Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Medchal-Malkajgiri500076

ఓయూ పోలీసులు జర్నలిస్టులపై దాడి

Jul 11, 2024 11:55:25
Hyderabad, Telangana
ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో మీడియా కవరేజ్ కి వెళ్ళిన జీ తెలుగు రిపోర్టర్ శ్రీ చరణ్ పై ఉస్మానియా యూనివర్సిటీ సిఐ దురుసుగా ప్రవర్తించాడు శ్రీ చరణ్ కి స్వల్ప గాయాలు శ్రీ చరణ్ ని హాస్పిటల్ కి తరలించారు
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Jan 05, 2026 17:04:17
Hyderabad, Telangana:

Sankranti 2026 Holidays In Telangana: తెలంగాణలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. జనవరి 10 నుంచి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ..సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆప్షన్ హాలీడే వినియోగించుకుంటే ఏకంగా 9 రోజుల పాటు సంక్రాంతి సెలవులను విద్యార్థులు ఎంజాయ్ చేయోచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

9 రోజులు సంక్రాంతి సెలవులు..
జనవరి 10న రెండో శనివారంతో పాటు ఆ తర్వాత జనవరి 11న ఆదివారం కారణంగా సెలవు ఉండడం వల్ల సెలవులను జనవరి 10 నుంచే ప్రారంభం అయ్యేలా ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో జనవరి 10 నుంచి జనవరి 16 సంక్రాంతి సెలవులను ప్రకటించింది. 

అయితే జనవరి 17న శనివారం రోజున ఆప్షన్ హాలీడే ఇస్తే.. జనవరి 18న ఆదివారం కావడం వల్ల మరో సెలవులు కలిసి వస్తుంది. దీంతో శనివారం ఆప్షన్ హాలీడే వినియోగిస్తే.. ఏకంగా 9 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. అయితే ఆప్షన్ హాలీడే అనేది ఆయా పాఠశాల యాజమాన్య నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. 

స్కూల్స్ రీ-ఓపెన్..
కానీ, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా అధికారికంగా జనవరి 17న పాఠశాలలు తెరవాల్సి ఉంది. అయితే జనవరి 17న శనివారం ఆ తర్వాత ఆదివారం కారణంగా సెలవు కలిసి వస్తుండడం వల్ల శనివారం ఆప్షన్ హాలీడే గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. ఒకవేళ శనివారం (జనవరి 17) వ్యక్తిగతంగా సెలవు తీసుకుంటే విద్యార్థులకు 9 రోజుల పాటు సెలవు వచ్చినట్లు ఉంటుంది.

జనవరి అంటేనే సెలవుల మాసం!
ఈ ఏడాది జనవరి నెల విద్యార్థులకు అసలైన పండుగను తీసుకువచ్చింది. జనవరి 1 (న్యూ ఇయిర్), సంక్రాంతికి 9 రోజులు, జనవరి 26 (గణతంత్ర దినోత్సవం)తో పాటు నెలలో 4 ఆదివారాలు, ఒక రెండో శనివారం వంటి వాటితో కలుపుకొని జనవరి నెలలో ఏకంగా 16 రోజులు పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. అంటే సగానికి పైగా రోజులు విద్యార్థులు ఇంటి వద్దే గడపవచ్చు.

ప్రయాణాలు - జాగ్రత్తలు
సెలవులు భారీగా ఉండటంతో హైదరాబాద్ నగరం నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలు, జాతీయ రహదారులపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి.

విద్యార్థులకు సూచనలు..
పండుగ అంటే కేవలం ఆటలే కాదు, ప్రాణ రక్షణ కూడా ముఖ్యం. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు మేడల మీద, రోడ్ల మీద అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి. నదులు లేదా చెరువుల్లో స్నానాలకు వెళ్లేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. సెలవుల ఎంజాయ్‌మెంట్‌తో పాటు అకడమిక్ క్యాలెండర్ దెబ్బతినకుండా ఉపాధ్యాయులు ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేయాలి.

Also Read: School Holiday: రేపు సోమవారం స్కూళ్లకు సెలవు..ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..విద్యార్థులు ఫుల్ ఖుషీ!

Also Read: Mana Shankara Vara Prasad Trailer: 'మన శంకరవరప్రసాద్' ట్రైలర్ వచ్చేసింది! సంక్రాంతి మెగా ధమాకా..బాక్సాఫీస్ కుమ్ముడే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 05, 2026 17:03:00
Hyderabad, Telangana:

Polavaram Nallamala Sagar: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అంగీకరించే ప్రసక్తేలేదని.. కచ్ఛితంగా అడ్డుకుని తీరుతామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం  ప్రతిపాదనలు ముమ్మాటికి గోదావరి జల వివాద ట్రిబ్యునల్ 1980 అవార్డుతో పాటు అంతరాష్ట్ర జల నిబంధనలు ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.

Also Read: Schools Holiday: రేపు స్కూళ్లకు సెలవు.. ఎక్కడ? ఎందుకో తెలుసా?

రాష్ట్ర శాసనసభలో జరిగిన మీడియా చిట్-చాట్‌లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మాజీ మంత్రి హరీశ్‌ రావు చూపిస్తున్న లేఖ సీడబ్ల్యూసీ అంతర్గత సమాచారం కోసం పంపిన లేఖ మాత్రమేనని.. ఎంతమాత్రం సీడబ్ల్యూసీ ఆమోదించినట్లు కాదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర జల హక్కులపై ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు బీఆర్ఎస్ పార్టీ పూనుకుందని.. ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని కొట్టి పారేశారు.

Also Read: Kavitha Drama: 'కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు? కేసీఆర్‌ను తిడితే లీడర్‌ అవుతావా?': బీఆర్‌ఎస్‌ పార్టీ

పోలవరం-నల్లమల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలతో పాటు కేంద్ర జల కమిషన్, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలకు లేఖలు రాసిన విషయాన్ని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణా ప్రభుత్వ అభిప్రాయంతొవీపైన పేర్కొన్న సంస్థలన్నీ ఏకీభవించాయని తెలిపారు. డిసెంబర్ 4వ తేదీన కేంద్ర జల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖనే దీనికి నిదర్శనమని చెప్పారు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు.

Also Read: BRS Party: ఎవరి చేతిలో కవిత కీలుబొమ్మ.. ఆమె తీరుతో కేసీఆర్‌ కంటతడి

పోలవరం-నల్లమల ప్రాజెక్టును ఒక్క తెలంగాణా రాష్ట్రం మాత్రమే కాకుండా మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాలు కుడా ఆక్షేపిస్తున్నాయని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా ప్రాంత ప్రయోజనాలను కాపాడడంతో పాటు గట్టి వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని నియమించిందని వివరించారు. రానున్న రెండు రోజుల్లో న్యాయవాదులతో ప్రత్యేకంగా మరో సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తామని వెల్లడించారు.

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీదటనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బ్రేక్ పడిన విషయాన్ని తెలంగాణా సమాజం గుర్తించుకోవాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. కొత్తగా ఏర్పడినడ్డ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ పాలకులు జల వనరుల నిర్వహణలో ఘోరంగా విఫల మయ్యారని విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో మాటలకు చేతలకు ఎక్కడ పొంతన లేదని విమర్శించారు. జూరాల నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం ప్రాజెక్టుకు, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద తుమ్మిడిహట్టి ప్రాజెక్టును రీ డిజైన్ చేయడం వంటి నిర్ణయాలు మోయలేని భారాన్ని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 05, 2026 13:13:14
Hyderabad, Telangana:

Kavitha Politics: 'తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట అందరూ అడుగులో అడుగు వేసి పని చేశారు. ఉద్యమం ప్రారంభమైన ఆరేళ్లకు కవిత వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన పడుతున్న సమయంలో అందరూ కలిసి వచ్చారు. అలానే కవిత వచ్చారు. అందరిలా ఆమె కూడా పని చేయడంతో కేసీఆర్‌ ఆమెకు ఎంపీగా, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కవిత ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు బాధేస్తున్నాయి. ఆరోజుల్లో మీరు ఎంత మందికి పదవులు ఇచ్చారు? ఎంత మంది బీసీలకు మీరు పదవులు ఇప్పించారు?' అని ప్రశ్నించారు.

Also Read: BRS Party: ఎవరి చేతిలో కవిత కీలుబొమ్మ.. ఆమె తీరుతో కేసీఆర్‌ కంటతడి

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కవిత జైలుకు వెళ్లినప్పుడు పార్టీకి ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలుసు. జైలులో ఉన్నప్పుడు మిమ్ములను మీ కోసం ఎంత కష్టపడి అక్కడే ఉన్నారో అందరికీ తెలుసు. జైలులో ఉన్నప్పుడు బీజేపీ మెప్పు కోసం మాట్లాడారో తెల్వదా? బీజేపీకి మద్దతునిస్తూ పోస్టులు పెట్టిన సంగతి మర్చిపోతే ఎలా? అయోధ్య రాముడి గురించి పోస్టులు పెట్టి పొద్దున్నే డిలీట్ చేసింది మీరు కాదా?' అని తుల ఉమ నిలదీశారు.

Also Read: Luxury Bikes: లగ్జరీ బైక్‌ దొంగల ముఠా అరెస్ట్‌.. కేటీఎం, బుల్లెట్‌లే వారి లక్ష్యం

'జాగృతి జాగృతి అంటున్నారు మీరు చేసే జాగృతి కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పని చేయలేదా? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేనిదే మీరు ఊర్లలో మీ జాగృతి కార్యక్రమాలు చేశారా? తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం అన్ని వదులుకొని పని చేశారు. నీలాగా ఎలాంటిది ఆశించలేదు? అనేక మంది ఉద్యమకారులకు ఉద్యోగాలు వచ్చాయి. అనేక కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం ఆనాడు చేసింది. 
మీకు ఏదో నష్టం జరిగినట్లు చెబుతున్నారు. శాసనమండలిలో మీ వ్యక్తిగత విషయాలు చెప్పడానికా? ప్రజా సమస్యలు కదా శాసన మండలిలో చెప్పాల్సినవి. శాసన మండలిలో మాట్లాడిన మాటలు ఎవరికి లాభం జరుగుతుంది' అని తుల ఉమ వివరించారు.

Also Read: NRI Nikitha: ఎన్నారై యువతి హత్యకేసులో భారీ ట్విస్ట్‌.. బాయ్‌ఫ్రెండ్‌ కాదు అతడు ఎవరంటే?

'కేసీఆర్‌పై రోజు తిట్టే వారికి లాభం జరుగుతుందా? మీరు బీఆర్ఎస్ పార్టీని రోజు విమర్శిస్తే మర్చిపోతే ఎలా? మద్యం కుంభకోణం సమయంలో ప్రధాన పత్రికలను ఉద్దేశించి తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతా అన్నారు పెట్టరా? ఇవాళ తను కన్నీళ్లు పెట్టుకున్న పద్దతి పాలన వారికి నష్టం జరిగింది. ఈ వర్గాలకు నష్టం జరిగిందో అని కన్నీళ్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఆమె వ్యక్తిగత విషయాలు కోసం ఆమె కన్నీళ్లు పెట్టుకున్నది. ఆమె ఆవేదనతో బీఆర్‌ఎస్‌ పార్టీకి, కేసీఆర్‌కు నష్టం చేసే పని చేస్తోంది' అని మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ తెలిపారు.

'లిక్కర్ స్కాంలో నీ పాత్ర లేదని ఇదే లక్ష్మీనరసింహ స్వామి మీద ప్రమాణం చేస్తారా?' అని కవితకు మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ సవాల్‌ చేశారు. లిక్కర్ స్కాంతో కేజ్రీవాల్ అంతకు దిగజారి పోయారని తెలిపారు. ఆమె మాట్లాడే మాటలు తెలంగాణ ప్రజలు, పేదలకు బడుగు బలహీన వర్గాలకు లాభం చేకూర్చే విధంగా ఉండాలి. మీరు పార్టీ పెట్టుకోండి ఎవరికి అభ్యంతరం లేదు. అధికార పార్టీకి అండగా వారికి లాభం చేకూరే విధంగా మాట్లాడుతున్నారు. రోజు మీడియా ముందుకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అందరికీ తెలుసు. కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు?' అని తుల ఉమ ప్రశ్నించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 05, 2026 12:48:58
Hyderabad, Telangana:

Prabhas One Day Food Cost: టాలీవుడ్ 'డార్లింగ్' ప్రభాస్ సినిమాలే కాదు, ఆయన పెట్టే భోజనం కూడా బాక్సాఫీస్ హిట్టే. షూటింగ్ సెట్‌లో ప్రభాస్ వడ్డించే విందు గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. తాజాగా దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ డైలీ ఫుడ్ ఖర్చు ఎంతంటే?
ప్రభాస్ గురించి తెలిసిన వారు ఆయన ఒక్కడే తినడం ఎప్పుడూ చూడరు. ఆయన ఎక్కడున్నా కనీసం 10 నుండి 20 మందితో కలిసి భోజనం చేస్తారు. ప్రభాస్ కోసం ఒక ప్రత్యేక కుకింగ్ టీమ్ ఉంటుందని, వీరు ప్రతిరోజూ చేసే రకరకాల వంటకాల ఖర్చే దాదాపు రూ.2 లక్షల వరకు ఉంటుందని ఇండస్ట్రీ టాక్.

మెనూలో ఏముంటాయి? 
మటన్, చికెన్, రొయ్యలు, పీతలు, చేపల పులుసు.. ఇలా ఒకటా రెండా, పేర్లు చెప్పడానికే పావుగంట పడుతుంది. వెరైటీ కాంబినేషన్లతో విందు వడ్డించడం హీరో ప్రభాస్ నైజం. కృష్ణంరాజు గారి నుంచి ప్రభాస్‌కు వచ్చిన అతిపెద్ద వారసత్వం 'ఆతిథ్యం'. వీరిద్దరికీ గోదావరి పులస అంటే అమితమైన ఇష్టం. ప్రభాస్ కఠినమైన డైట్‌లో ఉన్నా, పులస దొరికిందని తెలిస్తే 'చీట్ డే' ప్రకటించి మరీ ఆరగిస్తారట. కృష్ణంరాజు గారు లండన్ నుంచి స్నేహితులు వచ్చినా వారి ఇష్టాలను అడిగి మరీ స్వయంగా వడ్డించేవారట. అదే గుణం ప్రభాస్‌లోనూ పుష్కలంగా కనిపిస్తుంది.

పెదనాన్న మరణం తర్వాత..అండగా!
కృష్ణంరాజు గారి మరణం తర్వాత శ్యామలాదేవి గారు తీవ్ర నిరాశలోకి వెళ్ళినప్పుడు, ప్రభాస్ ఆమెకు ధైర్యం చెప్పిన తీరు ఎంతో విలువైనదే కాకుండా మరిచిపోలేనిది. "పెదనాన్న ఎక్కడికీ వెళ్ళలేదు, ఆయన సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించి మనతోనే ఉన్నారు. మీరు బాధపడితే ఎవరూ మీ దగ్గరకు రారు.. మీరు పెదనాన్న ఉన్నట్టుగానే ధైర్యంగా అందరికీ కనిపించాలి" అని ప్రభాస్ ఆమెలో ధైర్యాన్ని నింపారు.

కేవలం భోజనం పెట్టడమే కాదు, మనుషుల మనసులను గెలవడంలో కూడా ప్రభాస్ 'రెబల్ స్టార్' వారసత్వాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారని శ్యామలాదేవి గారు గర్వంగా చెప్పుకొచ్చారు.

Also Read: Sankranti 2026 Dates: సంక్రాంతి 2026 వచ్చేసింది! పండుగ తేదీలు, పుణ్యకాలం ముహుర్తాలు ఏంటో తెలుసుకోండి!

Also Read: School Holiday: రేపు సోమవారం స్కూళ్లకు సెలవు..ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..విద్యార్థులు ఫుల్ ఖుషీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Jan 05, 2026 12:07:33
Secunderabad, Telangana:

Old PF Account Withdrawal: ప్రభుత్వ, ప్రైవేట్ లేదా ఇతర ఏ సంస్థలో పనిచేసే ఉద్యోగికైనా యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఇప్పుడు అత్యంత కీలక గుర్తింపుగా మారింది. ఈ 12 అంకెల ప్రత్యేక నంబర్‌ను EPFO జారీ చేస్తుంది. 2014లో UAN వ్యవస్థను తీసుకువచ్చిన ప్రధాన ఉద్దేశ్యం ఒక్కటే..  ఉద్యోగి ఉద్యోగం మారినా.. అతని PF ఖాతాలు విడివిడిగా కాకుండా ఒకే నంబర్‌తో అనుసంధానంగా ఉండేలా చేయడం. అయితే2014కి ముందు పరిస్థితి భిన్నంగా ఉండేది. అప్పట్లో ఉద్యోగి ప్రతి కొత్త కంపెనీలో చేరినప్పుడు కొత్త PF నంబర్ ఇచ్చేవారు. ఆ నంబర్ ఆ కంపెనీకే పరిమితం అయ్యేది. ఫలితంగా.. ఉద్యోగాలు మారినవారికి పాత PF ఖాతాలు ఎక్కడున్నాయో కూడా గుర్తు లేకుండా పోయేది. ఈ సమస్యకు పరిష్కారంగానే UAN వ్యవస్థను ప్రవేశపెట్టారు.

ఒక ఉద్యోగి తన సందేహాన్ని అడిగారు.. నేను 15 ఏళ్ల క్రితం పనిచేసిన కంపెనీ PF నంబర్ ఇప్పుడు గుర్తు లేదు. ఆ ఖాతాలో ఉన్న డబ్బును ఎలా తీసుకోవాలి? అని ఆయన సందేహం. ఇప్పుడు దీనికి సులభంగా అర్థమయ్యేలా సమాధానం చూద్దాం.

15 ఏళ్ల పాత PF ఖాతా ఎలా గుర్తించాలి?
చాలా మందికి తమ పాత PF నంబర్ లేదా UAN గుర్తుండదు. ముఖ్యంగా 2014కి ముందు ఉద్యోగం చేసినవారికి ఇది సాధారణ సమస్య. EPFO పోర్టల్‌లోని చాలా సేవలు UAN ఆధారంగానే ఉంటాయి. కాబట్టి మొదట పాత ఖాతాను గుర్తించడం అవసరం.

పాత కంపెనీ పేరు గుర్తుంటే:
EPFO వెబ్‌సైట్‌లోని Establishment Search ఆప్షన్ ఉపయోగించండి. కంపెనీ పేరు లేదా పాత కోడ్ ద్వారా సెర్చ్ చేస్తే.. ఆ సంస్థకు సంబంధించిన వివరాలు లభిస్తాయి. కంపెనీ ఇంకా కొనసాగుతుంటే.. అక్కడి HR విభాగాన్ని సంప్రదించడం కూడా ఉపయోగపడుతుంది.

UAN ఇప్పటికే ఉంటే:
మీరు 2014 తర్వాత మరో ఉద్యోగం చేసి ఉంటే.. మీకు ఇప్పటికే UAN ఉండే అవకాశం ఉంది. EPFO పోర్టల్‌లో Know Your UAN ఆప్షన్నుక్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఇవ్వాలి. OTP వచ్చిన తర్వాత పేరు, పుట్టిన తేదీ, ఆధార్ లేదా పాన్ వివరాలు నమోదు చేయాలి. మీ పాత PF ఖాతా లింక్ అయి ఉంటే, UAN వివరాలు కనిపిస్తాయి.

EPFO కార్యాలయాన్ని నేరుగా సంప్రదించండి:
ఇది అత్యంత నమ్మకమైన మార్గం మరొకటి ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సంప్రదించడం. మీ ఆధార్, పాన్, పాత కంపెనీ పేరు, ఉద్యోగంలో చేరిన తేదీ, వదిలిన తేదీ వంటి వివరాలతో సమీప EPFO కార్యాలయానికి వెళ్లండి. అక్కడి అధికారులు వారి రికార్డుల్లో శోధించి మీ పాత PF నంబర్‌ను కనుగొనడంలో సహాయం చేస్తారు.

Also Read: EPS Pension Scheme: బడ్జెట్‌లో నిర్మలమ్మ వరాలు.. ఉద్యోగులకు తీపి కబురు గ్యారెంటీ.. EPSపై కీలక నిర్ణయం..!

ఆన్‌లైన్ ఫిర్యాదు చేయండి:
epfigms.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు.  పనిచేయని / పాత PF ఖాతా  అనే విభాగంలో మీ సమస్యను వివరంగా నమోదు చేస్తే, EPFO అధికారులు స్పందిస్తారు.

15 ఏళ్ల పాత PF ఖాతా నుంచి డబ్బు ఎలా తీసుకోవాలి?
ఉద్యోగం వదిలిన తర్వాత PF ఖాతా 36 నెలల వరకు యాక్టివ్‌గా పరిగణిస్తారు. ఆ తర్వాత ఖాతా పనిచేయని విభాగంలోకి వెళ్తుంది. అయితే దీని అర్థం వడ్డీ ఆగిపోతుంది అని కాదు. EPFO నిబంధనల ప్రకారం, ఉద్యోగికి 58 ఏళ్లు వచ్చే వరకు లేదా మొత్తం డబ్బు తీసుకునే వరకు వడ్డీ పడుతూనే ఉంటుంది. మీరు 15 ఏళ్ల క్రితం ఉద్యోగం వదిలినా, డబ్బు సురక్షితంగానే ఉంటుంది. మీ పాత కంపెనీ మూసివేసినా..PF డబ్బు EPFO ప్రాంతీయ కార్యాలయంలోనే ఉంటుంది. ముందుగా పాత PF నంబర్‌ను కనుగొని, దానిని మీ UANకి లింక్ చేయాలి.

PF ఉపసంహరణకు రెండు మార్గాలు ఉన్నాయి:

ఆన్‌లైన్ పద్ధతి:
EPFO పోర్టల్‌లో లాగిన్ అవ్వండి. Online Services → Claim (Form 31, 19, 10C) ఎంపిక చేయండి. బ్యాంక్ ఖాతా, ఆధార్ లింక్ వంటి వివరాలు పూరిస్తే, డబ్బు నేరుగా మీ ఖాతాలోకి జమ అవుతుంది.

ఆఫ్‌లైన్ పద్ధతి:
మీ PF ఖాతా ఉన్న EPFO కార్యాలయానికి వెళ్లి అవసరమైన ఫారమ్‌లు పూరించాలి. ధృవీకరణ తర్వాత డబ్బు విడుదల అవుతుంది. సరైన సమాచారం, కొద్దిపాటి ఓర్పు ఉంటే.. 15 ఏళ్ల పాత PF ఖాతా అయినా..మీ డబ్బును తిరిగి పొందడం పూర్తిగా సాధ్యమే అవుతుంది.

Also Read: EPFO: ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్.. ఇక పై పీఎఫ్ ఖాతాతోనే ఇన్సూరెన్స్..!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 05, 2026 11:46:47
Hyderabad, Telangana:

Kavitha Drama Politics: ఎవరో ఆడించినట్టు కవిత వైఖరి ఉందని.. ఆమె ప్రతి రోజు కేసీఆర్‌ను కంటతడి పెట్టిస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యంగా ఆమె రాజకీయం చేస్తున్నారని కవిత తీరును ఖండించారు. పార్టీ వ్యవహారాలను శాసనమండలిలో ఎలా మాట్లాడతారు? సభలో అనుమతి ఇచ్చారని మహిళా నాయకులు ప్రశ్నించారు. ఎవరి చేతిలోనే కీలుబొమ్మగా మారి కవిత మాట్లాడుతున్నారని తప్పుబట్టారు.

Also Read: NRI Nikitha: ఎన్నారై యువతి హత్యకేసులో భారీ ట్విస్ట్‌.. బాయ్‌ఫ్రెండ్‌ కాదు అతడు ఎవరంటే?

కవిత వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తదితరులు మాట్లాడారు. కవిత వ్యవహారాన్ని.. ఆమె ధోరణిని కొట్టిపారేశారు. 'కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఎవరో ఆడిస్తే కవిత కీలు బొమ్మగా మారారు. కేసీఆర్‌ను క్షోభకు గురి చేస్తున్న వైనాన్ని ఖండిస్తున్నాం' అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రకటించారు. 'కేసీఆర్ ఆదేశాల మేరకు అసెంబ్లీని ఎమ్మెల్యేలు బహిష్కరించారు. కవిత మనస్పూర్తిగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారా? నాటకాలు ఆడుతున్నారా? పదవి అవసరం లేనప్పుడు శాసనమండలికి ఎందుకు హాజరయ్యారు?' అని నిలదీశారు. 'బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేలా కవిత మాట్లాడారు. రోజు కేసీఆర్‌ను కంటతడి పెట్టిస్తున్నారు. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వని ప్రభుత్వం, కవితకు అంత సమయం ఎలా ఇచ్చింది? అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రశ్నించారు.

Also Read: Harish Rao: నదీ జలాలపై ఉత్తమ్‌ కట్టుకథలు, రేవంత్ పిట్ట కథలు: హరీశ్‌ రావు

'కవితను ఎవరు నాటకాలు ఆడిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీలో స్వేచ్ఛ లేకపోతే పదవులు ఇప్పించుకోలేదా? పార్టీలో కవితకు ఉన్న చనువు ఎవరికి లేదు? కంటతడి పెట్టేంత క్షోభకు బీఆర్ఎస్ పార్టీ గురి చేయలేదు. కవిత ఓడిపోయిన ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ పార్టీగా మార్చడం ఇష్టం లేదంటున్న కవిత, తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా ఎలా మార్చింది? అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత నిలదీశారు.

Also Read: Schools Holiday: రేపు స్కూళ్లకు సెలవు.. ఎక్కడ? ఎందుకో తెలుసా?

బీఆర్‌ఎస్‌ పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోతే మీకు పదవులు ఎలా వచ్చాయి? కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయాలని చూస్తున్నారు. లిక్కర్ కేసులో ఇరుక్కుంటే హరీశ్‌ రావు, కేటీఆర్ వారానికి నాలుగు సార్లు ఢిల్లీకి తిరిగారు. కూర్చున్న కొమ్మనే నరకాలని చూస్తున్నారు మీ ఆటలు ఇక సాగవు' అని కవితకు హెచ్చరించారు. మీ భవిష్యత్తును మీరే కాలరాసుకుంటున్నారని కవితపై మండిపడ్డారు. కవిత టార్గెట్ బీఆర్ఎస్, కేసీఆర్ అని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 05, 2026 11:18:28
Miyapur, Telangana:

Luxury Bikes Gang Arrest: ఖరీదైన బైక్‌లే వారి లక్ష్యం. అత్యంత ఖరీదైన బైక్‌లు కనిపిస్తే ఆ గ్యాంగ్‌ వెంటనే ఎత్తుకుపోతుంది. రూ.లక్షల విలువైన కేటీఎం, బుల్లెట్‌, అపాచీ వంటి ఖరీదైన బైక్‌లను దొంగతనం చేస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రేమతో కొన్న బైక్‌లు దొంగతనానికి గురవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బైక్‌ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన బైక్‌ దొంగల ముఠా వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: NRI Nikitha: ఎన్నారై యువతి హత్యకేసులో భారీ ట్విస్ట్‌.. బాయ్‌ఫ్రెండ్‌ కాదు అతడు ఎవరంటే?

జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన సాయి కిరణ్ (23) బైక్‌ రిపేర్లు చేస్తుండేవాడు. దీంతో సునాయాసంగా బైక్‌ల తాళాలు తీసి దొంగతనానికి పాల్పడుతున్నాడు. ఒక గ్యాంగ్‌ను ఏర్పాటుచేసుకుని ఖరీదైన కేటీఎం, బుల్లెట్‌ వంటి బైక్‌లను దొంగతనాలు చేస్తున్నాడు. అతడి గ్యాంగ్‌లో లీల సాయి (21), విజయశివ సాయి ప్రసాద్(25), గెడ్డం ప్రవీణ్ (25) ఉన్నారు.

Also Read: Harish Rao: నదీ జలాలపై ఉత్తమ్‌ కట్టుకథలు, రేవంత్ పిట్ట కథలు: హరీశ్‌ రావు

వీరి సమాచారం తెలుసుకున్న మియాపూర్‌ పోలీసులు సాయి కిరణ్‌ ముఠాను అరెస్ట్‌ చేశారు. సాయికిరణ్‌తోపాటు లీల సాయి చిక్కగా.. దొంగతనం కేసులో విజయశివ సాయి ప్రసాద్ (25) ప్రస్తుతం అనకాపల్లి పోలీసుల పరిధిలో ఉన్నాడు. మరో గ్యాంగ్‌ సభ్యుడు గెడ్డం ప్రవీణ్ (25) పరారీలో ఉన్నాడు. వీరంతా నలుగురు ఏపీకి చెందిన ముఠా. గతంలో అత్తాపూర్‌లో కూడా ఒక కేసు నమోదు అయింది. గతంలో జైలుకు వెళ్లినా అతడి తీరు మారలేదు. మెకానిక్ వృత్తి కావడంతో బైక్‌లను ఈజీగా లాక్ తీసి చోరీలు చేస్తున్నాడు. అన్ని విలువ చేసే బైక్స్ దొంగతనం చేస్తాడు. చోరీ చేసిన బైక్స్ అన్ని యమహా కేటీఎం, డ్యూక్ బైక్స్ ఉన్నాయి. బైక్ చేసిస్ నెంబర్ కూడా కూడా మార్చేసి అమ్ముతాడు.

Also Read: Schools Holiday: రేపు స్కూళ్లకు సెలవు.. ఎక్కడ? ఎందుకో తెలుసా?

కిరణ్ సాయి, లీలా సాయి ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు మియాపూర్ ఏసీపీ వై. శ్రీనివాస్ కుమార్ తెలిపారు. రూ.80 లక్షల విలువ చేసే 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు కూడా నమోదు చేశామని.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

ఏటీఎం దొంగ అరెస్ట్‌..
సైబర్ క్రైమ్ కోర్స్ నేర్చుకొని ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని మియాపూర్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అర్థరాత్రి 100 కాల్ చేయగా.. మియాపూర్ పోలీసులు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏటీఎం నుంచి డబ్బులు దొంగతనం చేస్తున్న టైంలో పట్టుకున్నాం. ఏపీకి చెందిన వడ్డే కాటమయ్య సైబర్ క్రైమ్ కోర్సులు నేర్చుకోవడం కోసం హైదరాబాద్ వచ్చాడు. కోర్స్‌లో భాగంగా ఏటీఎంలో డబ్బులు ఎలా దొంగిలించాలని నేర్చుకున్నాడు. ప్రత్యేక కంపెనీ ఏటీఎంలలో వాటి టెక్నికల్ సమర్థ్యం గుర్తించి అదే నేర్చుకుంటాడు. ఏటీఎంలోకి వెళ్లిన కస్టమర్ డబ్బులు డ్రా చేసే క్రమంలో డబ్బులు రాకుండా టెక్నికల్ డివైస్ పెట్టి డబ్బులు రాకుండా చేస్తాడు. కస్టమర్ డబ్బులు రాలేదని వెళ్లిపోగానే ఈ వ్యక్తి డబ్బులు తీసుకుంటాడు. రామాంజనేయులు అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 05, 2026 10:45:04
Hyderabad, Telangana:

Sankranti 2026 Date And Time: భారతీయ సంస్కృతిలో మకర సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే ఈ శుభ పర్వదినం, చీకటి నుండి వెలుగులోకి ప్రయాణాన్ని సూచిస్తుంది. ఈ ఏడాది మకర సంక్రాంతితో పాటు ఏకాదశి తిథి కూడా కలిసి రావడం విశేషం.

2026 సంక్రాంతి పండుగ తేదీలు
ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు జనవరి 13 నుండి ప్రారంభం కానున్నాయి. తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.

జనవరి 14 (బుధవారం): భోగి పండుగ – పాత సామాగ్రిని మంటల్లో వేసి, కొత్త వెలుగులతో పండుగను ఆహ్వానించే రోజు.

జనవరి 15 (గురువారం): మకర సంక్రాంతి – సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ప్రధాన పండుగ.

జనవరి 16 (శుక్రవారం): కనుమ – పశువులను పూజించి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే రోజు.

పుణ్యస్నానాలు, పూజా సమయాలు
పంచాంగం ప్రకారం, జనవరి 15న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని బట్టి పుణ్యకాలం నిర్ణయిస్తారు. సూర్యుడి మకర సంక్రమణం మధ్యాహ్నం 3:13 గంటలకు ఉండగా.. మకర సంక్రాంతి పుణ్యకాలం మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 5:45 వరకు ఉంటుందట. అలాగే మహా పుణ్యకాలం మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:58 వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.

పవిత్ర నదీ స్నానాలు, సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలడం, దానధర్మాలు, జపతపాలు చేయడానికి మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:58 వరకు ఉన్న 'మహా పుణ్యకాలం' అత్యంత శ్రేష్టమైనదని పండితులు చెబుతున్నారు.

సంక్రాంతి విశిష్టత
ఈ పండుగ కేవలం మతపరమైనదే కాదు, రైతులకు పంట చేతికి వచ్చే ఆనంద సమయం. ఈ పండుగ రోజుల్లో ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు పల్లెల్లో సందడిని తెస్తాయి. నువ్వులు, బెల్లం కలిపి చేసే వంటకాలు ఈ కాలంలో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

ఆకాశంలో రంగురంగుల గాలిపటాల సందడి, పిల్లలకు పోసే భోగి పళ్లు పండుగ సంబరాన్ని రెట్టింపు చేస్తాయి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే ఈ సమయంలో చేసే దానధర్మాలు అనంతమైన ఫలితాలను ఇస్తాయని భక్తుల నమ్మకం.

Also Read: Tuesday Astrology: మంగళవారం స్త్రీలు అస్సలు చేయకూడని పనులు..అవి చేస్తే దరిద్ర దేవతని బొట్టుపెట్టి పిలిచినట్టే!

Also REad: Weight Loss Tips: సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? జిమ్‌కి వెళ్లకుండానే పొట్ట తుస్సుమని తగ్గిపోతుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 05, 2026 09:11:45
Hyderabad, Telangana:

Things should Not Do Women On Tuesday: హిందూ సంప్రదాయం ప్రకారం..ప్రతి మంగళవారం ఆంజనేయస్వామికి ప్రీతికరమైనది. కావున, ఆ రోజు స్వామి వారికి ఆలయాల్లో విశేషమైన పూజలు నిర్వహిస్తారు. అయితే మంగళవారం రోజున మహిళలు అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయట. అలాంటి వాటిని చేయడం వల్ల దరిద్ర దేవతను ఇంట్లోకి ఆహ్వానించినట్టే అని పండితులు అంటున్నారు. 

మంగళవారం రోజున కుజగ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటుందట. అలాంటి పరిస్థితుల్లో కొత్త పనులు ప్రారంభించకోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు. ఆ రోజుల కొత్త పనులు ప్రారంభించడం అశుభకరం, అమంగళకరమని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కావున మంగళవారం రోజున కొత్త బట్టలు కొనుగోలు చేయడం, కొత్త దుస్తులు ధరించడం మంచిది కాదట. అలా చేస్తే కుజ ప్రభావం కారణంగా ఆర్థికంగానే కాకుండా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందట. 

అదే విధంగా స్త్రీలు మంగళవారం రోజున సౌందర్య సాధనాలు కొనుగోలు చేయడం మంచిది కాదట. అలా చేయడం వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు. 

అలాగే పెళ్లైన మహిళలు మంగళవారం రోజున కుంకుమ కొనకూడదట. అలా చేస్తే భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావొచ్చని పండితులు చెబుతున్నారు. 

మంగళవారం రోజున స్త్రీలు గాజులు కొనరాదట. అలా చేస్తే దరిద్రాన్ని ఇంట్లోకి ఆహ్వానించినట్లే అని జోతిష్య శాస్త్రం చెబుతుంది.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: School Holiday: రేపు సోమవారం స్కూళ్లకు సెలవు..ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..విద్యార్థులు ఫుల్ ఖుషీ!

Also Read: Venezuela President Wife: అందగత్తెలున్న దేశంపై కన్నేసిన ట్రంప్..వెనిజులా అధ్యక్షుడి భార్యని కూడా అలా చేయడం ఎందుకు?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top