ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ అండ్ సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్ సమీక్షా సమావేశం
Karimnagar, Telangana:శిక్షకుల శిక్షణ మరియు పారిశుధ్య కార్మికుల భద్రత మరియు గౌరవంపై జరిగిన సమీక్షా సమావేశంలో గౌరవనీయులైన శ్రీమతి పమేలా సత్పతి జిల్లా పాలనాధికారి, గౌరవనీయులు శ్రీ ప్రఫుల్ల దేశాయ్ అధనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Fee Reimbursement Funds: కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఫీజు రీయింబర్స్మెంట్ మనీ విడుదల..ఎలా అప్లై చేయాలి?
Hyderabad, Telangana:Telangana Fee Reimbursement: తెలంగాణలోని లక్షలాదిమంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. జూన్ 27న ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల కింద రూ.100 కోట్లను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా బకాయిల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు ఈ వార్త ఎంతో ఊరటని కలిగించింది.
కొత్త విధానం ప్రకారం.. రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రతినెల రూ.200 కోట్ల విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగమే ఈ మొదటి విడత రూ.100 కోట్ల రూపాయలు విడుదల చేశారని అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.
ఎవరెవరు అర్హులు..
ఈ పథకం ద్వారా కింద వర్గాలకు చెందిన పేద, గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బీసీ, ఈడబ్యూఎస్, మైనారిటీ, దివ్యంగ విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అయితే ఆ విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, నర్సింగ్ వంటి అన్ని రకాల ప్రొఫెషనల్, ఉన్నత కోర్సులు చదువుతున్న వారు అయ్యుండాలి. ఆయా విద్యార్థులు కనీసం 75% అటెండెన్స్ (హాజరు) తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది. ఈ నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం సదరు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంది.
కొత్త జీవోలు..
హైకోర్టు స్టే తర్వాత ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలతో జీవో నెంబర్ 8, 9లను విడుదల చేసింది. వీటి ప్రకారం.. నిధులు మొత్తం నాలుగు విడతల్లో నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోని జమవుతాయి. ఖాతాలో డబ్బులు పడిన ఒక వారంలోపు విద్యార్థులు ఆ డబ్బును తమ కాలేజీలకు చెల్లించాల్సి ఉంటుంది.
అప్లై చేసుకోవడం ఎలా?
ఫీజు రీయింబర్స్మెంట్ పొందాలనుకునే అర్హులైన విద్యార్థులు కింది విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్: ముందుగా అధికారిక ఈ-పాస్ పోర్టల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
డాక్యుమెంట్ అప్లోడ్: వెబ్సైట్లో అడిగిన వివరాలను నమోదు చేసి, అవసరమైన అన్ని రకాల సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి.
అధికారులు వెరిఫికేషన్: మీ దరఖాస్తులను సంబంధిత జిల్లా సంక్షేమ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
ఖాతాలో జమ: వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, నిధులు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో వచ్చేస్తాయి.
గమనిక: నిధులు విడుదలతో హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కాలేజీల్లో అడ్మిషన్లు ప్రక్రియ ఇకపై సాఫీగా సాగనుంది. తదుపరి విడతల నిధులను కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: రాష్ట్ర చరిత్రలో అరుదైన రికార్డు..జూలైలో అత్యధికంగా 27 రోజులు స్కూల్ వర్కింగ్ డేస్..
Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్..జూన్ 29న స్కూళ్లు కాలేజీలకు సెలవు..ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
జగన్నాథుడి విగ్రహంలో కొట్టుకునే గుండె చప్పుడు.. పూరిలో దాగున్న 5 అంతుచిక్కని అద్భుతాలు!
Hyderabad, Telangana:Puri Jagannath Temple Latest News: భారతదేశంలోని అత్యంత పవిత్రమైన చార్ ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం ఒకటి.. ఈ ఆలయం కేవలం భక్తికే కాదు.. ఆధునిక సైన్స్ సైతం సమాధానం చెప్పలేని ఎన్నో అతీంద్రియ, అద్భుత రహస్యాలకు నిలయంగా మారింది.. యుగయుగాలుగా ఇక్కడ జరిగే సంఘటనలు స్వామివారి అపారమైన దైవశక్తికి నిదర్శనంగా నిలుస్తూ వస్తోంది..
1999 సంవత్సరంలో అక్టోబర్ 29న ఒడిశా తీరాన్ని వణికించిన పరదీప్ మహా తుఫాన్ సమయంలో పూరి క్షేత్రంలో ఒక అద్భుతం జరిగింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు.. కుండపోత వర్షం పూరి వైపు ఊహించని స్థాయిలో దూసుకొచ్చాయి. ఆలయానికి, భక్తులకు పెద్ద ప్రమాదం పొంచి ఉన్న ఆ రాత్రి వేళ.. ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రం నుంచి ఒక రహస్య నీలి రంగు కాంతి కిరణం (Blue Light Ray) అత్యంత వేగంగా సముద్రం వైపు వెళ్లడాన్ని భక్తులు గమనించారు. ఆ మరుక్షణమే పూరి వైపు రావలసిన తుఫాను ఒక్కసారిగా ఆగిపోయి.. జగన్నాథుడు తన ఆలయాన్ని, భక్తులను కాపాడుకున్నాడనేందుకు ఈ ఘటనే సజీవ సాక్ష్యంగా భావించవచ్చు.
గాలికి వ్యతిరేకంగా ఎగిరే జెండా..
ఈ ఆలయంపై ఉన్న జెండా సాధారణ వాతావరణానికి చాలా భిన్నంగా ఎల్లప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు ఎలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకుండా కేవలం ఒక తాడు సహాయంతో వంశపారంపర్యంగా వస్తున్న పూజారులు వందల అడుగుల ఎత్తుకు ఎక్కి ఈ జెండాను మారుస్తారు. ఈ జెండాపై పక్షులు వాలడం అత్యంత అరుదు.. ఒకవేళ పక్షి వాలితే అది రాబోయే విపత్తుకు సంకేతంగా భావిస్తారట. గతంలో ఒడిశా రైలు ప్రమాదానికి రెండు రోజుల ముందు, అలాగే కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభానికి ముందు ఈ జెండాపై పక్షులు వాలడం, జెండా గాలికి ఎగిరిపోవడం వంటి అశుభ సూచికలు జరిగాయని స్థానికులు నమ్ముతారు.
ముస్లిం భక్తుడి కోసం ఆగిన స్వామి రథం..
15వ శతాబ్దంలో లాల్ బెగ్ అనే మొగల్ సైన్యాధిపతికి.. ఒక బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన సలాబేగ ముస్లిం అయినప్పటికీ.. జగన్నాథుని పరమ భక్తుడిగా మారారు. ఒకసారి రథయాత్ర సమయంలో ఆయన పూరికి రావడం ఆలస్యమైంది. తన ఆరాధ్య దైవాన్ని చూడలేకపోతున్నానని ఆయన మార్గమధ్యంలో బాధపడ్డాడు.. బాలగండి అనే ప్రదేశంలో జగన్నాథుడి రథం నిలిచిపోయింది. వందలాది ఏనుగులు, వేలాది మంది భక్తులు లాగినా రథం ఒక్క ఇంచు కూడా ముందుకు కదల్లేదు... కలలో స్వామి రాజుకు ఆదేశించినట్లుగా.. మూడు రోజుల తర్వాత సలాబేగ వచ్చి స్వామివారిని దర్శించుకున్నాకే రథం ముందుకు కదిలింది. ఈనాటికీ రథయాత్రలో సలాబేగ సమాధి వద్ద రథాన్ని కాసేపు ఆపడం ఒక ఆచారంగా వస్తోంది.
విగ్రహాలకు గుండె చప్పుడు..
పూరి ఆలయంలోని విగ్రహాలు రాతితో చేసినవి కావు.. వీటిని ప్రత్యేక వేప చెట్టు దుంగలతో చేస్తారు. ప్రతి 8, 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి పాత విగ్రహాలను తీసివేసి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. దీనిని నవకలేబర ఉత్సవంగా చెప్పకుంటారు. పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహంలోకి మార్చే అత్యంత పవిత్రమైన అంతర్లీన శక్తినే బ్రహ్మ పదార్థం అంటారు. ఇది శ్రీకృష్ణుని గుండె లేదా నాభి అని జానపద కథలు చెబుతున్నప్పటికీ.. అది సైన్స్ వివరించలేని.. ఒక అపారమైన దైవ శక్తిగా భావిస్తారు. ఈ మార్పిడి ప్రక్రియ అర్ధరాత్రి వేళ.. ఆలయంలోని లైట్లన్నీ ఆర్పివేసి పూర్తి చీకట్లో జరుగుతుంది. పూజారులు కళ్ళకు గంతలు కట్టుకుని.. చేతులకు వస్త్రాలు చుట్టుకుని ఈ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. దానిని ఇప్పటివరకు ఎవరూ చూడలేదు.
తరిగిపోని మహాప్రసాదం..
లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా వచ్చినా ఇక్కడ వండే ప్రసాదం ఎప్పుడు తరిగిపోదని భక్తులు భావిస్తారు. అలాగని వృధా కూడా కాదట.. అలాగే ఆలయంలో ఉండే 22 మెట్లలో మూడవ మెట్టును యమశీల అంటారు. దీనిని తొక్కితే పుణ్యం పోతుందని భక్తులు దీనిపై అడుగు పెట్టకుండా దాటుకుంటూ వెళతారు. ఇటువంటి ఎన్నో అంతుచిక్కని అద్భుత రహస్యాలకు నిలయమే.. పూరి జగన్నాథ పుణ్యక్షేత్రం.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
July School Working Days: రాష్ట్ర చరిత్రలో అరుదైన రికార్డు..జూలైలో అత్యధికంగా 27 రోజులు స్కూల్ వర్కింగ్ డేస్..
Hyderabad, Telangana:July 2026 School Working Days: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జులై నెలలో పాఠశాలకు ఏకంగా 27 రోజులపాటు పని దినాలు రాబోతున్నాయి. సాధారణంగా ఏ నెలలోనైనా కనీసం నాలుగు ఆదివారాలు ఒక రెండో శనివారం కలిపి ఐదు రోజులు సెలవులు కచ్చితంగా ఉంటాయి. ఈ నెలలో 31 రోజులు ఉన్న అదే కూడా గరిష్టంగా 26 రోజులు పనిదినాలు మాత్రమే వస్తుంటాయి. కానీ, ఈ జులై నెల అందుకు భిన్నంగా సరికొత్త రికార్డును నమోదు చేయనుంది.
27 పని దినాలు ఎలా వచ్చాయంటే..
వేసవి సెలవులు తర్వాత పాఠశాల పునః ప్రారంభం కావాల్సిన సమయంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ మార్పు చోటుచేసుకుంది. ఎండల కారణంగా జూలై 12న పాఠశాల ప్రారంభోత్సవానికి ప్రభుత్వం ఒకరోజు సెలవు ప్రకటించింది.
జూన్ 13న రెండో శనివారం, 14 ఆదివారం కావడంతో పాఠశాలలో జూన్ 15న అధికారింగా తెరుచుకున్నాయి. జూన్ 12 నాటి సెలవును భర్తీ చేసేందుకు జూలై నెలలోని రెండో శనివారాన్ని పనితరంగా విద్యాశాఖ ప్రకటించింది.
దీనివల్ల జులై నెలలో కేవలం నాలుగు ఆదివారాలు మాత్రమే సెలవులుగా మిగిలాయి. ఫలితంగా మొత్తం 31 రోజుల్లో నాలుగు రోజులు పోగా మిగిలిన 27 రోజులు పాఠశాలలు తెరిచే ఉంటాయి.
ఉపాధ్యాయులు ఏమంటున్నారంటే..
పాఠశాలల్లో రెండో శనివారం సెలవు విధానాన్ని ప్రవేశపెట్టిన నాటి నుంచి, ఒకే నెలలో 27 పని దినాలు రావడం విద్యాశాఖ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ అరుదైన మార్పుతో సిలబస్ పూర్తి చేయడానికి ఉపాధ్యాయులకు తగినంత సమయం దొరుకుతుందని పలువురు టీచర్లు అభిప్రాయపడుతున్నారు.
Also Read: AP Rain Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!
Also Read; Aarna Funny Video: ఫన్నీ వీడియో షేర్ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు..వెంకటేష్ మూవీ డైలాగ్‌తో మీమ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lava Blaze N2 5Gపై అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.15,999 ఫోన్ కేవలం రూ.649 లకే!
Hyderabad, Telangana:Lava Blaze N2 5g Price Cut: బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లతో కూడిన 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి అమెజాన్ ఒక బంపర్ ఆఫర్‌ను అందిస్తూ వస్తోంది.. ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava) నుంచి మార్కెట్లోకి వచ్చిన మోస్ట్ పాపులర్ మొబైల్ Lava Blaze N2 5G పై అమెజాన్ ఊహించని భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. లుక్, పర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టే ఈ ఫోన్‌ను ఇప్పుడు అత్యంత చౌక ధరకే సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశం లభిస్తోంది.. అయితే, దీనిపై ఉన్న స్పెషల్ ఆఫర్స్ ఏంటో, ఎక్చేంజ్ డిస్కౌంట్స్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భారీ ఫ్లాట్ డిస్కౌంట్..
ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మార్కెట్లో అసలు ధర (MRP) రూ. 15,999తో అందుబాటులో ఉంది. అయితే, ప్రస్తుతం అమెజాన్ నడుపుతున్న స్పెషల్ సేల్ ఆఫర్స్‌లో భాగంగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ.3,500 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో లావా బ్లేజ్ N2 5G స్మార్ట్‌ఫోన్ ధర ఒక్కసారిగా రూ. 12,499కే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పాటు ఎక్చేంజ్ బోనస్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
బ్యాంక్ ఆఫర్లతో అదనంగా మరో రూ. 1,000 డిస్కౌంట్..
ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు వినియోగదారులను ఆకర్షించేందుకు అమెజాన్ పలు ప్రముఖ బ్యాంకులకు సంబంధించి క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే భారీగా డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ముఖ్యంగా Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్, Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి పేమెంట్ పూర్తి చేస్తే.. వినియోగదారులకు అదనంగా రూ. 1,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీనితో ఈ ఫోన్ ధర మరింత తగ్గి.. బడ్జెట్ ధరలోకి వస్తుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఎక్స్ఛేంజ్ బోనస్ ధమాకా..
ఈ డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఏకంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల అమెజాన్ గరిష్టంగా రూ.11,850 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. ఒకవేళ మీరు అందించే పాత మొబైల్‌కు పూర్తి ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందితే.. అన్ని ఆఫర్లు పోను ఈ సరికొత్త Lava Blaze N2 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.649 లోపే మీ సొంతం చేసేకునే అవకాశం లభిస్తోంది.. అయితే, ఈ బోనస్ అనేది ఎక్చేంజ్ చేసే పాత స్మార్ట్‌ఫోన్ కండీషన్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Varanasi Storyline: 'వారణాసి' సినిమా స్టోరీ లీక్ చేసిన రాజమౌళి..రూ.3,000 కోట్లు పక్కా..మహేష్ ఫ్యాన్స్ సంబరాలు!
Hyderabad, Telangana:Varanasi Story Leaked: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వారణాసి'. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాజమౌళి అక్కడ జరిగిన ఒక అంతర్జాతీయ మీడియా ఇంట్రాక్షన్ లో ఈ సినిమాలు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయాలతో పాటు.. స్టోరీ లైన్ ను రివిల్ చేశారు.
సీక్వెల్స్ లేవు..
సాధారణంగా రాజమౌళి సినిమాలో అనగానే 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తరహాలో పార్ట్ టూ లేదా సీక్వెల్స్ ఉంటాయేమో అని అంతా భావించారు. కానీ జక్కన్న వహదారులకు బ్రేక్ వేశారు. మహేష్ బాబుతో తీస్తున్న ఈ సినిమాకి ఎలాంటి సీక్వెల్స్ గాని ఫ్రీక్వెల్స్ గాని ఉండవని.. ఇది కేవలం ఒకే ఒక స్టాండ్ అలోన్ చిత్రంగా మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.
అసలు కథ ఏంటంటే..?
ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి యాక్షన్ తో అల్లరించబోతున్నప్పటికీ.. ఈ స్టోరీ సోల్ మాత్రం పక్క ఇండియన్ ఎమోషన్ అని రాజమౌళి హింట్ ఇచ్చారు. సినిమా స్టోరీ లైన్ గురించి ఆయన మాట్లాడుతూ.. "ఆఫ్రికాలోని దట్టమైన అడవుల నుంచి అంటార్కిటికాలోని గడగట్టే చలి వరకు.. రామాయణంలోని దేవుళ్ళు, ప్రకృతి విపత్తులు, అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్.. ఇలా ఇవన్నీ ఒకే సినిమాలో ప్రేక్షకులు చూడబోతున్నారు. అయితే వారణాసి సినిమాకు అసలైన మూలం మాత్రం తండ్రీకొడుకుల మధ్య సాగే బలమైన ఎమోషన్. ఆ ఎమోషన్ నుంచి కథలోని మిగిలిన అడ్వెంచర్స్ అన్ని గుర్తుకొస్తాయి" అని ఆయన అన్నారు.
ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. వీరితో పాటు మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పవర్ఫుల్ విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజు మరో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బంధం ఇప్పటికే ప్రకటించేసింది.
మహేష్ ఫ్యాన్స్ ఖుషి..రూ.3000 కోట్లు కలెక్షన్లు పక్కా..
రాజమౌళి లిఫ్ట్ చేసిన ఈ స్టోరీ లైన్, రామాయణం రిఫరెన్సులు విన్న తర్వాత మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అడవులు, అంటార్కిటికా, ఫాంటసీ ఎలిమెంట్స్, తండ్రి కొడుకుల ఎమోషన్.. ఇవన్నీ కలిస్తే థియేటర్లలో పూనకాలే అని ఫిక్స్ అయిపోతున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులన్నింటికీ బద్దలు కొట్టడం ఖాయమని.. మినిమం రూ.3,000 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు రాబడుతుందని ఫాన్స్ ఇప్పటినుంచే సోషల్ మీడియాలో ట్రెండు చేస్తున్నారు.
Also Read: పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్..'ఓజీ యూనివర్స్' నుంచి మరో వీడియో రిలీజ్!
Also Read: 'ఇడుపు కాయితం' వివాదంపై నిర్మాత బన్నీవాసు.."తగ్గే ప్రసక్తే లేదు, నచ్చింది చేసుకోండి"
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
iQOO 15R: బడ్జెట్ ధరలోనే iQOO 15R ప్రీమియం ఫోన్.. అమెజాన్‌లో ఎగబడుతున్న జనాలు!
Hyderabad, Telangana:Iqoo 15r Price Drop On Amazon: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అమెజాన్ అదిరిపోయే శుభవార్త అందిస్తోంది. ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన లుక్స్‌తో మార్కెట్లోకి విడుదలైన iQOO 15R స్మార్ట్‌ఫోన్‌పై ప్రస్తుతం ఊహించని రేంజ్లో డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హై-ఎండ్ ఫీచర్లతో లభించే ఈ మొబైల్‌ను సొంతం చేసుకోవాలని చూస్తున్న టెక్ లవర్స్‌కు ఇది నిజంగా అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఎప్పుడూ లభించని విధంగా ఈ ఫోన్‌పై భారీ ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో పాటు అదనంగా భారీ ఎక్స్చేంజ్ బోనస్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటినీ ఉపయోగిస్తే.. ఈ ప్రీమియం ఫోన్‌ను అత్యంత చౌక ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే, దీనిపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రూ.53,990 ఫోన్.. ఇప్పుడు రూ.49,999 లోపే..
సాధారణంగా మార్కెట్లో iQOO 15R స్మార్ట్‌ఫోన్ అసలు ధర (MRP) రూ. 53,990తో అందుబాటులో ఉంది.. కానీ.. అమెజాన్ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ.3,991 వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది. ఎలాంటి కార్డ్‌తో పేమెంట్ చేయకుండానే నేరుగా ఈ తగ్గింపు అందుబాటులో ఉండడం విశేషం.. ఈ ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ధర రూ.49,999 లోపు బడ్జెట్‌కే కస్టమర్లకు అందుబాటులోకి వస్తోంది. ప్రీమియం విభాగంలో ఇంత మొత్తంలో తగ్గింపు లభించడం చాలా అరుదు..
బ్యాంక్ ఆఫర్లతో మరికొంత ఊరట..
అమెజాన్ కేవలం ఫ్లాట్ డిస్కౌంట్‌తోనే ఆగకుండానే... ఇప్పుడే కొనుగోలు చేసే కస్టమర్స్‌కి మరింత ఆకర్షించేందుకు ప్రముఖ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లపై అద్భుతమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు Amazon Pay ICICI, HDFC Bank, లేదా SBI Bank క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి పేమెంట్ చేస్తే, మీకు అదనంగా మరో రూ. 2,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దీనివల్ల ఫోన్ ధర మరింత తగ్గి.. సాధారణ ధరలకే తగ్గుతుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఎక్స్చేంజ్ ఆఫర్.. ఏకంగా రూ.35,900 బోనస్..
ఈ డీల్లోనే అత్యంత కీలకమైన ఆఫర్ ఏంటంటే.. ఎక్స్చేంజ్ బోనస్.. మీ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసేవారికి అదనంగా ఏకంగా రూ. 35,900 వరకు భారీ తగ్గింపును లభిస్తోంది.. మీ పాత ఫోన్ బ్రాండ్, దాని వర్కింగ్ కండిషన్ బాగుంటే గరిష్ట ఎక్స్చేంజ్ బోనస్ మీ సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్ ఇచ్చి.. కొత్త ఫోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది ఒక బంపర్ ఆఫర్.. ఈ రూ.35,900 ఎక్స్చేంజ్ బోనస్ అనేది పూర్తిగా మీరు ఎక్స్చేంజ్ చేసే పాత స్మార్ట్‌ఫోన్ మోడల్‌తో పాటు దాని కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. మీ పాత ఫోన్ స్క్రీన్ పగలకుండా.. ఎలాంటి స్క్రాచెస్ లేకుండా, మంచి వర్కింగ్ కండిషన్లో ఉంటేనే పూర్తిగా బోనస్ పొందవచ్చు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
జూలైలో బుధాదిత్య రాజయోగం.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, ఊహించని ధనలాభం!
Hyderabad, Telangana:Budhaditya Rajyoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులతో పాటు కలయికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాల కదలికల వల్ల మానవ జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో వచ్చే నెల జూలై నెలలో శక్తివంతమైన గ్రహాల కలయిక జరగబోతోంది. నవగ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు, బుద్ధికారకుడైన బుధుడు ఒకే రాశిలో కలవడం వల్ల అత్యంత పవిత్రమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ముఖ్యంగా ఒక 4 రాశుల వారికి ఈ సమయం అద్భుతంగా ఉండబోతోంది. ఈ సమయంలో అపారమైన ధనలాభంతో పాటు జీవితంలో వారు అనుకున్న పనులు నెరవేరే అవకాశాలు లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో అదృష్టాన్ని పొందే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేష రాశి:
మేష రాశి వారికి ఈ సూర్య-బుధ కలయిక అత్యంత లాభదాయకంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడుల నుంచి ఊహించని రీతిలో లాభాలు కలుగుతాయి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈ నెలలో సజావుగా సాగిపోతాయి.. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగుపడతాయి.
మిథున రాశి:
మిథున రాశి వారికి జూలై నెల ఒక వరంగా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సూర్యుడితో పాటు బుధుడి అనుగ్రహం వల్ల మీ ఆలోచనా విధానంలో సానుకూల మార్పులు వస్తాయి. కార్యాలయంలో మీ పనితీరుకు పైఅధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు కలుగుతాయి.. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు
సింహ రాశి:
సింహ రాశికి అధిపతి సూర్యుడు కావడం వల్ల.. ఈ రాశి వారికి శక్తివంతమైన యోగం కారణంగా అఖండమైన విజయాలు లభించబోతున్నాయి.. ఆర్థికంగా వీరికి ఉన్న ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. పాత అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో పెద్దల సపోర్ట్ కూడా సులభంగా లభిస్తుంది. మీరు తీసుకునే సరైన నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేయాలనే మీ కళ నెరవేరుతుంది.
తుల రాశి:
తుల రాశి వారికి ఈ సమయంలో అదృష్టం పూర్తిగా సహకరిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీరు ఏ పని చేపట్టినా అందులో అద్భుతమైన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి బోలెడు లాభాలు కలుగుతాయి.. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. ఈ సమయంలో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి.. బంధం మరింత బలపడుతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Telangana Folk Song: YouTubeను షేక్ చేస్తున్న తెలంగాణ Folk Song.. ప్రతి పెళ్లిలోనూ ఈ డిజె పాటే హైలైట్.. ఎంత క్రేజ్ అంటే..!!
Secunderabad, Telangana:Telangana Folk Song: బాసింగ బాసింగ బలాలే భలేగున్నాయే..
చేతుల జిలకర బెల్లాలే కలిసున్నాయే..!!
ఈ పోరడి నిలువెత్తు ప్రాణాలే నాలో ఉన్నాయే..
శ్రావణ మాసపు బలాలే సై అన్నాయే..!!
బాసింగ బాసింగ బంగారు బొమ్మలే..
చూసినోళ్ల కళ్లల్లో నీ వెంట పరుగులే..
ఈ జన్మలోనా జీవితమే పండుగలే..!!
అటో డజాను.. ఇటో డజాను..
గాజులు వేపిస్తా పిల్ల..
నీ నుదిటిన బాసింగం కట్టి..
నా ఇంటికి తీసుకెళ్తా పిల్ల..!!
పెళ్లి పందిట్లోన పెండ్లి కొడుకై నేను కూర్చుంటే..
నా పక్కన చేరి సిగ్గుల మొగ్గవు నువ్వవుతుంటే..
ఈడు జోడు కలిసిన వేళా..
మన బంధం గట్టిపడతా ఉంటే..
వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్లు వేస్తుంటే..!!
బాసింగ బాసింగ బలాలే భలేగున్నాయే..
చేతుల జిలకర బెల్లాలే కలిసున్నాయే..!!
తెలంగాణ అంటేనే ఫోక్ సాంగ్స్.. ఫోక్ సాంగ్స్ అంటేనే తెలంగాణ. ఎప్పటికప్పుడు సరికొత్తగా వచ్చే తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో యూట్యూబ్ షేక్ అవుతూనే ఉంటుంది. ఇప్పటికే వందలాది పాటలు ఓ రేంజ్ లో దుమ్ముదురేపాయి. కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ పెళ్లి పాట మాత్రం కొన్నేండ్ల వరకు యాదికుంటుంది. ఈ పాట విడుదలైన రెండు రోజుల్లోనే యూట్యూబ్ ను షేక్ చేసిందంటే.. ఈ పాటకున్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఈ పాట చూస్తున్నంత సేపు నిజంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పెళ్లి కబర్లు చెబుతున్నట్లుగానే అనిపిస్తుంది.
తెలంగాణ బీట్ తో ఈ పాట మొదలవుతుంది. ఆ బీట్ లో ఎంగేజ్ మెంట్, తర్వాత పెళ్లికి సంబంధించి ఒక్కో ఘట్టాన్ని ఎంతో అద్బుతంగా చూపించారు. అటో డజను.. ఇటో డజను గాజులు తొడుగుతుండగా అనే లిరిక్స్ నిజంగా ప్రతి అక్క చెల్లెమ్మ గుండెలకు అతుక్కుపోయింది. నుదిటికి పెళ్లి బాసింగాలే.. అనే లైన్ ప్రతిఒక్కరి పెళ్లి రోజులు గుర్తుకు తెస్తుంది. ఆ మ్యూజిక్ వింటుంటే మనం కూడా ఎగిరిగంతేయ్యాలనిపిస్తుంది.
ఇక ఇప్పుడు ఈ పాట ఇన్ స్ట్రాగ్రామ్ లోనూ దుమ్ములేపుతోంది. ఎవరూ చూసిన అటో డజాను.. ఇటో డజాను.. గాజులు వేపిస్తా పిల్ల..నీ నుదిటిన బాసింగం కట్టి.. నా ఇంటికి తీసుకెళ్తా పిల్ల..!! బాసింగ బాసింగ బలాలే భలేగున్నాయే..అంటూ స్టెప్పులు వేస్తూ అదరగొడుతున్నారు. ఒక్క పాటలో తెలంగాణ ట్రెడిషన్ అంతా చూపించారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట్లోట్రెండింగ్గా మారింది. స్వామినరేశ్, శ్రీనిధి నెరెళ్ల పాడిన ఈ పాట..నిజంగా మనస్సును హత్తుకుంది. కల్యాణ్ కీస్ మ్యూజిక్ ఈ పాటకు హైలైట్ గా నిలిచింది.
తెలంగాణ లగ్గం, పసుపులు ముట్టడం, మంగళ స్నానాలు, తలంబ్రాల ముచ్చట్లను కళ్లకు కట్టినట్లు చూపించింది ఈపాట. ఈ మాస్ జానపద గీతం సోషల్ మీడియాలో రీల్స్ తో దుమ్మురేపుతోంది.
Also Read: 4 నెలల్లో 49వేలు తగ్గిన పసిడి.. చైనా తీసుకోబోయే ఈ నిర్ణయంతో త్వరలో మరింత పతనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
EPFO 3.0 UPI-ATM: PF ఖాతాదారులు ATM నుండి ఎంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు? అర్హులు ఎవరు?
Secunderabad, Telangana:EPFO 3.0 UPI-ATM: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. ఈపీఎఫ్ 3.0ను త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ డిజిటల్ అప్ గ్రేడ్ ద్వారా సభ్యులు యూపీఐ, ఏటీఎంల ద్వారా తమ పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ నెల జూన్ ఆఖరులోగా ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఈపీఎఫ్ఓ 3.0 కింద యూపీఐ లేదా ఏటీఎం ద్వారా ఎంత డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.. ఏటీఎం విత్ డ్రాయల్స్ కోసం కార్డు అవసరమా ఇలాంటి ప్రశ్నలు చాలా మంది సభ్యుల్లో తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.
యూపీఐ, ఏటీఎం ట్రాన్సాక్షన్స్ వేర్వేరు విత్ డ్రాయల్ లిమిట్స్ ను ఈపీఎఫ్ఓ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈపీఎఫ్ఓ 3.0 కింద ప్రస్తుత ఈపీఎఫ్ విత్ డ్రాయల్ నిబంధనలను మార్చేందుకు ఎలాంటి సూచన చేయలేదు. అందుకే వినియోగదారులు విత్ డ్రాయల్ లిమిట్స్ కు సంబంధించి ఇప్పటికే నిబంధనలను పాటిస్తున్నారు.
ఎంత విత్ డ్రా చేసుకునే ఛాన్స్:
ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం అర్హులైన కస్టమర్లు విత్ డ్రా ఉద్దేశం, అర్హత ప్రమాణాలను బట్టి యూపీఐ లేదా ఏటీఎం ద్వారా తమ పీఎఫ్ బ్యాలెన్స్ లో 75శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ కొత్త సదుపాయంతో అందుబాటులో ఉన్న ఈపీఎఫ్ బ్యాలెన్స్ లో 75శాతం వరకు నేరుగా కస్టమర్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ కు వెంటనే ట్రాన్స్ ఫర్ చేయవచ్చని పలు నివేదికలు ఇప్పటికే పేర్కొన్నాయి.
యూపీఐ, ఏటీఎం ద్వారా డబ్బు విత్ డ్రా:
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో కొత్త విత్ డ్రాయల్ విధానాన్ని అప్ డేట్ చేస్తున్నారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఈ ఫీచర్ టెస్టింగ్ పూర్తయ్యింది. కొన్ని రోజుల్లోనే అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా త్వరలోనే దీని గురించి అధికారికంగా ప్రకటన చేస్తామని సూచించారు.
యూపీఐ నుంచి నిధులు విత్ డ్రా చేసుకునే ముందు మీరు మీ ఆధార్ ఆధారిత ఓటీపీని ధ్రువీకరించాలి. ఆ తర్వాత ఆటోమేటిక్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఫలితంగా డబ్బు వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అవుతుంది. దీంతో ట్రాన్సాక్షన్స్ వేగవంతం అవుతాయి. అయితే గతంలో ఈ ప్రాసెస్ కు ఎక్కువ సమయం పట్టేది.
Also Read: NPS ఖాతాదారులకు గుడ్ న్యూస్..5 నిమిషాల్లో దరఖాస్తు చేసుకోండి..3 రోజుల్లోపు డిపాజిట్
త్వరలోనే ఏటీఎం కార్డులు కూడా జారీ:
సాధారణ డెబిట్ కార్డు మాదిరిగానే యూజర్లు తమ డబ్బును నేరుగా ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునేందుకు పీఎఫ్ అనుసంధానిత ఏటీఎం కార్డులను కూడా ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టనుంది. సభ్యులు తమ రిటైర్మెంట్ పొందుపు పూర్తిగా అయిపోకుండా ఉండేందుకు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్ లో కనీసం 25శాతం మెయింటన్ చేయాలి.
అర్హులు ఎవరు?
కొత్త రూల్స్ ప్రకారం డబ్బు విత్ డ్రాయల్ సౌకర్యాలు పొందేందుకు ఆధార్ తో అనుసంధానం చేసిన యాక్టివ్ యూఏఎన్ అప్ డేట్ చేసిన పాన్ వివరాలు, సరైనా ఐఎఫ్ఎస్ సీ కోడ్ తో ధ్రువీకరించిన బ్యాంక్ అకౌంట్, ఓటీపీ ఆధారిత ప్రమాణీకరణ కోసం రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ అవసరం ఉంటుంది.
Also Read: 4 నెలల్లో 49వేలు తగ్గిన పసిడి.. చైనా తీసుకోబోయే ఈ నిర్ణయంతో త్వరలో మరింత పతనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
నిన్న శ్రీకాళహస్తి.. నేడు తిరుమలలో కీర్తి సురేశ్
Dharmavaram, Andhra Pradesh:Keerthi Suresh Visits Tirumala Temple With VIP Break Darshanప్రభుత్వ ఉద్యోగులకు 'ఆరోగ్యమస్తు'.. జూలై 15వ తేదీన కొత్త ఆరోగ్య పథకం
Hyderabad, Telangana:Employees New Health Scheme: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి ఆరోగ్యం అందించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు నిండు ఆరోగ్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రారంభించింది. ఉద్యోగ సంఘాలతో చర్చలు, సంప్రదింపులు చేసిన అనంతరం వారి అభిప్రాయాలు తీసుకున్న ప్రభుత్వం కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రారంభించబోతున్నది. జూలై 15వ తేదీన ఉద్యోగులకు కానుక అందించనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్య పథకానికి సంబంధించి ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్టు సమావేశమైంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్త ఆరోగ్య పథకం ప్రారంభానికి ముహూర్తం నిర్ణయం తీసుకుంది. జూలై 15వ తేదీ నుంచి నూతన ఆరోగ్య పథకం ప్రారంభిస్తామని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో సమగ్రమైన నిబంధనలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్యాకేజీ రేట్లు, ఆస్పత్రుల జాబితాను వచ్చే సమావేశంలో ఖరారు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
భార్యాభర్తల్లో ఒకరి నుంచి మాత్రమే చందా మినహాయింపు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో హాస్పిటల్ యాజమాన్య ప్రతినిధులతో ఆరోగ్య శాఖ అధికారులు, ట్రస్ట్ సభ్యుల సమావేశం కానుంది. ఈ సమావేశం అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నాక కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రారంభం చేయనున్నారు. తమ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త ఆరోగ్య పథకం ఎలా ఉంటుందనేది ఇప్పటివరకు ఉద్యోగులకు ఒక స్పష్టత రాలేదు.
Ireland Vs India: ఐర్లాండ్‌పై ఓటమి తర్వాత కోచ్ కీలక నిర్ణయం..రేపు జరిగే మ్యాచ్‌లో టీమ్ఇండియాలో కీలక మార్పులు!
Hyderabad, Telangana:Ireland Vs India Playing 11: ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఎదురైన ఊహించని పరాజయం తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ అప్రమత్తమైంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో నిలవాలంటే శనివారం జరగబోయే రెండో మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తుది జట్టులో మూడు కీలక మార్పులు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
భారత జట్టులో జరగబోయే ఆ 3 మార్పుల వివరాలు ఇవేనా?
ప్రసిద్ధ్ కృష్ణపై వేటు..
తొలి మ్యాచ్‌లో భారత బౌలింగ్ దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్నాడు. డెత్ ఓవర్లలో పరుగులను నియంత్రించడంలో విఫలమవ్వడంతో, రెండో మ్యాచ్‌లో అతడిని పక్కనబెట్టి బెంచ్‌పై ఉన్న మరో ప్రతిభావంతుడైన యువ ఫాస్ట్ బౌలర్‌కు అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
వాషింగ్టన్ సుందర్ ఔట్?
గత మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌గా నిరాశపరిచిన వాషింగ్టన్ సుందర్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది. తొలి వన్డేలో కేవలం ఒకే ఒక్క ఓవర్ వేసి 19 పరుగులు ఇచ్చిన సుందర్, బ్యాటింగ్‌లోనూ రాణించలేకపోయాడు. దీంతో స్పిన్ విభాగంతో పాటు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌ను బలోపేతం చేసేందుకు అతడి స్థానంలో మరో సమర్థుడైన ఆల్‌రౌండర్‌ను బరిలోకి దించనున్నారు.
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ?
భారత బ్యాటింగ్ ఆర్డర్‌కు మరింత దూకుడును జోడించేందుకు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. పవర్‌ప్లేలో వేగంగా పరుగులు రాబట్టగల సూర్యవంశీని జట్టులోకి తీసుకుంటే, భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది పడుతుందని కెప్టెన్, కోచ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: టీ20 ప్రపంచకప్‌లో దూసుకోపోతున్న భారత్..5 వికెట్ల తేడాతో బంగ్లాను మట్టికరిపించింది!
Also Read: వన్డే జట్టులో ఎట్టకేలకు విరాట్ కోహ్లీ ఆగమనం..కానీ, ఆ పని చేస్తేనే ఆడే ఛాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
మాజీ మంత్రులకు భారీ షాక్! తెలంగాణలో 100 మంది వీఐపీలకు సెక్యూరిటీ తగ్గింపు
Hyderabad, Telangana:Security Withdraw To RS Praveen Kumar: తెలంగాణలో రాజకీయ నాయకులకు భారీ షాక్ తగిలింది. మాజీ ప్రజాప్రతినిధులకు భారీ షాక్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతోపాటు మాజీ అధికారులు భద్రతా కుదించినట్లు సమాచారం. మొత్తం 100 మంది వీఐపీలకు భద్రత తొలగించడం.. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధుల భద్రతకు సంబంధించి కొత్త నిబంధనలు జూలై 1వ తేదీ నుంచి అమలవుతాయని చర్చ జరుగుతోంది.
కొత్త నిబంధనలు
తెలంగాణలో 100 మంది వీఐపీలకు సెక్యూరిటీ తగ్గించారని విశ్వసనీయ సమాచారం. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు వస్తాయని వాటిలో భాగంగా బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, గన్మెన్ల ఉపసంహరణ ఉంటుందని తెలుస్తోంది. కొత్త నిబంధనల్లో భాగంగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీల సెక్యూరిటీ తగ్గించే అవకాశం ఉంది. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు, నక్సల్స్ ముప్పు పూర్తిగా అదుపులోకి రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల హెచ్చరికలు, తమ ప్రాణానికి ముప్పు ఉందని భావించిన ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇన్నాళ్లూ వివిధ రంగాల ప్రముఖులకు, రాజకీయ నాయకులకు అందిస్తున్న అదనపు భద్రతను భారీగా తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కుదింపు
ఈ క్రమంలో ఐపీఎస్ మాజీ అధికారి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ప్రభుత్వం భద్రత కుదించింది. సెక్యూరిటీతోపాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులకు వాహనం తగ్గించడంతోపాటు గన్మెన్ల ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్, హరీశ్ రావుతోపాటు కీలక నాయకులు తప్పుబడుతున్నాయి.
భద్రత ఉపసంహరణ
తమ పార్టీ నాయకులు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రతా కుదించడాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. భద్రత ఉపసంహరించుకోవడాన్ని ఖండిస్తూ కీలక ప్రకటన చేశారు. '25 సంవత్సరాల పాటు ఐపీఎస్ అధికారిగా దేశానికి, సుమారు దశాబ్దం పాటు గురుకుల విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థుల విద్యకు ఎన్నో సేవలందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత తగ్గించడం పూర్తిగా కక్షసాధింపు చర్యే' అని స్పష్టం చేశారు.
కేటీఆర్ ఆగ్రహం
'రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రతా తగ్గిస్తూ ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది. ఇప్పటికే పలుమార్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై హత్యాయత్నాలు జరిగాయని.. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన స్వయంగా వెల్లడించినప్పటికీ కావాలనే భద్రతను తగ్గించడం వెనుక కుట్ర దాగి ఉంది' అని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలను మానుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు వెంటనే భద్రతను పునరుద్ధరించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తులు.. వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి బుకింగ్ రద్దు!
Tirupati Urban, Andhra Pradesh:VIP Break Darshan: వేసవి సెలవులు ముగియడం.. వేసవికాలం పూర్తయినా కూడా తిరుమల ఆలయానికి భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వారాంతం కావడంతో ఒక్కసారిగా శనివారం భక్తుల రద్దీ తిరుమలలో పెరిగింది. అనూహ్యంగా భక్తులు పెరగడంతో తిరుమల ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. వరుసగా సెలవులు రావడంతో భక్తుల సంఖ్య పెరిగిందని టీటీడీ అధికారులు అంచనా వేశారు. స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతుండడంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి కరెంట్ బుకింగ్‌ను రద్దు చేశారు.
తిరుమలలో శనివారం అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనంతోపాటు శ్రీవాణి దర్శనాల కరెంట్ బుకింగ్‌ను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రద్దు చేసింది. ఈ కారణంగా సుమారు 7 కిలోమీటర్ల వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ప్రకటన చేసింది. సోమవారం శ్రీవాణి కరెంట్ బుకింగ్ దర్శన టికెట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రత్యేక దర్శనం రద్దు
వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి కరెంట్ బుకింగ్ దర్శనం రద్దుతో అధిక మంది భక్తులకు దర్శనం కల్పించేందుకే నిర్ణయం తీసుకుంది. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండాయి. ప్రస్తుతం బాలాజీ నగర్ వద్దకు భక్తుల క్యూలైన్లు చేరుకున్నాయి. రేపు, ఎల్లుండి తిరుమలకు మరింత మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం అవకాశం ఉండడంతో టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ సీనియర్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల ప్రణాళికను పునః సమీక్షించుకోవాలని ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
స్వామి సేవలో కీర్తి సురేశ్
తిరుమల వేంకటేశ్వర స్వామిని శనివారం ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆమెకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీఐపీ విరామ సమయంలో ఆమె శ్రీవారి దివ్య దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, జ్ఞాపిక అందజేశారు. తిరుమలకు వచ్చిన ఆమె అభిమానులు కీర్తి సురేష్‌ను చూసేందుకు ఆసక్తి చూపారు. ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారు.
నిన్న ఆలయంలో రద్దీ
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగింది. వైకుంఠంలోని వేచి ఉన్న 27 కంపార్ట్మెంట్ల వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 28-24 గంటల సమయం పట్టగా.. టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) టోకెన్లు కలిగిన భక్తులకు 18- 24 గంటల సమయం దర్శనానికి పట్టింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2-5 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 81,340 మంది భక్తులు దర్శించుకోగా.. తలనీలాలు 44,874 మంది భక్తులు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చింది.
