Back
మహిళా శక్తి సంబరాలలో మహిళలకు ప్రాధాన్యత కరువు
Bellampalle, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇందిరా మహిళ శక్తి సంబరాలు అంటూ సభ పెట్టి అందులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణం అని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మసాడి శ్రీదేవి విమర్శించారు. బుధవారం మాట్లాడుతూ మహిళా సంబరాలలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వకుండా వెనుక వరుసలో కూర్చోబెట్టడం దారుణం అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పదవి మహిళను త్వరగా నియమించాలన్నారు. మహిళా సమైక్య భవనాలు నిర్మించకుంటే MLA క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామన్నారు
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Hyderabad, Telangana:
గత కొన్ని సంవత్సరాల్లో నడుస్తూ తిరుగుతూ మరణించిన చాలా ఘటనలు బయటకి వచ్చాయి. ఇలాంటి మరో లైవ్ మరణం హైదరాబాదులో చోటు చేసుకుంది. 25 ఏళ్ల రాకేష్ అనే యువకుడు బ్యాడ్మింటన్ ఆడుతుండగా అకస్మాత్తుగా పడిపోయి మళ్లీ లేచలేకపోయాడు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. కొన్ని రోజులుగా ఇలాంటి ఎన్నో సంఘటనలు सामनेకి వచ్చాయి. ప్రజలు నడుస్తూ, మిత్రులతో మాట్లాడుతూ అనుకోకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చలు వేడెక్కాయి.
14
Report
Bellampalle, Telangana:
రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బెల్లంపల్లి మండల కేంద్రం లో నిర్వహించిన CPI మండల కౌన్సిల్ సమావేశానికి అయన హాజరయ్యారు. అయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి, కూలీల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి బొంతల లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
13
Report
Hyderabad, Telangana:
బడుగు బలహీన,కార్మిక వర్గాల కొరకు గత ఎనిమిది సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవలు అందిస్తున్న శ్రీదేవి రమేష్ ను బి.జె.ఎం.సి హైదరాబాద్ నగర అధ్యక్షురాలుగా నియమితులయ్యారు.ఈ మేరకు సోమాజిగూడ,ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బి.జె.ఎం.సి జాతీయ చైర్మన్ బిశ్వ ప్రియ రాయ్ చౌదరి, జాతీయ అధ్యక్షులు అర్నబ్ చటర్జీ, తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ నాగార్జున్ లు శ్రీదేవి రమేష్ కు నియామక పత్రాన్ని అందజేశారు.
కార్మికులు, బాల కార్మికుల భవిష్యత్తు కొరకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు.
0
Report
Hyderabad, Telangana:
కేస్టోన్ ఉత్సవ్ ద్వారా అమేయ దాబ్లీ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా టూర్ — కృష్ణా: మ్యూజిక్, బ్లిస్ అండ్ బియాండ్ — జూన్ 28, 2025న శిల్పకళా వేదిక హాల్లో ప్రత్యేక కచేరీకి ముందు, ఇండోర్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్‌తో అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆధ్యాత్మిక సంగీత యాత్రకు ముందు అమేయ దాబ్లీ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు.
కానీ ఈ టూర్ ఓ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.
1
Report
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి శివారు సర్వేనెంబర్ 64 లో తమ భూమిని కాజేయాలనే ఉద్దేశంతో మాజీ జడ్పీటీసీ కారుకూరి రామచందర్ అతని అనుచరులు తమపై కక్షగట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పనాస గణేష్ ఆరోపించారు. మంగళవారం మాట్లాడుతూ ఎవరైనా ప్రశ్నిస్తే తానే ఎమ్మెల్యే అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడన్నారు. ఎమ్మెల్యే స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న రామచందర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.
0
Report
Hyderabad, Telangana:
ఉద్యోగం కోల్పోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన గోపికృష్ణ (26) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ నెల రోజుల క్రితం ఉద్యోగం కోల్పోయాడు. దీనితో మనస్థాపానికి గురై రెండు రోజులు ఊరికి వెళ్లి వచ్చిన తర్వాత బుధవారం తాను నివసిస్తున్నారు ఫ్యానుకూరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను భయంతో చనిపోవట్లేదు బాధ భరించలేక చనిపోతున్నానంటూ సూసైడ్ లెటర్ రాసి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన పైన తండ్రి ఇచ్చిన ఫిర్యాదులతో దర్యాప్తు చేపట్టారు
0
Report
Hyderabad, Telangana:
పీటా ఇండియా ఎన్జీవో వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ యందు సైన్స్ పాలసీ అడ్వైజర్ అంజన అగర్వాల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
తెలంగాణకి సంబంధించిన ఒక టెస్టింగ్ లేబరేటరీ లో అమాయకమైన కుక్కలను కోతులను మరియు ఇతర జంతువులను టెస్టింగ్ పేరిట హింసకు గురి చేస్తున్నట్లు మీడియా ముఖంగా తెలిపారు.
0
Report
Hyderabad, Telangana:
గోమాత రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని జన్ ఊర్జా మంచ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నిషిత దీక్షిత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్బులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో యువ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివకుమార్, బాలస్వామి లు మాట్లాడారు. గోహత్య మహా పాపమని, గోవులను కిరాతకంగా హత్య చేసిన ఏ దేశము ఏ ప్రాంతము అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని అన్నారు. గోవులను హత్య చేసిన మహా నేతలు సైతం నేలకొరిగిన విషయాన్ని గుర్తు చేశారు.
0
Report
Bhimavaram, Andhra Pradesh:
సామాజిక బాధ్యత,సేవా స్పూర్తితో జిల్లా పోలీస్ శాఖకు హై-టెక్ డ్రోన్ ను అందించిన శాసనసభ ఉపసభాపతి శ్రీ కనుమూరు రఘు రామ కృష్ణ రాజు.
జిల్లా పోలీసు శాఖకు మౌలిక వసతులు కల్పనకై విశేష కృషి చేస్తున్న రఘు రామ కృష్ణ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లా ఎస్పీ. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నయీం అస్మి తో కలిసి మొక్కలు నాటారు రఘురామకృష్ణరాజు.
0
Report
Bhimavaram, Andhra Pradesh:
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు, కాళ్ల మండలం పెదఆమిరంలో ఓపెన్ ఎయిర్ థియేటర్లుకు శంకుస్థాపన చేయబోతున్నామని ఏపి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. జిల్లాలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండి నియోజకవర్గంలో శిల్పారామం లాంటిది ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది.
1
Report
Bhimavaram, Andhra Pradesh:
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరులో రైతులకు డ్రోన్లు పంపిణీ చేసిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
0
Report
Bollaram, Telangana:
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి సంబంధించి 13వ విడత 11 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 17 మంది లబ్ధిదారులకు అందజేసిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.
0
Report
Hyderabad, Telangana:
బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు దీనిలో భాగంగా అక్రమంగా నిషేధిత మత్తు పదార్థాలను అమ్ముతున్న కరణ్ పరమార్(32) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ కిషన్ వెల్లడించారు.నిందితుడి వద్ద నుండి 19.36 గ్రాముల కొకైన్ తో పాటు 6.77 గ్రాముల కుష్ గంజాయి, 55 వేల రూపాయల నగదు ఐఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు కరణ్ పరమార్ గోవాకు చెందిన సంతోష్ జావిద్ నుండి కొరియర్ ద్వారా ఈ మత్తు పదార్థాలను తెప్పించుకొని నగరంలో అవిక్రయిస్తున్నట్లు గుర్తించామని అన్నారు.
1
Report
Hyderabad, Telangana:
జెప్టో యాప్ గుడ్లు ఆర్డర్ పెట్టిన వినియోగదారుడు కి చేదు అనుభవం ఎదురైంది. హైదర్ నగర్ లో నివాసం ఉండే దేవా నేడు ఉదయం యాప్ లో ఆర్డర్ చేసుకోక కనీసం వాటిని పరీక్షించకుండా సిబ్బంది కుళ్ళిపోయిన గుడ్లను వినియోగదారుడికి అందజేశారు. వెంటనే సంబంధిత సిబ్బందికి తెలియజేసిన నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా పట్టించుకోలేదన్నారు. ఇలాంటి వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలని వినియోగదారుడు వాపోయారు.
1
Report