Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mancherial504251

అంగన్వాడి సెంటర్ టీచర్ ను సస్పెండ్ చేయాలి

Oct 03, 2024 10:37:00
Bellampalle, Kannal Rural, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బూడిదిగడ్డ బస్తీ అంగన్వాడి సెంటర్ టీచర్ సెంటర్ తెరవకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నందున ఆమెను సస్పెండ్ చేయాలని ఎంసీపీఐ యూ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం వారు మాట్లాడుతూ గర్భిణీలకు, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందించడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలన్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Jan 05, 2026 11:18:28
Miyapur, Telangana:

Luxury Bikes Gang Arrest: ఖరీదైన బైక్‌లే వారి లక్ష్యం. అత్యంత ఖరీదైన బైక్‌లు కనిపిస్తే ఆ గ్యాంగ్‌ వెంటనే ఎత్తుకుపోతుంది. రూ.లక్షల విలువైన కేటీఎం, బుల్లెట్‌, అపాచీ వంటి ఖరీదైన బైక్‌లను దొంగతనం చేస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రేమతో కొన్న బైక్‌లు దొంగతనానికి గురవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బైక్‌ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన బైక్‌ దొంగల ముఠా వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: NRI Nikitha: ఎన్నారై యువతి హత్యకేసులో భారీ ట్విస్ట్‌.. బాయ్‌ఫ్రెండ్‌ కాదు అతడు ఎవరంటే?

జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన సాయి కిరణ్ (23) బైక్‌ రిపేర్లు చేస్తుండేవాడు. దీంతో సునాయాసంగా బైక్‌ల తాళాలు తీసి దొంగతనానికి పాల్పడుతున్నాడు. ఒక గ్యాంగ్‌ను ఏర్పాటుచేసుకుని ఖరీదైన కేటీఎం, బుల్లెట్‌ వంటి బైక్‌లను దొంగతనాలు చేస్తున్నాడు. అతడి గ్యాంగ్‌లో లీల సాయి (21), విజయశివ సాయి ప్రసాద్(25), గెడ్డం ప్రవీణ్ (25) ఉన్నారు.

Also Read: Harish Rao: నదీ జలాలపై ఉత్తమ్‌ కట్టుకథలు, రేవంత్ పిట్ట కథలు: హరీశ్‌ రావు

వీరి సమాచారం తెలుసుకున్న మియాపూర్‌ పోలీసులు సాయి కిరణ్‌ ముఠాను అరెస్ట్‌ చేశారు. సాయికిరణ్‌తోపాటు లీల సాయి చిక్కగా.. దొంగతనం కేసులో విజయశివ సాయి ప్రసాద్ (25) ప్రస్తుతం అనకాపల్లి పోలీసుల పరిధిలో ఉన్నాడు. మరో గ్యాంగ్‌ సభ్యుడు గెడ్డం ప్రవీణ్ (25) పరారీలో ఉన్నాడు. వీరంతా నలుగురు ఏపీకి చెందిన ముఠా. గతంలో అత్తాపూర్‌లో కూడా ఒక కేసు నమోదు అయింది. గతంలో జైలుకు వెళ్లినా అతడి తీరు మారలేదు. మెకానిక్ వృత్తి కావడంతో బైక్‌లను ఈజీగా లాక్ తీసి చోరీలు చేస్తున్నాడు. అన్ని విలువ చేసే బైక్స్ దొంగతనం చేస్తాడు. చోరీ చేసిన బైక్స్ అన్ని యమహా కేటీఎం, డ్యూక్ బైక్స్ ఉన్నాయి. బైక్ చేసిస్ నెంబర్ కూడా కూడా మార్చేసి అమ్ముతాడు.

Also Read: Schools Holiday: రేపు స్కూళ్లకు సెలవు.. ఎక్కడ? ఎందుకో తెలుసా?

కిరణ్ సాయి, లీలా సాయి ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు మియాపూర్ ఏసీపీ వై. శ్రీనివాస్ కుమార్ తెలిపారు. రూ.80 లక్షల విలువ చేసే 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు కూడా నమోదు చేశామని.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

ఏటీఎం దొంగ అరెస్ట్‌..
సైబర్ క్రైమ్ కోర్స్ నేర్చుకొని ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని మియాపూర్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అర్థరాత్రి 100 కాల్ చేయగా.. మియాపూర్ పోలీసులు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏటీఎం నుంచి డబ్బులు దొంగతనం చేస్తున్న టైంలో పట్టుకున్నాం. ఏపీకి చెందిన వడ్డే కాటమయ్య సైబర్ క్రైమ్ కోర్సులు నేర్చుకోవడం కోసం హైదరాబాద్ వచ్చాడు. కోర్స్‌లో భాగంగా ఏటీఎంలో డబ్బులు ఎలా దొంగిలించాలని నేర్చుకున్నాడు. ప్రత్యేక కంపెనీ ఏటీఎంలలో వాటి టెక్నికల్ సమర్థ్యం గుర్తించి అదే నేర్చుకుంటాడు. ఏటీఎంలోకి వెళ్లిన కస్టమర్ డబ్బులు డ్రా చేసే క్రమంలో డబ్బులు రాకుండా టెక్నికల్ డివైస్ పెట్టి డబ్బులు రాకుండా చేస్తాడు. కస్టమర్ డబ్బులు రాలేదని వెళ్లిపోగానే ఈ వ్యక్తి డబ్బులు తీసుకుంటాడు. రామాంజనేయులు అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 05, 2026 10:45:04
Hyderabad, Telangana:

