మల్కాజిగిరి లో గురు పౌర్ణమి వేడుకలు
Hyderabad, Telangana:మల్కాజిగిరి : గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మల్కాజిగిరి లోని సాయిబాబా దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి వేడుకలకు భక్తులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Vivo S2 గ్రాండ్ ఎంట్రీ.. చీప్ ధరకే 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే, Sony 50MP కెమెరా!
Hyderabad, Telangana:Vivo S2 India Launch: స్మార్ట్‌ఫోన్ ప్రియుల అద్భుతమైన శుభవార్త.. టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అద్భుతమైన టైమ్ రానే వచ్చేసింది. ప్రముఖ దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) భారత మార్కెట్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. తన అత్యంత ప్రతిష్టాత్మక ఫోన్ Vivo S2ను ఆగస్టు 6న గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.. ఇది 6.83 అంగుళాల 3D కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రీఫ్రెష్ రేట్‌తో కంటికి చెప్పలేనంత ఇంపుగా కనిపిస్తుందని తెలుస్తోంది.. ఏకంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఎంతో ఎండలో కూడా ప్రకాశవంతంగా మెరుస్తుంది. కళ్లకు ఏమాత్రం శ్రమ కలగకుండా SGSలో-బ్లూ లైట్ సర్టిఫికేషన్‌తో అందుబాటులోకి తీసుకు రావడం విశేషం..
ఈ డివైజ్‌లో MediaTek Dimensity 7360 Turbo శక్తివంతమైన ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఆంటోటూ (AnTuTu) బెంచ్‌మార్క్‌లో ఏకంగా 9.70 లక్షలకు పైగా స్కోర్ సాధించిన్నట్లు తెలుస్తోంది. ఇక గేమర్స్ కోసం ఏకంగా 7,050 mAh భారీ బ్యాటరీని ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఫోన్ మందం కేవలం 7.99 mm మాత్రమే ఉండటం నిజంగా ఒక అద్భుతంగా భావించవచ్చు.
ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడేవారికి వివో అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది.. బ్యాక్ సెటప్‌ను 50 మెగాపిక్సెల్ Sony IMX852 ప్రధాన కెమెరాతో పాటు ఫ్రాంట్ భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. రెండు కెమెరాలూ 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
అధునాతన OriginOS 6, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో పాటు డ్యూయల్ సిమిట్రికల్ స్పీకర్లతో రాబోతున్న ఈ ఫోన్ సిల్క్ వైట్, శాఫైర్ బ్లూతో పాటు రీగల్ బ్రాంజ్ కలర్స్‌లో అందుబాటులోకి రాబోతోంది.. 8GB+128GB వేరియంట్ ధర సుమారు రూ.51,999తో.. 8GB+256GB వేరియంట్ ధర రూ. 55,999తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇది అమెజాన్‌తో పాటు వివో ఈ-స్టోర్లతో పాటు ప్రముఖ రిటైల్ షాపుల్లో ఇది అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. 2 రోజుల పోలీసుల కస్టడీ మంజూరు..!!
Secunderabad, Telangana:Uday Krishnareddy: హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఒక మహిళా ఐపీఎస్ ట్రైనీపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డిపై ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఇటీవల ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అప్పర్ పారిష్ కోర్టు అతనికి రెండు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు చేసింది. అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టే వరకు అదుపులో ఉంచాలని పోలీసులు కోరారు. కోర్టు అందుకు అంగీకరించింది. పోలీసులు నేడు ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించనున్నారు.
కొంతమంది అత్యుత్తమ ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఇటీవల ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగినట్లు తెలిసింది. అయితే, అదే అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న తోటి మహిళా ఐపీఎస్ ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి, అతను తనను లైంగికంగా వేధించి, దాడి చేశాడని ఆరోపిస్తూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు తన తీర్పులో జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. అతను ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. అయితే, ఉదయ కృష్ణారెడ్డికి పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. అతను పలువురు మహిళలతో సోషల్ మీడియాలో చాట్ చేశాడని, వారికి ప్రపోజ్ కూడా చేశాడని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. అయితే, ఉదయ కృష్ణారెడ్డి తన చర్యలను సమర్థించుకున్నట్లు విచారణలో తేలింది.
ఉదయ కృష్ణారెడ్డి ఇలా అన్నట్లు సమాచారం. "సివిల్ సర్వీసెస్ గెలిచిన తర్వాత, నా గురించి కథనాలు సోషల్ మీడియా, టీవీ ఛానెళ్లలో వచ్చాయి. వాటిని చూసి చాలా మంది మహిళలు నాకు ప్రపోజ్ చేశారు. వాళ్లు నా అభిమానులుగా మారిపోయారు. నేను వారి ప్రపోజల్స్‌కు సరే అన్నాను. అందులో తప్పేముంది?" ఇటీవల కోర్టు అతనికి రెండు రోజుల పోలీసు కస్టడీ మంజూరు చేయడంతో, ఉదయ కృష్ణారెడ్డికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.
Also Read: ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో నో ఫ్యూయల్! కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..!!
Also Read: పీఆర్సీ పై టీచర్ల పోరు బాట.. సెప్టెంబర్ 1న ప్రభుత్వ ఉపాధ్యాయుల మహా ధర్నా.. డిమాండ్లు ఇవే..!!
