icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Avika Gor Dengue: డెంగ్యూ బారిన పడిన నటి అవికా గోర్.. తీవ్ర జ్వరంతోనూ షూటింగ్ పూర్తి చేసిన వైనం!

Mumbai, Maharashtra:

Avika Gor Dengue News: ప్రముఖ నటి, 'బాలికా వధూ' ఫేమ్ అవికా గోర్ డెంగ్యూ బారిన పడి ఆసుపత్రిలో చేరారు. గత ఐదు రోజులుగా 103 నుంచి 104 డిగ్రీల తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, ఆమె తన వృత్తిపరమైన బాధ్యతల పట్ల చూపిన నిబద్ధతను భర్త మిలింద్ చంద్వానీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

జ్వరంతోనూ వెనకడుగు వేయని అవికా..
అవికా గోర్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తన వృత్తిపరమైన బాధ్యతల పట్ల చూపిన అంకితభావాన్ని భర్త మిలింద్ ప్రశంసించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ఐదు రోజులుగా 104 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ, రెండు రోజులు మిగిలి ఉన్న ఒక ప్రాజెక్ట్ షూటింగ్‌ను ఆమె కేవలం ఒక్క రోజులోనే పూర్తి చేశారని మిలింద్ తెలిపారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి.. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లి మరీ ఒక యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నారని, ఇతరుల సమయం, డబ్బు వృథా కాకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఈ సాహసం చేశారని ఆయన చెప్పారు. షూటింగ్ ముగించుకుని ముంబైకి తిరిగి వచ్చి టెస్ట్ చేయించుకోగా, ఆమెకు డెంగ్యూ ఉన్నట్లు తేలిందని, దీంతో వెంటనే ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందని తెలిపారు.

"ఇతరుల సమయానికి, వనరులకు ఆమె ఇచ్చే విలువ నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంది. పరిశ్రమలో అలా ఆలోచించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అవికా, నీ గురించి నాకు గర్వంగా ఉంది" అంటూ మిలింద్ భావోద్వేగానికి గురయ్యారు.

అవికా గోర్ సినీ ప్రస్థానం..
2007లో ఓ ధారావాహిక ద్వారా బాలనటిగా ప్రయాణం ప్రారంభించిన అవికా.. 'బాలికా వధు'లో 'ఆనంది' పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత 'ససురల్ సిమర్ కా', 'లాడో' వంటి పలు విజయవంతమైన ధారావాహికల్లో నటించారు. కేవలం బుల్లితెరపైనే కాకుండా, పలు హిందీ, తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Also Read: ప్రభాస్ సినిమాలోని ఈ లేడీ విలన్ గుర్తుందా? 54 ఏళ్ల వయసులోనూ హీట్ పుట్టించే గ్లామర్!

Also Read: డిమోన్ పవన్‌తో పెళ్లి అప్పుడే! బిగ్‌బాస్ బ్యూటీ రీతూ చౌదరి క్రేజీ ఆన్సర్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

OYO ఫుల్ ఫార్మ్ ఏంటో మీకు తెలుసా? తప్పకుండా తెలుసుకోండి..

Hyderabad, Telangana:

Oyo Full Form In Telugu: యో (OYO)... ఈ పేరు వినని వారు, ఈ హోటళ్లలో ఉండని వారు చాలా అరుదు.. సామాన్యుడి బడ్జెట్‌లో నాణ్యమైన గదులను అందుబాటులోకి తెచ్చి.. భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రంగంలో సంచలనం సృష్టించిన సంస్థ ఇది.. అయితే, మనం రోజూ చూసే ఈ OYO అనే పదానికి Full Form ఏమిటో చాలామందికి తెలియదు.. OYO అంటే On Your Own (ఆన్ యువర్ ఓన్) అని అర్థం.. తెలుగులో దీని అర్థం మీ సొంతంగా లేదా  మీకై మీరుగా అని చెప్పుకుంటారు..

ఈ సంస్థ ప్రస్థానం వెనుక ఒక యువకుడి కష్టం, మంచి ఆలోచనలు ఉన్నాయి. ఒడిశాకు చెందిన రితేష్ అగర్వాల్ అనే 19 ఏళ్ల యువకుడు 2012లో ఓరావెల్ స్టేస్ (Oravel Stays) పేరుతో ఒక వెబ్‌సైట్‌ను మొదలు పెట్టారు. ప్రయాణికులకు తక్కువ ధరలో మంచి హోటళ్లను వెతుక్కోవడానికి ఇది ఎంతగానో సహాయపడింది.. అయితే, కేవలం హోటళ్ల సమాచారం ఇవ్వడమే కాకుండా.. వాటిలో కనీస హోటల్ వివరాలు, ఫీచర్స్‌, ధరలు అన్ని అందుబాటులో ఉంచారు. అయితే, దీనిని పెంచితే బాగుంటుందని భావించిన రితేష్.. 2013లో దీనిని OYO Roomsగా పేరు మార్చేశారు. 