Sankranti 2026 Date And Time: భారతీయ సంస్కృతిలో మకర సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే ఈ శుభ పర్వదినం, చీకటి నుండి వెలుగులోకి ప్రయాణాన్ని సూచిస్తుంది. ఈ ఏడాది మకర సంక్రాంతితో పాటు ఏకాదశి తిథి కూడా కలిసి రావడం విశేషం.

2026 సంక్రాంతి పండుగ తేదీలు
ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు జనవరి 13 నుండి ప్రారంభం కానున్నాయి. తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.

జనవరి 14 (బుధవారం): భోగి పండుగ – పాత సామాగ్రిని మంటల్లో వేసి, కొత్త వెలుగులతో పండుగను ఆహ్వానించే రోజు.

జనవరి 15 (గురువారం): మకర సంక్రాంతి – సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ప్రధాన పండుగ.

జనవరి 16 (శుక్రవారం): కనుమ – పశువులను పూజించి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే రోజు.

పుణ్యస్నానాలు, పూజా సమయాలు
పంచాంగం ప్రకారం, జనవరి 15న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని బట్టి పుణ్యకాలం నిర్ణయిస్తారు. సూర్యుడి మకర సంక్రమణం మధ్యాహ్నం 3:13 గంటలకు ఉండగా.. మకర సంక్రాంతి పుణ్యకాలం మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 5:45 వరకు ఉంటుందట. అలాగే మహా పుణ్యకాలం మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:58 వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.

పవిత్ర నదీ స్నానాలు, సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలడం, దానధర్మాలు, జపతపాలు చేయడానికి మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:58 వరకు ఉన్న 'మహా పుణ్యకాలం' అత్యంత శ్రేష్టమైనదని పండితులు చెబుతున్నారు.

సంక్రాంతి విశిష్టత
ఈ పండుగ కేవలం మతపరమైనదే కాదు, రైతులకు పంట చేతికి వచ్చే ఆనంద సమయం. ఈ పండుగ రోజుల్లో ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు పల్లెల్లో సందడిని తెస్తాయి. నువ్వులు, బెల్లం కలిపి చేసే వంటకాలు ఈ కాలంలో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

ఆకాశంలో రంగురంగుల గాలిపటాల సందడి, పిల్లలకు పోసే భోగి పళ్లు పండుగ సంబరాన్ని రెట్టింపు చేస్తాయి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే ఈ సమయంలో చేసే దానధర్మాలు అనంతమైన ఫలితాలను ఇస్తాయని భక్తుల నమ్మకం.

Also Read: Tuesday Astrology: మంగళవారం స్త్రీలు అస్సలు చేయకూడని పనులు..అవి చేస్తే దరిద్ర దేవతని బొట్టుపెట్టి పిలిచినట్టే!

Also REad: Weight Loss Tips: సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? జిమ్‌కి వెళ్లకుండానే పొట్ట తుస్సుమని తగ్గిపోతుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 05, 2026 09:11:45
Hyderabad, Telangana:

Things should Not Do Women On Tuesday: హిందూ సంప్రదాయం ప్రకారం..ప్రతి మంగళవారం ఆంజనేయస్వామికి ప్రీతికరమైనది. కావున, ఆ రోజు స్వామి వారికి ఆలయాల్లో విశేషమైన పూజలు నిర్వహిస్తారు. అయితే మంగళవారం రోజున మహిళలు అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయట. అలాంటి వాటిని చేయడం వల్ల దరిద్ర దేవతను ఇంట్లోకి ఆహ్వానించినట్టే అని పండితులు అంటున్నారు. 

మంగళవారం రోజున కుజగ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటుందట. అలాంటి పరిస్థితుల్లో కొత్త పనులు ప్రారంభించకోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు. ఆ రోజుల కొత్త పనులు ప్రారంభించడం అశుభకరం, అమంగళకరమని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కావున మంగళవారం రోజున కొత్త బట్టలు కొనుగోలు చేయడం, కొత్త దుస్తులు ధరించడం మంచిది కాదట. అలా చేస్తే కుజ ప్రభావం కారణంగా ఆర్థికంగానే కాకుండా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందట. 

అదే విధంగా స్త్రీలు మంగళవారం రోజున సౌందర్య సాధనాలు కొనుగోలు చేయడం మంచిది కాదట. అలా చేయడం వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు. 

అలాగే పెళ్లైన మహిళలు మంగళవారం రోజున కుంకుమ కొనకూడదట. అలా చేస్తే భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావొచ్చని పండితులు చెబుతున్నారు. 

మంగళవారం రోజున స్త్రీలు గాజులు కొనరాదట. అలా చేస్తే దరిద్రాన్ని ఇంట్లోకి ఆహ్వానించినట్లే అని జోతిష్య శాస్త్రం చెబుతుంది.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: School Holiday: రేపు సోమవారం స్కూళ్లకు సెలవు..ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..విద్యార్థులు ఫుల్ ఖుషీ!

Also Read: Venezuela President Wife: అందగత్తెలున్న దేశంపై కన్నేసిన ట్రంప్..వెనిజులా అధ్యక్షుడి భార్యని కూడా అలా చేయడం ఎందుకు?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 05, 2026 08:12:39
Hyderabad, Telangana:

Weight Loss Tips Without Gym: నేటి కాలంలో అధిక బరువు (Obesity) అనేది చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గడం అనగానే అందరికీ గుర్తొచ్చేది కఠినమైన డైటింగ్, గంటల తరబడి జిమ్‌లో వ్యాయామం. కానీ, మన జీవనశైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, ఆకలితో అలమటించకుండానే నేచురల్‌గా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు చూద్దాం.

1. జీవక్రియ (Metabolism) మెరుగుపరచుకోండి
బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషించేది మీ శరీర జీవక్రియే. రోజంతా తగినంత నీరు త్రాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలు (Toxins) బయటకు వెళ్లిపోతాయి. ఇది కేలరీలను వేగంగా ఖర్చు చేయడంలో సహాయపడుతుంది. భోజనం చేయడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీరు త్రాగడం వల్ల ఆకలి తగ్గుతుంది, దీనివల్ల మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు.

2. ఆహారం తీసుకునే పద్ధతి మార్చండి
మనం ఏమి తింటున్నామనే దానికంటే, ఎలా తింటున్నామనేది ముఖ్యం. ఆహారాన్ని బాగా నమిలి, ఆస్వాదిస్తూ తినండి. ఇలా చేయడం వల్ల మీ కడుపు నిండిందనే సంకేతం మెదడుకు త్వరగా అందుతుంది. మీ డైట్‌లో ఫైబర్ (పీచు పదార్థం), ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇవి కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగించి, అనవసరమైన చిరుతిళ్లపై వ్యామోహాన్ని తగ్గిస్తాయి.

3. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి
బరువు తగ్గడానికి తగినంత నిద్ర చాలా అవసరం. మీరు నిద్రపోతున్నప్పుడు మీ శరీరం కండరాలను మరమ్మతు చేస్తుంది. నిద్ర లేమి వల్ల ఆకలిని ప్రేరేపించే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి, మీరు ఎక్కువగా తినే ప్రమాదం ఉంది. రోజుకు కనీసం 7-8 గంటల గాఢ నిద్ర అవసరం.

4. నడకను అలవాటు చేసుకోండి
ప్రత్యేకంగా వ్యాయామం చేయకపోయినా, రోజూవారీ పనుల్లో చురుగ్గా ఉండటం మంచి ఫలితాలను ఇస్తుంది. లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోండి. ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు నడవడం వంటి చిన్న మార్పులు కూడా కేలరీలను ఖర్చు చేయడంలో సహాయపడతాయి.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Chicken Rate Today: నాన్‌వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్..భారీగా పెరిగిన చికెన్, మటన్ ధర..ఆకాశానికి కోడిగుడ్డు రేటు!

Also Read: School Holiday: రేపు సోమవారం స్కూళ్లకు సెలవు..ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..విద్యార్థులు ఫుల్ ఖుషీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
IPInamdar Paresh
Jan 05, 2026 08:12:24
Hyderabad, Telangana:

Kalvakuntla kavitha emotional in the legislative council: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం సంచనలంగా మారారు.తరచుగా బీఆర్ఎస్ పార్టీపై ముఖ్యంగా హరీష్ రావును టార్గెట్ చేసుకుని ఫైర్ అవుతున్నారు. అదే విధంగా ఎక్కడ అవకాశం దొరికిన కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కల్వకుంట్ల కవిత శాసన మండలిలో సమావేశాలకు హజరయ్యారు. కవిత భావోద్వేగంకు గురయ్యారు. తనపై కొంత మంది కక్ష తో పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారని ఎమ్మెల్సీ కవిత  సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

అంతేకాకుండా  తెలంగాణలో బతుకమ్మ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసేటప్పుడు కూడా తనపై చాలా మంది తప్పుడు ప్రచారం చేశారన్నారు. తనపై ఈడీ, సీబీఐ దాడులు చేసినప్పుడు పార్టీ అండగా ఉండలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంత మంది చేసిన తప్పులను ప్రశ్నించడంతోనే తనపై కుట్రలు చేసి పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారని కవిత మండలిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమ కారులు, అసువులు బాసిన అమరులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.  నీళ్లు ,నిధులు, నియామకాల విషయంలోకూడా గత బీఆర్ఎస్ తో పాటు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ కూడా పూర్తిగా మోసపూరితంగా వ్యవహరించాయన్నారు. 

 శాసనమండలిలో సమ్మక్క, సారాలమ్మ గురించి మాట్లాడుతూ.. ఇదే తన చివరి ప్రసంగమంటూ కవిత కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివాసీ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా సమ్మక్క, సారక్క వైదిక చిహ్నాలను చెక్కారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more: Phone tapping case: సీఎం రేవంత్‌కు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

ఇది వారి సంప్రదాయాలకు విరుద్దమన్నారు. సమ్మక్క - సారక్క జాతరకు దేవాదాయ శాఖ పర్యవేక్షణ అనేది ఎంత వరకు సమంజసం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మక్క,సారక్క జాతరలో అమ్మవార్లు అడవి నుంచి రావడం సాంప్రదాయమని గిరిజన, ఆదివాసీ సంప్రదాయాలకు విరుద్దంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. కవిత  శాసన మండలిలో కన్నీళ్లు పెట్టుకొవడం తెలంగాణ  రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా ామారింది.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 05, 2026 06:58:21
Hyderabad, Telangana:

Chicken Price Increase 2026: నాన్‌వెజ్ ప్రియులకు 2026 సంవత్సరం చేదు వార్తతో ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న మాంసం ధరలు ఒక్కసారిగా పుంజుకుని, వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నాయి.

మార్కెట్‌లో ప్రస్తుత ధరల పరిస్థితి
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వివిధ రకాల కోడి మాంసం ధరల వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ చికెన్ ధర (స్కిన్ లెస్) కిలో రూ.300, లైవ్ కోడి కిలోకి ధర రూ. 170, ఫారం కోడి కిలో రూ. 180, నాటు కోడి కిలో రూ. 300, కోడి గుడ్డు ధర (ఒక్కటి)రూ.8కి మార్కెట్లో విక్రయిస్తున్నారు. 

ధరలు పెరగడానికి కారణాలేంటి?
సాధారణంగా డిసెంబర్ నెలలో కిలో చికెన్ ధర రూ.240 నుండి రూ.250 మధ్య ఉండగా.. జనవరి మొదటి వారంలోనే 'ట్రిపుల్ సెంచరీ' (కిలో ధర రూ.300) కొట్టడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. పండగ సీజన్ కావడంతో విందు వినోదాల కోసం చికెన్ వినియోగం విపరీతంగా పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగాయి.

ఏపీలోని పాయకరావుపేట, నక్కపల్లి వంటి ప్రధాన పౌల్ట్రీ కేంద్రాల నుండి ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతులు జరుగుతున్నాయి. స్థానిక అవసరాలకు సరిపడా స్టాక్ లేకపోవడం వల్ల వ్యాపారులు ధరలను పెంచాల్సి వచ్చింది.

గతంలో బర్డ్‌ఫ్లూ వంటి కారణాలతో ధరలు పడిపోయినప్పుడు కోళ్ల ఫారాల యజమానులు నష్టపోయారు. కానీ ఇప్పుడు ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మాంసమే కాకుండా, పేదల ప్రోటీన్ ఆహారమైన గుడ్డు ధర కూడా రూ.8 కి చేరడం మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారాన్ని మోపుతోంది.

"చికెన్ తినాలంటేనే భయమేస్తోంది, పండగ పూట ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ ఈ రేట్లు చూస్తుంటే కూరగాయలతోనే సరిపెట్టుకోవాలేమో" అని వినియోగదారులు వాపోతున్నారు.

చివరిగా ఒక్క ముక్కలో చెప్పాలంటే.. సంక్రాంతి ముగిసే వరకు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పండుగ తర్వాత సరఫరా మెరుగుపడితేనే ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

Also Read: School Holiday: రేపు సోమవారం స్కూళ్లకు సెలవు..ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..విద్యార్థులు ఫుల్ ఖుషీ!

Also Read: Thalapathy Net Worth: రూ.500 కోట్ల ఆస్తి..రాయల్ లైఫ్! అన్ని వదిలేసి స్టార్ హీరో రాజకీయాల్లోకి వచ్చేశాడు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Jan 05, 2026 03:22:10
Secunderabad, Telangana:

8th Pay Commission New Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా చర్చకు వస్తున్న అంశం 8వ వేతన సంఘం. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకోసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి, ఉద్యోగుల జీతాలు, భత్యాలు, పెన్షన్లను సమీక్షిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసింది. దీంతో 2026 జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. 

అయితే.. ఇప్పటికే ప్రభుత్వం 8వ వేతన సంఘానికి సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR)లను 2025 నవంబర్‌లో ఆమోదించినప్పటికీ, వేతన సంఘం తన సిఫార్సులను సమర్పించడానికి సాధారణంగా 18 నెలల వరకు సమయం పడుతుంది. అంటే 2026లోనే కొత్త వేతనాలు అమలవుతాయన్నది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ లోపు కేంద్ర క్యాబినెట్ సిఫార్సులను ఆమోదించే వరకు ఉద్యోగులు 7వ వేతన సంఘం ప్రకారమే జీతాలు, పెన్షన్లు అందుకుంటూ ఉంటారు.

ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ). గత వేతన సంఘాల అనుభవం చూస్తే, కొత్త వేతన సంఘం అమలయ్యే సమయంలో ప్రభుత్వం మొత్తం కాలానికి సంబంధించిన బకాయిలను చెల్లించింది. ఇందులో పెరిగిన ప్రాథమిక వేతనం, అలవెన్సులు, పెన్షన్ ప్రయోజనాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కొత్తగా నిర్ణయించే ఫిట్‌మెంట్ కారకం ఆధారంగా లెక్కిస్తారు. అందువల్ల 8వ వేతన సంఘం అమలయ్యాక ఉద్యోగులకు భారీ మొత్తంలో అరియర్స్ వచ్చే అవకాశం ఉందన్న ఆశలు బలంగా ఉన్నాయి.

డీఏ విషయంలో మరో ముఖ్యమైన అంశం ఉంది. కొత్త వేతన సంఘం అమలైన వెంటనే అప్పటివరకు సేకరించిన మొత్తం డీఏను ప్రాథమిక జీతంలో విలీనం చేస్తారు. ఆ తర్వాత డీఏ మళ్లీ సున్నా నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం జూలై 1, 2025 నుంచి డీఏ 58 శాతానికి చేరుకుంది. తదుపరి డీఏ పెంపు జనవరి 1, 2026న జరగాల్సి ఉంది. కొత్త వేతన సంఘం అమలయ్యే వరకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏ పెరుగుతూనే ఉంటుంది. కానీ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలులోకి వచ్చిన తర్వాత మొత్తం డీఏ ప్రాథమిక జీతంలో కలిసిపోతుంది.

Also Read: Venezuela Petrol: వెనిజులాలో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా? ఫుల్ ట్యాంక్ నింపే డబ్బులతో ఇండియాలో పిప్పర్‎మెంట్ కొనొచ్చు..!!

ఈ విధానం ఉద్యోగులకు ఒక్కసారిగా లాభమిచ్చినా, ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయంలో డీఏ సున్నా నుంచి ప్రారంభమవడం వల్ల ఆదాయం మీద ఒత్తిడి పడుతుందన్న ఆందోళన ఉద్యోగుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ప్రత్యామ్నాయ సూచనలతో ముందుకొచ్చాయి. ఆల్ ఇండియా NPS ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్ మాట్లాడుతూ.. 2028 నాటికి డీఏ సుమారు 74 శాతానికి చేరితే, మొత్తం డీఏను తొలగించకుండా, అందులో 50 శాతాన్ని మాత్రమే ప్రాథమిక జీతంలో విలీనం చేయాలని సూచించారు. మిగిలిన 24 శాతం డీఏను కొనసాగిస్తే, ద్రవ్యోల్బణ భారం ఉద్యోగులపై ఒక్కసారిగా పడదని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే కనీస వేతనాన్ని నిర్ణయించేటప్పుడు ఫిట్‌మెంట్ కారకాన్ని 2.64గా నిర్ణయించాలని, కుటుంబ యూనిట్ పరిమాణాన్ని మూడు నుంచి ఐదుకు పెంచాలని కూడా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం గత వేతన సంఘాల ఫార్ములానే కొనసాగిస్తుందా, లేక ఉద్యోగులకు కొంత వెసులుబాటు కల్పించే మధ్యస్థ మార్గాన్ని ఎంచుకుంటుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

 8వ వేతన సంఘం అమలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక మలుపుగా మారనుంది. జీతాలు, డీఏ, అరియర్స్ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు లక్షలాది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి. అందుకే ఈ అంశంపై ఉద్యోగుల్లో ఉత్కంఠ, ఆసక్తి మరింత పెరుగుతోంది.

Also Read: Venezuela Currency VS Indian Rupee: మీరు ఇండియా నుంచి 10,000 రూపాయలతో వెనిజులాకు వెళితే, అక్కడ మీకు ఎంత లభిస్తుంది? లాభమా? నష్టమా?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
BBhoomi
Jan 04, 2026 16:22:20
Secunderabad, Telangana:

Gustavo Petro warning by Trump: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు అరెస్టు చేసిన తర్వాత లాటిన్ అమెరికా ప్రాంతం మొత్తం తీవ్ర ఉద్రిక్తతకు లోనవుతోంది. ఈ సైనిక చర్య ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలకు దారి తీసిన వేళ, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక దేశాధ్యక్షుడిని బహిరంగంగా హెచ్చరించడం సంచలనంగా మారింది. ఈసారి ట్రంప్  కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను లక్ష్యంగా చేసుకున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రచురించిన కథనం ప్రకారం, మదురో అరెస్టు అనంతరం ట్రంప్ కొలంబియా అధ్యక్షుడిని ఉద్దేశించి  జాగ్రత్తగా ఉండాలి  అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇలా హెచ్చరించడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా పెట్రోపై ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ హెచ్చరిక మరింత తీవ్రతను సంతరించుకుంది. వాషింగ్టన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, “గుస్తావో పెట్రో కొకైన్ తయారీకి సంబంధించిన కార్యకలాపాల్లో ఉన్నాడు. కొలంబియాలో కొకైన్ తయారు చేసి అమెరికాకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. అందుకే అతను తన ప్రాణాల గురించి జాగ్రత్తగా ఆలోచించాలి” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి.

న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం, మదురో అరెస్టును ప్రకటించిన సందర్భంలోనే ట్రంప్ మెక్సికో, క్యూబా దేశాలపై కూడా పరోక్ష హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వెనిజులాపై దాడి మెక్సికోను ఉద్దేశించి కాదని చెబుతూనే, మాదకద్రవ్యాల ముఠాలపై కఠిన చర్యలు అవసరమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో కొలంబియా, క్యూబా నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు.ట్రంప్ వ్యాఖ్యలకు లాటిన్ అమెరికా దేశాల నుంచి వెంటనే ప్రతిస్పందన వచ్చింది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ పార్డో ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, వెనిజులాపై అమెరికా సైనిక చర్యను తీవ్రంగా ఖండించారు. ఇది సార్వభౌమ దేశంపై జరిగిన దురాక్రమణగా అభివర్ణించారు. వెనిజులా ప్రభుత్వం, ప్రజలపై అన్ని రకాల దాడులను తక్షణమే నిలిపివేయాలని అమెరికాను కోరారు.

Also Read: Venezuela Petrol: వెనిజులాలో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా? ఫుల్ ట్యాంక్ నింపే డబ్బులతో ఇండియాలో పిప్పర్‎మెంట్ కొనొచ్చు..!!

కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కూడా స్పందిస్తూ, అమెరికా చర్యలను లాటిన్ అమెరికా సార్వభౌమాధికారంపై నేరుగా చేసిన దాడిగా పేర్కొన్నారు. ఈ చర్యలు ప్రాంతాన్ని మానవతా సంక్షోభం వైపు నెట్టివేస్తాయని హెచ్చరించారు. వాషింగ్టన్ విధానాలు శాంతికి కాకుండా అస్థిరతకు దారి తీస్తున్నాయని ఆయన విమర్శించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా కూడా అమెరికా దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు హింస, గందరగోళం నిండిన ప్రపంచానికి తొలి అడుగుగా మారతాయని హెచ్చరించారు. చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ శాంతియుత పరిష్కారం కోసం పిలుపునిచ్చారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కెయిన్ అమెరికా చర్యలను నేరపూరిత దాడిగా అభివర్ణించారు.

ఉరుగ్వే ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అమెరికా సైనిక జోక్యాన్ని ఎప్పటిలాగే తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది. మొత్తం మీద, మదురో అరెస్టు తర్వాత ట్రంప్ తీసుకుంటున్న దూకుడు వైఖరి లాటిన్ అమెరికా మొత్తాన్ని ఒక కొత్త రాజకీయ సంక్షోభం వైపు నడిపిస్తున్నదన్న అభిప్రాయం బలపడుతోంది.

Also Read: Venezuela Currency VS Indian Rupee: మీరు ఇండియా నుంచి 10,000 రూపాయలతో వెనిజులాకు వెళితే, అక్కడ మీకు ఎంత లభిస్తుంది? లాభమా? నష్టమా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 04, 2026 14:20:40
Hyderabad, Telangana:

School Holiday Tomorrow: భారతదేశ వ్యాప్తంగా తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కారణంగా ఉత్తర భారతంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నాయి. జనవరి 5, 2026 (సోమవారం) నాడు కూడా స్కూళ్లకు అధికారులు సెలవును ప్రకటించాయి. ఇంతకీ ఏయే రాష్ట్రాల్లో పాఠశాలలు మూసివేతగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా తీవ్రమైన చలి, వాటి తీవ్రమైన గాలుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు అనగా జనవరి 5 (సోమవారం) అన్ని స్కూళ్లకు సెలవును ప్రకటించారు. అలాగే చలితీవ్రత కారణంగా పంజాబ్ రాష్ట్రంలో స్కూళ్లకు జనవరి 7 వరకు సెలవులకు ప్రభుత్వం ఆదేశించింది.

అలాగే దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో శీతాకాలపు సెలవులను జనవరి 15 వరకు రాష్ట్రప్రభుత్వం స్కూళ్లకు సెలవును ప్రకటించింది. చలిగాలుల కారణంగా హర్యానా రాష్ట్రంలో జనవరి 15 వరకు స్కూల్స్ క్లోజ్ అవ్వనున్నాయి. అలాగే రాజస్థాన్‌లో జనవరి 5న, అస్సాంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో జనవరి 6 వరకు స్కూళ్లకు సెలవులను ప్రకటించారు. 

ఉత్తర ప్రదేశ్‌లో కఠిన నిబంధనలు:
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ (CBSE/ICSE తో సహా) పాఠశాలలు జనవరి 5 వరకు సెలవులను ప్రకటించారు. ముఖ్యంగా నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా ప్రయాణాలు ప్రమాదకరంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దక్షిణ భారతదేశంలో పరిస్థితి..
ఉత్తర భారతం చలితో వణుకుతుంటే, దక్షిణ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ శీతాకాలపు సెలవులు ఇప్పటికే ముగియడంతో, జనవరి 5వ తేదీన పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయి.

గమనిక: వాతావరణ పరిస్థితుల ఆధారంగా సెలవుల పొడిగింపుపై నిర్ణయాలు జిల్లా కలెక్టర్ల స్థాయిలో చివరి నిమిషంలో మారే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు స్థానిక వార్తలు లేదా పాఠశాల యాజమాన్యం ఇచ్చే అధికారిక సమాచారాన్ని అనుసరించాలి.

Also Read: Thalapathy Net Worth: రూ.500 కోట్ల ఆస్తి..రాయల్ లైఫ్! అన్ని వదిలేసి స్టార్ హీరో రాజకీయాల్లోకి వచ్చేశాడు!

Also Read: School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జనవరి 5 వరకు స్కూళ్లకు సెలవులు..భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 04, 2026 13:33:04
Hyderabad, Telangana:

Vijay Thalapathy Net Worth: దశాబ్దాల కాలంగా కోలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలుతున్న విజయ్ దళపతి, ఇప్పుడు వెండితెరపై తన చివరి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం 'జన నాయకుడు' (తమిళంలో జన నాయగన్) సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి (TVK పార్టీ) వెళ్తున్న విజయ్ సంపాదన, విలాసవంతమైన జీవితంపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.

రాజభవనం లాంటి ఇల్లు
చెన్నైలోని నీలాంకరై తీర ప్రాంతంలో విజయ్‌కు ఒక అద్భుతమైన విల్లా ఉంది. దాని విలువ దాదాపుగా రూ. 80 కోట్ల విలువ ఉంటుందని అంచనా. అమెరికన్ నటుడు టామ్ క్రూజ్ ఇంటి స్ఫూర్తితో దీనిని నిర్మించినట్లు సమాచారం. అధునాతన స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, ఆటోమేటెడ్ లైటింగ్, ప్రశాంతమైన వాతావరణం ఈ ఇంటి సొంతం.

గ్యారేజీలో విలాసవంతమైన కార్లు
హీరో విజయ్‌కు కార్లంటే అమితమైన ఇష్టమట. ఆయన వద్ద ఉన్న కార్ల సేకరణ చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు విలువ దాదాపుగా రూ.6 కోట్లకు పైగా ఉంటుందట. అలాగే రూ. 1 కోటి విలువైన మెర్సిడెస్-బెంజ్ GL-క్లాస్, రూ.95 లక్షలు విలువైన BMW X5 కారు విజయ్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.  వీటితో పాటు ఆడి, మినీ కూపర్ వంటి మరికొన్ని లగ్జరీ కార్లు కూడా ఆయన గ్యారేజీలో ఉన్నాయట.

సంపాదన, మొత్తం ఆస్తి
దక్షిణాదిలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో విజయ్ ఒకరు. తన చివరి చిత్రాలకు ఆయన ఒక్కో సినిమాకు దాదాపు రూ.150 కోట్లు తీసుకుంటున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అనేక నివేదికల ప్రకారం.. విజయ్ నికర ఆస్తి విలువ సుమారు రూ.500 కోట్ల పైమాటే ఉంటుందని అంచనా.

సినిమాలకు గుడ్‌బై..రాజకీయాల్లోకి ఎంట్రీ
హీరో విజయ్ స్థాపించిన తమిళనాడు వెట్రీ కజగం (TVK) పార్టీపై తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాల్లో సంపాదించిన పాపులారిటీని, ఆస్తులను ఇప్పుడు ప్రజా సేవ కోసం వెచ్చించేందుకు ఆయన సిద్ధమయ్యారు. 'జన నాయకుడు' సినిమాతో చివరగా థియేటర్లలో సందడి చేసి, ఆపై పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దీన్ని చూసిన టాలీవుడ్ ప్రేక్షకులు ఇది నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'భగవంత్ కేసరి' రీమేక్ అంటున్నారు.

Also Read: Mana Shankara Vara Prasad Trailer: 'మన శంకరవరప్రసాద్' ట్రైలర్ వచ్చేసింది! సంక్రాంతి మెగా ధమాకా..బాక్సాఫీస్ కుమ్ముడే!

Also Read: Venezuela President Wife: అందగత్తెలున్న దేశంపై కన్నేసిన ట్రంప్..వెనిజులా అధ్యక్షుడి భార్యని కూడా అలా చేయడం ఎందుకు?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Jan 04, 2026 13:32:37
Secunderabad, Telangana:

Business Ideas: బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మీరు బంగారు ఆభరణాలను ధరించాలని మోజుపడుతున్నారా  అయితే ఒకప్పుడు వేలల్లో పలికిన  తులం బంగారం, ఇప్పుడు లక్షల్లోకి చేరుకుంది. కనీసం ఒక చిన్న నెక్లెస్ కొనుగోలు చేయాలన్న మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చయ్య పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు ఇంత ఖరీదైన డిజైన్స్ ఉన్న బంగారం నెక్లెస్ ధరించి బయటకు వెళితే సేఫ్టీ కూడా ఉండదు. దొంగల కన్ను పడిందంటే  మీ నెక్లెస్ మాయం అవడం ఖాయం. 

ఎందుకంటే ధరలు లక్షల్లోకి వెళ్లిపోయాయి ఈ సమయంలో దొంగలు ఎంత రిస్క్ తీసుకునేందుకు ఆయన ఏమాత్రం వెనుకాడరు. ప్రస్తుతం బంగారం ధర విపరీతంగా పెరిగిపోయిన ఈ నేపథ్యంలో అంత ఖరీదైన బంగారు నగలను ధరించి బయటకు వెళితే ప్రాణాపాయం  ఉందనే మాట కూడా నిజమే అని చెప్పవచ్చు. ఇటీవల నగరంలో చైన్ స్నాచింగ్ కేసుల్లో  మహిళలు తీవ్రంగా గాయపడిన సంఘటనలు చూడవచ్చు. అయితే మరి మీకు నచ్చిన ఎంపిక చేసుకున్న చక్కటి నగలను ఇక మీరు  ధరించలేము అని బాధపడుతున్నారా అయితే దీన్నే మీరు ఒక చక్కటి వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. 

 వన్ గ్రామ్ గోల్డ్ దీనికి చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. మార్కెట్లో ఇది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ వన్ గ్రామ్ గోల్డ్  అనేది పూర్తిగా తక్కువ ధరతో లభించే ఒక ఇమిటేషన్ జ్యువెలరీ.  కేవలం 100 రూపాయల నుంచి వెయ్యి రూపాయలు మధ్యలో లభిస్తాయి. ఉదాహరణకు మీరు వడ్డానం లాంటి పెద్ద నగను ధరించాలి అనుకున్నట్లయితే వన్ గ్రామ్ గోల్డ్ ధరించడం ద్వారా మీ కోరిక తీర్చుకోవచ్చు. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ చేయడం ద్వారా ప్రస్తుతం చక్కటి ఆదాయం లభించే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలు 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. 

Also Read: Business Ideas: మహిళలూ..రేవంత్ రెడ్డి సర్కార్ అందిస్తున్న లోన్‎ తీసుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే.. భారీ ఆదాయం పక్కా..!!

మార్కెట్లో లభిస్తున్న ట్రెండీ డిజైన్స్ అలాగే  గొలుసులు, నెక్లెస్లు, ట్రెండీ చెవి కమ్మలు వంటివి హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేసి మీరు రిటైల్ గా విక్రయించినట్లయితే చక్కటి ఆదాయం పొందవచ్చు. మీరు ఈ బిజినెస్ ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఒక లేడీస్ ఎంపోరియం ప్రారంభించి అందులో అన్ని వస్తువులతో పాటు ఈ వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకున్నట్లయితే మంచి లాభాలను పొందవచ్చు. 

మీకు హోల్సేల్ మార్కెట్లో వీటి ధర చాలా తక్కువగా లభిస్తుంది. మీరు వీటి పైన దాదాపు 50 శాతం నుంచి 60 శాతం వరకు  ప్రాఫిట్ మార్జిన్ పొందే అవకాశం ఉంది.  ఉదాహరణకు మీరు 100 రూపాయలకు ఒక చైన్ కొనుగోలు చేస్తే దానిని 150 రూపాయలు నుంచి 160 రూపాయల వరకు అమ్మవచ్చు.

Also Read:  Business Ideas: కేసీఆర్‌ ఐడియా అదుర్స్.. ఈ చిన్న ట్రిక్‎తో టన్నుల కొద్దీ క్యాప్సికం పండిస్తున్నారు.. ఆ ట్రిక్ తెలుసుకుంటే మీ ఫేట్ మారడం గ్యారెంటీ..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
Jan 04, 2026 13:09:40
0
comment0
Report
Advertisement
Back to top