Also Read: టీచర్లకు డెడ్‌లైన్ ఫిక్స్.. టెట్ అర్హత తప్పనిసరి
Also Read: ఆ బడుల్లో ఒకే టీచర్.. దేశంలో ఇలాంటి పాఠశాలలు లక్ష
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
కుజ-శని ప్రతికూల కలయిక.. ఆగస్టు 12 గ్రహణంతో మారబోతున్న ఈ రాశుల జాతకాలు!
Hyderabad, Telangana:Solar Eclipse Aug 12 Telugu: ఆగస్టు 12న ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది.. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించకపోవడం వల్ల ఇక్కడ సూతక్ కాలం వర్తించనప్పటికీ.. జ్యోతిష్యులు మాత్రం ఈ సమయాన్ని అత్యంత కీలకమైనదిగా భావిస్తూ ఉంటారు. గ్రహణానికి ముందే గ్రహాల గమనంలో సంభవించిన మార్పులతో పాటు ముఖ్యంగా కుజుడితో పాటు శని దేవుని స్థానాలు ప్రపంచ పరిణామాలతో పాటు పలు రాశుల వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు..
ఆగస్టు 2వ తేదీ రాత్రి కుజుడు మిథున రాశిలోకి సంచారం చేశాడు.. దీనివల్ల కుజ, శని గ్రహాలు ఒకదానికొకటి కేంద్ర స్థానాల్లో ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ అరుదైన మార్పులు ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు, కెరీర్, ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సమయంలో కొంత ఉద్రిక్తతలు లేదా ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది..
తులా రాశి:
వాహనాలు నడిపేటప్పుడు తులా రాశివారు తప్పకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇతరుల వాహనాలను నడపకపోవడమే శ్రేయస్కరమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇతరుల మాటలకు ప్రభావితమై కెరీర్, వ్యాపారాల్లో పెద్ద మార్పులు రాకుండా చేసుకోవడమే చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృషభ రాశి:
రాబోయే రోజుల్లో ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇంట్లోని పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా కెరీర్‌లో పెద్ద రిస్క్‌లు తీసుకోవడం తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది.
మిథున రాశి:
మిథున రాశి వారికి ఆరోగ్యం, ఉద్యోగ రంగాల్లో సమయమనం చాలా అవసరమని నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగం మారడంతో పాటు కొత్త వ్యాపారం ప్రారంభించడం లేదా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడం వంటి నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీయవచ్చు.
ధనుస్సు రాశి:
ఈ సమయం ధనుస్సు రాశి వారికి కొంత సవాలుతో కూడుకున్నదని భావించవచ్చు. మీతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే కంటే ప్రస్తుతం చేస్తున్న పనిపైనే దృష్టి పెట్టడం ఎంతో మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
కుజుడు-రాహువుల నవపంచమ యోగం.. సెప్టెంబర్ 18 వరకు ఈ 4 రాశులకి తిరుగులేని రాజయోగం!
Hyderabad, Telangana:Navpancham Yoga 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాల మార్పుల కారణంగా అనేక శుభ, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆగస్టు 2న అంగారకుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేశాడు.. ఈ గ్రహ సంచారం వల్ల కుజుడు, రాహువుల మధ్య అత్యంత శక్తివంతమైన నవపంచమ యోగం ఏర్పడింది.
జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఈ యోగం రాబోయే సెప్టెంబర్ 18 వరకు చురుకుగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ నవపంచమ యోగం ప్రభావం ద్వాదశ రాశులన్నింటిపైనా ఉన్నప్పటికీ.. ముఖ్యంగా 4 రాశుల వారికి మాత్రం ఆర్థిక పురోగతి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని విజయాన్ని, ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అదృష్టాన్ని పొందే రాశులు ఇవే
మిథున రాశి (Gemini)
కుజుడు ప్రస్తుతం మిథున రాశిలోనే సంచార దశలో ఉన్నాడు. ఈ రాశి వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. నిలిచిపోయిన లేదా రావాల్సిన పాత బాకీలు చేతికి అందుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి లేదా ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది శుభసమయంగా భావించవ్చు.
మేష రాశి (Aries)
మేష రాశికి అధిపతి కుజుడు కావడం వల్ల ఈ గ్రహ మార్పు అత్యంత అనుకూల ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సుదీర్ఘకాలంగా పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు లేదా ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త ప్రణాళికల కారణంగా పనులు కూడా స్పీడ్‌గా పూర్తి చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్లు, షేర్ మార్కెట్ రంగానికి చెందిన వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
కుంభ రాశి (Aquarius)
కుంభ రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అద్భుతంగా ఉంటుంది. మీరు తీసుకునే సరైన నిర్ణయాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి.. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇరుక్కుపోయిన డబ్బులు కూడా పూర్తిగా తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో శాంతి, సౌఖ్యాలు నెలకొంటాయి. శ్రమకు తగ్గట్టుగా లక్ష్యాలను సులువుగా చేరుకుంటారు.
తులా రాశి (Libra)
తులా రాశి వారికి ఈ యోగం వృత్తి, ఉద్యోగ రంగాల్లో గొప్ప అనుకూల మార్పులను తీసుకువస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ఆఫీసులో కీలకమైన ప్రాజెక్టులు చేతికి రావడంతో పాటు ప్రమోషన్ లేదా హోదా పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఐటీ (IT), టెక్నాలజీ, కార్పొరేట్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపార విస్తరణ విజయవంతమవుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Liquor Ban: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్..ఇండియాలో ఈ బ్రాండ్లు నిషేధం!
Hyderabad, Telangana:Liquor Brands Ban In India: మందుబాబులకు గుండె ఝల్లుమనే వార్త! ఇకపై వైన్స్ షాపుల్లో ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్, బ్యాగ్ పైపర్ వంటి ప్రముఖ లిక్కర్ బ్రాండ్లు ఇకపై కనిపించవు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రకారం.. ఈ లిక్కర్ బ్రాండ్ల సేల్స్‌పై నిషేధం విధించారు. అయితే దాని వెనుక అసలు కారణంగా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.AP Rain Alert: బంగాళాఖాతంలో మరోసారి అలజడి..రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
Vijayawada, Andhra Pradesh:AP Rain Alert News: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే చెదురుమదురు వర్షాలు కురుస్తుండగా, రాబోయే రోజుల్లో దీని ప్రభావం మరింత విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమై, పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది.
జిల్లాల వారీగా వర్ష సూచన
రేపు అనగా ఆగస్ట్ 6వ తేదీ గురువారం శ్రీకాకుళం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే మిగిలిన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే సూచన ఉందని అధికారులు వెల్లడించారు.
ప్రజలకు కీలక హెచ్చరికలు
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు, రైతులు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా వర్షం సమయంలో చెట్లు, విద్యుత్ పోల్స్, హోర్డింగ్స్ కింద ఎవరూ నిలబడవద్దని స్పష్టం చేసింది. పొలాల్లో పనిచేసే రైతులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
రైతులకు తాజా పరిస్థితి
రాష్ట్రంలో గత కొంతకాలంగా ఎల్ నినో ప్రభావం వల్ల సకాలంలో వర్షాలు పడక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ద్రోణులు, అల్పపీడనాలు పంటలకు కొంతవరకు ఊరటనిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తారమైన వర్షాలు కురిస్తేనే వ్యవసాయ రంగానికి మేలు జరిగి రైతులు సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశం ఉంది.
Also Read: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి? త్వరలోనే అధికారిక ప్రకటన!
Also Read: ఉపరాష్ట్రపతితో టీడీపీ ఎంపీల బృందం భేటి.. 'అమరావతి' ప్రత్యేక పుస్తకం ఆవిష్కరణ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chiranjeevi Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి? త్వరలోనే అధికారిక ప్రకటన!
Vijayawada, Andhra Pradesh:AP Brand Ambassador Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ కీలక బాధ్యతపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య ప్రాథమిక సంప్రదింపులు, సానుకూల చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ముఖ్య విశేషాలు, ప్రధాన లక్ష్యం..
రాష్ట్రంలోకి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం, పర్యాటకరంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, జాతీయ స్థాయిలో ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను గణనీయంగా పెంచడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం.
గుజరాత్ పర్యాటక రంగానికి బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి ఆ రాష్ట్రానికి ఎంతటి జాతీయ గుర్తింపు తెచ్చారో, అదే రీతిలో ఏపీ బ్రాండ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి చిరంజీవిని రంగంలోకి దించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ఈ బృహత్తర బాధ్యతపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య కీలక చర్చలు పూర్తయినట్లు సమాచారం.
ఈ భాగస్వామ్యానికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు, దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మెగాస్టార్ రాకతో ఏపీ పర్యాటక, పెట్టుబడుల రంగాలకు మరింత ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read: విద్యార్థులకు పండగ లాంటి వార్త..ఈ వారంలో వరుసగా 3 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
Also Read: ఏపీ, తెలంగాణ ఎల్‌నినో బారి నుంచి బయటపడినట్టేనా? రైతులు తప్పకుండా తెలుసుకోవాలి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Airtel 299 Cancelled: వినియోగదారులకు ఎయిర్‌టెల్ బిగ్‌షాక్..అతిచౌకైన రూ.299 రీఛార్జ్ ప్లాన్ క్యాన్సిల్!
Hyderabad, Telangana:Airtel 299 Recharge Cancelled: ప్రముఖ ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) తన కస్టమర్లకు మరో షాక్ ఇచ్చింది. అత్యంత ఆదరణ పొందిన రూ.299 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను పూర్తిగా తొలగించింది. ప్రస్తుతం ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్ లేదా ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో కనిపించడం లేదు. గతంలో రీఛార్జ్ ధరలను సవరించిన ఏడాది తిరగకముందే ఈ మార్పు చేయడం గమనార్హం.
తొలగించిన ప్లాన్‌లు, ప్రయోజనాలు..
రూ.299 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ కింద రోజుకు 1GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, ఫ్రీ కాలర్ ట్యూన్స్‌తో పాటు పెర్‌ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్‌స్క్రిప్షన్ లభించేవి. ఇకపై ఈ ప్లాన్ అందుబాటులో ఉండదు.
రూ.299 ప్లాన్ రద్దు కావడంతో, యూజర్లు రీఛార్జ్ చేసుకోవడానికి కనీస ధర రూ.349కి పెరిగింది. రూ.349 ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMSలు, 6 నెలల యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఫ్రీ హెలోట్యూన్స్ లభిస్తాయి.
రూ.579, రూ.619 ప్లాన్‌లు కూడా గల్లంతు
ఎంట్రీ లెవల్ ప్లాన్‌తో పాటు మధ్యస్థ వ్యాలిడిటీ కలిగిన రూ.579, రూ.619 ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా ఎయిర్‌టెల్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్యాక్‌లు కూడా ప్రస్తుతం వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవు. అందులో మొదటిది రూ.579 రీఛార్జ్ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటాను అందించేది.
అలాగే రూ.619 రీఛార్జ్ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా ప్రయోజనాలతో అందుబాటులో లేవు. తొలుత కొన్ని సెలెక్టెడ్ సర్కిళ్లలో మాత్రమే ఈ ప్యాక్స్‌ను తొలగించిన ఎయిర్‌టెల్, క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ వీటిని నిలిపివేసినట్లు సమాచారం.
Also Read: మార్కెట్లోకి కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..చలామణీ ఎప్పటినుంచి అంటే?
Also REad: అన్నీ వస్తువులు దొరికే డీమార్ట్‌లో చీరలు ఎందుకు అమ్మరు? ఇదే బిజినెస్ టాప్ సీక్రెట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan: వెన్నుపోటు పార్టీతో ఏపీ ప్రజలకు బాధ తప్ప ఏమైనా మంచి జరుగుతోందా? వైఎస్ జగన్
Rajamahendravaram, Andhra Pradesh:YS Jagan Devarapalli Tour: 'అన్యాయంపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు. అరెస్టులు. వెన్నుపోటు పార్టీతో రాష్ట్రానికి, ప్రజలకు బాధ. అంతేతప్ప ఏ మాత్రమైనా మంచి జరుగుతోందా?' అని మాజీ వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాష్టంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని.. రైతులు రోడ్డెక్కుతున్నా పట్టించుకోని ప్రభుత్వం అని మండిపడ్డారు. పొగాకు రైతులకు అండగా నిలుస్తామని.. వారికి న్యాయం జరిగేలా పోరాడుతామని భరోసానిచ్చారు.
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొగాకు కొనుగోలు కేంద్రం సందర్శించారు. పొగాకు కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించి అక్కడి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. స్థానిక పొగాకు కొనుగోలు కేంద్రం సందర్శించిన ఆయన, కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన, పొగాకు పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర వివరాలు ఆరా తీశారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 'చంద్రబాబు పాలనలో ఒక్క గంజాయికే ధర. దాన్ని సాగు చేస్తోంది వెన్నుపోటు పార్టీ వారే' అని వెల్లడించారు. చంద్రబాబు పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక.. అన్ని రంగాలు విధ్వంసమయ్యాయని విమర్శించారు.
తమ సమస్యలను వినే నాయకుడు, కష్టకాలంలో అండగా నిలిచే మనిషి వస్తున్నాడనే నమ్మకమే వారిని కదిలించింది. పొగాకు రైతుల బాధ తెలుసుకునేందుకు వచ్చిన వైయస్ జగన్ గారికి ప్రజలు తమ అభిమానాన్ని అపూర్వంగా చాటుకున్నారు. నాయకత్వంపై నమ్మకం ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా ఎలా తరలివస్తారో ఈ దృశ్యాలే… pic.twitter.com/n0lT9n6p1r
— YSR Congress Party (@YSRCParty) August 5, 2026
'రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన రూ.7 లక్షలు ఇవ్వడం లేదు. అధికారంలోకి రాగానే వారికి రెట్టింపు సాయం చేస్తాం. మళ్లీ మార్క్‌ఫెడ్‌నూ బలోపేతం చేస్తాం' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. 'చంద్రబాబు పరిపాలనలో ఏం జరుగుతోంది అంటే విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు అన్నింటిలోనూ విధ్వంసమే కనిపిస్తోంది. ఎవరైనా అన్యాయి ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. ఇవి మాత్రమే చంద్రబాబు పరిపాలనలో కనిపిస్తాయి' అని తెలిపారు. చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ అని.. ఈ వెన్నుపోటు పార్టీతో రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇంకేమైనా ఉందా' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.
'26 నెలలు కనీసం ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధరలు వచ్చాయా? వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, పెసర్లు, సజ్జలు, మిర్చి, పొగాకు, టమోటా, చీనీ పంటకు కానీ.. చివరకు మామిడి రైతులకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి' అని వైఎస్ జగన్ వివరించారు. రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితికి బాధ్యత ఎవరిది? రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులు నమ్మి పంట వేస్తే, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని చంద్రబాబును ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వంలో ఒకే ఒక పంటకి మాత్రమే గిట్టుబాటు ధర లభిస్తోంది
అది ఏ పంట అంటే..? వెన్నుపోటు పార్టీకి చెందిన వారు పండిస్తున్న గంజాయి పంట
ఆ గంజాయిని పండిస్తున్న రైతులు టీడీపీకి చెందిన వారే
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు#YSJaganInDevarapalli#SadistChandraBabu… pic.twitter.com/lqpeBaw5Go
— YSR Congress Party (@YSRCParty) August 5, 2026
రైతులకు చంద్రబాబు దగా
'పీఎం కిసాన్‌కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20 వేల చొప్పున ‘అన్నదాత సుఖీభవ' పేరుతో ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మూడేళ్లకు కలిపి ప్రతి రైతుకు రూ.60 వేలు అందాలి. కానీ ఇప్పటివరకు ఇచ్చింది రూ.19 వేలు మాత్రమే. అంటే ఒక్కో రైతుకు రూ.41 వేలు ఇవ్వకుండా ఎగవేశారు. సుమారు 7 లక్షల మంది రైతులను ఈ పథకం నుంచి తొలగించారు. మొంథా తుపాన్ వచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ కూడా అందలేదు. సున్నా వడ్డీ పథకం రద్దు చేశారు' అని చంద్రబాబు రైతులకు చేసిన మోసాలు అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు.
'చంద్రబాబు హయాంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అది ఏ పంటో తెలుసా? అది గంజాయి. చంద్రబాబు బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట. కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా ఢమాల్ చేసే కార్యక్రమం చేశాడు. మిర్చి తింటే ఎసిడిటీ వస్తుందట! దీంతో మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు రాకుండా ఢమాల్ చేశాడు. మామిడి తింటే షుగర్ వస్తుందని ఆ పంటను ఢమాల్ చేశాడు' అని వైఎస్ జగన్ వెల్లడించారు.
SpaceX Moon Crash: అంతరిక్షంలో ఘోర ప్రమాదం..చంద్రుడ్ని ఢీ కొట్టిన ఎలాన్ మస్క్ రాకెట్!
Hawthorne, California:SpaceX Moon Crash News: అంతరిక్ష రంగంలో ఒక అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX)కు చెందిన ఫాల్కన్-9 రాకెట్‌కు సంబంధించిన విడిచిపెట్టిన పైభాగం (సెకండ్ స్టేజ్) చంద్రుడిని ఢీకొట్టినట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:05 గంటల ప్రాంతంలో చంద్రుడిపై ఉన్న ఐన్‌స్టీన్ బిలం (Einstein Crater) సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
ప్రమాదానికి దారితీసిన పరిణామాలు..
దాదాపు 4,500 కిలోల బరువు ఉన్న ఈ రాకెట్ పైభాగం, చంద్రుడిపైకి 'బ్లూ ఘోస్ట్ మిషన్'ను ప్రయోగించిన నాటి నుంచి గడచిన 19 నెలలుగా అంతరిక్షంలో లక్ష్యం లేకుండా తిరుగుతూ వచ్చింది.
2025 జనవరి 15న ప్రయోగించిన ఈ ఫాల్కన్-9 రాకెట్ దశలవారీగా విడిపోయిన తర్వాత, దాని పైభాగం ఇంధనం కోల్పోయింది. అప్పటి నుంచి భూమికి, చంద్రుడికి మధ్య గల ఒక విశాలమైన, అస్థిరమైన వలయంలో ఇది పయనించింది.
భూమి, చంద్రుడు, సూర్యుని గురుత్వాకర్షణ శక్తుల రాపిడి, అలాగే సూర్యరశ్మి కలిగించిన ఒత్తిడి కారణంగా ఈ రాకెట్ భాగం గమ్యస్థానం క్రమంగా మారుతూ వచ్చి, చివరికి చంద్రుడిని ఢీకొనేలా చేసింది.
వేగం, ప్రభావం..
ఈ స్టేజ్‌లోని ఇంధనాన్ని పూర్తిగా తొలగించి 'పాసివేట్' చేశామని స్పేస్ఎక్స్ సంస్థ తెలిపింది. అయినప్పటికీ, అంతటి అధిక శక్తి మార్గాలలో ప్రయాణించే వ్యోమనౌకల శకలాలను నియంత్రిత పద్ధతిలో పూర్తిగా దారి మళ్లించడం సాధ్యం కాదని పేర్కొంది.
చంద్రునికి గాలి నిరోధం లేదా ఘర్షణను కలిగించే వాతావరణం లేనందున, ఈ రాకెట్ భాగం దాదాపు గంటకు 8,700 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది సుమారు మూడు టన్నుల టీఎన్టీ (TNT)కి సమానమైన శక్తిని విడుదల చేసి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న మన చంద్రయాన్-2 ఆర్బిటర్ ఈ ప్రమాద స్థలాన్ని గుర్తించే అవకాశం ఉంది.
Also REad: Dubai explosions: 20 నిమిషాల్లో ఏడు భారీ పేలుళ్లు.. దుబాయ్‌లో హైటెన్షన్..
Also REad: అమెరికా-ఇరాన్ యుద్ధానికి తాత్కాలిక విరామం.. ట్రంప్ సంచలన నిర్ణయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రూ.450 కోట్ల అవినీతి.. ఖండించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
Mancherial, Telangana:Prem Sagar Rao: రూ.450 కోట్ల బకాయిలను అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే చెల్లించడంతో తీవ్ర అవినీతి ఆరోపణలు మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై వచ్చాయి. ఈ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఎట్టకేలకు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పందించారు. ఈ సందర్భంగా అవినీతి ఆరోపణలను ఖండించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ దిన పత్రికలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నట్లు చెప్పారు.
'నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. నాపై ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టను. త్వరలో కుట్రలు అన్ని బయటకు వస్తాయి' కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు చర్చలకు రావాలని సవాల్ చేశారు. 'నేను రూ.450 కోట్లు వాడుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదు. 2009-10లో బ్యాంక్ రూ.450 కోట్లు మంజూరు చేసింది. సాయినాథ్ ప్రయివేట్ లిమిటెడ్‌పై, భాగ్యనగర్ హోటల్స్ పేరుమీద బ్యాంక్ రుణం తీసుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా నేను 15 స్కూల్స్ కట్టించా' అని ప్రేమ్ సాగర్ రావు వివరించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తాను అధికార దుర్వినియోగం చేయలేదని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. 'ఇసుక, భూమి తీసుకోవాలనుకుంటే అప్పుడే తీసుకునే వాణ్ణి. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న, పత్రికలపై లీగల్ యాక్షన్ తీసుకుంటా' అని ప్రకటించారు. తాను ఆధారాలు లేకుండా ఫిర్యాదు చేయనని.. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నేను భూమి, ఇసుక, మట్టి మాఫియా చేయలేదని పేర్కొన్నారు.
'యూఎస్ ట్రేడింగ్ డౌన్ అయిన తర్వాత నేను రూ.160 కోట్లు నష్టపోయా. నిజానిర్ధారణ కమిటీ వేస్తే కమిటీ ముందు పూర్తి ఆధారాలు చూపిస్తా. రూ.450 కోట్లు అవినీతి చేస్తే బ్యాంక్ రూ.109 కోట్లకు ఎలా ఆక్షన్ వేస్తుంది?' అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రశ్నించారు. సాంక్షన్ ఆర్డర్స్ నేను క్రేయేట్ చేసినవి కాదని తెలిపారు. తమ ఆదిలాబాద్ జిల్లా నేతలు తనపై కుట్ర చేశారని ఆరోపించారు. మంత్రి పదవి చర్చ వచ్చిన ప్రతీ సారి ఇలాంటి వార్తలు వస్తున్నాయని.. తనపై వచ్చిన ఆరోపణలపై ఎక్కడ చర్చకు అయినా సిద్దమేనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రకటించారు.
YS Sharmila: ‘విధ్వంసం నుంచి మరింత అగాధంవైపు చంద్రబాబు పాలన‘: వైఎస్ షర్మిల
Vijayawada, Andhra Pradesh:YS Sharmila vs Chandrababu: అబద్ధాన్ని అందంగా చెప్పడంలో సీఎం చంద్రబాబు చంద్రబాబు ఘనాపాటి. రెండేళ్ల పాలనపై కూటమి ప్రోగ్రెస్ రిపోర్టు ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్. ప్రగతి నివేదిక కాదది.. పూర్తిగా గతి తప్పిన నివేదిక‘ అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నాలుగు సూత్రాల పాలన అపహాస్యం.. అభివృద్ధి బూటకం.. సంపద సృష్టి మోసం.. అని ప్రకటించారు. ‘సమతుల్యత పచ్చి అబద్ధం. సంక్షేమం టోకరా. విధ్వంసం నుంచి మరింత అగాధంవైపు.. అధిక అప్పుల నుంచి ఇంకాస్త అంధకారం వైపు. ఇదే కూటమి ప్రభుత్వ రెండేళ్ల ప్రగతి నివేదిక‘ అని వైఎస్ షర్మిల అభివర్ణించారు.
‘రెండేళ్ల కూటమి పాలన 24 మోసాల మయం. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్. ఎన్నికల హామీలకు పంగనామాలు. మ్యానిఫెస్టోకి మంగళం’ అని చంద్రబాబు వైఫల్యాలను వైఎస్ షర్మిల ఏకరువు పెట్టారు. ‘అమలు చేశామని చెప్పే పథకాలు అరకొర. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పక్కన బెట్టి, చెల్లని రూపాయితో చిల్లు రాజకీయం తప్పా రెండేళ్లుగా చంద్రబాబు ఉద్ధరించింది శూన్యం. అందుకే బాబు షూరిటీ - భవిష్యత్ కి లేదిక గ్యారెంటీ‘ అని షర్మిల విమర్శించారు.
‘భరోసా పేరుతో సగానికి సగం పెన్షన్లలో కోతలు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని మాట తప్పారు. 3 వేల నిరుద్యోగ భృతి, లేదా 20 లక్షల ఉద్యోగాలు అంటూ 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకి 15 వందలు ఇస్తామని 2 కోట్ల మంది మహిళలను నమ్మించి నయవంచన చేశారు‘ అని వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. ‘దీపం పథకం రాష్ట్రంలోని సగం కుటుంబాలకే పరిమితం చేస్తే, గొప్పలు చెప్పుకుంటున్న సుఖీభవ పథకం కింద 40 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారు. ఇచ్చేదాంట్లో కేంద్రంతో సంబంధం లేకుండా అని మాట మార్చారు. 20 వేలు ఇస్తామని పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో అన్యాయంగా లింక్ పెట్టారు‘ అని వైఎస్ షర్మిల ఆరోపించారు.
‘ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అన్ని రూ.15 వేలు అని హామీ ఇచ్చి.. 20 లక్షల మంది బిడ్డలకు దారుణ మోసం చేస్తున్నారు. ఇస్తున్న వారికి రూ.2 వేలు చొప్పున తగ్గించి ఎన్నికల్లో హామీని గాలిలో కలిపారు. ఆరోగ్యశ్రీ కి రూ.4 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి రూ.10 వేల కోట్లు బకాయిలు పెట్టి, రూ.6 వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకోవడం కూటమి సర్కారుకే చెల్లింది‘ అని చంద్రబాబు మోసాలను వైఎస్ షర్మిల వివరించారు.
రూ.32 వేల కోట్ల మేర సబ్సిడీలు విద్యుత్ కింద ప్రజలకు ఇస్తే మరి 15 వేల కోట్ల మేర ట్రూ అప్ భారాన్ని ఎందుకు మోపినట్లు? కూటమి ప్రభుత్వాన్ని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రూ.12 వందల కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడితే, రాష్ట్ర రైతాంగం పండించిన పంటలను రూపాయికి అమ్ముకోలేక చెత్తకుప్పలో ఎందుకు పారబోసినట్లు? నిలదీశారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి పరుగులు పెడితే, అభివృద్ధిలో అట్టడుగున అప్పుల్లో ప్రథమ స్థానంలో ఎందుకున్నట్లు? అని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల కడిగి పారేశారు. ‘తలసరి ఆదాయం పెంచడం పక్కన పెడితే గత 12 ఏళ్లుగా తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కలిసి ఒక్కో తలపై పెట్టిన అప్పు సరాసరి రూ.2 లక్షలు‘ అని షర్మిల వెల్లడించారు. ‘2024-26 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గసాధించిన ప్రగతి మళ్లీ అరచేతిలో వైకుంఠమే. పెట్టుబడుల పేరుతో జిమ్మిక్కులే. అమరావతి ముసుగులో మాయాజాలమే. అభివృద్ధి అజెండాతో మరో 3 లక్షల కోట్ల అప్పులే. ఎన్నికల హామీల పేరుతో మాటల గారడీలే. ఇదే కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి శ్వేతపత్రం‘ అని చంద్రబాబు రెండేళ్ల రిపోర్ట్ పై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.
Plastic Notes In India: మార్కెట్లోకి కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..చలామణీ ఎప్పటినుంచి అంటే?
Mumbai, Maharashtra:Plastic Notes In India News: ప్రస్తుతం మన దేశంలో చలామణిలో ఉన్న కాగితపు కరెన్సీ నోట్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లను తీసుకువచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సన్నాహాలు చేస్తోంది. ఈ నూతన విధానంపై ప్రజల్లో ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టమైన ప్రకటన చేశారు.
ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి?
ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. ఆయన ప్రకటనను బట్టి 2027 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఈ ప్లాస్టిక్ నోట్లు మార్కెట్లోకి వచ్చే సూత్రప్రాయమైన ప్రణాళిక ఉంది. అయితే, ఇది ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉందని, ఈ ప్రయోగ ఫలితాల ఆధారంగానే వీటిని పెద్ద ఎత్తున అమలు చేయడంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ప్లాస్టిక్ నోట్ల ప్రత్యేకతలు
కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.10, రూ.20 డినామినేషన్లలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 2 బిలియన్ల (200 కోట్లు) పాలిమర్ నోట్లను ముద్రించడానికి ఆర్బీఐకి అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతానికి కాగితపు నోట్లను పూర్తిగా రద్దు చేసే ప్రణాళికలు ఏవీ లేవు. పాలిమర్, కాగితపు నోట్లు రెండూ ఏకకాలంలో సమాంతరంగా చలామణిలో ఉంటాయి.
సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్ల కాలపరిమితి రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ. తరచుగా చేతులు మారుతూ త్వరగా అరిగిపోయే చిన్న నోట్ల (రూ.10, రూ.20) సమస్యకు ఇది చక్కటి పరిష్కారంగా మారుతుంది.
ప్లాస్టిక్ నోట్ల అవసరం ఎందుకు ఏర్పడింది?
దేశంలో ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరుగుతున్న కొద్దీ నగదు లావాదేవీల అవసరం కూడా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు గత 30 ఏళ్లుగా పాలిమర్ నోట్లను విజయవంతంగా వాడుతున్నాయి.
నోట్ల భద్రత, నిర్వహణ, ముద్రణ కోసం ప్రతి ఏటా సుమారు రూ.5,000 కోట్లు ఖర్చవుతున్నాయి. గణాంకాల ప్రకారం 2016-17 నుంచి జారీ చేసిన ప్రతి 100 కొత్త నోట్లలో 71 పాత నోట్లను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అలాగే గత దశాబ్దంలో దాదాపు రూ. 50 బిలియన్ల విలువైన పాత నోట్లను ఉపసంహరించుకున్నారు. నకిలీ నోట్ల బెడదను అరికట్టి భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసేందుకు ఇవి దోహదపడతాయి.
భారత వాతావరణం, పర్యావరణం, బ్యాంకింగ్ వ్యవస్థకు ఇవి ఎంతవరకు అనుకూలంగా ఉంటాయో క్షేత్రస్థాయిలో పరీక్షించిన తర్వాతే రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నోట్లు చలామణిలోకి రానున్నాయి.
Also REad: రేపు మంగళవారం బ్యాంకులకు సెలవు..ఆగస్టు 4వ తేదీన అక్కడ ఈ బ్యాంకులు బంద్! ఎందుకంటే?
Also REad: అన్నీ వస్తువులు దొరికే డీమార్ట్‌లో చీరలు ఎందుకు అమ్మరు? ఇదే బిజినెస్ టాప్ సీక్రెట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Iqoo నుంచి మరో మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. iQOO Z11 ఫుల్ డీటైల్స్ లీక్!
Hyderabad, Telangana:Iqoo Z11 Launching In India: టెక్ ప్రియులకు నిద్రలేకుండా చేసే అదిరిపోయే వార్త రానే వచ్చేసింది.. భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి.. యంగ్ జనరేషన్‌ను ఆకట్టుకోవడానికి వివో (Vivo) సబ్‌బ్రాండ్ ఐకూ (iQOO) దిమ్మతిరిగే డిజైన్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. తన ఫ్లాగ్షిప్ వేరియంట్లో అందుబాటులోకి రాబోతున్న iQOO Z11 స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను అధికారికంగా టీజ్ చేస్తూ టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఐకూ ఇండియా CEO నిపుణ్ మార్యా తమ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విడుదల చేసిన టీజర్ ఇప్పుడు టెక్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. గతంలో మార్చి నెలలో చైనాలో విడుదలైన మోడల్‌తో పోలిస్తే.. భారత వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని.. దీని డిజైన్‌లో ఊహించని మార్పులు చేశారు.
ఈ ఫోన్ వెనుక భాగంలో క్లాసీగా కనిపించే హారిజంటల్ పిల్-షేప్డ్ కెమెరా మోడ్యూల్‌తో పాటు దానిలో రెండు పెద్ద ప్రధాన కెమెరా రింగ్స్, అలాగే అద్భుతమైన సర్క్యులర్ LED రింగ్ లైట్ అందించారు. 3D కర్వ్‌డ్ రియర్ ప్యానెల్‌తో చేతిలో పట్టుకుంటే ఒక అద్భుతమైన ప్రీమియం అనుభూతిని ఇచ్చేలా దీనిని తీర్చిదిద్దిన్నట్లు తెలస్తోంది.. ముఖ్యంగా కళ్లకు కట్టిపడేసే బ్లూ (Blue), గ్రీన్ (Green) అనే రెండు క్యూట్ అండ్ స్టైలిష్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభించబోతోంది.
స్పీడ్‌తో పాటు పెర్ఫార్మెన్స్ విషయంలో రాజీపడేదే లేదంటోంది ఐకూ.. భారతదేశంలో ఆక్టాకోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 7500 టర్బో (MediaTek Dimensity 7500 Turbo) ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. హెవీ గేమింగ్ ఆడేవారికి, మల్టీ టాస్కింగ్ ప్రియులకు ఈ ప్రాసెసర్ ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
భారత మార్కెట్లో 3D కర్వ్‌డ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతున్న ఈ ఫోన్ టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకోనుంది. ఇక చైనా వేరియంట్ ఫీచర్లను గమనిస్తే.. ఇందులో 6.83-అంగుళాల AMOLED స్క్రీన్‌తో పాటు 165Hz రిఫ్రెష్ రేట్, 50MP OIS ప్రధాన కెమెరా, 16GB ర్యామ్‌తో పాటు 512GB స్టోరేజ్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.. ఇది భారత మార్కెట్లోకి ఈ నెలలోనే అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ iQOO Z11 స్మార్ట్‌ఫోన్, మిడ్-రేంజ్ విభాగంలో ఇతర దిగ్గజ బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
భారత్‌లోకి Moto G Max ఎంట్రీ.. రూ.30 వేల బడ్జెట్లో అదిరిపోయే ఫీచర్లు.. పూర్తి వివరాలు ఇవే!
Hyderabad, Telangana:Motorola Moto G Max Price: ప్రముఖ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా (Motorola) భారతీయ వినియోగదారుల కోసం మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మోటో G మాక్స్ (Moto G Max) పేరుతో రాబోతున్న ఈ కొత్త ఫోన్ అతిత్వరలోనే భారత్‌లో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఎక్స్ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ ఫోన్ ఆగస్టు 15న భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భారత్‌లో Moto G Max స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ.30,000 నుంచి ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది.. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్‌ను 8 GB ర్యామ్‌తో పాటు 256 GB స్టోరేజ్ అనే ఒకే ఒక్క వేరియంట్లో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. ఇది అజుల్ క్లారో (Azul Claro), గ్రాఫైట్ (Grafite) అనే రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో విడుదల కాబోతున్నాయి..
ఫీచర్లు వివరాలు..
గ్లోబల్ మార్కెట్‌తో పోలిస్తే.. భారతీయ వేరియంట్లో మోటోరోలా కొన్ని కీలక మార్పులు చేయనున్నట్లు తెలిసింది. అంతర్జాతీయంగా మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌తో విడుదలైనప్పటికీ.. భారత్‌లో వచ్చే మోటో G మాక్స్ ఫోన్‌లో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 (Snapdragon 6s Gen 4) ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది.
ఈ ఫోన్‌లో 6.8-ఇంచుల 1.5K రిజల్యూషన్ కలిగిన బిగ్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది.. ఇది గేమింగ్‌తో పాటు వీడియో చూడడానికి చాలా అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ LYT-600 ప్రధాన కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది.. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేసిన్నట్లు తెలుస్తోంది.
ఈ ఫోన్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ 5,200 mAh సామర్థ్యం కలిగిన శక్తివంతమైన బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతోంది.. ఇది 32W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మోటో G మాక్స్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో UI (Hello UI) ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. వినియోగదారులకు 2 సంవత్సరాల OS అప్డేట్లతో పాటు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లను కంపెనీ హామీగా ఇస్తున్నట్లు తెలిపింది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
మోటోరోలా ఇటీవలే భారత మార్కెట్లో మోటో G37తో పాటు మోటో G37 పవర్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు రూ.30,000 బడ్జెట్లో రాబోతున్న మోటో G మాక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
