ఖమ్మంలో ఫ్రూట్ మార్కెట్ ను ఏర్పాటు చేయాలి
Khammam, Telangana:పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలని పండ్ల వ్యాపారుల సంఘం ప్రతినిధులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. ఖమ్మంలో బొప్పాయి, జామ, దానిమ్మ తదితర పంటలు మార్కెట్ అవుతున్నాయని మంత్రికి తెలిపారు. రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని, మార్కెట్ ఏర్పాటుతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో మంత్రి మాట్లాడారు. మార్కెట్ వ్యవస్థ సమస్యను పరిశీలించాలని కలెక్టర్‌కు సూచించారు. అనంతరం తమ్ముడి కుమారుడు యుగేంద్రను కలిసి సమస్యను వివరించాడు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Bank Employees: బ్యాంకులకు ఐదు రోజుల పని విధానం.. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల ఆందోళన
Hyderabad, Telangana:Bank Employees Strike: తీవ్ర పని ఒత్తిడి.. అధిక పని గంటలతో తీవ్రంగా సతమతమవుతున్న బ్యాంకు ఉద్యోగులు భారీ ఉద్యమం చేపట్టారు. తమ నిరసనల్లో భాగంగా శుక్రవారం దేశవ్యాప్త సమ్మె చేపట్టారు. అన్నీ జాతీయ బ్యాంకులు ఒక రోజు బంద్ చేపట్టాయి. తమ సమస్యల పరిష్కారం.. తమ డిమాండ్ల సాధనలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళనకు దిగారు.
ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలులో జాప్యాన్ని నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. హైదరాబాద్ కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో పెద్ద ఎత్తున బ్యాంకు ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. వారంలో రెండు రోజుల సెలవు.. ఖాళీల భర్తీ చేపట్టి తమపై పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
సమ్మె సందర్భంగా యుఎఫ్‌బీయూ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కె. ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ.. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు, బ్యాంకింగ్ రంగంలో ఖాళీ పోస్టుల భర్తీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం తదితర డిమాండ్లను ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు పరిష్కరించాలని కోరారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని, సిబ్బంది కొరతతో ఖాతాదారులకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని, ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిలిపివేయాలని యుఎఫ్‌బీయూ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కె. ఆంజనేయ ప్రసాద్ డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ రంగంలో ప్రతిపాదిత పనితీరు ఆధారిత ప్రోత్సాహక విధానం (పీఎల్ఐ)పై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఉద్యోగుల మధ్య విభజనకు దారితీసే విధానాలను అమలు చేయవద్దని కోరారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగులు, అధికారుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బ్యాంకు ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.
బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించేందుకు సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమావేశాలు నిర్వహించనున్నట్లు యూఎఫ్‌బీయూ ప్రకటించింది. సమస్యలు పరిష్కారం కాకపోతే తదుపరి ఆందోళన కార్యక్రమాలను చేపడతామని తెలిపింది. ఈ కార్యక్రమంలో ఏఐబీఈఏ రాంబాబు, ఎన్సీబీఈ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, శాండిల్య, వెంకటరామయ్య తదితరులు పాల్గొని సంఘీభవాన్ని తెలిపారు.
Tirumala: తిరుమల ఆలయంలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
Dharmavaram, Andhra Pradesh:Devotees Heavy Rush To Tirumala Temple A Head Continuous Holidays Watch VideoTirumala Temple: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి
Dharmavaram, Andhra Pradesh:Cine Heroine Kriti Shetty Visits Tirumala Temple Watch VideoTelangana Rain Alert: తెలంగాణలో రెడ్ అలెర్ట్..ఈ 6 జిల్లాల్లో భారీ వర్ష సూచన!
Hyderabad, Telangana:Telangana Rain Forecast: బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతున్న సుస్పష్టమైన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణలోని 6 జిల్లాల్లో భారీ వర్షసూచన ఉండబోతుందని రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో అధికారులతో పాటు ప్రజలకు తగు సూచనలు చేశారు.Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్సార్సీపీ ఎంపీ
Dharmavaram, Andhra Pradesh:YSRCP MP Mithun Reddy Visits To Tirumala Temple Watch VideoMahesh Babu SIR Notice: డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు, ఉపాసనకు ఈసీఐ నోటీసులు..వెంటనే స్పందించాలని సూచన!
Hyderabad, Telangana:Mahesh Babu Rajamouli SIR Notice: దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ తెలంగాణలో కూడా సమయం పొడిగించి సమర్థవంతంగా కొనసాగిస్తోంది. ఈ విధానంలో భాగంగా హైదరాబాద్ నగరంలో ప్రచురించిన ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్ వంటి ప్రముఖ నియోజకవర్గాల పరిధిలో ఓటర్లుగా నమోదైన పలువురు దిగ్గజాల సమాచారంలో వ్యత్యాసాలు, సాంకేతిక లోపాలు ఉన్నట్లు తేలింది. అధికారుల రికార్డులతో వీరి వివరాలు సరిపోలకపోవడంతో చట్టబద్ధంగా వివరణ కోరుతూ ఈసీఐ నోటీసులు జారీ చేసింది.
సినీ రంగానికి చెందిన ప్రముఖులు..
ఎన్నికల సంఘం నోటీసులు పంపిన వారిలో టాలీవుడ్ అగ్రశ్రేణి నటులు, దిగ్గజ దర్శకులు ఉన్నారు. దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్, సీనియర్ కథానాయకుడు దగ్గుబాటి వెంకటేష్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు ప్రముఖ కథానాయిక సమంత రూత్ ప్రభు, యువ హీరో విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండలకు కూడా ఈసీ నోటీసులు పంపారు.
క్రీడా, వ్యాపార రంగాలు..
సినీ ప్రముఖులతో పాటు క్రీడా రంగానికి చెందిన దిగ్గజాలు కూడా ఈసీఐ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓటరు రికార్డుల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కార్పొరేట్ రంగం నుంచి ఫార్మా దిగ్గజం దివీస్ ల్యాబ్స్ అధినేత మురళీకృష్ణ ప్రసాద్ దివి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కొణిదెల వంటి వ్యాపారవేత్తలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అందుతోంది.
ఓటరు గుర్తింపు కార్డుల్లో మ్యాచ్ కాని వివరాలకు సంబంధించి ప్రముఖులు తమ ఆధారాలను మళ్లీ సమర్పించి సవరణలు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. ఒకవేళ వీరు ప్రత్యక్షంగా లేదా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేని పక్షంలో, తమ తరపున ఒక ప్రతినిధిని పంపే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది.
Also Read: Chalo Hyderabad: ప్రభుత్వ ఉద్యోగుల్లో గందరగోళం..రేపు చలో హైదరాబాద్ ఉందా? లేదా?!
Also Read: మాధురి రాథోడ్ 'నిమ్మతోట వనములో' పాట సంపాద ఎంత? రూ.10 లక్షలు పెడితే,16.2 కోట్లతో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Srikakulam Crime News: 7 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల ముసలోడు లైంగిక దాడి..శ్రీకాకుళంలో దారుణం, కామాంధుడి అరెస్ట్!
Srikakulam, Andhra Pradesh:Srikakulam Minor Rape Case: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలానికి చెందిన గుంజిలోవ గ్రామంలో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడు కవిటి రామారావు, బుధవారం మధ్యాహ్నం ఏడేళ్ల అమాయక బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు వెంటనే స్పందించి, కోటబొమ్మాళి పోలీసులను ఆశ్రయించి ఘటనపై అధికారికంగా ఫిర్యాదు చేశారు.
బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోటబొమ్మాళి పోలీసులు తక్షణమే విచారణ చేపట్టారు. భారతీయ నష్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్లతో పాటు, పోక్సో (POCSO) చట్టంలోని సెక్షన్ 5(m) రెడ్ విత్ 6 కింద నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం పోలీసులు బాధిత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.
టెక్కలి డీఎస్పీ దాసరి లక్ష్మణరావు స్వయంగా బాలిక నివాసానికి వెళ్ళి పరిస్థితిని పరిశీలించి విచారణ నిర్వహించారు. అంతేకాకుండా, క్లూస్ టీమ్ (Clues Team) కూడా ఘటనాస్థలానికి చేరుకుని కీలక ఆధారాలను సేకరించింది.
నిందితుడి అరెస్ట్, కోర్టులో హాజరు..
కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, గురువారం సాయంత్రం కోటబొమ్మాళి మార్కెట్ యార్డు సమీపంలో టెక్కలి డీఎస్పీ దాసరి లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిందితుడు కవిటి రామారావును అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ నుంచి నడిపిస్తూ ప్రత్యేక జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
ఈ కేసును విచారించిన న్యాయస్థానం, నిందితుడు కవిటి రామారావుకు 7 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిని ప్రత్యేక వాహనంలో శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు ప్రాంతంలో ఉన్న జిల్లా జైలుకు తరలించారు. చిన్నారులపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని, అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Also Read: తిరుమల వెళ్లే భక్తులకు ఊహించని షాక్..సెప్టెంబరు 12, సెప్టెంబరు 13న దర్శనాలు రద్దు!
Also Read: "జగన్‌కి డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలుసా?" వైఎస్ జగన్‌కు మంత్రి లోకేష్ కౌంటర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Seed Ganesha: విత్తన గణపతి నాటాలని హీరో విజయ్ దేవరకొండ పిలుపు
Hyderabad, Telangana:Actor Vijay Deverakonda Called To Use Seed Ganesha For Ganesh Chaturthi 2026 Watch VideoRajaka Community: అసెంబ్లీని ముట్టడించిన రజకులు.. కేసీఆర్ ఇచ్చింది మాకు ఇవ్వడం లేదు
Hyderabad, Telangana:Rajaka Community Protest At Telangana Assembly About Free Electricity Watch VideoTirumala: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సేవలో నటి కృతి శెట్టి
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Heavy Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో భక్తుల సందడి కనిపిస్తోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు టీటీడీ అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, పాలు, అల్పాహారం అందిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తిరుమలలోని ప్రధాన ప్రాంతాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది.
తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సినీ నటి కృతి శెట్టి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో వారు దర్శించుకోగా.. వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకున్న ప్రముఖులకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.
తిరుమల ఆలయంలో స్వామిని 11వ తేదీన భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. శ్రీవారిని 69,771 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 25,888 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఒక్కరోజే తిరుమల ఆలయానికి భారీగా హుండీ ఆదాయం లభించింది. రూ.6.94 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది. 4.42 లక్షల లడ్డూ ప్రసాదం విక్రయాలు జరగ్గా.. 2.65 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి 15 నుంచి 20 గంటలు సమయం పడుతోంది.
అవి రద్దు
రెండో శనివారం, ఆదివారంతోపాటు సోమవారం వినాయక చవితి రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, స్కూళ్లతోపాటు బ్యాంకులకు కూడా సెలవు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో టీటీడీ దర్శనాలు త్వరగా అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. శ్రీవారిని త్వరితంగా దర్శనం చేసుకునేలా టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనం, సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసింది.
Gynecological Cancer Symptoms: మహిళల్లో పెరుగుతున్న గైనకాలాజికల్ క్యాన్సర్లు..ఈ లక్షణాలుంటే వెంటనే జాగ్రత్త పడండి!
Hyderabad, Telangana:Gynecological Cancer Symptoms Signs: మహిళల పునరుత్పత్తి వ్యవస్థలోని అండాశయాలు, గర్భాశయం, యోని, గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్), బాహ్య జననేంద్రియ ప్రాంతం (వల్వా) వంటి అవయవాలకు వచ్చే క్యాన్సర్లను స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లు అంటారు. వీటిలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) అత్యంత సాధారణమైనది. అంటే ఎక్కువ శాతం మంది మహిళల్లో ఇది కనిపిస్తుంటుంది. కొన్ని రకాల క్యాన్సర్లలో ప్రారంభ దశలో ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే స్త్రీల జననేంద్రియాల క్యాన్సర్లపై ఫెర్నాండెజ్ హాస్పిటల్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వాతి దోనూరి అందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందస్తు గుర్తింపు, స్క్రీనింగ్..
లక్షణాలు లేని వారికి కూడా సాధారణ స్క్రీనింగ్ పరీక్షలు సిఫార్సు చేయబడిన ఏకైక స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ మాత్రమే. దీనికోసం పాప్ పరీక్ష (Pap test), హెచ్పివి (HPV) పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. హెచ్పివి టీకా వేయించుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార, యోని, వల్వార్ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అండాశయ, గర్భాశయ క్యాన్సర్లకు సాధారణ స్క్రీనింగ్ పరీక్షలు లేకపోవడంతో, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర లేదా BRCA1, BRCA2 జన్యుపరమైన మార్పులు ఉన్నవారు నిపుణులను సంప్రదించడం అవసరం.
ముఖ్యమైన హెచ్చరిక లక్షణాలు: ఈ క్యాన్సర్లను గుర్తించడానికి క్రింది లక్షణాలను ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్
అసాధారణ యోని రక్తస్రావం (ఋతుచక్రాల మధ్యలో, దీర్ఘకాలిక ఋతుస్రావం లేదా మెనోపాజ్ తర్వాత) లైంగిక సంపర్కం సమయంలో లేదా తర్వాత నొప్పి/రక్తస్రావం, దుర్వాసనతో కూడిన యోని స్రావాలు కనిపించవచ్చు.
అండాశయ క్యాన్సర్..
నిరంతర కడుపు ఉబ్బరం లేదా వాపు, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, గ్యాస్, పొత్తికడుపు లేదా కటి ప్రాంతంలో నొప్పి, తరచుగా లేదా అత్యవసరంగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి.
గర్భాశయ / ఎండోమెట్రియల్ క్యాన్సర్..
మెనోపాజ్ తర్వాత అకస్మాత్తుగా రక్తస్రావం కావడం (90% కంటే ఎక్కువ మంది రోగులలో కనిపించే లక్షణం ఇది) లేదా అసాధారణ మచ్చలు కనిపించడం జరుగుతుంది.
యోని క్యాన్సర్..
అసాధారణ యోని రక్తస్రావం లేదా స్రావం, సంభోగం సమయంలో నొప్పి లేదా నిరంతర కటి నొప్పి, యోని లోపల స్పర్శకు తగిలే గడ్డ లేదా ముద్దగా సంభవించవచ్చు.
వల్వార్ క్యాన్సర్..
యోని ముఖద్వారం వద్ద నిరంతర తీవ్రమైన దురద, మంట, సున్నితత్వం, చర్మం రంగు లేదా ఆకృతి మారడం, దద్దుర్లు, మానని పుండ్లు లేదా వ్రణాలు ఏర్పడతాయి.
నివారణ, సూచనలు..
క్రమం తప్పకుండా గైనకాలజికల్ చెకప్‌లు చేయించుకోవడం, శరీరంలో వచ్చే మార్పులను గమనించడం చాలా అవసరం. క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు విస్తృతంగా వ్యాపించక ముందే గుర్తించినప్పుడు చికిత్స మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం వైద్యుల సలహాలు సూచనల ప్రకారం పొందుపరిచినది. దీన్ని అనుసరించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Onion Juice: ఉల్లిపాయ రసం ఎప్పుడైనా తాగారా? ఎన్ని లాభాలో తెలుసా?
Also REad: Money Plant Vastu: ఇంట్లో మనీప్లాంట్ ఉంటే డబ్బు సమస్య తీరుతుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ganesh Chaturthi 2026: వినాయక చవితికి ఇంట్లో ప్రతిమకు ప్రాణప్రతిష్ట ఎలా చేయాలి? పూజ నుంచి నిమజ్జనం వరకు ఇవి ఖచ్చితంగా చేయాలి!
Hyderabad, Telangana:Ganesh Chaturthi 2026 Puja Rituals: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగను భక్తులు ఘనంగా నిర్వహిస్తారు. ప్రజలంతా ఊరూ, వాడ వినాయకుని ప్రతిమను ప్రతిష్టించి.. భక్తి శ్రద్ధలతో 9 లేదా 11 రోజుల పాటు విశేషమైన పూజలందిస్తారు. అయితే ఈ పండుగ నాడు వినాయకుని ప్రాణ ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి పూజా నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వినాయకుని జననానికి ప్రతీక అయిన గణేశ చతుర్థి పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. పూజకు సంబంధించిన పవిత్రమైన ఆచారాలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవడంతో ప్రారంభమవుతాయి. పూజ జరిగే రోజున ఉదయాన్నే కుటుంబ సభ్యులందరూ స్నానం చేసి సిద్ధం కావాలి.
విగ్రహాన్ని తెచ్చేందుకు వెళ్లేటప్పుడు అగరబత్తీలు, ధూపం, హారతి పళ్ళెం, వక్క, తమలపాకు, విగ్రహాన్ని కప్పే వస్త్రం, చందనపు చెక్క పీట కోసం ప్రత్యేక వస్త్రాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. చతుర్థి కంటే ముందే విగ్రహాన్ని తెస్తే, స్వామివారి ముఖాన్ని వస్త్రంతో కప్పి ఉంచి పూజ రోజున మాత్రమే తొలగించాలి.
ప్రతిష్ఠాపన, ప్రాణ ప్రతిష్ఠ..
విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకువచ్చేటప్పుడు, నిర్ణీత పీఠంపై ఉంచే ముందు దానిపై పచ్చి బియ్యం చల్లాలి. పీఠంపై బియ్యంతో పాటు వక్క, పసుపు, కుంకుమ, దక్షిణ ఉంచాలి. విగ్రహ ప్రతిష్ఠాపనకు పూజారిని ఆహ్వానించి, ఋగ్వేదంలోని గణేశ సూక్తంలో ఉన్న ప్రాణ-ప్రతిష్ఠ మంత్రాల ద్వారా పవిత్రమైన ప్రాణ ప్రతిష్ఠ ఘట్టాన్ని నిర్వహించాలి. ఈ సమయంలో 'ఓం గం గణపతయే నమః' మంత్రాన్ని జపించాలి. కోరుకుంటే పండితుడి ద్వారా 16 రకాల ఆచారాలతో కూడిన షోడశోపచార పూజ జరిపించుకోవచ్చు.
నైవేద్యం, పూజా ఘట్టాలు..
పూజలో భాగంగా లంబోదరునికి ఎంతో ప్రియమైన 21 గరిక పోచలు (దూర్వా గడ్డి), 21 మోదకాలు, ఎర్రని పూలు సమర్పించి, నుదుటిపై ఎర్ర చందనంతో తిలకం దిద్దాలి. ఆ తర్వాత దేవునికి నైవేద్యంగా కొబ్బరికాయ ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అలాగే స్వామివారి వాహనమైన మూషికం కోసం వేయించిన ధాన్యపు గింజలను ఉంచాలి. శ్రేయస్సు కోసం భక్తులు 108 నామాలు లేదా గణేశ ఉపనిషత్తు పఠించడం ఎంతో మంచిది.
నిమజ్జనం..
పవిత్రమైన ఆలోచనలతో, విశాల హృదయంతో పూజిస్తే వినాయకుడు భక్తులకు జ్ఞానం, ఆరోగ్యం, శ్రేయస్సును అనుగ్రహిస్తారు. చివరిగా పూజలన్నీ పూర్తయ్యాక నిమజ్జనం సమయంలో "గణపతి బాప్పా మోరియా లేదా జై బోలో గణేష్ మహారాజ్‌కి.. జై" అని నినదిస్తూ మళ్లీ త్వరగా రావాలని కోరుకుంటూ స్వామివారికి వీడ్కోలు పలుకుతారు.
Also Read: ఆంధ్ర, తెలంగాణలో వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి? 14 లేదా 15? పండగ సెలవు ఎప్పుడంటే?
Also Read: మీ వీధిలో వినాయక మండపం పెడుతున్నారా? ఒకే క్లిక్‌తో పోలీస్ పర్మిషన్..రూ.1 ఖర్చు లేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala Darshan Cancelled: తిరుమల వెళ్లే భక్తులకు ఊహించని షాక్..సెప్టెంబరు 12, సెప్టెంబరు 13న దర్శనాలు రద్దు!
Tirupati Urban, Andhra Pradesh:Tirumala VIP Break Darshan Cancelled: కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. దీంతో తిరుమల కొండపై క్యూలైన్లు భక్తులతో పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం క్యూలైన్లలో వేచి ఉన్న సామాన్య భక్తులకు స్వామివారి దివ్య దర్శనం కలగడానికి దాదాపు 24 గంటల సుదీర్ఘ నిరీక్షణ సమయం పడుతోంది. కొండపై భక్తుల రద్దీని టీటీడీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
వరుస సెలవుల ప్రభావం..
రాబోయే సెప్టెంబర్ 12వ తేదీ నుండి సెప్టెంబర్ 14వ తేదీ వరకు వరుసగా సెలవులు ఉండటంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మరిన్నింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు ముందస్తుగా అంచనా వేశారు. వేలాదిగా తరలివచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ, వారికి వీలైనంత త్వరగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది.
2 రోజుల పాటు వీఐపీ దర్శనాలపై కోత..
సాధారణ భక్తులకు దర్శన సమయాన్ని గరిష్టంగా అందుబాటులో ఉంచేందుకు టీటీడీ క్రింది నిర్ణయాలు ప్రకటించింది. సెప్టెంబర్ 12 శనివారం నాడు ఎలాంటి వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. అలాగే ఆదివారం అనగా సెప్టెంబరు 13న వీఐపీ బ్రేక దర్శనాలను రద్దు చేసినట్లు ప్రకటించింది.
సాధారణంగా ప్రతిరోజూ వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం కేటాయించే ప్రత్యేక సమయాన్ని ఆదివారం నాడు పూర్తిగా సామాన్య భక్తుల దర్శనానికే వినియోగించనున్నారు. దీనివల్ల క్యూలైన్లలో వేచి ఉండే సాధారణ భక్తులను మరింత వేగంగా దర్శనానికి పంపే వీలు కలుగుతుంది.
భక్తులకు టీటీడీ ముఖ్య విజ్ఞప్తి..
తిరుమల యాత్రకు రాబోయే భక్తులు ప్రస్తుత రద్దీ పరిస్థితులను గమనించి, తమ తిరుమల ప్రయాణాన్ని అనుగుణంగా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. స్వామివారి దర్శనం, వసతి గదుల లభ్యత, ఇతర సేవల వివరాలను ముందుగానే తెలుసుకుని యాత్రను ప్లాన్ చేసుకోవాలని తెలిపారు.
క్యూలైన్లలో ఉన్న భక్తులు ఓపికతో వ్యవహరిస్తూ, టీటీడీ అధికారులు, సిబ్బంది ఇచ్చే సూచనలను పాటించి సహకరించాలని కోరారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ అందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వెల్లడించింది.
Also Read: "జగన్‌కి డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలుసా?" వైఎస్ జగన్‌కు మంత్రి లోకేష్ కౌంటర్!
Also Read: అన్నీ స్కూళ్లు, కాలేజీలకు సెలవు..ఎట్టకేలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nara Lokesh On Jagan: "జగన్‌కి డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలుసా?" వైఎస్ జగన్‌కు మంత్రి నారా లోకేష్ కౌంటర్!
Vijayawada, Andhra Pradesh:Nara Lokesh On YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నిర్వహణపై మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఓ వీడియో విడుదల చేశారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి వ్యత్యాసం జగన్‌కు తెలుసా ఘాటుగా ప్రశ్నించారు. వైకాపా ఐదేళ్ల పాలనలో భర్తీ చేసిన టీచర్ పోస్టుల సంఖ్య సున్నా అని ఎద్దేవా చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తొలి సంతకంతో 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని మంత్రి నారా లోకేష్ గుర్తుచేశారు. డీఎస్సీని అడ్డుకోవడానికి వైకాపా నాయకులు సుమారు 300 కేసులు వేసినా కోర్టులు ప్రభుత్వాన్ని తప్పుపట్టలేదని తెలిపారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన ఆయన, త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.
ఉపాధ్యాయ నియామకాలపై నిలదీత..
మాజీ సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నిస్తూ, డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య ఉన్న తేడా తెలుసా అని లోకేశ్ నిలదీశారు. వైకాపా ఐదేళ్ల పాలనలో భర్తీ చేసిన టీచర్ పోస్టుల సంఖ్య సున్నా అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం డీఎస్సీ ఫైల్‌పైనే చేశారని, తద్వారా ప్రజా ప్రభుత్వం 16 వేల పోస్టులను భర్తీ చేసిందని వివరించారు.
న్యాయస్థానాల తీర్పులు - వైకాపా కేసులు..
డీఎస్సీ ప్రక్రియను నిలిపివేయడానికి వైకాపా నేతలు సుమారు 300 కేసులు వేసినా కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి తీర్పులు రాలేదని చెప్పారు. వైకాపా ఎమ్మెల్సీ సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించిందని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించి, జగన్ చేసిన ప్రతీ ఆరోపణకూ ఆధారాలతో సహా జవాబు ఇచ్చారని వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారని, దాడులకు పాల్పడుతున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఉపాధ్యాయుల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని, వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. భవిష్యత్ నోటిఫికేషన్..
మూడేళ్ల క్రితం స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరుతో చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేసి 53 రోజులు జైల్లో బంధించారని, మూడేళ్ల లీగల్ ప్రాసెస్ ముగిశాక ఆయనకు క్లీన్ చిట్ వచ్చిందని గుర్తుచేశారు. ఎలాంటి అవినీతి జరగలేదని రెగ్యులేటరీ ఏజెన్సీలు తేల్చేశాయని చెప్పారు. యువగళం పాదయాత్రలో నిరుద్యోగుల కష్టాలను చూశానని, అందుకే ప్రతి ఏటా 3 వేల పోస్టులతో ఐదేళ్లలో 30 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. అదేవిధంగా త్వరలోనే తదుపరి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.
Also Read: మహిళలకు బిగ్ గుడ్‌న్యూస్.. ఇకపై ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం! సీఎం కీలక ప్రకటన!
Also Read: రేపు స్కూళ్లకు సెలవు ఉందా లేదా? సెప్టెంబరు 11న ఆంధ్ర, తెలంగాణల్లో పరిస్థితి ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bigg Boss Charan Elimination: బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్..ఆర్జే చరణ్ మిడ్ వీక్ ఎలిమినేషన్..ట్విస్ట్ వెనుక కారణం ఏంటి?
Hyderabad, Telangana:Bigg Boss 10 Charan Elimination: బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొత్తం 16 మంది కంటెస్టెంట్లతో అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. వీరిలో 10 మంది సెలబ్రిటీలు (దేబ్జానీ మోదక్, త్రిగుణ్, సింగర్ ఝాన్సీ, యాంకర్ సుధీర్ రెడ్డి, అమన్ మసూద్, చైత్రా రాయ్, రాం ప్రసాద్, షాలిని, టెంపర్ వంశీ, సృష్టి వ్యాకరణం, జబర్దస్త్ నరేష్, నటుడు కృష్ణుడు, యాంకర్ వర్షిణి, రోహిత్ నాయుడు, ముఖేష్ గౌడ) కాగా, ఆరుగురు సాధారణ ప్రజల (కామనర్స్) కేటగిరీ నుంచి ఎంపికయ్యారు. తొలి రోజు నుంచే హౌస్మేట్స్ మధ్య నామినేషన్ల వేడి, తీవ్ర వివాదాలు మొదలయ్యాయి. అయితే ఊహించని రీతిలో బిగ్ బాస్ వీకెండ్ దాకా ఆగకుండా మిడ్ వీక్‌లోనే ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి బిగ్ షాక్ ఇచ్చారు.
హౌస్‌లో నిర్వహించిన ప్రత్యేక టాస్క్, హౌస్మేట్స్ మెజారిటీ ఓటింగ్ ఆధారంగా కామనర్ కంటెస్టెంట్ చరణ్ మహాదేవ్ హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అగ్నిపరీక్షను అధిగమించి హౌస్‌లోకి ప్రవేశించిన చరణ్ ప్రయాణం కేవలం నాలుగు రోజుల్లోనే అర్ధాంతరంగా ముగిసిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
టాస్క్‌లో వైఫల్యం.. హౌస్మేట్స్ ఓటింగ్
బిగ్ బాస్ ఇచ్చిన ఓ ప్రత్యేక టాస్క్‌లో పాల్గొన్న నామినేటెడ్ సభ్యుల్లో, చివరి రౌండ్‌కు వచ్చేసరికి జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్, కామనర్ చరణ్ నిలిచారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కే అప్పగించారు. హౌస్మేట్స్ నిర్వహించిన ఓటింగ్‌లో ఎక్కువ మంది ఆటో రామ్ ప్రసాద్‌కు మద్దతుగా ఓటు వేయడంతో, మెజారిటీ నిర్ణయం మేరకు చరణ్ ఎలిమినేట్ కాక తప్పలేదు.
ఎమోషనల్ అయిన చరణ్..
హౌస్ నుండి నిష్క్రమించే సమయంలో చరణ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. హౌస్మేట్స్ గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం తనకు ఇష్టం లేదని, అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే తన కోరిక అని వెల్లడించాడు. కేవలం నాలుగు రోజుల్లోనే ఒకరి సామర్థ్యాన్ని అంచనా వేసి ఎలిమినేట్ చేయడం సరైంది కాదని వీక్షకుల నుంచి సానుభూతి వ్యక్తమవుతోంది. ఆటపై సరైన అవగాహన లేకపోవడం, ఫిజికల్ టాస్కుల్లో మందకొడిగా ఉండటం, ఒంటరిగా గడపడం చరణ్‌కు మైనస్‌గా మారాయని నెటిజన్లు భావిస్తున్నారు.
హౌస్‌లో వాతావరణం గరంగరం..
చరణ్ నిష్క్రమణతో బిగ్ బాస్ హౌస్‌లో నూతన సమీకరణాలు మొదలయ్యాయి. సెలబ్రిటీలు, కామనర్ల మధ్య వ్యూహాలు మారుతుండగా, ప్రస్తుతం హౌస్‌లో త్రిగుణ్, రోహిత్ నాయుడు మధ్య తలెత్తుతున్న విభేదాలు, వాదోపవాదాలు ఆటను మరింత వేడెక్కిస్తున్నాయి.
Also Read: "జైలులో 30 సార్లు నగ్నంగా నిలబెట్టారు" తీహార్ జైలు ఘోర అనుభవాలపై హీరోయిన్ ఆవేదన!
Also Read: Rashi Singh: 'రంభ ఊర్వశి మేనక' హీరోయిన్ ఒరిజినల్ గెటప్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
