కూరగాయల మార్కెట్ భవనానికి మాజీ ఎమ్మెల్యే మల్లేష్ పేరు పెట్టాలి
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన కూరగాయల సముదాయానికి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ నామకరణం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కి నాయకులు మెమోరాండం అందజేశారు. బెల్లంపల్లి అభివృద్ధి కొరకు తన జీవితాంతం కృషిచేసిన గుండ మల్లేష్ పేరు పెట్టడమే సరైన నిర్ణయం అన్నారు. అప్పుడే పట్టణ ప్రజలు హర్షిస్తారని పేర్కొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
ఉదయాన్నే హై-ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ తింటే ఏం జరుగుతుందో తెలుసా? కాలిఫోర్నియా బాదంపై న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కీలక సీక్రెట్స్!
Hyderabad, Telangana:California Almonds Breakfast Benefits: ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్లో కొంతమంది ఫిట్‌నెస్‌కు దూరమవుతున్నారు.. అలాగే ఏది దొరికితే అది తినేయాలనే ధోరణి కూడా పెరిగింది. అయితే, ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుండి రాత్రి డిన్నర్ వరకు సరైన పోషకాలు, ఖనిజాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా మనం ఉదయం తీసుకునే ఆహారం ఆ రోజంతా మన శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే, రానురాను చాలామంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచుకుంటూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మన జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరైన పోషకాహారంతో రోజును ప్రారంభించడం ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా కడుపు ఖాళీగా ఉండటం వల్ల, రోజంతా అవసరమైన శక్తి లభించాలంటే ప్రోటీన్ అధికంగా ఉండే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌ను ఎంచుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాకుండా, ప్రోటీన్ కణజాలాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు.. తద్వారా అతిగా తినకుండా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీనివల్ల అనారోగ్యకరమైన ఆహారం తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఆరోగ్యంపై ప్రాధాన్యత చూపడం చాలా ముఖ్యం, లేదంటే తప్పుడు ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. కార్బోహైడ్రేట్లతో పాటు ప్రోటీన్ ఉండే ఆహారాన్ని ఉదయం అల్పాహారంలో చేర్చుకుంటే రోజంతా శక్తి లభిస్తుంది. కండరాల నిర్మాణం కూడా బాగుంటుంది. ఇటువంటి చిన్న మార్పులే దీర్ఘకాలిక ఆరోగ్యానికి దోహదపడతాయని న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి పేర్కొంటున్నారు.
ప్రోటీన్ ప్రధానంగా గింజలు, విత్తనాలు, పాల ఉత్పత్తులు, కొన్ని రకాల పప్పు ధాన్యాలలో పుష్కలంగా ఉంటుంది. బాదం పప్పులో కూడా ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. ముఖ్యంగా కాలిఫోర్నియా బాదంపప్పు ప్రోటీన్‌తో పాటు ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ, మొత్తం 24 రకాల పోషకాలను అందిస్తుంది. ఈ బాదంపప్పును నేరుగా తినవచ్చు, నానబెట్టి తీసుకోవచ్చు లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో కలిపి స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు.
Also Read: ఒత్తుగా, పట్టులాంటి జుట్టు కోసం మందార పూల షాంపూ.. సింపుల్ స్టెప్స్‌లో ఇంట్లోనే తయారు చేసుకోండి!
Also Read: కోడిగుడ్డు ఇలా తింటేనే విటమిన్ డి పూర్తిగా అందుతుందట! డైటీషియన్లు చెప్పే అసలు రహస్యం ఇదే!
బ్రేక్‌ఫాస్ట్, దీర్ఘకాలిక ఆరోగ్యం గురించి నటి సోహ అలీఖాన్ కూడా మాట్లాడారు. మనం ఉదయం తీసుకునే ఆహారమే రోజంతా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని, కాబట్టి అల్పాహారం సమతుల్యంగా ఉండాలని ఆమె చెప్పారు. కాలిఫోర్నియా బాదంపప్పు పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల అది తన బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనం కోసం పెద్దగా మార్పులు అవసరం లేదని, చిన్నపాటి స్థిరమైన అలవాట్లను పెంపొందించుకుంటే సరిపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
అందుకే మనం ప్రతిరోజూ తీసుకునే అల్పాహారం పోషకయుక్తంగా ఉండేలా చూసుకోవాలి. కాలిఫోర్నియా బాదంపప్పును పోహా లేదా ఉప్మాలో కూడా కలిపి తీసుకోవచ్చు. అలాగే పరాటాల్లో కూడా వీటిని చేర్చుకోవడం ద్వారా రోజంతా కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. దీనివల్ల ఆకలి త్వరగా వేయదు, అనవసరంగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా ఉంటారు. రోజంతా కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రోడ్డుపై ఉన్న యువతిని వేధించి వ్యక్తి.. ఆ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం చేసిందో తెలుసా?
Hyderabad, Telangana:IT రాజధాని బెంగళూరులో మహిళల రక్షణపై మళ్లీ ప్రశ్నలు రేకెత్తించేలా.. ఒక ఊహించని ఘటన వెలుగు చూసింది. నగరంలోని రామమూర్తి నగర్ ప్రాంతంలో క్యాబ్ కోసం వేచి చూస్తున్న ఓ మహిళ పట్ల ఒక వ్యక్తి తీవ్రంగా అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే, ఆ ఆకతాయి చేష్టలకు భయపడిపోకుండా.. ఆ యువతి చూపించిన సమయస్ఫూర్తి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగింది?
రామమూర్తి నగర్‌లోని ప్రధాన రహదారిపై ఒక యువతి తన ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ కోసం వేచి చూస్తోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి.. ఆమెతో వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు... అంతటితో ఆగకుండా అత్యంత బూతు పదజాలాన్ని ఉపయోగిస్తూ.. ఆమెను మానసికంగా వేధించేందుకు యత్నించాడు.
సదరు యువతి ఆ ఘటనతో కంగారు పడకుండా.. వెంటనే తన స్మార్ట్‌ఫోన్ తీసి ఆ వ్యక్తి చేస్తున్న చేష్టలను, అసభ్య పదజాలాన్ని రికార్డ్ చేసింది. పోకిరీ ఆకతాయి తనను బెదిరిస్తున్నప్పటికీ.. ధైర్యంగా నిలబడి వీడియోలు తీసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్..
తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని, సదరు వ్యక్తి ప్రవర్తనను సమాజానికి తెలియజేసేందుకు బాధితురాలు ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మహిళలకు బహిరంగ ప్రదేశాల్లో రక్షణ ఏది? అనే ప్రశ్నిస్తూ ఆ వీడియోను షేర్ చేయడంతో.. అది కొన్ని గంటల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ యువతి ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నగర పోలీసుల దృష్టికి వెళ్లింది.. అధికారులు తక్షణమే స్పందించారు. రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్లో సదరు వ్యక్తిపై వివిధ సెక్షన్ల కింద కేసు (FIR) నమోదు చేశారు. వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి.. అత్యంత వేగంగా అదుపులోకి తీసుకున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మహిళల పట్ల ఇలా వేధింపులకు పాల్పడితే సహించేది లేదని.. నిందితుడిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ తరహా ఘటనలు ఎదురైనప్పుడు మహిళలు భయపడకుండా వెంటనే హెల్ప్‌లైన్ నంబర్లకు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. మహిళల భద్రతపై ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన శిక్షలతో పాటు సమాజంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం.. యువతను ప్రేరేపిస్తున్న పర్యావరణవేత్త సత్యం దీక్షిత్ స్ఫూర్తిదాయక ప్రయాణం!
Hyderabad, Telangana:World Nature Conservation Day: తన జీవితంలో ఎదురైన అనేక వ్యక్తిగత సంక్షోభాలను , కష్టాలను కూడా పక్కన పెట్టి, కేవలం పర్యావరణ పరిరక్షణ అనే ఉన్నతమైన ధ్యేయంతోనే ఆయన తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై పూర్తి వివరాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ తాము కూడా కృషి చేయాలని కోరుకుంటారు.. కానీ అందులో కేవలం కొంతమంది మాత్రమే ఆ మాటలను ఆచరణలో పెడతారు. అయితే, ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సత్యం దీక్షిత్ అసాధారణ జీవిత ప్రయాణం గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేము నిర్వహిస్తున్న ప్రత్యేక సిరీస్ ద్వారా ఈయన అద్భుతమైన కథను మన ముందుకు తీసుకువస్తున్నాం.
