హైదరాబాద్ లో వానలు, కూలిన 200 పురాతన వృక్షం, 4 బైకులు ధ్వంసం, ఒకరికి గాయాలు
హైదరాబాద్ టోలిచౌకి గోల్కొండ ఎండి లైన్స్ లోని ఈదురా గాలులతో కూలీనా 200 సంత్సరాల చెట్టు.. చెట్టు కూలడం వల్ల ఓ వ్యక్తి కి తల పై గాయాలయ్యాయి మరియు 4ద్విచక్ర వాహనాలు డామేజ్ అయినాయి. సంఘటన స్థలానికి చేరుకున్న DRF బృందం సహాయక చర్యలు చేపట్టారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
US 500 Percent Tariff On India: ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో రూపొందించిన "గ్రాహం-బ్లూమెంటల్ ఆంక్షల బిల్లు"కు ట్రంప్ పచ్చజెండా ఊపారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుండి చమురు, యురేనియం కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కఠినమైన చర్యలు తీసుకోనుంది.
బిల్లులోని ప్రధానాంశాలు..
500% సుంకం: రష్యా నుంచి చమురు లేదా యురేనియం కొనుగోలు చేసే ఏ దేశంపై అయినా సరే, ఆ దేశం నుండి అమెరికాకు వచ్చే ఎగుమతులపై 500 శాతం వరకు సుంకాలను విధించే అధికారం ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడికి కల్పిస్తుంది.
పుతిన్ యుద్ధానికి కావాల్సిన నిధులు రష్యా చమురు ఎగుమతుల ద్వారానే అందుతున్నాయని, ఆ నిధుల మూలాన్ని కత్తిరించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని సెనేటర్ లిండ్సే గ్రాహం స్పష్టం చేశారు. కేవలం సుంకాలే కాకుండా, సదరు దేశాలపై ఇతర ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం కూడా ఉంది.
భారత్, చైనా, బ్రెజిల్‌లకు హెచ్చరిక?
రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలకు ఈ బిల్లు నేరుగా హెచ్చరిక వంటిది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారత్ రష్యా నుండి భారీగా చమురును కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందితే, భారత వాణిజ్యంపై అమెరికా ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్ శాంతి చర్చల కోసం రాయితీలు ఇస్తున్న తరుణంలో, పుతిన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచి యుద్ధాన్ని శాశ్వతంగా ఆపాలని ట్రంప్ పరిపాలన భావిస్తోంది.
తదుపరి అడుగులు ఎప్పుడు?
బుధవారం ట్రంప్‌తో సమావేశమైన అనంతరం సెనేటర్ గ్రాహం ఈ విషయాన్ని ధృవీకరించారు. వైట్ హౌస్ వర్గాలు కూడా ట్రంప్ మద్దతును ఖరారు చేశాయి. వచ్చే వారం ప్రారంభంలోనే సెనేట్‌లో ఈ బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. హౌస్, సెనేట్ రెండూ ఆమోదిస్తే ఇది చట్టంగా మారుతుంది.
ఒకవైపు ఈ కఠిన ఆంక్షలు విధిస్తూనే, మరోవైపు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కోసం రాయబారాలు నడుపుతున్నారు.
ఈ ఆంక్షల ప్యాకేజీ కేవలం రష్యానే కాకుండా, అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను భారత్ వంటి మిత్రదేశాలతో అమెరికాకు ఉన్న సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
Also Read: School Holiday: విద్యార్థులకు పండగ లాంటి వార్త..రిపబ్లిక్ డే స్కూళ్లకు 3 రోజులు సెలవులు..ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Capital Amaravati: రాజధాని అమరావతికి గుర్తింపు దక్కడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్న సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా రాజధాని అమరావతిని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రాజధానికి చట్టబద్దత కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేశారు. రాజధానిగా అమరావతిని గుర్తించడంతో అనేక ప్రయోజనాలు ఉంటాయని వివరించారు.
Also Read: Kavitha Congress: కాంగ్రెస్‌లోకి కేసీఆర్ గారాలపట్టీ కల్వకుంట్ల కవిత.. ఇదిగో ప్రూఫ్!
ఏపీలో పోలవరం ప్రాజెక్టు పర్యటన ముగించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడ బిజీబిజీగా గడిపిన సీఎం చంద్రబాబు కేంద్ర హోం మంత్రితో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్దత కల్పిస్తే విశ్వవ్యాప్త గుర్తింపు లభిస్తుందని.. వెంటనే ఇది చేయాలని విన్నవించారు. రాజధానిగా గుర్తింపు ఇస్తే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు... రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్టు అవుతుందని హోంమంత్రికి వివరించారు.
Also Read: MANUU Lands: యూనివర్సిటీ భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తావా? హరీశ్ రావు
ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన జీ రామ్ జీ పథకంలోని కొన్ని అంశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం ఇప్పటికే సహకరిస్తోందని ప్రశంసించిన సీఎం చంద్రబాబు.. ఇదే తరహా సహకారాన్ని కొనసాగించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
Also Read: Amaravati Avakai: రేపటి నుంచి ఆవకాయ్ -అమరావతి ఉత్సవాలు.. ఏ రోజు ఏముంటాయంటే?
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రామాలు, తాజా పరిణామాలను అమిత్‌షాతో చంద్రబాబు పంచుకున్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, నిధులు, ప్రాజెక్టుల అంశంపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రులకు వివరించనున్నారు. రానున్న కేంద్ర బడ్జెట్లో ఏపీ ప్రాధాన్యాలు నెరవేరేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
School Holiday: విద్యార్థులకు పండగ లాంటి వార్త..రిపబ్లిక్ డే స్కూళ్లకు 3 రోజులు సెలవులు..ఎప్పుడంటే?
School Holidays News: ఇటీవలే హాఫ్ ఇయర్లీ పరీక్షల తర్వాత విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 12 రోజుల సుదీర్ఘ విరామం ముగించుకుని ఇప్పుడే స్కూళ్లకు వెళ్తున్న ఇది శుభవార్తే అని చెప్పాలి. ఈ నెలలో సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా భారీగా సెలవులను ప్రకటించింది.
సంక్రాంతికి 5 రోజులు సెలవులు..
జనవరి మధ్యలో వచ్చే పొంగల్ పండుగను పురస్కరించుకుని బుధవారం నుండి ఆదివారం వరకు వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.
జనవరి 14 (బుధవారం): భోగి పండుగ
జనవరి 15 (గురువారం): సంక్రాంతి
జనవరి 16 (శుక్రవారం): తిరువల్లువర్ దినోత్సవం / మట్టు పొంగల్
జనవరి 17 (శనివారం): ఉజ్వవర్ తిరునాళ్ (రైతుల పండుగ)
జనవరి 18 (ఆదివారం): వారపు సెలవు
రిపబ్లిక్ డే: 3 రోజుల వీకెండ్!
జనవరి చివరి వారంలో రిపబ్లిక్ డే సందర్భంగా మరో మూడు రోజుల విరామం లభించనుంది. సోమవారం సెలవు రావడంతో శని, ఆదివారాలు కలిపి లాంగ్ వీకెండ్ రాబోతోంది.
జనవరి 24 (శనివారం): వారాంతపు సెలవు
జనవరి 25 (ఆదివారం): వారాంతపు సెలవు
జనవరి 26 (సోమవారం): గణతంత్ర దినోత్సవం (ప్రభుత్వ సెలవు)
జనవరి 2026 - మొత్తం ప్రభుత్వ సెలవుల జాబితా:
తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన 2026 క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో మొత్తం 5 ప్రధాన ప్రభుత్వ సెలవులు ఉన్నాయి.
జనవరి 1: ఆంగ్ల నూతన సంవత్సరం
జనవరి 15: పొంగల్
జనవరి 16: తిరువల్లువర్ దినోత్సవం
జనవరి 17: ఉజ్వవర్ తిరునాళ్
జనవరి 26: గణతంత్ర దినోత్సవం
ఎవరికి వర్తిస్తాయి?
ఈ సెలవులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలతో పాటు బ్యాంకులకు (RBI మార్గదర్శకాల ప్రకారం) వర్తిస్తాయి. వరుస సెలవులు ఉండటంతో తల్లిదండ్రులు తమ కుటుంబ ప్రయాణాలను లేదా ఊరికి వెళ్లే ప్లాన్లను ఇప్పుడే సిద్ధం చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
King Cobra Virao Video: భయం లేదు.. బెరుకు లేదు.. సాహసమంటే ఎంతో ఇష్టపడే హీరోయిన్ సదా ఓ భారీ పామును ఒడిసిపట్టింది. జియోగ్రాఫిక్ చానల్లో చూసినట్టు అతి పేద్ద పామును హీరోయిన్ పట్టుకుంది. తనతోపాటు కొందరిని సహాయంగా తీసుకుని ఓ ఇంట్లో దూరిన పామును పట్టుకుని అడవిలో వదిలేశారు. చూడగానే గగుర్పొడిచే 16 అడుగుల పామును హీరోయిన్ భయం లేకుండా సాహసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలను హీరోయిన్ సదా విడుదల చేశారు.
Also Read: KTR Counter: ఖమ్మం గడ్డపై ముగ్గురు మంత్రులకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
జయం సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సదా అనంతరం అనేక విజయవంతమైన సినిమాలు చేసిన విషయం తెలిసిందే. సినిమాల తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న సదా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వైల్డ్ లైఫ్‌ను ఇష్టపడుతున్న ఆమె తరచూ సాహస యాత్రలు చేస్తూ ప్రకృతి ఒడిలో జీవితం గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొన్ని సినిమాలు చేయడమే కాకుండా పలు టీవీ షోలలో సదా పాల్గొంటున్నారు.
Also Read: Kavitha Congress: కాంగ్రెస్‌లోకి కేసీఆర్ గారాలపట్టీ కల్వకుంట్ల కవిత.. ఇదిగో ప్రూఫ్!
అలా ప్రేక్షకులకు దగ్గరైన సదా తన ప్రవృత్తి వైల్డ్ లైఫ్‌ను వదలలేదు. ఈ క్రమంలోనే కొన్ని నెలల కిందట ఓ పామును రక్షించారు. ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేశారు. విశాఖపట్టణం సమీపంలోని చెరుకుపల్లి అటవీ ప్రాంతంలో సదా పర్యటించారు. పర్యటిస్తున్న సమయంలో ఓ చోట 16 అడుగుల పాము దాగి ఉందని తెలిసింది. వెంటనే ఆమె అక్కడకు వెళ్లారు. ఆ పాముపై స్థానికులు అప్రమత్తం చేశారు. అయితే తాను పామును ఎప్పుడూ నేరుగా చూడలేదని.. రెస్క్యూ ఆపరేషన్ కూడా చూడలేదని సదా అక్కడే ఉండి మొత్తం చూడడమే కాకుండా తన కెమెరాలో బంధించారు.
Also Read: KTR: ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని ఉరి తీయాలి: కేటీఆర్
అక్కడ నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అతి పెద్ద పాము దూరింది. అక్కడ స్నేక్ క్యాచర్ వెంకట్‌ను పిలిపించి ఆ పామును పట్టించారు. అతి కష్టంగా 16 అడుగుల పామును వెంకట్ బృందం చాకచక్యంగా ఓ సంచిలోకి పంపించారు. అనంతరం దానిని తీసుకుని ఓ అటవీ ప్రాంతంలో వదిలేశారు. పాములను చంపరాదని.. వాటిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేయాలని సదా విజ్ఞప్తి చేశారు. వాటిని హాని చేయకపోతే అవి కూడా మనుషులను హానీ కలిగించవని సదా తెలిపారు. సదా పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 15 లక్షల మంది చూడగా.. 14 వేల మంది ఆ వీడియోకు లైక్ కొట్టారు.
మీరు ఆ వీడియో చూడాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Samantha Maa Inti Bangaram: స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ తన ఆరోగ్యంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అత్యంత వేగంగా, పక్కా ప్లానింగ్‌తో మొదలుపెట్టారు. పెళ్లైన 37 రోజులకే అభిమానులకు ఒక అదిరిపోయే శుభవార్త చెప్పారు.
నిర్మాతగా సమంత కొత్త అవతారం
సమంత కేవలం నటిగానే కాకుండా, ఇప్పుడు నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె సొంతంగా ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "మా ఇంటి బంగారం" పేరుతో నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. అయితే ఈ సినిమాకు కథను సమంత భర్త రాజ్ నిడిమోరు అందిస్తున్నారు.
మళ్లీ వెండితెరపైకి 'బంగారం'
మైయోసైటిస్ వంటి ఆరోగ్య సమస్యల వల్ల రెండేళ్ల పాటు వెండితెరకు దూరమైన సమంత, ఇప్పుడు "మా ఇంటి బంగారం" చిత్రంతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఈ చిత్రం ఆమె కెరీర్లో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దీనికి కథను తన భర్త అందించడమే కాకుండా, తానే స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.
ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. జనవరి 9న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే (First Half) సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
సక్సెస్ ఫుల్ కెరీర్
'బృందావనం', 'దూకుడు', 'ఈగ' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్గా ఎదిగిన సమంత.. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో స్థిరపడి, కెరీర్‌ను మరింత కొత్తగా మలుచుకుంటున్నారు. అటు హీరోయిన్గా, ఇటు నిర్మాతగా డ్యూయల్ రోల్లో ఆమె బిజీ బిజీగా గడుపుతున్నారు.
పెళ్లి తర్వాత సమంత తన ప్రొఫెషనల్ లైఫ్‌లో తీసుకున్న ఈ వేగవంతమైన నిర్ణయాలు చూస్తుంటే, ఆమె మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Telangana Movie Ticket Price Hike: తెలంగాణలో భారీ బడ్జెట్ చిత్రాల టికెట్ ధరల విషయంలో నెలకొన్న సందిగ్ధానికి హైకోర్టు తెరదించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ఇతర సినిమాలపై పడే ప్రభావం నుంచి తాజా చిత్రాలకు మినహాయింపునిస్తూ డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు..
గతంలో టికెట్ ధరల నియంత్రణపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కేవలం 'పుష్ప-2', 'ఓజీ'(OG), 'గేమ్ ఛేంజర్', 'అఖండ-2' చిత్రాలకు మాత్రమే పరిమితమని కోర్టు స్పష్టం చేసింది. అలాగే టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలపై నిర్మాతలు ఇచ్చే వినతులను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ విన్నపాలపై సానుకూలంగా స్పందిస్తుందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.
'ది రాజా సాబ్' నిర్మాతల విన్నపం ఏంటి?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసింది. వారి అభ్యర్థనలు ఇలా ఉన్నాయి. ఈ చిత్రం జనవరి 9న విడుదల కానున్న నేపథ్యంలో ముందు రోజు అనగా జనవరి 8న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో ప్రదర్శించేందుకు అనుమతి కోరుతున్నారు.
ఆ ప్రీమియర్ షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.800+జీఎస్టీ.. అలాగే మల్టీప్లెక్స్‌లో ప్రీమియర్ షో లకు రూ.1000 + జీఎస్టీ వరకు పెంపు కోసం నిర్మాతలు ప్రభుత్వానికి విన్నవించుకోనున్నారు. అలాగే విడుదల తేదీ జనవరి 9 నుంచి సింగిల్ స్క్రీన్ టికెట్లపై రూ.102, అలాగే మల్టీప్లెక్స్‌లో రూ.132 అదనంగా పెంచాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
అయితే అదనంగా జనవరి 9న తెల్లవారుజామున 4 గంటల షోలకు కూడా అనుమతి కోరినట్లు తెలుస్తోంది. భారీ పెట్టుబడితో రూపొందించినందున ఈ పెంపు అత్యవసరమని నిర్మాతలు కోర్టుకు విన్నవించినట్లు సమాచారం.
సంక్రాంతి సినిమాలకు లైన్ క్లియర్!
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో టికెట్ ధరల పెంపు ఉండదని ప్రకటించిన నేపథ్యంలో, హైకోర్టు తాజా తీర్పు నిర్మాతలకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉన్న 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి కూడా ఈ తీర్పు సానుకూలంగా మారనుంది.
హైకోర్టు సూచనతో ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టులో ఉంది. మరి ప్రభుత్వం ఎంత మేరకు ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో వేచి చూడాలి.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ద్వారా రూపొందించింది. సినిమా టికెట్ ధరలపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tanuja Viral Video: సెలబ్రిటీలను చూడగానే ఆగకుండా ఒక్కసారిగా వారి పైకి దూసుకెళ్లడం కామన్ అయిపోయింది. హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో కూడా ఫ్యాన్స్ అదుపుతప్పుతున్నారు. సెలబ్రిటీలపై అభిమానం వెర్రి తలలు వేస్తోంది. నిధి అగర్వాల్, సమంత, అల్లు అర్జున్, విజయ్‌లను బెంబేలెత్తించిన ఫ్యాన్స్ తాజాగా బిగ్ బాస్ ఫేమ్ తనూజను కూడా హడలెత్తించారు. హైదరాబాద్‌లోని ఈవెంట్‌కు వెళ్లిన ఆమె కోసం ఒక్కసారిగా ఫ్యాన్స్ చుట్టూ ముట్టేశారు. నేను మీ కోసమే వచ్చా.. దయచేసి తోయొద్దు అని విజ్ఞప్తి చేసినా వినలేదు. ఆమెను చుట్టుముట్టేసి ఒక్కసారిగా అక్కడ తోపులాట కూడా జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. దీంతో చూసినవారు అంత అభిమానం కాదు మూర్ఖత్వం అని నెటిజెన్లు సైతం ఫైర్ అవుతున్నారు.
అంతకు ముందు లుల్లు మాల్లో నిధి అగర్వాల్ ది రాజాసాబ్ ఈవెంట్ కోసం రాగా అక్కడ ఒక్కసారిగా ఆమెపై తోపులాట జరిగింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు. అభిమానుల సెలబ్రెటీలు కనిపించగానే అదుపు చేసుకోలేక వారిపై దూసుకెళ్తున్నారు. ఆ తర్వాత సమంత ఒక షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన సమయంలో కూడా ఆమెపై అలాగే దూసుకొచ్చారు. దీంతో సమంత కూడా కాస్త ఇబ్బంది పడింది. ఒక ఫ్యాన్ అయితే ఆమె చీరను కూడా తొక్కేశాడు. అదుపుతప్పితే సమంత కింద పడే ప్రమాదం కూడా జరిగేది.
ఇటీవలె బన్నీ భార్య స్నేహరెడ్డితోపాటు హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ నీలోఫర్ కేఫ్ వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ కూడా చుట్టుముట్టారు. అభిమానులు మరోసారి మితిమీరి ప్రవర్తించారు. వారిని చూసి సెల్ఫీల కోసం ఫ్యాన్స్ గుమిగూడారు. అతి కష్టం మీద బన్నీ స్నేహ కేఫ్ నుంచి బయటికి వెళ్లారు. కారు ఎక్కడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు.
తాజాగా తనూజ కూడా ఇలాంటి ఛేదు అనుభవమే మిగిలింది. ఇక బిగ్ బాస్ 9 తెలుగు రన్నరప్‌గా తనూజ నిలిచింది. ఈమె పూర్తి పేరు తనూజ పుట్ట స్వామి. ఇండస్ట్రీలోని పలు సీరియల్స్ లో నటించింది. తెలుగు మాత్రమే కాదు కన్నడ సీరియల్ లో కూడా నటించింది. కర్నాటకలోని బెంగళూరు ఆమె స్వస్థలం. మొదటగా 2013లో కన్నడ హారర్ మూవీ నటించారు. జీ తెలుగు సీరియల్ ముద్దమందారంలో తను మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈ సీరియల్ 1500 ఎపిసోడ్స్ కూడా పూర్తి చేసుకుంది. ఆ ఫేమ్ తర్వాత బిగ్ బాస్ తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. తనూజ పుట్టస్వామి తెలుగు బిగ్ బాస్ 9 లో ఈ 33 ఏళ్ల సెలబ్రిటీ అడుగుపెట్టి. ఆమె రన్నరప్ నిలవగా.. విన్నర్‌గా కళ్యాణ్ పడాలా ట్రోఫీ అందుకున్నారు.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook