రైతులతో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. డివిజన్లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మార్గమధ్యంలో మంత్రి రైతు కూలీలను కలుసుకుని వారి కష్టాలు. ఎలాంటి ధాన్యం వేస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రజాపరిపాలనపై ఆరా తీశారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
YS Jagan Padayatra: కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క వర్గానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి మేలు చేయలేదని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఏ వర్గానికి కష్టం వచ్చినా నిలబడుతామని తెలిపారు. జెండా పట్టుకుని బాధితుల తరపున పోరాడుతున్నామని చెప్పారు. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగించాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ సూచించారు.
Also Read: Medaram Jathara: మేడారం భక్తులకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త.. ఏం ప్రకటించిందో తెలుసా?
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేశారు. 'కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. జగన్ ఉంటే ఎలా మేలు జరిగేదన్నది ఆలోచిస్తున్నారు. ప్రభుత్వానికి మిగిలింది ఇంకా మూడేళ్లు మాత్రమే. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతా' అని మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు.
Also Read: Phone Tapping: బొగ్గు కుంభకోణంపై డైవర్షన్ కోసమే రేవంత్ రెడ్డి సరికొత్త డ్రామా: కేటీఆర్
ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటానని.. ఇక ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతానని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించారు. ఏలూరు నియోజకవర్గంతో ఆ కార్యక్రమాన్ని తిరిగి మొదలుపెడుతున్నామని.. ఇక ముందు వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఇలా సమావేశమవుతామని తెలిపారు. 'వచ్చే నెల చివరలో లేదా మార్చి మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమే. పరిపాలన చాలా అన్యాయంగా జరగుతోంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.
Also Read: Kavitha: తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ ప్రశాంత్ కిశోర్.. కవిత పార్టీకి సేవలు
రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండకావరంతో వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనంతా అబద్దాలు మోసాలు.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని వివరించారు. పోలీస్ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే కూటమి ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చిందని వైఎస్ జగన్ తెలిపారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని నమ్మించి, చివరకు పలావ్ కూడా లేకుండా చేశారని అంతా బాధపడుతున్నారని వివరించారు.
Also Read: Viral Pic: ఈ 'స్టార్ యువకులకు వధువు కావలెను'.. పెళ్లి కాని యువకుల బ్యానర్ ఫొటో వైరల్
'వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ వచ్చింది. అన్ని కష్టాలున్నా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఏ ఒక్క పథకం ఆపలేదు. ప్రజలకు చెప్పింది ప్రతిదీ చేసి చూపాం. చంద్రబాబు పాలన మళ్లీ తిరిగి చూసిన తర్వాత, ప్రజలంతా అన్ని వాస్తవాలు గుర్తించారు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసాలు చేసే వారు ఉండరని అంతా గుర్తించారని చెప్పారు.
'సూపర్‌సిక్స్ లేదు. సూపర్ సెవెన్ లేదు. అన్నీ మోసాలే. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. గవర్నమెంటు స్కూళ్లు పూర్తిగా కళ తప్పాయి. పిల్లలకు టోఫెల్ క్లాస్‌లు లేవు. గోరుముద్ద కూడా క్వాలిటీ లేకుండా పోయింది. పిల్లల ప్రాణాలు పోతున్నాయి' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు గవర్నమెంట్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం ఎమ్మెల్యేల నుంచి కూడా రికమెండేషన్లు ఉండేవని.. ఆ స్థాయిలో గవర్నమెంటు స్కూళ్లకు డిమాండ్ ఉండేదని గుర్తుచేశారు. అదే ఇప్పుడు దాదాపు 9 లక్షల మంది పిల్లలు గవర్నమెంటు స్కూళ్ల నుంచి చదువు మానేశారని వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Samsung Galaxy A57: 5000mAh బ్యాటరీతో Samsung Galaxy A57 ఫోన్ త్వరలో లాంచ్.. ఫీచర్స్ వివరాలు ఇవే!
Samsung Galaxy A57 Specifications: సాంసంగ్ కంపెనీ మార్కెట్లోకి Samsung Galaxy A57 మొబైల్ విడుదల చేయబోతోంది. విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలు MIIT సర్టిఫికేషన్‌లో కూడా పేర్కొన్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో OLED డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చాలా స్లిమ్‌గా కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో OLED డిస్ప్లేతో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన లీక్ అయిన ఇతర వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ Samsung Galaxy A57 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ లాంచింగ్‌కి ముందే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సర్టిఫికేషన్ జాబితాలో అందించిన స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. 6.6-అంగుళాల FullHD+ డిస్ప్లేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో OLED ప్యానెల్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన ఆక్టా-కోర్ Exynos 1680 చిప్సెట్ ప్రాసెసర్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక కంపెనీ ఈ మొబైల్‌ను కేవలం ఒక స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 256GB స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులోకి రాబోతోంది.
