icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505307
Bandi SrikanthBandi SrikanthFollow22 Jul 2024, 12:45 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement

Harish Rao Arrest: ఉద్రిక్తంగా మారిన టీఎన్జీవో ధర్నా.. బీఆర్ఎస్ హరీష్ రావు అరెస్ట్..హనుమకొండలో హైటెన్షన్!

Hyderabad, Telangana:Harish Rao Arrested in Hanamkonda: తెలంగాణలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు దక్కాల్సిన బెనిఫిట్స్ పై కాంగ్రెస్ సర్కారును ఏకీపారేస్తుంది. ఇప్పటికే రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, డీఏలు, ఇతర అలవెన్సులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంది. దీనిలో భాగంగా హనుమకొండలో హనుమకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీవోల ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
0
0
Report

Pending DAs: దేశ చరిత్రలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల 6 పెండింగ్‌ డీఏలు ఒక రికార్డు

Warangal, Telangana:

Dearness Allowance Record: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు, డిమాండ్ల పరిష్కారంపై ఆందోళన బాట పట్టారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు ఆందోళన చేపట్టగా వారికి బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీవోలు చేపట్టిన ఉద్యోగుల ఆందోళనలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు కీలక ప్రసంగం చేశారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిదే' అని ప్రకటించారు.

'జీతాల్లో డబ్బులు కట్ చేస్తూ.. ఆసుపత్రులతో అగ్రిమెంట్ లేకుండా ఈహెచ్ఎస్ మోసం. మీరు నడుపుతున్నది సర్కారా? లేక సర్కస్సా రేవంత్‌ రెడ్డి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏకంగా 15 శాతం కమీషన్ అడుగుతున్న దౌర్భాగ్యం ఉందని అసహనం వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు గౌరవం.. నేడు సచివాలయంలోకి నో ఎంట్రీ ఉందని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి శంకరగిరి మాన్యాలు తప్పవని రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

'సీపీఎస్ ఉద్యోగులను ఓపీఎస్‌లోకి మారుస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గొప్పగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దగ్గరపడుతున్నా ఇప్పటివరకు సీపీఎస్ రద్దు లేదు, పీఆర్సీకి మోక్షం లేదు. ప్రభుత్వం నుంచి కనీస చలనం లేదు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం కేవలం 1 శాతం కాంట్రిబ్యూషన్‌తో ఈహెచ్ఎస్ ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాన్ని 1.5 శాతానికి పెంచింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇద్దరికీ కట్ చేస్తున్నారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఇంట్లో రిటైర్డ్ తల్లిదండ్రులు ఉంటే వాళ్లకూ కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి ఉద్యోగులు మోసపోవడం తప్ప వారికి ఒరిగేదేమీ లేదని చెప్పారు.

'రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నారా? లేక సర్కస్ నడుపుతున్నారా? భారతదేశంలో ఎక్కడైనా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్న రాష్ట్రం ఉందా? ఆరు డీఏలను పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం మీదే. ఇది అత్యంత సిగ్గుచేటు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పెండింగ్ డీఏలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కలిసి దండం పెట్టి అడిగినా ఈ ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంటే 15 శాతం కమీషన్ లంచంగా అడుగుతున్నారని ఓ బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. ప్రభుత్వానికి వెన్నెముక లాంటి ఉద్యోగులను, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే వారిని ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారు.. కాంగ్రెస్ పాలనలో అందరి బతుకులు ఆగమయ్యాయి' అని విమర్శించారు.

'తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలి. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. 'జీపీఎఫ్ లోన్ కోసం వెళ్దామంటే కనీసం వినే నాథుడే లేడు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఆగమాగం చేసి, అన్ని వర్గాలనూ రోడ్డు మీదికి తెచ్చాడు' అని విమర్శించారు. 'ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు, జీవో 97 కోసం పాలిటెక్నిక్ విద్యార్థులు, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేశారు. 

'సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను వరంగల్‌లో చాయ్ తాగినంత సేపట్లో పరిష్కరిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పటిదాకా వారి సమస్యను పరిష్కరించలేదు. కనీసం సచివాలయంలోకి కూడా అనుమతించడం లేదు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులతో పెట్టుకుంటే మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డట్లేనని రేవంత్ రెడ్డికి హెచ్చరించారు.

0
0
Report
Advertisement

Rakhi Festival: రాఖీ పండుగ వేళ కలకలం.. హైదరాబాద్‌లో స్వీట్‌ షాపులపై అధికారుల దాడులు

Secunderabad, Telangana:

Rakhi Festival: తోబుట్టువుల ఆత్మీయ పండుగ రాఖీ పౌర్ణమి సందర్భంగా మిఠాయిలు కొనేందుకు ప్రయత్నం చేస్తున్నారా? ఒక్క నిమిషం. నాసిరకం.. గడువు దాటిన మిఠాయిలు, ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారని హైదరాబాద్‌ పోలీసులు చెబుతున్నారు. ఆహార శుద్ధి పాటించకుండా తీవ్ర నిర్లక్ష్యంతో స్వీట్‌ షాపులు నడుపుతున్న వాటిపై పోలీసులు, అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్‌ శివారులోని మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చౌదరిగూడ వెంకటాద్రి టౌన్‌షిప్‌లో పోలీసులు దాడులు చేశారు. అక్కడ ఉన్న బాలాజీ పవన్‌ స్వీట్‌ షాపుపై ఉప్పల్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీలు చేపట్టగా అక్కడ అధ్వాన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాలం చెల్లిన ఆహార పదార్థాలు, హానికరమైన సింథటిక్ కలర్స్‌ను వినియోగిస్తూ మిఠాయిలు, ఇతర తినుబండారాలు తయారు చేస్తున్నట్లు అక్కడ గుర్తించారు.

రాజస్థాన్‌కు చెందిన కమల్‌ కుడ్కుడియా (37) ఆ స్వీట్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద నుంచి సింథటిక్‌ ఆరెంజ్‌, లెమన్‌ ఎల్లో ఫుడ్‌ కలర్స్‌, వివిధ ఫ్లేవర్లు, రోజ్‌వాటర్‌, షుగర్‌ సిరప్‌, బాదం పాలు తదితర పదార్థాలతో పాటు సుమారు 30 కిలోల కలాఖండ్‌, 500 గ్రాముల డ్రైఫ్రూట్‌ స్వీట్‌, 2 కిలోల కోవా స్వీట్‌, 12 కిలోల సోన్‌ పప్పడ్‌ను ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలు, కమల్‌ కుడ్కుడియాను పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఓటీ పోలీసుల ఫిర్యాదు మేరకు సివిల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దాడుల నేపథ్యంలో ప్రజలకు ఎస్‌ఓటీ పోలీసులు, అధికారులు కీలక సూచనలు చేశారు. స్వీట్లు కొనే ముందు తయారీ, గడువు తేదీలు, ప్యాకింగ్‌, రంగు, వాసన, రుచి, నాణ్యతను పరిశీలించాలని పోలీసులు సూచించారు. వీలైనంత వరకు నమ్మకమైన దుకాణాల నుంచే స్వీట్లు కొనుగోలు చేయాలని.. లేదా ఇంట్లోనే తయారు చేసుకోవాలని ఎస్‌ఓటీ పోలీసులు తెలిపారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీటు దుకాణాల్లో కొనుగోలు చేయరాదని పోలీసులు సూచిస్తున్నారు. 

ఇటీవల హైదరాబాద్‌లో స్టార్‌ హోటళ్లతోపాటు మార్ట్‌లు, ఇతర రెస్టారెంట్లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, ఎస్‌ఓటీ పోలీసులు తనిఖీలు చేస్తుండగా విస్తుపోయే విషయాలు కనిపిస్తున్నాయి. కల్తీ పదార్థాలు తయారుచేయడం.. నాసిరకం సామగ్రితో వంటలు చేయడం.. హానికరమైన పదార్థాలు వినియోగించడంతో పోలీసులు దాడులు చేస్తూ పెద్ద ఎత్తున సీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రాఖీ పండుగ సందర్భంగా స్వీటు షాపులపై దాడులు చేసి తనిఖీలు చేయగా.. అక్కడ అదే పరిస్థితి ఎదురైంది. దీంతో ప్రజలు ఏం కొని తినాలో అని ఆందోళన చెందుతున్నారు. బయట ఆహార పదార్థాలు కొనకుండా ఇంట్లోనే తయారుచేసుకోవాలని పోలీసులు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు.

0
0
Report

Maharashtra Paper Leak: లవర్ బ్రేకప్ చెప్పిందని పేపర్ లీక్ బయటపెట్టిన ప్రియుడు..రిక్రూట్‌మెంట్ రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం!

Badapur, Maharashtra:

Maharashtra Paper Leak Exposed: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వెనుక ఒక ఆసక్తికరమైన ప్రేమ కథా ముగింపు  ఉంది. ఈ ఏడాది మార్చి 22న రాష్ట్రవ్యాప్తంగా ఆరు డివిజనల్ ప్రధాన కార్యాలయాల్లోని కేంద్రాలలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలోని గ్రూప్-బి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి MPSC ఆఫ్‌లైన్ స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించింది. అయితే, ప్రియురాలితో విడిపోయిన గౌరవ్ పాటిల్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో ఈ లీక్ వ్యవహారం ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ద్వారా బయటపడింది.

గౌరవ్ పాటిల్ తన మాజీ ప్రియురాలి నుండి పరీక్షకు ముందే ప్రశ్నపత్రాన్ని పొందినట్లు ఆరోపించాడు. ఆమె తండ్రి కోచింగ్-క్లాస్ నిర్వాహకుడైన ప్రవీణ్ పాటిల్‌కు రూ.5 లక్షలు చెల్లించి ఈ లీకైన పేపర్‌ను సంపాదించినట్లు దర్యాప్తులో తెలిసింది. ఆ తర్వాత సదరు మహిళా అభ్యర్థి ఆ లీకైన పేపర్‌ను గౌరవ్‌తో పంచుకుంది. అయితే, వీరిద్దరి మధ్య సంబంధం చేదుగా ముగిసిన తర్వాత ప్రతీకారంతో గౌరవ్ MPSCకి ఫిర్యాదు చేశాడు.

ఆ తర్వాత కేసును మరో మలుపు తిప్పుతూ తానూ అబద్ధం చెప్పానని గౌరవ్ ఈమెయిల్ పంపినప్పటికీ, పోలీసులు విచారణను వేగవంతం చేసి అతనితో పాటు కమిషన్ అదనపు కార్యదర్శి అభిజిత్ లెండ్వే, మరో ముగ్గురు అధికారులతో సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు.

పోలీసుల దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పరీక్ష తర్వాత సదరు మహిళ కోచింగ్ నిర్వాహకుడికి చేసిన ఫోన్ కాల్‌లో.. లీకైన పేపర్‌లోని దాదాపు 90 ప్రశ్నలలో 78 ప్రశ్నలకు తాను సరిగ్గా సమాధానాలు రాశానని, ఉద్దేశపూర్వకంగానే అనుమానం రాకుండా ఉండేందుకు కొన్ని ప్రశ్నలను వదిలేశానని చెప్పినట్లు ఫోన్ రికార్డుల ద్వారా తెలిసింది. ఇదే సమయంలో, గంగూర్డే అనే మరో అభ్యర్థి సోషల్ మీడియాలో నియామక ప్రక్రియ అపారదర్శకతపై పోస్ట్ చేసిన వీడియోతో ఈ వివాదం మరింత తీవ్రమైంది.

ఈ స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను జూన్ 12న ప్రకటించి, మొదట 506 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. జూలై 1 నుండి 22 మధ్య 488 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించి తాత్కాలిక మెరిట్ జాబితాను కూడా సిద్ధం చేశారు. కానీ ఈ తీవ్ర వివాదం, దర్యాప్తు నేపథ్యంలో MPSC ఈ మొత్తం నియామక ప్రక్రియను రద్దు చేసింది. త్వరలోనే మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, అలాగే ఎలాంటి పరీక్ష రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని కమిషన్ స్పష్టం చేసింది. 

Also Read: రాహుల్ గాంధీకి లైవ్‌లో ముద్దుపెట్టిన యువతి..సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీజేపీ రచ్చ!

Also Read: మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే వార్త.. తెలంగాణలో 121 కొత్త అంతర్జాతీయ బ్రాండ్లు సిద్ధం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

India Vs Sri Lanka: శ్రీలంక జట్టు అద్భుత పోరాటం..భారత్‌తో రెండో టెస్టు డ్రా..సిరీస్ టీమ్ఇండియా కైవసం!

Colombo, Western Province:

India Vs Sri Lanka 2nd Test: కొలంబో వేదికగా టీమ్ఇండియాతో రెండో టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు అసాధారణ పోరాటపటిమను ప్రదర్శించింది. ఐదో రోజు ఆట ముగియడానికి మరో 18 ఓవర్ల సమయం ఉండగానే, మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్లూ డ్రాకు అంగీకరించాయి. ఈ సమయంలో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసి, భారత్‌పై 216 పరుగుల లీడ్‌ సాధించింది. దీంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటిస్తూ ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. తొలి టెస్ట్ గెలిచిన భారత్, ఈ సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 503/9 (డిక్లేర్డ్) స్కోరు చేయగా, శ్రీలంక 290 పరుగులకు ఆలౌటైంది.

సోనాల్ దినుష సరికొత్త చరిత్ర
ఈ మ్యాచ్‌లో శ్రీలంక యువ బ్యాటర్ సోనాల్ దినుష వీరోచిత బ్యాటింగ్‌తో జట్టును ఓటమి నుంచి రక్షించాడు. తొలి ఇన్నింగ్స్‌లో (103) సెంచరీ సాధించిన దినుష, రెండో ఇన్నింగ్స్‌లోనూ అజేయ సెంచరీతో (133*) చెలరేగాడు. ఈ ఘనతతో భారత్‌పై ఒకే టెస్టులో రెండు సెంచరీలు సాధించిన మూడో శ్రీలంక బ్యాటర్‌గా (గతంలో దులీప్ మెండిస్ - 1982, అరవింద డిసిల్వా - 1997) దినుష నిలిచాడు. శ్రీలంక తరఫున ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 8వ బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. దినుష ఆటతీరును బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కొనియాడుతూ, అతడు అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో "మరో సచిన్"లా కనిపిస్తున్నాడంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

పట్టుదల చూపిన లోయర్ ఆర్డర్
ఐదో రోజు ఆటలో శ్రీలంక ఓవర్‌నైట్ బ్యాటర్లు సోనాల్ దినుష, కేశర నువాంత (46) చాలా నిలకడగా ఆడి ఏడో వికెట్‌కు 112 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లంచ్ అనంతరం నువాంతను మానవ్ సుతార్ అవుట్ చేసి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ప్రభాత్ జయసూర్య (2 పరుగులు, 28 బంతులు), లాహిరు కృష్ణ (12 పరుగులు, 90 బంతులు) అద్భుతమైన డిఫెన్స్‌తో భారత బౌలర్లను విసిగించారు. వీరిద్దరినీ రవీంద్ర జడేజా అవుట్ చేశాడు.

బౌలింగ్ చేసిన కెప్టెన్ గిల్
రెండో ఇన్నింగ్స్‌లో చివరి గంటల్లో శ్రీలంక 9వ వికెట్ కోల్పోయి, 200 పైగా పరుగుల ఆధిక్యం సాధించడంతో డ్రా ఖాయమైంది. ఈ క్రమంలో భారత ప్రధాన బౌలర్లకు విశ్రాంతినిస్తూ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (151వ ఓవర్)తో పాటు యశస్వి జైస్వాల్ కూడా పార్ట్‌టైమ్ బౌలర్లుగా బంతులు విసిరారు. అంతకుముందు జడేజా కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడగా, మిగిలిన ఓవర్ బంతులను ప్రసిద్ధ్ కృష్ణ పూర్తి చేశాడు.

Also Read: ఆర్సీబీ టీమ్‌లోకి రోహిత్ శర్మ? రెడ్ జెర్సీలో హిట్‌మ్యాన్ ఫొటో వైరల్..ఏం జరుగుతోంది?

Also Read; టీమ్ఇండియాలోకి సూర్యకుమార్ యాదవ్ రీఎంట్రీ? బీసీసీఐ నుంచి కీలక సమాచారం లీక్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

మైనింగ్ AD ఇళ్లపై ACB పంజా.. 8 చోట్ల ఏకకాలంలో మెరుపు దాడులు!

Hyderabad, Telangana:

Telangana Acb Raids: అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ అవినీతి నిరోధక శాఖ మరో భారీ ఆపరేషన్ చేపట్టింది.. ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెడుతున్నారని పక్కా సమాచారంతో భూగర్భ జల వనరుల శాఖకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజు నివాసంపై ఏసీబీ అధికారులు గురువారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏసీబీ అధికారులకు ఆశ్చర్యం కలిగించే ఆస్తులు బయటపడ్డాయి. అవేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మైనింగ్ ఏడిగా జయరాజు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని భారీగా అక్రమాస్తులు సంపాదిస్తున్నారని ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్ నగర్ లో ఉన్న ఆయన ప్రధాన నివాసంతో పాటు బంధువులు బినామీల ఇల్లు, కార్యాలయాలు ఇలా మొత్తం 8 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏసీబీ ప్రత్యేకమైన దాడులను నిర్వహించింది.

ఈ భారీ తనిఖీలను హైదరాబాద్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్ తో పాటు వరంగల్ ఏసీబీ డిఎస్పి సాంబయ్య తమ పర్యవక్షణలో కొనసాగిస్తున్నారు. ఇంటి అణువణువు గాలిస్తున్న అధికారులు.. బీరువాతో పాటు లాకర్లు తెరిచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. జయరాజు ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంక్ అకౌంట్ లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు..

సోదాలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ.. అధికారుల కళ్ళు చెదిరి ఆస్తుల చిట్టా బయటపడినట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు ఇప్పటివరకు గుర్తించిన వివరాల ప్రకారం.. తన ఇంట్లో ఉన్న రెండు ఖరీదైన కార్లతో పాటు దాదాపు 1,50,000 వరకు నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది ఇక జనగామ జిల్లాలో ఉన్న ఐదు ఎకరాల విలువైన వ్యవసాయ భూమికి సంబంధించిన దస్త్రాలతో పాటు భారీ మొత్తంలో చేసిన ఫిక్స్ డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్ల రసీదులను వారు సొంతం చేసుకున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఆస్తులకు సంబంధించిన రెండు కీలకమైన పాస్ బుక్కులను కూడా సొంతం చేసుకున్నారట..

ప్రస్తుతం దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.. బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయాల్సి ఉందని.. బంధువుల ఇళ్లలో తనిఖీలు పూర్తయితే భారీ ఎత్తున నగదుతో పాటు బంగారం మరెన్నో బినామీ ఆస్తు పత్రాలు బయటకు వచ్చే అవకాశాలు ఉందని సమాచారం. సోదాలు పూర్తిగా ముగిసిన అనంతరం.. స్వాధీనం చేసుకున్న అక్రమాస్తుల మొత్తం విలువను, ఇతర కీలక సమాచారాన్ని ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు..

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Kavitha: ఆంధ్రోళ్ల ఏజెంట్‌ రేవంత్ రెడ్డి.. తెలంగాణపై సోయి లేదు: కవిత తీవ్ర విమర్శలు

Hyderabad, Telangana:

Andhra Agent Revanth Reddy: 'రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు ఆంధ్రా రేవంత్ రెడ్డి. బ్రహ్మణ పరిషత్‌లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు ఆంధ్రా వాళ్లకు ఇచ్చారు. అంటే తెలంగాణలో బ్రహ్మణ మేధావులు లేరా పొలిటికల్ పదవులు కచ్చితంగా తెలంగాణ వాళ్లకే ఇవ్వాలి' అని మాజీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. 'ఇప్పుడున్న బ్రహ్మణ పరిషత్ ఛైర్మన్ బసవరాజు శ్రీనివాసరావు పచ్చి తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వాదులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. పేద బ్రహ్మణులకు మేలు చేయాల్సిన తెలంగాణ బ్రహ్మణ పరిషత్ ఆంధ్రా రౌడీలకు అడ్డాగా మారింది. దళిత మహిళలను, తెలంగాణ వాళ్లను బసవరాజు శ్రీనివాసరావు ఇష్టమొచ్చినట్లు తిట్టాడు' ఆరోపించారు. వెంటనే ఆంధ్రా వాళ్లకు ఇచ్చిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను తొలగించి తెలంగాణ వాళ్లకు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డిని కవిత కోరారు.

'హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ వద్ద ఓ ఆంధ్రా ఎంపీ కొడుకు రూ.6 కోట్ల కారు వేసుకోని ఒడిశాకు చెందిన 25 ఏళ్ల అమ్మాయిని కారుతో గుద్ది చంపాడు. ఆ అమ్మాయి ఇంట్లో పనిచేసే సంపాదించే ఆమెను చంపితే పోలీసులు రాసిన ఎఫ్ఐఆర్‌లో తండ్రి పేరు లేదు. ఈ కేసులో మద్యం ప్రమేయం లేదని క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్‌లో అన్ని ఖాళీలే ఉన్నాయి. వేరే కేసులో కూడా ఇలాగే ఎఫ్ఐఆర్ వేస్తారా?' అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. ఇలా ఎఫ్ఐఆర్ రాసినందుకు పోలీసులు సిగ్గుపడాలి అని మండిపడ్డారు.

'తన విదేశీ పర్యటనను అడ్డుకుంటే రేవంత్ రెడ్డి 48 నిమిషాలు ప్స్‌మీట్ పెడతాడు. కానీ ఒక్క క్షణం కూడా ఎంపీ కొడుకు చేసిన కారు ప్రమాదంపై మాత్రం మాట్లాడాడు. ఆయన విదేశీ పర్యటనను అడ్డుకుంటే ముఖ్యమంత్రికి తెలంగాణ గుర్తు వచ్చింది. కానీ రెడ్ కో ఛైర్మన్, ప్రిన్సిపల్ సెక్రటరీ సహా ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో ఆంధ్రావాళ్ల పెత్తనమే కదా ఉన్నది. తెలంగాణ భక్తుల పైసలతో కట్టిన యాదాద్రి గుడిలో సభ్యుడిగా ఆంధ్రా హీరో భార్యకు అవకాశం కల్పించారు. తిరుపతి బోర్డులో మన వాళ్లకు అవకాశం కల్పించమంటే అక్కడ మనవాళ్ల పైసలు కూడా ఉంటాయి' అని రేవంత్‌ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు.

'బయోకాన్‌లో తెలుగు మాట్లాడినందుకు 200 మందిని తీసేస్తే రేవంత్‌ రెడ్డి మాట్లాడడు. ఆంధ్రావాళ్లు సహా ఇతర కంపెనీలలో బాత్‌రూమ్‌లు కడిగే వాళ్లను కూడా తెలంగాణ వాళ్లను పెట్టుకోవటం లేదు. నారాయణ కాలేజ్‌లో సంవత్సరం మధ్యలో చాలా మందిని తొలగించారు. వారికి ఇప్పుడు ఉద్యోగాలు ఎలా వస్తాయి?' అని కవిత ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్ల ఏజెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణలో పాలన నడుస్తోందని మండిపడ్డారు.

'తెలంగాణ వాళ్లకు అన్యాయం జరిగితే రేవంత్‌ రెడ్డి మాట్లాడటం లేదు. ఇప్పటికైనా తెలంగాణ సోయి రావాలి. లేదంటే ఆయన ఎప్పుడు కనిపించిన సరే ఆంధ్రా రేవంత్ రెడ్డి అనే పిలుస్తా' మాజీ ఎమ్మెల్సీ కవిత కీలక ప్రటన చేశారు. రేవంత్‌ రెడ్డి బీజేపీ, ఆంధ్రావాళ్లతో లాలూచీ ఉందని.. అందుకే తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కృష్ణా నీళ్లను ఆంధ్రావాళ్లు పట్టుకోని పోయిన సరే ఆయన పట్టించుకోవటం లేదని తెలిపారు. రేవంత్‌ రెడ్డికి తెలంగాణ సోయి ఉంటే బ్రహ్మణ పరిషత్‌లో ఆంధ్రావాళ్లను తొలగించాలి.. యాదాద్రి గుడి బోర్డులో కూడా ఆంధ్రావాళ్లను తొలగించాలని కవిత డిమాండ్‌ చేశారు.

0
0
Report
Advertisement

Tanguturu Jewellery Theft: అర్ధరాత్రి హైవేపై ఘోరం..ఒంటరి మహిళపై మత్తుమందు చల్లి..రన్నింగ్ ట్రావెల్ బస్సులో దారుణం!

Tanguturu, Andhra Pradesh:

Tanguturu Travel Bus Jewellery Theft: బాధితురాలి వివరాల ప్రకారం, విజయవాడలో జరగబోయే ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు వేంపాటి రాధ అనే మహిళ తన వద్ద ఉన్న 300 గ్రాముల బంగారు ఆభరణాలను ఒక చిన్న బ్యాగులో భద్రపరుచుకుని బెంగళూరు నుంచి బయలుదేరింది. ఆమె "వేమూరి కావేరి" అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తోంది. అర్ధరాత్రి సమయంలో హైవేపై ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్న వేళ బస్సు వేగంగా దూసుకెళ్తోంది. ఆ సమయంలో ప్రయాణికురాలిపై మత్తు కలిగించే కెమికల్ స్ప్రే చేసి, ఆమె నిద్రలో ఉండగానే ఈ నగలను అపహరించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెల్లవారిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవడానికి బస్సు ఒక చోట ఆగిన సమయంలో, నిద్రలేచిన రాధ తన వద్ద ఉన్న నగల బ్యాగు కోసం వెతికింది. కానీ ఆ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురై వెంటనే బస్సు సిబ్బందిని అప్రమత్తం చేసింది. తోటి ప్రయాణికులతో కలిసి బస్సులో గాలించగా, కొద్దిసేపటికే బస్సు ప్రవేశ ద్వారం (డోర్) వద్ద ఆ చిన్న బ్యాగు లభ్యమైంది. అయితే బ్యాగును తెరిచి చూడగా, అందులో భద్రపరిచిన రూ.40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాత్రం మాయమయ్యాయి. ఉలవపాడు మండలం కోవూరు సమీపానికి బస్సు చేరుకున్న తరుణంలోనే ఈ చోరీ జరిగినట్లు రాధ గుర్తించి బస్సు డ్రైవర్‌కు సమాచారం ఇచ్చింది.

దీంతో రాధ బస్సును సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాల్సిందిగా కోరింది. బస్సు డ్రైవర్, సిబ్బంది వెంటనే ఆ బస్సును ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించగా, అక్కడ పోలీసులు వచ్చి బస్సులో ప్రాథమిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఎలాంటి రిజర్వేషన్ లేకుండా బస్సులో ఎక్కిన ఒక అపరిచిత యువకుడిపై రాధ బలమైన అనుమానాన్ని వ్యక్తం చేసింది.

అతడికి కనీసం టికెట్ కూడా ఇవ్వకుండా, కేవలం డబ్బులు తీసుకుని ఖాళీ సీటులో కూర్చోబెట్టారని ఆమె ఆరోపించింది. బస్సులో సీసీ కెమెరాలు ఉంటే నిందితుడిని సులభంగా గుర్తించే వీలుండేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, టికెట్ లేని ప్రయాణికుడిని ఎందుకు ఎక్కించుకున్నారనే కోణంలో ప్రైవేట్ బస్సు సిబ్బందిపై కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మరోసారి ఫైర్..రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ప్రెస్‌మీట్

Also Read: స్కూల్ విద్యార్థినులతో కలిసి ప్రిన్సిపాల్ స్నానం..వీడియో వైరల్ కావడంతో సస్పెండ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

BRS Party: బీఆర్‌ఎస్‌ పార్టీని హరీశ్ రావు చీల్చే కుట్ర.. రేవంత్‌ రెడ్డితో లండన్‌లో కుట్ర: కవిత

Hyderabad, Telangana:

Kavitha vs Harish Rao: 'బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునేందుకు గుంటనక్క కుట్ర. మెదక్ ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు చేస్తున్నారు. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. అటు గుంపుమేస్త్రీ, ఇటు బీజేపీతో దోస్తానా?' అని మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రా వ్యాపార సంస్థలతో రూ.వేల కోట్ల పాల వ్యాపారం చేశారని.. గుంటనక్క, గుంపుమేస్త్రీ మధ్య లండన్‌లో లాలుచీ చేస్తున్నారని ఆరోపించారు.

'లండన్ మీటింగ్ వివరాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాం. ముఖ్యమంత్రి పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు ఆంధ్రా రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతూ ఆంధ్రా ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు' అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను రేవంత్‌ రెడ్డి తాకట్టు పెడుతున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడటం లేదని.. కాంగ్రెస్ పార్టీతో పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయిందని తెలిపారు.

'ఒడిశా అమ్మాయి చనిపోయినా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం లేదు. తెలంగాణకు అన్యాయం జరిగిన మాట్లాడటం లేదు. లండన్ లాలూచీ కారణంగానే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడటం లేదా? కొన్ని రోజుల కిందట లండన్‌లో గుంపుమేస్త్రీ, గుంటనక్క మధ్య మీటింగ్ జరిగింది. గుంటనక్కకు చాలా వ్యాపార సంబంధాలు ఉండడంతోనే మాట్లాడటం లేదు. ఇక ఆంధ్రావాళ్లతో కేటీఆర్‌కు వ్యాపార సంబంధాలు, దోస్తులు ఉండటంతో ఆయన మాట్లాడటం లేదు' అని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.

'నిజంగా లండన్‌లో గుంటనక్కతో లాలూచీ లేకపోతే ఆయన మీద క్విడ్‌ప్రోకో కేసు నమోదు చేయాలని రేవంత్‌ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీశ్‌ రావు కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున పాలు పోసి వ్యాపారం చేశాడు. ఒక్క నారాయణ, చైతన్య కాలేజ్‌లకే నెలకు రూ.5 కోట్ల చొప్పున 8 ఏళ్లుగా రూ.960 కోట్ల వ్యాపారం చేశాడు. ఇంకా కార్పొరేట్ హాస్పిటల్స్ కిమ్, కామినేని, యశోద వంటి హాస్పిటల్స్‌కు కూడా ఆయన పాలు పోశాడు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ ఇలా ఆంధ్రావాళ్ల పాల వ్యాపారం చేయటం క్విడ్‌ప్రోకో కాదా?' అని ప్రశ్నించారు.

'గుంటనక్కతో రేవంత్‌ రెడ్డికి లాలూచీ లేకపోతే లండన్‌లో ఒప్పందం జరగకపోతే ఆయనపై క్విడ్‌ప్రోకో కేసు నమోదు చేయాలి. కరీంనగర్ డెయిరీ, ముల్కనూరు డెయిరీ, మదర్ డెయిరీ, విజయ డెయిరీ లాంటి వాళ్లకు 5 మంది పైగా విద్యార్థులు ఉన్న చోట పాలు వాళ్లే పోసేలా జీవో ఇవ్వాలి. ప్రభుత్వంతో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కాంప్రమైజ్ అయ్యింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వ్యవస్థీకృత అవినీతికి పాల్పడింది' అని మాజీ ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. 

'పాల వ్యాపారం ఒకరికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒకరికి, ఇసుక వ్యాపారం ఒకరికి అన్నట్లు పంచుకొని వ్యవస్థీకృత అవినీతి చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్ అయ్యిందంటూ మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. వ్యవస్థీకృతమైన అవినీతికి పాల్పడిన పార్టీని మళ్లీ అధికారంలోకి తెద్దామా?' అని కవిత ప్రశ్నించారు. జవాబుదారీతనంతో, అవినీతి లేకుండా, కొత్తవాళ్లకు అవకాశం కల్పించేందుకు మేము పార్టీ పెట్టాం. మా లాంటి పార్టీకి అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

'ఇటీవల మెదక్ ఎమ్మెల్యేలతో హరీశ్‌ రావు మీటింగ్ పెట్టారు. కేసీఆర్ ఎన్టీఆర్‌లాగా పెద్ద మనిషి. కానీ ఆయన కొడుకు వారసత్వం ఇవ్వడం సరికాదంటూ ఆయన వారితో అన్నారు. అందులో ఉన్న ఒక ఎమ్మెల్యేనే నాకు ఈ విషయాలు చెప్పారు. ఎన్టీఆర్ పేరు తీసుకున్నారంటే గుంటనక్క వెన్నుపోటు పొడిచేందుకు సిద్దమైందన్నమాట. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకొని ఆ తర్వాత బీజేపీ మద్దతు తీసుకోవాలని హరీశ్‌ రావు కుట్ర చేస్తున్నాడు.

'బీజేపీతో మిలాఖత్ ఉందని నేను చెప్పటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్‌లో ఒక ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు వచ్చినప్పుడల్లా ఆయనకు పసుపు, మిరియాలు కలిపిన పాలు వెళ్తుంటాయి. ఆ రోజు హరీష్ రావు పూర్తిగా తన కార్యక్రమాలను రద్దు చేసుకోని ఆయనతో మీటింగ్ పెడతాడు. నేను ఇప్పుడు బీఆర్ఎస్‌లో లేను. ఆ పార్టీ ఎలా పోయినా నాకు సంబంధం లేదు. కానీ తిన్నింటి వాసాలు లెక్కపెట్టే గుంటనక్క గురించి తెలియాలని చెబుతున్నా. ఇప్పుడున్న రేవంత్‌ రెడ్డితో కచ్చితంగా ఆయనకు లాలూచీ ఉంది' అని మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.

0
0
Report

Bibek Kumar Nepal: నేపాల్ జలప్రళయం.. మామిడి చెట్టును పట్టుకుని రెండుసార్లు చావును జయించిన కార్మికుడు!

Namarjung, Gandaki Province:

Bibek Flood Nepal Flash Flood: నేపాల్ - చైనాలోని టిబెట్ సరిహద్దు వెంబడి భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడి, కొట్టుకువచ్చిన మట్టి, రాళ్ల ప్రవాహం నది దిగువ ప్రాంతాల్లోని నివాసాలను, మౌలిక సదుపాయాలను ముంచెత్తింది. జర్మన్ జియోసైన్సెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. ఈ కొండచరియల విలయానికి సరిగ్గా 7 నిమిషాల ముందు ఆ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఆకస్మిక వరదల దాటికి వందలాది మంది మరణించగా, వేలాది ఇళ్ళు, భవనాలు, వంతెనలు కొట్టుకుపోయి ప్రజల జీవితాలు పూర్తిగా తలకిందులయ్యాయి.

ప్రాణం నిలిపిన మామిడి చెట్టు..
నేపాల్‌లోని రసువా జిల్లాలోని బిదుర్ అనే ప్రాంతంలో బిబెక్ కుమల్ అనే భవన నిర్మాణ కార్మికుడు కొత్తగా నిర్మిస్తున్న ఒక ఇంటి వద్ద 5 అడుగుల లోతు గొయ్యి తవ్వుతున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా వరద ముంచుకొస్తున్న భయంకరమైన శబ్దాన్ని విని పైనున్న అతని నలుగురు సహచరులు వెంటనే బయటకు వచ్చి పరుగెత్తమని గట్టిగా కేకలు వేశారు.

కుమల్ గొయ్యిలోంచి పైకి వచ్చి పరుగెడుతుండగానే, కొండలను సైతం కరిగించేలా బురద, శిథిలాలతో కూడిన ఒక భారీ ప్రవాహం దూసుకొచ్చింది. ఆ ఉధృతికి వారు నిర్మిస్తున్న ఇల్లు కళ్ల ముందే పూర్తిగా కొట్టుకుపోయింది. వరద నీటిలో కొట్టుకుపోతున్న కుమల్, అదృష్టవశాత్తు అక్కడ ఉన్న ఏకైక మామిడి చెట్టు కొమ్మల మధ్య చిక్కుకున్నాడు. "అక్కడ గనక ఆ మామిడి చెట్టు లేకపోతే నేను ఖచ్చితంగా వరదలో కొట్టుకుపోయి చనిపోయేవాడిని" అని కుమల్ ఆవేదనతో తెలిపాడు. వరద ఉధృతి తగ్గే వరకు చెట్టును పట్టుకుని వేలాడుతున్న అతడిని పోలీసులు గమనించి సురక్షితంగా రక్షించారు.

చావును రెండుసార్లు జయించి..
ఈ ప్రమాదంలో కొండచరియలు విరిగిపడటం వల్ల కుమల్ కుడి కాలుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం అతను రాజధాని కాఠ్మాండులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని సోదరుడు దినేష్ అతని వద్ద ఉండి పరిరక్షిస్తున్నాడు. ఈ ఆకస్మిక విపత్తు నుండి ఇప్పటివరకు 114 మందిని రక్షించి పలు ఆసుపత్రులలో చేర్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గతంలో 2015లో సంభవించి దాదాపు 9,000 మందిని బలిగొన్న భయంకర భూకంపం నుండి కూడా బిబెక్ కుమల్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడటం విశేషం.

Also Read: నేపాల్‌లో ప్రకృతి విలయం..ఆకస్మిక వరదలతో భూకంపం..మౌలిక వసతుల విధ్వంసం!

Also REad: క్షణాల్లో కొట్టుకుపోయిన గ్రామాలు.. 300 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top