మెహిదిపట్నం లోని చోరీ కు యత్నం, కూలీలు పట్టుకొని దేహ శుద్ధి చేయడం తో తీవ్ర గాయాలతో మృతి చెందిన దొంగ
Hyderabad, Telangana:హైదరాబాద్.అసిఫ్ నగర్ పి.యస్ పరిధిలోని ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నిర్మాణం ఉన్న భవవంలో యువకుల వద్ద ఉన్న సెల్ ఫోన్లను ఓ వ్యక్తి చోరీ చేసేందుకు యత్నించాడు. అక్కడ పనిచేసే కూలీలు ఆ దొంగను పట్టుకున్ని కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఆ దొంగకు తీవ్ర గాయాలయ్యాయి.. ఆ దొంగను ఆసుపత్రికి తీసుకెళ్ళుతున్న సమయంలో అతడు చనిపోయాడు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
August New Rules: సామాన్యులకు పిడుగు లాంటి వార్త..ఆగస్టు 1 నుంచి భారీగా పెరగనున్న ధరలు!
Hyderabad, Telangana:August New Rules 2026: ఆగస్టు నెల ప్రారంభంతో సామాన్యులపై ద్రవ్యోల్బణం భారం మరింత పెరగనుంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడిసరుకుల ధరల పెరుగుదల, రవాణా ఛార్జీల భారం, రూపాయి విలువ పతనం వంటి కారణాల వల్ల వివిధ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు నిర్ణయించాయి. ఈ ఏడాది వివిధ వినియోగ వస్తువుల ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం విశేషం.
ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి?
ఆగస్టు నుంచి ప్యాక్ చేసిన టీ, హెయిర్ ఆయిల్ (తల నూనె), రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు (టీవీలు), రెడీమేడ్ దుస్తులు, ప్రయాగ వాహనాల ధరలు సుమారు 4 శాతం నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. పండుగ సీజన్ ప్రారంభానికి ముందు ఇదే చివరి ధరల పెంపు కావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆటోమొబైల్ రంగంపై ప్రభావం..
దేశీయ కార్ల మార్కెట్‌పై ధరల పెంపు ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. మారుతి సుజుకి కార్లపై ఆగస్టు నుంచి కార్ల ధరలను రూ.15,000 నుంచి రూ.30,000 వరకు పెంచనుంది. అలాగే హోండా ఇండియా కార్లపై ఆగస్టు 1 నుంచి ధరలు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీ కార్ల ధరలను పెంచగా.. మెర్సిడెస్-బెంజ్ ఇండియా కంపెనీ వచ్చే త్రైమాసికంలో ధరల పెంపు ఉండబోతుందని అంచనా వేస్తుంది.
ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసిజి ఉత్పత్తులు..
మెమరీ చిప్‌ల ధరల పెరుగుదల, సరఫరా సమస్యలు, దిగుమతి వ్యయాల కారణంగా టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర గృహోపకరణాల ధరలను ఎలక్ట్రానిక్స్ కంపెనీలు 4% నుంచి 6% మేర పెంచనున్నాయి. మరోవైపు, పెట్రోలియం ఆధారిత ప్యాకేజింగ్ మెటీరియల్స్, వంట నూనెలు, ముడి పదార్థాల భారం కారణంగా ఎఫ్ఎంసిజి (FMCG) కంపెనీలు కూడా ఉత్పత్తి వ్యయాల పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు..
పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా గొలుసు దెబ్బతినడం వల్ల సముద్ర రవాణా ఛార్జీలు, ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. రూపాయి మారకం విలువ పడిపోవడంతో దిగుమతులు మరింత ప్రియంగా మారాయి. పెరిగిన ఉత్పాదక వ్యయాల భారాన్ని కంపెనీలు చివరికి చిల్లర ధరల రూపంలో వినియోగదారులపై మోపుతున్నాయి.
పండుగ సీజన్‌పై అంచనాలు..
ఆగస్టు తర్వాత ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉండదని కంపెనీలు భావిస్తున్నాయి. ఓనంతో ప్రారంభమయ్యే రాబోయే పండుగ సీజన్లో వినియోగదారుల నుంచి డిమాండ్ బలంగా ఉంటుందని, మార్కెట్‌పై దీని ప్రభావం పరిమితంగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also REad: ఆగస్టులో విద్యార్థులకు పండగే పండగ..ఏకంగా వారం రోజులకు పైగా సెలవులు!
Also Read: E20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుందా? రాజ్యసభలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
శ్రావణ మాసంలో ఈ రాశులవారికి శని ఎఫెక్ట్.. వీరికి రాజయోగం.. కోరుకున్న కోరికలు నెరవేరే కాలం!
Hyderabad, Telangana:Shravana Masam Shani Effect: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం మొదలైంది.. ఈ మాసంలో కర్మఫలదాత అయిన శని దేవుడు మీన రాశిలో వక్ర మార్గంలో సంచారం కొనసాగిస్తున్నాడు.. శనిభగవానుడి ఈ వక్ర స్థితి 2026 డిసెంబర్ వరకు కొనసాగనుంది. శ్రావణ మాసంలో శనిదేవుని ఈ ప్రత్యేక కదలికలు మొత్తం 12 రాశుల వారి కెరీర్, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడబోతోంది. ముఖ్యంగా కొందరికి ఇది సువర్ణ అవకాశాలను తెచ్చిపెడితే.. మరికొందరికి సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే శని అనుగ్రహం వల్ల జీవితంలో అనుకున్న పనులు సులభంగా చేస్తారు. ముఖ్యంగా 12 రాశుల వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి లాభాలే, లాభాలు:
మేష రాశి:
శ్రావణ మాసం మేష రాశి వారికి అత్యంత శుభప్రదమైనదిగా భావించవచ్చు.. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మంచి అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయి. నాయకత్వలో ఉన్నవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.
వృషభ రాశి:
ఆర్థికంగా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది.. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రయాణాలు చేయాలనుకుంటున్నవారికి దిమ్మతిరిగే ధన లాభాలు కూడా కలుగుతాయి. అయితే, అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది..