Samsung Galaxy A57 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాంచ్ కాబోతోంది. ఇది Samsung One UI 8 స్కిన్ అందుబాటులోకి రానుంది. ఇక ఈ మొబైల్ వెనక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రధాన లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు అదనంగా 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా 5-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఫ్రంట్ భాగంలో సెల్ఫీ కోసం ప్రత్యేకమైన 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తోంది. దీంతో పాటు సెక్యూరుటీ కోసం ఇందులో ప్రత్యేకంగా ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా అందిస్తోంది.
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో ప్రత్యేకంగా USB టైప్-Cతో పాటు స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉండబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. దీనిని కంపెనీ IP67 రేటింగ్ కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ 161.5 x 76.8 x 6.9mm కొలతలతో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన అధికారక ప్రకటనను కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Motorola Edge 60 Fusion 5G Price Cut: మిడ్-రేంజ్ విభాగంలో మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే మోటరోలా విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్స్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ముఖ్యంగా ఇటీవలే విడుదలైన స్మార్ట్‌ఫోన్స్ అత్యంత చీప్ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. రిపబ్లిక్ డే సేల్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే ఎన్నో రకాల అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో? ఇది ఎన్ని రకాల ఫీచర్స్‌తో లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది 6.67 అంగుళాల pOLED క్వాడ్-కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 1.5K (1220 x 2712 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఇందులో డిస్ల్పే ప్రోటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iను కూడా అందిస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 (MediaTek Dimensity 7400 - 4nm) ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. మొదటిది 256GB స్టోరేజ్‌తో పాటు రెండవది 512GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఇక ఇది ఆండ్రాయిడ్ 15 (హలో UI) ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభిస్తోంది. ఇది 3 ఏళ్ల OS అప్డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ను కూడా అందిస్తోంది. ఇది డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాన కెమెరా 50MP సోనీ LYT-700C సెన్సార్‌తో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా 13MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా లభిస్తోంది. ఇది మాక్రో, డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది. అలాగే ఫ్రంట్ భాగంలో 32MP సెల్ఫీ కెమెరా (4K వీడియో రికార్డింగ్ సపోర్ట్) కూడా అందుబాటులో ఉంది. ఇది ఎంతో శక్తివంతమైన 5500mAh బ్యాటరీతో లభిస్తోంది. ఇందులో ప్రత్యేకంగా 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.
Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్ డిస్కౌంట్.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్.!
ప్రస్తుతం మార్కెట్లో వేరియంట్స్‌ను బట్టి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, 8GB + 256GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర మార్కెట్లో సుమారు రూ.21,999 నుంచి రూ.22,999 వరకు ధరతో లభిస్తోంది. అలాగే రెండవ వేరియంట్ 12GB + 256GB స్టోరేజ్‌తో సుమారు రూ.23,999 నుంచి రూ.24,999 ధరల్లో లభిస్తోంది. అయితే, దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం మొదిటి వేరియంట్‌పై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ.27,999 కాగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్స్‌తో కేవలం రూ. 23,999కే అందుబాటులో ఉంది. ఇక రిపబ్లిక్ డే సేల్స్‌లో యాక్సిస్ బ్యాంక్, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.3,048 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎక్చేంజ్ బోనస్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ.20 వేల బోనస్‌తో కేవలం రూ.3,999కే పొందవచ్చు.
Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్ డిస్కౌంట్.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్.!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Allu Arjun Mana Shankara Vara Prasad Movie Review: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం ఇప్పటికే రూ.300 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన అల్లు అర్జున్, చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే అభినందనలు తెలిపారు.
జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తాజాగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంపై బన్నీ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బన్నీ రివ్యూ హైలైట్స్..
"బాస్ ఈస్ బ్యాక్! చిరంజీవి గారు మరోసారి స్క్రీన్ పై వెలిగిపోయారు. ఆయన ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది" అని మెగాస్టార్ మ్యాజిక్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొనియాడారు.
CONGRATULATIONS TO THE ENTIRE TEAM OF #ManaShankaraVaraPrasadGaru
The BOSS IS BACK ❤️🔥 L - I - T 🔥
Happy to see our megastar @KChiruTweets garu light up the screens again 🔥Full #VintageVibes
⁰@VenkyMama garu rocked the show . #VenkyGowda ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದಿರಾ (Thumba… pic.twitter.com/SI8CF7r9VO— Allu Arjun (@alluarjun) January 20, 2026
వెంకటేష్ & నయనతార: "వెంకటేష్ గారు తన నటనతో అదరగొట్టారు. నయనతార చాలా అందంగా కనిపించారు" అంటూ ప్రధాన తారాగణాన్ని ప్రశంసించారు.
అనిల్ రావిపూడిపై ప్రశంసలు: దర్శకుడు అనిల్ రావిపూడిని 'సక్సెస్ మిషన్' గా అభివర్ణించారు. "సంక్రాంతికి వస్తారు.. హిట్ కొడతారు.. రిపీట్! అనిల్ గారు మీ సక్సెస్ కు అభినందనలు" అంటూ ట్వీట్ చేశారు.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ సూపర్ గా ఉందని బన్నీ కితాబిచ్చారు.
