అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపించిన రెవెన్యూ అధికారులు
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారు సర్వే నంబర్ 112లో బీఆర్ఎస్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను మంగళవారం మధ్యాహ్నం 1:30 సమయంలో బెల్లంపల్లి తహసిల్దార్ జ్యోత్స్న ఆదేశాలతో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఆదిలక్ష్మి ,మురళీధర్ లు బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో కూల్చివేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
EPFO కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగికి రూ.7500 పెన్షన్ వస్తుందా?
Hyderabad, Telangana:Epfo Pension Rules News: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ భవిష్యత్తుకు ఒక పెద్ద భరోసా.. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు ఈపీఎఫ్ డబ్బులు, పెన్షన్ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈపీఎఫ్ పెన్షన్ నిబంధనల EPS-95 గురించి చాలామందికి పూర్తి అవగాహన లేకపోయింది.. ముఖ్యంగా ఎవరైతే తమ ఉద్యోగంలో దాదాపు 20 ఏళ్ల తరబడి సర్వీస్ పూర్తి చేస్తారో.. వారికి ఈపీఎఫ్ఓ ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని అందిస్తోంది.. అయితే, ఈ రూల్ గురించి ప్రతి ఒక్క ఉద్యోగి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
రెండేళ్ల బోనస్..
ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ నిబంధనల ప్రకారం.. ఒక ఉద్యోగి కనీసం 10 ఏళ్లు పనిచేస్తేనే నెల వారికి పెన్షన్ పొందడానికి అర్హత సాధిస్తూ ఉంటాడు. ఈ పెన్షన్ ఉద్యోగికి 58 ఏళ్లు నిండిన తర్వాత రావడం ప్రారంభమవుతుంది.. అయితే, ఎవరైతే తమ కెరీర్లు 20 ఏళ్ల సర్వీస్‌ను విజయవంతంగా పూర్తి చేస్తారో.. వారికి ఈపీఎఫ్‌వో రెండేళ్ల బోనస్ వెయిటేజీని అందిస్తోంది. అంటే మీరు 20 ఏళ్లు పనిచేస్తే.. మీ పెన్షన్ లెక్కించేటప్పుడు మీ సర్వీస్‌ను 22 ఏళ్లుగా పరిగణలోకి తీసుకుంటారని ఈపీఎఫ్ఓ చెబుతోంది.. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత మీకు వచ్చే నెల వారి పెన్షన్ మొత్తం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
20 ఏళ్లు పూర్తి చేస్తే కచ్చితంగా రూ.7,500 పెన్షన్ వస్తుందా?.. లాంటి సోషల్ మీడియాలో వదంతులు నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మీ సర్వీస్ పాత కొత్త నిబంధనలు.. మీ బేసిక్ జీతం ఆధారంగా తీసుకొని పెన్షన్ వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. EPFOలో ఉండే పెన్షన్ క్యాలిక్యులేటర్లు కేవలం ఒక అంచనాను మాత్రమే ఇస్తాయని గమనించాల్సిన అవసరం ఎంతగానో ఉందని నిపుణులు చెబుతున్నారు..
ఉద్యోగులు ఎప్పటికప్పుడు తమ UAN ద్వారా ఈపీఎఫ్ఓ పోర్టల్ లో లాగిన్ అయి తమ పాసుబుక్ తో పాటు.. సర్వీస్ హిస్టరీని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మారిన అన్ని కంపెనీల సర్వీస్ రికార్డులు ఒకే ఖాతాకు Merge ఉన్నాయా? లేదా సింగిల్ గా ఉన్నాయా అని చూసుకోవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఇలా ఉంటేనే 20 ఏళ్ల సర్వీస్ బోనస్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా పొందగలుగుతారు. అలాగే పిఎఫ్ ఖాతా ల పేర్లతో వచ్చే నకిలీ కాల్స్‌తో పాటు OTP అడిగే మోసగాళ్లపట్ల కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
భార్య ప్రైవేట్ వీడియోలు తీసి పో**ర్న్ సైట్లకు అమ్మేసిన సైకో భర్త !
Hyderabad, Telangana:Kerala Psycho Husband Arrested News: పవిత్రమైన భార్య భర్తల బంధానికి మచ్చ తెచ్చే అత్యంత ధారణమైన ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది.. రక్షణగా ఉండాల్సిన భర్తీ కీచకుడిగా మారి.. తన సొంత భార్యతో పడక గదిలో చేసిన పనులను వీడియోలుగా చిత్రీకరించి పోర్న్ సైట్లకు అమ్ముకున్నాడు. అంతటితో ఆగకుండా.. భార్యను వేరే అబ్బాయితో గడపాలని బలవంతం చేయడమే కాకుండా.. కన్న కూతురి ముందు వికృతి చేష్టలకు పాల్పడిన ఓ సైకో భర్తను పోలీసులు అరెస్టు చేశారు..
పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. కేరళలోని మయ్యనాడుకు చెందిన ఓ 31 ఏళ్ల యువకుడు.. పదేళ్లపాటు ప్రేమించుకున్న యువతిని ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.. వీరికి నాలుగేళ్ల పాప ఉంది.. గత నాలుగేళ్లుగా ఈ కుటుంబం బ్రిటన్ లోని నివాసం ఉంటోంది. అయితే.. ఇంజనీరింగ్ మధ్యలోనే ఆపేసిన ఈ నిందితుడు మొదటినుంచి పోర్న్ వీడియోలకు బానిస అయ్యాడు.. భార్యకు తెలియకుండా పడకగదిలో.. స్నానం చేసే క్రమంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆమె వీడియోలను చిత్రీకరించాడు. వాటిని యూకే లోని పాలు అశ్లీల వెబ్సైట్లకు విక్రయించి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. ఈ దారుణం గురించి పోర్న్ వెబ్సైట్లో వీడియోలు చూసిన బాధితురాలు స్నేహితులు ఆమెకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది..
భర్త చేసిన దారుణం తెలుసుకున్న ఆ ఇల్లాలు కన్నీరు మున్నీరయింది.. అయినా సంసారాన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో ఆగస్టు 14న భర్తను తీసుకొని కేరళలోని కొల్లంకు తిరిగి వచ్చింది.. భర్త మానసిక స్థితి మారాలని అతనికి మూడు రోజులపాటు సైకియాట్రిస్ట్‌తో ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ప్రక్రియను కూడా ఇపించింది. కానీ అతడిలో ఎలాంటి మార్పు రాలేదు.. పైగా ఇతర పురుషులతో పడుకోవాలని భార్యను టార్చర్ చేయడం మొదలుపెట్టాడట.. తాను స్వాతంత్రంగా బతకాలనుకుంటున్నానని.. దానికి అంగీకరించకపోవడంతో విచక్షణారహితంగా దాడి చేశాడట..
కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత కూడా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదట.. ఏకంగా నాలుగేళ్ల కూతురి ముందే తన లైంగిక వికృత చేస్తాలన్న ప్రదర్శిస్తూ వీడియోలు తీశారని బాధితురాలు తెలిపింది. ఈ దారుణాన్ని ప్రశ్నించిన భార్యను చితకబాతాడు.. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. కొల్లాలంలోని కొట్టియం పోలీసులకు ఫిర్యాదు చేసింది..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించారు.. కౌన్సిలింగ్ సమయంలో చిన్నారి ఇచ్చిన వాంగ్మూలాలను ఆధారంగా ఆ సైకో భర్తపై ప్రత్యేకమైన పోక్షో చట్టం కింద కూడా నాన్ బేలబుల్ కింద కేసులు నమోదు చేశారు.. పోలీసులు కేసు నమోదు చేయగానే నిందితుడు పరారీ అయ్యాడు.. బాధితురాలు తరఫున న్యాయవాది ప్రశాంత్ వి కురత్ కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో.. విచారణను వేగవంతం చేసిన పోలీసులు ఆగస్టు 24వ తేదీన నిందితుడుని ట్రాక్ చేసి అరెస్టు చేశారు..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
బుధాదిత్య యోగంతో ఈ 5 రాశుల దశ తిరగబోతోంది.. మీ రాశి ఇందులో ఉందా?
Hyderabad, Telangana:Budhaditya Yoga In August Last Week: ఆగస్టు చివరివారం కొన్ని రాశుల వారికి కొత్త ఆశలను, పెద్ద పెద్ద మార్పులను తీసుకురాబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో అనేక గ్రహాలు మార్పులు చేర్పులు చేసుకోబోతున్నాయి. దీని కారణంగా ఉంది వ్యక్తుల జీవితాల్లో వృత్తి వ్యాపారం ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితం పరంగా సానుకూలమైన మార్పులు వస్తూ ఉంటాయి. అయితే, ఈ వారం ఐదు రక్షల వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది..
ఆగస్టు 24 నుంచి 30 మధ్య సూర్యుడితో పాటు బుధుడు కేతు గ్రహాలు సింహరాశిలోనే ఉండడం.. కుజుడు మిధున రాశిలో.. శుక్రుడు కన్యారాశిలో.. గురుడు కర్కాటక రాశిలో.. శని మీన రాశిలో వక్రగతిలో ఉంటాయి. దీని కారణంగా 12 రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా అనుకోని ప్రయోజనాలు కలుగుతాయి..
ఈ వారం సూర్యుడితోపాటు బుధ గ్రహాల కలయిక ఘనంగా ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని మేదస్సుతో పాటు వాక్చాతుర్యం వ్యాపారం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే సూర్యుడని ఆత్మవిశ్వాసం నాయకత్వం గౌరవానికి సూచికగా భావిస్తారు. ఇలా రెండు గ్రహాలు కారణంగా ఏర్పడిన బుధాదిత్య రాజయోగం మొత్తం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
వృషభ రాశి
ఈవారం వృషభ రాశి వారికి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఎంతో సులభంగా పూర్తవుతూ ఉంటాయి. చాలాకాలంగా నేర్చుకున్న ప్రాజెక్టులు ఈ సమయంలో తిరిగి ప్రారంభమవుతాయి. అంతేకాకుండా పనుల్లో అకస్మాత్తుగా విజయాలు సాధించుతారు. ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్త బాధ్యతలు పొందడమే కాకుండా.. అనుకోని ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. అలాగే ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు సాధారణం కంటే చాలా వరకు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఖర్చులను అదుపులో ఉంచుకోవడం వల్ల లాభాలు సొంతం చేసుకుంటారు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి కూడా తొలగిపోయి అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు..
కన్యా రాశి
ఈవారం కన్యా రాశి వారికి అనేక విషయాలపరంగా వస్తున్న సమస్యలు తొలగిపోయే.. అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వివాదాస్పద విషయాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగాల్లో బాధ్యతలతో పాటు గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు కూడా ఎంతో సులమంగా తిరిగి పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా సామాజిక హోదా పెరిగి అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికల కోసం వ్యక్తుల సలహాలను తీసుకోవడం చాలా మంచిది.
వృశ్చిక రాశి
వ్యాపారాల పరంగా ఈ వారం వృశ్చిక రాశి వారికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు లభించడమే కాకుండా పాత సంబంధాలు మరింత మెరుగుపడతాయి. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన మంచి లాభాలు వందనం చేసుకోగలుగుతారు. మీకు కుటుంబ సభ్యుల నుంచి మంచి సపోర్టు లభించడమే కాకుండా.. పూర్వీకుల ఆస్తులు తప్పకుండా తిరిగి పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు పనుల్లో కొత్త బాధ్యతలు లభించి భవిష్యత్తులో పదోన్నతులకు మార్గం సుగుమవుతుంది.
మకర రాశి
ఈ వారం మకర రాశి వారికి కూడా అనుకున్న ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా పాత పెట్టుబడులనుంచి భారీ మొత్తంలో ధన లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలంలో ఆర్థిక ప్రణాళికలపై పనిచేస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో పురోగతి కూడా లభించబోతోంది. కుటుంబ సభ్యుల నుంచి మంచి శుభవార్తలు వినడమే కాకుండా.. పనుల్లో పై అధికారుల నుంచి మంచి సపోర్టు కూడా పొందుతారు. ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టడం వల్ల దిమ్మతిరిగే ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఆర్థిక విషయాల్లో శుభసంకేతాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా పెంచుకునేందుకు కొత్త కొత్త మార్గాలను కూడా ఎంచుకునే అవకాశాలున్నాయి. దీంతోపాటు వ్యాపారవేత్తలకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే పనుల్లో సామర్థ్యం పెరిగి పాత పెట్టుబడిలో నుంచి భారీ మొత్తంలో విజయాలు కలుగుతాయి. కుటుంబ సంబంధిత సమస్యల నుంచి పరిష్కారం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే అనుకుంటున్న పనుల్లో దిమ్మతిరిగే ధన లాభాలు సొంతం చేసుకుంటారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
YS Jagan: జూడాల సమ్మెపై అహంకారం వీడాలని సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ విజ్ఞప్తి
Nuzendla, Andhra Pradesh:Junior Doctors Strike: ప్రజల ప్రాణాలు కాపాడే జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి.. పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడతారా? అని సీఎం చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు. జూడాల స్టైపెండ్ సవరణను ఎందుకు నిలిపివేశారని నిలదీశారు. 'జూనియర్ డాక్టర్ల శ్రమతోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్యసేవలు నడుస్తున్నాయి. ఇప్పుడు సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడి పేద రోగులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి మీ మొండివైఖరే కారణం కాదా చంద్రబాబు? అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.
రెండు వారాలుగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టగా.. వారి డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో 'ఎక్స్' వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. 'రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు 2 వారాలుగా ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదు?' అని చంద్రబాబును వైఎస్ జగన్ ప్రశ్నించారు.
'జూనియర్ డాక్టర్లకు జీవో నంబర్ 287 నిర్దేశించిన 15శాతం కంటే అధికంగా మా హయాంలో 42.4 శాతం పెంచాం. సూపర్ స్పెషాల్టీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్‌గా గురిస్తూ, వారి విజ్ఞప్తినికూడా పరిగణలోకి తీసుకుని నిర్దేశించిన దానికంటే పెంచి మొత్తంగా 77శాతం వారికి పెంచాం' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఆయుష్ విభాగానికి చెందిన జూనియర్ డాక్టర్లకు కూడా అల్లోపతి జూనియర్ డాక్టర్ల తరహాలోనే స్టైపెండ్ పెంచినట్లు తెలిపారు. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని 15 శాతం కంటే మెరుగైన పెంపు ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు కోరుతుంటే కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే పెంచుతామని చెప్పడం అన్యాయం కాదా? అని చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు.
'బకాయిలతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. మరోవంక ప్రభుత్వ వైద్యరంగాన్ని మీరు దారుణంగా దెబ్బతీశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మేం ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి.. ఐదింటిని పూర్తిచేసి క్లాసులుకూడా ప్రారంభిస్తే, మరో కాలేజీని క్లాసులకు సిద్ధంచేసి, మొత్తంగా ఆరు అందుబాటులోకి తెచ్చాం' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. మిగిలిన వాటిని పూర్తిచేయాల్సిందిపోయి, వాటిని తెగనమ్మడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మందులు లేక ప్రభుత్వ ఆస్పత్రులు విలవిల్లాడుతున్నాయని.. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారని చంద్రబాబు పాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు చేశారు.
'వైద్యరంగంలో మేం నియమించిన 50 వేల మంది సిబ్బందిని క్రమంగా తగ్గిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానానికి గండికొట్టారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను తొలగించారు. విలేజ్, అర్బన్ క్లినిక్‌లను నిర్వీర్యం చేశారు' అని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని దారుణంగా దెబ్బతీసి రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారని ఆరోపించారు. ప్రజారోగ్య వ్యవస్థలో చంద్రబాబు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు అహంకారం వీడి.. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులను వెంటనే చర్చలకు పిలవాలని మాజీ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని.. తగిన స్థాయిలో స్టైపెండ్‌ను పెంచాలని డిమాండ్ చేశారు.
Tirumala Video: తిరుమల స్వామి సేవలో హోంమంత్రి వంగలపూడి అనిత
Dharmavaram, Andhra Pradesh:AP Home Minister Vangalapudi Anitha Visits Tirumala Temple Watch VideoTirumala Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎంపీలు
Dharmavaram, Andhra Pradesh:Sama Satish Bhashyam Ramakrishna And Other VIPs Visits Tirumala Temple Watch VideoMangli: కలియుగ వైకుంఠవాసుడి సేవలో గాయని మంగ్లీ
Dharmavaram, Andhra Pradesh:Tollywood Singer Mangli Tirumala Darshan After Long Time Watch VisualsRevanth Reddy Resign: ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: ఈటల రాజేందర్
Hyderabad, Telangana:KPHB Lands Auction: భూకబ్జాలను అరికట్టే సత్తా లేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. 'ఊర్లలో తాతల ఆస్తులు అమ్ముకుని తిరిగేవాన్ని తిరుగుబోతు అనేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నారు' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఏర్పడింది పేదలకు ఇళ్ల జాగాలు ఇవ్వడానికి అని.. వ్యాపారం చేయడానికి కాదు' అని స్పష్టం చేశారు. కేపీహెచ్‌బీ కాలనీలో ఏర్పాటుచేసిన వేలం పాటను రద్దు చేయాలని రేవంత్ రెడ్డికి డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో వేలానికి పెట్టిన ప్లాట్లను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులు విక్రయించడం ఆపకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. రూ.20 వేల కోట్ల విలువైన భూములు హానర్ హోమ్స్‌కి కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది. తాను వస్తే వెనక్కి తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకోవడం లేదు?' అని ప్రశ్నించారు. 22ఏ ద్వారా రూ.10 లక్షల కోట్ల ఆదాయం రేవంత్ రెడ్డి లక్ష్యం. దానిలో ముప్పై శాతం వీళ్ల వాటా. పేదలను ఇబ్బంది పెడుతున్న వీరికి శిక్ష తప్పదు' రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరిక జారీ చేశారు.
'హౌసింగ్ బోర్డ్ ఏర్పడింది పేదవారి సొంత ఇంటి కలను నెరవేర్చడానికి తప్ప వ్యాపారం చేయడానికి కాదు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005-06లో కూకట్‌పల్లిలో భూముల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ భూముల విక్రయంతో వచ్చిన రూ.1,200 కోట్లు హౌసింగ్ బోర్డ్ ఖాతాలో నిల్వ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని తీసేసుకున్నాడు' అని ఎంపీ ఈటల రాజేందర్ వివరించారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పరిధిలో ఖాళీగా ఉన్న జాగాలను విక్రయించరాదని విజ్ఞప్తి చేశారు.
హౌసింగ్ బోర్డ్ చట్టం ప్రకారం పేదవారికి ఇళ్ల జాగాలు ఇవ్వాలి తప్ప ఇలా అమ్ముకోవడానికి హక్కు లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎంపీ ఈటల రాజేందర్ గుర్తుచేశారు. 'కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఖాళీ స్థలం లేకుండా చేస్తున్నారు. భూములు అమ్ముకొని జీతాలు ఇస్తున్నారు. ఆస్తులు విక్రయించడం ఆపకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. భూకబ్జాలను అరికట్టే సత్తా లేకపోతే రాజీనామా చేయాలి' అని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
'పేదవారికి కట్టించడానికి మనసు రావడం లేదా? పేదవారి కోసమైతే బడ్జెట్ లేదా? ఇందిర రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అన్నది కేవలం నినాదంగానే మిగిలిపోయింది. రూ.6 లక్షలకు ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది' అని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. '22ఏ తీసుకొచ్చి రూ.10 లక్షల కోట్లు ప్రభుత్వానికి డబ్బులు వచ్చేలా చేయాలి. స్వామికార్యం స్వకార్యంలా 30 శాతం కొట్టేయాలని చూస్తున్నారు' అని ఆరోపించారు. అర్బన్ సీలింగ్ ల్యాండ్లను ప్రైవేటు వారికి కట్టబట్టే ప్రయత్నం కూడా ఆపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసి కూర్చోబెట్టిన ఖర్మకు తమ ఉసురు పోసుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
Konda Surekha Issue: మంత్రి కొండా సురేఖ అంశంపై తొలిసారి నోరు విప్పిన రేవంత్ రెడ్డి
Baddipadaga, Telangana:Konda Surekha vs Revanth Reddy: అవినీతి, అక్రమాలు అంటూ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. వారం రోజులుగా ఆమె చేసిన వ్యాఖ్యలపై రాజకీయాలు హాట్టాహాట్గా ఉన్నాయి. రేవంత్ రెడ్డిపై కొండా కుటుంబం తిరుగుబాటు చేసిందనే చర్చ జరుగుతోంది. ఈ అంశంలో కొండా సురేఖ క్రమశిక్షణా కమిటీ నోటీసులు అందుకోవడం.. దానికి బదులివ్వడం వంటివి చకాచకా జరిగిపోయాయి. అయితే తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అంశంపై విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన రేవంత్ రెడ్డి స్పందించారు.
హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా తన అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడంపై మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ క్రమంలో మీడియా అంతా ఎదురుచూస్తున్న కొండా సురేఖ ఎపిసోడ్‌పై స్పందించకుండా వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి కొండా సురేఖ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో రెండు మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డివ వెళ్లిపోయారు.
బంతి అధిష్టానం కోర్టులో..
'కొండా సురేఖ అంశం కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ఆ అంశం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉంది. పార్టీ అంతర్గత అంశాలపై మాట్లాడను' అని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఊహాజనితమైన విషయాలను ప్రస్తావించరాదని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే కొండా సురేఖ వ్యవహారం అధిష్టానం కోర్టులో ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. కొండా సురేఖ వ్యవహారంలో ఇప్పటికే పార్టీ అధిష్టానానికి రేవంత్ రెడ్డి తన అభిప్రాయం చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఆమెను సహించేది లేదని.. ఓపిక పట్టలేమని తేల్చిచెప్పినట్లు సమాచారం. అయితే కొండా సురేఖను సస్పెండ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోకవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాగా కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకోవడం ద్వారా కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని చర్చ జరుగుతండగా.. అనూహ్యంగా ఆమె తన శాఖకు సంబంధించిన కార్యక్రమంలో మునిగారు. మంత్రి పదవి నుండి ఉద్వాసన, బర్తరఫ్ ఇలా వార్తలు వస్తుండగా కొండా సురేఖ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన అనంతరం కొండా సురేఖ పూర్తి ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను కలిసి వచ్చిన అనంతరం కొండా సురేఖ ఇక రాజకీయ వివాదాల జోలికి వెళ్లకుండా తన మంత్రిత్వ శాఖ పనుల్లో నిమగ్నమయ్యారు. మంత్రిగా సమీక్షలు.. కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించారు.
Jogi Ramesh: కుటుంబ వివాదంపై నోరు విప్పిన మాజీ మంత్రి జోగి రమేశ్
Jaggaiahpet, Andhra Pradesh:Jogi Ramesh Reacts On His Son Rajeev And Daughter In Law Meghana Issue Watch His CommentsRevanth Reddy: కొండా సురేఖ, అమెరికా పర్యటన రద్దుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hyderabad, Telangana:Hyderabad: విదేశీ పర్యటన రద్దు.. కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్‌మీట్ నిర్వహించి కీలక విషయాలు వెల్లడిచారు. కొండా సురేఖ వ్యవహారంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. తన అమెరికా పర్యటన రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. తన పర్యటనకు అనుమతి నిరాకరించడాన్ని తప్పుబట్టారు. ఆ పర్యటనపై కీలక విషయాలు వెల్లడించారు.
నిరాకరించడం బాధాకరం
హైదరాబాద్‌లోని సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కీలక విషయాలు తెలిపారు. 'రాష్ట్రాల కలయికనే దేశం. విదేశీ పర్యటన ద్వారా తెలంగాణ రైజింగ్‌తో విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని కార్యాచరణతో ముందుకెళుతున్నాం. దురదృష్టవశాత్తు ఇంగ్లాండ్ పర్యటనకు అంగీకరించి అమెరికాకు అనుమతి నిరాకరించడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఎంతోమంది తీవ్రంగా ఖండించారు. అయితే బీజేపీ వాళ్లు మాత్రం మాపై ఆరోపణలు చేస్తున్నారు' అని తెలిపారు.
'పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనలు చేపట్టాం. విద్యా, క్రీడా రంగంలో పెట్టుబడులతో ముందుకు వెళ్లాలన్నది మా ఆలోచన. ఇంగ్లండ్ పర్యటనకు అనుమతిచ్చి అమెరికా పర్యటనకు తిరస్కరించారు. కేంద్రం వైఖరిని ఖర్గే ఖండించారు. కోట్లాది మంది కేంద్రం వైఖరిని తప్పుపట్టారు' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఎందుకు అనుమతి ఇవ్వలేదు?
'నేను పర్యటనకు దరఖాస్తు చేస్తే ప్రొసీజర్ ప్రకారం మేము వెళితే పొలిటికల్ యాంగిల్ పేరుతో తిరస్కరిస్తున్నామని చెప్పారు. బీజేపీ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులకు ఇస్తారు. మాకు ఎందుకు ఇవ్వరో చెప్పు?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గుజరాత్ ముఖ్యమంత్రి కెనడా, ఇతర దేశాల పర్యటనకు ఎలా అనుమతి ఇచ్చారని అడిగారు. 'పెట్టుబడులకు సంబంధించి క్రీడలకు, విద్యా అవసరాలను దృష్టిలో పర్యటనకు వెళ్తున్నట్లు వివరించాం. రాజకీయపరమైన నిర్ణయాలతో పర్యటనను రద్దు చేస్తున్నట్లు కేంద్రం చెపుతుంది. విదేశీ పర్యటనలో విషయం లేదు అంటే మరీ ఇంగ్లాండ్‌కు ఎందుకు అనుమతి ఇచ్చారు. అమెరికాకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు' అని రేవంత్ రెడ్డి ప్రశ్నలు సంధించారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ కీలక వ్యాఖ్యలు.. 'నా కోడలు మేఘన కూతురుతో సమానం'
Jaggaiahpeta, Andhra Pradesh:Jogi Ramesh Family Issue: తన కుమారుడు రాజీవ్, కోడలు మేఘన వివాదంపై మాజీ మంత్రి జోగి రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కోడలు మేఘన తన కూతురుతో సమానం అని ప్రకటించారు. 'ఉన్న కొన్ని రోజులైనా కూతురు కన్నా ఎక్కువగా చుసుకున్నాం. వారి మధ్య వచ్చిన చిన్న సమస్యలకు 11 మందిపై ఫిర్యాదు చేశారు. కోర్టుకు లోబడి కొన్ని విషయాలు చెప్పలేను. నెల రోజులుగా కొన్ని యూట్యూబ్, టీవీ ఛానల్స్ వారు మితిమీరి ప్రచారం చేశారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నా భార్య కన్న కూతురిలా చూసుకొని కోడలు మేఘనకు గోరుముద్దలు తినిపించింది. నా భార్య బైబిల్ చదివితే తప్ప? తిరుమల వెళ్తాం. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తాం. అసత్యాలను ప్రచారం చేస్తూ నెల రోజులపాటు మా కుటుంబాన్ని మానసికంగా వేధించారు' అని మాజీ మంత్రి జోగి రమేశ్ తెలిపారు. 'ఐ టీడీపీ ద్వారా కొన్ని ఛానల్స్‌ను పెట్టుకొని వ్యాపారం చేశారు. కల్తీ కేసు పెట్టి 3 నెలలు జైలు తిప్పావు.. అయినా భయపడాల?' అని ప్రశ్నించారు.
'నా గొంతు నొక్కేందుకు ఈ పరిణామాలు జరుగుతున్నాయి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని ఎవరో చేస్తున్నారో తెలుసు. 83 రోజులపాటు జైలులో పెట్టిన జడవలేదు. ఇంటిపై యాసిడ్ దాడి చేసినా భయపడలేదు' అని మాజీ మంత్రి జోగి రమేశ్ వెల్లడించారు. రాజీవ్, మేఘన ఇప్పటికీ కలిసి ఉండాలని కోరుంటామని తెలిపారు. 'టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను ఏనాడు వ్యక్తిగతంగా మాట్లాడలేదు. రాజకీయంగా మాత్రమే ఎదుర్కొన్నాం' అని గుర్తుచేశారు.
తాను ఎప్పటికీ తప్పు చేయనని.. విలువలతో కూడా రాజకీయాలు చేస్తానని మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రకటించారు. 'ఎమ్మెల్యే వసంత కార్యాలయం నుంచి డ్రామాలు జరిగాయి. నెల రోజులపాటు మా కుటుంబసభ్యులను మానసిక క్షోభకు గురి చేశారు. కోర్టు కన్నా ముందే ఓ టీవీ ఛానల్లో అసత్యాలను ప్రచారం చేశారు. దేవుడు చూస్తున్నాడు' అని తెలిపారు. 'ఐ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్ నా స్థానంలో ఉండి ఆలోచించు. మీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో నా కుటుంబంపై అనేక దాడులు చేశారు. ప్రాణం పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటా' అని జోగి రమేశ్ ప్రకటించారు.
'కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని టీవీలో ముందే తప్పుడు ప్రచారం చేశారు. కొన్ని తప్పుడు ఛానల్స్, యూట్యూబ్ చానల్స్ ప్రసారాలు చాలా దారుణం. టీడీపీ వారిలో కొందరు ఐ టీడీపీని అసహ్యించుకుంటున్నారు' అని మాజీ మంత్రి జోగి రమేశ్ తెలిపారు. 'ఎప్పుడు ఒకరే పరిపాలన చేయరు.. మహామహులే మట్టి కరిచారు. నాకు ఒక సమయం వస్తుంది. రెడ్ బుక్ నేడు డెడ్ బుక్‌గా మారింది' అని ఆరోపించారు. తాను జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతామని ప్రకటించారు.
'అధికార మదంతో వ్యవహరించిన చంద్రబాబు. ఇద్దరు వ్యక్తులు కలవాలని కోరుకోవాలి తప్ప విడగొట్టేందుకు రాజకీయాలు చేయకూడదు. కుటుంబపరమైన విషయాలను రాజకీయ జోక్యంతో ఎలా వ్యవహరించారు. తమ కుటుంబ విషయాన్ని ఇంతటితో ముగించితే మంచిది' అని ప్రత్యర్థులకు మాజీ మంత్రి జోగి రమేశ్ సూచించారు.
Telangana New Brands: మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే వార్త.. తెలంగాణలో 121 కొత్త అంతర్జాతీయ బ్రాండ్లు సిద్ధం!
Hyderabad, Telangana:Telangana International Brands: తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న తరుణంలో, ఇక్కడి ప్రజల జీవనశైలి (లైఫ్ స్టైల్), వీకెండ్ పార్టీల సంస్కృతి కూడా వేగంగా మారుతోంది. దీనికి అనుగుణంగా ఎలైట్, ప్రీమియం విదేశీ మద్యం బ్రాండ్లకు నగరంలో డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో విదేశీ మద్యం ప్రియుల కొరతను తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSBCL) ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే మద్యం ఏదైనా అది ఆరోగ్యానికి హానికరమనే నిజాన్ని గ్రహించాలని కూడా అధికారులు గుర్తుచేస్తున్నారు.
121 కొత్త బ్రాండ్ల రాక..
తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోకి కొత్తగా 121 రకాల నూతన లిక్కర్ బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 18 ప్రముఖ సరఫరా సంస్థలు (suppliers) ఈ 121 బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకురావడానికి దరఖాస్తు చేసుకోగా, ప్రాథమిక పరిశీలన పూర్తి చేసిన తర్వాత, ఈ బ్రాండ్ల వివరాలను అధికారుల అధికారిక వెబ్సైట్లో ప్రజల పరిశీలనార్థం ఉంచారు.
అందుబాటులోకి రానున్న ఎలైట్ బ్రాండ్లు..
ఈ నూతన నిర్ణయం ద్వారా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అత్యంత ఖరీదైన గ్లెన్ఫెడిక్ (Glenfiddich), ది మెకాలన్ సింగిల్ మాల్ట్ విస్కీ (The Macallan Single Malt Whisky), లూయిస్ థర్టిన్ కాగ్నాక్ (Louis XIII Cognac) వంటి ప్రీమియం బ్రాండ్లు ఇకపై స్థానిక వైన్ షాపుల్లోనే నేరుగా లభించనున్నాయి. వీటితో పాటు మంకీ షోల్డర్, హెండ్రిక్స్ జిన్, టైగర్ లాగర్, చీతా, రెడ్ హార్స్ వంటి అంతర్జాతీయ బీర్లు, వోడ్కా, బ్రాందీ, టకీలా బ్రాండ్లు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పాటించేందుకు TSBCL మేనేజింగ్ డైరెక్టర్ హరికిరణ్ ఒక కీలక ప్రకటన చేశారు. కొత్త సప్లయర్లు, వారి బ్రాండ్ల వివరాలను అధికారిక వెబ్సైట్ tgbcl.telangana.gov.inలో ప్రదర్శించామని తెలిపారు. ఈ బ్రాండ్ల ఆమోదంపై ప్రజలకు లేదా ఇతర మద్యం వ్యాపారులకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే, సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు.
ఆ అభ్యంతరాల పరిష్కారం తర్వాతే వీటికి తుది ఆమోదం లభిస్తుంది. ఈ అంతర్జాతీయ ప్రీమియం బ్రాండ్లు అధికారికంగా మార్కెట్లో లభించడం వల్ల నకిలీ మద్యం బెడద, బ్లాక్ మార్కెట్ విక్రయాలు తగ్గుతాయి. పరోక్షంగా ఇది రాష్ట్ర పర్యాటక, హాస్పిటాలిటీ రంగాలకు తోడ్పడటమే కాకుండా, ప్రభుత్వ ఎక్సైజ్ ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచే అవకాశం ఉంది.
Also Read; మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి పీసీసీ నివేదిక..మంత్రివర్గ మార్పులపై చర్చ!
Also Read: వైసీపీ మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rahul Gandhi Kiss Video: రాహుల్ గాంధీకి లైవ్‌లో ముద్దుపెట్టిన యువతి..సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ రచ్చ!
Pune, Maharashtra:Rahul Gandhi Kiss Viral Video: పూణెలో నిర్వహించిన ఒక విద్యార్థి సదస్సు వేదికపై అత్యంత ఆసక్తికరమైన, ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఫోటో దిగడానికి ఒక యువతి వేదికపైకి వచ్చింది. అయితే, కెమెరాకు ఫోజు ఇస్తున్న తరుణంలో ఆమె హఠాత్తుగా రాహుల్ గాంధీ బుగ్గపై ముద్దుపెట్టి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ అనాలోచిత సంఘటనకు రాహుల్ గాంధీ ఏమాత్రం తత్తరపాటుకు గురికాకుండా, ఎంతో ప్రశాంతంగా మరియు సరదాగా స్పందించారు. ఈ ఆత్మీయ హావభావానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన కొద్ది సేపట్లోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి వైరల్‌గా మారింది.
ఈ సంఘటన యువతలో రాహుల్ గాంధీకి ఉన్న విశేషమైన ఆదరణను స్పష్టం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా దేశంలో అగ్రశ్రేణి రాజకీయ నాయకులతో ప్రజలు ప్రవర్తించే విధానానికి భిన్నంగా, యువ మద్దతుదారులు ఆయనతో ఎంతటి బలమైన అనుబంధాన్ని, స్వేచ్ఛను, చొరవను అనుభవిస్తున్నారో ఈ ఉదంతం నిరూపించింది. నాయకుడి పట్ల యువతలో ఉన్న విశ్వాసానికి ఈ దృశ్యం అద్దం పట్టింది.
How lucky is this girl? 😭🫶🎀
She got to meet Rahul Gandhi and even kissed him. 😭❤️
Never seen any baddies this comfortable with any BJP leader🔥 pic.twitter.com/j0Z9KWxZGL
— Amock (@Politicx2029) August 23, 2026
కానీ, ఈ వ్యక్తిగత ఆత్మీయ స్పందన కేవలం ఒక వైరల్ వీడియోతో ముగిసిపోలేదు. సాంప్రదాయ సామాజిక నిర్మాణాలు, విలువలపై రాహుల్ గాంధీ చేసే విమర్శలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రత్యర్థి పార్టీలు రంగంలోకి దిగడంతో ఇది పెద్ద రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీ (BJP) నేతల మధ్య తీవ్రమైన విమర్శలు, ప్రతివిమర్శలు నడిచాయి. పబ్లిక్ పర్సెప్షన్ (ప్రజా అభిప్రాయం), ఇరు పార్టీల రాజకీయ వ్యూహాలకు సంబంధించిన చర్చలకు ఈ చిన్న ఘటన ఒక పెద్ద ఫ్లాష్‌పాయింట్‌గా మారింది. ఒక స్వచ్ఛందమైన వ్యక్తిగత స్పందన కాస్తా, దేశంలో విస్తృత రాజకీయ సిద్ధాంతాల మధ్య ఘర్షణకు దారితీయడం గమనార్హం.
Also Read: భర్తను చంపి, పేగులు బయటకు తీసిన భార్య..కురుక్షేత్రలో ఘోర హత్యోదంతం!
Also Read: స్కూల్ విద్యార్థినులతో కలిసి ప్రిన్సిపాల్ స్నానం..వీడియో వైరల్ కావడంతో సస్పెండ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
