బదిలీపై వెళుతున్న ఆడిట్ అధికారికి రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం ఘన సన్మానం
వేములవాడ రాజన్న దేవాలయం లోకల్ ఫండ్ ఆడిట్ అధికారిగా పనిచేస్తూ హైదరాబాద్ జీహెచ్ ఎంసీ ఆడిట్ అధికారిగా బదిలీపై వస్తున్న రమేష్ ను రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఏఈవో ప్రతాప్ నవీన్, సూపర్ వైజర్లు వెల్ది సంతోష్, అరుణ్, మహేశ్ గౌర్, సీనియర్ అసిస్టెంట్లు నూగూరి నరేంద్ర, నక్కా తిరుపతి, పెరిక శ్రీనివాస్, ఎడ్ల సాయి, పురాణం వంశీ, పోల్సాని రాజు పాల్గొన్నారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Prabhas Riddhi Kumar Rumors: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు.. అటు బాక్సాఫీస్ వద్ద రికార్డులు, ఇటు సోషల్ మీడియాలో ఆయన వ్యక్తిగత జీవితంపై రూమర్లు హోరెత్తిపోతుంటాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం 'ది రాజా సాబ్' (The Raja Saab) విడుదలకు సిద్ధమవుతున్న వేళ, ఆయన డేటింగ్ గురించి నెట్టింట ఒక ఆసక్తికర చర్చ మొదలైంది.
'ది రాజా సాబ్' సినిమాలో నటించిన ముగ్గురు హీరోయిన్లలో ఒకరైన రిద్ధి కుమార్, ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలే ఈ రూమర్లకు కేంద్రబిందువు అయ్యాయి. ఆ వేదికపై ఆమె ప్రభాస్ గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు.
ప్రభాస్ నుంచి స్పెషల్ గిఫ్ట్..
"ప్రభాస్ గారు నాకు ఒక అందమైన చీరను బహుమతిగా ఇచ్చారు. దానిని నేను మూడేళ్లుగా చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. ఈ ప్రత్యేకమైన రోజునే (ప్రీ-రిలీజ్ ఈవెంట్) కట్టుకోవాలని ఇన్నాళ్లూ ఎదురుచూశాను" అని ఈ చిత్రంలో హీరోయిన్లలో ఒకరైన రిద్ధి కుమార్ వెల్లడించారు.
"నా జీవితంలో మిమ్మల్ని (ప్రభాస్‌ను) పొందడం నా అదృష్టం. నేను ఈ సినిమాలో ఉన్నానంటే దానికి కారణం మీరే" అంటూ ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
డేటింగ్ రూమర్స్ ఎందుకంటే?
హీరోయిన్ రిద్ధి కుమార్ ప్రభాస్‌ను పొగిడిన విధానం, ఆయన ఇచ్చిన బహుమతిని మూడేళ్లుగా దాచుకున్నానని చెప్పడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గతంలో 'రాధే శ్యామ్' సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు.
ఇప్పుడు రెండోసారి 'రాజా సాబ్'లో కూడా అవకాశం రావడంతో వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైంది. ప్రభాస్ కంటే రిద్ధి కుమార్ సుమారు 19 ఏళ్లు చిన్నది. అయినప్పటికీ, సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు షేర్ చేస్తూ 'కొత్త జోడీ' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అసలు నిజం ఏంటి?
ప్రభాస్‌కు తన తోటి నటీనటులకు, సెట్ లోని వారికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం, రకరకాల వంటకాలతో విందు ఇవ్వడం అలవాటు. దీనిని పరిశ్రమలో అందరూ 'ప్రభాస్ ఆతిథ్యం' అని పిలుచుకుంటారు. రిద్ధి కుమార్‌కు ఇచ్చిన గిఫ్ట్ కూడా అందులో భాగమే అయ్యింటుందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. డేటింగ్ వార్తలపై ఇప్పటివరకు అటు ప్రభాస్ టీమ్ గానీ, ఇటు రిద్ధి గానీ స్పందించలేదు.
సినిమా విషయానికొస్తే.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' చిత్రం హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ola Roadster X+ Price Features: ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మరో అద్భుత మైలురాయిని అందుకుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రోడ్‌స్టర్ X+ (9.1 kWh) మోటార్‌సైకిల్‌కు కేంద్ర ప్రభుత్వం నుండి అధికారిక ధృవీకరణ లభించింది. దీంతో ఈ బైక్ కస్టమర్లకు డెలివరీ కావడానికి మార్గం సుగమమైంది.
'మేక్ ఇన్ ఇండియా'తో సరికొత్త చరిత్ర
ఈ బైక్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది భారతదేశంలోనే తయారు చేసిన 4680 భారత్ సెల్ (4680 Bharat Cell) టెక్నాలజీతో పనిచేస్తుంది. మన దేశంలోనే తయారైన బ్యాటరీ సెల్స్‌తో ధృవీకరణ పొందిన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇదే కావడం విశేషం. మనేసర్‌లోని iCAT (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ) ఈ మోడల్‌ను క్షుణ్ణంగా పరీక్షించి, సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (CMVR) ప్రకారం సర్టిఫై చేసింది.
ఈ బైక్ కేవలం వేగం మాత్రమే కాదు, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను కూడా కలిగి ఉంది. AIS-156 సర్టిఫికేషన్‌తో దీనిలోని 9.1 kWh బ్యాటరీ ప్యాక్, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నుండి కఠినమైన భద్రతా పరీక్షల తర్వాత సర్టిఫికేషన్ పొందింది. బ్యాటరీ నీటిలో మునిగినా, అగ్ని ప్రమాదం జరిగినా, విపరీతమైన వేడి లేదా కంపనాలు ఎదురైనా తట్టుకునేలా దీనిని రూపొందించారు. అలాగే బ్రేకింగ్ సామర్థ్యం, సౌండ్, విద్యుదయస్కాంత సమ్మతి వంటి అంశాల్లో ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను ఇది విజయవంతంగా పూర్తి చేసింది.