జపాన్‌లో పుష్ప-2 హవా.. అట్లీతో కొత్త ప్రాజెక్ట్!
మరోవైపు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి జపాన్ లోని చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించి వచ్చారు. అక్కడ విడుదలైన 'పుష్ప 2' ప్రమోషన్లలోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్, దర్శకుడు అట్లీతో సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రాబోతున్న సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. మరోవైపు 'మాస్టర్' డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కూడా బన్నీ ఒక సినిమాను అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.
వరుస హిట్లు అందుకుంటున్న అనిల్ రావిపూడికి, మెగాస్టార్‌కు అల్లు అర్జున్ అభినందనలు తెలపడం మెగా అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. ఈ సినిమా వసూళ్ల పరంగా మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: 500 Note Ban: రూ.500 నోట్లు రద్దు కానున్నాయా? ఏటీఎంల నుంచి మాయమవుతాయా? కేంద్రం ఏం చెప్పిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
500 Note Ban News: గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్లో రూ.500 నోట్ల భవిష్యత్తుపై పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుల్లో నెలకొన్న ఆందోళనను తొలగిస్తూ ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. సోషల్ మీడియాలో రూ.500 నోట్ల రద్దు గురించి జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజం ఉందో వివరిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కీలక స్పష్టతనిచ్చింది.
వైరల్ అవుతున్న వార్త ఏమిటి?
మార్చి 2026 తర్వాత ఏటీఎంలలో రూ.500 నోట్లు అందుబాటులో ఉండవనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మరోసారి డీమోనిటైజేషన్ (Demonetization 2.0) కి సిద్ధమవుతున్న క్రమంలో.. ఇకపై దేశంలో రూ.100 నోటే అతిపెద్ద కరెన్సీగా ఉండబోతోదనే వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు నెట్టింట విపరీతంగా షేర్ కావడంతో, పదేళ్ల క్రితం జరిగిన నోట్ల రద్దు కష్టాలను గుర్తుచేసుకుంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ నివేదిక..
ఈ పుకార్లను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం తీవ్రంగా ఖండించింది. 500 రూపాయల నోట్లను నిషేధించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని PIB స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, అటువంటి తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరింది. కరెన్సీ మార్పుల గురించి ఆర్బీఐ (RBI) గానీ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదని తేల్చి చెప్పింది.
తప్పుడు సమాచారాన్ని బహిర్గతం చేస్తూ, ఒక స్క్రీన్ షాట్‌ను కూడా PIB షేర్ చేసింది. ప్రభుత్వ విధానాలు లేదా ఆర్థిక నిర్ణయాలకు సంబంధించిన సమాచారం కోసం కేవలం అధికారిక వెబ్సైట్లు, ధ్రువీకరించబడిన ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే అనుసరించాలని సూచించింది.
కాబట్టి, మీ దగ్గర ఉన్న రూ.500 నోట్లు పూర్తి సురక్షితం. వాటి రద్దు గురించి వస్తున్న వార్తలు కేవలం సృష్టించిన పుకార్లు మాత్రమే. ఇటువంటి మెసేజ్‌లను ఫార్వార్డ్ చేయకుండా ఉండటం బాధ్యతాయుతమైన పని.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Vs Pakistan: టోర్నీ ఏదైనా సరే భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయంటే వచ్చే కిక్కే వేరు. ఇరు దేశాల అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ సైతం భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు అన్న సంగతిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరి 15 పైనే ఉంది. ఎందుకంటే ఆ రోజు టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
అయితే.. అదే రోజు మరో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కూడా జరగనుంది. తొలి మ్యాచ్ లో పురుషుల జట్లు తలపడనుండగా రెండో మ్యాచ్ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో భాగంగా జరగనుంది. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వేదికగా ఫిబ్రవరి 13 నుంచి 22 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత మహిళల-ఏ జట్టుతో పాటు మరో ఏడు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 13న జరగనుంది. యూఏఈ, నేపాల్ జట్లు తలపడనున్నాయి.
8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. భారత్, పాకిస్తాన్లతో పాటు యూఏఈ, నేపాల్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయిలాండ్ జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి. ఇక భారత-ఏ జట్టు తమ తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 13న యూఏఈతో ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఫిబ్రవరి 15న తలపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది.
మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ షెడ్యూల్ ఇదే..
* ఫిబ్రవరి 13న – పాకిస్తాన్ vs నేపాల్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 13న – భారత్ vs యుఎఇ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 14న – మలేషియా vs థాయిలాండ్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 14న – బంగ్లాదేశ్ vs శ్రీలంక (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 15న – యుఏఈ vs నేపాల్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 15న – భారత్ vs పాకిస్తాన్ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 16న – శ్రీలంక vs మలేషియా (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 16న – బంగ్లాదేశ్ vs థాయిలాండ్ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 17న – భారత్ vs నేపాల్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 17న – పాకిస్తాన్ vs యుఎఇ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 18న – బంగ్లాదేశ్ vs మలేషియా (ఉదయం 9:30 గంటలకు)
* ఫిబ్రవరి 18న – శ్రీలంక vs థాయిలాండ్ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 20న – సెమీ-ఫైనల్ 1 (A1 vs B2) (ఉదయం 9:30 గంటలకు)
* ఫిబ్రవరి 20న – సెమీ-ఫైనల్ 2 (B1 vs A2) (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 22న – ఫైనల్ (మధ్యాహ్నం 2 గంటలకు)
Also Read: WPL 2026: డబ్ల్యూపీఎల్‌లో స్మృతి మంధాన సేన దూకుడు.. ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్సీబీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
8th Pay Commission DA Hike 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త సంవత్సరం 2026 కానుకగా డియర్నెస్ అలవెన్స్ (DA) పెరగనుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులు, AICPI-IW గణాంకాలను బట్టి చూస్తే, ఈసారి డీఏ పెంపు ఎంత ఉండబోతోంది? దీనివల్ల జీతాలు ఏ మేరకు పెరుగుతాయి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ద్రవ్యోల్బణ ప్రభావం నుంచి ఉద్యోగులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం ఏడాదికి రెండుసార్లు (జనవరి, జూలై) కరువు భత్యాన్ని (DA) సవరిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగులు 58% డీఏ పొందుతున్నారు.
డీఏ పెంపు అంచనాలు (AICPI-IW డేటా ఆధారంగా)
కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నవంబర్ 2025 వరకు ఉన్న ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI-IW) గణాంకాల ప్రకారం..
నవంబర్ ఇండెక్స్: 148.2 పాయింట్లు.
పెరుగుదల: 59.93% డీఏకి సమానమైన పాయింట్లు నమోదయ్యాయి.
అంచనా: డిసెంబర్ గణాంకాలు కూడా కలిపితే, డీఏ 2% నుండి 3% వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం డీఏ 60% లేదా 61% కి చేరుకోవచ్చు.
ఎప్పుడు ప్రకటిస్తారు?
సాధారణంగా జనవరి నెలకు సంబంధించిన డీఏ పెంపును మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో (హోలీ పండుగ తర్వాత) కేంద్ర మంత్రివర్గం ఆమోదిస్తుంది. ప్రకటన ఎప్పుడు వచ్చినా, పెంపు మాత్రం జనవరి 1, 2026 నుండి వర్తిస్తుంది. కాబట్టి గడిచిన నెలల వ్యత్యాసాన్ని బకాయిల రూపంలో చెల్లిస్తారు.
8వ వేతన సంఘం ప్రభావం:
నిజానికి 7వ వేతన సంఘం కాలపరిమితి డిసెంబర్ 31, 2025తో ముగిసింది. 8వ వేతన సంఘం జనవరి 2026 నుండి అమల్లోకి రావాల్సి ఉన్నా, ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల, ప్రస్తుతం ఈ పెంపు 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారమే కొనసాగుతోంది.
జనవరి 30 లేదా 31న విడుదలయ్యే డిసెంబర్ నెల AICPI-IW డేటాతో డీఏ పెంపుపై పూర్తి స్పష్టత వస్తుంది. 3% పెంపు లభిస్తే ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుంది.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Medaram Jathara 2026: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర 28 నుంచి 1వ తేదీ వరకు జరగనుండగా ఈ జాతరకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే భక్తులు లక్షలాది సంఖ్య అమ్మవార్లను దర్శించుకునేందుకు తరలివస్తుండగా.. భక్త జనుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జారత ముందు నుంచే ప్రత్యేకంగా బస్సులు నడుపుతామని ప్రకటించింది. ఈనెల 25 నుంచి 1వ తేదీ వరకు పెద్ద ఎత్తున ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ తెలిపింది.
Also Read: Tomorrow Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. బ్యాంకులకు కూడా! ఎందుకో తెలుసా?
2024 జాతరలో ఆర్టీసీ 3,491 బస్సులు నడిపి 16.82 లక్షల మంది ప్రయాణికులను తరలించగా.. ఉచిత బస్సు పథకం అమలుతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఈ జాతరకు 20 లక్షల సంఖ్యలో ప్రయాణికులు వెళ్తారని ఆర్టీసీ అంచనా వేసింది. తదనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మేడారం జాతరలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తూనే.. ప్రత్యేక బస్సులు నడపనుంది. ఆర్టీసీ మేడారం జాతరకు మొత్తం 4,000 బస్సులను నడపనుంది. ఈ బస్సులు అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించనున్నాయి. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ సిటీ నుంచి మొత్తం 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లతో ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.
Also Read: Viral Pic: ఈ 'స్టార్ యువకులకు వధువు కావలెను'.. పెళ్లి కాని యువకుల బ్యానర్ ఫొటో వైరల్
మేడారం నుండి భక్తులను రవాణా చేయడానికి మేడారంలో 50 ఎకరాల భూమిలో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. భక్తులు తమ గమ్యస్థానాల ప్రకారం సులభంగా బస్సుల్లో ఎక్కేందుకు మొత్తం 9 కిలో మీటర్ల పొడవు కలిగిన 50 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్లలో ఒకేసారి సుమారు 20,000 మంది ప్రయాణికులను నిలుపుకునే ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ సంస్థ తెలిపింది. తాత్కాలిక బస్ స్టేషన్లో ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతం, సిబ్బంది విశ్రాంతి గదులు, నిర్వహణ కార్యకలాపాలు మొదలైన వాటి కోసం 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. మేడారం, కామారం ప్రాంతాలలో సుమారు వెయ్యి బస్సుల పార్కింగ్‌కు వీలుగా 25.76 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం పార్కింగ్ ప్రాంతం అభివృద్ధి చేశారు. బస్సుల చిన్నపాటి నిర్వహణ సమస్యలు, మార్గమధ్యలో బస్సులు నిలిచిపోతే అత్యవసర సేవల కోసం 11 గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, 2 క్రేన్లు, 1 ట్రాక్టర్‌ను ఏర్పాటు చేశారు.
Also Read: Kavitha: తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ ప్రశాంత్ కిశోర్.. కవిత పార్టీకి సేవలు
జోన్లవారీగా..
ప్రత్యేక బస్సులను నడిపే కేంద్రాల నుంచి మేడారం జాతర ప్రాంతం వరకు ఉన్న ప్రయాణ మార్గాలను 11 జోన్లుగా విభజించి 15 జీపులు, 8 మోటర్ సైకిల్లను ప్రత్యేకమైన పెట్రోలింగ్ వ్యవస్థను ఆఫీసర్ల పర్యవేక్షణలో బస్సులు మార్గమధ్యలో ఆగకుండా చర్యలు తీసుకున్నారు. మార్గమధ్యలో ఉన్న 7 ప్రైవేట్ పెట్రోల్ బంకుల వద్ద బస్సులకు డీజిల్ టాప్-అప్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. మేడారం తాత్కాలిక బస్ స్టేషన్లో, 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల వద్ద ట్రాఫిక్‌ను సమీపంగా పర్యవేక్షించేందుకు, మొత్తం 10,000 మంది వారం రోజులు పనిచేయనున్నారు.
హనుమకొండ నుంచి తాడ్వాయి వరకు మార్గంలో ఉన్న కల్వర్టులు, ట్యాంక్బండ్లు, గుండ్ల వాగు, జలగలాంచ వాగు వంటి కీలక ప్రాంతాల్లో బస్సులకు మార్గనిర్దేశం చేయడానికి గార్డులను ఏర్పాటు చేశారు. మేడారం తాత్కాలిక బస్ స్టేషన్లో ట్రాఫిక్ ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక కమెండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. తాత్కాలిక బస్ స్టేషన్లో 76 క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ తెలిపింది.
సౌకర్యాలు
తాత్కాలిక బస్ స్టేషన్లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు ఏర్పాటు. పూర్తిగా సన్నద్ధమైన అంబులెన్సులు, వైద్యులు, మందులతో కూడిన వైద్య శిబిరం కూడా ఏర్పాటుచేశారు. సిబ్బందికి స్టాఫ్ క్యాంటీన్ ఏర్పరిచి భోజన సదుపాయం కల్పించారు.
హనుమకొండ నుంచి మేడారం వరకు బస్సుల సజావుగా రాకపోకలు జరగడానికి ములుగు, వరంగల్ హనుమకొండ జిల్లాల పోలీసులు, జిల్లా పరిపాలనలతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. క్లర్కులు, డ్రైవర్లు, కండక్టర్లు, విధులు నిర్వర్తించేందుకు గుర్తించిన అన్ని సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రైవేటు వాహనాలలో ప్రయాణించడంతో దూరంగా పార్కింగ్ చేయడం, అసౌకర్యం కలుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rs 345 Crore Flyover Project Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు అదిరిపోయే శుభవార్త. జీహెచ్ఎంసీ పరిధిలో ట్రాఫిక్ సమస్యను తప్పించేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. దీంతో సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే వెహికిల్స్ సిగ్నల్ ఫ్రీగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టును 345 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ చేపట్టనుంది.
హై సిటీ-హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కింద 6 లేన్లతో ఫ్లై ఓవర్ పనులు త్వరలోనే షురూ కానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం టెండర్లు ఆహ్వానించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాటేదాన్ జంక్షన్ వద్ద మూడు లేన్లతో డౌన్‌ర్యాంప్ ఉంటుంది. టెండర్ ద్వారా ప్రాజెక్ట్ దక్కించుకునే ఏజెన్సీయే సర్వే, డిజైన్, డ్రాయింగ్స్, నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. కాంట్రాక్టు అగ్రిమెంట్ జరిగినప్పటి నుంచి రెండు సంవత్సరాల్లో పనులు పూర్తి కావాలి.
యుటిలిటీ షిఫ్టింగ్, ఫుట్‌పాత్‌లు, ల్యాండ్‌స్కేపింగ్, సైనేజీలు, లైటింగ్, పేవ్మెంట్ మార్కింగ్స్ తదితర పనులు కూడా చేయాలి. మెట్రోకు సమాంతరంగా.. ఎయిర్పోర్ట్ మెట్రోలైన్‌కు పక్క నుంచి ఈ ఫ్లై ఓవర్ రానుంది. ఫ్లై ఓవర్ కంటే మెట్రోమార్గం ఎక్కువ ఎత్తులో ఉంటుంది. దీంతోపాటు టీకేర్ కాలేజ్ జంక్షన్, గాయత్రినగర్ జంక్షన్, మంద మల్లమ్మ జంక్షన్ల మీదుగా ఆరు లేన్లతో మరో ఫ్లైఓవర్ పనులకు టెండర్ల గడువు ముగిసింది. టెండర్లు ఖరారు కావాల్సి ఉంది.
ఈ ఫ్లైఓవర్ పూర్తయితే.. విమానాశ్రయానికి వెళ్లేవారు మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్ జంక్షన్ల వంటివాటి వద్ద వాహనాలను ఆపకుండానే వెళ్లిపోవచ్చు. ఇరు వైపులా సాఫీగా ప్రయాణం సాగుతుంది. అంతేగాక, షాద్‌నగర్‌తో పాటు మహబూబ్‌నగర్, అత్తాపూర్, మెహదీపట్నం వెళ్లే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ 6 లేన్లతో ఫ్లై ఓవర్ పనులు పూర్తయితే వాహనదారులు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
Also Read: WPL 2026: డబ్ల్యూపీఎల్‌లో స్మృతి మంధాన సేన దూకుడు.. ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్సీబీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Kohli Rohit BCCI Contract Status: భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ (BCCI) షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ చేసిన తాజా సిఫార్సులు అమలైతే, వీరిద్దరి కాంట్రాక్ట్ హోదా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన వార్షిక రిటైనర్‌షిప్ కాంట్రాక్ట్ వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ల హోదాలను మార్చే దిశగా చర్చలు జరుగుతున్నాయి.
ఏ-ప్లస్ (A+) కేటగిరీ రద్దు?
ప్రస్తుతం బీసీసీఐలో నాలుగు అంచెల కాంట్రాక్ట్ వ్యవస్థ (A+, A, B, C) అమలులో ఉంది. అయితే, అత్యున్నతమైన ఏ-ప్లస్ (A+) కేటగిరీని పూర్తిగా తొలగించాలని సెలక్షన్ కమిటీ సూచించింది. అందుకు కారణం ఏంటంటే..సాధారణంగా మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) ఆడే కీలక ఆటగాళ్లకు ఈ గ్రేడ్ కేటాయిస్తారు.
కానీ, ఆ గ్రేడ్‌లో కొనసాగుతున్న రోహిత్, కోహ్లీల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వీరిద్దరూ ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిని నేరుగా 'బి' (B) కేటగిరీకి తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాంట్రాక్ట్ గ్రేడ్లు - వేతనాల వివరాలు:
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లకు ఏడాదికి లభించే వేతనాలు ఇలా ఉంటాయి.
| కేటగిరీ | వార్షిక వేతనం | ప్రస్తుతం ఉన్న ప్రముఖ ఆటగాళ్లు |
| A+ | ₹7 కోట్లు | రోహిత్, విరాట్, బుమ్రా, జడేజా |
| A | ₹5 కోట్లు | గిల్, రాహుల్, పాండ్యా, పంత్, సిరాజ్, షమీ |
| B | ₹3 కోట్లు | సూర్యకుమార్, జైస్వాల్, కుల్దీప్, అక్షర్, అయ్యర్ |
| C | ₹1 కోటి | రింకు, సంజు శాంసన్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ తదితరులు |
ముఖ్య మార్పులు, పదోన్నతులు..
శుభ్‌మన్ గిల్: టెస్టులు, వన్డేల్లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుండటంతో గిల్‌ను అగ్రశ్రేణికి (A) ప్రమోట్ చేసే అవకాశం ఉంది.
జస్ప్రీత్ బుమ్రా: మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉన్న బుమ్రా వంటి బౌలర్ల విషయంలో ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
జడేజా: టెస్ట్ క్రికెట్లో కొనసాగుతున్న జడేజా తన అగ్రశ్రేణి స్థానాన్ని నిలబెట్టుకుంటాడా లేదా అనేది చూడాలి.
ఎంపిక నిబంధన:
కేంద్ర కాంట్రాక్ట్ పొందాలంటే ఒక ఆటగాడు కనీసం 3 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20 మ్యాచ్‌లు ఆడి ఉండాలి. అలాంటి ఆటగాళ్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌కు అర్హత సాధిస్తారు.
ఈ సిఫార్సులపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఏ-ప్లస్ కేటగిరీ రద్దయితే, అది భారత క్రికెట్లో ఒక శకం ముగిసినట్లే అవుతుంది. దిగ్గజ ఆటగాళ్ల ఆదాయంపై కూడా ఇది గణనీయమైన ప్రభావం చూపుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Oneplus Turbo 6 Launch Date In India: వన్‌ప్లస్ మొబైల్స్‌కి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్స్‌తో కూడిన మొబైల్స్ ను విడుదల చేయడంలో ఈ బ్రాండ్ ముందుంటుంది. అంతేకాకుండా ప్రీమియం కెమెరా సెటప్‌తో పాటు అద్భుతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.. కాబట్టి చాలామంది ఎంతో ఇష్టంగా ఈ మొబైల్ తోని కొనుగోలు చేస్తారు. అయితే, వన్‌ప్లస్ వినియోగదారులకు కంపెనీ త్వరలోనే గుడ్ న్యూస్ తెలుపబోతోంది. తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.
ఈ కొత్త మొబైల్‌ను ఇప్పటికే చైనాలో ప్రారంభించింది. అయితే, అతి త్వరలోనే భారత మార్కెట్ లోకి కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ OnePlus Turbo 6 సిరీస్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చైనాలో ప్రకటించింది. అయితే, ఇందులో భాగంగా మొత్తం రెండు స్మార్ట్ ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ సిరీస్ OnePlus Turbo 6, Turbo 6V మోడల్స్‌లో అందుబాటులోకి రాబోతోంది.
ఈ OnePlus Turbo 6, Turbo 6V స్మార్ట్‌ఫోన్స్‌ను ప్రపంచ మార్కెట్లో OnePlus Nord 6, Nord CE 6 పేర్లతో విడుదల చేసే అవకాశాలున్నట్లు కొంతమంది టెక్ నిపుణులు చెబుతున్నారు. గతంలో వన్ ప్లస్ కంపెనీ దానికి సంబంధించిన టర్బో సిరీస్‌ను భారతదేశ మార్కెట్‌తో పాటు ప్రపంచ మార్కెట్లో రీ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్‌గా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రపంచ మార్కెట్ విడుదల తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం మాత్రం ఫిబ్రవరి మొదటి వారంలో లేదా జూలైలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట.. అయితే, ఈ మొబైల్‌ను కంపెనీ అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి తీసుకురాబోతోంది.
OnePlus Nord 6 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ Qualcomm Snapdragon 8s Gen 4 చిప్సెట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ముఖ్యంగా ఇది ప్రస్తుత Nord లైనప్‌లో అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ 16gb ర్యామ్‌తో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ Oneplus Turbo 6 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్టోరేజ్ వివరాల్లోకి వెళితే..బేస్ వేరియంట్ మొబైల్‌ని కూడా 512 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీంతోపాటు ఇది Android 16 ఆపరేటింగ్ సిస్టంతో విడుదల కాబోతోంది. అలాగే 6.78-అంగుళాల ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లేను కలిగి ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ స్క్రీన్ 1272x2772 పిక్సెల్‌లు, 60Hz నుండి 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది.
ఈ మొబైల్ వెనుక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వెనక భాగంలో 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా లభిస్తుంది. దీంతోపాటు ఫ్రంట్ భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎంతో శక్తివంతమైన 9,000mAh బ్యాటరీతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ యోచిస్తుంది. ఇవే కాకుండా ఇందులో 80W SuperVOOC ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mana Shankara Vara Prasad Home Tour: మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా అందించిన 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న అంశాల్లో 'శంకర వరప్రసాద్ మామగారి ఇల్లు' ఒకటి. సినిమాలోని మెజారిటీ భాగం ఈ ఇంట్లోనే సాగడంతో, ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సినిమాలో సన్నివేశాలు సగానికి పైగా ఆ ఇల్లు చుట్టూనే ఉంటాయి.
సాధారణంగా సినిమాల్లో సెట్స్ అంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లేదా ఫైబర్‌తో నిర్మిస్తారు. కానీ 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ కోసం నిర్మించిన ఈ ఇంటి ప్రత్యేకత వేరు. ఈ ఒక్క ఇంటి సెట్ కోసమే నిర్మాతలు దాదాపు రూ.5 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇంటిని సహజంగా చూపించేందుకు అందులో ఉపయోగించిన ఫర్నిచర్, డెకరేటివ్ వస్తువులన్నీ ఒరిజినల్ ప్రాపర్టీస్‌నే వాడారట. అందుకే వెండితెరపై ఈ ఇల్లు ఒక ఇంద్ర భవనంలా కనిపిస్తోంది.
ముఖ్య సన్నివేశాల వేదిక
ఈ ఇంట్లోనే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ మధ్య వచ్చే హై-వోల్టేజ్ సీన్స్‌తో పాటు, సూపర్ హిట్ సాంగ్ 'మీసాల పిల్ల'ను కూడా ఇక్కడే చిత్రీకరించారు. సినిమా చూస్తున్నంత సేపు ఇది ఒక సెట్ అనే భావన కలగకుండా ప్రొడక్షన్ డిజైన్ టీం అత్యంత జాగ్రత్తలు తీసుకుంది.
సినిమా విశేషాలు..
మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార నటించగా, వెంకటేష్ కీలక పాత్రలో మెరిశారు. క్యాథరీన్ థ్రెసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమటం ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు.
భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మెగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
వైరల్ హోమ్ టూర్
ప్రస్తుతం చిత్ర బృందం విడుదల చేసిన ఈ 'హౌస్ సెట్' మేకింగ్ వీడియోలో.. ఇంటి లోపలి డిజైన్, లైటింగ్, ఆర్కిటెక్చర్ చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఒక ఇల్లు కథలో పాత్రలా ఎలా మారిందో ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.
Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు శుభవార్త..వచ్చే 1వ తేదీ నుంచి జీతం ఎంత పెరుగుతుందంటే?
Also Read: 1 KG Fat Burn Calories: కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది? జిమ్ కోచ్ ఏం చెప్తున్నారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Fat Loss Diet And Exercise: బరువు తగ్గాలనుకునే వారు నిరంతరం వినే పదం 'క్యాలరీ డెఫిసిట్' (Calorie Deficit). అసలు దీని అర్థం ఏమిటి? ఆకలితో మాడాలా? లేక తక్కువ తినాలా? ఒక కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఈ అంశాలపై కొందరు ఫిట్నెస్ నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడం అనేది ఒక మ్యాజిక్ కాదు. మన శరీరం రోజూ శ్వాస తీసుకోవడం, నడవడం, జీర్ణక్రియ వంటి పనుల కోసం కొంత శక్తిని (క్యాలరీలను) ఖర్చు చేస్తుంది. ఈ క్యాలరీల కంటే తక్కువగా ఆహారం తీసుకోవడాన్నే 'క్యాలరీ డెఫిసిట్' అంటారు.
ఒక కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది?
సాధారణంగా ఒక కిలో కొవ్వు కరగాలంటే శరీరంలో సుమారు 7,700 క్యాలరీల లోటు (Deficit) ఏర్పడాలి. మీరు రోజుకు 500 క్యాలరీలు తక్కువగా తీసుకుంటే, దాదాపు 15 నుండి 16 రోజుల్లో ఒక కిలో కొవ్వు తగ్గుతారు.
వ్యాయామం + డైట్: కేవలం ఆహారం తగ్గించడమే కాకుండా, వ్యాయామం కూడా తోడైతే ఫలితం ఇంకా వేగంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఉదాహరణకు, 300 క్యాలరీలు తక్కువగా తిని, మరో 200 క్యాలరీలు నడక ద్వారా ఖర్చు చేస్తే శరీరం మరింత ధృడంగా మారుతుంది.
ఆకలితో ఉండటం క్యాలరీ డెఫిసిట్ కాదు!
ఫిట్నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, చాలామంది చేసే తప్పు ఏంటంటే అస్సలు తినకుండా ఉండటం. మీ శరీరం రోజుకు 2000 క్యాలరీలు ఖర్చు చేస్తుంటే, మీరు 1500 నుండి 1700 క్యాలరీలు తీసుకోవాలి. రోజుకు 300 నుండి 500 క్యాలరీల లోటు ఉంచడం అత్యంత సురక్షితమైన మార్గం. దీనివల్ల కండరాలు బలహీనపడకుండా కేవలం కొవ్వు మాత్రమే కరుగుతుంది.
అతిగా తగ్గించడం వల్ల వచ్చే ముప్పు..
బరువు త్వరగా తగ్గాలనే ఆశతో రోజుకు 1000 క్యాలరీల కంటే తక్కువ తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయట. మహిళల్లో నెలసరి సమస్యలు, పురుషుల్లో హార్మోన్ల లోపం ఏర్పడవచ్చని అంటున్నారు. అలాగే ఎముకలు బలహీనపడటం, గుండెపై ఒత్తిడి పడటం, నిరంతరం అలసటగా అనిపించడం వంటివి జరుగుతాయి. అదే విధంగా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల తక్కువ ఆహారం వల్ల నిద్రలేమి, చిరాకు (Mood swings) పెరుగుతాయి.
సహజంగా బరువు తగ్గడానికి 5 సూత్రాలు..
తీపికి దూరం: కూల్ డ్రింక్స్, సోడాల బదులు నీళ్లు ఎక్కువగా తాగాలి.
ప్రోటీన్: ఆహారంలో ప్రోటీన్ పెంచితే కండరాలు దృఢంగా ఉంటాయి.
రిఫైన్డ్ ఫుడ్ వద్దు: మైదా, తెల్ల బియ్యం తగ్గించి ముడి ధాన్యాలు (Whole Grains) తీసుకోవాలి.
శారీరక శ్రమ: జిమ్‌కు వెళ్లకపోయినా రోజుకు కనీసం 30-40 నిమిషాలు నడవాలి.
ఓపిక: బరువు తగ్గడం అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. తక్షణ ఫలితాల కోసం ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొందరు నిపుణుల సలహలు, సూచనల మేరకు మాత్రమే పేర్కొన్నది. మీరు అనారోగ్య సమస్యలతో బాధపడే వారైతే సంబంధిత వైద్యుడిని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు శుభవార్త..వచ్చే 1వ తేదీ నుంచి జీతం ఎంత పెరుగుతుందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook