Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajanna Sircilla505302

బచ్ పన్ స్కూల్ లో ప్లాంటేషన్ మరియు రైన్ డే వేడుకలు

Jul 22, 2024 12:51:03
Vemulawada, Telangana
వేములవాడ పట్టణంలోని బచ్ పన్ స్కూల్ లో సోమవారం ప్లాంటేషన్ డే మరియు రైయన్ డే ను విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులచే మొక్కలు నాటించారు. కరస్పాండెంట్ నేదురి అనిల్ కుమార్ మాట్లాడుతూ మొక్కల పెంపకం దానిలోని ప్రధాన్యత గురించి విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Jan 12, 2026 07:13:59
Hyderabad, Telangana:

BSNL 1 Rupee Plan: టెలికాం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) సంచలనం సృష్టిస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కేవలం రూ.1 కే నెల రోజుల పాటు అపరిమిత సేవలను అందించే "ఫ్రీడమ్ ప్లాన్"ను ప్రకటించింది. ప్రైవేట్ టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను పెంచుతున్న తరుణంలో, సామాన్యులకు ఇది పెద్ద ఊరటనిచ్చే వార్త. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఆఫర్ వివరాలు ఏమిటి?
ఈ ప్రత్యేక ఆఫర్ కింద రూ.1 చెల్లిస్తే మీకు కొత్త సిమ్ కార్డ్ లభించడమే కాకుండా, 30 రోజుల పాటు ఈ క్రింది ప్రయోజనాలు అందుతాయి. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా నెల మొత్తం ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ప్రతిరోజూ 100 SMSలు ఉచితంగా పంపుకోవచ్చు. ఈ ప్లాన్ మొత్తం 30 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

ఎవరికి ఈ ఆఫర్ వర్తిస్తుంది?
ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో ఉండదు, కేవలం కొందరికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కొత్తగా BSNL సిమ్ తీసుకోవాలనుకునే వారు ఈ ఆఫర్‌కు అర్హులు. అలాగే ఇతర నెట్‌వర్క్‌ల (Jio, Airtel, VI) నుండి తమ నంబర్‌ను BSNLకి మార్చుకునే (Port) వారికి కూడా ఇది మంచి అవకాశం. గమనిక: ఇప్పటికే BSNL వాడుతున్న పాత కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించదు.

ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది?
BSNL తన అధికారిక 'X' (గతంలో Twitter) ఖాతాలో వెల్లడించిన ప్రకారం.. ఈ సంక్రాంతి ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు తమ సమీపంలోని BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా గుర్తింపు పొందిన BSNL రిటైలర్ను సంప్రదించి, అవసరమైన గుర్తింపు పత్రాలు (Aadhaar Card) సమర్పించి కేవలం రూ.1కే ఈ సేవలను పొందవచ్చు.

ప్రైవేట్ సంస్థలకు గట్టి పోటీ
జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు తమ ప్లాన్ల ధరలను భారీగా పెంచడంతో, చాలా మంది వినియోగదారులు తక్కువ ధరలో మెరుగైన సేవల కోసం BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం BSNL దేశవ్యాప్తంగా తన 4G/5G నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తుండటం కూడా కస్టమర్ల సంఖ్య పెరగడానికి ఒక కారణం.

Also Read; Bengaluru Techie Sharmila: ఆమెకు 34..అతనికి 18..మిడ్‌నైట్ రూమ్‌లోంచి గట్టి గట్టిగా అరుపులు, కేకలు..అంతలోనే!

Also Read: Amrit Bharat Express Route In AP: తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక..ఏపీ మీదుగా కొత్త 'అమృత్ భారత్' రైళ్లు..వెళ్లే రూట్ ఇదే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 12, 2026 06:35:26
Bengaluru, Karnataka:

Bengaluru Techie Sharmila Case: బెంగళూరులోని రామమూర్తి నగర్‌లో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ షర్మిల (35) కేసులో పోలీసులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఇది ప్రమాదకర అగ్నిప్రమాదం కాదని.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా నిర్ధారించారు. ఈ కేసులో కేరళకు చెందిన 18 ఏళ్ల పీయూసీ (PUC) విద్యార్థి కల్నల్ కురైని పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలేం జరిగింది?
మంగళూరుకు చెందిన షర్మిల.. రామమూర్తి నగర్‌లోని ఒక ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో తన స్నేహితురాలు షబరీన్‌తో కలిసి నివసిస్తోంది. షబరీన్ పని నిమిత్తం ఢిల్లీకి వెళ్లడంతో గత 15 రోజులుగా షర్మిల ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న పొరుగింటి విద్యార్థి కల్నల్ కురై జనవరి 3వ తేదీ రాత్రి బాల్కనీ గుండా ఆమె ఫ్లాట్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు.

ఒన్‌సైడ్ లవ్..దాడి..హత్య
నిందితుడు కురైకి షర్మిల అంటే ఒన్‌సైడ్ లవ్ ఉందని, ఆ రాత్రి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. షర్మిల దీనిని తీవ్రంగా వ్యతిరేకించి ప్రతిఘటించడంతో, ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమెపై భౌతిక దాడి చేసి హతమార్చాడు.

సాక్ష్యాల ధ్వంసం కోసం అగ్నిప్రమాదం సృష్టి
హత్య చేసిన తర్వాత ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు నిందితుడు కిరాతక ప్లాన్ వేశాడు. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయని నమ్మించడానికి.. స్నేహితురాలు షబరీన్ ఉన్న బెడ్‌రూమ్‌కు నిప్పు పెట్టాడు. దీంతో ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకుంది. కానీ, షర్మిల మృతదేహం వంటగదిలో లభించింది. ఆమె శరీరంపై ఎలాంటి కాలిన గాయాలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

పోలీసుల దర్యాప్తులో తేలిన నిజాలు
మొదట అగ్నిప్రమాదంగా భావించినప్పటికీ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించినప్పుడు పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేవలం ఒక బెడ్‌రూమ్ మాత్రమే తగలబడటం, హాల్, కిచెన్ సురక్షితంగా ఉండటం. మద్యం బాటిల్ ఉన్నప్పటికీ పార్టీ జరిగిన ఆనవాళ్లు లేకపోవడం. పోస్ట్‌మార్టం రిపోర్ట్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.

నిందితుడు కల్నల్ కురైని అదుపులోకి తీసుకున్న రామమూర్తి నగర్ పోలీసులు, కోర్టు అనుమతితో అతడిని మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన స్థానిక అపార్ట్‌మెంట్ వాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

Also Read: Amrit Bharat Express Route In AP: తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక..ఏపీ మీదుగా కొత్త 'అమృత్ భారత్' రైళ్లు..వెళ్లే రూట్ ఇదే?

Also Read: PF Money Used For Loan: అప్పులు తీర్చేందుకు PF డబ్బు వాడుతున్నారా? ఈ భారీ నష్టాల గురించి మీకు తెలుసా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 11, 2026 15:37:46
Amaravati, Andhra Pradesh:

AP Govt Sankranti Gift: సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొన్ని నెలలుగా బకాయి పడిన చెల్లింపులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేతలకు సంక్రాంతి శుభవార్త ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బకాయిల చెల్లింపునకు ఆప్కో నిర్ణయం తీసుకోవడం విశేషం. రేపు చేనేత సహకార సంఘాల ఖాతాల్లో రూ.5 కోట్ల బకాయిల జమ కానున్నాయి. గతనెలలో రూ.2.42 కోట్ల బకాయిలను ఆప్కో చెల్లించగా.. తాజా చెల్లింపులతో చేనేత కుటుంబాల్లో ఆనందం నిండింది. ప్రభుత్వ నిర్ణయంపై చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.

Also Read: Cyber Crime Tips: సైబర్‌ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కకుండా ఈ 10 చిట్కాలు పాటించండి

చేనేత సహకార సంఘాలకు చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సంక్రాంతి ముంగిట శుభవార్త తెలిపారు. ఆప్కో బకాయిల్లో రూ.5 కోట్లు చెల్లించనున్నట్లు ప్రకటించారు. గతంలో చేనేత సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోలుకు సంబంధించి మరో విడత బకాయిలను విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. గత నెలలో రూ.2.42 కోట్ల మేర బకాయిలను చేనేత సహకార సంఘాలకు చెల్లించగా.. సంక్రాంతి పండగ వేళ మరో రూ.5 కోట్లు చెల్లించాలని ఆప్కో యాజమాన్యాన్ని ఆదేశించారు. దీంతో చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రేపు బకాయిలు ఆప్కో జమ చేయనుంది.

Also Read: Cyber Fraud: మారుమూల పల్లెలో రూ.547 కోట్ల సైబర్‌ క్రైమ్‌.. ఏం జరిగిందో తెలుసా?

చేనేత సహకార సంఘాల ఆర్థిక బలోపేతానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని ఈ సందర్భంగా మంత్రి సవిత తెలిపారు. చేనేత కళాకారులకు వ్యక్తిగత లబ్ధి పొందేలా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. సామూహికంగా చేనేత సహకార సంఘాల ద్వారా లబ్ధి కలిగేలా మరికొన్ని పథకాలు అమలుచేస్తామని చెప్పారు. చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడంతో పాటు కొత్త కొనుగోళ్లను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు.

Also Read: Pension Hike: ప్రైవేటు ఉద్యోగులకు భారీ జాక్‌పాట్‌.. ఐదు రెట్లు కనీస పింఛన్‌ పెంపు

చేనేత కళాకారులు గౌరవప్రదమైన జీవనం పొందడంతోపాటు 365 రోజులు ఉపాధి కల్పించడానికి తాము కృషి చేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. చేనేతలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే.. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. చేనేత ఉత్పత్తుల విక్రయాల కోసం కో ఆప్టెక్స్, టాటా తనేరియా, ఆదిత్య బిర్లా గ్రూప్‌తో ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జియో మార్ట్, ఓఎన్డీసీ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో చేనేత దుస్తుల విక్రయాలను ప్రారంభించినట్లు మంత్రి సవిత వెల్లడించారు. రెడీమేడ్ చేనేత వస్త్రాలను తయారు చేయించి, ఆప్కో షో రూమ్‌లతో పాటు ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు చేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. చేనేత కళాకారులకు రెడీమేడ్ దుస్తుల తయారీపై శిక్షణ అందిస్తామని.. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా చేనేత అమ్మకాలు ఊపందుకున్నాయని వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 11, 2026 14:07:02
Hyderabad, Telangana:

Cyber Crime Precautions: ఆశపడితే సరే.. కానీ అత్యాశకు వెళ్తితే మాత్రం ఉన్నది పోతది.. ఉంచుకున్నది పోతది అనేది జగమెరిగిన సత్యం. ఎంత సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంటే ఆ స్థాయిలో అన్ని నేరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సైబర్‌ నేరాలు కళ్ల ముందే జరుగుతుంటాయి. కానీ మోసపోతున్నామనేది తెలియదు. సైబర్‌ క్రైమ్‌ బారిన నిరక్షరాస్యుల కన్నా చదువుకున్న వారే మోసపోతుండడం గమనార్హం. నిన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మాజీ భార్య కొన్ని కోట్ల రూపాయలు మోసపోగా.. గతంలో చాలా మంది వీఐపీలు కూడా సైబర్‌ ఉచ్చున చిక్కుకున్నారు. ఇలా సైబర్‌ నేరాల పారిట మోసపోకుండా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.

Also Read: Pension Hike: ప్రైవేటు ఉద్యోగులకు భారీ జాక్‌పాట్‌.. ఐదు రెట్లు కనీస పింఛన్‌ పెంపు

==> తెలియని కాల్స్ లేదా మెసేజ్‌లను నమ్మరాదు. బ్యాంక్, పోలీస్, కస్టమ్స్ అని చెప్పి మాట్లాడితే మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదు. ఓటీపీ, సీవీవీ, పిన్‌ ఎవరితోనూ వీటిని పంచుకోకూడదు. అవసరమైతే అధికారిక నంబర్‌కు తిరిగి కాల్ చేయాలి.

==> అనధికారిక లింకులు క్లిక్ చేసే ముందు ఆలోచించాలి. ఉచిత గిఫ్ట్‌లు, లాటరీ పేర్లతో వచ్చే సందేశాలు కుంభకోణాలే. లింక్ ఓపెన్ చేస్తే డేటా చోరీ జరుగుతుంది. వచ్చిన సందేశాలపై అనుమానం ఉంటే వెంటనే డిలీట్ చేయాలి.

==> ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటే నకిలీ వెబ్‌సైట్లు జాగ్రత్త. యూఆర్‌ఎల్‌ సరిగా ఉందో లేదో చెక్ చేయాలి. అతి తక్కువగా ధరలు చూపిస్తుంటే అనుమానించాలి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ ఉంటేనే ఆర్డర్‌ చేసుకోవాలి.

==> పెట్టుబడి పథకాలు (ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌)లో హామీలను నమ్మకూడదు. డబుల్ మనీ, ఫాస్ట్ రిటర్న్స్ వంటి మాటలు, ఆఫర్లు పెడితే అవి స్కామ్ అని గుర్తించాలి. అలాంటి ప్రకటనలు, సందేశాలు వస్తే వాటి రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించాలి. వీటిపై నిపుణుల సలహా తీసుకోవాలి.

==> రోజురోజుకు సోషల్ మీడియా వినియోగం పెరుగుతుండడంతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తుంటే జాగ్రత్త. నకిలీ ప్రొఫైల్స్‌తో మోసాలు జరుగుతుంటాయి. వ్యక్తిగత ఫొటోలు పంపకూడదు. అనుమానాస్పద అకౌంట్లను బ్లాక్ చేయాలి.

Also Read: Cyber Fraud: మారుమూల పల్లెలో రూ.547 కోట్ల సైబర్‌ క్రైమ్‌.. ఏం జరిగిందో తెలుసా?

==> కస్టమర్ కేర్ నంబర్ల విషయంలో అప్రమత్తత ఉండాలి. గూగుల్‌లో కనిపించే ప్రతి నంబర్ నిజం కాదనే విషయాన్ని గుర్తించాలి. ఆఫిషియల్ (అధికారిక) యాప్ లేదా వెబ్‌సైట్ నుంచే కాల్‌ సెంటర్‌ నంబర్ తీసుకోవాలి. రిమోట్ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకుంటే మోసపోయే ప్రమాదం ఉంది.

==> కేవైసీ అప్‌డేట్ పేరుతో వచ్చే కాల్స్ మోసపూరితమైనవి కావచ్చు. బ్యాంకులు ఎప్పుడూ ఫోన్‌లో లావాదేవీలు, ఓటీపీ, బ్యాంకు అకౌంట్‌ వివరాలు అడగవనే విషయాన్ని గుర్తించాలి. లింక్ ద్వారా కేవైసీ చేయమంటే అస్సలు చేయరాదు. ఒకవేళ అలాంటి ఫోన్‌ కాల్స్‌, సందేశాలు వస్తే నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించాలి.

==> ఉద్యోగాల పేరుతో చాలా కుంభకోణాలు, మోసాలు జరుగుతున్నాయి. నిరుద్యోగులు చాలా అప్రమత్తంగా ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫీజు అడిగితే మోసం అనే విషయాన్ని గ్రహించాలి. ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం ఇస్తామని చెబితే అస్సలు నమ్మరాదు. ఒకవేళ అలాంటి అవకాశం కల్పిస్తుంటే కంపెనీ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి.

==> క్యూఆర్‌ కోడ్ రూపంలో కూడా మోసాలు జరుగుతున్నాయి. డబ్బు రిసీవ్ చేయడానికి క్యూఆర్‌ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తు తెలియని చోట్ల క్యూఆర్‌ కోడ్స్‌ స్కాన్ చేయరాదు. ఒకవేళ చేస్తే  ఒకౌంట్‌లోని డబ్బు మొత్తం వెళ్లిపోతుంది.

==> వ్యక్తిగతానికి సంబంధించిన అంశం డేటింగ్, మ్యాట్రిమోని మోసాలు. పెళ్లి సంబంధాలు, డేటింగ్‌ యాప్స్‌తో మోసాలు జరుగుతుంటాయి. దీనిని హనీట్రాప్‌ అంటారు. భావోద్వేగాలతో ఆడుకుని మోసాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి మోసాలను బయటకు చెప్పుకుంటే పరువుపోతుందని కొందరు ఫిర్యాదు చేసేందుకు ముందుకు కూడా రారు. ఈ మోసాలపై చాలా అప్రమత్తంగా ఉండాలి.

Also Read: KTR: నీ డ్రామాలు, అబద్ధాలు ఎక్కువ రోజులు నడవవు.. రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ కౌంటర్‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 11, 2026 13:51:30
Hyderabad, Telangana:

Pawan Kalyan Tiger of Martial Arts: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీర్తి కిరీటంలో మరో అంతర్జాతీయ మైలురాయి వచ్చి చేరింది. అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, తనకిష్టమైన మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన అత్యున్నత స్థాయి గుర్తింపును సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన 'కెంజుట్సు' (Kenjutsu) లో అధికారికంగా ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు.

మూడు దశాబ్దాల సుదీర్ఘ సాధన
సినిమాల్లోకి రాకముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం మొదలైంది. చెన్నైలో కరాటేతో ప్రారంభించి, కేవలం శారీరక దృఢత్వం కోసమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోని తత్వశాస్త్రాన్ని కూడా ఆయన లోతుగా అధ్యయనం చేశారు. దాదాపు 30 ఏళ్లుగా ఆయన చూపిస్తున్న నిబద్ధతకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

పవన్ కళ్యాణ్ అందుకున్న ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..
ఫిఫ్త్ డాన్ (5th Dan) గౌరవం: జపాన్ సంప్రదాయ యుద్ధకళల సంస్థ 'సోగో బుడో కన్‌రి కై' పవన్ కళ్యాణ్‌కు ఈ ఉన్నత స్థాయి గుర్తింపును అందించింది.

టకెడా షింగెన్ క్లాన్: జపాన్ వెలుపల ఈ ప్రతిష్ఠాత్మక క్లాన్‌లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ గుర్తింపు పొందారు. ఇది అత్యంత అరుదుగా లభించే గౌరవం.

టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్: గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు ఈ విశిష్ట బిరుదును ప్రధానం చేసింది.

కెండో శిక్షణ: ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ వద్ద 'కెండో'లో పవన్ సమగ్ర శిక్షణ పొందారు.

తెరపై మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన
పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ పట్ల తనకున్న మక్కువను కేవలం వ్యక్తిగత సాధనకే పరిమితం చేయకుండా, వెండితెరపై కూడా అద్భుతంగా ప్రదర్శించారు. తాను నటించిన తొలి చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'లోనూ తన యుద్ధకళా నైపుణ్యాన్ని చాటుకున్నారు. 

ఆ తర్వాత 'తమ్ముడు', 'ఖుషి' చిత్రాల్లోని ఫైట్ సీక్వెన్సులు తెలుగు ప్రేక్షకులకు మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తిని పెంచాయి. ఇటీవలే విడుదలైన OG (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రంలోనూ పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి జపనీస్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.

సినిమా నటుడిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే.. కఠినమైన క్రమశిక్షణతో కూడిన జపనీస్ యుద్ధకళల్లో ఈ స్థాయి గుర్తింపు సాధించడం విశేషం. మార్షల్ ఆర్ట్స్ అంటే కేవలం పోరాటం మాత్రమే కాదు, అది నిరంతర అభ్యాసం, వినయం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు.

Also Read: PF Money Used For Loan: అప్పులు తీర్చేందుకు PF డబ్బు వాడుతున్నారా? ఈ భారీ నష్టాల గురించి మీకు తెలుసా!

Also Read: RRB Group D Recruitment: రైల్వేలో 22,000 ఉద్యోగాల మేళా..10వ తరగతి చదివితే చాలు..జీతం ఎంతో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 11, 2026 13:26:35
Dhamsalapuram, Telangana:

Rs 547 Crore Cyber Fraud: ఎంత అవగాహన కల్పిస్తున్నా.. నిరక్షరాస్యుల కన్నా చదువుకున్న వారే సైబర్‌ మోసగాళ్లకు చిక్కి దారుణంగా మోసపోతున్నారు. మొన్న ఏకంగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సతీమణి కొన్ని కోట్ల రూపాయలు మోసపోగా తాజాగా మారుమూల ప్రాంతంలో ఏకంగా వందల కోట్ల సైబర్‌ నేరం జరిగింది. రూ.547 కోట్ల సైబర్‌ నేరం జరగడం తీవ్ర సంచలనం రేపగా.. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Pension Hike: ప్రైవేటు ఉద్యోగులకు భారీ జాక్‌పాట్‌.. ఐదు రెట్లు కనీస పింఛన్‌ పెంపు

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన సైబర్ నేరంపై పోలీస్‌ కమిషనర్‌ సునీల్ దత్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా కేసు పూర్వపరాలు వెల్లడించారు. సైబర్‌ నేరంపై మోదుగు సాయి కిరణ్ అనే వ్యక్తి 2025 డిసెంబర్ 24వ తేదీన ఫిర్యాదు ఇచ్చాడు. అతడి ఫిర్యాదుతో ఈ సైబర్ నేరం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చాలా మందిని ఉద్యోగం పేరుతో బ్యాంక్ ఖాతాలు తీసుకుని.. వాటి ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలిందని కమిషనర్‌ వెల్లడించారు.

Also Read: KTR: నీ డ్రామాలు, అబద్ధాలు ఎక్కువ రోజులు నడవవు.. రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ కౌంటర్‌

పోట్రూ మనోజ్ కల్యాణ్, ఉడతనేని వికాస్, మేడా భానుప్రియ ఈ సైబర్ మోసాలకు ప్రధాన నిందితులుగా గుర్తించినట్లు పోలీస్‌ కమిషనర్‌ సునీల్ దత్ ప్రకటించారు. కల్యాణ్ ఖాతాల్లో రూ.114 కోట్లు, అతడి భార్య భానుప్రియ ఖాతాల్లో సుమారు రూ.44.5 కోట్లు, కల్యాణ్ బావమరిది మేడా సతీష్ ఖాతాల్లో రూ.130 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాల్లో రూ.80 కోట్ల లావాదేవీలు జరిగాయని కమిషనర్‌ వివరించారు. ఇప్పటికీ సుమారు రూ.547 కోట్ల మేర సైబర్ నేరం జరిగిందని.. ఇంకా విచారణ జరుగుతుండడంతో మోసపోయిన లెక్క అనేది ఇంకా తేలాల్సి ఉందని తెలిపారు.

Also Read: Sankranti Gift: సంక్రాంతి పండుగకు తెలంగాణ మంత్రి శుభవార్త.. ఏమిటో తెలుసా?

కాంబోడియాలో ఉన్న చైనీస్ ఏజెంట్లకు డబ్బులు బదిలీ చేసి కమీషన్లు తీసుకున్నారని, క్రిప్టో కరెన్సీ లావాదేవీల ద్వారా కూడా అక్రమంగా డబ్బులు సంపాదించినట్లు పోలీస్‌ కమిషనర్‌ సునీల్ దత్ వివరించారు. వీరి కింద పనిచేసే ఉద్యోగులను నియమించి.. ఒక్కో వ్యక్తి నుంచి 10 బ్యాంక్ ఖాతాలు చొప్పున సేకరించినట్లు.. కాంబోడియాలోని కాల్ సెంటర్ల ద్వారా ఓటీపీ ఫ్రాడ్, డిపాజిట్ ఫ్రాడ్, ఏపీకే ఫ్రాడ్‌లకు పాల్పడినట్లు కమిషనర్‌ తెలిపారు. ఎవరూ తమ బ్యాంక్ ఖాతాలను ఇతరులకు ఇవ్వకూడదని.. మ్యూల్ అకౌంట్‌గా ఖాతా ఇచ్చినా అది నేరమని స్పష్టం చేశారు. చిన్న చిన్న కమీషన్లకు ఆశపడి ఇలాంటి నేరాల్లో ఇరుక్కుంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీస్‌ కమిషనర్‌ సునీల్ దత్ హెచ్చరించారు.

ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరూ తప్పించుకునే అవకాశం పోలీస్‌ కమిషనర్‌ సునీల్ దత్ స్పష్టం చేశారు. గత నెల 24వ తేదీన ఇదే పోలీస్ స్టేషన్‌లో పోట్రు ప్రవీణ్ అనే వ్యక్తి  సైబర్ నేరం కింద అరెస్టవడం.. ఇప్పుడు పోట్రు కల్యాణ్‌పై సైబర్ కేసు నమోదు కావడం చూస్తుంటే ఈ ప్రాంతంలో మరెంతమంది సైబర్ నేరస్తులు ఉన్నారోనని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 11, 2026 12:36:08
Hyderabad, Telangana:

King Cobras In Bathroom Video Watch: సాధారణంగా మనమంతా బాత్రూం కి వెళ్ళేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించకుండా వెళ్లి పనులు కానిస్తూ ఉంటాము. కానీ ఇటీవల కాలంలో అడవులు విస్తీర్ణత పూర్తిగా తగ్గిపోవడం.. జనావాసాలు పెరగడం కారణంగా విశ్వసర్పాలు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. అలాగే మరికొన్ని విష సర్పాలు అయితే ఏకంగా బాత్రూంలోకి కూడా వస్తున్నాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఎన్నో వీడియోలు మనం సోషల్ మీడియాలో చూసిన సంగతి తెలిసిందే. తాజాగా కూడా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షార్ట్ వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ ఇంట్లోని బాత్రూంలో ఏకంగా రెండు భారీ విషసర్పాలు తిష్ట వేసి ఉండడం మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఇందులో ఒక పాము అత్యంత భయానకంగా పడక విప్పి బుసలు కొడుతూ కెమెరా వైపు చూస్తూ ఉండడం భయాన్ని కలిగిస్తోంది. సాధారణంగా అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా సంచారం చేసేందుకు చీకటిగా తేమగా ఉండే ప్రదేశాలను ఎక్కువగా వెతుక్కుంటూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఈ రెండు పాములు తేమగా ఉన్న బాత్రూమ్ ని నివాసస్థలంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో పాములు ఇలాగే సంచారం చేస్తూ ఉంటాయి. అందుకే అక్కడి ప్రజలు నిత్యం పాములు బాత్రూంలోకి రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లోనైతే.. పాములు ఇలా బాత్రూంలోకి దూరి అందులోకి వెళ్లిన మనుషులపై దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగిన సంగతి మన సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలను కూడా చూసి ఉన్నాం.. ఏది ఏమైనా ఇలా అడవి ప్రాంతాలకు దగ్గరగా ఇళ్లను కట్టుకునేవారు బాత్రూంకి వెళ్లే క్రమంలో ఒకటికి రెండుసార్లు చూస్తూ వెళ్లాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే అద్భుతమైన ప్రజాధరణ పొందింది. అంతేకాకుండా ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా జనాలు అయితే ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలు ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఇతరులకు కూడా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోని కూడా చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Advertisement
Back to top