కేవలం మోటార్‌సైకిళ్లు మాత్రమే కాకుండా, రాబోయే రోజుల్లో ఓలా స్కూటర్లు, ఇతర ద్విచక్ర వాహనాల్లో కూడా ఇదే 'భారత్ సెల్' టెక్నాలజీని వాడనున్నట్లు సదరు కంపెనీ స్పష్టం చేసింది. ప్రభుత్వ అనుమతులు లభించడంతో, రోడ్‌స్టర్ X+ డెలివరీలు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. లాంగ్ రేంజ్, పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్ కానుంది.
ధర, అదిరిపోయే ఫీచర్స్..
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ అనేక వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.99,999 నుంచి రూ.1,25,000 అత్యధికంగా ఉండనుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిలో బ్యాటరీని బట్టి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ, నుంచి 250 కి.మీ., మేర మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. గంటకు 105 నుంచి 118 కి.మీ, వేగాన్ని అందుకోగలదట. దీని బ్యాటరీ 80 శాతం ఛార్జ్ అయ్యేందుకు సుమారు 4.6 గంటల నుంచి 6.2 గంటల సమయం పడుతుందని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Silver and Rare Earth Elements: 2025 వెండి మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు ప్రపంచ పెట్టుబడిదారుల ద్రుష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓ వైపు వెండి ధరలు భారీగా పెరుగుతుండగా.. మరోవైపు ప్రపంచంలోనే కీలక ముడి పదార్థాల సరఫరాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న చైనా కీలక నిర్ణయం తీసుకుంది. వెండి ఎగుమతులపై నియంత్రణను మరింత కఠినతరం చేస్తూ కొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. ఈ రూల్స్ కొత్త ఏడాది అంటే జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా అమెరికా పరిశ్రమలు, రక్షణ రంగ సరఫరా గొలుసుకు వెండి అత్యంత అవసరమైన లోహం మారుతున్న ఈ నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
వెండి ఒక్కటే కాదు వెండితోపాటు అరుదైన భూమి ఖనిజాల ఎగుమతులపై కూడా చైనా కండిషన్స్ పెడుతోంది. ఇప్పటికే అక్టోబర్ నెలలోనే చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కొత్త రూల్స్ ప్రకటించింది. అదే సమయంలో దక్షిణ కొరియాలో జరిగిన కీలక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జెన్ పింగ్ మధ్య చర్యలు జరిగాయి. ఆ చర్చల తర్వాత కొన్ని అరుదైన భూమి ఖనిజాల ఎగుమతులపై ఒక ఏడాది పాటు నిషేధం విధించేందుకు చైనా అంగీకరించింది. దీంతో అమెరికా కొన్ని సుంకాలను విధించడం ఉపసంహరించుకుంది.
అయితే కొత్త విధానంలో భాగంగా.. వెండిని ఎగుమతి చేసేందుకు 44 కంపెనీలకు మాత్రమే అనుమతి ఇచ్చింది చైనా. 2026, 2027 సంవత్సరాల్లో వెండి ఎగుమతులు చేయడానికి అర్హత పొందిన ఈ 44 కంపెనీల జాబితాను తాజాగా విడుదల చేసింది. అంతేకాదు.. 2026 నుంచి టంగ్స్టన్, యాంటిమోనీ వంటి కీలక లోహాల ఎగుమతులపైనా ఆంక్షలు విధించనున్నారు. చైనా సెక్యూరిటీస్ టైమ్స్ కథనం ప్రకారం.. తాజా నిబంధనలతో వెండికి వ్యూహాత్మక పదార్థం హోదా లభించింది. ఇకపై వెండి ఎగుమతులు కూడా అరుదైన భూమి ఖనిజాల తరహాలో కఠిన నియంత్రణల కింద ఉంటాయి.
Also Read: Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!
