Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Medchal-Malkajgiri500072

ఆలయ నిర్వాహకులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

Jul 19, 2024 12:40:37
Hyderabad, Telangana
కూకట్ పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేడు బేగంపేట్ డివిజన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆషాడ మాస బోనాలకు సంబంధించిన చెక్కులను ఆలయ నిర్వాహకులకు అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేయాలని వారికి సూచించారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Jan 24, 2026 08:06:14
Hyderabad, Telangana:

Giant King Cobra Video Watch Now: ప్రస్తుతం చాలామంది వన్యప్రాణులను ఇంట్లో పెంచుకుంటున్నారు. వాటికి ఎన్నో రకాల ఆహారాలను అందిస్తూ.. అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ప్రమాదకరమైన వన్యప్రాణులను సైతం ఏ మాత్రం భయపడకుండా ఇంట్లో సురక్షితంగా పెంచుకుంటున్నారు. అనారోగ్య సమస్యలకు గురైనప్పుడు వాటికి ప్రత్యేకమైన చికిత్సలు కూడా ఇంట్లోనే చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. ఈ వీడియోలో ఓ యువకుడు అత్యంత ప్రమాదకరమైన భారీ కింగ్ కోబ్రాకు చికిత్స చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు..

వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ భారీ కింగ్ కోబ్రా అనారోగ్య సమస్యకు గురైంది.. దీనిని గుర్తించిన పెంపుడు యజమాని వెంటనే తన ప్రాణాలను సైతం తెగించి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆ కింగ్ కోబ్రాను ఒంటి చేతితో పట్టుకొని చికిత్స చేశాడు. ఈ అరుదైన చికిత్సకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. అయితే చర్మ సంరక్షణలో భాగంగా.. ఆ యువకుడు అత్యంత ప్రమాదకరమైన పామును పట్టుకొని దాని నోటి భాగం కింద ఉన్న పాత చర్మాన్ని తొలిచేందుకు ప్రయత్నించాడు. అయితే, ఈ పాము గత కొద్ది రోజుల నుంచి ఈ పాత చర్మం కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతూ వస్తోందట.. దీనిని దృష్టిలో పెట్టుకొని అతను ఆ పాముని పట్టుకొని మరి దానిని పట్టుకొని చికిత్స చేసేందుకు ప్రయత్నించడం మీరు వీడియోలో చూడొచ్చు. 

ఈ పాముకు సంబంధించిన యజమాని ప్రమాదకరమైన పాములను పట్టుకునే నైపుణ్యం ఉండడంవల్ల.. ఎంతో చాకచక్యంగా ముందుగా దాని నడుము భాగాన్ని పట్టుకొని.. చాలా నెమ్మది నెమ్మదిగా ఒకే చేతిని ఆ పాము తలభాగం వైపుగా తీసుకువచ్చి ఒకేసారి ఉన్నట్టుండి దాని తలను పట్టేసుకున్నాడు. ఈ సమయంలో ఆ పాము అతని వైపు తిరిగి చూడలేకపోయింది. అందుకే ఎంతో చాకచక్యంగా దాని తలభాగాన్ని పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో అతను నన్ను కరువద్దు.. నీకు ఇంకా చాలా సహాయం చేయాల్సి ఉంది.. అంటూ మాట్లాడుతూ ఉండిపోయిన పాత చర్మాన్ని తీయడానికి ప్రయత్నించాడు..

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

ఆ యువకుడు చర్మాన్ని తొలగించిన వెంటనే పాము కాస్త ఉపశమనం పొందినట్లు తెలుస్తోంది. అది అప్పటివరకు కోపంగా ఉన్నప్పటికీ.. ఆ చర్మాన్ని తొలచి వేసిన తర్వాత కాస్త ప్రశాంతంగా అటు ఇటు తిరగడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సాధారణంగా అన్ని పాములు వాటి శరీర రక్షణలో భాగంగా సంవత్సరంలో ఒకటి నుంచి రెండుసార్లు కుబుసాన్ని విడుస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్ని పాములు చర్మ సమస్యల బారిన పడుతూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఈ పాము కూడా ఇలాంటి చర్మ సమస్యను ఎదుర్కొంటున్నట్లు కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 24, 2026 07:50:27
Hyderabad, Telangana:

Tamil Nadu Private School Fees Bill: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ రూపొందించిన 'ఫీజుల నియంత్రణ బిల్లు'కు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు ఏకపక్షంగా ఫీజులు పెంచకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. దీనివల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలపై విద్యాభారం తగ్గనుంది.

ప్రైవేట్ పాఠశాలల ఫీజులు నియంత్రణ కోసం ఏడుగురు సభ్యులతో శక్తివంతమైన కమిటీ వేశారు. ఫీజుల నిర్ణయం, పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి (ఛైర్మన్), పాఠశాల విద్య డైరెక్టర్, పిడబ్ల్యుడి (PWD) జాయింట్ చీఫ్ ఇంజనీర్, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి, రాష్ట్ర తల్లిదండ్రుల-ఉపాధ్యాయ సంఘం ప్రతినిధి, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధి, ప్రాథమిక విద్యా విభాగ ప్రతినిధి

చట్టంలోని కీలక నిబంధనలు..
పాఠశాలలు తమ ఇష్టానుసారంగా ఫీజులను పెంచడానికి వీలుండదు. కమిటీ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలి. కమిటీ ఒకసారి ఫీజును ఖరారు చేస్తే, అది వరుసగా మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఆ లోపు ఫీజు మార్చడానికి వీలుండదు. రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

ఎన్నికల వేళ రాజకీయ ప్రాధాన్యత..
తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం అధికార పార్టీకి మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల అంశం రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య. దీనిపై చట్టబద్ధమైన నియంత్రణ తీసుకురావడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే, అమలు తేదీపై విద్యాశాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఫీజుల విధానం అమల్లోకి వస్తుంది.

Also Read; Telangana DA Hike: తెలంగాణ ఉద్యోగులకు అలర్ట్..విధులకు డుమ్మా కొడితే ఉద్యోగం గోవిందా! రూల్స్ మార్చిన సర్కార్!

ALso Read; Jiohotstar 79 Plan: జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్.. రూ.79కే అతితక్కువ రీఛార్జ్ ప్లాన్..ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 24, 2026 07:29:28
Hyderabad, Telangana:

Two Snakes Dance Video Watch Now: మహారాష్ట్రలోని అహ్మదాబాద్ జిల్లా కేడ్‌గావ్ ప్రాంతంలోని ఓ రైతుకు సంబంధించిన పొలంలో రెండు అత్యంత ప్రమాదకరమైన పాములు ప్రత్యక్షమవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ పాములు చేస్తున్న పనులు చూసిన కొంతమంది రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అత్యంత విషపూరితమైన పాములు పంట పొలాల్లోకి రావడం సర్వసాధారణమే.. కానీ ఒకే చోట రెండు పాములు కనిపించడం ఆశ్చర్యమేస్తోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న ప్రముఖ స్నేక్ క్యాచర్ వెంటనే అక్కడికి చేరుకొని.. ఆ ప్రమాదకరమైన పాములను పట్టుకున్నారు. ఇప్పుడు ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

స్థానికులు అందించిన సమాచారం ప్రకారం ఎండిన పంట పొలాల్లో రెండు అత్యంత ప్రమాదకరమైన పాములు కనిపించాయట.  వారికి ముందుగా కేవలం ఒక పాము మాత్రమే కనిపించింది.. అయితే, ఆ తర్వాత ఆ పాము ఉన్నచోటే మరో పాము ప్రత్యక్షమవడం.. రెండు పెద్ద పాములు కనిపించడంతో ఆ పొలానికి సంబంధించిన యజమాని షాక్ అయిపోయాడు. దీంతో వెంటనే అతను స్నేక్ క్యాచర్ బృందానికి సమాచారం అందించారు. వారెక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే, ఈ సమయంలో రెండు పాములు ఒకదానిపై మరొకటి పాకుతూ ఉండడం మీరు గమనించవచ్చు. 

ఇలా రెండు పాములు ఒకదానిపై ఒకటి పాకుతూ.. ఉండడం చూసి స్నేక్ క్యాచర్ బృందం కూడా షాక్ అయ్యారు. ఇందులో ఓ స్నేక్ క్యాచర్ ఎంతో సులభంగా రెండు పాములను పట్టుకుని బంధించాడు. అయితే, ఈ సమయంలో ఆ పాములు రెండు పొదల్లోకి దూరెందుకు ప్రయత్నించాయి. అంతేకాకుండా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం కూడా చేశాయి. దీనిని గమనించిన స్నేక్ క్యాచర్ ముందుగానే వాటి తోక భాగాలను పట్టుకున్నాడు. దీంతో ఆ రెండు పాములు ఎంతో సులభంగా పట్టుకొని ఓ సంచిలో బంధించి అక్కడి నుంచి తీసుకెళ్లారు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

ఈ సందర్భంగా ఒక స్నేక్ క్యాచర్ మాట్లాడుతూ.. ఈ పాములు ఒకదానిపై ఒకటి పాకడానికి అనేక కారణాలు ఉన్నాయని. ముఖ్యంగా ఫిబ్రవరి నెల నుంచి మార్చి నెలలో వీటి సంతానోత్పత్తి సమయం ప్రారంభమవుతుందని. కాబట్టి సుమారు రెండు నుంచి మూడు నెలల పాటు ఈ పాములు ఇలాగే ఒకదానికొకటి కలయిక జరుపుతాయని వివరించాడు. అందుకే ఈ పాముల జంట ఒకదానిపై ఒకటి పాకుతూ నాట్యం చేస్తున్నట్లు కనిపించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోను పోస్ట్ చేసి చాలా రోజులైనప్పటికీ.. ఇప్పుడు వైరల్ అవ్వడం విశేషం..

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 24, 2026 07:11:23
Hyderabad, Telangana:

Telangana DA Hike News: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అటు నిబంధనల కఠినతరం, ఇటు సంక్షేమ పథకాల ప్రకటనతో కూడిన కీలక అప్‌డేట్స్ వెలువడ్డాయి. ఒకవైపు విధుల్లో క్రమశిక్షణపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండగా, మరోవైపు డీఏ పెంపు, బీమా వంటి వరాలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 'సివిల్ సర్వీసెస్ రూల్స్'లో తెలంగాణ ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ముఖ్యంగా అనధికారిక గైర్హాజరుపై నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

1. కొత్త నిబంధనలు ఇవే (రూల్ 9, రూల్ 25 సవరణ)..
ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ఏడాది కాలం పాటు విధులకు దూరంగా ఉంటే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. ఐదేళ్లకు మించి నిరంతరంగా విధులకు గైర్హాజరైతే, వారిని సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తారు. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా విదేశాలకు వెళ్లినా కఠిన చర్యలు తప్పవు. ఏదైనా చర్య తీసుకునే ముందు సంబంధిత ఉద్యోగికి 'షోకాజ్ నోటీసు' ఇవ్వడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

2. సంక్రాంతి కానుకగా డీఏ (DA) పెంపు
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరువు భత్యాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. డీఏను 30.03% నుండి 33.67% కి సవరిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.227 కోట్ల అదనపు భారం పడనుంది.

3. రూ.1.02 కోట్ల ఉచిత ప్రమాద బీమా
ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక భారీ పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని సుమారు 5.14 లక్షల మంది పర్మినెంట్ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల విలువైన ఉచిత ప్రమాద బీమా వర్తిస్తుంది. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో చర్చలు జరిపింది. ఎటువంటి ప్రీమియం భారం లేకుండానే ఉద్యోగులకు ఈ సౌకర్యం కలగనుంది.

విధుల్లో బాధ్యతారాహిత్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరిస్తూనే, ఉద్యోగుల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోంది. అనధికార సెలవుల్లో ఉన్న వారు తక్షణమే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.

Also Read: Bangladesh T20 World Cup: బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..అప్పీల్‌ను కొట్టివేసిన డీఆర్‌సీ..టోర్నీ నుంచి బంగ్లా అవుట్?

Also Read: Jiohotstar 79 Plan: జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్.. రూ.79కే అతితక్కువ రీఛార్జ్ ప్లాన్..ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 24, 2026 07:11:18
Hyderabad, Telangana:

Vivo V70 Launch Date: అతిపెద్ద స్మార్ట్ ఫోన్ కంపెనీల్లో ఒకటైన వివో త్వరలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ వివో v70 సిరీస్ పేరుతో లాంచ్ చేయబోతోంది. గత సంవత్సరం మార్కెట్‌లోకి విడుదల చేసిన వివో v6 సిరీస్ సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకొని దీనిని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. వివో కంపెనీ ఈ సిరీస్‌ను మొత్తం నాలుగు మోడల్స్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ గతంలో కంటే అద్భుతమైన డిజైన్‌తో, ప్రత్యేకమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్ సిరీస్‌కు సంబంధించిన అన్ని వివరాలు యూరోపియన్ సర్టిఫికేషన్ సైట్‌లో అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

యూరోపియన్ ప్రొడక్ట్ రిజిస్ట్రీ ఫర్ ఎనర్జీ లేబులింగ్ (EPREL) డేటాబేస్‌లో కొత్తగా విడుదల కాబోయే అన్ని స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన వివరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగానే వివో v70 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కు సంబంధించిన వివరాలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్‌ని కంపెనీ V2550 అనే మోడల్ నంబర్‌తో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది కొన్ని ప్రాంతాల్లో Vivo V70 FE సిరీస్‌గా విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 7,000 mAh బ్యాటరీతో లాంచ్ చేయబోతోంది. దీనికి తోడుగా 55W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు కూడా లభిస్తుంది. కాబట్టి ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 67 గంటలకు పైగా ఇది ప్లే బ్యాక్‌ను అందిస్తుంది.

అలాగే ఈ Vivo V70 మొబైల్ ఐదు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్డేట్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఈ సిరీస్‌లో భాగంగా కంపెనీ  వివో V70, వివో V70 ఎలైట్‌తో పాటు వివో V70 లైట్ 5G, వివో V70 EPREL మోడల్స్‌ను అందుబాటులో ఉంచబోతోంది. ఇక ఇందులోని హైడ్ ఎండ్ మోడల్ V2538 మోడల్ నెంబర్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇక దీనిని కంపెనీ 2026 సంవత్సరం ఆగస్టు నెలలో భారతదేశంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక ఈ స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ 6.77-అంగుళాల 1.5K క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు  5,000 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్ సపోర్టుతో విడుదల కాబోతోంది. 

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో చాలా ప్రత్యేకమైన కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా అన్ని మోడల్స్ త్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంతో ప్రత్యేకతతో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అదనంగా 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో బేస్ వేరియంట్స్ ఎంతో శక్తివంతమైన 6500mAh బ్యాటరీ 90W ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉండబోతోంది. అలాగే ఎన్నో రకాల ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ ప్రత్యేకమైన ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
TKTA Kiran Kumar
Jan 24, 2026 05:00:40
Hyderabad, Telangana:

Rats in annavaram Prasadam Basket: పవిత్ర క్షేత్రం అన్నవరంలో దారుణ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతినిత్యం ఏదో వివాదానికి పుణ్యక్షేత్రం కేంద్ర బిందువుగా మారుతోంది. సత్యదేవును ప్రసాదంపై ఎలుకలు తిరగడం కలకలం రేపుతోంది. సాక్షాత్తూ ప్రసాద విక్రయ కేంద్రంలో కళ్లెదురుగా ఎలుకలు ఇష్టారీతిన తిరుగుతున్నా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ భక్తుడు హైవే వద్దనున్న ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకునేందుకు వెళ్ళగా ఎలుకలు అందులోంచి బిలబిలమంటూ బయటికి రావడంతో భయానికి గురయ్యారు. దీనిపై ప్రశ్నిస్తే సిబ్బంది నిర్లక్ష్యంగా బదులిచ్చారు. 

భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో ఆలయ ఈవో త్రినాథరావు తక్షణం చర్యలకు ఆదేశించారు. పాత నమూనాలయం వద్ద పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించాలని ఆదేశించారు. మొత్తంగా ఎలుకలు తిండి పదార్ధాలు ఎక్కడున్న అక్కడ వాలిపోతాయి. 

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

అది గుడి కావొచ్చు.. ఏదైనా తినుబండారాలకు సంబంధించిన హోటల్ కావొచ్చు. అక్కడ ఎప్పటికపుడు పరిశుభ్రత పాటించడం మూలానా.. ఇలాంటి వాటిని అరికట్టవచ్చు. మరి ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నాదేది చూడాలి. అయినా.. ఆలయ పరిసరాల్లో ఎలుకలు రాకుండా కట్టుదిట్టైమన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

0
comment0
Report
HDHarish Darla
Jan 24, 2026 04:59:23
Hyderabad, Telangana:

ICC Refused Bangladesh: 2026 టీ20 ప్రపంచకప్ వేదికల వివాదంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నుండి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు ససేమిరా అంటున్న బంగ్లాదేశ్‌కు ఇప్పుడు అన్ని ద్వారాలు మూసుకుపోతున్నాయి.

భారత్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలన్న ఐసీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బంగ్లాదేశ్ వేసిన అప్పీల్‌ను ఐసీసీ వివాద పరిష్కార కమిటీ (DRC) తోసిపుచ్చింది. దీనితో బంగ్లాదేశ్ ఆశలు అడియాశలయ్యాయి.

డీఆర్‌సీ నిర్ణయం ఏంటి?
ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపే అధికారం తమకు లేదని డీఆర్‌సీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఐసీసీ బోర్డు సభ్యులు 14-2 మెజారిటీతో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్‌లోనే నిర్వహించాలని ఓటింగ్ ద్వారా ఖరారు చేశారు. నిబంధనల ప్రకారం ఈ నిర్ణయమే అంతిమమని కమిటీ తేల్చి చెప్పింది.

బంగ్లాదేశ్ తదుపరి అడుగు..
డీఆర్‌సీలో చుక్కెదురు కావడంతో, బీసీబీ ఇప్పుడు స్విట్జర్లాండ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)ను ఆశ్రయించాలని ఆలోచిస్తోంది. అయితే టోర్నీ సమయం దగ్గరపడుతుండటంతో ఇది ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందనేది సందేహమే.

బంగ్లా స్థానంలో స్కాట్లాండ్?
బంగ్లాదేశ్ మొండివైఖరి వీడకపోవడంతో ఐసీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం భారత్‌లో ఆడేందుకు అంగీకరించని పక్షంలో, బంగ్లాదేశ్‌ను టోర్నీ నుండి తప్పించి స్కాట్లాండ్ జట్టుకు అవకాశం ఇవ్వాలని ఐసీసీ భావిస్తోంది. దీనిపై శనివారం ఐసీసీ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

భద్రతా కారణాలను చూపుతూ భారత్‌లో ముంబై, కోల్‌కతా వేదికల్లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తోంది. వీటికి బదులుగా శ్రీలంక లేదా పాకిస్తాన్‌ను వేదికలుగా మార్చాలని కోరుతోంది. కానీ ఐసీసీ మాత్రం ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్‌కే కట్టుబడి ఉంది.

Also Read: Jiohotstar 79 Plan: జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్.. రూ.79కే అతితక్కువ రీఛార్జ్ ప్లాన్..ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా!

Also Read: Allu Arjun Review: మామ 'మెగాస్టార్' సినిమాకి అల్లుడు 'ఐకాన్ స్టార్' రివ్యూ..సినిమా చూసి ఏం చెప్పాడంటే? లాస్ట్ లైన్ మిస్ అవ్వొద్దు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
TKTA Kiran Kumar
Jan 24, 2026 04:59:17
Hyderabad, Telangana:

Andhra Pradesh Rain Alert: రానున్న 24 గంటల్లో  ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. 

మరోవైపు నిన్న దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. అలాగే ఉత్తర కోస్తాలో పొగమంచు కురుస్తుందని, 2-3డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలిపింది. మరోవైపు ఏపీలో చలి తీవ్రత ఇంకా తగ్గలేదు. సంక్రాంతి తర్వాత చలి తగ్గుతుందని అంచనా వేసినా.. అనూహ్యంగా మళ్లీ చలిపులి పెరిగింది. 

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

చలితో పాటు ఉదయం 7 గంటలు అయ్యేంత వరకు సూర్యుడు కనిపించంచడం లేదు. మరోవైపు పొగమంచు కారణంగా ఉదయం పూట వాహనాదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనబడకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం పది రోజులు పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 24, 2026 04:21:52
Bengaluru, Karnataka:

Realme 16 Pro Offer Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రియల్ మీ లేటెస్ట్‌గా విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్స్‌లో రియల్ మీ 16 ప్రో (Realme 16 Pro) ఒకటి. దీనిని కంపెనీ ఈ ఏడాది జనవరిలో లాంచ్ చేసింది. అయితే, ఇది ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇది అద్భుతమైన డిజైన్ను కలిగి ఉంది. వెనక భాగంలోని కెమెరా మాడ్యూల్ గతంలో కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్‌లో భాగంగా అత్యంత తగ్గింపు ధరకు లభిస్తోంది. దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలేంటో? ఫీచర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో రియల్ మీ 16 ప్రో (Realme 16 Pro) అత్యంత తగ్గింపు ధరకి లభించడం విశేషం. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 7,000mAh బ్యాటరీతో వచ్చిన మొట్టమొదటి రియల్ మీ మొబైల్‌గా కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. అంతేకాకుండా ఇది 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఇక ఈ Realme 16 Pro స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన డిస్ప్లే వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో ప్రత్యేకమైన 6.78 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు 144Hz రిఫ్రెష్ రేట్‌తో  వస్తోంది. అలాగే ఇది 6,500 నిట్స్ (Nits) బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఇది ఇతర కాంతి ఉన్నచోట కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 (Realme UI 7.0) ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది.

వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉంటుంది. రియల్ మీ బ్యాక్ సెటప్‌లో 200MP మెయిన్ కెమెరా (Samsung HP5 సెన్సార్, OIS సపోర్ట్) ప్రధాన కెమెరా అందించింది. అంతేకాకుండా అదనంగా 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఫ్రంట్ భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ Dimensity 7300 Max 5G చిప్‌సెట్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. 

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ Realme 16 Pro స్మార్ట్‌ఫోన్‌ మొత్తం మూడు వేరియన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.31,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవ వేరియంట్ 256 జిబి ఇంటర్నల్ స్టోరీస్‌తో లభిస్తోంది. కానీ ఇది 8gb ర్యామ్ ని మాత్రం కలిగి ఉంటుంది. ఇక చివరి వేరియంట్ 12gb ర్యామ్‌తో పాటు 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.36,999 నుంచి ప్రారంభమవుతుంది.

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ ఎంపిక చేసిన ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే బేస్ వేరియంట్‌పై రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.28,999కే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా అదనంగా భారీ తగ్గింపు పొందాలి అనుకునేవారు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, ఏదైనా పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.27 వేల వరకు బోనస్ లభిస్తుంది.. దీంతో మీరు కేవలం రూ.1,999 చెల్లిస్తే.. ఈ Realme 16 Pro స్మార్ట్‌ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు.

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 24, 2026 04:20:46
Hyderabad, Telangana:

Jiohotstar Cheapest Subscription: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం సరికొత్త, అత్యంత చవకైన ఓటీటీ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జియో హాట్‌స్టార్ (JioHotstar) పేరుతో వచ్చిన ఈ కొత్త సర్వీస్ ఇప్పుడు కేవలం రూ.79 నుంచే ప్రారంభం కానుంది.

ఇప్పటివరకు కేవలం మూడు నెలలు (త్రైమాసిక) లేదా ఏడాది (వార్షిక) ప్లాన్‌లను మాత్రమే అందించిన కంపెనీ, ఇప్పుడు వినియోగదారుల వెసులుబాటు కోసం నెలవారీ ప్లాన్‌లను కూడా అందుబాటులోకి తెచ్చింది.

1. మొబైల్ ప్లాన్ (Mobile Plan)
తక్కువ బడ్జెట్‌లో కంటెంట్‌ను వీక్షించాలనుకునే వారి కోసం ఈ ప్లాన్ అనువైనది. నెలవారీ సేవల కోసం రూ.79.. త్రైమాసిక (3 నెలలు) ప్లాన్ కోసం రూ.149.. వార్షిక (1 ఏడాది) ప్లాన్ కోసం రూ.499 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

2. సూపర్ ప్లాన్ (Super Plan)
మెరుగైన నాణ్యతతో వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారి కోసం ఈ విభాగం ఉంది.
నెలవారీ: రూ. 149
త్రైమాసిక: రూ. 349
వార్షిక: రూ. 1099

3. ప్రీమియం ప్లాన్ (Premium Plan)
యాడ్స్ లేని అనుభూతిని, అత్యున్నత నాణ్యతను కోరుకునే వారి కోసం ప్రీమియం ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.
నెలవారీ: రూ. 299
త్రైమాసిక: రూ. 699
వార్షిక: రూ. 2199

వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా నెలవారీ, మూడు నెలల లేదా సంవత్సర ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. జియో హాట్‌స్టార్ ఇప్పటికే మిలియన్ల కొద్దీ డౌన్‌లోడ్లను సాధించి దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది. స్పోర్ట్స్ నుంచి మూవీస్ వరకు అన్ని రకాల వినోదాన్ని ఈ ప్లాన్‌ల ద్వారా వీక్షించవచ్చు.

ఓటీటీ ప్రియులకు జియో హాట్‌స్టార్ ప్లాన్‌లు మంచి వెసులుబాటును కల్పిస్తున్నాయి. ముఖ్యంగా కేవలం రూ.79 తో ప్రారంభమయ్యే నెలవారీ ప్లాన్ సాధారణ వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

Also Read: Allu Arjun Review: మామ 'మెగాస్టార్' సినిమాకి అల్లుడు 'ఐకాన్ స్టార్' రివ్యూ..సినిమా చూసి ఏం చెప్పాడంటే? లాస్ట్ లైన్ మిస్ అవ్వొద్దు!

Also REad: 500 Note Ban: రూ.500 నోట్లు రద్దు కానున్నాయా? ఏటీఎంల నుంచి మాయమవుతాయా? కేంద్రం ఏం చెప్పిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 23, 2026 13:55:27
0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 23, 2026 13:04:45
Hyderabad, Telangana:

Giant Cobra Video Watch Here: అడవికి దగ్గరగా ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంటి లోపల ఎప్పుడు ఎప్పుడు పరీక్షిస్తూ శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అడవుల్లో నీటి కోరత విపరీతంగా పెరిగి.. ఆహార సమస్యలు వస్తున్నాయి.. దీనికి కారణంగా పాములు పెద్ద మొత్తంలో జనావాసాల వైపు సంచారం చేస్తూ ఉన్నాయి. ఇలా ఇప్పటివరకు చాలా పాములు జనాభాసాల్లో సంచారం చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటి సందర్భానికి సంబంధించిందే. అడవిలోకి వచ్చిన ఓ పాము ఏకంగా ఇంట్లో వంట గదిలో ఉండే ఫ్రిడ్జ్ వెనక భాగంలో దూరింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలే వైరల్ గా మారాయి. 

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. సర్పమిత్ర ఆకాష్ జాదవ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేసిన వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోలో స్నేక్ క్యాచర్ నెమ్మదిగా ఫ్రిజ్‌ను జరుపుతూ అందులో దూరిన పామును బయటకు తీయడం మీరు చూడొచ్చు. ముందుగా స్నేక్ క్యాచర్ ఆ పామును చాలా నెమ్మదిగా అందులో ఇరుక్కున్న పామును తన దగ్గర ఉన్న స్నేక్ స్టిక్ వినియోగించి నెమ్మదిగా బయటికి తీయడం మీరు చూడొచ్చు. అలాగే దానిని చూసిన ఆ పాము ఫ్రిడ్జ్ వెనక భాగం నుంచి స్పీడ్‌గా బయటికి దూసుకురావడం కూడా మీరు గమనించవచ్చు. 

స్నేక్ క్యాచర్ ఎంతో నెమ్మదిగా ఆ పామును పట్టుకొని బయటికి లాగేసాడు. బయటికి లాగేసిన వెంటనే దాని తల పట్టి నెమ్మదిగా ఆ ఇంట్లో నుంచి బయటికి తెచ్చేసాడు. అయితే, ఈ సమయంలో పాము అతనిపై దాడి చేసేందుకు ఎంతగానో ప్రయత్నించింది. అతను ఏమాత్రం భయపడకుండా ఎంతో చాకచక్యంగా ఆ పామును పట్టుకొని.. దానిని సులభంగా ఓ బ్యాగ్‌లో బంధించాడు. ఇలా బంధించిన వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

ఈ వీడియో చూసిన కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు.. ఇలాంటి పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఆ పాము ఎంత యాక్టివ్గా ఉందోనని.. ఎప్పుడైనా ఎవరినైనా సులభంగా దాడి చేసే సామర్థ్యం కలిగి ఉంటుందని.. దీనికి దూరంగా ఉండటం చాలా మంచిదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ పట్టుకున్న పామును ఎంతో సులభంగా బ్యాంకులో బంధించి దానిని అడవి ప్రదేశంలో వదిలిపెట్టినట్లు వన్యప్రాణి సంరక్షకులు ఆకాష్ చెప్పారు.

Also Read: ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..

Back to top