సింహ రాశి:
శని దేవుని అనుగ్రహంతో సింహ రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆఫీసులో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
మకర రాశి:
వ్యాపారంలో కొత్త, లాభదాయకమైన ఒప్పందాలు ఖరారవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్లో పురోగతి లభించడమే కాకుండా అనుకున్న పనుల్లో దిమ్మతిరిగే ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. కుటుంబ సంబంధాలు మరింత బలపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
కర్కాటక రాశి:
ఈ సమయంలో కర్కాటక రాశివారికి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ.. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మేలు..
మిథున రాశి:
మిథున రాశివారికి ఈ సమయం ఎంతో లాభదాయంగా ఉంటుంది. విజయం సాధించడానికి సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి ఉన్నప్పటికీ జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు సొంతం చేసుకుంటారు.. తొందరపాటు నిర్ణయాల వల్ల చిక్కులు రావచ్చు.. ఓర్పు వహించడం చాలా ముఖ్యం.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Bhogapuram Airport Credit: టీడీపీ Vs వైసీపీ.. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం వేళ క్రెడిట్ రాజకీయాలు..ఎవరు ఎంత చేశారంటే?
Gudepuvalasa, Andhra Pradesh:Bhogapuram Airport Credit War: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం వేళ క్రెడిట్ ఎవరిదనే చర్చపై రాజకీయ వర్గాలలో, సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత దశాబ్ద కాలంగా ప్రాజెక్ట్ వెనుక జరిగిన పరిణామాలు, రికార్డుల్లో ఉన్న వాస్తవాలు పరిశీలిస్తే పరిస్థితి స్పష్టమవుతుంది.
ప్రాజెక్ట్ ప్రయాణం - వాస్తవాల రూపంలో...
భూసేకరణ వివాదాలు: అవసరానికి మించి దాదాపు 5,000 ఎకరాలకు పైగా భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేయడం, స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఆందోళనలకు అప్పట్లో ప్రతిపక్షం (వైసీపీ) మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రజాపోరాటాల ఫలితంగా భూమి పరిమితిని సుమారు 3,000 ఎకరాలకు కుదించారు.
మొదటి వేలం, మార్పులు
ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తొలుత వేలం నిర్వహించగా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) బిడ్డు గెలుచుకుంది. అయితే అప్పట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు హయాంలో ఆ వేలాన్ని రద్దు చేసి, నిబంధనలను సవరించి తిరిగి వేలం నిర్వహించి GMR సంస్థకు అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇందులో నిజమెంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికే తెలియాలి.
ప్రభుత్వాల మారడంతో జాప్యం
ఆ తర్వాత కాలంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు కొంతకాలం ఆగిపోవడం, కాకినాడ SEZలో GMR వాటాలు అరబిందోకు బదిలీ కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2014లో భూసేకరణ ప్రారంభమైన అనేక అవాంతరాల తర్వాత ఓ కొలిక్కి వచ్చింది. అయితే 2019-2024 మధ్య విమానాశ్రయ పనులు మందకొడిగా సాగాయి.
పునఃప్రారంభం వేగం
ఆ తర్వాత 2024లో పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులను వేగవంతం చేశారు. ఉత్తరాంధ్రలో కలికితురాయిగా ఉండాలని.. రాష్ట్ర ప్రభుత్వం కనెక్టింగ్ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించింది.
చివరిగా.. భోగాపురం ప్రాజెక్ట్ అనేది ఒక రోజూ, ఒక ప్రభుత్వ హయాంలో పూర్తయింది కాదు. అనేక రాజకీయ పరిణామాలు, ప్రభుత్వాల మార్పులు, న్యాయపరమైన, ఆర్థిక ఒప్పందాల నేపథ్యంలో దశాబ్ద కాలంగా సాగిన ప్రక్రియ ఇది. ప్రాజెక్ట్ నిర్మాణంలో వాస్తవ పనులు దక్కించుకుని పూర్తి చేసిన ఘనత మాత్రం పూర్తిగా GMR (జీఎంఆర్) సంస్థకే దక్కుతుంది.
Also Read: భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభం..పూర్తి షెడ్యూల్ ఇదే!
Also Read: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సానికి ఏర్పాట్లు పూర్తి..ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
కమర్షియల్ ఎల్పీజీ యూజర్లకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన సిలిండర్ ధరలు!
Lakshmapur, Telangana:LPG Cylinder Price Cut: దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార వర్గానికి, హోటళ్లకు, రెస్టారెంట్లకు, క్యాటరింగ్ ఆపరేటర్లకు ఉపశమనం కల్పిస్తూ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ ధరల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. నెలవారీ సవరణలలో భాగంగా, ఆగస్టు 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చేలా వాణిజ్య (19 కేజీల) ఎల్పీజీ సిలిండర్ల ధరలో గణనీయమైన తగ్గింపును ప్రకటించాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సంఘర్షణల నేపథ్యంలో, గతంలో పెరుగుతూ వచ్చిన సిలిండర్ ధరలు ఇప్పుడు వ్యాపార రంగానికి గణనీయమైన ఉపశమనాన్ని కలిగించాయి.
వివిధ నగరాల్లో సిలిండర్ ధరలలో భారీ తగ్గింపు:
తాజా సవరణ ప్రకారం, జాతీయ రాజధాని ఢిల్లీ నుండి కోల్‌కతా వరకు వాణిజ్య సిలిండర్ ధరలు మారాయి. ఢిల్లీలో, 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర సుమారుగా రూ.192 తగ్గి రూ.202కు చేరింది. అదేవిధంగా, కోల్‌కతాలో ధర రూ.209మేర తగ్గడం విశేషమని చెప్పాలి. ఈ తాజా తగ్గింపుతో, కోల్‌కతాలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ 2,872.50కు తగ్గింది. నిజానికి, జూలై 1వ తేదీన వాణిజ్య సిలిండర్ల ధరను కూడా రూ.183.50 తగ్గించారు. ఈ తగ్గింపు వరుసగా రెండో నెల కూడా కొనసాగుతూ, వ్యాపారులకు గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తోంది. రెండు నెలల్లోనే ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ల ధర మొత్తం రూ.375.50 తగ్గింది.
గృహ వినియోగదారులకు ఉపశమనం లేదు
వాణిజ్య సిలిండర్ల ధరలు గణనీయంగా తగ్గి వ్యాపార వర్గానికి ప్రయోజనం చేకూర్చగా, సాధారణ గృహ వినియోగదారులకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. మన ఇళ్లలో వంటకు ఉపయోగించే 14.2 కేజీల గృహ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. గృహ సిలిండర్ల ధరలు పాత ధరల వద్దే స్థిరంగా ఉన్నందున, ఈ ధరల తగ్గింపు వర్తిస్తే తమకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని మధ్యతరగతి కుటుంబాలు ఆశిస్తున్నాయి.
Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి
Also Read: ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా
Also Read: ఆ పరిచయమే కొంపముంచిందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభం..పూర్తి షెడ్యూల్ ఇదే!
Gudepuvalasa, Andhra Pradesh:Bhogapuram Airport Air India Services: దేశీయ విమానయాన రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ అత్యాధునిక ఎయిర్‌పోర్టును ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ చారిత్రాత్మక తరుణంలో, ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ముందుకు వచ్చింది. భోగాపురం నుంచి ఆగస్టు 17 నుంచి విమాన రాకపోకలు ప్రారంభంకానున్నట్లు వెల్లడించిన సంస్థ, ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అక్టోబర్ 24 వరకు తాజాగా విడుదల చేసింది.
విమానయాన రాకపోకలకు సంబంధించి ఎయిర్ ఇండియా ప్రకటించిన వివిధ నగరాల సర్వీసుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వాటి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ - భోగాపురం రూట్
తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్ నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అత్యధిక సర్వీసులను కేటాయించారు. ఈ మార్గంలో ప్రతిరోజూ నిరంతరం 5 సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. దీనివల్ల వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులకు రాకపోకలు ఎంతో సులభతరం కానున్నాయి.
బెంగళూరు - భోగాపురం రూట్
ఐటీ హబ్ బెంగళూరు నుంచి భోగాపురానికి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ మార్గంలో నిత్యం 2 సర్వీసులు రెగ్యులర్‌గా నడుస్తాయి. అయితే, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రోజులను దృష్టిలో ఉంచుకుని ఆది, శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు అదనంగా మరో సర్వీసును నడపనున్నట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. తద్వారా ఈ మార్గంలో కొన్ని రోజులు మొత్తం 3 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
విజయవాడ - భోగాపురం రూట్
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన విజయవాడ నుంచి భోగాపురం మధ్య కూడా విమాన సర్వీసులు భారీగా ఉండనున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించేలా రోజుకు 4 సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా తెలియజేసింది.
ప్రయాణికులకు ముఖ్య గమనిక
విమానాశ్రయ ప్రారంభోత్సవం అనంతరం ఆగస్టు 17 నుంచి విమానాలు టేకాఫ్ తీసుకోనున్నాయి. అక్టోబర్ 24 వరకు వర్తించే ఈ తాజా షెడ్యూల్‌ను ప్రయాణికులు అందరూ విధిగా గమనించాలని కోరడమైనది. టికెట్ల బుకింగ్, సమయాల్లోని మార్పులు వంటి ఇతర పూర్తి వివరాల కోసం ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్ లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించవచ్చు. ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక, పర్యాటక అభివృద్దికి ఈ ఎయిర్‌పోర్టు ఒక మైలురాయిగా నిలవనుందని విమానయాన నిపుణులు భావిస్తున్నారు.
Also Read: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సానికి ఏర్పాట్లు పూర్తి..ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే!
Also Read: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ముసాయిదా విడుదల..44 లక్షల ఓట్ల తొలగింపు..మీ పేరు ఉందా చూడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతం..నీరజ్ చోప్రాకు రజతం.. యశ్వీర్ సింగ్‌కు కాంస్య పతకం
Hyderabad, Telangana:Commonwealth Games 2026 Javelin Throw: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు మరోసారి సత్తా చాటారు. శుక్రవారం రాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో ఇద్దరు భారత ఆటగాళ్లు పతకాలు సాధించారు. ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు రజతం.. అలాగే యువ కెరటం యుశ్ వీర్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించారు. అయితే ఒకే గేమ్‌లోని ఇద్దరు భారత ఆటగాళ్లు రెండేసి పతకాలు సాధించడం అరుదైన ఘటనగా క్రీడా అభిమానులు అభివర్ణించారు.
స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఉన్న స్కాట్స్టౌన్ స్టేడియంలో జరుగుతోన్న కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు ఈ ఘటన సాధించారు. ఈ ఫైనల్ విభాగంలో స్టార్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా 85.83 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకోగా, యశ్ వీర్ సింగ్ 85.41 మీటర్ల త్రోతో కాంస్య పతకాన్ని సాధించాడు. అయితే వీరిద్దరి కంటే ముందుగా శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగ పతిరాగే 89.75 మీటర్ల భారీ త్రోతో స్వర్ణ పతకాన్ని గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచాడు.
ఫైనల్ పోటీ ఎలా సాగింది?
గాయం కారణంగా 2022 కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమైన నీరజ్ చోప్రా, ఈసారి 80.97 మీటర్ల త్రోతో బలమైన ఆరంభాన్ని ఇచ్చాడు. రెండో రౌండ్లో 85.83 మీటర్ల అత్యుత్తమ త్రోతో అతను తాత్కాలికంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. అయితే, అదే రౌండ్లో పతిరాగే 89.75 మీటర్ల భారీ త్రోతో వెంటనే స్పందించి, మిగిలిన పోటీలో ఎవరూ అధిగమించలేని రికార్డును నెలకొల్పాడు.
తుది పతకాల పట్టిక: పురుషుల జావెలిన్ త్రో (CWG 2026)
స్వర్ణం: రుమేష్ పతిరాగే (శ్రీలంక) - 89.75 మీటర్లు
రజతం: నీరజ్ చోప్రా (భారత్) - 85.83 మీటర్లు
కాంస్యం: యశ్ వీర్ సింగ్ (భారత్) - 85.41 మీటర్లు
పాకిస్థాన్‌కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ అర్షద్ నదీమ్ చివరి మూడు ప్రయత్నాలకు అర్హత సాధించలేకపోవడంతో తొమ్మిదవ స్థానానికి పరిమితమవ్వడం ఈ రాత్రి జరిగిన ఒక ఊహించని పరిణామం.
యశ్ వీర్ సింగ్ అద్భుత ప్రదర్శన
గోల్డ్ కోస్ట్ 2018లో స్వర్ణం గెలిచిన తర్వాత నీరజ్ చోప్రా తన కెరీర్లో మరో కామన్వెల్త్ పతకాన్ని జోడించుకోగా, భారత బృందానికి యశ్ వీర్ సింగ్ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తీవ్రమైన పోటీ మధ్య అద్భుతంగా రాణించిన యశ్ వీర్, తన మునుపటి వ్యక్తిగత పరిమితులను అధిగమించి 85.41 మీటర్లు విసిరి, గ్రెనడాకు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ ఆండర్సన్ పీటర్స్, దక్షిణాఫ్రికాకు చెందిన డౌ స్మిత్‌లను వెనక్కి నెట్టి, తన తొలి కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతకాన్ని పదిలం చేసుకున్నాడు. అలాగే భారతదేశానికి చెందిన మూడవ ఫైనలిస్ట్, రోహిత్ యాదవ్ 81.56 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో ఏడవ స్థానంలో నిలిచాడు.
కామన్వెల్త్ గేమ్స్‌లో జావెలిన్ త్రోలో భారత్‌కు సంబంధించిన కీలక అంశాలు..
భారతదేశానికి డబుల్ పోడియం: కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ చరిత్రలో తొలిసారిగా భారత్‌కు చెందిన ఇద్దరు అథ్లెట్లు మొదటి మూడు స్థానాల్లో నిలవడం విశేషం.
నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్ రికార్డు: నీరజ్ చోప్రా తాను గతంలో పాల్గొన్న కామన్వెల్త్ గేమ్స్‌లో ఓ సారి స్వర్ణ (2018) పతాకాన్ని సాధించగా.. ఇప్పుడు రజత (2026) పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
అప్‌కమింగ్ టాలెంట్: యశ్ వీర్ సింగ్ అంతర్జాతీయ వేదికపై తన కెరీర్లోనే అత్యుత్తమమైన 85.41 మీటర్ల త్రోను నమోదు చేశాడు.
Also Read: కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్‌కు చేరిన మరో భారత అథ్లెట్..బంగారం వేటలో బాక్సర్ ప్రీతి!
Also Read: కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన నీరజ్ చోప్రా..ఫైనల్లో అడుగుపెట్టిన భారత అథ్లెట్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RTC Bus Driver: రీల్స్ చూస్తూ ఆర్టీసీ బస్ డ్రైవింగ్.. సస్పెండ్
Madanapalle, Arikela, Andhra Pradesh:RTC Bus Driver Watch Insta Reels While Driving Watch Viral VideoMouse Theft Gold: దొంగ ఎలుక.. బంగారం దుకాణంలో చోరీ
Tumakur, Karnataka:Mouse Theft Gold Ornaments In Jewellery Shop Video Goes ViralTelangana: దేశంలో పెట్టుబడులకు తెలంగాణ సురక్షిత స్థానం: రేవంత్ రెడ్డి
Hyderabad, Telangana:Invest Telangana: 'పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ సురక్షిత స్థానం. తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలి' అని తెలంగాణ ముఖ్యమంత్రి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు రక్షణగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. 'తెలంగాణ సంస్కృతి తమకు పెద్ద ఆస్తి. హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన దానికి రెట్టింపు ఆదాయం వస్తుంది. పారిశ్రామికవేత్తలు తమకు ఏం కావాలో చెబితే ఆ వసతులు కల్పిస్తాం' అని పెట్టుబడిదారులను తెలంగాణ సీఎం ఆకర్షించారు.
భారత పరిశ్రమల సమాఖ్య, ఉత్తర భారత ప్రతినిధులను హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కలిశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రితో సమావేశమైన ప్రతినిధులు తమ ఆలోచనలు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ పారిశ్రామిక విధానాలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, మంచి ప్రతిపాదనలతో వచ్చిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వివరించారు. 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్ 500 కంపెనీల పెట్టుబడులు పెట్టాలనేది తమ ఆకాంక్ష అని తెలిపారు.
'డిసెంబర్లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో 175 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ -2047 పాలసీని గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటించాం. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉందని.. అది 10 శాతంగా ఉండాలన్నదే మా లక్ష్యం' అని తెలంగాణ సీఎం తెలిపారు. ఐటీ శాఖ మంత్రి ప్రతి రెండు నెలలకోసారి, తాను ప్రతి మూడు నెలలకు ఒకసారి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణను మీ సొంత ప్రాంతంగా భావించాలని సీఐఐ ప్రతినిధులకు సూచించారు.
దేశంలోని మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగుళూరు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ఆ మహానగరాల పరిస్థితులు రావొద్దన్న ఉద్దేశంతో సంస్కరణలు తీసుకువచ్చాం. సర్వీస్ సెక్టర్, మాన్యుఫ్యాక్చర్ రంగం, వ్యవసాయ రంగానికి, వ్యవసాయ ఆధార పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలంగాణ సీఎం వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు ఇవ్వడంతో పాటు ఇతర వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
వరంగల్, ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు కేంద్రం నుంచి అనుమతి తెలిపిందని, 7 బుల్లెట్ ట్రైన్లను కేంద్రం ప్రకటిస్తే 3 తెలంగాణకు వచ్చాయని తెలంగాణ సీఎం గుర్తుచేశారు. శంషాబాద్ నుంచి చెన్నై, శంషాబాద్ నుంచి పూణె, శంషాబాద్ నుంచి బెంగళూరు బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోటీ పడి చైనా ప్లస్ 1 కంట్రీగా తెలంగాణను నిలపడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2037 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలిపారు.
'ఏఐ సునామీతో వైట్ కాలర్ జాబ్‌లు పోతుండడంతో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాం. రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా మార్చిన నేపథ్యంలో వాటిల్లో శిక్షణ పొందిన వారికి 100 శాతం ఉద్యోగాలు పొందారు. జీసీసీల్లో 200 కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని, అమెజాన్ డేటా సెంటర్ల పై రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెడుతోందన్నారు. అదాని రూ.35 వేల కోట్లు డేటా సెంటర్‌పైన పెట్టుబడి పెడుతోంది' అని ముఖ్యమంత్రి వివరించారు.
RTC Bus Driver: సెల్‌ఫోన్ చూస్తూ బస్ డ్రైవింగ్.. వీడియో వైరల్ కావడంతో డ్రైవర్ సస్పెండ్
Madanapalle, Andhra Pradesh:Viral News: విధి నిర్వహణలో ఆదర్శంగా ఉండే ఆర్టీసీ డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యం వహించాడు. పదుల సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సు డ్రైవర్ బాధ్యతగా ఉండాల్సి ఉండగా ప్రమాదకరంగా బస్సు నడిపాడు. సెల్‌ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయగా.. ఆ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు అతడిని ఆర్టీసీ అధికారులు విధుల నుంచి తొలగించారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపింది. మదనపల్లి నుంచి చిత్తూరుకు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు (ఏపీ39 యూవీ 9691)ను డ్రైవర్ నిర్లక్ష్యం ప్రదర్శించాడు. బస్సు నడుపుతూనే డ్రైవర్ సెల్ఫోన్లో నిమగ్నమై డ్రైవింగ్ చేశాడు. ప్రయాణికులు వారిస్తున్నా వినిపించుకోలేదని తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
బస్సు డ్రైవర్ మొబైల్ ఫోన్ చూస్తూ ప్రమాదకరంగా బస్సు నడపడాన్ని గమనించిన ఓ ప్రయాణికుడు తన సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించాడు. అనంతరం అది సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పలమనేరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిసింది. ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టి డ్రైవింగ్ చేస్తూనే సెల్‌ఫోన్ ఉపయోగించడంపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైరల్‌గా మారిన ఈ వీడియోపై అధికారులు స్పందించారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సంబంధిత డ్రైవర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఆదర్శంగా ఉండాల్సిన ఆర్టీసీ డ్రైవర్లు ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని విధి నిర్వహణ సమయంలో సెల్ఫోన్లు ఉపయోగించకుండా కఠిన చర్యలు అమలు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఈ సమాచారం తెలుసుకున్న ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారని తెలుస్తోంది. మొబైల్ ఫోన్ చూస్తూ బస్సు నడిపిన ఘటనపై ఆర్టీసీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఆర్టీసీ అధికారులతో చర్చించి సంబందించిన ఆర్టీసీ డ్రైవర్‌ను వెంటనే సస్పెండ్ చేయించారని తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
HYDRAA: ఐపీఎస్‌ను పదవి నుంచి తొలగించడం కోర్టు ధిక్కార శిక్ష కాదు.. హైడ్రా కమిషనర్ వివరణ
Hyderabad, Telangana:HYDRAA vs High Court: తెలంగాణ హైకోర్టు ప్రాంగణాలలో తీవ్ర ఆందోళన కలిగించే ఒక విషయం జరుగుతోంది. అది కేవలం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రవర్తన మాత్రమే కాదు. ఆయన పదేపదే న్యాయపరమైన ఆదేశాలను ధిక్కరించడం సమర్థించరానిది. చట్టం అనుమతించిన అత్యంత తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు అర్హమైనది అయినప్పటికీ... ఇది ఆందోళన కలిగించే విషయం. చాలా తక్కువ పరిశీలనకు గురైనది ఏమిటంటే కోర్టు ఆదేశాలను ఐచ్ఛికంగా పరిగణించిన ఒక ఏజెన్సీపై స్పష్టంగా ఆందోళన వ్యక్తం చేస్తూ జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ స్వయంగా రాజ్యాంగ హద్దులను దాటారా లేదా అనేది. నిరంతర ఉల్లంఘనలతో ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ.. ఏ న్యాయమూర్తి కూడా చట్టబద్ధంగా ఆ హద్దులను దాటకూడదు.
వాస్తవాలు సుస్పష్టంగా ఉన్నాయి. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని లోతుకుంట గ్రామంలో ఉన్న 40 ఎకరాల ప్రైవేట్ భూమిలోకి అమలులో ఉన్న న్యాయ ఉత్తర్వులను బేషరతుగా ధిక్కరిస్తూ హైడ్రా అధికారులు ప్రవేశించారని ఆరోపిస్తూజజ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పలు ధిక్కార పిటిషన్లను దాఖలు చేసింది. రిట్ అప్పీల్‌తో సహా పలు విచారణల ద్వారా ఆ ఆస్తి ప్రైవేట్ భూమి అనే విషయాన్ని సమర్థించారు. ప్రభుత్వ మద్దతుతో స్పష్టంగా ధైర్యం పుంజుకున్న హైడ్రా పదేపదే తిరిగి వస్తూనే ఉంది. కమిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్లు అనాలోచితంగా, అసంపూర్ణంగా, చిత్తశుద్ధితో కూడిన, సకాలంలో క్షమాపణ లేకుండా ఉన్నాయని కోర్టు అభివర్ణించింది. ఏ విధంగా చూసినా, ఇది అత్యంత తీవ్రమైన ధిక్కారం. జస్టిస్ అనిల్ కుమార్ యొక్క తీవ్ర ప్రతిస్పందన పూర్తిగా అర్థం చేసుకోదగినదే. రాజకీయ అండతో పనిచేసే ఏజెన్సీలు కోర్టు ఉత్తర్వులను కేవలం సూచనలుగా పరిగణించినప్పుడు ఏ కోర్టు కూడా సరిగ్గా పనిచేయలేదు. కానీ ఈ పరిష్కార మార్గం రాజ్యాంగ పరిధిలోనే ఉండాలి.
న్యాయమూర్తి అనిల్ కుమార్ జారీ చేసిన రెండు ఆదేశాలు: ఒకటి పదవి నుంచి తొలగించాలని ఆదేశించడం. మరొకటి సైన్యాన్ని మోహరించాలని ఆదేశించడం. పరిశీలన అవసరమైన తీవ్రమైన రాజ్యాంగపరమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.
తొలగింపు ఆదేశం - ఒక న్యాయపరిధి ప్రశ్న
హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించి ఆయన స్థానంలో తగిన వ్యక్తిని నియమించాలని న్యాయమూర్తి అనిల్ కుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇది రాజ్యాంగ్యానికి సంబంధించిన ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతుంది. ఆ అధికారి ప్రవర్తన ఎంత బలంగా న్యాయపరమైన ప్రతిస్పందనను కోరినప్పటికీ అది ఇక్కడ అప్రధానం.
హైకోర్టుకు ఉండే 'కోర్టు ధిక్కార చర్యల' అధికారానికి రాజ్యాంగ పునాది అయిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 215 ఇలా పేర్కొంటోంది: "ప్రతి హైకోర్టు ఒక 'కోర్ట్ ఆఫ్ రికార్డ్' (రికార్డుల న్యాయస్థానం)గా ఉంటుంది. తనను తాను ధిక్కరించినందుకు శిక్షించే అధికారంతో సహా అటువంటి న్యాయస్థానానికి ఉండే అన్ని అధికారాలను కలిగి ఉంటుంది. 'కోర్టు ధిక్కార చట్టం, 1971'లోని సెక్షన్ 12(1) ప్రకారం.. ఈ చట్టంలో లేదా మరే ఇతర చట్టంలోనైనా ప్రత్యేకంగా పేర్కొన్న విధంగా తప్ప కోర్టు ధిక్కారానికి గరిష్టంగా ఆరు నెలల సాధారణ కారాగార శిక్ష లేదా రూ.2 వేల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
రాజ్యాంగం ఏం చెబుతోంది..?
సెక్షన్ 12(2) ఇంకా ఇలా.. 'ప్రస్తుతం అమలులో ఉన్న ఏ చట్టంలోనైనా ఏమున్నప్పటికీ తనను తాను ధిక్కరించినందుకు లేదా తన పరిధిలోని కింది కోర్టును ధిక్కరించినందుకు సబ్-సెక్షన్ (1)లో పేర్కొన్న దానికంటే మించిన శిక్షను ఏ కోర్టు కూడా విధించకూడదు'. కోర్టు ధిక్కార చట్టం, 1971లో లేదా మరే ఇతర భారతీయ చట్టంలో కోర్టు ధిక్కారానికి శిక్షగా ఒక ప్రభుత్వ అధికారిని చట్టబద్ధమైన లేదా కార్యనిర్వాహక పదవి నుంచి తొలగించాలని ఆదేశించే అధికారం ఏ కోర్టుకూ లేదు. చట్టం నిర్దేశించే శిక్షలు కేవలం కారాగారవాసం, జరిమానా మాత్రమే. పదవి నుంచి తొలగించడం అనేది కోర్టు ధిక్కారానికి సంబంధించిన శిక్షా విధానం కాదు. ఇది చట్టపరమైన పరిధికి పూర్తిగా వెలుపల ఉన్న అంశం.
రాజ్యాంగపరమైన అడ్డంకి కూడా అంతే స్పష్టంగా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(1)లో 'కేంద్ర లేదా అఖిల భారత లేదా రాష్ట్ర సివిల్ సర్వీస్‌లో సభ్యుడిగా ఉన్న లేదా కేంద్రం లేదా రాష్ట్రం కింద సివిల్ పదవిని నిర్వహిస్తున్న ఏ వ్యక్తినైనా.. వారిని నియమించిన అధికారి కంటే తక్కువ స్థాయి అధికారి తొలగించకూడదు లేదా పదవి నుంచి తీసివేయకూడదు. హైకోర్టు అనేది ఐపీఎస్ అధికారిని నియమించే అధికారం కలిగిన సంస్థ కాదు. ప్రభుత్వ ఉద్యోగిని.. ముఖ్యంగా ఐపీఎస్ పదవిలో నియమితులైన వారిని లేదా రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం ద్వారా నియమితులైన వారిని తొలగించడం అనేది ఒక కార్యనిర్వాహక చర్య. కోర్టు ధిక్కార అధికార పరిధిని ఉపయోగించడం ద్వారా ఆ చర్య న్యాయపరమైన చర్యగా మారిపోదు. సుప్రీంకోర్టు వర్సెస్ ఉత్తరప్రదేశ్ కేసులో సరిగ్గా ఈ నిర్మాణాత్మక సరిహద్దును ప్రస్తావించింది.
భూసేకరణ, నష్టపరిహారం, సమగ్ర పునరావాసం కోసం అవసరమైన భారీ మూలధనాన్ని ఇది పూర్తిగా మినహాయించింది. ఈ విస్మరణ ప్రైవేట్ కన్సల్టెన్సీలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రాజెక్ట్ బడ్జెట్‌ను భారీగా పెంచి చూపించారనే ఆరోపణలకు ఆజ్యం పోసింది. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌లో అత్యంత రాజకీయ సున్నితమైన అంశం. నదీ తీరాల్లో నివసిస్తున్న వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాల నివాసాలకు ఇది కలిగించే ప్రత్యక్ష ముప్పు. మూసీ నదీ గర్భం వెంబడి దూకుడుగా కూల్చివేత చర్యల కోసం హైడ్రా సిబ్బందిని మోహరించడం విస్తృతమైన ప్రజా ఆందోళనకు, రాజకీయ వ్యతిరేకతకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిబంధనలు జారీ చేయమని బలవంతం చేయడానికి ప్రయత్నించిన అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను రాజ్యాంగ ధర్మాసనం పక్కనపెట్టింది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందన
'రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్‌గా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21,48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించా. మార్కెట్లో వీటి విలువ రూ.1.50 లక్షల కోట్లు. ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాం. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను హైడ్రా రెండేళ్లల్లో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. నిజాయితీగా నిర్భయంగా.. నిబద్ధతతో పని చేస్తాం కాబట్టే హైడ్రాకు ధైర్యం' అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. భూ మాఫియా , భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో న్యాయస్తానాలను తప్పు దోవ పట్టిస్తున్నారు. లోతుకుంట భూమి విషయంలో దాదాపు రూ.10 వేల కోట్ల భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది. అనుమతి లేకుండా 2,500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ.. వందల చెట్లను విచ్చలవిడిగా విధ్వంసం చేసింది' అని వివరించారు.
'అదే నేను చేసిన తప్పు'
'సేవ్ ద రాక్స్ సొసైటీ, పర్యావరణవేత్తలతోపాటు స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల ఉందని చెబుతూ లేని భూమిని చూపిస్తూ ఈ బిల్డర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద కోర్టు ధిక్కరణ కేసు వేశారు. నా మీద 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. వాటిని వేసింది బడా భూ కబ్జా దారులే' అని రంగనాథ్ వెల్లడించారు. బతుకమ్మ కుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు, లోతుకుంటలో రూ.వేల కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్‌లు కట్టాలని చూస్తున్న సంధ్యా శ్రీధర్ రావు, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్స్‌ను కొట్టేయాలని చూసిన నల్ల మల్లా రెడ్డి, క్రిమినల్ మాఫియాగా చెలామణి అవుతూ రూ.వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్స్, ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖీం.. వీరందరికీ నేను హైడ్రా కమిషనర్‌గా అడ్డు పడడటమే నేను చేసిన తప్పు' అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. వారందరూ వేసిన కేసులే తన మీద ఉన్న 63 కోర్ట్ ధిక్కార కేసులు అని వివరణ ఇచ్చారు. వాటిని తాను చట్టపరంగానే ఎదుర్కుంటానని ప్రకటించారు. 'నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం. చట్టాలపై గౌరవంతో పని చేస్తూ వస్తున్నా. గతంలో.. ఇప్పుడు, మున్ముందు ప్రభుత్వాలు ఏ బాధ్యతలు అప్పగించినా నేను నా వైపు నుంచి వంద శాతం ఫలితాలు ఇవ్వటమే లక్ష్యంగా ఉంటా. అలాగే పని చేస్తున్నా, భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో పని చేస్తా' అని ఓ ప్రకటనలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.
Narsampet: పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో హరీశ్ రావు కన్నీళ్లు
Narsampet, Telangana:Ex Minister Harish Rao Gets Emotional And Tears In Peddi Sudarshan Reddy Last Journey Watch Videoరాఖీ హబ్‌గా పెద్దపల్లి.. తెలంగాణలోనే తొలి అతిపెద్ద యూనిట్‌గా రికార్డు..
Hyderabad, Telangana:Wholesale Rakhi Market: అక్కచెల్లెళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకే రాఖీ పండుగ.. ఇక ఈ పండగకు వేళైంది.. ఒకప్పుడు రాఖీల కోసం కలకత్తా, గుజరాత్, రాజస్థాన్ వైపు చూసిన తెలంగాణ రాఖీ డిస్టీబ్యూటర్స్.. ఇప్పుడు ఉత్తరాదికే గట్టి పోటీనిస్తోంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాఖీ ప్రొడక్షన్ యూనిట్ రాష్ట్రంలోనే తొలి అతిపెద్ద రాఖీ హబ్‌గా అవతరించి రికార్డు సృష్టించింది. పండగకు ముందే ఈ ప్రాంతంలో ఒక సందడి వాతావరణం నెలకొంది. ఇది ఇప్పుడు దక్షిణ భారతంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.
ఒకప్పుడు కేవలం వ్యవసాయ పనులు, బీడీ కార్మిక రంగానికే పరిమితమైన స్థానిక మహిళలు.. ఇప్పుడు నైపుణ్యం కలిగిన రాఖీ డిజైనర్లుగా మారి తమ జీవితాలను పునర్నిర్మించుకుంటున్నారు. ఈ ఎస్ఆర్ఆర్ కేంద్రం ద్వారా దాదాపు 2,500 నుంచి 3,000 మంది మహిళలు ప్రత్యక్షంగా.. పరోక్షంగా గౌరవప్రదమైన జీవనోపాధి పొందుతున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించని ఈ పని ద్వారా సొంత ఊరిలోనే ఉంటూ ఆర్థికంగా బాగా ఎదుగుతున్నారని ఇక్కడి మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
లక్ష రకాల డిజైన్లు..
ఈ ఏడాది పండుగ సీజన్ కోసం సుమారు లక్షకు పైచిలుకు సరికొత్త డిజైన్లతో లక్షలాది రాఖీలు సిద్ధమయ్యాయి. రూపాయి మొదలుకుని వేల రూపాయల విలువ చేసే డిజైనర్, ట్రెండీతో పాటు సాంప్రదాయక రాఖీలు కొలువుదీరాయి. వ్యాపారులను ఆకట్టుకునేలా భారీ డిస్ ప్లే సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి హోల్‌సేల్ వ్యాపారులు కొనుగోళ్ల కోసం ఇక్కడికి క్యూ కడుతున్నారు.
గతంలో మేం రాఖీల కోసం కలకత్తా వెళ్లేవాళ్లం.. కానీ ఇప్పుడు మన పెద్దపల్లిలోనే అంతకంటే అద్భుతమైన డిజైన్లు హోల్‌సేల్ ధరలకే లభిస్తున్నాయి. నాణ్యత, మోడల్స్ చాలా బాగున్నాయని హోల్‌సేల్ వ్యాపారులు అంటున్నారు. మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న పెద్దపల్లి ఎస్.ఆర్.ఆర్ రాఖీ తయారీ కేంద్రం, జిల్లా పేరును జాతీయ స్థాయిలో మారుమోగేలా చేస్తోంది. వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఈ రాఖీ హబ్.. తెలంగాణ పారిశ్రామిక నైపుణ్యానికి ఒక అద్భుతంగా మారింది.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
12 ఏళ్ల బంధం.. ఒక్క మోసంతో రోడ్డుకెక్కిన సంసారం.. వీడియో..
Hyderabad, Telangana:Wife Caught Red-handed With Lover Video: నమ్మకం.. ఏ సంబంధానికైనా అసలైన పునాది.. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఒక్కటిగా నిలబెట్టేది ఆ నమ్మకమే.. కానీ, ఒక్క చిన్న మోసం.. 12 సంవత్సరాల నాటి సుదీర్ఘ అనుబంధాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఒక ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో వెలుగుచూసింది. 12 ఏళ్ల పాటు కలసి ప్రయాణించిన ఒక జంట.. దారుణమైన పరిస్థితిలో రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది?
స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. అయితే, తన భాగస్వామి తనను మోసం చేస్తోందనే అనుమానంతో ఇంటి దగ్గరే సీక్రెట్‌గా అక్కడే ఉండి చూశాడు.. అనుమానం కాస్త నిజమవుతూ.. ఆ భాగస్వామి వేరొక వ్యక్తితో బహిరంగంగా దొరిపోయింది.. గత కొంత కాలంగా భర్తకు తెలియకుండానే వేరే ఒకరిని ప్రేమించింది. అంతేకాకుండా ఈ ప్రేమ కాస్త ఇంటి వరకు వచ్చేలా చేసింది. అయితే, భర్తలేని సమయంలో ఆ మహిళ ఇంటి వద్దకే రావడంతో తన భర్త వారి ఇద్దిరినీ పట్టుకున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఘటనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితుడు నడిరోడ్డుపైనే వారిని నిలదీశారు.. ప్రశాంతంగా మాట్లాడుకోవాల్సిన సమస్య కాస్తా రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. చూస్తుండగానే చుట్టుపక్కల జనాలు గుమిగూడడంతో పాటు ఒకరినొకరు నిందించుకోవడంతో పాటు కొట్టుకోవడం వల్ల వీధులు ఆందోళనకరంగా మారాయి. 12 ఏళ్ల కాలంలో పెంచుకున్న ప్రేమాభిమానాలు, పంచుకున్న జ్ఞాపకాలు అన్నీ ఆ ఒక్క క్షణంలో తుడిచిపెట్టుకుపోయాయి.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
సుదీర్ఘమైన బంధాలు కూడా ఎంత ఇంత త్వరగా విచ్ఛిన్నమవుతున్నాయో ఇది స్పష్టం చేస్తోంది. సంబంధాలలో విశ్వాసం లోపిస్తే.. ఎంతటి సుదీర్ఘ అనుబంధమైనా ఒక్క క్షణంలో కూలిపోతుందనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనమని భావించవచ్చు. ఎలాంటి బంధంలోనైనా మనస్పర్థలు రావడం సహజం.. భాగస్వామి ప్రవర్తనలో తేడా అనిపించినా.. లేదా బంధం నుంచి బయటకు రావాలనుకున్నా ప్రత్యక్షంగా మాట్లాడుకోవడమే ఉత్తమమైన మార్గం..
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
CWG 2026 Boxing: కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్‌కు చేరిన మరో భారత అథ్లెట్..బంగారు పతకం వేటలో బాక్సర్ ప్రీతి పవార్!
Hyderabad, Telangana:CWG 2026 Boxing Final Match: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. టోర్నమెంట్లో తొమ్మిదవ రోజు జరిగిన ఉత్కంఠభరితమైన సెమీఫైనల్ బౌట్స్‌లో భారత బాక్సర్లు అదరగొట్టగా, మహిళల 54 కేజీల విభాగంలో ప్రపంచ నంబర్ 3 బాక్సర్ ప్రీతి పవార్ అద్భుత విజయంతో ఫైనల్లోకి ప్రవేశించారు.
ఏకపక్ష పోరులో ఘన విజయం
కామన్వెల్త్ గేమ్స్ మహిళల 54 కేజీల విభాగం సెమీఫైనల్ పోరులో ప్రీతి పవార్ జాంబియాకు చెందిన కేథరీన్ మ్వాపెతో తలపడ్డారు. అత్యుత్తమ టెక్నిక్ కనబరిచిన ప్రీతి 5-0 ఏకగ్రీవ నిర్ణయంతో ఘన విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించారు. U-22, ఎలైట్ స్థాయిలలో రెండుసార్లు ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన ప్రీతి, ఈ మ్యాచ్‌లోనూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
మొదటి రౌండ్ ప్రారంభంలో ఇద్దరూ హోరాహోరీగా పంచ్‌లు విదిలించినా.. ప్రీతి తన అద్భుతమైన బ్యాక్‌హ్యాండ్, ఓవర్‌హ్యాండ్ లెఫ్ట్, పదునైన జాబ్‌లతో పట్టు సాధించారు. దీంతో జాంబియా క్రీడాకారిణి తొలి స్టాండింగ్ ఎయిట్-కౌంట్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత రెండో రౌండ్లో మ్వాపె దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేసినా, ప్రీతి తన అద్భుతమైన ఫుట్‌వర్క్, వేగవంతమైన కాంబినేషన్లు, లెఫ్ట్ అప్పర్‌కట్‌తో విజృంభించారు. ఈ రౌండ్లో మ్వాపెకు మరో రెండు స్టాండింగ్ కౌంట్లు లభించాయి.
చివరిగా మూడో రౌండ్లో రింగ్‌ను ఎంతో సమర్థవంతంగా ఉపయోగించుకున్న ప్రీతి, ప్రత్యర్థి దూకుడికి తగినట్లుగా ఆడుతూ గట్టి బాడీ షాట్‌తో మెప్పించారు.
ఐదుగురు న్యాయనిర్ణేతలు (జడ్జీలు) మూడు రౌండ్లలోనూ ప్రీతికే పూర్తి మార్కులు కేటాయించారు. జడ్జీల స్కోర్లు వరుసగా 30-25, 30-25, 30-26, 30-24, 30-25గా నమోదయ్యాయి.
ఫైనల్ పోరు ఎవరితో?
సెమీఫైనల్లో అజేయ ప్రదర్శనతో విజయం సాధించిన భారత క్రీడాకారిణి ప్రీతి పవార్, స్వర్ణ పతకం కోసం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో కెనడా క్రీడాకారిణి స్కార్లెట్ డెల్గాడోతో తలపడనున్నారు.
Also Read: కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన నీరజ్ చోప్రా..ఫైనల్లో అడుగుపెట్టిన భారత అథ్లెట్లు!
Also REad; రహానే కెప్టెన్సీలో భారత్ ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు..కానీ, చివరికి అతడ్ని పక్కన పెట్టారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