విద్యుత్ సర్క్యూట్లు, బ్యాటరీలు, సౌర విద్యుత్ ప్యానెల్స్, వైద్య పరికరాల తయారీలో విస్తృతంగా ఉపయోగపడే వెండిని అమెరికా ఇప్పటికే క్రిటికల్ మినరల్స్ జాబితాలో చేర్చింది. గణాంకాల ప్రకారం.. 2024లో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ఉత్పత్తిదారులలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది తొలి 11 నెలల్లోనే చైనా 4,600 టన్నులకు పైగా వెండిని ఎగుమతి చేయగా.. సుమారు 220 టన్నులను దిగుమతి చేసుకుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొన్ని చైనా సంస్థలు కెనడాకు చెందిన వెండి సరఫరాదారుల నుంచి మార్కెట్ ధర కంటే ఔన్సుకు 8 డాలర్లు ఎక్కువ చెల్లించేందుకు ముందుకొచ్చాయి. భారత్‌కు చెందిన ఓ కొనుగోలుదారు అయితే మార్కెట్ రేటుకంటే 10 డాలర్లు అధికంగా చెల్లించినట్లు సమాచారం. ఒక దశలో వెండి ధర ఔన్సుకు 80 డాలర్లను దాటగా, ప్రస్తుతం సుమారు 73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
2025లో అమెరికన్ డాలర్ ఇండెక్స్ దాదాపు 9.5 శాతం పడిపోవడం కూడా వెండి ధరలకు మరింత బలం చేకూర్చింది. ఈ ఏడాది వెండి ధరలు రెట్టింపుకంటే ఎక్కువగా పెరగడం గమనార్హం. అదే సమయంలో బంగారం కూడా బలమైన లాభాలను నమోదు చేసింది. అయితే క్రిప్టో మార్కెట్లో బిట్‌కాయిన్ మాత్రం భిన్న దిశలో కదులుతోంది. ప్రస్తుతం దాదాపు 88,000 డాలర్ల వద్ద ట్రేడవుతున్న బిట్‌కాయిన్, ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 5 శాతం నష్టాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో వెండి భవిష్యత్తులో మరింత కీలక లోహంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Quartz Illegal Mining: నకరికల్లు సమీపంలో మట్టి టిప్పర్ల హంగామా ఒక నిండు ప్రాణంపైకి తెచ్చింది. వేగంగా వచ్చిన మట్టి టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పాలయ్యారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నకరికల్లు పాతూరుకు చెందిన అబ్బూరి శ్రీనివాస్, తన ద్విచక్ర వాహనంపై శ్రీరాంపురం వద్ద ఉన్న కాలువ కట్టపై వెళ్తుండగా, వెనుక నుండి అతివేగంగా వచ్చిన మట్టి టిప్పర్ లారీ ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను గమనించిన స్థానికులు వెంటనే నకరికల్లు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
పరారీలో డ్రైవర్..పోలీసుల స్వాధీనంలో టిప్పర్
ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి అక్కడి నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై ఇంకా అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.
మట్టి మాఫియా బరితెగింపు?!
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు, త్రిపురారం కొండలు మట్టి మాఫియా ధాటికి కరిగిపోతున్నాయి. అనుమతులు ఉన్నది కొద్ది మేరకే అయినా, అక్రమార్కులు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి కొండలను నామరూపాల్లేకుండా చేస్తున్నారని స్ఠానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల అటు ప్రకృతి సంపద హరించుకుపోవడమే కాకుండా, స్థానిక ప్రజల ఆరోగ్యం కూడా ముప్పులో పడింది.
త్రిపురారంలో అడ్డూఅదుపు లేని తవ్వకాలు
అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్రీయ రహదారికి ఆనుకుని ఉన్న త్రిపురాపురం కొండల సముదాయం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోందా? అవుననే అంటున్నారు నకరికల్లు-త్రిపురాపురం నివాసితులు. నిత్యం మట్టి టిప్పర్లు మితిమీరిన వేగంతో మట్టి రవాణా చేస్తుంటే రోడ్డుపైకి రావాలంటేనే భయాందోళనలతో అదిరిపోతున్నారు. సమీపంలో శ్రీరాంపురం, త్రిపురాపురంలోని ప్రజలు నిత్యం దుమ్ము,ధూళితో ఇబ్బంది పడుతున్నట్లు ఇప్పటికే అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుమతి ఎంత..తవ్వకం ఎంత?
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శ్రీరాంపురంలో కేవలం 6.07 హెక్టార్లకే మైనింగ్ శాఖ నుంచి అనుమతులు ఉన్నాయట. కానీ, వాస్తవానికి అంతకు మించిన విస్తీర్ణంలో కొండలను పిండి చేస్తున్నారని సమాచారం. భారీ పొక్లెయిన్లు, పదుల సంఖ్యలో టిప్పర్లతో రేయింబవళ్లు తవ్వకాలు సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నిత్యం రణగొణ ధ్వనుల మధ్య రాత్రుళ్లు నిద్రలేకుండా పోతుందని ఆ ఊరి ప్రజలు వాపోతున్నారు.
కొండమోడు-పేరేచర్ల జాతీయ రహదారి పనుల కోసం మట్టిని తరలిస్తున్నామని పర్మిట్లు తీసుకుని.. వాటి ముసుగులో ప్రైవేట్ వెంచర్లకు మట్టిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమ రవాణా వల్ల స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. టిప్పర్ల రాకపోకలతో సమీప గ్రామాల ఇళ్లు, పంట పొలాలు ఎర్రమట్టి దుమ్ముతో నిండిపోయాయి. ప్రజలు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. భారీ టిప్పర్ల లోడుకు అద్దంకి-నార్కట్‌పల్లి రహదారి గుంతలమయమైంది. ఆ గుంతలను కూడా మట్టితోనే పూడ్చి మమ అనిపిస్తున్నారు.
అక్రమార్కులకు స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారం పూర్తిస్థాయిలో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆ సమాచారాన్ని అధికారులే మాఫియాకు చేరవేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. తవ్వకాలు సాగించేందుకు ప్రతిఫలంగా భారీగా ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సెలవు రోజులే టార్గెట్..
నకరికల్లు కొండల్లో ప్రతి ఆదివారం (సెలవు దినం) ప్రత్యేకంగా తవ్వకాలు జరుపుతున్నారు. "సెలవు రోజుల్లో మేము పట్టించుకోం" అని అధికారులు భరోసా ఇస్తున్నట్లు సమాచారం. తవ్వకాలను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే, కార్లలో తిరిగే బౌన్సర్లతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
చివరిగా.. ప్రకృతిని కాపాడాల్సిన అధికారులే మాఫియాకు అండగా నిలబడటంపై శ్రీరాంపురం - త్రిపురాపురం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: Chicken Vs Mutton Liver: మటన్ లివర్ Vs చికెన్ లివర్..ఏది తినొచ్చు? ఏది తినకూడదు? నిప్పులాంటి నిజం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
SCSS PPF SSY Savings Schemes Interest Rate: మీరు పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ లేదా పోస్టాఫీస్ అందించే ఇతర చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెడుతున్నట్లయితే.. మీకు బిగ్ అలర్ట్. ఎందుకంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. 2025 డిసెంబర్ 31న మరోసారి ఈ సమీక్ష జరగనుంది. దాని ఆధారంగా కొత్త వడ్డీ రేట్లు ప్రకటించనున్నారు. అయితే ఈ రేట్లు 2026 జనవరి 1 నుంచి మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి.
ఇప్పటికే 2025 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం 1.25 శాతం మేర రెపో రేటును తగ్గించింది. దీని ప్రభావంతో బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను క్రమంగా తగ్గించాయి. దీంతో పోస్టాఫీస్ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో కూడా కోత పడుతుందా? అనే ప్రశ్న పెట్టుబడిదారుల్లో తలెత్తుతోంది. ప్రస్తుతం అక్టోబర్–డిసెంబర్ 2025 త్రైమాసికానికి గాను SCSS, SSY పథకాలు 8.2 శాతం వడ్డీ అందిస్తున్నాయి. పీపీఎఫ్‌కు 7.1 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్కు 7.7 శాతం, కిసాన్ వికాస్ పత్రకు 7.5 శాతం వడ్డీ లభిస్తోంది.
చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ఎలా నిర్ణయిస్తారంటే.. 2010లో శ్యామల గోపీనాథ్ కమిటీ చేసిన సిఫార్సులే ఆధారంగా నిర్ణయిస్తుంటారు. ఈ సూత్రం ప్రకారం, 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ (G-Sec) సగటు తీసుకుని.. ప్రతి పథకం మెచ్యూరిటీ కాలాన్ని బట్టి అదనంగా 0.25 శాతం నుంచి 1 శాతం వరకు స్ప్రెడ్ జోడిస్తారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ 2025 వరకు 10 ఏళ్ల G-Sec సగటు దిగుబడి సుమారు 6.54 నుంచి 6.6 శాతం మధ్యలోనే ఉంది. ఈ లెక్కన చూస్తే.. కొన్ని పథకాల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉదాహరణకు.. ఈ ఫార్ములాను పీపీఎఫ్‌పై కచ్చితంగా అమలు చేస్తే వడ్డీ రేటు 7.1 శాతం నుంచి దాదాపు 6.8 శాతం వరకు తగ్గే అవకాశముంది. తక్కువ ద్రవ్యోల్బణం, ప్రభుత్వ బాండ్ల దిగుబడి తగ్గడం వంటి అంశాలు కూడా రేట్లపై ఒత్తిడి తెస్తున్నాయి. అయితే సీనియర్ సిటిజన్లను దృష్టిలో పెట్టుకుని SCSS వంటి పథకాల వడ్డీని తగ్గించడంపై ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. రాజకీయంగా కూడా ఇది సున్నితమైన అంశం కావడంతో, SCSS వడ్డీ రేటు 8.2 శాతం వద్దనే కొనసాగవచ్చని పలువురు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
గతంలో RBI వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ చిన్న పొదుపు పథకాల వడ్డీని ప్రభుత్వం చాలాసార్లు యథాతథంగా ఉంచింది. కరోనా తర్వాత బ్యాంక్ రేట్లు పెరిగిన దశలో కూడా పీపీఎఫ్ వడ్డీ 7.1 శాతం వద్దే నిలిచింది. అందుకే మీరు పీపీఎఫ్, SSY లేదా SCSSలో కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటే.. డిసెంబర్ 31, 2025లోపు ప్రస్తుత వడ్డీ రేట్ల వద్దనే పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి రేట్లు తగ్గితే, కొత్త పెట్టుబడులకు తక్కువ వడ్డీనే వర్తిస్తుంది. అదనంగా, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి పథకాలపై సెక్షన్ 80C కింద ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుందన్న విషయాన్ని కూడా మర్చిపోవద్దు.
Also Read: Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Podili Police Fight: స్థానిక వ్యాపారితో పోలీసులు ఘర్షణ పడడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లారీ అన్ లోడ్ విషయంలో ఎరువుల వ్యాపారితో అతడి కుమారుడిని పొదిలి పోలీసులు తీవ్రంగా కొట్టడం ప్రకాశం జిల్లాలో రచ్చకు దారి తీసింది. బాధితులు తీవ్ర గాయాలవడంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పొదిలిలో బాధితుల తరఫున ఓ సామాజిక సంఘం నాయకులు ఉద్యమం చేపడుతుండడంతో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రోజురోజుకు వివాదం సద్దుమణకపోవడంతో సీఎం స్పందించారు.
Also Read: BRS Party: నదీ జలాల్లో దొంగకు తాళం ఇచ్చిన రేవంత్ రెడ్డి: హరీశ్ రావు
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో స్థానిక వ్యాపారికి, పోలీసులకు జరిగిన ఘర్షణపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. స్థానిక ఎస్ఐ అకారణంగా దాడి చేశారనే వ్యాపారుల ఆరోపణపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పొదిలి పట్టణంలో అవినాష్ అనే వ్యాపారికి, పట్టణ ఎస్సై వేమనకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో షాప్ వద్ద లారీ నుంచి ఎరువులను దింపే క్రమంలో వెంటనే లారీని అక్కడ నుంచి తొలగించాలని పోలీసులు కోరగా.. ఆ సమయంలో వివాదం రాజుకుంది.
Also Read: Railway Warning: ప్రజలకు రైల్వే శాఖ కీలక విజ్ఞప్తి.. అక్కడ గాలిపటాలు ఎగురవేయవద్దు
తరువాత రోజు క్రిస్మస్ పండగ సందర్భంగా రోడ్లపై రద్దీ కారణంగా ట్రాఫిక్‌ను క్లియర్ చేసే క్రమంలో ఎస్సై, వ్యాపారికి మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. ఈ సందర్భంలో తమపై లాఠీతో దాడి చేశారని అవినాశ్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు ఎస్ఐపై ఆరోపణలు చేశారు. పోలీసులు దాడికి పాల్పడడంతో పొదిలిలో వ్యాపార వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. వ్యాపార సంఘాలు ఆందోళనకు దిగడంతోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన జిల్లా ఎస్పీ ఎస్ఐ వేమనను వీఆర్‌కు పంపుతూ రెండు రోజుల కిందట ఆదేశాలు ఇచ్చారు.
Also Read: Schools Holiday: జనవరి 1వ తేదీ అన్నీ స్కూళ్లకు సెలవు.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
అయినా కూడా వర్తక వ్యాపారులు శాంతించకుండా నిరసనలు చేస్తుండడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. పొదిలిలో ఘర్షణకు కారణాలు, పోలీసుల చర్యలు, వ్యాపార వర్గాల ఆందోళనపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి వంగలపూడి అనితతో సీఎం చంద్రబాబు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై ఇప్పటికే మంత్రులు, అధికారులు స్పందించారని తెలిపారు. దాడికి పాల్పడిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్కు ముందుగా ఛార్జ్ మెమో ఇచ్చి వివరణ తీసుకున్నట్లు.. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎస్ఐ వేమనను బదిలీ చేసినట్లు సీఎం చంద్రబాబుకు డీజీపీ వివరించారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని.. సాధారణ ప్రజల పట్ల వ్యవహరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని డీజీపీతోపాటు పోలీస్ శాఖకు సీఎం చంద్రబాబు సూచించారు. పొదిలి ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు, వ్యాపారుల గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rashmika Vijay Devarakonda Rome Tour: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక.. వచ్చే ఏడాది పెళ్లిపీటలెక్కనున్నారనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్న క్రమంలో వారిద్దరూ ఇప్పుడు విహారయాత్రకు వెళ్లారని సమాచారం. రష్మిక మందన్న ప్రస్తుతం రోమ్ నగరంలో విహరిస్తున్నారు.
అయితే ఆమె షేర్ చేసిన తాజా ఫోటోలు, వీడియోలు కేవలం పర్యటనకు సంబంధించినవి మాత్రమే కాదు, నటుడు విజయ్ దేవరకొండతో ఆమెకు ఉన్న బంధం గురించి వస్తున్న పుకార్లకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరిలో ఉదయపూర్‌లోని ఒక ప్యాలెస్‌లో వీరిద్దరి వివాహం జరగబోతోందనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ పోస్ట్ సంచలనంగా మారింది.
రష్మిక పోస్ట్‌లో విజయ్ ఎక్కడ?
రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో "ఇప్పటివరకు రోమ్" (Rome so far) అంటూ కొన్ని ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ నేరుగా కనిపించకపోయినప్పటికీ, అభిమానులు తమ 'డిటెక్టివ్' కళ్లతో కొన్ని ఆసక్తికర విషయాలను కనిపెట్టారు.
> ఒక వీడియోలో రష్మిక డెజర్ట్ తింటూ, మొదటి ముద్దను కెమెరా వెనుక ఉన్న వ్యక్తికి ఎంతో ప్రేమగా తినిపిస్తున్నారు. అది విజయ్ దేవరకొండ అని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
> మరొక వీడియోలో రష్మిక ప్రార్థన చేస్తూ కొవ్వొత్తి వెలిగిస్తుండగా, పక్కనే మరొక చేయి కొవ్వొత్తిని పట్టుకుని ఉంది. ఆ చేయి విజయ్ దేనని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
> ఈ ట్రిప్‌లో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా రష్మిక స్నేహితులతో కలిసి కనిపించడం విశేషం. ఇది వీరిద్దరి మధ్య ఉన్న కుటుంబ సంబంధాలను స్పష్టం చేస్తోంది.
సోషల్ మీడియాలో అభిమానుల సందడి
రష్మిక పోస్ట్ చేసిన వెంటనే ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు రచ్చ మొదలుపెట్టారు. "రష్మిక విజయ్ దేవరకొండ.. మీరిద్దరూ కలిసి ఉంటే చూడముచ్చటగా ఉంటుంది" అని రాసుకొచ్చారు. రష్మికను నెటిజన్లు ఇప్పటికే 'దేవరకొండ వారి కోడలు' అని పిలుస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కెరీర్ పరంగా బిజీ బిజీ
ఒకవైపు వ్యక్తిగత జీవితంపై ఇన్ని ఊహాగానాలు వస్తున్నా, రష్మిక తన కెరీర్ లోనూ దూసుకుపోతున్నారు. 'పుష్ప 2'తో భారీ విజయాన్ని అందుకున్న ఆమె, ఇటీవలే 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాతో అలరించారు. పలు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. తాజా రోమ్ వెకేషన్ పోస్ట్‌లో ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. వచ్చే ఫిబ్రవరిలో ఉదయపూర్ వేదికగా ఈ జంట ఒక్కటి కాబోతున్నారా? లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!
Also Read: Chicken Vs Mutton Liver: మటన్ లివర్ Vs చికెన్ లివర్..ఏది తినొచ్చు? ఏది తినకూడదు? నిప్పులాంటి నిజం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mega Victory Mass Song Launch: తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజ నటులు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తుండగా, వెంకటేశ్ ఒక పవర్ఫుల్ పాత్రలో మెరవనున్నారు.
మాస్ సాంగ్ అదిరిపోయింది!
సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా ‘ఆర్ యూ రెడీ’ (Mega Victory Mass Song) మెగా విక్టరీ మాస్ సాంగ్ అనే హుషారైన పాటను విడుదల చేశారు. ఈ పాటలో చిరంజీవి, వెంకటేశ్‌ల మధ్య సాగే బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.
ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశారు. "ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ.., ఏంటి వెంకీ సంగతీ.. ఇరగతీద్దాం సంక్రాంతీ.." అంటూ సాగే సాహిత్యం మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది.
చిరంజీవి మార్కు గ్రేస్, వెంకటేశ్ మార్కు టైమింగ్ ఈ పాటలో హైలైట్‌గా నిలిచాయి. ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకుంటూ సందడి చేయడం వెండితెరపై కన్నుల పండుగగా ఉండబోతోంది.
సంక్రాంతి రేసులో 'శంకరవరప్రసాద్'
అనిల్ రావిపూడి అంటేనే వినోదానికి కేరాఫ్ అడ్రస్. 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రంలో కూడా అటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఇటు మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 'మెగా విక్టరీ' మాస్ సాంగ్ చూస్తుంటే, థియేటర్లలో సంక్రాంతి సందడి ముందుగానే వచ్చేసినట్లు కనిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవికి ఇది మరో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవుతుందని, వెంకీ తోడవ్వడంతో సినిమా స్థాయి రెట్టింపు అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జనవరి 12 కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Chicken Vs Mutton Liver: మటన్ లివర్ Vs చికెన్ లివర్..ఏది తినొచ్చు? ఏది తినకూడదు? నిప్పులాంటి నిజం!
Also Read: AP Pension Survey: పెన్షన్ దారులకు ప్రభుత్వం అలర్ట్..త్వరలోనే ఏపీలో మరో సర్వే..ఏం చేయనున్నారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Government: ఈ స్కీమ్ కింద 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ట్రాన్స్జెండర్లకు 100 శాతం సబ్సిడీతో రుణాలను అందించనున్నారు. అర్హత సాధించిన ప్రతి లబ్ధిదారుడికి గరిష్టంగా రూ.75 వేల వరకు ఆర్థిక సాయం మంజూరు చేస్తారు. ఈ మొత్తం పూర్తిగా సబ్సిడీ రూపంలో ఉండటం వల్ల లబ్ధిదారులు ఎలాంటి తిరిగి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం ఈ రుణాన్ని ఒక భరోసాగా అందిస్తూ... స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడానికి ప్రోత్సహిస్తోంది.
ప్రత్యేకంగా ఏదైనా రంగంలో నైపుణ్య శిక్షణ పొందిన వారు లేదా చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించాలని ఆసక్తి ఉన్న ట్రాన్స్జెండర్లకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా మారనుంది. కిరాణా దుకాణాలు, సేవా రంగం, హస్తకళలు, చిన్న తయారీ యూనిట్లు వంటి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఈ ఆర్థిక సాయం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ సాధికారిత శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన ట్రాన్స్జెండర్లు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అర్హత కలిగి ఉంటారు. అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించిన తర్వాత దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
హైదరాబాద్ జిల్లాలో ఈ పథకం కింద మొత్తం 30 స్వయం ఉపాధి యూనిట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్‌లో ఉన్న సంబంధిత కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా, www.wdsc.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా అప్లై చేయవచ్చు.
దరఖాస్తులు వచ్చే నెల జనవరి 31వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది. అందిన దరఖాస్తులను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి అర్హులైన వారిని తుది ఎంపిక చేస్తుంది. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు లేదా సందేహాల నివృత్తి కోసం 9640452773 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
ట్రాన్స్‌జెండర్ వర్గాన్ని ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావడం, వారికి ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమాజంలో సమానత్వం, సాధికారత దిశగా ఒక కీలక అడుగుగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Chicken Liver vs Mutton Liver Benefits: మాంసాహార ప్రియుల్లో చాలా మందికి చికెన్, మటన్ కంటే వాటి 'లివర్' (కాలేయం) అంటేనే ఎక్కువ ఇష్టంగా తింటుంటారు. రుచితో పాటు వీటిలో పోషకాలు పుష్కలంగా ఉండటమే దీనికి కారణం. అయితే, చికెన్ లివర్ మంచిదా? లేక మటన్ లివర్ మంచిదా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వీటి ఉపయోగాలు, పరిమితులను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ లివర్ ప్రయోజనాలు
చికెన్ లివర్ తక్కువ ధరలో లభించే అద్భుతమైన పౌష్టికాహారం. ఇందులో ఐరన్, సెలీనియం, విటమిన్ A, B12, ఫోలేట్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
విటమిన్ A, B12 కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు పరిమితంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. ఉడికించిన లివర్ తింటే శరీరంలో కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది.
మటన్ లివర్ ప్రయోజనాలు
చాలా మంది రుచి కోసం మటన్ లివర్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. రక్తహీనత (Anemia) సమస్యతో బాధపడేవారికి మటన్ లివర్ ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఇందులో జింక్, పొటాషియం, కాపర్ ఉండటం వల్ల కణాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. విటమిన్ B12 పుష్కలంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి (రోగనిరోధక శక్తి) పెరుగుతుంది.
వీళ్లు తినకపోవడమే మంచిది!
లివర్‌లో పోషకాలు ఉన్నప్పటికీ, అందరికీ ఇది సరిపడదు. ఈ క్రింది సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. లివర్‌లో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుండె జబ్బులు ఉన్నవారు లేదా కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు లివర్ తింటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
ఇందులో విటమిన్ A అతిగా ఉండటం వల్ల గర్భధారణ సమయంలో ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు కూడా లివర్‌ను తక్కువగా తీసుకోవాలి.
చివరిగా.. మటన్ లివర్, చికెన్ లివర్.. ఈ రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. రక్తహీనత ఉన్నవారు మటన్ లివర్‌ను, బరువు తగ్గాలనుకునే వారు లేదా బడ్జెట్లో పోషకాలు
కావాలనుకునే వారు చికెన్ లివర్‌ను ఎంచుకోవచ్చు. అయితే, వారానికి ఒకసారి కంటే ఎక్కువగా తీసుకోకపోవడం ఉత్తమం.
Also REad: AP Pension Survey: పెన్షన్ దారులకు ప్రభుత్వం అలర్ట్..త్వరలోనే ఏపీలో మరో సర్వే..ఏం చేయనున్నారంటే?
Also Read: Bank Holiday: రేపు బ్యాంకులు బంద్?!..డిసెంబరు 31, న్యూఇయర్ హాలీడే..ఆర్బీఐ ఏం చెప్పిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Pension Survey IVRS: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ పథకం అమలుపై క్షేత్రస్థాయిలో నిజానిజాలను తెలుసుకోవడానికి కూటమి సర్కార్ ఐవీఆర్ఎస్ (IVRS) విధానంలో ఒక భారీ సర్వేను నిర్వహించబోతున్నారు. కేవలం అనర్హులను ఏరివేయడమే కాకుండా, పింఛన్ల తొలగింపుపై జరుగుతున్న రాజకీయ ప్రచారాలకు చెక్ పెట్టడం కూడా ఈ సర్వే ప్రధాన ఉద్దేశం.
సర్వే ఎలా జరుగుతుంది?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్దిదారులందరికీ ప్రభుత్వం నుండి నేరుగా ఫోన్ కాల్ వస్తుందట. ఇది ఒక ఆటోమేటెడ్ కాల్. అందులో పింఛన్ పంపిణీకి సంబంధించి లబ్దిదారులను మూడు ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతారట.
ఆ మూడు ప్రశ్నలు ఇవే ఉండొచ్చని అంచనా..
1) ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో ఎవరైనా డబ్బులు ఆశిస్తున్నారా లేదా అవినీతి ఉందా?
2) ప్రతి నెలా 1వ తేదీన పింఛన్ మీ ఇంటి వద్దకే అందుతోందా?
3) పింఛన్ అందించే సచివాలయ అధికారి లేదా వాలంటీర్ ప్రవర్తన సంతృప్తికరంగా ఉందా?
పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానం 'అవును/బాగుంది' అయితే 1 నొక్కాలి. 'లేదు/బాగోలేదు' అయితే 2 నొక్కాలి. ఈ విధంగా పెన్షన్ సర్వే పూర్తి కానుంది.
లబ్దిదారులు ఇచ్చే సమాధానాలను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకోనుంది. ఒకవేళ అవినీతి జరుగుతోందని లేదా ఇంటి వద్ద పింఛన్ ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తే, సంబంధిత సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. పింఛన్ల సంఖ్యను తగ్గించారనే విమర్శలకు ఈ సర్వే ద్వారా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. ఎంతమందికి పింఛన్ అందుతుందో డేటా రూపంలో తేలిపోనుంది.
లబ్దిదారులకు సూచన
ఈ సర్వే ద్వారా కొత్త ఏడాదిలో పింఛన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం మరిన్ని కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి లబ్దిదారులు తమకు వచ్చే ఫోన్ కాల్స్‌ను నిర్లక్ష్యం చేయకుండా, వాస్తవ పరిస్థితులను బట్టి సరైన సమాధానాలు చెప్పాలని అధికారులు కోరుతున్నారు.
Also Read: Bank Holiday: రేపు బ్యాంకులు బంద్?!..డిసెంబరు 31, న్యూఇయర్ హాలీడే..ఆర్బీఐ ఏం చెప్పిందంటే?
Also Read: Priyanka Singh: "జబర్దస్త్ షో నుంచి గెంటేశారు..అతనే ప్రేమతో అండగా ఉన్నాడు" ప్రియాంకా సింగ్ ఆవేదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bank Holiday On New Year: కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతున్న వేళ, సంవత్సరం చివరి రోజైన డిసెంబర్ 31, 2025 (బుధవారం) నాడు బ్యాంకులు పని చేస్తాయా లేదా అని చాలా మంది కస్టమర్లు సందిగ్ధంలో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక హాలిడే క్యాలెండర్ ప్రకారం దీనిపై స్పష్టత వచ్చేసింది.
డిసెంబర్ 31న బ్యాంకులు తెరిచే ఉంటాయా?
అవును, డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా (ముఖ్యంగా ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో) బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా RBI ఎటువంటి అధికారిక బ్యాంకు సెలవును ప్రకటించలేదు. సాధారణంగా జాతీయ సెలవులు, రాష్ట్ర పండుగలు, ఆదివారాలతో పాటు ప్రతి నెలలోని 2వ, 4వ శనివారాల్లో మాత్రమే బ్యాంకులు మూసివేతగా ఉంటాయి. డిసెంబర్ 31 ఈ జాబితాలో లేదు.
అందుబాటులో ఉండే సేవలు
సంవత్సరం చివరి రోజైనప్పటికీ, బ్యాంకింగ్ బ్రాంచ్ స్థాయిల లో ఈ క్రింది సేవలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు, చెక్కుల క్లియరెన్స్, ఖాతా అప్డేటింగ్, కస్టమర్ సర్వీస్ డెస్క్ సేవలు వంటివి అందుబాటులో ఉంటాయి. సంవత్సరం చివరి రోజు కావడంతో బ్యాంకుల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి, అత్యవసర పనులు ఉన్నవారు ఉదయాన్నే బ్యాంకును సందర్శించడం ఉత్తమం.
డిజిటల్ బ్యాంకింగ్ - 24/7 అందుబాటు
ఒకవేళ మీరు బ్యాంకుకు వెళ్లలేకపోయినా, ఈ క్రింది ఆన్లైన్ సేవలు ఏవైనా అంతరాయం లేకుండా పని చేస్తాయి. UPI లావాదేవీలైన ఫోన్ పే, గూగుల్ పే వంటి సేవలతో పాటు ఆన్లైన్ ఫండ్ ట్రాన్స్ఫర్లలో NEFT, RTGS, IMPS సేవలు సహా నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి. మొబైల్ యాప్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యథాతధంగా కొనసాగుతాయి.
తదుపరి సెలవు ఎప్పుడు?
నూతన సంవత్సర వేడుకల తర్వాత, దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేతగా ఉండే తదుపరి ప్రధాన జాతీయ సెలవుదినం జనవరి 26, 2026 (గణతంత్ర దినోత్సవం)గా ఉండనుంది. అయితే, స్థానిక పండుగలను బట్టి ఆయా రాష్ట్రాల్లో సెలవులు మారవచ్చు.
Also REad: Priyanka Singh: "జబర్దస్త్ షో నుంచి గెంటేశారు..అతనే ప్రేమతో అండగా ఉన్నాడు" ప్రియాంకా సింగ్ ఆవేదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Priyanka Singh Jabardasth: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో 'జబర్దస్త్' ఎంతో మంది సామాన్యులను స్టార్లుగా మార్చింది. ఈ షో ద్వారా లేడీ గెటప్స్‌తో పాపులర్ అయ్యి, ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకుని అబ్బాయి నుండి అమ్మాయిగా మారిన ప్రియాంక సింగ్ (సాయి తేజ) ప్రయాణం అందరికీ తెలిసిందే. అయితే, ఆమె జబర్దస్త్ నుండి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలేంటి? అనే విషయాలపై ప్రియాంక ఇటీవల మనసు విప్పారు.
"షో నేను మానలేదు.. వాళ్లే గెంటేశారు!"
జబర్దస్త్ నుండి తప్పుకోవడంపై నటి ప్రియాంక సింగ్ సంచలన నిజాలు బయటపెట్టారు. తాను సర్జరీ చేయించుకుని పూర్తిగా అమ్మాయిగా మారిన తర్వాత, షోలో ఇతర లేడీ గెటప్ ఆర్టిస్టులు ఉండటం వల్ల షోకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని నిర్వాహకులు భావించారట. వారు ఆ విషయం చెప్పగానే, తానూ ఏమాత్రం వాదించకుండా, తన వస్తువులు సర్దుకుని అక్కడి నుండి వెంటనే బయటకు వచ్చేశానని ఆవేదనగా గుర్తు చేసుకున్నారు.
అనారోగ్యం..మంచానికే పరిమితం
షో నుండి బయటకు వచ్చిన పది రోజులకే ప్రియాంక జీవితంలో మరో విషాదం ఎదురైంది. ఆమె తీవ్రమైన ఆర్థరైటిస్ బారిన పడి, దాదాపు ఏడాది కాలం పాటు కదలలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. కెరీర్ లేక, ఆరోగ్యం సహకరించక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ సమయంలో ఆమెకు ఒక 'దేవుడు' అండగా నిలిచారని ఆమె చెప్పుకొచ్చింది.
ఆపద్బాంధవుడు నాగబాబు..
ఆ క్లిష్ట పరిస్థితుల్లో మెగా బ్రదర్ నాగబాబు తనకు అండగా నిలిచారని ప్రియాంక కృతజ్ఞతగా తెలిపారు. నాగబాబు గారు ప్రతి నెలా మందుల కోసం, ఖర్చుల కోసం డబ్బులు పంపించేవారని ఆమె చెప్పారు. కేవలం డబ్బు ఇవ్వడమే కాకుండా, ప్రతిరోజూ ఫోన్ చేసి ఆమె యోగక్షేమాలు అడుగుతూ ధైర్యం చెప్పేవారట. నాగబాబు సలహాతోనే తాను మళ్ళీ కోలుకుని మా టీవీ, జీ తెలుగు షోలలో అవకాశాలు దక్కించుకున్నానని ప్రియాంకా సింగ్ వెల్లడించారు.
బిగ్ బాస్ ప్రయాణం & వ్యక్తిగత జీవితం
నాగబాబు ప్రోత్సాహంతో మళ్ళీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ప్రియాంకకు బిగ్ బాస్ సీజన్ 5 లో అవకాశం వచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళేటప్పుడు తన వయస్సు 24 ఏళ్లని, లోకం తెలియని అమాయకత్వంతో వెళ్లానని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తాను నటించిన ఎపిసోడ్లను ఒక్కటి కూడా చూడలేదని ఆమె అనడం విశేషం.
గత 14 ఏళ్లుగా ప్రతి శుక్రవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్తానని.. లలితా సహస్రనామం పఠిస్తూ, పబ్‌లు, పార్టీలకు దూరంగా చాలా సాధారణ జీవితం గడుపుతున్నానని ప్రియాంక తెలిపారు. మళ్ళీ జన్మంటూ ఉంటే తన తండ్రికి మంచి కూతురిగా పుట్టాలని ప్రియాంక ఆకాంక్షించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook