వేములవాడలో ఏఐటీయూసీలో వలస కార్మికుల చేరిక
Venkatapur, Telangana:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వలస కార్మికులను ఏఐటీయూసీలో చేర్చుకున్నారు. రాజస్థాన్ నుంచి వచ్చిన మార్బల్ టైల్స్ మేస్తిరి లేబర్లతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల పోశెట్టి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, సర్జీత్ సింగ్, బన్వారి లాల్, నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Oppo Find X9s: కెమెరా అదిరింది.. ఒప్పో ఫైండ్ X9s ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Hyderabad, Telangana:Oppo Find X9s Specs Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ ఒప్పో (Oppo) మార్కెట్లోకి మరో అద్భుతమైన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ ఒప్పో ఫైండ్ X9s (Oppo Find X9s) పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ టెక్ ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన బ్యాటరీ సామర్థ్యంతో పాటు అత్యాధునిక కెమెరా సెటప్‌తో పాటు పవర్ఫుల్ ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ Oppo Find X9s స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 6.59 అంగుళాల AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ డిస్ల్పే వినియోగదారులకు అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఈ డిస్ల్పే ప్రొటెక్షన్ కంపెనీ కంపెనీ ఎంతో శక్తివంతమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఇందులో కంపెనీ ఒప్పో ఫైండ్ X9s మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500s (MediaTek Dimensity 9500s) చిప్సెట్ ప్రాసెసర్‌తో విడుదల చేసింది.
ఈ Oppo Find X9s మొబైల్ 12GB ర్యామ్‌తో పాటు 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో వచ్చింది. అలాగే మల్టీ టాస్కింగ్‌తో పాటు హై-ఎండ్ గేమింగ్ ఆడేవారికి ఇది ఒక గొప్ప ఎంపికగా టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏంటంటే? దీని కెమెరా సెటప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్ కలిగి కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీని వెనక భాగంలో 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్‌తో పాటు 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరాను కూడా అందిస్తోంది. అంతేకాకుండా సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరాను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఇందులో కంపెనీ 4K వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!
ఈ Oppo Find X9s స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కూడా ఎంతో శక్తివంతంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఇది 7025mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది భారీ బ్యాటరీ సామర్థ్యం ఉండటం వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చని కంపెనీ క్లైమ్ చేస్తోంది. అంతేకాకుండా 80W సూపర్ వూక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల ఈ బ్యాటరీ సులభంగా ఛార్జ్ అవుతుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ (ColorOS) ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీని స్టార్టింగ్ ధర అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.85 వేల నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిని కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Motorola Edge 70 Pro: 6500mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ఫీచర్స్ ఇవే!
Hyderabad, Telangana:Motorola Edge 70 Pro Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మోటరోలా ఎంతో శక్తివంతమైన ఎడ్జ్ సిరీస్‌లోని మరో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. బుధవారం ఈ కంపెనీ భారత మార్కెట్లోకి మోటరోలా ఎడ్జ్ 70 ప్రో (Motorola Edge 70 Pro) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది అద్భుతమై డిజైన్‌తో పాటు ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇందులో కంపెనీ అతి పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ అయ్యింది. అయితే, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ Motorola Edge 70 Pro స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల 1.5K ఎక్స్ట్రీమ్ అమోలెడ్ (Extreme AMOLED) డిస్ప్లేతో విడుదలైంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంటుంది. ఈ డిస్ల్పే వినియోగదారులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్‌తో లాంచ్ చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ 4nm చిప్సెట్తో అందుబాటులోకి వచ్చింది. కాబట్టి దీనితో గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్‌కు అత్యంత అద్భతంగా పని చేస్తుంది.
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం కంపెనీ అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది. వెనక భాగంలో OIS సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. దీంతో పాట ఫ్రంట్ భాగంలో సెల్ఫీల కోసం ముందు భాగంలో కూడా 50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరాను అందిస్తోంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా అద్భుతమైన ఫిల్టర్స్ కూడా లభిస్తున్నాయి.
Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!
ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 6500mAh భారీ బ్యాటరీతో పాటు 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభించడం చాలా విశేషం.. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ అత్యంత తక్కువ సమయంలో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీంతో పాటు 3 ఏళ్ల ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తూ వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ స్టోరేజ్‌తో పాటు వివిధ ధరల్లో లభిస్తోంది. దీని మొదటి స్టోరేజ్ వేరియంట్ 256GB స్టోరేజ్‌తో ధర రూ. 38,999తో అందుబాటులో ఉంది. ఇక రెండవ వేరియంట్ 12GB RAM + 256GB స్టోరేజ్‌తో ధర రూ.41,999తో లభిస్తోంది. ఈ మొబైల్ ఏప్పిల్ 29వ తేది నుంచి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో పాటు మోటరోలా అధికారిక వెబ్సైట్లలో అందుబాటులోకి రాబోతోంది.
Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Neechabhanga Raja Yoga 2026: మే నెలలో అరుదైన నీచభంగ రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే!
Hyderabad, Telangana:Neechabhanga Raja Yoga In May 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏవైన రెండు గ్రహాలు కలయిక జరిపినప్పడు ఏర్పడే యోగాలు అన్ని రాశులవారిపై ఏదో ఒక విధంగా ప్రభావం తప్పకుండా చూపుతాయి. అయితే, ఈ ఏడాది మే నెలలో గ్రహాల స్థితిగతుల్లో అరుదైన మార్పులు సంభవించబోతున్నాయి. ఈ సమయంలో అత్యంత శక్తివంతమైన నీచభంగ రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఒక గ్రహం నీచ స్థితిలో బలహీనంగా ఉన్నప్పుడు.. మరో గ్రహం సహాయంతో ఆ దోషం తొలగిపోయి.. రాజయోగంగా మారుతుంది. దీనినే జ్యోతిష్య శాస్త్రంలో నీచభంగ రాజయోగం అంటారు. ఈ యోగ ప్రభావం కూడా అన్ని రాశులవారిపై సమానంగా పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశులవారు అదృష్టాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ యోగంతో మూడు రాశులవారికి అదృష్టం వరించబోతోంది..
1. మేష రాశి (Aries)
నీచభంగ రాజయోగం ఏర్పడడం వల్ల మేష రాశివారికి ఈ సమయం స్వర్ణయుగమనే చెప్పాలి. ఎందుకంటే ఈ సమయంలో నిలిచిపోయిన ప్రతి పని వేగంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎలాంటి పని చేసిన తప్పకుండా సక్సెస్ అవుతారు. దీంతో పాటు ఊహించని విధంగా ధనలాభం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత బాకీలు కూడా ఈ సమయంలో సులభంగా వసూలవుతాయి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెంపు ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు నూతన ఒప్పందాలు కలిసివస్తాయి. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే ఛాన్స్ కూడా ఉంది.
2. కర్కాటక రాశి (Cancer)
నీచభంగ రాజయోగం ప్రభావంతో కర్కాటక రాశివారికి కూడా ఈ సమయం చాలా కలిసి రాబోతోంది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. కుటుంబంలో ఉన్న ఎలాంటి కలహాలైన సులభంగా తొలగిపోయి.. సులభంగా ప్రశాంతత లభించబోతోంది. దీంతో పాటు ఇంట్లో తప్పకుండా శుభకార్యాలు కూడా జరుగుతాయి. అంతేకాకుండా గత కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలకు మార్గం సుగమం అవుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో లక్కీ జాక్‌పాట్ కొట్టే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.
3. కన్య రాశి (Virgo)
ఈ శక్తివంతమైన రాజయోగం ఎఫెక్ట్‌తో కన్య రాశి (Virgo)వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆపారమైన కీర్తి, ప్రతిష్టలు కూడా పొందే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు సమాజంలో గౌరవం విపరీతంగా పెరుగుతుంది. రాజకీయ లేదా సామాజిక రంగాల్లో ఉన్న వారికి పదవీ యోగం కూడా ఉంది. దీని కారణంగా మంచి పదవులను కూడా త్వరలోనే పొందుతారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు ఇది చాలా అనువైన సమయమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
Also Read: Gajalakshmi Rajayoga 2026: మే 14 నుంచి ఈ 4 రాశుల వారికి మహర్దశ.. గజలక్ష్మి రాజయోగంతో ధన వర్షం ఖాయం!

Also Read: Gajalakshmi Rajayoga 2026: మే 14 నుంచి ఈ 4 రాశుల వారికి మహర్దశ.. గజలక్ష్మి రాజయోగంతో ధన వర్షం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IRS Daughter Murder: రెండురోజుల్లో 2 రేప్‌లు, ఒక మర్డర్.. పోలీసులకే మైండ్ బ్లాంక్! దేశ రాజధానిని వణికించిన ‘కిల్లర్’ పనిమనిషి స్టోరీ!
Hyderabad, Telangana:2 Days 2 Rapes In IRS Daughter Rape case: ఈ క్రైమ్ పని మనిషి కిల్లర్ కథ వింటే ఇంట్లో పనిమనిషి ఉన్న ప్రతిఒక్కరూ బెంబేలెత్తి పోవాల్సిందే. పని నుండి తొలగించిన వ్యక్తి సదరు యజమాని కుమార్తె ప్రాణాలు తీశారు. ఏకంగా అత్యాచారం చేసి మరీ హత్య చేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపుతోంది. ఐఆర్ఎస్ కూతురు (22) హత్యాచారం కేసులో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల ప్రకారం రాహుల్ అనే మాజీ ఇంటి పనిమనిషి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వెంటనే పోలీసులు సదరు నిందితుని గాలించి అరెస్టు చేశారు. ప్రధానంగా ఆన్లైన్ గేమ్స్‌కు బానిసైనా అతన్ని నెల కిందటే పని నుంచి తొలగించారు. ఆ కక్షతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రెక్కీ వేసి మరీ డూప్లీకేట్ కీ తో ప్రవేశించి యువతిపై అఘాయిత్యానికి పాల్పడి, ఆ తర్వాత గొంతు నిలిమి చంపేశాడు. అయితే, ఈ కేసులో పోలీసులకు మరో విస్తుపోయే నిజం తెలిసింది. నిందితుడు ఈ హత్య చేసిన ముందు రోజే అళ్లార్లో ఒక మహిళను రేప్ చేసినట్లు సమాచారం. ఈ క్రైమ్ కిల్లర్ స్టోరీ రెండు రోజుల్లో రెండు అత్యాచారాలు, ఒక మర్డర్ దేశవ్యాప్తంగా వణికిస్తోంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
ఈ ఐఆర్ఎస్ కూతురు యూపీఎస్‌స్సీ కి సన్నద్ధమవుతోంది. ఢిల్లీ ఈస్ట్ కైలాష్ లో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ పనిమనిషి వయస్సు కేవలం 19 ఏళ్ళు మాత్రమే. దారుణానికి ఒడిగట్టిన అనంతరం దగ్గరలో ఉన్న ద్వారకా హోటల్ వద్ద తిరగడంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించినప్పుడు ఈ నిందితుడి గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇతడు ఢిల్లీలో పలు నేరాలు పాల్పడినట్లు సమాచారం. అంతేకాదు తన స్వగ్రామామైన అల్వార్ లో కూడా ఓ మహిళపై దారుణానికి ఒడిగట్టాడు. స్నేహితుడి భార్యపై అత్యాచారం చేశాడు. డబ్బులు పెట్టి లూడో గేమ్ ఆడుతూ తరచూ వారి ఇంటికి వెళ్లేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లోనే ఒక రూమ్‌లో అద్దెకు దిగినట్లు స్థానికులు సమాచారం. తన స్నేహితుడి భార్యపై అత్యాచారం జరిపి ఢిల్లీకి పారిపోయాడు. ఇక్కడ కూడా తోటి పనివారి నుంచి డబ్బులు అప్పుగా తీసుకొని తిరిగి ఇచ్చేవాడు కాదు. బెదిరింపులకు పాల్పేడవాడని సమాచారం.
READ ALSO: ఘోర ప్రమాదం.. అదుపుతప్పిన ట్రక్కు, చెల్లాచెదురైన వాహనాలు, 11 మంది సజీవదహనం! హృదయవిదారక దృశ్యం..
READ ALSO: Kurnool Accident: కర్నూల్ జిలాల్లో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం, 15 మందికి తీవ్రగాయాలు..!
CCTV Footage Of Suspect | Month After Being Fired, Help Rapes, Kills IRS Officer's Daughter In Delhi https://t.co/0ZzThTWZ7R pic.twitter.com/JIakc80ZPm
— NDTV (@ndtv) April 22, 2026
ఢిల్లీ జాయింట్ కమిషనర్ పోలీస్ విజయ్ కుమార్ ఈ ఘటన గురించి మీడియాతో మాట్లాడారు హత్యకు గల అసలైన కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో రెండు రేప్‌లకు పై దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా అతని క్రిమినల్ మైండ్ సెట్ వల్లే ఈ దారుణానికి వడగట్టాడని చెప్పారు. ప్రస్తుతం ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తొలగించినందుకే ఈ దారుణానికి వడగట్టినట్లు తెలుస్తోంది. కక్ష పెట్టుకొని తన యజమాని కూతురినే అత్యాచారం చేసి హత్య చేశాడు. ఇక దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. అత్యాచారాన్ని తర్వాత అక్కడ నిందితుడు సంచరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: పన్ను ఎగవేతే లక్ష్యం.. చీకటి వ్యాపారానికి కరీంనగర్ అడ్డా..
Karimnagar, Telangana:Karimnagar Zero Bill Scam Latest News: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జీరో బిల్లు వ్యాపారం ఇప్పుడు యదేచ్చగా సాగుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతోంది. GST ఎగవేత లక్ష్యంగా సాగుతున్న ఈ అక్రమ దందా వల్ల ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం పక్కదారి పడుతోంది. కరీంనగర్ లోని ప్రకాశం గంజ్‌తో పాటు గోదావరిఖని, జగిత్యాల వంటి ప్రధాన వ్యాపార కేంద్రాల్లో ఈ దందాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతూ వస్తోంది.
ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంటుతో పాటు ఐరన్, ఇతర వస్తువులు, వ్యవసాయానికి సంబంధించిన ఎరువుల విక్రయాలు జీరో బిల్లుల దండ ఎక్కువగా సాగుతోంది. నిబంధనల ప్రకారం ప్రతి లావాదేవీకి జిఎస్టి బిల్లు తప్పనిసరి. కానీ కొందరు బడా వ్యాపారులు పన్ను ఎగవేసేందుకు ఎలాంటి బిల్లులు లేకుండా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రతో పాటు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి ఎటువంటి పత్రాలు లేకుండా సరుకులను తరలిస్తున్నారు. వీటిని ఊరు శివారులోని రహస్యం గోదాముల్లో నిల్వ ఉంచి.. చీకటి పడ్డాక చిల్లర వర్తకులకు సరఫరా చేస్తూ వస్తున్నారు..
వాణిజ్య పన్నుల శాఖ అధికారుల అండదండలతోనే.. ఈ వ్యాపారం కోట్లలో సాగుతూ ఉందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నామమాత్రం గానే సాగుతున్నాయని.. లారీకి ఇంత అని మామూలు అందడంతో అక్రమ రవాణాకు అడ్డు లేకుండా పోతుందని తెలుస్తోంది.. ఏటా వెలకోట్ల టర్నోవర్ జరిగే కరీంనగర్ మార్కెట్లో.. కాగితాలపై మాత్రం తక్కువ లావాదేవీలను చూపిస్తూ అధికారులను మేనేజ్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి..
వ్యాపారులు జీరో బిల్లుల పేరుతో సామాన్య ప్రజల నుంచి పూర్తిస్థాయిలో ధరను వసూలు చేస్తూ.. ప్రభుత్వానికి మాత్రం పన్ను చెల్లించడం లేదు.. ఒకవేళ వినియోగదారుడు బిల్లు అడిగితే అదనంగా పన్ను కట్టాలని భయపెట్టి.. బిల్లు లేకుండా తక్కువ ధరలకే ఇస్తున్నామని నమ్మిస్తున్నారు. దీనివల్ల వినియోగదారుడు నాణ్యత లేని వస్తువులు కొన్న చట్టపరంగా ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా పోతావని సమాచారం..
Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!
ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్న ఈ వ్యవస్థపై ఉన్నత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలతో పాటు ఇతర అధికారులు కలిసి గోదాములపై దాడులు నిర్వహించి.. అక్రమంగా నిల్వచేసిన సరుకు సీజ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. పన్ను ఎగవేత దారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేరుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు..
Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Luxury Cars At 5 Lakhs: రూ.5 లక్షలకే ఆడి, BMW కార్లు.. కళ్లు చెదిరే ఆఫర్లు!
Hyderabad, Telangana:Second-Hand Luxury Cars At 5 Lakhs News: ఖరీదైన లగ్జరీ కారు కొనాలనేది మధ్యతరగతి ప్రజల కల.. సాధారణ వినియోగదారులు రోడ్లమీద లగ్జరీకారులను చూసి వాటిని ఫాలో అవుతుంటారు. అంటే ఆ కార్లు అంటే వారికి ఎంతో ఇష్టం. కానీ, ఈ కార్లు 50 లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఉంటాయి. అయితే, సెకండ్ హ్యాండ్ కార్లు మాత్రం అత్యంత తక్కువ ధరల్లో లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఢిల్లీ లాంటి కొన్నిచోట్లనైతే సాధారణ కార్ల ధరల్లోనే సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు లభిస్తూ ఉంటాయి. ఢిల్లీలోని రోహిణి సెక్టర్లో ఉన్న ఆటో కింగ్ సెకండ్ హ్యాండ్ కార్లకు సంబంధించిన షోరూం లో మెర్సిడెస్ బెంచ్, ఆడి, బిఎమ్‌డబ్ల్యూ వంటి దిగ్గజ బ్రాండ్ల కార్లు సాధారణ కార్ల ధరలకే లభిస్తున్నాయి. కేవలం రూ. 99,000 నుంచే కార్ల అందుబాటులో ఉండడం విశేషం..
సాధారణంగా మారుతి స్విఫ్ట్ కార్ ధర షోరూం ప్రైస్ దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. అయితే, ఇక్కడ మెర్సిడెస్ బెంజ్ c200 పెట్రోల్ కారు ధర కేవలం రూ.4.90 లక్షల కే లభిస్తోంది. అంటే మారుతి స్విఫ్ట్ కారు సగం ధరకే ఈ కారు లభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక ఆడి ఏ సిక్స్ మెట్రిక్స్ వంటి ప్రీమియం లగ్జరీ కార్ కూడా ఇక్కడ 5.95 లక్షలకే అందుబాటులో ఉండడం విశేషం. ఇంత తక్కువ ధరకే లగ్జరీ కార్లు లభించడంతో చాలామంది ఆశ్చర్యపోయి అక్కడికి వెళ్లి మరి విక్రయించే వారిని ధరలు అడుగుతున్నారు..
Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!
ఇవే కాకుండా ఎస్యూవీ (SUV) ప్రియుల కోసం మహీంద్రతో పాటు టాటా బ్రాండ్‌కు సంబంధించిన ఫ్యామిలీ కార్స్ కూడా చాలా తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మహీంద్రా ఎక్స్‌యూవీ 500 (XUV 500) కేవలం రూ. 3.90 లక్షలకే అందుబాటులో ఉంది. అలాగే ఎంతో శక్తివంతమైన కారుగా భావించే ఫోర్డ్ కంపెనీకి చెందిన ఎండీవర్ (3.2 ఆటోమేటిక్) రూ. 11.90 లక్షలకు లభిస్తోంది. దీంతోపాటు స్కార్పియో, థార్, ఫార్చ్యూనర్ వంటి కార్ల సగం ధరలకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ కేవలం రూ.50 వేలు లేదా లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కడితే చాలు.. ఇక్కడ మీకు నచ్చిన కార్ ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకమైన ఫైనాన్స్ సదుపాయం కూడా అందిస్తున్నారు.
ఈ కార్ బజార్లో కేవలం ఢిల్లీ వరకే కాకుండా.. ఫ్యాన్ ఇండియా సర్వీసులను కూడా కొన్ని సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ వాళ్ల అందిస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఉన్న.. మీరు కొనుగోలు చేసిన కారును ఇంటికి పంపించేలా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది. అంతేకాకుండా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ హర్యానా వంటి రాష్ట్రాలకు చెందిన వారికి రిజిస్ట్రేషన్ బదిలీ ప్రక్రియను కూడా దగ్గరుండి కార్లను విక్రయించే వారు పూర్తి చేస్తున్నారు. అయితే, చాలా తక్కువ ధరల్లో కార్లు అందుబాటులోకి రావడం వల్ల, యూజ్డ్ కార్లు కొనుగోలు చేసేటప్పుడు ఇంజన్ కండిషన్ తో పాటు యాక్సిడెంట్ హిస్టరీని కూడా ఒకసారి పరిశీలించడం చాలా మంచిదని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు.
Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Harish Rao: తెలంగాణ హైకోర్టుపై హరీశ్ రావు హర్షం.. సత్యమేవ జయతే!
Hyderabad, Telangana:Telangana High Court: కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు వెలువరించిన తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ 'ఎక్స్' వేదికగా ప్రకటన చేశారు. సత్యమేవ జయతే అని ప్రకటించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమంగా ధర్మం జయిస్తుందని తెలిపారు. ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం అని ప్రకటించారు. కేసీఆర్, తనపై ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.
Also Read: KCR Harish Rao: రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ.. హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావుకు భారీ ఊరట
'సత్యమేవ జయతే.. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుంది. సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. 'ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని.. ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పు ఇచ్చింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Also Read: KCR Highlights: జగిత్యాలలో కేసీఆర్ 3.0.. ప్రజా ఆశీర్వాద సభ టాప్ 10 హైలెట్స్
'కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యింది. ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 'ఎవరు ఔనన్నా కాదన్నా ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
సత్యమేవ జయతే ✊
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు.
పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతా ట్రాష్.. చెత్త బుట్టలో వేయాల్సిందే!
కమిషన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు… pic.twitter.com/WpRc4b1KS3
— BRS Party (@BRSparty) April 22, 2026
ఈ తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తూ కీలక ప్రకటన చేసింది. 'సత్యమేవ జయతే. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతా ట్రాష్.. చెత్త బుట్టలో వేయాల్సిందే! కమిషన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బతీయాలనే రేవంత్ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టిన హైకోర్టు' అని వివరించింది.
సత్యమేవ జయతే..
ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది.
ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్…
— Harish Rao Thanneeru (@BRSHarish) April 22, 2026
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
KCR Harish Rao: రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ.. హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావుకు భారీ ఊరట
Hyderabad, Telangana:Telangana High Court: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటుచేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు హరీశ్ రావు, నాటి అధికారులక భారీ ఊరట లభించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తదుపరి చర్యలు కేసీఆర్, హరీశ్ రావుపై తీసుకోరాదని ధర్మాసనం ఆదేశించింది. సమర్పించిన నివేదిక ప్రకారం ఎలాంటి చర్యలు చేపట్టకూడదని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
Also Read: SRH vs DC Highlights: ఉప్పల్‌లో ఢిల్లీ చిత్తు.. అభిషేక్ సెంచరీతో హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం
కాళేశ్వరం ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మార్చి 14వ తేదీన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌ను నియమిస్తూ జారీ చేసిన జీఓ 6ను రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టగా.. దానిపై తెలంగాణ హైకోర్టు నేడు బుధవారం తీర్పు ఇచ్చింది.
Also Read: GT vs MI Highlights: తిలక్ వర్మ బ్యాట్‌తో విధ్వంసం.. బంతిలో అశ్వనీ విశ్వరూపం
పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టి ప్రభుత్వానికి 665 పేజీల నివేదికను సమర్పించింది. ప్రాజెక్టులోని వైఫల్యాలకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడు అని నివేదికలో కమిషన్ తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.38,500 కోట్ల అంచనాల నుంచి రూ.1.10 లక్ష కోట్లకు పెరిగిందని కమిషన్ ఆరోపించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపై కమిషన్ విచారణ చేపట్టింది. ఈ కమిషన్‌పై వేసిన పిటిషన్‌ను విచారణ చేపట్టిన హైకోర్టు ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. అయితే జీవో 6ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేయగా.. న్యాయస్థానం మాత్రం కమిషన్ ఏర్పాటును సమర్ధించింది. చర్యలు తీసుకోరాదని ఆదేశించడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వాదనలు పరిశీలించిన హైకోర్టు కమిషన్ ఏర్పాటు సరైనదేనని పేర్కొంది. కమిషన్ తన నివేదిక రూపొందించే ప్రక్రియలో అవసరమైన నిబంధనలు పూర్తిగా పాటించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికలోని నిర్ధారణలు 'ప్రస్తుతం అమల్లోకి రాకూడదు' అని స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వం, సంబంధిత అధికారులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rahu Transit 2026: రాహువు సంచారంతో గోల్డెన్ డేస్.. ఆ రాశుల వారికి కాసుల వర్షం కురవాల్సిందే!
Hyderabad, Telangana:Rahu Transit Into Aquarius Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు గ్రహాన్ని అత్యంత కీడు గ్రహంగా, మాయాగ్రహంగా పిలుస్తారు. ఈ గ్రహం ఒక రాసి నుంచి మరొక రాశికి మారినప్పుడల్లా మానవ జీవితాలపై అత్యంత ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. రాహువు కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అతి త్వరలోనే ఇది జరగబోతోంది. అయితే సాధారణంగా రాహు అంటే భయపడేవారు ఉన్నప్పటికీ.. ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని అదృష్టం లభిస్తుంది. ఆర్థికంగా ఊహించని వృద్ధిని సాధించగలుగుతారు. రాహు కుంభరాశిలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి గోల్డెన్ పీరియడ్ కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఆయా రాశుల వారికి ఆర్థికంగా అద్భుతమైన మేలు జరుగుతుంది.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేష రాశి
మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు రాహు సంచారం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. వీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పకుండా ఉపశమనం లభించబోతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడమే కాకుండా.. జీతాల్లో భారీ మార్పులు ఉండబోతున్నాయి. వీరు చేసే ఎలాంటి పనులైన అద్భుతమైన అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి.
వృషభరాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు రాహు అనుగ్రహం వల్ల వృత్తిపరంగా గొప్ప గొప్ప మార్పులు సంభవించబోతున్నాయి. కొత్త బాధ్యతలు స్వీకరించడమే కాకుండా వీరు తప్పకుండా సమాజంలో ప్రతిష్టలు పొందగలుగుతారు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కూడా లభించబోతున్నాయి. ఇవి భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి. రాజకీయ రంగాల్లో ఉన్న వ్యక్తులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉండబోతోంది.
మిథున రాశి
రాహు సంచారం కారణంగా మిథున రాశి వారికి కూడా ఈ సమయంలో విపరీతమైన అదృష్టం లభించబోతోంది. పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తి అవడమే కాకుండా.. తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆస్తులు కూడా వీరికి చేరుతాయి. అంతేకాకుండా విద్యార్థులు తప్పకుండా పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు కూడా సాధించగలుగుతారు. తీర్థయాత్రలకు లేదా విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. ఆకస్మిక ధన లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఊహించని స్థాయిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల అన్ని రకాల పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. సమాజంలో మీ మాటకు విలువ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండి.. ముందుకు సాగడం చాలా మంచిది. అలాగే ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పకుండా అప్పుడప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తూ ఉన్నారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PM Modi: రక్తపాతంతో గెలవలేరు.. ఉగ్ర కుట్రలు సాగనివ్వం.. ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక!
Hyderabad, Telangana:PM Modi Honors Pahalgam Martyrs Latest News: భారతదేశ సర్వభౌమత్వానికి.. శాంతికి విగాథం కలిగించే ఏ ప్రతికూల శక్తి అయిన గట్టిగా ఎదుర్కొంటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.. జమ్ము కాశ్మీర్లో పహల్గామ్ వద్ద జరిగిన కిరాతక ఉగ్రదాడికి నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా.. ఆ దాడిలో అమరులైన వారికి ఆయన నివాళులర్పించారు. సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ. ఉగ్రవాదంపై పోరులో భారత్ ఎన్నటికీ వెనకాడదని స్పష్టం చేశారు..
పహల్గాం ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని దేశం ఎప్పటికీ మర్చిపోదు.. వారి త్యాగం ప్రతి భారతీయుడు గుండెల్లో నిలిచి ఉంటుంది.. అని ప్రధాని పేర్కొన్నారు.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ.. ఒక దేశంగా మనం దుఃఖంలోనూ.. సంకల్పంలోనూ ఐక్యంగా ఉన్నాం. ఉగ్రవాది ఏ రూపంలో ఉన్న.. ఏ పేరుతో వచ్చిన భారత్ దానికి తలోగ్గే ప్రసక్తే లేదని.. మోదీ తెలిపారు. అమాయకుల రక్తాన్ని చిందించే ఉగ్రవాదుల నీచమైన కుట్రలు ఎప్పటికీ సఫలం కావని ప్రధాని హెచ్చరించారు..
గతేడాది సరిగ్గా ఇదే రోజున పహాల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు అత్యంత పాషవికంగా జరిపిన కాల్పుల్లో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. సరిహద్దుల అవతల నుంచి సాగుతున్న ఉగ్రవాదుల కుట్రలను తుడిచి పెట్టేందుకు భారత సైన్యం అప్పటినుంచి ఆపరేషన్లను మరింత ఉధృతం చేసింది..
దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని సమూలంగా అణచివేయడమే లక్ష్యంగా అంతర్జాతీయ వేదికలపై కూడా భారత్ గళాన్ని వినిపిస్తూ వస్తోంది. దేశ అంతర్గత భద్రతను దెబ్బతీయాలని చూసే శక్తులకు తగిన బుద్ధి చెబుతామని.. రక్షణ రంగంలో తీసుకుంటున్న సంస్కరణలు ఉగ్రవాదుల గుండెల్లో భయాన్ని రేపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: TGSRTC Strike: చర్చలు విఫలం.. తెలంగాణ సర్కారుపై ఆర్టీసీ కార్మికుల సమ్మె అస్త్రం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RTC Strike Update: స్తంభించిన రవాణా వ్యవస్థ.. రోడ్డెక్కిన ప్రైవేటు వాహనాలు..
Hyderabad, Telangana:Sircilla RTC Strike Update Telugu: రాష్ట్రవ్యాప్తంగా పిలుపులో భాగంగా సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. కార్మికులందరూ విధులను బహిష్కరించి నిరసనల్లో పాల్గొనడంతో ప్రభుత్వ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సిరిసిల్లతోపాటు వేములవాడ దిబోకు చెందిన వందలాది బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.. అయితే ప్రయాణికుల ఇబ్బందులను గమనించిన యంత్రాంగం ప్రైవేటు వాహనాలను అనుమతించడంతో జిల్లాలో ప్రైవేటు బస్సులు యధావిధిగా నడుస్తూ ఉన్నాయి.
సమ్మె ప్రభావంతో బుధవారం ఉదయం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రధాన డిపోలు నిశ్శబ్దంగా మారిపోయాయి.. వేములవాడ తో పాటు సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, సిద్దిపేట డిపోలకు చెందిన బస్సులు కూడా నిలిచిపోయాయి. దీనివల్ల నిత్యం వేల సంఖ్యలో ప్రయాణించే సామాన్య ప్రజలతో పాటు వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు..
ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో జిల్లా యంత్రాంగం ప్రైవేటు డ్రైవర్లతో పాటు వాహనాలతో ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లను చేసింది. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద ప్రైవేట్ బస్సులతో పాటు మినీ వ్యాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ప్రయాణికులకు కొంతమేర ఊరట లభించింది. కరీంనగర్, కామారెడ్డి మార్గాల్లో ప్రైవేటు వాహనాలు నడుస్తుండడంతో అత్యవసర పనులు ఉన్నవారు గమ్యస్థానాలకు చేరుకోగలుగుతున్నారు అయితే సాధారణ రోజుల్లో కంటే రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన ఉదృతం చేశారు. సిరిసిల్ల కొత్త బస్టాండ్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న కార్మికులతో పాటు నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేకమైన నినాదాలు చేస్తున్నారు. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు విధుల్లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్మికుల నిరసనతో కొత్త బస్టాండ్ ప్రాంగణంలో వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీగా మోహరించినట్లు సమాచారం.
Also Read: TGSRTC Strike: చర్చలు విఫలం.. తెలంగాణ సర్కారుపై ఆర్టీసీ కార్మికుల సమ్మె అస్త్రం..
ప్రస్తుత పరిస్థితుల దృశ్య ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని.. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సమ్మె ఎప్పుడు ముగుస్తుందనే అంశంపై స్పష్టత లేకపోవడంతో సామాన్యుల్ లో ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే అధికారులు మాత్రం త్వరలోనే ఆర్టీసీకి సంబంధించిన సంఘాల నేతలతో చర్చించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
Also Read: TGSRTC Strike: చర్చలు విఫలం.. తెలంగాణ సర్కారుపై ఆర్టీసీ కార్మికుల సమ్మె అస్త్రం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TGSRTC Strike: టీజీఎస్ఆర్టీసీ జేఏసీ డిమాండ్లు ఏంటి? సమ్మెతో ఆర్టీసీకి ఒక రోజు నష్టం ఎంతో తెలుసా?
Hyderabad, Telangana:What Are TGSRTC JAC Key Demands: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలైంది. అయితే వేల సంఖ్యలో బస్సులు డిపోలకే పరిమితం అవ్వడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రైవేట్ ఉద్యోగులు, కూలీలు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దిల్షుఖ్ నగర్, జూబ్లీహిల్స్, ఎంజీబీఎస్, లకఢీకాపూల్ లో పెద్ద ఎత్తున ప్రయాణీకులు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమంది నడక మార్గంలో వెళ్తున్నారు. హైదరాబాదులో 20 లక్షల మంది వరకు ఆర్టీసీ పైనే ఆధారపడి ఉన్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ అయితే అదనంగా వారి నుంచి డబ్బు దండుకునే అవకాశం ఉంది.
ఈరోజు మరోసారి చర్చలు..
ఆర్టీసీ సమ్మె కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎంజీబీఎస్ లో కూడా బస్సులు డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం అవ్వడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు నేడు సమ్మెకు దిగారు. అయితే ఈరోజు ఆర్టీసీ జేఏసీ నేతలతో మరోసారి చర్చలకు అవకాశం ఉండగా సమ్మెపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
టీజీఎస్ఆర్టీసీ చేసిన డిమాండ్లు ఏంటి..?
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మేనిఫెస్టోలోని వాగ్దానాలు అన్నింటిని నెరవేర్చాలని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. అంతే కాదు ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. పెండింగ్‌లో బిల్లులు క్లియర్ చేయాలి. 2017 నుంచి అలవెన్సులను కూడా పెంచాలి. 2021 నాటి పే రివిజన్ అంటే (30% ఫిట్ మెంట్) అమలు కూడా చేయాలి. కొత్త బస్సులు కొనుగోలు చేసి వర్క్ షాపులను మరింత బలోపేతం చేయాలి. ఆర్టీసీ అప్పులను ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి. బడ్జెట్లో 3 శాతం కేటాయించాలి. ఇక ఎనిమిది గంటల షిఫ్ట్ కూడా అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తోంది.
ఆర్టీసీకి ఒకరోజు ఎంత నష్టమంటే..?
సమస్యల పరిష్కారం కోసం జరిగిన చర్చల విఫలం కావడంతో ఆర్టీసీ సమ్మెకు దిగింది. అయితే సంస్థకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సాధారణంగా ఆర్టీసీకి డైలీ రూ.13 కోట్ల నుంచి రూ.16 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. పండుగ రోజుల్లో అయితే రూ. 18 కోట్లు వరకు వస్తుంది. ఆర్టీసీ మొత్తం 9,375 బస్సులు ఉండగా.. ఒక్కో బస్సుకు రోజుకు సగటున రూ.18 వేల వరకు ఆదాయం వస్తుందని అంచనా.
Also Read: కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. డిపో నుంచి కదలని బస్సులు, జేఏసీ నాయకుల అరెస్ట్..!
Also Read: రేపటి నుంచి ఆర్టీసీ బంద్.. నేటి అర్ధరాత్రి నుంచే డిపోలకే పరిమితం కానున్న బస్సులు!
సమ్మెతో డేంజర్ బెల్స్..
సమ్మె విచ్చిన్నం చేసేందుకు ప్రభుత్వం ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపించాలని చూస్తోంది. కానీ హైదరాబాద్ రోడ్లమీద బస్సు నడపడం అనుభవం లేని డ్రైవర్లకు ప్రాణ సంకటంగా మారుతుంది. గతంలో ప్రైవేట్ డ్రైవర్ల వల్ల జరిగిన ప్రమాదాలు రికార్డులు బయటపెడుతున్నాయి. అంతేకాదు బస్సు బయటకు వస్తే అడ్డుకుంటామని జేఏసీ కూడా హెచ్చరికలు చేస్తోంది. శాంతి భద్రతల దృష్ట్యా 5000 మంది పోలీసులను డిపోల వద్ద హోంశాఖ మొహరించేందుకు యత్నిస్తోంది.
మెట్రో కిటకిట ..
అర్ధరాత్రి నుంచి బస్సులు డిపోలకే పరిమితం అవడంతో ప్రయాణికులు మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు అధిక ఛార్జీలతో దండుకునే ఆస్కారం ఉంది.
విధులకు హాజరవ్వండి… RTC ఎండీ
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే అందరు విధులకు హాజరు కావాలని ఎండి వై నాగిరెడ్డి కోరారు. ఐఏఎస్ అధికారుల కమిటీ సమస్యల పరిష్కారానికి నాలుగు వారాల సమయం పడుతుందన్నారు. దశలవారీగా డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కొందరు తప్పుదోవ పట్టించి సమ్మెకు పిలుపునిస్తున్నారని, ఇది సామాన్య ప్రజలపై తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని కార్మికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Second-hand Cars: బంపర్ ఆఫర్.. బైక్ ధరకే కారు.. సగం ధరకే స్విఫ్ట్.. థార్‌పై రూ. 8 లక్షల డిస్కౌంట్!
Hyderabad, Telangana:Second-hand Cars In Delhi: సొంతంగా కారు కొనుక్కోవాలని సగటు మధ్యతరగతి మనిషి కల.. అయితే కొత్త కార్ల ధరలు కొన్ని కారణాలవల్ల ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో చాలామంది సెకండ్ హ్యాండ్ మార్కెట్ వైపు వెళ్ళిపోతున్నారు. అత్యంత తక్కువ ధరల్లో సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసి వారి కల నెరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి సెక్టార్ త్రీ లో ఉన్న సెకండ్ హ్యాండ్ మోటార్ షో రూమ్స్ లో సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే అక్కడున్న సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్స్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని వాహనాలు అయితే ఇక్కడ సగం కంటే తక్కువ ధరల్లో లభించడం విశేషం..
రోహిణి సెక్టార్ 3లో ఉన్న మోటార్ షోరూమ్స్ లో కేవలం రూ.35 వేల నుంచి అద్భుతమైన కార్లు లభిస్తున్నాయి. పాత మోటార్ సైకిల్స్ ధరకి ఇక్కడ కార్లు దొరకడం వల్ల దేశంలోని నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం వినియోగించే హ్యాచ్‌బ్యాక్ తో పాటు SUV కార్లు కూడా భారీ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. దీంతో చాలామంది ఇక్కడ ఈ కార్లను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి బిజినెస్ కూడా చేస్తున్నారు.
ముఖ్యంగా ఇక్కడ సెకండ్ హ్యాండ్ థార్ రాక్స్ (Thar ROXX) అత్యంత చీపు ధరల్లో లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న థార్ రాక్స్ మోడల్‌పై ఏకంగా రూ. 6 నుంచి 8 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగిన స్విఫ్ట్ కారును సగం ధరకే అంటే సుమారు రూ. 4.5 లక్షలకే విక్రయిస్తున్నారు. ఇక లగ్జరీ బ్రాండ్లకు సంబంధించిన కార్లు అయితే సగం కంటే తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. ఇక్కడ మెర్సిడెస్ బెంజ్ వంటి విలాసవంతమైన కార్లపై 90 నుండి 95 శాతం వరకు డిస్కౌంట్ తో అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ. 10.90 లక్షలకే మెర్సిడెస్ కారును సొంతం చేసుకోవచ్చు.
సాధారణంగా ఢిల్లీలోని కొన్ని సెకండ్ హ్యాండ్ మోటార్స్ షోరూమ్స్ లో సెకండ్ హ్యాండ్ కార్లకు ఎలాంటి గ్యారెంటీని అందించరు.. కానీ ఇక్కడ కొనుగోలు చేసే వారికి మాత్రం ప్రతీ కారుపై 500 కిలోమీటర్ల వారంటీని బాండ్ రూపంలో అందిస్తున్నారు. అంతేకాకుండా మొదటి సర్వీసింగ్ ఉచితం తో పాటు ఉచిత ఆర్సి ట్రాన్స్ఫర్ వంటి సదుపాయాలను కూడా అందిస్తున్నారు. కేవలం రూ.25 వేల నుంచి రూ.30 వేలు డౌన్ పేమెంట్ చెల్లించి కారుని ఇంటికి తీసుకెళ్లే సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్న హోం డెలివరీ చేసే సదుపాయం అందుబాటులో ఉండడం విశేషం. పాత కార్లను వినియోగించేవారు ఇక్కడ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు..
Also Read: iQOO 15: అమెజాన్‌లో ఐక్యూ 15 భారీ ధర తగ్గింపు.. రూ.77 వేల ఫోన్ కేవలం రూ.31,999కే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Guru Gocharam 2026: పునర్వాసులో గురుడు.. ఈ 4 రాశుల వారికి ఇక రాజభోగమే.. అదృష్టం మామూలుగా లేదు!
Hyderabad, Telangana:Guru Gocharam 2026 Effect 4 Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభగ్రహంగా భావించే బృహస్పతి కదలికలు జరిపాడు. ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 4 గంటల సమయంలో పునర్వాసు నక్షత్రంలోని రెండో పాదంలోకి సంచారం చేశాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రెండో పాదంలోకి వెళ్లడం ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అయితే, మే 14వ తేదీ వరకు అదే పాదంలో ఉండబోతున్నాడు. పునర్వాసు నక్షత్రం రెండవ పాదానికి అధిపతిగా శుక్రుడు వ్యవహరిస్తాడు. అలాంటిది గురు గ్రహం అక్కడికి వెళ్లడం చాలా శుభ్రమని కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు సంభవించబోతున్నాయట. ముఖ్యంగా జీవితంలో పురోగతి లభించడమే కాకుండా అన్ని రకాల సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని.. కోరుకున్న కోరికలు పూర్తిగా నెరవేరే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోతున్న అదృష్ట రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బృహస్పతి నక్షత్ర సంచారంతో ఈ రాశులవారికి గుడ్ లక్!
మేషరాశి
బృహస్పతి నక్షత్ర సంచారం వల్ల మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఈ సమయంలో కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపార రంగాల్లో స్థిరపడిన వ్యక్తులకు వారి పంట పండబోతోంది. పెట్టిన పెట్టుబడులకంటే రెట్టింపు ఆదాయం పొందగలుగుతారు. గతంలో వ్యాపారాల్లో నిలిచిపోయిన అనేక పనులు ఇప్పుడు వేగవంతంతో పూర్తవుతాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా విపరీతంగా పెరిగి.. మానసికంగా చాలా అద్భుతంగా ఉండగలుగుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ కాలం గోల్డెన్ పీరియడ్ అని భావించవచ్చు. ఎందుకంటే గురు గ్రహ ప్రభావంతో వీరికి ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్న కలహాలు పూర్తిగా తొలగిపోయి.. శాంతి వాతావరణం నెలకొనబోతోంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్న అనేక సమస్యలకు ఈ సమయం పరిష్కారం చూపబోతోంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కూడా రెట్టింపు అవుతాయి. అనుకున్న పనులు జరిగి మానసికంగా అద్భుతంగా ఉండగలుగుతారు.
కన్యా రాశి
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం పట్టిందల్లా బంగారమే కాబోతోంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకైనా పూర్తిగా నెరవేరబోతుంది.. దీనివల్ల ఎంతో సులభంగా విదేశాలకు వెళ్లి అక్కడ చదువులు చదివే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు సంబంధిత కేసుల్లో నిమగ్నమైన వ్యక్తులకు ఈ సమయంలో మీకు అనుకూలంగా కోర్టు తీర్పులు ఉండబోతున్నాయి. తండ్రి వైపు నుంచి ఆస్తులు కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగు పడుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు పూర్తిగా తీరిపోతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. అంతేకాకుండా సంతాన ప్రాప్తి కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు కూడా అందుతాయి. రాజకీయాలతో పాటు సామాజిక రంగాల్లో ఉన్నవారికి పదవియోగం కూడా అద్భుతంగా లభించబోతోంది. అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యలకు ఈ సమయం అద్భుతమైన పరిష్కారంగా నిలవబోతోంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
NIMS Recruitment 2026: నిరుద్యోగులకు అదిరిపోయే వార్త.. నిమ్స్‌లో 643 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
Hyderabad, Telangana:NIMS Recruitment 2026 Latest News: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరోసారి తీపి కబురు అందించబోతోంది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరి పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 643 ఖాళీలను ప్రత్యక్ష నియామక పద్ధతి ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ తాజాగా జీవో జారీ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా వైద్య సేవలో కీలకమైన స్టాఫ్ నర్స్ పోస్టులు అత్యధికంగా ఉండడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి.. అయితే వీటికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ఈ 643 పోస్టులలో మెజారిటీ వాట స్టాఫ్ నరుసులకే దక్కింది.. మొత్తం 375 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు ల్యాబ్ టెక్నీషియన్ లతో పాటు ఫార్మసిస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు ఇతర పారామెడికల్ సిబ్బంది ఖాళీలను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నట్లు సమాచారం. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సేవలను మెరుగుపరచడంలో భాగంగానే ఈ భారీ నియామక ప్రక్రియ చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Inter Admissions 2026: బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు.. నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం!
డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ (DSC) ద్వారా ఈ నియామకాలు జరగబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు రోస్టర్ పాయింట్లతో పాటు అభ్యర్థుల అర్హతలు, స్థానిక క్యాడర్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి వీలైనంత త్వరగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వ అధికారులు ఆదేశించినట్లు సమాచారం. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ కొనసాగాలని ప్రభుత్వం స్పష్టం చేసిందట..
గత కొంతకాలంగా వైద్య ఆరోగ్యశాఖలో నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది నర్సింగ్ విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం అని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పని చేయడం ద్వారా మెరుగైన ఉపాధితో పాటు వృత్తిపరమైన గుర్తింపు లభిస్తుందని అభ్యర్థులు కూడా భావిస్తున్నారు. వచ్చే కొన్ని వారాల్లో దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు వెబ్సైట్ లింకులు కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.
Also Read: Inter Admissions 2026: బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు.. నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
