Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mancherial504251

యూపీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు

Sept 04, 2024 15:56:42
Bellampalle, Kannal Rural, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్ లో యూపీహెచ్సీ షంషీర్ నగర్ ఆధ్వర్యంలో ఆర్బీఎస్కే టీం పర్యవేక్షణలో బుధవారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో వార్డ్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి వైద్యులు మందులు అందజేశారు. అత్యవసరమైన కేసులను సీహెచ్ సీ కి సూచిస్తున్నారు. ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రతతో పాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటామని అన్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Jan 17, 2026 10:49:03
Hyderabad, Telangana:

Bank Holidays This Week: మీరు ఈ వారంలో బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులు ఏవైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ ప్రకారం.. జనవరి 19 నుండి జనవరి 25 మధ్య ఎటువంటి అదనపు పండుగ సెలవులు లేనప్పటికీ, వారాంతపు సెలవుల కారణంగా బ్యాంకులు రెండు రోజులు మూసి ఉంటాయి.

వారాంతపు సెలవుల వివరాలు..
RBI నిబంధనల ప్రకారం.. ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలతో పాటు అన్ని ఆదివారాలు బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ క్రమంలో జనవరి 24న నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు పనిచేయవు. అలాగే జనవరి 25న ఆదివారం సాధారణ వారాంతపు సెలవు కారణంగా బ్యాంకులన్నీ మూసి ఉంటాయి.

జనవరి 26న 'గణతంత్ర దినోత్సవం' సెలవు
వారాంతపు సెలవుల వెంటనే సోమవారం, జనవరి 26న గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అంటే శని, ఆది, సోమవారాల్లో వరుసగా మూడు రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం కలగనుంది. కాబట్టి వినియోగదారులు తమ బ్యాంకింగ్ పనులను జనవరి 23 (శుక్రవారం) లోపే పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం.

బ్యాంకులు మూసి ఉన్నా అందుబాటులో ఉండే సేవలు ఇవే!
భౌతిక బ్యాంక్ శాఖలు పని చేయకపోయినప్పటికీ, డిజిటల్ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయి.

ATM సేవలు: నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ విచారణ కోసం ATMలు యథావిధిగా పనిచేస్తాయి.

డిజిటల్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా నిధుల బదిలీ (IMPS, NEFT, RTGS) చేసుకోవచ్చు.

UPI చెల్లింపులు: గూగుల్ పే, ఫోన్ పే వంటి UPI సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.

కార్డ్ లావాదేవీలు: డెబిట్, క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్ లేదా షాపింగ్ మాల్స్‌లో చెల్లింపులు చేసుకోవచ్చు.

గమనిక: చెక్కుల క్లియరెన్స్, నగదు డిపాజిట్లు, కొత్త ఖాతాల ప్రారంభం వంటి శాఖలకు వెళ్లి చేయాల్సిన పనులకు మాత్రం ఈ సెలవు దినాల్లో వీలుండదు.

Also Read: Blinq EV Car: ఆటో రిక్షా ధరకే ఎలక్ట్రిక్ కారు..కేవలం రూ.3 లక్షలకే EV కారు..5 నిమిషాల్లో ఛార్జింగ్ ఫుల్!

Also Read: Siva Balaji Madhumitha: విడాకులకు రెడీ అయిన మరో టాలీవుడ్ కపుల్..శివబాలాజీ-మధుమిత బంధంలో విడాకుల సెగ?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 17, 2026 10:15:25
Hyderabad, Telangana:

Blinq Mobility EV Car Price: భారతీయ నగరాల్లో నిత్యం వేధించే ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ, సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా బ్లింక్ మొబిలిటీ (Blink Mobility) ఒక వినూత్న ఎలక్ట్రిక్ పాడ్ కారును ఆవిష్కరించింది. రతన్ టాటా 'నానో' కలలను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ కారు రూపం ఉండడం విశేషం. ఇంతకీ ఆ కారు విశేషాలేంటో తెలుసుకుందాం.

భారతీయ రోడ్లపై ప్రయాణాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థులు, టెస్లా మాజీ నిపుణులు కలిసి ఈ అత్యాధునిక ఈవీని రూపొందించారు. కేవలం రూ.2 నుంచి రూ.3 లక్షల ధరలోనే లభించే అవకాశం ఉన్న ఈ కారు, భవిష్యత్తు సిటీ మొబిలిటీని మార్చేయనుంది.

డిజైన్, లుక్ వివరాలు..
కాంపాక్ట్ సైజ్:
రద్దీగా ఉండే నగరాల్లో, చిన్న గల్లీల్లో కూడా సులభంగా నడిపేలా ఇది చాలా చిన్నగా, ఆకర్షణీయంగా ఉంటుంది.

ఫ్యూచరిస్టిక్ ఫీచర్లు: ముందు భాగంలో హెక్సాగోనల్ డీఆర్‌ఎల్‌లు (DRLs), ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, వెనుక స్టైలిష్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లతో ఇది ఆధునిక లుక్‌ను కలిగి ఉంది.

స్పేస్: స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించడం వల్ల కారు లోపల ప్రయాణికులకు ఎక్కువ స్థలం లభిస్తుంది.

బ్యాటరీ స్వాపింగ్ -గేమ్ ఛేంజర్
ఈ కారులోని అత్యంత ముఖ్యమైన ఫీచర్ బ్యాటరీ స్వాపింగ్ (Battery Swapping). గంటల కొద్దీ ఛార్జింగ్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, ఖాళీ అయిన బ్యాటరీని తీసివేసి నిండుగా ఉన్న బ్యాటరీని కేవలం 5 నిమిషాల్లోనే మార్చుకోవచ్చు.

బ్యాటరీని ఒక సర్వీస్‌గా అందించడం వల్ల కారు ధర గణనీయంగా తగ్గుతుంది. అంటే కారును బ్యాటరీ లేకుండా కొనుగోలు చేసి, వాడుకున్న దానికి మాత్రమే ఛార్జీలు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. అయితే ఒకసారి బ్యాటరీ సెట్ వేసుకుంటే సుమారు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు
బ్లింక్ మొబిలిటీ పాడ్ కారు కేవలం చౌకగా ఉండటమే కాదు, అత్యంత సురక్షితమైనది కూడా. అంతే కాకుండా డ్రైవర్ అలసటను గుర్తించి అప్రమత్తం చేసే స్మార్ట్ ఏఐ టెక్నాలజీ ఉంది. ప్రమాదం జరిగే అవకాశం ఉంటే ముందే హెచ్చరించే వ్యవస్థను ఇందులో అమర్చారు.

కంపెనీ నేపథ్యం, పెట్టుబడులు
నికేష్ బిష్త్ స్థాపించిన ఈ సంస్థలో.. టెస్లాలో సైబర్ ట్రక్ వంటి ప్రాజెక్టులపై పనిచేసిన అంకిత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ స్టార్టప్ రూ.4.3 కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధులతో బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్‌ను, పైలట్ ప్రాజెక్టులను వేగవంతం చేయనున్నారు.

Also Read: Siva Balaji Madhumitha: విడాకులకు రెడీ అయిన మరో టాలీవుడ్ కపుల్..శివబాలాజీ-మధుమిత బంధంలో విడాకుల సెగ?!

Also Read: Salary Hike: ఉద్యోగులకు సంక్రాంతి కానుక..17 శాతం జీతాల పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్?!..మూడేళ్ల నిరీక్షణకు తెర!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 17, 2026 09:58:20
Hyderabad, Telangana:

Oneplus 15T Launch Date In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలో ఒకటైన వన్‌ప్లస్ కంపెనీ త్వరలోనే తమ కొత్త మొబైల్‌ను విడుదల చేయబోతోంది. ఇటీవల లీకైన వివరాల ప్రకారం, దీనిని కంపెనీ వన్‌ప్లస్ 15T (Oneplus 15T) పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. దీన్నిబట్టి చూస్తే ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ సిరీస్‌లో విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొత్తం రెండు మోడల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15R మోడల్స్‌తో వినియోగదారులకు లభించబోతోంది.  

లీకైన వివరాల ప్రకారం, ఈ వన్‌ప్లస్ 15T మొబైల్ ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో లాంచ్ కాబోతోంది. అయితే, ఈ మొబైల్‌ను కంపెనీ భారత మార్కెట్లో వన్ ప్లస్ 15 ఎస్ గా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది 1.5K రిజల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉండబోతోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతమైన 6.3-అంగుళాల LTPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు వెనక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఈ కెమెరాలు భాగంగా వెనక భాగంలో రెండు 50-మెగాపిక్సెల్ ప్రత్యేకమైన సెన్సార్లతో కూడిన కెమెరాలు కూడా కలిగి ఉంటుంది అలాగే ఇది ఎంతో శక్తివంతమైన 7,500mAh బ్యాటరీని ప్యాక్‌తో లంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ వన్‌ప్లస్ 15T స్మార్ట్‌ఫోన్‌ మొత్తం నాలుగు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులోని మొదటి వేరియంట్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ని కలిగి ఉంటుంది. ఇక చివరి వేరియంట్ 16gb ర్యామ్‌తో 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక OnePlus 15 6.78-అంగుళాల FHD+ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 1.5K LTPO AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉండబోతోంది. కాబట్టి ఇది మల్టీ టాస్కింగ్ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది.. ముఖ్యంగా ఎక్కువ గేమింగ్ చేసే వారికి ఈ స్మార్ట్‌ఫోన్‌ బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు.

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

ఈ OnePlus 15 స్మార్ట్ ఫోన్ 16 ఆధారంగా కలర్ OS 16 ఆపరేటింగ్ సిస్టంపై విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇందులో ప్రత్యేకమైన ఐస్ రివర్ వేపర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ మొబైల్ వెనుక భాగంలో కూడా అద్భుతమైన కెమెరా సెటప్ లభించబోతోంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన విడుదల తేదీని వన్ ప్లస్ కంపెనీ త్వరలోనే వెల్లడించబోతోంది. కాబట్టి అధికారిక ధ్రువీకరణ కోసం కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 17, 2026 09:47:04
Hyderabad, Telangana:

Siva Balaji Madhumitha Divorce: సినిమా నటుడిగా, బిగ్ బాస్ విజేతగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన శివబాలాజీ, తన భార్య మధుమితతో కలిసి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి ప్రేమకథలో ఉన్న మలుపులు, పెళ్లయ్యాక ఎదురైన గొడవల గురించి సంచలన విషయాలు వెల్లడించారు.

ప్రేమ కోసం మూడు రోజుల నిరాహార దీక్ష
శివబాలాజీ, మధుమితల ప్రేమ పెళ్లికి మొదట్లో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా మధుమిత తల్లికి ఈ సంబంధం అస్సలు ఇష్టం లేదట. పెళ్లికి ఒప్పుకోకుండా ఆమెను గదిలో బంధించి, ఫోన్ కూడా లాగేసుకున్నారట. శివబాలాజీని పెళ్లి చేసుకోవడం కోసం మధుమిత ఏకంగా మూడు రోజుల పాటు అన్నపానీయాలు మానేసి నిరాహార దీక్ష చేశారట. చివరికి ఆమె తండ్రి జోక్యం చేసుకుని తల్లిని ఒప్పించడంతో వీరి వివాహం ఘనంగా జరిగింది.

విడాకుల ఆలోచన..!
పెళ్లైన మొదటి ఒకటిన్నర సంవత్సరం వీరిద్దరికీ నరకంలా గడిచిందని వారు చెప్పుకొచ్చారు. అప్పటికే వారికి బాబు కూడా పుట్టాడు. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలు కారణంగా మూడో వ్యక్తిని (బయటి వ్యక్తులను) తమ గొడవల్లోకి లాగడం వల్ల సమస్యలు మరింత ముదిరాయని వారు చెప్పుకొచ్చారు. గొడవలు తారాస్థాయికి చేరడంతో విడాకులు తీసుకోవాలని కూడా అనుకున్నారట. ఒక దశలో కజిన్ సలహాతో కొన్ని రోజులు విడివిడిగా కూడా ఉన్నారు.

నిలిపిన 'ఇగో' త్యాగం
ఎట్టకేలకు తమ మధ్య ఉన్న 'ఇగో' (అహంకారం) సమస్యలను పక్కన పెట్టాలని ఈ జంట నిర్ణయించుకుంది. బయటి వ్యక్తుల ప్రమేయం లేకుండా తమ సమస్యల గురించి నేరుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అలా ఒకరిపై ఒకరికి ఉన్న అపార్థాలు తొలగిపోయి, ప్రస్తుతం ఒక అన్యోన్యమైన దంపతులుగా కొనసాగుతున్నారు.

Also Read: Train Accident Today: పట్టాలు తప్పిన తిరుపతి ట్రైన్..రెండు బోగీలు ఈడ్చుకెళ్లి..పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం!

Also REad: AP Employees DA Arrears: సంక్రాంతి ధమాకా..60 నెలల DA బకాయిలు విడుదల..ఉద్యోగుల ఖాతాల్లో రూ.60 వేల వరకు జమ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 17, 2026 09:43:10
Hyderabad, Telangana:

Home Made Fraud Telugu Latest News: ఇంట్లో తయారు చేస్తున్న పదార్థాలు అంటూ అమాయక కస్టమర్స్‌ని నమ్మబలికి.. వారి నుంచి భారీ డబ్బులు వసూలు చేస్తున్న ఓ దుకాణం అసలైన మోసం గుట్టు రట్టయింది. బ్రాండెడ్ వస్తువులను హోమ్‌ మేడ్ పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదుతో ఆహార భద్రత అధికారులు సదరు షాపుపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే వారి అసలైన దందా ఏంటో బయటపడింది. ఇది తెలుసుకున్న అమాయపు కస్టమర్స్ ఒక్కసారిగా శాఖ అయిపోయారు. ఇప్పుడు దీనికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కెర్లు కొడుతుంది. ఇంతకీ ఏమైంది? ఎక్కడ ఇంతటి దారుణం జరిగింది? దీనికి సంబంధించిన అసలైన విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఏం జరిగిందంటే జగిత్యాల పట్టణానికి చెందిన నవీన్ అనే ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న కొత్త బస్టాండుకు చాలా దగ్గరగా ఉండే రాజు స్వీట్స్ అండ్ హోమ్స్ ఫుడ్స్ దుకాణానికి వెళ్ళాడు. అక్కడ అమ్ముతున్న ఒక కిలో పచ్చడిని ఇంట్లోనే స్వయంగా తయారు చేసిందని యజమాని అనడంతో... వెంటనే నవీన్ ఆ తొక్కును కొనుగోలు చేశాడు.. అయితే సాధారణ మార్కెట్లో దాని ధర 180 రూపాయలకు లభిస్తుంది.. కానీ ఆ తొక్కును అమ్ముతున్న యజమాని హోం మేడ్ పేరు చెప్పి ఏకంగా రూ.400 విక్రయించాడు.

అయితే నవీన్ తాను మోసపోయానని గ్రహించిన వెంటనే జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అతను కోరారు.. దీంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష వెంటనే రంగంలోకి దిగింది. తక్షణమే స్పందిస్తూ అధికారులు సదరు దుకాణంలో తనిఖీలు చేపట్టారు. అయితే ఈ క్రమంలో షాప్ లో నిల్వ ఉంచిన పచ్చళ్ళతోపాటు ఇతర ఆహార పదార్థాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతోపాటు వారు విక్రయిస్తున్న పచ్చళ్లపై ఎలాంటి సమాచారం లేకపోవడానికి కూడా గుర్తించారు. 

ఈ సందర్భంగా జగిత్యాల ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష మాట్లాడుతూ.. కొన్ని కీలకమైన విషయాలను కస్టమర్స్ కి వెల్లడించారు.. వస్తువులు ఇంట్లో తయారుచేసిన లేదా ఫ్యాక్టరీలో తయారుచేసిన.. ప్యాకింగ్ తేదీలపై తప్పనిసరిగా తయారి తేదీతో పాటు ఎక్స్పైరీ డేట్ ఉండాల్సిందేనని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి విక్రయిస్తున్న పచ్చళ్లను సీజ్ చేసి పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు పంపారు. అంతేకాకుండా దీనికి గాను ఆ షాపును విక్రయిస్తున్న యజమానికి ప్రత్యేకమైన నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే మూడు రోజుల్లో ఈ వ్యవహారంపై ప్రత్యేకమైన వివరణ ఇవ్వాలని.. లేకపోతే దుకాణానికి సంబంధించిన లైసెన్సును రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
BBhoomi
Jan 17, 2026 09:42:16
Lakshmapur, Telangana:

Union Budget 2026:  2026 కేంద్ర బడ్జెట్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రియల్ ఎస్టేట్ రంగంలో ఆశలు మరింత పెరుగుతున్నాయి. నివాస, వాణిజ్య ప్రాజెక్టులతో పాటు టైర్–2, టైర్–3 నగరాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని డెవలపర్లు కోరుతున్నారు. గృహ యాజమాన్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవాలంటే ఈ బడ్జెట్‌లో కీలక సంస్కరణలు అవసరమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంపై ఉన్న జీఎస్టీ భారమే గృహ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా మారిందని డెవలపర్లు చెబుతున్నారు. నివాస ప్రాజెక్టులపై 5 శాతం లేదా 12 శాతం జీఎస్టీ ఉండగా, రూ.45 లక్షల వరకు ఉన్న సరసమైన ఇళ్లకు మాత్రమే 1 శాతం జీఎస్టీ వర్తిస్తోంది. అయితే నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో, ఈ పరిమితి చాలా తక్కువగా మారిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా సగటు ఆదాయం కలిగిన వ్యక్తికి సొంత ఇల్లు కలగానే మిగిలిపోతోందని వారు అంటున్నారు.

ఈ నేపథ్యంలో 2026 బడ్జెట్‌లో కొన్ని కీలక డిమాండ్లను పరిశ్రమ ప్రభుత్వం ముందుంచుతోంది. సరసమైన గృహాల ధర పరిమితిని రూ.80–90 లక్షల వరకు పెంచాలని, అలా చేస్తే మరిన్ని ఇళ్లు 1 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయని సూచిస్తున్నారు. అలాగే కొన్ని విభాగాల్లో జీఎస్టీ రేట్లను తగ్గించడం లేదా సరళమైన పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతున్నారు.

Also Read: Pension: తమ సంబంధాన్ని ఎప్పుడూ దాచలేదు..లివ్‌-ఇన్‌-పార్ట్‌నెర్‌కు పెన్షన్ ఇవ్వాల్సిందే.. కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు..!

ఇదే సమయంలో నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు వర్క్స్ కాంట్రాక్టులపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 12 శాతం లేదా 5 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టుల అనుమతులను వేగవంతం చేయడం, రోడ్లు, మెట్రో రైలు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాలపై ఎక్కువ పెట్టుబడి పెట్టడం కూడా కీలకమని అంటున్నారు.

ఈ సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే, రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు వస్తుందని, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని డెవలపర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం పెరిగి, “అభివృద్ధి చెందిన భారత్” లక్ష్యానికి బడ్జెట్ 2026 బలమైన పునాది వేస్తుందని వారు నమ్ముతున్నారు.

Also Read: Yogi Adityanath: అంతా టీచరే చేశారు.. యోగి బాల్డ్ హెడ్‌కి కారణం తెలుసుకుంటే మైండ్ బ్లాక్‌ అవుతుంది.. ఓసారి ఈ యూపీ సీఎం బాల్యంలోకి తొంగిచూద్దామా?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Jan 17, 2026 09:06:58
Lakshmapur, Telangana:

Budget 2026: బడ్జెట్ 2026 నేపథ్యంలో సామాన్యుల జేబుపై దాని ప్రభావం ఎలా ఉండబోతుందన్న అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పన్నుల్లో ఉపశమనం లభిస్తుందా? నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయా? పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం ఏదైనా ఊరట కల్పిస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోర్గాన్ స్టాన్లీ విడుదల చేసిన తాజా నివేదిక, రాబోయే బడ్జెట్ దిశను, ప్రభుత్వ ఆర్థిక వ్యూహాన్ని స్పష్టంగా సూచిస్తోంది.

మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం..  ఈసారి ప్రభుత్వం పన్ను నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. గత బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లను తగ్గించడం వల్ల పన్ను వసూళ్ల వృద్ధి ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. అంచనాల ప్రకారం 21 శాతానికి పైగా ఉండాల్సిన పన్ను వృద్ధి, వాస్తవంగా కేవలం 6.8 శాతానికే పరిమితమైంది. దీంతో ప్రభుత్వ ఆదాయంపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2026లో భారీ పన్ను తగ్గింపులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నివేదిక స్పష్టం చేస్తోంది. అయితే.. పూర్తిగా ఉపశమనం ఉండదని కాదు. పెద్ద ఎత్తున పన్ను స్లాబ్ మార్పులు కాకపోయినా, చిన్నపాటి సర్దుబాట్లు, రిబేట్‌లలో స్వల్ప మార్పులు లేదా పరిమిత రాయితీలు ఇవ్వవచ్చని అంచనా. దీని ద్వారా ప్రభుత్వ వసూళ్లపై భారం పడకుండా, సామాన్యులకు కొంత ఊరట కల్పించే ప్రయత్నం ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

ద్రవ్యోల్బణంపై కూడా బడ్జెట్ ప్రభావం కీలకంగా ఉండనుంది. ప్రభుత్వ ఖర్చులు పెరిగితే, వాటికి అవసరమైన నిధుల కోసం పన్ను ఆధారాన్ని విస్తరించడం లేదా కొన్ని సేవలపై ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. దీని ప్రభావం పెట్రోల్, డీజిల్, విద్యుత్, గ్యాస్, రేషన్ వంటి నిత్యావసరాల ధరలపై పడవచ్చు. సబ్సిడీల్లో మార్పులు జరిగితే కొన్ని వస్తువులు ఖరీదయ్యే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము. ఇక వ్యయపరంగా చూస్తే, ప్రభుత్వం తన ప్రధాన ఎజెండాపైనే దృష్టి సారించనుంది. రోడ్లు, రైల్వేలు, పట్టణ మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యం, విద్య, పట్టణ సేవల వంటి సామాజిక మౌలిక రంగాలపై ఖర్చును పెంచడం ద్వారా ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగనుంది. ఇవి నేరుగా సామాన్యుల దైనందిన జీవితంపై సానుకూల ప్రభావం చూపే అంశాలుగా నిపుణులు భావిస్తున్నారు.

Also Read: Yogi Adityanath: అంతా టీచరే చేశారు.. యోగి బాల్డ్ హెడ్‌కి కారణం తెలుసుకుంటే మైండ్ బ్లాక్‌ అవుతుంది.. ఓసారి ఈ యూపీ సీఎం బాల్యంలోకి తొంగిచూద్దామా?

ఉపాధి అవకాశాల సృష్టి కూడా ఈ బడ్జెట్‌లో కీలక అంశంగా మారనుంది. ముఖ్యంగా MSME రంగానికి మద్దతు, సులభమైన రుణాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ స్కిల్స్‌పై పెట్టుబడులు పెరగవచ్చని మోర్గాన్ స్టాన్లీ నివేదిక సూచిస్తోంది. దీని ద్వారా చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు ఊతం లభించి, కొత్త ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. మొత్తంగా.. బడ్జెట్ 2026లో సామాన్యులకు భారీ పన్ను ఉపశమనం కంటే, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక రంగాలపై పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెంపుపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు సబ్సిడీలు, టారిఫ్‌ల్లో మార్పులు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ బడ్జెట్ సామాన్యుల జేబుపై భారం పూర్తిగా తగ్గించకపోయినా, దీర్ఘకాలంలో జీవన సౌకర్యాలు మెరుగుపడేలా మార్గం వేసే బడ్జెట్‌గా ఉండవచ్చని అంచనా వేయొచ్చు.

Also Read: Pension: తమ సంబంధాన్ని ఎప్పుడూ దాచలేదు..లివ్‌-ఇన్‌-పార్ట్‌నెర్‌కు పెన్షన్ ఇవ్వాల్సిందే.. కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు..!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Jan 17, 2026 07:40:15
Lakshmapur, Telangana:

Hindu Adoptions and Maintenance Act: సుప్రీంకోర్టు తాజాగా వితంతువుల హక్కులను మరింత బలోపేతం ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. హిందూ దత్తత, నిర్వహణ చట్టం, 1956 ప్రకారం, ఒక మహిళ తన భర్త మరణించిన తర్వాత వితంతువుగా మారినప్పటికీ.. ఆమె మామగారి ఆస్తి నుండి భరణం పొందే హక్కు కలిగి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భర్త మరణం మామగారి మరణానికి ముందు జరిగిందా? తర్వాత జరిగిందా? అనే అంశం ఆధారంగా వితంతువు హక్కులను నిరాకరించలేమని కోర్టు తేల్చిచెప్పింది.

ఈ తీర్పుకు కారణమైన కేసు దివంగత డాక్టర్ ప్రసాద్ ఆస్తికి సంబంధించినది. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుడు రంజీత్ శర్మ మార్చి 2, 2023న మరణించారు. రంజీత్ శర్మ భార్య గీతా శర్మ, తన భర్త మరణించిన అనంతరం మామగారి ఆస్తి నుంచి భరణం ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే కుటుంబం తరఫున వాదన ఏమిటంటే, డాక్టర్ ప్రసాద్ 2011లోనే తన ఆస్తిని మరో కుమారుడు దేవిందర్ రాయ్ భార్య కాంచన రాయ్,  వారి పిల్లలకు వారసత్వంగా ఇస్తూ వీలునామా రాశారని, అందులో రంజీత్ శర్మను పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో గీతా శర్మ దాఖలు చేసిన భరణం పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. డాక్టర్ ప్రసాద్ మరణించిన సమయంలో గీతా శర్మ వితంతువు కాదనే కారణంతో ఆమె అభ్యర్థనను కొట్టివేసింది. దీనిపై గీతా శర్మ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఫ్యామిలీ కోర్టు తీర్పును రద్దు చేస్తూ, గీతా శర్మ చట్టపరంగా ఆధారపడిన వ్యక్తేనని పేర్కొంది. భరణం అంశాన్ని మళ్లీ పరిశీలించాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది.

Also Read: Yogi Adityanath: అంతా టీచరే చేశారు.. యోగి బాల్డ్ హెడ్‌కి కారణం తెలుసుకుంటే మైండ్ బ్లాక్‌ అవుతుంది.. ఓసారి ఈ యూపీ సీఎం బాల్యంలోకి తొంగిచూద్దామా?

ఈ నిర్ణయాన్ని కాంచన రాయ్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. గీతా శర్మ తన మామగారి మరణ సమయంలో వితంతువు కాదని, అందువల్ల ఆమెకు భరణం హక్కు ఉండదని వాదించారు. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. చట్టంలోని సెక్షన్ 21(vii) ప్రకారం, కుమారుడి ఏ వితంతువైనా కుటుంబంపై ఆధారపడిన వ్యక్తిగా పరిగణిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. భర్త మరణం మామగారి మరణానికి ముందే జరగాలి అనే షరతు చట్టంలో ఎక్కడా లేదని కోర్టు స్పష్టంగా పేర్కొంది.

అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లను ఉటంకిస్తూ, భర్త మరణించిన కాలాన్ని ఆధారంగా చేసుకుని వితంతువుల మధ్య వివక్ష చూపడం సమానత్వ హక్కుకు విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది. భరణం నిరాకరించడం మహిళ గౌరవంగా జీవించే హక్కును హరించడమేనని పేర్కొంది. ఇలాంటి విధానం వితంతువులను పేదరికం, సామాజిక ఒంటరితనంలోకి నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది.  మనుస్మృతిని ప్రస్తావిస్తూ, కుటుంబ పెద్ద తనపై ఆధారపడిన మహిళలను పోషించడం నైతికంగానూ, చట్టపరంగానూ బాధ్యతేనని సుప్రీంకోర్టు పేర్కొంది. మామగారు మరణించిన తర్వాత కూడా ఆయన వారసులు, ఆయనపై ఆధారపడిన వారికి సహాయం అందించాల్సిన బాధ్యత కలిగి ఉంటారని కోర్టు స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ, అన్ని అప్పీల్స్‌ను తిరస్కరించింది. గీతా శర్మకు ఇవ్వాల్సిన భరణం మొత్తాన్ని ఆమె అర్హతలు, పరిస్థితుల ఆధారంగా నిర్ణయించాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. వితంతువుల హక్కుల పరిరక్షణలో ఈ తీర్పు ఒక చారిత్రాత్మక ముందడుగుగా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Pension: తమ సంబంధాన్ని ఎప్పుడూ దాచలేదు..లివ్‌-ఇన్‌-పార్ట్‌నెర్‌కు పెన్షన్ ఇవ్వాల్సిందే.. కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు..!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Jan 17, 2026 05:06:22
Lakshmapur, Telangana:

EPF Money Via UPI Soon: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక సౌలభ్యాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా తక్షణమే PF మొత్తాన్ని ఉపసంహరించుకునే వెసులుబాటును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే దాదాపు 8 కోట్ల మంది సభ్యులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటివరకు క్లెయిమ్ దాఖలు, ధృవీకరణ, బ్యాంక్ బదిలీ వంటి ప్రక్రియలతో కొంత సమయం తీసుకున్న ఉపసంహరణలు, ఇకపై చాలా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.

కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ సంస్కరణ ద్వారా ‘జీవన సౌలభ్యం’ను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదిత విధానం ప్రకారం, EPF సభ్యులు తమ బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన UPI గేట్‌వే ద్వారా తమ అర్హత కలిగిన PF బ్యాలెన్స్‌ను నేరుగా చూడగలుగుతారు. అవసరమైన మొత్తాన్ని UPI పిన్ సహాయంతో సురక్షితంగా తమ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. ఒకసారి డబ్బు బ్యాంకు ఖాతాలో జమ అయిన తర్వాత, దానిని ATMల ద్వారా నగదుగా తీసుకోవచ్చు లేదా డిజిటల్ చెల్లింపులకు వినియోగించుకోవచ్చు.

భద్రత మరియు భవిష్యత్ పొదుపుల దృష్ట్యా, మొత్తం PFలో కొంత భాగాన్ని ‘ఫ్రీజ్’గా ఉంచే విధానాన్ని కూడా EPFO ప్రవేశపెట్టనుంది. కొత్త నిబంధనల ప్రకారం, సభ్యులు తమ మొత్తం సహకారంలో కనీసం 25 శాతం మొత్తాన్ని ఖాతాలో తప్పనిసరిగా నిల్వగా ఉంచాలి. మిగిలిన మొత్తాన్ని అవసరాల మేరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఈ 25 శాతం నిల్వపై ప్రస్తుత 8.25 శాతం వడ్డీ రేటుతో పాటు కాంపౌండింగ్ లాభం కొనసాగుతుంది. దీని వల్ల పదవీ విరమణ సమయానికి సభ్యులకు పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులో ఉంటాయి.

Also Read: Pension: తమ సంబంధాన్ని ఎప్పుడూ దాచలేదు..లివ్‌-ఇన్‌-పార్ట్‌నెర్‌కు పెన్షన్ ఇవ్వాల్సిందే.. కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు..!

ఇక ఉపసంహరణలకు సంబంధించిన క్లిష్టమైన నిబంధనలను కూడా ప్రభుత్వం సరళీకరించింది. ఇప్పటివరకు ఉన్న 13 రకాల పాక్షిక ఉపసంహరణ నిబంధనలను తొలగించి, వాటిని మూడు ప్రధాన వర్గాలుగా విభజించింది. అవి అత్యవసర అవసరాలు (వైద్య చికిత్స, విద్య, వివాహం), గృహ అవసరాలు మరియు ప్రత్యేక పరిస్థితులు. ఈ మార్పులకు EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ అధికారికంగా ఆమోదించిన వెంటనే ఇవి అమల్లోకి వస్తాయి.

ప్రస్తుతం EPFO ప్రతి ఏడాది దాదాపు 5 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం ఉపసంహరణలకే సంబంధించినవి. ఆటో సెటిల్‌మెంట్ విధానంలో రూ.5 లక్షల వరకు క్లెయిమ్‌లు మూడు రోజుల్లోనే పూర్తవుతున్నప్పటికీ, UPI ఏకీకరణతో ఈ సమయం మరింత తగ్గనుంది. EPFOకు స్వంత బ్యాంకింగ్ లైసెన్స్ లేకపోయినా, UPI అనుసంధానంతో బ్యాంకింగ్ తరహా సేవలను అందించే స్థాయికి సంస్థ చేరుకుంటోంది. ఏప్రిల్ నుంచి ఈ సదుపాయం సజావుగా అమలయ్యేలా అవసరమైన సాఫ్ట్‌వేర్ మార్పులు, సాంకేతిక లోపాల పరిష్కారంపై ప్రస్తుతం EPFO తీవ్రంగా పనిచేస్తోంది.

Also Read: Yogi Adityanath: అంతా టీచరే చేశారు.. యోగి బాల్డ్ హెడ్‌కి కారణం తెలుసుకుంటే మైండ్ బ్లాక్‌ అవుతుంది.. ఓసారి ఈ యూపీ సీఎం బాల్యంలోకి తొంగిచూద్దామా?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 16, 2026 17:28:13
Hyderabad, Telangana:

Sampath Kumar Harassment: నేషన్ హైవే 44 పనుల్లో రూ.8 కోట్లు డబ్బులు ఇస్తేనే పనులు సాగనిస్తానని బెదిరింపులు కాంగ్రెస్‌ నాయకుడు సంపత్ కుమార్‌ బెదిరింపులకు పాల్పడడాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకువచ్చింది. ఆ పార్టీ ఆలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు కీలక విషయాలు వెల్లడించారు. మండల స్థాయి అధికారులను నిత్యం భయపెట్టి వసూలు చేస్తున్నాడని.. వసూలు రాజాగా సంపత్‌ మారాడని ఆరోపించారు. 

Also Read: Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో-2 దశపై కీలక పరిణామం.. ఏం జరిగిందో తెలుసా?

హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సంపత్‌ కుమార అక్రమాలు, కమీషన్‌కు దాడులకు పాల్పడడం వంటి అంశాలను బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే విజయుడు వివరించారు. వసూల్ రాజా సంపత కుమార్‌పై అన్ని ఆధారాలు ఉన్నాయని.. త్వరలోనే బయట పెడతామని ప్రకటించారు. నడిగడ్డ నీ రాజ్యం కాదు ప్రజలదని స్పష్టం చేశారు.

Also Read: Cockfight Prize: సంక్రాంతి జాక్‌పాట్.. రూ.కోటి 50 లక్షలు గెలుచుకున్న ఓ కోడి

'40 వేల ఓట్లతో ఆయన ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. తనను ముట్టుకుంటే అగ్గి అవుతారు అన్నాడు. అగ్గి కాదు కానీ మట్టి అవుతారు ఎందుకంటే మీరు చేసే అక్రమ దందా మట్టి దందానే. జాతీయ కాంగ్రెస్ నాయకుడు ఆయన జాతీయ సమావేశాల్లో పాల్గొంటారు. జాతీయ నాయకుడు కనుక మీనాక్షి నటరాజన్ సమాధానం చెప్తారా? లేక హోమ్ మంత్రి అలియాస్ రేవంత్‌ రెడ్డి సమాధానం చెప్తారా?' అని బీఆర్‌ఎస్‌ పార్టీ యువ నాయకుడు మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.

Also Read: Sankranti Offer: సంక్రాంతికి బంపర్‌ ఆఫర్‌.. ఒక్క రూపాయికే విమాన టికెట్‌

'జర్నలిస్టుల మీద సిట్ వేసిన ప్రభుత్వం ఇతని మీద సిట్ విచారణ వేస్తారా? మారణాయుధాలతో బెదిరించారు అని శ్రీ భ్రమర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ ఫిర్యాదు చేసింది. రేపు అక్కడకు పర్యటనకు వెళ్తున్న రేవంత్‌ రెడ్డి సిట్ విచారణ వేయాలి' అని మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. సంపత్‌ మాట్లాడిన బూతులు చూస్తూ బయట పెట్టడం లేదు. సంపత్ సతీమణి ప్రభుత్వ టీచర్ అంట.మరి విధులకు వెళ్తుందో లేదో తెల్వదు ఆయన ఏదో మ్యానేజ్ చేసుకుంటున్నారు. ఆయన అఫిడవిటలో ఎలాంటి భూములు లేవని నిల్ అని పెట్టారు. ఇప్పుడు మాత్రం అసైన్డ్స్ ల్యాండ్  రెండు ఎకరాలు సతీమణి మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఇలా కబ్జాలు చాలా ఉన్నాయి.అన్ని ఆధారాలు ఉన్నాయి' అని మన్నె క్రిశాంక్ వెల్లడించారు.

'సంపత్ అబ్బాయి ఒక్క కంపెనీ డైరెక్టర్. 100 పడకల హాస్పిటల్ కేసీఆర్ సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేశారు. కానీ సంపత్ కుమార్ కొడుకు గ్లోబెన్ కంపెనీకి మాత్రమే టెండర్లు రావాలి అని బెదిరిస్తున్నారు. కాంటాక్ట్ రావాలి అంటే కాంగ్రెస్ నాయకులకు మాత్రమే రావాలి. ఇందులో కాంట్రాక్ట్ మాత్రం వాళ్ల అబ్బాయికి ఇచ్చారు. చిన్నది అయిన పెద్దది అయిన మట్టి అయిన ఇంకా ఏదైనా టెండర్ రావాలి అంటే కేవలం సంపత్ కుమార్ కుటుంబ సభ్యులకు మాత్రమే రావాలి' అని మన్నె క్రిశాంక్ ఆరోపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
BBhoomi
Jan 16, 2026 16:11:00
Lakshmapur, Telangana:

EPFO Digital Life Certificate: పెన్షన్‌దారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఒక కీలకమైన, ఉపయోగకరమైన నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్‌ (EPS) కింద పెన్షన్ పొందుతున్న వారు ఇకపై ఇంటి వద్ద నుంచే ఉచితంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (DLC) సమర్పించుకునే వెసులుబాటు కల్పించింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌ (IPPB)తో భాగస్వామ్యంలో ఈ కొత్త సేవను అమలులోకి తీసుకొచ్చింది.

ప్రతి ఏడాది పెన్షన్ కొనసాగాలంటే లైఫ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అయితే, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, నడవలేని స్థితిలో ఉన్నవారు లేదా స్మార్ట్‌ఫోన్‌లు, బయోమెట్రిక్ కేంద్రాలు అందుబాటులో లేని పెన్షనర్లకు ఇది పెద్ద సమస్యగా మారుతోంది. బ్యాంకులు, పోస్టాఫీసులు లేదా EPFO కార్యాలయాలకు వెళ్లడం చాలా మందికి శారీరకంగా, మానసికంగా భారంగా మారుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని EPFO ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది.

జనవరి 9, 2025న విడుదల చేసిన అధికారిక సర్క్యులర్‌లో EPFO ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. చాలా మంది EPS పెన్షనర్లు టెక్నాలజీపై అవగాహన లేకపోవడం, స్మార్ట్‌ఫోన్‌లు లేని కారణంగా లేదా బయోమెట్రిక్ ధృవీకరణ కేంద్రాలు దూరంగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా, IPPB సహకారంతో డోర్‌స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవను ప్రారంభించినట్లు వెల్లడించింది.

ఈ సేవలో భాగంగా, పోస్ట్‌మ్యాన్ లేదా డాక్ సేవక్ నేరుగా పెన్షనర్ ఇంటికే వస్తారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానంలో లైఫ్ సర్టిఫికేట్‌ను అక్కడికక్కడే డిజిటల్‌గా సబ్‌మిట్ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు పెన్షనర్ల నుంచి ఎటువంటి ఛార్జీ వసూలు చేయరు. ఈ సేవకు సంబంధించిన ఖర్చును EPFO సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ అండ్ రికార్డ్ సెంటర్ భరిస్తుంది.

Also Read: Yogi Adityanath: అంతా టీచరే చేశారు.. యోగి బాల్డ్ హెడ్‌కి కారణం తెలుసుకుంటే మైండ్ బ్లాక్‌ అవుతుంది.. ఓసారి ఈ యూపీ సీఎం బాల్యంలోకి తొంగిచూద్దామా?

హోమ్ విజిట్‌ను ఎలా బుక్ చేసుకోవాలి?
పెన్షనర్లు లేదా వారి కుటుంబ సభ్యులు IPPB కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి డోర్‌స్టెప్ సర్వీసును బుక్ చేసుకోవచ్చు. వివరాలు నమోదు చేసిన తర్వాత సంబంధిత పోస్ట్‌మ్యాన్ లేదా డాక్ సేవక్‌కు హోమ్ విజిట్ కేటాయిస్తారు. వారు నిర్ణీత తేదీన పెన్షనర్ ఇంటికి వచ్చి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియను పూర్తిచేస్తారు. దీంతో పెన్షనర్‌కు బ్యాంకులు లేదా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి?
పెన్షన్‌దారు జీవించి ఉన్నారని నిర్ధారించేందుకు లైఫ్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. బ్యాంకులు, పోస్టాఫీసులు వంటి పెన్షన్ పంపిణీ సంస్థలు ఈ ధృవీకరణ ఆధారంగానే నెలవారీ పెన్షన్‌ను ఖాతాలో జమ చేస్తాయి. పెన్షనర్ మరణించిన తర్వాత తప్పుడు క్లెయిమ్‌లు జరగకుండా నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఇది ప్రభుత్వ నిధుల పరిరక్షణకు, అలాగే నిజమైన లబ్ధిదారులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉపయోగపడుతుంది.

మొత్తంగా, EPFO తీసుకొచ్చిన ఈ డోర్‌స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవ వృద్ధులు, అసహాయ పెన్షనర్లకు ఎంతో ఊరట కలిగించే నిర్ణయంగా నిలవనుంది. పెన్షన్ ప్రక్రియను మరింత సులభం, పారదర్శకం, ప్రజాహితంగా మార్చే దిశగా ఇది ఒక కీలక అడుగుగా భావించవచ్చు.

Also Read: Pension: తమ సంబంధాన్ని ఎప్పుడూ దాచలేదు..లివ్‌-ఇన్‌-పార్ట్‌నెర్‌కు పెన్షన్ ఇవ్వాల్సిందే.. కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు..!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 16, 2026 16:09:53
Tadipatri, Andhra Pradesh:

Kethireddy Peddareddy vs JC Prabhakar Reddy: ఆర్థిక సంఘం నిధుల విషయంలో అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని.. దీనిపై తాను ఎక్కడికైనా.. ఏ సెంటర్‌లోనైనా చర్చకు సిద్ధమని జేసీ ప్రభాకర్‌ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన సవాల్‌ చేశారు. ప్రభుత్వం నిర్వహించే స్పందన కార్యక్రమంలో సామాన్యుల ఫిర్యాదులకు ఎలాంటి పరిష్కారం లభిస్తుంది? అనేది ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేగా ఫిర్యాదు ఇస్తేనే చర్యలు కరువయ్యాయని ఆరోపించారు. స్పందన అంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుందని, ప్రజల నుంచే వచ్చే ఫిర్యాదులపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే పరిష్కారాలు ఎలా లభిస్తాయని ప్రశ్నించారు.

Also Read: YS Jagan: పల్నాడులో వైసీపీ కార్యకర్త దారుణ హత్య.. చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

అనంతపురంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. '15వ ఆర్థిక సంఘంలో పెద్ద అవినీతి జరిగిందని.. ఎరువు వంకపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని అధికారులు తక్షణం స్పందించి ప్రారంభం నుంచి చివరి వరకు సర్వే చేసి దానిలో వైఎస్సార్‌సీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా చర్యలు తీసుకోవాలి' అని సవాల్‌ చేశారు. 'తాడిపత్రిలో డ్రైనేజీ నీరు కాలనీల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శ్రద్ధ పెట్టాలని లేదా అధికారులకు ఆదేశాలు ఇచ్చి సమస్యను పరిష్కరించాలి' అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోరారు.

Also Read: Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో-2 దశపై కీలక పరిణామం.. ఏం జరిగిందో తెలుసా?

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడకుండా పౌరుషం గురించి మాట్లాడాడని ప్రెస్‌మీట్‌లు పెట్టి మరి పౌరుషం గురించి మాట్లాడుతున్నాడని  మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. వెంకట్రామిరెడ్డి ఏదైనా తప్పు మాట్లాడితే ప్రభుత్వం నుంచి వకాల్తా తీసుకొని ఖండించాలి తప్ప మా కుటుంబంపై పదే పదే టార్గెట్ చేసి మాట్లాడటం సరికాదు' అని కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు. ఒకవేళ గొడవలు కావాలి అంటే టైమ్ డేట్ ఫిక్స్ చేసి చెప్పాలని..  మీ కుటుంబం మా కుటుంబం రెండు కుటుంబాలు మాత్రమే కొట్టుకోవాలని సవాల్‌ చేశారు.

Also Read: Cockfight Prize: సంక్రాంతి జాక్‌పాట్.. రూ.కోటి 50 లక్షలు గెలుచుకున్న ఓ కోడి

'దమ్ము ఉంటే ఎస్పీకి ఈ గొడవలో ఎవరి మీద కేసులు నమోదు చేయకూడదని ఒక లేఖ ద్వారా తెలియచేసి రాయలసీమలో ఏ సెంటర్‌కి రమ్మన్నా.. వస్తానని' అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. అమాయక ప్రజలను ఉసిగొల్పి  వారి ప్రాణాలను బలి తీయవద్దు అని జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. తమ కొడుకు గురించి కూడా మాట్లాడుతున్నారని పోలీసులు అడ్డుకోకపోతే తాడిపత్రిలో తిరగడానికి నా కొడుకును గంటల్లో పిలుస్తానని ప్రకటించారు.

తాడిపత్రిలో పోలీసులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నలలో నడుస్తున్నారు తప్ప ఎస్పీ చెప్పినట్టు వినడం లేదని ఆరోపించారు. క్రైమ్‌ రేట్ లేకపోయినా తాడిపత్రిలో అమాయకులను తీసుకువచ్చి పోలీసులు ప్రగల్భాలు పలుకుతున్నారని.. అసలైన వారిని అరెస్ట్ చేసి పోలీసులు నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోరారు. ప్రభాకర్ రెడ్డి ఏదైనా మాట్లాడాలి అంటే మీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి మా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించడానికి సిద్ధంగా ఉంటే చెప్పాలని సవాల్‌ చేశారు. బూటకపు మాటలు వదిలి అభివృద్ధి పై దృష్టి సారించాలని జేసీ ప్రభాకర్‌ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు పలికారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
BBhoomi
Jan 16, 2026 15:44:17
Lakshmapur, Telangana:

Budget 2026: ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టున్న బడ్జెట్ 2026పై సామాన్యులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు.  బడ్జెట్ 2026తో ఎలక్ట్రానిక్ వస్తువులు చౌకగా మారతాయని చాలా మంది వినియోగదారులు ఆశిస్తున్నారు. అయితే పరిశ్రమ వర్గాలు మాత్రం ఈ ఆశలకు విరుద్ధమైన సంకేతాలను ఇస్తున్నాయి. బడ్జెట్ ప్రభావంతో ధరలు తగ్గే అవకాశం కంటే..  రాబోయే నెలల్లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు మరింత ఖరీదయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీనికి ప్రధాన కారణం కృత్రిమ మేధస్సు (AI) , హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC) రంగాల్లో వేగంగా పెరుగుతున్న వినియోగం. ఈ విస్తరణ వల్ల మెమరీ చిప్‌లపై డిమాండ్ భారీగా పెరిగింది. అదే సమయంలో సరఫరా పరిమితంగా ఉండటంతో మెమరీ ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈ ప్రభావం నేరుగా స్మార్ట్‌ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ తయారీదారులపై పడుతోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం... వచ్చే రెండు నెలల్లోనే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు మరో 4 నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది కొత్త విషయం కాదు. ఇప్పటికే గత నవంబర్–డిసెంబర్ నెలల్లోనే స్మార్ట్‌ఫోన్ ధరలు సగటున 3 శాతం నుంచి 21 శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది మొత్తం ధరల పెరుగుదల ఒకేసారి కాకుండా, ప్రతి త్రైమాసికం లేదా కొన్ని సందర్భాల్లో నెలవారీగా కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. ప్రపంచ మెమరీ మార్కెట్ ప్రస్తుతం  హైపర్-బుల్  దశలో ఉంది. అంటే ధరలు చాలా వేగంగా, నిరంతరంగా పెరుగుతున్న పరిస్థితి. గత త్రైమాసికంలోనే మెమరీ చిప్ ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. ప్రస్తుత త్రైమాసికంలో మరో 40–50 శాతం వరకు పెరుగుదల నమోదవుతుండగా, ఏప్రిల్–జూన్ కాలంలో కూడా అదనంగా 20 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ పరిశోధన డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ, ఈ ధరల భారాన్ని ఇప్పటికే కొన్ని బ్రాండ్‌లు వినియోగదారులపై మోపడం ప్రారంభించాయని తెలిపారు. వివో, నథింగ్ వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు జనవరిలోనే తమ హ్యాండ్‌సెట్ ధరలను రూ.3,000 నుంచి రూ.5,000 వరకు పెంచాయి. మరోవైపు, శామ్‌సంగ్ వంటి బ్రాండ్‌లు నేరుగా ధరలు పెంచకుండా, ఇప్పటివరకు అందిస్తున్న క్యాష్‌బ్యాక్‌లు, ఆఫర్లు, డిస్కౌంట్‌లను తగ్గించడం ద్వారా పరోక్షంగా ధరల పెంపును అమలు చేస్తున్నాయి.

తరుణ్ పాఠక్ మాటల్లో చెప్పాలంటే.. 2026లోనే కాకుండా వచ్చే ఏడాదిలో కూడా మెమరీ చిప్‌ల ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. కొత్త మోడళ్ల లాంచ్ సమయంలో బ్రాండ్‌లు ఈ ఖర్చును లెక్కలోకి తీసుకుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ధరలు అదుపులో ఉంచేందుకు డిస్ప్లేలు లేదా ఇతర భాగాల నాణ్యతను కొద్దిగా తగ్గించడం వంటి  కాస్ట్ కటింగ్ చర్యలు తీసుకునే అవకాశమూ ఉందని ఆయన తెలిపారు.

మెమరీ చిప్‌ల సరఫరా కూడా పెద్ద సవాలుగా మారింది. కోడాక్, థామ్సన్, బ్లాపంక్ట్ వంటి టీవీ బ్రాండ్‌లను విక్రయిస్తున్న సూపర్ ప్లాస్ట్రోనిక్స్ సంస్థ తనకు అవసరమైన మెమరీ చిప్ ఆర్డర్లలో కేవలం 10 శాతం మాత్రమే అందుకోగలుగుతోందని తెలిపింది. ఇది తయారీ, సరఫరా చైన్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో ధరల పెరుగుదల ఎలా జరుగుతోందో సూపర్ ప్లాస్ట్రోనిక్స్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా వివరించారు. ఆయన ప్రకారం, నవంబర్‌లో ధరలు 7 శాతం పెంచగా, డిసెంబర్‌లో మరో 10 శాతం పెరిగాయి. ఫిబ్రవరిలో మళ్లీ 4 శాతం పెంపు ప్రణాళికలో ఉంది. అంతేకాదు, రాబోయే రిపబ్లిక్ డే సేల్‌లో కూడా గతంలా భారీ డిస్కౌంట్‌లు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.

Also Read: Yogi Adityanath: అంతా టీచరే చేశారు.. యోగి బాల్డ్ హెడ్‌కి కారణం తెలుసుకుంటే మైండ్ బ్లాక్‌ అవుతుంది.. ఓసారి ఈ యూపీ సీఎం బాల్యంలోకి తొంగిచూద్దామా?

రిటైల్ రంగం కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. ల్యాప్‌టాప్ ధరలు ఇప్పటికే 5–8 శాతం వరకు పెరిగాయని రిటైలర్లు చెబుతున్నారు. ప్రధాన టీవీ కంపెనీలు కూడా త్వరలో ధరల పెంపును అమలు చేయనున్న సంకేతాలు ఇస్తున్నాయి. గ్రేట్ ఈస్టర్న్ రిటైల్ డైరెక్టర్ పుల్కిత్ బైద్ మాట్లాడుతూ..  ఈ ధరల పెరుగుదల డిమాండ్‌పై తక్షణ ప్రభావం చూపుతుందని, వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసే అవకాశం ఉందని అన్నారు.

ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AIMRA) గణాంకాల ప్రకారం..  నవంబర్–డిసెంబర్ కాలంలోనే స్మార్ట్‌ఫోన్ ధరలు 3 నుంచి 21 శాతం వరకు పెరిగాయి. దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా మొబైల్ స్టోర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న AIMRA, బ్రాండ్‌ల నుంచి అందిన సంకేతాల ఆధారంగా, రాబోయే నెలల్లో మొత్తం ధరల పెరుగుదల 30 శాతం వరకు చేరవచ్చని హెచ్చరిస్తోంది.

ధరల పెరుగుదల వల్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం తప్పదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. AIMRA చైర్మన్ కైలాష్ లఖ్యాని మాట్లాడుతూ, ఈ పరిస్థితి వల్ల మార్కెట్‌లో 10–12 శాతం వరకు క్షీణత రావచ్చని అన్నారు. ముఖ్యంగా రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్‌ల విభాగంపై ఎక్కువ ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. ఎందుకంటే భారతదేశంలో ఇదే అతిపెద్ద అమ్మకాల సెగ్మెంట్. ఇప్పటికే వినియోగదారులు  వేచి చూసే  ధోరణిలోకి వెళ్లిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2026లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు గతంలో అంచనా వేసిన 2 శాతం క్షీణతను మించిపోయే అవకాశం ఉందని తెలిపింది. మెమరీ చిప్ ధరలు పెరగడం, హ్యాండ్‌సెట్ ధరలు ఎక్కడం, రూపాయి విలువ బలహీనపడటం ఇవన్నీ కలిసి మార్కెట్‌పై అదనపు ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. ఉదాహరణకు, 4GB RDIMM మెమరీ ధర సెప్టెంబర్ 2025లో డాలర్ 255గా ఉండగా.. డిసెంబర్ నాటికి అది డాలర్ 450కి చేరింది. మార్చి 2026 నాటికి అదే ధర డాలర్ 700 వరకు వెళ్లవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2026 నుంచి తక్షణ ధరల ఊరట ఆశించడం కష్టమేనని పరిశ్రమ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.

Also Read: Pension: తమ సంబంధాన్ని ఎప్పుడూ దాచలేదు..లివ్‌-ఇన్‌-పార్ట్‌నెర్‌కు పెన్షన్ ఇవ్వాల్సిందే.. కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు..!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 16, 2026 15:38:26
Hyderabad, Telangana:

Hyderabad: 'విద్యార్థులు అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో ప్రాణ‌త్యాగాలు చేసి తెలంగాణ‌ను సాధించారు. పదేళ్లు రాజ‌కీయ‌, కుటుంబ‌, పార్టీ ప్ర‌యోజనాల కోస‌మే ప‌నిచేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీపై ఆలోచ‌న చేయ‌లేదు. తెలంగాణ యువ‌త గురించి ఆలోచించ‌లేదు. వాళ్ల ఉద్యోగాలు తొల‌గిస్తేనే మాకు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని నిరుద్యోగ యువ‌త న‌డుం బిగించారు కాబ‌ట్టే ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డింది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'టీఎస్‌పీఎస్సీలో దారుణ ప‌రిస్థితులు అంద‌రికీ తెలుసు. పద్నాలుగేళ్ల పాటు గ్రూప్ 1 నియామ‌కాలు చేప‌ట్ట‌లేక‌పోయారు. ఇంతకంటే దారుణం, ఘోరం ఎక్క‌డైనా ఉంటుందా?' అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

Also Read: Sankranti Offer: సంక్రాంతికి బంపర్‌ ఆఫర్‌.. ఒక్క రూపాయికే విమాన టికెట్‌

'టీఎస్‌పీఎస్సీని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేశాం. యూపీఎస్సీని స్వ‌యంగా ప‌రిశీలించి టీఎస్‌పీఎస్సీని ఏర్పాటు చేశాం. తెలంగాణ ప‌ట్ల చిత్త‌శుద్ది ఉన్న‌వాళ్లేనే టీఎస్‌పీఎస్సీ స‌భ్యులుగా నియ‌మించాం. ప్ర‌భుత్వ టీచ‌ర్లు, గ్రూప్ 1,2,3 వంటి ఉద్యోగాల‌ను ఒక బాధ్య‌త‌తో ఎలాంటి త‌ప్పులు లేకుండా భ‌ర్తీ చేశాం. నియామ‌క‌ప‌త్రాలు ఇవ్వొద్ద‌ని కుట్ర‌లు చేసినా కోర్టుల ముందు కొట్లాడి భ‌ర్తీ చేశాం' అని రేవంత్‌ రెడ్డి వివరించారు. భ‌విష్య‌త్తు త‌రాల‌కు మీ ఉద్యోగాలు దిక్సూచిగా మారుతుందని చెప్పారు.

Also Read: Cockfight Prize: సంక్రాంతి జాక్‌పాట్.. రూ.కోటి 50 లక్షలు గెలుచుకున్న ఓ కోడి

'తెలంగాణ రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ఉద్యోగం అంటే ఒక భావోద్వేగం. తెలంగాణ రాష్ట్ర పున‌ఃనిర్మాణంలో మీమ్మ‌ల్ని భాగ‌స్వాములు చేస్తోంది. ఉద్యోగ నియామ‌కాల‌తో మమ్మ‌ల్నీ క‌లిసి మీ క‌ళ్ల‌లో ఆనందం చూడాల‌నే ఈ స‌మావేశాన్ని ఏర్పాటు చేశాం. విద్య అంద‌రికీ అందుబాటులో ఉన్న‌ప్ప‌టికి నాణ్య‌మైన విద్య ప్ర‌జ‌ల‌కు అంద‌డం లేదు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌పైన ఎందుకు విశ్వాసం త‌గ్గుతుందో ఆలోచించాలి?' అని రేవంత్‌ రెడ్డి సూచించారు.

Also Read: Revanth Reddy: ఆదిలాబాద్‌పై రేవంత్‌ రెడ్డి వరాలు.. ఎయిర్‌పోర్టు, ఇండస్ట్రీయల్‌ కారిడార్‌

'పేద‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందిస్తే ప్ర‌పంచంతో పోటీ ప‌డ‌గ‌ల‌మనే విశ్వానం నాకు ఉంది. ‌దేశంలోనే అత్య‌ధికంగా వ‌రి పండించే రాష్ట్రం గా తెలంగాణ నిల‌బ‌డింది. నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆహారం, స్కిల్‌పై దృష్టి పెడుతున్నాం. స్కిల్ లేక‌పోవ‌డంతో అంత‌ర్జాతీయ స్థాయిలో పోటీ ప‌డ‌లేక‌పోతున్నాం' అని రేవంత్‌ రెడ్డి వివరించారు. విద్య‌లో స్కిల్ చాలా ముఖ్య‌మైన‌ది.. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కోసం ప‌నిచేయాల్సి ఉంది' అని గుర్తుచేశారు.

'నాణ్య‌మైన విద్య‌ను అందించే అవ‌కాశం ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఉంది. విద్య ఒక్క‌టే జీవితాల్లో మార్పు, వెలుగులు తీసుకువ‌స్తుంది. ప్ర‌భుత్వానికి వార‌ధులు, సార‌ధులు ప్ర‌భుత్వ ఉద్యోగులే' అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. గ‌రం, న‌రం, బేష‌ర‌మ్ నానుడి త‌ప్పు అని ఉద్యోగులు నిరూపించాలి. పేద‌ల మోహంలో త‌ల్లిదండ్రుల‌ను చూసుకుని  ప్ర‌భుత్వ ఉద్యోగులు సేవలు ల‌క్ష్యంగా అందించాలి' అని సూచించారు. త‌ల్లిదండ్రుల‌ను గౌర‌వంగా చూసుకొని ఉద్యోగుల‌ జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి త‌ల్లిదండ్రుల‌కు అంద‌జేస్తామని ప్రకటించారు. త‌ల్లిదండ్రుల‌ను స‌రిగా చూసుకోని వాళ్లు మాన‌వ జ‌న్మ‌లో ఉండొద్దని చెప్పారు. 'రాజ‌కీయ పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారొద్దు. ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాం' అని రేవంత్‌ రెడ్డి ప్రకటన చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Advertisement
Back to top