Mahalaxmi Raja Yoga Effect On Zodiac Telugu: కుజుడు చంద్రుని అనుకూల స్థానం ఎంతో శక్తివంతమైన రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఇది ఆకస్మిక ఆర్థిక లాభాలతో పాటు ప్రమోషన్లు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా మార్చి 16వ తేదీన గ్రహాలకి అధిపతి, ధైర్యానికి కారకుడైన కుజుడు, మనసుకు కారకుడైన చంద్రుడు సంయోగం చేయబోతున్నాయి. దీంతో ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. సాధారణంగా ఈ రాజయోగానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మహాలక్ష్మి రాజయోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి అపారమైన ధన లాభాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ఆయారాశుల వారికి అన్ని రకాల సమస్యలు ఎంతో సులభంగా పరిష్కారం అవుతాయి.. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టే వారికి చాలా అనుకూలంగా ఈ సమయం మారుతుంది. అయితే, మార్చి 16వ తేదీ నుంచి మహాలక్ష్మి రాజయోగంతో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో తెలుసుకుందాం.
ఈ రాశులవారికి లాభాలే, లాభాలు!
వృషభ రాశి
మహాలక్ష్మి రాజయోగం వృషభరాశి వారికి గణనీయమైన ఫలితాలను అందించబోతోంది. ముఖ్యంగా జీవితంలో ఆర్థిక పరిస్థితులు చాలావరకు మెరుగుపడతాయి. వ్యాపారాల్లో గణనీయమైన లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వ్యక్తులకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త ప్రణాళికలతో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అలాగే కుటుంబంలో ఆనందం విపరీతంగా పెరిగే ఛాన్సులు ఉన్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించబోతోంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులకు ప్రమోషన్స్ లభించడమే కాకుండా గణనీయంగా జీతాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు స్నేహితుల సపోర్టుతో మానసిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అలాగే విపరీతంగా ఆనందం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాత ప్రణాళికల్లో.. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చిక రాశి
కుజుడు చంద్రుడి అద్భుతమైన సంయోగంతో ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగంతో వృశ్చిక రాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా కెరీర్ పరంగా సానుకూలమైన మార్పులు ప్రారంభమవుతాయి. అలాగే సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో సరైన నిర్ణయాలు కూడా తీసుకుని అద్భుతమైన ముందడుగు వేస్తారు. కుటుంబంలో ఈ సమయంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
ధనస్సు రాశి
మహాలక్ష్మి రాజయోగంతో ధనస్సు రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి. కుటుంబ జీవితంలో ఏవైనా అపార్ధాలు ఉంటే ఈ సమయంలో పూర్తిగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. ఎంతో ఓపికగా ఉంటూ.. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. అలాగే పెద్ద సమస్యల నుంచి ఉపశమనం కలగబోతోంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
VI Recharge Plan 140 Details: ఫీచర్ ఫోన్ వినియోగదారులకు వోడాఫోన్ ఐడియా (Vi) తీపి కబురు అందించింది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ HMD తో చేతులు కలిపి 'సూపర్ సేవర్ ఆఫర్' పేరుతో అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రతి నెలా రీఛార్జ్ ఖర్చులతో ఇబ్బంది పడే సామాన్యులకు ఇది గొప్ప ఉపశమనంగా మారనుంది.
ఏమిటీ ఆఫర్?
సాధారణంగా 28 రోజుల కాలపరిమితి ఉన్న అపరిమిత కాలింగ్ ప్లాన్ ధర రూ.199 వరకు ఉంటుంది. కానీ ఈ ప్రత్యేక ఆఫర్ కింద, వినియోగదారులు అదే ప్రయోజనాలను కేవలం రూ.140 కే పొందవచ్చు. అంటే ప్రతి రీఛార్జ్ మీద మీరు దాదాపు రూ.59 వరకు ఆదా చేసుకోవచ్చు.
రూ.140 ప్లాన్ ప్రయోజనాలు:
వ్యాలిడిటీ: 28 రోజులు.
కాలింగ్: అపరిమిత ఉచిత కాల్స్ (Unlimited Calling).
డేటా: 2GB హై-స్పీడ్ డేటా.
SMS: 300 ఉచిత సందేశాలు.
ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది?
ఈ ఆఫర్ ఎంపిక చేసిన కొత్త ఫీచర్ ఫోన్‌లను కొనుగోలు చేసే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ మోడల్స్ ఇవే.. HMD 100, HMD 101, Nokia 105 Classic వంటి మొబైల్స్‌లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
ఆఫర్ పొందడం ఎలా? (ముఖ్యమైన నిబంధనలు)
పైన పేర్కొన్న మూడు మోడళ్లలో ఏదో ఒక కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయాలి. కొత్త Vi SIM కార్డును తీసుకుని, మొదటి రీఛార్జ్ (FRC) రూ.140 తో చేయాల్సి ఉంటుంది. ఈ సిమ్ కార్డును కేవలం ఆ కొత్త HMD లేదా నోకియా ఫోన్‌లోనే వాడాలి. ఒకవేళ సిమ్‌ను తీసి వేరే స్మార్ట్‌ఫోన్‌లో వేస్తే ఆఫర్ ప్రయోజనాలు నిలిచిపోతాయి. డిసెంబర్ 24, 2025 తర్వాత కొనుగోలు చేసిన ఫోన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
ఆఫర్ వ్యాలిడిటీ: ఈ ప్రత్యేకమైన ప్రమోషనల్ ఆఫర్ జూన్ 30, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరలో ఫోన్ కబుర్లు చెప్పుకోవాలనుకునే వారికి ఇది నిజంగా బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vasamsetti Subhash: ఏపీ క్యాబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాసంశెట్టి సుభాష్ పలు వివాదాలతో వార్తల్లో ఉంటారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా తన సొంత నియోజకవర్గం రామచంద్రపురంలో నిర్వహించిన సంబరాల్లో డాన్సులు చేసిన వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ నేరుగా స్పందించడంతో హాట్ టాపిక్ గా మారింది. అయితే మంత్రి వ్యవహార శైలిని తప్పు బడుతూ చేసిన కామెంట్స్ మరో మలుపు తిరిగాయి.
Also Read: AP Cabinet Expansion: త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ.. రేసులో ఎవరెవరు ఉన్నారో తెలుసా?
రెండు రోజుల క్రితం తాడేపల్లిలో భీమవరంకు చెందిన పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో మాజీ సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు బరితెగించారని పలు ఉదాహరణలు చెప్పారు. ఇందులో భాగంగా రామచంద్రపురం లో జరిగిన సంక్రాంతి సంబరాలను ప్రస్తావిస్తూ మంత్రి సుభాష్ అశ్లీల రికార్డింగ్ డ్యాన్స్ లో పాల్గొన్నారని జగన్ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వీడైతే ఏకంగా అసలు అశ్లీల డాన్సులు చేస్తూ చిందులేశాడని అన్నారు. అయితే ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ప్రస్తుతం జగన్ మాట్లాడిన విధానం తిరిగి ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా మారింది. సాక్షాత్తు ఒక మంత్రిని వాడు... వీడు అనడం బడుగు బలహీన వర్గాలకు చిన్న చూపా అని మంత్రి సుభాష్ ప్రశ్నించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆయన వర్గీయులు, వర్గీయులు సైతం మంత్రిని వాడు... వీడు అనడంపై మండిపడుతున్నారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన బీసీ మంత్రి సుభాష్ పై జగన్ అలా కామెంట్ చేసి అవమానించడంతో రానున్న రోజుల్లో తాము ఏంటో చూపిస్తామని కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు మంత్రి సుభాష్ డాన్స్ చేసింది మహిళ గెటప్ లో ఉన్న జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతి స్వరూప్ తో అని జగన్ కామెంట్స్ తర్వాత వెలుగులోకి వచ్చింది. తాను ఎవరితో డాన్స్ చేశానో తెలియకుండా మాజీ సీఎం జగన్ ఎవరో రాసిచ్చింది చదివారని మంత్రి సుభాష్ మండిపడుతున్నారు. కళాకారులకు రికార్డింగ్ డాన్సులకూ తేడా తెలియడం లేదని.. కనీసం మాజీ మంత్రి రోజాను అడిగినా చెప్పేవారని అంటున్నారు. తాము బలవంతం పెడితేనే మంత్రి సుభాష్ తమతో రెండు స్టెప్పులు వేసారని జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతి స్వరూప్ సైతం ప్రకటించాడు.
ఇక ఏపీలో అరాచక పరిస్థితులు జంగిల్ రాజ్ తరహాలో ఉన్నాయని పలు ఉదాహరణలు చెబుతూ.. మాజీ సీఎం జగన్ రామచంద్రాపురంలో మంత్రి డ్యాన్సులు వ్యవహారాన్ని ప్రస్తావించారు. అయితే ఈ విషయంలో మంత్రిని అవమానించేలా వాడు మాట్లాడటమే ఎక్కువగా రచ్చ అవుతోంది. దీనిపై మంత్రి సుభాష్ తో పాటు ఆయన అనుచరులు ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే ఇది మంత్రి సుభాష్ కు పరోక్షంగా కలిసి వచ్చే అంశం అవుతుందా అనే చర్చ సైతం మొదలైంది. బడుగు బలహీన వర్గాలను జగన్ అవమానించారు అనే అంశాన్ని టిడిపి ప్రజల్లోకి తీసుకువెళుతుంది. దీంతోపాటు ఇదే వ్యవహారంలో జబర్దస్త్ నటుడు శాంతి స్వరూప్ సైతం జగన్ వ్యాఖ్యలను బహిరంగంగా తప్పుపట్టారు. ఈ అంశాలు గమనిస్తే మంత్రి సుభాష్ ఈ విషయంలో టిడిపికి ప్లస్ పాయింట్ గా మారినట్లుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు మంత్రి సుభాష్ పై వివాదాలు... పనితీరు ర్యాంకింగ్ లో వెనుకబాటు.. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ముద్ర వంటివి మైనస్ గా ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే.. మంత్రి సుభాష్ ఉద్దేశ పూర్వకంగానే డాన్సర్ లో పాల్గొన్నట్లుగా చర్చ జరుగుతోంది. గతంలో వైసీపీ మంత్రులు డాన్సులు చేసినప్పుడు ఎలా ట్రోల్ అయ్యారో అందరికీ తెలిసిందే. అయితే తాను కూడా డాన్స్ లో పాల్గొంటే తనను కూడా ట్రోల్ చేస్తారని.. తద్వారా తన అనుచరులు లేదా సామాజిక వర్గం నుంచి మద్దతు ఉంటుందనే వ్యూహాన్ని కూడా మంత్రి సుభాష్ అవలంబించారా అనే చర్చ సైతం జరుగుతోంది. మరోవైపు జగన్ మాటలతో అవమానం సుభాష్ పై పాలు పోసినట్లు అయ్యిందనే చర్చ సైతం జరుగుతోంది. మొత్తం మీద సీఎం చంద్రబాబు క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చేస్తే మంత్రి సుభాష్ ను తప్పించడం ఖాయం అనే ప్రచారం సైతం జోరుగా ఉంది. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యల వ్యవహారంతో వైసీపీ విమర్శలను మంత్రి సుభాష్ ధీటుగానే తిప్పికొట్టినట్లుగా కనిపిస్తోంది. దీంతో జగన్ కామెంట్స్ మంత్రి సుభాష్ కు పరోక్షంగా కలిసి వచ్చినట్లుగానే చర్చ జరుగుతుంది. తదుపరి ఏం జరుగుతుందో చూడాలి మరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Saturn And Sun Conjunction Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడితో పాటు శని గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రెండు గ్రహాలను శాస్త్రంలో తండ్రి కొడుకులు గా పరిగణిస్తారు ఈ రెండు గ్రహాల మధ్య శత్రుత్వం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రత్యేకమైన సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి. మార్చి 25వ తేదీన సూర్యుడితో పాటు శని గ్రహ సంయోగం జరిగింది దీని కారణంగా మొత్తం అన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడింది.. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి సూర్యుడు అనుగ్రహం అందిస్తే.. మరికొన్ని రాశుల వారికి శని దుష్ప్రభావాలను అందిస్తాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశుల వారిపై తీవ్ర దశ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆయారాశుల వారికి ఈ సమయంలో కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ సమయంలో ఏ రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశుల వారిపై దుష్ప్రభావం:
మేష రాశి
సూర్యుడు శని కలయిక కారణంగా మేష రాశి వారికి ఈ సమయంలో కొన్ని రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు బాస్‌తో పాటు ఇతర అధికారులతో విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం పై కూడా ఆందోళన చెందాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు సూర్యుడు శని రెండు గ్రహాల కలయికతో వ్యక్తిగత జీవితంలో అనేక సమస్య లేదు రావచ్చు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఆటంకాలు రావడం ప్రారంభమవుతాయి.. అలాగే భాగస్వామ్య వ్యాపారాల్లో తీవ్ర నష్టాలు కూడా సంభవిస్తాయి.. ముఖ్యంగా కమ్యూనికేషన్ దెబ్బతినడం కారణంగా కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సంబంధాలు గతంలో కంటే ఇప్పుడు మరింత దెబ్బతింటాయి.. భాగస్వామితో ఎంతో ఓపికగా మాట్లాడడం మంచిది. అవసరమైన ఖర్చులు కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది.
కన్యారాశి
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు సూర్యుడు శని సంయోగంతో కొన్ని రకాల కీడు సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి. శత్రువులు మీకు నష్టం కలిగించే పనులు చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడమే కాకుండా కొన్ని పనుల్లో ఎంతో ఆ జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా వీరు చట్టపరమైన కేసుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాగే కొన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు వృత్తి వ్యాపారాల పరంగా కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభించకపోవడంతో మానసికంగా ఒత్తిడికి గురవుతారు. అలాగే ఈ సమయంలో తీవ్ర నిరాశ చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఉద్యోగాలు మారాలనుకుంటున్న వ్యక్తులు తప్పకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.. కుటుంబంలో ఆస్తి కోసం గొడవలు కూడా తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎంతో ఓపికగా ఉండి కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఎన్నో రకాల తీవ్ర సమస్యలకు దారి తీయవచ్చు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Silver Trading: బుధవారం అంతర్జాతీయ లోహాల మార్కెట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ డెరివేటివ్స్ ట్రేడింగ్ వేదిక CME Group నిర్వహించే CME Globexలో సాంకేతిక లోపం తలెత్తడంతో బంగారం, వెండి ఫ్యూచర్స్ ట్రేడింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. మధ్యాహ్నం సుమారు 12:15 గంటలకు (CT) ట్రేడింగ్ ఆగిపోవడంతో పెట్టుబడిదారుల్లో అనేక సందేహాలు వెల్లువెత్తాయి.
అయితే ఈ సాంకేతిక సమస్యల సమయంలో ఎక్స్చేంజ్‌లు సాధారణంగా మార్కెట్‌ను స్థిరంగా ఉంచేందుకు ట్రేడింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తాయి. ఇది ధరలను నియంత్రించేందుకు కాదు. తప్పు ఆర్డర్లు, సిస్టమ్ లోపాలు లేదా అసాధారణ హెచ్చుతగ్గులను నివారించేందుకు తీసుకునే జాగ్రత్త చర్య అని చెప్పాలి. మొదట సహజ వాయువు మార్కెట్‌ను పునఃప్రారంభించి.. ఆ తర్వాత బంగారం, వెండి కాంట్రాక్టులను తిరిగి ప్రారంభించారు.
సాధారణ పెట్టుబడిదారుడి దృష్టిలో ట్రేడింగ్ నిలిపివేత అనేది ధరలు తప్పనిసరిగా పెరుగుతాయని లేదా పడిపోతాయని సూచించదు. అయితే మార్కెట్ అకస్మాత్తుగా ఆగిపోతే అనిశ్చితి పెరుగుతుంది. తిరిగి ప్రారంభమైన వెంటనే వాల్యూమ్ ఒక్కసారిగా పెరగడం లేదా షార్ట్ కవరింగ్ జరగడం వల్ల పదునైన హెచ్చుతగ్గులు సంభవించే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి సందర్భాల్లో ట్రేడర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారు.
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ధరలు ఎలా ఉన్నాయో చూడండి..!!
గతంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వెండి ధరలు గణనీయంగా పెరిగిన సందర్భం కూడా ఉంది. అప్పట్లో షార్ట్ పొజిషన్లు చిక్కుకోవడంతో ధరలు వేగంగా పెరిగాయి. అయితే చరిత్ర ప్రతిసారి పునరావృతం కావాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్ ఆర్థిక వాతావరణం, డాలర్ బలం, పెట్టుబడిదారుల భావోద్వేగాలు కీలక పాత్ర పోషిస్తాయి.
మార్కెట్ తిరిగి తెరుచుకున్న తర్వాత భారీ కొనుగోళ్లు, షార్ట్ కవరింగ్ లేదా అంతర్జాతీయ అనిశ్చితి పెరిగితే బంగారం, వెండి ధరలు బుల్లిష్ ధోరణి కనబరచవచ్చు. మరోవైపు ట్రేడింగ్ సాధారణ స్థితిలోకి వస్తే, పెద్ద పెట్టుబడిదారులు కొత్త పొజిషన్లు తీసుకోకపోతే లేదా అమెరికన్ డాలర్ బలపడితే ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది.ముఖ్యంగా, ఒక్క సంఘటన ఆధారంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు తమ వ్యూహాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కానీ స్వల్పకాలిక ట్రేడర్లు మాత్రం అస్థిరతకు సిద్ధంగా ఉండాలి. మార్కెట్ నిజమైన దిశ ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైన తర్వాత వాల్యూమ్.. ట్రెండ్ ఆధారంగా స్పష్టమవుతుంది.
Also Read: Gold Silver Rate: బంగారం.. వెండిపై చైనా కీలక ప్రకటన.. ధరలు భారీగా తగ్గే అవకాశం..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bill Gates: మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి అంతర్జాతీయ వార్తల్లో చర్చకు దారి తీశారు. బాలలపై లైంగిక నేరాల కేసుల్లో నిందితుడు జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్ స్టీన్ ఫైల్ బయటకు పొక్కడంతో బిల్ గేట్స్ గతంలో చేసిన తప్పులను ఒప్పుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది. దివంగత ఆర్థికవేత్త.. లైంగిక నేర కేసుల్లో నిందితుడిగా నిలిచిన Jeffrey Epsteinతో గతంలో తనకు ఉన్న పరిచయంపై ఆయన బహిరంగంగా స్పందిస్తూ తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘Bill & Melinda Gates Foundation’ సిబ్బందితో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో గేట్స్ ఈ అంశంపై స్పష్టంగా మాట్లాడారు. ఎప్‌స్టీన్‌తో గడపడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పిదమని.. ఆ నిర్ణయం సంస్థ విలువలకు విరుద్ధమైందని ఆయన అంగీకరించారు.
సమావేశంలో భావోద్వేగానికి లోనైన గేట్స్.. నా నిర్ణయం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలి. ఈ విషయానికి పూర్తి బాధ్యత నాదే అని అన్నారు. ఫౌండేషన్ ప్రతిష్ఠ ఎంతో కీలకమని, ఇటువంటి వివాదాలు దాతలు, భాగస్వాములు, సిబ్బందిపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్‌తో సంబంధం కొనసాగించడం ఒక తీవ్రమైన తీర్మాన దోషమని, ఆ సమయంలో తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు తనకు విచారం ఉందని చెప్పారు.
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ధరలు ఎలా ఉన్నాయో చూడండి..!!
ఇటీవల United States Department of Justice విడుదల చేసిన పత్రాల్లో ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఈమెయిల్ ముసాయిదాలు బయటకు రావడంతో వివాదం మళ్లీ ముదిరింది. వాటిలో గేట్స్‌పై పరోక్షంగా కొన్ని ఆరోపణలు ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను గేట్స్ ఖండిస్తూ తాను ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఎప్‌స్టీన్‌తో ఉన్న పరిచయం తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠకు భంగం కలిగించిందని, కానీ అక్రమ చర్యలకు తాను పాల్పడలేదని తెలిపారు.
ఫౌండేషన్ తరఫున ఎప్‌స్టీన్ లేదా అతని అనుబంధులతో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉండగా, ఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్–2026లో గేట్స్ పాల్గొనాల్సి ఉన్నప్పటికీ అనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన హాజరు కాలేదని తెలియజేశారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పలువురు ప్రముఖుల పేర్లు బయటపడటంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా మరింత చర్చనీయాంశమైంది.
Also Read: Gold Silver Rate: బంగారం.. వెండిపై చైనా కీలక ప్రకటన.. ధరలు భారీగా తగ్గే అవకాశం..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Punarvika Treatment: అత్యంత అరుదైన వ్యాధి. ఆ వ్యాధి సోకితే దాదాపు ప్రాణం పోయినట్టే. కానీ ఒకే ఒక ఇంజెక్షన్‌తో తిరిగి ప్రాణం పోసుకోవచ్చు. కానీ ఆ ఇంజెక్షన్ ధర రూ.16 కోట్లు. అంత ఖరీదైన ఇంజెక్షన్ వేసుకోవడం మధ్యతరగతికి చాలా కష్టం. ఇక పేద కుటుంబాలకైతే అది కల.. ఇక ప్రాణం పోయినట్టే. అయితే మానవతామూర్తులు స్పందించడంతో ప్రాణాంతక వ్యాధికి గురయిన ఓ పేదింటి బిడ్డ తిరిగి ప్రాణం పోసుకోనుంది. బోసి నవ్వులతో తిరిగి ప్రపంచాన్ని చూడనుంది. ఆ పాపకు ఏపీ మంత్రి నారా లోకేశ్ భారీ విరాళం ప్రకటించడం మరింత విశేషం.
Also Read: TDP: గోదారోళ్ల ప్రేమాప్యాయతల్లో మునిగిన నారా లోకేశ్.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయం
ఎస్‌ఎంఏ టైప్ 1 కండరాల క్షీణత వ్యాధితో ఏపీకి చెందిన చిన్నారి పునర్విక బాధపడుతోంది. రూ.16 కోట్లు విలువైన ఇంజెక్షన్ విదేశాల నుంచి తీసుకువస్తే పాప బతికే అవకాశం ఉంది. చిన్నారి తల్లిదండ్రులు తమ పాప కష్టాన్ని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఒక్కొక్కరూ తలచుకుంటే తమ పాప చికిత్సకు కావాల్సిన డబ్బులు సులభంగా సాధ్యమయని తెలిపారు. సహాయం కోసం అర్జించారు. తమ రక్తం పంచుకుని పుట్టిన పాపకు పునర్జన్మ ఇవ్వాలని ప్రాధేయపడడంతో సోషల్ మీడియాలో 'సేవ్ పునర్విక' అని ట్రెండింగ్ మొదలైంది. ప్రతి ఒక్క నెటిజన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పునర్విక ప్రాణం కోసం తపించారు. వారికి చేతనైనా సహాయం చేశారు.
పునర్విక తల్లిదండ్రుల వీడియో చూసి పెద్ద ఎత్తున ప్రజలు ఆర్థికంగా అండగా నిలిచారు. ఒక్క తెలంగాణ, ఏపీ మాత్రమే కాకుండా దేశ, విదేశాల నుంచి పునర్విక వైద్య ఖర్చుల కోసం ప్రజలు, నెటిజన్లు ఆన్‌లైన్‌లో చెల్లించారు. చికిత్సకు కావాల్సిన రూ.16 కోట్లలో మానవత్వం ఉన్న ప్రజల ద్వారా రూ.10 కోట్లు సమకూరాయి. ఇంకా రూ.6 కోట్లు రావాల్సి ఉండగా అవి కూడా ఇచ్చేందుకు ప్రజానీకం సిద్ధంగా ఉంది. అయితే ఆ డబ్బును తాను ఇస్తానని ఏపీ మంత్రి నారా లోకేశ్ ముందుకువచ్చారు.
పునర్విక తల్లిదండ్రులు చేసిన వీడియోకు నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. పాప పునర్విక చికిత్సకు అవసరమైన 6 కోట్లు ఇస్తానంటూ లోకేష్ పోస్టు చేశారు. ఇప్పటికే రూ.10 కోట్లు విరాళాలుగా ప్రజల నుంచి సేకరణ చేశారని.. మిగిలిన రూ.6 కోట్ల బాధ్యత తనదేనని లోకేష్ హామీ ఇచ్చారు. పునర్వికకు పూర్తి చికిత్స అందేలా చూస్తానని.. ధైర్యంగా ఉండాలని పాప తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. పాప చికిత్స కోసం ఉదారంగా విరాళాలు ఇచ్చిన వారందరికీ ఈ సందర్భంగా నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
పునర్విక కుటుంబం
కర్నూలు జిల్లా వెల్దూర్తికి చెందిన సూర్యకుమార్, పుష్పవతి దంపతులకు 12 మే 2025న పునర్విక జన్మించింది. అయితే ఆరు నెలలు దాటినా పాప కదలికలు లేవు. పాకడం.. గెంతడం వంటివి పునర్విక చేయకపోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు కారణం బయటపడింది. ప్రాణాంతక స్పైనల్ మాస్క్యూలర్ ఆట్రోఫీ (ఎస్‌ఎంఏ) వ్యాధి ఉందని వైద్యులు నిర్ధారించారు.
ఎస్‌ఎంఏ అంటే?
ఇది అత్యంత అరుదైన వ్యాధి. ఈ వ్యాధి సోకితే కండరాల బలహీనత తీవ్రంగా ఉంటుంది. జీవచ్ఛవంలా మారుతారు. కొన్నిసార్లు ప్రాణాంతకంగా ఉంటుంది. జోల్‌గెన్‌స్మా ఇంజెక్షన్ ఈ వ్యాధికి నివారణగా పనిచేస్తుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ ఇదే. గతంలో కూడా ఇలాంటి వ్యాధి బారినపడితే సోషల్ మీడియా, ప్రజలు కలిసి ఆ ఇంజెక్షన్ కావాల్సిన డబ్బులు సర్దుబాటు చేశారు. తాజాగా పునర్విక విషయంలో కూడా అదే జరగడంతో ప్రపంచంలో ఇంకా మానవత్వం ఉందని నిరూపితమైంది.
SMA Type-1 is a rare and devastating genetic condition that weakens a child’s muscles and slowly takes away the ability to move, breathe and live normally. Yet little Punarvika from Kurnool, AP, is a true braveheart - fighting this battle with extraordinary courage.
— Lokesh Nara (@naralokesh) February 25, 2026
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Water Gun Panipuri Video Viral: భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ కున్న క్రేజ్ ఎంతో ఇంతో కాదు.. అందులోనూ పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఉండరు.. సాధారణంగా పానీ పూరి షాప్ దగ్గర ఆ బండి వ్యక్తి ప్లేట్లో పానీపూరిని పెట్టి.. అందులో రసం పోయడం మనం తరచుగా చూస్తూ ఉంటాం.. కానీ ముంబైలో ఒక పానీ పూరి షాప్ వద్ద.. అందర్నీ ఆశ్చర్యపరిచేలా కొత్త ప్రయత్నం చేశాడు. ఆ పానీపూరీలమ్మే వ్యక్తి నేరుగా పానీపూరీలో రసం నింపకుండా.. ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఏముందో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ముంబై కి చెందిన సాక్షి గదవే అనే ఒక ఫుడ్ లాకర్ ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి వెరైటీ పానీపూరి వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోకు అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేయడం విశేషం. ఇది పానీపూరి కానీ.. ఇది కాంబ్యాట్ ఎడిషన్ అని క్యాప్షన్ రాసి పోస్ట్ చేసింది. ఈ వీడియోలు ఆ పానీ పూరి అమ్ముతున్న వ్యక్తి నలుపు రంగు దుస్తులను ధరించి.. హాలీవుడ్ సినిమా మాట్రిక్స్ స్టైల్లో కనిపించడం మీరు చూడొచ్చు. చేతిలో ఒక రంగురంగుల పెద్ద వాటర్ గాని పట్టుకొని.. అందులో పానీపూరి రసాన్ని నింపి నేరుగా తమ కస్టమర్స్ కి నోట్లో పోసేందుకు రెడీ ఉండడం వీడియోలో చూడొచ్చు..
అయితే పానీ పూరి కొనుగోలు చేసిన వారు ముందుగా.. పూరిని సిద్ధం చేసుకోగానే.. అతను తన వాటర్ గంతో గురి చూసి పానీపూరీలో ఆ రసాన్ని షూట్ చేస్తున్నారు. కొంతమంది పానీపూరి లవర్స్ అయితే.. నోటిలోకి ఆ రసాన్ని స్ప్రే చేయించుకోవడం మీరు చూడొచ్చు. ఈ సరికొత్త ప్రయోగం చూసి అక్కడున్న కొంతమంది ఆశ్చర్య పోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగదారులు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు.. కొంతమంది ఇది జెన్-జీ (Gen-Z) తరానికి తగ్గ పానీ పూరీ బండి అని కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు ఇదొక వినూత్నమైన స్టార్టప్ ఐడియా అని ప్రశంసించడం విశేషం..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
అయితే ఈ వినూత్న ఐడియాపై కొంతమంది సానుకూలంగా స్పందించడమే కాకుండా.. విమర్శల వర్షం కూడా కురిపిస్తున్నారు. ప్లాస్టిక్ వాటర్ గన్ ఉపయోగించడం వల్ల ఫుడ్ సేఫ్టీ దెబ్బతింటుందని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతలేని ప్లాస్టిక్ గండ్లను వాడటం వల్ల పానీపూరీలో రసాయనాలు కలిసే అవకాశాలు ఉన్నాయని.. దీని కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా.. ముంబై స్వీట్ ఫుడ్ లో ఈ గన్ పానిపూరి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Emotional Viral Video: కుటుంబ బంధాల్లో ఉండే స్వచ్ఛమైన ప్రేమ అనేది కొన్ని సందర్భాల్లో బయటికి వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాలు వస్తేనే మనుషులు అనేది ఏంటని తెలుస్తుంది. అయితే బంధాల్లో ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగదారుల మనసు గెలుచుకుంటుంది. అనారోగ్యంతో ఉన్న తన వృద్ధ తండ్రికి ఒక కుమార్తె ఎంతో ఓపికగా.. ఏ మాత్రం కసురుకోకుండా సేవ చేస్తున్న తీరు చూసి సోషల్ మీడియా వినియోగదారులు బాగోద్వేగానికి గురవుతున్నారు.
ఇటీవలే పోల్ సమ్ అని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో అందరి మనసును దోచుకుంటుంది.. ఈ వీడియోలో ఒక కుమార్తె తన తండ్రికి దుస్తులు వేయడం మీరు చూడొచ్చు. ఆ వృద్ధుడు చాలా అనారోగ్య సమస్యతో బాధపడుతూ.. వదలలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆమె ఏమాత్రం అసహ్యించకుండా ఎంతో సున్నితంగా ఆయనకు స్వెటర్ వేస్తూ ఉండడం మీరు చూడొచ్చు. సాధారణంగా ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు.. వారి దగ్గరికి వెళ్లేందుకే ఇష్టపడరు. అలాంటిది ఆ యువతి తండ్రి పై ఉన్న ప్రేమతో ఎంతో ఓపికతో స్వెటర్ వేస్తూ వేస్తూ ఉండడం ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులకు బాగోద్వేగం తెప్పిస్తోంది.
అలాగే ఈ వీడియోలు ఆయన నడవడానికి ఇబ్బంది పడుతుంటే.. తన చేతులను పట్టుకుని ఆసరాగా నిలిచి బెడ్ వరకు తీసుకెళ్లడం కూడా మీరు చూడొచ్చు. ఆయన పడుకోవడానికి వీలుగా దిండ్లను సర్దడంతోపాటు తండ్రిని జాగ్రత్తగా కూర్చోబెట్టడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ఈ సమయంలో ఆమెను ఆమెను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..
A touching human scene of a girl documenting her care for her sick father and her daily attention to preparing him 🥺❤️ pic.twitter.com/AOkWkpFB93
— Wholesome (@wholesome_X_) February 24, 2026
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
ఈ వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.. కుమార్తె చూపే ప్రేమ, సున్నితమైన స్పర్శ నిజమైన మానవత్వం అని కొంతమంది కామెంట్లు చేస్తే.. మరి కొంతమంది ఇలాంటి సందర్భాల్లో తండ్రిని చూసుకోవడం మాకు కన్నీళ్లు తెప్పిస్తోందని.. మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ దృశ్యాలను చూసి కన్నీరు పెట్టుకున్నారని మరికొందరు కామెంట్లలో తెలుపుతున్నారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు పిల్లలు వారికి అండగా నిలవడమే జీవితంలో అత్యంత విలువైన విషయమని ఈ వీడియో మరోసారి గుర్తు చేసింది..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jagtial Latest Telugu News: జగిత్యాల పట్టణంలోని కళాచీ వాడలో అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తుతెలియని కొంతమంది దుండగులు అర్ధరాత్రి వేళ విగ్రహాన్ని తొలగించడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న మాజీమంత్రి ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకున్నారు. అసలు అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరి తొలగించారు? అసలు అక్కడ ఏం జరిగింది? మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఘటనను జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్థానిక ప్రజలతో కలిసి స్వయంగా అంబేద్కర్ విగ్రహాన్ని అదే స్థానంలో తిరిగి ప్రతిష్టించారు.. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.. అయితే ఈ సందర్భంగా అక్కడికి పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులతో పాటు స్థానికులు ప్రభుత్వంతో పాటు దుండగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్ధరాత్రి ఎవరూ లేనిది చూసి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడానికి తప్పుపట్టారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం అంటే అది కేవలం ఒక కులానికో.. మతానికో జరిగిన అవమానం కాదని.. అది యావత్ భారత జాతికి అగౌరపరచడమేనని.. ఆయన మండిపడ్డారు.. ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతిని పెంచడానికి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, నేటి దేశ అభివృద్ధికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మూలమని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన దుండగులను తీవ్రంగా హెచ్చరించారు.
Also Read: Tirupati Crime News: అయ్యయ్యో కసాయి తల్లి.. ప్రియుడి కోసం కన్నకొడుకును కడతేర్చిన తల్లి!
రాజకీయాలకు అతీతంగా కళాచీ వాడ ప్రజలతో తమకు దశాబ్దాల అనుబంధం ఉందని.. ఇలాంటి నీచమైన ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన తెలిపారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను.. వారిని ప్రోత్సహించిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కు పాదం మోపాలని ఆయన కోరారు.. ఏది ఏమైనా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం అది దేశానికే పెద్ద అవమానమని కొంతమంది స్థానికులు తెలుపుతున్నారు.
Also Read: Tirupati Crime News: అయ్యయ్యో కసాయి తల్లి.. ప్రియుడి కోసం కన్నకొడుకును కడతేర్చిన తల్లి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nandamuri Balakrishna Minister Post News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో నందమూరి బాలకృష్ణకు చోటు దక్కబోతుందా? నందమూరి, మెగా కుటుంబాలకు క్యాబినెట్‌లో సమాన ప్రాధాన్యత దక్కనుందా? అన్న అంశాలపై పొలిటికల్ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ మంత్రి పదవిపై ప్రచారం
హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు (హ్యాట్రిక్) విజయం సాధించిన నందమూరి బాలకృష్ణకు ఈసారి మంత్రి పదవి ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ కాలం నుండి హిందూపురం నందమూరి కుటుంబానికి కంచుకోట.
అక్కడ తిరుగులేని విజయం సాధించిన బాలయ్యకు పాలనలో భాగస్వామ్యం కల్పించాలని నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే నందమూరి కుటుంబానికి టీడీపీలో ప్రాధాన్యత తగ్గింది అనే విమర్శలకు చెక్ పెట్టాలంటే బాలకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఒక మార్గమని విశ్లేషకులు భావిస్తున్నారు.
బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడంలో కొన్ని సాంకేతిక, రాజకీయ ఇబ్బందులు కూడా ఉన్నాయట. ఇప్పటికే బావ చంద్రబాబు ముఖ్యమంత్రిగా, అల్లుడు నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు బాలయ్యకు కూడా పదవి ఇస్తే "కుటుంబ పాలన" అంటూ విపక్షాలు విమర్శించే అవకాశం ఉంది. గతంలో లోకేష్ కోసం బాలయ్య తన అవకాశాన్ని వదులుకున్నారనే చర్చ కూడా ఉంది.
నందమూరి vs మెగా ఫ్యామిలీ
ఈ సమీకరణంలో మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ మరో ఆసక్తికర మలుపు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఆయనను ఎమ్మెల్సీగా కూడా చేశారు.
మెగా కుటుంబం నుండి పవన్ కల్యాణ్ (డిప్యూటీ సీఎం), నాగబాబు (మంత్రి కాబోతున్నారని సీఎం ప్రకటించారు) ఇద్దరూ క్యాబినెట్‌లో ఉంటే.. నందమూరి కుటుంబం నుండి కేవలం లోకేష్ మాత్రమే ఉండటం అసమతుల్యతకు దారితీయవచ్చు. అందుకే నందమూరి అభిమానులను సంతృప్తి పరచడానికి బాలకృష్ణకు బెర్త్ ఖాయం చేసే అవకాశం కనిపిస్తోంది.
బాలకృష్ణ ప్రస్తుతం తన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఒకవేళ మంత్రి పదవి ఖాయమైతే, త్వరగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మెగా, నందమూరి కుటుంబాల మద్దతును పూర్తిస్థాయిలో కూడగట్టడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి కూటమిని మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ 'డబుల్ ఫ్యామిలీ' స్కెచ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.
Also Read: Srikakulam Diarrhea News: భారీగా పెరిగిన డయేరియా కేసులు..ముగ్గురు మృతి, 76 మంది తీవ్ర అనారోగ్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rain On Wedding Day Hindu Tradition: పెళ్లి సీజన్ మొదలైందంటే చాలు.. ఊరూ వాడా కళ్యాణ భాజాల మోత మోగుతుంది. హిందూ సంప్రదాయంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, అది నూరేళ్ల బంధం. అయితే, కొన్నిసార్లు వివాహం జరుగుతున్న సమయంలో అనుకోకుండా వర్షం కురుస్తుంటుంది. ఇలా పెళ్లి రోజు వర్షం పడటం అదృష్టమా? లేక అశుభమా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
శ్రేయస్సు, అదృష్టానికి చిహ్నం
పెళ్లి రోజు వర్షం కురవడం చాలా శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. వర్షం అనేది ఆకాశం నుండి కురిసే ఆశీర్వాదం వంటిది. ఇది నూతన వధూవరుల జీవితాల్లోకి అదృష్టాన్ని, శ్రేయస్సును తీసుకువస్తుందని నమ్ముతారు.
ప్రకృతిలో వర్షం భూమిని ఎలా శుద్ధి చేస్తుందో, అలాగే వివాహ సమయంలో పడే వర్షం ఆ జంటకి సంబంధించిన గతంలోని నెగటివిటీని కడిగివేసి, వారి కొత్త జీవితాన్ని స్వచ్ఛంగా ప్రారంభిస్తుందని భావిస్తారు. ఇది రాబోయే కాలంలో వారి మధ్య సంతోషాన్ని పెంచుతుందని అర్థం.
బలమైన బంధం
ఒక సామెత ప్రకారం.. తడిచిన ముడి విప్పడం చాలా కష్టం. అదేవిధంగా, వర్షంలో జరిగిన వివాహ బంధం కూడా చాలా బలంగా ఉంటుందని, ఆ దంపతులు కలకాలం విడదీయరాని బంధంతో కలిసి ఉంటారని విశ్వసిస్తారు.
అలాగే వర్షం పడితే భూమి పులకించి పంటలు ఎలా పండుతాయో, అలాగే పెళ్లి రోజు వర్షం పడటం ఆ జంటకు సంతాన ప్రాప్తిని, సిరి సంపదలను కలిగిస్తుందని సంప్రదాయాలు చెబుతున్నాయి. పిల్లాపాపలతో ఆ ఇల్లు కలకలలాడుతుందని దీని అర్థం.
ముఖ్య గమనిక: ఈ సమాచారం పూర్తిగా మత విశ్వాసాలు, పండితుల అభిప్రాయాలపై ఆధారపడి అందించబడింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వర్షం వల్ల పెళ్లి పనులకు కొంత ఆటంకం కలిగినా, ఆధ్యాత్మికంగా మాత్రం ఇది ఒక మంచి శకునంగానే పరిగణించవచ్చు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.
Also Read: Srikakulam Diarrhea News: భారీగా పెరిగిన డయేరియా కేసులు..ముగ్గురు మృతి, 76 మంది తీవ్ర అనారోగ్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook