కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి-మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ హరికృష్ణ కు వినతిపత్రం అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసానని రైతులని మభ్యపెడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతులకు మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఆంక్షలతో రైతులను మోసం చేసినందుకు ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Janmashtami Non Veg Ban: రేపు మాంసం దుకాణాలు బంద్.. కృష్ణాష్టమి నాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆదేశాలు?
Hyderabad, Telangana:Janmashtami Non Veg Ban News: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. రేపు అనగా సెప్టెంబర్ 4న గ్రేటర్ పరిధిలో ఉన్న అన్ని రిటైల్ చికెన్, మటన్, బీఫ్ విక్రయ దుకాణాలతో పాటు జీహెచ్ఎంసీ గుర్తింపు పొందిన అన్ని పశు వధ శాలలు (స్లాటర్ హౌసెస్) తప్పనిసరిగా మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా రహస్యంగా విక్రయాలు జరిపితే వారి ట్రేడ్ లైసెన్సులను తక్షణమే రద్దు చేయడంతో పాటు, కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయడానికి నగరంలోని 6 జోన్లలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించారు. పండుగ వాతావరణం పవిత్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని జీహెచ్ఎంసీ కోరింది.
'ది హిందూ' పత్రిక కథనం ప్రకారం, హైదరాబాద్‌లోని అన్ని సర్కిళ్లలో ఎలాంటి మినహాయింపులు లేకుండా ఈ నిషేధాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని నగరపాలక సంస్థ జోనల్, డిప్యూటీ కమిషనర్లందరినీ ఉన్నతాధికారులు ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా రహస్యంగా విక్రయాలు జరిపినా, లేదా చట్టవిరుద్ధంగా జంతువులను వధించినా వారి ట్రేడ్ లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు.
అంతేకాకుండా, వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. 'డెక్కన్ క్రానికల్' తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 4న తెల్లవారుజాము నుంచే పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడానికీ, ఎటువంటి అక్రమ పశువధా జరగకుండా చూసేందుకు GHMC పరిధిలోని 6 జోన్లలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించారు. ఈ ప్రత్యేక వెటర్నరీ బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడతాయి. ఎక్కడైనా అక్రమ విక్రయాలు గుర్తిస్తే వెంటనే ఆ దుకాణాలను సీజ్ చేసి యజమానులకు భారీ జరిమానా విధిస్తారు.
నగరంలో సాధారణంగా గాంధీ జయంతి, మహాశివరాత్రి, శ్రీరామనవమి వంటి పండుగల సమయంలో కూడా ఇలాంటి మాంసం విక్రయాల నిషేధాన్ని అమలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అదే తరహాలోనే ఇప్పుడు కృష్ణాష్టమికి కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. జన్మాష్టమి వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.
ఈ నేపథ్యంలో ప్రజలు ఒక రోజు ముందుగానే తమకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలనీ, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని జీహెచ్ఎంసీ సూచించింది. పండుగ వాతావరణం పవిత్రంగా ఉండేందుకు వ్యాపారులు, ప్రజలు బాధ్యతగా వ్యవహరించి మున్సిపల్ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.
Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి 2026..జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన 7 కృష్టుడి ఆలయాలు!
Also Read: ఏపీ, తెలంగాణ ప్రజలకు చల్లని కబురు..బంగాళాఖాతంలో అల్పపీడనం..భారీ వర్షాలకు హెచ్చరిక!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
200 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడబిడ్డ కోసం ఊరంతా సంబరాలు!
Hyderabad, Telangana:Maharashtra Baby Girl Birth Celebration: ఆడపిల్ల పుడితే కొందరు భారంగా భావించే ఈ రోజుల్లో.. ఓ కుటుంబం మాత్రం తమ ఇంటి మహాలక్ష్మి వచ్చిందంటూ ఊరంతా సంబరాలు చేసుకుంది.. ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు తరాలు.. సుమారు 200 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ వంశంలో ఆడబిడ్డ జన్మించడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ కుటుంబ సభ్యులు ఆనందంతో ఊర్లో ఎన్నో రకాల ప్రత్యేకమైన దానధర్మ కార్యక్రమాలు చేపట్టారు.
మహారాష్ట్రకు చెందిన దహిఫలే కుటుంబంలో దాదాపు రెండు శతాబ్దాలుగా మగ పిల్లలే పుడుతూ వస్తున్నారు.. తమ ఇంట్లో కూడా ఆడపిల్ల నవ్వులు వినిపించాలని.. ఓ చిన్నారి ముద్దు ముద్దు మాటలతో ఇల్లంతా సందడి చేయాలని ఆ కుటుంబం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ వస్తోంది. ఎట్టకేలకు నాలుగు తరాల తర్వాత వారి కల నెరవేరింది.. కుటుంబంలోని పండంటి ఆడబిడ్డ జన్మించడంతో కుటుంబ సభ్యులు ఆనందంతో సంబరాల్లో మునిగిపోయారు.. ఆ పాపకు గార్గి అని నామకరణం చేసి.. తమ ఇంటిని వెలిగించడానికి వచ్చిన సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపంగా భావించారు..
తమ ముద్దుల కూతురి రాకను చిరస్మరణీయంగా మార్చుకోవాలని ఆ కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆస్పత్రి నుంచి తల్లి బిడ్డ డిశ్చార్జ్ అయిన సందర్భంగా వారు చేసిన ఏర్పాట్లు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు.. చిన్నారి, ఆమె తల్లిని సాధారణ వాహనంలో కాకుండా రంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై కూర్చోబెట్టారు.. ఆస్పత్రి నుంచి ఇంటి వరకు దారి పొడవున డప్పు జప్పులతో పాటు భార్యాభజంత్రీలు మోగిస్తూ బాణ సంచాలు కాలు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు.
Also Read: నేపాల్ జలప్రళయం.. మామిడి చెట్టును పట్టుకుని రెండుసార్లు చావును జయించిన కార్మికుడు!
దారి పొడవునా గ్రామస్తులతో పాటు బంధువులు ఆ చిన్నారిపై పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఊరంతా పండగ వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.. నేటి ఆధునిక కాలంలో కూడా ఆడపిల్లల పట్ల వివక్షత చూపే కొందరికి ఈ ఘటన ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఆడబిడ్డ పుట్టుకను ఒక మహా ఉత్సవంలా జరుపుకున్న దాహిఫలే కుటుంబ తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి రాకతో ఆ ఇంట ఆనందం ఊహించని స్థాయిలో వెల్లువిరిసింది. అంతేకాకుండా ఈ వేడుకకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి..
Also Read: నేపాల్ జలప్రళయం.. మామిడి చెట్టును పట్టుకుని రెండుసార్లు చావును జయించిన కార్మికుడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
GATE 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. కొత్తగా 'రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్' సబ్జెక్ట్ చేరిక.. దరఖాస్తు చేసుకోండిలా!
Hyderabad, Telangana:GATE 2027 Registration: ఐఐటి గేట్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది, ఈ ప్రక్రియ సెప్టెంబర్ 27 నుండి 2026 వరకు కొనసాగుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GATE) 2027 కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్లను సమర్పించవచ్చు. దరఖాస్తుల గడువు అక్టోబర్ 5 వరకు ఉంటుంది, అయితే లేట్ ఫీజు చెల్లించి కూడా అప్లికేషన్ చేసుకునే సౌలభ్యం ఉంది. అక్టోబర్ 21 వరకు అప్లికేషన్ కరెక్షన్ విండో కూడా అందుబాటులో ఉంటుంది.
గేట్ 2027 పరీక్షలను ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో నిర్వహిస్తారు. సిటీ అలాట్మెంట్ నోటిఫికేషన్ జనవరి 4న విడుదలవుతుంది, అడ్మిట్ కార్డ్‌లు కూడా అంతకుముందే విడుదల చేస్తారు. 2027 పరీక్షల ఫలితాలను మార్చి 19, 2027లో ప్రకటించే అవకాశం ఉంది.
గేట్ 2027లో కొత్తగా రోబోటిక్స్, ఆటోమేషన్ పేపర్‌ను ప్రవేశపెట్టారు. దీనితో పాటు పరీక్షను 30 టెస్ట్ పేపర్ల ఆధారంగా నిర్వహించనున్నారు. ఐఐటి మద్రాస్ 2027 గేట్ సిలబస్‌లో మార్పులు చేసింది, ప్రధానంగా బయోటెక్నాలజీ పేపర్లో అప్డేట్స్ చేసింది. సెక్షన్ పేపర్ కోడ్లు టెక్ స్టైల్ ఇంజినీరింగ్, ఫైబర్ సైన్స్ ఇంజినీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ ఆధారంగా ఉంటాయి. పరీక్షా అభ్యర్థులు రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది, అందులో ఒక కాంబినేషన్ కూడా ఎంచుకునే అవకాశం ఉంది.
గేట్ 2027 అర్హత..
హయ్యర్ డిగ్రీ చదువుతున్న వారు ఈ పరీక్షకు అర్హులు. గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ కాలేజీలలో ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్ లేదా హ్యుమానిటీస్‌లో మూడవ సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా గేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, భారతీయ పౌరులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డిజిలాకర్ తప్పనిసరి. ఐఐటి మద్రాస్ అభ్యర్థులు తమ డిజిలాకర్ అకౌంట్‌ను వెరిఫై చేసుకోవాలని, 2027 గేట్ అప్లికేషన్ ప్రక్రియకు ముందే ఈ పని పూర్తి చేయాలని సూచించింది.
Also Read: హైదరాబాద్ - మంగళూరు స్పెషల్ ట్రైన్స్ సర్వీసులు పొడిగింపు..టైమింగ్స్, రూట్ వివరాలివే!
Also Read: కృష్ణాష్టమి హాలిడే.. రేపు తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ISRO Rocket: శ్రీహరికోటలో సర్వం సిద్ధం.. రేపు ఇస్రో కీలక రాకెట్ ప్రయోగం
Shar Project, Andhra Pradesh:GSLV F17 EOS 05: భారత అంతరిక్ష పరిశోధనలో మరో కీలక రాకెట్ ప్రయోగం జరగనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాల్లో రారాజుగా చెప్పుకునే ఇస్రో జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాల్లో కూడా వరుస విజయాలు సాధిస్తోంది. అధిక బరువు కలిగిన శాటిలైట్లను నింగిలోకి ఇస్రో జీఎస్ఎల్వీ ప్రయోగాలను చేపడుతుంది. ఇప్పటివరకు రాకెట్ ప్రయోగాల్లో వరుస విజయాలు సాధించిన ఇస్రో GSLV F 17 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చేసింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రం వేదికగా సర్వం సిద్ధం చేసింది.
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో GSLV F-17/EOS-05 రాకెట్‌ను ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున 2:55 నిమిషాలకు ప్రయోగించడానికి ఇస్రో సిద్ధమైంది. ఈ రాకెట్ ప్రయోగానికి బుధవారం రాత్రి 11 గంటల 25 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభించింది. ఈ కౌంట్‌డౌన్ 27.30 గంటల పాటు కొనసాగుతోంది. ఈ కౌంట్‌డౌన్ విజయవంతంగా కొనసాగిన అనంతరం తెల్లవారుజామున 2.55 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్- 17 రాకెట్ నింగిలోకి వెళ్లనుంది. ఈ రాకెట్ ప్రయోగం జీఎస్ఎల్ ప్రయోగాల్లో 19వ ప్రయోగం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన క్రయోజనిక్‌తో ప్రయోగించే ఈ ప్రయోగం ద్వారా ఈఓఎస్ (EOS) 05 శాటిలైట్‌ను కక్ష్యలోకి ఇస్రో పంపనుంది. భూ ఉపరితల పరిస్థితులను అధునాతనంగా అధ్యయనం చేసేందుకు ఈ రాకెట్ ప్రయోగం ఉపయోగపడనుందని ఇస్రో శాస్త్రవేతలు తెలిపారు.
ప్రయోగం ప్రధాన లక్ష్యం
ఈఓఎస్-05 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇది కేవలం మరో ఉపగ్రహ ప్రయోగం కాదు. భూకక్ష్య నుంచి భూమిని మరింత అధునాతనంగా పరిశీలించే భారత అంతరిక్ష సామర్థ్యానికి మరో కీలక ముందడుగుగా ఇస్రో భావిస్తోంది. జియోసింక్రోనస్ ఆర్బిట్ నుంచి ఇమేజింగ్ చేయనున్న భారత తొలి ఇమేజింగ్ శాటిలైట్‌గా EOS-05 ప్రత్యేకతను సంతరించుకుంది. భూమి పరిశీలన, భౌగోళిక మార్పుల అధ్యయనం, సహజ వనరుల పర్యవేక్షణ వంటి అనువర్తనాల్లో ఉపగ్రహ ఆధారిత పరిశీలనా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం. శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లే GSLV-F17, భారత అంతరిక్ష ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలవబోతోంది. ఈ రాకేట్ ప్రయోగం దృష్ట్యా శ్రీహరికోట రాకెట్ కేంద్రం (షార్)లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Onion Price Hike: మండిపోతున్న ఉల్లి ధరలు..రెట్టింపైన రేట్లతో సామాన్యుడి కన్నీళ్లు!
Hyderabad, Telangana:Onion Rate Hike: కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య, మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా రోజువారీ కూలీలు తమ జీవితాలను కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంటిట్లో అత్యంత కీలకమైన వస్తువు ఉల్లిపాయ. ప్రతిరోజు వంటల్లో దీని వాడకం తప్పనిసరి. ఇది లేనిదే ఏ కూర కూడా వండటానికి కుదరదు.
అలాంటి ఉల్లిపాయల ధరలు గత కొద్ది రోజులుగా గణనీయంగా పెరిగి సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.20కే లభించిన ఉల్లిపాయలు ఇప్పుడు ఏకంగా రెట్టింపయ్యాయి. అకాల వర్షాలు మరియు నిల్వ నష్టాల కారణంగా మార్కెట్లకు నాణ్యమైన ఉల్లి సరఫరా తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో ధరలు..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ. 40 నుండి రూ. 50 వరకు పలుకుతోంది. సెప్టెంబర్ 2వ తేదీ నాటి రైతు బజార్లలోని ధరల వివరాలను గమనిస్తే..
హైదరాబాద్ (మెహిదీపట్నం రైతు బజార్): ఇక్కడ కిలో ఉల్లిపాయల ధర రూ. 40గా ఉంది. ఇతర కూరగాయలతో పోల్చితే టమాట రూ. 19, వంకాయ రూ. 35, బెండకాయ రూ. 35, పచ్చిమిర్చి రూ. 37, బీన్స్ రూ. 65, క్యారెట్ రూ. 37, దొండకాయ రూ. 23, ఆలుగడ్డ రూ. 16 వద్ద కొనసాగుతున్నాయి.
విజయవాడ రైతు బజార్: విజయవాడలోని రైతు బజార్లలో చూస్తే కిలో ఉల్లిపాయల ధర రూ. 48 నుండి రూ. 50 వరకు పలుకుతోంది. ఇక్కడ ఇతర కూరగాయల ధరలు చూస్తే టమాట రూ. 30, వంకాయ రూ. 24, క్యారెట్ రూ. 45, కీరదోస రూ. 50, బీన్స్ అత్యధికంగా రూ. 94కు లభిస్తున్నాయి.
దేశవ్యాప్త సగటు, కారణాలు
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో సగటు కిలో ఉల్లి ధర రూ. 49.59కి చేరుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన దేశంలో సగటు ఉల్లి ధర రూ. 28.48 ఉండగా, ఇప్పుడు అది 74 శాతానికి పైగా పెరిగింది.
అయితే, ఈ ధరల పెరుగుదలకు దేశంలో ఉల్లి ఉత్పత్తి తగ్గడం కారణం కాదు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 307.37 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అయింది. రబీ కోత సమయంలో కురిసిన అకాల వర్షాలు పంటను తీవ్రంగా దెబ్బతీయడం, తదుపరి నిల్వ నష్టాల వల్ల మండీలకు చేరే నాణ్యమైన ఉల్లిపాయల పరిమాణం తగ్గడమే ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: విద్యార్థులకు శుభవార్త.. 'తల్లికి వందనం' నిధులు మరోసారి విడుదల..లిస్టు వచ్చేసింది!
Also Read: దేశవ్యాప్తంగా భారీ వర్షసూచన..రేపు స్కూళ్లకు సెలవు ఉందా? విద్యార్థులకు అలర్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana: కల్యాణలక్ష్మి గోవింద.. స్కూటీలు గోవిందా
Secunderabad, Telangana:BRS Party Leaders Chants Govinda Govinda Against Congress 420 PromisesMalla Reddy: రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మల్లారెడ్డి తీన్మార్ డ్యాన్స్
Hyderabad, Telangana:Former Minister Malla Reddy Mass Dance In BRS Party Protest Watch Viral VideoBRS Party: రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గాడిదలతో గులాబీ పార్టీ నిరసన
Hyderabad, Telangana:BRS Party Protest With Donkeys Against Revanth Reddy 1000 Days Rule Watch VideoACB Rides: టీటీడీ డిప్యూటీ ఈఓ నివాసంలో ఏసీబీ తనిఖీలు
Tirupati, Andhra Pradesh:ACB Officers Ride On TTD Deputy EO Lokanatham Residence At Tirupati Know The DetailsYSR: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనేది వైఎస్సార్ కోరిక: రేవంత్ రెడ్డి
New Delhi, Delhi:YSR Awards 2026: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ఒక కోరిక తీరకుండానే మరణించాడని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ఆయన జీవిత లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆ కోరిక తీరలేదని చెప్పారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి అని ప్రకటించారు. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ ఆశయాల సాధనకు తాము పనిచేస్తామని తెలిపారు.
ఢిల్లీలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'రైతులకు ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్సార్. ఆనాడు రూ.1,300 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసి.. రైతులపై కేసులు ఎత్తివేసి రైతుల గుండెల్లో వైఎస్సార్ రారాజుగా నిలిచారు' అని రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో సాగునీరు అందిచేందుకు ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రారంభించిన ఘనత వైఎస్సార్‌ది' అని వివరించారు. ఆనాడు వైఎస్సార్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్బీసీ ఆగిపోయాయని.. ఆయన ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామని ప్రకటించారు.
'వైఎస్సార్ చివరి కోరిక ఇంకా నెరవేరలేదు. ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేశాక ఒకే ఒక్క మాట చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఆయన జీవిత లక్ష్యం అని ఒకే ఒక్క మాట చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి. ఆయన చివరి కోరిక నెరవేర్చాలంటే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
'వైఎస్ ఆశయాలను మనమంతా ముందుకు తీసుకెళ్లాలి. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. నెహ్రూ ముందుచూపుతో దేశం ఆకలి కేకల నుంచి ఆహార ఎగుమతుల వరకు చేరుకుంది. దేశంలో మొట్టమొదటిసారిగా రైతు పండించే పంటకు మద్దతు ధరను అందించే చర్యలు చేపట్టిన ఘనత ఇందిరాగాంధీ. దేశంలో ప్రతీ ఒక్కరికీ ఆహారభద్రత కల్పించాలని సోనియా గాంధీ ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చారు' అని రేవంత్ రెడ్డి వివరించారు.
'వ్యవసాయ చట్టం తీసుకొచ్చి అసైన్డ్ భూములను పేదలకు పంచిన చరిత్ర ఇందిరాగాంధీది. పీడీఎస్ విధానం తీసుకొచ్చి రేషన్ షాప్ ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. తెలంగాణలో 3 కోట్ల 48 లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితమిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. 'దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుడు అండగా నిలబడాలి. అండగా నిలబడాల్సిన చారిత్రక సందర్భం ఈరోజు ఈ దేశానికి అవసరం. దేశానికి బలమైన నాయకుడు రాహుల్ గాంధీ' అని తెలిపారు. తామంతా కలిసి కష్టపడి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందామని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి సూచించారు.
Traffic Diversion: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. రేపు భారీగా ట్రాఫిక్ మళ్లింపు
Hyderabad, Telangana:Hyderabad Traffic Diversion: రోజువారి మీదుగా రాకపోకలు సాగించే హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్. రేపు ఓ ప్రాంతంలో భారీగా వాహనాల మళ్లింపు చేపట్టారు. నగరంలో మరో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరగనుండగా.. ఈ క్రమంలో ఆ మార్గంలో వాహనాల మళ్లింపు చేయనున్నారు. నిత్యం బిజీగా ఉండే నల్గొండ ఎక్స్ రోడ్డులో వాహనాల మళ్లింపు చేపడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. పలు మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు రేపు ఉంటుందని.. వాహనదారులు గమనించాలని సూచించారు.
రేపు ఫ్లైఓవర్ ప్రారంభం
కేసీఆర్ ప్రభుత్వంలో శంకుస్థాపన జరిగిన నల్లగొండ క్రాస్ రోడ్డు నుంచి ఓవైసీ జంక్షన్ కారిడార్ ఫ్లైఓవర్ పూర్తయ్యింది. నూతనంగా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం రేపు జరగనుంది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా రేపు సెప్టెంబర్ 3 గురువారం నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు విధించినట్లు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు వాహనాల మళ్లింపు కొనసాగుతుందని ప్రకటించారు.
మూసివేసే రహదారులు
సైదాబాద్ వై జంక్షన్ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ మధ్య రహదారి పూర్తిగా మూసివేత. ఈ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండడంతో వాహనదారులు నల్గొండ ఎక్స్ రోడ్ - సైదాబాద్ వై జంక్షన్ రోడ్డు వైపు వెళ్లరాదు.
దారి మళ్లింపు ఇలా
నల్గొండ ఎక్స్ రోడ్డు నుంచి సంతోశ్ నగర్, ఐఎస్ సదన్ వైపు వెళ్లే వాహనాలు
==> నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద మళ్లింపు: మలక్‌పేట్ గంజ్ -- మూసారాంబాగ్ ఎక్స్ రోడ్ - గడ్డిఅన్నారం ఎక్స్ రోడ్ వద్ద కుడి మలుపు -> రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ -> శివగంగ థియేటర్ -> హనఫియా మసీదు వద్ద కుడి మలుపు -> సంకేశ్వర్ బజార్ -> సింగరేణి కాలనీ (ఎడమ మలుపు) -> ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ చంపాపేట్ (ఎడమ మలుపు) -> చంపాపేట్ మెయిన్ రోడ్డులో యు-టర్న్ -> చంపాపేట్ ఎక్స్ రోడ్ వద్ద ఎడమ మలుపు -> లక్ష్మారెడ్డి గార్డెన్ మీదుగా డిఎమ్‌ఆర్‌ఎల్ రోటరీ వైపు వెళ్లాలి
ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ వైపు వెళ్లే వాహనాలు
==> సైదాబాద్ వై జంక్షన్ వద్ద కుడి మలుపు -> డీసీపీ-3 కార్యాలయం -> సైదాబాద్ లా అండ్ ఆర్డర్ పీఎస్ -> సరస్వతి నగర్ కమాన్ -> సంకేశ్వర్ బజార్ -> ఇండియన్ పెట్రోల్ బంక్ -> హనఫియా మసీదు వద్ద ఎడమ మలుపు -> గడ్డిఅన్నారం ఎక్స్ రోడ్ వద్ద ఎడమ మలుపు తీసుకుని నల్గొండ ఎక్స్ రోడ్ చేరుకోవాలి.
మీర్‌చౌక్ నుంచి డబీర్‌పురా బ్రిడ్జి మీదుగా సైదాబాద్ వై జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు
==> ట్రిబ్యునల్ కోర్ట్ (ఏపీఏటీ) వద్ద మళ్లింపు -> డబీర్‌పురా కమాన్ -> షేక్ ఫయాజ్ కమాన్ (కుడి మలుపు) -> గంగా నాలా -> బడా బజార్ -> యాకుత్‌పురా ఆర్యూబీ (ఆర్యూబీ) -> 82 బస్ స్టాప్ -> మదన్నాపేట్ మండీ -> సంతోష్ నగర్ మెయిన్ రోడ్డు మీదుగా వెళ్లాలి.
డబీర్‌పురా కమాన్ నుంచి చంచల్‌గూడ ఎక్స్ రోడ్ మీదుగా మలక్‌పేట్ వైపు వెళ్లే వాహనాలు
==> ట్రిబ్యునల్ కోర్ట్ (ఏపీఏటీ) వద్ద మళ్లింపు -> దారుల్షిఫా గ్రౌండ్ -> సక్సెస్ స్కూల్ -> ఎస్‌జె రోటరీ చాదర్‌ఘాట్ మీదుగా మలక్‌పేట్ మెయిన్ రోడ్డుకు చేరుకోవాలి.
తాజా అప్డేట్ కోసం..
ప్రయాణికులు ఈ ప్రత్యామ్నాయ మార్గాలను గమనించి, సహకరించాలని కోరారు. తాజా ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్బుక్, ఎక్స్‌లో తమ అధికారిక ఖాతాలు చూడాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ప్రయాణ అత్యవసర సమయాల్లో సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 90102 03626ను సంప్రదించాలని సూచించారు.
KPHB Land Record Price: భూముల ధరల్లో సరికొత్త రికార్డు.. ఒక్క గజం రూ.2.70 లక్షలు
Hyderabad, Telangana:KPHB Land Auction: తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కన్న అత్యధిక ధరలు పలుకుతుండగా ఇక హైదరాబాద్‌లో భూముల ధరలు దేశంలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా నిర్వహించిన భూముల వేలంలో ఒక్క గజం రూ.2.70 లక్షలు పలికింది. కేపీహెచ్‌బీకి సంబంధించిన భూముల వేలంలో భారీ ధరలు పలికాయి. ఆ భూముల ధరలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కేపీహెచ్‌బీ భూములకు మరోసారి వేలం నిర్వహించగా ఈసారి తీవ్ర పోటీ నెలకొనడంతో భారీ ధరలు పలికాయి. మరోసారి రికార్డు ధరలకు హౌసింగ్ బోర్డు భూములు అమ్ముడుపోయాయి. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.47.14 కోట్ల మేర ఆదాయం లభించిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ ప్రకటించారు. ఎటువంటి వివాదాలు లేని.. అన్ని వసతులతో అభివృద్ధి చెందిన కేపీహెచ్‌బీ ప్రాంతంలో నిర్వహించిన ఓపెన్ ప్లాట్లకు భారీ డిమాండ్ వచ్చింది.
హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగం వేలంలో ఓపెన్ ప్లాట్లకు రికార్డు ధరలు వచ్చాయి. కేపీహెచ్‌బీ 7 ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో ఒక ప్లాట్‌కు ఒక చదరపు గజం భూమి 2.70 లక్షలకు ధర పలికింది. ఈ వేలానికి సంబంధించి హౌసింగ్ బోర్డు ఆగస్టు 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ ప్లాట్లకు చదరపు గజం కనీస ధరగా రూ.1.60 లక్షలు నిర్దారించింది.
ఈ వేలం పాటలో ఓపెన్ ప్లాట్లను దక్కించుకోడానికి మొత్తం 19 మంది కొనుగోలుదారులు (బిడ్డర్లు) పోటీపడ్డారు. వేలంలో చదరపు గజం సగటు ధర సుమారు రూ.1.79 లక్షలు పలికిందని హౌసింగ్ బోర్డు అధికారులు ప్రకటించారు. తాజా బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డ్‌కు సుమారు రూ.47.14 మేర కోట్ల ఆదాయం వచ్చిందని వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ వెల్లడించారు. ఒక ప్లాట్ చదరపు గజం రూ.2.70 లక్షలకు అమ్ముడుపోగా.. మరో ప్లాట్ చదరపు గజం రూ.2.36 లక్షలకు వేలంలో ధర లభించిందని తెలిపారు. మరో రెండు ప్లాట్లు రూ.2.06 లక్షలకు వేలం పాటలో ధర పలికిందని వివరించారు. నగరానికి శివారున ఉన్న కేపీహెచ్‌బీ ప్రాంతంలో భూములు ధరలు భారీగా ఉన్నాయి. ఈ డిమాండ్‌తో ప్రభుత్వం రానున్న రోజుల్లో మరికొన్ని కేపీహెచ్‌బీ ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Konda Surekha: ముఖ్యమంత్రి రేవంత్‌పై మరోసారి కొండా సురేఖ ఫైర్..ఈసారి మంత్రి పదవి ఊడినట్టేనా?
Hyderabad, Telangana:Minister Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఏఐసీసీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వచ్చినట్లు చెప్పిన ఆమె.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేసింది. తన మంత్రి పదవిని డిస్మిస్ చేసే ముందు రేవంత్ రెడ్డిపై తొలుత చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై వేటు తప్పదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.School Holiday Tomorrow: దేశవ్యాప్తంగా భారీ వర్షసూచన..రేపు స్కూళ్లకు సెలవు ఉందా? విద్యార్థులకు అలర్ట్!
Hyderabad, Telangana:School Holiday Tomorrow News: భారతదేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాలలో రుతుపవనాలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ (IMD) సెప్టెంబరు 3, 2026 వరకు పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు, మధ్య భాగాలలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల రేపు బడులు మూసివేస్తారా లేదా అనే ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రులలో వ్యక్తమవుతోంది.
సాధారణంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర స్థాయి నుండి కాకుండా, ఆయా రాష్ట్రాల విద్యాశాఖ, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్థానిక వాతావరణ తీవ్రతను బట్టి సెలవులు నిర్ణయిస్తారు. ఈ క్రమంలో, దేశవ్యాప్తంగా ఒకేసారి సెలవు ప్రకటించే అవకాశం లేదు. ముఖ్యంగా పాఠశాలల మూసివేత నిర్ణయాలు ప్రయాణాల భద్రత, వరద పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.
రాష్ట్రాల వారీగా తాజా పరిస్థితులు..
హిమాచల్ ప్రదేశ్: ఈ రాష్ట్రంలో సెప్టెంబర్ 3 వరకు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు ఒకేసారి సెలవు ఇవ్వకపోయినప్పటికీ, వాతావరణ తీవ్రతను బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు లేదా అధికారులు స్థానికంగా మూసివేత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఉత్తరాఖండ్: ఈ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ముఖ్యంగా నైనిటాల్ జిల్లాలో సెప్టెంబర్ 3వ తేదీన పాఠశాలలకు సెలవును అధికారులు ధృవీకరించారు. మిగిలిన జిల్లాల్లో వాతావరణ బులెటిన్లు, స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.
ఇతర రాష్ట్రాలు: తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో పూర్తిస్థాయి సెలవులు ప్రకటించలేదు కానీ స్థానిక పరిస్థితుల ఆధారంగా బడులు మూసివేసే అవకాశం ఉంది.
తల్లిదండ్రులు, విద్యార్థుల జాగ్రత్తలు..
వాతావరణ పరిస్థితులు సెప్టెంబర్ 3-4 వరకు ఇలాగే ఉండి, ఆ తర్వాత రుతుపవనాలు క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు, విద్యార్థులు తమ స్థానిక జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ, పాఠశాలల యాజమాన్యం నుండి వచ్చే అధికారిక ప్రకటనలను నిరంతరం గమనిస్తూ ఉండాలని సూచించడమైనది. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండి భద్రతా నియమాలు పాటించడం మంచిది.
Also Read: ఏపీ, తెలంగాణ ప్రజలకు చల్లని కబురు..బంగాళాఖాతంలో అల్పపీడనం..భారీ వర్షాలకు హెచ్చరిక!
Also Read: "రూ.43,000 కోట్ల అప్పులు తీర్చాను..నా జీవితం తెరిచిన పుస్తకం": Dr.సుభాష్ చంద్ర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TTD Deputy EO: తిరుమలలో కలకలం.. టీటీడీ డిప్యూటీ ఈఓ నివాసంలో ఏసీబీ తనిఖీలు
Tirupati, Andhra Pradesh:Mendu Lokanatham: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన డిప్యూటీ ఈఓ నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడం కలకలం రేపింది. ఇన్నాళ్లు ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ దాడులు నిర్వహించగా.. టీటీడీ అధికారి నివాసంపై ఏసీబీ తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం టీటీడీలో తీవ్ర కలకలం రేపింది.
తిరుపతిలోని డిప్యూటీ ఈఓ లోకనాథం ఇంటిలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని ఏసీబీ బృందం సోదాలు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగి మెండు లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు జరిగాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఈ తనిఖీలు చేపట్టారు. జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథం ఆస్తులపై విచారణ సాగుతోంది.
తిరుపతితో పాటు ఆయన బంధువులు, తమ్ముడి ఇళ్లతో సహా మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేశాయని సమాచారం. విచారణలో భాగంగా లభించిన బంగారం, ఆస్తి పత్రాలు, ఇతర పత్రాలను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ కోరారు. ఏసీబీ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేసే నకిలీ వ్యక్తుల మాటలు నమ్మవద్దని, అలా అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీకి కాల్ చేయాలని సూచించారు.
భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాగా టీటీడీ డిప్యూటీ ఈఓ నివాసంపై ఏసీబీ తనిఖీలు చేయడాన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ ఈవో లోకనాథం యాదవ్‌పై ఏసీబీ దాడులు కుట్రలో భాగమేనా? లోకనాథం యాదవ్‌ను టార్గెట్ చేయడం వెనుక ఆధిపత్య పోరే కారణమా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక 80 మంది అధికారులతో 6 నెలల విచారణ చేసినా ఏం తేలలేదు తెలిపారు. కొండను తవ్వి ఎలుకను పట్టారని విమర్శించారు.
