icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అలర్ట్.. త్వరలోనే కీలక ప్రకటన.. 5 ముఖ్యమైన విషయాలు ఇవే..!!

BBhoomiJust now
Secunderabad, Telangana:

8th Pay Commission:  లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఎనిమిదవ వేతన సంఘంపై ఒక కీలక అప్డేట్ వెలువడింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్,  జీతాల పెంపు,  పెన్షన్ సంస్కరణలకు సంబంధించి కమిషన్ తన ప్రక్రియను మరింత వేగవంతం చేసింది.  దీంతో సుమారు 1.9 కోట్ల మందికి నేరుగా లబ్ధి పొందేలా ఈ సమావేశాలు జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు.  2025 నవంబర్ 3వ తేదీన 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన ఒక తాత్కాలిక కమిషన్ ఇది.  తన సిఫార్సులను సిద్ధం చేసేందుకు ఈ కమిషన్ కు 18 నెలల సమయం ఇచ్చారు.  ఈ నేపథ్యంలో 2027 మధ్య నాటికి ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది . అయితే కమిషన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,  పెన్షనర్లు,  ఉద్యోగ సంఘాల  సూచనలు, ఫిర్యాదులను సేకరిస్తుంది.  సమాజంలో ప్రతి వర్గం వారి అభిప్రాయాలను చేర్చడమే ఈ కమిషన్ లక్ష్యం.  వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలను వినేందుకు కమిషన్ పలు రాష్ట్రాల్లో సమావేశాలు కూడా నిర్వహిస్తోంది.  కమిషన్ అధికారిక సమాచారం ప్రకారం ఇటీవల కాలంలో అనేక ముఖ్యమైన చర్యలు తీసుకుంది. 

-2026 మే 29న కమిషన్ మెమోరాండం లను సమర్పించేందుకు గడువును 2026 మే 31వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు పొడిగించింది.  దీనివల్ల ఎక్కువ మంది ఉద్యోగులు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు వీలు కల్పించింది.  

-2026 జూలై 9, 10వ తేదీల్లో కోల్ కతాలో భాగస్వాములైన వారితో సమావేశం జరుగుతుందని కమిషన్ ప్రకటించింది. 

-మే 26వ తేదీ భువనేశ్వర్ పర్యటనకు సంబంధించి ఒక కీలక ప్రకటన కూడా జారీ చేసింది.  దీనిలో భాగంగా జులై 6, 7వ తేదీల్లో ఉద్యోగ సంఘాల నుంచి సూచనలు స్వీకరిస్తుంది.

- మే 21వ తేదీన లక్నోలో.. జూన్ 22, 23 తేదీల్లో జరగాల్సి ఉన్న చర్చలు ఇప్పుడు పూర్తయ్యాయి.  అంతకుముందు 2026 మే 13, 14వ తేదీల్లో ఢిల్లీలో ఉద్యోగ సంఘాలు,  ఇతర భాగస్వాములతో కూడా సమావేశాలు నిర్వహించింది. 

అయితే ప్రస్తుతం  ఫిట్మెంట్ ఫ్యాక్టర్ లేదా జీతాల పెంపునకు సంబంధించి కమిషన్ ఎలాంటి ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు.  రానున్న నెలలో వేతన నిర్మాణాన్ని నిర్ణయించడంలో ఈ చర్చలు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు.  గత వేతన సంఘాల్లో 6వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.86 ఉండగా..  7వ వేతన సంఘంలో దాన్ని 2.57 గా నిర్ణయించారు.  అయితే ఈసారి ఉద్యోగ సంఘాలు అధిక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ డిమాండ్ చేస్తున్నారు.  8వ వేతన సంఘం సిఫార్సులు సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,  69 లక్షల మంది పెన్షనర్ల పై ప్రభావం చూపనున్నాయి.  దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాల ఆదాయం,  జీవనశైలి మారే ఛాన్స్ ఉంటుంది.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,  పెన్షన్ దారులు కమిషన్ సమావేశాలు తాజా సమాచారాన్ని నిశితంగా గమనిస్తున్నారు.  ఎందుకంటే ఈ సమావేశాల్లో చేసే సూచనలు డిమాండ్ లు భవిష్యత్తులో వారి జీతభత్యాలు,  పెన్షన్లకు ఆధారమవుతాయి. 

Also Read: ముడి చమురు ధరలు భారీ పతనం.. నేడు జూన్ 26వ తేదీ పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Also Read: యాపిల్ యూజర్లకు బిగ్ షాక్.. మ్యాక్ బుక్, ఐప్యాడ్ ధరలు ఏకంగా 1లక్ష వరకు పెంపు..!!

Also Read: AI ఇంజనీర్ ఉద్యోగానికి రిజైన్.. వ్యవసాయం చేస్తూ నెలకు లక్షలు సంపాదిస్తున్న యువకుడు..

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

0
0
Report

Husband Support Pregnancy: ప్రెగ్నెన్సీ కేవలం తల్లి ప్రయాణం కాదు..భర్త తోడుంటేనే అది 'సంపూర్ణం' అవుతుంది!

Hyderabad, Telangana:

Husband Support Pregnant Wife: సాధారణంగా గర్భధారణను కేవలం ఒక మహిళకు సంబంధించిన విషయంగానే అందరూ చూస్తుంటారు. కానీ, నిజానికి ఏ మహిళ కూడా ఈ ప్రయాణాన్ని ఒంటరిగా సాగించాల్సిన అవసరం లేదు. తొమ్మిది నెలలు ఆమె బిడ్డను గర్భంలో మోస్తున్నప్పటికీ, ఆ అనుభూతి తల్లిదండ్రులిద్దరికీ చెందుతుంది. ఈ సమయంలో భర్త అందించే తోడ్పాటు ఆ తొమ్మిది నెలలను మరింత ఆరోగ్యకరంగా, ఒత్తిడి లేకుండా, సంతోషంగా మార్చగలదు.

చాలా మంది భర్తలు తమ భార్యను ఆసుపత్రికి చెకప్‌ల కోసం తీసుకెళ్తే బాధ్యత తీరిపోయిందని భావిస్తారు. అది మంచి విషయమే అయినప్పటికీ, భర్త పాత్ర అంతకంటే చాలా పెద్దదని ఫెర్నాండేజ్ హాస్పిటల్‌కు చెందిన కన్సల్టెంట్ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ పల్లవి చంద్ర రావుల అంటున్నారు. 

శారీరక, మానసిక మార్పులను అర్థం చేసుకోండి..
గర్భధారణ సమయంలో మహిళల్లో శారీరక అసౌకర్యాలు, హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే మూడ్ స్వింగ్స్ (భావోద్వేగాల హెచ్చుతగ్గులు), ప్రసవం, భవిష్యత్తుపై ఆందోళనలు సహజం. కొన్ని రోజులు ఆమె చాలా ఉత్సాహంగా ఉండవచ్చు, మరికొన్ని రోజులు విపరీతమైన నీరసం, అలసట లేదా ఒత్తిడికి గురికావచ్చు. ఇలాంటి సమయాల్లో భర్త చూపించే ఓర్పు, అవగాహన ఆమెకు కొండంత అండగా నిలుస్తాయి.

చిన్న చిన్న పనుల్లో..పెద్ద సాయం!
భార్యకు మద్దతుగా నిలవడం అంటే పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు, రోజువారీ చిన్న విషయాల్లో తోడుగా ఉంటే చాలు. అలాగే ఆమెకు నచ్చిన ఆరోగ్యకరమైన వంటకాలు చేయడం, తగినంత నీరు తాగమని గుర్తుచేయడం, విశ్రాంతి తీసుకునేలా ప్రోత్సహించడం వంటివి చేస్తుండాలి.

ఇంటి పనులను పంచుకోవడం వల్ల తనపై భారం తగ్గిందనే భరోసా ఆమెకు లభిస్తుంది. సాయంత్రం వేళల్లో ఆమెతో కలిసి కాసేపు నడవడం వల్ల ఇద్దరి మధ్య బంధం బలపడటమే కాకుండా శారీరకంగానూ మంచిది.

డాక్టర్ చెకప్స్, లేబర్ రూమ్‌లో భర్త పాత్ర
వైద్య పరీక్షలకు భార్యతో కలిసి వెళ్లడం వల్ల గర్భం ఏ విధంగా సాగుతోందో భర్తలకు అవగాహన వస్తుంది. డౌట్స్ ఉంటే డాక్టర్‌ను అడిగి తెలుసుకోవచ్చు. అలాగే ప్రసవానికి ముందు ఇచ్చే క్లాసులకు (Antenatal classes) దంపతులు కలిసి హాజరైతే ప్రసవ వేదనను ఎలా తట్టుకోవాలో, బిడ్డ పుట్టాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక స్పష్టత వస్తుంది.

ముఖ్యంగా ప్రసవ వేదన (Labor Pain) సమయంలో భర్త తోడుండటం ఎంతో అవసరం. ఆ శారీరక, మానసిక శ్రమ సమయంలో భార్య చేయి పట్టుకోవడం, ధైర్యం చెప్పడం, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం వల్ల ఆమెలో భయం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

గర్భధారణ సమయంలో వచ్చే భావోద్వేగాలను తక్కువ చేసి చూడకూడదు. కొన్నిసార్లు ఆమె బాధను చూసి వెంటనే ఏదో ఒక పరిష్కారం చెప్పేయడం కంటే, ఆమె చెప్పేది ఓపిగ్గా వినడమే ఒక భర్త ఇవ్వగల అతిపెద్ద మానసిక మద్దతు.

చివరిగా ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒక బిడ్డకు తండ్రి అయ్యే బాధ్యత డెలివరీ రూమ్ బయట ప్రారంభం కాదు. అది నెలల ముందే.. ఇద్దరూ కలిసి పంచుకునే బాధ్యత, సంరక్షణ ద్వారా మొదలవుతుంది. గర్భధారణ సమయం నుండి భార్యకు తోడుగా ఉండే భర్త, ఆమెకు మాత్రమే కాదు.. పుట్టబోయే తన బిడ్డకు కూడా ఒక సురక్షితమైన, అందమైన భవిష్యత్తును అందిస్తున్నాడని మరవద్దు.

Also Read: భోజనం చేసిన తర్వాత నడిస్తే ఏం జరుగుతుంది? తిన్నాక

Also Read: కోడి కాళ్ల కూర తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది? ఎవ్వరూ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report
Advertisement

AP Rain Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..నేడు, రేపు భారీ వర్షాలు..ఏయే జిల్లాల్లో వర్షసూచన ఉందంటే?

Vijayawada, Andhra Pradesh:

AP Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం నుంచి మధ్య మహారాష్ట్ర వరకు (తెలంగాణ మీదుగా) ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రంలో వర్షాల ప్రభావం పెరగనుంది. శని, ఆదివారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.

శనివారం (27-06-2026) వాతావరణం..
ఉత్తరాంధ్రతో పాటు కింది జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి వాటిలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందట.

అలాగే కోస్తాఆంధ్రాలోని కాకినాడ, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.

ఆదివారం (28-06-2026) వాతావరణం..
ఆదివారం నాడు కింది జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయట.

ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రమాదాల బారిన పడకుండా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో భారీ చెట్ల కింద, హోర్డింగ్స్ (ఫ్లెక్సీలు) కింద లేదా బలహీనమైన షెడ్ల కింద నిలబడకూడదు.

విద్యుత్ ప్రమాదాలు: ఈదురుగాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటికి దూరంగా ఉండాలి. తక్షణమే అధికారులకు సమాచారం అందించాలి.

రైతులకు సూచన: ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశుకాపరులు చెట్ల కింద ఉండకుండా వెంటనే సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలి.

Also Read: ఏపీ ప్రజలకు తీరనున్న కష్టాలు..బంగారు గనిని ప్రారంభం..700 మంది ఉపాధి..

Also Read; విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అపచారం..రూ.500 దర్శనం టికెట్ల గోల్‌మాల్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

The Subhash Chandra Show: బుల్లితెరపైకి డాక్టర్ సుభాష్ చంద్ర 'సచ్' సీజన్ 3.. ఈసారి మరింత వినూత్నంగా!

Noida, Uttar Pradesh:

Sach The Subhash Chandra Show: మీడియా రంగ దిగ్గజం, జీ గ్రూప్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు అయిన డాక్టర్ సుభాష్ చంద్ర తన పాపులర్ టాక్ షో "సచ్: ది సుభాష్ చంద్ర షో" (Sach: The Subhash Chandra Show) మూడవ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జీ మీడియా సమర్పిస్తున్న ఈ సరికొత్త సీజన్ జూన్ 28వ తేదీ నుండి ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు జీ న్యూస్‌తో పాటు జీ నెట్‌వర్క్‌లోని అన్ని ఛానళ్లలో ప్రసారం కానుంది. డిజిటల్ ప్రేక్షకులకు ZEE5 ఓటీటీలోనూ ఇది అందుబాటులో ఉంటుంది.

ఈ సీజన్ ప్రత్యేకత ఏంటి? (కళాశాలల నుండి పల్లెల వరకు..)
గత సీజన్లలో కేవలం విద్యా సంస్థలు, నగరాల యువతపైనే దృష్టి పెట్టిన ఈ షో, ఇప్పుడు తన పరిధిని మరింత విస్తరించింది. ఈసారి చిన్న పట్టణాలు, నగరాలు, గ్రామీణ భారతదేశంలోని సామాన్యుల గళానికి ఈ షో పెద్దపీట వేయబోతోంది. పల్లెటూళ్ల నుండి పుట్టుకొచ్చిన స్థానిక ఆవిష్కరణలు, సామాజిక మార్పులు, స్ఫూర్తిదాయక విజయ గాథలను దేశానికి పరిచయం చేయనున్నారు.

వయసుతో సంబంధం లేకుండా.. అటు నూతన ఆలోచనలతో దూసుకుపోయే యువతను, ఇటు పదవీ విరమణ తర్వాత జీవితంలో సంక్లిష్ట సమస్యలను ఎదుర్కొనే పెద్దలను ఈ వేదికపైకి తీసుకురానున్నారు.

చర్చకు రానున్న కీలక అంశాలు..
మారుతున్న ప్రపంచంలో విద్యార్థులు, యువత, వ్యాపారవేత్తలకు సరైన దిశానిర్దేశం చేయడం కోసం ఈ క్రింది అంశాలపై లోతైన చర్చలు జరగనున్నాయి. టెక్నాలజీ & ఎడ్యుకేషన్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), విద్య, భవిష్యత్ వృత్తులు (Future Careers) వంటి వాటిపై చర్చ జరగనుండగా.. బిజినెస్ & లీడర్‌షిప్ వైపు స్టార్టప్‌లు/వ్యవస్థాపకత, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్.. అలాగే లైఫ్ & సొసైటీ రంగాల్లోని ఆధ్యాత్మికత, నైతిక విలువలు, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి వంటి వాటిపై చర్చ జరగనుంది. 

మీ జీవితానికి డాక్టర్ సుభాష్ చంద్రే 'సారథి'
ఈ మూడవ సీజన్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం 'సారథి' (Sarthi) అనే సరికొత్త డిజిటల్ వేదిక. దీని ద్వారా ప్రజలు నేరుగా డాక్టర్ సుభాష్ చంద్రతో కనెక్ట్ అవ్వవచ్చు. దశాబ్దాల వ్యాపార, సామాజిక అనుభవం ఉన్న ఆయన.. జీవితంలోని కీలక మలుపుల్లో గందరగోళానికి గురయ్యే వారికి ఒక 'సారథి'లా ఆచరణాత్మకమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తారు.

ఎలా సంప్రదించాలి?
ఆసక్తి ఉన్నవారు
https://sach.org.in/sarthi వెబ్‌సైట్ ద్వారా ఆయన ఆలోచనలతో, అనుభవాలతో నేరుగా అనుసంధానం కావచ్చు.

"మీ ప్రయాణంలో నేను తోడుంటాను" - డాక్టర్ సుభాష్ చంద్ర
ఈ షో గురించి డాక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. "సచ్ సీజన్ 3 ఇప్పుడు మీ నగరాలకు, మీ పెద్ద కలలకు విస్తరిస్తోంది. మీ కలలకు రెక్కలు తొడగడానికి మీ దగ్గర ఒక వినూత్నమైన ఆలోచన ఉన్నా, లేదా జీవితంలో, వ్యాపారంలో మీరు ఏ దశలోనైనా ఇబ్బందుల్లో చిక్కుకున్నా.. ఈ ప్రయాణంలో మీకు 'సారథి'గా తోడుండటమే నా లక్ష్యం" అని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..20 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు..ఆ రోజు నుంచే అమలు!

Also Read: రూ.500 లాటరీ టికెట్‌తో రూ.3 కోట్ల జాక్‌పాట్.. ఆ జర్నీతో డ్రైవర్‌ కోటీశ్వరుడయ్యాడు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report
Advertisement

గాయనీ, గాయకులకు జీ తెలుగు సువర్ణావకాశం.. 28న సరిగమప ఆడిషన్స్‌

Bengaluru, Karnataka:

Zee Telugu Sa Re Ga Ma Pa Auditions: తెలుగు ప్రేక్షకులకు విశేషంగా వినోదం అందిస్తున్న జీ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ మరో షోతో ముందుకు వస్తోంది. విశేషంగా ప్రజాదరణ పొందిన జీ తెలుగు సరిగమప మరో సీజన్‌ ప్రారంభం కానుంది. సినీ పరిశ్రమకు ఎంతో మంది గాయకులను అందించిన జీ తెలుగు సరిగమప మరోసారి కొత్త సీజన్‌తో రాబోతున్నది. భావి గాయనీ గాయకులుగా తీర్చిదిద్దేందుకు సరిగమప 17 సీజన్లు పూర్తి చేసుకుంది. 18వ సీజన్‌ తెలుగు సరిగమప త్వరలో ప్రారంభం కానుండగా.. ఈ సీజన్‌లో పాలుపంచుకునే గాయనీ గాయకులకు ఆహ్వానం పలుకుతోంది. బెంగళూరులోని జూన్‌ 28వ తేదీన సరిగమప సీజన్‌కు ఆడిషన్స్‌ నిర్వహించనుంది.

అంతులేని వినోదంతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ‘సరిగమప’తో ప్రతిభావంతులను వెలికితీయడంలోనూ జీ తెలుగు ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జీ తెలుగు నిర్వహిస్తున్న పాపులర్ సింగింగ్ షో సరిగమప ఎంతో మంది గాయనీ గాయకులను పరిచయం చేసిన విషయం తెలిసిందే. విజయవంతంగా 17 సీజన్లు పూర్తి చూసుకున్న జీ తెలుగు తదుపరి సీజన్ ‘సరిగమప‌- ఇండియాస్ నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్’ను ఘనంగా ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విస్తృతంగా తెలంగాణ, ఏపీతోపాటు కర్ణాటకలోనూ ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ప్రతిభావంతులైన గాయనీగాయకులు జీ తెలుగు అందిస్తున్న ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని భావి గాయకులుగా కెరీర్‌ ప్రారంభించండి.

జీ తెలుగు సరిగమప తదుపరి సీజన్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేశంలోని పలు నగరాల్లో గాయనీ గాయకుల కోసం ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ప్రతిభను ప్రోత్సహిస్తూ మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు ఈ ఆదివారం బెంగళూరులో ఆడిషన్స్ జరగనున్నాయి. 18-35 సంవత్సరాల వయసు గల గాయనీగాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. జీ తెలుగు అందిస్తనున్న అద్భుత అవకాశాన్ని యువతీ యువకులు తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. 

సరిగమప- ఇండియస్ నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్ ఆడిషన్స్ జూన్ 28, ఆదివారం బెంగళూరులోని అబ్బయ్య నాయుడు స్టూడియో (మధు ఆర్ట్ స్టూడియో)లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతాయి. ఆసక్తి గల గాయనీ గాయకులు జీ తెలుగు అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని పొందవచ్చు. జీ తెలుగు ‘సరిగమప - ఇండియాస్ నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్’ టైటిల్ కోసం మీరూ పోటీపడండి.. అదృష్టం పరీక్షించుకోండి. తెలంగాణ, ఏపీ నగరాల్లో కూడా త్వరలోనే జీ తెలుగు సరిగమప ఆడిషన్స్ జరగనున్నాయి.

0
0
Report

Viral Video: మళ్లీ ప్రత్యక్షమైన లేడీ అఘోరీ.. శ్మశాన వాటికలో ఒంటికి భస్మం పూసుకుంటూ వీడియో..

Hyderabad, Telangana:

Lady Aghori Viral Video Watch: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ, కొన్ని వీడియోలు మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా.. ఒక క్షణం పాటు ఆశ్చర్యపోయేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఒక సంచలన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది. గతంలో కొన్ని వివాదాలు, ఆసక్తికరమైన ఆధ్యాత్మిక అంశాల ద్వారా వార్తల్లో నిలిచిన  లేడీ అఘోరీ చాలా రోజుల విరామం తర్వాత మళ్లీ నెట్టింట ప్రత్యక్షమయ్యారు. ఆమెకు సంబంధించిన కొత్త వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శ్మశాన వాటికలో లేడీ అఘోరీ..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో లేడీ అఘోరీ ఒక అర్ధరాత్రి సమయంలో శ్మశాన వాటికలో కనిపిస్తున్నారు. అక్కడ చితి పక్కన నిలబడి, శవాల దహనం తర్వాత మిగిలిన పవిత్రమైన భస్మంను ఆమె తన ఒళ్లంతా పూసుకుంటూ కనిపించారు. అఘోరీల జీవన విధానం, వారి పూజా పద్ధతులు సగటు మనుషులకు భిన్నంగా.. అత్యంత రహస్యంగా ఉంటాయి. అందులోనూ మహిళా అఘోరీ ఈ తరహాలో శ్మశానంలో శవాల భస్మాన్ని ధరించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో శివనామ స్మరణలు చూస్తుంటే శివ భక్తిలో ఆమె ఎంతగా లీనమైపోయారో అర్థమవుతోంది.

నెటిజన్ల భిన్నాభిప్రాయాలు.. 
చాలా రోజుల పాటు సోషల్ మీడియాకు, వార్తలకు దూరంగా ఉన్న లేడీ అఘోరీ.. మళ్లీ ఇలాంటి ఒక ఆశ్చర్యపోయే రూపంలో కనిపించడంతో ఈ వీడియో నిమిషాల్లోనే లక్షలాది వ్యూస్, వేలాది కామెంట్లను సొంతం చేసుకుంది. ఈ వీడియోపై సోషల్ మీడియా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.. అఘోరీల సాధన చాలా కఠినమైనదని.. ఇది వారి భక్తికి నిదర్శనమని కొందరు కామెంట్లు పెడుతున్నారు. హర హర మహాదేవ్ అంటూ కామెంట్ల సెక్షన్‌ను నింపేస్తున్నారు. శ్మశానంలో ఒంటరిగా, శవాల బూడిదతో ఒక మహిళ ఇలా చేయడం చూస్తుంటే కాస్త భయంగా.. వింతగా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..

సాధారణంగా అఘోరీల జీవితాలను, వారి ఆచారాలు హిమాలయాల్లోనో లేదా కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లోని శ్మశానాల్లోనో ఎక్కువగా కొనసాగిస్తూ ఉంటారు. అయితే, ఈ లేడీ అఘోరీ మాత్రం తరచూ సమాజంలో తిరుగుతూ.. వార్తల్లో నిలవడం విశేషం. చాలా రోజుల తర్వాత ఆమె మళ్లీ ఇలా శ్మశాన వాటికలో భస్మధారణ చేస్తూ కనిపించడంతో, ఈ కొత్త వీడియో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

0
0
Report

ఆర్టీసీ బస్సులో సిగరెట్‌ కాల్చిన కండక్టర్‌.. మద్యం మత్తులో వీరంగం

Vinukonda, Andhra Pradesh:

RTC Bus Cigarette Smoke: ఎంతో మంది ప్రయాణికులను ప్రజా సేవగా భావించి వారితో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఆర్టీసీ కండక్టర్‌ రెచ్చిపోయాడు. తాగి విధులకు హాజరవడమే కాకుండా తాగిన మైకంలో అనుచితంగా ప్రవర్తించాడు. ప్రయాణికులతో దుర్భాషలాడుతూ వారిపై బూతు పంచాంగం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా బస్సులోనే సిగరెట్‌ కాలుస్తూ వీరంగం సృష్టించాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వైరల్‌గా మారిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో ఆర్టీసీ కండక్టర్ అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన సంఘటన వినుకొండలో జరగడం కలకలం రేపింది. మద్యం మత్తులో బస్సులోనే సిగరెట్ కాలుస్తూ.. ఇదేమిటని ప్రశ్నించిన ప్రయాణికులను అసభ్య పదజాలంతో దూషించాడు. బొల్లపల్లి మండలం దోమలగుండం గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో డ్యూటీ ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఒక ఆర్టీసీ కండక్టర్ ఎక్కాడు. 

అతడు అప్పటికే పూర్తిగా మద్యం మత్తులో తూగుతున్నాడు. తాగిన మైకంలో ఆర్టీసీ బస్సులోనే నిబంధనలకు విరుద్ధంగా సిగరెట్ వెలిగించాడు. సిగరెట్‌ పొగతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అతడిని ప్రయాణికులు వారించబోగా ఆ కండక్టర్‌ మరింత రెచ్చిపోయాడు. తాగిన మైకంలో ప్రయాణికులతో అసభ్యకర రీతిలో ప్రవర్తించడమే కాకుండా బూతుల పంచాంగం మొదలుపెట్టాడు. అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ వీరంగం సృష్టించాడు.

అతడు బస్సులో వ్యవహరించిన తీరుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. తమకు రక్షణగా.. ఆదర్శంగా ఉండాల్సిన ఆర్టీసీ సిబ్బందే ఇలా ప్రవర్తించడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన ఆ కండక్టర్‌పై అంతర్గత విచారణకు ఆర్టీసీ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అతడిని విధుల నుంచ సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్ల తెలుస్తోంది.

0
0
Report
Advertisement

రూ.1,699కే అధునాతన AI ఫీచర్లతో itel Power 451 లాంచ్.. 55 రోజుల బ్యాటరీ లైఫ్!

Hyderabad, Telangana:

Itel Power 451 Price In India: భారతదేశంలో బడ్జెట్ మొబైల్ కంపెనీలు మార్కెట్లో తిరుగులేని బ్రాండ్‌గా మారిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఐటెల్ (itel)కు సంబంధించిన మొబైల్స్‌కి డిమాండ్‌ విపరీతంగా పెరుగుతూ వస్తోంది. సామాన్యుల కోసం మరో అద్భుతమైన ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే లభించే.. అద్భుతమైన ఫీచర్స్‌.. ఐటెల్ కంపెనీ విడుదల చేసిన ఐటెల్ పవర్ 451 (itel Power 451) మోడల్‌లో కూడి అందుబాటులోకి తీసుకు వచ్చింది. కేవలం రూ. 1,699 ధరకే లభించే ఈ ఫోన్.. అధునాతన ఏఐ (AI) ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీతో కస్టమర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

తొలిసారిగా AI-ENC టెక్నాలజీ..
సాధారణంగా రద్దీగా ఉండే మార్కెట్లు, బస్టాండ్లు లేదా ప్రయాణాలు చేసే క్రమంలో ఫోన్ మాట్లాడితే చుట్టుపక్కల వచ్చే శబ్దాల (బ్యాక్‌గ్రౌండ్ నాయిస్) వల్ల అవతలి వారికి మాటలు సరిగ్గా వినిపించవు. ఈ సమస్యకు ఐటెల్ శాశ్వత పరిష్కారం చూపిన్నట్లు తెలుస్తోంది. చరిత్రలోనే మొదటిసారిగా ఈ ఫోన్‌లో AI-ENC (Artificial Intelligence Environmental Noise Cancellation) సాంకేతికతను అందించింది. ఇది వాహనాల హారన్లు, గాలి శబ్దం వంటి అనవసరపు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను గుర్తించి, వాటిని పూర్తిగా మ్యూట్ చేస్తున్నట్లు కంపెనీ క్లైమ్‌ చేస్తోంది. దీనివల్ల వినియోగదారులు ఎంతటి రద్దీ ప్రదేశంలో ఉన్నప్పటికీ స్పష్టమైన వాయిస్ కాల్స్ మాట్లాడుకునే సదుపాయం లభిస్తుంది.

శక్తివంతమైన బ్యాటరీ.. 55 రోజుల స్టాండ్‌బై టైమ్..
ఐటెల్ పవర్ 451 ఫోన్‌లో 2500 mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్‌లోని సూపర్ బ్యాటరీ మోడ్‌తో పాటు AI మోడ్ సహాయంతో ఏకంగా 55 రోజుల వరకు లాంగ్ స్టాండ్‌బై టైమ్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది.. రోజంతా ఇంటి బయట ఉంటూ.. పనుల్లో బిజీగా ఉండే వారికి, తరచూ చార్జింగ్ పెట్టుకునే వీలులేని వారికి ఈ ఫోన్ ఒక అద్భుతమైన వరం లాంటిదని చెప్పవచ్చు.

మోడ్రన్ టైప్-సి (Type-C) చార్జింగ్ సపోర్ట్..
ప్రస్తుత దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్లు టైప్-సి చార్జింగ్‌తోనే వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఐటెల్ ఈ చిన్న ఫోన్‌లో కూడా టైప్-సి (Type-C) చార్జింగ్ పోర్ట్‌ను అందించిందన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల వినియోగదారులు అదనంగా మరో చార్జర్ మోయాల్సిన అవసరం లేకుండా.. స్మార్ట్‌ఫోన్ చార్జర్‌తోనే దీనిని సులభంగా చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్లు ఇవే..
ఇందులో 2.4-ఇంచుల స్పష్టమైన డిస్ల్పేను అందించిన్నట్లు తెలుస్తోంది. మెమరీని పెంచుకోవడానికి వీలుగా 32GB వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ సపోర్ట్‌ను కూడా అందుబాటులో ఉంచింది..ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు రికార్డింగ్ కలిగిన వైర్‌లెస్ ఎఫ్‌ఎమ్ (Wireless FM) రేడియోను అందించారు. భారతదేశంలోని విభిన్న ప్రాంతాల ప్రజల కోసం ఈ ఫోన్ మొత్తం 10 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది.. అంతేకాకుండా వాయిస్ అసిస్టెన్స్ కోసం  కింగ్ వాయిస్ ఫీచర్, ఆటో కాల్ రికార్డింగ్ సపోర్ట్‌ కూడా లభిస్తోంది. ఇది మార్కెట్‌లో ఈ ఫోన్ కేవలం రూ. 1,699 ధరకే అందుబాటులోకి వచ్చింది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Telangana New CS: తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీ ఇతనే..సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్లానింగ్‌తో నిర్ణయం!

Hyderabad, Telangana:

Telangana New Chief Secretary: తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) ఎంపికపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర నూతన సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ కె.రామకృష్ణా రావు పదవీ కాలం ఈ నెలాఖరుతో (జూన్ 30) ముగియనుండటం వల్ల సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

సంజయ్ జాజు‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును తెలంగాణకు పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం మన్నించింది. దీంతో ఆయనను మాతృ రాష్ట్ర కేడర్‌కు రిలీవ్ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సంజయ్ జాజు 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక హోదాల్లో పనిచేశారు. ముఖ్యంగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (MCH) కమిషనర్‌గా సేవలందించిన అనుభవం ఆయనకు ఉంది. సుమారు 13 ఏళ్లకు పైగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన.. ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌కాస్టింగ్, డోనర్ (DoNER) సెక్రటరీగా అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

రేవంత్ రెడ్డి మార్క్ వ్యూహం..
కొత్త సీఎస్ ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో సంజయ్ జాజుకు ఉన్న సుదీర్ఘ అనుభవం, సంబంధాలు రాష్ట్ర అభివృద్ధికి ప్లస్ అవుతాయని సీఎం భావించారు.

ముఖ్యమైన లక్ష్యాలు:
కొత్త సీఎస్‌గా సంజయ్ జాజును నియమించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి సుదీర్ఘమైన లక్ష్యాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. అందులో హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులను పరుగులు పెట్టించడంతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు (RRR)నిర్మాణానికి అవసరమైన అడ్డంకులను తొలగించడం వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుండి త్వరితగతిన అనుమతులు, నిధులు సాధించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఈయన వైపు మొగ్గు చూపారు.

జూన్ 30న బాధ్యతల స్వీకరణ
కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన సంజయ్ జాజు ఈ నెల 30వ తేదీన తెలంగాణ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే సమయంలో ప్రస్తుత సీఎస్ కె.రామకృష్ణా రావు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ప్రభుత్వంలో మరో కీలకమైన బాధ్యతను అప్పగించే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.

Also REad: Telangana Rains: ద్రోణి ప్రభావం..తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు..

Also Read: ఆ ప్రాంతంలో నిత్యం టిఫిన్ ఉచితం..365 రోజులు ఎప్పుడు వచ్చినా ఫుడ్ పెడతారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

AP Panchayat Raj Promotions: ఆ శాఖలో ఉద్యోగులకు డిప్యూటీ సీఎం బంపర్ ఆఫర్.. భారీగా పదోన్నతులుకి గ్రీన్ సిగ్నల్!

Vijayawada, Andhra Pradesh:

AP Panchayat Raj Promotions List: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియలో మరో కీలక అడుగు ముందుకు పడింది.

డీడీఓలుగా 42 మంది ఎంపీడీఓలు
డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (DPC) తాజాగా 42 మంది మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ల (MPDO) సీనియారిటీ జాబితాను ఆమోదించింది. వీరందరికీ త్వరలోనే డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు(DDO)గా ప్రమోషన్ లభించనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ శాఖలో పదోన్నతులు భారీగా జరగడం ఆ శాఖ ఉద్యోగులకు ఆనందంలో ముంచెత్తుతుంది.

అయితే గత పదేళ్ల కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు ఇవ్వడం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. అంతకుముందు కూడా ఇదే శాఖలో దాదాపు 10,000 మందికి పైగా ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది.

పంచాయితీ రాజ్ ఉద్యోగుల హర్షం.. 
ప్రభుత్వ నిర్ణయంపై పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పదోన్నతులు తమలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని, గ్రామీణాభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడానికి దోహదపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

డిప్యూటీ సీఎం సీరియస్ రివ్యూ..
మరోవైపు వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణ తేజ్, ఇతర ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా పలు ఆదేశాలు జారీ చేశారు.

పవన్ కళ్యాణ్ ఆదేశాల్లోని ముఖ్యాంశాలు..
పారిశుధ్యానికి తొలి ప్రాధాన్యత.. గ్రామ పంచాయతీలన్నీ అప్రమత్తంగా ఉంటూ పారిశుధ్య నిర్వహణను పక్కాగా చేపట్టే విధంగా ప్రణాళిక రూపొందించారు.

దోమల నివారణ: దోమల నియంత్రణ కోసం గ్రామాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలి. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి.

సురక్షిత తాగునీరు: తాగునీటి నాణ్యత పరీక్షలను నిరంతరం నిర్వహించడంతో పాటు, పైప్‌లైన్ లీకేజీలను తక్షణమే అరికట్టాలి.

ఫ్రైడే - డ్రైడే: ప్రతివారం "ఫ్రైడే - డ్రైడే" కార్యక్రమాన్ని విధిగా, సక్రమంగా అమలు చేయాలి.

వ్యర్థాల నిర్వహణ: ఘన వ్యర్థాల నిర్వహణపై గ్రామీణ ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి.

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు!
ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని పవన్ కళ్యాణ్ అధికారులను హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా జిల్లా, మండల స్థాయిల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీములను (RRT) సిద్ధంగా ఉంచాలని, అలాగే ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.

Also REad: ఏపీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. విద్యుత్ శాఖలో 629 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

Also REad: బాబాయ్ ఆశీస్సులు తీసుకున్న అబ్బాయ్.. మంగళగిరిలో డిప్యూటీ సీఎంను కలిసిన రామ్‌చరణ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report
Advertisement

Python Video: కొండచిలువకు ముద్దు పెట్టబోయాడు.. కట్ చేస్తే ముక్కు, నోరు కొరికేసింది.. వైరల్!

Hyderabad, Telangana:

Python Video Watch Here: సోషల్ మీడియా క్రేజ్, రీల్స్ పిచ్చి యువత ప్రాణాల మీదకు తెస్తోంది.. కేవలం లైకులతో పాటు వ్యూస్ కోసం కొందరు చేసే ప్రమాదకరమైన విన్యాసాలు ఊహించని విషాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఒక యువకుడు అత్యంత ప్రమాదకరమైన కొండచిలువతో సాహసం చేయబోయి.. చావు అంచుల దాకా వెళ్ళిన భయంకరమైన వీడియో ఒకటి సోషల్ మీడియా వినియోగదారులను వనికించేలా చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ను సైతం షేక్ చేస్తుంది. ఈ వీడియో ఎప్పటిదో అయినప్పటికీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని రీతిలో వైరల్ అవ్వడం విశేషం.. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ముద్దు పెట్టబోతే.. ఏం జరిగిందో చూడండి..
వైరల్ అవుతున్న వీడియో వివరాల ప్రకారం.. ఒక యువకుడు భారీ పరిమాణంలో ఉన్న కొండచిలువ తలభాగాన్ని చేతిలో పట్టుకొని ఉండటం మీరు గమనించవచ్చు. సాధారణంగానే కొండచిలువలు అత్యంత బలమైనవి, ప్రమాదకరమైనవిగా భావిస్తారు.. అయితే ఆ యువకుడు ఏమాత్రం భయం లేకుండా ఆ పాముతో ఆటలాడడం మొదలుపెట్టాడు.  అంతటితో ఆగకుండా.. ఆ కొండచిలువను నెమ్మదిగా తన ముఖం వైపుకు.. తిప్పుకుంటూ.. దాని మూతికి దగ్గరగా.. తన ముఖాన్ని తీసుకెళ్లాడు.. బహుశా ఆ యువకుడు దానికి ముద్దు పెట్టుకోవడానికో.. లేదా కెమెరాకు క్రేజీగా ఫోజ్ ఇవ్వడానిko అతడు ప్రయత్నించి ఉండవచ్చు..

కానీ మరుక్షణమే అక్కడ ఊహించని ఘోరం జరిగిపోయింది.. అతనిపై దాడికి వస్తుందనుకుందో... ఏమో కానీ.. ఆ కొండచిలువ ఒక్కసారిగా మెరుపు వేగంతో యువకుడి పై దాడి చేసింది. దానికున్న పదునైన పళ్ళతో.. ఆ యువకుడి ముక్కుతో పాటు నోటి భాగాన్ని కలిపి గట్టిగా పట్టుకొని ఉండడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు.. పాము నోటికి చిక్కిన యువకుడు నరకయాతన అనుభవించడం కూడా మీరు ఈ వీడియోలో క్లియర్గా గమనించవచ్చు. దాని పట్టు నుంచి తప్పించుకోవడానికి అతను పడిన ఆరాటం చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోయినంత పని అవుతుంది..

కొండచిలువలు ఒకసారి పట్టుకుంటే అంత సులభంగా వదలవని మనందరికీ తెలుసు.. ఆ పాము యువకుడి ముఖాన్ని గట్టిగా లాగుతుండడంతో.. అతడు విపరీతమైన నొప్పితో పాటు.. ప్రాణ భయంతో విలవిలలాడిపోతున్నాడు.. ఆ పాము నుంచి తన ముఖాన్ని విడిపించుకోవడానికి సర్వశక్తులు వినియోగించి ఎంతగానో కష్టపడ్డాడు.. ఈ బీకర దృశ్యాన్ని పక్కనే ఉండి రికార్డు చేస్తున్న వ్యక్తి కూడా ఒక్కసారిగా షాక్కు గురైపోయినట్లు తెలుస్తోంది..

Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో వైరల్..
ఈ ఆశ్చర్యం కలిగించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా స్పందిస్తూ వస్తున్నారు.. ఇలాంటి పిచ్చి పనుల వల్ల ప్రాణాలకే ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నారు.. వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన పాములతో చెలగాటమాడితే ప్రకృతి ఇలాగే బుద్ధి చెబుతుందని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.. ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి ప్రమాదకరమైన పాముల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటి ప్రమాదం ఉంచుకొస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనంగా భావించవచ్చు..

Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

0
0
Report

Video: పాపం.. పసిపాప అని చూడకుండా కాలితో తన్నిన మహిళ.. వీడియో వైరల్!

Hyderabad, Telangana:

 Kicks Child Video Watch: మానవత్వం మంట కలిసి పోతుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన చేతులే.. పసిబిడ్డపై రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. మహారాష్ట్రలోని పన్వేల్ తాలూకా నంద్‌గావ్ గ్రామంలో ఓ చిన్నారిపై మహిళ అమానుషంగా దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా కాకుండా దేశవ్యాప్తంగా తీవ్రత కలకలం రేపతోంది.. అంతేకాకుండా ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు సైతం మహిళ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కాలితో తన్నుతూ..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ప్రకారం చూస్తే.. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్న ఒక చిన్నారిని.. ఒక మహిళ ఎలాంటి జాలి దయ లేకుండా విరుచుకు పడింది.  అధికారిక సమాచారం ప్రకారం.. బాధితురాలు స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకుంటున్న ఒక మైనర్ బాలిక. ఆ చిన్నారిపై ఓ మహిళ ఎలాంటి జాలి, దయ లేకుండా విరుచుకుపడింది. పసిపాప అని చూడకుండా.. ఆ అంగన్వాడి మహిళ.. పాపం నేలపై పడేసి కాలితో పదే పదే తన్నడం మీరు ఈ వీడియోలో స్పష్టంగా గమనించవచ్చు. ఆ మహిళ ఏమాత్రం దయ లేకుండా తన క్రూరత్వాన్ని ప్రదర్శించడం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది..

సోషల్ మీడియా వినియోగదారుల ఆగ్రహం..
ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియో పై తీవ్రంగా స్పందిస్తూ వస్తున్నారు. ఈమె మనిషా.. లేదంటే రాక్షసా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. నిస్సహాయురాలైన చిన్నారిపై ఇంతటి దాడికి పాల్పడడం చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆ మహిళను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో జాతీయస్థాయిలో కూడా దీనిపై చర్చ నడుస్తోంది..

 
 
 
 
 

Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..

రంగంలోకి దిగిన పోలీసులు..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. వైరల్ అవుతున్న వీడియోను ఆధారంగా తీసుకొని నిందితురాలిని గుర్తించే పనిలో పడ్డట్లు సమాచారం.. నంద్‌గావ్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద అసలు ఏం జరిగిందనే కోణంలో విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది. బాలల హక్కుల పరిరక్షణ చట్టం కింద, ఇతర కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. నిందితురాలిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు కూడా స్పందించినట్లు సమాచారం.. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది..

Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

0
0
Report

Amazonలో బంపర్ ఆఫర్.. రూ.4,599 పీట్రాన్ 20000mAh పవర్ బ్యాంక్ కేవలం రూ.1,299కే!

Hyderabad, Telangana:

Ptron Dynamo Power 20000mah Amazon Discount: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ లేనిదే క్షణం గడవదు... నిరంతరం ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియా వినియోగం, వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం వల్ల ఫోన్ బ్యాటరీ చాలా త్వరగా డిఛార్జ్‌ అవుతుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసే క్రమంలో లేదా కరెంట్ లేని సమయాల్లో ఛార్జింగ్ అయిపోతే వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు.. ఇలాంటి సమస్యలకు శాశ్వత చెక్ పెట్టడానికి పవర్ బ్యాంక్ అనేది ప్రతి ఒక్కరికీ అత్యవసర Gadget మారింది. నేటి యువత చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, మీరు కూడా ఎప్పటి నుంచో మంచి వపర్‌బ్యాంక్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు.

అమెజాన్‌లో బంపర్ ఆఫర్..
pTron సంస్థకు సంబంధించిన Dynamo Power 20000mAh స్మార్ట్ పవర్ బ్యాంక్‌పై ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ (Amazon)లో మునుపెన్నడూ చూడని రీతిలో అద్భుతమైన ఆఫర్స్ అందిస్తూ వస్తోంది. ఎన్నో ప్రీమియం ఫీచర్లతో కూడిన ఈ పవర్ బ్యాంక్ అసలు ధర (MRP) మార్కెట్లో రూ.4,599 ధరతో లభిస్తోంది. అయితే, ప్రస్తుతం అమెజాన్‌లో జరుగుతున్న స్పెషల్ సేల్‌లో భాగంగా దీనిపై భారీ ఫ్లాట్ తగ్గింపును అందిస్తున్నారు. ఈ స్పెషల్ ఆఫర్‌ను వినియోగించి ఈ భారీ 20000mAh కెపాసిటీ పవర్ బ్యాంక్‌ను కేవలం రూ.1,299 లకే సొంతం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడే కొనుగోలు చేసేవారికి  ఏకంగా రూ.3,300 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

pTron Dynamo Power 20000mAh ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు..
ఇందులో 20000mAh బ్యాటరీ ఉండటం వల్ల, స్మార్ట్‌ఫోన్‌ను సులభంగా 4 నుంచి 5 సార్లు ఫుల్ ఛార్జ్ చేసుకునే అవకాశం లభిస్తోంది. దూర ప్రయాణాలు చేసేవారికి ఇది బెస్ట్ పవర్‌ హౌజ్‌ మారుతుందని భావించవచ్చు. అలాగే ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చేతిలో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉండేలా కాంపాక్ట్ డిజైన్‌తో దీన్ని తయారు చేశారు. ఈ స్మార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మీ మొబైల్స్, ఇయర్‌బడ్స్, స్మార్ట్ వాచ్‌లను సింపుల్‌గా వేగంగా ఛార్జ్ చేస్తుంది. అంతేకాకుండా ఒకేసారి రెండు పరికరాలను ఛార్జ్ చేసుకునే సపోర్ట్‌ కూడా అందుబాటులో ఉండడం విశేషం. ఇది టైప్-సి (Type-C), మైక్రో USB అవుట్‌పుట్ ఆప్షన్స్ యూజర్లకు మరింత అద్బుతంగా ఉంటుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

అదనపు బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు..
ఈ పవర్ బ్యాంక్ ధర కేవలం రూ. 1,299కే ఉండడమే కాకుండా.. కస్టమర్ల కోసం అమెజాన్ అదనంగా పలు బ్యాంక్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు కొనుగోలు చేసే సమయంలో కొన్ని క్రెడిట్స్‌ లేదా డెబిట్ కార్డులను ఉపయోగిస్తే తక్షణ క్యాష్‌బ్యాక్ లేదా అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.. ఒకవేళ మీరు ఆ ఆఫర్లను కూడా వినియోగించుకుంటే.. ఈ ప్రీమియం స్మార్ట్ పవర్ బ్యాంక్‌ను రూ.1,299 కంటే ఇంకా తగ్గింపు ధరకే మీ సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top