Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

Bomb Threat Court: ఆంధ్రప్రదేశ్‌లో కోర్టులకు వరుస బాంబు బెదిరింపులు..పరుగులు పెట్టిన అధికారులు!

HDHarish Darla
Jan 08, 2026 15:44:54
Bomb Threat Court In AP: ఏపీలోని పలు కోర్టులకు గురువారం అనగా జనవరి 8న బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అనంతపురం, ఏలూరు, చిత్తూరులోని కోర్టులకు మధ్యాహ్న సమయంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి విస్త్రృతంగా తనిఖీలు చేపట్టారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GSG Shekhar
Jan 09, 2026 11:07:05
Visakhapatnam, Andhra Pradesh:

AP Politics: శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు కాస్తా డిఫరెంట్ గా ఉంటాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత.. జిల్లాలో మెజారిటీ ప్రజలు సైకిల్ పార్టీ వెంటే నడుస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ జిల్లాలో కూటమి పార్టీలు తిరుగులేని విజయాలు సాధించాయి. అందుకే జిల్లాకు రెండు మంత్రి పదవులు, ఓ కేంద్రమంత్రి పదవి దక్కింది. ప్రస్తుతం జిల్లాకు పెద్దదిక్కులా కింజరపు అచ్చెన్నాయుడి ఫ్యామిలీ వ్యవహారిస్తోంది. అటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సైతం జిల్లాకు అనేక అభివృద్ది పనులు సాధించి పెడుతున్నారు. అయితే జిల్లాలో సైకిల్ పార్టీ స్పీడ్‌కు బ్రేకులు వేయడంలో ఫ్యాన్ పార్టీ ఫెయిల్ అయ్యిందన్న చర్చ జరుగుతోంది.. ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గం విషయంలో వైసీపీ నేతలే పార్టీ ఓటమికి కారణం అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ ఈ విషయంలో జగన్ కూడా పెద్దగా దృష్టి సారించడం లేదని సొంత పార్టీ నేతలు తెగచర్చించుకుంటున్నారు..
 
గత నాలుగు దశాబ్ధాల్లో ఇచ్చాపురం నియోజకవర్గంలో 9 సార్లు ఎన్నికలు జరిగాయి.. ఇందులో ఓకసారి మాత్రమే టీడీపీ ఓడిపోగా.. మిగతా ఎనిమిది సార్లు టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట గానే చెప్పుకుంటారు. ఇంతటి ప్రాధాన్యత కల్గిన ఇచ్చాపురంలో వైసీపీ పకడ్బంది ప్రణాళిక లేక విఫలం అవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. 

ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పిరియ సాయిరాజ్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, లేటెస్ట్ గా పిరియ విజయా సాయిరాజ్ లు పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాలం అశోక్ చేతిలో ఓడిపోయారు. ఈ అసెంబ్లీ నియోజక వర్గంలో వైఎస్సార్సీపీ  ఇప్పటికీ నలుగురు సమన్వయకర్తలను మార్చింది. అయినా ఫలితం లేకుండా పోయింది.. దాంతో ఈసారీ ప్లాన్ మార్చే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉందనే టాక్ వినిపిస్తోంది. 
 
అయితే ఇచ్చాపురం విషయంలో ఇప్పుడు ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ సంచలనం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇచ్చాపురం ఇంచార్జ్ గా ఉన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ సాయి రాజ్ ను సమన్వయకర్త భాద్యతల నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారట. ఆయన స్థానంలో మరొక నేతకు ఇంచార్జ్ పదవి ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాల నేపథ్యంలో  సీనియర్ నేత సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి కి బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అయితే అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయం పట్ల ఎమ్మెల్సీ నర్తు రామారావు విభేదిస్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఇచ్చాపురం నియోజక వర్గంలో కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కళింగ, యాదవ, రెడ్డి కులాలకు చెందిన నేతలు తమకు టికెట్టు దక్కాలని ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూ వర్గ విభేదాలకు తావిస్తున్నారు. వీరిలో ఎవరికి అభ్యర్థిత్వం ఖరారు అయినా వేరే వారు హ్యాండ్ ఇచ్చేస్తారనే టాక్ ఉంది. 
 
ఇక 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతటా వైసీపీ గాలి వీచింది. దాదాపు 151 స్థానాల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు. కానీ ఇచ్చాపురంలో మాత్రం ఫ్యాన్ పార్టీ సత్తా చాటలేకపోయింది. అందుకే ఈసారి మరో ప్రయోగానికి జగన్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అందుకే కొత్త ముఖానికి అవకాశం ఇవ్వబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పుడైన కొత్త ఇంచార్జ్ కు నేతలు ఎంతవరకు సహకరిస్తారు అనేది హాట్ టాపిక్ అవుతోంది. 

గతంలో ఇలాంటి మిస్టేక్ లను వైసీపీ అధిష్టానం సరిచేయక పోవడం వల్లే నాలుగు మండలాల్లో మూడు గ్రూపులు, ఆరు వర్గాలు నడుస్తున్నాయట. సంఖ్యా పరంగా మొదటి వరుసలో ఉన్న ఇచ్చాపురం అసెంబ్లీ నియోజక వర్గంలో వైసీపీ బలహీనతలు టీడీపి కి మరింత బలాన్ని ఇచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఎంతో మంది నియోజక వర్గానికి, జిల్లాకు, పార్లమెంట్ నియోజక వర్గానికి, రీజనల్ ప్రాంతానికి కో ఆర్డినేటర్లను నియమిస్తున్న వైసీపీ చిన్న లాజిక్ మాత్రం మిస్ అవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కొత్త ఇంచార్జ్ ను ప్రకటిస్తున్న వైసీపీ పాత అభ్యర్థులను సమన్వయం చేయకపోవడంతోనే ప్రతీసారి ఫెయిల్ అవుతుందనీ రిజల్ట్స్ పై పోస్ట్ మార్టం చేస్తున్నారు. మొత్తంమీద ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ ఇంచార్జి ను మార్చబోతున్న ఫ్యాన్ పార్టీ ఈసారి ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే..
 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 09, 2026 10:54:53
Hyderabad, Telangana:

Revanth Reddy vs Chandrababu: నదీ జలాల వివాదంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు నిలదీస్తున్న క్రమంలో ఈ అంశంపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుకు కీలక విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులను అడ్డంకులు సృష్టించరాదని కోరారు. తనకు వివాదం వద్దని.. నీళ్లు అవసరం అని పేర్కొన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Tirumala Darshan: 10 రోజుల్లో 7.83 ల‌క్ష‌ల మందికి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం

హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటా. వివాదం కావాలా? పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారం కావాలని కోరుకుంటా' అని తెలిపారు. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ది పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి చెప్పారు.

Also Read: Pay Revison Commission: ఉద్యోగులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి గిఫ్ట్‌.. పీఆర్‌సీపై కీలక ప్రకటన

'మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు అడ్డంకులు పెట్టకండి. అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వ నిధులు రావడంలేదు.. రాష్ట్రంపై ఆర్ధిక భారం పడుతోంది. మేం వివాదం కోరుకోవడంలేదు.. పరిష్కారం కోరుకుంటున్నాం' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. రాజకీయ ప్రయోజనాలు కాదు ప్రజల ప్రయోజనాల కోసం, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

Also Read: Tirumala: ఈ ఒక్క నంబర్‌కు 'హాయ్‌' అంటే చాలు.. తిరుమల వివరాలు మీ ఫోన్‌లోకి

'తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాలి. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇందుకోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయి. పక్క రాష్ట్రాలతో మేం వివాదాలు కోరుకోవడం లేదు. అది ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అయినా పరస్పర సహకారమే కోరుకుంటున్నాం' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నదీ జలాలపై చంద్రబాబుకు చేసిన రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తులు రాజకీయంగా దుమారం రేపుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 09, 2026 10:19:42
Tirupati Urban, Andhra Pradesh:

Tirumala Darshan: వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి లభించిందని టీటీడీ ప్రకటించింది. 10 రోజుల్లో 7.83 ల‌క్ష‌ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నాలు చేసుకున్నారని.. గ‌త ఏడాదితో పోలిస్తే ఈసారి ల‌క్ష మంది భ‌క్తుల‌కు అధికంగా ద‌ర్శ‌నం కల్పించినట్లు టీటీడీ వెల్లడించింది. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో రూ.41.14 కోట్ల హుండీ ఆదాయం లభించిందని.. 33 లక్ష‌ల మంది భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదం స్వీకరించారని అధికారులు తెలిపారు. 44 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యాలు జరిగినట్లు టీటీడీ ప్రకటించింది.

Also Read: Pay Revison Commission: ఉద్యోగులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి గిఫ్ట్‌.. పీఆర్‌సీపై కీలక ప్రకటన

డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు టీటీడీ చేసిన ఏర్పాట్ల‌పై భ‌క్తులు విశేష సంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు టీటీడీ చైర్మ‌న్  బీఆర్‌ నాయుడు తెలిపారు. వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలపై తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్‌లో శుక్ర‌వారం  మీడియా స‌మావేశం నిర్వ‌హించి వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో  అనిల్ కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో  సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి పాల్గొన్నారు.

Also Read: Tirumala: ఈ ఒక్క నంబర్‌కు 'హాయ్‌' అంటే చాలు.. తిరుమల వివరాలు మీ ఫోన్‌లోకి

స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేసినట్లు టీటీడీ చైర్మన్‌ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ సహకారంతో ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా టోకెన్ లేని భక్తులకు కూడా వేగవంతంగా దర్శనం కల్పించినట్లు వెల్లడించారు. వైకుంఠ ద్వార దర్శనాలపై దాదాపు 93 శాతం మంది భక్తులు సంతృప్తి చెందారని ప్రకటించారు.

పది రోజుల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 7.83 లక్షలు. గ‌త వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో 6.83 ల‌క్ష‌ల మంది ద‌ర్శించుకున్నారు. ఈ ఏడాది ల‌క్ష మంది భ‌క్తుల‌కు అద‌నంగా ద‌ర్శ‌నం కలిగింది. జనవరి 2వ తేదీ శుక్రవారం రికార్డుస్థాయిలో 83 వేల మంది భక్తులకు దర్శనం చేసుకున్నారు. జనవరి 3వ తేదీ శనివారం అత్యధికంగా దాదాపు 89 వేల మందికి దర్శనం కల్పించాం. అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164 గంటల సమయం సామాన్య భక్తులకు కేటాయించడంతో సామాన్య భక్తుల్లో ఆనందం నింపాం' అని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు.

Also Read: Amaravati: కేంద్రానికి చంద్రబాబు కీలక విజ్ఞప్తి.. ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించాలి

'పది రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.41.14 కోట్లు రాగా.. శ్రీవారి లడ్డూలు 44 లక్షల విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 10 లక్షల లడ్డూలు అదనంగా విక్రయించాం' అని టీటీడీ చైర్మన్‌ వెల్లడించారు. దర్శనాల సమయంలో దాదాపు 2400 మంది పోలీసులు, 1150 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వివిధ విభాగాల సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Jan 09, 2026 09:51:27
0
comment0
Report
HDHarish Darla
Jan 09, 2026 09:01:33
Hyderabad, Telangana:

Fake Crocodile Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈసారి 'ది రాజా సాబ్' విడుదల సందర్భంగా వారు చేసిన రచ్చ ఏకంగా సోషల్ మీడియాను ఊపేస్తోంది. గురువారం (జనవరి 8) రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో పడిన ప్రీమియర్ షోల వద్ద డార్లింగ్ అభిమానుల సందడి అంబరాన్నంటింది. అయితే, ఒక థియేటర్‌లో అభిమానులు ఏకంగా 'మొసళ్లతో' ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

థియేటర్‌లో మొసళ్ల రచ్చ..అసలు కథేంటి?
థియేటర్ లోపలికి మొసళ్లు రావడమేంటి అని కంగారు పడకండి! అవి నిజమైన మొసళ్లు కావు, పెద్ద సైజులో ఉన్న రబ్బరు మొసళ్లు. 'ది రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్ మొసలితో పోరాడే ఒక అదిరిపోయే యాక్షన్ సీన్ ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో కూడా ఈ సీన్ హైలైట్‌గా నిలిచింది.

తమ హీరో సినిమాలో మొసలితో ఫైట్ చేస్తుంటే, తాము మాత్రం ఊరుకుంటామా అన్నట్లుగా.. అభిమానులు ఆ రబ్బరు మొసళ్లను భుజాన వేసుకుని థియేటర్ అంతా కలియతిరుగుతూ ఈలలు, కేకలతో రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండటంతో, నెటిజన్లు "ప్రభాస్ ఫ్యాన్స్ మరీ ఇంత వైల్డ్‌గా ఉన్నారేంట్రా బాబు" అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించగా.. హారర్-కామెడీ జోనర్‌లో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో హీరో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించగా.. సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో దద్దరిల్లుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం
మొదటి రోజు టాక్, అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే, 'ది రాజా సాబ్' తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. మారుతి మార్క్ కామెడీకి ప్రభాస్ మాస్ స్వాగ్ తోడవడంతో థియేటర్లన్నీ పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

Also Read; 8th Pay Commission Calculator: ఉద్యోగులకు సంక్రాంతికి ముందు గుడ్‌న్యూస్..ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసింది!? పండగ చేసుకోండి!

Also REad: AP Govt Schools: విద్యార్థులకు సంక్రాంతికి ముందు మరో గుడ్‌న్యూస్..స్కూళ్లలో సిక్ రూమ్స్! ఒక్కో దానికి రూ.5 లక్షలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
PPINEWZ
Jan 09, 2026 08:54:14
Secunderabad, Telangana:

Teacher Eligibility Test Supreme Court TET Ruling: ఉపాధ్యాయులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన పరిణామం ఇప్పుడు నిజమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా 2010కి ముందు నియమించిన ఉపాధ్యాయుల విషయంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అంశంపై ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 1, 2025న వచ్చిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తర్వాత ఈ అంశం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.

ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్య.. అక్షరాస్యత విభాగం ఒక కీలక చర్యకు శ్రీకారం చుట్టింది. ఉత్తరప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, TET అర్హత పొందని కానీ 2010కి ముందు నియమించిన ఉపాధ్యాయులపై పూర్తి స్థాయి సమాచారం ఇవ్వాలని కేంద్రం కోరింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోనే దాదాపు 1.86 లక్షల మంది ఉపాధ్యాయులు TET ఉత్తీర్ణులు కాకుండానే సర్వీసులో కొనసాగుతున్నారని కేంద్రానికి సమాచారం అందింది.

సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత.. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, అలాగే ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున ప్రాతినిధ్యాలు కేంద్రానికి చేరాయి. చాలా మంది ఉపాధ్యాయులు ఒకే మాట చెబుతున్నారు.. సర్వీస్ చివరి దశలో ఉన్న తమపై మరోసారి పరీక్ష రాయమని ఒత్తిడి చేయడం తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తోందని. వయస్సు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతల మధ్య TET వంటి పరీక్షలు రాయడం తమకు సాధ్యం కాదని వారు వాపోతున్నారు.

ఈ ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల నుంచి మూడు ముఖ్యమైన అంశాలపై వివరాలు కోరింది. మొదటిగా.. 2010కి ముందు నియమించిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? రెండవది.. వారు ప్రస్తుతం ఎలాంటి సర్వీసులో ఉన్నారు? మూడవది.. సుప్రీంకోర్టు తీర్పు అమలైతే ఉపాధ్యాయులపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? అనే అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించింది.

Also Read: Gold Price Venezuela: వెనిజులాలో 24 క్యారెట్ల బంగారం ధర ఎంతో తెలుసా? పాలు, రొట్టె లాగా గోల్డ్ చౌకగా లభిస్తుందా..?

అంతేకాదు.. ఈ ఉపాధ్యాయులకు ఉపశమనం కల్పించేందుకు చట్టపరమైన లేదా విధానపరమైన మార్గాలు ఏవైనా ఉన్నాయా అనే విషయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని కేంద్రం స్పష్టంగా అడిగింది. అయితే ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన అన్ని నియమాలు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTE) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగానే ఉండాలని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. జనవరి 16లోపు ఈ సమాచారాన్ని పూర్తిగా సమర్పించాలని రాష్ట్రాలకు గడువు విధించింది.

ఈ పరిణామంపై అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం జాతీయ అధ్యక్షుడు సుశీల్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ఇది ఉపాధ్యాయులు సంవత్సరాలుగా చేసిన పోరాటానికి వచ్చిన పెద్ద విజయమని తెలిపారు. ఈ అంశంపై ఉపాధ్యాయ సంఘం మెమోరాండంలు సమర్పించడం, సంతకాల ఉద్యమం నిర్వహించడం, కేంద్ర విద్యా మంత్రితో నేరుగా సమావేశం కావడం, ఢిల్లీలో ధర్నా నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన గుర్తు చేశారు.

ఇక సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా దాఖలు కావడంతో, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా చర్య ఉపాధ్యాయుల పట్ల సానుకూల దృక్పథాన్ని సూచిస్తోంది. రాబోయే రోజుల్లో 2010కి ముందు నియమించిన ఉపాధ్యాయులకు TET విషయంలో స్పష్టమైన ఉపశమన నిర్ణయం వెలువడే అవకాశముందని ఉపాధ్యాయ వర్గాలు ఆశాభావంతో ఎదురుచూస్తున్నాయి.

Also Read: Gold Mines: ఇరాన్ కుబేరుడి నిధి.. భూగర్భంలో ఏకంగా 22 మిలియన్ టన్నుల బంగారం.. షాకింగ్ ఫ్యాక్ట్స్..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Jan 09, 2026 07:43:04
Secunderabad, Telangana:

Union Budget 2026: యూనియన్ బడ్జెట్ దగ్గరపడుతున్న కొద్దీ దేశవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈసారి బడ్జెట్‌పై సీనియర్ సిటిజన్లు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026న బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుండగా.. సీనియర్ సిటిజన్ ప్రయాణికులంతా ఒక కీలక నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. అదే… రైల్వే టికెట్లపై సీనియర్ సిటిజన్ డిస్కౌంట్ తిరిగి వస్తుందా? అన్న ప్రశ్న.

ఇటీవల భారత రైల్వే తీసుకున్న నిర్ణయం వృద్ధులను మరింత ఆందోళనకు గురిచేసింది. డిసెంబర్ 26, 2025 నుంచి రైల్వేలు ప్రయాణ ఛార్జీలను పెంచాయి. ముఖ్యంగా 215 కిలోమీటర్లకు మించిన ప్రయాణాలకు ఈ పెంపు వర్తిస్తోంది. జనరల్ కోచ్‌లో కిలోమీటరుకు ఒక పైసా, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని నాన్-ఏసీ, ఏసీ కోచ్‌లకు కిలోమీటరుకు రెండు పైసలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా రైల్వేలకు సుమారు రూ. 600 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. కానీ దీని భారం నేరుగా ప్రయాణికులపై, ముఖ్యంగా వృద్ధులపై పడుతోంది.

కోవిడ్‌కు ముందు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. 2019 వరకు భారత రైల్వేలు సీనియర్ సిటిజన్లకు భారీ రాయితీలు అందించేవి. 60 ఏళ్లు పైబడిన పురుషులకు టికెట్ ధరపై 40 శాతం తగ్గింపు ఉండేది. అలాగే 58 ఏళ్లు పైబడిన మహిళలకు 50 శాతం డిస్కౌంట్ లభించేది. ఈ సౌకర్యం మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లకు కూడా వర్తించేది. ఉదాహరణకు, ఒక రాజధాని రైలులో ఫస్ట్ ఏసీ టికెట్ ధర రూ. 4,000 అయితే, సీనియర్ సిటిజన్ అదే టికెట్‌ను సుమారు రూ. 2,000 నుంచి రూ. 2,300 మధ్య పొందగలిగేవారు. అప్పట్లో దూర ప్రయాణం వృద్ధులకు చాలా సరసమైనదిగా ఉండేది.

Also Read: EPFO: 30కోట్ల మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఫోన్‌పే, గూగుల్‌ పే నుంచే పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. EPFO కీలక నిర్ణయం..!!

అయితే 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అప్పట్లో రైళ్లు ఖాళీగా నడవడం, ఆదాయం తగ్గిపోవడం, రైల్వే ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరగడం ఇందుకు కారణాలుగా ప్రభుత్వం పేర్కొంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రైళ్లు మళ్లీ ప్రయాణికులతో నిండిపోయాయి. ఆదాయాలు కూడా గణనీయంగా పెరిగాయి. అయినప్పటికీ, సీనియర్ సిటిజన్ డిస్కౌంట్ మాత్రం ఇప్పటివరకు తిరిగి ప్రారంభించలేదు. ఇదే అంశం వృద్ధ ప్రయాణికుల్లో అసంతృప్తిని పెంచుతోంది.

వృద్ధులు చెబుతున్నది ఒకటే... పదవీ విరమణ తర్వాత ఆదాయం పరిమితంగా ఉంటుంది. చాలా మంది పెన్షన్ లేదా తమ పొదుపులపైనే ఆధారపడుతున్నారు. వైద్య చికిత్సల కోసం, మతపరమైన యాత్రల కోసం లేదా పిల్లలను, మనవళ్లను కలవడానికి వారు తరచూ ప్రయాణించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న రైల్వే ఛార్జీలు వారి జేబులపై తీవ్ర భారం వేస్తున్నాయి. కనీసం కోవిడ్‌కు ముందు ఉన్న టికెట్ రాయితీ అయినా తిరిగి వస్తే తమకు ఎంతో ఉపశమనం కలుగుతుందని వారు భావిస్తున్నారు.

ఇప్పుడు అందరి చూపు ఫిబ్రవరి 1, 2026పై ఉంది. ఆ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల దీర్ఘకాల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుంటుందా? లేదా? అన్నది కీలకంగా మారింది. రైల్వే టికెట్లపై డిస్కౌంట్ తిరిగి అమలులోకి వస్తే, దేశవ్యాప్తంగా లక్షలాది మంది వృద్ధ ప్రయాణికులకు ఇది నిజమైన ఊరటగా మారుతుంది. ఈసారి బడ్జెట్ సీనియర్ సిటిజన్లకు నిజంగా ఒక శుభవార్త తీసుకొస్తుందా అనే ఉత్కంఠ ఇప్పుడు దేశమంతా నెలకొంది.

Also Read:  Gold Mines: ఇరాన్ కుబేరుడి నిధి.. భూగర్భంలో ఏకంగా 22 మిలియన్ టన్నుల బంగారం.. షాకింగ్ ఫ్యాక్ట్స్..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 09, 2026 06:57:56
Hyderabad, Telangana:

8th Pay Commission Fitment Factor: 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు, అమలుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2026 జనవరి 1 నుండి కొత్త వేతన సవరణలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, వివిధ స్థాయిల అధికారుల జీతాలు ఎంత పెరగవచ్చో అని లెక్కలు వేసుకుంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి తన ఉద్యోగుల వేతన నిర్మాణాన్ని సమీక్షించడానికి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసింది. ఈ క్రమంలో కొత్తగా అమలు కాబోతున్న 8వ వేతన సంఘం ద్వారా ఏఏ స్థాయి ఉద్యోగులకు ఎంతెంత జీతం పెరుగుతుందనే అంచనాలను తెలుసుకుందాం.

సుమారు 49 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు 8వ వేతన సంఘం సిఫారుసులపై లబ్ధి పొందుతారు. ఇది అమలు తర్వాత మూల వేతనం (Basic Pay), భత్యాలు (Allowances), పెన్షన్లలో పెరుగుదల ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. 

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ (Fitment Factor) అంటే ఏమిటి?
కొత్త వేతన సంఘం సిఫార్సులలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అత్యంత కీలకమైనది. పాత మూల వేతనాన్ని కొత్త మూల వేతనంగా మార్చడానికి ఉపయోగించే గుణకాన్నే 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' అంటారు. ప్రస్తుతం చర్చల్లో ఉన్న మూడు రకాల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంచనాలు ఇలా ఉన్నాయి. కనీసం 1.92 నుంచి 2.15 లేదా అంతకంటే ఎక్కువ 2.57 వరకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వంలో లెవెల్ 1 (గ్రూప్ డి) నుండి లెవెల్ 18 (క్యాబినెట్ సెక్రటరీ) వరకు 18 స్థాయిల ఉద్యోగులు ఉన్నారు. వివిధ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ల ప్రకారం జీతాలు ఎలా ఉండవచ్చనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వేతన స్థాయి ప్రస్తుత మూల వేతనం (7th CPC) 1.92 ఫిట్‌మెంట్ వద్ద (అంచనా) 2.15 ఫిట్‌మెంట్ వద్ద (అంచనా) 2.57 ఫిట్‌మెంట్ వద్ద (అంచనా)
లెవెల్ 1 (Entry Level) ₹18,000 ₹34,560 ₹38,700 ₹46,260
లెవెల్ 5 ₹29,200 ₹56,064 ₹62,780 ₹75,044
లెవెల్ 10 (Group B/A) ₹56,100 ₹1,07,712 ₹1,20,615 ₹1,44,177
లెవెల్ 15 (Senior Group A) ₹1,82,200 ₹3,49,824 ₹3,91,730 ₹4,68,254
లెవెల్ 18 (Highest Level) ₹2,50,000 ₹4,80,000 ₹5,37,500 ₹6,42,500

ముఖ్య విషయాలు
8వ వేతన సంఘం అమలులోకి వస్తే, ప్రభుత్వ ఉద్యోగి కనీస మూల వేతనం ప్రస్తుతం ఉన్న రూ. 18,000 నుండి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. జీతాల పెంపుతో పాటు, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కరువు భత్యాన్ని (డియర్నెస్ అలవెన్స్ (DA)) కూడా ప్రభుత్వం సర్దుబాటు చేస్తుంది.

గమనిక: పైన పేర్కొన్న గణాంకాలు ప్రస్తుత విశ్లేషణలు, నివేదికల ఆధారంగా రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ తుది నివేదిక సమర్పించిన తర్వాతే ఖచ్చితమైన జీతం పెరుగుదలపై స్పష్టత వస్తుంది.

Also Read: EPF Wage Ceiling: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..రూ.300 నుంచి రూ.21,000 వరకు..74 ఏళ్లలో జరిగిన మార్పులు ఇవే?!

Also Read: Anasuya On Shivaji: శివాజీతో వివాదంపై రూటు మార్చిన యాంకర్ అనసూయ..శివాజీకి సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు..ఇదేం ట్విస్ట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 08, 2026 14:41:36
Hyderabad, Telangana:

NRI Nikitha Godishala Case: అమెరికాలోని మేరీల్యాండ్‌లో హత్యకు గురయిన నిఖిత గోడిశాల కేసులో కీలక ట్విస్ట్‌ జరిగింది. ఈ కేసుపై పుకార్లు.. వివాదాలు నడుస్తుండడం.. తమ కుమార్తె విషయంలో వివిధ కోణాల్లో చర్చ జరుగుతుండడంతో బాధిత కుటుంబం స్పందించింది. తమ కుమార్తె హత్య విషయంలో ఆ కుటుంబం ఓ వీడియో విడుదల చేసింది. మీడియాతోపాటు ప్రజలకు కీలకమైన విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Pay Revison Commission: ఉద్యోగులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి గిఫ్ట్‌.. పీఆర్‌సీపై కీలక ప్రకటన

తమ బిడ్డ కేసు విషయమై మీడియా సంయమనంతో వ్యవహరించాలని నిఖిత గోడిశాల కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. అపోహాలు, అవాస్తవాలను ప్రచారం చేయొద్దని ఇంకా వాస్తవాలు తెలియలేదని చెప్పారు. తీవ్ర విషాదంలో ఉన్న ఈ సమయంలో తమ కుటుంబంపై గోప్యతను పాటించాలని, సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ఈ కేసులో నిందితుడు అర్జున్ శర్మ ఇంకా పరారీలోనే ఉన్నాడని.. పోలీసులకు లభించలేదని సంచలన ప్రకటన చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని ప్రకటించారు.

Also Read: Tirumala: ఈ ఒక్క నంబర్‌కు 'హాయ్‌' అంటే చాలు.. తిరుమల వివరాలు మీ ఫోన్‌లోకి

ఈ ఘటనపై అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని.. ధృవీకరణ లేని సమాచారాన్ని ప్రచురించవద్దని.. నమ్మరాదని నిఖిత గోడిశాల కుటుంబం విజ్ఞప్తి చేసింది. దర్యాప్తు ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆ కుటుంబం కోరింది. నిఖిత గోడిశాల డిసెంబర్ 31వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. నిందితుడు అర్జున్‌ శర్మ పరారీలో ఉన్నాడు. భారతదేశంలో ఉన్నాడని తెలుస్తుండగా.. అతడు అరెస్టయ్యారనే వార్త సంచలనం రేపింది.

Also Read: Pawan Kalyan: పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ సంక్రాంతి సంబరాలు.. 3 రోజులు సందడే సందడి

నిందితుడు అరెస్ట్‌.. తమ కుమార్తె వ్యవహార శైలిపై ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నవన్నీ పూర్తిగా అపోహలు, అస్తవాలేనని నిఖిత గోడిశాల కుటుంబం ప్రకటించింది. అమెరికా అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అర్జున్ శర్మ జనవరి 1వ తేదీన అదృశ్యమైనట్లు.. ఈ మేరకు కేసు నమోదైందని కుటుంబసభ్యులు తెలిపారు. జనవరి 2న అమెరికా నుంచి భారత్‌కు రావడంతో.. నిఖిత గోడిశాల మృతదేహం మేరీల్యాండ్‌లోని కొలంబియా ప్రాంతంలో అర్జున్ శర్మ నివాసంలో గుర్తించినట్లు వివరించారు. నిఖితకు చెందిన వాహనం కూడా అదే ప్రదేశంలో లభ్యమైంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని హోవార్డ్ కౌంటీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో సహా యూఎస్ చట్ట అమలు సంస్థలు స్పష్టంగా పేర్కొన్నాయని నిఖిత గోడిశాల కుటుంబం తెలిపింది. నిందితుడిని అరెస్ట్ చేశారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. తమ కుమార్తె అంత్యక్రియలు ప్రైవేట్‌గా నిర్వహిస్తామని.. ఆ కార్యక్రమాలు సక్రమంగా సాగేందుకు పోలీసు రక్షణను కోరినట్లు వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Jan 08, 2026 14:11:37
0
comment0
Report
Advertisement
Back to top