Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Jangaon506167
KTR: ప్రజలను మోసం చేసిన రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీని ఉరి తీయాలి: కేటీఆర్
RKRavi Kumar Sargam
Jan 06, 2026 11:04:09
Jangaon, Telangana

KTR Speech: 'తెలంగాణను 60 సంవత్సరాల పాటు రాచిరంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. 60 ఏళ్ల కాంగ్రెస్ దుర్మార్గాన్ని, తెలంగాణకు చేసిన ద్రోహాన్ని తన దీక్షతో ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ సాధించిన కేసీఆర్‌పైన అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. నదులు, తెలంగాణపై కనీస అవగాహన లేని హౌలా గాడు రేవంత్ రెడ్డి' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read: Ponnala Laxmaiah: సాగునీటిపై రేవంత్ రెడ్డి చేసిన మోసాలను ప్రజలు క్షమించరు: పొన్నాల లక్ష్మయ్య

జనగామ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల అభినందన సభ నిర్వహించగా.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'ఇంటింటికి నీళ్లు ఇచ్చినందుకు, అమ్మలక్కలకు ఆసరా పెన్షన్లు ఇచ్చినందుకు, ముసలివారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పెన్షన్‌ను 10 రెట్లు పెంచినందుకు, రైతన్నలకు రైతుబంధు ఇచ్చినందుకు, రైతు భీమా ఇచ్చినందుకు, సాగునీటి ప్రాజెక్టులు కట్టి దేశంలోనే పంటల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిపినందుకు, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినందుకు కేసీఆర్‌ను శిక్షించాలా?' అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.

Also Read: Polavaram Project: ఏపీ చేపట్టిన పోలవరం-నల్లమల్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం: తెలంగాణ నీళ్ల మంత్రి

మూటలు మోసుడు తప్ప రేవంత్ రెడ్డికి ఏం తెలవదు. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి నీళ్ల గురించి పాఠాలు చెప్తాడు. గోదావరి ఎక్కడుందో రేవంత్‌కు తెలియదు. భాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని చెబుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయిపోయింది.. ఎలా ప్రజలను మోసం చేశారో ఆలోచించాలి' అని ప్రజలకు మాజీ మంత్రి కేటీఆర్‌ సూచించారు. రైతుల పరిస్థితులు ఎలా తయారయ్యాయో ఆలోచించాలని చెప్పారు. 'యూరియా కోసం చలిలో ఎదురు చూస్తున్నారు. ఎనకటి రోజులు తెస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.. అదే రాబందుల కాలం రేవంత్ రెడ్డి తెచ్చాడు. గ్రామాల్లో రేవంత్ రెడ్డిని నోటికొచ్చినట్లు తిడుతున్నారు' అని కేటీఆర్‌ వివరించారు.

Also Read: Retirement Age: ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 62 ఏళ్లకు పెంపు.. త్వరలో ఉత్తర్వులు

'వరంగల్ రైతు డిక్లరేషన్‌లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసం చేశాడు. ఎకరానికి రైతుబంధు రూ.15,000 ఇస్తా. రైతులతో పాటు కౌలుదారులకు రైతుబంధు ఇస్తా. ప్రతి పంటకు రూ.500 అదనపు బోనస్ చెల్లిస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది' అని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు. మరి రాహుల్ గాంధీ అనే హౌలాగాడిని నడిబజార్‌లో ఉరి తీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

'2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ అనే హౌలాగాడి మాటలు విని ప్రతి ఒక్క విద్యార్థి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారు. విద్యార్థులను, నిరుద్యోగులను మోసగారి మాటలతో రెచ్చగొట్టిన రాహుల్ గాంధీ అనే హౌలాగాడిని ఉరితీయాలి. ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టే ముఖం లేని రేవంత్ రెడ్డి, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇవ్వలేని రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తానంటున్నాడు. కనీసం తులం బంగారం అయినా ఆడబిడ్డలకు ఇచ్చారా?' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలు పుస్తెలతాడు తాకట్టు పెట్టి బతికే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

'ఎందుకు రేవంత్‌ రెడ్డి అంత పిచ్చిగా మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. రేవంత్ రెడ్డి తన సొంత సెక్యూరిటీ సిబ్బందిని కూడా ప్రజల ముందే కొడుతున్నాడు. అడ్డగోలుగా కోరుతున్నాడు, త్వరలో కరుస్తాడు కాబట్టి కట్టివేయమని రేవంత్ రెడ్డి భార్య గీతకు చెప్పినం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 'అధికారం వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డికి ఇంకా ఏడుపు ఎందుకు? తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే రేవంత్‌ రెడ్డి లంగా పనులు చేసుకుంటూ.. పెయింటింగులు వేసుకుంటూ చదువుకోలేదు. దానికి నేనేం చేయాలి?' అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

'కేసీఆర్ చెప్పు ధూళికి రేవంత్ రెడ్డి సరిపోడు. కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్‌కే ఆగమాగం అవుతున్నాడు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అసెంబ్లీలోనే గుండె ఆగి సస్తాడు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. కారు గుర్తు కనిపిస్తే కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతోనే ఓటు వేసి గెలిపించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాకేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Jan 07, 2026 17:45:09
New Delhi, Delhi:

Capital Amaravati: రాజధాని అమరావతికి గుర్తింపు దక్కడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్న సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా రాజధాని అమరావతిని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రాజధానికి చట్టబద్దత కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలిసి విజ్ఞప్తి చేశారు. రాజధానిగా అమరావతిని గుర్తించడంతో అనేక ప్రయోజనాలు ఉంటాయని వివరించారు.

Also Read: Kavitha Congress: కాంగ్రెస్‌లోకి కేసీఆర్‌ గారాలపట్టీ కల్వకుంట్ల కవిత.. ఇదిగో ప్రూఫ్!

ఏపీలో పోలవరం ప్రాజెక్టు పర్యటన ముగించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడ బిజీబిజీగా గడిపిన సీఎం చంద్రబాబు కేంద్ర హోం మంత్రితో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై కేంద్ర మంత్రితో  చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్దత కల్పిస్తే విశ్వవ్యాప్త గుర్తింపు లభిస్తుందని.. వెంటనే ఇది చేయాలని విన్నవించారు. రాజధానిగా గుర్తింపు ఇస్తే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు... రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్టు అవుతుందని హోంమంత్రికి వివరించారు.

Also Read: MANUU Lands: యూనివర్సిటీ భూములను రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు చేస్తావా? హరీశ్ రావు

ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన జీ రామ్ జీ పథకంలోని కొన్ని అంశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం ఇప్పటికే సహకరిస్తోందని ప్రశంసించిన సీఎం చంద్రబాబు.. ఇదే తరహా సహకారాన్ని కొనసాగించాలని అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు.

Also Read: Amaravati Avakai: రేపటి నుంచి ఆవకాయ్ -అమరావతి ఉత్సవాలు.. ఏ రోజు ఏముంటాయంటే?

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రామాలు, తాజా పరిణామాలను అమిత్‌షాతో చంద్రబాబు పంచుకున్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, నిధులు, ప్రాజెక్టుల అంశంపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రులకు వివరించనున్నారు. రానున్న కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రాధాన్యాలు నెరవేరేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 07, 2026 13:28:57
Tamil Nadu:

School Holidays News: ఇటీవలే హాఫ్ ఇయర్లీ పరీక్షల తర్వాత  విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 12 రోజుల సుదీర్ఘ విరామం ముగించుకుని ఇప్పుడే స్కూళ్లకు వెళ్తున్న ఇది శుభవార్తే అని చెప్పాలి. ఈ నెలలో సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా భారీగా సెలవులను ప్రకటించింది.

సంక్రాంతికి 5 రోజులు సెలవులు..
జనవరి మధ్యలో వచ్చే పొంగల్ పండుగను పురస్కరించుకుని బుధవారం నుండి ఆదివారం వరకు వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.

జనవరి 14 (బుధవారం): భోగి పండుగ
జనవరి 15 (గురువారం): సంక్రాంతి
జనవరి 16 (శుక్రవారం): తిరువల్లువర్ దినోత్సవం / మట్టు పొంగల్
జనవరి 17 (శనివారం): ఉజ్వవర్ తిరునాళ్ (రైతుల పండుగ)
జనవరి 18 (ఆదివారం): వారపు సెలవు

రిపబ్లిక్ డే: 3 రోజుల వీకెండ్!
జనవరి చివరి వారంలో రిపబ్లిక్ డే సందర్భంగా మరో మూడు రోజుల విరామం లభించనుంది. సోమవారం సెలవు రావడంతో శని, ఆదివారాలు కలిపి లాంగ్ వీకెండ్ రాబోతోంది.

జనవరి 24 (శనివారం): వారాంతపు సెలవు
జనవరి 25 (ఆదివారం): వారాంతపు సెలవు
జనవరి 26 (సోమవారం): గణతంత్ర దినోత్సవం (ప్రభుత్వ సెలవు)

జనవరి 2026 - మొత్తం ప్రభుత్వ సెలవుల జాబితా:
తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన 2026 క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో మొత్తం 5 ప్రధాన ప్రభుత్వ సెలవులు ఉన్నాయి.

జనవరి 1: ఆంగ్ల నూతన సంవత్సరం
జనవరి 15: పొంగల్
జనవరి 16: తిరువల్లువర్ దినోత్సవం
జనవరి 17: ఉజ్వవర్ తిరునాళ్
జనవరి 26: గణతంత్ర దినోత్సవం

ఎవరికి వర్తిస్తాయి?
ఈ సెలవులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలతో పాటు బ్యాంకులకు (RBI మార్గదర్శకాల ప్రకారం) వర్తిస్తాయి. వరుస సెలవులు ఉండటంతో తల్లిదండ్రులు తమ కుటుంబ ప్రయాణాలను లేదా ఊరికి వెళ్లే ప్లాన్లను ఇప్పుడే సిద్ధం చేసుకోవచ్చు.

Also Read: Samantha News Today: పెళ్లైన 37 రోజులకే శుభవార్త చెప్పిన హీరోయిన్ సమంత..భర్త రాజ్ నిడిమోరు‌తో కొత్త ప్రయాణం..ఫ్యాన్స్ ఖుషీ!

Also Read: Movie Tickets Price Hike: 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్' సినిమాలకు గుడ్‌న్యూస్..టికెట్ల రేట్లపై భారీ పెంపు?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 07, 2026 12:59:52
Visakhapatnam, Andhra Pradesh:

King Cobra Virao Video: భయం లేదు.. బెరుకు లేదు.. సాహసమంటే ఎంతో ఇష్టపడే హీరోయిన్‌ సదా ఓ భారీ పామును ఒడిసిపట్టింది. జియోగ్రాఫిక్‌ చానల్‌లో చూసినట్టు అతి పేద్ద పామును హీరోయిన్‌ పట్టుకుంది. తనతోపాటు కొందరిని సహాయంగా తీసుకుని ఓ ఇంట్లో దూరిన పామును పట్టుకుని అడవిలో వదిలేశారు. చూడగానే గగుర్పొడిచే 16 అడుగుల పామును హీరోయిన్‌ భయం లేకుండా సాహసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలను హీరోయిన్‌ సదా విడుదల చేశారు.

Also Read: KTR Counter: ఖమ్మం గడ్డపై ముగ్గురు మంత్రులకు కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

జయం సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సదా అనంతరం అనేక విజయవంతమైన సినిమాలు చేసిన విషయం తెలిసిందే. సినిమాల తర్వాత కొన్నాళ్లు గ్యాప్‌ తీసుకున్న సదా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వైల్డ్‌ లైఫ్‌ను ఇష్టపడుతున్న ఆమె తరచూ సాహస యాత్రలు చేస్తూ ప్రకృతి ఒడిలో జీవితం గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొన్ని సినిమాలు చేయడమే కాకుండా పలు టీవీ షోలలో సదా పాల్గొంటున్నారు. 

Also Read: Kavitha Congress: కాంగ్రెస్‌లోకి కేసీఆర్‌ గారాలపట్టీ కల్వకుంట్ల కవిత.. ఇదిగో ప్రూఫ్!

అలా ప్రేక్షకులకు దగ్గరైన సదా తన ప్రవృత్తి వైల్డ్‌ లైఫ్‌ను వదలలేదు. ఈ క్రమంలోనే కొన్ని నెలల కిందట ఓ పామును రక్షించారు. ఆ వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్టు చేశారు. విశాఖపట్టణం సమీపంలోని చెరుకుపల్లి అటవీ ప్రాంతంలో సదా పర్యటించారు. పర్యటిస్తున్న సమయంలో ఓ చోట 16 అడుగుల పాము దాగి ఉందని తెలిసింది. వెంటనే ఆమె అక్కడకు వెళ్లారు. ఆ పాముపై స్థానికులు అప్రమత్తం చేశారు. అయితే తాను పామును ఎప్పుడూ నేరుగా చూడలేదని.. రెస్క్యూ ఆపరేషన్‌ కూడా చూడలేదని సదా అక్కడే ఉండి మొత్తం చూడడమే కాకుండా తన కెమెరాలో బంధించారు.

Also Read: KTR: ప్రజలను మోసం చేసిన రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీని ఉరి తీయాలి: కేటీఆర్

అక్కడ నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అతి పెద్ద పాము దూరింది. అక్కడ స్నేక్‌ క్యాచర్‌ వెంకట్‌ను పిలిపించి ఆ పామును పట్టించారు. అతి కష్టంగా 16 అడుగుల పామును వెంకట్‌ బృందం చాకచక్యంగా ఓ సంచిలోకి పంపించారు. అనంతరం దానిని తీసుకుని ఓ అటవీ ప్రాంతంలో వదిలేశారు. పాములను చంపరాదని.. వాటిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేయాలని సదా విజ్ఞప్తి చేశారు. వాటిని హాని చేయకపోతే అవి కూడా మనుషులను హానీ కలిగించవని సదా తెలిపారు. సదా పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 15 లక్షల మంది చూడగా.. 14 వేల మంది ఆ వీడియోకు లైక్‌ కొట్టారు. 

మీరు ఆ వీడియో చూడాలంటే ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 07, 2026 11:17:57
Hyderabad, Telangana:

Samantha Maa Inti Bangaram: స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ తన ఆరోగ్యంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అత్యంత వేగంగా, పక్కా ప్లానింగ్‌తో మొదలుపెట్టారు. పెళ్లైన 37 రోజులకే అభిమానులకు ఒక అదిరిపోయే శుభవార్త చెప్పారు.

నిర్మాతగా సమంత కొత్త అవతారం
సమంత కేవలం నటిగానే కాకుండా, ఇప్పుడు నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె సొంతంగా ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "మా ఇంటి బంగారం" పేరుతో నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. అయితే ఈ సినిమాకు కథను సమంత భర్త రాజ్ నిడిమోరు అందిస్తున్నారు. 

మళ్లీ వెండితెరపైకి 'బంగారం'
మైయోసైటిస్ వంటి ఆరోగ్య సమస్యల వల్ల రెండేళ్ల పాటు వెండితెరకు దూరమైన సమంత, ఇప్పుడు "మా ఇంటి బంగారం" చిత్రంతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఈ చిత్రం ఆమె కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దీనికి కథను తన భర్త అందించడమే కాకుండా, తానే స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. జనవరి 9న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే (First Half) సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సక్సెస్ ఫుల్ కెరీర్
'బృందావనం', 'దూకుడు', 'ఈగ' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత.. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో స్థిరపడి, కెరీర్‌ను మరింత కొత్తగా మలుచుకుంటున్నారు. అటు హీరోయిన్‌గా, ఇటు నిర్మాతగా డ్యూయల్ రోల్‌లో ఆమె బిజీ బిజీగా గడుపుతున్నారు.

పెళ్లి తర్వాత సమంత తన ప్రొఫెషనల్ లైఫ్‌లో తీసుకున్న ఈ వేగవంతమైన నిర్ణయాలు చూస్తుంటే, ఆమె మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: Movie Tickets Price Hike: 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్' సినిమాలకు గుడ్‌న్యూస్..టికెట్ల రేట్లపై భారీ పెంపు?!

Also Read: Tamanna Remuneration: నిమిషానికి రూ.కోటి వసూలు చేసిన మిల్కీ బ్యూటీ..సినిమాలో కాదు, 6 నిమిషాలకు రూ.6 కోట్లు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Jan 07, 2026 10:17:20
0
comment0
Report
HDHarish Darla
Jan 07, 2026 08:40:01
Hyderabad, Telangana:

AP Telangana Movie Ticket Price Hike: తెలంగాణలో భారీ బడ్జెట్ చిత్రాల టికెట్ ధరల విషయంలో నెలకొన్న సందిగ్ధానికి హైకోర్టు తెరదించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ఇతర సినిమాలపై పడే ప్రభావం నుంచి తాజా చిత్రాలకు మినహాయింపునిస్తూ డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు..
గతంలో టికెట్ ధరల నియంత్రణపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కేవలం 'పుష్ప-2', 'ఓజీ'(OG), 'గేమ్ ఛేంజర్', 'అఖండ-2' చిత్రాలకు మాత్రమే పరిమితమని కోర్టు స్పష్టం చేసింది. అలాగే టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలపై నిర్మాతలు ఇచ్చే వినతులను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ విన్నపాలపై సానుకూలంగా స్పందిస్తుందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.

'ది రాజా సాబ్' నిర్మాతల విన్నపం ఏంటి?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసింది. వారి అభ్యర్థనలు ఇలా ఉన్నాయి. ఈ చిత్రం జనవరి 9న విడుదల కానున్న నేపథ్యంలో ముందు రోజు అనగా జనవరి 8న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో ప్రదర్శించేందుకు అనుమతి కోరుతున్నారు. 

ఆ ప్రీమియర్ షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.800+జీఎస్టీ.. అలాగే మల్టీప్లెక్స్‌లో ప్రీమియర్ షో లకు రూ.1000 + జీఎస్టీ వరకు పెంపు కోసం నిర్మాతలు ప్రభుత్వానికి విన్నవించుకోనున్నారు. అలాగే విడుదల తేదీ జనవరి 9 నుంచి సింగిల్ స్క్రీన్ టికెట్లపై రూ.102, అలాగే మల్టీప్లెక్స్‌లో రూ.132 అదనంగా పెంచాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

అయితే అదనంగా జనవరి 9న తెల్లవారుజామున 4 గంటల షోలకు కూడా అనుమతి కోరినట్లు తెలుస్తోంది. భారీ పెట్టుబడితో రూపొందించినందున ఈ పెంపు అత్యవసరమని నిర్మాతలు కోర్టుకు విన్నవించినట్లు సమాచారం.

సంక్రాంతి సినిమాలకు లైన్ క్లియర్!
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో టికెట్ ధరల పెంపు ఉండదని ప్రకటించిన నేపథ్యంలో, హైకోర్టు తాజా తీర్పు నిర్మాతలకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉన్న 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి కూడా ఈ తీర్పు సానుకూలంగా మారనుంది.

హైకోర్టు సూచనతో ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టులో ఉంది. మరి ప్రభుత్వం ఎంత మేరకు ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో వేచి చూడాలి.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ద్వారా రూపొందించింది. సినిమా టికెట్ ధరలపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. 

Also Read: Tamanna Remuneration: నిమిషానికి రూ.కోటి వసూలు చేసిన మిల్కీ బ్యూటీ..సినిమాలో కాదు, 6 నిమిషాలకు రూ.6 కోట్లు!

Also Read: School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..స్కూళ్లకు మరో 7 రోజులు సెలవులు పొడిగింపు..పండగ చేసుకోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RGRenuka Godugu
Jan 07, 2026 07:26:05
Hyderabad, Telangana:

Tanuja Viral Video: సెలబ్రిటీలను చూడగానే ఆగకుండా ఒక్కసారిగా వారి పైకి దూసుకెళ్లడం కామన్ అయిపోయింది. హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో కూడా ఫ్యాన్స్ అదుపుతప్పుతున్నారు. సెలబ్రిటీలపై అభిమానం వెర్రి తలలు వేస్తోంది. నిధి అగర్వాల్, సమంత, అల్లు అర్జున్, విజయ్‌లను బెంబేలెత్తించిన ఫ్యాన్స్ తాజాగా బిగ్ బాస్ ఫేమ్‌ తనూజను కూడా హడలెత్తించారు. హైదరాబాద్‌లోని ఈవెంట్‌కు వెళ్లిన ఆమె కోసం ఒక్కసారిగా ఫ్యాన్స్ చుట్టూ ముట్టేశారు. నేను మీ కోసమే వచ్చా.. దయచేసి తోయొద్దు అని విజ్ఞప్తి చేసినా వినలేదు. ఆమెను చుట్టుముట్టేసి ఒక్కసారిగా అక్కడ తోపులాట కూడా జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. దీంతో చూసినవారు అంత అభిమానం కాదు మూర్ఖత్వం అని నెటిజెన్లు సైతం ఫైర్ అవుతున్నారు.

అంతకు ముందు లుల్లు మాల్‌లో నిధి అగర్వాల్ ది రాజాసాబ్‌ ఈవెంట్ కోసం రాగా అక్కడ ఒక్కసారిగా ఆమెపై తోపులాట జరిగింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు. అభిమానుల సెలబ్రెటీలు కనిపించగానే అదుపు చేసుకోలేక వారిపై దూసుకెళ్తున్నారు. ఆ తర్వాత సమంత ఒక షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన సమయంలో కూడా ఆమెపై అలాగే దూసుకొచ్చారు. దీంతో సమంత కూడా కాస్త ఇబ్బంది పడింది. ఒక ఫ్యాన్ అయితే ఆమె చీరను కూడా తొక్కేశాడు. అదుపుతప్పితే సమంత కింద పడే ప్రమాదం కూడా జరిగేది.

ఇటీవలె బన్నీ భార్య స్నేహరెడ్డితోపాటు హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ నీలోఫర్ కేఫ్  వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ కూడా చుట్టుముట్టారు. అభిమానులు మరోసారి మితిమీరి ప్రవర్తించారు. వారిని చూసి సెల్ఫీల కోసం ఫ్యాన్స్ గుమిగూడారు. అతి కష్టం మీద బన్నీ స్నేహ కేఫ్ నుంచి బయటికి వెళ్లారు. కారు ఎక్కడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు.

 తాజాగా తనూజ కూడా ఇలాంటి ఛేదు అనుభవమే మిగిలింది. ఇక బిగ్ బాస్ 9 తెలుగు రన్నరప్‌గా తనూజ నిలిచింది. ఈమె పూర్తి పేరు తనూజ పుట్ట స్వామి. ఇండస్ట్రీలోని పలు సీరియల్స్ లో నటించింది. తెలుగు మాత్రమే కాదు కన్నడ సీరియల్ లో కూడా నటించింది.  కర్నాటకలోని బెంగళూరు ఆమె స్వస్థలం. మొదటగా 2013లో కన్నడ హారర్ మూవీ నటించారు. జీ తెలుగు సీరియల్ ముద్దమందారంలో తను మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈ సీరియల్ 1500 ఎపిసోడ్స్ కూడా పూర్తి చేసుకుంది. ఆ ఫేమ్‌ తర్వాత బిగ్ బాస్ తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. తనూజ పుట్టస్వామి తెలుగు బిగ్ బాస్ 9 లో ఈ 33 ఏళ్ల సెలబ్రిటీ అడుగుపెట్టి. ఆమె రన్నరప్‌ నిలవగా.. విన్నర్‌గా కళ్యాణ్ పడాలా ట్రోఫీ అందుకున్నారు.

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 07, 2026 07:07:24
Hyderabad, Telangana:

Tamanna 6 Crore Remuneration: భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా భాటియా. కేవలం సినిమాలతోనే కాకుండా, తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ 'మిల్కీ బ్యూటీ' పారితోషికం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కేవలం 6 నిమిషాలకు రూ. 6 కోట్లు వసూలు చేసిందట. తమన్నా క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి తాజా ఉదాహరణ ఇదే. ఇంతకీ ఆ విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని వార్తా నివేదికల ప్రకారం.. గోవాలో జరిగిన 2025 నూతన సంవత్సర వేడుకల్లో తమన్నా తన డ్యాన్స్‌తో అదరగొట్టారు. కేవలం 6 నిమిషాల స్టేజ్ పెర్ఫార్మెన్స్ కోసం ఆమెకు రూ.6 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంటే ఆమె నృత్యంలోని ప్రతి నిమిషానికి ఒక కోటి రూపాయలు వసూలు చేశారన్నమాట!

యూట్యూబ్‌ను వణికిస్తున్న చార్ట్‌బస్టర్స్
తమన్నా కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఒక అద్భుతమైన డ్యాన్సర్. 2024లో ఆమె నటించిన పాటలు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించాయి. బాలీవుడ్‌లో రూపొందిన 'స్త్రీ 2' సినిమాలోని 'ఆజ్ కీ రాత్' సాంగ్ యూట్యూబ్‌లో ఏకంగా 90.1 కోట్లకు పైగా (901,784,667) వీక్షణలు సాధించి ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది.

అలాగే రజినీకాంత్ హీరోగా రూపొందిన 'జైలర్' సినిమాలోని 'కావాలయ్యా' సాంగ్‌లోని స్టెప్పులకు ఫిదా కాని వారు లేరు. ఈ ఒక్క పాట కోసం ఆమె సుమారు రూ.3 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో తమన్నా ఒకరు. ఆమె ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల నుండి రూ.5 కోట్ల వరకు వసూలు చేస్తారు. వివిధ నివేదికల ప్రకారం ఆమె ఆస్తుల విలువ సుమారు రూ.110 కోట్లుగా ఉంది. 2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా'తో మొదలైన తమన్నా సినీ ప్రయాణం.. 'హ్యాపీ డేస్', '100% లవ్', 'బాహుబలి', 'సైరా నరసింహ రెడ్డి' వంటి 89 చిత్రాలతో హీరోయిన్‌గా విజయవంతంగా కొనసాగుతోంది.

అవార్డులు
తన నటనకు గాను ఆమె మూడు సంతోషం ఫిల్మ్ అవార్డులు, రెండు సైమా అవార్డులతో పాటు ప్రతిష్టాత్మకమైన కళైమామణి అవార్డును కూడా అందుకున్నారు. 'బాహుబలి' వంటి చిత్రాలతో ఆమె పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగారు.

Also Read: School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..స్కూళ్లకు మరో 7 రోజులు సెలవులు పొడిగింపు..పండగ చేసుకోండి!

Also Read: School Holiday: తెలంగాణలో సంక్రాంతి హాలీడేస్ ప్రకటన..ఏకంగా 9 రోజులు సెలవులు..ఎప్పటి నుంచి అంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 07, 2026 06:25:16
Hyderabad, Telangana:

School Holiday Tomorrow: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్ర ప్రభుత్వాలు శీతాకాల సెలవులను పొడిగిస్తున్నాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఏఏ రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులను ప్రకటించారనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

జనవరి 15 వరకు సెలవులు
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో చలి తీవ్రత, గాలి కాలుష్యం దృష్ట్యా, ఢిల్లీలోని పాఠశాలలు జనవరి 15, 2026 వరకు మూత పడనున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అదే విధంగా ఉత్తరప్రదేశ్‌లో తీవ్రమైన చలితో పాటు దట్టమైన పొగమంచు కారణంగా వేర్వేరు జిల్లాల్లో సెలవులను పొడిగించారు. ఘజియాబాద్‌లో 8వ తరగతి వరకు విద్యార్థులకు జనవరి 10 వరకు పాఠశాలలు మూతపడనున్నాయి. అలాగే లక్నోలోని కొన్ని స్కూళ్లకు జనవరి 8 వరకు సెలవులు పొడిగించిన సంగతి తెలిసిందే.

జార్ఖండ్‌లో సెలవుల పొడిగింపు
జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జనవరి 6 వరకు ఉన్న సెలవులను ఇప్పుడు జనవరి 8, 2026 వరకు పొడిగించింది. ఈ ఆదేశం నర్సరీ నుండి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలకు వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది.

పంజాబ్‌లో స్కూళ్ల సెలవులు ఇలా..
పంజాబ్ విద్యాశాఖ ఆదేశాల ప్రకారం.. రాష్ట్రంలోని పాఠశాలలు జనవరి 7 (ఈరోజు) వరకు మూసివేయబడ్డాయి. అయితే, వాతావరణ పరిస్థితులు ఇంకా మెరుగుపడకపోవడంతో సెలవులు మరింత పొడిగించే అవకాశం ఉందా లేదా అనేది ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.

త్రిపురలో సెలవుల పొడిగింపు..
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో కూడా చలి గాలులు తీవ్రంగా ఉండటంతో, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను జనవరి 10, 2026 వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

గమనిక: వాతావరణంలో మార్పుల వల్ల సెలవులపై నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి స్కూల్ మేనేజ్‌మెంట్ లేదా జిల్లా కలెక్టర్ ఇచ్చే అధికారిక సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోండి. కొన్ని చోట్ల పాఠశాలలు తెరిచినప్పటికీ, ఉదయం పూట చలి ఎక్కువగా ఉండటం వల్ల స్కూల్ ప్రారంభ సమయాలను (ఉదాహరణకు ఉదయం 10 గంటలకు) మార్చే అవకాశం ఉంది.

Also Read: School Holiday: తెలంగాణలో సంక్రాంతి హాలీడేస్ ప్రకటన..ఏకంగా 9 రోజులు సెలవులు..ఎప్పటి నుంచి అంటే?

Also Read: Prabhas Daily Food Cost: డార్లింగ్ ప్రభాస్‌తో ఉంటే 'రాజ'వైభోగమే! తిండికి ఆయన రోజుకు ఎంత ఖర్చు చేస్తారో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top