Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500052

హబీబ్‌నగర్‌లో రౌడీషీటర్‌ హత్య

Jun 20, 2024 06:05:22
Hyderabad, Telangana

హైదరాబాద్‌లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన రౌడీ షీటర్ అలీమ్‌ను ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి కూడలి సమీపంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, ఆసిఫ్ నగర్ పోలీస్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలంలో మద్యం సీసాలు లభ్యమయ్యాయి.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Jan 20, 2026 13:35:42
Hyderabad, Telangana:

Allu Arjun Mana Shankara Vara Prasad Movie Review: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం ఇప్పటికే రూ.300 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన అల్లు అర్జున్, చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే అభినందనలు తెలిపారు.

జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తాజాగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంపై బన్నీ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బన్నీ రివ్యూ హైలైట్స్..
"బాస్ ఈస్ బ్యాక్! చిరంజీవి గారు మరోసారి స్క్రీన్ పై వెలిగిపోయారు. ఆయన ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది" అని మెగాస్టార్ మ్యాజిక్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొనియాడారు.

వెంకటేష్ & నయనతార: "వెంకటేష్ గారు తన నటనతో అదరగొట్టారు. నయనతార చాలా అందంగా కనిపించారు" అంటూ ప్రధాన తారాగణాన్ని ప్రశంసించారు.

అనిల్ రావిపూడిపై ప్రశంసలు: దర్శకుడు అనిల్ రావిపూడిని 'సక్సెస్ మిషన్' గా అభివర్ణించారు. "సంక్రాంతికి వస్తారు.. హిట్ కొడతారు.. రిపీట్! అనిల్ గారు మీ సక్సెస్ కు అభినందనలు" అంటూ ట్వీట్ చేశారు.

సంగీతం: భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ సూపర్ గా ఉందని బన్నీ కితాబిచ్చారు.

జపాన్‌లో పుష్ప-2 హవా.. అట్లీతో కొత్త ప్రాజెక్ట్!
మరోవైపు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి జపాన్ లోని చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించి వచ్చారు. అక్కడ విడుదలైన 'పుష్ప 2' ప్రమోషన్లలోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్, దర్శకుడు అట్లీతో సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రాబోతున్న సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. మరోవైపు 'మాస్టర్' డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కూడా బన్నీ ఒక సినిమాను అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

వరుస హిట్లు అందుకుంటున్న అనిల్ రావిపూడికి, మెగాస్టార్‌కు అల్లు అర్జున్ అభినందనలు తెలపడం మెగా అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. ఈ సినిమా వసూళ్ల పరంగా మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: 500 Note Ban: రూ.500 నోట్లు రద్దు కానున్నాయా? ఏటీఎంల నుంచి మాయమవుతాయా? కేంద్రం ఏం చెప్పిందంటే?

Also Read: 8th Pay Commission DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్..మళ్లీ పెరగనున్న DA! ఎంతమేర పెరుగుతుందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 20, 2026 13:10:59
Hyderabad, Telangana:

500 Note Ban News: గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్‌లో రూ.500 నోట్ల భవిష్యత్తుపై పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుల్లో నెలకొన్న ఆందోళనను తొలగిస్తూ ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. సోషల్ మీడియాలో రూ.500 నోట్ల రద్దు గురించి జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజం ఉందో వివరిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కీలక స్పష్టతనిచ్చింది. 

వైరల్ అవుతున్న వార్త ఏమిటి?
మార్చి 2026 తర్వాత ఏటీఎంలలో రూ.500 నోట్లు అందుబాటులో ఉండవనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మరోసారి డీమోనిటైజేషన్ (Demonetization 2.0) కి సిద్ధమవుతున్న క్రమంలో.. ఇకపై దేశంలో రూ.100 నోటే అతిపెద్ద కరెన్సీగా ఉండబోతోదనే వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు నెట్టింట విపరీతంగా షేర్ కావడంతో, పదేళ్ల క్రితం జరిగిన నోట్ల రద్దు కష్టాలను గుర్తుచేసుకుంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ నివేదిక..
ఈ పుకార్లను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం తీవ్రంగా ఖండించింది. 500 రూపాయల నోట్లను నిషేధించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని PIB స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, అటువంటి తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరింది. కరెన్సీ మార్పుల గురించి ఆర్‌బీఐ (RBI) గానీ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదని తేల్చి చెప్పింది.

తప్పుడు సమాచారాన్ని బహిర్గతం చేస్తూ, ఒక స్క్రీన్ షాట్‌ను కూడా PIB షేర్ చేసింది. ప్రభుత్వ విధానాలు లేదా ఆర్థిక నిర్ణయాలకు సంబంధించిన సమాచారం కోసం కేవలం అధికారిక వెబ్‌సైట్లు, ధ్రువీకరించబడిన ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే అనుసరించాలని సూచించింది.

కాబట్టి, మీ దగ్గర ఉన్న రూ.500 నోట్లు పూర్తి సురక్షితం. వాటి రద్దు గురించి వస్తున్న వార్తలు కేవలం సృష్టించిన పుకార్లు మాత్రమే. ఇటువంటి మెసేజ్‌లను ఫార్వార్డ్ చేయకుండా ఉండటం బాధ్యతాయుతమైన పని.

Also Read: 8th Pay Commission DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్..మళ్లీ పెరగనున్న DA! ఎంతమేర పెరుగుతుందంటే?

Also Read: Megastar MSG Movie Home Set: 'మన శంకర వరప్రసాద్' గారి ఇంద్ర భవనం..రూ.5 కోట్లతో అద్భుతమైన సెట్..హోమ్ టూర్‌పై ఒకసారి లుక్కేయండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
AMAruna Maharaju
Jan 20, 2026 11:14:53
Hyderabad, Telangana:

India Vs Pakistan: టోర్నీ ఏదైనా స‌రే భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయంటే వ‌చ్చే కిక్కే వేరు. ఇరు దేశాల అభిమానులే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ సైతం భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు అన్న సంగ‌తిని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి ఫిబ్ర‌వ‌రి 15 పైనే ఉంది. ఎందుకంటే ఆ రోజు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

అయితే.. అదే రోజు మ‌రో భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ కూడా జ‌ర‌గ‌నుంది. తొలి మ్యాచ్ లో పురుషుల జ‌ట్లు త‌ల‌ప‌డ‌నుండ‌గా రెండో మ్యాచ్ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో భాగంగా జ‌ర‌గ‌నుంది. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ విడుద‌ల చేసింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 13 నుంచి 22 వ‌ర‌కు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. భార‌త మ‌హిళ‌ల‌-ఏ జ‌ట్టుతో పాటు మ‌రో ఏడు జ‌ట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 13న జ‌ర‌గ‌నుంది. యూఏఈ, నేపాల్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

8 జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జించారు. భార‌త్‌, పాకిస్తాన్‌ల‌తో పాటు యూఏఈ, నేపాల్ జ‌ట్లు గ్రూప్‌-ఏలో ఉండ‌గా, బంగ్లాదేశ్, శ్రీలంక‌, మ‌లేషియా, థాయిలాండ్ జ‌ట్లు గ్రూప్‌-బిలో ఉన్నాయి. ఇక భార‌త-ఏ జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్ ను ఫిబ్ర‌వ‌రి 13న యూఏఈతో ఆడ‌నుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్‌తో ఫిబ్ర‌వ‌రి 15న త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ భార‌త కాల‌మానం ప్రకారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు ప్రారంభం కానుంది.

మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ షెడ్యూల్ ఇదే..
* ఫిబ్రవరి 13న – పాకిస్తాన్ vs నేపాల్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 13న – భార‌త్ vs యుఎఇ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 14న – మలేషియా vs థాయిలాండ్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 14న – బంగ్లాదేశ్ vs శ్రీలంక (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 15న – యుఏఈ vs నేపాల్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 15న – భారత్ vs పాకిస్తాన్ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 16న – శ్రీలంక vs మలేషియా (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 16న – బంగ్లాదేశ్ vs థాయిలాండ్ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 17న – భారత్ vs నేపాల్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 17న – పాకిస్తాన్ vs యుఎఇ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 18న – బంగ్లాదేశ్ vs మలేషియా (ఉదయం 9:30 గంటలకు)
* ఫిబ్రవరి 18న – శ్రీలంక vs థాయిలాండ్ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 20న – సెమీ-ఫైనల్ 1 (A1 vs B2) (ఉదయం 9:30 గంటలకు)
* ఫిబ్రవరి 20న – సెమీ-ఫైనల్ 2 (B1 vs A2) (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 22న – ఫైనల్ (మధ్యాహ్నం 2 గంటలకు)

Also Read: WPL 2026: డ‌బ్ల్యూపీఎల్‌లో స్మృతి మంధాన సేన‌ దూకుడు.. ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్సీబీ..!

Also Read: Pan Card Loan: బ్యాంక్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. పాన్ కార్డ్‌తో రూ. 5 లక్షల లోన్.. 24 గంటల్లో డబ్బు మీ అకౌంట్‌లో..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 20, 2026 11:13:12
Hyderabad, Telangana:

8th Pay Commission DA Hike 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త సంవత్సరం 2026 కానుకగా డియర్నెస్ అలవెన్స్ (DA) పెరగనుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులు, AICPI-IW గణాంకాలను బట్టి చూస్తే, ఈసారి డీఏ పెంపు ఎంత ఉండబోతోంది? దీనివల్ల జీతాలు ఏ మేరకు పెరుగుతాయి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

ద్రవ్యోల్బణ ప్రభావం నుంచి ఉద్యోగులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం ఏడాదికి రెండుసార్లు (జనవరి, జూలై) కరువు భత్యాన్ని (DA) సవరిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగులు 58% డీఏ పొందుతున్నారు.

డీఏ పెంపు అంచనాలు (AICPI-IW డేటా ఆధారంగా)
కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నవంబర్ 2025 వరకు ఉన్న ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI-IW) గణాంకాల ప్రకారం.. 

నవంబర్ ఇండెక్స్: 148.2 పాయింట్లు.

పెరుగుదల: 59.93% డీఏకి సమానమైన పాయింట్లు నమోదయ్యాయి.

అంచనా: డిసెంబర్ గణాంకాలు కూడా కలిపితే, డీఏ 2% నుండి 3% వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం డీఏ 60% లేదా 61% కి చేరుకోవచ్చు.

ఎప్పుడు ప్రకటిస్తారు?
సాధారణంగా జనవరి నెలకు సంబంధించిన డీఏ పెంపును మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో (హోలీ పండుగ తర్వాత) కేంద్ర మంత్రివర్గం ఆమోదిస్తుంది. ప్రకటన ఎప్పుడు వచ్చినా, పెంపు మాత్రం జనవరి 1, 2026 నుండి వర్తిస్తుంది. కాబట్టి గడిచిన నెలల వ్యత్యాసాన్ని బకాయిల రూపంలో చెల్లిస్తారు.

8వ వేతన సంఘం ప్రభావం:
నిజానికి 7వ వేతన సంఘం కాలపరిమితి డిసెంబర్ 31, 2025తో ముగిసింది. 8వ వేతన సంఘం జనవరి 2026 నుండి అమల్లోకి రావాల్సి ఉన్నా, ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల, ప్రస్తుతం ఈ పెంపు 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారమే కొనసాగుతోంది.

జనవరి 30 లేదా 31న విడుదలయ్యే డిసెంబర్ నెల AICPI-IW డేటాతో డీఏ పెంపుపై పూర్తి స్పష్టత వస్తుంది. 3% పెంపు లభిస్తే ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుంది.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Megastar MSG Movie Home Set: 'మన శంకర వరప్రసాద్' గారి ఇంద్ర భవనం..రూ.5 కోట్లతో అద్భుతమైన సెట్..హోమ్ టూర్‌పై ఒకసారి లుక్కేయండి!

Also REad: Akshay Kumar Car Accident: హీరో అక్షయ్ కుమార్ కారుకు ఘోర ప్రమాదం..కారులో అక్షయ్, ట్వింకిల్..ఆటోని ఢీకొని గాల్లోకి అమాంతం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 20, 2026 10:48:53
Medaram, Telangana:

Medaram Jathara 2026: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర 28 నుంచి 1వ తేదీ వరకు జరగనుండగా ఈ జాతరకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే భక్తులు లక్షలాది సంఖ్య అమ్మవార్లను దర్శించుకునేందుకు తరలివస్తుండగా.. భక్త జనుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జారత ముందు నుంచే ప్రత్యేకంగా బస్సులు నడుపుతామని ప్రకటించింది. ఈనెల 25 నుంచి 1వ తేదీ వరకు పెద్ద ఎత్తున ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ తెలిపింది.

Also Read: Tomorrow Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. బ్యాంకులకు కూడా! ఎందుకో తెలుసా?

2024 జాతరలో ఆర్టీసీ 3,491 బస్సులు నడిపి 16.82 లక్షల మంది ప్రయాణికులను తరలించగా.. ఉచిత బస్సు పథకం అమలుతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఈ జాతరకు 20 లక్షల సంఖ్యలో ప్రయాణికులు వెళ్తారని ఆర్టీసీ అంచనా వేసింది. తదనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మేడారం జాతరలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తూనే.. ప్రత్యేక బస్సులు నడపనుంది. ఆర్టీసీ మేడారం జాతరకు మొత్తం 4,000 బస్సులను నడపనుంది. ఈ బస్సులు అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించనున్నాయి. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ సిటీ నుంచి మొత్తం 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లతో ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.

Also Read: Viral Pic: ఈ 'స్టార్ యువకులకు వధువు కావలెను'.. పెళ్లి కాని యువకుల బ్యానర్ ఫొటో వైరల్‌

మేడారం నుండి భక్తులను రవాణా చేయడానికి మేడారంలో 50 ఎకరాల భూమిలో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. భక్తులు తమ గమ్యస్థానాల ప్రకారం సులభంగా బస్సుల్లో ఎక్కేందుకు మొత్తం 9 కిలో మీటర్ల పొడవు కలిగిన 50 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్లలో ఒకేసారి సుమారు 20,000 మంది ప్రయాణికులను నిలుపుకునే ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ సంస్థ తెలిపింది. తాత్కాలిక బస్ స్టేషన్‌లో ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతం, సిబ్బంది విశ్రాంతి గదులు, నిర్వహణ కార్యకలాపాలు మొదలైన వాటి కోసం 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. మేడారం, కామారం ప్రాంతాలలో సుమారు వెయ్యి బస్సుల పార్కింగ్‌కు వీలుగా 25.76 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం పార్కింగ్ ప్రాంతం అభివృద్ధి చేశారు. బస్సుల చిన్నపాటి నిర్వహణ సమస్యలు, మార్గమధ్యలో బస్సులు నిలిచిపోతే అత్యవసర సేవల కోసం 11 గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు, 2 క్రేన్లు, 1 ట్రాక్టర్‌ను ఏర్పాటు చేశారు.

Also Read: Kavitha: తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ ప్రశాంత్‌ కిశోర్‌.. కవిత పార్టీకి సేవలు

జోన్లవారీగా..
ప్రత్యేక బస్సులను నడిపే కేంద్రాల నుంచి మేడారం జాతర ప్రాంతం వరకు ఉన్న ప్రయాణ మార్గాలను 11 జోన్లుగా విభజించి 15 జీపులు, 8 మోటర్ సైకిల్‌లను ప్రత్యేకమైన పెట్రోలింగ్ వ్యవస్థను ఆఫీసర్ల పర్యవేక్షణలో బస్సులు మార్గమధ్యలో ఆగకుండా చర్యలు తీసుకున్నారు. మార్గమధ్యలో ఉన్న 7 ప్రైవేట్ పెట్రోల్ బంకుల వద్ద బస్సులకు డీజిల్ టాప్-అప్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. మేడారం తాత్కాలిక బస్ స్టేషన్‌లో, 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల వద్ద ట్రాఫిక్‌ను సమీపంగా పర్యవేక్షించేందుకు, మొత్తం 10,000 మంది వారం రోజులు పనిచేయనున్నారు.

హనుమకొండ నుంచి తాడ్వాయి వరకు మార్గంలో ఉన్న కల్వర్టులు, ట్యాంక్‌బండ్‌లు, గుండ్ల వాగు, జలగలాంచ వాగు వంటి కీలక ప్రాంతాల్లో బస్సులకు మార్గనిర్దేశం చేయడానికి గార్డులను ఏర్పాటు చేశారు. మేడారం తాత్కాలిక బస్ స్టేషన్‌లో ట్రాఫిక్ ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక కమెండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. తాత్కాలిక బస్ స్టేషన్‌లో 76 క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ తెలిపింది.

సౌకర్యాలు
తాత్కాలిక బస్ స్టేషన్‌లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు ఏర్పాటు. పూర్తిగా సన్నద్ధమైన అంబులెన్సులు, వైద్యులు, మందులతో కూడిన వైద్య శిబిరం కూడా ఏర్పాటుచేశారు. సిబ్బందికి స్టాఫ్ క్యాంటీన్ ఏర్పరిచి భోజన సదుపాయం కల్పించారు.

హనుమకొండ నుంచి మేడారం వరకు బస్సుల సజావుగా రాకపోకలు జరగడానికి ములుగు, వరంగల్ హనుమకొండ జిల్లాల పోలీసులు, జిల్లా పరిపాలనలతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. క్లర్కులు, డ్రైవర్లు, కండక్టర్లు, విధులు నిర్వర్తించేందుకు గుర్తించిన అన్ని సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రైవేటు వాహనాలలో ప్రయాణించడంతో దూరంగా పార్కింగ్ చేయడం, అసౌకర్యం కలుగుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
AMAruna Maharaju
Jan 20, 2026 10:32:12
Hyderabad, Telangana:

Rs 345 Crore Flyover Project Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు అదిరిపోయే శుభవార్త. జీహెచ్‌ఎంసీ పరిధిలో ట్రాఫిక్ సమస్యను తప్పించేందుకు మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రానుంది. దీంతో సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వెళ్లే వెహికిల్స్‌ సిగ్నల్‌ ఫ్రీగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టును 345 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జీహెచ్‌ఎంసీ చేపట్టనుంది. 

హై సిటీ-హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫార్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్‌ కింద 6 లేన్లతో ఫ్లై ఓవర్‌ పనులు త్వరలోనే షురూ కానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం టెండర్లు  ఆహ్వానించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాటేదాన్‌ జంక్షన్‌ వద్ద మూడు లేన్లతో డౌన్‌ర్యాంప్‌ ఉంటుంది. టెండర్‌ ద్వారా ప్రాజెక్ట్‌ దక్కించుకునే ఏజెన్సీయే సర్వే, డిజైన్, డ్రాయింగ్స్, నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. కాంట్రాక్టు అగ్రిమెంట్‌ జరిగినప్పటి నుంచి రెండు సంవత్సరాల్లో పనులు పూర్తి కావాలి. 

యుటిలిటీ షిఫ్టింగ్, ఫుట్‌పాత్‌లు, ల్యాండ్‌స్కేపింగ్, సైనేజీలు, లైటింగ్, పేవ్‌మెంట్‌ మార్కింగ్స్‌ తదితర పనులు కూడా చేయాలి. మెట్రోకు సమాంతరంగా.. ఎయిర్‌పోర్ట్‌ మెట్రోలైన్‌కు పక్క నుంచి ఈ ఫ్లై ఓవర్‌ రానుంది. ఫ్లై ఓవర్‌ కంటే మెట్రోమార్గం ఎక్కువ ఎత్తులో ఉంటుంది. దీంతోపాటు టీకేర్‌ కాలేజ్‌ జంక్షన్, గాయత్రినగర్‌ జంక్షన్, మంద మల్లమ్మ జంక్షన్‌ల మీదుగా ఆరు లేన్లతో మరో ఫ్లైఓవర్‌ పనులకు టెండర్ల గడువు ముగిసింది. టెండర్లు ఖరారు కావాల్సి ఉంది.    

ఈ ఫ్లైఓవర్‌ పూర్తయితే.. విమానాశ్రయానికి వెళ్లేవారు మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్‌ జంక్షన్‌ల వంటివాటి వద్ద వాహనాలను ఆపకుండానే వెళ్లిపోవచ్చు. ఇరు వైపులా సాఫీగా ప్రయాణం సాగుతుంది. అంతేగాక, షాద్‌నగర్‌తో పాటు మహబూబ్‌నగర్, అత్తాపూర్, మెహదీపట్నం వెళ్లే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ 6 లేన్లతో ఫ్లై ఓవర్‌ పనులు పూర్తయితే వాహనదారులు ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

Also Read: Pan Card Loan: బ్యాంక్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. పాన్ కార్డ్‌తో రూ. 5 లక్షల లోన్.. 24 గంటల్లో డబ్బు మీ అకౌంట్‌లో..!

Also Read: WPL 2026: డ‌బ్ల్యూపీఎల్‌లో స్మృతి మంధాన సేన‌ దూకుడు.. ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్సీబీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 20, 2026 09:19:27
Hyderabad, Telangana:

Kohli Rohit BCCI Contract Status: భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ (BCCI) షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ చేసిన తాజా సిఫార్సులు అమలైతే, వీరిద్దరి కాంట్రాక్ట్ హోదా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన వార్షిక రిటైనర్‌షిప్ కాంట్రాక్ట్ వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ల హోదాలను మార్చే దిశగా చర్చలు జరుగుతున్నాయి.

ఏ-ప్లస్ (A+) కేటగిరీ రద్దు?
ప్రస్తుతం బీసీసీఐలో నాలుగు అంచెల కాంట్రాక్ట్ వ్యవస్థ (A+, A, B, C) అమలులో ఉంది. అయితే, అత్యున్నతమైన ఏ-ప్లస్ (A+) కేటగిరీని పూర్తిగా తొలగించాలని సెలక్షన్ కమిటీ సూచించింది. అందుకు కారణం ఏంటంటే..సాధారణంగా మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) ఆడే కీలక ఆటగాళ్లకు ఈ గ్రేడ్ కేటాయిస్తారు.

కానీ, ఆ గ్రేడ్‌లో కొనసాగుతున్న రోహిత్, కోహ్లీల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వీరిద్దరూ ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిని నేరుగా 'బి' (B) కేటగిరీకి తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాంట్రాక్ట్ గ్రేడ్‌లు - వేతనాల వివరాలు:
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లకు ఏడాదికి లభించే వేతనాలు ఇలా ఉంటాయి.

కేటగిరీ వార్షిక వేతనం ప్రస్తుతం ఉన్న ప్రముఖ ఆటగాళ్లు
A+ ₹7 కోట్లు రోహిత్, విరాట్, బుమ్రా, జడేజా
A ₹5 కోట్లు గిల్, రాహుల్, పాండ్యా, పంత్, సిరాజ్, షమీ
B ₹3 కోట్లు సూర్యకుమార్, జైస్వాల్, కుల్దీప్, అక్షర్, అయ్యర్
C ₹1 కోటి రింకు, సంజు శాంసన్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ తదితరులు

ముఖ్య మార్పులు, పదోన్నతులు..
శుభ్‌మన్ గిల్: టెస్టులు, వన్డేల్లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుండటంతో గిల్‌ను అగ్రశ్రేణికి (A) ప్రమోట్ చేసే అవకాశం ఉంది.

జస్‌ప్రీత్ బుమ్రా: మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉన్న బుమ్రా వంటి బౌలర్ల విషయంలో ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

జడేజా: టెస్ట్ క్రికెట్‌లో కొనసాగుతున్న జడేజా తన అగ్రశ్రేణి స్థానాన్ని నిలబెట్టుకుంటాడా లేదా అనేది చూడాలి.

ఎంపిక నిబంధన:
కేంద్ర కాంట్రాక్ట్ పొందాలంటే ఒక ఆటగాడు కనీసం 3 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20 మ్యాచ్‌లు ఆడి ఉండాలి. అలాంటి ఆటగాళ్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌కు అర్హత సాధిస్తారు.

ఈ సిఫార్సులపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఏ-ప్లస్ కేటగిరీ రద్దయితే, అది భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసినట్లే అవుతుంది. దిగ్గజ ఆటగాళ్ల ఆదాయంపై కూడా ఇది గణనీయమైన ప్రభావం చూపుతుంది.

Also Read: Rohit Sharma Doubtful: రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు ఎండ్ కార్డ్? గంభీర్ 'మిషన్ 2027'లో హిట్ మ్యాన్ ఉంటారా?

Also Read: Rohit Sharma Doubtful: రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు ఎండ్ కార్డ్? గంభీర్ 'మిషన్ 2027'లో హిట్ మ్యాన్ ఉంటారా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 20, 2026 09:18:59
Hyderabad, Telangana:

Oneplus Turbo 6 Launch Date In India: వన్‌ప్లస్ మొబైల్స్‌కి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్స్‌తో కూడిన మొబైల్స్ ను విడుదల చేయడంలో ఈ బ్రాండ్ ముందుంటుంది. అంతేకాకుండా ప్రీమియం కెమెరా సెటప్‌తో పాటు అద్భుతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.. కాబట్టి చాలామంది ఎంతో ఇష్టంగా ఈ మొబైల్ తోని కొనుగోలు చేస్తారు. అయితే, వన్‌ప్లస్ వినియోగదారులకు కంపెనీ త్వరలోనే గుడ్ న్యూస్ తెలుపబోతోంది. తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. 

ఈ కొత్త మొబైల్‌ను ఇప్పటికే చైనాలో ప్రారంభించింది. అయితే, అతి త్వరలోనే భారత మార్కెట్ లోకి కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ OnePlus Turbo 6 సిరీస్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చైనాలో ప్రకటించింది. అయితే, ఇందులో భాగంగా మొత్తం రెండు స్మార్ట్ ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ సిరీస్  OnePlus Turbo 6, Turbo 6V మోడల్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. 

ఈ OnePlus Turbo 6, Turbo 6V స్మార్ట్‌ఫోన్స్‌ను ప్రపంచ మార్కెట్‌లో OnePlus Nord 6, Nord CE 6 పేర్లతో విడుదల చేసే అవకాశాలున్నట్లు కొంతమంది టెక్ నిపుణులు చెబుతున్నారు. గతంలో వన్ ప్లస్ కంపెనీ దానికి సంబంధించిన టర్బో సిరీస్‌ను భారతదేశ మార్కెట్తో పాటు ప్రపంచ మార్కెట్‌లో రీ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్‌గా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రపంచ మార్కెట్ విడుదల తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం మాత్రం ఫిబ్రవరి మొదటి వారంలో లేదా జూలైలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట.. అయితే, ఈ మొబైల్‌ను కంపెనీ అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి తీసుకురాబోతోంది.

OnePlus Nord 6 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ Qualcomm Snapdragon 8s Gen 4 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ముఖ్యంగా ఇది ప్రస్తుత Nord లైనప్‌లో అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ 16gb ర్యామ్‌తో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

ఈ Oneplus Turbo 6 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్టోరేజ్ వివరాల్లోకి వెళితే..బేస్ వేరియంట్ మొబైల్‌ని కూడా 512 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీంతోపాటు ఇది Android 16 ఆపరేటింగ్ సిస్టంతో విడుదల కాబోతోంది. అలాగే 6.78-అంగుళాల ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేను  కలిగి ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ స్క్రీన్ 1272x2772 పిక్సెల్‌లు, 60Hz నుండి 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది.

ఈ మొబైల్ వెనుక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వెనక భాగంలో 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా లభిస్తుంది. దీంతోపాటు ఫ్రంట్ భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎంతో శక్తివంతమైన 9,000mAh బ్యాటరీతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ యోచిస్తుంది. ఇవే కాకుండా ఇందులో 80W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంటుంది.

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 20, 2026 08:04:45
Hyderabad, Telangana:

Mana Shankara Vara Prasad Home Tour: మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా అందించిన 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న అంశాల్లో 'శంకర వరప్రసాద్ మామగారి ఇల్లు' ఒకటి. సినిమాలోని మెజారిటీ భాగం ఈ ఇంట్లోనే సాగడంతో, ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సినిమాలో సన్నివేశాలు సగానికి పైగా ఆ ఇల్లు చుట్టూనే ఉంటాయి.

సాధారణంగా సినిమాల్లో సెట్స్ అంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లేదా ఫైబర్‌తో నిర్మిస్తారు. కానీ 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ కోసం నిర్మించిన ఈ ఇంటి ప్రత్యేకత వేరు. ఈ ఒక్క ఇంటి సెట్ కోసమే నిర్మాతలు దాదాపు రూ.5 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇంటిని సహజంగా చూపించేందుకు అందులో ఉపయోగించిన ఫర్నిచర్, డెకరేటివ్ వస్తువులన్నీ ఒరిజినల్ ప్రాపర్టీస్‌నే వాడారట. అందుకే వెండితెరపై ఈ ఇల్లు ఒక ఇంద్ర భవనంలా కనిపిస్తోంది.

ముఖ్య సన్నివేశాల వేదిక
ఈ ఇంట్లోనే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ మధ్య వచ్చే హై-వోల్టేజ్ సీన్స్‌తో పాటు, సూపర్ హిట్ సాంగ్ 'మీసాల పిల్ల'ను కూడా ఇక్కడే చిత్రీకరించారు. సినిమా చూస్తున్నంత సేపు ఇది ఒక సెట్ అనే భావన కలగకుండా ప్రొడక్షన్ డిజైన్ టీం అత్యంత జాగ్రత్తలు తీసుకుంది.

సినిమా విశేషాలు..
మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార నటించగా, వెంకటేష్ కీలక పాత్రలో మెరిశారు. క్యాథరీన్ థ్రెసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమటం ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. 

భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మెగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 

వైరల్ హోమ్ టూర్
ప్రస్తుతం చిత్ర బృందం విడుదల చేసిన ఈ 'హౌస్ సెట్' మేకింగ్ వీడియోలో.. ఇంటి లోపలి డిజైన్, లైటింగ్, ఆర్కిటెక్చర్ చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఒక ఇల్లు కథలో పాత్రలా ఎలా మారిందో ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. 

Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు శుభవార్త..వచ్చే 1వ తేదీ నుంచి జీతం ఎంత పెరుగుతుందంటే?

Also Read: 1 KG Fat Burn Calories: కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది? జిమ్ కోచ్ ఏం చెప్తున్నారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 20, 2026 07:21:05
Hyderabad, Telangana:

Fat Loss Diet And Exercise: బరువు తగ్గాలనుకునే వారు నిరంతరం వినే పదం 'క్యాలరీ డెఫిసిట్' (Calorie Deficit). అసలు దీని అర్థం ఏమిటి? ఆకలితో మాడాలా? లేక తక్కువ తినాలా? ఒక కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఈ అంశాలపై కొందరు ఫిట్‌నెస్ నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

బరువు తగ్గడం అనేది ఒక మ్యాజిక్ కాదు. మన శరీరం రోజూ శ్వాస తీసుకోవడం, నడవడం, జీర్ణక్రియ వంటి పనుల కోసం కొంత శక్తిని (క్యాలరీలను) ఖర్చు చేస్తుంది. ఈ క్యాలరీల కంటే తక్కువగా ఆహారం తీసుకోవడాన్నే 'క్యాలరీ డెఫిసిట్' అంటారు.

ఒక కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది?
సాధారణంగా ఒక కిలో కొవ్వు కరగాలంటే శరీరంలో సుమారు 7,700 క్యాలరీల లోటు (Deficit) ఏర్పడాలి. మీరు రోజుకు 500 క్యాలరీలు తక్కువగా తీసుకుంటే, దాదాపు 15 నుండి 16 రోజుల్లో ఒక కిలో కొవ్వు తగ్గుతారు.

వ్యాయామం + డైట్: కేవలం ఆహారం తగ్గించడమే కాకుండా, వ్యాయామం కూడా తోడైతే ఫలితం ఇంకా వేగంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఉదాహరణకు, 300 క్యాలరీలు తక్కువగా తిని, మరో 200 క్యాలరీలు నడక ద్వారా ఖర్చు చేస్తే శరీరం మరింత ధృడంగా మారుతుంది.

ఆకలితో ఉండటం క్యాలరీ డెఫిసిట్ కాదు!
ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, చాలామంది చేసే తప్పు ఏంటంటే అస్సలు తినకుండా ఉండటం. మీ శరీరం రోజుకు 2000 క్యాలరీలు ఖర్చు చేస్తుంటే, మీరు 1500 నుండి 1700 క్యాలరీలు తీసుకోవాలి. రోజుకు 300 నుండి 500 క్యాలరీల లోటు ఉంచడం అత్యంత సురక్షితమైన మార్గం. దీనివల్ల కండరాలు బలహీనపడకుండా కేవలం కొవ్వు మాత్రమే కరుగుతుంది.

అతిగా తగ్గించడం వల్ల వచ్చే ముప్పు..
బరువు త్వరగా తగ్గాలనే ఆశతో రోజుకు 1000 క్యాలరీల కంటే తక్కువ తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయట. మహిళల్లో నెలసరి సమస్యలు, పురుషుల్లో హార్మోన్ల లోపం ఏర్పడవచ్చని అంటున్నారు. అలాగే ఎముకలు బలహీనపడటం, గుండెపై ఒత్తిడి పడటం, నిరంతరం అలసటగా అనిపించడం వంటివి జరుగుతాయి. అదే విధంగా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల తక్కువ ఆహారం వల్ల నిద్రలేమి, చిరాకు (Mood swings) పెరుగుతాయి.

సహజంగా బరువు తగ్గడానికి 5 సూత్రాలు..
తీపికి దూరం: కూల్ డ్రింక్స్, సోడాల బదులు నీళ్లు ఎక్కువగా తాగాలి.

ప్రోటీన్: ఆహారంలో ప్రోటీన్ పెంచితే కండరాలు దృఢంగా ఉంటాయి.

రిఫైన్డ్ ఫుడ్ వద్దు: మైదా, తెల్ల బియ్యం తగ్గించి ముడి ధాన్యాలు (Whole Grains) తీసుకోవాలి.

శారీరక శ్రమ: జిమ్‌కు వెళ్లకపోయినా రోజుకు కనీసం 30-40 నిమిషాలు నడవాలి.

ఓపిక: బరువు తగ్గడం అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. తక్షణ ఫలితాల కోసం ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దు.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొందరు నిపుణుల సలహలు, సూచనల మేరకు మాత్రమే పేర్కొన్నది. మీరు అనారోగ్య సమస్యలతో బాధపడే వారైతే సంబంధిత వైద్యుడిని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు శుభవార్త..వచ్చే 1వ తేదీ నుంచి జీతం ఎంత పెరుగుతుందంటే?

Also Read: Akshay Kumar Car Accident: హీరో అక్షయ్ కుమార్ కారుకు ఘోర ప్రమాదం..కారులో అక్షయ్, ట్వింకిల్..ఆటోని ఢీకొని గాల్లోకి అమాంతం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
IPInamdar Paresh
Jan 20, 2026 06:18:10
Hyderabad, Telangana:

Harish rao fires on cm revanth reddy over phone tapping case allegations: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దీనిలో అనేక మంది అధికారుల్ని సిట్ విచారించింది. ఇక ఇది కాస్త మున్సిపల్ ఎన్నికల సమీపిస్తున్న వేళ పొలిటికల్ టర్న్ తీసుకుంది. నిన్న రాత్రి (సోమవారం) బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు తమ ఎదుట మంగళవారం హజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈ ప్రకారమే మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హజరయ్యే ముందు తెలంగాణ భవన్ కు వచ్చారు.

 

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కీలక నేతలు తెలంగాణ భవన్ కు వచ్చారు. జూబ్లిహిల్స్ పోలీసుల ముందు హజరు కాబోయే ముందు హరీష్ రావు మీడియాలో మాట్లాడారు.  ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమన్నారు. బొగ్గుగనుల స్కామ్ ను డైవర్షన్ చేసేందుకు, వాటాల పంచాయతిని పక్కన పెట్టడానికి  మాత్రమే సీఎం రేవంత్ ఈ నోటీసుల డ్రామాకు తెరతీశాడన్నారు.  

గతంలోనే సుప్రీంకోర్టు తనపై కేసు నమోదు చేస్తామంటూ కొట్టివేసిందని అన్నారు. ఇచ్చిన 420 హమీలను అమలు చేయమంటే ఈ విధంగా ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నాడన్నారు. ఇలాంటి కేసులు,  వేధింపులకు భయపడేదిలేదని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ హయాంలో ఎన్నో కేసుల్ని, వేధింపుల్ని ఎదుర్కొన్నామన్నారు.

Read more: Renuka Chowdhury: మహిళల దుస్తుల జోలికి వస్తే తాట తీస్తా.!.. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరీ సంచలన వ్యాఖ్యలు..

అదే విధంగా ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో సరైన విధంగా బుద్ది చెప్తారన్నారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు, కేసులకు ఎవరు భయపడరని మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణకు హజరవుతున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా పోలీసుల్ని మోహరించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 20, 2026 05:09:05
Hyderabad, Telangana:

Dwipushkar Yoga Effect On Zodiac 2026: ప్రతి మంగళవారం హనుమంతుడి అంకితం చేస్తారు. ఇలా ప్రతి వారం ఒక్కొక్క దేవుడికి అంకితం చేస్తారు. అయితే ఈ సమయంలో చంద్రుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తాడు. దీనివల్ల కుజుడితోపాటు చంద్రుడి కలయిక జరుగుతుంది.. ప్రత్యేకమైన ధనయోగం ఏర్పడుతుంది. సూర్యుడు కుజుడు సంయోగం వల్ల ఆదిత్య మంగళ రాజయోగం కూడా ఏర్పడుతుంది. అలాగే శ్రవణా నక్షత్రం తర్వాత ధనిష్ట నక్షత్రంలో సర్వార్ధ సిద్దయోగం కూడా ఏర్పడుతుంది. దీంతోపాటు సిద్ది యోగం కూడా ఏర్పడుతుంది. 

ఇలా ప్రత్యేకమైన యోగాలు ఏర్పడడం కారణంగా ఈ సమయంలో ద్విపుష్కర యోగం కూడా ఏర్పడబోతోంది. దీనివల్ల ఈ సంవత్సరం మొదటి నెలలోనే కొన్ని రాశుల వారికి హనుమంతుడి అనుగ్రహం లభించబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో పురోగతి లభించడమే కాకుండా ప్రభుత్వ పనుల్లో ఆర్థికపరమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే దీర్ఘకాలికంగా పెట్టుబడింది పెట్టే వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. 

ఈ రాశులవారికి బంపర్‌ ప్రయోజనాలు:
ఈరోజు నుంచి మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.. హనుమంతుడి అనుగ్రహంతో వీరికి దౌత్యపరమైన విషయాల్లో అద్భుతమైన విజయాలు కలుగుతాయి.. ముఖ్యంగా సీనియర్ అధికారుల నుంచి మంచి సపోర్టు లభించబోతోంది. కెరీర్ పరంగా అనుకున్న పనులు చేసి అద్భుతంగా సెటిల్ అవుతారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఏదైనా పనులు కూడా ఈ సమయంలో పూర్తిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రుల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి. 

మేషరాశి 

మిధున రాశి 

మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా మంగళవారం చాలా అద్భుతంగా ఉంటుంది.. వీరు ప్రత్యర్థులపై అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ఓర్పుతో ధైర్యంతో ఉండడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. అలాగే మీపై శత్రువులు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసిన అద్భుతమైన లాభాలు పొందుతారు. ఆర్థికపరంగా చాలావరకు కలిసి రాబోతోంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి మీ తోటి ఉద్యోగులతో సంబంధాలు మరింత మెరుగుపడి విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.

కర్కాటక రాశి 

కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా మంగళవారం రోజు నుంచి ఆదాయ వనరులు అద్భుతంగా పెరుగుతాయి. వ్యాపారవేత్తలకు ఈ సమయంలో మంచి ఆదాయం లభిస్తుంది. అలాగే ఈ సమయంలో ఇతరులనుంచి బహుమతులు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎలాంటి ప్రయత్నాలు చేసినా అద్భుతమైన లాభాలు పొందుతారు. ప్రభుత్వ రంగాల్లో పనులు చేయాలనుకుంటున్న వ్యక్తులు ఊహించని విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.

కన్యారాశి 

ఈ మంగళవారం నుంచి కన్యా రాశి వారికి కూడా కెరీర్ పరంగా ఎంతో పురోగతి లభించబోతోంది. ముఖ్యంగా వీరు భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. వ్యాపారాలు చేస్తున్నవారు పెద్దపెద్ద ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో అదృష్టం సహకరించి అన్ని రకాల పనులు చేయగలుగుతారు. అలాగే కార్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఈ సమయంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. 

మీన రాశి 

మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం అన్ని విధాలుగా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా పెద్ద కోరికలు ఏవైనా వీరికి నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇల్లు లేదా కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు కెరీర్ పరంగా మెరుగుదల కనిపిస్తుంది. సామాజిక హోదా కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. సంపాదన కూడా ఊహించని స్థాయిలో పెరిగి అద్భుతమైన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు అభివృద్ధి చెందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

 

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 20, 2026 04:55:48
Hyderabad, Telangana:

Venus Effect On Zodiac 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని సంపాదన ఆనందం, అదృష్టానికి సూచికగా భావిస్తారు. ఇలాంటి గ్రహం 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన అస్తమించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన శుక్రుడు మకర రాశిలో సక్రమ మార్గంలోకి రాబోతున్నాడు. ఏదైనా ఒక గ్రహం తీరుగమనం నుంచి సక్రమ మార్గంలోకి రావడం వల్ల జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా దీని ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. శుక్రుడి ప్రభావంతో కొన్ని రాశుల వారు అదృష్టవంతులు కూడా అవుతారు. అలాగే ఆర్థికంగా కూడా ఆయా రాసిన వారికి మేలు జరుగుతుంది. కెరీర్ పరంగా ఈ సమయంలో చాలా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శుక్రుడు సక్రమ మార్గంలోకి రావడం వల్ల ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏ రాశుల వారికి ఎక్కువగా మేలు జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి ఊహించని లాభాలు:
మిథున రాశి 

శుక్రుడు ఉదయించడం వల్ల ఎక్కువగా మిథున రాశి వారికి లాభాలు కలుగుతాయి. వీరికి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. దీంతోపాటు సమాజంలో ఇమేజ్ కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త సంబంధాలు ఏర్పడి మంచి పరిచయాలు కూడా పొందుతారు. అలాగే జీవితంలో వస్తున్న కొన్ని రకాల సమస్యలు ఎంతో సులభంగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాల అందిస్తుంది. చాలాకాలంగా ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు ఇది అద్భుతమైన సమయం గా భావించవచ్చు. ఇక కుటుంబ సభ్యుల నుంచి కూడా ఈ సమయంలో శుభవార్తలు వినే సూచనలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

తులారాశి 
ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి తులా రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో కథ కొద్ది రోజుల నుంచి వస్తున్న ఎలాంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయి.. అంతేకాకుండా ఆనందంతో పాటు శ్రేయస్సు విపరీతంగా పెరుగుతుంది. వీరు ఈ సమయంలో కొత్తగా కారు లేదా ఇతర ఆస్తులు కూడా కొనుగోలు చేయగలుగుతారు. అనుకుంటున్న పనులు వెంటవెంటనే చేసి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందగలుగుతారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు కూడా పొంది ముందుకు సాగుతారు. తల్లిదండ్రులతో సంబంధాలు అద్భుతంగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఎంతో ఓపికతో సహనంతో పనిచేస్తే భారీ మొత్తంలో అదృష్టం సహకరించి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆందోళన కూడా పూర్తిగా తొలగిపోతుంది.

మకర రాశి 
శుక్రుడి ప్రభావంతో మకర రాశి వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఈ సమయంలో వీరిపై వీరికి నమ్మకం పెరిగి కెరీర్ పరంగా ముందుకు సాగుతారు. అంతేకాకుండా పెద్దపెద్ద ఆఫర్లు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో స్థిరపడిన వ్యక్తులకు గౌరవం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అంతేకాకుండా పూర్వీకుల ఆస్తులు కూడా పొందగలుగుతారు. ఏదైనా బాధ పెట్టుబడుల నుంచి ఈ సమయంలో భారీ మొత్తంలో లాభాలు పొందుతారు. అలాగే చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని డబ్బులు కూడా తిరిగి వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో అత్యంత శుభకరమైన వాతావరణం నెలకొంటుంది. మనశ్శాంతి కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

 

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 20, 2026 04:18:18
Hyderabad, Telangana:

8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) అమలుపై కీలక సమాచారం వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియలో జాప్యం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల వెంటనే జీతాలు పెరగకపోయినా, భవిష్యత్తులో అందే బకాయిల (Arrears) రూపంలో భారీ లబ్ధి చేకూరనుంది.

1. అమలులో జాప్యం - కారణాలేంటి?
నియమ నిబంధనల ప్రకారం.. 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుండి అమలులోకి రావాలి. అయితే, ICRA నివేదిక ప్రకారం.. వేతన సంఘం తన తుది నివేదికను సమర్పించడానికి ఇంకా 15 నుండి 18 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీనివల్ల 2026 ప్రారంభంలోనే జీతాల పెంపు ఉండకపోవచ్చు.

2. 15 నెలల బకాయిలు అందే ఛాన్స్!
అమలు ఆలస్యమైనప్పటికీ, ప్రభుత్వం దీనిని జనవరి 1, 2026 నుండి వర్తింపజేస్తే, ఉద్యోగులకు దాదాపు 15 నెలల కంటే ఎక్కువ కాలం నాటి బకాయిలు ఒకేసారి అందుతాయి. ఈ భారీ బకాయిల చెల్లింపు వల్ల 2028 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ జీతాల వ్యయం 40% నుండి 50% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.

3. గత వేతన సంఘాల అనుభవాలు..
7వ వేతన సంఘం: కేవలం 6 నెలల బకాయిలతోనే ప్రభుత్వ వ్యయం 20% పెరిగింది.
6వ వేతన సంఘం: రెండున్నర ఏళ్ల జాప్యం కారణంగా ప్రభుత్వంపై దీర్ఘకాలిక ఆర్థిక ఒత్తిడి పడింది. ఇప్పుడు 8వ వేతన సంఘం విషయంలో కూడా అదే స్థాయి ఆర్థిక ప్రభావం ఉంటుందని ICRA విశ్లేషించింది.

4. ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు
భవిష్యత్తులో పెరిగే జీతాలు, పెన్షన్ల భారాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం ఒక వ్యూహాన్ని అనుసరిస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాన్ని (Capital Expenditure) 14% పెంచి, సుమారు రూ. 13.1 లక్షల కోట్లకు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వేతనాల భారం పడకముందే మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని చూస్తోంది.

5. ఉద్యోగులకు కలిగే ప్రయోజనం ఏంటి?
ప్రస్తుతానికి జీతాల పెంపు వాయిదా పడినట్లు కనిపించినా, అది రద్దు కాలేదని గుర్తుంచుకోవాలి. అమలు ఆలస్యమయ్యే కొద్దీ బకాయిల రూపంలో పెద్ద మొత్తం ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుంది. అయితే, స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఉద్యోగుల్లో కొంత అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది.

8వ వేతన సంఘం అమలు అనేది కేవలం వేతన సవరణ మాత్రమే కాదు, ఇది దేశ ఆర్థిక బడ్జెట్‌ను ప్రభావితం చేసే పెద్ద ప్రక్రియ. 2026 బడ్జెట్ ద్వారా ఈ విషయంలో ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

Also Read: Akshay Kumar Car Accident: హీరో అక్షయ్ కుమార్ కారుకు ఘోర ప్రమాదం..కారులో అక్షయ్, ట్వింకిల్..ఆటోని ఢీకొని గాల్లోకి అమాంతం!

ALso Read: Union Budget 2026: 8వ వేతన సంఘం జీతాల పెంపు..2026 కేంద్ర బడ్జెట్‌పై ప్రభావం ఎంత? ఉద్యోగుల కష్టాలు తీరేది ఎన్నడో?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top