మహిళలకు ఉచిత ఆటో శిక్షణ తరగతులు
Hyderabad, Telangana:తెలంగాణ మహిళ సహకారక అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, కూకట్ పల్లి లోని దుర్గాబాయి మహిళ శిశు వికాస కేంద్రంలో ఉచిత ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలు ఈ శిక్షణ ద్వారా స్వయం ఉపాధి పొందగలరని, కుటుంబానికి అండగా నిలబడగలరని చెప్పారు. మహిళలు కొన్ని రంగాల్లో మాత్రమే పరిమితం కాకుండా, ప్రతి రంగంలోనూ ప్రతిభ చూపించాలి అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల క్రాంతి వెస్లీ పాల్గొన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Paradise Release Delay: నాని పారడైజ్ సినిమా రిలీజ్‌కు మళ్లీ బ్రేక్.. మరోసారి సినిమా విడుదలపై సస్పెన్స్? ఈసారి కూడా కష్టమే?
Hyderabad, Telangana:Paradise Release Delay News: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ది పారడైజ్' రిలీజ్ డేట్‌పై మళ్లీ సస్పెన్స్ రేగింది. ఈ ప్రతిష్టాత్మక సినిమాను కేవలం తెలుగు మార్కెట్ కే పరిమితం చేయకుండా, పాన్-ఇండియా స్థాయిలో పలు భాషల్లో అత్యంత భారీగా విడుదల చేసేందుకు చిత్ర మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే, 'ది పారడైజ్' హిందీ వెర్షన్ విడుదలకు సంబంధించి వస్తున్న తాజా ఊహాగానాలు ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌పై పలు అనుమానాలను, ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. దీంతో చిత్ర బృందం మొత్తం సినిమాను అక్టోబర్‌కు వాయిదా వేస్తుందా, లేదా కేవలం తెలుగు వెర్షన్‌ను మాత్రమే సెప్టెంబర్ 24న విడుదల చేస్తుందా అనేది త్వరలో అధికారికంగా తేలనుంది.
ప్రస్తుతం వినిపిస్తున్న వివిధ వార్తల ప్రకారం.. 'ది పారడైజ్' హిందీ వెర్షన్ విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. మునుపటి అధికారిక ప్రకటనల ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకులకు విడుదల కావాల్సి ఉంది.
అయితే ఇప్పటివరకు ఉత్తరాది ప్రాంతంలో ఆశించిన స్థాయిలో సినిమా ప్రమోషన్లు ప్రారంభం కాకపోవడమే ఈ తాత్కాలిక వాయిదా అనుమానాలకు ప్రధాన బలంగా మారుతోంది. తగిన ప్రచారం లేకుండా హిందీలో విడుదల చేయడం కంటే వాయిదా వేయడమే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రచార లోపం హిందీ ప్రేక్షకులలో సినిమాపై సరైన అంచనాలను కలిగించలేకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ విచిత్రమైన పరిస్థితుల్లో చిత్ర నిర్మాతల ముందు రెండు ప్రధాన మార్గాలు కనిపిస్తున్నాయి. ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్ 24న తెలుగు వెర్షన్‌ను మాత్రమే థియేటర్లలోకి విడుదల చేసి, ప్రస్తుతానికి హిందీ వెర్షన్‌ను ఆపివేస్తారా? లేదా పాన్-ఇండియా స్థాయిలో అన్ని భాషల్లోనూ ఒకేసారి అత్యంత గ్రాండ్‌గా విడుదల చేయడం కోసం సినిమా మొత్తాన్ని అక్టోబర్ నెలకు వాయిదా వేస్తారా? అనేది తేలాల్సి ఉంది.
ఇప్పటికే ఈ సినిమా మార్చి నుంచి ఆగస్టుకు, ఆ తర్వాత సెప్టెంబర్ 24కు వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సరైన ప్రమోషన్ ప్లాన్ కోసం మరోసారి సినిమా విడుదల తేదీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
నానికి ఈ సినిమా విడుదల తేదీ కేవలం ఒక మామూలు తేదీ మార్పు మాత్రమే కాదు. తన మార్కెట్‌ను పాన్-ఇండియా స్థాయిలో మరింత బలంగా విస్తరించుకోవడానికి 'ది పారడైజ్' చిత్రాన్ని ఒక పెద్ద మైలురాయిగా హీరో నాని భావిస్తున్నారు. హిందీ వెర్షన్‌ను పక్కన పెట్టి కేవలం తెలుగులో సెప్టెంబర్ 24న రావడం ఒక మార్గమైతే, అన్ని భాషల ప్రేక్షకుల వద్దకు ఒకేసారి తీసుకెళ్లేందుకు మొత్తం సినిమాను అక్టోబర్‌కు వాయిదా వేయడమే సరైన నిర్ణయమని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారికంగా సెప్టెంబర్ 24 రిలీజ్ డేట్ ఉన్నప్పటికీ, మేకర్స్ నుంచి త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
Also Read: 'బడిపంతులు' నుంచి 'సార్' వరకు..వెండితెరపై గురుశిష్యుల బంధాన్ని ఆవిష్కరించిన చిత్రాలు
Also Read: బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లోకి వెళ్లిన సెలబ్రిటీలు వీళ్లే..ఆదిరెడ్డి వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
CM Chandrababu PRC: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు వరాల జల్లు.. పీఆర్సీ, డీఏల చెల్లింపులపై ముహూర్తం ఖరారు!
Vijayawada, Andhra Pradesh:CM Chandrababu PRC Commission News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో జరిగిన చర్చల అనంతరం, 12వ వేతన సవరణ సంఘం (PRC) నియామకానికి సీఎం అంగీకరించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను (DA) వచ్చే అక్టోబర్ 1వ తేదీ నుండి చెల్లించేందుకు ఆమోదం తెలిపారు.
సంక్రాంతి నాటికి 2022 సరెండర్ లీవ్స్ నిధుల విడుదల, పోలీసులకు దసరా కానుకగా అదనపు లీవ్ చెల్లింపు, అదనపు పెన్షన్ వంటి పలు కీలక హామీలను ఇచ్చారు. ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.2,880 కోట్ల అదనపు బడ్జెట్ భారం పడనుంది.
ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలకు ఉపశమనం కలిగించే పలు కీలక వరాలను ప్రకటించారు. ఈ చర్చల్లో భాగంగా, ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన 12వ పీఆర్సీ (12th PRC) నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను (1-7-2024, 1-1-2025 కి సంబంధించినవి) వచ్చే నెల అక్టోబర్ 1వ తేదీ నుండి ఉద్యోగులకు చెల్లించడానికి అంగీకరించారు. దీంతో పాటు, 2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్స్ (సెలవుల నగదు) బకాయిలను వచ్చే సంక్రాంతి పండుగ నాటికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సమ్మతించింది.
మరోవైపు, పోలీస్ సిబ్బందికి దసరా కానుకగా ఒక అదనపు సరెండర్ లీవ్ చెల్లింపు చేయనున్నట్లు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పెన్షనర్లకు కూడా ఊరటనిస్తూ 'అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్'ను జనవరి 2027 నుండి అమలు చేయడానికి నిర్ణయించారు. దీని ప్రకారం, 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం మేర అదనపు పెన్షన్ లభించనుంది. ఎంప్లాయిస్ హెల్త్ స్కేం (EHS)ను మరింత క్రమబద్ధం చేస్తూ, వచ్చే నెల నుండి ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు ప్రభుత్వ వాటా నిధులను క్రమం తప్పకుండా చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఈ నిర్ణయాల అన్నింటి వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి సంవత్సరం దాదాపు రూ.2,880 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుందని అంచనా వేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను తాము అర్థం చేసుకున్నామని, ప్రభుత్వానికి తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు..పీఆర్సీ, డీఏల చెల్లింపుపై నేడే సీఎం కీలక ప్రకటన!
Also REad: 40 ఏళ్లకే ఉద్యోగం మానేస్తున్నారా? మీ ఈపీఎఫ్ నిధులపై వడ్డీ వస్తుందా? పూర్తి వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Teachers Day Movies: 'బడిపంతులు' నుంచి 'సార్' వరకు..వెండితెరపై గురుశిష్యుల బంధాన్ని ఆవిష్కరించిన టాలీవుడ్ చిత్రాలు!
Hyderabad, Telangana:Teachers Day Tollywood Movies: సెప్టెంబర్ 5 వచ్చిందంటే మనకు ముందుగా గుర్తొచ్చేది బ్లాక్‌బోర్డ్, చాక్ పీస్, క్లాస్రూమ్ కంటే మన జీవితంలో ఏదో ఒక దశలో మనల్ని మార్చిన ఒక గురువే. మనలో దాగి ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి, పడిపోయినప్పుడు నిలబెట్టేది ఉపాధ్యాయుడే. తెలుగు సినిమా కూడా గురు-శిష్యుల పవిత్రమైన బంధాన్ని, విద్యావ్యవస్థలోని మార్పులను ఎన్నో అద్భుతమైన చిత్రాల ద్వారా ఆవిష్కరించింది. వెండితెరపై గురువులుగా అలరించి, సమాజానికి విలువైన పాఠాలు నేర్పిన కొన్ని చిరస్మరణీయ తెలుగు చిత్రాల ప్రత్యేక కథనం ఇది.
1) బడిపంతులు (1972)
తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయిన మహోన్నత చిత్రం 'బడిపంతులు'. ఇందులో సీనియర్ ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) (NTR) బడిపంతులుగా కంటికి రెప్పలా విద్యార్థులను తీర్చిదిద్దే పాత్రలో జీవించారు. క్రమశిక్షణ, నైతిక విలువలు, విద్యాబోధనలో ఆయన చూపిన నిబద్ధత ఇప్పటికీ తరాలపాటు గుర్తుండిపోతుంది.
2) మాస్టర్ (1997)
సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి తెలుగు లెక్చరర్ 'రాజ్‌కుమార్' పాత్రలో నటించారు. కాలేజీలో దారితప్పిన, గొడవలు పడే యువతను క్రమశిక్షణలోకి తెచ్చి మార్చే గురువుగా ఆయన కనిపించారు. గురువు అంటే కేవలం కఠినంగా ఉండటం మాత్రమే కాదు, విద్యార్థులతో కలిసిపోయి వారిలో ఉన్న మంచిని బయటకు తీసి, ఆదర్శవంతమైన ఆలోచనను మార్చగలరని ఈ పాత్ర నిరూపించింది.
3) సుందరకాండ (1992)
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ లెక్చరర్‌గా నటించిన ఈ చిత్రం, వినోదాన్ని పంచుతూనే ఉపాధ్యాయుడికి ఉండాల్సిన బాధ్యతను, లెక్చరర్, విద్యార్థి మధ్య ఉండాల్సిన పవిత్ర బంధాన్ని చాలా చక్కగా చిత్రీకరించింది.
4) గోల్కొండ హైస్కూల్ (2011)
హరి మోహన్ పరువు రాసిన 'ది మెన్ వితిన్' (The Men Within) పుస్తకం ఆధారంగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుమంత్ ఇందులో క్రికెట్ కోచ్ 'సంపత్'గా నటించారు. విద్యార్థుల్లో గెలవాలనే నమ్మకం తగ్గిపోయినప్పుడు, వారికి కేవలం ఆట మాత్రమే కాకుండా, ఓడిపోయిన తర్వాత కూడా మళ్లీ ప్రయత్నించి విజయం సాధించడం ఎలాగో నేర్పిన గురు పాత్ర ఇది.
5) సార్ (2023)
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ లెక్చరర్ 'బాల గంగాధర్ తిలక్'గా అద్భుతంగా నటించారు. విద్యావ్యవస్థలోని వ్యాపారీకరణను, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రభావాన్ని ఎండగడుతూ, పేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించడానికి పోరాడే పాత్ర ఇది. చదువు అనేది కేవలం వ్యాపారం కాదు, ప్రతి ఒక్కరి హక్కు అని ఈ చిత్రం చాటిచెప్పింది.
6) ఇతర చిత్రాలు...
'ఠాగూర్'లో ప్రొఫెసర్‌గా చిరంజీవి భౌతికశాస్త్రం బోధిస్తూనే, విద్యార్థుల సహాయంతో అవినీతిపై పోరాడే పాత్రలో నటించారు. ఇది ఉపాధ్యాయుడు విద్యార్థులలో సామాజిక స్పృహను ఎలా పెంపొందించవచ్చో చూపించింది. అలాగే 'రిపబ్లిక్' లో సాయి ధరమ్ తేజ్ రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య బాధ్యతలను నేర్పించే గొప్ప మార్గదర్శకుడిగా కనిపించారు.
మంచి గురువు కేవలం సమాధానాలు ఇవ్వడమే కాదు, మనమే స్వయంగా సమాధానాలు వెతుక్కునేలా చేస్తాడు. కొన్ని పాఠాలు పుస్తకాల్లో ఉండవు.. అవి గురువుల రూపంలోనే మన జీవితంలోకి వస్తాయి.
Also Read: బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లోకి వెళ్లిన సెలబ్రిటీలు వీళ్లే..ఆదిరెడ్డి వీడియో వైరల్!
Also REad: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అనసూయ మరో వివాదం..రాధా గెటప్‌పై నెటిజన్ల తీవ్ర ట్రోలింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
నెలకు రూ.5,000 దాచుకుంటే రూ.8.5 లక్షల రాబడి.. సూపర్ హిట్ స్కీమ్ వివరాలు ఇవే!
Hyderabad, Telangana:Post Office RD Scheme: మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి, మంచి రిటర్న్స్‌తో కూడిన పెద్ద కార్పస్‌ను నిర్మించుకోవాలని అనుకుంటున్నారా? అయితే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో మీరు పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు; నెలకు రూ.100 నుండి రూ.5,000 వరకు సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీతో కలిపి క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతూ ఉంటే, మీరు రూ.8.5 లక్షల వరకు భారీ కార్పస్‌ను సృష్టించవచ్చు.
ప్రతిరోజూ సుమారు రూ.165 పొదుపు చేస్తే, అది నెలకు రూ.5,000 అవుతుంది. మీరు మీ పేరు మీద ఖాతాను ఓపెన్ చేసుకుని, ప్రతి నెలా పెట్టుబడిని రూ.100 చొప్పున పెంచుకుంటూ కూడా పోవచ్చు. ఇది మీ ఆర్థిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.
ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ RD స్కీమ్‌పై 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందులో మీరు జాయింట్ అకౌంట్‌ను కూడా ఓపెన్ చేయవచ్చు. మీరు చేసిన పెట్టుబడిని మరో ఐదేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం ఉంది. తద్వారా పదేళ్లలో మీరు అద్భుతమైన కార్పస్‌ను పొందవచ్చు.
అయితే, ప్రతి నెలా మీరు నిర్ణీత వాయిదాను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఒక ఇన్స్టాల్మెంట్ మిస్ అయితే, ఒక శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్రతి నెలా మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌ను క్రమం తప్పకుండా చెల్లించాలి. మీకు అవసరమైతే పోస్ట్ ఆఫీస్ RDని ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు.
మీరు ప్రతి నెలా రూ.5,000 పోస్ట్ ఆఫీస్ RDలో ఇన్వెస్ట్ చేస్తే, ఐదేళ్లలో అది 3 లక్షలు అవుతుంది. 6.7 శాతం వడ్డీతో కలిపి మెచ్యూరిటీ సమయానికి మీకు రూ.3,56,830 అందుతాయి. ఒకవేళ మీరు దీన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తే, మొత్తం పదేళ్ల కాలంలో మీరు దాదాపు రూ. 6 లక్షల వరకు పొందుతారు. ఈ కాలంలో వడ్డీ మొత్తం రూ.2,54,272 అవుతుంది, తద్వారా పదేళ్ల మెచ్యూరిటీ సమయానికి మీరు మొత్తం రూ.8,54,272 పొందుతారు.
Also Read: రోడ్డుపై ఊహించని ఘటన.. మహిళను రేప్ చేయబోయిన కామాంధుడికి చుక్కలు చూపించిన కుక్క!
Also Read: SBI PO మెయిన్స్ హాల్ టికెట్లు వచ్చేశాయి..
పోస్ట్ ఆఫీస్ RD స్కీమ్ ద్వారా మీరు హామీతో కూడిన మంచి రిటర్న్స్‌ను పొందవచ్చు. చిన్న మొత్తాలతో నెలవారీ డిపాజిట్లు చేస్తూ వెళ్తే, మీరు మరింత ఎక్కువ లాభాలను పొందవచ్చు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ పథకంలో ఎలాంటి భయం లేకుండా పెట్టుబడి పెట్టి మంచి కార్పస్‌ను సృష్టించుకోవచ్చు. ఒకవేళ మీకు ఐదేళ్లలోనే డబ్బులు అవసరమైతే, ఆ మొత్తాన్ని కూడా మీరు పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లోకి వెళ్లిన సెలబ్రిటీలు వీళ్లే..యూట్యూబర్ ఆదిరెడ్డి వీడియో వైరల్!
Hyderabad, Telangana:Bigg Boss 10 Telugu Contestants: మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' గ్రాండ్ లాంచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో షోలో సరికొత్త సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్, మార్పులు ఉంటాయని హోస్ట్ నాగార్జున, నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ల గురించి తీవ్ర ఉత్కంఠ నెలకొనగా, మాజీ కంటెస్టెంట్, ప్రముఖ యూట్యూబర్ ఆదిరెడ్డి ఈ సీజన్ ఫైనల్ కంటెస్టెంట్ల జాబితాతో కూడిన ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. గతంలో ఆదిరెడ్డి చేసిన అంచనాలు చాలా వరకు నిజం కావడంతో ఈ క్రేజీ జాబితా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ముఖ్యంగా గేమ్స్, టాస్కుల్లోనూ చాలా మార్పులు చేశారని సమాచారం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతితో పాటు డబుల్ ఎంటర్ టైన్మెంట్ అందించేవారినే ఈసారి కంటెస్టెంట్స్ గా ఎంపిక చేశామంటూ బిగ్ బాస్ మేకర్స్ వెల్లడిస్తున్నారు.
ఈ తరుణంలో హౌస్‌లోకి వెళ్లే సెలబ్రిటీల గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. వీటిలో సినీ, టీవీ రంగాల ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు ఉన్నారు.
అయితే, గత సీజన్లలో కంటెస్టెంట్ల గురించి ఖచ్చితమైన అంచనాలు వేసిన ఆదిరెడ్డి, ఈ సారి కూడా ఫైనల్ లిస్ట్‌ను బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయన విడుదల చేసిన అంచనా ప్రకారం హౌస్‌లోకి రాబోయే 16 మంది కంటెస్టెంట్స్ వీరే..
1) అదిత్ ఈశ్వరన్: 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలో సెకండ్ హీరో.
2) ముఖేష్ గౌడ అలియాస్ రిషి: ప్రముఖ టీవీ సీరియల్ నటుడు.
3) రోహిత్: సామాన్యుడి (కామనర్) కేటగిరీ కింద ఎంపికైన కంటెస్టెంట్.
4) కృష్ణుడు: 'వినాయకుడు' సినిమా హీరో.
5) శాలినీ
6) జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్: ప్రముఖ కామెడీ నటుడు
7) టెంపర్ వంశీ
8) సృష్టి వ్యాకరణం
9) ఆర్జే చరణ్: 'అగ్నిపరీక్ష' కంటెస్టెంట్
10) యాంకర్ వర్షిణీ సౌందర రాజన్
11) ఝాన్సీ: రైతు, సింగర్, 'అగ్నిపరీక్ష' కంటెస్టెంట్
12) 'జబర్దస్త్' నరేష్
13) దేబ్జానీ మోదక్: సీరియల్ నటి
14) చైత్ర రాయ్: ప్రముఖ సీరియల్ నటి
15) నవరసాలు ఆర్కే: 'అగ్నిపరీక్ష' కామనర్ కంటెస్టెంట్
16) సుధీర్ రెడ్డి: పోడ్కాస్టర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
ఆదిరెడ్డి వెల్లడించిన ఈ ఆసక్తికరమైన జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఆదివారం సాయంత్రం జరిగే గ్రాండ్ లాంచ్‌తో ఈ పేర్లపై తుది అధికారిక స్పష్టత రానుంది.
Also Read: 100 రోజులకు రూ.80 లక్షలు..బిగ్‌బాస్ చరిత్రలో అత్యధికంగా సంపాదించింది ఎవరో తెలుసా?
Also Read: బిగ్‌బాస్ ఆఫర్ తిరస్కరించిన సెలబ్రిటీలు వీళ్లే.. లక్షల్లో రెమ్యునరేషన్ ఇచ్చినా 'నో'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..ఈరోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే?
Hyderabad, Telangana:Gold Price India Today: భారతదేశంలో సెప్టెంబర్ 5న ప్రధాన నగరాలైన చెన్నై, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులలో బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. 'గుడ్ రిటర్న్స్' తాజా సమాచారం ప్రకారం.. దేశీయంగా ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15,480గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.14,190, 18 క్యారెట్ల ధర రూ.11,610గా నమోదైంది. నిన్నటితో (సెప్టెంబర్ 4) పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.186 తగ్గగా, 22 క్యారెట్లపై రూ.170.. అలాగే 18 క్యారెట్లపై రూ.139 మేర తగ్గుదల నమోదైంది.
అయితే, పశ్చిమ ఆసియా (మధ్యప్రాచ్యం)లో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా విలువైన లోహాల ధరలలో రోజువారీ హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు.
నగరాల వారీగా ధరల వివరాలు
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు కింది విధంగా ఉన్నాయి.
చెన్నై: 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 15,667 కాగా.. 22 క్యారెట్లు రూ. 14,361.. 18 క్యారెట్లు రూ. 12,131గా ఉంది. ఇక్కడ ధరలు అత్యధికంగా నమోదయ్యాయి.
హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, పూణే.. ఈ నగరాలన్నింటిలోనూ ధరలు ఒకేలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15,480, 22 క్యారెట్లు రూ. 14,190.. 18 క్యారెట్లు రూ. 11,610గా ఉన్నాయి.
ఢిల్లీ: 24 క్యారెట్లు రూ. 15,495 కాగా, 22 క్యారెట్లు రూ. 14,205.. 18 క్యారెట్లు రూ. 11,625గా ఉంది.
అహ్మదాబాద్ & వడోదర: 24 క్యారెట్లు రూ. 15,485, 22 క్యారెట్లు రూ. 14,195.. 18 క్యారెట్లు రూ. 11,615గా నమోదైంది.
అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు సంక్షోభం
బంగారం ధరల హెచ్చుతగ్గులకు అంతర్జాతీయ పరిణామాలు బలమైన కారణంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, అమెరికాల మధ్య సైనిక ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌లోని 'పికాక్స్ మౌంటైన్' పై "చాలా త్వరగా" దాడి చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, ఏ విధమైన ఘర్షణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ఇరాన్ వైమానిక రక్షణ దళ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీరేజా ఎల్హామి స్పష్టం చేశారు.
మరోవైపు, గాజా నుండి ప్రజలను తరలించాలన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ, పాలస్తీనియన్ల బహిష్కరణను సమర్థించబోమని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఉద్రిక్తతల వల్ల వాణిజ్య నౌకలపై క్షిపణి దాడులు పెరిగాయి. దీనితో వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య జూన్ 2026లో కుదిరిన 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైంది.
మరోవైపు సౌదీ అరేబియా ముడి చమురు ఎగుమతులు రోజుకు 3 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయి, 9 ఏళ్ల కనిష్టానికి చేరుకోవడంతో చమురు ధరలు ఆరు వారాల గరిష్టానికి చేరాయి. ఈ ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో దౌత్య మార్గాలు దెబ్బతినడంతో, పెట్టుబడిదారులు సురక్షితమైన ఆశ్రయంగా బంగారం వైపు మళ్లడం వల్ల ధరలలో నిరంతరం మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Also Read: 40 ఏళ్లకే ఉద్యోగం మానేస్తున్నారా? మీ ఈపీఎఫ్ నిధులపై వడ్డీ వస్తుందా? పూర్తి వివరాలు
Also Read: 100 రోజులకు రూ.80 లక్షలు..బిగ్‌బాస్ చరిత్రలో అత్యధికంగా సంపాదించింది ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nagamani Video: నాగమణికి కోబ్రా కాపలా.. వైరల్ వీడియో మీరు చూశారా?
Hyderabad, Telangana:Nagamani Video Viral: పురాణాలతో పాటు అనేక ఇతిహాసాల్లో, జానపద కథల్లో నాగమణి గురించి ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి.. నాగమణిని నాగుపాములు తమ ప్రాణాల కంటే ఎక్కువగా కాపాడుకుంటాయని.. వాటి దగ్గరికి ఎవ్వరిని రానివ్వమని పెద్దలు కొన్ని కథల్లో చెప్పేవారు.. కాలక్రమేన ఇవన్నీ కేవలం కల్పిత కథలని చాలామంది భావిస్తూ ఉంటారు.. అయితే సరిగ్గా అలాంటి నమ్మకాలనే నిజం చేసేలా తాజాగా ఇన్స్టాగ్రామ్ లో వెలుగులోకి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియా వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అసలు ఈ వీడియో ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక అద్భుతమైన కాంతితో ధగధగ మెరుస్తున్న నాగమణి నేలపై కనిపించడం మీరు చూడొచ్చు.. ఆశ్చర్యకరంగా.. ఆ ప్రకాశవంతమైన మణికి అత్యంత సమీపంలో ఒక ప్రమాదకరమైన భారీ కోబ్రా పడక విప్పి రక్షణ వలయంగా నిలబడి ఉండడం మీరు గమనించవచ్చు. ఎవరైనా ఆ మణిని తాకడానికి వస్తే కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ పాము ఉగ్రరూపం దాల్చి ఉండడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు.. ఆ పాము నాగమణికి రక్షణగా నిలుస్తున్నట్లు ఈ వీడియో భావన..
ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఈ అరుదైన దృశ్యాన్ని ఎవరు చిత్రీకరించారు? అనే వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు.. అయినప్పటికీ.. మెరుస్తున్న నాగమణి పక్కనే పడగవిప్పి కోబ్రా ఎంతో భయంకరంగా ఉగ్రరూపం దాల్చి.. రక్షణగా నిలిచిన వైనం సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.
Also Read: 20 ఏళ్ల వయస్సును తగ్గించుకున్న 68 ఏళ్ల వ్యక్తి.. ఎలా సాధ్యం ఇది?
ఈ వీడియో ఇంస్టాగ్రామ్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు భక్తి భావంతో కామెంట్లు పెడుతూ.. గతంలో మాత్రమే విన్న అద్భుతమైన రూపంలో దర్శనమిచ్చిందని.. ఇది ప్రకృతిలో దాగివున్న దైవిక శక్తులకు నిదర్శనమని నమ్ముతూ కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. ఇక మరికొంతమంది ఇది కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్ ను వినియోగించి పామును అలా డిజైన్ చేసి.. నాగమణిని పెట్టారని కామెంట్లలో పెడుతున్నారు.. ఇక మరి కొంతమంది ఎల్ఈడి బల్బు పెట్టి.. పెంచుకుంటున్న నాగుపామును అక్కడ పెట్టి వీడియో తీశారని కామెంట్లలో చెబుతూ వస్తున్నారు. ఏది ఏమైనా చాలామంది ఈ వీడియోను నిజమైన వీడియోగా విశ్వసిస్తున్నారు..
Also Read: 20 ఏళ్ల వయస్సును తగ్గించుకున్న 68 ఏళ్ల వ్యక్తి.. ఎలా సాధ్యం ఇది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Canadian Woman Nude Rituals: విదేశీ మహిళతో నగ్నంగా పూజలు చేసిన జోతిష్య్కుడు..వీడియో రికార్డు చేసి బెదిరింపులు!
Chennai, Tamil Nadu:Canadian Woman Nude Rituals News: పోలీసుల కథనం ప్రకారం.. కెనడా పౌరసత్వం కలిగిన శ్రీలంక తమిళురాలైన ఒక 37 ఏళ్ల మహిళ ఇటీవల తమిళనాడుకు వచ్చారు. ఆధ్యాత్మికతపై అమితమైన ఆసక్తి కలిగిన ఆమె గత కొన్ని నెలలుగా చెన్నైలోని కోడంబాక్కంలో నివసిస్తున్నారు. గతంలో ఆమె ఒక టెలివిజన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇటీవల ఆమె చెన్నైలోని బెసెంట్ నగర్ బీచ్‌కి వెళ్లిన సమయంలో, అక్కడ చిలుక జ్యోతిష్యం చెప్పే ఇసాక్కిముత్తు అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు.
ఆమె అతని వద్దకు వెళ్లి జ్యోతిష్యం చెప్పాలని అడగగా, ఆమెను తాను టీవీలో చూశానని, తాను చెప్పినట్లు చేస్తే జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకుంటారని నమ్మబలికి ఆమె నమ్మకాన్ని పూర్తిగా చూరగొన్నాడు. ఆమె గ్రహాల స్థితిగతుల వల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి తమిళనాడులోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించాల్సి ఉంటుందని ఇసాక్కిముత్తు నమ్మించాడు.
ఈ పూజకు దాదాపు రూ. 70,000 వరకు ఖర్చవుతుందని తెలిపాడు. అదే సమయంలో అర్ధరాత్రి జరిగే వీడియో కాల్లో ఆమె నగ్నంగా పూజలో పాల్గొంటేనే అనుకున్నది నెరవేరుతుందని సదరు మహిళను ఒప్పించాడు. అతని మాటలను గుడ్డిగా నమ్మిన ఆ విదేశీ మహిళ అతను చెప్పినట్లుగానే వీడియో కాల్లో నగ్నంగా పూజలో పాల్గొంది. ఈ పూజ కోసం ఆమె మొదట రూ.20,000 లేదా రూ.70,000 వరకు నగదును చెల్లించింది.
అయితే, ఆ కాల్ ముగిసిన వెంటనే జ్యోతిష్యుడు ఇసాక్కిముత్తు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. తన వద్ద ఆమెకు సంబంధించిన నగ్న వీడియో రికార్డు ఉందని, దానిని సామాజిక మాధ్యమాల్లో, ఆన్లైన్లో పోస్టు చేయకుండా ఉండాలంటే తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. దీనితో తీవ్ర ఆందోళనకు గురైన బాధితురాలు బుధవారం చెన్నైలోని మాంబళం మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ (IT) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు, బాధితురాలు మొదట డబ్బులు బదిలీ చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు, నిందితుడి మొబైల్ ఫోన్ నెట్వర్క్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు జరిపారు. చివరకు గురువారం రాత్రి తెన్కాసి జిల్లా కోర్టాలమ్లో ఇసాక్కిముత్తు ఆచూకీ కనుగొని అతన్ని విజయవంతంగా అరెస్టు చేశారు. నిందితుడిని చెన్నైకి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు.
Also Read: 40 ఏళ్లకే ఉద్యోగం మానేస్తున్నారా? మీ ఈపీఎఫ్ నిధులపై వడ్డీ వస్తుందా? పూర్తి వివరాలు
Also Read: మీ వీధిలో వినాయక మండపం పెడుతున్నారా? ఒకే క్లిక్‌తో పోలీస్ పర్మిషన్..రూ.1 ఖర్చు లేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
సెప్టెంబర్ 7 నుంచి భద్రా రాజయోగం.. ఈ 4 రాశుల వారికి ఊహించని గోల్డెన్ జాక్‌పాట్..
Hyderabad, Telangana:Bhadra Raj Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహాన్ని తెలివితేటలు వాక్చాతుర్యం వ్యాపారం ధనానికి అధిపతిగా సూచిస్తూ ఉంటారు. అయితే, బుధుడు తన ఉచ్ఛరాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు పంచ మహాపురుష రాజయోగాల్లో తప్పకుండా ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన భద్రా రాజయోగం ఏర్పడబోతోంది. దీని ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. సెప్టెంబర్ 7వ తేదీన కన్యా రాశిలోకి బుధుడు సంచారం చేయడం కారణంగా ఈ రాజయోగం ఏర్పడుతుంది. అయితే, దీనికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. ఈ యోగ ప్రభావంతో ఈ క్రింది రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు వస్తాయి. ఈ సమయంలో ఏ రాశుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి ఊహించని జాక్‌ఫాట్!
వృషభరాశి
సెప్టెంబర్ 7వ తేదీన బుధుడు ఏర్పరచబోతున్న ఎంతో శక్తివంతమైన భద్రా రాజయోగం ప్రభావంతో ఈ సమయంలో వృషభ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ధన సంబంధిత కోరికలు సులభంగా నెరవేరబోతున్నాయి.. వ్యాపారాల్లో అద్భుతమైన వృద్ధ లభించబోతోంది. ప్రధానమైన సమస్యను పూర్తిగా పరిష్కారమై అన్ని రంగాల్లో విజయాలు సాధించబోతున్నారు. అంతేకాకుండా ఆస్తులకు సంబంధించిన వివిధ అంశాల్లో అనేక మార్పులు వస్తాయి. వ్యాపారాల్లో వృద్ధులబించి అనుకున్న మొత్తంలో ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు..
మిథున రాశి
ఎంతో శక్తివంతమైన రాజయోగం ప్రభావంతో మిథున రాశి వారికి ఈ సమయంలో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. గొప్ప విజయాలు సాధించడమే కాకుండా ఉద్యోగాల్లో పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా ప్రమోషన్స్ లభించి.. మీపై అధికారుల నుంచి అద్భుతమైన ప్రశంశాలు పొందుతారు. అంతేకాకుండా కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే డబ్బు సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ముందుకు నడవాల్సి ఉంటుంది.
కన్య రాశి
కన్యా రాశి వారికి ఈ సమయం సువర్ణ అవకాశాలను అందిస్తుంది. ముఖ్యంగా భారీ ధన లాభాలు కలగడమే కాకుండా డబ్బుకు ఎలాంటి కొరత ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగాలతో పాటు వ్యాపారాలపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే కుటుంబంలో మంచి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య దూరం పూర్తిగా తొలగిపోయి అనుకున్న లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరబోతున్నాయి.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ శక్తివంతమైన రాజయోగ ప్రభావంతో విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి అకస్మాత్తుగా డబ్బులు లభించి విశేషమైన ధన లాభాలు సొంతం చేసుకుంటారు. అలాగే డబ్బుకూరత కూడా తీరిపోయి.. పొదుపు విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి లభిస్తుంది. వ్యాపారంలో పడ్డ కష్టాలు కూడా సులభంగా తీరిపోయి.. మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే ఎప్పటినుంచో అనుకుంటున్న వస్తువులు కూడా సులభంగా కొనుగోలు చేస్తారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
CM Chandrababu PRC DA: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు..పీఆర్సీ, డీఏల చెల్లింపుపై నేడే సీఎం కీలక ప్రకటన!
Vijayawada, Andhra Pradesh:AP Employees PRC DA News: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు అందాల్సిన ఆర్థిక బకాయిల చెల్లింపుల కోసం ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టడం, కొన్ని సంఘాలు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలకు దిగడంతో ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, పీఆర్సీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. ఉద్యోగ సంఘాల నేతలతో స్వయంగా చర్చలు జరిపి తగిన పరిష్కారాలు కనుగొనాలని నిర్ణయించారు.
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 11 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అనగా నేడు సెప్టెంబరు 5 (శనివారం) అత్యున్నత స్థాయి భేటీ కానున్నారు. ఈ చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాలు ప్రస్తావిస్తున్న అంశాలపై సమగ్రంగా చర్చించడంతో పాటు, రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక సమస్యలను వారికి వివరించనున్నారు.
ఈ సమావేశంలో ఉద్యోగులు గత కొంతకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘానికి (పీఆర్సీ) కొత్త కమిషనర్‌ను నియమించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ పీఆర్సీ కమిషనర్‌గా నియమితులవగా, కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆయన స్థానంలో సరికొత్త అధికారిని నియమించేందుకు సిద్ధమవుతోంది.
దీనితో పాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రెండు డీఏల (DA) చెల్లింపులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగుల హెల్త్‌కార్డుల సమస్యకు కూడా ఈ సమావేశంలో పరిష్కారం లభించనుంది. హెల్త్ కార్డుల అంశంపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశమై కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని కలసి తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అయితే ప్రభుత్వం చర్చలు జరుపుతున్న తరుణంలో ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు ఎందుకు అంత తొందరపడుతున్నాయని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగులకు న్యాయంగా చేయాల్సిన ప్రయోజనాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
మొత్తంమీద, పీఆర్సీ నూతన కమిషనర్ నియామకం, రెండు పెండింగ్ డీఏల బకాయిల చెల్లింపులతో పాటు హెల్త్ కార్డుల వంటి కీలకమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ఎంతో ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి తీసుకోబోయే నిర్ణయాలపై ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఆర్సీ కోసం రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు!
Also REad: 40 ఏళ్లకే ఉద్యోగం మానేస్తున్నారా? మీ ఈపీఎఫ్ నిధులపై వడ్డీ వస్తుందా? పూర్తి వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Konda Surekha Jagadeesh Reddy: "కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీ గేటు కూడా తాకనివ్వం" జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Hyderabad, Telangana:Konda Surekha Jagadeesh Reddy News: మాజీ మంత్రి కొండా సురేఖ త్వరలోనే కాంగ్రెస్ పార్టీని విడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. మంత్రి పదవి నుంచి ఆమెకు అధికార కాంగ్రెస్ పార్టీ బర్త్‌రఫ్ చేయగా.. ఈ క్రమంలో ఆమె పార్టీ మారే ఛాన్స్ ఉందని, త్వరలోనే ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీ గేటు కూడా తాకనివ్వమని ఆయన స్పష్టం చేశారు.Anasuya Krishnashtami Dance: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అనసూయ మరో వివాదం..రాధా గెటప్‌పై నెటిజన్ల తీవ్ర ట్రోలింగ్!
Hyderabad, Telangana:Anasuya Krishnashtami Dance Video: శ్రీకృష్ణాజన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నటి అనసూయ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రాచుర్యం పొంది వైరల్ అవుతున్న 'తులసి కోమలవేణి..' అనే కన్నడ భక్తి గీతానికి ఆమె రాధా దేవి గెటప్‌లో నృత్యం చేస్తూ కనిపించారు. ఈ వీడియో చివర్లో "కృష్ణుడికి అంతా తెలుసు. నాకు అది చాలు" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను కూడా జోడించారు.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొద్ది సమయానికే నెట్టింట విపరీతంగా వైరల్ కావడమే కాకుండా, నెటిజన్ల నుండి తీవ్రమైన ట్రోలింగ్‌కు దారితీసింది. అనసూయ శైలిని తప్పుబడుతూ కొందరు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఒక నెటిజన్ "ఆ పాట ఏంటి? ఆ డ్రెస్ ఏంటి? బుద్ధి ఉందా?" అని మండిపడగా, మరొకరు "ఈ వీడియోలో ఆధ్యాత్మిక భావం కంటే అందాల ప్రదర్శన ఎక్కువగా కనిపిస్తోంది, అలా అనడమే బాగుంటుందేమో" అంటూ విమర్శనాత్మక కామెంట్స్ చేశారు.
వాస్తవానికి.. సనాతన ధర్మం, హిందూ ధర్మం విషయంలో అనసూయ గత కొన్ని రోజులుగా పలు విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ధర్మం, మతం పేరుతో ఇతరులపై వ్యక్తిగత దాడులకు దిగడం, బెదిరింపులకు పాల్పడటం ఏమాత్రం సరైన విధానం కాదని ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున చర్చలకు దారితీశాయి. తనను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే వ్యక్తిగత దూషణలు చేయడం, భౌతిక బెదిరింపులకు పాల్పడటం మాత్రం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె గట్టిగా స్పష్టం చేశారు.
న్యూస్ రీడర్‌గా తన వృత్తిని ప్రారంభించిన అనసూయ, ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. బుల్లితెరపై తన హవా కొనసాగిస్తూనే, నాగార్జున సరసన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంలో స్టెప్పులేసి వెండితెర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
ఆ తర్వాత రామ్ చరణ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'రంగస్థలం' చిత్రంలో ఆమె పోషించిన 'రంగమ్మత్త' పాత్ర ఆమె సినిమా కెరీర్‌ను అద్భుతమైన మలుపు తిప్పింది. ఈ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అనసూయ, ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ వెండితెరపై ఫుల్ బిజీగా కొనసాగుతున్నారు.
Also Read: బిగ్‌బాస్ ఆఫర్ తిరస్కరించిన సెలబ్రిటీలు వీళ్లే.. లక్షల్లో రెమ్యునరేషన్ ఇచ్చినా 'నో'
Also REad: 100 రోజులకు రూ.80 లక్షలు..బిగ్‌బాస్ చరిత్రలో అత్యధికంగా సంపాదించింది ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