On Your Own అనే పేరు పెట్టడానికి ప్రధాన కారణం... ప్రయాణికులు ఎక్కడికి వెళ్లినా సరే.. తమ సొంత ఇంట్లో ఉన్నంత సౌకర్యవంతంగా.. స్వేచ్ఛగా, తక్కువ బడ్జెట్‌లో బస చేయాలనే ఉద్దేశమని ఆయన తెలిపారు. సాధారణ హోటల్ యజమానులతో భాగస్వామ్యం కుదుర్చుకుని.. ఆ గదుల్లో ఏసీ, వైఫై, శుభ్రమైన బెడ్డింగ్, మంచి వాష్‌రూమ్‌లు వంటి సౌకర్యాలను ఒకే రకమైన ప్రమాణాలతో అందించడం ఓయో ప్రత్యేకత..

ఒక్క గది సరిగ్గా లేకపోవడం వల్ల పడిన ఇబ్బంది నుంచి పుట్టుకొచ్చిన ఈ ఆలోచన.. నేడు వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన గ్లోబల్ బ్రాండ్‌గా మారింది. ప్రస్తుతం భారత్‌తో పాటు US, యుకె, మలేషియా, ఇండోనేషియా వంటి అనేక దేశాల్లో OYO సేవలు విస్తరించాయి. ఒక చిన్న ఆలోచనతో హోటల్స్‌ రంగ చిత్రపటాన్నే మార్చేసి.. కోట్లాది మందికి తక్కువ ఖర్చులో ఆతిథ్యం అందిస్తున్న OYO కథ నిజంగానే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం..

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

కెమెరా ఆన్ చేయమన్న బాస్.. ఫేస్ మాస్క్‌తో షాకిచ్చిన Gen-Z ఎంప్లాయ్‌.. వీడియో!

Hyderabad, Telangana:

 Gen-Z WFH Viral Video Viral: కరోనా మహమ్మారి తర్వాత వెలుగులోకి వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సంస్కృతి ప్రస్తుతం కార్పొరేట్ ఆఫీసుల్లో సర్వసాధారణమైపోయింది. ఇంటి నుంచే పనిచేసే సౌలభ్యం ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్ మీటింగ్‌ల సమయంలో అనేక ఆసక్తికర, విచిత్ర సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక జెన్-జీ (Gen-Z) ఉద్యోగిని వర్క్ ఫ్రమ్ హోమ్ మీటింగ్‌లో చేసిన పని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఆ మహిళ ఉద్యోగిని ఏం చేసింది. ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక కంపెనీకి చెందిన ఆన్‌లైన్ రిమోట్ మీటింగ్ జరుగుతుండగా.. ఒక జెన్-జీ ఉద్యోగిని తన వెబ్‌క్యామ్‌ను ఆఫ్ చేసి ఉంచింది.. మీటింగ్‌లో అందరూ పాల్గొనాలని భావించిన మేనేజర్ ఆమెను పలుమార్లు క్యామెరా ఆన్ చేయాల్సిందిగా కోరారు.. మేనేజర్ పట్టుబట్టడంతో చేసేదేమీ లేక ఆ ఉద్యోగిని తన వీడియోను ఆన్ చేసింది.

అయితే, స్క్రీన్ పై ఆమెను చూసిన మేనేజర్‌తో పాటు మీటింగ్‌లో ఉన్న ఇతర ఉద్యోగులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే, ఆమె ముఖానికి ఫేస్ ప్యాక్ (Face Pack) వేసుకొని చాలా ప్రశాంతంగా మీటింగ్‌లో కూర్చుంది. ఆమె అవతారాన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయిన మేనేజర్ సరదాగా స్పందిస్తూ.. ఇలాంటి ఫేస్ ప్యాక్‌లు, స్కిన్ కేర్ పనులన్నీ మీ లంచ్ టైమ్‌లో చేసుకోవచ్చు కదా.. అని అన్నాడు.

దానికి ఆ జెన్-జీ ఉద్యోగిని ఏమాత్రం తడబడకుండా.. చాలా అద్భుతంగా సమాధానం ఇచ్చింది.. సార్, మీరు ఇచ్చే లంచ్ బ్రేక్ కేవలం 15 నిమిషాలు మాత్రమే.. కానీ నా ఫేస్ ప్యాక్ ఆరడానికి కనీసం 20 నిమిషాలు పడుతుంది!.. అని చిరునవ్వుతో బదులిచ్చింది. ఆమె జవాబుదారీతనానికి టీమ్ సభ్యులతో పాటు నెటిజన్స్‌ సైతం ఫిదా అవుతున్నారు.

 
 
 
 
 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే, ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది.. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఆఫీస్ ఒత్తిడిని తేలికగా తీసుకుంటూ.. తమ వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇచ్చే జెన్-జీ మనస్తత్వాన్ని చాలామంది సమర్థిస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగి తనకు కేటాయించిన పనిని సమయానికి పూర్తి చేస్తున్నప్పుడు.. ఆమె ముఖానికి ఫేస్ ప్యాక్ ఉందా లేదా పాటలు వింటోందా అనే దానితో పనిలేదని కొందరు కామెంట్ చేశారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report
Advertisement

కిడ్నీలో 7.3mm రాయి ఉన్నా లేదన్నారు! డయాగ్నస్టిక్ సెంటర్‌ తప్పుడు రిపోర్టులు..

Hyderabad, Telangana:

Jagtial Diagnostic Center News: జగిత్యాల పట్టణానికి చెందిన గౌతమి అనే మహిళ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ.. జూలై 27న స్థానిక ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఆశ్రయించారు. వైద్యుల సూచన మేరకు అక్కడ CT KUB స్కాన్ నిర్వహించారు. అయితే, ఆ నివేదికలో కిడ్నీలో ఎలాంటి రాళ్లు (Stones) లేవని స్పష్టం చేశారు. నొప్పి తగ్గకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు, అదే రోజు పట్టణంలోని మరొక డయాగ్నస్టిక్ సెంటర్‌లో మళ్లీ CT KUB స్కాన్ చేయించారు.

ఆశ్చర్యకరంగా.. రెండో సెంటర్ ఇచ్చిన రిపోర్టులో బాధితురాలి కుడి కిడ్నీలో 7.3 మిల్లీమీటర్ల పరిమాణంలో రాయి ఉన్నట్లు స్పష్టంగా నిర్ధారణ అయింది. ఆ నివేదిక ఆధారంగా వైద్యులు వెంటనే శస్త్రచికిత్స జరిపి.. సరిగ్గా అదే 7.3 mm పరిమాణం ఉన్న రాయిని తొలగించారు.

అయితే, మొదటి రిపోర్ట్‌లో తీవ్ర లోపం బయటపడటంతో బాధితురాలి కుటుంబ సభ్యులు సదరు డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులను నిలదీశారు. ప్రాణాలతో చెలగాటమాడేలా.. రిపోర్టు ఎలా ఇస్తారని ప్రశ్నించగా.. కేంద్రం ప్రతినిధులు బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలి కుటుంబం జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DMHO)కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. గతంలోనూ ఈ డయాగ్నస్టిక్ సెంటర్‌పై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ.. అధికారులు కంటితుడుపు చర్యలతో సరిపెట్టడం వల్లే వైఖరి మారలేదని స్థానికులు మండిపడుతున్నారు.

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

సామాన్యులు వేల రూపాయలు పెట్టి.. చేసుకునే వైద్య పరీక్షల్లో ఇటువంటి నిర్లక్ష్యం క్షమించరానిదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. క్వాలిటీ కంట్రోల్ లేని లాబ్‌లతో పాటు అర్హత లేని రేడియాలజిస్టుల వల్ల రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు రిపోర్టులు ఇచ్చి.. రోగులను అయోమయానికి గురిచేసిన ఈ డయాగ్నస్టిక్ సెంటర్‌పై సమగ్ర విచారణ జరిపి.. తక్షణమే గుర్తింపు రద్దు చేయాలని.. జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లలో క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని బాధిత కుటుంబంతో పాటు స్థానికులు జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Gas Cylinder Scheme: సామాన్యులకు గుడ్‌న్యూస్..రూ.500లకే గ్యాస్ సిలిండర్..రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు!

Hyderabad, Telangana:

Telangana Gas Cylinder Scheme: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల్లో ఒకటైన 'మహాలక్ష్మి' పథకాన్ని తెలంగాణ సర్కార్ మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో 5 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

పథకం విస్తరణ ముఖ్యాంశాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఈ పథకం కింద దాదాపు 42.90 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. తాజాగా పౌర సరఫరాల శాఖ చేపట్టిన కసరత్తులో మరో 5 లక్షలకు పైగా కుటుంబాలు అర్హమైనవిగా గుర్తించారు. ఈ పథకం కోసం మొత్తం 91.49 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అధికారులు అర్హుల జాబితాను తుది పరిశీలన చేసి ప్రభుత్వానికి పంపారు.

ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.723.30 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదం లభించి, నిధులు విడుదలైన వెంటనే కొత్త లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి సబ్సిడీ మొత్తం జమ కానుంది.

అర్హతల పరిశీలన ఇలా..
తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం ఈ సబ్సిడీ గ్యాస్ పథకాన్ని వర్తింపజేస్తోంది. గతంలో వివాహం జరిగి వేరుగా కాపురం పెట్టిన దంపతులకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు లేకపోవడం, ఒకే ఇంట్లో రెండు కుటుంబాలు ఉన్నా ఒకే కార్డు ఉండటం వంటి కారణాల వల్ల చాలామంది అర్హులు ఈ పథకానికి దూరమయ్యారు.

గత కొద్దికాలంగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ముమ్మరం చేయడంతోపాటు, అందిన దరఖాస్తులను పౌరసరఫరాల శాఖ క్షుణ్ణంగా పరిశీలించింది. అర్హులైన ఆయా కుటుంబాలను గుర్తించి తుది జాబితాను సిద్ధం చేసింది. త్వరలోనే వీరికి కూడా రూ.500కే గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభం కానుంది.

Also Read; రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు..ఆగస్టు 8 నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్!

Also REad: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం..బ్యాలెట్ బాక్సులా? ఈవీఎంలా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

సిరిసిల్ల జిల్లాలో వాగులో ఇరుక్కుపోయిన కస్తూర్బా టీచర్ల ట్రాక్టర్..

Hyderabad, Telangana:

Rajanna Sircilla News: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) మహిళా ఉపాధ్యాయులు రోజూవారీలాగే స్కూల్‌కి వెళ్తున్నారు. అయితే, ఇటీవల కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా స్థానిక తూకమర్రి వాగు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. పాఠశాలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో.. గ్రామానికి చెందిన పంచాయతీ ట్రాక్టర్‌తో వాగు దాటేందుకు ఉపాధ్యాయులు యత్నించారు. ఈ సమయంలోనే కొంతమంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫిక్స్‌ వైరల్ అవుతున్నాయి. 

ఉపాధ్యాయులతో పాటు వారి వెంట ఉన్న ఇద్దరు చంటిపిల్లలను ఎక్కించుకుని.. వాగు దాటుతున్న సమయంలో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. నీటి ఉధృతికి తోడు భారీ ప్రవాహంతో వాగు మధ్యలోకి వెళ్లగానే ట్రాక్టర్ చక్రాలు ఒక్కసారిగా ఇసుకలో కూరుకుపోయాయి. నీటి ప్రవాహ ధాటికి ట్రాలీ ఒకవైపుగా బాగా ఒరిగిపోయింది. ఏ క్షణంలో ట్రాలీ తలక్రిందులవుతుందో.. వాగు ప్రవాహంలో కొట్టుకుపోతామోనని టీచర్లు కేకలు వేస్తూ.. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చంటిపిల్లల ఏడుపులు, ఉపాధ్యాయుల కేకలు ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా అయోమయంగా మారింది.

గమనించిన స్థానికులు వెంటనే స్పందించి.. సహాయక చర్యలు చేపట్టారు. సమయస్ఫూర్తితో మరో ట్రాక్టర్‌ను సంఘటనా స్థలానికి రప్పించి.. తాడు సహాయంతో ఒరిగిన ట్రాక్టర్‌ను లాగేందుకు ప్రయత్నించారు. దాదాపు అరగంట తర్వాత ఉపాధ్యాయులను, చంటిపిల్లలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

ఈ ఘటన ఉపాధ్యాయుల రక్షణపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.. విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులకు హాజరవుతున్న మహిళా సిబ్బందికి తగిన రవాణా సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తూకమర్రి వాగుపై తక్షణమే చిన్న బ్రిడ్జి నిర్మించి.. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నారు..

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

రీల్స్ పిచ్చి పచ్చని కాపురంలో నిప్పులు పోసింది.. భార్యను గొంతునులిమి చంపిన భర్త!

Hyderabad, Telangana:

Bengaluru Reels Murder Case News: సోషల్ మీడియా మనుషుల మధ్య అనుబంధాలను ఎంత దూరం చేస్తుందో చెప్పడానికి బెంగళూరు నగరంలో జరిగిన ఈ ఘోర ఘటనే నిదర్శనం.. ఆన్‌లైన్‌లో కలర్ ఫుల్ ప్రపంచాన్ని చూపిస్తూ.. కాలాన్ని కరిగిస్తున్న ఆ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మాయాజాలం.. చివరకు ఒక పచ్చని కాపురంలో తీవ్ర నిప్పులు పోసి.. ఒక ప్రాణాన్ని బలితీసుకుంది. ఇప్పుడు ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బిహార్ రాష్ట్రానికి చెందిన ధీరజ్‌ కుమార్‌ (24), రీమా కుమారి (20) కొంతకాలం కిందట ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఎన్నో ఆశలతో ఏడడుగులు వేశారు. భవిష్యత్తుపై ఎన్నో కన్న కలలతో, బతుకుదెరువు కోసం కొద్ది రోజుల క్రితమే కర్ణాటక రాజధాని బెంగళూరుకు వలస వచ్చారు. అక్కడ ధీరజ్ చిన్న చిన్న పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తుండగా.. భార్య రీమా ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. అంతా బాగుంది.. జీవితం హాయిగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలోనే వారి మధ్యలోకి ఇన్‌స్టా రీల్స్ పిచ్చి వచ్చి పడింది.

కాపురంలో రీల్స్ చిచ్చు..
రీమా క్రమంగా సోషల్ మీడియాలో రీల్స్ చూడటానికి విపరీతంగా అలవాటు పడింది.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు రీల్స్ చూడటంలోనే మునిగిపోతుండేది.. దీంతో ఇంట్లో వంట చేయడం, ఇతర పనులు పూర్తిగా మానేసింది. అలసిపోయి ఇంటికి వచ్చే ధీరజ్‌కు సమయానికి భోజనం దొరకకపోవడం, భార్య నిరంతరం ఫోన్‌లోనే మునిగితేలడంతో ఇద్దరి మధ్య నిత్యం గొడవలు మొదలయ్యాయి. అనేకసార్లు తన భర్త వేడుకున్న రీమా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆ కాపురంలో గొడవలు నిత్యం జరిగేవి..

ఆవేశంలో ఘోరం..
ఈ క్రమంలోనే ఇటీవల ఇద్దరి మధ్య రీల్స్ విషయంలో మరోసారి తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. రీమాపై విపరీతమైన ఆవేశానికి లోనైన ధీరజ్.. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయాడు. ఆమె గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. అనంతరం భయంతో తలుపులు బయట నుంచి లాక్ చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా తన సొంత ఊరు బిహార్‌కు పరారయ్యాడు.

దుర్వాసనతో బయటపడ్డ శవం..
ఆఫీస్‌కు రావాల్సిన రీమా వరుసగా రాకపోవడం.. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన సహోద్యోగి ఇంటికి వెళ్లి చూశాడు. గది నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా.. రీమా కుళ్ళిన స్థితిలో విగతజీవిగా పడి ఉంది.

వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి.. బిహార్‌కు పారిపోయిన ధీరజ్‌ను అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. నా భార్య రీల్స్‌కు అలవాటు పడి ఇల్లు పట్టించుకోకపోవడం.. మాట వినకపోవడంతోనే చంపేశానని నిందితుడు ధీరజ్ పోలీసుల ఎదుట కన్నీళ్లతో నేరం అంగీకరించాడు. రీల్స్ పిచ్చి ఒకరి ప్రాణాన్ని తీస్తే.. మరొకరిని జైలు పాలు చేసి ఇరు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

రూ.5 లక్షలకే క్రెటా.. రూ.7.85 లక్షలకే సెల్తోస్.. ఎక్కడో తెలుసా?

Hyderabad, Telangana:

Budget Used Cars in Delhi: సొంత కారు ఉండాలనేది ప్రతి సామాన్యుడికి ఉండే ఒక కల.. అయితే, రోజురోజుకూ పెరుగుతున్న కొత్త కార్ల ధరలు చూసి చాలామంది మధ్యతరగతి ప్రజలు సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారు. సరిగ్గా ఇలాంటి వారి కోసమే.. ఢిల్లీలోని సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌లోని కొన్ని షోరూమ్స్‌ బంపర్ ఆఫర్లతో ముందుకు వచ్చాయి. ముఖ్యంగా డిమాండ్ ఎక్కువగా ఉండే డీజిల్, సీఎన్‌జీ, పెట్రోల్ వేరియంట్ కార్లను ఊహించని ధరకు అందిస్తూ.. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఇక్కడ ఏయే కార్లు ఎలాంటి ధరలకు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొంతమంది కస్టమర్లకు డీజిల్ కార్లంటే ఎంతో ఇష్టం ఉంటుంది.. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ కొన్ని షో రూమ్స్‌ వారు అన్ని రకాల మోడళ్లను అత్యంత చీప్‌ ధరలకే అందిస్తున్నారు. టాటా, హ్యుందాయ్, కియాతో పాటు మహీంద్రా వంటి ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన కొత్త కొత్త కార్లను ఇక్కడ మార్కెట్ ధరల కంటే చాలా తక్కువకే ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ 2021 మోడల్ కియా సెల్టోస్ టాప్ మోడల్ కారు కేవలం రూ.7,85,000కే అందుబాటులో ఉండటం విశేషం.. అంతేకాకుండా హ్యుందాయ్ క్రెటా రూ.4,99,000కు, క్రేజ్ ఉన్న XUV 300తో పాటు వెన్యూ వంటి కార్లు అత్యంత చీప్‌ ధరల్లో లభిస్తున్నాయి.

సాధారణంగా సెకండ్ హ్యాండ్ కార్లు అనగానే కొనేవారికి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి.. కానీ ఇక్కడ కార్లను ఉన్నది ఉన్నట్లుగా (Raw Condition) కస్టమర్లకు చూపిస్తున్నారు. టైర్లతో పాటు ఇంజిన్, ఇంటీరియర్ ఇలా ప్రతిదీ కస్టమర్ స్వయంగా లేదా తమ మెకానిక్ ద్వారా చెక్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించడం విశేషం.. కేవలం ఢిల్లీ వారికే కాకుండా ఆల్ ఇండియా ఎన్.ఓ.సి (NOC) సదుపాయం ఇస్తుండటంతో తెలంగాణ, ఏపీ వంటి ఇతర రాష్ట్రాల వారు సైతం ఇక్కడ సులభంగా కార్లు కొనుగోలు చేసి తమ రాష్ట్రాలకు తీసుకెళ్లవచ్చు.

మంచి సిబిల్ (CIBIL) స్కోర్ ఉన్న కస్టమర్లకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా అందిస్తున్నారు. ఇక భవిష్యత్తులో రాబోయే E-20 పెట్రోల్ నిబంధనల గురించి కస్టమర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. 2018 తర్వాత వచ్చిన ఇంజిన్లు అన్నీ దానికి అనుగుణంగానే డిజైన్ చేశారని ఇక్కడి షోరూమ్స్‌ వారు భరోసా ఇస్తున్నారు. 

డీజిల్, సీఎన్‌జీ కార్ల వినియోగదారులకు ఈ భయమే అవసరం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 18 మెట్రో స్టేషన్ దగ్గరా.. క్రౌన్ ప్లాజా హోటల్ ఎదురుగా ఉన్న పార్కింగ్‌లో ఈ షోర్స్‌ ఉంది. సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలని వారికి.. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్స్ కోరుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. 

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Rishabh Pant Uttarakhand: "నా సొంత ఊర్లో ఇంటి స్థలం ఇప్పించండి సీఎం గారూ"..క్రికెటర్ రిషబ్ పంత్ ఆవేదన!

Amoli Range, Uttarakhand:

Rishabh Pant Uttarakhand CM: టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ నుంచి తన మకాంను పూర్తిగా సొంతూరికి మార్చుకోవాలని భావిస్తున్న ఆయన, అక్కడ 'తొలి ఇల్లు' నిర్మించుకునేందుకు తగిన స్థలాన్ని కొనుగోలు చేసేలా సహాయం చేయాలంటూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు.

పంత్ అభ్యర్థనలోని ముఖ్యాంశాలు..
సొంతూరిపై మమకారంతో తాను పుట్టి పెరిగిన పహాడీ ప్రాంత ప్రజల మధ్య నివసించాలని, ఉత్తరాఖండ్ అభివృద్ధిలో భాగస్వామి కావాలని ఉందని పంత్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే తాను భూమిని కొనుగోలు చేసేందుకు సిద్ధమని పంత్ స్పష్టం చేశాడు. తాను ఉచితంగా భూమిని కోరడంలేదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత ధర చెల్లించి భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

గడచిన మూడేళ్లుగా ఉత్తరాఖండ్‌లో తగిన స్థలం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కుదరలేదని, అందుకే సీఎం సహాయం కోరాల్సి వచ్చిందని రిషబ్ పంత్ ఈ సందర్భంగా తెలిపారు. "ఉత్తరాఖండ్ అభివృద్ధికి తోడ్పడటానికి, నా పహాడీ ప్రజల మధ్య నివసించడానికి నేను నా సొంత ఊరికి తిరిగి వెళ్లాలనుకుంటున్నాను. ప్రభుత్వ ధరలకే భూమిని కొనుగోలు చేసి, నా మొదటి ఇంటిని నిర్మించుకునే అవకాశం కల్పించండి" అని పంత్ అభ్యర్థించారు.

సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందన..
రిషబ్ పంత్ నిన్న రాత్రి చేసిన విజ్ఞప్తిపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సానుకూలంగా స్పందించారు. పంత్ దేశానికే కాకుండా ఉత్తరాఖండ్‌కు కూడా గర్వకారణమని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా 'దేవభూమి' కీర్తిని ఇనుమడింపజేసిన పంత్‌కు మాతృభూమిపై ఉన్న ప్రేమ ఎంతో అభినందనీయమన్నారు.

ఈ విషయంపై ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడామని, త్వరలోనే వారు పంత్‌ను సంప్రదిస్తారని సీఎం తెలిపారు. నిబంధనల మేరకు తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పంత్ భారత జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనలో ఉన్నారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభంకానున్న రెండు టెస్టుల సిరీస్ కోసం ఆయన సిద్ధమవుతున్నారు.

Also Read: కావ్యా మారన్ సూపర్ ప్లాన్..రాబోయే ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ ఇతనే!

Also Read: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట..ఒకే రోజు 8 స్వర్ణ పతకాలు..భారత్‌ ఖాతాలో 39

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

1000 అడుగుల లోయ అంచున చావుతో పోరాటం.. చీరలతో యువకుడిని కాపాడిన పర్యాటకులు!

Hyderabad, Telangana:

 Kalu Waterfall Accident Video Watch: పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆనందంగా గడపడం మానేసి.. లైక్లు, కామెంట్ల కోసం సాహసాలు చేయడం నేటి యువతకు అలవాటుగా మారింది. మహారాష్ట్రలోని మాల్‌షేజ్ ఘాట్ సమీపంలో ఉన్న కాళూ జలపాతం (Kalu Waterfall) వద్ద సరిగ్గా అలాంటి ఓ ప్రమాదకరమైన ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక వీడియో ఇప్పుడు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తూ వస్తోంది.. ఓ యువకుడు జలపాతం అంచున నిలబడి.. సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. నీటి ప్రవాహం విపరీతంగా పెరిగింది.. రాళ్లపై ఉన్న నాచు కారణంగా అకస్మాత్తుగా అతడికి కాలు జారింది. క్షణాల వ్యవధిలోనే ఉధృతంగా పారుతున్న నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోతూ.. వేలాది అడుగుల లోతుండే లోయ జారిపోవడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు..

అక్కడ ఉన్న మిగతా పర్యాటకులు అది చూసి భయంతో కేకలు వేయడం కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. యువకుడి ప్రాణాలు గాల్లో కలసిపోయినట్లే.. అని అంతా భావించిన సమయంలోనే.. అద్భుతమే జరిగింది. లోయలోకి పడిపోయేందుకు సరిగ్గా కొద్ది అంగుళాల ముందు.. అక్కడున్న ఒక భారీ రాయిని యువకుడు గట్టిగా పట్టుకోగలిగాడు.. నీటి ఉధృతికి కొట్టుకుపోకుండా రాతిని పట్టుకుని ప్రాణభయంతో అల్లాడిపోయాడు.

ఆపదలో ఉన్న యువకుడిని కాపాడేందుకు అక్కడ అత్యవసర పరికరాలు ఏవీ లేవు... అయితే, అక్కడున్న పర్యాటకులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. పర్యాటకుల వద్ద ఉన్న చీరలు.. దుస్తులను ఒకదానికొకటి గట్టిగా ముడివేసి తాత్కాలిక తాడు (Makeshift Rope) తయారుచేశారు.

pic.twitter.com/bC8ZWf7Brx

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

కొందరు పర్యాటకులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జలపాతం అంచుకు చేరుకుని.. ఆ చీరల తాడును కింద ఉన్న యువకుడికి అందించారు. యువకుడు ఆ తాడును గట్టిగా పట్టుకోగానే.. పైన ఉన్నవారంతా కలిసి అతడిని సురక్షితంగా పైకి లాగారు.. దీంతో ఆ యువకుడు అతి కష్టం మీద పైకి వచ్చాడు. ఇప్పుడు ఈ గఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

తులం బంగారం ధర ఎంత..? నేడు ఆగస్టు 8వ తేదీ శనివారం పసిడి ధరలు ఇవే..!!

BBhoomi7h ago
Secunderabad, Telangana:

Gold Rate Today: నేడు ఆగస్టు 8వ తేదీ శనివారం బంగారం, వెండి ధరలు చూస్తే..  10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ. 152,140. 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర రూ. 139,462. ఒక కిలోగ్రాము వెండి ధర రూ. 232,620 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బంగారం ధరలు భారీగా పెరగడానికి  ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌లోని మార్పులే అని చెప్పవచ్చు. డాలర్ విలువ పెరగడం.. ప్రపంచవ్యాప్త డీ-డాలరైజేషన్ ప్రభావం బంగారం ధరలలో ఏకకాలంలో పెరుగుదలకు దారితీశాయి. సెంట్రల్ బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పుంజుకోవడానికి దారితీసింది. గత మూడు, నాలుగు రోజులుగా డాలర్ విలువను గమనిస్తే, అది క్రమంగా తగ్గుతూ వస్తోంది. మరోవైపు, రూపాయి విలువ పెరుగుతున్నట్లు గమనించవచ్చు. బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్సు బంగారం ధర  4,300డాలర్ల కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతుండటమే.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏం చెబుతోంది?
బంగారం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇటీవల బంగారం ధరలు తగ్గుతాయని ఒక అంచనాను జారీ చేసింది. బంగారం ధర సుమారుగా 37శాతం మేర తగ్గే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొనడం గమనార్హం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ బంగారం ధరలు తగ్గుతాయని అంచనా వేస్తుండగా, మరికొన్ని బ్రోకరేజ్ సంస్థలు కూడా బంగారం ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నాయి. 

మరి మోతీలాల్ ఓస్వాల్ ఏమంటోంది?

ఇటీవల, మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ సంస్థ కూడా ఈ విషయంలో బంగారం ధరలు వాటి గరిష్ట స్థాయి నుండి సుమారుగా 7 నుండి 8శాతం మేర తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. గత ఏడాది బంగారం ధరలను పరిశీలిస్తే, జనవరిలో ఇది రూ. 1.83 లక్షల (సుమారు $1.50 లక్షలు) వద్ద సర్వకాలిక రికార్డు స్థాయికి చేరుకుంది. అప్పటి నుండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే, ఇప్పుడు బంగారం ధర మళ్లీ రూ. 1.50 లక్షల (సుమారు $1.50 లక్షలు) పైకి కదులుతోంది. ఈలోగా, పెరుగుతున్న ధరల దృష్ట్యా, రాబోయే శ్రావణ మాసంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముడి చమురు ధరల తగ్గుదల బంగారం ధరల పెరుగుదలకు కూడా దోహదపడిందని నిపుణులు అంటున్నారు.

Also Read: ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. గజిని కంటే దారుణం..ఏం అడిగినా.. ఆ మూడే సమాధానాలు..!!

Also Read:ఎస్‌బీఐలో 1,538 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇవే..!!

Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?

Also Read:  రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

0
0
Report

చేయూత పింఛన్లకు నేటి నుంచి దరఖాస్తులు.. అర్హతలు ఏంటంటే?

Hyderabad, Telangana:

Telangana New Pension Eligibility: సామాజిక భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుండే కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణను చేపడుతోంది. ఆగస్టు 15న సుమారు 2.50 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను అధికారికంగా ప్రారంభిస్తారు. ప్రధానంగా ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, డయాలసిస్, ఫైలేరియా, థలసేమియా, హిమోఫీలియా వంటి సమస్యలతో బాధపడే వారికి పెన్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు.

కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ ఈ నెల నుండి నిరంతరంగా కొనసాగుతుంది కాబట్టి దీనికి ప్రత్యేక గడువు లేదు. ఆగస్టు 15 నుండి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందించనున్నట్లు ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క గతంలోనే ప్రకటించారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణిస్తే, వెంటనే వారి పేర్లను జాబితా నుండి తొలగించాలని, అలాగే స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

సామాజిక భద్రతను పటిష్టం చేసే క్రమంలో, పెన్షనర్ మరణిస్తే వారి భాగస్వామికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది ప్రభుత్వం. అలాగే  దివ్యాంగులు, తలసేమియా బాధితుల కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించడంతో పాటు, భార్య లేదా భర్త మరణించిన వారికి తక్షణమే పెన్షన్ వర్తించేలా చర్యలు తీసుకున్నారు.

చేయూత పెన్షన్ కోసం అర్హతలు ఇలా ఉన్నాయి: 
వితంతువులైతే భర్త మరణ ధృవీకరణ పత్రం సమర్పించాలి. విడాకులు పొందిన వారు లేదా కనీసం ఏడాది కాలంగా విడిగా ఉంటున్న ఒంటరి మహిళల విషయంలో తహశీల్దార్ విచారణ నివేదిక అవసరం. అవివాహిత ఒంటరి మహిళల వయస్సు 30 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. దివ్యాంగులకు 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండాలి. సదరం సర్టిఫికేట్ సమర్పించాలి. 50 ఏళ్లు పైబడిన చేనేత కార్మికులు సొసైటీ సభ్యత్వ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి.

తెలంగాణలో చేయూత పింఛన్‌ల ఆదాయ పరిమితి విషయానికి వస్తే, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల కంటే తక్కువ, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉండాలి. నాలుగు చక్రాల వాహనాలు, భారీ వాహనాలు లేదా మూడు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కారు.

Also Read:  ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. గజిని కంటే దారుణం.. ఏం అడిగినా.. ఆ మూడే సమాధానాలు..!!

Also Read:  BRS Party: పాలమూరు ప్రాంతానికి రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ ఓ శని: బీఆర్‌ఎస్‌ పార్టీ

దరఖాస్తు విధానం..
ఇప్పటికే అప్లై చేసినవారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కేవలం సంబంధిత పంచాయతీ లేదా వార్డు అధికారుల ద్వారా ధ్రువీకరించుకుంటే సరిపోతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు చేయూత వెబ్‌సైట్ నుండి ఫారం డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసి సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు సమర్పించాలి. ఆగస్టు 15న ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలను ప్రకటించనుంది. కొత్త రేషన్ కార్డులు, సుమారు 1.50 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు, 2.50 లక్షల మందికి కొత్త పెన్షన్లతో పాటు, గిగ్‌ వర్కర్ల చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. అలాగే, వేతన కోతల నుండి రక్షణ కల్పించేందుకు సంక్షేమ బోర్డు సేవలను కూడా ప్రారంభించనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

ఆగస్టు 15న బుధ-గురు యుతి దృష్టి యోగం.. 4 రాశుల వారికి లక్ ఛేంజ్, ధన వర్షం!

Hyderabad, Telangana:

Mercury-jupiter Effect Telugu: జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు, గురుడు గ్రహాలను అత్యంత శుభ గ్రహాలుగా చెప్పుకుంటారు. బుధుడు బుద్ధి, వ్యాపారంతో పాటు అద్భుతమైన ఆలోచనలు, సంభాషణ నైపుణ్యానికి కారకుడిగా భావిస్తూ ఉంటారు.. గురు దేవుడు అదృష్టం, విద్యతో పాటు ధర్మం, ఆర్థిక సమృద్ధికి ప్రతీకగా చెప్పుకుంటారు.. ఈ రెండు శుభ గ్రహాల మధ్య అరుదైన, అత్యంత శక్తివంతమైన యుతి దృష్టి యోగం ఏర్పడబోతోంది.

ఆగస్టు 15 శనివారం సాయంత్రం 4:51 గంటలకు బుధుడుతో పాటు గురుడు ఒకరికొకరు 0 డిగ్రీల కోణంలోకి వచ్చి.. ఈ శక్తివంతమైన యోగాన్ని ఏర్పాటు చేస్తాయి. ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభంతో పాటు కెరీర్, వ్యాపారాల్లో ఊహించని పురోగతి లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా 4 రాశుల జాతకులు గోల్డెన్ పీరియడ్‌గా మారుతుంది. ఈ సమయంలో అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కలుగుతాయి..

ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
ధనుస్సు రాశి (Sagittarius)

ధనుస్సు రాశి జాతకులకు ఈ యోగం బంపర్ ప్రయోజనాలను అందిస్తుంది. జీవితంలో సానుకూల మార్పులు మొదలవుతాయి. కుటుంబంతో సంతోషకరమైన సమయం ప్రారంభమవుతుంది. కీలకమైన నిర్ణయాలు సునాయాసంగా తీసుకుంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో పురోగతితో పాటు వ్యాపారంలో భారీ డీల్స్ కుదురి ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. నూతన ప్రాజెక్టులు చేతికి వచ్చి ఆర్థికంగా బలపడతారు.

వృషభ రాశి (Taurus)
బుధ-గురు యుతి దృష్టి యోగం వల్ల వృషభ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల సపోర్ట్ లభించి.. పెద్ద పదవులు పొందే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జీతం భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఇది సరైన సమయంగా మారుతుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి.. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

మీన రాశి (Pisces)
ఈ శక్తివంతమైన దృష్ట్యా యోగం వల్ల మీన రాశివారికి కష్టాలన్నీ తొలగిపోతాయి.. ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. వ్యాపార విస్తరించేవారికి నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయంగా మారుతుంది.. ఈ సమయంలో చేసే పెట్టుబడులు భవిష్యత్తులో భారీ లాభాలను అందిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతం పెంపు కూడా కనిపిస్తుంది. దీంతో పాటు కెరీర్ కొత్త మలుపు లభిస్తాయి.

మకర రాశి (Capricorn)
మకర రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగ రంగంలో ప్రమోషన్ దక్కే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యాపారవేత్తలకు ఈ సమయంలో భారీ ప్రాఫిట్ మార్జిన్ ఇచ్చే ప్రాజెక్టులను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు తగ్గి ధన నిల్వలు విపరీతంగా పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement
Advertisement
Back to top