Rain On Wedding Day Hindu Tradition: పెళ్లి సీజన్ మొదలైందంటే చాలు.. ఊరూ వాడా కళ్యాణ భాజాల మోత మోగుతుంది. హిందూ సంప్రదాయంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, అది నూరేళ్ల బంధం. అయితే, కొన్నిసార్లు వివాహం జరుగుతున్న సమయంలో అనుకోకుండా వర్షం కురుస్తుంటుంది. ఇలా పెళ్లి రోజు వర్షం పడటం అదృష్టమా? లేక అశుభమా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
శ్రేయస్సు, అదృష్టానికి చిహ్నం
పెళ్లి రోజు వర్షం కురవడం చాలా శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. వర్షం అనేది ఆకాశం నుండి కురిసే ఆశీర్వాదం వంటిది. ఇది నూతన వధూవరుల జీవితాల్లోకి అదృష్టాన్ని, శ్రేయస్సును తీసుకువస్తుందని నమ్ముతారు.
ప్రకృతిలో వర్షం భూమిని ఎలా శుద్ధి చేస్తుందో, అలాగే వివాహ సమయంలో పడే వర్షం ఆ జంటకి సంబంధించిన గతంలోని నెగటివిటీని కడిగివేసి, వారి కొత్త జీవితాన్ని స్వచ్ఛంగా ప్రారంభిస్తుందని భావిస్తారు. ఇది రాబోయే కాలంలో వారి మధ్య సంతోషాన్ని పెంచుతుందని అర్థం.
బలమైన బంధం
ఒక సామెత ప్రకారం.. తడిచిన ముడి విప్పడం చాలా కష్టం. అదేవిధంగా, వర్షంలో జరిగిన వివాహ బంధం కూడా చాలా బలంగా ఉంటుందని, ఆ దంపతులు కలకాలం విడదీయరాని బంధంతో కలిసి ఉంటారని విశ్వసిస్తారు.
అలాగే వర్షం పడితే భూమి పులకించి పంటలు ఎలా పండుతాయో, అలాగే పెళ్లి రోజు వర్షం పడటం ఆ జంటకు సంతాన ప్రాప్తిని, సిరి సంపదలను కలిగిస్తుందని సంప్రదాయాలు చెబుతున్నాయి. పిల్లాపాపలతో ఆ ఇల్లు కలకలలాడుతుందని దీని అర్థం.
ముఖ్య గమనిక: ఈ సమాచారం పూర్తిగా మత విశ్వాసాలు, పండితుల అభిప్రాయాలపై ఆధారపడి అందించబడింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వర్షం వల్ల పెళ్లి పనులకు కొంత ఆటంకం కలిగినా, ఆధ్యాత్మికంగా మాత్రం ఇది ఒక మంచి శకునంగానే పరిగణించవచ్చు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.
Also Read: Srikakulam Diarrhea News: భారీగా పెరిగిన డయేరియా కేసులు..ముగ్గురు మృతి, 76 మంది తీవ్ర అనారోగ్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Jagtial Latest Telugu News: జగిత్యాల పట్టణంలోని కళాచీ వాడలో అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తుతెలియని కొంతమంది దుండగులు అర్ధరాత్రి వేళ విగ్రహాన్ని తొలగించడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న మాజీమంత్రి ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకున్నారు. అసలు అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరి తొలగించారు? అసలు అక్కడ ఏం జరిగింది? మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఘటనను జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్థానిక ప్రజలతో కలిసి స్వయంగా అంబేద్కర్ విగ్రహాన్ని అదే స్థానంలో తిరిగి ప్రతిష్టించారు.. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.. అయితే ఈ సందర్భంగా అక్కడికి పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులతో పాటు స్థానికులు ప్రభుత్వంతో పాటు దుండగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్ధరాత్రి ఎవరూ లేనిది చూసి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడానికి తప్పుపట్టారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం అంటే అది కేవలం ఒక కులానికో.. మతానికో జరిగిన అవమానం కాదని.. అది యావత్ భారత జాతికి అగౌరపరచడమేనని.. ఆయన మండిపడ్డారు.. ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతిని పెంచడానికి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, నేటి దేశ అభివృద్ధికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మూలమని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన దుండగులను తీవ్రంగా హెచ్చరించారు.
Also Read: Tirupati Crime News: అయ్యయ్యో కసాయి తల్లి.. ప్రియుడి కోసం కన్నకొడుకును కడతేర్చిన తల్లి!
రాజకీయాలకు అతీతంగా కళాచీ వాడ ప్రజలతో తమకు దశాబ్దాల అనుబంధం ఉందని.. ఇలాంటి నీచమైన ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన తెలిపారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను.. వారిని ప్రోత్సహించిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కు పాదం మోపాలని ఆయన కోరారు.. ఏది ఏమైనా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం అది దేశానికే పెద్ద అవమానమని కొంతమంది స్థానికులు తెలుపుతున్నారు.
Also Read: Tirupati Crime News: అయ్యయ్యో కసాయి తల్లి.. ప్రియుడి కోసం కన్నకొడుకును కడతేర్చిన తల్లి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nandamuri Balakrishna Minister Post News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో నందమూరి బాలకృష్ణకు చోటు దక్కబోతుందా? నందమూరి, మెగా కుటుంబాలకు క్యాబినెట్‌లో సమాన ప్రాధాన్యత దక్కనుందా? అన్న అంశాలపై పొలిటికల్ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ మంత్రి పదవిపై ప్రచారం
హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు (హ్యాట్రిక్) విజయం సాధించిన నందమూరి బాలకృష్ణకు ఈసారి మంత్రి పదవి ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ కాలం నుండి హిందూపురం నందమూరి కుటుంబానికి కంచుకోట.
అక్కడ తిరుగులేని విజయం సాధించిన బాలయ్యకు పాలనలో భాగస్వామ్యం కల్పించాలని నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే నందమూరి కుటుంబానికి టీడీపీలో ప్రాధాన్యత తగ్గింది అనే విమర్శలకు చెక్ పెట్టాలంటే బాలకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఒక మార్గమని విశ్లేషకులు భావిస్తున్నారు.
బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడంలో కొన్ని సాంకేతిక, రాజకీయ ఇబ్బందులు కూడా ఉన్నాయట. ఇప్పటికే బావ చంద్రబాబు ముఖ్యమంత్రిగా, అల్లుడు నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు బాలయ్యకు కూడా పదవి ఇస్తే "కుటుంబ పాలన" అంటూ విపక్షాలు విమర్శించే అవకాశం ఉంది. గతంలో లోకేష్ కోసం బాలయ్య తన అవకాశాన్ని వదులుకున్నారనే చర్చ కూడా ఉంది.
నందమూరి vs మెగా ఫ్యామిలీ
ఈ సమీకరణంలో మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ మరో ఆసక్తికర మలుపు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఆయనను ఎమ్మెల్సీగా కూడా చేశారు.
మెగా కుటుంబం నుండి పవన్ కల్యాణ్ (డిప్యూటీ సీఎం), నాగబాబు (మంత్రి కాబోతున్నారని సీఎం ప్రకటించారు) ఇద్దరూ క్యాబినెట్‌లో ఉంటే.. నందమూరి కుటుంబం నుండి కేవలం లోకేష్ మాత్రమే ఉండటం అసమతుల్యతకు దారితీయవచ్చు. అందుకే నందమూరి అభిమానులను సంతృప్తి పరచడానికి బాలకృష్ణకు బెర్త్ ఖాయం చేసే అవకాశం కనిపిస్తోంది.
బాలకృష్ణ ప్రస్తుతం తన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఒకవేళ మంత్రి పదవి ఖాయమైతే, త్వరగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మెగా, నందమూరి కుటుంబాల మద్దతును పూర్తిస్థాయిలో కూడగట్టడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి కూటమిని మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ 'డబుల్ ఫ్యామిలీ' స్కెచ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.
Also Read: Srikakulam Diarrhea News: భారీగా పెరిగిన డయేరియా కేసులు..ముగ్గురు మృతి, 76 మంది తీవ్ర అనారోగ్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirupati Incident Telugu Latest News: సమాజం తలదించుకునేలా.. ఓ కన్నతల్లి ప్రవర్తించిన ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనం రేపింది. తన వివాహేతర సంబంధానికి బిడ్డ అడ్డొస్తుందని భావించి.. రెండు సంవత్సరాలు కలిగిన కన్న బిడ్డను అత్యంత కిరాతకంగా హతమార్చింది.. ఈ ఘటన ఇప్పుడు తిరుపతిలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఆ కసాయి తల్లి బిడ్డను ఎలా చంపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తిరుపతికి చెందిన ఆశలత అనే ఓ మహిళలకు 2 సంవత్సరాల దుర్గ అనే కుమార్తె ఉంది. అయితే, ఆశలత ఇప్పటికే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన ప్రియుడితో కలిసి జీవించేందుకు ఆ చిన్నారి అడ్డుగా ఉందని భావించింది.. ఈ క్రమంలోనే చిన్నారిని వదిలించుకోవాలని నిర్ణయం తీసుకుంది. పాపను చంపేసి.. ఎవరికీ తెలియకుండానే గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి పెట్టేసింది..
చిన్నారి దుర్గ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అమ్మమ్మ, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు దర్యాప్తులో భాగంగా ఈ దారుణం వెలుగులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితురాలు ఆశలత కదలికలపై నిఘా ఉంచగా.. ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల శైలిలో విచారించగా.. తనే స్వయంగా.. బిడ్డను చంపి పూడ్చి పెట్టిన్నట్లు ఆమె నేరాన్ని అంగీకరించింది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
దీంతో నిందితురాలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఏర్పేడు మండలం పాపానాయుడు పేట సమీపంలోని ప్రవహించే సర్ణముఖి నది ఒడ్డున చిన్నారి మృతదేహాన్ని పూడ్చి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి.. పంచనామా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆశలతను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించే ప్రక్రియలో ఉన్నారు. ఈ హత్యలో ఆమె ప్రియుడి పాత్ర ఎంతవరకు ఉంది? అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vijay Rashmika Wedding Unseen Pics: టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరి వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
ఉదయ్‌పూర్‌లో సందడి
ఉదయ్‌పూర్‌లోని ప్రతిష్టాత్మకమైన ఐటీసీ మెమెంటోస్ (ITC Mementos) హోటల్‌లో వీరి ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరి 24న నిర్వహించిన సంగీత్ ఈవెంట్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఎంతో ఉత్సాహంగా సాగింది.
వైరల్ అవుతున్న 'ప్రేమ జ్ఞాపకాలు'
పెళ్లి వేదిక వద్ద అతిథుల మొబైల్ ఫోన్లు, వీడియోలపై కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. హోటల్ ప్రాంగణంలో విజయ్, రష్మికల ఏడేళ్ల ప్రేమ ప్రయాణానికి సంబంధించిన అరుదైన ఫోటోలను ప్రదర్శనకు ఉంచారు.
వీరిద్దరూ కలిసి విదేశాలకు వెళ్ళినప్పటి ఫోటోలతో పాటు, 'గీత గోవిందం' షూటింగ్ సమయంలో బస్సులో దిగిన ఐకానిక్ ఫోటో కూడా ఈ గ్యాలరీలో ఉండటం విశేషం. షూటింగ్ స్పాట్స్‌లో వారు గడిపిన క్షణాల నుంచి నేటి వరకు వారి బంధం ఎలా బలపడిందో ఈ ఫోటోలు ప్రతిబింబిస్తున్నాయి.
పెళ్లి ఏర్పాట్లలో ప్రత్యేకతలు
ఈ వివాహాన్ని అత్యంత గోప్యంగా ఉంచేందుకు ఇరు కుటుంబాలు కొన్ని కఠిన నియమాలను పాటిస్తున్నాయి. వివాహ ఆచారాలు జరుగుతున్నప్పుడు ఎలాంటి వీడియోలు తీయకుండా నిషేధం విధించారు. పెళ్లి వేదికపై డ్రోన్ కెమెరాలు ఎగురవేయడానికి అనుమతి లేదు. ఈ రాయల్ వెడ్డింగ్‌లో భోజనాల విషయానికి వస్తే.. పక్కా సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ వంటకాలకు పెద్దపీట వేస్తున్నారు.
పెళ్లి వేడుకల ప్రైవసీ దెబ్బతినకుండా ఉండేందుకు, వివాహం ముగిసే వరకు హోటల్‌లో యూట్యూబర్‌లకు ఎలాంటి బుకింగ్స్ ఇవ్వడం లేదని సమాచారం. రేపు జరగనున్న ఈ పెళ్లి వేడుకతో విజయ్, రష్మికలు అధికారికంగా దంపతులు కానున్నారు. వీరిద్దరి 'కొత్త జీవితం' కోసం అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read: AP Housing Scheme: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త..ఇళ్ల స్కీమ్ డబ్బులు అకౌంట్లో పడేది ఆరోజే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
iQOO Z11x: దిమ్మతిరిగే ఫీచర్స్‌తో iQOO Z11x ఫోన్ త్వరలో లాంచ్.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు!
Iqoo Z11x Launch Date In India Telugu: ప్రీమియం ఫీచర్స్‌తో ప్రాముఖ్యత స్మార్ట్‌ఫోన్ కంపెనీ iQOO నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ కంపెనీ iQOO Z11x పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ముఖ్యంగా ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో లాంచ్ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఇటీవలే చైనాలో కూడా విడుదల చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో త్వరలోనే లాంచ్ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Geekbenchలో ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మోడల్ నెంబర్ కూడా కనిపించింది. ఇది I2507 మోడల్ నంబర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో అభిషేక్ యాదవ్ (@yabhishekhd) అనే టిప్ స్టార్ ఫీచర్స్‌ను లీక్ చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7400 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది Mali-G615 MC2 GPUతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది..
iQOO Z11x స్మార్ట్‌ఫోన్ కొన్ని డేటాబేస్‌లో V2547A మోడల్ నంబర్‌తో అందుబాటులో ఉంచిన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ 6.76-అంగుళాల పూర్తి HD+ టచ్‌స్క్రీన్ డిస్ల్పేను కలిగి ఉంటుంద. అంతేకాకుండా ఈ సిరీస్‌లో iQOO Z11 టర్బో స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవలే కంపెనీ చైనాలో ప్రారంభించిన్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిని కంపెనీ మొత్తం నాలుగు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులో హై ఎండ్ వేరియంట్ 16GB+1TB స్టోరేజ్‌తో లభించబోతోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ iQOO Z11 టర్బో స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 6.59-అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 16 ఆధారంగా OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. అలాగే ఇది వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఎంతో శక్తివంతమైన 7,600mAh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AC Power Consumption: వేసవి కాలం వస్తోందంటే చాలు.. అందరి చూపు ఏసీల వైపు వెళ్తుంది. అయితే, ఏసీ ఇచ్చే చల్లని గాలి ఎంత హాయిగా ఉంటుందో, వచ్చే కరెంటు బిల్లు అంతకంటే ఎక్కువగా భయపెడుతుంది. అందుకే కొత్త ఏసీ కొనే ముందు లేదా వాడుతున్న ఏసీ బిల్లు తగ్గించుకోవాలంటే కొన్ని లెక్కలు తప్పనిసరి. 1 టన్ను ఏసీ ఎంత కరెంటును వినియోగిస్తుందో, బిల్లును ఎలా ఆదా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
1 టన్ను ఏసీ గంటకు ఎంత ఖర్చు?
సాధారణంగా ఏసీ వినియోగం అనేది దాని రకాన్ని బట్టి మారుతుంది. నాన్-ఇన్వర్టర్ ఏసీ గంటకు సగటున 0.9 నుండి 1.5 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంది. ఇన్వర్టర్ ఏసీ అయితే గది ఉష్ణోగ్రతను బట్టి కంప్రెసర్ వేగాన్ని సర్దుబాటు చేస్తుంది కాబట్టి గంటకు 0.6 నుండి 1.2 యూనిట్ల లోపే ఖర్చవుతుంది.
కరెంటు బిల్లు లెక్క ఇలా..
మీ ఏసీ గంటకు సగటున 1 యూనిట్ కరెంటును వాడుతుందని అనుకుందాం. యూనిట్ ధర రూ.8 అనుకుంటే.. 1 గంట ఖర్చు రూ.8 ఉంటుంది. రోజుకు 8 గంటలు వాడితే రూ.64.. ఈ విధంగా నెలవారీ ఖర్చు (30 రోజులకు) సుమారు రూ.1,920 ఉంటుంది.
BEE స్టార్ రేటింగ్ (3 Star, 5 Star) ఎంత ఎక్కువగా ఉంటే విద్యుత్ ఆదా అంత ఎక్కువగా ఉంటుంది. ఏసీని 18°C దగ్గర నడిపితే కంప్రెసర్ నిరంతరం పనిచేసి బిల్లు ఎక్కువగా వస్తుంది. దీనిని 24°C - 26°C మధ్య ఉంచడం వల్ల కరెంటు ఆదా అవుతుంది. గది కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉండాలి. గాలి బయటకు వెళ్తుంటే ఏసీపై ఒత్తిడి పెరిగి కరెంటు ఎక్కువగా కాలుతుంది. ఏసీ ఫిల్టర్లను రెగ్యులర్‌గా శుభ్రం చేయకపోతే గాలి రాక కంప్రెసర్ కష్టపడాల్సి వస్తుంది.
AC కొనే ముందు ఇవి తప్పక చూడండి
1) గది పరిమాణానికి తగ్గట్టుగా ఏసీని ఎంచుకోవాలి. పెద్ద గదిలో చిన్న ఏసీ పెడితే గది చల్లబడదు, పైగా బిల్లు విపరీతంగా వస్తుంది.
2) ఎక్కువ గంటలు ఏసీ వాడే వారు ఇన్వర్టర్ ఏసీని ఎంచుకోవడం ఉత్తమం.
3) స్మార్ట్ ఫీచర్లు: టైమర్, స్లీప్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్న ఏసీలు విద్యుత్ ఆదాకు తోడ్పడతాయి.
4) చివరిగా ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్‌ను కూడా తక్కువ స్పీడ్‌లో నడపడం వల్ల చల్లని గాలి గది అంతా త్వరగా వ్యాపించి, ఏసీపై భారం తగ్గుతుంది.
Also Read: AP Housing Scheme: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త..ఇళ్ల స్కీమ్ డబ్బులు అకౌంట్లో పడేది ఆరోజే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Rain Alert: తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో ఇవాళ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (Weather Department) అంచనా వేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశమూ ఉన్నట్లు వెల్లడించింది. ప్రత్యేకంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఈ వర్షాలు వ్యవసాయానికి కొంత మేలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, పంట కోత దశలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో తేమ శాతం కొంత ఎక్కువగా ఉండవచ్చు. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదయ్యే అవకాశముంది. వర్ష ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో గాలుల వేగం స్వల్పంగా పెరిగే సూచనలు ఉన్నాయి. మరోవైపు వర్షాలు పడే ప్రాంతాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. అటు ఈదుగు గాలులకు ఇప్పటికే తెలంగాణ పూతకు వచ్చిన మామిడి పిందెలు నేల రాలాయి. దీంతో రైతన్నలు లబోదిబో మంటున్నారు. పిందె దశలో వర్షాల వలన ఈ సారి మామిడి పంట దిగుబడి పై ఎక్కువ ప్రభావం పడే అవకాశాలున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట.
Read more: Top 10 Richest Actors: మన దేశంలో అత్యంత ధనవంతులైన హీరోలు వీళ్లే.. ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే.
Read more: Chiranjeevi Sankranthi Hits:‘మన శంకర వరప్రసాద్ గారు’ సహా సంక్రాంతి బరిలో హిట్టైన చిరంజీవి మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kethireddy Mass Warning: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్లిన నేతలపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి అండగా నిలవాల్సిన సమయంలో పక్కకు తప్పకుని..ఇప్పుడు అవకాశాల కోసం మళ్లీ పార్టీ పంచనా చేరాలనుకోవడం అస్సలు అంగీకారయోగ్యం కాదన్నారు. మన దగ్గర సంపాదించుకుని.. పక్క పార్టీల్లోకి వెళ్లి.. ఇప్పుడు బంధుత్వాలు, స్నేహం పేరుతో మళ్లీ వైసీపీ వైపు చూస్తామంటే.. గేటు దగ్గరే ముఖంపై చెప్పుతో కొడతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గతంలో పదవులు అనుభవించి.. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారిన తరువాత కూటమి వైపు చేరిన నాయకులపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ధర్మవరంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందుతూ.. కష్టకాలం వచ్చినప్పుడు దూరంగా వెళ్లిన నేతల వైఖరిపై కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి అండగా నిలవాల్సిన సమయంలో పక్కకు తప్పుకుని, ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం తిరిగి రావాలనుకోవడం అస్సలు అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని వదిలిన వారికి తిరిగి చోటు లేదని ఆయన ఘాటుగా హెచ్చరించారు. మన దగ్గర ఉంది సంపాదించుకుని.. ఇప్పుడు పదవుల కోసం వెళ్లిన నా కొడుకులను మళ్లీ పార్టీలోకి రానిచ్చే ప్రసక్తి లేదు. బంధుత్వాలు, స్నేహం పేరుతో మళ్లీ వైసీపీ వైపు చూస్తామంటే.. గేటు దగ్గరే ముఖంపై చెప్పుతో కొడతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.
రాజకీయాల్లో నైతికత, విధేయత అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, ఎదురుగా నిలబడి పోరాడే ప్రత్యర్థులను గౌరవించగలమేమోగానీ, లోపలుండి నష్టపరిచిన వారిని మాత్రం క్షమించలేమని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీపై విశ్వాసం కోల్పోయి, స్వప్రయోజనాల కోసం వెళ్లిన నాయకులు మళ్లీ చేరాలని ప్రయత్నిస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని సూచించారు. వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టే రాజకీయాలకు తాము లొంగబోమని స్పష్టం చేశారు.
Also Read: AC Price Hike 2026: ఏసీ కొనుగోలుదారులకు అలర్ట్.. భారీగా పెరగనున్న ధరలు..!!
అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కష్టకాలంలో తోడుగా ఉన్నవారే నిజమైన బలమని, అలాంటి వారికే భవిష్యత్తులో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. పదవుల కోసం మారే నాయకుల కంటే, సిద్ధాంతాల కోసం నిలిచే కార్యకర్తలే పార్టీకి శక్తి అని అన్నారు.
పార్టీ భవిష్యత్తు విధేయత మరియు క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుందని, నమ్మకద్రోహానికి పాల్పడిన వారికి తలుపులు తెరవబోమని కేతిరెడ్డి తేల్చిచెప్పారు. ఈ వ్యాఖ్యలతో పార్టీ అంతర్గత పరిస్థితులపై చర్చ మరింత వేగం పుంజుకుంది. రాజకీయ నిబద్ధత, నైతిక విలువలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి.
Also Read: Gold Silver Rate: బంగారం.. వెండిపై చైనా కీలక ప్రకటన.. ధరలు భారీగా తగ్గే అవకాశం..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jupiter's Favorite Zodiac Signs Telugu: జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని సంపద, జ్ఞానం, విద్య, ఆనందంతో పాటు శ్రేయస్సుకు సూచికగా భావిస్తారు. ఈ గ్రహం జాతకంలో శుభస్థానంలో ఉంటే కెరీర్ పురోగతికి, ఆర్థిక శ్రేయస్సుకు ఎలాంటి డోకా ఉండదు.. అంతేకాకుండా అనేక రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఇదే గ్రహం అశుభ స్థానంలో ఉంటే అనేక ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా నష్టాలు కూడా కలుగుతాయి. అలాగే వృత్తిపరమైన జీవితంలో ఇబ్బందులు కూడా తలెత్తే ఛాన్స్‌లు ఉన్నాయి.
జ్యోతిష్య శాస్త్రంలో తొమ్మిది గ్రహాల్లో బృహస్పతిని దేవతలకు గురువుగా చెప్పుకుంటారు. అందుకే దేవతలకు గురువుగా కూడా పిలుస్తారు. ఆ గ్రహం అనుగ్రహం ఉంటే వ్యక్తులకు తెలివితేటలు విపరీతంగా పెరగడమే కాకుండా ఆదాయం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. వైవాహిక జీవితంలో కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అలాగే అనుకున్న పనుల్లో ఊహించని ప్రయోజనాలు పొందుతారు. అయితే, ఈ గ్రహం అనుగ్రహం కొన్ని రాశులవారికి ఎల్లప్పుడు లభిస్తాయి. దీని కారణంగా ఆయా రాశులవారికి భారీ మొత్తంలో డబ్బు లభిస్తుంది.
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
కర్కాటక రాశి
బృహస్పతి ప్రభావంతో కర్కాటక రాశివారికి ఎల్లప్పుడు సానుకూల లాభాలు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. కుటుంబ జీవితంలో ఆనందం కూడా పొందుతారు. అదృష్టం రెట్టింపు అవ్వడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా విదేశీ వ్యాపారాలు చేసేవారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారు మంచి పదోన్నతలు కూడా పొందుతారు.
సింహ రాశి
సింహ రాశివారికి సూర్యుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. అలాగే వీరికి గురు గ్రహం అనుగ్రహం కూడా ఎల్లప్పుడు లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు నాయకత్వ లక్షణాలతో పాటు అద్భుతమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. దీంతో పాటు వీరికి అపారమైన ప్రజాదరణ కూడా లభిస్తుంది. ముఖ్యంగా బృహస్పతి అనుగ్రహం వల్ల సంపాదన కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి చాలా లాభదాయకంగా ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
కర్కాటక రాశి
బృహస్పతి అత్యంత శక్తివంతమైన గ్రహంగా చెప్పకుంటారు. అయితే, ఈ గ్రహ ప్రభావం ఎల్లప్పుడు కర్కాటక రాశివారిపై కూడా ఉంటుంది. దీని కారణంగా వీరికి అనేక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఆర్థికంగా కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. సంపదన కూడా విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారు అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారికి బృహస్పతి ప్రభావంతో జీవితంలో అనుకున్న పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటె ఇప్పుడు మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వీరు స్థిరమైన ఆన్తులను కూడా సొంతం చేసుకుంటారు. వైవాహికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆరోగ్యంగా కూడా చాలా రోజుల తర్వాత మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారికి ఎల్లప్పుడు అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Motorola Edge 60 Fusion Price Cut: మోటరోలా (Motorola) బ్రాండ్‌కి సంబంధించిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి ఛాన్స్‌గా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. దీనిపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా స్పెషల్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, డిస్కౌంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ Motorola Edge 60 Fusion 5G మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిజైన్‌తో పాటు ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో ప్రారంభించారు. ముఖ్యంగా ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల p-OLED Quad Curved డిస్ప్లేను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ Dimensity 7400 (4nm) చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్ కోసం అద్భుతమైన పనితీరును అందిస్తుంది. అంతేకాకుండా శక్తివంతమైన 50MP మెయిన్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది Sony LYT-700C సెన్సార్, OIS సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. ఇక అదనంగా 13MP అల్ట్రావైడ్, మాక్రో లెన్స్ కెమెరాలను కూడా కలిగి ఉంటుంది.
ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 32MP సెల్ఫీ కెమెరాను ఫ్రంట్ భాగంలో ఉంటుంది. ఇందులో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 5500mAh భారీ బ్యాటరీతో పాటు 68W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 (Hello UI) ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అలాగే దీనికి 3 ఏళ్ల పాటు OS అప్‌డేట్స్‌తో పాటు 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తున్నట్లు కంపెనీ క్లైమ్ చేస్తోంది.. ఇది ప్రీమియం వేగన్ లెదర్ ఫినిషింగ్, IP68/69 వాటర్‌తో పాటు డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో రన్ అవుతుంది. ఇందులో ప్రత్యేకంగా Moto AI ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్, మ్యాజిక్ కాన్వాస్, స్టైల్ సింక్ వంటి అద్బుతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం మార్కెట్‌లో మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని సాధారణ వేరియంట్ MRP ధర రూ.24,999లతో లభిస్తోంది. అలాగే ఈ Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్ స్పెషల్ ఫ్లాట్ డిస్కౌంట్‌తో కేవలం రూ.19,999కే లభిస్తోంది. అయితే, బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,900 వరకు తగ్గింపు లభిస్తుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. దీనిని వినియోగించి ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా పాత స్మార్ట్‌ఫోన్ ఎక్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏకంగా రూ.15,950 వరకు బోనస్‌తో పాటు అదనంగా రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.4,999 లోపే సొంతం చేసుకోవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Trump Claims Shehbaz Sharif Would Have Died: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆపరేషన్ సింధూర్‌పై ఈసారి కొత్త రకమైన వాదనకు దిగారు. భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధంతో పాటు మొత్తంగా తన 10 నెలల అధికారంలో 8 యుద్ధాలు తాను ఆపానని బుధవారం పునరుద్ఘాటించారు. 2026 స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్ పాక్ యుద్ధం తర్వాత కూడా ఆయన ఎన్నో సార్లు భారత్ యుద్ధం తానే ఆపాను అని.. లేకపోతే అణుయుద్ధం జరిగేదని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బుధవారం రోజు కూడా ఆయన ఈ ప్రసంగంలో భారత్ ఆపరేషన్ సింధూర్‌లో నేను ఆపకపోతే పాకిస్తాన్ ప్రధాని షాబాద్ షరీఫ్ చనిపోయేవాడని ఈ యుద్ధంలో 35 మిలియన్ల మంది దానే కాపాడినట్లు ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
10 నెలల్లో ..8 యుద్ధాలు ఆపాను..
యుద్ధం సమయంలో 35 మిలియన్ల మంది మరణించే వారని స్వయానా పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తనకు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఘర్షణలో తాను జోక్యం చేసుకోకపోతే సైనిక చర్యను ఆపి ఉండకపోతే శభాష్ షరీఫ్ ప్రాణాలతో ఉండేవాడు కాదని పేర్కొన్నారు. నేను దాదాపు పది నెలల్లో 8 యుద్ధాలు ఆపాను. కాంబోడియా- థాయిలాండ్ ,ఇజ్రాయిల్- హమాస్, ఇజ్రాయిల్ -ఇరాన్, భారత్ పాకిస్తాన్, సెర్బియా -కొసావా, రువాండా-కాంగో, అర్మేనియా-అజర్‌బైజాన్ మధ్య యుద్దాలను తానే పరిష్కరించానని ఆయన ప్రకటించారు.
ఆపరేషన్స్ సింధూర్ సమయంలో భారత్ పాక్ ఇద్దరూ ప్రధాన మంత్రులతో తాను మాట్లాడినట్లు.. యుద్ధం ఆపకపోతే ఇరు దేశాలపై 200 శాతం టారీఫ్ విధిస్తానని చెప్పానన్నారు. ఇరుదేశాలతో వాణిజ్యం ఒప్పందాలు కుదరవన్నానని ఆయన ప్రకటించారు. దీంతో ఈ ప్రధానులు దిగొచ్చినట్లు ఆయన పేర్కొంటున్నారు.
PRESIDENT TRUMP: We’re proudly restoring safety for Americans at home and abroad. In my first ten months, I ended eight wars. pic.twitter.com/BrIBSMhPj0
— Department of State (@StateDept) February 25, 2026
ఆపరేషన్ సింధూర్ ఎలా ఆగింది?
అయితే భారతదేశ మాత్రం ఈ వైఖరిని గతంలో కూడా తిరస్కరించింది. గత సంవత్సరం పహాల్గాం ఉగ్ర దాడుల తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో భారత్ పాకిస్తాన్ మధ్య మరింత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మూడో వ్యక్తి జోక్యం లేదని ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం పాత్ర ఎవరిది లేదని తోసి పుచ్చింది.
అమెరికా పాత్ర ఏది?
భారత్ పాకిస్తాన్ యుద్ధం మధ్యలో మధ్యవర్తిత్వం ఏది జరగలేదు. అమెరికా ఏ పాత్ర పోషించలేదు అని దౌత్య భాషలో జయశంకర్ కూడా దీనిపై స్పందించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కూడా ఈ కాల్పుల విరమణలో మూడో పక్షం జోక్యం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే నెలలో ఫిబ్రవరి 19వ తేదీ కూడా ట్రంప్ 8 దేశాల యుద్ధాలను ఆపానని ప్రకటించారు. భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో ఎనిమిది జెట్స్ కులాయి అని ఈసారి సంఖ్యను కూడా మార్చారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఇటీవలె కుదిరింది. ఆ తర్వాత ట్రంప్ వైఖరి కూడా మారింది. ఇది వరకు భారత్ పాక్ యుద్ధంలో ఏ దేశానికి పైచేయి అనే సంగతి ఆయన ఎన్నడూ నేరుగా చెప్పనేలేదు. కానీ, తాజాగా పాకిస్తాన్ ప్రధాని చనిపోయి ఉండేవాడు అని చెప్పడం గమనార్హం. ఇక పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది అమాయక టూరిస్టులో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారత సైనికులు ప్రధానంగా 9 టెర్రర్ అటాక్ ప్రదేశాలను గుర్తించి వాటిపై దాడిచేశారు. ఇందులో పిఓకే విస్తృత తనిఖీలు కూడా నిర్వహించింది. అయితే ఎయిర్ చీఫ్ మార్షల్ మన S-400 పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేసిందని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read: మరో బాంబు పేల్చిన ట్రంప్.. గ్లోబల్ టారీఫ్స్ 15 శాతానికి పెంపు, భారత్‌కు ఇదే వర్తిస్తుందంటూ క్లారిటీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
VK Sasikala Political Party: దక్షిణ భారతదేశంలో కీలకంగా ఉన్న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా పరోక్షంగా తమిళనాడు రాజకీయాల్లో భాగమైన చిన్నమ్మ అంటే వీకే శశికళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. ఏఐడీఎంకే అధినేత్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ప్రాణ స్నేహితురాలిగా ఉన్న శశికళ మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు. అయితే ఈసారి కొత్త రాజకీయ పార్టీని పెట్టి సంచలనం సృష్టించారు.
Also Read: TDP: గోదారోళ్ల ప్రేమాప్యాయతల్లో మునిగిన నారా లోకేశ్.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయం
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అందరూ తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుండగా.. ఈ క్రమంలోనే తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించి సంచలనం సృష్టించారు. త్వరలోనే పార్టీ పేరును అధికారికంగా వెల్లడిస్తానని ప్రకటించారు.
Also Read: YS Sharmila: తిరుమల అంశంలో వైఎస్సార్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: వైఎస్ షర్మిల
తమిళ ప్రజల ఆరాధ్య దైవం జయలలిత 78వ జయంతిని పురస్కరించుకుని శశికళ తన రాజకీయ ప్రస్థానాన్ని అధికారికంగా ప్రారంభించారు. రామనాథపురంలో శశికళ కొత్త పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన జెండా, ఆ జెండాపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత ఫొటోలు ఉన్నాయి. ఈ జెండా ఆవిష్కరణతో తాను జయలలిత అసలైన వారసురాలినని శశికళ ప్రకటించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం వీకే శశికళ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తన రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తానని చెప్పారు. జయలలిత సెంటిమెంట్‌ను వాడుకుంటూ ఆమె ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జయలలిత మృతి అనంతరం జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే నుంచి శశికళ బహిష్కరణకు గురయిన విషయం తెలిసిందే. కొన్నాళ్లు జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు. తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు అనూహ్యంగా మళ్లీ బరిలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తమిళనాడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డీఎంకే మళ్లీ అధికారం సొంతం చేసుకుంటుందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో.. ఇక్కడ విజయం కోసం అన్నాడీఎంకే సరికొత్త వ్యూహం నడుపుతోంది. బీజేపీ మద్దతుతో ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకుని అధికారం కైవసం చేసుకోవాలని ప్రణాళిక వేస్తోంది. ఈ క్రమంలో జయలలిత ఫొటోతో శశికళ రంగంలోకి దిగడంతో అన్నాడీఎంకేకు భారీ షాక్ తగిలింది. శశికళ రాజకీయ ప్రవేశంతో ఎవరి ఓట్లు చీలుతాయనేది ఆసక్తికరంగా మారింది. జయలలిత ఫొటో వాడకంతో అన్నాడీఎంకే ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆమె రాజకీయ అడుగులు ఎటు ఉంటాయో.. ఆమెను ఎవరు నడిపిస్తున్నారో అనే వార్తలు చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి