₹8.36 మాత్రం గానే ఉంది.

బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ అదనపు డేటా, ప్రత్యేక ప్లాన్ల ప్రయోజనం పొందాలంటే వినియోగదారులు ఫిబ్రవరి 1 లోపు తమ మొబైల్స్ రీఛార్జ్ చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Also Read: Google Data Center Vizag: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు..రూ.83 వేల కోట్ల పెట్టుబడికి రంగం సిద్ధం!

Also Read: Google Data Center Vizag: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు..రూ.83 వేల కోట్ల పెట్టుబడికి రంగం సిద్ధం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 29, 2026 10:51:09
Mumbai, Maharashtra:

Gold Price Will Great Fall: బంగారం మాట అంటేనే మండే పరిస్థితులు ఉన్నాయి. బంగారం ధర చూసి ఇప్పుడు మహిళలు తమ ఇంట్లో వారిని కొనమని అడితే పరిస్థితి లేదు. ఎందుకంటే భారీ స్థాయిలో బంగారం ధరలు పెరిగిపోతుండడం.. దానికితోడు వెండి కూడా అదే స్థాయిలో పెరిగిపోతుండడంతో మహిళలు కూడా బంగారం, వెండిపై మమకారాన్ని చంపేసుకుంటున్నారు. అయితే ఈ ధరలు ఇప్పట్లో తగ్గవా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించబోతుందని చర్చ జరుగుతోంది. కీలక నిర్ణయాలు తీసుకుంటే బంగారం రూ.లక్ష లోపు చేరుతుందని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Traffic Challan: ట్రాఫిక్‌ చలాన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐదు చలాన్లు దాటితే లైసెన్స్‌ రద్దు

కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై ప్రజల్లో భారీగా ఆశలు ఉన్నాయి. బడ్జెట్‌ నుంచి తమకు ఏం లభిస్తాయోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బంగారంపై కూడా కేంద్రం తీపి కబురు వినిపించబోతుందని వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం, జీఎస్టీ తగ్గిస్తే బంగారం ధర అమాంతం పడిపోతుందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం.. పీఆర్‌సీ, ఈపీఎఫ్‌, డీఏ కోసం పోరాటం

అమెరికా డాలర్ బలహీనంగా ఉండడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిస్తుందనే అంచనాలు ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ పరిణామాలు ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో పెట్టుబడిదారులు తమ సురక్షితమైన పెట్టుబడిగా బంగారం, వెండి అని భావిస్తున్నారు. దీంతో బంగారం, వెండి ధరలు రోజురోజుకు వేలకు వేలు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుడికి అందనంత దూరంలోకి చేరుకున్నాయి. ప్రస్తుతం తులం బంగారం దాదాపు రూ.1.65 లక్షలకు చేరుకుంటోంది. వెండి అయితే కిలో రూ.4 లక్షలు దాటేసింది.

Also Rad: Telangana PRC: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..పీఆర్సీ అమలుపై ఆశలు గల్లంతు..ఎప్పటికి వచ్చే?!

కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న బంగారం, వెండి ధరలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో బంగారం, వెండిపై తీపి కబురు ఇవ్వాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. బంగారం ధరను ప్రభావితం చేసే దిగుమతి సుంకాలు, జీఎస్టీ రేట్లను తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అందరి విజ్ఞప్తితోపాటు దేశంలో బంగారం మార్కెట్‌కు ఊరటనిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

విదేశాల నుంచి భారతదేశం అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. బంగారంపై విధించే దిగుమతి సుంకాల ప్రభావం ధరలపై ఉంటుంది. రానున్న బడ్జెట్‌లో బంగారంపై విధించే దిగుమతి సుంకాన్ని తగ్గించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. సుంకాలను తగ్గిస్తే బంగారం ధరలు కాస్త తగ్గే అవకావం ఉంది. సుంకాలు తగ్గిస్తే రిటైల్ మార్కెట్ పెరగడమే కాకుండా తయారీ రంగం కూడా అభివృద్ది చెందుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 

బంగారాన్ని పెట్టుబడిగా భావిస్తుండడంతో సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని తిరిగి తీసుకురావాలనే డిమాండ్‌ వస్తోంది. 2024లో ఈ పథకం నిలిపివేయగా తిరిగి పునరుద్దరించాలనే డిమాండ్లు వస్తున్నాయి. బంగారం అభరణాలపై ఉన్న 3 శాతం జీఎస్టీని తగ్గించాలని మహిళలు కోరుతున్నారు. 1.25 లేదా 1.5 శాతం జీఎస్టీ తగ్గించాలనే కోరుతుండగా.. అలా తగ్గిస్తే బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉంది. దిగుమతి సుంకాలు తగ్గించడం, జీఎస్టీ తగ్గించడం చేస్తే మాత్రం దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతాయి. మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు ఇస్తుందో వేచి చూడాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 29, 2026 10:22:21
Visakhapatnam, Andhra Pradesh:

Google Data Center Vizag Foundation: విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారే దిశలో మరో భారీ అడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ (Google) తన డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖను వేదికగా చేసుకుంది. దీనికి సంబంధించి ఫిబ్రవరిలో శంకుస్థాపన జరగనుందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగ చరిత్రలో విశాఖపట్నం కేంద్రంగా ఒక భారీ పారిశ్రామిక విప్లవం మొదలుకాబోతోంది. గూగుల్‌తో పాటు బెంగళూరుకు చెందిన ఆర్‌ఎంజడ్‌ (RMZ) కార్పొరేషన్ కూడా ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

గూగుల్ డేటా సెంటర్ - కీలక వివరాలు
వేదిక: ఆనందపురం మండలం, తర్లువాడ పరిసర ప్రాంతాలు.
భూమి: సుమారు 308 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెంటర్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఏపీఐఐసీ (APIIC) ద్వారా భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ పూర్తయింది.
పరిహారం: భూమి సేకరించిన 51 మంది రైతులలో 49 మందికి ఇప్పటికే నగదు జమ చేశారు. మిగిలిన ఇద్దరికీ త్వరలోనే చెల్లింపులు పూర్తి చేయనున్నారు.
మౌలిక సదుపాయాలు: డేటా సెంటర్లకు నీటి సరఫరా అత్యంత కీలకం. దీనికోసం జీవీఎంసీ (GVMC) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

ఆర్‌ఎంజడ్‌ (RMZ) కార్పొరేషన్ భారీ ప్రాజెక్టు
దావోస్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఆర్‌ఎంజడ్‌ గ్రూపు ఏపీలో రూ.83,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. విశాఖలో ఒక గిగావాట్ సామర్థ్యం గల భారీ డేటా సెంటర్‌ను వీరు నిర్మించనున్నారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (GCC) మొదటి దశలో 50 ఎకరాల్లో గ్లోబల్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు భూములను పరిశీలిస్తున్నారు. ఆనందపురం మండలం జగన్నాథపురం, విజయనగరం పరిసరాలు, కాపులుప్పాడ ఐటీ లేఅవుట్‌లను అధికారులు ప్రతిపాదించారు.

ఈ భారీ కంపెనీల రాకతో విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఐటీ మ్యాప్‌లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకోనుంది. వేల సంఖ్యలో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఇంజనీర్లకు ఉపాధి దొరకనుంది. డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో విశాఖ కీలక కేంద్రంగా మారుతుంది.

ఫిబ్రవరిలో జరగబోయే శంకుస్థాపన కార్యక్రమం విశాఖ ఐటీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలవనుంది. సింహాచలం భూముల కేటాయింపు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న వెంటనే పనులు వేగవంతం కానున్నాయి.

Also Read: School Holiday: రేపు శుక్రవారం అన్నీ స్కూళ్లకు సెలవు..ఆదేశాలు జారీ చేసిన జిల్లా యంత్రాంగం..విద్యార్థులకు పండగే!

Also Read: Skipping Rope Benefits: ఉదయాన్నే కేవలం 15 నిమిషాల ఈ పని చేస్తే చాలు..పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మంచులా కరిగిపోతుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 29, 2026 09:57:13
Hyderabad, Telangana:

Employees JAC Protest: మాయ మాటలతో నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వేతన సవరణ సంఘంతోపాటు ఈపీఎఫ్‌ జీపీఎఫ్‌, డీఏ, పెండింగ్‌ బిల్లులపై రేవంత్ రెడ్డి తీరని మోసం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిరసనకు దిగారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో రెండు రోజులుగా పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మింట్‌ కాంపౌండ్‌లో చేస్తున్న భారీ నిరసనపై పూర్తి వివరాలు ఇవే.

Also Rad: Telangana PRC: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..పీఆర్సీ అమలుపై ఆశలు గల్లంతు..ఎప్పటికి వచ్చే?!

మింట్ కాంపౌంట్‌లో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ ఫోరం ఆధ్వర్యంలో  మహా ధర్నా జరుగుతోంది. విద్యుత్ సంస్థల యాజమాన్యాల వైఖరికి నిరసనగా ధర్నా చేస్తున్నారు. బదిలీల పాలసీపై యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కమిటీ వేయాలని.. ఈపీఎఫ్ టు జీపీఎఫ్, అరిజన్ల గ్రెడ్ మార్పు చేయాలని విద్యుత్‌ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సాయిబాబా ప్రసంగిస్తూ.. 'బదిలీల విషయంలో సిబ్బంది సమస్యలు పరిగణలోకి తీసుకోవాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కను కోరాం. యాజమాన్యం మొండి వైఖరిగా వ్యవహరిస్తోంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మహా ధర్నా తలపెట్టాం' అని వివరించారు. తాము చేసే డిమాండ్లతో యాజమాన్యంపై ఎలాంటి భారం పడదని స్పష్టం చేశారు.

Also Read: Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి

జేఏసీ మరో నాయకుడు శివాజీ మాట్లాడుతూ.. 'కేవలం ఎస్పీడీసీఎల్ పరిధిలో 10 వేల మందికి పైగా మహా ధర్నాకు తరలివచ్చారు. ఐఏఎస్ అధికారులు, ఉద్యోగులు సిబ్బంది, ప్రభుత్వం పక్షాన ఉండాలి కానీ వారు ఆ విషయాలనే పట్టించుకోవడం లేదు. సీఎండీ ప్రవర్తన జేఏసీ నేతలకు ఆందోళన కలిగించింది. సమస్యల పరిష్కారం కోసం స్పందించాలని కోరితే స్పందించడం లేదు. ఎస్పీడీసీఎల్ సీఎండీ అహంకారపూరిత వ్యవహారశైలితో వ్యవహరిస్తున్నారు' అని ఆరోపించారు. ఉద్యోగస్తులను, ఉద్యోగ సంఘాల నేతలను బానిసలుగా, ఆర్టిజన్‌లను కట్టు బానిసలుగా చూస్తున్నారని విమర్శించారు. 'సీఎండీ నేను నా ఇష్టం అన్న చందంగా వ్యవరిస్తున్నారు. ఎస్పీడీసీఎల్‌లో ఆంధ్రా ఆధిపత్యం కొనసాగుతుంది' అని సంచలన ఆరోపణలు చేశారు.

Also Read: Traffic Challan: ట్రాఫిక్‌ చలాన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐదు చలాన్లు దాటితే లైసెన్స్‌ రద్దు

'సాధారణ బదిలీల పై యాజమాన్యానికి రెండు జేఏసీలు వినతిపత్రం ఇచ్చాయి. అన్ని సమస్యల పరిష్కారాల కోసం పనిచేస్తాం. బదిలీ పాలసీ అనేది చిన్న సమస్య ఆత్మగౌరవ సమస్య. కష్టపడి పని చేయడానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ మా గౌరవాన్ని తగ్గించొద్దు. మా కష్టఫలితంగానే సంస్థ మనుగడ సాధిస్తోంది. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలతో చర్చలు చేయాలి'
- రత్నాకర్ రావు, విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నాయకుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 29, 2026 09:36:53
Medaram, Telangana:

Medaram School Holidays 2026: మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణలో విద్యాసంస్థల సెలవులపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. ఈ విషయంలో ములుగు జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం జాతర ఉత్సవాలు ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది.

ములుగు జిల్లాకు స్థానిక సెలవు..
జనవరి 30, 2026 (శుక్రవారం) నాడు ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు జిల్లా కలెక్టర్ స్థానిక సెలవు (Local Holiday) ప్రకటించారు. మేడారంలో అమ్మవార్లు గద్దెలపైకి చేరుకునే ప్రధాన ఘట్టం దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు.

రీప్లేస్‌మెంట్ వర్కింగ్ డే..
ఈ సెలవును భర్తీ చేయడానికి, ఫిబ్రవరి 14, 2026 (రెండో శనివారం) నాడు ములుగు జిల్లాలో విద్యాసంస్థలు, కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్త సెలవుపై స్పష్టత..
ప్రస్తుతం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నప్పటికీ, ప్రభుత్వం రాష్ట్రవ్యాప్త సెలవును ప్రకటించలేదు. కేవలం ములుగు జిల్లాకు మాత్రమే ప్రస్తుతానికి అధికారికంగా సెలవు ఉంది. పాత వరంగల్ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో (హన్మకొండ, వరంగల్ వంటివి) స్థానిక పరిస్థితులను బట్టి సెలవులు ఉండవచ్చని సమాచారం.

విద్యార్థులు తమ పాఠశాలలు లేదా కళాశాలల యాజమాన్యాన్ని సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని సూచించడమైనది.

జాతర విశేషాలు
జనవరి 28న ప్రారంభమైన ఈ మహా జాతర జనవరి 31 వరకు కొనసాగుతుంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుండి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు పోలీసు, రవాణా శాఖలు భారీ ఏర్పాట్లు చేశాయి.

ముఖ్య గమనిక: ఈ సెలవు కేవలం ములుగు జిల్లా పరిధిలో మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన జిల్లాల్లో విద్యాసంస్థలు సాధారణం గానే పనిచేస్తాయి.

Also Read: EPFO Wage Ceiling: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..కనీస జీతం రూ.25,000కి పెంపు? బడ్జెట్‌లో భారీ ప్రయోజనం!

ALso REad: Gold Price Collapse: బంగారం ప్రియులకు డేంజర్ బెల్..అమాంతం పడిపోయే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లు జాగ్రత్త!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 29, 2026 09:16:00
Hyderabad, Telangana:

Snake Gave Birth To Baby Snake Video News: మనం తరచుగా చూసే పాములు గుడ్ల ద్వారా మాత్రమే పిల్లలకు జన్మనిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు అడవి ప్రాంతాల్లో మనం అప్పుడప్పుడు పాములకు సంబంధించిన గుడ్లను చూస్తూ ఉంటాం.. అలాగే కొన్ని సందర్భాల్లో అప్పుడే గుడ్లలో నుంచి వచ్చిన పిల్లలను కూడా చూస్తాం.. నిజానికి కొన్ని పాములు గుడ్ల ద్వారా పిల్లలకు జన్మనిస్తే.. మరికొన్ని నేరుగా ఇస్తాయి. ఇలా అరుదైన జాతులు మాత్రమే కలిగి ఉంటాయని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. అయితే మీరు ఎప్పుడైనా నేరుగా పిల్లలకు జన్మనిచ్చే పాములను చూశారా? చూడకపోతే ఈ వీడియో మీకోసమే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో నేరుగా పిల్లలకు జన్మనిస్తున్న ఓ పాముకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.. అంతేకాదండోయ్ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అయిపోతున్నారు. పాములకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి చాలామంది ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే, తాజాగా పాము తన పిల్లలకు జన్మనిస్తున్న వీడియోకు ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించింది. 

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ పాము నడిరోడ్డుపై నెమ్మదిగా కదులుతూ కనిపించడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో ఆ పాము ఎంతో ఇబ్బంది పడుతూ పిల్లలకు జన్మనివ్వడం మీరు క్లియర్‌గా చూడొచ్చు. అయితే ఈ పిల్లలు కూడా పాము తోక వెనక భాగం నుంచి బయటికి రావడం మీరు గమనించవచ్చు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది ప్రత్యక్ష సాక్షులు తమ స్మార్ట్ ఫోన్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అప్పటినుంచి ఇప్పటివరకు విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. చాలామంది ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోతున్నారు. 

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

ముఖ్యంగా పాములంటే ఆసక్తి ఉన్న చాలామంది.. ఈ వీడియో చూసిన తర్వాత గూగుల్ లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి, ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రస్తుతం ఈ పాము కు సంబంధించిన వీడియో ను దాదాపు 2.74 కోట్ల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఒక లక్ష మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. దీన్ని బట్టి చూస్తే.. ఈ వీడియో ఎంత వైరల్ అయిందనేది మీరే ఊహించవచ్చు. జనాలు కూడా ఇలాంటి పాములకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోలు విపరీతంగా చూస్తున్నారు. 

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 29, 2026 08:08:44
Hyderabad, Telangana:

Health Benefits of Skipping Rope: ఆధునిక జీవనశైలిలో సమయం దొరకక వ్యాయామానికి దూరమవుతున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి కోసం ఆరోగ్య నిపుణులు ఒక అద్భుతమైన మార్గాన్ని సూచిస్తున్నారు. కేవలం 15 నిమిషాల స్కిప్పింగ్ (తాడు ఆట) మీ శరీరంలో మంచులా పేరుకుపోయిన కొవ్వును కరిగించడమే కాకుండా, మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్కిప్పింగ్ అనేది కేవలం చిన్న పిల్లల ఆట మాత్రమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లు అనుసరించే అత్యంత శక్తివంతమైన వర్కవుట్.

బరువు తగ్గడానికి బెస్ట్ ఆప్షన్..
త్వరగా బరువు తగ్గాలనుకునే వారికి స్కిప్పింగ్ ఒక వరం. ఇది తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది. 15 నిమిషాల స్కిప్పింగ్ వల్ల శరీర మెటబాలిజం పెరిగి, కొవ్వు వేగంగా కరుగుతుంది.

గుండెకు రక్షణ..
ఇది ఒక గొప్ప కార్డియో వ్యాయామం. క్రమం తప్పకుండా స్కిప్పింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, గుండె కండరాలు దృఢంగా మారుతాయి. తద్వారా గుండెపోటు, అధిక రక్తపోటు (High BP) ముప్పు తప్పుతుంది.

దృఢమైన ఎముకలు..
స్కిప్పింగ్ చేసేటప్పుడు కాళ్లు, తొడలు, భుజాలపై ఒత్తిడి పడి కండరాలు బలోపేతం అవుతాయి. ఇది ఎముకల సాంద్రతను పెంచి, భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

డయాబెటిస్ నియంత్రణ & గాఢ నిద్ర..
రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి స్కిప్పింగ్ తోడ్పడుతుంది. అలాగే రోజంతా చురుగ్గా ఉంచి, రాత్రిపూట శరీరం త్వరగా విశ్రాంతి స్థితిలోకి వెళ్లి గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది.

ఒత్తిడికి చెక్..
వ్యాయామం చేసేటప్పుడు మెదడులో ఎండార్ఫిన్లు (Endorphins) అనే 'ఫీల్ గుడ్' హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఇది సహకరిస్తుంది.

గమనిక: మోకాళ్ల నొప్పులు లేదా తీవ్రమైన వెన్నునొప్పి ఉన్నవారు నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే స్కిప్పింగ్ ప్రారంభించాలి. స్కిప్పింగ్ చేసేటప్పుడు మంచి స్పోర్ట్స్ షూస్ ధరించడం వల్ల పాదాలపై ఒత్తిడి తగ్గుతుంది.

Also Read: EPFO Wage Ceiling: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..కనీస జీతం రూ.25,000కి పెంపు? బడ్జెట్‌లో భారీ ప్రయోజనం!

Also Read: Gold Price Collapse: బంగారం ప్రియులకు డేంజర్ బెల్..అమాంతం పడిపోయే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లు జాగ్రత్త!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 29, 2026 06:45:58
Hyderabad, Telangana:

EPFO Wage Ceiling Hike 2026: ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. 2014 నుండి స్థిరంగా ఉన్న EPFO (ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) వేతన పరిమితిని పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మార్పు వల్ల కోట్లాది మంది ఉద్యోగుల సామాజిక భద్రత, పదవీ విరమణ నిధి గణనీయంగా పెరగనుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, ఉద్యోగుల పీఎఫ్ (PF), పెన్షన్ (EPS) లెక్కల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి.

వేతన పరిమితి పెంపు అంచనా
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ఓ వేతన సీలింగ్ నెలకు రూ.15,000 గా ఉంది. దీనిని ఇప్పుడు రూ.25,000 కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. చివరిసారిగా 2014 సెప్టెంబర్ 1న ఈ పరిమితిని రూ.6,500 నుండి రూ.15,000కి పెంచారు. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సవరణకు మోక్షం కలగనుంది.

వేతన పరిమితి (Salary Ceiling) అంటే ఏమిటి?
వేతన పరిమితి అనేది ఈపీఎఫ్ఓ పథకంలో తప్పనిసరిగా చేరాల్సిన ఉద్యోగుల జీతపు స్థాయిని సూచిస్తుంది. ప్రస్తుత నియమం ప్రకారం.. నెలకు రూ.15,000 వరకు ప్రాథమిక వేతనం (Basic Pay) ఉన్న ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఈపీఎఫ్ఓలో సభ్యుడిగా ఉండాలి. ఆ పైన జీతం ఉన్నవారు స్వచ్ఛందంగా చేరవచ్చు.

ప్రస్తుత కాలంలో నగరాల్లో కనిష్ట వేతనాలు కూడా రూ.15,000 దాటుతున్నాయి. దీనివల్ల చాలా మంది కార్మికులు సామాజిక భద్రతా పథకాలకు దూరమవుతున్నారు. అందుకే ఈ పరిమితిని పెంచడం అనివార్యమైంది.

పెంపు వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు..
పెరగనున్న రిటైర్మెంట్ ఫండ్: వేతన పరిమితి పెరిగితే.. ఉద్యోగి, యజమాని చెల్లించే నెలవారీ విరాళాలు పెరుగుతాయి. చక్రవడ్డీ ప్రభావంతో పదవీ విరమణ సమయానికి చేతికి వచ్చే మొత్తం భారీగా ఉంటుంది.

విరాళం పెరగడం వల్ల ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద వచ్చే నెలవారీ పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. ఇది వృద్ధాప్యంలో అధిక భద్రతను ఇస్తుంది. వేతన సీలింగ్ రూ.25,000కి పెంచడం వల్ల, అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది మంది కొత్త కార్మికులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి వస్తారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం
గతంలో సుప్రీంకోర్టు కూడా వేతన పరిమితిని సమీక్షించాలని కార్మిక మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపు అనేది ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత భారం కలిగించినప్పటికీ (సబ్సిడీల రూపంలో), ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఇది ఒక విప్లవాత్మక అడుగు. ఇది మధ్యతరగతి, తక్కువ వేతన జీవుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తుంది.

Also Read: Gold Price Collapse: బంగారం ప్రియులకు డేంజర్ బెల్..అమాంతం పడిపోయే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లు జాగ్రత్త!

ALso Read: Shambhavi Pathak: అజిత్ పవార్ విమాన ప్రమాదం..కాక్‌పిట్‌లో పైలట్స్ చివరి మాటలు..అసలేం జరిగిందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 29, 2026 06:05:38
Hyderabad, Telangana:

Gold Price Collapse Forecast: ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణంగా డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది, కానీ విచిత్రంగా కొనుగోళ్లు తగ్గుతున్నా బంగారం రేటు మాత్రం తగ్గడం లేదు. దీని వెనుక పెద్ద అంతర్జాతీయ సంస్థల మాయాజాలం ఉందా? సామాన్యులు 'బంగారం బుడగ' (Gold Bubble) లో చిక్కుకుంటున్నారా? అన్న కోణంలో ఆరోపణలు వస్తున్నాయి.

బంగారం ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయిల్లో ఉన్నాయి. కానీ ఈ పెరుగుదల సహజమైనది కాదని, త్వరలోనే భారీగా కుదేలయ్యే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2025లోనూ ఇదే పరిస్థితి!
గత ఏడాది కాలంలో బంగారం ధర ఏకంగా 60 శాతం పెరగడం అసాధారణం. మార్కెట్ పరిభాషలో దీనిని 'బబుల్' (Bubble) అని పిలుస్తారు. అంటే వాస్తవ విలువ కంటే రేటు ఎక్కువగా ఉబ్బిపోవడం. ఈ బుడగ ఎప్పుడైనా పేలిపోయే అవకాశం ఉందని, అప్పుడు కొనుగోలుదారులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

విదేశీ సంస్థల 'రిపోర్ట్' మాయాజాలం
గోల్డ్‌మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ వంటి దిగ్గజ సంస్థలు మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు "ధర ఇంకా పెరుగుతుంది" అంటూ నివేదికలు ఇస్తుంటాయి. ఆ రిపోర్టులు నమ్మి సామాన్యులు ఎగబడి కొంటున్న సమయంలోనే, ఈ పెద్ద సంస్థలు తమ దగ్గరున్న బంగారాన్ని అమ్ముకుని లాభాలు పొందుతాయి. గతంలో జేపీ మోర్గాన్ బ్యాంక్ "స్పూఫింగ్" అనే టెక్నిక్ వాడి ధరలను కృత్రిమంగా పెంచినందుకు రూ.7,600 కోట్ల జరిమానా కూడా కట్టింది.

గత చరిత్ర ఏం చెబుతోంది?
బంగారం ధర పీక్స్‌కు వెళ్లి మళ్లీ కుప్పకూలడం కొత్తేమీ కాదు. 1980లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరిన తర్వాత ఒక్కసారిగా 57% పడిపోయింది. ఆ నష్టం పూడటానికి 25 ఏళ్లు పట్టింది.

అలాగే 2011లోనూ మళ్లీ రేటు భారీగా పెరిగి, తర్వాత 45% క్రాష్ అయ్యింది. కోలుకోవడానికి 4 ఏళ్లు పట్టింది. 2026లోనూ ఇప్పుడు కూడా అదే తరహా 'ప్రైస్ క్రాష్' జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ధరలు పడిపోవడానికి కారణాలు..
లిక్విడిటీ క్రంచ్: స్టాక్ మార్కెట్లు పడిపోయినప్పుడు, ఇన్వెస్టర్లు నగదు కోసం తమ దగ్గరున్న గోల్డ్ ఈటీఎఫ్‌లను (ETFs) విక్రయిస్తారు. దీనివల్ల మార్కెట్లో బంగారం సప్లై పెరిగి ధర తగ్గుతుంది.

రిటైల్ డిమాండ్ క్షీణత: పెళ్లిళ్ల సీజన్ ఉన్నా సామాన్యులు బంగారం కొనడం తగ్గించేశారు. ఎప్పుడైతే డిమాండ్ కనిష్ట స్థాయికి చేరుతుందో, అప్పుడు ధరల్లో దిద్దుబాటు తప్పదు.

మధ్యతరగతికి దూరం: ఇప్పటికే పేదలకు అందని ద్రాక్షగా మారిన బంగారం, మధ్యతరగతి ప్రజలకు కూడా దూరమైతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింటుంది.

బంగారం ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడి అని భావిస్తాం. కానీ ప్రస్తుత ధరలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎగబడి కొనడం కంటే, మార్కెట్ స్థిరీకరణ అయ్యే వరకు వేచి చూడటం ఉత్తమమని నిపుణుల సలహా.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికలు, నిపుణుల అభిప్రాయాల మేరకు పొందుపరిచినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Telangana PRC: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..పీఆర్సీ అమలుపై ఆశలు గల్లంతు..ఎప్పటికి వచ్చే?!

Also Read: Shambhavi Pathak: అజిత్ పవార్ విమాన ప్రమాదం..కాక్‌పిట్‌లో పైలట్స్ చివరి మాటలు..అసలేం జరిగిందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top