సత్యం ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పెరిగారు. ఆయన తండ్రి జీవనోపాధి కోసం రిక్షా నడిపేవాడు, ఆ తర్వాత సెక్యూరిటీ గార్డుగా కూడా పనిచేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే ఎన్నో ఆర్థిక ఇబ్బందులను, కష్టాలను స్వయంగా అనుభవించారు. తన చదువును పూర్తి చేసుకోవడమే కాకుండా, కుటుంబాన్ని పోషించడానికి పాఠశాలల్లో మోమోలు అమ్ముతూ, కళాశాల రోజుల్లో డెలివరీ బాయ్‌గా కూడా పని చేస్తూ ఎంతో శ్రమించారు. కోవిడ్ మహమ్మారి కాలం సత్యం జీవితంలో ఒక అత్యంత కీలకమైన మలుపుగా నిలిచింది. ఆ క్లిష్ట సమయంలోనే యూపీఎస్సీ పరీక్షలకు ఎలాగైనా సన్నద్ధం కావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన తన నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడమే కాకుండా, అదే సమయంలో పర్యావరణ పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా తన కార్యక్రమాలను ప్రారంభించారు. 'మై ఎర్త్.. మై డ్యూటీ' ద్వారా ఆయన అనేక మంది ప్రజలలో మార్పును తీసుకురాగలిగారు.
కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తలతో కలిసి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమం, నేడు సుమారు 200 నగరాలకు విస్తరించిన ఒక పెద్ద ఉద్యమంగా రూపాంతరం చెందింది. వీరు బహిరంగ ప్రదేశాలలో, నది తీర ప్రాంతాలలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, పర్యావరణానికి హాని చేసే పెద్ద ఎత్తున వ్యర్థాలను కూడా సమర్థవంతంగా తొలగిస్తున్నారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, మతపరమైన ప్రదేశాలలో పేరుకుపోయిన వ్యర్థాలను పునర్వినియోగం చేయడం, సామాజిక భాగస్వామ్యం ద్వారా పౌరులు తమ పరిసరాల పట్ల బాధ్యతగా ఉండేలా ప్రోత్సహించడం వంటి అనేక కీలకమైన పనులను వీరు చేపడుతున్నారు. ఈ విధంగా సత్యం దీక్షిత్ తన ప్రగాఢమైన విశ్వాసంతో సమాజంలోని ఎంతో మందికి గొప్ప స్ఫూర్తినిస్తున్నారు.
Also Read: ట్రైన్లో ఖాళీ సీట్లు ఎలా చూడాలో తెలుసా? IRCTC యాప్‌లో సులభమైన ప్రాసెస్ ఇదిగో!
Also Read: ఇకపై క్షణాల్లో తత్కాల్ టికెట్ బుకింగ్.. ఐఆర్సీటీసీ తెచ్చిన ఆ 5 కొత్త ఫీచర్లు ఇవే!
ఆయన చేస్తున్న 'నా భూమి - నా కర్తవ్యం' అనే ప్రచారం, సందేశం ఆయన తపనను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. ఆయన చేసే పని కేవలం చెత్త సేకరణకు మాత్రమే పరిమితం కాలేదు.. ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చడం, పర్యావరణం పట్ల అవగాహన పెంచడం, ప్రతి పౌరుడు తన పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా వారిని శక్తివంతం చేయడమే ఈ సంఘం ప్రధాన ఉద్దేశ్యం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
చంకలో పాప.. చేతిలో కల్యాణలక్ష్మి చెక్కు.. వైరల్ అవుతున్న వీడియో..
Hyderabad, Telangana:Kalyana Lakshmi Scheme Delay News: పెళ్లయిన కొత్తలో.. పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఆ కొత్తపెళ్లికూతురి కళ్లలో ఎన్నో ఆశలు. ప్రభుత్వం ఇచ్చే కల్యాణలక్ష్మి ఆర్థిక సాయం అందుతుంది.. తమ కొత్త కాపురానికి ఆసరాగా నిలుస్తుంది.. అని భావించింది. కానీ, నెలలు గడిచాయి.. కాలం మారింది.. ప్రభుత్వాలు మారాయి.. చివరికి ఆమె కడుపున ఒక ప్రాణం ఊపిరి పోసుకొని.. పండంటి పాపలా కూడా జన్మించింది. బిడ్డ పుట్టిన తర్వాత గానీ ఆ పేద తల్లికి కల్యాణలక్ష్మి చెక్కు చేతికందలేదు..
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం భీంపూర్ మండల కేంద్రంలో గురువారం నాడు చోటుచేసుకున్న ఈ ఘటన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరుకు అద్దం పడుతోంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక BRS ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఒక లబ్ధిదారురాలు తన చంకలో కొన్ని నెలల పసిపాపను పట్టుకుని.. ఎంతో ఆశగా చెక్కు కోసం క్యూలైన్ లో నిలబడటం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది..
ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయిన MLA అనిల్ జాదవ్.. స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లారు. ఎంతో ఆప్యాయంగా ఆ పసికందును కూడా చంకన ఎత్తుకుని.. తల్లిని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తల్లి చేతికి కల్యాణలక్ష్మి చెక్కును అందజేస్తూ.. అక్కా.. పెళ్లి సమయానికి అందాల్సిన సాయం, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బిడ్డ పుట్టేదాకా ఆలస్యమైంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వైఫల్యంపై మండిపడ్డ లబ్ధిదారులు..
BRS ప్రభుత్వ హయాంలో KCR తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు ఎంతో ఆసరాగా నిలిచిందని.. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో లబ్ధిదారులకు చెక్కులు అందక నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విమర్శించారు. పెళ్లి ఖర్చుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని.. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Jantar Mantar Protest: జంతర్ మంతర్ నిరసనల్లో 2,873 మంది నేరస్థులు?
Hyderabad, Telangana:Jantar Mantar Protest Latest News: జంతర్ మంతర్ వద్ద జరుగిన నిరసనల వెనుక ఆశ్చర్యం కలిగించే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హక్కుల కోసం, న్యాయం కోసం సాగిన ఆందోళనల ముసుగులో నేర చరిత్ర ఉన్న శక్తులు చొరబడ్డాయా అనే అనుమానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. జూలై 20 నుంచి 25 మధ్య జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్లో ఏకంగా 2,873 మంది పాత నేరస్థులు ఆందోళనలు సృష్టించిన్నట్లు ఢిల్లీ పోలీసులు సాంకేతిక ఆధారాలతో సహా సంచలన ప్రకటన చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో..
అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)తో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేపట్టిన విస్తృత పరిశీలనలో ఈ భయాందోళనకర విషయాలు బయటపడ్డాయి. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం.. అక్కడ గుర్తించిన వారిలో ఏకంగా 989 మంది తీవ్రమైన నేరాల్లో (Heinous Offences) నిందితులుగా ఉన్నారు. హత్యలు, హత్యాయత్నాలు, దారిదోపిడీలు, అత్యాచారాలు, కిడ్నాప్లతో పాటు ఆర్మ్స్ యాక్ట్ వంటి కేసులలో వీరికి సుదీర్ఘ నేర చరిత్ర ఉన్నట్లు వెల్లడైంది. మరికొందరు అలవాటుపడిన నేరస్థులుగా (Habitual Offenders) నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
రచ్చకెక్కిన హింస..
నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న రాళ్లదాడి, ఖాకీ డ్రెస్సులో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడులు, ప్రభుత్వ వాహనాల ధ్వంసంతో పాటు భద్రతా బారికేడ్లను బద్దలు కొట్టిన ఉదంతాల వెనుక ఈ క్రిమినల్ మూకల హస్తం ఉందా అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ లోతుగా విచారణ చెపడుతున్నట్లు తెలుస్తోంది.. అయితే, ఒక వ్యక్తి కేవలం నిరసన స్థలంలో ఉన్నంత మాత్రాన అతనికి హింసతో సంబంధం ఉందని తేల్చలేమని.. ప్రతి ఒక్కరిపై ప్రాథమిక విచారణ తర్వాతే.. పోలీసులు స్పష్టం చేశారని తెలిపారు..
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఈ పరిణామాలు ఒకవైపు శాంతిభద్రతల ముప్పును ఎత్తిచూపుతుంటే.. మరోవైపు సరికొత్త చట్టపరమైన వివాదానికి తెరలేపాయి. నిరసన ప్రదర్శనల్లో పౌరులపై నిఘా పెట్టేందుకు ఫేషియల్ రికగ్నిషన్ వంటి ప్రైవేట్ సాంకేతికతను వాడటం రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ (Privacy Rights)ను భంగపరచడమేనంటూ హక్కుల సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ప్రజాస్వామ్యయుత నిరసనల్లో నేరస్థుల చొరబాటు ఎంతటి ప్రమాదకరమో.. సాంకేతికత పేరిట సాధారణ పౌరుల స్వేచ్ఛను అణచివేయడం కూడా అంతే ప్రమాదకరమని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Shani Vakri: మీన రాశిలో శని వక్రీకరణ.. డిసెంబర్ 11 వరకు ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం!
Hyderabad, Telangana:Saturn Retrograde In Pisces: జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడికి అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. మానవులు చేసే కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదించే న్యాయాధిపతిగా, కర్మఫలదాతగా కూడా శనిదేవుడిని ఆరాధిస్తారు. ఇదిలా ఉంటే జూలై 27 నుంచి మీన రాశిలో శనిదేవుడు తిరోగమనం స్థితిలోకి ప్రవేశించాడు. ఈ తిరోగమన గ్రహ సంచారం ఈ ఏడాది డిసెంబర్ 11 వరకు దాదాపు నాలుగున్నర నెలల పాటు తిరోగమనంలోనే ఉంటాడు..శని భగవానుడి ఈ సమయంలో ద్వాదశ రాశులన్నింటిపైనా ప్రభావం చూపుతాడు. ప్రధానంగా 4 రాశుల జాతకులకు మాత్రం ఈ సమయం అత్యంత శుభప్రదంగా.. అదృష్టాన్ని తెచ్చిపెట్టేలా ఉంటుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. ఈ కాలంలో ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కెరీర్లో గొప్ప సానుకూల మార్పులు చోటుచేసుకోనున్నాయి.
శని వక్రీతో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి..
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారికి శనిదేవుడు 5వ, 6వ స్థానాలకు అధిపతిగా భావిస్తారు. శని తిరోగమనం వల్ల వీరికి సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు లభించడమే కాకుండా ప్రమోషన్ కూడా సులభంగా కలుగుతాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు సమకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. పాత ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి.. దాంపత్య జీవితంలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మకర రాశి (Capricorn)
శని సొంత రాశి అయిన మకర రాశి వారికి ఈ తిరోగమనం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు కూడా సులభంగా కుదురుతాయి. అంతేకాకుండా నూతన ఆర్డర్లు కూడా లభిస్తాయి.. సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా సులభంగా లభిస్తుంది. కుటుంబంలో శాంతి కూడా లభిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి అనేక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
తులా రాశి (Libra)
తులా రాశి వారికి శనిదేవుడి శుభ దృష్టి వల్ల ఎన్నో రోజులుగా వేధిస్తున్న మానసిక ఒత్తిడులు, ఆందోళనలు తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు, విద్యార్థులకు శుభవార్తలు వింటారు. నూతన ఆస్తులు, స్థలాలు లేదా వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంది. పొదుపు పెరిగి ఆర్థికంగా నిలకడ సాధిస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి శని వక్రీ ప్రభావంతో అద్భుతమైన ఫలాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన లేదా మొండి బాకీల రూపంలో ఉన్న డబ్బు తిరిగి చేతికి అందుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పైఅధికారుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అంతేకాకుండా మెరుగైన వేతనంతో కూడిన నూతన ఉద్యోగావకాశాలు కూడా సులభంగా పొందుతారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Bhogapuram Airport: అదిరిపోయిన భోగాపురం ఎయిర్పోర్ట్ విజువల్స్
Gudepuvalasa, Andhra Pradesh:Watch Visuals Of Bhogapuram Airport Video At Vizag PM Modi Will Launch On August 1stTDP MLC: ఎమ్మెల్సీ కోసం 20 మంది పోటీ.. చంద్రబాబు ఛాయిస్ వీళ్లే!
Kanagumakulapalli, Andhra Pradesh:TDP Chief Chandrababu Exercise Governer Quota MLC Candidates In TDP Know The DetailsJeevan Reddy: రైతులకు సాగునీటి కోసం అధికారులకు జీవన్ రెడ్డి ఫోన్‌కాల్
Jagtial, Telangana:Former Minister T Jeevan Reddy Phone Call To Officials For Farmers Issue Watchడీఈ, ఎస్ఈలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫోన్.. ఖరీఫ్ పంటలను కాపాడాలని విజ్ఞప్తి
Jagtial, Telangana:BRS Party: ఎత్తిపోతల మోటర్లు మరమ్మతు చేపట్టి వెంటనే ఖరీఫ్ పంటకు నీరు అందించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. కొల్వాయి ఆరేపల్లిలో మోటార్లు మరమ్మతు చేయించాలని.. ఏడాదికాలంగా మరమ్మతులు చేపట్టడం లేదని తెలిపారు. అధికారులు అంచనాలు రూపొందించేది ఎప్పుడు నీళ్లు అందించేది ఎప్పుడు అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
బీర్పూర్ మండలం కొల్వాయి ఎత్తిపోతల పథకాన్ని సోమవారం రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి సందర్శించారు. అక్కడ కాలిపోయిన మోటార్లను పరిశీలించారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో నీళ్లు అందక సాగు చేయడం లేదని రైతులు జీవన్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ డీఈ, ఎస్ఈలతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫోన్లు చేసి మాట్లాడారు. సాగునీరు కోసం వెంటనే మోటార్లు ఆన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
'రైతుల అదృష్టం కొద్ది కాలువలో నీళ్లు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకునేందుకు మోటర్లు మరమ్మతు చేపట్టి పంపులు వినియోగించాలి. కొల్వాయి, ఆరేపల్లిలో పంపుసెట్లు నిలిచిపోయి ఏడాది గడుస్తుంది. రేకులపల్లెలో పంపుసెట్టు నిలిచిపోయింది. కమ్మనూరులో ట్రాన్స్ఫార్మర్ లేక పంపుసెట్టు వినియోగం కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. మంగేలలో ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్మెంట్ నేటికి రాలేదు. ఈనెల 31వ తేదీలోగా మోటార్ల మరమ్మతు, ట్రాన్స్ఫార్మర్ల రీప్లేస్మెంట్ చేస్తే ఖరీఫ్ పంట సాగు చేసుకునే అవకాశం ఉంది' అని అధికారులతో ఫోన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వివరించారు.
ఆగస్టు ఒకటో తేదీ నాటికి పంపుసెట్లు సిద్ధం చేయాలని.. లేకపోతే నీళ్లు ఉండి కూడా పంటలు ఎండిపోవడానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని అధికారులకు ఫోన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి హెచ్చరించారు. నీళ్లు ఉండి కూడా పంటలు పండించుకోలేని దుస్థితి రాకుండా చూడాలని కోరారు. అన్ని పంపు సెట్లు వినియోగంలో తీసుకువచ్చి ఖరీఫ్ పంటకు నీరు అందించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనావేసేందుకు అధికారులు పంపుసెట్లు పరిశీలించాలని అధికారులకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి సూచించారు.
31 లోగా కమ్మనూరు మంగల పంపు చెట్ల ద్వారా నీరు అందించాలి.
కుల్వాయి, ఆరేపల్లిలో ప్రధాన సమస్య పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని అధికారులకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూచించారు. మరమ్మతులకు డబ్బులు లేవని మాత్రం చెప్పొద్దన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది అని చెబితే రైతులే మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. బీర్పూర్లో నిలిచిపోయిన పంపుసెట్లు అన్ని ప్రారంభించాలని లేకపోతే రైతులు ప్రజావాణి ఎదుట కూర్చుంటారని హెచ్చరించారు. 'కొల్వాయి, ఆరేపల్లి లో మూడు పంపులు పనిచేయడం లేదు. రైతుల సమస్య అర్థం చేసుకోండి. సమయానికి నీళ్లు ఇవ్వకపోతే ఖరీఫ్ సాగు ఎట్లా సాధ్యమవుతుంది. సీజన్ పోయిన తర్వాత మరమ్మతులు చేయిస్తే లాభం ఏముంది. పంట సాగు చేపట్టకపోతే మీరే బాధ్యత వహించాలి' అని అధికారులను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి హెచ్చరక చేశారు.
Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం ఆస్పత్రికి వచ్చిన కేసీఆర్
Hyderabad, Telangana:Telangana First CM KCR Back With Peddi Sudarshan Reddy Family Watch VideoKCR: పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన కేసీఆర్
Hyderabad, Telangana:MLC Aspirants: గవర్నర్ కోటాకు టీడీపీలో తీవ్ర పోటీ.. 20 ఆశావహుల్లో ఎవరికీ అదృష్టం వరించునో..?
Nuzendla, Andhra Pradesh:TDP Governor Quota MLC: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పదవుల జాతర జరగనుంది. శాసనమండలిలో జూలై 28వ తేదీ నాటికి రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు టీడీపీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీలు పండుల రవీంద్ర బాబు, జకీయా ఖనుమ్ పదవీ కాలం ముగియనుండగా.. ఆ రెండు స్థానాలతోపాటు గవర్నర్ కోటాలో మరో రెండు స్థానాలు భర్తీ కానున్నాయి. భర్తీ కానున్న నాలుగు పదవుల్లో రెండు స్థానాలు టీడీపీకి దక్కనున్నాయి. పదవీకాలం ముగుస్తున్న జకీయా ఖనుమ్ వైఎస్సార్సీపీ నుంచి బీజేపీలో చేరడంతో మరోసారి అవకాశం లభించే ఛాన్స్ ఉంది. మిగిలిన మూడింటిలో జనసేన పార్టీకి ఒకటి దక్కనుండగా.. మిగిలిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి దక్కనున్నాయి. ఈ ఎమ్మెల్సీ పదవి కోసం తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. రేసులో మోపిదేవి వెంకట రమణా రావు, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, వర్ల రామయ్య, శ్రీనివాసులురెడ్డి, పనబాక లక్ష్మి తదితరులు ఉన్నారు.
చంద్రబాబు తీవ్ర కసరత్తు
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రెండు స్థానాల కోసం రేసులో 20 మందికి పైగా ఆశావహులు ఉన్నారు. అభ్యర్థులను నేడో రేపో ప్రకటించాల్సి ఉండడంతో ఎవరికి అవకాశం దక్కుతుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ రెండు స్థానాల్ని భర్తీ చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. సామాజిక, రాజకీయ, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి తీవ్ర పోటీ
గతంలో సీట్లు త్యాగం చేసిన వారు.. రాజ్యసభ ఛాన్స్ మిస్సయిన సీనియర్లు అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు తమ వినతులు చెప్పుకున్నారు. అయితే ఆశావహుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకుల జాబితా పెద్దగానే ఉంది. కృష్ణా జిల్లా నుంచి రేసులో వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధా, టీడీ జనార్దన్, గొట్టిపాటి రామకృష్ణ, బుద్ధా వెంకన్న ఉన్నారు.
ఒకటి రాయలసీమకు
గోదావరి జిల్లా నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మంతెన సత్యనారాయణరాజు మరోసారి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. రెండింటిలో ఒక సీటు రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకులకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అలా అయితే రాయలసీమ నుంచి రేసులో రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, తిప్పేస్వామి, బీటెక్ రవి, ప్రభాకర్ చౌదరి ఉన్నారు. దివ్యాంగుల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఈసారి తనకు అవకాశం లభిస్తుందని గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు విశ్వాసంతో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
బ్రాహ్మణ కోటాలో..
ఎమ్మెల్సీ పదవి కోసం బ్రాహ్మణ కోటాలో సీనియర్ నాయకుడు ఏవీ రమణ పోటీపడుతుండగా.. తనకు అవకాశం కల్పించాలని ఆయన ఇప్పటికే పార్టీ అధిష్టానానికి మొరపెట్టుకున్నారు. ఇక డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, మోపిదేవి వెంకట రమణా రావు, కొమ్మాలపాటి శ్రీధర్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మంగళగిరి సీనియర్ నాయకుడు పోతినేని శ్రీనివాసరావు కూడా ఎమ్మెల్సీ పదవి రేసులో ఉన్నారు. నేడో రేపో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు చేయనుంది. చివరి వరకు తమకు అవకాశం దక్కేలా ఆశావహులు లాబీయింగ్ చేస్తున్నారు. మరి ఎవరినీ అదృష్టం వరిస్తుందనేది ఉత్కంఠ నెలకొంది.
KCR: 'మా పెద్దిని కాపాడండి'.. వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన మాజీ సీఎం కేసీఆర్
Hyderabad, Telangana:KCR With Doctors: తన వెన్నంటి ఉంటూ వచ్చిన తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి వచ్చి వైద్యులను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. చేతులెత్తి నమస్కరించి మా పెద్దిని కాపాడాలని కోరారు. ఏం చేస్తారో చేయండి కానీ పెద్ది సుదర్శన్ రెడ్డిని బతికించాలని కేసీఆర్ వైద్యులకు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పార్టీ నాయకత్వానికి ఆదేశాలు
తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న గుండెపోటుకు గురవగా.. వరంగల్ నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. పెద్ది గుండెపోటుకు గురయ్యాడనే సమాచారం తెలుసుకున్న నాటి నుంచి కేసీఆర్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు పెద్దికి అందించే వైద్య చికిత్సపై పార్టీ నాయకత్వానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం యశోద ఆస్పత్రికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చారు.
'దేవుడున్నాడు, డాక్టర్లున్నారు'
పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందుతున్న ఐసీయూ వార్డుకు చేరుకొని వైద్యులతో కలిసి అక్కడ పెద్దికి అందుతున్న చికిత్స విధానాన్ని పరిశీలించారు. దాదాపు అరగంట సేపు అక్కడే నిలుచుని డాక్టర్లతో చికిత్స అందుతున్న తీరును గురించి ఆరా తీశారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసిన అనంతరం వైద్యులతో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఏం చేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి అని విజ్ఞప్తి చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా వైద్యులకు చేతులెత్తి కేసీఆర్ నమస్కరించారు. 'దేవుడున్నాడు, డాక్టర్లున్నారు. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. గుండె చెదురొద్దు ధైర్యంగా ఉండండి' ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యాపిల్లలు, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
♦️ ఎంజేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి
- వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు♦️ దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. గుండె చెదరొద్దు ధైర్యంగా ఉండండి
- పెద్ది భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేసీఆర్ గారు.… pic.twitter.com/T5iJ9ooiAF
— BRS Party (@BRSparty) July 27, 2026
మరో 48 గంటలు సమయం
పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న అత్యున్నత చికిత్సపై గులాబీ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. ప్రపంచ స్థాయి అత్యుత్తమ చికిత్స అందుతున్నదని వైద్యులు తెలిపారు. పూర్తిస్థాయి సమాచారం ఇవ్వడానికి మరో 48 గంటలు పడుతుందని డాక్టర్లు చెప్పారు. అవసరమైన మేరకు విదేశాల నుంచి కూడా డాక్టర్లతో కన్సల్టెన్సీ తీసుకుంటున్నట్లు డాక్టర్లు వివరించారు. గుండె, ఊపిరితిత్తులు మిగతా అవయవాలు అన్నీ పనిచేస్తున్నాయని కాకపోతే.. కొంత బ్రెయిన్ ఇంకా పునరుత్తేజం చెందాల్సి ఉందని.. దీనికి మరో 48 గంటలు సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు మాజీ సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో.. స్పష్టమైన నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు. ఖర్చుకు వెనకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. pic.twitter.com/hBPRH7iZIO
— KTR News (@KTR_News) July 27, 2026
అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యవస్థలతో, సీనియర్ డాక్టర్లతో చికిత్సను అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ఎంఆర్ఐ తదితర అవసరమైన పరీక్షలు చేస్తూ డాక్టర్ల బృందం సమావేశమవుతూ నిర్ణయాలు తీసుకుంటూ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేలా అత్యున్నత చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని యశోద ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, ఎండీ ఏఎస్ రావు జేఎస్ రావు వివరించారు.
అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబసభ్యుల వద్దకు చేరుకున్న కేసీఆర్ వారికి భరోసా.. ధైర్యాన్ని అందించారు. వైద్యుల కృషితో, దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదంతో పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకుంటాడని కేసీఆర్ విశ్వాసాన్ని ప్రకటించారు. ఆందోళన చెందవద్దని భార్యాపిల్లలకు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి గుండె ధైర్యం నింపారు. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు.
గులాబీ నేతలు ఆస్పత్రిలో మకాం
పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం ఆస్పత్రిలో ఉండడం విశేషం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజయ్య, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మారావు గౌడ్, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు గ్యాదరి బాలమల్లు, సతీశ్ రెడ్డి, రజినీ సాయిచంద్, పల్లె రవికుమార్, రాజాం యాదవ్, వాసుదేవరెడ్డి, గజ్జెల నగేష్, చిరుమల్ల రాకేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
