QR Code Based Footwear Tracking System: తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు తమ పాదరక్షలను ఎక్కడ వదిలేయాలో తెలియక, రోడ్ల పక్కన పడేయడం వల్ల అవి పోవడం లేదా వెతుక్కోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ ఇబ్బందులను అధిగమించడానికి టీటీడీ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది.
ఏమిటీ ట్రాకింగ్ సిస్టమ్?
సాధారణంగా పాదరక్షల కౌంటర్ల వద్ద ఉండే రద్దీని తగ్గించడానికి, భక్తుల సమయాన్ని ఆదా చేయడానికి ఈ క్యూఆర్ (QR) కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. భక్తులు తమ పాదరక్షలను కౌంటర్‌లో ఇచ్చినప్పుడు, వారికి ఒక క్యూఆర్ కోడ్ కేటాయిస్తారు.
దీనివల్ల పాదరక్షలను డిపాజిట్ చేయడం, తిరిగి తీసుకోవడం చాలా వేగంగా జరుగుతుంది. పాత పద్ధతిలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీ పాదరక్షలు ఎక్కడున్నాయో ఈ సిస్టమ్ ద్వారా ట్రాక్ చేయడం సులభం, కాబట్టి అవి పోయే అవకాశం ఉండదు.
త్వరలో మరిన్ని కౌంటర్లు
ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్న ఈ సేవలను, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తరిస్తోంది. త్వరలోనే కొన్ని కీలక ప్రాంతాల్లో స్మార్ట్ కౌంటర్లు ఏర్పాటు కానున్నాయి. కళ్యాణకట్ట, ఏటీసీ (ATC) సర్కిల్, బేడి ఆంజనేయస్వామి ఆలయం వంటి ప్రాంతాల్లో ఈ సదుపాయాన్ని కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టును 'కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్' సంస్థ సహకారంతో టీటీడీ నిర్వహిస్తోంది.
దీనివల్ల కలిగే ప్రయోజనాలు..
భక్తులు రోడ్ల పక్కన పాదరక్షలు వదలకపోవడం వల్ల తిరుమల మాడ వీధులు, రోడ్లు పరిశుభ్రంగా ఉంటున్నాయి. ఇప్పటివరకు సుమారు 8.45 లక్షల మందికి పైగా భక్తులు ఈ సేవలను వినియోగించుకోవడం విశేషం. ప్రధాన కౌంటర్ల వద్ద రద్దీ తగ్గి, భక్తులకు ప్రశాంతమైన దర్శన అనుభూతి కలుగుతోంది.
భక్తులకు సూచన: తిరుమలకు వెళ్ళినప్పుడు అపరిచిత ప్రదేశాల్లో పాదరక్షలు వదిలి ఇబ్బంది పడకండి. టీటీడీ ఏర్పాటు చేసిన ఈ ఉచిత స్మార్ట్ కౌంటర్లను వినియోగించుకుని మీ ప్రయాణాన్ని సుఖమయం చేసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Vivo X300 Fe Launch Date: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వీవో మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ విడుదల చేయబోతోంది.. దీనిని కంపెనీ వివో X300 FE మొబైల్ పేరుతో విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. దీని బట్టి చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ వివో X300 FE స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ వివో S50 ప్రో మినీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిని వీవో కంపెనీ త్వరలో భారత్‌లో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. టిప్‌స్టర్ అన్విన్ (@ZionsAnvin) తెలిపిన వివరాల ప్రకారం, ఈ Vivo X300 FE స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ 256GB స్టోరేజ్‌తో పాటు 512GB స్టోరేజ్ వేరియంట్స్‌లో విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమైన్నట్లు సమాచారం..
Vivo X300 FE స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మోడల్ నెబంర్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ Geekbenchలో కూడా నమోదు చేశారు. అయితే, ఇది మార్కెట్‌లోకి V2537 మోడల్ నంబర్‌తో లాంచ్ కాబోతోంది. అంతేకాకుండా సింగిల్-కోర్ పరీక్షలో 2,701 పాయింట్లు సాధించిన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్‌తో లాంచ్ కాబోతోంది. అలాగే ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో పాటు 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు Wi-Fi, బ్లూటూత్‌తో పాటు NFC వంటి కనెక్టివిటీ ఫీచర్స్‌తో లభిస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో విడుదల చేసిన Vivo S50 Pro Mini రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కూడా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్ 6.31-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది Android 16 ఆధారంగా OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇది మోస్ట్ వపర్‌ఫుల్ 6,500 mAh బ్యాటరీతో పాటు 40 W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే వెనక భాగంలో 50-మెగాపిక్సెల్ సోనీ ప్రధాన కెమెరాతో లభిస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Samsung Galaxy A37 5g Launch Date: సాంసంగ్ నుంచి మార్కెట్‌లోకి కొత్త గెలాక్సీ A సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ గెలాక్సీ A37తో పాటు గెలాక్సీ A57 మోడల్స్ తీసుకు రాబోతోంది. అలాగే ఇప్పటికే కంపెనీ సింగపూర్ IMDA సర్టిఫికేషన్ డేటాబేస్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ మోడల్స్ వివరాలు కనిపించిన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీటికి సంబంధించిన ఫీచర్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే, ఈ మొబైల్స్‌కి సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ స్మార్ట్‌ఫోన్స్ కంపెనీ A376B/DSతో పాటు SM-A576B/DS మోడల్ నెంబర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులో ప్రత్యేకంగా డ్యూయల్-సిమ్ స్పీడ్ నెట్‌వర్క్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే గ్లోబల్ వేరియంట్‌లో అనేక రకాల స్పెషల్ ఫీచర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇందులో కొన్ని కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన ఫీచర్స్ లీక్ అవ్వడం ఇదే మొదటి సారి కాదు.. వీటికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఫీచర్స్ ఎన్నో సార్లు సోషల్‌లో మీడియాలో కనిపించిన్నట్లు తెలుస్తోంది.. ఇక దీనిని కంపెనీ 2026 సంవత్సరం మార్చిలో అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
లీక్ అయిన వివరాల్లోకి వెళితే.. Samsung Galaxy A37 స్మార్ట్‌ఫోన్ Exynos 1480 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ఎంట్రీ-లెవల్ మొబైల్స్ కంటే.. మధ్య శ్నేణి విభాగానికి సంబంధించిన మోడల్‌గా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీనిని కంపెనీ 6జీబీ ర్యామ్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన బ్యాక్ ప్యానెల్ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 50MP సెన్సార్‌తో ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది.
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో అదనంగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు 5MP మాక్రో లెన్స్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన 5,000mAh బ్యాటరీతో పాటు 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ అవుతోంది. అలాగే ఇందులో మరెన్నో అద్భుతమైన ఫీచర్స్‌ను కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో వన్ UI 8.5తో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.
ఈ గెలాక్సీ A57 స్మార్ట్‌ఫోన్ మోడల్‌లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన Exynos 1680 ప్రాసెసర్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లీక్ అయిన వివరాల ప్రకారం, 6.6-అంగుళాల AMOLED ప్యానెల్ డిస్ల్పేను కూడా కలిగి ఉంటుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో పాటు 45W ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gang Rape In Hyderabad Narsingi: హైదరాబాద్‌లోని నార్సింగిలో మరోసారి రౌడీషీటర్లు రెచ్చిపోయారు. బాలికకు బలవంతంగా గంజాయి తాగించి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా ఈ వార్తా సంచలనంగా మారింది. అయితే ఈ బాలిక మాత్రం చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మాయిగా పోలీసులు గుర్తించారు. నార్సింగి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదయింది. ఆమె నానమ్మతో కలిసి ఉంటున్న అమ్మాయి మిస్ అవ్వటం జరిగింది. సదరు అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా గంజాయి తాగించారు. మత్తులో ఉన్న ఆ బాలిక పైశాచికానికి పాల్పడ్డారు. గంజాయి రౌడీషీటర్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘతంలో కూడా ఈ నార్సింగి పరిధిలో మైనర్ బాలికపై దారుణం జరిగిన సంగతి తెలిసిందే.
రెండు రోజుల క్రితమే బాలిక మిస్ అయినట్లు కేసు కూడా నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే నిందితులు ఇద్దరు కూడా మైనర్లని పోలీసు అధికారి హరీష్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఘటన చింగిచెర్ల ప్రాంతంలో జరిగినట్లు వెల్లడించారు. రెండు రోజుల నుంచి అమ్మాయి కనిపించడం లేదని మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. తాజా ఘటనతో నిందితులపై పోక్సోకేసు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. కోకాపేట్ నివాసులు అయిన బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read more: సునీత ఆ పోస్టులు పెట్టకుంటే బతికేదేమో..? అక్కసుతోనే నెలరోజులుగా రెక్కీ వేసి అంతమొందించాడు..!
Read more: Konda Surekha: వేలిముద్ర వాళ్లు కూడా సీఎం అవుతారు.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Diabetes Home Remedies: నేటి కాలంలో డయాబెటిస్ (మధుమేహం) అనేది ఒక పెద్ద ఆరోగ్య సవాలుగా మారింది. శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేనప్పుడు లేదా ఉన్న ఇన్సులిన్‌ను సరిగ్గా వినియోగించుకోలేనప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయడం కష్టమైనప్పటికీ, సరైన ఆహారపు అలవాట్లు, వంటింటి దినుసులతో దానిని సులభంగా నియంత్రించవచ్చు.
మెంతులు చక్కెరను ఎలా నియంత్రిస్తాయి?
మెంతులు కేవలం రుచికే కాదు, ఔషధ గుణాలకు కూడా పెట్టింది పేరు. ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక అంశాలు మధుమేహ రోగులకు మేలు చేస్తాయి. మెంతుల్లో ఉండే 'గెలాక్టోమన్నన్' అనే పీచు పదార్థం జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా ఉంటుంది.
ఇందులో ఉండే '4-హైడ్రాక్సీఐసోలూసిన్' అనే అమైనో ఆమ్లం క్లోమ గ్రంథిని ప్రేరేపించి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. మెంతులు శరీరంలో కార్బోహైడ్రేట్లు, చక్కెర గ్రహించే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి.
మెంతి పొడిని ఎలా వాడాలి?
గరిష్ట ఫలితాల కోసం మెంతి పొడిని ఈ క్రింది పద్ధతుల్లో తీసుకోవచ్చు. ఒక టీస్పూన్ మెంతి పొడిని గ్లాసు గోరువెచ్చని నీటితో కలిపి ఉదయాన్నే తీసుకోవాలి. మధ్యాహ్నం భోజన సమయంలో ఒక కప్పు పెరుగులో చెంచా మెంతి పొడి కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
రాత్రిపూట ఒక టీస్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగి, గింజలను నమిలి తినడం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కూరలు లేదా ఇతర వంటకాలపై అర టీస్పూన్ మెంతి పొడిని చల్లుకోవడం ద్వారా రోజువారీ ఆహారంలో దీనిని భాగం చేసుకోవచ్చు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్త ఆహారపు అలవాటును ప్రారంభించే ముందు లేదా మందులకు బదులుగా వీటిని వాడే ముందు తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించండి.)
Also REad: Madanapalle Girl Incident: బాలిక హత్యాచార నిందితుడు ఆత్మహత్య..మదనపల్లెలో బాణాసంచాతో సంబరాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vanasthalipuram Ex Husband Kill Software Update: వనస్థలిపురం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మాజీ భర్త నరికి చంపిన ఘటన తెలిసిందే. అయితే దీనిపై అనేక కారణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఆమె మొదటి భర్త పై కేసులు పెట్టడం.. రెండో వివాహంతో మృతురాలు సునీత సంతోషంగా ఉంటున్నాను అంటూ ఆమె సోషల్ మీడియా పోస్టులు పెట్టడమే కారణం. మహారాష్ట్రకు చెందిన సునీత.. పెద్దపల్లి వాసి అయిన మహేశ్‌ను 2022 లో పెళ్లి చేసుకుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు నేపథ్యంలో 2024 లోనే విడిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తోన్న ఇంజనీర్ శ్రీనాథ్‌ని సునీత వివాహం చేసుకుంది. ఇక రెండో పెళ్లితో తాను ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్లు ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ చూసి రగిలిపోయాడు మొదటి భర్త మహేష్.
దీంతో నెల రోజులుగా రెక్కీ వేసి ఆ అక్కసుతోనే ఆమెను అంతమొందించాడు. సీఐ మహేష్ ప్రకారం బీఎన్ రెడ్డిలోని గ్రీన్ సిటీ కాలనీలో ఉండే సునీత (30)కు మహేష్ (30) తో వివాహం జరిగింది . వీళ్ళు కొన్ని కారణాలవల్ల మనస్పర్థాలతో విడిపోయారు. సునీత గుట్టు చప్పుడు కాకుండా 2025 లోనే శ్రీనాథ్‌ని రెండో పెళ్లి కూడా చేసుకుంది.
అయితే వీళ్ళు 2024 లోనే చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె జీవితం కొనసాగిస్తూ వస్తోంది. ఇటీవల హైదరాబాద్లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో కూడా ఉద్యోగంలో చేరింది. అక్కడే ఆ కంపెనీలోనే పరిచయం ఏర్పడంతో శ్రీనాథ్‌ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరూ కలిసి వనస్థలిపురం గ్రీన్ సిటీలో ఉంటున్నారు. అయితే ఇటీవలే మహేష్ కూడా కెనడా వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే ఆమె సునీత పెట్టిన పాత కేసుల నేపథ్యంలో అతనికి వీసా రిజెక్ట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తన జీవితం నాశనమైంది.. తను మాత్రం రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా సాగిస్తోందని కక్షతో ఆమెను చంపాలని డిసైడ్ అయ్యాడు మహేష్. ఈ క్రమంలోనే నెల రోజులుగా తుర్కయంజాల్ ప్రాంతంలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఆమెపై రెక్కి వేశాడు. కత్తి, రంపం పదునైన ఆయుధాలు బ్యాగులో పెట్టుకొని తిరిగాడు. భర్త బయటకు వెళ్లిన సమయంలో అపార్ట్‌మెంట్లో మెట్ల మార్గం ద్వారా వెళ్లి సునీత ఇంటి తలుపు తట్టాడు. వెంటనే అతని చూసి షాక్ అయిన సునీతను మహేష్ బలవంతంగా గొడవకు దిగాడు. అనంతరం తెచ్చుకున్న కత్తులతో ఆమెను నరికేశాడు. దీంతో అత్త పెద్దగా కేకలు వేయడంతో పక్కింటి వారు వచ్చి చూసేసరికి గదిలోనే ఉన్న మహేష్ లోపల నుంచి గడియ పెట్టాడు. ఆ తర్వాత పోలీసులు వెంటనే రావడంతో తనతో తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. ఇక పోలీసులు చాకచక్యంగా నిందితుడిని అరెస్టు చేశారు.
Read more: విద్యార్థులకు తల్లిదండ్రులకు అలెర్ట్.. మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..!
Read more: Konda Surekha: వేలిముద్ర వాళ్లు కూడా సీఎం అవుతారు.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Happy Chhatrapati Shivaji Maharaj Jayanti 2026 Telugu: 1870లో ఫిబ్రవరి 19వ తేదీన జ్యోతిరావు పూలే పూణేలో మొట్టమొదటిసారిగా శివాజీ జయంతి వేడుకను ప్రారంభించారు. ఆ తర్వాత బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలను ఏకం చేయడానికి ఈ వేడుకను మరింత ప్రజలకు తెలిసేలా విస్తృతం చేశారు. ఈ రోజున మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు శివాజీ పరాక్రమ గాదలను గుర్తు చేసుకుంటారు. పల్లె పల్లెనా ఆయన విగ్రహాన్ని ఊరేగిస్తూ.. యువత అంతా భక్తిని చాటుతారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన ఆయన జయంతిని గుర్తు చేసుకుంటూ.. చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోండి.
చత్రపతి శివాజీ మహారాజ్ శుభాకాంక్షలు..
✾పశ్చిమ కనుమ కొండల శిఖరాన ఉదయించిన సూర్యుడు ఆయన.. అధర్మాన్ని అణచివేసిన అఖండ వీరుడా ఆయన.. స్వరాజ్య స్థాపకుడు మన చత్రపతి శివాజీ మహారాజ్..
✾కత్తి పడితే శత్రువుల గుండెల్లో వణుకు.. కరుణ చూపిస్తే కన్నతల్లి లాంటి ప్రేమ.. ధర్మం కోసం అవతరించిన ఆ మహావీరుడికి శతకోటి వందనాలు..
✾120 కోట్ల హిందువుల కలరూపం.. మరాఠా మట్టి గర్వించదగ్గ అజయ శిల్పం.. కోట్ల తరాలు గర్వించదగ్గ ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి పాదాభివందనం..
✾లక్షల భారతీయుల సంకెళ్లు తెంచిన పిడుగు.. స్వరాజ్య దీపాన్ని వెలిగించిన ఆయన అడుగు.. ఆ చత్రపతి శివాజీ మహారాజ్ అడుగుజాడలే మనకు మార్గదర్శకాలు..
✾శత్రువుల ఇంటి స్త్రీని కూడా తల్లిగా పూజించిన మహోన్నతుడు.. నైతికతకు నిలువెత్తు సాక్ష్యం ఆ చత్రపతి శివాజీ..
✾కొండ కోనల్లో గెరిల్లా యుద్ధంలో శత్రువులను హడలెత్తించిన మహా మేధావి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అపార చాణక్యుడు మన శివాజీ..
✾జజియా బాయి పురిటిలో పుట్టిన నిప్పుకణిక.. భరతమాత దాస్య శృంఖలాలు ఛేదించిన విజయ పతాక... చత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు
✾కిరీటం ధరించినా సామాన్యుల కోసమే తపించిన రాజు.. కోటిలే కాదు.. ప్రజల గుండెలను గెలుచుకున్న ఆ చత్రపతి మహారాజు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vijay Devarakonda Vs Rashmika Net Worth: టాలీవుడ్ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్టార్ కపుల్ సంపాదన, వారి నికర ఆస్తుల విలువ నెట్టింట ఆసక్తిని రేకెత్తిస్తోంది.
విజయ్ దేవరకొండ సంపాదన ఎంతంటే?
విజయ్ దేవరకొండ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. ఆయన నికర ఆస్తుల విలువ సుమారు రూ.70 కోట్లుగా అంచనా. హైదరాబాద్‌లోని విలాసవంతమైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో రూ.15 కోట్ల విలువైన భవనంలో ఆయన నివసిస్తున్నారు.
కేవలం సినిమాల ద్వారానే కాకుండా, తన సొంత నిర్మాణ సంస్థ 'కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్', ఫ్యాషన్ బ్రాండ్ 'రౌడీ వేర్', వాలీబాల్ టీమ్ 'హైదరాబాద్ బ్లాక్ హాక్స్' సహ-యజమానిగా విజయ్ భారీగా ఆర్జిస్తున్నారు. అంతేకాకుండా, ఆయన గ్యారేజీలో BMW 5 సిరీస్, రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లతో పాటు ప్రైవేట్ జెట్ కూడా ఉండటం విశేషం.
రష్మిక ఎంత సంపాదిస్తుందంటే?
మరోవైపు 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న సైతం సంపాదనలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం సౌత్, నార్త్ సినిమాలతో బిజీగా ఉన్న ఆమె నికర విలువ సుమారు రూ.66 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో రూ.8 కోట్ల విలువైన ఇల్లు మాత్రమే కాకుండా ముంబై, హైదరాబాద్, గోవా, కూర్గ్ ప్రాంతాల్లో ఆమెకు సొంత ఆస్తులు ఉన్నాయి. ఒక్కో సినిమాకు సుమారు రూ.4 కోట్లు వసూలు చేసే రష్మిక వద్ద ఆడి Q3, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన వాహనాలు ఉన్నాయి. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా ఆమె కోట్లలో ఆదాయాన్ని పొందుతోంది.
విజయ్, రష్మికల మొత్తం ఆస్తుల విలువను కలిపి చూస్తే అది సుమారు రూ.136 కోట్లు దాటుతోంది. ఈ జంట తమ వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ అధికారికంగా స్పందించకపోయినప్పటికీ, వారి వెకేషన్ ఫోటోలు, సోషల్ మీడియా పోస్ట్‌లు వారు ప్రేమలో ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అభిమానులు నమ్ముతున్నారు. ఈ నెలాఖరున జరగబోయే వేడుకతో ఈ క్రేజీ కాంబినేషన్ అధికారికంగా ఒక్కటి కాబోతుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
Also Read: Madanapalle Girl Incident: బాలిక హత్యాచార నిందితుడు ఆత్మహత్య..మదనపల్లెలో బాణాసంచాతో సంబరాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Money Rain On Bride Video Watch: సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగినప్పటి నుంచి ఏ చిన్న విషయం జరిగిన అది క్షణాల్లోనే ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. తాజాగా పంజాబ్ లోని తార్న్ తరుణ్ లో జరిగిన ఒక పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. ఈ వేడుకలు వరుడు వధువుపై ఏకంగా రూ. 8.5 కోట్ల నోట్ల వర్షం కురిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఎలాంటి నిజం లేదని వరుడుకి సంబంధించిన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 14వ తేదీన పంజాబ్లోని తరుణ్‌లో గ్రాండ్‌గా పెళ్లి జరిగింది.. పంజాబీ ఆచారాల ప్రకారం వేడుకల్లో నోట్లను గాల్లోకి విసరడం సర్వసాధారణమే.. అయితే, ఈ పెళ్లిలో కూడా అతిథులతో పాటు కుటుంబ సభ్యులు DJ పాటలతో స్టెప్పులు వేస్తూ వధువుపై నోట్ల వర్షం కురిపించారు. దీంతో వివాహ వేదికంత కరెన్సీ నోట్లతో నిండిపోయి ఉండడానికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీనిని చూసి కొందరు ఏకంగా 8.5 కోట్లు ఖర్చు చేశారని పోస్ట్లు పెట్టడంతో సోషల్ మీడియా వినియోగదారులంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
అలాగే సోషల్ మీడియాలో వీడియోలు విపరీతంగా వైరల్ అవ్వడంతో కొన్ని నెగిటివ్ వార్తలు కూడా వచ్చాయి. దీంతో వరుడి సోదరుడు సికిందర్ సింగ్ స్పందించారు.. తన సోదరుడు ఆస్ట్రేలియాలోని ట్రక్ బిజినెస్ చేస్తున్నాడని.. ఫిబ్రవరి 14వ తేదీన పెళ్లి జరిగిందని.. ఈ సమయంలో తమ ఆచారాల ప్రకారమే గాల్లో డబ్బులు చల్లారని.. అది కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమేనని అన్నారు. సోషల్ మీడియాలో కోట్లాది రూపాయలని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు..
ఈవెంట్ మేనేజర్ స్పందించారు..
ఈ వేడుకలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఈవెంట్ మేనేజర్ తో పాటు డీజే కు సంబంధించిన కొంతమంది సిబ్బంది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా కొట్టి పారేశారు. డాలర్ నోట్లతో కలిసి మొత్తం మీద సుమారు రూ.4 లక్షల వరకు నగదును ఇందులో వినియోగించి ఉండవచ్చని.. వారు తెలిపారు.. అంతేకానీ సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలు అసాధ్యమని వారు తెలిపారు. అయితే ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మిశ్రమంగా స్పందిస్తున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Paper Boy Video Watch: ఉదయం లేవగానే ఇంటి గుమ్మం ముందు పేపర్ బాయ్ పేపర్ విసరడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కానీ ఓ పేపర్ బాయ్ విసిరే విధానం మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. వృత్తి పట్ల అతనికున్న అద్భుతమైన ఏకాగ్రత, నైపుణ్యం చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ పేపర్ బాయ్‌కి సంబంధించిన వీడియో ఇంస్టాగ్రామ్ లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 41 మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకొని ట్రెండింగ్లో కొనసాగుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంస్టాగ్రామ్ లో పేపర్ బాయ్ దీప్ అనే అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోలో సదరు యువకుడు సైకిల్ పై వెళ్తూ అత్యంత వేగంగా.. న్యూస్ పేపర్లను ఎంతో స్పీడ్‌గా గురి తప్పకుండా.. సైకిల్ తొక్కుతూనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. కొన్నిచోట్ల తలుపులు కింద ఉన్న సన్నని సందులో నుంచి కూడా పేపర్ లోపలికి వెళ్లేలా విసురుతున్నాడు. ఇక మరికొన్ని చోట్లనైతే ఇంటి బయట పేపర్ కోసం చూస్తున్న యజమానుల చేతుల్లోకి నేరుగా వెళ్లేలా పేపర్ విసరడం విశేషం.. అతను ఏ మాత్రం తడబాటు లేకుండా సైకిల్ తొక్కుతూనే.. పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.
ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. నువ్వు ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు... రోజు పేపర్ నీ ముందుకు వస్తే, ఆ అనుభూతే వేరు అని.. ఒక సోషల్ మీడియా వినియోగదారుడు కామెంట్ పెడితే.. మరొకరు 2027 సంవత్సరం ఒలంపిక్స్‌లో పేపర్ గ్రోయింగ్ అనే పోటీని కూడా పెట్టాలి కానీ కచ్చితంగా ఇతనికి గోల్డ్ మెడల్ వస్తుందని.. కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది అతని క్రమశిక్షణతో పాటు నైపుణ్యాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి నైపుణ్యం కొంతమందిలో మాత్రమే ఉంటుంది.
రోజు చేసే సాధారణ పని కూడా.. ఎంత సులభంగా కచ్చితంగా చేయవచ్చో అనేది ఈ యువకుడు నిరూపించేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్‌లో రికార్డుల వ్యూస్‌ను సంపాదించుకుంది. కేవలం పనిగా కాకుండా.. దానిని ఒక కలల మార్చుకున్న ఈ పేపర్ బాయ్ ఇప్పుడు ఇంటర్నెట్లో సెన్సేషన్‌గా మారారు. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు తమ స్నేహితులకు షేర్ చేస్తూనే ఉన్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Nagarkurnool Latest Telugu News: గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థుల స్థితిగతులు దిగజారుతూ వస్తున్నాయి.. ముఖ్యంగా శుభ్రమైన ఆహారం అందించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణ మరోసారి ఈరోజు నిజమైంది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావుపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం రోడ్డుపై నిరసనకు దిగారి. తమకు పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. శ్రీశైలం, హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు..
గత కొంతకాలంగా పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం ఇవ్వడం లేదని.. ముఖ్యంగా మూడు పూటలా వడ్డించే ఆహార పదార్థాల్లో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడంతో విద్యార్థులంతా విసిగిపోయి.. పాఠశాల నుంచి బయటికి వచ్చి రహదారిపై ధర్నాకు దిగారు.. దీనివల్ల శ్రీశైలం హైదరాబాద్ హైవే పై కొంత దూరం మేర వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
ఆందోళన చేస్తున్న సమయంలో ఎండ తీవ్రత విపరీతంగా ఉండడం కారణంగా.. నలుగురు విద్యార్థులు స్పృహతప్పి పడిపోయినట్లు సమాచారం. వెంటనే అక్కడే ఉన్న స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కాస్త నిలకడగానే ఉంది.. అలాగే వీరు ధర్నాకు దిగే కంటే ముందు మధ్యాహ్నం భోజనం చేయకపోవడం కారణంగానే.. విద్యార్థులను ఇబ్బంది పడ్డట్లు తెలుస్తోంది.
ప్రిన్సిపల్ పై తీవ్ర ఆరోపణలు..
కొంతమంది విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ.. కనీసం మాకు తినడానికి వీల్లేని భోజనం పెడుతున్నారు.. అడిగితే ప్రిన్సిపల్‌తో పాటు ఉపాధ్యాయులు మమ్మల్ని మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నారు" అని కొంతమంది విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ తో పాటు సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.. విషయం తెలుసుకున్న వెల్దండ ఎమ్మార్వో తో పాటు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.. విద్యార్థునులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. అంతేకాకుండా ఆహార నాణ్యతను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Madanapalle Incident Accused Suicide: మదనపల్లెలో బాలికపై జరిగిన హత్యాచారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. బాలికను దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా ఆ తర్వాత చిన్నారిని హత్య చేసిన ఉదంతంపై ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడైన కులవర్ధన్‌ను నిర్ధాక్షిణంగా వ్యవహరించి, బాలిక మృతికి తగిన న్యాయం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఘటనకు పాల్పడిన కులవర్ధన్ తొలుత పరారీలో ఉండగా.. ఈరోజు ఉదయాన్నే చెరువులో విగతజీవిగా కనిపించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని జిల్లా ఎస్పీ నిర్ధారించారు. అయితే నిందితుడు కులవర్ధన్ మృతిపట్ల స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. రాక్షసుడికి తగిన గతి జరిగిందని టపాసులు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగిందంటే?
స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. నిన్న (మంగళవారం) మదనపల్లె పరిధిలో ఒక మైనర్ బాలికపై హత్యాచారం జరిగింది. కులవర్ధన్ అనే ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ తర్వాత ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో రోడ్లపై ఆందోళన చేపట్టారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అయితే తొలుత నిందితుడు కులవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో అతడు తప్పించుకున్నాడు.
నిందితుడు పరారీలో ఉండడం వల్ల అతడి కోసం వెతికేందుకు జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమించింది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగగా.. వారంతా మదనపల్లెను జల్లెడ పట్టారు. చివరికి డ్రోన్లు, డాగ్ స్క్వాడ్స్‌ను కూడా రంగంలోకి దించినట్లు తెలిసింది.
అలా నిందితుడు కులవర్ధన్ ఆచూకీ కోసం వెతుకుతున్న తరుణంలో బుధవారం అనగా ఫిబ్రవరి 18న ఉదయం స్థానిక చెరుపులో ఓ మృతదేహం తేలియాడుతూ ఉంది. అది నిందితుడే అని పోలీసులు నిర్ధారించారు. పోలీసుల చెర నుంచి తప్పించుకున్న నిందితుడు.. భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నిందితుడు కులవర్ధన్ మృతిపట్ల మృతురాలు బాలిక తల్లి స్పందించింది. కులవర్ధన్ బతికే ఉంటే తానే చంపేదాన్ని అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అతడి మృతి పట్ల మదనపల్లెలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. చిన్నారిని బలి తీసుకున్న కిరాతకుడు మట్టికరిచిపోయాడని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP 10th Class Hall Ticket 2026 Release Date: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలుత ఇంటర్ పరీక్షలు నిర్వహించి.. వచ్చే నెలలో పదో తరగతి ఎగ్జామ్స్ జరిపేందుకు ఏపీ విద్యాశాఖ ప్రణాళిక రచించింది. అయితే ఈ క్రమంలో మార్చి మొదటి వారంలో హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
ఈ క్రమంలో హాల్ టికెట్లపై విద్యార్థుల ఇంటి పేరు, పుట్టినతేదీ వంటి వివరాల్లో ఎలాంటి తప్పులున్నా వాటి సవరణల కోసం అవకాశం కల్పిస్తామని ఏపీ విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇలాంటి సమస్యలున్న విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పరీక్షలు పూర్తైన తర్వాత కూడా మార్క్స్ మెమో ఇచ్చే సమయంలో వివరాలను సవరణ చేసుకునేందుకు వీలుందని అధికారులు తెలియజేశారు.
అయితే పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి మార్చి 30 తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల మధ్య పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల అనంతరం ఏప్రిల్ 4 నుంచి పదో తరగతి జవాబు పత్రాలు మూల్యాంకనం జరగనుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది. ఈ మ్యూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు 10 రోజుల పాటు కొనసాగుతుందట.
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 టైమ్‌టేబుల్..
మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు)
మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
మార్చి 21న ఇంగ్లీష్ (మార్చి 20 నుంచి 21కి పరీక్ష తేదీ మారింది)
మార్చి 23న మ్యాథమెటిక్స్
మార్చి 25న ఫిజికల్ సైన్స్
మార్చి 28న బయాలజికల్ సైన్స్
మార్చి 30న సోషల్ స్టడీస్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Infinix Note Edge 5g Price: ప్రముఖ ఇన్ఫినిక్స్ బ్రాండ్ తమ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీనిని కంపెనీ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ పేరుతో లాంచ్ చేసింది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో పాటు ప్రీమియం కెమెరా సెటప్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఇందులోని ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 6nm ప్రాసెసర్‌తో లభిస్తోంది. ఇది IP65 రేటింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. ఇది మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని బేస్ వేరియంట్ 6GB + 128GB స్టోరేజ్‌తో ధర రూ.21,999తో లభిస్తోంది..
ఇక రెండ వేరియంట్ 8GB + 128GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. మూడవ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ రూ.25,999తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 25వ తేదిన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇన్ఫినిక్స్ ఇండియాలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు లాంచింగ్ ఆఫర్స్‌లో భాగంగా ICICI బ్యాంక్, SBI కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.2,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఎక్చేంజ్ ఆఫర్స్‌పై ఏకంగా రూ.2 వేల వరకు అదనపు బోనస్ కూడా లభిస్తుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ ఫీచర్స్ వివరాలు..
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. 6.78-అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 2644×1208 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అలాగే 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఇక ఇందులో కంపెనీ ప్రత్యేకమైన 2160Hz PWM డిమ్మింగ్‌ను ఆప్షన్‌ను కూడా అందిస్తోంది..
డిస్ప్లే ప్రొటక్షన్ కోసం ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇది మాలి-G610 GPUతో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 6nm ప్రాసెసర్‌తో లభిస్తోంది. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ చేయాలనుకునేవారికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇది చాలా ప్రత్యేకమైన Android 16 ఆధారంగా XOS 16 ఆపరేటింగ్‌పై రన్ అవుతుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shubman Gill Dance In Arjun Tendulkar Pre Wedding: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ, అర్జున్ టెండూల్కర్ వేడుకల కోసం గిల్ ప్రత్యేకంగా హాజరయ్యారు. అక్కడ ఆయన చేసిన డ్యాన్స్ అభిమానులను అలరిస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో గిల్ పూర్తి 'ఫన్ మూడ్'లో కనిపించారు. బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ 'మౌజా హీ మౌజా' (జబ్ వి మెట్) కు గిల్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. బ్రౌన్ కలర్ బంద్‌గలా సూట్, మెడలో స్టైలిష్ మఫ్లర్ ధరించి గిల్ చాలా హుందాగా కనిపించారు. మైదానంలోనే కాదు, డాన్స్ ఫ్లోర్‌పై కూడా గిల్ 200 స్ట్రైక్ రేట్‌తో అదరగొడుతున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ వీడియోపై కొందరు ఇది ఆయన బంధువుల పెళ్లి వీడియో అని చెబుతున్నా.. నెట్టింట మాత్రం అర్జున్ ప్రీ-వెడ్డింగ్ వీడియోగానే వైరల్ అవుతోంది.
అర్జున్ టెండూల్కర్ పెళ్లి ఎవరితో? ఎప్పుడు?
అర్జున్ టెండూల్కర్ తన లాంగ్‌టైమ్ పార్ట్నర్ సానియా చండోక్‌ను పెళ్లాడబోతున్నారు. 2026 మార్చి 5న ముంబైలో ఈ వివాహం జరగనుంది. సానియా చండోక్ ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు. వీరి కుటుంబానికి క్వాలిటీ ఐస్‌క్రీమ్, బాస్కిన్ రాబిన్స్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో అనుబంధం ఉంది.
शुभमन गिल अर्जुन तेंदुलकर की प्री-वेडिंग पार्टी में खूब मस्ती कर रहे हैं।
- कोहली कल रात शादी की पार्टी में शामिल होंगे।
- शुभमन गिल और विराट कोहली के डांस वीडियो देखना बेहद मजेदार होगा। pic.twitter.com/rS9CwUZ6Wv
— ममता राजगढ़ (@rajgarh_mamta1) February 16, 2026
సచిన్ తన కుమారుడి పెళ్లిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉన్న ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోం మంత్రి అమిత్ షా వంటి వారికి ఇప్పటికే ఆహ్వానాలు అందినట్లు సమాచారం. అలాగే క్రీడా రంగంలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ వంటి క్రికెట్ స్టార్స్ హాజరుకానున్నారు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ కలిసి డాన్స్ ఫ్లోర్‌పై స్టెప్పులు వేస్తే చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
అర్జున్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్
2026 సంవత్సరం అర్జున్‌కు వ్యక్తిగతంగానే కాకుండా ప్రొఫెషనల్‌గా కూడా చాలా కీలకం. వివాహంతో పాటు, ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆయన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున బరిలోకి దిగనున్నారు. సచిన్ తనయుడి పెళ్లి వేడుకలు ఇప్పటికే జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబంతో కలిసి ప్రారంభమయ్యాయి. మార్చి 5న జరగబోయే ఈ మెగా వెడ్డింగ్ కోసం క్రికెట్, సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook