Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

Tirumala: శ్రీవారి ఆలయంలో హీరోయిన్లు మీనాక్షి, ఐశ్వర్య

PPINEWZ
Jan 07, 2026 14:11:06
Meenakshi Chowdary And Aishwarya Rajesh Visits Tirumala Temple Viral Video
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Jan 08, 2026 14:41:36
Hyderabad, Telangana:

NRI Nikitha Godishala Case: అమెరికాలోని మేరీల్యాండ్‌లో హత్యకు గురయిన నిఖిత గోడిశాల కేసులో కీలక ట్విస్ట్‌ జరిగింది. ఈ కేసుపై పుకార్లు.. వివాదాలు నడుస్తుండడం.. తమ కుమార్తె విషయంలో వివిధ కోణాల్లో చర్చ జరుగుతుండడంతో బాధిత కుటుంబం స్పందించింది. తమ కుమార్తె హత్య విషయంలో ఆ కుటుంబం ఓ వీడియో విడుదల చేసింది. మీడియాతోపాటు ప్రజలకు కీలకమైన విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Pay Revison Commission: ఉద్యోగులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి గిఫ్ట్‌.. పీఆర్‌సీపై కీలక ప్రకటన

తమ బిడ్డ కేసు విషయమై మీడియా సంయమనంతో వ్యవహరించాలని నిఖిత గోడిశాల కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. అపోహాలు, అవాస్తవాలను ప్రచారం చేయొద్దని ఇంకా వాస్తవాలు తెలియలేదని చెప్పారు. తీవ్ర విషాదంలో ఉన్న ఈ సమయంలో తమ కుటుంబంపై గోప్యతను పాటించాలని, సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ఈ కేసులో నిందితుడు అర్జున్ శర్మ ఇంకా పరారీలోనే ఉన్నాడని.. పోలీసులకు లభించలేదని సంచలన ప్రకటన చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని ప్రకటించారు.

Also Read: Tirumala: ఈ ఒక్క నంబర్‌కు 'హాయ్‌' అంటే చాలు.. తిరుమల వివరాలు మీ ఫోన్‌లోకి

ఈ ఘటనపై అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని.. ధృవీకరణ లేని సమాచారాన్ని ప్రచురించవద్దని.. నమ్మరాదని నిఖిత గోడిశాల కుటుంబం విజ్ఞప్తి చేసింది. దర్యాప్తు ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆ కుటుంబం కోరింది. నిఖిత గోడిశాల డిసెంబర్ 31వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. నిందితుడు అర్జున్‌ శర్మ పరారీలో ఉన్నాడు. భారతదేశంలో ఉన్నాడని తెలుస్తుండగా.. అతడు అరెస్టయ్యారనే వార్త సంచలనం రేపింది.

Also Read: Pawan Kalyan: పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ సంక్రాంతి సంబరాలు.. 3 రోజులు సందడే సందడి

నిందితుడు అరెస్ట్‌.. తమ కుమార్తె వ్యవహార శైలిపై ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నవన్నీ పూర్తిగా అపోహలు, అస్తవాలేనని నిఖిత గోడిశాల కుటుంబం ప్రకటించింది. అమెరికా అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అర్జున్ శర్మ జనవరి 1వ తేదీన అదృశ్యమైనట్లు.. ఈ మేరకు కేసు నమోదైందని కుటుంబసభ్యులు తెలిపారు. జనవరి 2న అమెరికా నుంచి భారత్‌కు రావడంతో.. నిఖిత గోడిశాల మృతదేహం మేరీల్యాండ్‌లోని కొలంబియా ప్రాంతంలో అర్జున్ శర్మ నివాసంలో గుర్తించినట్లు వివరించారు. నిఖితకు చెందిన వాహనం కూడా అదే ప్రదేశంలో లభ్యమైంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని హోవార్డ్ కౌంటీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో సహా యూఎస్ చట్ట అమలు సంస్థలు స్పష్టంగా పేర్కొన్నాయని నిఖిత గోడిశాల కుటుంబం తెలిపింది. నిందితుడిని అరెస్ట్ చేశారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. తమ కుమార్తె అంత్యక్రియలు ప్రైవేట్‌గా నిర్వహిస్తామని.. ఆ కార్యక్రమాలు సక్రమంగా సాగేందుకు పోలీసు రక్షణను కోరినట్లు వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Jan 08, 2026 14:11:37
0
comment0
Report
HDHarish Darla
Jan 08, 2026 12:22:04
Nunna, Vijayawada, Andhra Pradesh:

Sick Room In AP Govt Schools: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దే క్రమంలో ఏపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్కూల్ క్యాంపస్‌లోనే తక్షణ వైద్య సహాయం అందేలా "సిక్ రూమ్స్" (Sick Rooms) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 

విద్యార్థులు పాఠశాలలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనా లేదా ఆడుకునే సమయంలో గాయపడినా, తక్షణమే ప్రథమ చికిత్స అందించేందుకు ప్రతి స్కూల్లోనూ ఒక ప్రత్యేక వైద్య గదిని (సిక్ రూమ్) ఏర్పాటు చేయనుంది.

సిక్ రూమ్ - ప్రత్యేకతలు..
ఈ గదిలో ప్రథమ చికిత్స కిట్లు (First Aid Kits), అవసరమైన మందులు, ఇతర వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. దీనిని 'మెడికల్ లేదా నర్సు ఆఫీస్'గా కూడా పిలుస్తారు. ఒక్కో సిక్ రూమ్ ఏర్పాటు కోసం సర్వశిక్ష అభియాన్ ద్వారా రూ.5 లక్షల నిధులను ప్రభుత్వం కేటాయించింది. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 600 పాఠశాలల్లో ఈ సౌకర్యాన్ని కల్పించనున్నారు. తదుపరి విడతల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు దీనిని విస్తరిస్తారు.

కేవలం మందులు ఇవ్వడమే కాకుండా, విద్యార్థుల సమగ్ర ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. స్థానిక ఆసుపత్రుల సహకారంతో విద్యార్థులకు రెగ్యులర్ మెడికల్ టెస్టులు నిర్వహించి, ప్రతి విద్యార్థికి ఒక 'డిజిటల్ హెల్త్ ప్రొఫైల్' తయారు చేస్తారు.

టీచర్లు, ఆరోగ్య నిపుణులు, తల్లిదండ్రులతో కూడిన ఒక కమిటీ ఈ సిక్ రూమ్ నిర్వహణను పర్యవేక్షిస్తుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు ఇక్కడ నిపుణుల ద్వారా అవగాహన కల్పిస్తారు.

గడువు ఎప్పటి వరకు?
ప్రభుత్వ లక్ష్యం ప్రకారం 2026 మార్చి నాటికి ఎంపిక చేసిన 600 పాఠశాలల్లో ఈ సిక్ రూమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం పాఠశాలల్లోని పెద్ద గదులను విభజించి, ఒక భాగాన్ని ప్రత్యేక వైద్య అవసరాల కోసం కేటాయిస్తున్నారు.

ఇప్పటికే మధ్యాహ్న భోజనంలో మార్పులు, 'ముస్తాబు' వంటి కార్యక్రమాలతో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం, తాజా నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో మరింత భరోసా నింపింది.

Also Read: EPF Wage Ceiling: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..రూ.300 నుంచి రూ.21,000 వరకు..74 ఏళ్లలో జరిగిన మార్పులు ఇవే?!

Also Read: Anaganaga Oka Raju Trailer: 'అనగనగా ఒక రాజు' ట్రైలర్ వచ్చేసింది! సంక్రాంతి బరిలో నవీన్ పోలిశెట్టి కామెడీ జాతర కన్ఫర్మ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
TKTA Kiran Kumar
Jan 08, 2026 11:35:27
Hyderabad, Telangana:

Sankranthi Movies Box Office War  2026: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త సినిమాలు పోటీపడుతున్నాయి. అభిమాన హీరోల సినిమాల కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.  సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఈసారి అర అజను సినిమాలు పోటీపడుతున్నాయి. కానీ అందులో తమిళ సినిమా పోటీలో లేదనే చెప్పాలి. అంటే ఐదు సినిమాలు మాత్రమే బరిలో ఉండబోతున్నాయి. ఈ సినిమాలు అభిమానుల అంచనాలను మించిపోతాయనే క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. సినిమా ప్రమోషన్లలో ఆ సినిమా ట్రైలర్లు, పాటలు సోషల్ మీడియాను దద్దరిల్లేలా చేశాయి. దీంతో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద అభిమానుల సందడితో పండగ వాతావరణం నెలకొననుంది. ఈ రేసులో తొలిసారిగా జనవరి 9వ తేదీన ప్రభాస్ నటించిన భారీ ఎంటర్‌టైనర్  ‘ది రాజా సాబ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  అదే రోజున తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన పొలిటికల్ డ్రామా  జననాయకుడు విడుదలయ్యేందుకు సిద్ధమైంది.కానీ అనూహ్యంగా ఈ సినిమా సెన్సార్ కారణంగా వాయిదా పడింది. ఎపుడు విడుదల చేస్తారనేది క్లారిటీ లేదు. 

సంక్రాంతి బరిలో దిగుతున్న రెండో అతిపెద్ద సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’.  క్లాస్, మాస్ ప్రేక్షకులను రంజింపచేసే సినిమాలతో విజయవంతమైన డైరెక్టరుగా పేరుతెచ్చుకున్న అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్ తో తెరకెక్కించిన వెరైటీ కామిడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జనవరి 12వతేదీన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’  ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ చిత్రంలో 
వెంకటేష్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

మాస్ మహారాజగా పేరు తెచ్చుకున్న రవితేజన జనవరి 13న సరికొత్త ఎనర్జీతో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో సంక్రాంతికి సందడి చేసేందుకు సిద్ధమ్యాడు. పండగ జోరులోనే  జనవరి 14వ తేదీన నవీన్ పోలీశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమా రాబోతుంది. అటు చివరగా జనవరి 15న సంక్రాంతి పండగ రోజున ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో శర్వానంద్ ప్రేక్షకులను పలుకరించబోతున్నారు.

సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు కొట్టేదెవరని చర్చలో అభిమానులు పోటీపడి పందెంకాస్తున్నారు.  ప్రభాస్, చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలు.. రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్, శ్రీవిష్ణు లాంటి చిన్న మీడియం మార్కెట్ ఉన్న హీరోలు.. విజయ్ ఒక్కడే  పరభాషా హీరో బరిలో దిగుతున్నారు.

రెబల్ స్టార్ డార్లింగ్  ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమా  ప్రమోషన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. రాజాసాబ్‌ కోసం 44 ఏళ్ల నాటి హిందీ సాంగ్ రీమిక్స్.. ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ డ్యాన్స్.. ‘నాచే నాచే’ వీడియో సాంగ్ అభిమానుల అంచనాలను రెట్టింపు చేసింది.  ప్రభాస్ ను వెండి తెరపై చూసి థియేటర్లలో పూనకానికి సిద్ధమైపోయారు.  హీరో మెగాస్టార్ చిరు నటించిన ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. దీనికి ‘మెగా విక్టరీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌’ అని నామకరణం చేశారు. ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీ హీరో వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవితో కలిసి కామెడీ పండించబోతున్నారు.  రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఆ సినిమా యూనిట్ లో అంచనాలు మించిపోయాయి. నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు.  

వరుస పాన్‌ ఇండియా సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ప్రభాస్‌ హీరోగా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రభాస్‌ ఫ్యాన్స్   సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని  ఎదురు చూస్తున్నారు. ది రాజా సాబ్‌ సినిమా పలుమార్లు విడుదల వాయిదా పడుతూ  ఫైనల్‌గా సంక్రాంతి రేసులో నిలిచింది.  ఈ సంక్రాంతికి  రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ది రాజా సాబ్ గా ప్రేక్షకులను ఉత్తేజ పరచబోతున్నారు. ప్రభాస్‌ నటిస్తున్న తొలి హారర్, కామెడీ మూవీ కావడంతో ఈ మూవీపై ట్రేడ్‌ వర్గాల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఇప్పటికే ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది.  ప్రత్యేకించి ‘ది రాజా సాబ్‌’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రభాస్‌ వింటేజ్‌ లుక్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీ పోస్టర్స్, టీజర్, గ్లింప్స్‌తో పాటు తాజాగా విడుదలైన పాటకి కూడా అనూహ్యమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలో  నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్‌, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషించారు.  మారుతి దర్శకత్వం వమించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి సీజన్‌లో ముందుగా మరికొన్ని గంటల్లో రాబోతుంది. 

సంక్రాంతికి  మెగాస్టార్  చిరంజీవి  మన శంకర వరప్రసాద్‌గారు  సినిమాతో   పండగకి వస్తున్నారు  అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకులను పులకరించబోతున్నారు.  ఫ్యామిలీ ఎంటర్ టైనర్  హీరోగా పేరు తెచ్చకున్న విక్టరీ వెంకటేశ్ తో  సంక్రాంతికి వస్తున్నాం  మూవీతో బిగ్టెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అందుకున్న డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి  మన శంకర వరప్రసాద్‌గారు చిత్రానికి దర్శకత్వం వహించారు. కడుపుప్ప నవ్వించే కామెడీ, కంటినిండా వినోదం, భావోద్వేగాలు,  మాస్‌ ఎలిమెంట్స్‌ కలగలిపిన  సినిమా సంక్రాంతి పండగ సీజన్‌లో అభిమానులకు ఫెస్టివల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.  చిరంజీవి–వెంకటేశ్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటంతో అభిమానుల అంచనాలు మించిపోయాయి. సినిమా ఆరంభం నుంచే 2026 సంక్రాంతి లక్ష్యంగా షూటింగ్‌ ΄ప్లాన్ చేసి, శరవేగంగా పూర్తిచేశారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది.  కేథరిన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో హీరో వెంకటేశ్‌ కీలక పాత్రలో 20 నిమిషాల పాటు కనిపించనున్నారు.  ఇద్దరు స్టార్‌ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్‌ కలిసి ఒకే సినిమాలో కనిపింంచనుండటంతో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ పై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుందని ట్రేడ్‌ వర్గాల్లోనూ మంచి జోష్‌ నెలకొంది. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ‘మీసాల పిల్ల...’ పాట సోషల్ మీడియాను షేక్ చేసింది. అభిమానుల్లో హమ్మింగ్ సాంగ్ గా మారిపోయింది. అర్చన సమర్పణలో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. 

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రేక్షకులను మాస్‌ మహారాజా రవితేజ ఫిదా చేయబోతున్నారు. సంక్రాంతి కానుకగా తనదైన శైలిలో వినోదం అందించేందుకు సిద్ధమయ్యారు.  నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్ళు మీకు జోహార్లు వంటి వినోదాత్మక  సినిమాలను తెరకెక్కించిన కిశోర్‌ తిరుమల ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. సున్నితమైన అంశాలను తనదైన భావోద్వేగాలతో తెరకెక్కించే కిశోర్‌ తిరుమల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో భార్య, భర్తల మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్‌ను వినోదాత్మకంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. హీరో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా అంచనాలను మించిపోయింది. సంక్రాంతి సినిమాగా బక్సాఫీసు వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు... సమాధానం కోసం చాలా ప్రయత్నించాను. గూగుల్, చాట్‌ జీపీటీ, జెమినీ, ఏఐ... ఇలా అన్నింటినీ అడిగాను.. బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్‌ చెప్పలేకపోయాయేమో. అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లను అడిగాను. ఆశ్చర్యపోయారే తప్ప ఆన్సర్‌ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ మీ ఈ రామ సత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్‌ గ్లింప్స్‌లో ఆకట్టుకున్నాయి.  రవితేజ చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్‌టైనర్‌ చేయడం ప్రేక్షకులకు రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇందులో వినోదంతో పాటు మనసుని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి. సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. 

ప్రచారానికి దూరంగా.. సంచలన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హీరో శర్వానంద్‌ మరోసారి సంక్రాంతికి నారీనారీ నడుమ మురారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 2017లో  శతమానం భవతి  సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి ఊహించని విధంగా  ఘన విజయం అందుకున్నారు. ఇప్పుడు  నారి నారి నడుమ మురారి  చిత్రంతో మరోసారి సంక్రాంతికి శర్వానంద్ ప్రేక్షకులను అలరించబోతున్నారు. 2023లో శ్రీవిష్ణుతో  సామజవరగమన   వంటి విజయవంతమైన సినిమా తెరకెక్కించిన రామ్‌ అబ్బరాజు ‘నారి నారి నడుమ మురారి’కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాక్షీ వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకాలపై అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.   శర్వానంద్‌ నటిస్తున్న ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. ఇప్పటికే విడుదలైన మా మూవీ ఫస్ట్‌ లుక్, ప్రమోషనల్‌పోస్టర్లు బజ్‌ క్రియేట్‌ చేశాయి. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్‌ సింగిల్‌  దర్శనమే...  ప్రేక్షకుల ఆదరణ పొందింది.. దీపావళి సందర్భంగా సంప్రదాయ పంచె కట్టుతో ఉన్న శర్వానంద్‌ లుక్‌ని విడుదల చేయగా మంచి స్పందన లభించింది. గతంలో ‘శతమానం భవతి’ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందించిన శర్వానంద్‌కి సంక్రాంతి లక్కీ సీజన్‌ మారిపోయింది. అందుకే  నారి నారి నడుమ మురారి సినిమాతో కుటుంబ ప్రేక్షకులను అలరించడంతో పాటు మరో హిట్‌ని ఆయన తన ఖాతాలో వేసుకుంటారని  సినీ దర్శక నిర్మాతలు విశ్వాసంతో ఉన్నారు. జ్ఞానశేఖర్, యువరాజ్‌ విజువల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సినిమా వర్గాలు అభిప్రాయం వ్యక్తంచేశాయి.

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న మరో కామెడీ చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న విడుదల కానుంది. నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. జాతిరత్నాలు, మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి వంటి సినిమాలతో నవీన్ పొలిశెట్టి ప్రేక్షకుల ఆదరణ పొందారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘అనగనగా ఒక రాజు’ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపుదిద్దుకుంది. మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘భీమవరం బల్మా..’ అంటూ సాగే మొదటి పాట విడుదల వేడుకని భీమవరంలో ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండగను కాస్త ముందుగానే తీసుకొచ్చినట్టుగా నవీన్‌ పొలిశెట్టి వేదిక వద్దకు ఎద్దుల బండిపై రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే నవీన్, మీనాక్షి కలిసి ‘భీమవరం బల్మా...’ పాటకు వేదికపై డ్యాన్స్‌ చేయడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పైగా భీమవరం బల్మా...’ పాటతో నవీన్‌ పొలిశెట్టి మొదటిసారి గాయకుడిగా మారడం మరింత విశేషం. ఒక బైక్‌ ప్రమాదంలో గాయాలు కావడం నవీన్ పొలిశెట్టి కొంతకాలం షూటింగ్‌కి దూరంగా ఉన్నారు. ఆ సమయంలో ప్రేక్షకులకు ఎలా వినోదం అందించాలని నవీన్ ఆందోళనకు గురయ్యాడు.  గాయాలనుంచి తేరుకుని అనగనగా ఒక రాజు’ సినిమా పూర్తి చేసుకున్నాడు.  పండగకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో వినోదం, మాస్, కమర్షియల్‌ సాంగ్స్, అద్భుతమైన ప్రేమకథ వంటి అంశాలన్నీ ఉన్నాయి. మీనాక్షి కామెడీ టైమింగ్‌ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ‘అనగనగా ఒక రాజు’ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని నవీన్ అభిప్రాయం వ్యక్తంచేశారు. సంక్రాంతి పండుగ సంబరాలతో కడుపుబ్బా నవ్వుకోడానికి సిద్ధంగా ఉండాలని  నవీన్‌ పొలిశెట్టి  ప్రేక్షకులను కోరారు. సినిమాతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

సంక్రాంతికి పోటీ పడుతున్న తెలుగు సినిమాలు.. ప్రేక్షకులను ఆకట్టుకునేదెవరు? బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు కొల్లగొట్టేదెవరు?  సంక్రాంతి సంబరాల్లో గుర్తుండిపోయే నటన ఎవరిది? అనే విశ్లేషణలతో వెండితెరపై చూసి ఆనందించేందుకు అగ్రహీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇందులో విజేతలు ఎవరేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. 

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
TKTA Kiran Kumar
Jan 08, 2026 11:28:08
Hyderabad, Telangana:

Prime Minister Narendra Modi Assets Value: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆస్తుల విలువ అనూహ్యంగా పెరిగింది. మోడీ ఆస్తుల విలువ  రూ. 3.02 కోట్లకు చేరిందని ఏడీఆర్‌ (Association for Democratic Reforms) నివేదిక వెల్లడించింది. 2014తో పోలిస్తే పదేళ్లలో ఆయన ఆస్తులు 82శాతం మార్కెట్ ప్రకారం పెరిగనట్టు వెల్లడించింది.  ఇక లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆస్తులు 2014లో రూ. 9.4 కోట్లు ఉండగా.. 2024 నాటికి రూ. 20.39 కోట్లకు చేరి 117శాతం వృద్ధి నమోదైంది. 

వరుసగా 3సార్లు గెలిచిన ఎంపీల సగటు ఆస్తులు కూడా పదేళ్లలో 110 శాతం పెరిగినట్లు ADR తెలిపింది. అలాగే వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి రూ. 124 కోట్ల సంపాదనతో టాప్‌ త్రీలో ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషయానికొస్తే.. ఈయన ప్రభుత్వాధినేతగా 24 యేళ్లు కంప్లీట్ చేసుకొని 25వ యేట అడుగుపెట్టారు. 7 అక్టోబర్ 2001న గుజరాత్ సీఎంగా అయ్యారు. నరేంద్ర మోడీ స్వాతంత్య్రం వచ్చాకా పుట్టిన నేతగా రికార్డు క్రియేట్ చేశారు. స్వాతంత్రం తర్వాత  మొదటి ప్రైమ్ మినిష్టర్ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నేతగా నరేంద్ర మోడీ  రికార్డు క్రియేట్ చేశారు. 

2001 లో తొలిసారి గుజరాత్ సీఎం అయ్యారు. ఆ తర్వాత 2002, 2007, 2012లో వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచి సంచలనం రేపారు. మొత్తంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు ఎమ్మెల్యే కాకముందే  ఈయన  ముఖ్యమంత్రిగా  గుజరాత్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2001 నుంచి అప్రతిహతంగా ప్రభుత్వాధినేతగా ఉన్న ప్రపంచ లీడర్ బహుశా ప్రపంచంలో ఎవరు లేరనే చెప్పాలి.  ప్రభుత్వాధినేతగా 24 యేళ్లు పూర్తి చేసుకొని 25వ యేట అడుగుపెట్టారు. 

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

అంతేకాదు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రధాన మంత్రి అయిన ఆరో నేతగా నరేంద్ర మోడీ రికార్డు క్రియేట్ చేశారు. ఈయన కంటే ముందు మొరార్జీ దేశాయ్ (బాంబే స్టేట్), చౌదరి చరణ్ సింగ్ (ఉత్తర ప్రదేశ్), విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (ఉత్తర ప్రదేశ్), పీవీ నరసింహారావు (ఆంధ్ర ప్రదేశ్), హెచ్ డీ దేవగౌడ (కర్ణాటక) ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని అయ్యారు. అంతేకాదు వరుసగా మూడు సార్లు ఎలెక్ట్ అయిన ప్రధాన మంత్రిగా రికార్డు క్రియేట్ చేశారు. 

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

2014లో భారత ప్రైమ్ మినిష్టర్ అయ్యారు. ఈయనకు ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో  106 మిలియన్లకు పైగా ఫాలోవర్స్స్ ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశాధినేతకు ఈ రేంజ్ ఫాలోవర్స్ లేరు.ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 99.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ రెండు మాధ్యమాల్లో ఈ రేంజ్ ఫాలోవర్స్ ఉన్న వరల్డ్ లీడర్ గా రికార్డు క్రియేట్ చేశారు. నరేంద్ర మోడీ ప్రధాని మంత్రిగా 26 మే 20214లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.నరేంద్ర మోడీ 2014, 2019,2024 వరుసగా మూడు లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించిన  కాంగ్రెస్ యేతర  ప్రధాని మంత్రిగా  చరిత్ర తిరగరాసారు. అంతేకాదు వారణాసి లోక్ సభ నుంచి ఈయన వరుసగా హాట్రిక్ విజయాలు అందుకున్నారు.  అంతేకాదు 29 దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్న ప్రపంచ నేతగా రికార్డ్ క్రియేట్ చేశారు.

0
comment0
Report
Jan 08, 2026 11:24:21
0
comment0
Report
HDHarish Darla
Jan 08, 2026 10:43:09
Hyderabad, Telangana:

EPF Wage Ceiling Increase: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వేతన పరిమితి పెంపుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, గత 74 ఏళ్లలో ఈ పరిమితి ఎలా మారుతూ వచ్చిందో వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కోట్లాది మంది ఉద్యోగుల సామాజిక భద్రతకు ఈపీఎఫ్ఓ (EPFO) భరోసా ఇస్తుంది. అయితే, ఈ పథకంలో చేరడానికి ప్రామాణికంగా తీసుకునే 'వేతన పరిమితి' కాలక్రమేణా మారుతూ వస్తోంది. ప్రస్తుతం ఉన్న రూ.15,000 పరిమితిని సవరించాలని సుప్రీంకోర్టు తాజాగా కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది.

సుప్రీంకోర్టు కీలక ఆదేశం
ప్రస్తుతం ఉన్న రూ.15,000 ప్రాథమిక వేతన పరిమితిని పెంచే విషయంపై నాలుగు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెరుగుతున్న జీతాలు, జీవన వ్యయం దృష్ట్యా ఈ పరిమితిని రూ.21,000 లేదా అంతకంటే ఎక్కువకు పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

1952 నుండి ఇప్పటివరకు..
ఈపీఎఫ్ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 9 సార్లు వేతన పరిమితిని సవరించారు. ఆ వివరాలు పట్టిక రూపంలో ఇక్కడ చూడవచ్చు.

కాలం (అమలులోకి వచ్చిన తేదీ) నెలకు వేతన పరిమితి (రూపాయల్లో)
01.11.1952 నుంచి 31.05.1957 Rs 300
01.06.1957 నుంచి 30.12.1962 Rs 500
31.12.1962 నుంచి 10.12.1976 Rs 1,000
11.12.1976 నుంచి 31.08.1985: Rs 1,600
01.09.1985 నుంచి 31.10.1990: Rs 2,500
01.11.1990 నుంచి 30.09.1994: Rs 3,500
01.10.1994 నుంచి 31.05.2001: Rs 5,000
01.06.2001 నుంచి 31.08.2014: Rs 6,500
01.09.2014 నుంచి ప్రస్తుత రోజు వరకు Rs 15,000

ప్రస్తుత నిబంధనలు ఏమిటి?
నెలకు రూ.15,000 వరకు ప్రాథమిక వేతనం (Basic + DA) ఉన్న ఉద్యోగులందరూ ఈపీఎఫ్ ఖాతా కలిగి ఉండటం తప్పనిసరి అనే నిబంధన ఉంది. సెప్టెంబర్ 1, 2014 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి, వారి వేతనం రూ.15,000 కంటే ఎక్కువగా ఉంటే, ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ఐచ్ఛికం (Optional). అంటే ఉద్యోగి నిర్ణయాన్ని బట్టి ఈపీఎఫ్‌ ఖాతా తెరుచుకునేందుకు వీలు కల్పించారు.

ఈ పరిమితిని పెంచడం వల్ల మరింత మంది తక్కువ, మధ్యతరగతి ఆదాయ వర్గాల వారు ఈ సామాజిక భద్రతా పథకం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. గత 10 ఏళ్లుగా (2014 నుండి) ఈ పరిమితిలో ఎటువంటి మార్పు రాలేదు. త్వరలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై లక్షలాది మంది వేతన జీవులు ఆశలు పెట్టుకున్నారు.

Also Read: Anasuya On Shivaji: శివాజీతో వివాదంపై రూటు మార్చిన యాంకర్ అనసూయ..శివాజీకి సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు..ఇదేం ట్విస్ట్!

Also Read: Sharmila Joins To YCP: వైసీపీలో చేరనున్న వైఎస్ షర్మిళ..అన్న కోసం మరోసారి పార్టీ మారనున్న చెల్లెలు?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 08, 2026 09:18:45
Hyderabad, Telangana:

Naveen Polishetty Anaganaga Oka Raju Trailer: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి మరోసారి తన కామెడీ టైమింగ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' వంటి వరుస విజయాల తర్వాత ఆయన నటించిన లేటెస్ట్ ఫన్ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు'. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా రిలీజ్ చేసింది.

సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద సినిమాల హడావుడి. అయితే ఈసారి భారీ యాక్షన్ చిత్రాల మధ్య తనదైన శైలిలో వినోదాన్ని పంచేందుకు హీరో నవీన్ పోలిశెట్టి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న 'అనగనగా ఒక రాజు' చిత్ర ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రైలర్ విశేషాలు..
తాజాగా 'అనగనగా ఒక రాజు' విడుదలైన ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. నవీన్ పోలిశెట్టి తన మార్క్ కామెడీ టైమింగ్ మరియు మేనరిజమ్స్‌తో ఇరగదీశారు. పెళ్లి చుట్టూ తిరిగే కథాంశంతో, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి, ఈ సినిమాలో నవీన్ జోడిగా అలరించనుంది. ట్రైలర్‌లో ఆమె లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 

ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాను సమర్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా, ఇప్పుడు ట్రైలర్ పండుగ వాతావరణాన్ని ముందే తీసుకువచ్చింది.

సంక్రాంతి బరిలో పోరు..
జనవరి 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి రేసులో 'రాజా సాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వంటి భారీ చిత్రాలు ఉన్నప్పటికీ.. నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీకి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

Also Read: Anasuya On Shivaji: శివాజీతో వివాదంపై రూటు మార్చిన యాంకర్ అనసూయ..శివాజీకి సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు..ఇదేం ట్విస్ట్!

Also Read: Sharmila Joins To YCP: వైసీపీలో చేరనున్న వైఎస్ షర్మిళ..అన్న కోసం మరోసారి పార్టీ మారనున్న చెల్లెలు?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 08, 2026 08:27:17
Hyderabad, Telangana:

Anasuya Supports Shivaji Comments On Women: టాలీవుడ్‌లో గత కొద్దిరోజులుగా సంచలనం సృష్టించిన 'శివాజీ వర్సెస్ అనసూయ' వివాదం ఊహించని మలుపు తిరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయి నుండి, ఒకరి ఉద్దేశాన్ని మరొకరు గౌరవించుకునే స్థాయికి ఈ వ్యవహారం చేరుకోవడంతో సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. అయితే సడెన్‌గా యాంకర్ అనసూయ.. నటుడు శివాజీకి అనుకూలమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఏం జరిగిందంటే?
'దండోరా' ఈవెంట్‌లో నటీమణుల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. హీరోయిన్లు పద్ధతిగా ఉండాలని ఆయన సూచించడాన్ని తప్పుబడుతూ అనసూయ, చిన్మయి వంటి వారు సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. అయితే, తాజాగా అనసూయ తన ధోరణిని మార్చుకుంటూ ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు.

అసలు వివాదం ఏంటి?
శివాజీ ఒక బహిరంగ వేదికపై మాట్లాడుతూ.. నిధి అగర్వాల్‌కు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ప్రస్తావించి, ఆడపిల్లలు జాగ్రత్తగా, పద్ధతిగా ఉండాలని వ్యాఖ్యానించారు. దీనిపై అనసూయ స్పందిస్తూ, "తప్పు చేసే మగాళ్లకు బుద్ధి చెప్పాల్సింది పోయి, మాకు నీతులు చెబుతారా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా అనసూయకు మద్దతు తెలపడంతో టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది.

సడన్‌గా ఈ వివాదంపై తన రూట్ మార్చిన అనసూయ.. శివాజీ ఉద్దేశాన్ని పాజిటివ్‌గా అర్థం చేసుకుంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "శివాజీ గారు ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన మాటను ప్రజలు వినేంతగా ఎదిగారు" అని ఆమె ప్రశంసించారు. ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఆడపిల్లల భద్రత పట్ల ఉన్న ఆరాటం, ఒక మంచి ఉద్దేశమే ఉందని అనసూయ అభిప్రాయపడ్డారు. శివాజీ గారు కేవలం అమ్మాయిలకే కాకుండా, అబ్బాయిలకు కూడా వారి బాధ్యతను గుర్తుచేసి ఉంటే ఇంత పెద్ద గొడవ జరిగేది కాదని ఆమె సున్నితంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

అనసూయ చేసిన ఈ సానుకూల వ్యాఖ్యలతో గత కొద్దిరోజులుగా సాగుతున్న మాటల యుద్ధానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. శివాజీపై వ్యక్తిగత ద్వేషం లేదని, కేవలం అభిప్రాయ భేదం మాత్రమేనని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Also Read; Sharmila Joins To YCP: వైసీపీలో చేరనున్న వైఎస్ షర్మిళ..అన్న కోసం మరోసారి పార్టీ మారనున్న చెల్లెలు?!

Also Read: School Holiday: విద్యార్థులకు పండగ లాంటి వార్త..రిపబ్లిక్‌ డే స్కూళ్లకు 3 రోజులు సెలవులు..ఎప్పుడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 08, 2026 07:39:01
Hyderabad, Telangana:

YS Sharmila Into YCP Party: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాల్లో వస్తున్న మార్పులు, ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులతో మళ్లీ సఖ్యత ఏర్పడుతోందన్న తాజా ఊహాగానాలు ఊపందుకున్నాయి. అన్న-చెల్లెళ్ల మధ్య సయోధ్య కుదిరినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు కారణంగా ఇటీవలే జరిగిన కొన్ని సంఘటనలే అని వారు చెప్పుకొస్తున్నారు. ఇంతకీ ఆ విశేషాలేంటో వివరంగా తెలుసుకుందాం.

జగన్-షర్మిల మధ్య సయోధ్య? 
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నారని సమాచారం. ఒకవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూనే, మరోవైపు తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకిగా మారిన కుటుంబ విభేదాలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

గత ఎన్నికల్లో వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి వైసీపీపై చేసిన తీవ్ర విమర్శలు జగన్‌కు రాజకీయంగా తీరని నష్టం చేకూర్చాయి. తెలంగాణలో వైఎస్సార్టీపి స్థాపించి పాదయాత్ర చేసిన షర్మిల, ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అన్నాచెల్లెళ్ల మధ్య పోరు వల్ల ఓట్ల చీలిక జరగడమే కాకుండా, వైఎస్సార్ అభిమానుల్లో కూడా గందరగోళం నెలకొంది. దీనివల్ల ఇద్దరూ రాజకీయంగా ఆశించిన ఫలితాలను సాధించలేకపోయారు.

రంగంలోకి వైఎస్సార్ సన్నిహితులు..
విడిపోవడం వల్ల ఇద్దరి భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు భావిస్తున్నారు. ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చేందుకు సన్నిహితులు నిరంతరం లోటస్ పాండ్ టు బెంగళూరు తిరుగుతూ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. "కలిసి ఉంటేనే మేలు.. ఒకవేళ కలిసి రాజకీయాలు చేయకపోయినా, కనీసం బహిరంగంగా కలహించుకోవద్దు" అన్నదే ఈ రాయబారాల సారాంశంగా వినిపిస్తోంది.

ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఈ రాజీ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. డిసెంబర్ 21న జగన్ పుట్టినరోజున షర్మిల విష్ చేయడం, దానికి జగన్ ఎంతో ఆప్యాయంగా 'థాంక్యూ షర్మిలమ్మా' అని బదులివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రిస్మస్ వేళ జగన్ మేనల్లుడు రాజారెడ్డి తన మామ ఇంటికి వచ్చి గడపడం సయోధ్య దిశగా మరో ముందడుగుగా భావిస్తున్నారు.

వైసీపీ సీనియర్ నేతలు కూడా ఇదే కోరుకుంటున్నారు. కడప నేత సతీష్ రెడ్డి వంటి వారు బహిరంగంగానే ఈ విషయంపై ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనలు, పాదయాత్రలు చేసే ముందు.. ఇంటి నుండి ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. 2024 చేదు అనుభవాలు పునరావృతం కాకుండా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అధినాయకత్వం అంచనా వేస్తోంది.

అయితే.. ఈ ప్రచారంలో ఎంత నిజమున్నా, అన్నాచెల్లెళ్లు మళ్లీ ఒకటి కావడం అనేది ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు కారణం కావచ్చు. అదే జరిగితే వైసీపీ కేడర్‌లో కొత్త ఉత్సాహం రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: Samantha News Today: పెళ్లైన 37 రోజులకే శుభవార్త చెప్పిన హీరోయిన్ సమంత..భర్త రాజ్ నిడిమోరు‌తో కొత్త ప్రయాణం..ఫ్యాన్స్ ఖుషీ!

Also Read: School Holiday: విద్యార్థులకు పండగ లాంటి వార్త..రిపబ్లిక్‌ డే స్కూళ్లకు 3 రోజులు సెలవులు..ఎప్పుడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 08, 2026 06:22:08
New Delhi, Delhi:

US 500 Percent Tariff On India: ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో రూపొందించిన "గ్రాహం-బ్లూమెంటల్ ఆంక్షల బిల్లు"కు ట్రంప్ పచ్చజెండా ఊపారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుండి చమురు, యురేనియం కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కఠినమైన చర్యలు తీసుకోనుంది.

బిల్లులోని ప్రధానాంశాలు..
500% సుంకం: రష్యా నుంచి చమురు లేదా యురేనియం కొనుగోలు చేసే ఏ దేశంపై అయినా సరే, ఆ దేశం నుండి అమెరికాకు వచ్చే ఎగుమతులపై 500 శాతం వరకు సుంకాలను విధించే అధికారం ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడికి కల్పిస్తుంది.

పుతిన్ యుద్ధానికి కావాల్సిన నిధులు రష్యా చమురు ఎగుమతుల ద్వారానే అందుతున్నాయని, ఆ నిధుల మూలాన్ని కత్తిరించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని సెనేటర్ లిండ్సే గ్రాహం స్పష్టం చేశారు. కేవలం సుంకాలే కాకుండా, సదరు దేశాలపై ఇతర ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం కూడా ఉంది.

భారత్, చైనా, బ్రెజిల్‌లకు హెచ్చరిక?
రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలకు ఈ బిల్లు నేరుగా హెచ్చరిక వంటిది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారత్ రష్యా నుండి భారీగా చమురును కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందితే, భారత వాణిజ్యంపై అమెరికా ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్ శాంతి చర్చల కోసం రాయితీలు ఇస్తున్న తరుణంలో, పుతిన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచి యుద్ధాన్ని శాశ్వతంగా ఆపాలని ట్రంప్ పరిపాలన భావిస్తోంది.

తదుపరి అడుగులు ఎప్పుడు? 
బుధవారం ట్రంప్‌తో సమావేశమైన అనంతరం సెనేటర్ గ్రాహం ఈ విషయాన్ని ధృవీకరించారు. వైట్ హౌస్ వర్గాలు కూడా ట్రంప్ మద్దతును ఖరారు చేశాయి. వచ్చే వారం ప్రారంభంలోనే సెనేట్‌లో ఈ బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. హౌస్, సెనేట్ రెండూ ఆమోదిస్తే ఇది చట్టంగా మారుతుంది.

ఒకవైపు ఈ కఠిన ఆంక్షలు విధిస్తూనే, మరోవైపు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక దూత స్టీవ్ విట్‌కాఫ్ ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కోసం రాయబారాలు నడుపుతున్నారు.

ఈ ఆంక్షల ప్యాకేజీ కేవలం రష్యానే కాకుండా, అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను భారత్ వంటి మిత్రదేశాలతో అమెరికాకు ఉన్న సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

Also Read: School Holiday: విద్యార్థులకు పండగ లాంటి వార్త..రిపబ్లిక్‌ డే స్కూళ్లకు 3 రోజులు సెలవులు..ఎప్పుడంటే?

Also REad: Samantha News Today: పెళ్లైన 37 రోజులకే శుభవార్త చెప్పిన హీరోయిన్ సమంత..భర్త రాజ్ నిడిమోరు‌తో కొత్త ప్రయాణం..ఫ్యాన్స్ ఖుషీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Jan 08, 2026 04:56:31
0
comment0
Report
Advertisement
Back to top