ముక్తాపూర్ గ్రామంలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం ముక్తాపూర్ గ్రామంలో తాండూరు సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కార్డెన్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సరైన ధ్రువపత్రాలు లేని 54 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను గుర్తించి సరిచేసినట్లు తెలిపారు గంజాయి, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు సీసీటీవీ కెమెరాల ప్రత్యేకతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గంగారం, పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Balapur Ganesh Theme: ఈసారి బాలాపూర్ గణేష్‌కు పూరీ జగన్నాథ్ ఆలయం థీమ్..ఎలా ఉండబోతుందంటే?
Balapur, Telangana:Balapur Ganesh Mandapam 2026 Theme: వినాయక చవితి ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఇప్పటికే గణేశ్ ఆర్డర్లు పూర్తవగా.. మండపాలు వినూత్నంగా.. కొత్త తరహాలో తీర్చిదిద్దడానికి ఉత్సవ సమితి నిర్వాహకులు ప్లాన్లు వేస్తున్నారు. ఇక ఈసారి బాలాపూర్ గణేశ్ మరో కొత్త రూపంలో కనిపించనుంది. ఈసారి ఏ థీమ్‌తో మండపం సిద్ధం చేస్తున్నారో తెలుసుకుందాం.AUS Vs BAN Test: పిల్లకూన బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘోర ఓటమి..ఆసీస్ గడ్డపై బంగ్లా జట్టు తొలి విజయం ఇదే!
The Gardens, Northern Territory:AUS Vs BAN 1st Test: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్‌లోని మొదటి మ్యాచ్ కంగారూల జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆస్ట్రేలియాలోని డార్విన్‌లోని మరారా క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌పై 9 వికెట్ల తేడాతో గెలిచి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. గెలవడానికి 57 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, నాలుగో రోజు రెండో సెషన్లోనే బంగ్లాదేశ్ ఆ లక్ష్యాన్ని చేరుకుంది. బంగ్లాదేశ్ విజయంలో ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్, ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్ కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో మహమూద్ మొత్తం 9 వికెట్లు తీయగా, మిరాజ్ 65 పరుగులు చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు.
స్వదేశంలో ఆస్ట్రేలియాను ఓడించడం బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టెస్టు విజయం. బంగ్లాదేశ్ గతంలో ఆస్ట్రేలియాలో రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఆ రెండు మ్యాచ్‌లు బంగ్లాదేశ్ 2003 పర్యటనలో జరిగాయి. ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌కు ఇది రెండవ టెస్ట్ విజయం.
గత టెస్ట్ విజయం 2017 ఆగస్టులో మీర్పూర్లో ఆస్ట్రేలియాను 20 పరుగుల తేడాతో ఓడించడం ద్వారా లభించింది. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు ఏడు టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో ఆస్ట్రేలియా ఐదింటిలో గెలుపొందగా, బంగ్లాదేశ్ రెండింటిలో విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని రెండవ టెస్ట్ ఆగస్టు 22 నుంచి మక్కేలో జరగనుంది.
నాలుగో రోజు ఆట సాగిందిలా..
మ్యాచ్ నాలుగో రోజున, ఆస్ట్రేలియా 161/4 స్కోరుతో తమ రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. తొలి సెషన్లో మెహిదీ హసన్ మిరాజ్, అలెక్స్ క్యారీ (30 పరుగులు), బ్యూ వెబ్‌స్టర్ (5 పరుగులు), పాట్ కమిన్స్ (8 పరుగులు)లను అవుట్ చేసి ఆస్ట్రేలియాను క్లిష్ట పరిస్థితిలోకి నెట్టాడు. అయినప్పటికీ, వికెట్లు పడుతున్నా కామెరాన్ గ్రీన్ క్రీజులో నిలిచాడు. గ్రీన్ 201 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో సహా 104 పరుగులు చేశాడు. ఇది గ్రీన్‌కు మూడవ టెస్ట్ సెంచరీ.
మరోవైపు మిచెల్ స్టార్క్ (18 పరుగులు) కూడా క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాడు, కానీ టాస్కిన్ అహ్మద్ అతని ఇన్నింగ్స్‌ను ముగించాడు. అవుటైన తొమ్మిదవ వికెట్ కామెరాన్ గ్రీన్. హసన్ మహమూద్ బౌలింగ్‌లో గ్రీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత నాథన్ లియాన్ (15 పరుగులు) మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు, దీంతో కంగారూ ఇన్నింగ్స్ 284 పరుగుల వద్ద ముగిసింది. రెండవ ఇన్నింగ్స్‌లో మిరాజ్ ఐదు వికెట్లు తీయగా, మహమూద్ మూడు వికెట్లు పడగొట్టాడు. టాస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లాం చెరో వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 198 పరుగులు మాత్రమే చేసింది. స్టీవ్ స్మిత్ అత్యధికంగా 71 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ తరఫున హసన్ మహమూద్ ఆరు వికెట్లు తీయగా, ఇబాదత్ హుస్సేన్, టాస్కిన్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
దీనికి ప్రతిగా, బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 426 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్ 228 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ అద్భుతమైన 101 పరుగులు చేశాడు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (84), మెహిదీ హసన్ మిరాజ్ (65) కూడా బ్యాటింగ్‌లో ఉపయోగకరమైన సహకారం అందించారు. ఆస్ట్రేలియా తరఫున జోష్ హేజిల్‌వుడ్ ఆరు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Also Read: విరాట్ కోహ్లీకి ఈ టాలీవుడ్ హీరోయిన్ మరదలు అవుతుంది..ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
Also REad: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్లో మార్పు.. గాంధీ జయంతి రోజున ఘనంగా ప్రారంభమయ్యేలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Faria Abdullah Troll: సోషల్ మీడియాలో హీరోయిన్ ఫరియాపై ట్రోలింగ్..వెక్కివెక్కి ఏడ్చిన హీరోయిన్!
Hyderabad, Telangana:Faria Abdullah Crying Video: 'జాతిరత్నాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. ఆ తర్వాత మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్ పై నటి తాజాగా స్పందించింది. తనపై వస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది.Shravana Masam Chicken Price: శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్, కోడిగుడ్ల ధరలు..ఇప్పుడు ఎలా అమ్ముతున్నారంటే?
Hyderabad, Telangana:Shravana Masam Chicken Egg Price: హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్ర మాసంలో చాలామంది నాన్-వెజ్ వంటకాలకు దూరంగా ఉంటూ పూర్తిగా శాకాహారాన్ని ఆచరిస్తారు. ప్రతి ఏటా ఈ సమయంలో మాంసాహారానికి డిమాండ్ ఒక్కసారిగా పడిపోతుండటం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పాతాళానికి పడిపోయాయి. గత నెలలో చుక్కలు చూపించిన ధరలు ఇప్పుడు అమాంతం తగ్గిపోవడంతో సామాన్యులకు ఊరట లభిస్తోంది.
భారీగా తగ్గిన చికెన్ ధరలు
గతంలో కిలో చికెన్ ధర ఏకంగా రూ.340 వరకు చేరుకుని సామాన్యులను షాక్‌కు గురిచేసింది. అయితే శ్రావణ మాసం ఎఫెక్ట్‌తో కేవలం రెండు వారాల వ్యవధిలోనే ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రాంతాలను బట్టి, రవాణా ఖర్చులను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ జోన్ పరిధిలో కిలో డ్రస్డ్ చికెన్ రూ.197లకు విక్రయిస్తుండగా.. స్కిన్ లెస్ చికెన్ ధర రూ.222గా ఉంది. రిటైల్ లైవ్ బర్డ్ రూ.127గా ఉండగా.. ఎక్స్ ఫామ్ లైవ్ బర్డ్ రూ.100లకు అమ్మకాలు జరుగుతుంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పరిధిలో ఎక్స్ ఫామ్ లైవ్ బర్డ్ రూ.110, రిటైల్ లైవ్ బర్డ్ రూ.137 ధరకు విక్రయిస్తున్నారు. అదే విధంగా డ్రస్డ్ చికెన్ రూ.212, కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.240గా అమ్మకాలు జరుపుతున్నారు.
తగ్గుముఖం పట్టిన కోడిగుడ్ల ధరలు
చికెన్‌తో పాటు కోడిగుడ్ల ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. గతంలో ఒక్కో గుడ్డు ధర రూ.8 వరకు పలకగా, ప్రస్తుతం ఆ ధరలు తగ్గావు. విజయవాడ జోన్లో 12 గుడ్ల రిటైల్ ధర రూ.75 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, కరీంనగర్ జోన్ 12 గుడ్ల రిటైల్ ధర రూ.74గా ఉంది.
వ్యాపారుల ఆందోళన.. మరికొంత తగ్గే ఛాన్స్
శ్రావణ మాసం పూర్తయ్యే వరకు మార్కెట్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని, కోళ్లకు డిమాండ్ లేకపోవడం వల్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. గత నెలతో పోలిస్తే చికెన్ ధర దాదాపు రూ.100 వరకు తగ్గిపోవడంతో తమకు ఆదాయం గణనీయంగా పడిపోయిందని ఫామ్‌ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ALso Read: పాడుబడ్డ ఇంటి గోడలో బంగారు నిధి..గుట్టలు గుట్టలుగా రూ.100 కోట్ల గోల్డ్ బిస్కెట్స్!
Also Read: అనిల్ రావిపూడి సినిమాలో ఆర్మీ జవాన్‌గా విక్టరీ వెంకటేష్..లెఫ్టినెంట్ కల్నల్ పాత్రలో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
2027 ODI World Cup: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్లో మార్పు.. గాంధీ జయంతి రోజున ఘనంగా ప్రారంభమయ్యేలా!
Dubai, Dubai:2027 ODI World Cup Schedule: 2027 వన్డే ప్రపంచకప్ కేవలం ఫోర్లు, సిక్సర్లతో అలరించే సాధారణ క్రికెట్ పోరాటమే కాకుండా.. చరిత్ర, గౌరవం, ఒక సరికొత్త ఫార్మాట్‌తో అభిమానుల ముందుకు అద్భుతంగా రాబోతోంది. క్రీడలు, చరిత్ర కలగలిసిన ఈ మహాసంగ్రామం ఏకంగా అక్టోబర్ 2న, అనగా మహాత్మా గాంధీ జయంతి రోజున ప్రారంభం కానుంది. మహాత్మా గాంధీ 158వ జయంతి సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులతో పాటు చరిత్ర ప్రేమికులకు ఎంతో గర్వకారణంగా, ప్రత్యేకంగా నిలుస్తోంది.
గాంధీజీ జీవితం భారతదేశంతో పాటు ఈ ప్రపంచకప్‌కు ప్రధాన ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా దేశపు భవిష్యత్తును మార్చడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. ఒక సాధారణ యువ బారిస్టర్‌గా దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన గాంధీజీ, అక్కడ తీవ్రమైన వర్ణవివక్షను ఎదుర్కొన్నారు. ఆ పోరాటంలోనే ఆయనలోని సత్యాగ్రహి ఆవిర్భవించారు. దక్షిణాఫ్రికాలో గడిపిన ఆ రెండు దశాబ్దాల కాలమే తన జీవితంలో అత్యంత కీలకమైనదని ఆయన తరచూ భావించేవారు.
అక్కడ భారతీయుల హక్కుల కోసం ఆయన నడిపిన అహింసాయుత పోరాటం, తర్వాతి కాలంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారత్‌లో జాతిపితగా స్వాతంత్ర్య సంగ్రామానికి ఆయన సారథ్యం వహించారు.
ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీని అక్టోబర్ 2న ప్రారంభించడమే బాపూజీకి అర్పించే ఘనమైన నివాళిగా భావిస్తున్నారు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. మొదట ఈ టోర్నీని అక్టోబర్ 8న ప్రారంభించాలని ఐసీసీ భావించినప్పటికీ, ఇప్పుడు ఆ తేదీని అక్టోబర్ 2కి మార్చాలని నిర్ణయించారు. దీంతో వార్మప్ మ్యాచ్‌లు సెప్టెంబర్ చివరి వారంలోనే మొదలుకానున్నాయి. ఆఫ్రికా ఖండంలోని 12 వేదికలలో 14 జట్ల మధ్య జరిగే ఈ ప్రపంచకప్ ఫైనల్ పోరు నవంబర్ 21న అత్యంత వైభవంగా జరగనుంది.
ఈసారి ప్రపంచకప్ తన ప్రారంభ తేదీతో పాటు వినూత్నమైన, ఆసక్తికరమైన ఫార్మాట్ వల్ల కూడా బాగా వార్తల్లో నిలుస్తోంది. మొత్తం 14 దేశాలు పోటీపడుతున్న ఈ టోర్నీకి భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, జింబాబ్వే జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 4 స్థానాల కోసం క్వాలిఫైయర్ పోరు జరగనుంది.
టోర్నీ ప్రధాన దశలో అత్యల్ప ర్యాంకింగ్స్ ఉన్న మూడు జట్ల మధ్య 'సూపర్ సిరీస్' పేరుతో ట్రై-సిరీస్ నిర్వహిస్తారు. ఇందులో విజేతగా నిలిచే జట్టు ప్రధాన రౌండ్లో ఉండే జట్లతో కలుస్తుంది. ఆ తర్వాత 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించి, 'సూపర్ సెవెన్' దశ, సెమీఫైనల్స్ ద్వారా నవంబర్ 21న తుది పోరు నిర్వహిస్తారు. చారిత్రక ప్రాధాన్యతతో కూడిన ఈ టోర్నీ క్రికెట్ చరిత్రలో నిలిచిపోనుంది.
Also REad: విరాట్ కోహ్లీకి ఈ టాలీవుడ్ హీరోయిన్ మరదలు అవుతుంది..ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
Also Read: టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే వార్త..భారత్ - శ్రీలంక తొలి టెస్టు రద్దవుతుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Wife Killed Husband: ఏపీలో దారుణం.. భర్తను గొంతుకోసి చంపిన భార్య.. అనుమానంతో చంపి తల వద్ద దీపం పెట్టింది!
Pakalajeedi, Andhra Pradesh:Wife Killed Husband in AP: కాలం మారుతున్న కొద్దీ వివాహేతర సంబంధాలు, అనుమానాలు కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. ఒకప్పుడు భర్తలు అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు ఉండగా, ఇటీవల కాలంలో భార్యలే స్వయంగా భర్తలను హతమారుస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రేమ వివాహం.. ముగిసిన 30 ఏళ్ల కాపురం..
అల్లూరి సీతారామరాజు జిల్లా చోడవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ ఉన్మాద ఘటన చోటుచేసుకుంది. రామ్మోహనరావుపేట సమీపంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన కొండ్ల ఇందిర, వెంకటరావు (58) దంపతులకు నలుగురు కుమార్తెలు కాగా, ఒక కూతురికి వివాహం అయింది.
వెంకటరావు ప్రైవేటు కేబుల్ నెట్‌వర్క్‌లో ఉద్యోగం చేస్తుండగా, ఇందిర స్థానికంగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ, గడిచిన మూడేళ్లుగా కుటుంబంలో విభేదాలు ప్రారంభమయ్యాయి.
భర్తపై అనుమానంతోనే ఈ అఘాయిత్యం
వెంకటరావుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కొండ్ల ఇందిరతో నిత్యం గొడవలు పడేది. అనకాపల్లిలో ఉన్న కూతురి ఇంటికి వెళ్లి శనివారం తిరిగి వచ్చిన వెంకటరావుపై ఇందిరకు తీవ్ర అనుమానం పెరిగింది.
ఆ మహిళ దగ్గరికే వెళ్లొచ్చాడనే కోపంతో ఊగిపోయిన ఇందిర, పట్టరాని ఆగ్రహంతో కత్తి తీసుకుని భర్త గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. అత్యంత విచిత్రం ఏమిటంటే.. హత్య చేసిన అనంతరం మృతుని తల వద్ద దీపం పెట్టి, నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.
నిందితురాలిగా అంగన్వాడీ కార్యకర్త
మహిళలకు కుటుంబ సమస్యలపై, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించాల్సిన అంగన్వాడీ కార్యకర్తే స్వయంగా ఈ హత్యకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానం పెనుభూతమై ముగ్గురు పిల్లల భవిష్యత్తును, మూడు దశాబ్దాల కాపుారాన్ని చిదిమేసిన ఈ ఘటన చోడవరం ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
Also Read: మరోసారి చంద్రబాబు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ దూరం..అసలేం జరుగుతోంది?
Also Read: భారతదేశానికి అర్ధరాత్రే స్వాతంత్ర్యం ఎందుకు వచ్చింది? ఆగస్టు 15 వెనుక జోతిష్య రహస్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Discovery: పాడుబడ్డ ఇంటి గోడలో బంగారు నిధి..గుట్టలు గుట్టలుగా రూ.100 కోట్ల విలువైన గోల్డ్ బిస్కెట్స్, నాణేలు!
Les Bons Villers, Région wallonne:Gold Discovery In Belgium: ఇంటికి సాధారణ మరమ్మతులు చేస్తుండగా కూలీలకు అనుకోకుండా కోట్ల రూపాయల విలువైన బంగారు నిధి లభించింది. బెల్జియంలో వెలుగు చూసిన ఈ అరుదైన ఘటన ప్రస్తుతం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.
గోడ వెనుక దాగిన నిధి.. అసలేం జరిగింది?
బెల్జియంలోని తూర్పు ఫ్లాండర్స్ ప్రాంతంలో ఓ పాత ఇంట్లో మురుగునీటి పైపులు మార్చే పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా కార్మికులు ఇంటి పునాది వద్ద గోడకు డ్రిల్లింగ్ చేస్తుండగా.. లోపలి నుంచి పసుపు రంగు వస్తువులు బయటపడ్డాయి. మొదట అయోమయానికి గురైన కూలీలు మరింత లోతుగా తవ్వగా, గుట్టలు గుట్టలుగా బంగారు ఆభరణాలు, నాణేలు, గోల్డ్ బిస్కెట్లు దర్శనమిచ్చాయి.
రూ. 100 కోట్ల విలువైన బంగారం!
ఈ పనులలో వేసవి సెలవుల్లో పనిచేయడానికి వచ్చిన 18 ఏళ్ల కోబీ అనే యువకుడు కూడా ఉన్నాడు. మొదట అతను ఆ నాణేలను సాధారణ 1 యూరో నాణేలుగా భావించాడు. కానీ కొద్దిసేపటికి అక్కడ బంగారు కడ్డీలు కనిపించడంతో అది కోట్ల విలువైన నిధి అని అందరూ గ్రహించారు. కార్మికులు కనుగొన్న ఈ నిధి మొత్తం విలువ సుమారు 9 మిలియన్ యూరోలు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ అద్భుత ఆవిష్కరణ అందరినీ విస్మయానికి గురిచేసింది.
బంగారం యజమాని ఎవరు? చట్టం ఏం చెబుతోంది?
బంగారం లభించిన ఆ భవనం స్థానికంగా సేవలందిస్తున్న 'CAW ఊస్ట్ - వ్లాండరెన్' సంస్థకు చెందినదిగా తేలింది. ఈ అరుదైన ఘటనపై ఆ సంస్థ డైరెక్టర్ గీర్ట్ హిల్లెర్ట్ సైతం తీవ్ర ఆశ్చర్య వ్యక్తం చేశారు.
బెల్జియం చట్టాల ప్రకారం.. ఈ నిధిని క్లెయిమ్ చేసుకోవడానికి చట్టబద్ధమైన యజమానికి ఐదు సంవత్సరాల (1,823 రోజులు) గడువు ఉంటుంది. ఒకవేళ ఆ సమయానికి ఎవరూ ముందుకు రాకపోతే, పౌర చట్టం ప్రకారం ఆ నిధిని కనుగొన్న కార్మికులకు, ఆస్తి యజమానికి మధ్య చట్టబద్ధంగా పంచడం జరుగుతుంది.
పోలీసుల హెచ్చరికలు
ఈ అద్భుత నిధి గురించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, ఆ ప్రదేశాన్ని చూడటానికి, వెతకడానికి ప్రజలు భారీగా ఎగబడ్డారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ఇంటిని పూర్తిగా సోదా చేసి, దొరికిన బంగారాన్ని అత్యంత సురక్షిత ప్రాంతానికి తరలించారు. నిధి కోసం ఎవరూ ఆ ప్రాంతానికి రావద్దని పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అనుకోని అదృష్టం ఆ కూలీల జీవితంలో ఊహించని మలుపు తిప్పింది.
Also Read: Videos: నిమిషాల వ్యవధిలో 3 సార్లు కంపించిన భూమి.. ఇండోనేషియాలో 7.7
Also REad: పాకిస్తాన్ ఒక క్యాన్సర్.. ఆగస్టు 11 స్వాతంత్ర్య దినోత్సవం వేళ బలూచ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
WAPL 2026: ఆంధ్ర క్రికెట్ సంఘం కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌లో ఆంధ్ర మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్
Vijayawada, Andhra Pradesh:Womens Andhra Premier League 2026: ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ ప్రోత్సాహానికి విశేష కృషి చేస్తున్న ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పురుషులకు విజయవంతంగా నిర్వహించిన ఆంధ్ర క్రికెట్ సంఘం ఇప్పుడు మహిళలకు కూడా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఏపీ మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నట్లు.. ఈ టోర్నమెంట్ షెడ్యూల్ కూడా ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రకటించింది. భారత మహిళల మాజీ క్రికెట్ మిథాలీ రాజ్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరగనుంది.
ముఖ్యమైన మైలురాయి
భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ.. 'రెండు మూడేళ్లుగా ఏసీఏతో అనుబంధం పెంచుకున్నా. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది ఏసీఏలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఏసీఏ తీసుకున్న ఈ నిర్ణయం ఒక ప్రొఫెషనల్ సెటప్ లాంటిది. రాబోయే కాలంలో ఏసీఏ విమెన్స్ ప్రీమియర్ లీగ్ విజయవంతం అవుతుందని ఆశిస్తున్నా' అని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎంతో మంది క్రికెటర్లు ఉన్నారని.. వారికి అవకాశం.. ప్రోత్సాహం కావాలని పేర్కొన్నారు.
మహిళల క్రికెట్‌కు గుర్తింపు
'ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా ఒక ప్రొఫెషనల్ స్ట్రక్చర్‌ను ఏసీఏ క్రియేట్ చేస్తోంది. దీనివలన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు క్రికెట్ ఆడాలనే ఆసక్తి ఏర్పడుతుంది. విభిన్న కేటగిరీల ప్లేయర్లు ఈ టీమ్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఉన్న ఫ్రాంచైజీలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ప్రతిభ కలిగిన క్రికెటర్లను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తోంది. మహిళల క్రికెట్‌కు బిడ్డింగ్ పెట్టడం ద్వారా దాని విలువ పెరుగుతుంది' అని సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ వెల్లడించారు. 'ఆంధ్రలో మహిళల క్రికెట్‌కు ఒక గుర్తింపు, ప్రాధాన్యం వస్తోంది. ఆంధ్ర నుంచి ఇంకా చాలా మంది ప్లేయర్లు ఇండియా తరఫున ఆడతారని ఆశిస్తున్నా' అని మిథాలీ రాజ్ తెలిపారు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో కూడా మన ప్లేయర్లను చూసే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మన ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెట్ చరిత్రలో ఇదొక నూతన శకం! 🏏✨ @Andhra_Cricket_ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన "మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) 2026" లోగో ఆవిష్కరణ కావడం ఎంతో సంతోషకరం...
మన ఆడబిడ్డల క్రీడా ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఇది ఒక గొప్ప వేదిక కానుంది.… pic.twitter.com/Yjz5syQFl7
— Kesineni Sivanath (@KesineniS) August 15, 2026
షెడ్యూల్ విడుదల
ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఆంధ్ర మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. సెప్టెంబర్ 15 - 26 వరకు మంగళగిరిలో డేఅండ్ నైట్ మ్యాచ్‌లు జరుగుతాయి. త్వరలోనే క్రికెట్ అకాడమీ కూడా ఇక్కడ ప్రారంభిస్తాం. సెప్టెంబర్ 15 నుంచి 26వ తేదీలోపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది' అని ప్రకటించారు. ప్రస్తుతం 4 టీమ్స్‌తో ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌ను భవిష్యత్తులో మరిన్ని టీమ్స్‌తో విస్తరించాలనే ఆలోచన ఉందని చెప్ఆరు. మిథాలీరాజ్ సేవలను ఆంధ్ర క్రికెట్ సంఘం ఉపయోగించుకుంటుందని.. ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళా క్రీడాకారులు కూడా వస్తున్నారని పేర్కొన్నారు.
'మహిళల క్రికెట్‌కి కూడా ప్రాధాన్యం వచ్చేలా ఆంధ్ర క్రికెట్ సంఘం పనిచేస్తోంది. రాబోయే కాలంలో మూలపాడులో చక్కటి అకాడమీ కూడా ప్రారంభించుకోబోతున్నాం. మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించడానికి పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నాం' అని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని ప్రకటించారు.
Tragedy: స్వాతంత్య్ర దినోత్సవం రోజు తీవ్ర విషాదం.. కృష్ణా నదిలో ముగ్గురు యువకులు మృతి
Tadepalli, Andhra Pradesh:Three Youths Dies In River: స్వాతంత్య్ర దినోత్సవం సెలవు కావడంతో సరదాగా ఆడుకుందామని కృష్ణా నదికి కొందరు యువకులు వచ్చారు. నది నీటిలో ఈత కొడుతూ సరదాగా గడుపుతున్నారు. అయితే ప్రమాదవశాత్తు నీటి లోపలికి మునిగిపోయారు. అలా ముగ్గురు మునిగిపోయి నీటిలో గల్లంతయ్యారు. లోతు ప్రాంతంలోకి వెళ్లడంతో వారంతా విగతజీవులుగా మారారు. ఈ సంఘటన ఏపీలోని తాడేపల్లిలో ఉన్న కృష్ణా నది వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన ముగ్గురు యువకులు వీసం గౌతమ్ (18), గడ్డం జాషువా (17), తీగుళ్ల తేజ (18) తాడేపల్లి సమీపంలోని కృష్ణలంక మెట్లబజారు పద్మావతి ఘాట్ వద్ద కృష్ణా నదిలోకి దిగారు. స్వాతంత్య్ర దినోత్సవం సెలవు కావడంతో మిత్రులంతా కలిసి నదిలో ఈత కొట్టారు. సరదాగా ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. స్నానానికి నదిలోకి దిగిన సమయంలో ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో ముగ్గురూ గల్లంతయ్యారు. ఈ విషయం తెలిసిన గత ఈతగాళ్లు, స్థానికులు గాలించగా ముగ్గురి మృతదేహాలు లభించాయి. ముగ్గురు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నదిలోకి స్నానానికి వెళ్లే సమయంలో ప్రజలు, ముఖ్యంగా యువకులు సాహసాలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
అనకాపల్లి జిల్లా చోడవరం అంబేడ్కర్ కాలనీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తన భర్తను భార్య హత్య చేసింది. కొండ్ల వెంకటరావు (58), ఇందిర (54) భార్యాభర్తలు. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. స్థానికంగా అంగన్వాడీ టీచర్‌గా ఇందిర తన భర్త ప్రవర్తనతో విసిగిపోయి హత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న చోడవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాకరాపేట ఘాట్‌లో భారీ రోడ్డు ప్రమాదం
తిరుపతి జిల్లా బాకరాపేట ఘాట్‌లో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 20 చక్రాల భారీ లారీ అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఘాట్ రోడ్డులో వెళ్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి లారీ పడిపోగా.. టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని స్థానికులు, పోలీసులు ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిపోయిన లారీని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లారీలో ఎంతమంది ఉన్నారనే దానిపై ఇంకా వివరాలు తెలియలేదు.
Pawan Kalyan: స్వాతంత్య్ర వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీబిజీ
Kakinada, Andhra Pradesh:Deputy CM Pawan Kalyan One Day Three Tours And Effected Health Problem Watch VisualsBalapur Ganesh: పూరీ జగన్నాథ్ ఆలయ రూపంలో బాలాపూర్ గణేష్ మండపం
Balapur, Telangana:Puri Jagannath Temple Theme: వినాయక చవితి ఉత్సవాల్లో విశిష్ట ప్రాధాన్యం ఉన్న బాలాపూర్ గణేశ్ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈసారి కొత్త థీమ్‌తో బాలాపూర్ గణేశ్ రూపుదిద్దుకుంటోంది. అశేష సంఖ్యలో భక్తులు విచ్చేస్తుండడంతో వారికి మరపురాని అనుభూతి కల్పించేందుకు బాలాపూర్ గణేశ్ ఉత్సవ నిర్వాహకులు ఈసారి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి యేడాది మాదిరి ఈ ఏడాది మరో కొత్త థీమ్‌తో వస్తున్నారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథ్ స్వామి ఆలయ రూపంలో మండపాన్ని రూపుదిద్దుతున్నారు.
ప్రతి సంవత్సరం భక్తులకు వైభవంగా దర్శనమిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న బాలాపూర్ గణేష్ 2026 సంవత్సరానికి సంబంధించి కొత్తగా కనిపించనున్నారు. ఈ ఏడాది మరో అద్భుతమైన రూపంలో భక్తులను కనువిందు చేయబోతున్నారు. గతంలో అరుణాచలేశ్వర ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, యాదాద్రి స్వర్ణగిరి ఆలయం, అయోధ్య శ్రీరామ మందిరం వంటి పుణ్యక్షేత్రాల థీమ్‌లలో మండపాన్ని రూపొందించి బాలాపూర్ గణేష్ భక్తులకు దర్శనమిచ్చింది. కొత్త కొత్త థీమ్‌లకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండడంతో ఈ ఏడాది కూడా మరో పుణ్యక్షేత్రాన్ని ఎంచుకున్నారు. ఈసారి పూరీ ఆలయం రూపంలో మండపాన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రతి సంవత్సరం సుధాకర్ రెడ్డి డెకరేటర్స్ ఈ ఆలయ నమూనాలు వేస్తుండగా... ప్రతి రూపం భక్తుల్లో ఆధ్యాత్మిక భావన, భక్తి శ్రద్ధలను మరింత పెంచుతున్నాయి.
ఈ ఏడాది ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ స్వామి ఆలయ థీమ్‌లో బాలాపూర్ గణేష్ భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. జగన్నాథ స్వామి ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా బాలాపూర్ గణేశ్ మండపం రూపొందించనున్నారు. ఈ ఆలయంతో బాలాపూర్ గణేశ్ సరికొత్తగా కనిపిస్తాడని.. భక్తుల కళ్లకు పండుగలా, హృదయాలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచేలా ఉండబోతుందని ఉత్సవ సమితి నిర్వాహకులు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహిస్తుండగా ఈసారి అంతకుమించి ఉత్సవాలు నిర్వహించాలని బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక లడ్డూ వేలంలో రికార్డులు తిరగరాసే బాలాపూర్ లడ్డూ ఈసారి ఎంతకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Pawan Kalyan Chandrababu: మరోసారి చంద్రబాబు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ దూరం..అసలేం జరుగుతోంది?
Vijayawada, Andhra Pradesh:Pawan Kalyan Chandrababu News: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో చీలికలు మొదలయ్యయా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే గత నెల రోజులుగా ఏపీలోని కూటమి పార్టీల్లో లుకలుకలు మొదలైనట్లు తెలుస్తోంది. అందుకు రుజువుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరంగా ఉండటమే అని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ నివాసంలో జరిగిన 'ఎట్ హోమ్' విందుకు కూడా ఆయన హాజరుకాలేదు.
'ఎట్ హోమ్' కార్యక్రమానికి గైర్హాజరు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోక్‌భవన్‌లో సంప్రదాయంగా నిర్వహించే 'ఎట్ హోమ్' విందు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకావడం లేదని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. కాకినాడలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల తర్వాత, రాజమహేంద్రవరంలో అటవీశాఖకు చెందిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ప్రారంభించే సమయంలో పవన్‌కు తీవ్ర జ్వరం వచ్చిందని, అందుకే కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించాల్సి వచ్చిందని జనసేన తెలిపింది.
రాజమహేంద్రవరంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ను వైద్యులు పరీక్షించి తగిన విశ్రాంతి సూచించడంతో, ఆయన అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఇటీవల కుడి భుజానికి జరిగిన శస్త్రచికిత్సకు సంబంధించి ఫిజియోథెరపీపై వైద్యుల సూచనలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
ఇటీవల కాలంలో అమరావతిలో జరిగిన స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం వంటి పలు అధికారిక కార్యక్రమాలకు చంద్రబాబుతో పాటు పవన్ హాజరుకాకపోవడం, విశాఖపట్నంలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చకు దారితీసింది. అంతేకాకుండా, గతంలో వరుసగా కొన్ని కేబినెట్ సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉండటంతో కూటమి ప్రభుత్వంలో పార్టీల మధ్య అసలు ఏం జరుగుతోందనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.
Also Read: కర్నూలు పర్యటనలో వైఎస్ జగన్‌కు తీవ్ర అవమానం?! జైలులో మాజీ ముఖ్యమంత్రికి చేదు అనుభవం!
Also Read: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..జనసేనలోకి ఎమ్మెల్యే రాజాసింగ్..అసలు ట్విస్ట్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
