Naxal Surrender In Telangana: "మావోయిస్ట్ గన్ తీసుకుని డీజీపీకి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!"
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Sundar Pichai Latest Salary News: భారత సంతతికి చెందిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరోసారి వార్తల్లో నిలిచిపోయారు.. ఈసారి ఆయన తన అందుకుంటున్న భారీ వేతన ప్యాకేజీ తో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసేలా చేశారు. ఆయనకు సంబంధించిన ప్యాకేజీ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి. గూగుల్ మాతృ సంస్థగా చెప్పుకునే ఆల్ఫాబెట్ సుందర్ పిచాయ్ వేతన ప్యాకేజీని భారీగా పెంచినట్లు తెలుస్తోంది. రాబోయే మూడేళ్ల కాలానికి ఆయనకు సుమారు 692 మిలియన్లు జీతం అందించబోతున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. అంటే భారత కరెన్సీలు దాదాపు 6,361 కోట్ల అన్నమాట..
అయితే, గూగుల్ కంపెనీ అందించే ఈ భారీ ప్యాకేజీ కేవలం నగదు రూపంలోనే ఉండదు. ఇందులో వివిధ భాగాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వార్షిక జీతం తో పాటు రిస్ట్రిక్టెడ్ స్టాక్ వెస్టింగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆల్ఫాబెట్‌లోని ఇతర అనుబంధ సంస్థల్లో ఉన్న షేర్ల వాటాలు కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయని సమాచారం. దీంతోపాటు గూగుల్ కంపెనీకి సంబంధించిన అనుసంధాన కంపెనీల షేర్ల వాటాలు కూడా ఈ లెక్కలోకి వస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్‌లో వెల్లడించారు..
దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత జీతం తీసుకుంటున్న సీఈఓల జాబితాలో సుందర్ పిచాయ్ అగ్రస్థానంలోకి చేరుకున్నారని తెలుస్తోంది. సంస్థ వృద్ధిలో ఆయన పాత్ర క్రియాశీలకం కాబట్టి భారీగా ప్యాకేజీని పెంచినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా కంపెనీ కష్ట కాలాల్లో ఆయన ఎన్నో సేవలు చేశారని.. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇంత స్థాయిలో ప్యాకేజీ అందిస్తున్నట్లు వారు చెబుతున్నారు.
తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ప్రస్థానం ఎంతో ప్రత్యేకమని మనందరికీ తెలిసిందే.. ఐఐటి ఖరగ్‌పూర్‌లో విద్యనభ్యసించిన ఆయన.. 2004లో ఒక సాధారణ ఉద్యోగిగా గూగుల్లో చేరి.. క్రోమ్ తో పాటు ఆండ్రాయిడ్ వంటి కీలక ఉత్పత్తుల విజయంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారట.. అంతేకాకుండా ఆయన పనితీరుకు గూగుల్ వ్యవస్థాపకులైన లెర్రీ పేజ్, సెర్గీ బ్రిన్ కూడా కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యపోయేవారట.. అయితే 2025 సంవత్సరంలో గూగుల్ సీఈఓ గా బాధ్యతలను ఆయనకు అప్పగించారు.. ఆ తర్వాత 2019లో ఆల్ఫాబెట్ సీఈఓ గా కూడా బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ రంగాల్లో గూగుల్ గట్టి పోటీని ఎదుర్కొంటున్న సమయంలో సుందర్ నాయకత్వంపై సమస్త గట్టి నమ్మకాన్ని ఉంచినట్లు తెలుస్తోంది.. ఆయన పర్యవేక్షణలోని గూగుల్ క్లౌడ్ తో పాటు యూట్యూబ్ ప్రకటనల ఆదాయం ఊహించని స్థాయిలో పెరగడం విశేషం.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Elderly Women Bike Riding Viral Video Watch: వయస్సు అనేది కేవలం అంకి మాత్రమేనని నిరూపించారు ఈ వృద్ధులు.. సాధారణంగా ఈ వయసులో చాలామంది ఇంట్లో పడుకోవడం, ఆధ్యాత్మికంగా ఉండేందుకు పూజలు చేయడం, ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉండడం చూస్తూ ఉంటాం. కానీ రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు వృద్ధురాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. రాజస్థానీ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ.. ఒకరు బైక్ నడుపుతుంటే.. మరో ఇద్దరు వెనక కూర్చుని.. దర్జాగా బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఊహించని స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే, ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రాజస్థాన్లోని అజ్మీర్ నగరంలోని చోటు చేసుకున్న ఈ అరుదైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒక వృద్ధురాలు బైక్ డ్రైవింగ్ సీట్లో ఉండగా.. ఆమె వెనక మరో ఇద్దరు వృద్ధురాలు వచ్చి కూర్చోవడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు.. అయితే వారందరూ సాంప్రదాయ లెహంగాను ధరించి ఉండటం మీరు గమనించవచ్చు. బైక్ నడుపుతున్న ఆ వృద్ధురాలు ముగ్గురు కూర్చున్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా.. చాలా సాదాసీదాగా బైకును తోలడం మీరు క్లియర్గా ఈ వీడియోలో చూడవచ్చు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న కొంతమంది మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈ దృశ్యాలను చూసి సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ఈ సమయంలో కూడా ఈ వృద్ధుల జోష్ చూస్తుంటే ముచ్చటేస్తోందని.. కొంతమంది కామెంట్ పెడుతుంటే. మరికొందరు అసలైన విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇదే అని కామెంట్లలో మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా కొంతమంది ఈ వీడియోకు నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు వీరి ముగ్గురికి ఎలాంటి హెల్మెట్ లేదు అని.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గాయాలపాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వారు కామెంట్లు పెడుతూ వస్తున్నారు. అలాగే త్రిబుల్ రైడింగ్ చేయడం కూడా ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమని మరి కొంతమంది కామెంట్లలో చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ సమయంలో ఇలా బైక్ పై వెళ్లడం చాలా గ్రేట్.. అయితే ఈ వీడియోలు షేర్ చేసిన కొంత వ్యవధిలోని ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. కోట్ల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఉమెన్స్ డే సమయంలో ఈ వీడియో వైరల్ అవ్వడం ఇప్పుడు విశేషం..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Mitchell Santner on Indian Fans: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమైన వేళ, మైదానం వెలుపల మాటల యుద్ధం మొదలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తుది పోరుపై కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి.
గతంలో 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అన్న మాటలనే ఇప్పుడు సాంట్నర్ పునరుద్ఘాటించారు. భారత అభిమానుల కేరింతలను మ్యూట్ చేస్తామంటూ గట్టిగా చెప్పారు. "ఫైనల్ మ్యాచ్ కోసం మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. గ్యాలరీ నిండా ఉండే భారత అభిమానుల అరుపులు, కేకలను మేము పూర్తిగా నిశ్శబ్దం చేస్తాము. 2023లో ఆస్ట్రేలియా ఎలాగైతే భారత్‌ను వారి సొంత గడ్డపై కట్టడి చేసిందో, మేము కూడా అదే పునరావృతం చేస్తాము" అని సాంట్నర్ ధీమా వ్యక్తం చేశారు.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియాపైనే ఒత్తిడి ఎక్కువగా ఉందని సాంట్నర్ విశ్లేషించారు. గత టీ20 ప్రపంచకప్ ఛాంపియన్స్‌గా నిలిచిన భారత్.. ఈసారి సొంత గడ్డపై ఆడుతుండటంతో కప్ నిలబెట్టుకోవాలనే ఒత్తిడి వారిపైనే ఉంటుంది. ఈ ఒత్తిడిని ఆసరాగా చేసుకుని భారత్‌ను ఓడించడం మాకు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రదర్శనను సాంట్నర్ ప్రశంసించారు. "బుమ్రా సెమీఫైనల్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ ఇది ఫైనల్. ఇక్కడ ఒక ఆటగాడి కంటే జట్టుగా మేము ఎలా రాణిస్తామన్నదే ముఖ్యం. బుమ్రాను ఎదుర్కోవడానికి, అలాగే భారత బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేయడానికి మా దగ్గర పక్కా ప్లాన్ ఉంది" అని తెలిపారు.
గతంలో న్యూజిలాండ్ పలుమార్లు ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌కు చేరుకున్నా, ట్రోఫీని ముద్దాడలేకపోయింది. "గతంలో మేము ఫైనల్స్‌లో ఓడిపోయి ఉండవచ్చు, కానీ ఈసారి మా జట్టు భిన్నంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రతి ఆటగాడికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. ఈసారి కచ్చితంగా ట్రోఫీతోనే తిరిగి వెళ్తాం" అని సాంట్నర్ స్పష్టం చేశారు.
అహ్మదాబాద్‌లోని బ్యాటింగ్ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. మరి సాంట్నర్ అన్నట్లుగా కివీస్ జట్టు భారత్‌ను నిశ్శబ్దం చేస్తుందా? లేక టీమ్ ఇండియా వరుసగా రెండోసారి ప్రపంచ విజేతగా నిలుస్తుందో చూడాలి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gaddar Best Actor Award Naga Chaitanya: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో యువ సామ్రాట్ నాగ చైతన్య ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. 'తండేల్' చిత్రంలో ఆయన కనబరిచిన అద్భుత నటనకు గాను ఈ గౌరవం దక్కింది. ఈ చిత్రంలో ఒక జాలరి పాత్రలో నాగ చైతన్య పోషించిన భావోద్వేగభరితమైన నటనకు విమర్శకుల నుంచి ప్రేక్షకుల నుంచి భారీ ప్రశంసలు లభించాయి.
హీరో నాగ చైతన్య తన కెరీర్‌లోనే అత్యంత కఠినమైన పాత్రను ఈ సినిమా కోసం ఎంచుకున్నారు. మత్స్యకారుల జీవనశైలిని, వారి శరీర భాషను ఒంటబట్టించుకోవడానికి హీరో నాగచైతన్య.. ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకార గ్రామాల్లో పర్యటించి, వారితో సమయం గడిపారు. ఒక కరుడుగట్టిన జాలరిలా కనిపించడానికి ఆయన తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ఈ పాత్ర కోసం ఆయన పడ్డ శ్రమ స్క్రీన్‌పై ప్రతిబింబించింది.
ఈ గౌరవం దక్కడంపై యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హర్షం వ్యక్తం చేశారు. "తండేల్ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా నిలవడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ విజయం మా చిత్ర బృందం పడ్డ కష్టానికి ఫలితం" అని ఆయన పేర్కొన్నారు.
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రాముఖ్యత
తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డులను ఏర్పాటు చేసింది. ప్రజల గొంతుకగా నిలిచిన ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద ఈ అవార్డులు ఇవ్వడం విశేషం. ఈ పురస్కారం దక్కడం ద్వారా నాగ చైతన్య తన తరం నటుల్లో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు. 'తండేల్' విజయం నాగచైతన్య కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఈ చిత్రానికి మరిన్ని అవార్డులు వస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Also Read: Adulterated Watermelon: మార్కెట్లోకి కల్తీ పుచ్చకాయలు..సహజమైన పుచ్చకాయలను ఇలా గుర్తించాలి!
Also Read; School Holiday: సోమవారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు..విద్యార్థులు ఫుల్ ఖుషీ..ఉత్తర్వులు జారీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Watermelon Adulteration Test At Home: మార్కెట్లో ప్రస్తుతం అనేక రకాల ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. గతంలో పాలు, బియ్యం, పప్పు దినుసులు వంటి వాటిని కల్తీ చేయగా.. ఇప్పుడు ఆ కల్తీ పుచ్చకాయలను తాకింది. కొందరు వ్యాపారులు పుచ్చకాయలను వేగంగా పండడమే కాకుండా లోపలి భాగం ఎర్రగా కనిపించేలా ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ విధంగా కల్తీ పుచ్చకాయలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వారు సూచిస్తున్నారు. కాబట్టి పుచ్చకాయ కొనడానికి ముందు అది సహజంగా పండినదా లేదా కల్తీనా అని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అదే విధంగా ఏప్రిల్ నెలకు ముందే పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఈ వేడి నుండి ఉపశమనం పొందేందుకు చాలా మంది మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరకు రసం వంటి శీతల పానీయాలతో పాటు శరీరాన్ని చల్లబరిచే పండ్లను తీసుకుంటున్నారు. ఎండల వేడి నుండి ఉపశమనం కలిగించే పండ్ల జాబితాలో పుచ్చకాయ అగ్రస్థానంలో ఉంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండడం సహా ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పుచ్చకాయను చాలా ఆనందంగా తింటారు.
అయితే మార్కెట్లో పేరుకుపోయిన కల్తీ సమస్య ప్రస్తుతం అన్ని ఆహార పదార్థాలను ప్రభావితం చేస్తోంది. కొంతమంది వ్యాపారులు పుచ్చకాయలను త్వరగా పండించడంతో పాటు లోపలి భాగం ఎర్రగా కనిపించేలా ఇంజెక్షన్లు చేస్తున్నారని కొందరు నిపుణలు అంటున్నారు.
ఈ సందర్భంలో పుచ్చకాయ కొనే ముందు అది నేచురల్‌దా లేదా కల్తీ అయినదా అని గుర్తించడంలో మీకు సహాయపడటానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొన్ని సాధారణ చిట్కాలను అందించింది.
మార్కెట్లో పుచ్చకాయను కొనుగోలు చేసేటప్పుడు, ముందుగా చిన్న ముక్కను కోయమని అడగండి. దాన్ని ఓ చిన్న కాటన్ బాల్ లేదా టిష్యూ తీసుకొని ఆ ముక్కపై లోపలి ఎర్రని భాగాన్ని సున్నితంగా రుద్దండి. ఆ తర్వాత ఆ టిష్యూ ఎర్రగా మారితే, పుచ్చకాయను కల్తీగా పరిగణించాలి. ఎందుకంటే అలాంటి సందర్భాలలో పుచ్చకాయ ఎర్రగా కనిపించేలా చేయడానికి 'ఎరిథ్రోసిన్' అనే రసాయనాన్ని దానిలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ రసాయనం ఉన్న పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు అంటున్నారు. టిష్యూ పేపర్ మరకలు పడకపోతే, పుచ్చకాయను సహజంగా పరిగణిస్తారు.
మార్కెట్లో మనకు అమ్మకం చేసే మామిడి పండ్ల మాదిరిగానే కొంతమంది వ్యాపారులు పుచ్చకాయలను త్వరగా పండించడానికి కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఈ రసాయనంతో పక్వానికి తీసుకొచ్చిన పుచ్చకాయల పైభాగంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. అలాంటి పండ్లు ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయపై పసుపు రంగు మచ్చలు కనిపిస్తే, తినడానికి ముందు ఉప్పు నీటితో బాగా కడగడం మంచిది.
పుచ్చకాయ కొనేముందు మీరు దాని పైభాగాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. పండ్లపై చిన్న రంధ్రాలు కనిపిస్తే, అలాంటి పుచ్చకాయలను కొనకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ రంధ్రాలు ఇంజెక్షన్ గుర్తులు కావచ్చునని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎండల కాలంలో పుచ్చకాయ తినేటప్పుడు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే ఈ చిన్న జాగ్రత్తలను పాటించాలి.
Also Read: School Holiday: సోమవారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు..విద్యార్థులు ఫుల్ ఖుషీ..ఉత్తర్వులు జారీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Salary Hike: ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.6 వేల జీతం పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
AP Govt Salary Hike News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జల వనరుల శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఔట్సోర్సింగ్ లస్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వారి వేతనాల పెంపు డిమాండ్ ను సానుకూలంగా స్పందిస్తూ.. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఉత్తర్వులను జారీ చేసింది. క్షేత్రస్థాయిలో సాగునీటి వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడుతున్న లస్కర్ల ఆర్థిక భరోసాను పెంచుతూ తీసుకున్న నిర్ణయం పై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వీరి జీతం ఎంత పెరిగింది? ఈ ఉత్తర్వుల్లో భాగంగా ఉన్న ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రస్తుతం జలవనరుల శాఖలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో వేల సంఖ్యలో లస్కర్లు పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటివరకు రోజు వారి వేతనంగా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.350 మాత్రమే చెల్లిస్తూ వస్తోంది. పెరిగిన ధరలతో పాటు జీవన ప్రమాణాల దృశ్య ఈ వేతనం వారికి ఏమాత్రం సరిపోవటం లేదని కార్మిక సంఘాలు ఇప్పటికే చాలాసార్లు మొరపెట్టుకున్నాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం వారి వేతనాన్ని రూ.550 పెంచుతూ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది.. అంటే రోజు రూ.200 వరకు అదనపు లబ్ది చేకూరుతుంది.
తాజాగా పెరిగిన జీతంతో ఒక్కొక్క లస్కర్‌కు నెలకు సగటున రూ.6 వేల వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. అరకొర జీతాలతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిస్తుందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో నీటి నిర్వహణ చేసే సిబ్బందికి ఈ పెంపు ఒక ప్రోత్సాహం అని ప్రభుత్వం భావిస్తోంది. గత కొన్ని ఏలుగా వ్యవసాయ రంగంలో వీరి పాత్ర క్రియాశీలకమువ్వడం విశేషం..
వ్యవసాయ రంగంలో సాగునీటి పంపిణీ సజావుగా సాగడంలో లస్కర్ల పాత్ర ఎంతగానో ఉంది. కాలువలతో పాటు తూముల ద్వారా పొలాలకు నీటిని సక్రమంగా విడుదల చేసేందుకు వీరి క్రియాశీలక పాత్ర పోషిస్తారు. అంతేకాకుండా షట్టర్లో మూతతో పాటు గేట్ల నిర్వహణ పర్యవేక్షణలో వీరి ఎంతగానో సహాయపడతారు. కాలువలకు గండ్లు పడకుండా.. లీకేజీలను సకాలంలో గుర్తించి మరమ్మత్తులు చేయడం వీరి ప్రధాన పాత్ర.. అయితే వీటన్నిటిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వీరి జీతాలు పెంచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల లస్కర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా జీతాల పెంపు తక్షణమే అమల్లోకి వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలని వారి కోరుతున్నారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
School Holiday News: తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం 12వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు మరో రోజు స్కూళ్లకు సెలవు రానుంది. మార్చి 9న పుదుకొట్టే అనే జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
2025-26 విద్యా సంవత్సరం పూర్తి కావస్తోంది. మరోవైపు అందరూ విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లకు సెలవు వచ్చింది. ఇప్పటికే 12వ తరగతి విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. మార్చి 2 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు.. మార్చి 26 వరకు జరగనున్నాయి.
అవి పూర్తవ్వగానే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 11న ప్రారంభం కానుంది. అలా పదో తరగతి పూర్తవ్వగా 1 నుంచి 9వ తరగతుల వారికి పరీక్షలు జరుగుతాయి. అయితే వాటి పరీక్షల షెడ్యూల్ త్వరలోనే వెలువడనుంది.
ఇదిలా ఉండగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఇప్పుడు కొత్తగా మరో సెలవు రానుంది. ముఖ్యంగా తమిళనాడులో పవిత్రంగా భావించే మాసి మాసం కావడంతో ఆలయ ఉత్సవాలు జరుగుతున్నాయి. దీని కారణంగా జిల్లా వారికి కొందరు కలెక్టర్లు స్థానిక సెలవులను ప్రకటిస్తున్నారు. ఆలయాల్లో రద్దీ కారణంగా ఆయా ప్రాంతాల్లో ఉండే పాఠశాలలకు ముందుస్తు సెలవు ప్రకటిస్తున్నారు.
ఆ విషయంలో ఇప్పుడు తాజాగా ఓ సెలవు గురించి చర్చ జరుగుతోంది. మార్చి 9 (సోమవారం) పుదుక్కోట్టై జిల్లాకు స్థానిక సెలవు ప్రకటించారు. ఆ రోజున జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది.
పుదుక్కోట్టై జిల్లాలోని తిరువాపూర్ అరుల్మిగు శ్రీ ముత్తుమారియమ్మన్ ఆలయ ఉత్సవం మార్చి 9న ఘనంగా జరగనుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి ప్రజలు భారీగా తరలివస్తారు. దీనిని పరిగణనలోకి తీసుకుని, మార్చి 9న పుదుక్కోట్టైకి స్థానిక సెలవు ప్రకటించారు. ఈ సెలవు రోజును భర్తీ చేసేందుకు మార్చి 19 (శనివారం) పని దినంగా ప్రకటించారు. ఆ రోజు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా తెరిచి ఉంటాయని ప్రకటించారు.
అదేవిధంగా మార్చి 9న పాఠశాలలు, కళాశాలలలో పరీక్షలు ఇప్పటికే షెడ్యూల్ చేసి ఉండే.. అలాంటి వాటికి స్థానిక సెలవు వర్తించదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ప్రభుత్వ పబ్లిక్ పరీక్షలు గతంలో ప్రకటించిన తేదీల ప్రకారం, ఎటువంటి మార్పులు లేకుండా జరుగుతాయని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Five-headed Snake Video Watch: గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వింతైన వీడియోలు చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలైతే ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా పవిత్ర నదిలో ఐదు తలల భారీ పాము ప్రత్యక్షమైందని.. నీటిలో తేలుతూ భక్తులకు దర్శనమిస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తుంది. ఈ వీడియోని చూసి సోషల్ మీడియా వినియోగదారులైతే ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా ఆ శ్రీ మహావిష్ణువు మహిమే అని పెద్ద ఎత్తున వీడియోను షేర్ కూడా చేస్తున్నారు. అయితే ఈ వీడియో నిజమైందేనా? లేదంటే ఎవరైనా కావాలనే ఎడిటింగ్ చేసి ఇలా వైరల్ చేస్తున్నారా? అన్న అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైర్లవుతున్న వీడియోలు మొదట్లోనే మనం ఒక పవిత్రమైన నది పై పడవ ప్రయాణిస్తున్నట్లు.. అందులో ఉన్న వ్యక్తి సెల్ఫీ తీసుకుంటున్నట్లు మీరు చూడొచ్చు. అతని వెనక నీటిలో ఐదు తలన శేషనాగు భారీ ఆకారంలో కనిపించడం మీరు చూడవచ్చు. ఆ పాము నీటిపై కదులుతూ.. దాని చుట్టూ అలలు వస్తున్నట్లు కూడా మీరు స్పష్టంగా ఈ వీడియోలో చూడవచ్చు. అంతేకాకుండా ఆ పాము తలను విడిపోయి నీటిలో అటు ఇటు దూసుకెళ్తున్న దృశ్యాలు కూడా మీరు ఈ వీడియోలో క్లియర్‌గా గమనించవచ్చు..
అయితే, ఈ వీడియోను క్లియర్గా పరిశీలించి చూస్తే.. అవి నిజమైన పాములు కావని తేలింది. నీటిలో కనిపిస్తున్న ఐదు తలల పాము కదలికను కాస్త వింతగా ఉన్నాయని.. ఇది కేవలం సినిమా షూటింగ్ కోసం ఉపయోగించే ఆనిమేట్రానిక్స్ పరికరాలు అని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. ఇక మరికొంతమంది అయితే ఈ వీడియో చూసిన వారు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిన గ్రాఫిక్స్ అని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోని మీరు క్లియర్ గా పరిశీలించి చూస్తే తప్పకుండా ఇది గ్రాఫిక్స్ తో తయారు చేసిన వీడియో అని మీకు కూడా అర్థమవుతుంది..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు ఇలాంటి వీడియోలను నిత్యం అప్లోడ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సెన్సేషన్ వీడియోస్ ని క్రియేట్ చేసి ఇలా పోస్ట్ చేసి.. వ్యూస్ ను రాబట్టుకుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చినప్పటి నుంచి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలు కుప్పలుగా వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా ఈ వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను చూసి నిజమైన అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేయడం చాలా మంచిది.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Sheshnaag 150 Drone Price: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముదిరిపోతున్న భారతదేశం ఆధునిక డ్రోన్‌ను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. బెంగళూరుకు చెందిన డిఫెన్స్ స్టార్టప్ న్యూస్పేస్ రీసెర్చ్ టెక్నాలజీస్ 'శేష్‌నాగ్-150' అనే డ్రోన్‌ను అభివృద్ధి చేసింది. దాని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
'శేష్‌నాగ్-150' శత్రువుల వాయు రక్షణ వ్యవస్థను క్షణంలో నాశనం చేసే శక్తి ఉంది. ఇది కేవలం ఓ మెషీన్ మాత్రమే కాదు. 1000 కిలో మీటర్ల పరిధిలోని దాడులను ఖచ్చితంగా నిర్వహించగల సామర్థ్యం ఉంది. ఈ డ్రోన్ 5 గంటల పాటు నిరంతరాయంగా గాల్లో ఎగరడమే కాకుండా 40 కిలోల పేలుడు పదార్థాలను మోయగలదు. దీని ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇది GPS లేకుండా కూడా దృశ్య నావిగేషన్ ఉపయోగించి శత్రువు బంకర్లను, సైనిక స్థావరాలను నాశనం చేయగలదు.
'శేషనాగ్-150' నిజమైన శక్తి దాని 'స్వార్మ్ అటాక్' టెక్నాలజీ, దీనిలో అనేక డ్రోన్లు కలిసి దాడి చేస్తాయి. ఈ డ్రోన్లు కలిసి వచ్చినప్పుడు, అవి అత్యంత ఖరీదైన శత్రు రక్షణ వ్యవస్థను కూడా గందరగోళానికి గురి చేస్తాయి. అప్పుడు వాటిని ఆపడం శత్రువులకు అసాధ్యం అవుతుంది. దీనికి ప్రత్యేకమైన ఇంజిన్ ఉంది, ఇది దీనిని అత్యంత తెలివైన, నెట్‌వర్క్ కెపాసిటీ ఉంటుంది. కనీస మానవ జోక్యంతో లక్ష్యాలను గుర్తించి నాశనం చేయడానికి ఈ వ్యవస్థ రూపొందించారు. ఇరాన్ 'షహీద్' డ్రోన్ లాగా, ఇది చాలా చౌకగా నిర్మించవచ్చు. కాబట్టి పెద్ద, ఖరీదైన శత్రు లక్ష్యాలను తక్కువ ఖర్చుతో సులభంగా లక్ష్యంగా చేసుకోవచ్చు.
ఇరానియన్‌కు చెందిన 'షాహెద్', అమెరికాకు చెందిన 'లూకాస్' డ్రోన్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కానీ భారతదేశ 'శేష్‌నాగ్-150' దాని స్వంత ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. అమెరికన్ లూకాస్ డ్రోన్ స్టార్‌లింక్ ఉపగ్రహాలపై ఆధారపడి పనిచేస్తుంది. అయితే 'శేష్‌నాగ్-150' విజువల్ నావిగేషన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. దీని వలన జామ్ చేయడం అసాధ్యం. ఇరానియన్ షాహిద్ డ్రోన్ ఎక్కువ పరిధిని కలిగి ఉన్నా.. 'షెష్నాగ్-150' కచ్చితత్వంలో మాస్ టెక్నాలజీ పరంగా చాలా ముందుంది.
'శేష్‌నాగ్-150' డ్రోన్ 1,000 కిలోమీటర్ల పరిధిలోని ఏదైనా వాహనాన్ని లేదా సైనిక మౌలిక సదుపాయాలను నాశనం చేయగల సత్తా ఉంది. 'ఆపరేషన్ సింధూర్' వంటి సందర్భాల్లో పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో చౌకైన డ్రోన్‌లను ఎగురవేసింది. అలాంటి వాటిని లక్ష్యంగా చేసుకోవడానికి శేషనాగ్-150 డ్రోన్‌ను సిద్ధం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
10-foot Crocodile Video Watch: గుజరాత్‌లోని వడోదర నగరంలో అర్ధరాత్రి వేళ ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయే ఘటన జరిగింది. సామ సవ్లీ రోడ్డులోని ఊర్మి బ్రిడ్జిపై సుమారు పది అడుగుల పొడవు కలిగిన భారీ మొసలి దర్జాగా నడుచుకుంటూ వెళ్లడం ఎప్పుడు చర్చనీయాంశానికి దారితీసింది. జనసంచారం చాలా తక్కువగా ఉన్న సమయంలో వంతెన పై ఈ ప్రమాదకరమైన జీవి నడుచుకుంటూ వెళ్లడం ఇప్పుడు స్థానికంగా ఆందోళనకు గురిచేస్తుంది. అయితే, రోడ్డుపై వెళుతున్న సమయంలో కొంతమంది ప్రయాణికులు దీనిని చూసి భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ జీవి వంతెన పైకి ఎలా వచ్చింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మార్చి 4వ తేదీన అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వంతెన పై వెళ్తున్న వాహనదారులు తమ కళ్ల ముందు కదులుతున్న ఈ భారీ మొసలిని చూసి మొదట ఏదో సాధారణ జంతువు అనుకున్నారు.. తీర దగ్గరికి వెళ్లి చూడగా అది భారీ ముసలి అని తేలడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కొందరు అక్కడి వాహనాలను ఆపి.. వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇక మరి కొంతమంది వాహనదారులు మాత్రం వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Crocodile went to hang on the Urmi Bridge of Vadodara!#Vadodara pic.twitter.com/M7Cmk5Zc1d
— My Vadodara (@MyVadodara) March 5, 2026
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు.. అంతేకాకుండా స్థానిక పోలీసులతో వంతెన పై ఉన్న ట్రాఫిక్ ను మళ్లించి మోసలికి ఎలాంటి హాని కలగకుండా చాకచక్యంగా దానిని పట్టుకున్నారు. అయితే, ఆ ముసలికి భారీ గాయం కావడంతో.. అలా వంతెన పైకి వచ్చేసిందని అక్కడున్న సహాయక సిబ్బంది తెలిపారు. ఈ మొసలిని పట్టుకునే సమయంలో అక్కడున్న సిబ్బంది ఎంతగానో శ్రమించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాయంతో ఉన్న మొసలిని పట్టుకోవడం కాస్త కష్టంగానే అనిపించిందని వారన్నారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
సాధారణంగా వడోదర ప్రాంతంలో ప్రవహించే నదుల్లో విశ్వామిత్ర నది ఒకటి. ఇక్కడ పెద్ద సంఖ్యలో మొసళ్ళు తిరుగుతూ ఉంటాయి. వర్షాకాలంలో లేదా నదికి సంబంధించిన నీటిమట్టం పెరిగినప్పుడు.. ఆహారం కోసం ఇలా జనాలు తిరిగే ప్రదేశాల్లోకి సంచారం చేస్తూ ఉంటాయని అక్కడి స్థానికులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా వేరే సురక్షితమైన ప్రదేశాల్లోకి వెళ్లేందుకు కూడా అప్పుడప్పుడు ఇలా దర్శనం ఇస్తాయట.. అయితే, అప్పుడప్పుడు జనసంచారం చేసినప్పటికీ.. ఇలా వంతెన పైకి రావడం ఇదే మొదటిసారి అని స్థానికులు చెబుతున్నారు. నది ఒడ్డున కంచెలు సరిగ్గా లేకపోవడం కారణంగానే ప్రాణాంతకమైన ఇలాంటి జంతువులు రోడ్లపైకి వస్తున్నాయని అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
EPS Higher Pension Update: ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద అధిక పెన్షన్ చెల్లింపుల విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న ఆందోళనకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈపీఎఫ్ఓ తెరదించాయని భావించవచ్చు.. అధిక పెన్షన్ అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ.10 లక్షల కోట్ల వరకు ఊహించని భారం పడుతుందని గతంలో ప్రచారం జరిగినప్పటికీ.. ఇప్పటి అంచనాలు వాటిని కొట్టి పడేసాయి అని చెప్పవచ్చు. తాజాగా ఈపీఎఫ్ఓ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దీనివల్ల అదనపు భారం కేవలం రూ.78 వేల కోట్లు మాత్రమే ఉంటుందని తేలింది..
అధిక పెన్షన్ కోసం దాదాపు 17.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో.. డబ్బుల కోరత ఏర్పడవచ్చు అని కేంద్రం ఆందోళన చెందినప్పటికీ.. సుప్రీంకోర్టు ప్రత్యేకమైన ఆదేశాల మేరకు అధిక వేతనంపై పెన్షన్ చెల్లించాల్సి వస్తే.. ఈపీఎఫ్ నిధి పూర్తిగా ఖాళీ అవుతుందని కొన్ని ఆర్థిక వర్గాలు భావించాయి.. అయితే, వాస్తవంగా దరఖాస్తు చేసిన వారి సంఖ్య.. వారు చేసిన సేవలు కాలంతో పాటు పెన్షన్ పండుకు వారు చెల్లించాల్సిన అదనపు వాటాను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ వారం ఊహించిన దాని కంటే చాలా తక్కువగా ఉందని నిపుణులు తెలిపారు..
దరఖాస్తు చేసుకున్న వారిలో అందరూ అర్హులు కాకపోవడంతో పాటు చాలామందికి పెన్షన్ లెక్కింపులో వచ్చే తేడాల వల్ల ప్రభుత్వ అంచనాలు భారీగా తగ్గాయి.. ఈపీఎఫ్ఓ నిర్వహించిన యాక్చువేరియల్ విశ్లేషణ ప్రకారం.. రాబోయే కొన్ని దశాబ్దాలలో ఈ అదనపు బాధ్యత రూ.78 వేలకోట్లకే పరిమితం కాబోతోంది. ఇది పెన్షన్ ఫండ్ లో ఉన్న నిధితో పోలిస్తే.. చాలా తక్కువయినని అధికారులు భావిస్తున్నారు..
అయితే, కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధుల కోరత సాకుతో అధిక పెన్షన్ ప్రక్రియను జాప్యం చేస్తున్నారనే విమర్శల మధ్య ఇప్పుడు ఈ స్పష్టత రావడం విశేషం.. అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకున్న వారు తమ పాత బకాయాలను వడ్డీతోపాటు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల పెన్షన్ పండులోకి తక్షణమే పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయ్యే అవకాశాలున్నాయి. తద్వారా భవిష్యత్తులో పెన్షన్ చెల్లింపులకు ఆటంకం ఉండదని EPFO స్పష్టం చేసింది.. తాజా నివేదికలతో అధిక పెన్షన్ కోసం చూస్తున్న లక్షలాదిమంది పెన్షనర్లతో పాటు ప్రస్తుత ఉద్యోగులకు పెద్ద ఊరట లభించబోతోంది. వారం తక్కువగానే ఉండడంతో పెన్షన్ మంజూరు ప్రక్రియ మరింత వేగవంతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Amazing Monkey Viral Video Watch: జూ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఇరుపకంచెలతో పాటు లోతైన కందకాలు, అందులో ఉండే జంతువులు. జూలలో ఏళ్ల తరబడి అన్ని వన్యప్రాణులు బందీలుగా ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ అవి ఏమాత్రం దిగులు చెందకుండా ఇనుప కంచెల్లోనే ఉంటాయి. కానీ ఇటీవలే ఒక కోతి తన తెలివితేటలతో ఆ ఇనుపకంచెలను తెంచుకొని బయటపడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేవలం ఒక చిన్న కర్ర సహాయంతో ఆ కోతి జీవుల నుంచి తప్పించుకున్న దృశ్యాలు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే, కోతి తనకున్న తెలివితేటలతో ఎలా సింపుల్గా తప్పించుకుందో? దానికి సందర్శకులు చేసిన సహాయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక జూలోని కోతుల బోనులో ముందు సందర్శకులు నిలబడి ఉండడం మనం క్లియర్ గా చూడవచ్చు. బోనుకు, సందర్శకులకు ఉండే ప్రదేశానికి మధ్యలో ఒక నీటి కందకం కూడా కనిపిస్తూ ఉండడం మీరు చూడొచ్చు. అయితే అది జంతువులు నేరుగా కంచ వద్దకు రాకుండా అడ్డుకట్టగా నిలుస్తుంది. అయితే అక్కడికి వచ్చిన కొంత మంది వ్యక్తులు ఆ కంచ నుంచి ఒక పొడవైన సన్నని కర్రను ఇనుప గ్రిల్స్ మధ్యలో నుంచి లోపలికి చాచారు.. అంతే సంగతి ఇంకా.. ఆ కోతి చేసిన పనిని చూసి అక్కడి వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
లోపల ఉన్న ఆ కోతి వెంటనే ఆ కర్రను అందుకోవడం మీరు చూడొచ్చు.. అయితే ముందుగా అక్కడున్న సందర్శకులు అంత కేవలం ఆ కోతి కట్టేతో ఆడుకుంటుందని భావించారు.. కానీ ఆ కోతి కర్రను ఒక సపోర్టుగా వాడుకొని.. కందకం మీదుగా కట్టెపై నుంచి ఎంతో నెమ్మదిగా చాకచక్యంగా ఇనుప కంచపై గెంతు వేసింది.. ఆ కోతి ఎంతో సులభంగా ఆ ఇనుప కంచపై దూకేసి అందరూ చూస్తుండగానే క్షణాల్లో అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయింది. అయితే అక్కడే ఉన్న వారంతా కోతి వారి పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భయపడి వెనక్కి వెళ్లారు.
A truly heart-melting moment 🫶 🙌🏻 pic.twitter.com/ssIcaK4sST
— Hinduism_and_Science (@Hinduism_sci) February 26, 2026
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
దీనికి సంబంధించిన వీడియో హిందూయిజం_ఎస్‌సి ట్విట్టర్ ఖాతా నుంచి అక్కడే ఉన్న కొంతమంది సందర్శకులు పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా షేర్ చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే లక్షల వ్యూ సంపాదించుకుంది. అయితే, ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎవరికైనా స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు.. దానికి ఒక చిన్న ఆధారం దొరికిన చాలు.. అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తూ వస్తున్నారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
India Vs New Zealand Final Playing 11: మరికొద్ది గంటల్లో టీ20 ప్రపంచకప్ 2026 విజేత ఎవరో తేలిపోనుంది! అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం అనగా మార్చి 8వ తేదీ జరగనున్న ఈ సూపర్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌ను 'ప్లేయింగ్ XI' ఎంపిక తీవ్రంగా కలవరపెడుతోంది.
సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించినప్పటికీ, భారత బౌలింగ్ విభాగంలో కొన్ని లొసుగులు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ప్రధాన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్ టీమ్‌కు ఆందోళన కలిగిస్తోంది.
ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నప్పటికీ, సెమీఫైనల్‌లో వరుణ్ దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో బౌలింగ్ సంధించి ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. వరుణ్ ప్రతి బంతికి అతిగా ఆలోచిస్తూ తన మార్క్‌ను కోల్పోతున్నాడనే వాదన వినిపిస్తుంది. వికెట్ కీపర్ సంజూ శాంసన్ అతనికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
అహ్మదాబాద్ పిచ్ - సిరాజ్ రాక!
నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ నల్లరేగడి, ఎర్రమట్టి మిశ్రమంతో తయారు చేశారు. ఇది బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున, భారత్ అదనపు పేసర్‌ను ఆడించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే మైదానంలో సౌతాఫ్రికా పేసర్లను వాడి సక్సెస్ అయింది. అదే ఫార్ములాను భారత్ అనుసరిస్తే వరుణ్ స్థానంలో సిరాజ్ జట్టులోకి రావచ్చు.
వాషింగ్టన్ సుందర్ అవసరమేనా?
కివీస్ జట్టులో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. వారిని అడ్డుకోవడానికి ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కీలకం కాగలడు. అయితే, సుందర్‌ను తీసుకోవాలంటే ఇన్-ఫామ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టడం అసాధ్యం. కాబట్టి వరుణ్ స్థానంలో సుందర్‌ను ఆడించే అవకాశాలూ ఉన్నాయి.
వరుణ్ చక్రవర్తి విఫలమవుతున్న నేపథ్యంలో, అనుభవం ఉన్న కుల్దీప్ యాదవ్ పేరును కూడా మేనేజ్‌మెంట్ పరిశీలిస్తోంది. పెద్ద మ్యాచ్‌ల్లో కుల్దీప్ మ్యాజిక్ జట్టుకు ప్లస్ అవుతుందని కొందరు భావిస్తున్నారు.
భారత్ ముందున్న సవాళ్లు..
టీమ్ఇండియా ఐదో బౌలర్ కష్టాలు ఎదురుకానున్నాయి. శివమ్ దూబే ఎకానమీ రేట్ (14.12) ఆందోళనకరంగా ఉంది. ఐదో బౌలర్ కోటా పూర్తి చేయడం ఇప్పుడు తలనొప్పిగా మారింది. సాధారణంగా గెలిచే జట్టును మార్చడానికి మేనేజ్‌మెంట్ ఇష్టపడదు. ఈ సెంటిమెంట్‌ను పాటిస్తే వరుణ్‌కు మరో అవకాశం దక్కవచ్చు.
ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్‌లో పిచ్ కండిషన్స్, న్యూజిలాండ్ బ్యాటర్ల బలాబలాలను బట్టి రోహిత్ శర్మ అండ్ కో తుది నిర్ణయం తీసుకోనుంది. వరుణ్ తన స్పిన్ మ్యాజిక్‌ను మళ్లీ ప్రదర్శిస్తాడా లేక సిరాజ్/కుల్దీప్ రంగ ప్రవేశం చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook