Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500033
EPFO అధిక పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. రూ. 78,500 కోట్లకు పడిపోయిన అదనపు భారం!
DDDharmaraju Dhurishetty
Mar 07, 2026 08:13:36
Hyderabad, Telangana

EPS Higher Pension Update: ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద అధిక పెన్షన్ చెల్లింపుల విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న ఆందోళనకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈపీఎఫ్ఓ తెరదించాయని భావించవచ్చు.. అధిక పెన్షన్ అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ.10 లక్షల కోట్ల వరకు ఊహించని భారం పడుతుందని గతంలో ప్రచారం జరిగినప్పటికీ.. ఇప్పటి అంచనాలు వాటిని కొట్టి పడేసాయి అని చెప్పవచ్చు. తాజాగా ఈపీఎఫ్ఓ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దీనివల్ల అదనపు భారం కేవలం రూ.78 వేల కోట్లు మాత్రమే ఉంటుందని తేలింది.. 

అధిక పెన్షన్ కోసం దాదాపు 17.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో.. డబ్బుల కోరత ఏర్పడవచ్చు అని కేంద్రం ఆందోళన చెందినప్పటికీ.. సుప్రీంకోర్టు ప్రత్యేకమైన ఆదేశాల మేరకు అధిక వేతనంపై పెన్షన్ చెల్లించాల్సి వస్తే.. ఈపీఎఫ్ నిధి పూర్తిగా ఖాళీ అవుతుందని కొన్ని ఆర్థిక వర్గాలు భావించాయి.. అయితే, వాస్తవంగా దరఖాస్తు చేసిన వారి సంఖ్య.. వారు చేసిన సేవలు కాలంతో పాటు పెన్షన్ పండుకు వారు చెల్లించాల్సిన అదనపు వాటాను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ వారం ఊహించిన దాని కంటే చాలా తక్కువగా ఉందని నిపుణులు తెలిపారు..

దరఖాస్తు చేసుకున్న వారిలో అందరూ అర్హులు కాకపోవడంతో పాటు చాలామందికి పెన్షన్ లెక్కింపులో వచ్చే తేడాల వల్ల ప్రభుత్వ అంచనాలు భారీగా తగ్గాయి.. ఈపీఎఫ్ఓ నిర్వహించిన యాక్చువేరియల్ విశ్లేషణ ప్రకారం.. రాబోయే కొన్ని దశాబ్దాలలో ఈ అదనపు బాధ్యత రూ.78 వేలకోట్లకే పరిమితం కాబోతోంది. ఇది పెన్షన్ ఫండ్ లో ఉన్న నిధితో పోలిస్తే.. చాలా తక్కువయినని అధికారులు భావిస్తున్నారు..

Also Read:  Central Govt Scheme : గాడిదలు పెంచితే రూ.50 లక్షలు.. మోదీ సర్కార్ అందిస్తున్న స్కీమ్‌ గురించి తెలుసుకోండి!

అయితే, కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధుల కోరత సాకుతో అధిక పెన్షన్ ప్రక్రియను జాప్యం చేస్తున్నారనే విమర్శల మధ్య ఇప్పుడు ఈ స్పష్టత రావడం విశేషం.. అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకున్న వారు తమ పాత బకాయాలను వడ్డీతోపాటు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల పెన్షన్ పండులోకి తక్షణమే పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయ్యే అవకాశాలున్నాయి. తద్వారా భవిష్యత్తులో పెన్షన్ చెల్లింపులకు ఆటంకం ఉండదని EPFO స్పష్టం చేసింది.. తాజా నివేదికలతో అధిక పెన్షన్ కోసం చూస్తున్న లక్షలాదిమంది పెన్షనర్లతో పాటు ప్రస్తుత ఉద్యోగులకు పెద్ద ఊరట లభించబోతోంది. వారం తక్కువగానే ఉండడంతో పెన్షన్ మంజూరు ప్రక్రియ మరింత వేగవంతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Also Read:  Central Govt Scheme : గాడిదలు పెంచితే రూ.50 లక్షలు.. మోదీ సర్కార్ అందిస్తున్న స్కీమ్‌ గురించి తెలుసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Mar 07, 2026 10:47:17
Hyderabad, Telangana:

AP Govt Salary Hike News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జల వనరుల శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఔట్సోర్సింగ్ లస్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వారి వేతనాల పెంపు డిమాండ్ ను సానుకూలంగా స్పందిస్తూ.. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఉత్తర్వులను జారీ చేసింది. క్షేత్రస్థాయిలో సాగునీటి వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడుతున్న లస్కర్ల ఆర్థిక భరోసాను పెంచుతూ తీసుకున్న నిర్ణయం పై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వీరి జీతం ఎంత పెరిగింది? ఈ ఉత్తర్వుల్లో భాగంగా ఉన్న ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుతం జలవనరుల శాఖలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో వేల సంఖ్యలో లస్కర్లు పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటివరకు రోజు వారి వేతనంగా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.350 మాత్రమే చెల్లిస్తూ వస్తోంది. పెరిగిన ధరలతో పాటు జీవన ప్రమాణాల దృశ్య ఈ వేతనం వారికి ఏమాత్రం సరిపోవటం లేదని కార్మిక సంఘాలు ఇప్పటికే చాలాసార్లు మొరపెట్టుకున్నాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం వారి వేతనాన్ని రూ.550 పెంచుతూ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది.. అంటే రోజు రూ.200 వరకు అదనపు లబ్ది చేకూరుతుంది. 

తాజాగా పెరిగిన జీతంతో ఒక్కొక్క లస్కర్‌కు నెలకు సగటున రూ.6 వేల వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. అరకొర జీతాలతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిస్తుందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో నీటి నిర్వహణ చేసే సిబ్బందికి ఈ పెంపు ఒక ప్రోత్సాహం అని ప్రభుత్వం భావిస్తోంది. గత కొన్ని ఏలుగా వ్యవసాయ రంగంలో వీరి పాత్ర క్రియాశీలకమువ్వడం విశేషం..

వ్యవసాయ రంగంలో సాగునీటి పంపిణీ సజావుగా సాగడంలో లస్కర్ల పాత్ర ఎంతగానో ఉంది. కాలువలతో పాటు తూముల ద్వారా పొలాలకు నీటిని సక్రమంగా విడుదల చేసేందుకు వీరి క్రియాశీలక పాత్ర పోషిస్తారు. అంతేకాకుండా షట్టర్లో మూతతో పాటు గేట్ల నిర్వహణ పర్యవేక్షణలో వీరి ఎంతగానో సహాయపడతారు. కాలువలకు గండ్లు పడకుండా.. లీకేజీలను సకాలంలో గుర్తించి మరమ్మత్తులు చేయడం వీరి ప్రధాన పాత్ర.. అయితే వీటన్నిటిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వీరి జీతాలు పెంచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల లస్కర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా జీతాల పెంపు తక్షణమే అమల్లోకి వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలని వారి కోరుతున్నారు.

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 07, 2026 08:55:11
Tamil Nadu:

School Holiday News: తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం 12వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు మరో రోజు స్కూళ్లకు సెలవు రానుంది. మార్చి 9న పుదుకొట్టే అనే జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

2025-26 విద్యా సంవత్సరం పూర్తి కావస్తోంది. మరోవైపు అందరూ విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లకు సెలవు వచ్చింది. ఇప్పటికే 12వ తరగతి విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. మార్చి 2 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు.. మార్చి 26 వరకు జరగనున్నాయి.

అవి పూర్తవ్వగానే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 11న ప్రారంభం కానుంది. అలా పదో తరగతి పూర్తవ్వగా 1 నుంచి 9వ తరగతుల వారికి పరీక్షలు జరుగుతాయి. అయితే వాటి పరీక్షల షెడ్యూల్ త్వరలోనే వెలువడనుంది.

ఇదిలా ఉండగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఇప్పుడు కొత్తగా మరో సెలవు రానుంది. ముఖ్యంగా తమిళనాడులో పవిత్రంగా భావించే మాసి మాసం కావడంతో ఆలయ ఉత్సవాలు జరుగుతున్నాయి. దీని కారణంగా జిల్లా వారికి కొందరు కలెక్టర్లు స్థానిక సెలవులను ప్రకటిస్తున్నారు. ఆలయాల్లో రద్దీ కారణంగా ఆయా ప్రాంతాల్లో ఉండే పాఠశాలలకు ముందుస్తు సెలవు ప్రకటిస్తున్నారు. 

ఆ విషయంలో ఇప్పుడు తాజాగా ఓ సెలవు గురించి చర్చ జరుగుతోంది. మార్చి 9 (సోమవారం) పుదుక్కోట్టై జిల్లాకు స్థానిక సెలవు ప్రకటించారు. ఆ రోజున జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది.

పుదుక్కోట్టై జిల్లాలోని తిరువాపూర్ అరుల్మిగు శ్రీ ముత్తుమారియమ్మన్ ఆలయ ఉత్సవం మార్చి 9న ఘనంగా జరగనుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి ప్రజలు భారీగా తరలివస్తారు. దీనిని పరిగణనలోకి తీసుకుని, మార్చి 9న పుదుక్కోట్టైకి స్థానిక సెలవు ప్రకటించారు. ఈ సెలవు రోజును భర్తీ చేసేందుకు మార్చి 19 (శనివారం) పని దినంగా ప్రకటించారు. ఆ రోజు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా తెరిచి ఉంటాయని ప్రకటించారు.

అదేవిధంగా మార్చి 9న పాఠశాలలు, కళాశాలలలో పరీక్షలు ఇప్పటికే షెడ్యూల్ చేసి ఉండే.. అలాంటి వాటికి స్థానిక సెలవు వర్తించదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ప్రభుత్వ పబ్లిక్ పరీక్షలు గతంలో ప్రకటించిన తేదీల ప్రకారం, ఎటువంటి మార్పులు లేకుండా జరుగుతాయని ప్రకటించారు.

Also Read: Sheshnaag 150 Drone: శత్రుదేశాల్లో భయం పుట్టిస్తున్న 'శేష్‌నాగ్-150'..భారత్‌లో తయారైన అత్యాధునిక వార్ డ్రోన్..కొడితే కుంభస్థలం బద్దలు!

Also Read: India Vs New Zealand Playing 11: న్యూజి‌లాండ్‌తో ఫైనల్ మ్యాచ్..టీమ్ఇండియా జట్టు ఇదే..హైదరాబాదీ రాక ఖరారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 07, 2026 08:38:06
Hyderabad, Telangana:

Five-headed Snake Video Watch: గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వింతైన వీడియోలు చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలైతే ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా పవిత్ర నదిలో ఐదు తలల భారీ పాము ప్రత్యక్షమైందని.. నీటిలో తేలుతూ భక్తులకు దర్శనమిస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తుంది. ఈ వీడియోని చూసి సోషల్ మీడియా వినియోగదారులైతే ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా ఆ శ్రీ మహావిష్ణువు మహిమే అని పెద్ద ఎత్తున వీడియోను షేర్ కూడా చేస్తున్నారు. అయితే ఈ వీడియో నిజమైందేనా? లేదంటే ఎవరైనా కావాలనే ఎడిటింగ్ చేసి ఇలా వైరల్ చేస్తున్నారా? అన్న అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వైర్లవుతున్న వీడియోలు మొదట్లోనే మనం ఒక పవిత్రమైన నది పై పడవ ప్రయాణిస్తున్నట్లు.. అందులో ఉన్న వ్యక్తి సెల్ఫీ తీసుకుంటున్నట్లు మీరు చూడొచ్చు. అతని వెనక నీటిలో ఐదు తలన శేషనాగు భారీ ఆకారంలో కనిపించడం మీరు చూడవచ్చు. ఆ పాము నీటిపై కదులుతూ.. దాని చుట్టూ అలలు వస్తున్నట్లు కూడా మీరు స్పష్టంగా ఈ వీడియోలో చూడవచ్చు. అంతేకాకుండా ఆ పాము తలను విడిపోయి నీటిలో అటు ఇటు దూసుకెళ్తున్న దృశ్యాలు కూడా మీరు ఈ వీడియోలో క్లియర్‌గా గమనించవచ్చు..

అయితే, ఈ వీడియోను క్లియర్గా పరిశీలించి చూస్తే.. అవి నిజమైన పాములు కావని తేలింది. నీటిలో కనిపిస్తున్న ఐదు తలల పాము కదలికను కాస్త వింతగా ఉన్నాయని.. ఇది కేవలం సినిమా షూటింగ్ కోసం ఉపయోగించే ఆనిమేట్రానిక్స్ పరికరాలు అని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. ఇక మరికొంతమంది అయితే ఈ వీడియో చూసిన వారు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిన గ్రాఫిక్స్ అని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోని మీరు క్లియర్ గా పరిశీలించి చూస్తే తప్పకుండా ఇది గ్రాఫిక్స్ తో తయారు చేసిన వీడియో అని మీకు కూడా అర్థమవుతుంది..

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు ఇలాంటి వీడియోలను నిత్యం అప్లోడ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సెన్సేషన్ వీడియోస్ ని క్రియేట్ చేసి ఇలా పోస్ట్ చేసి.. వ్యూస్ ను రాబట్టుకుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చినప్పటి నుంచి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలు కుప్పలుగా వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా ఈ వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను చూసి నిజమైన అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేయడం చాలా మంచిది.

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 07, 2026 08:33:39
Hyderabad, Telangana:

Sheshnaag 150 Drone Price: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముదిరిపోతున్న భారతదేశం ఆధునిక డ్రోన్‌ను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. బెంగళూరుకు చెందిన డిఫెన్స్ స్టార్టప్ న్యూస్పేస్ రీసెర్చ్ టెక్నాలజీస్ 'శేష్‌నాగ్-150' అనే డ్రోన్‌ను అభివృద్ధి చేసింది. దాని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

'శేష్‌నాగ్-150' శత్రువుల వాయు రక్షణ వ్యవస్థను క్షణంలో నాశనం చేసే శక్తి ఉంది. ఇది కేవలం ఓ మెషీన్ మాత్రమే కాదు. 1000 కిలో మీటర్ల పరిధిలోని దాడులను ఖచ్చితంగా నిర్వహించగల సామర్థ్యం ఉంది. ఈ డ్రోన్ 5 గంటల పాటు నిరంతరాయంగా గాల్లో ఎగరడమే కాకుండా 40 కిలోల పేలుడు పదార్థాలను మోయగలదు. దీని ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇది GPS లేకుండా కూడా దృశ్య నావిగేషన్ ఉపయోగించి శత్రువు బంకర్లను, సైనిక స్థావరాలను నాశనం చేయగలదు.

'శేషనాగ్-150' నిజమైన శక్తి దాని 'స్వార్మ్ అటాక్' టెక్నాలజీ, దీనిలో అనేక డ్రోన్లు కలిసి దాడి చేస్తాయి. ఈ డ్రోన్లు కలిసి వచ్చినప్పుడు, అవి అత్యంత ఖరీదైన శత్రు రక్షణ వ్యవస్థను కూడా గందరగోళానికి గురి చేస్తాయి. అప్పుడు వాటిని ఆపడం శత్రువులకు అసాధ్యం అవుతుంది. దీనికి ప్రత్యేకమైన ఇంజిన్ ఉంది, ఇది దీనిని అత్యంత తెలివైన, నెట్‌వర్క్ కెపాసిటీ ఉంటుంది. కనీస మానవ జోక్యంతో లక్ష్యాలను గుర్తించి నాశనం చేయడానికి ఈ వ్యవస్థ రూపొందించారు. ఇరాన్ 'షహీద్' డ్రోన్ లాగా, ఇది చాలా చౌకగా నిర్మించవచ్చు. కాబట్టి పెద్ద, ఖరీదైన శత్రు లక్ష్యాలను తక్కువ ఖర్చుతో సులభంగా లక్ష్యంగా చేసుకోవచ్చు.

ఇరానియన్‌కు చెందిన 'షాహెద్', అమెరికాకు చెందిన 'లూకాస్' డ్రోన్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కానీ భారతదేశ 'శేష్‌నాగ్-150' దాని స్వంత ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. అమెరికన్ లూకాస్ డ్రోన్ స్టార్‌లింక్ ఉపగ్రహాలపై ఆధారపడి పనిచేస్తుంది. అయితే 'శేష్‌నాగ్-150' విజువల్ నావిగేషన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. దీని వలన జామ్ చేయడం అసాధ్యం. ఇరానియన్ షాహిద్ డ్రోన్ ఎక్కువ పరిధిని కలిగి ఉన్నా.. 'షెష్నాగ్-150' కచ్చితత్వంలో మాస్ టెక్నాలజీ పరంగా చాలా ముందుంది.

'శేష్‌నాగ్-150' డ్రోన్ 1,000 కిలోమీటర్ల పరిధిలోని ఏదైనా వాహనాన్ని లేదా సైనిక మౌలిక సదుపాయాలను నాశనం చేయగల సత్తా ఉంది. 'ఆపరేషన్ సింధూర్' వంటి సందర్భాల్లో పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో చౌకైన డ్రోన్‌లను ఎగురవేసింది. అలాంటి వాటిని లక్ష్యంగా చేసుకోవడానికి శేషనాగ్-150 డ్రోన్‌ను సిద్ధం చేశారు.

Also Read: India Vs New Zealand Playing 11: న్యూజి‌లాండ్‌తో ఫైనల్ మ్యాచ్..టీమ్ఇండియా జట్టు ఇదే..హైదరాబాదీ రాక ఖరారు!

Also Read: Talliki Vandanam Scheme: 'తల్లికి వందనం' డబ్బు జమ కాలేదా? వాళ్లకి త్వరలోనే అకౌంట్లోకి..మంత్రి లోకేష్ హామీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 07, 2026 08:25:34
Hyderabad, Telangana:

10-foot Crocodile Video Watch: గుజరాత్‌లోని వడోదర నగరంలో అర్ధరాత్రి వేళ ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయే ఘటన జరిగింది. సామ సవ్లీ రోడ్డులోని ఊర్మి బ్రిడ్జిపై సుమారు పది అడుగుల పొడవు కలిగిన భారీ మొసలి దర్జాగా నడుచుకుంటూ వెళ్లడం ఎప్పుడు చర్చనీయాంశానికి దారితీసింది. జనసంచారం చాలా తక్కువగా ఉన్న సమయంలో వంతెన పై ఈ ప్రమాదకరమైన జీవి నడుచుకుంటూ వెళ్లడం ఇప్పుడు స్థానికంగా ఆందోళనకు గురిచేస్తుంది. అయితే, రోడ్డుపై వెళుతున్న సమయంలో కొంతమంది ప్రయాణికులు దీనిని చూసి భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ జీవి వంతెన పైకి ఎలా వచ్చింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మార్చి 4వ తేదీన అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వంతెన పై వెళ్తున్న వాహనదారులు తమ కళ్ల ముందు కదులుతున్న ఈ భారీ మొసలిని చూసి మొదట ఏదో సాధారణ జంతువు అనుకున్నారు.. తీర దగ్గరికి వెళ్లి చూడగా అది భారీ ముసలి అని తేలడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కొందరు అక్కడి వాహనాలను ఆపి.. వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇక మరి కొంతమంది వాహనదారులు మాత్రం వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Crocodile went to hang on the Urmi Bridge of Vadodara!#Vadodara pic.twitter.com/M7Cmk5Zc1d

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు.. అంతేకాకుండా స్థానిక పోలీసులతో వంతెన పై ఉన్న ట్రాఫిక్ ను మళ్లించి మోసలికి ఎలాంటి హాని కలగకుండా చాకచక్యంగా దానిని పట్టుకున్నారు. అయితే, ఆ ముసలికి భారీ గాయం కావడంతో.. అలా వంతెన పైకి వచ్చేసిందని అక్కడున్న సహాయక సిబ్బంది తెలిపారు. ఈ మొసలిని పట్టుకునే సమయంలో అక్కడున్న సిబ్బంది ఎంతగానో శ్రమించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాయంతో ఉన్న మొసలిని పట్టుకోవడం కాస్త కష్టంగానే అనిపించిందని వారన్నారు.

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

సాధారణంగా వడోదర ప్రాంతంలో ప్రవహించే నదుల్లో విశ్వామిత్ర నది ఒకటి. ఇక్కడ పెద్ద సంఖ్యలో మొసళ్ళు తిరుగుతూ ఉంటాయి. వర్షాకాలంలో లేదా నదికి సంబంధించిన నీటిమట్టం పెరిగినప్పుడు.. ఆహారం కోసం ఇలా జనాలు తిరిగే ప్రదేశాల్లోకి సంచారం చేస్తూ ఉంటాయని అక్కడి స్థానికులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా వేరే సురక్షితమైన ప్రదేశాల్లోకి వెళ్లేందుకు కూడా అప్పుడప్పుడు ఇలా దర్శనం ఇస్తాయట.. అయితే, అప్పుడప్పుడు జనసంచారం చేసినప్పటికీ.. ఇలా వంతెన పైకి రావడం ఇదే మొదటిసారి అని స్థానికులు చెబుతున్నారు. నది ఒడ్డున కంచెలు సరిగ్గా లేకపోవడం కారణంగానే ప్రాణాంతకమైన ఇలాంటి జంతువులు రోడ్లపైకి వస్తున్నాయని అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook

 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 07, 2026 07:58:38
Hyderabad, Telangana:

Amazing Monkey Viral Video Watch: జూ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఇరుపకంచెలతో పాటు లోతైన కందకాలు, అందులో ఉండే జంతువులు. జూలలో ఏళ్ల తరబడి అన్ని వన్యప్రాణులు బందీలుగా ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ అవి ఏమాత్రం దిగులు చెందకుండా ఇనుప కంచెల్లోనే ఉంటాయి. కానీ ఇటీవలే ఒక కోతి తన తెలివితేటలతో ఆ ఇనుపకంచెలను తెంచుకొని బయటపడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేవలం ఒక చిన్న కర్ర సహాయంతో ఆ కోతి జీవుల నుంచి తప్పించుకున్న దృశ్యాలు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే, కోతి తనకున్న తెలివితేటలతో ఎలా సింపుల్గా తప్పించుకుందో? దానికి సందర్శకులు చేసిన సహాయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక జూలోని కోతుల బోనులో ముందు సందర్శకులు నిలబడి ఉండడం మనం క్లియర్ గా చూడవచ్చు. బోనుకు, సందర్శకులకు ఉండే ప్రదేశానికి మధ్యలో ఒక నీటి కందకం కూడా కనిపిస్తూ ఉండడం మీరు చూడొచ్చు. అయితే అది జంతువులు నేరుగా కంచ వద్దకు రాకుండా అడ్డుకట్టగా నిలుస్తుంది. అయితే అక్కడికి వచ్చిన కొంత మంది వ్యక్తులు ఆ కంచ నుంచి ఒక పొడవైన సన్నని కర్రను ఇనుప గ్రిల్స్ మధ్యలో నుంచి లోపలికి చాచారు.. అంతే సంగతి ఇంకా.. ఆ కోతి చేసిన పనిని చూసి అక్కడి వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

లోపల ఉన్న ఆ కోతి వెంటనే ఆ కర్రను అందుకోవడం మీరు చూడొచ్చు.. అయితే ముందుగా అక్కడున్న సందర్శకులు అంత కేవలం ఆ కోతి కట్టేతో ఆడుకుంటుందని భావించారు.. కానీ ఆ కోతి కర్రను ఒక సపోర్టుగా వాడుకొని.. కందకం మీదుగా కట్టెపై నుంచి ఎంతో నెమ్మదిగా చాకచక్యంగా ఇనుప కంచపై గెంతు వేసింది.. ఆ కోతి ఎంతో సులభంగా ఆ ఇనుప కంచపై దూకేసి అందరూ చూస్తుండగానే క్షణాల్లో అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయింది. అయితే అక్కడే ఉన్న వారంతా కోతి వారి పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భయపడి వెనక్కి వెళ్లారు.

A truly heart-melting moment 🫶 🙌🏻 pic.twitter.com/ssIcaK4sST

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

దీనికి సంబంధించిన వీడియో హిందూయిజం_ఎస్‌సి ట్విట్టర్ ఖాతా నుంచి అక్కడే ఉన్న కొంతమంది సందర్శకులు పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా షేర్ చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే లక్షల వ్యూ సంపాదించుకుంది. అయితే, ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎవరికైనా స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు.. దానికి ఒక చిన్న ఆధారం దొరికిన చాలు.. అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తూ వస్తున్నారు.

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

0
comment0
Report
HDHarish Darla
Mar 07, 2026 07:18:19
Ahmedabad, Gujarat:

India Vs New Zealand Final Playing 11: మరికొద్ది గంటల్లో టీ20 ప్రపంచకప్ 2026 విజేత ఎవరో తేలిపోనుంది! అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం అనగా మార్చి 8వ తేదీ జరగనున్న ఈ సూపర్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌ను 'ప్లేయింగ్ XI' ఎంపిక తీవ్రంగా కలవరపెడుతోంది.

సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించినప్పటికీ, భారత బౌలింగ్ విభాగంలో కొన్ని లొసుగులు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ప్రధాన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్ టీమ్‌కు ఆందోళన కలిగిస్తోంది.

ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నప్పటికీ, సెమీఫైనల్‌లో వరుణ్ దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో బౌలింగ్ సంధించి ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. వరుణ్ ప్రతి బంతికి అతిగా ఆలోచిస్తూ తన మార్క్‌ను కోల్పోతున్నాడనే వాదన వినిపిస్తుంది. వికెట్ కీపర్ సంజూ శాంసన్ అతనికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

అహ్మదాబాద్ పిచ్ - సిరాజ్ రాక!
నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ నల్లరేగడి, ఎర్రమట్టి మిశ్రమంతో తయారు చేశారు. ఇది బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున, భారత్ అదనపు పేసర్‌ను ఆడించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే మైదానంలో సౌతాఫ్రికా పేసర్లను వాడి సక్సెస్ అయింది. అదే ఫార్ములాను భారత్ అనుసరిస్తే వరుణ్ స్థానంలో సిరాజ్ జట్టులోకి రావచ్చు.

వాషింగ్టన్ సుందర్ అవసరమేనా?
కివీస్ జట్టులో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. వారిని అడ్డుకోవడానికి ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కీలకం కాగలడు. అయితే, సుందర్‌ను తీసుకోవాలంటే ఇన్-ఫామ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టడం అసాధ్యం. కాబట్టి వరుణ్ స్థానంలో సుందర్‌ను ఆడించే అవకాశాలూ ఉన్నాయి.

వరుణ్ చక్రవర్తి విఫలమవుతున్న నేపథ్యంలో, అనుభవం ఉన్న కుల్దీప్ యాదవ్ పేరును కూడా మేనేజ్‌మెంట్ పరిశీలిస్తోంది. పెద్ద మ్యాచ్‌ల్లో కుల్దీప్ మ్యాజిక్ జట్టుకు ప్లస్ అవుతుందని కొందరు భావిస్తున్నారు.

భారత్ ముందున్న సవాళ్లు..
టీమ్ఇండియా ఐదో బౌలర్ కష్టాలు ఎదురుకానున్నాయి. శివమ్ దూబే ఎకానమీ రేట్ (14.12) ఆందోళనకరంగా ఉంది. ఐదో బౌలర్ కోటా పూర్తి చేయడం ఇప్పుడు తలనొప్పిగా మారింది. సాధారణంగా గెలిచే జట్టును మార్చడానికి మేనేజ్‌మెంట్ ఇష్టపడదు. ఈ సెంటిమెంట్‌ను పాటిస్తే వరుణ్‌కు మరో అవకాశం దక్కవచ్చు.

ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్‌లో పిచ్ కండిషన్స్, న్యూజిలాండ్ బ్యాటర్ల బలాబలాలను బట్టి రోహిత్ శర్మ అండ్ కో తుది నిర్ణయం తీసుకోనుంది. వరుణ్ తన స్పిన్ మ్యాజిక్‌ను మళ్లీ ప్రదర్శిస్తాడా లేక సిరాజ్/కుల్దీప్ రంగ ప్రవేశం చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది.

Also Read: IND Vs ENG Match Turning Moment: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో కీలక మలుపు..ఈ మూడు జరగకపోయి ఉంటే టీమ్ఇండియా ఓడిపోయేది!

Also Read: Pakistan Cricketer Controversy: శ్రీలంక హోటల్‌లో అసభ్యంగా ప్రవర్తించిన క్రికెటర్ ఇతడే..పాక్ బోర్డుకు దిమ్మతిరిగే న్యూస్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 07, 2026 06:43:40
Kandy, Central Province:

Pakistan Cricketer Controversy Post: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక వచ్చిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అటు సూపర్-8 దశ నుంచి పాక్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఇప్పుడు ఆ జట్టు ఆటగాడు హోటల్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బయటపడింది. 

పాక్ జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ సల్మాన్ మీర్జా మహిళా హౌస్ కీపింగ్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. శ్రీలంకలోని కాండీలోని ఒక హోటల్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగితో ఆటగాడు సల్మాన్ మీర్జా అసభ్యంగా ప్రవర్తించాడని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్తాన్ పేసర్ సల్మాన్ మీర్జా.. వాటిని ఖండించారు. అవి పూర్తిగా నిరాధారమైన వార్తలని స్పష్టం చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. పూర్తిగా అవాస్తవం అని పేర్కొంది. ఈ ఆరోపణల వల్ల తమ ఆటగాడి ప్రతిష్టను దెబ్బతీసేందుకు వ్యాప్తి చేసిన నకిలీ వార్తలు అని బోర్డు పేర్కొంది.

అయితే తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని పేసర్ సల్మాన్ మీర్జా సోషల్ మీడియాలో తనను తాను సమర్థించుకున్నారు. పాకిస్తాన్ క్రికెటర్ ఈ వార్తలను ఖండిస్తూనే.. చౌకబారు జర్నలిజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ఓ పోస్ట్ లో సల్మాన్ మీర్జా ఈ విధంగా స్పందించారు. "వార్తల్లో పూర్తిగా అసంబద్ధమైన కథనం ప్రసారం అవుతోంది. ఈ రకమైన చౌక జర్నలిజాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ మీడియా సంస్థ కూడా ధృవీకరణ లేకుండా అలాంటి వార్తలను ప్రచురించకూడదు" అని పోస్ట్ పెట్టాడు.

సల్మాన్ మీర్జా ఈ పోస్ట్‌లో.. తనపై తప్పుడు వార్తలు ప్రచురించిన ఛానెల్, జర్నలిస్టుల పేర్లను కూడా ప్రస్తావించారు. వీటిపై తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సల్మాన్ హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రభుత్వం నుండి తక్షణమే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. "#PakistanCricketBoard ఇప్పటికే ఈ నిరాధారమైన వార్తలను తిరస్కరించడం సహా ఖండించింది. నేను ARY న్యూస్ జర్నలిస్ట్ షాహిద్ హష్మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఇటువంటి చెత్త వార్తలను వెంటనే ఆపేయాలి. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది" అని సల్మాన్ మీర్జా రాసుకొచ్చారు.

అంతకుముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. సంబంధిత ప్రచారాన్ని మొదలుపెట్టిన జర్నలిస్టు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. "మా ఆటగాళ్ల వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దానిని ఒక ఎజెండాలో భాగంగా వ్యాప్తి చేయడం మంచి పద్ధతి కాదు. దీనికి కారణమైన రిపోర్టర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకుంటే PCB అటువంటి తప్పుడు, హానికరమైన కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటుంది" అని పాక్ బోర్డు స్పష్టం చేసింది. 

శ్రీలంకలోని కాండీలోని జట్టు హోటల్‌లో బస చేస్తున్నప్పుడు ఒక మహిళా సిబ్బందితో పాక్ ఆటగాళ్లలో ఒకరు అసభ్యంగా ప్రవర్తించాడని వార్తలు వచ్చాయి. అయితే పాక్ కు చెందిన ARY న్యూస్ తమ నివేదికలో ఆ క్రికెటర్ సల్మాన్ మీర్జా అంటూ పేర్కొంది. దీంతో ఆధారాలు లేకుండా తన పేరును ఎలా ఆరోపిస్తారంటూ క్రికెటర్ సల్మాన్ మీర్జా స్పందించారు.

Also Read: Talliki Vandanam Scheme: 'తల్లికి వందనం' డబ్బు జమ కాలేదా? వాళ్లకి త్వరలోనే అకౌంట్లోకి..మంత్రి లోకేష్ హామీ!

Also Read: IND Vs ENG Match Turning Moment: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో కీలక మలుపు..ఈ మూడు జరగకపోయి ఉంటే టీమ్ఇండియా ఓడిపోయేది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 07, 2026 06:05:07
Hyderabad, Telangana:

Iqoo 15r Price Cut: భారత మార్కెట్‌లోకి విడుదలయ్యే iQOO స్మార్ట్ ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఉంటుంది ఇవి తక్కువ ధరల్లోనే అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా గేమింగ్ చేసేందుకు ఎంతగానో వీలుంటుంది. అందుకే చాలామంది ఈ మొబైల్స్ ని ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతారు. అయితే, మీరు కూడా ఎప్పటినుంచో ఇదే బ్రాండ్‌లో మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ స్టోరీ మీకోసమే.  ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ఈ బ్రాండ్ కు సంబంధించిన కొన్ని మొబైల్‌పై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 

ముఖ్యంగా iQOO 15R (Triumph Silver) స్మార్ట్‌ఫోన్స్ అత్యంత అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ ఫిబ్రవరి 24వ తేదీన భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే, అప్పటినుంచి ఇప్పటివరకు ఈ మొబైల్ ఎన్నో రకాల స్పెషల్ తీసుకుంట ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఎన్నో రకాల అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి.

iQOO 15R స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. 6.59-ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 5000 nits పీక్ బ్రైట్‌నెస్ ప్రాసెసర్ తో లభిస్తోంది. ఎండలో కూడా డిస్ప్లే బాగా కనిపించేందుకు స్పెషల్ బ్రైట్నెస్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా మరెన్నో డిస్ప్లే ఫీచర్స్ లభిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Gen 5 (3nm) ప్రాసెసర్‌తో విడుదలైంది. గేమింగ్స్ ఆడుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మల్టీ టాకింగ్ చేసే సమయంలో లాగ్ అవ్వకుండా చాలా వరకు సహాయపడుతుంది. అలాగే ఇది వివిధ స్టోరేజ్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. 

ఈ మొబైల్ వెనుక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది Sony LYT-700V, OIS సెన్సార్‌తో 50MP కెమెరాతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో లభిస్తుంది. దీంతోపాటు ఫ్రంట్ భాగంలో 32MP కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో శక్తివంతమైన 7,600mAh (సిలికాన్ ఆనోడ్ బ్యాటరీ) బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. దీంతోపాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. సుమారు 63 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్ అవుతుంది. అలాగే ఇది Android 16 ఆధారితం OS OriginOS 6 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ Triumph Silver కలర్ వేరియంట్ గ్లాస్ బ్యాక్‌తో ప్రత్యేకమైన ప్రీమియం లుక్కున అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో SuperComputing Chip Q2 కూడా అందుబాటులో ఉంది. గేమింగ్ సమయంలో స్టేబుల్ ఫ్రేమ్ రేట్స్‌తో పాటు తక్కువ లాగిన్ ఉంటుంది. అలాగే ఇది నాలుగేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ తో పాటు ఆరేళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను కూడా అందిస్తుంది. iQOO 15R బేస్ వేరియంట్ ధర మార్కెట్‌లో MRP రూ.53,999 నుంచి ప్రారంభమవుతుంది.  అయితే, ఇప్పుడే అమెజాన్‌లో కొనుగోలు చేసే వారికి కేవలం రూ.44,989 లభిస్తోంది. ఇక దీనిని అమెజాన్‌లో హెచ్డిఎఫ్సి లేదా యాక్సిస్ బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.4,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ కేవలం రూ.40 వేల లోపే పొందవచ్చు. 

అంతేకాకుండా ఈ మొబైల్‌ను ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన బోనస్ కూడా లభిస్తుంది. ఇందులో భాగంగా మీ దగ్గర ఉన్న ఏదైనా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే  ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ.38 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.2 వేల లోపే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్ పై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 07, 2026 05:51:09
Hyderabad, Telangana:

Kendra Trikona Raj Yoga Effect On Zodiac Telugu: మార్చి 2న శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనిని ఒక ప్రత్యేకమైన సంచారంగా భావిస్తారు. శని ఇప్పటికే అదేమైనా రాశిలో సంచార దశలో ఉన్నాడు. అయితే శుక్రుడి రాకతో రెండు గ్రహాలు కలయిక జరిగింది. దీనినే జ్యోతిష్య పరిభాషలో సంయోగంగా పిలుస్తారు. అయితే, ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం ఏర్పడడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా దీనివల్ల జీవితంలో సౌకర్యాలు పెరగడమే కాకుండా.. కెరీర్లో పురోగతి లభించి, ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. దీంతోపాటు ఈ సమయంలో మూడు రాశుల వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా ఎన్నో రకాల అద్భుతమైన లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

కేంద్ర త్రికోణ రాజయోగం ఎఫెక్ట్..
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రుడితో పాటు శని గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉంటే కేంద్ర త్రికోణ రాజయోగ ప్రభావం అంత ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి అపారమైన సంపాదన అందిస్తుంది. దీంతోపాటు ఆర్థికంగా కూడా అద్భుతమైన లాభాలను అందించే అవకాశాలున్నాయి. మార్చి 26వ తేదీ వరకు రెండు గ్రహాలు సంయోగ దశలోనే ఉంటాయి. దీంతో అప్పటివరకు ఆయారాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.

మేషరాశి 
మేష రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగ ప్రభావం అద్భుతమైన ప్రయోజనాలనుందిస్తుంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలున్నాయి. నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసే వారికి కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. ఈ సమయంలో కుటుంబ వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వివాహానికి అర్హులైన వ్యక్తులకు మంచి లాభాలు కలుగుతాయి. దీంతోపాటు భాగస్వామ్య జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 

వృషభ రాశి 
వృషభ రాశి వారికి జీవితంలో సానుకూలమైన మార్పులను తీసుకువస్తుంది. ముఖ్యంగా కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కొత్త ఆధార్ వనరులు కూడా లభిస్తాయి. ముఖ్యంగా జీతాలు విపరీతంగా పెరుగుతాయి. అలాగే అద్భుతమైన పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారవేత్తలకు ఈ సమయంలో లాభాలు రావడం కూడా వస్తాయి. కొంతకాలంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు పరిష్కారం కూడా లభిస్తుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

ధనస్సు రాశి 
కేంద్ర త్రికోణ రాజయోగ ప్రభావం వల్ల ధనస్సు రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలను పొందగలుగుతారు. ఆరోగ్యం కూడా చాలావరకు బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇళ్లతో పాటు వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా ప్రయోజనాలను అందించబోతోంది. ముఖ్యంగా జీవితంలో సానుకూలమైన మార్పులను పొందడమే కాకుండా.. అద్భుతమైన ఆనందాన్ని పొందగలుగుతారు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 06, 2026 16:43:20
Hyderabad, Telangana:

Hyderabad: వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణ పరిశ్రమల మధ్య సమన్వయాన్ని పెంపొందించే లక్ష్యంతో హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శుక్రవారం 'అలైడ్ అండ్ హెల్త్‌ కేర్ ఇండస్ట్రీ సమ్మిట్' ఘనంగా జరిగింది. యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు, అకడమిక్ రంగానికి, పారిశ్రామిక అవసరాలకు మధ్య ఒక బలమైన వారధిగా నిలిచింది. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు, వ్యాక్సిన్ తయారీ కేంద్రాలు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లకు చెందిన ప్రతినిధులతో పాటు 40కి పైగా జాతీయ, అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ సంస్థలు పాల్గొన్నాయి.

అపోలో హాస్పిటల్స్, కిమ్స్, మెడికవర్, సిటిజన్ హాస్పిటల్స్, జైస్ వంటి అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులు హాజరై విద్యార్థులతో ముఖాముఖి చర్చలు చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవస్థాపక చైర్మన్ చామకూర మల్లారెడ్డి ప్రోత్సాహంతో జరిగిన ఈ కార్యక్రమంలో తరగతి గది అభ్యాసాన్ని వాస్తవ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్చడం, అలైడ్ హెల్త్‌ కేర్ టెక్నాలజీలో వస్తున్న మార్పులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మారుతున్న ఆరోగ్య రంగ అవసరాలకు తగ్గట్టుగా హెల్త్‌ కేర్ వర్కర్స్ ఫోర్స్ సిద్ధం చేయడం వంటి అంశాలపై నిపుణులు చర్చించారు.

భవిష్యత్ అవకాశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులను అంతర్జాతీయ హెల్త్‌ కేర్ మార్కెట్‌కు సిద్ధం చేయడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. సదస్సు ముగింపులో విద్యార్థులకు వివిధ సంస్థలలో ఇంటర్న్‌ షిప్ మరియు ప్లేస్‌మెంట్ అవకాశాలను కల్పించడంపై స్పష్టమైన హామీ లభించింది. ఈ సదస్సుతో పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం కలిగిన నిపుణులను అందించడంలో మల్లారెడ్డి యూనివర్సిటీ తన నిబద్ధతను మరోసారి చాటుకుంది. ఈ సదస్సుకు కేబీకే గ్రూప్ చైర్మన్, మెధాజెన్ ఏఐ సీఈవో డాక్టర్ కక్కిరేణి భరత్ కుమార్, మల్లారెడ్డి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ వీఎస్‌కే రెడ్డి, డీన్స్ డాక్టర్ ఎస్. అపర్ణ, డాక్టర్ ఎం. సుజీర్ బాషా అధికారులు సమన్వయం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 06, 2026 16:15:52
Hyderabad, Telangana:

Retirement Benefits: 'ప్ర‌తి నెల వెయ్యి మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. నెల‌కు రూ.వెయ్యి కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వ‌స్తోంది. అయినా స‌మ‌న్వ‌యం చేసుకుని ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నాం. ప్ర‌భుత్వ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర్చే బాధ్య‌త ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ది. అక్ర‌మాల‌ను అరిక‌ట్టి ఖ‌జానాకు నిధులు తీసుకువ‌స్తే ప‌ది మందికి స‌హాయం అందుతుంది' అని తెలంగాణ సీఎం తెలిపారు. 'గ‌తంలో జాగీరుదారులు, జ‌మీందార్ల ద‌గ్గ‌ర వేలాది ఎక‌రాల భూములు ఉండేవి. అసైన్డ్ భూముల విష‌యంలో ప్ర‌భుత్వం అన్నిర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంది. పంచ‌డానికి ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర భూములు లేవు. ప్ర‌భుత్వానికి ఆర్థిక వెసులుబాటు ప‌రిమితంగా ఉంది. దారిద్ర్య రేఖ లో ఉన్న జాతి ముందుకు న‌డ‌వాలంటే విద్య అవ‌స‌రం' అని తెలంగాణ సీఎం తెలిపారు.

Also Read: Virosh Gold: విజయ్, రష్మిక పెళ్లిలో 257 తులాల బంగారం.. ఇక పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?

హైదరాబాద్‌లోని శిల్పా క‌ళా వేదిక‌లో నిర్వహించిన మాదిగ ఉద్యోగుల కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశంలో తెలంగాణ సీఎం కీలక ప్రసంగం చేశారు. 'మాట‌లు, మూట‌ల‌తో అయితే మేం ఎన్నిక‌ల్లో గెలిచేవాళ్లం కాదు. చాలా కాలం నుంచి ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం న‌లుగుతోంది. పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి. ఎలా అయితే సాధించుకోవాల‌నే త‌ప‌న‌తో కొంద‌రు ప్రాణ త్యాగాలు చేశారు' అని తెలంగాణ సీఎం తెలిపారు.  'ఎన్నో చిక్కుముడులు, క‌మిష‌న్లు, త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు జ‌రిగాయి. 20 ఏళ్ల నుంచి ఈ స‌మ‌స్య‌ను ప్ర‌త్య‌క్షంగా నేను చూస్తూ వ‌స్తున్నా. మీరు కోట్లాడిన ప్ర‌తి సంద‌ర్భంలో నా చేత‌నైనా సాయం చేస్తూ వ‌చ్చా. నాకు మ‌హాభార‌తంలో క‌ర్ణుడు, బార్బ‌రీకుడు అనే పాత్ర‌లు ఇష్టం. కర్ణుడికి అవ‌మానం జ‌రిగిన‌ప్పుడు పోరాటం చేశారు.. మిత్ర‌ధ‌ర్మాన్ని నేర‌వేర్చాడు. నేను కూడా మిత్ర‌ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తించా. మాదిగ‌ల‌కు నేను అండ‌గా నిల‌బ‌డ్డా' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Also Read: Golden Duck: ఇది నిజంగా బంగారు బాతు.. పొట్ట కోస్తే పది గ్రాముల బంగారం లభ్యం

'ఘటోత్కచుని కుమారుడు బర్బరీకుడు.. బ‌ల‌హీనుల ప‌ట్ల నిల‌బ‌డి కొట్లాడ‌టం అనే గొప్ప ల‌క్ష‌ణం ఉన్న‌వాడు. వ‌ర్గీక‌ర‌ణలో న్యాయం ఉంది. మీరు బ‌ల‌హీనులు కాబ‌ట్టే నేను మీకు అండ‌గా నిల‌బ‌డ్డా. రాజ‌కీయ‌ప‌ర‌మైన ఒత్తిడి వ‌చ్చినా మాదిగ‌ల ప‌క్క‌న నిల‌బ‌డ్డా' అని తెలంగాణ సీఎం తెలిపారు. 'నా ప్ర‌య‌త్నంలో  మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రులు, అధికారులు స‌మ‌య‌స్పూర్తిని చూపించి అండ‌గా నిల‌బ‌డ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల త‌ర్వాత వ‌ర్గీక‌ర‌ణ‌ను అమ‌లు చేసిన మొద‌టి రాష్ట్రం మ‌న‌దే. వ‌ర్గీక‌ర‌ణ అన్ని స‌మ‌స్య‌ల‌కు పరిష్కారం చూపించ‌క‌పోచ్చు' అని వివరించారు.

'ప్ర‌మోష‌న్లు, ఉన్న‌త విద్య‌, భూములు , లిడ్ క్యాప్ భూములను కాపాడుకోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం పెద్ద విష‌యం కాదు. ముందుండి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్న‌ప్పుడు వెనుక నుంచి జ‌రిగే దాడుల‌ను మీరు ఆపాలి. వెన‌క నుంచి జ‌రిగే దాడుల విష‌యంలో మీ జాతి నాకు అండ‌గా ఉండాలి' అని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండి స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.

'ప్ర‌భుత్వానికి క‌ళ్లు, చెవులు, బ్రాండ్ అంబాసిడ‌ర్లు నా ప్ర‌భుత్వ ఉద్యోగులే. 99 రోజుల ప్ర‌జా పాల‌న‌.. ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్య‌క్ర‌మాన్ని తీసుకున్నాం. ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నాం. ప్ర‌తిపేద వాడికి రేష‌న్ కార్డు అందాలంటే మీరు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాలి. స‌న్న బియ్యం, ఇందిర‌మ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి కోసం పేద‌లు ఎదురు చూస్తున్నారు' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 'అత్యంత వెనుక‌బాటు త‌నంలో మాదిగ జాతి ఉంది.. ప్ర‌భుత్వ. ఉద్యోగులు వాళ్ల‌కు అండ‌గా ఉండాలి. సంక్షేమం, అభివృద్ధి ని అందించాల‌న్న‌దే మా సంకల్పం' అని ప్రకటించారు.

'నా ద‌గ్గ‌ర ఉన్న విద్యా శాఖ‌ల‌ను ప్ర‌క్షాళ‌న చేస్తున్నా. నాణ్య‌మైన విద్య కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాం. ప్ర‌భుత్వ హాస్ట‌ళ్ల‌లో చ‌దువుకునే విద్యార్థుల‌కు కాస్మోటిక్ , డైట్ ఛార్జీలు పెంచాం. విద్య ఒక్క‌టే మీ జీవితంలో మార్పు తీసుకువ‌స్తుంది. అవ‌కాశం వ‌స్తే ప‌ది మందికి సాయం చేస్తార‌నే మంచి పేరు మీరు, నేను తెచ్చుకోవాలి' అని రేవత్‌ రెడ్డి తెలిపారు. 'మీ జాతి కోసం ఏం చేయాలో అన్ని చేస్తాం..మీ హ‌క్కుల‌ను చ‌ట్ట‌బ‌ద్దం చేసి కాపాడుతాం' అని తెలంగాణ సీఎం వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 06, 2026 15:22:24
Lanzhou, Gansu:

Golden Duck Viral News: సాధారణంగా.. మాట వరుసకు బంగారు బాతు అంటారు. కొందరి జీవితం ఎలాంటి కష్టం.. శ్రమ లేకుండా హాయిగా.. విలాసవంతంగా జీవిస్తుంటే వారిది బంగారు బాతులాంటి జీవితం అంటుంటారు. అన్నీ పక్షుల్లో బాతు కూడా ఒకటి. కానీ బాతునే బంగారు బాతు అనడానికి కారణం తాజాగా జరిగిన ఓ సంఘటన చెబుతుంది. గుడ్డు పెట్టే బంగారు బాతు మాదిరి ఓ చోట నిజంగంటే బాతు బంగారం పెట్టింది. అయితే అది తన పొట్టలో దాచుకుంది. కోసుకుని కూర వండేదామనుకున్న యజమానికి బంగారం లభించింది. బాతు పొట్టలో దాదాపు పది గ్రాముల బంగారం లభించిన వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? దాని వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

Also Read: IND vs ENG Highlights: ఇంగ్లాండ్‌ ఇంటికి.. ఉత్కంఠ విజయంతో టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లోకి భారత్‌

చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఉన్న లాంగ్‌హుయ్ కౌంటీలో లియు అనే గ్రామస్తుడు బాతును పెంచుకునేవాడు. ఫిబ్రవరిలో తాను పెంచుకుంటున్న బాతును కోసి కూర వండుకుని తినాలని భావించాడు. బెకబెక మంటూ బాతు అరవగా అయినా కూడా లియు బాతును కోశాడు. అనంతరం కోసి బాతును శుభ్రం చేస్తున్న సమయంలో బంగారం కనిపించింది. చిన్న చిన్న బంగారు ముక్కలు అక్కడ పడడం చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడ పడిన లోహం లియు బంగారం అని గుర్తించాడు. అది బంగారమా? కాదా అని అనుమానం వ్యక్తం చేస్తూ.. ఇంట్లోనే వాటిని కరిగించాడు. దీంతో ఆ ముక్కలు కరిగిపోయి బంగారం ద్రావణం వచ్చింది. అది చూసి బంగారమే అని లియు గుర్తించాడు. నిజమైన బంగారం కావడంతో తన పంట పండిందని లియు సంబరపడ్డాడు. బంగారం మొత్తం విలువ పది గ్రామాలు ఉంటుందని చైనా మీడియా చెప్పుకొచ్చింది.

Also Read: Virosh Gold: విజయ్, రష్మిక పెళ్లిలో 257 తులాల బంగారం.. ఇక పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?

బాతుల పెంపకం చేసే లియూ తాము పెంచుకున్న ఓ బాతును కోసి కూర వండేందుకు సిద్ధమయ్యాడు. ముక్కలుగా చేసే సమయంలో అనూహ్యంగా దాని పొట్టలో బంగారం ముక్కలు కనిపించాయి. మొత్తం ముక్కల బరువు 10 గ్రాములు ఉంటాయి. వాటి అంచనా విలువ 12,000 యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 1.6 లక్షలు). ఇది చూసి లియూ సంబరపడ్డాడు. జాక్‌పాట్ తగిలిందని సంతోషపడ్డాడు. అయితే బాతులో బంగారం ఎక్కడిదని చర్చ జరుగుతోంది.కోళ్ల జాతికి చెందిన బాతులు ఆరు బయట ఉండే చిరు గింజలు, వివిధ ఆహార పదార్థాలు తింటూ ఉంటాయి. ఆహారం తీసుకునేటప్పుడు చిన్న చిన్న రాళ్లు వంటివి తింటుంటాయి. ఆ క్రమంలో బంగారం ముక్కలు కూడా బాతు తిని ఉంటుందని తెలుస్తోంది. అయితే బాతులో బంగారం లభించడంపై లియు తండ్రి హర్షం వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Advertisement
Back to top