icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
RKRavi Kumar Sargam1 Mar 2026, 03:01 pm

Bandi Sanjay: మాట నిలబెట్టుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌.. ఏమిటో తెలుసా?

Karimnagar, Telangana:

Karimnagar: తెలంగాణలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పంచాయతీలను ఏకం చేస్తే తాను ప్రత్యేకంగా నిధులు ఇస్తానని చెప్పిన మాట ప్రకారం బండి సంజయ్‌ నిధులు ఇచ్చారు. తాను మాట నిలబెట్టుకున్నానని.. ఇక కాంగ్రెస్‌ను, రేవంత్ రెడ్డిని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులేవి? అని ప్రశ్నించారు. హామీలిచ్చి మోసం చేయడంలో రేవంత్ రెడ్డి రికార్డు సృష్టిస్తున్నాడని ఎద్దేవా చేశారు.

Also Read: Schools Holiday: విద్యార్థులకు పండగ మీద పండుగ.. మార్చిలో మొత్తం 13 సెలవులు

ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సహకాన్ని ఇస్తానంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏకగ్రీవమైన పీచుపల్లి, విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీలకు తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సహక నిధులు విడుదల చేశారు. గ్రామస్తుల సమక్షంలో నిధులకు సంబంధించి ప్రతులను సర్పంచ్‌లకు అందజేశారు.

Also Read: Sharadha Peetham Lands: శారద పీఠం భూముల వివాదంపై తెలంగాణ మంత్రి వివరణ ఇదే!

అనంతరం విజయనగర్ కాలనీ గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రసంగం చేశారు. భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తానని ప్రకటించారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని.. వీటితోపాటు ప్రజల కోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నగదు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన 1,203 గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.120.30 కోట్లు ఇవ్వాలని కోరారు. పంచాయతీ ఎన్నికలు ముగిసినా రేవంత్‌ రెడ్డి ఇంతవరకు నయాపైసా ఇయ్యలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు.

Also Read: TTD: బీఆర్ నాయుడు కాదు కామనాయుడు.. వెంటనే రాజీనామా చేయాలి: టీటీడీ మాజీ చైర్మన్‌

హామీలిచ్చి మోసం చేయడంలో రేవంత్ రెడ్డి అందరినీ మించిపోయాడని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. ప్రోత్సాహక నిధులు ఎందుకు ఇవ్వడం లేదనే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి రేవంత్‌ రెడ్డి చిల్లీగవ్వ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్‌లు చేసిన పనులకు బిల్లులివ్వాలని తిరిగి తిరిగి ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు

మాజీ సర్పంచుల బిల్లులతోపాటు గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రం ఇప్పటి వరకు పంచాయతీల అభివృద్ధి కోసం దశల వారీగా దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా నిధులు మంజూరు చేసిందని వెల్లడించా. ఆ నిధులతో కాస్తో కూస్తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

LSG vs RCB: ఐపీఎల్‌ 2026లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు జోరు.. లక్నో బేజారు

Bengaluru, Karnataka:

RCB Beat LSG By 5 Wickets: డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌ 2026లో ఆధిపత్యం చలాయిస్తోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బెంగళూరు జోరు కనపడుతోంది. లక్నో సూపర్‌ జియాంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విజయం సాధించి మొత్తం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి లక్నోను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: KTR On Delimitation: దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గితే ఊరుకోం.. పోరాటం చేస్తాం: కేటీఆర్‌

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌ జియాంట్స్‌ నిర్ణీత 20 ఓవర్లకు 146 పరుగులు చేసి ఆలౌటైంది. ఏ ఒక్క బ్యాటర్‌ కూడా భారీ స్కోర్‌ సాధించలేకపోవడంతో తక్కువ స్కోర్‌కు పరిమితమైంది. బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి పరుగులు నియంత్రించడమే కాకుండా వికెట్లన్నింటిని తీసేశారు. తక్కువ లక్ష్యాన్ని బెంగళూరు బ్యాటర్లు 15.1 ఓవర్‌లలో 5 వికెట్లు కోల్పోయి సాధించారు. విరాట్‌ కోహ్లీ అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. తక్కువ స్కోర్‌ను లక్నో బౌలర్లు ఏమాత్రం కాపాడలేకపోయారు.

Also Read: Raghav Chadha In To BJP: వదులుకుంటున్న ఆమ్‌ ఆద్మీ.. రాఘవ్‌ను రా రమ్మంటున్న బీజేపీ

లక్నో తరఫున మిచెల్‌ మార్ష్‌ 32 బంతుల్లో 40 పరుగులు చేయగా.. మార్‌క్రమ్‌ (12), కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (1), అబ్దుల్‌ సమద్‌ (0), జార్జ్‌ లిండే (7), మహ్మద్‌ షమీ (0), అవేశ్ ఖాన్‌ (1) ఇలా అందరూ అతి తక్కువ స్కోర్‌ నమోదు చేశారు. ఆయూశ్‌ బదౌనీ 24 బంతుల్లో 38 పరుగులతో రాణించగా.. ముకుల్‌ చౌదరి మరోసారి తన బ్యాట్‌తో సత్తా చాటాడు. 28 బంతుల్లో 39 పరుగులు సాధించి ప్రత్యర్థికి గౌరవ ప్రదమైన లక్ష్యం ఇచ్చాడు. బెంగళూరు బౌలర్లు మ్యాజిక్‌ చేశారు. లక్నో బ్యాటర్లను ఏమాత్రం ఆడకుండా చేసి తక్కువ స్కోర్‌కు పరిమితం చేశారు. రసిక్‌ సలామ్‌ 4 వికెట్లతో లక్నో నడ్డి విరవగా.. సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతమైన బంతులతో మూడు వికెట్లు తీశాడు. కృనాల్‌ పాండ్యా రెండు, జోష్‌ హేజిల్‌వుడ్‌ ఒక వికెట్‌ తీశాడు.

Also Read: Bike Stunts: నిబంధనలు బేఖాతర్‌.. ఔటర్‌ రింగురోడ్డుపై ప్రేమజంటల హల్‌చల్‌

తక్కువ లక్ష్యాన్ని బెంగళూరు పది ఓవర్లకు పూర్తి చేస్తుందని భావించగా.. కొంత గట్టిగానే పోరాడాల్సి వచ్చింది. ఫిల్‌ సాల్ట్‌ 7 పరుగులకే పరిమితమవగా.. విరాట్‌ కోహ్లీ మరోసారి బ్యాట్‌తో సత్తా చాటాడు. 34 బంతుల్లో 49 పరుగులు చేసి అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఔటయ్యాడు. ఆరు ఫోర్లు బాదగా.. ఒక సిక్సర్‌ నమోదు చేశాడు. దేవదత్‌ పడిక్కల్ తక్కువ స్కోర్‌ (10) చేయగా.. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (27), జితేశ్‌ శర్మ (23) పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. టిమ్‌ డేవిడ్‌, రొమారియా షెఫర్డ్‌ సమాన స్కోర్‌ (14) నమోదు చేసి విజయం అందించారు. తక్కువ స్కోర్‌ను కాపాడేందుకు లక్నో బౌలర్లు ఏమాత్రం శ్రమించలేదు. మొదట దూకుడుగా కనిపించినా బెంగళూరు బ్యాటర్ల ధాటికి అది ఏమాత్రం సరిపోలేదు. అయినా కూడా ప్రి్స్‌ యాదవ్‌ అద్భుతమైన 3 వికెట్లు తీయగా.. అవేశ్‌ ఖాన్‌ దూకుడు మీద ఉన్న కోహ్లీతోపాటు మరొకరిని ఔట్‌ చేశాడు.

ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఒక ఓటమితో బెంగళూరు అగ్రస్థానంలోకి దూసుకెళ్లగా.. ఓటమితో లక్నో 3 ఓటములు, రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి ఉనంచి నాలుగో స్థానానికి పరిమితమైంది. రేపు ముంబై, పంజాబ్‌ మధ్య కీలక పోరు నడవనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

KTR On Delimitation: దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గితే ఊరుకోం.. పోరాటం చేస్తాం: కేటీఆర్‌

Hyderabad, Telangana:

BRS Party On Delimitation: డిలిమిటేషన్‌లో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోమని కేంద్ర ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి ఒక హైబ్రిడ్ ముఖ్యమంత్రి.. రేవంత్ రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదని విమర్శించారు. ఉదయం ఆయన కాంగ్రెస్‌ను ప్రతినిధిగా ఉంటారు.. సాయంత్రానికి బీజేపీతో కలిసిపోతారని ఆరోపించారు. హైబ్రిడ్ విధానం రేవంత్‌ రెడ్డి పాలనలో కూడా కనిపిస్తోంది. 

Also Read: Raghav Chadha In To BJP: వదులుకుంటున్న ఆమ్‌ ఆద్మీ.. రాఘవ్‌ను రా రమ్మంటున్న బీజేపీ

ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల పెంపుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులో ఉన్న అస్పష్టతలపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 'దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్ల శాతం 24 శాతంగానే కొనసాగాలి. దీనిని మార్చే ప్రయత్నం చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయాల మీద కాకుండా, పాలన, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి' అని కేటీఆర్‌ కోరారు.

Also Read: Delimitation Protest: దక్షిణాదికి అన్యాయం జరిగితే కేసీఆర్‌ ఆధ్వర్యంలో భారీ ఉద్యమం: కేటీఆర్‌

'మహిళా రిజర్వేషన్ బిల్లుకు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ మొదటి నుంచి చిత్తశుద్ధితో సంపూర్ణ మద్దతు ఇస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారత కోసం అనేక చర్యలు అమలు చేసిన రికార్డు మాకు ఉంది అని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడమే కాకుండా అసెంబ్లీ, శాసనమండలి‌లో ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేసిందని వెల్లడించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, మార్కెట్ కమిటీల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి కేసీఆర్‌ మహిళా సాధికారతపై అచంచలమైన నిబద్ధతను చాటుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Also Read: Bike Stunts: నిబంధనలు బేఖాతర్‌.. ఔటర్‌ రింగురోడ్డుపై ప్రేమజంటల హల్‌చల్‌

మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణలతో అనవసరంగా ముడిపెట్టడాన్ని కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అత్యంత సరళమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సంక్లిష్టం చేస్తోందని ప్రశ్నించారు. సీట్ల పెంపు, పునర్విభజనతో ముడిపెట్టి ఎందుకు అయోమయాన్ని సృష్టిస్తున్నారు? నిలదీశారు. రాజ్యాంగ విధివిధానాల ప్రకారం మొదట జనగణన, తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, ఆ తర్వాతే నిర్మాణాత్మక మార్పులు జరగాలని గుర్తుచేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగని ఏ సహేతుకమైన ప్రతిపాదనకైనా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కానీ దక్షిణాదికి అన్యాయం చేసే ప్రయత్నం జరిగితే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే ఆందోళనలు చేపడతామని మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు.

రేవంత్ రెడ్డిని హైబ్రిడ్ ముఖ్యమంత్రిగా మాజీ మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. 'రేవంత్ రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదు. ఉదయం ఆయన కాంగ్రెస్‌ను ప్రతినిధిగా ఉంటారు. సాయంత్రానికి బీజేపీతో కలిసిపోతారు. సహజంగానే ఇలాంటి హైబ్రిడ్ విధానం ఆయన పాలనలో కూడా కనిపిస్తోంది. ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారు'  అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇతరుల నుంచి నిబంధనలు కోరుతున్న రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదన విషయంలో జీహెచ్‌ఎంసీ ప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు లేదా ఎమ్మెల్యేలను ఎందుకు సంప్రదించలేదు' అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 

50 శాతం సీట్లు పెరుగుతాయని కేంద్ర నాయకులు చెబుతున్నా బిల్లులో మాత్రం ఎక్కడా ఆ ప్రస్తావన లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 1971లో పార్లమెంటు సీట్లపై విధించిన స్తంభన జనాభా నియంత్రణ ప్రాతిపదికన జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ ఆందోళనలను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Raghav Chadha In To BJP: వదులుకుంటున్న ఆమ్‌ ఆద్మీ.. రాఘవ్‌ను రా రమ్మంటున్న బీజేపీ

New Delhi, Delhi:

Raghav Chadha Touch With BJP: సామాన్యుల సమస్యలపై పార్లమెంట్‌లో నిలదీస్తూ కొన్ని రోజులుగా వైరల్‌గా మారిన ఎంపీ రాఘవ్‌ చద్దాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సొంత పార్టీ ఆమ్‌ ఆద్మీ అతడిని దూరం చేసుకుంటోంది. ఇప్పటికే పార్లమెంట్‌లో పార్టీ తరఫున అతడి పదవి తొలగించగా.. తాజాగా అతడి వ్యక్తిగత భద్రతను కుదించింది. సొంత పార్టీ వదులుకునేందుకు ప్రయత్నిస్తుండగా రాఘవ్‌ చద్దాకు బీజేపీ అండగా నిలుస్తోంది. పంజాబ్‌ ప్రభుత్వం తొలగించిన భద్రతను తాము పునరుద్ధరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాఘవ్‌ బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు.

Also Read: Delimitation Protest: దక్షిణాదికి అన్యాయం జరిగితే కేసీఆర్‌ ఆధ్వర్యంలో భారీ ఉద్యమం: కేటీఆర్‌

పంజాబ్‌ నుంచి రాజ్యసభకు ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున రాఘవ్‌ చద్దా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆమ్‌ ఆద్మీ పార్టీలో అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా తదితర టాప్‌ 10 లీడర్‌లలో ఒకడిగా రాఘవ్‌ ఉన్నాడు. అలాంటి రాఘవ్‌ చద్దాకు పార్టీకి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని.. అరవింద్‌ కేజ్రీవాల్‌తో రాఘవ్‌ విభేదిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ పక్కనపెడితే ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో రాఘవ్‌ సామాన్యుల సమస్యలపై నిలదీస్తున్నాడు. ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలను చట్టసభలో ప్రస్తావిస్తుండడంతో ప్రజలందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా రాఘవ్‌ పేరు మార్మోగింది. సోషల్‌ మీడియాలో కూడా రాఘవ్‌ చద్దాకు విశేష ప్రాచుర్యం లభించింది.

Also Read: Bike Stunts: నిబంధనలు బేఖాతర్‌.. ఔటర్‌ రింగురోడ్డుపై ప్రేమజంటల హల్‌చల్‌

పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై నిలదీస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడిస్తుండగా అతడికి ప్రమోషన్‌ ఇవ్వాల్సి ఉండగా ఆమ్‌ ఆద్మీ పార్టీ మాత్రం అతడికి ఉన్న పదవి పీకేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్‌ పదవి నుంచి రాఘవ్‌ను తొలగించింది. ఇప్పుడు పంజాబ్‌ ప్రభుత్వం జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రతను తొలగించింది. ఇది జరిగిన కొన్ని నిమిషాలకే వెంటనే కేంద్ర హోం శాఖ స్పందించి జెడ్‌ కేటగిరి భద్రత మంజూరు చేసింది. జెడ్‌ కేటగిరి భద్రత కల్పించే వరకు వెంటనే రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు ఇచ్చింది.

Also Read: Nari Shakti Vandan: నారీ శక్తి వందనంపై జగన్‌, షర్మిలతో సహా అన్నీ పార్టీ అధ్యక్షులకు చంద్రబాబు లేఖ!

ఇంటలిజెన్స్‌ బ్యూరో సూచనల మేరకు కేంద్ర హోం శాఖ భద్రత కల్పించడంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు స్పందించారు. వరుస పరిణామాల నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ వదులుకుంటుండడంతో రాఘవ్‌ చద్దాను చేర్చుకోవాలని బీజేపీలో భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'బీజేపీ అగ్ర నాయకులతో రాఘవ్‌ సమావేశమయ్యాడు' అని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రతినిధి ప్రియాంక కక్కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా వచ్చిన అశోక్‌ మిట్టల్‌పై దాడులు చేయాలని నిర్ణయించుకోవడం దురదృష్టకరం అని తెలిపారు. రాజ్యసభకు అరవింద్‌ కేజ్రీవాల్‌ పంపిన విషయం గుర్తుంచుకోవాలని రాఘవ్‌ చద్దాకు ఆమె హితవు పలికారు.

వరుస పరిణామాలు చూస్తుంటే రాఘవ్‌ చద్దాను పొమ్మనలేక పొగబెడుతున్నట్లు అర్థమవుతోంది. త్వరలోనే అతడిపై వేటు వేసే అవకాశం కూడా లేకపోలేదు. ఆప్‌ వదులుకుంటుండగా బీజేపీ తలుపులు తెరుస్తోంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే రాఘవ్‌ కాషాయ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో? ఈ పరిణామాలు ఎక్కడకు దారి తీస్తాయో వేచి చూడాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Maharashtra Exploitation: 350 అశ్లీల వీడియోలు..180 మంది మైనర్ బాలికలతో శృంగారం..కేటుగాడు అరెస్టు!

Badapur, Maharashtra:

Maharashtra Exploitation Case: మహారాష్ట్రలో ఘోరమైన ఘటన బయటపడింది. మహమ్మద్ అయాజ్ అనే నిందితుడు సుమారు 180 మంది మైనర్ బాలికలను ప్రేమ పేరుతో ట్రాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి. వారిని ప్రేమ పేరుతో లొంగదీసుకొని లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడని తేలింది. అంతే కాకుండా వారికి సంబంధించిన 350 ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసులు సదరు నిందితుడ్ని అరెస్టు చేశారు. ఆ మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి మహారాష్ట్రలోని అమరావతి నుంచి ముంబై, పూణె నగరాలను తీసుకెళ్లి వారి అశ్లీల వీడియోలను చిత్రీకరించినట్లు అభియోగాలు ఉన్నాయి. 

అదే రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ ఎంపీ ఫిర్యాదు మేరకు పోలీసులు తక్షణ చర్య తీసుకుని సదరు నిందితుడు మహమ్మద్ అయాజ్ ను అరెస్టు చేశారు. పరాత్వడ నగర నివాసి అయిన మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్.. మైనర్ బాలికలను 'ప్రేమ వల'లోకి లాగి, వారిని ముంబై, పూణేలకు తీసుకెళ్లి.. వారి అశ్లీల వీడియోలను చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియోలతో బాలికలను బ్లాక్‌మెయిల్ చేయడంతో పాటు వారిని వ్యభిచారంలోకి బలవంతంగా నెట్టడానికి ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

రాజ్యసభ ఎంపీ అనిల్ బోండే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) విశాల్ ఆనంద్‌కు సమర్పించిన ఒక ఫిర్యాదు ప్రకారం.. వాట్సాప్, స్నాప్‌చాట్ గ్రూపుల ద్వారా మైనర్ బాలికలపై ఓ పథకం ప్రకారం వారితో చనువుగా ఉంటూ.. వారినే లక్ష్యంగా చేసుకొని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయకపోతే, బుధవారం ఉదయం ఎస్పీ కార్యాలయం ముందు నిరసనలు చేపడతామని బోండే హెచ్చరించారు.

నిందుతుడు మహ్మద్ అయాజ్ గతంలో ఏఐఎంఐఎం (AIMIM)లో ఆఫీస్ బేరర్‌గా పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి. అతను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు, ఫోటోల ఆధారంగా అతను ఎంఐఎం (MIM) అమరావతి అధ్యక్షుడు హాజీ ఇర్ఫాన్ ఖాన్ నుండి ఒక లేఖను అందుకుంటున్నట్లు, పార్టీ ర్యాలీలలో సోషల్ మీడియా 'రీల్స్' రికార్డ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. అయితే ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి అలాంటి అనేక వీడియోలు డిలీట్ చేశారు. అయితే నిందితుడు ఇంటిపై బుల్‌డోజర్‌తో అధికారులు ఇంటిని కూలగొట్టారు.

ఈ కేసులో వేగంగా స్పందించిన పోలీసులు.. అయాజ్‌ను అరెస్టు చేసి ఈరోజు (బుధవారం) కోర్టులో హాజరుపరిచారు. అతనికి ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీ విధించారు. పోలీసులు అతని మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆ ఫోన్‌లో అనేక అభ్యంతరకరమైన వీడియోలు ఉన్నాయి. నిందితుడు ఆ వీడియోలను తన స్నేహితులతో లేదా ఏదైనా నేర ముఠాతో పంచుకున్నాడా అనే విషయంపై పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ సెల్ సహాయంతో, ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వీడియోలపై కూడా విచారణ చేయనున్నారు.

Also Read:  8th Pay Commission Fitment: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..జీతంపై 3.8 శాతం పెంపు..నెలకు కనీసం రూ.69,000 జీతం!

Also Read: Standup Comedian Arrest: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కామెడీ చేసిన వ్యక్తి అరెస్టు..ఉత్తరప్రదేశ్‌లో వెంటాడి మరీ అరెస్టు చేసిన ఏపీ పోలీసులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Weather Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మధ్యాహ్నం 11 నుంచి 4 వరకు బయటకు రావద్దు!

Hyderabad, Telangana:

Telangana Weather Alert Telugu: కొద్దిరోజుల నుంచి భానుడు భగభగమంటున్నాడు.. ఇప్పటికే ఎండ వేడితో అల్లాడుతున్న ఉత్తర తెలంగాణ ప్రజలకు జగిత్యాల జిల్లా పొలాస లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (AMFU) ప్రమాద సంకేతాలను జారీ చేసింది.. రాబోయే ఐదు రోజులపాటు ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని.. వడగాల్పుల ప్రభావం కూడా తీవ్రంగా ఉందని హెచ్చరించింది.. అయితే వీటి ప్రభావం ఏయే జిల్లాలపై ఉండబోతుందో? ప్రభావితమయ్యే ప్రాంతాలేవో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 19 వరకు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కాబోతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్ తో పాటు నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దపల్లి కరీంనగర్ జగిత్యాలలో థర్మల్ సూచి 45 డిగ్రీలు దాటే అవకాశాలు ఉన్నాయని పరిశోధన కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే దాదాపు మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు..

టెక్నికల్ ఆఫీసర్ శ్రీలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే ఐదు రోజులపాటు వాతావరణం అత్యంత పొడిగా ఉంటుందని.. ఈ సందర్భంగా ప్రజలంతా తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆమె తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప వృద్ధులతో పాటు పిల్లలు గర్భిణీలు బయటికి రావద్దని ఆమె సూచించారు.. బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా గొడుగు పట్టుకుని వెళ్లాలని తెలిపారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా మజ్జిగ లేదా కొబ్బరినీళ్లు నిమ్మరసం మట్టి పానీయాలు తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు.

వేడి గాలుల ప్రభావం పంటపై కూడా పడే అవకాశం ఉందని.. ఈ సమయంలో ఆరతడి పంటలకు సాయంత్రం లేదా ఉదయం వేళల్లో నీటి తడులు అందించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పశువులను ఎండలో మేతకు పంపకుండా.. నీడలో ఉన్న ప్రదేశాల్లో ఉంచి సరిపడా త్రాగునీటిని అందించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయా జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. వడదెబ్బకు గురైన వారికి తక్షణ చికిత్స అందేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధం చేయాలని ఆదేశించింది.

Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్‌తోనే దేవుడికి హారతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Standup Comedian Arrest: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కామెడీ చేసిన వ్యక్తి అరెస్టు..ఉత్తరప్రదేశ్‌లో వెంటాడి మరీ అరెస్టు చేసిన ఏపీ పోలీసులు!

Vijayawada, Andhra Pradesh:

Standup Comedian Anudeep Arrest: టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఏపీ రాజకీయ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. ఏప్రిల్ 14 నాడు ఏపీ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇటీవలే యూట్యూబ్‌లో విడుదలైన 'టాలీవుడ్ రోస్ట్ షో' ద్వారా స్టాండప్ కమెడీయన్ అనుదీప్ కటికాల అసభ్యకరమైన కామెంట్స్ చేసినట్లు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. 

ఆ వీడియోలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా హీరో రామ్ చరణ్, కొణిదెల నిహారిక, నందమూరి బాలకృష్ణ వంటి సెలబ్రిటీలపై వ్యక్తిగతంగా అసభ్యకరమైన కామెంట్స్ చేయడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీసింది. జనసేన అభిమానులు, మెగా ఫ్యాన్స్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు స్టాండప్ కమెడియన్‌ పరారీలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడు ఉత్తరప్రదేశ్‌లో తలదాచుకున్నాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకొని.. సోమవారం ప్రయాగ్ రాజ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

కామెడీ, వినోదం పేరుతో సమాజంలోని కొందరు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చేయడం.. వారి వ్యక్తిగత జీవితాల గురించి అసభ్యంగా ప్రస్తావించడం వంటి ఆరోపణల నేపథ్యంలో అనుదీప్ కటికాలను అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో పలువురు ప్రముఖుల ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చట్టపరమైన పరిణామాలు ఎలా ఉంటాయనే దానికి ఈ ఘటన మరోసారి నిరూపితమైంది.

వైరల్ అయిన వీడియో ప్రకారం..స్టాండప్ కమెడియన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నిహారిక విడాకుల వ్యవహారాన్ని వ్యంగ్యంగా మాట్లాడడం సహా నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌లను వెటకారంగా కించపరిచేలా అనుదీప్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తేలింది. ఈ వీడియో పట్ల ఇరు తెలుగు రాష్ట్రాల్లో తమ అభిమానులు నిరసనలు తెలపడం సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో దిగొచ్చిన అనుదీప్.. ఓ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పాడు. అయితే అంతటితో ఆగని మెగా, నందమూరి అభిమానులు అతడ్ని అరెస్టు చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఆ వెంటనే కమెడియన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఫ్యాన్స్ కు బయపడి తన మొబైల్‌ను స్విచ్ ఆఫ్ కూడా చేసుకున్నాడు. పరారైన అనుదీప్ తనను క్షమించండి అంటూ ఓ వీడియో ద్వారా వేడుకున్నాడు. అయితే అప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అతడు ఉత్తరప్రదేశ్‌లోని ఓ పార్కులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అనుదీప్‌ను కాకినాడ పోలీసులు అరెస్టు చేశారు. 

Also Read: 8th Pay Commission Fitment: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..జీతంపై 3.8 శాతం పెంపు..నెలకు కనీసం రూ.69,000 జీతం!

Also Read: Gold Reserves In World: రూ.3,418 లక్షల కోట్ల బంగారం..బయటకు తీస్తే అందరూ ధనవంతులే! ఎక్కడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Quick Commerce Scam: సన్‌ఫ్లవర్ ఆయిల్ డబ్బాలో రంగు నీళ్లు.. క్విక్ కామర్స్ యాప్స్ ఘోరమైన మోసం!

Hyderabad, Telangana:

Shocking Quick Commerce Scam: నిత్యవసర వస్తువుల నుంచి ఆహార పదార్థాల వరకు అన్ని అరచేతిలో వచ్చేస్తున్న కాలమిది.. అయితే, ఈ సౌలభ్యం వెనక కొన్ని చేదు నిజాలు వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ప్రముఖ్ క్విక్ కామర్స్ యాపుల ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులలో నాణ్యత లోభించడం మాత్రమే కాకుండా.. ఏకంగా వస్తువులని మార్చేసి పంపిస్తున్న ఘటనలు నగరంలో సంచలనం రేపుతున్నాయి. తాజాగా బోడుప్పల్ తో పాటు మెహదీపట్నం ప్రాంతంలో వెలుగు చూసిన ఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఎప్పుడు తెలుసుకుందాం..

బోడుప్పల్‌కు చెందిన శరత్ అనే వ్యక్తి నిత్యవసరాల కోసం ఓ క్విక్ కామర్స్ యాప్‌లో ఐదు లీటర్ల ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ క్యాన్‌ను ఆర్డర్ చేశారు. డెలివరీ అయిన ప్యాకింగ్‌ను తెరిచి చూసిన ఆయన ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ క్యాన్లు నూనెకు బదులుగా రంగు కలిపిన నీటిని పోసారు. అవును మీరు చదువుతుంది నిజమే.. నూనె రంగులో ఉన్న నీటిని నింపి అతనికి డెలివరీ చేశారు.  ఇది చూసిన ఆయన ఒక్కసారిగా షాక్ అయిపోయాడు..

ఈ మోసంపై వెంటనే ఆ యాప్ కు సంబంధించిన కస్టమర్ కేర్‌ను సంప్రదించగా.. వారి నుంచి సరైన స్పందన లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన డబ్బును రిఫండ్ చేయాలని లేదా సరైన వస్తువులను పంపాలని కోరిన ఫలితం లేకపోవడంతో.. ఆయన వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారట.. రూ.800 పైగా చెల్లించి ఆర్డర్ చేస్తే.. ఇలాంటి మోసం జరుగుతుందని ఊహించలేదని శరత్ పేర్కొన్నారు..

మరో ఘటన మెహదీపట్నంలో చోటుచేసుకుంది.. ఒక మహిళ మరో క్విక్ కామర్స్ యాప్ ద్వారా తాజా చేపలను ఆర్డర్ పెట్టారు. తీరా డెలివరీ ఇంటికి వచ్చాక చూస్తే.. అవి పూర్తిగా కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్నాయి. తినే ఆహార పదార్థాల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలు.. సదరు యాప్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు..

Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్‌తోనే దేవుడికి హారతి!

ఆన్లైన్ డెలివరీలో ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తూ వస్తున్నారు. ఏదైనా ఖరీదైన వస్తువు లేదా ఆహార పదార్థాలు డెలివరీ అయినప్పుడు ప్యాకింగ్ విప్పేటప్పుడు వీడియో తీయడం చాలా మంచిది. ఆర్డర్ ఐడితో పాటు ఇన్వాయిస్ కాపీని జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. కంపెనీ స్పందించకుంటే వెంటనే 1915 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు కూడా చేయొచ్చు. వరస ఘటనలో నేపథ్యంలో ఆన్లైన్ డెలివరీ ప్లాట్ ఫామ్ లు తమ ప్యాకింగ్ తో పాటు వెండర్ నాణ్యత పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తూ ఉన్నారు.

Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్‌తోనే దేవుడికి హారతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Drone Crashes: పర్షియన్ గల్ఫ్‌లో అమెరికాకు భారీ షాక్.. రూ. 2,200 కోట్ల డ్రోన్ గల్లంతు!

Hyderabad, Telangana:

US Military Drone Crashes Telugu: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తత మరోసారి పదాక స్థాయికి చేరిందని భావించవచ్చు.. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన  సెక్యూరిటీ డ్రోన్లలో ఒకటిగా చెప్పుకునే అమెరికన్‌కు చెందిన MQ-4C ట్రైటాన్ (MQ-4C Triton) డ్రోన్ గల్లంతైనట్లు అగ్రరాజ్యం అధికారికంగా ధ్రువీకరించింది. ఈనెల తొమ్మిదో తేదీన అంతర్జాతీయ గగన తలంలో నిఘా నిఘా నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అసలు ఈ డ్రోన్లు ఎక్కడికి వెళ్లాయి? ఎలా మాయమయ్యాయి? దీనికి గల కారణాలేంటి? మనం ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..

వివిధ అంతర్జాతీయ వార్తా కథనాల ప్రకారం..  ఈ భారీ అన్-మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ (UAV) పర్షియన్ గల్ఫ్‌లోని హార్ముజ్ జలసంధి సమీపంలో గగనతల నిఘాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో అకస్మాత్తుగా రాడార్ తో సంబంధాలు తెగిపోయాయని. అనంతరం అది సముద్రంలో కూలిపోయిందని అమెరికా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీని విలువ భారత కరెన్సీలో సుమారు 2 200 కోట్లు ఉంటుందని అంచనా.. అసలు ఇలా కూలిపోవడానికి అసలు కారణాలు ఏవై ఉంటాయో తెలుసా? ఇది తెలుసుకున్న చాలామంది నిపుణులు ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది..

MQ-4C ట్రైటాన్ ప్రత్యేకత తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈ డ్రోన్లు సాధారణమైన వాటికంటే చాలా శక్తివంతమైనవి. ఇది అమెరికా నౌకాదళం కోసం ప్రత్యేకంగా రూపొందించిన నిఘవ్యవస్థగా చెప్పుకుంటారు. ఇది సముద్ర మట్టానికి 55 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిరంతరాయంగా 24 గంటల పాటు ఎగర గలిగే ప్రత్యేకమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వేల మహిళ పరిధిలో సముద్ర ప్రాంతాన్ని, ఓడల కదలికలను అత్యంత స్పష్టంగా చిత్రీకరించగలిగే కెమెరాలతో పాటు ప్రత్యేకమైన సెన్సార్లు కూడా ఇందులో ఉంటాయి. దీని రెక్కల విస్తీర్ణం దాదాపు బోయింగ్ 737 విమానంతో సమానంగా ఉంటుంది.

Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్‌తోనే దేవుడికి హారతి!

ఈ డ్రోన్ కూలిపోవడానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. సాంకేతిక లోపం వల్ల కూలిందా లేదా ప్రత్యర్థి దేశాలు ఏవైనా క్షిపని దాడులు చేశాయా అన్న కోణంలో అమెరికా దర్యాప్తు చేస్తోంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఇరాన్ దళాలు అమెరికా డ్రోన్లను కూల్చివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజా ఘటన గల్ఫ్ దేశాల్లో యుద్ధమేఘాలను కమ్ముకునేలా చేస్తోంది. ప్రస్తుతం కూలిన డ్రోన్ శకలాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో అరేబియా మహాసముద్రంతో పాటు పార్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా తన నౌకదలాన్ని మరింత అప్రమత్తం చేసింది.

Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్‌తోనే దేవుడికి హారతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

8th Pay Commission Fitment: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..జీతంపై 3.8 శాతం పెంపు..నెలకు కనీసం రూ.69,000 జీతం!

Hyderabad, Telangana:

8th Pay Commission Fitment Factor: దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో.. 8వ వేతన సంఘం కోసం కనీస మూల వేతనాన్ని రూ.69,000గా ఉండాలని ఉద్యోగ సంఘం NC-JCM ప్రతిపాదించింది. ద్రవ్యోల్బణం నేపథ్యంలో నానాటికి పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆర్థిక సహాయం కోసం అధిక ఇంక్రిమెంట్లు, వేతన పునర్‌వ్యవస్థీకరణ, హెచ్‌ఆర్‌ఏ (HRA)ను సర్దుబాటు చేయడం వంటి సిఫార్సులను ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. 

జాతీయ మండలి-JCM స్టాఫ్ సైడ్ సంఘం చేసిన ప్రతిపాదన ప్రకారం.. 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో కనీస మూల వేతనాన్ని రూ.69,000గా ప్రతిపాదిస్తూ 8వ వేతన సంఘానికి 51 పేజీల మెమోరాండంను సమర్పించింది. CNBC-TV18 ఇచ్చిన నివేదిక ప్రకారం.. 7వ వేతన సంఘం సిఫార్సులు రూ.18,000 వేతన పెంపునకు సంబంధించినవి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల మధ్య 50 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాలను మెరుగుపరచడమే ఈ సిఫార్సుల లక్ష్యంగా మారనున్నాయి.

అంతేకాకుండా.. వార్షిక ఇంక్రిమెంట్ రేటును ప్రస్తుతమున్న 3 శాతం నుండి 6 శాతానికి రెట్టింపు చేయడం వెనుకున్న ప్రాముఖ్యత, అవసరాన్ని ఈ మెమోరాండం చర్చించనుంది. అధిక ఇంక్రిమెంట్ ద్రవ్యోల్బణం.. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయాలను మరింత మెరుగ్గా ప్రతిబింబిస్తుందని ఇందులో వాదన ఉంది.

HRA సవరణ ప్రతిపాదన
NC-JCM హౌస్ రెంట్ అలవెన్స్ (HRA)లో కూడా పెంపును ప్రతిపాదించింది. దాని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. X నగరాలకు 40 శాతం.. Y నగరానికి 35 శాతం.. Z నగరానికి 30 శాతంగా పెంపును ప్రతిపాదించారు. ఆటోమేటిక్ ద్రవ్యోల్బణ సర్దుబాట్ల కోసం హెచ్‌ఆర్‌ఏను కరువు భత్యానికి అనుసంధానించాలని, అదనంగా ప్రతి ఐదేళ్లకు నగర వర్గీకరణ సమీక్షలు చేయాలని ఇది సిఫార్సు చేస్తుంది.

భత్యాలు, వేతన సమానత్వం
నిర్దేశిత అర్హతల కంటే అదనపు అర్హతలు కలిగిన వారికి 10 శాతం అదనపు వేతనంతో పాటు కార్మిక చట్టాల ప్రకారం ఓవర్‌టైమ్ పనికి రెట్టింపు రేటుతో వేతన సదుపాయాన్ని కల్పించాలి. అలాగే వైద్యం, రక్షణ, ప్రయోగశాలల వంటి అధిక ప్రమాదం ఉండే విభాగాల్లో పనిచేసేవారికి మెరుగైన వేతనం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. వేతన శ్రేణులను న్యాయబద్ధత (equity) ఆధారంగా పునర్వ్యవస్థీకరించారు. ఇందులో కనీస-గరిష్ట వేతన నిష్పత్తిని 1:12 వద్ద పరిమితం చేయడం ద్వారా, ఉద్యోగ ప్రమాణాలను, ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ALso REad: Gold Reserves In World: రూ.3,418 లక్షల కోట్ల బంగారం..బయటకు తీస్తే అందరూ ధనవంతులే! ఎక్కడంటే?

Also Read: Viral Pool Video: భర్త లేనప్పుడు ప్రియుడితో రొమాన్స్..స్విమ్మింగ్‌ పూల్‌లో ఏకంతంగా..సడెన్‌గా భర్త ఎంట్రీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Delimitation Protest: దక్షిణాదికి అన్యాయం జరిగితే కేసీఆర్‌ ఆధ్వర్యంలో భారీ ఉద్యమం: కేటీఆర్‌

Hyderabad, Telangana:

KCR Delimitation: 'దేశంలో మరో కొత్త కుట్ర జరుగుతుంది. లోక్‌సభ, శాసనసభ సీట్లు పెంపుపై కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఒక్కటి చేసేది ఒక్కటి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే ఉన్నది. అయిన దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేము స్థానికంగా ఉన్న మార్కెట్ కమిటీలలో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. మేము శాసన సభలో కూడా తీర్మానం చేశారు. ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు డిలిమిటేషన్‌లో అన్యాయం జరిగితే కేసీఆర్ అధ్యర్యంలో పోరాటం చేస్తాం. కేసీఆర్ స్వయంగా నాయకత్వం వహిస్తారు' అని ప్రకటించారు.

Also Read: Bike Stunts: నిబంధనలు బేఖాతర్‌.. ఔటర్‌ రింగురోడ్డుపై ప్రేమజంటల హల్‌చల్‌

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడలో కాంగ్రెస్‌ నాయకులు భారీగా బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో గులాబీ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. 'మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మలేదు. ఒక్క సీటు కూడా వాళ్లకు ఇవ్వలేదు. గ్రామాల్లో అమాయక ప్రజలు నమ్మి మోసపోయారు. అత్తకు రూ.4000, కోడలికి రూ.2,500 ఇస్తామన్నారు. ఆషాఢం సేల్ లెక్క అడ్డగోలు హామీలు ఇచ్చుకుంటూ పోయారు. అయ్యా రేవంత్‌ రెడ్డి మీరు ఇస్తామన్న స్కూటీలు ఎక్కడ? మీరు ఇస్తామన్న మహిళలకు రూ.2,500 ఎక్కడ? అని అడిగితే ఎంత కండలు తిరిగిన మొగోడు అయిన మూడు నెలల్లో పిల్లలు పుట్టించరు కదా అంటాడు . అయ్యా రేవంత్‌ రెడ్డి మూడు నెలలు కాలేదు. 30నెలలు అయింది. మరి ముప్పై నెలలు అయినా పుట్టకపోతే ఏం అంటారు?' అని రేవంత్‌ రెడ్డిని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Also Read: Bike Stunts: నిబంధనలు బేఖాతర్‌.. ఔటర్‌ రింగురోడ్డుపై ప్రేమజంటల హల్‌చల్‌

ఆడ పిల్ల పుడితే రూ.13 వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేలు ఇచ్చి తల్లి బిడ్డను ఇంటి దగ్గర దించి వచ్చేలా ఆనాడు మన కేసీఆర్ సంక్షేమ పథకాలు అందించారు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి రెండున్నర యేండ్లు అయింది. అనేక కార్యక్రమాలు రద్దయ్యాయి. హైదరాబాద్‌లో ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే ఇద్దరే ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఒక్కరు దొంగలు, మరొక్కరు దోమలు. నేను అసెంబ్లీలో చెప్పాను దోమలబాద్‌, దోమలగూడ అని పెట్టమని అడిగా' అని గుర్తుచేశారు.

Also Read: Nari Shakti Vandan: నారీ శక్తి వందనంపై జగన్‌, షర్మిలతో సహా అన్నీ పార్టీ అధ్యక్షులకు చంద్రబాబు లేఖ!

'కేసీఆర్‌ను బద్నామ్‌ చేసి అప్పులు పాలు చేసి తప్పించుకునే ఆలోచనలో రేవంత్‌ రెడ్డి ఉన్నారు. తప్పించుకునే పరిస్థితి లేదు, వాళ్లను కచ్చితంగా నిలదీయాలి' అని మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఉప్పల్ ఫ్లైఓవర్ భూమి పుట్టినప్పటి నుంచి నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్. 8 ఏండ్లు అయ్యింది ఎక్కడ పని అక్కడే. మేము కడతాం అంటే లేదు లేదు మేమే కడతాం అన్నారు' అని వెల్లడించారు.

'మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో మూడుకు మూడు క్లిన్ స్వీప్ చేశారు. మళ్లీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో మనమే గెలుస్తాం. ఇక్కడ సెప్టెంబర్‌, అక్టోబర్‌లో ఎన్నికలు అంటున్నారు. వాళ్లను గెలిపిస్తే ఇక్కడకు మళ్లీ బుల్డోజర్ వస్తుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో కత్తి వాడికి ఇచ్చి పోరాటం మనము చేయాలి ఎలా? అందుకే ఈసారి ఎన్నికల్లో మాకు ఓటు వేయండి మీకు మేము అండగా ఉంటామని చెప్పాలి' అని మాజీ మంత్రి కేటీఆర్‌ సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Cobra Video: యముడిలా విరుచుకుపడ్డ 15 అడుగుల కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!

Hyderabad, Telangana:

15 Foot King Cobra Video Watch Here: సోషల్ మీడియాలో ప్రపంచంలో ఎప్పుడు ఏ వీడియో ఎలా వైరల్‌ అవుతుందో చెప్పలేం.. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. తాజాగా అటువంటి కోవకే చెందిన ఒక భారీ కింగ్ కోబ్రా వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సుమారు 15 అడుగుల పొడవున్న అతి ప్రమాదకరమైన నాగుపాము జనావాసాల్లోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురైన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

జనాలు అటు ఇటు తిరుగుతున్న ప్లేస్‌లో అకస్మాత్తుగా 15 అడుగుల భారీ కింగ్ కోబ్రా దర్శనమిచ్చింది. ఆ పాము పరిమాణాన్ని చూసిన జనం భయంతో అటు ఇటు పరుగులు తీయడం ప్రారంభించారు.  సాధారణంగా కింగ్ కోబ్రా వంటి విష సర్పాలు అత్యంత వేగంగా దాడి చేస్తాయని మనందరికీ తెలిసిందే.. ఈ క్రమంలో స్థానికులు వెంటనే అలర్టై అక్కడి నుంచి పరిపోయేందుకు ప్రయత్నించారు. అయితే, అక్కడే ఉన్న కొంతమంది స్నేక్‌ క్యాచర్స్‌కి సమాచారం అందించారు. 

సమాచారం తెలుసుకున్న స్నేక్‌ క్యాచర్‌ వెంటనే రంగంలోకి దిగాడు.. ఎటువంటి భయం లేకుండా.. ఆ పామును బంధించేందుకు సిద్ధమయ్యాడు.. ఆ 15 అడుగుల కింగ్‌ కోబ్రాను ఆ వ్యకిని చూసి ఒక్కసారిగా పడగ విప్పింది. ఈ వీడియోలో చూస్తుంత సేపు.. ఎప్పుడు ఏం అవుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.. ఆ వ్యక్తి ఎంతో చాకచక్యంగా దాని తోకను పట్టుకుని నియంత్రించేందుకు ప్రయత్నించాడు..

ఆ స్నేక్ క్యాచర్ భారీ పామును పట్టుకునే క్రమంలో.. ఆ కింగ్ కోబ్రా ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతనిపైకి దాడి చేసేందుకు వేగంగా అతని వైపు దూసుకు రావడం మీరు చూడొచ్చు.. ఈ సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాలకే ముప్పు వాటిల్లేది.. కానీ, ఆ వ్యక్తి తన నైపుణ్యంతో మెరుపు వేగంతో పక్కకు తప్పించుకోవడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. అతను, మళ్ళీ ఏమాత్రం తడబడకుండా దానిని సురక్షితంగా బంధించి ఒక సంచిలో వేయడం కూడా మీ ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు..

Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్‌తోనే దేవుడికి హారతి!

ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఎక్స్ వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో  విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఇప్పటికీ ఇది మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదిస్తోంది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఇది మామూలు ధైర్యం కాదు, ఆ స్నేక్ క్యాచర్ రియల్ హీరో అంటూ కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. అయితే, ఇలాంటి పాములు వచ్చినప్పుడు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. 

Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్‌తోనే దేవుడికి హారతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Viral Pool Video: భర్త లేనప్పుడు ప్రియుడితో రొమాన్స్..స్విమ్మింగ్‌ పూల్‌లో ఏకంతంగా..సడెన్‌గా భర్త ఎంట్రీ!

Hyderabad, Telangana:

Wife In Pool Viral Video: ఒక మహిళ తన ప్రియుడితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో సరసాలు ఆడుతోంది. ఇంతలో ఆమె భర్త ఇంటికి వచ్చాడు. దీంతో నీటి కింద దాదాపుగా 2.8 నిమిషాల పాటు దాగి ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భర్తకు వాళ్లిద్దరూ పట్టుబడ్డారా? నీటిలో 2 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి బతికే ఉన్నాడా? అనేది తెలియాలంటే ఇప్పుడా వైరల్ అవుతున్న వీడియో చూడాల్సిందే.

ఓ మహిళ తన ప్రియుడితో స్విమ్మింగ్‌ పూల్‌లో ఆనందంగా గడుపుతోంది. ఇంతలో ఆమె భర్త అక్కడికి వచ్చాడు. ఆ మహిళ జిత్తులమారి చర్య ఆమె ప్రియుడి ప్రాణాలను ప్రమాదంలో పడేశాయి. ఆ వ్యక్తి రెండు నిమిషాలకు పైగా నీటిలోపల శ్వాసను బిగపట్టాడు. ఈ ఘటన కెమెరాలో రికార్డ్ అయింది.

వైరల్ అయిన వీడియో ప్రకారం.. ఓ మహిళ తన ప్రియుడితో అక్రమసంబంధం పెట్టుకుంది. ఆ వ్యక్తితో ఆమె స్విమ్మింగ్ పూల్‌లో సరసాలు ఆడుతూ కనిపించింది. భర్తను చీటింగ్ చేస్తున్న ఆ మహిళ, తన ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తుండగా.. ఆమె భర్త సడెన్ ఎంట్రీ ఇచ్చాడు. అతని బారి నుండి తప్పించుకోవడానికి.. ఆమె ప్రియుడు నీటి అడుగును నక్కి ఉన్నాడు. దాదాపు 2 నిమిషాలకు పైగా అతను ఊపిరి తీసుకోకుండా అలాగే ఉన్నాడు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోను @NeverteIImeodd అనే యూజర్ Xలో పోస్ట్ చేశారు. ఆ మహిళ భర్త నుండి తప్పించుకోవడానికి.. తన ప్రియుడు నీటి లోపల 2.8 నిమిషాల పాటు శ్వాసను బిగపట్టాడని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ ఒక పురుషుడితో కలిసి పూల్‌లో సరదాగా గడుపుతూ కనిపిస్తుంది. ఆ స్విమ్మింగ్ పూల్ ఒక ఇంటి లోపల ఉంది. గేటు బయట ఒక రోడ్డు ఉంది. రోడ్డుపై ఒక కారు కనిపిస్తుంది.. దాని నుండి ఒక వ్యక్తి దిగి, గేటు తెరిచి, పూల్ వైపు వస్తాడు. వీడియోలో చేసిన వాదన ప్రకారం, ఈ వ్యక్తి ఆ మహిళ భర్తే. 

ఆ మహిళ తన భర్త కారును చూడగానే, వెంటనే తన ప్రియుడిని నీటిలో దాక్కోమని చెప్పింది. ప్రియుడు వెంటనే తన చేతులతో ముక్కు మూసుకుని నీటిలో కూర్చున్నాడు. అప్పుడు ఆ మహిళ తన భర్తకు అనుమానం రాకుండా ఉండేందుకు అతని చెప్పులను నీటిలో పడేసింది. కానీ భర్త పూల్ వద్దకు వచ్చి తన చొక్కా విప్పడం మొదలుపెట్టడంతో సమస్య మొదలైంది. వీడియోను బట్టి చూస్తే, భర్త కూడా తన భార్యతో కలిసి పూల్‌లో ఈత కొట్టాలనే మూడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. 

ఈ సమయంలో, ఆ మహిళ తన భర్తతో సంభాషణ మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తుంది. భర్త దృష్టి మరలగానే, ఆమె తన ప్రియుడి చెప్పులను గోడ వెనుకకు విసిరేస్తుంది. ఆ తర్వాత ఆమె పూల్ నుండి బయటకు వచ్చి, తన భర్తతో సంభాషణ ముగించుకుని ఇంట్లోకి తీసుకెళ్లిపోతుంది. ఇంతలో, ప్రియుడు నీటిలోపల ఊపిరి బిగబట్టుకుని కనిపిస్తాడు. ఆ జంట దూరంగా వెళ్ళగానే, ప్రియుడు పూల్ నుండి బయటకు వచ్చి వెంటనే పారిపోతాడు. 

ఈ 2 నిమిషాల 20 సెకన్ల వీడియోను @NeverteIImeodd అనే యూజర్ షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 5 లక్షల మందికి పైగా చూశారు. చాలా మంది యూజర్లు సరదా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఒక యూజర్, "ఆమె అతన్ని వెంటనే లోపలికి తీసుకెళ్లి ఉండాల్సింది" అని రాశారు. మరో యూజర్ నవ్వుతూ.. "ఊపిరి బిగపట్టడంలో అతను కొత్త రికార్డు సృష్టించాడు" అని రాశారు. మరో యూజర్ కామెంట్ చేస్తూ.. "అతడికి ఆస్కార్ రావాలి" అని రాశారు.

(గమనిక: పాఠకులకు ముఖ్యగమనిక! పైన పేర్కొన్న సమాచారం కేవలం ఆ వైరల్ వీడియో ఆధారంగా పొందుపరిచింది. ఇందులోని ఎలాంటి అంశాన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.) 

Also Read: Gold Reserves In World: రూ.3,418 లక్షల కోట్ల బంగారం..బయటకు తీస్తే అందరూ ధనవంతులే! ఎక్కడంటే?

Also Read: Palnadu Crime News: పల్నాడులో పెరిగిపోతున్న పోలీసు ఆగడాలు..ఖాకీని అడ్డం పెట్టుకొని కొందరు క్రిమినల్ దందాలు..తాజాగా లాయర్‌ హత్య!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Gold Reserves In World: రూ.3,418 లక్షల కోట్ల బంగారం..బయటకు తీస్తే అందరూ ధనవంతులే! ఎక్కడంటే?

Hyderabad, Telangana:

Gold Mining Statistics 2026: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారానికి కీలక స్థానం ఉంది. ఆభరణాల దగ్గర నుండి పారిశ్రామిక అవసరాల వరకు గోల్డ్‌కు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ద్రవ్యోల్బణం కారణంగా దీని ధరలు నిర్ణయిస్తారు. చరిత్ర నుంచి చూసుకుంటే ఎన్ని లోహాలు మారినా.. బంగారానికి మాత్రం విలువ అలాగే కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ దాని విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. ప్రపంచంలోని బంగారం సరఫరా గనుల ద్వారా 73 శాతం ఉంటే.. అయితే ఇప్పటి వరకు భూమి నుంచి ఎంత బంగారాన్ని ఇప్పటి వరకు వెలికితీశారనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

Gold.org ప్రకారం.. మానవులు భూమి నుండి ఇప్పటివరకు సుమారు 220,000 మెట్రిక్ టన్నుల బంగారాన్ని వెలికితీశారట. ఇంతటి బంగారాన్ని రూపాయల్లోకి మారిస్తే.. దాదాపుగా రూ.3,418 లక్షల కోట్ల విలువ ఉంటుందట. అలాగే 2025 ఫిబ్రవరిలో విడుదల చేసిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన డేటా ప్రకారం.. గతేడాది డిసెంబరు నాటికి భూమిపై ఉన్న గోల్డ్ నిల్వ 219,891 టన్నులకు చేరనుందని సమాచారం. ఇంతటి బంగారం పూర్తిగా మైనింగ్ ద్వారానే వెలికితీస్తున్నారు. డబ్బు విలువ నానాటికి పడిపోయినా.. బంగారం విలువ రోజురోజుకు పెరిగిపోతుంటుంది. గోల్డ్ అనే లోహం నాశనం కాదు కాబట్టి.. అప్పటి నుంచి ఉన్న బంగారం నేటికి భూమిపై వివిధ రూపాల్లో ఉంది. 

ఆ బంగారం అంతటినీ కరిగించి ఒక ఘనంగా తయారుచేస్తే.. అది కేవలం 22 మీటర్ల పొడవు, వెడల్పు, ఎత్తు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్నేళ్ల నుంచి తవ్వి వెలికితీసిన బంగారం అంతా కేవలం చిన్న సైజు ఇల్లంత మాత్రమే ఉంటుందట.

1950 నుండి ప్రపంచవ్యాప్తంగా బంగారు తవ్వకాల కార్యకలాపాలు మరింత పుంజుకున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఆధునిక యంత్రాలు, భారీ గనులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తిని విపరీతంగా పెంచడంతో.. తవ్విన మొత్తం బంగారంలో దాదాపు మూడింట రెండు వంతులు గత 75 సంవత్సరాలలోనే వెలికితీశారనేది సమాచారం.

వెలికితీసిన బంగారంలో అధిక భాగం ఆభరణాలకే ఉపయోగించారట. సుమారు 97,645 టన్నులు అంటే మొత్తం నిల్వలో 44 శాతం.. ఆభరణాల రూపంలో ఉండగా, 23 శాతం బంగారపు కడ్డీలు, నాణేల (ఈటీఎఫ్‌లతో సహా) రూపంలో, 18 శాతం కేంద్ర బ్యాంకుల వద్ద, 15 శాతం ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారట.

2025 ఏడాదిలో ప్రపంచ బంగారు ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరుకుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. కిందటి ఏడాది గనుల నుంచి ఏకంగా 3,672 టన్నుల బంగారాన్ని వెలికితీశారు. మొత్తం మైనింగ్ సరఫరాలో ఇది 73 శాతం కాగా.. రీసైక్లింగ్ వాటా 27 శాతంగా ఉంది. చైనా, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు ప్రపంచంలో ప్రధాన గోల్డ్ ఉత్పత్తి దారులుగా ఉన్నాయి. కొత్త గనులను కనుగొనడం నానాటికి కష్టం అవుతుంది. 

భూగర్భంలో ఎంత బంగారం మిగిలి ఉంది అనేది భవిష్యత్తు తరాలకు ఉన్న సవాలు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ఆర్థికంగా వెలికితీయగల నిల్వలు సుమారు 54,770 టన్నులు కాగా, USGS సుమారు 64,000 టన్నులుగా అంచనా వేస్తోంది. మొత్తం వనరులు 132,110 టన్నులకు చేరవచ్చు. కానీ వాటిని వెలికితీయడం ఖరీదైనది. పర్యావరణపరంగా సంక్లిష్టమైనదని నిపుణులు చెబుతున్నారు.

Also Read: RCB Vs LSG Preview: బెంగళూరు Vs లక్నో మ్యాచ్‌లో గెలిచేది వీళ్లే! ముందే తెలిసిపోతుందా? సాక్ష్యం ఇదే..ప్లేయింగ్ 11 ఇదే!

Also Read: Palnadu Crime News: పల్నాడులో పెరిగిపోతున్న పోలీసు ఆగడాలు..ఖాకీని అడ్డం పెట్టుకొని కొందరు క్రిమినల్ దందాలు..తాజాగా లాయర్‌ హత్య!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report
Advertisement
Advertisement
Back to top