రాష్ట్ర ప్రజలకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు
రైతన్నలకు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రైతు రుణమాఫీ రేపటి నుండి అమలవుతుంది. 2 లక్షల రుణమాఫీ అమలవడం పెద్ద సాహసోపేత నిర్ణయం..ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగి భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేయడానికి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూన్నామని గుర్తించాలి. రైతులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Chiranjeevi Sankranthi Movies: ఎప్పటిలాగే మన టాలీవుడ్ హీరోలు సంక్రాంతి పండుగకి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మంచి కథలతో తమ అభిమానులను ఖుషీ చేసేందుకు థియేటర్లలో వచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ సంక్రాంతికి మునుపటి కంటే సినిమాల పోటీ ఎక్కువగానే ఉంది. ఏకంగా 5 సినిమాలు.. 'ది రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు', 'నారీనారీ నడుమ మురారి' విడుదల కానున్నాయి.
అయితే వీరిలో మెగాస్టార్ చిరంజీవి ఇంతకు ముందు ఎన్నో సంక్రాంతి పండుగలకు తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. సినిమాలతో అలరించడమే కాకుండా సూపర్ హిట్స్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా విడుదల కానున్న క్రమంలో చిరు సంక్రాంతి సెంటిమెంట్ కొనసాగుతుందా? తన కెరీర్లో సంక్రాంతి రేసులో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి? ఎన్ని హిట్స్ కొట్టాయనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవికి, సంక్రాంతి పండుగకు విడదీయలేని అనుబంధం ఉంది. బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సెంటిమెంట్ చిరంజీవికి చాలా బాగా కలిసొచ్చింది. తన కెరీర్లో దాదాపు 15 కి పైగా చిత్రాలు సంక్రాంతి సీజన్లో విడుదల కాగా, అందులో మెజారిటీ సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం విడుదల కాబోతున్న 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా నేపథ్యంలో, గతంలో సంక్రాంతి రేసులో నిలిచిన చిరంజీవి సినిమాల ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
| సినిమా పేరు | విడుదల సంవత్సరం | ఫలితం (Result) | విశేషాలు |
| వాల్తేరు వీరయ్య | 2023 | బ్లాక్‌బస్టర్ | చిరంజీవి వింటేజ్ మాస్ లుక్‌తో బాక్సాఫీస్‌ను ఊపేసింది. |
| ఖైదీ నంబర్ 150 | 2017 | బ్లాక్‌బస్టర్ | 10 ఏళ్ల విరామం తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చి రికార్డులు సృష్టించింది. |
| అంజి | 2004 | యావరేజ్ / ఫ్లాప్ | గ్రాఫిక్స్‌కు ప్రశంసలు దక్కినా, కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. |
| మృగరాజు | 2001 | డిజాస్టర్ | భారీ అంచనాలతో వచ్చి నిరాశపరిచింది. |
| అన్నయ్య | 2000 | హిట్ | ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించి మంచి వసూళ్లు రాబట్టింది. |
| స్నేహం కోసం | 1999 | హిట్ | చిరంజీవి ద్విపాత్రాభినయం మరియు సెంటిమెంట్ బాగా పండింది. |
| హిట్లర్ | 1997 | బ్లాక్‌బస్టర్ | చిరంజీవి కెరీర్లో మర్చిపోలేని కమ్‌బ్యాక్ మూవీ ఇది. |
| ముఠా మేస్త్రి | 1993 | బ్లాక్‌బస్టర్ | మాస్ ఆడియన్స్‌లో చిరు ఇమేజ్ను శిఖరాగ్రానికి చేర్చింది. |
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద 'మెగా' రికార్డులు..
సక్సెస్ రేట్: చిరంజీవి సంక్రాంతికి వస్తున్నారంటే థియేటర్ల వద్ద సందడి వేరే స్థాయిలో ఉంటుంది. ఆయన సంక్రాంతి సినిమాల్లో 70% కంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. రాజకీయాల తర్వాత చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది 'ఖైదీ నంబర్ 150'తో సంక్రాంతికే కావడం విశేషం. గత ఏడాది (2023) 'వాల్తేరు వీరయ్య'తో మరోసారి సంక్రాంతి మొనగాడు అనిపించుకున్నారు.
ఈ ఏడాది పోటీ..
ఈసారి సంక్రాంతికి 'ది రాజాసాబ్' (ప్రభాస్) వంటి భారీ చిత్రాలతో పోటీ ఉన్నప్పటికీ, చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ ఆశలు ఉన్నాయి. టైటిల్ సెంటిమెంట్, సంక్రాంతి ట్రాక్ రికార్డ్ చూస్తుంటే ఈసారి కూడా చిరంజీవి తన సక్సెస్ పరంపరను కొనసాగించేలా కనిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nanda's Journey Conspiracy Latest News: ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ నందాస్ జర్నీ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు నంద తనపై జరుగుతున్న కుట్రలకు సంబంధించిన అంశాలను బయట పెడుతూ సంచలన వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు.. గత కొద్ది రోజుల నుంచి తన వెనుక కొందరు వ్యక్తులు తిరుగుతూ.. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటమే కాకుండా.. ఛానల్ ను డిలీట్ చేయడమే కాకుండా, తన ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన వీడియో రూపంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఈ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో కూడా ఆయన ఓ పోస్ట్ ని పెట్టారు. ఎవరో కావాలని తనపై కుట్ర చేస్తున్నారని ఇందులో పేర్కొన్నారు. దీంతో అప్పటినుంచి తన సబ్స్క్రైబర్స్ వరుసగా ఏం జరిగిందని కామెంట్లు పెట్టడం ప్రారంభించారు.
ఆవేదన వ్యక్తం చేస్తూ విడుదల చేసిన వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఈ ఛానల్ తనది కాదని.. తనొక కూలిగా పనిచేస్తున్నానని కొందరు ప్రచారం చేస్తున్నారని.. కానీ ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి విడుదలయ్యే ప్రతి ఒక్క వీడియో ఐడియా నుంచి ఎడిటింగ్ వరకు అన్ని తానే స్వయంగా చూసుకుంటున్నారని నంద స్పష్టం చేశారు. థంబ్ నెయిల్స్ తప్ప మిగిలిన అన్ని రకాల పనులన్నీ తానొక్కడే చేస్తున్నట్లు ఈ వీడియోలో తెలిపారు. తనకు, ఈ యూట్యూబ్ ఛానల్ కు వెనకాల ఎవ్వరూ లేరని.. కానీ కొంతమంది కావాలనే తాము కూడా ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వీడియోలో చెప్పుకొచ్చారు.
కావాలని తన పేరు చెప్పుకొని లాప్‌ట్యాప్‌తో పాటు ఫోన్ కొనుక్కోవడానికి కొందరు దాతల నుంచి డబ్బులు వసూలు చేశారని.. కానీ అతనికి దాతల నుంచి ఎలాంటి డబ్బులు అందలేదని ఈ వీడియోలో స్పష్టం చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలకు అతను వాడుతున్న అన్ని రకాల వస్తువులను యూట్యూబ్ సంపాదనతో కొనుగోలు చేశారని చెప్పారు. అంతేకాకుండా యూట్యూబ్ నుంచి వచ్చే సంపాదన ను ఇంటికి ఇవ్వకుండా జల్సాలకు ఖర్చు చేస్తారని వస్తున్న ఆరోపణలను కూడా అతను ఖండించారు. ప్రతి నెల నంద తన ఇంటికి ఖర్చులకోసం రూ.20 వేల వరకు ఇంటికి పంపిస్తున్నట్లు ఆధారాలు కూడా చూపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు తనపై ఎన్నో రకాల కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Sankranti Bonus: ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి గిఫ్ట్.. సూపర్ బోనస్ ప్రకటించిన కేంద్రం
అలాగే కేదార్నాథ్ పర్యటన చివరి కోరికగా కొందరు చిత్రీకరించారని.. అంతేకాకుండా ఈ జర్నీలో కొందరు యాక్సిడెంట్ రూపంలో చంపడానికి, ఛానల్ ను పూర్తిగా రిమూవ్ చేయడానికి స్కెచ్ వేశారని కూడా నంద ఈ వీడియోలో తెలిపారు. అంతేకాకుండా తను ఎప్పుడు ఒక యూట్యూబర్ అని చెప్పుకొని.. హోటల్స్‌లో తోపాటు రెస్టారెంట్లలో డబ్బులు ఎగ్గొట్టలేదని.. ఒకవేళ చెప్పుకొని తిని ఉన్నట్లు నిరూపిస్తే.. ఛానల్ ను మూసేస్తానని సవాల్ విసిరారు. అంతేకాకుండా వీడియో వివరణ.. తనకు ఏమైనా జరిగితే అది సహజ మరణం కాదని.. తన వెనుక ఉన్న కుట్ర దారులు చేసిన పనేనని హెచ్చరిస్తూ ప్రేక్షకుల మద్దతు కోరారు..
Also Read: Sankranti Bonus: ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి గిఫ్ట్.. సూపర్ బోనస్ ప్రకటించిన కేంద్రం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Budget 2026: ఫిబ్రవరి 1వ తేదీ 2026న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన అంచనాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈసారి ప్రభుత్వం ప్రత్యేకంగా పన్ను సంస్కరణలపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి మధ్యతరగతి, జీతభత్యాల ఉద్యోగులు, పెట్టుబడిదారులకు ఊరటనిచ్చే ప్రకటనలు చేస్తారని అంచనా వేస్తున్నారు.
కేంద్ర బడ్జెట్ 2025 లో పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్ :
గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం, స్వచ్ఛందంగా పన్ను చెల్లింపులను ప్రోత్సహించడం, పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. 2020 బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం, ఆ తర్వాత దాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచడం వంటి నిర్ణయాలు తీసుకుంది. 2024 బడ్జెట్లో క్యాపిటల్ గెయిన్స్ పన్ను నిబంధనల్లో కీలక మార్పులు చేసి పెట్టుబడిదారులకు ఊరటనిచ్చింది. ఇక 2025 బడ్జెట్లో అయితే ఏటా రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా ప్రకటించడం ద్వారా పెద్ద చర్చకు దారి తీసింది.
క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులకు ట్యాక్స్ నుంచి రిలీఫ్?
ఇప్పుడు 2026 బడ్జెట్లో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని పన్ను నిపుణులు చెబుతున్నారు. 2022 బడ్జెట్లో క్రిప్టో లావాదేవీలపై 1 శాతం TDS, లాభాలపై 30 శాతం ఫ్లాట్ ట్యాక్స్ విధించడం వల్ల ఈ రంగం తీవ్రంగా ప్రభావితమైంది. లాభాలపై నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం లేకపోవడం కూడా పెట్టుబడిదారులను నిరుత్సాహపరిచింది. ఈ నేపథ్యంలో క్రిప్టో పరిశ్రమ ప్రభుత్వం వద్ద పన్ను ఉపశమనం కోరుతోంది. ఈసారి బడ్జెట్లో కనీసం TDS రేటును తగ్గించడం లేదా నష్టాల సర్దుబాటుకు అవకాశం కల్పించడం వంటి మార్పులు రావచ్చన్న ఆశలు ఉన్నాయి.
స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లపై గుడ్ న్యూస్?
ఇక స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడిదారులకు కూడా శుభవార్త వచ్చే అవకాశముంది. ప్రస్తుతం దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను రహిత పరిమితి రూ.1.25 లక్షలుగా ఉంది. దీనిని 2026 బడ్జెట్లో రూ.2 లక్షలకు పెంచే ఆలోచనపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలా జరిగితే చిన్న, మధ్యస్థ పెట్టుబడిదారులకు పెద్ద ఊరట లభించడంతో పాటు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
కొత్త విధానంలో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి పెరగవచ్చు:
కొత్త ఆదాయపు పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితి కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రూ.4 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ఉంది. దీన్ని రూ.5 లక్షలకు పెంచితే తక్కువ ఆదాయ వర్గాలకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా కొత్త విధానాన్ని ఎంచుకున్న ఉద్యోగులు, యువతకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read: Budget 2026: బడ్జెట్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న సీనియర్ సిటిజన్లు? అందులో రాయితీ దక్కుతుందా..??
కొత్త విధానంలో టర్మ్, ఆరోగ్య బీమాపై కూడా తగ్గింపు:
అదే విధంగా కొత్త పన్ను విధానంలో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై కూడా తగ్గింపులు అనుమతించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ మినహాయింపులు పాత విధానంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొత్త విధానంలో కూడా 80C, 80D తరహా ప్రయోజనాలు కల్పిస్తే మరింత మంది కొత్త విధానానికి మారే అవకాశం ఉంటుంది.
డెట్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు ఈ బడ్జెట్ కీలకం:
డెట్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు కూడా ఈ బడ్జెట్ కీలకంగా మారొచ్చు. 2023 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల వల్ల డెట్ ఫండ్ల లాభాలపై పన్ను భారం పెరిగింది. దీంతో ఈ విభాగంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గింది. 2026 బడ్జెట్లో ఈ నిబంధనలను సడలించి, మళ్లీ డెట్ ఫండ్లకు ఆకర్షణ తీసుకురావాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని సమాచారం.
మొత్తానికి 2026 కేంద్ర బడ్జెట్ పన్ను చెల్లింపుదారులు, పెట్టుబడిదారులు, మధ్యతరగతి ప్రజలకు కీలకంగా మారనుంది. ఫిబ్రవరి 1న వచ్చే ప్రకటనలు నిజంగా ఊరటనిస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Accidental Insurance Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒక పెద్ద ఊరటనిచ్చే ప్రకటన చేశారు. ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయబోతోందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 5.14 లక్షల మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 1.02 కోట్ల విలువైన ఉచిత ప్రమాద బీమా పథకాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఉద్యోగుల కుటుంబాలకు బలమైన ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన వివరించారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం.. ఈ నిర్ణయం కేవలం ప్రకటనల వరకే పరిమితం కాదని స్పష్టం చేశారు. ఈ బీమా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో ప్రభుత్వం విస్తృతంగా చర్చలు జరిపిందని తెలిపారు. ఉద్యోగుల జీతాలు ఏ బ్యాంకులో జమ అవుతున్నాయో.. అదే బ్యాంకు ద్వారా బీమా కవరేజ్ అందించేలా ప్రత్యేక శాలరీ ప్యాకేజీలను రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రక్రియలో ఉద్యోగులపై ఒక్క రూపాయి కూడా ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని భట్టి విక్రమార్క వెల్లడించారు.
రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఎప్పటికీ విస్మరించలేదని ఆయన స్పష్టం చేశారు. గత పాలనలో పేరుకుపోయిన బకాయిలను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలనెలా చెల్లిస్తూ వస్తోందని గుర్తు చేశారు. జీతాల చెల్లింపుల్లో ఆలస్యం లేకుండా చూడటంతో పాటు, పదవీ విరమణ ప్రయోజనాలు, అలవెన్సులు తదితర అంశాలను కూడా క్రమబద్ధంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.
ఈ ప్రమాద బీమా పథకం ప్రధాన ఉద్దేశం ఉద్యోగి విధి నిర్వహణలో గానీ, ఇతర కారణాల వల్ల గానీ అనుకోని ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతే, ఆ కుటుంబం ఆర్థికంగా కుదేలుకాకుండా చూడడమేనని డిప్యూటీ సీఎం చెప్పారు. ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు మాత్రమే కాకుండా, శాశ్వత అంగవైకల్యం ఏర్పడిన సందర్భాల్లో కూడా ఈ బీమా కింద పరిహారం లభించేలా నిబంధనలు రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రంలోని కీలక రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇలాంటి బీమా రక్షణ అమలులో ఉందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న సుమారు 38 వేల మంది రెగ్యులర్ కార్మికులకు, అలాగే ట్రాన్స్‌కో, జెన్కో వంటి విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 71 వేల మందికి పైగా ఉద్యోగులకు ఇప్పటికే కోటి రూపాయలకుపైగా ప్రమాద బీమా అందుతోందని చెప్పారు. అదే తరహాలో ఇప్పుడు సాధారణ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 5.14 లక్షల మంది ఉద్యోగులకూ ఈ రక్షణ కవచాన్ని విస్తరించబోతున్నామని స్పష్టం చేశారు.
త్వరలోనే ఈ బీమా పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అర్హతలు, క్లెయిమ్ విధానాలను అధికారికంగా ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పారు. ఉద్యోగులను ప్రభుత్వ కుటుంబ సభ్యులుగానే భావించి, వారి భద్రత, భవిష్యత్తు కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Sankranti Gift: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్రాంతి కానుక అందించింది. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని.. మరో మూడు విడతలుగా ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని తెలంగాణ మంత్రి ప్రకటించారు. ఆ ఇందిరమ్మ ఇల్లు పేదలకు ఇచ్చాకే తాము అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇల్లందు గడ్డపైనే నుంచి ప్రతిపక్షాలకు ఝలక్ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Pay Revison Commission: ఉద్యోగులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి గిఫ్ట్.. పీఆర్సీపై కీలక ప్రకటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజా ప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రసంగం చేశారు. రానున్న మూడేళ్లలో పల్లెలు పట్టణాల్లో మూడు విడతలగా ఇందిరమ్మ ఇళ్ళను ఇవ్వడం జరుగుతుందని ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.
Also Read: Tirumala Darshan: 10 రోజుల్లో 7.83 లక్షల మందికి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం
మరో ఐదేళ్లు ఇందిరమ్మ ప్రభుత్వమే ఉంటుందని పొంగులేటి జోష్యం చెప్పారు. రానున్న మున్సిపల్ ఇతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని ప్రభుత్వం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 68 నుంచి 69 శాతం సర్పంచులు ఉప సర్పంచ్‌లు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Tirumala: ఈ ఒక్క నంబర్‌కు 'హాయ్' అంటే చాలు.. తిరుమల వివరాలు మీ ఫోన్లోకి
ఏ ప్రభుత్వం చేయని విధంగా సన్న బియ్యం పంపిణీ, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని పొంగులేటి శ్రీనివాస రెడ్డి వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో 76వ జీవో సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో నిర్వహించి ఇల్లందు పట్టణాన్ని అద్దంలా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లోను ఇల్లందులో ప్రతి వార్డులో పర్యటిస్తానని పొంగులేటి చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ నియోజకవర్గం లో వందకు పైగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులు గెలుచుకోవడం జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని ఈ సందర్భంగా సర్పంచులకు ఎమ్మెల్యే తెలిపారు. రానున్న మున్సిపల్ జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Konda Surekha vs Ponguleti: తెలంగాణ గిరిజన కుంభమేళా.. సమ్మక్క- సారక్క జాతరకు ఏర్పాట్లు శరవేంగా సాగుతున్నాయి.. వన జాతరలో ప్రత్యేక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తోంది. దాదాపు నెలరోజులుగా మేడారం అభివృద్ది పనులు జరుగుతున్నాయి. మేడారం జాతరను గతంలో ఎప్పుడు లేని రీతిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా మేడారం జాతర విశిష్టత ప్రపంచానికి తెలిసేలా మేడారం నిర్మాణం పనులు చేస్తున్నారు. అయితే జాతర ఏర్పాట్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఎప్పటికప్పుడు పరామర్శిస్తున్నారు. జాతర ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు లేకుండా దిశానిర్ధేశం చేస్తున్నారు. కానీ మేడారం అభివృద్ధి పనులకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. మంత్రి సురేఖ మేడారం అభివృద్ది పనులకు ఎందుకు దూరంగా ఉన్నారని నేతలు తెగ చర్చించుకుంటున్నారు.
Also Read: Tirumala Darshan: 10 రోజుల్లో 7.83 లక్షల మందికి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం
అయితే మేడారం జాతర విషయంలో వరంగల్ జిల్లా మంత్రుల మధ్య విభేదాలు మరింత ముదిరేలా చేశాయని తెలుస్తోంది. నెలాఖరులో జరగనున్న సమ్మక్క సారక్క కోసం మేడారంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అయితే జిల్లాకే చెందిన..దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న సురేఖ... జాతర పనుల్లో జోక్యం చేసుకోవడం లేదు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వారానికోసారి మేడారం వెళ్లి రివ్యూ చేస్తున్నారు. అయితే దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నకొండా సురేఖ వెళ్లడం లేదు. అయితే సీతక్క, పొంగులేటితో విభేదాల కారణంగానే సురేఖ వెళ్లడం లేదా అన్న చర్చ జరుగుతోంది. లేదా గతంలో జరిగిన గొడవ కారణంగా సీఎం రేవంతే ఆమెను దూరంగా ఉండమని చెప్పారా అన్నది తెలియడం లేదు. కారణం ఏదైనా దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ.. మేడారం జాతరను పట్టించుకోకపోవడం చర్చగా మారింది.
Also Read: Tirumala: ఈ ఒక్క నంబర్‌కు 'హాయ్' అంటే చాలు.. తిరుమల వివరాలు మీ ఫోన్లోకి
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. మేడారం జాతర ఉండటంతో.. అక్కడ పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. అలాగే మేడారం డెవలప్ మెంట్ కోసం నిధులు మంజూరు చేశారు. దాంతో అధికారులు టెండర్లను పిలిచారు. ఇక్కడే ఇద్దరు మంత్రుల మధ్య వివాదం మొదలైంది. మేడారం టెండర్లలో ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకున్నారని మంత్రి సురేఖ అరోపించారు. అంతేకాదు దేవాదాయ శాఖకు సంబంధించిన 71 కోట్ల రూపాయాల టెంటర్‌ను తన మనిషికి ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేటి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. తన శాఖలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారంటూ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. గతంలోనూ కొండా మురళీ మంత్రి పొంగులేటితో తమకు ఇబ్బందిగా ఉందని అధిష్టానానికి లేఖ రాశారు. ఇప్పుడు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానానికి కొండా సురేఖ ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. చివరకు మంత్రి సురేఖ క్షమపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
Also Read: Pay Revison Commission: ఉద్యోగులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి గిఫ్ట్.. పీఆర్సీపై కీలక ప్రకటన
కొద్దిరోజులుగా కొండా సురేఖ తీరుపైన అనేక విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సొంత పార్టీ నేతలనే ఇబ్బంది పెడుతున్నారనే చర్చ ఉంది. ఇటీవల మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి జిల్లా ఎమ్మెల్యేలను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, కడియం శ్రీహారిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత వరంగల్ భద్రకాళి ఆలయం కమిటీ వ్యవహారంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో ఢీ అంటే ఢీ అన్నారు. తనకు సంబంధించిన ఇద్దరు నేతలకు ఉన్నత పదవులు కట్టబెట్టడంపై ఎమ్మెల్యే వర్గం భగ్గుమంది. అటు పరకాలలో మంత్రి పెత్తనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ ఉంది. మరోవైపు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితోనూ కొండా సురేఖ వివాదం పెట్టుకుంటున్నారు. వేం నరేందర్ రెడ్డి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు.. అలాంటి నేతతోనే కొండా సురేఖ గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారని జిల్లా నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తంమీద మేడారం విషయంలో మంత్రి కొండా సురేఖ సైలెంట్ గా ఉండటం వరంగల్ జిల్లా పాలిటిక్స్‌లో చర్చనీయాశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
MLC Ananta Babu: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రూటు మార్చారు. ఎన్నికల సమయం తరహాలో అక్కడ టిడిపి ఎమ్మెల్యే మిరియాల శిరీష దంపతుల దోపిడీపై విమర్శలు చేస్తున్నారు. దీనికి టిడిపి ఎమ్మెల్యే సైతం గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో రచ్చ జరుగుతోంది. ఇటీవల వైసిపి అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ అనంత బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే శిరీష రంపచోడవరం నియోజకవర్గంలో దోచుకో... పంచుకో అనే స్థితిలో ఉన్నారనీ... రాష్ట్రంలోనే ఆమె కరప్షన్ లో నెంబర్ వన్ అంటూ ఫైర్ అయ్యారు. ఒక సర్పంచ్ కు ఉన్న ఆదరణ కూడా ఎమ్మెల్యేకు లేదనీ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యల పై టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Also Read: RTC Good News: సంక్రాంతి పండుగకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. అద్దె బస్సుల సమ్మె విరమణ
అయితే ఈ డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుండగానే.. ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి రెచ్చిపోయారు. ఎమ్మెల్యే దంపతులు నియోజకవర్గంలోని ప్రజలను పట్టి పీడిస్తున్నారనీ.. అడ్డతీగల మండలంలో జరుగుతున్న రంగు రాళ్ల తవ్వకాల్లో ఎమ్మెల్యే భర్తకు సంబంధాలు ఉన్నాయనీ విమర్శించారు. ఎమ్మెల్యే దంపతుల అవినీతి బాగోతం పరాకాష్టకు చేరుకుందనీ.... ప్రభుత్వ ఇళ్ల లబ్ధిదారుల వద్ద తమ ఏజెంట్ల ద్వారా మామూళ్లు వసూలు చేస్తున్నారనీ తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ అనంత బాబు తోపాటు అక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి సైతం టీడీపీ ఎమ్మెల్యే పై దుమ్మెత్తి పోశారు. ఎమ్మెల్యే దంపతులు లక్షలు దోచుకుని వేలల్లో అంబులెన్స్ సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారనీ అన్నారు. తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు వ్యక్తిగత మాటలతోనే మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి కౌంటర్ ఇచ్చారు.
ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి తనను టార్గెట్ చేయడంతో టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష సైతం ఘాటుగానే సమాధానం చెబుతున్నారు. డోర్ డెలివరీ అనంతబాబుకు తమ పార్టీ కార్యకర్తలతో బుద్ధి చెబుతామని అన్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ధనలక్ష్మిని డమ్మీ చేసి ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలు చేశారనీ.. ఢిల్లీలో ఆస్తులు, చేపల చెరువులను సంపాదించారనీ విమర్శించారు. తాను ఊక లారీల్లో గంజాయి, రంగురాళ్లు, అక్రమ కలప వ్యాపారాలు చేయలేదని అన్నారు. ఇప్పటికే రంపచోడవరం నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చామనీ.. అసెంబ్లీలో మాట్లాడి పోలవరం నివాసితుల కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు కృషి చేసినట్లు ఎమ్మెల్యే శిరీష చెబుతున్నారు.
కొద్దిరోజులుగా రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబు అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ఇక 2014 నుంచి 2019 ఎన్నికల్లో అనంతబాబు బలం తోడవ్వడంతో మహిళా అభ్యర్థులైన వంతల రాజేశ్వరి, నాగులపల్లి ధనలక్ష్మి ఎమ్మెల్యేల గెలుపుకు దోహదపడింది. 2024 ఎన్నికల్లో టిడిపి టికెట్ ను అనూహ్యంగా దక్కించుకున్న అంగన్వాడి కార్యకర్తల మిరియాల శిరీష ఇక్కడ విజయం సాధించడంతో అనంతబాబుకు బ్రేక్ పడింది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిరీష, ఆమె భర్త విజయ్ భాస్కర్ ల హవా కొనసాగుతోంది. డోర్ డెలివరీ కేసు.. పార్టీ అధికారంలో లేకపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల అనంతబాబు కొత్త పంథాలో వెళ్తున్నారు.
వైసీపీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలో లేక నియోజకవర్గంలో పట్టు కోసమో గానీ టీడీపీ ఎమ్మెల్యేపై దోపిడీ విమర్శలు మొదలు పెట్టారు. ఇకనైనా ఎమ్మెల్యే దంపతులు తీరు మార్చుకుని వారి గురించి రంపచోడవరం నియోజకవర్గ ప్రజలు ఏమి అనుకుంటున్నారో ఆలోచించాలనీ సూచిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఇక్కడ జరిగే దోపిడీ వ్యవహారాలు.. అసాంఘిక కార్యకలాపాలపై అనంతబాబు ఇలాగే రచ్చ చేస్తూ వెళతారా అనేది చూడాలి. ఏదీఏమైనా ఇప్పటికే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో నియోజకవర్గంలో ఏం జరుగుతుందో బహిరంగం అయ్యింది. గతంలో వైసిపి ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ, టీడీపీ ఎమ్మెల్యే మధ్య రగడలో ఇకపై ఏం జరుగుతుందో చూడాలి మరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
NPS pension calculation: 30 ఏళ్లు అంటే జీవితంలో ఒక మలుపు. ఈ దశలో కెరీర్ కొంత స్థిరంగా మారుతుంది. ఆదాయం కూడా క్రమంగా పెరుగుతుంది. అప్పుడు చాలా మందికి భవిష్యత్తు గురించి... ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత జీవితం ఎలా ఉండాలి అన్న ఆలోచనలు మొదలవుతాయి. వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా, గౌరవంగా, ప్రశాంతంగా జీవించాలంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి. అందుకే ఈ వయసులోనే రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి సీరియస్‌గా ఆలోచించాలి. ఈ ప్రయాణంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఒక నమ్మకమైన ఆప్షన్‌గా ముందుకు వస్తుంది.
వృద్ధాప్యంలో ఆర్థిక ఒత్తిడి లేకుండా ఉండాలంటే పొదుపు అలవాటు చాలా కీలకం అవుతుంది. ముప్పై ఏళ్ల నుంచే దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రారంభిస్తే, చిన్న మొత్తాలే కాలక్రమేణా పెద్ద సంపదగా మారుతాయి. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా కనీసం యాభై వేల రూపాయల పెన్షన్ రావాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంటే.. దానికి అనుగుణంగా ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. నెలకు యాభై వేల రూపాయలు అంటే సంవత్సరానికి ఆరు లక్షల రూపాయల స్థిర ఆదాయం అవసరం అవుతుంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. రిటైర్మెంట్ సమయంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో చేరిన మొత్తం సొమ్ములో కనీసం నలభై శాతం డబ్బును యాన్యుటీ పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. ఈ యాన్యుటీపై సగటున సంవత్సరానికి ఆరు శాతం రాబడి వస్తుందని అంచనా వేస్తే, కావాల్సిన పెన్షన్ పొందాలంటే యాన్యుటీ భాగంలో దాదాపు కోటి రూపాయల ఫండ్ ఉండాలి. అంటే రిటైర్మెంట్కు చేరుకునే సమయానికి మొత్తం మీద సుమారు రెండున్నర కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ సిద్ధంగా ఉండాలి అన్నమాట.
ఇంత పెద్ద మొత్తాన్ని ఒక్కసారిగా సమకూర్చుకోవడం అసాధ్యం. కానీ ముప్పై ఏళ్ల నుంచే ప్లాన్ చేస్తే ఇది చాలా ఈజీ అవుతుంది. మీరు అరవై ఏళ్ల వయసులో రిటైర్ అవుతారని భావిస్తే, మీ దగ్గర సుమారు ముప్పై ఏళ్ల సమయం ఉంటుంది. ఈ కాలంలో NPS ద్వారా సంవత్సరానికి సగటున తొమ్మిది నుంచి పది శాతం వరకు రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన చూస్తే, ప్రతి నెలా సుమారు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయల మధ్య పెట్టుబడి పెడితే మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మొదట ఇది పెద్ద భారంలా అనిపించినా, భవిష్యత్తులో లభించే భద్రత ముందు ఇది చాలా చిన్న త్యాగమే.
Also Read: Gold Mines: ఇరాన్ కుబేరుడి నిధి.. భూగర్భంలో ఏకంగా 22 మిలియన్ టన్నుల బంగారం.. షాకింగ్ ఫ్యాక్ట్స్..!!
పెట్టుబడుల్లో కాలానికి ఉన్న విలువను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. మీరు ఎంత తొందరగా మొదలుపెడితే, చక్రవడ్డీ అంత గొప్పగా పని చేస్తుంది. ముప్పై ఏళ్లకే పెట్టుబడి ప్రారంభిస్తే చిన్న చిన్న మొత్తాలు కూడా కాలక్రమేణా భారీ నిధిగా మారతాయి. అదే ఐదేళ్లు ఆలస్యం చేస్తే, అదే లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి నెలా చాలా ఎక్కువ మొత్తాన్ని పెట్టాల్సి వస్తుంది. జీతం పెరిగినప్పుడల్లా మీ పెట్టుబడిని కాస్త పెంచుకుంటూ వెళ్తే, చివరికి మీ చేతిలో ఉండే కార్పస్ మరింత పెరుగుతుంది. క్రమశిక్షణతో చేసే పెట్టుబడులు మిమ్మల్ని ఆర్థికంగా బలంగా నిలబెడతాయి.
రిటైర్మెంట్ తర్వాత జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఈరోజే సరైన అడుగు వేయాలి. ప్రభుత్వ భరోసా ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే, భవిష్యత్తులో మీ అవసరాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకే వీలైనంత త్వరగా రిటైర్మెంట్ ప్లానింగ్‌ను మొదలుపెట్టడం తెలివైన నిర్ణయం. ఈరోజు చేసే చిన్న పొదుపే రేపటి సుఖమయమైన జీవితానికి బలమైన పునాది అవుతుంది. నిశ్చింతగా జీవించాలంటే ఇప్పుడే మీ ఆర్థిక ప్రయాణాన్ని ప్రారంభించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mana Shankara Vara Prasad Tickets Hike: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు' సంక్రాంతి బరిలో నిలుస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాలను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర యూనిట్‌కు సానుకూల వార్త అందించింది. సినిమా టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోలకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
టికెట్ ధరల పెంపు వివరాలు
సినిమా నిర్మాణ బడ్జెట్, భారీ తారాగణాన్ని పరిగణనలోకి తీసుకుని.. జనవరి 12 నుండి 10 రోజుల పాటు పెంచిన ధరలు అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సినిమా కోసం సింగిల్ స్క్రీన్స్‌లో ప్రస్తుత ధరపై అదనంగా రూ.100 పెంచుకోవడానికి అనుమతి ఇవ్వగా.. మల్టీప్లెక్స్‌ల్లో ప్రస్తుతం ఉన్న ధరపై అదనంగా రూ.120 పెంచేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ధరల పెంపు సంక్రాంతి సీజన్ ముగిసే వరకు కొనసాగనుంది. ఇది బాక్సాఫీస్ వసూళ్లకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది.
ప్రీమియర్ షో..రిలీజ్ డేట్
మెగా అభిమానుల కోసం జనవరి 11వ తేదీ రాత్రే సందడి మొదలుకానుంది. ఆ రోజు రాత్రి 8 PM నుండి 10 PM మధ్య ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్రదర్శించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అంటే, సంక్రాంతికి ఒక రోజు ముందే థియేటర్లలో మెగా ఉత్సవం ప్రారంభం కాబోతోంది అన్నమాట.
బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పోరు
ఈ సినిమా టైటిల్ 'మన శంకరవరప్రసాద్ గారు' అనేది చిరంజీవి అసలు పేరు కావడంతో అభిమానుల్లో సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఈ టికెట్ ధరల పెంపు, ముందస్తు షోలు నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ వెసులుబాటుతో మెగాస్టార్ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Largest Gold Producing State: బంగారం.. ఈ పేరు వినగానే మెరిసే పసుపు రంగు లోహం, సంపద లేదా సామాజిక హోదా గుర్తుకు వస్తాయి. వేల సంవత్సరాలుగా మానవ నాగరికతలో భాగమైన బంగారం, నేడు కేవలం ఆభరణంగానే కాకుండా అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనంగా మారిపోయింది. అయితే, బంగారం అనగానే మనకు దుబాయ్ గుర్తుకు వస్తుంది కానీ, ప్రపంచంలో అపారమైన బంగారు నిక్షేపాలు ఉండి 'బంగారు భూమి'గా పిలవబడే ప్రాంతాలు వేరే ఉన్నాయి.
'బంగారు భూమి' అని వేటిని పిలుస్తారు?
చరిత్రలోనే కాకుండా ప్రస్తుత ఆధునిక యుగంలో కొన్ని దేశాలు తమ వద్ద ఉన్న అపారమైన బంగారు నిక్షేపాలకు గానూ 'బంగారు భూమి' అనే పేరును సొంతం చేసుకున్నాయి.
ఘనా: పశ్చిమ ఆఫ్రికాలోని ఈ దేశాన్ని అరబ్ వ్యాపారులు 'బంగారు భూమి' అని పిలిచేవారు. ఇప్పటికీ ఆఫ్రికా ఖండంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాల్లో ఘనా అగ్రస్థానంలో ఉంది.
సాడో ద్వీపం: జపాన్ లోని ఈ ద్వీపాన్ని ఎడో కాలంలో బంగారు భూమిగా పిలిచేవారు. ఆ కాలంలో జపాన్ మొత్తం ఉత్పత్తి చేసే బంగారంలో సగం ఇక్కడి నుండే వచ్చేది.
శ్రీవిజయ: ప్రాచీన కాలంలో ఇండోనేషియాలోని శ్రీవిజయ నగరాన్ని 'బంగారు ద్వీపం'గా పరిగణించేవారు. ఇది అప్పట్లో వాణిజ్యానికి, సంపదకు ప్రధాన కేంద్రంగా ఉండేది.
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు వినియోగదారులలో ఒకటి. మన దేశంలో బంగారం కేవలం లోహం కాదు, అది ఒక సెంటిమెంట్. వివాహాలు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. బంగారాన్ని మహాలక్ష్మి స్వరూపంగా, అత్యంత శుభప్రదమైనదిగా భారతీయులు భావిస్తారు. సామాన్యుల నుండి సంపన్నుల వరకు కష్టకాలంలో ఆదుకునే ఆపద్బాంధవుడిగా బంగారాన్ని నమ్ముతారు.
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. అందులో మొదటిది అంతర్జాతీయ రాజకీయాలు ప్రధానంగా బంగారం రేటు పెరిగేందుకు కారణంగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.
స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు తమ సొమ్మును సురక్షితంగా ఉంచుకోవడానికి బంగారంలో పెట్టుబడి పెడతారు. కరెన్సీ విలువ తగ్గుతున్నప్పుడు బంగారం తన విలువను స్థిరంగా ఉంచుకోగలదు.
బంగారం అనేది కేవలం ఒక ఖరీదైన లోహం మాత్రమే కాదు. అది ఒక దేశ ఆర్థిక బలానికి చిహ్నం. ఘనా వంటి దేశాల్లో సహజ వనరుల రూపంలో ఉంటే, భారత్ వంటి దేశాల్లో అది ప్రజల పొదుపు, సంప్రదాయాల రూపంలో నిక్షిప్తమై ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pakistan PM Arrest Warrant News: పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌కు అనూహ్యమైన చిక్కులు ఎదురయ్యాయి. ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ కావడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వారెంట్‌ను పాకిస్తాన్ కోర్టులు కాకుండా, 'రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్' ప్రవాస ప్రభుత్వం జారీ చేయడం గమనార్హం.
ఆరోపణలు ఏమిటి?
బలూచ్ కార్యకర్త, న్యాయవాది మీర్ యార్ బలూచ్ సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలను వెల్లడించారు. షాబాజ్ షరీఫ్‌పై ప్రధానంగా ఈ క్రింది ఆరోపణలు మోపారు.
వీసా నిబంధనల ఉల్లంఘన: బలూచిస్తాన్‌ను ఒక స్వతంత్ర దేశంగా పరిగణిస్తున్న ప్రవాస ప్రభుత్వం, షరీఫ్ ఎటువంటి చట్టపరమైన అనుమతి లేదా వీసా లేకుండా ఆ భూభాగంలోకి ప్రవేశించారని పేర్కొంది.
సార్వభౌమాధికారానికి భంగం: బలూచిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను, గగనతల నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ఆరోపించింది.
అక్రమ ప్రవేశం: చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా రావడం నేరపూరిత చర్యగా పరిగణిస్తూ ఈ వారెంట్ జారీ చేశారు.
ఎక్కడ అడుగుపెట్టినా అరెస్ట్?
బలూచిస్తాన్ ప్రాంతంలోని ఏ విమానాశ్రయంలోనైనా, లేదా సరిహద్దుల వద్దనైనా షాబాజ్ షరీఫ్ కనిపిస్తే వెంటనే అరెస్టు చేయాలని ఆ వారెంట్‌లో పేర్కొన్నారు. "బలూచిస్తాన్ ఒక ప్రత్యేక సార్వభౌమ దేశం. పాకిస్తాన్ ప్రధాని అయినా సరే, ఇక్కడి వలస చట్టాలకు అతీతం కాదు" అని మీర్ యార్ బలూచ్ స్పష్టం చేశారు.
ప్రతీకాత్మక చర్యగా విశ్లేషణ
వాస్తవానికి బలూచిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్ నియంత్రణలోనే ఉంది. ప్రవాస ప్రభుత్వానికి అక్కడ భౌతిక నియంత్రణ లేనప్పటికీ, ఈ వారెంట్ జారీ చేయడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్ నుండి విడిపోవాలని కోరుతున్న బలూచ్ ప్రజల గొంతును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు చేసే ప్రయత్నం. పాకిస్తాన్ సైన్యాధికారులకు, ప్రభుత్వానికి బలూచ్ భూభాగంపై హక్కు లేదని ప్రతీకాత్మకంగా హెచ్చరించడం.. బలూచిస్తాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడం వంటి రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి.
పాక్ స్పందన?
ఈ వారెంట్‌పై పాకిస్తాన్ ప్రభుత్వం కానీ, ప్రధాని కార్యాలయం కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. క్షేత్రస్థాయిలో దీని ప్రభావం తక్షణమే లేకపోయినా, దౌత్యపరంగా ఇది పాకిస్తాన్‌కు ఇబ్బందికర పరిణామమేనని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Itel Zeno 20 Max India Launched: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఐటెల్ తమ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ జెనో 20 మ్యాక్స్ (Itel Zeno 20 Max) పేరుతో భారత్‌లో విడుదల చేసినట్లు వెల్లడించింది. ఇది గతంలో విడుదలైన అన్ని మొబైల్ మోడల్స్‌తో పోలిస్తే చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ కేవలం రూ.7 వేల లోపే అందుబాటులోకి తీసుకురావడం విశేషం. జెనో 20 మ్యాక్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ప్రీమియం కెమెరా గ్రిడ్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా కంపెనీ దీనిని రెండు స్టోరేజ్ (3GB, 4GB RAM) వేరియంట్లలో విడుదల చేసింది. అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకుందాం.
ఐటెల్ జెనో 20 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్(Itel Zeno 20 Max)కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఇది మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 3gb ర్యామ్ స్టోరేజ్ వేరియంట్ రూ.5,799 ధరతో అందుబాటులో ఉంది. ఇక 4 జిబి ర్యామ్ కలిగిన వేరియంట్ రూ.6,169తో లభిస్తోంది. ఇక ఈ మొబైల్ మొత్తం మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్ మల్టీ టాస్కింగ్ పరంగా కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. జెనో 20 మ్యాక్స్ డిజైన్ సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఇది చూడడానికి చాలా సన్నగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.
అలాగే ఇది MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్‌ను పొందిన సంగతి అందరికీ తెలిసిందే.. ఈ Itel Zeno 20 Max మొబైల్ IP54 రేటింగ్‌తో అందుబాటులోకి వచ్చింది. తేలికపాటి వర్షంలో కూడా ఇది పాడవకుండా ఉంటుంది. ఇక ఈ మొబైల్ 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో 6.6-అంగుళాల HD+ IPS డిస్ప్లేను కలిగి ఉంటున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఇది ఆల్వేస్-ఆన్ డిస్ప్లేతో కూడా అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ ద్వారా అద్భుతమైన సౌండ్ అనుభూతిని పొందేందుకు DTS పవర్డ్ సౌండ్ టెక్నాలజీని కలిగి ఉంది.
Also Read: OnePlus 16 Pro మొబైల్ వచ్చేస్తోంది భయ్యా.. ఫీచర్స్ లీక్ వివరాలు ఇవే!
ఈ Itel Zeno 20 Max స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రాసెసర్ వివరాల్లోకి వెళ్తే.. ఇది T7100 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. సెక్యూరిటీ కోసం అదనంగా ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉండడం విశేషం.. ఇక ఈ మొబైల్ కు సంబంధించిన వెనక భాగంలో ఉన్న కెమెరాలు వివరాల్లోకి వెళితే.. స్లైడింగ్ జూమ్ బటన్‌తో కూడిన 13MP కెమెరాను కూడా అందిస్తోంది. ఇది ఫోటోలు తీయడానికి ఎంతో హ్యాండీగా ఉంటుంది. అలాగే ఇందులో ఫ్రంట్ భాగంలో కంపెనీ చాలా ప్రత్యేకమైన 8MP సెల్ఫీ కెమెరా కూడా అందిస్తోంది. మెరుగైన ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో కూడిన కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు కూడా ఉండడం ఆశ్చర్యం. ఇక ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 5,000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.
Also Read: OnePlus 16 Pro మొబైల్ వచ్చేస్తోంది భయ్యా.. ఫీచర్స్ లీక్ వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook